Saturday, September 28, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఐదవ అధ్యాయం

                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఐదవ అధ్యాయం




శ్రీశుక ఉవాచ
అత్రానువర్ణ్యతేऽభీక్ష్ణం విశ్వాత్మా భగవాన్హరిః
యస్య ప్రసాదజో బ్రహ్మా రుద్రః క్రోధసముద్భవః

ఈ భాగవతములో సకల జగద్రూపుడైన శ్రీమన్నారాయణుడు వర్ణించబడతారు
ఆయనకు సంతోషం వస్తే బ్రహ్మపుట్టాడు. కోపం వస్తే శివుడు పుట్టాడు. అలాంటి పరమాత్మ కథ శ్రీమద్భాగవతములో ఉంటుంది

త్వం తు రాజన్మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి
న జాతః ప్రాగభూతోऽద్య దేహవత్త్వం న నఙ్క్ష్యసి

చనిపోతాననే జంతుబుద్ధి వదలిపెట్టు. నీవు పుట్టలేదు, పుట్టబోవు, నశించవు
దేహం కలవాడు పుట్టడు. దేహం పుడుతుంది

న భవిష్యసి భూత్వా త్వం పుత్రపౌత్రాదిరూపవాన్
బీజాఙ్కురవద్దేహాదేర్వ్యతిరిక్తో యథానలః

కొడుకూ మనవడూ అందరూ నీవే అనుకుంటే, వారి రూపములో నీవు బతికే ఉన్నావు.
వారు నీవు కాదు అనుకుంటే , నీవు పుట్టనే లేదు.
నీవు పుట్టలేదు. ఇది వరకు పుట్టిలేవు.. మరణించవు, ఇది వరకు మరణించి లేవు. బీజం నుంచి వృక్ష్మూ వృక్షము నుండి బీజమూ ఎపుడూ పుడుతూనే ఉంటుంది
అగ్ని జల వాయు సంబంధముతోనే అది పుడుతుంది
శుక్ర శోణిత అగ్ని సంయోగముతోనే దేహం పుడుతుంది. ఆత్మకు ఈ వేటితోనూ సంబంధం లేదు

స్వప్నే యథా శిరశ్ఛేదం పఞ్చత్వాద్యాత్మనః స్వయమ్
యస్మాత్పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజోऽమరః

నీవు కలగంటావు, కలలో తల నరికేశారు అని అంటావు, అది నీవే చెబుతావు
నీ కలలో తల నరికి వేయుట ఎంత అబద్ధమో నీవు చచ్చుటా అంతే అబద్దం
ఏ శరీరములో ఉండి నీవు ఆత్మను చూస్తున్నావో దానికి పుట్టుకా మరణమూ రెండూ లేవు.

ఘటే భిన్నే ఘటాకాశ ఆకాశః స్యాద్యథా పురా
ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సమ్పద్యతే పునః

కుండ అంటే ఆకాశమే. ఆకాశానికి కప్పు వేస్తే కుండ. ఒక పరిమిత భాగం చుట్టూ ఒక ఆకారం వేసి ఆకాశాన్ని కప్పి ఉంచుతున్నాము. అదే కుండ పగలగొడితే ఆకాశం ఆకాశములోనే ఉంటుంది. దేహం పోతే ఆత్మ ఆత్మలాగే ఉంటుంది. ఆకాశానికి కుండ ఎలా ఆవరణమో, ఆత్మకు ఆవరణ దేహం. దేహాన్ని వదలి జీవుడు బ్రహ్మలో చేరతాడు.

మనః సృజతి వై దేహాన్గుణాన్కర్మాణి చాత్మనః
తన్మనః సృజతే మాయా తతో జీవస్య సంసృతిః

మనస్సే దేహాలనూ కర్మలనూ గుణాలనూ ఆత్మకు సృష్టిస్తుంది. అలాంటి మనసును మాయ సృష్టిస్తుంది. మాయతో జీవునికి సంసారం ఏర్పడుతుంది

స్నేహాధిష్ఠానవర్త్యగ్ని సంయోగో యావదీయతే
తావద్దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః
రజఃసత్త్వతమోవృత్త్యా జాయతేऽథ వినశ్యతి

ప్రమిదలో నూనె ఉన్నంతవరకూ వత్తి కాలుతుంది. ప్రమిద ఉన్నా, నూనె లేకుంటే వత్తి కాలదు. దేహం ఉన్నా షేహం లేకుంటే మనసు సంస్కరించదు. సంస్కృతములో నూనెకు స్నేహం అని అంటారు. ఆ నూనే సంస్కారము.
గుణత్రయముతో పుట్టి గుణ త్రయముతోనే నశిస్తారు

న తత్రాత్మా స్వయంజ్యోతిర్యో వ్యక్తావ్యక్తయోః పరః
ఆకాశ ఇవ చాధారో ధ్రువోऽనన్తోపమస్తతః

ఈ ఆత్మ స్వయం జ్యోతి. అది వ్యక్తమూ అవ్యక్తమూ కాదు. రెంటికీ అవతల ఉంటుంది. ఆకాశములా ఆధారమైనది

ఏవమాత్మానమాత్మస్థమాత్మనైవామృశ ప్రభో
బుద్ధ్యానుమానగర్భిణ్యా వాసుదేవానుచిన్తయా

ఆత్మను పరమాత్మలో ఉన్న ఆత్మలాగే భావించి అనుమాన గర్భమైన బుద్ధితో పరమాత్మనే ధ్యానిస్తూ

చోదితో విప్రవాక్యేన న త్వాం ధక్ష్యతి తక్షకః
మృత్యవో నోపధక్ష్యన్తి మృత్యూనాం మృత్యుమీశ్వరమ్

బ్రాహ్మణ శాపముతో తఖకుడు కాల్చేది నిన్ను కాదు. నీ దేహాన్ని
మృత్యువులకు మృత్యువైన పరమాత్మను మృత్యువు ఎక్కడైనా అంటుందా

అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదమ్
ఏవం సమీక్ష్య చాత్మానమాత్మన్యాధాయ నిష్కలే

పరమాత్మ పదమే నా స్థానము
నేనే పరమాత్మ నివాసానికి వెళతాను
అని ఇలా ఆత్మ స్వరూపాన్ని తలచుకుని పరమాత్మ యందు ఆత్మలో దీన్ని ఉంచి

దశన్తం తక్షకం పాదే లేలిహానం విషాననైః
న ద్రక్ష్యసి శరీరం చ విశ్వం చ పృథగాత్మనః

అలా చేస్తే తక్షకుడు వచ్చి కరుస్తున్నా నీవు దాన్ని చూడలేవు
ఆత్మ కంటే వేరుగా ప్రపంచాన్నీ చూడలేవు, నిన్ను కరుస్తున్న పామునూ చూడలేవు
కాలిపోతున్న నీ దేహాన్నీ చూడలేవు

ఏతత్తే కథితం తాత యదాత్మా పృష్టవాన్నృప
హరేర్విశ్వాత్మనశ్చేష్టాం కిం భూయః శ్రోతుమిచ్ఛసి

(ద్వితీయ స్కంధములో) నీవు అడిగిన 'ఆత్మ అంటే ఏమిటీ అన్న దానికి సమాధానం ఇది.
నీవు ఎలా ఆత్మ గురించి అడిగావో, ఈ ఆత్మా జగత్తూ అంటే పరమాత్మ యొక్క లీల అని చెప్పాను
ఇంకా నీవు ఏమి వినాలనుకుంటున్నావో చెప్పవలసింది.


                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                    సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం

                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
కాలస్తే పరమాణ్వాదిర్ద్విపరార్ధావధిర్నృప
కథితో యుగమానం చ శృణు కల్పలయావపి

పరమాణువు నుంచీ ద్విపరార్థం వరకూ కాలాన్ని చెప్పుకున్నాము

చతుర్యుగసహస్రం తు బ్రహ్మణో దినముచ్యతే
స కల్పో యత్ర మనవశ్చతుర్దశ విశామ్పతే

నాలుగు యుగములు వేయి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. దీన్ని కల్పమూ అంటారు
ఈ కల్పములో పధ్నాలుగు మంది మనువులు ఉంటారు. తరువాత ప్రళయం వస్తుంది. ఇది బ్రహ్మ యొక్క రాత్రి

తదన్తే ప్రలయస్తావాన్బ్రాహ్మీ రాత్రిరుదాహృతా
త్రయో లోకా ఇమే తత్ర కల్పన్తే ప్రలయాయ హి

ఈ బ్రహ్మ యొక్క రాత్రిలో మూడులోకాలు పోతాయి. భూః భువ@ సువః.

ఏష నైమిత్తికః ప్రోక్తః ప్రలయో యత్ర విశ్వసృక్
శేతేऽనన్తాసనో విశ్వమాత్మసాత్కృత్య చాత్మభూః

దీన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. పరమాత్మ అనంతాసనుడై ఆదిశేషుని మీద పడుకుని ప్రపంచాన్ని తనలో చేర్చుకుని ఆత్మ భూః గా ఉంటాడు

ద్విపరార్ధే త్వతిక్రాన్తే బ్రహ్మణః పరమేష్ఠినః
తదా ప్రకృతయః సప్త కల్పన్తే ప్రలయాయ వై

ఇదే బ్రహ్మకు ద్విపరార్థకాలం ఐతే అది మహా ప్రళయం. దాన్ని మహా కల్పం అంటారు
అపుడు భూమీ జలం అగ్ని వాయువు ఆకాశం మహత్ అహంకారం అనే ఏడు ప్రకృతులూ ప్రళయాన్ని పొందుతాయి

ఏష ప్రాకృతికో రాజన్ప్రలయో యత్ర లీయతే
అణ్డకోషస్తు సఙ్ఘాతో విఘాట ఉపసాదితే

దీన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు
అండ కోశం అంతా కలసి

పర్జన్యః శతవర్షాణి భూమౌ రాజన్న వర్షతి
తదా నిరన్నే హ్యన్యోన్యం భక్ష్యమాణాః క్షుధార్దితాః
క్షయం యాస్యన్తి శనకైః కాలేనోపద్రుతాః ప్రజాః

మహాప్రళయ కాలములో నూరు సంవత్సరాలు వర్షము లేకుండా ఉంటుంది
ప్రజలు ఆకలికి తాళలేక ఒకరినొకరు తింటారు
అందరూ మెల్లగా నశిస్తారు

సాముద్రం దైహికం భౌమం రసం సాంవర్తకో రవిః
రశ్మిభిః పిబతే ఘోరైః సర్వం నైవ విముఞ్చతి

ఎక్కడ తడి అనేది ఉందో దాన్ని మొత్తం సూర్యుడు లాగుతాడు. సముద్రములో, దేహములో భూమిలో నదులలో రసములో ఉన్న నీటిని ప్రళయకాల సూర్యుడు ఈనాలిగింటిలో ఉండే నీటిని తన ఘోర కిరణాలతో తీసుకుంటాడు. ఏ ఒక్క నీటి బిందువునీ విడిచిపెట్టడు

తతః సంవర్తకో వహ్నిః సఙ్కర్షణముఖోత్థితః
దహత్యనిలవేగోత్థః శూన్యాన్భూవివరానథ

ప్రళయ కాలాగ్ని సంకర్షణుని వేయి ముఖముల నుండి లేచి వాయు వేగముతో లేచి మొత్తం శూన్యముగా ఉన్న అతల సుతలాది వివరాలను కాల్చిపారేస్తాయి

ఉపర్యధః సమన్తాచ్చ శిఖాభిర్వహ్నిసూర్యయోః
దహ్యమానం విభాత్యణ్డం దగ్ధగోమయపిణ్డవత్

ఆ జ్వాలలు పైకీ కిందకీ చుట్టూ నిండుతాయి
తన శిఖలూ సూయుని శిఖలూ అగ్ని శిఖలతో కాల్చబడిన ప్రపంచము బాగా కాలిన పిడకలా అవుతుంది.

తతః ప్రచణ్డపవనో వర్షాణామధికం శతమ్
పరః సాంవర్తకో వాతి ధూమ్రం ఖం రజసావృతమ్

అలా కాలిన  బూడిద ఐన తరువాత భయంకరమైన వాయువులతో కూడిన వర్షం, రజస్సుతో నిండి నూరు సంవత్సరాలు పడుతుంది

తతో మేఘకులాన్యఙ్గ చిత్ర వర్ణాన్యనేకశః
శతం వర్షాణి వర్షన్తి నదన్తి రభసస్వనైః

నూరు సంవత్సరాలు వర్షిస్తాయి
భయంకర ధ్వనితో గర్ఝిస్తాయి.

తత ఏకోదకం విశ్వం
బ్రహ్మాణ్డవివరాన్తరమ్

సూర్యభగవానుడు తీసుకున్న మొత్తం జలాలని విడిచిపెడతాడు
చివరకు ఉదకం ఒక్కటే మిగులుతుంది. ప్రపంచం మొత్తములో జలం మాత్రమే ఉంటుంది. బ్రహ్మానడ వివరములో కూడాజలమే ఉంటుంది.

తదా భూమేర్గన్ధగుణం గ్రసన్త్యాప ఉదప్లవే
గ్రస్తగన్ధా తు పృథివీ ప్రలయత్వాయ కల్పతే

భూమి గంధాన్ని జలము తీసుకుంటుంది. గంధము పోయిన భూమి లయమైపోతుంది

అపాం రసమథో తేజస్తా లీయన్తేऽథ నీరసాః
గ్రసతే తేజసో రూపం వాయుస్తద్రహితం తదా

జలం యొక్క రసాన్ని తేజస్సు తీసుకుంటుంది. రసం పోయిన జలము లయమైపోతుంది
తేజో రూపాన్ని వాయువు. వాయువు రూపాన్ని ఆకాశమూ తీసుకుంటాయి

లీయతే చానిలే తేజో వాయోః ఖం గ్రసతే గుణమ్
స వై విశతి ఖం రాజంస్తతశ్చ నభసో గుణమ్

ఆకాశ గుణాన్ని తామస అహంకారం తీసుకోగా, ఆకాశం కూడా లయమవుతుంది

శబ్దం గ్రసతి భూతాదిర్నభస్తమను లీయతే
తైజసశ్చేన్ద్రియాణ్యఙ్గ దేవాన్వైకారికో గుణైః

జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలు దేవతలలో కలుస్తాయి

మహాన్గ్రసత్యహఙ్కారం గుణాః సత్త్వాదయశ్చ తమ్
గ్రసతేऽవ్యాకృతం రాజన్గుణాన్కాలేన చోదితమ్

అహంకారాన్ని మహత్ తత్వమూ. దాన్ని సత్వాది గుణాలు తీసుకుంటాయి

న తస్య కాలావయవైః పరిణామాదయో గుణాః
అనాద్యనన్తమవ్యక్తం నిత్యం కారణమవ్యయమ్

ఇలాంటి మహత్ తత్వాన్ని అవ్యాహృతమైన కాలము చేత ప్రేరేపించబడిన ప్రకృతి తీసుకుంటుంది
ఇదంతా కలసి పరమాత్మలోకి వెళ్ళిపోతాయి

న యత్ర వాచో న మనో న సత్త్వం తమో రజో వా మహదాదయోऽమీ
న ప్రాణబుద్ధీన్ద్రియదేవతా వా న సన్నివేశః ఖలు లోకకల్పః

అక్కడ వాక్కూ సత్వమూ మనసూ రజస్తమో గుణాలూ, మహదాదులూ ప్రాణ బుద్ధి ఇంద్రియ దేవతలూ సన్నివేశమూ ఏవీ కనపడవు

న స్వప్నజాగ్రన్న చ తత్సుషుప్తం న ఖం జలం భూరనిలోऽగ్నిరర్కః
సంసుప్తవచ్ఛూన్యవదప్రతర్క్యం తన్మూలభూతం పదమామనన్తి

జాగ్రత్ స్వప్న సుషుప్తులూ నిద్రా ఆకాశం జలం భూమీ వాయువూ అగ్నీ సూర్యుడూ నిద్రపోయినట్లుగా లేనట్లుగా, ఊహించడానికి వీలు లేనట్లుగా, పరమాత్మ పదమును చేరుకుంటాయి

లయః ప్రాకృతికో హ్యేష పురుషావ్యక్తయోర్యదా
శక్తయః సమ్ప్రలీయన్తే వివశాః కాలవిద్రుతాః

ఇది ప్రాకృతిక ప్రళయం.
అన్ని శక్తులూ కాలముచే ప్రేరేపించబడి ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి

బుద్ధీన్ద్రియార్థరూపేణ జ్ఞానం భాతి తదాశ్రయమ్
దృశ్యత్వావ్యతిరేకాభ్యామాద్యన్తవదవస్తు యత్

అవి అన్నీ జ్ఞ్యానములో చేరతాయి. కనపడుతున్నట్టుగా, కనపడనివి కనపడినట్టుగా, కనపడినవి కనపడంట్లుగా వ్యతిరేకముగా చూస్తాము.

దీపశ్చక్షుశ్చ రూపం చ జ్యోతిషో న పృథగ్భవేత్
ఏవం ధీః ఖాని మాత్రాశ్చ న స్యురన్యతమాదృతాత్

దీపమూ చక్షూ రూపము, జ్యోతి యొక్క వికారం.
జ్యోతి లేకుండా విడిగా ఉండలేవు. బుద్ధీ ఇంద్రియములూ మాత్రలూ, ఇవన్నీ కూడా ఒకటిలేకుండా ఇంకొకటి ఉండలేవు. బుద్ధి లేనిదే మనస్సు,మనసు లేనిదే ఇంద్రియాలూ, ఇంద్రియం లేనిదే అహంకారమూ, ఇలా ప్రతీదీ రెండవదాని తత్వాన్ని ఆశ్రయించే ఉంటాయి

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి చోచ్యతే
మాయామాత్రమిదం రాజన్నానాత్వం ప్రత్యగాత్మని

నిదురపోవుటా మేలుకొని ఉండుటా కలలు గనుటా, బుద్ధివి.
ఎలాగైతే మనం దీపమూ కన్నూ రూపమూ తేజస్సువి అని చెబుతున్నామో
నిద్రా మెలకువా కలలూ బుద్ధివి.
ఇది గమనిస్తే ప్రపంచం మొత్తం మాయా జనితం అనీ, ఆత్మలో ఉండి నానారూపాలుగా భాసిస్తుంది అని అర్థమవుతుంది.

యథా జలధరా వ్యోమ్ని భవన్తి న భవన్తి చ
బ్రహ్మణీదం తథా విశ్వమవయవ్యుదయాప్యయాత్

ఆకాశములో మేఘాలు కనపడతాయీ కనపడవు. ఉంటాయీ పోతాయి. అవి ఎంత భ్రమలో ఇవీ అంతే భ్రమ. ఆకాశములో మేఘాలు ఉండీ ఉండనట్లుగా పరపంచం అంతా పరమాత్మలో ఉంటుందీ ఉండదు.
సృష్టీ స్థితీ నాశం అనే మూడు గుణాలతో ప్రపంచం ఉంటుంది. అన్ని అవయవిలకూ సత్యమే అవయవము.

సత్యం హ్యవయవః ప్రోక్తః సర్వావయవినామిహ
వినార్థేన ప్రతీయేరన్పటస్యేవాఙ్గ తన్తవః

కనుక పరమాత్మలేకుండా ప్రపంచం ఉండదు.

యత్సామాన్యవిశేషాభ్యాముపలభ్యేత స భ్రమః
అన్యోన్యాపాశ్రయాత్సర్వమాద్యన్తవదవస్తు యత్

ప్రపంచాన్ని చూసి నిత్యం అని సామాన్య విశేషభావాలతో దేన్నైతే తలుస్తున్నారో అది అంతా భ్రమా
పుట్టుకా నాశమూ ఉన్నవన్నీ వస్తువులు కావు. ఎప్పటికీ ఉండేది మాత్రమే వస్తువు. ఎప్పటికీ ఉండేది పరమాత్మే. ఏది వస్తువో అదే వాస్తవం. పరమాత్మ ఒక్కడే వాస్తవం. పరమాత్మ ఒక్కడే సత్యం.

వికారః ఖ్యాయమానోऽపి ప్రత్యగాత్మానమన్తరా
న నిరూప్యోऽస్త్యణురపి స్యాచ్చేచ్చిత్సమ ఆత్మవత్

మనం ఎన్ని భేధాలనూ వికారాలనూ చెప్పుకుంటున్నా ప్రత్యగాత్మ లేకుండా మనసూ బుద్ధీ గుణాలూ బుద్ధీ భాసించవు.

న హి సత్యస్య నానాత్వమవిద్వాన్యది మన్యతే
నానాత్వం ఛిద్రయోర్యద్వజ్జ్యోతిషోర్వాతయోరివ

సత్యం ఎపుడైనా నానా విధాలుగా ఉంటుందా. సత్యము ఏకం. సత్యములో భేధాలు ఉండవు.
గాలి యొక్క విభాగం అగ్ని యొక్క విభాగము చేయగలమా. ఎన్నీ దీపాలు ఉంటే అన్ని అగ్నులూ అని అనగలమా. ఎన్ని శరీరాలు ఉంటే అన్ని వస్తువులు అని అనగలమా.

యథా హిరణ్యం బహుధా సమీయతే నృభిః క్రియాభిర్వ్యవహారవర్త్మసు
ఏవం వచోభిర్భగవానధోక్షజో వ్యాఖ్యాయతే లౌకికవైదికైర్జనైః

బంగారం ఒక్కటే దాన్ని మానవులు ఉంగరమనీ గాజులనీ కడియాలనీ హారాలనీ అంటున్నా ఉన్న బంగారమొకటే. అలాగ మనం లోకములో గానీ, వేదములో గానీ ఎన్ని పేర్లైతే చెప్పుకుంటున్నామో అది అంతా పరమాత్మే. ఎన్ని పేర్లు పెట్టినా బంగారం ఒకటే ఐనట్లు, ఎన్ని రకాలుగా ప్రపంచాన్ని వర్ణించినా అది అంతా పరమాత్మే.

యథా ఘనోऽర్కప్రభవోऽర్కదర్శితో
హ్యర్కాంశభూతస్య చ చక్షుషస్తమః
ఏవం త్వహం బ్రహ్మగుణస్తదీక్షితో
బ్రహ్మాంశకస్యాత్మన ఆత్మబన్ధనః

శరీరమూ, ఆత్మ, ఆత్మలో పరమాత్మ అంటున్నాము. పరమాత్మే అన్నీ చూపుతున్నాడని అంటున్నాము. ఏ పరమాత్మ దీన్ని సృష్టిస్తున్నాడని అంటున్నామో ఆ పరమాత్మనే మనం గుర్తించట్లేదు.
మేఘము సూర్యునితో సృష్టించబడింది. మేఘం ఉన్నదని మేఘాన్ని చూపేదీ సూర్యుడే. కన్ను కూడా సూర్యుడే. సూర్యుడి వలన పుట్టి సూర్యుడి వలన చూపబడే మేఘము, సూర్యుని వలన చూపబడే కన్నుకి చీకటిని కలిగిస్తుంది. అదే కన్ను సూర్యుడు లేకుంటే మేఘాన్ని చూడలేదు. అదే మేఘం సూర్యుడు లేకుంటే లేదు.సూర్యుని వలన పుట్టిన మేఘం సూర్యున్ని కప్పినట్లు కనపడినట్లుగా భగవంతుని వలన పుట్టిన జగత్తు, భగవంతున్నే కప్పినట్లుగా కనపడుతుంది.
జగతూ ఆత్మ సృష్టీ బుద్ధీ మనసూ పరమాత్మ వలననే సృష్టించబడ్డాయి. ఆ బుద్ధీ మనసే పరమాత్మను చూడలేకుండా చేస్తున్నాయి.

నేను బ్రహ్మ యొక్క అవయవాన్ని
బ్రహ్మ చేతే చూడబడుతూ ఉన్నాను
ఆయన సృష్టే ఆత్మను బంధిస్తూ ఉన్నది, ఆంతను చూపెడుతూ ఉన్నది

ఘనో యదార్కప్రభవో విదీర్యతే చక్షుః స్వరూపం రవిమీక్షతే తదా
యదా హ్యహఙ్కార ఉపాధిరాత్మనో జిజ్ఞాసయా నశ్యతి తర్హ్యనుస్మరేత్

ఎపుడైతే ఈ మేఘాన్ని చీల్చి వేస్తే సూర్యుడు కనపడతాడు. సూర్యుని వలన పుట్టిన మేఘాన్ని చీల్చివేస్తే సూర్యుడు కనపడతాడు
ఆత్మకు ఉపాధిగా ఉండే అహంకారం జిజ్ఞ్యాసతో నశిస్తే మబ్బు తొలగితే సూర్యుడు కనపడినట్లుగా భగవానుడు కనపడతాడు

యదైవమేతేన వివేకహేతినా మాయామయాహఙ్కరణాత్మబన్ధనమ్
ఛిత్త్వాచ్యుతాత్మానుభవోऽవతిష్ఠతే తమాహురాత్యన్తికమఙ్గ సమ్ప్లవమ్

వివేకం అనే ఆయుధముతో ఇలాంటి అల్పబంధనాన్ని పరమాత్మ స్వరూపుడై పరమాత్మను మనసులో ఉంచుకుని, పరమాత్మలోనే లీనమవుతే అది ఆత్యంతిక ప్రళయం.

నిత్యదా సర్వభూతానాం బ్రహ్మాదీనాం పరన్తప
ఉత్పత్తిప్రలయావేకే సూక్ష్మజ్ఞాః సమ్ప్రచక్షతే

ఇది గాక నిత్య ప్రళయం, నిత్య సృష్టీ ఉంటుంది. సూక్షం తెలిసినవారు మాత్రమే దీన్ని గుర్తుపడతారు. ప్రాణి పెరగడం అంటే నిరంతరం ఆ శరీరములో పాత కణాలు నశిస్తూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి.
జగత్తులో జరిగే ప్రతీ మార్పూ సృష్టి లయాలకు సంకేతం. నదీ ప్రావహములో పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. మన శరీరం కూడా నిత్యం పరిణామం చెందుతూ ఉంటుంది

కాలస్రోతోజవేనాశు హ్రియమాణస్య నిత్యదా
పరిణామినాం అవస్థాస్తా జన్మప్రలయహేతవః

కాల వేగముతో రోజు రోజుకూ ఇదంతా హరించబడేది
ఇదంతా పరిణామం యొక్క వ్యవస్థ

అనాద్యన్తవతానేన కాలేనేశ్వరమూర్తినా
అవస్థా నైవ దృశ్యన్తే వియతి జ్యోతిషాం ఇవ

ఆది లేకుండా అంతం లేకుండా ఉండే ఈశ్వర రూపమే కాలము.
రోజులు గడుస్తున్నా నెలలు గడుస్తున్నా యుగాలు గడుస్తున్నా అది మనకు కనపడదు.ఉత్పత్తీ వినాశాన్ని మనం గమనించలేము.

నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రాకృతికో లయః
ఆత్యన్తికశ్చ కథితః కాలస్య గతిరీదృశీ

ఇలా ప్రళయం నాలుగు రకాలు
నిత్య(మనలో వచ్చే ప్రతీ మార్పు), నైమిత్తిక (బ్రహ్మకు ఒకపూట) ప్రాకృతిక (మహా ప్రళయం), ఆత్యంతికం(మోక్షం)

ఏతాః కురుశ్రేష్ఠ జగద్విధాతుర్నారాయణస్యాఖిలసత్త్వధామ్నః
లీలాకథాస్తే కథితాః సమాసతః కార్త్స్న్యేన నాజోऽప్యభిధాతుమీశః

పరమాత్మ యొక్క ఈ లీలా కథలన్నీ నీకు సంగ్రహముగా వివరించాను.
సంపూర్ణముగా చెప్పాలంటే బ్రహంకు కూడా సాధ్యం కాదు. క్లుప్తముగా చెప్పాను

సంసారసిన్ధుమతిదుస్తరముత్తితీర్షోర్
నాన్యః ప్లవో భగవతః పురుషోత్తమస్య
లీలాకథారసనిషేవణమన్తరేణ
పుంసో భవేద్వివిధదుఃఖదవార్దితస్య

ఎంత ప్రయత్నించినా దాట శక్యం కాని సంసారాన్ని దాటాలి అనుకునేవారికి
పురుషోత్తముడైన పరమాత్మ లీలా కథా రసమును సేవించడం తప్ప వేరే పడవ లేదు
సముద్రములో ఉన్నాము గానీ, చుట్టూ అగ్నితో బాధించబడుతూ ఉన్నాము. ఇది దాటడానికే పరమాత్మ కథ వినడం మాత్రమే మార్గము

పురాణసంహితామేతామృషిర్నారాయణోऽవ్యయః
నారదాయ పురా ప్రాహ కృష్ణద్వైపాయనాయ సః

ఈ పురాణ సంహితను నారాయణుడు,పరమాత్మ నారదునికి,నారదుడు వ్యాసునికీ, వ్యాసుడు నాకూ చెప్పాడు

స వై మహ్యం మహారాజ భగవాన్బాదరాయణః
ఇమాం భాగవతీం ప్రీతః సంహితాం వేదసమ్మితామ్

ఈ భాగవతం వేదం లాంటిది

ఇమాం వక్ష్యత్యసౌ సూత ఋషిభ్యో నైమిషాలయే
దీర్ఘసత్రే కురుశ్రేష్ఠ సమ్పృష్టః శౌనకాదిభిః

ఈ భాగవతాన్ని సూతుడు నైమిశారణ్యములో దీర్ఘ సత్రములో శౌనకాది ఋషులు అడిగితే చెబుతాడు


                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                              సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం మూడవ అధ్యాయం

                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం మూడవ అధ్యాయం
 

శ్రీశుక ఉవాచ
దృష్ట్వాత్మని జయే వ్యగ్రాన్నృపాన్హసతి భూరియమ్
అహో మా విజిగీషన్తి మృత్యోః క్రీడనకా నృపాః

నేను భూమిని గెలవాలీ, నేను భూమిని గెలవాలీ,  అనే రాజుని చూచి భూమి నవ్వుతుంది
మృత్యువు చేతిలో ఆట బొమ్మలైన రాజులు నన్ను గెలవాలి అనుకుంటున్నారు

కామ ఏష నరేన్ద్రాణాం మోఘః స్యాద్విదుషామపి
యేన ఫేనోపమే పిణ్డే యేऽతివిశ్రమ్భితా నృపాః

జ్ఞ్యానం ఉన్నప్పటికీ రాజుల ఈ కోరిక వ్యర్థమే అవుతుంది
నీటి మీద నురుగులాంటి శరీరం మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు రాజులు

పూర్వం నిర్జిత్య షడ్వర్గం జేష్యామో రాజమన్త్రిణః
తతః సచివపౌరాప్త కరీన్ద్రానస్య కణ్టకాన్

మొదలు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను రాజులు గెలవాలి
తరువాత సచివులనూ పౌరులనూ మిత్రులనూ గెలిచి, ప్రజలకు కంటకం కలిగించేవారిని తరువాత గెలవాలి

ఏవం క్రమేణ జేష్యామః పృథ్వీం సాగరమేఖలామ్
ఇత్యాశాబద్ధహృదయా న పశ్యన్త్యన్తికేऽన్తకమ్

మేము ఈ రీతిలో మొత్తం భూమండలాన్ని గెలుస్తాము
ఇలా వీళ్ళు ఆశతో కలలు కంటూ ఉండగానే మృత్యువు కాస్తా వస్తాడు
అతి దగ్గరలో వచ్చే మృత్యువును చూడలేక దూరములో ఉన్న రాజ్యాలను చూస్తున్నారు

సముద్రావరణాం జిత్వా మాం విశన్త్యబ్ధిమోజసా
కియదాత్మజయస్యైతన్ముక్తిరాత్మజయే ఫలమ్

సముద్రమే హద్దుగా ఉన్న నన్ను గెలిచి మళ్ళీ వారు నాలోనే కలుస్తున్నారు
వీరి ఆత్మ జయం ఎక్కడ? వీరు ముక్తిని ఎలా గెలుస్తారు

యాం విసృజ్యైవ మనవస్తత్సుతాశ్చ కురూద్వహ
గతా యథాగతం యుద్ధే తాం మాం జేష్యన్త్యబుద్ధయః

భూమీ రాజ్యాన్ని, ఇటువంటి వాటిని మనువులూ మనుపుత్రులూ ఎలా వచ్చారో యుద్ధములో అలాగే పోయారు
ఇలాంటి వారు నన్ను గెలుస్తారా
గెలిచినవారూ పాలించినవారూ అందరూ పోయారు.

మత్కృతే పితృపుత్రాణాం భ్రాతృణాం చాపి విగ్రహః
జాయతే హ్యసతాం రాజ్యే మమతాబద్ధచేతసామ్

నా కోసం తండ్రీ కొడుకూ సోదరులూ అని కూడా చూడకుండా వారిని వారు చంపుకుంటారు
వారిలో వారికి నా కోసమే విరోధం వస్తుంది. అందరి మనసులలో భూమి మీదే మమత  ఉంటుంది.

మమైవేయం మహీ కృత్స్నా న తే మూఢేతి వాదినః
స్పర్ధమానా మిథో ఘ్నన్తి మ్రియన్తే మత్కృతే నృపాః

"ఇదంతా నా భూమి" అని మూఢులై మాట్లాడుకుంటూ ఉంటారు
పోటీ పడి, విరోధించి పరస్పరం చంపుకుంటారు నా కోసం

పృథుః పురూరవా గాధిర్నహుషో భరతోऽర్జునః
మాన్ధాతా సగరో రామః ఖట్వాఙ్గో ధున్ధుహా రఘుః

తృణబిన్దుర్యయాతిశ్చ శర్యాతిః శన్తనుర్గయః
భగీరథః కువలయాశ్వః కకుత్స్థో నైషధో నృగః

హిరణ్యకశిపుర్వృత్రో రావణో లోకరావణః
నముచిః శమ్బరో భౌమో హిరణ్యాక్షోऽథ తారకః

ఇలాంటి రాజులందరూ (మనకు వేరే పురాణాలలో శతకంఠరావణాసురుడు ఉన్నాడు. వాడిని లోకరావణుడు అని ఇక్కడ చెప్పారు)

అన్యే చ బహవో దైత్యా రాజానో యే మహేశ్వరాః
సర్వే సర్వవిదః శూరాః సర్వే సర్వజితోऽజితాః

చాలా మంది రాక్షసులూ రాజులూ చక్రవర్తులూ మహేశ్వరులుగా ఉండి
మాకు అన్నీ తెలుసు మేమే శూరులం అని అందరినీ గెలిచారు, ఎవరినీ గెలవలేదు

మమతాం మయ్యవర్తన్త కృత్వోచ్చైర్మర్త్యధర్మిణః
కథావశేషాః కాలేన హ్యకృతార్థాః కృతా విభో

ఇలాంటి వారందరూ, గెలిచినవారు ఓడినవారూ బతికినవారూ బతుకుతున్నవారూ అందరూ నా మీద మమకారముతోనే బతుకుతున్నారు
ఆశలు బాగా పెంచుకుంటున్నారు నా కోసం

కథా ఇమాస్తే కథితా మహీయసాం వితాయ లోకేషు యశః పరేయుషామ్
విజ్ఞానవైరాగ్యవివక్షయా విభో వచోవిభూతీర్న తు పారమార్థ్యమ్

ఇలా కోట్లాడిన వారందరూ కాలములో కలసిపోయారు. కథ మాత్రం మిగిలిపోయింది
అనుకున్న కోరిక మాత్రం తీఎరలేదు వారికి
ఈ రీతిలో చాలా మంది రాజుల కథను చెప్పాను. లోకములో కీర్తిని పెంచుకుని ప్రాణాలు వదలిన వారి కథలు చాలా చెప్పాను
ఇలా చెప్పడానికి కారణం, రామునిలా ప్రవర్తించండి రావణునిలా కాదు, ధర్మరాజులా ప్రవర్తించండి దుర్యోధనునిలా కాదు. ఇంత పెద్దవారు కూడా ఇన్ని ఘనకార్యాలు చేసి కూడా వారు ఎవరూ మిగలలేదని జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలగాలని చెప్పాను. ఎంత ఘనకీర్తి సంపాదించినా, ఎంత జ్ఞ్యానమున్నా, ఎంత పరాక్రమం సంపాదించినా ఎంత బలం ఉన్నా అందరూ పోయేవారే అని తెలుసుకుని విజ్ఞ్యానం వైరాగ్యం కలగడానికి కొన్ని మాటలు అల్లి నీకు కొన్ని కథలు అలా చెపాను.కానీ ఆ కథలే పరమార్థం కాదు. ఆ కథల వలన విజ్ఞ్యానం పెంచుకోండి. ఇదంతా కేవల వాగ్వైభవం

యస్తూత్తమఃశ్లోకగుణానువాదః సఙ్గీయతేऽభీక్ష్ణమమఙ్గలఘ్నః
తమేవ నిత్యం శృణుయాదభీక్ష్ణం కృష్ణేऽమలాం భక్తిమభీప్సమానః

దీనికి ప్రథానం, పరమాత్మా జీవాత్మ ఈ రెండే సత్యం అనేది
జీవులు ఎన్ని అకృత్యాలు జరిపి అధర్మాన్ని ఎలా వృద్ధి చేసి మోహములో పడతారో అర్థం కావడానికి కథా రూపములో అందించాను.
ఏ కథలో ఐనా పరమాత్మ గుణాలనే చెప్పాను. ఆ కథలు సంపూర్ణ అమంగళలని సంపూర్ణముగా తొలగిస్తాయి
పరమాత్మ కీర్తిని పెంచేవి ఆ కథలు. మన అశుభాన్నీ తొలగించేవి ఆ కథలు. పరమాత్మ కథలు నిత్యం వినడి. పరమాత్మ యందు పరిశుద్ధమైన భక్తి కలిగి ఉండండి. ఇదే భాగవత సారం.

శ్రీరాజోవాచ
కేనోపాయేన భగవన్కలేర్దోషాన్కలౌ జనాః
విధమిష్యన్త్యుపచితాంస్తన్మే బ్రూహి యథా మునే

ఈ కలియుగములో, ఇంత అధర్మములో, ఆ కలి దోషాలను ఏ ఉపాయముతో తొలగించుకోవాలి.

యుగాని యుగధర్మాంశ్చ మానం ప్రలయకల్పయోః
కాలస్యేశ్వరరూపస్య గతిం విష్ణోర్మహాత్మనః

యుగాలూ యుగ ధర్మములూ యుగమానములూ ప్రళయమూ కల్పమూ, ఇవన్నీ కాల గతే కదా
యుగాలేమిటి యుగ ధర్మాలేమిటి ప్రళయం ఏమిటి కల్పం ఏమిటో వివరించండి

శ్రీశుక ఉవాచ
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జనైర్ధృతః
సత్యం దయా తపో దానమితి పాదా విభోర్నృప

కృత యుగములో ధర్మం నాలుగు పాదాలతో, అటువంటి మానవులతో కలసి ఉంటుంది
సత్యం దయ తపం దానం - ఈ నాలుగు కృత యుగములో పాదాలు

సన్తుష్టాః కరుణా మైత్రాః శాన్తా దాన్తాస్తితిక్షవః
ఆత్మారామాః సమదృశః ప్రాయశః శ్రమణా జనాః

సంతుష్టులూ దయ గలవారూ ఇంద్రియ నిగ్రహం ఓర్పూ కలవారు.
కృత యుగములో ఎక్కువ మంది సన్యాసుల లాగానే ఉంటారు

త్రేతాయాం ధర్మపాదానాం తుర్యాంశో హీయతే శనైః
అధర్మపాదైరనృత హింషాసన్తోషవిగ్రహైః

తృతా యుగములో నాలుగవ పాదం పోతుంది.
దాని వలన నాలిగింటిలో ఒక్కో భాగం పోతుంది.
అనృతం హింస అసంతోషం విరోధం వస్తాయి

తదా క్రియాతపోనిష్ఠా నాతిహింస్రా న లమ్పటాః
త్రైవర్గికాస్త్రయీవృద్ధా వర్ణా బ్రహ్మోత్తరా నృప

ఐతే హింస ఉంటుంది కానీ ఎక్కువ హింస ఉండదు, ఎక్కువ ఆశ ఉండదు.
ధర్మార్థ కామాలనే సేవిస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కూడా వేదముల చేత వృద్ధి పొందించబడేవే . అప్పుడు కూడా బ్రాహ్మణులే శ్రేష్టులుగా ఉంటారు.

తపఃసత్యదయాదానేష్వర్ధం హ్రస్వతి ద్వాపరే
హింసాతుష్ట్యనృతద్వేషైర్ధర్మస్యాధర్మలక్షణైః

తపమూ సత్యమూ దయా దానం అనే నాలిగింటిలో ద్వాపర యుగములో సగం పోతుంది
హింస, అస్నతుష్టి, అనృతం, ద్వేషములతో ఉంటారు

యశస్వినో మహాశీలాః స్వాధ్యాయాధ్యయనే రతాః
ఆధ్యాః కుటుమ్బినో హృష్టా వర్ణాః క్షత్రద్విజోత్తరాః

కీర్తివంతులూ గొప్ప స్వభావం కలవారూ స్వాధ్యాయన పరులు ఉంటారు
శ్రీమంతులూ, బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా శ్రేష్టులుగా గుర్తించబడతారు

కలౌ తు ధర్మపాదానాం తుర్యాంశోऽధర్మహేతుభిః
ఏధమానైః క్షీయమాణో హ్యన్తే సోऽపి వినఙ్క్ష్యతి

కలియుగములో నాలగవ పాదం మాత్రం పెరుగుతుంది.
అధర్మ పెరుగుతున్న కొద్దీ ధర్మం యొక్క భాగం తగ్గుతూ ఉంటుంది

తస్మిన్లుబ్ధా దురాచారా నిర్దయాః శుష్కవైరిణః
దుర్భగా భూరితర్షాశ్చ శూద్రదాసోత్తరాః ప్రజాః

అకారణ ద్వేషం కలిగి ఉంటారు
దౌర్భాగ్యం ఉంటుంది. ఆకలి ఎక్కువ ఉంటుంది. శూద్రులూ దాసులే ఉత్తములు

సత్త్వం రజస్తమ ఇతి దృశ్యన్తే పురుషే గుణాః
కాలసఞ్చోదితాస్తే వై పరివర్తన్త ఆత్మని

గుణాలు మూడూ కనపడుతూ ఉంటాయి. అవే తిరుగుతూ ఉంటాయి. తమస్సు మాత్రం మిగులుతుంది.

ప్రభవన్తి యదా సత్త్వే మనోబుద్ధీన్ద్రియాణి చ
తదా కృతయుగం విద్యాజ్జ్ఞానే తపసి యద్రుచిః

మనసు బుద్ధి ఇంద్రియములు సత్వములో ఉన్నపుడు కృత యుగముగా తెలుసుకోండి
అపుడు జ్ఞ్యానమూ తపసులో రుచి పుడుతుంది

యదా కర్మసు కామ్యేషు భక్తిర్యశసి దేహినామ్
తదా త్రేతా రజోవృత్తిరితి జానీహి బుద్ధిమన్

ధర్మార్థ కామాలో బుద్ధి ఉండి రజో గుణముతో ప్రవర్తించినపుడు అది త్రేతా యుగం అవుతుంది

యదా లోభస్త్వసన్తోషో మానో దమ్భోऽథ మత్సరః
కర్మణాం చాపి కామ్యానాం ద్వాపరం తద్రజస్తమః

అపుడు లోభమూ అసంతోషమూ మానమూ దంభమూ మత్సరమూ ప్రతీ కర్మకూ ఉంటాయి
ద్వాపర యుగములో కామ్య కర్మలు మొదలవుతాయి. అపుడు రజస్సూ తమస్సు కలిసి పని చేస్తాయి

యదా మాయానృతం తన్ద్రా నిద్రా హింసా విషాదనమ్
శోకమోహౌ భయం దైన్యం స కలిస్తామసః స్మృతః

కలియుగములో ఇవన్నీ ఉంటాయి
కేవల తమో గుణం.

తస్మాత్క్షుద్రదృశో మర్త్యాః క్షుద్రభాగ్యా మహాశనాః
కామినో విత్తహీనాశ్చ స్వైరిణ్యశ్చ స్త్రియోऽసతీః

మానవుల దృష్టే క్షుద్రముగా ఉంటుంది. అదృష్టము తక్కువ, చూపు కూడా క్షుద్రముగా ఉంటుంది. ఆకలి బాగా ఉంటుంది
కోరికలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉండదు. స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. యధేచ్చగా ప్రవర్తిస్తూ  ఉంటారు

దస్యూత్కృష్టా జనపదా వేదాః పాషణ్డదూషితాః
రాజానశ్చ ప్రజాభక్షాః శిశ్నోదరపరా ద్విజాః

ఊళ్ళలో దొంగలే ఎక్కువ ఉండారు.
వేదములన్నీ పాపులచేతా నాస్తికుల చేతా దూషించబడుతూ ఉంటాయి
ప్రజలను తినేవారే రాజులవుతారు
స్త్రీ యందూ భోజనం యందే కోరిక ఉంటుంది

అవ్రతా బటవోऽశౌచా భిక్షవశ్చ కుటుమ్బినః
తపస్వినో గ్రామవాసా న్యాసినోऽత్యర్థలోలుపాః

బ్రహ్మచారులకు వ్రతమూ సన్యాసులకు ఆచారమూ ఉండదు
సన్యాసులు కూడా కుటుంబం కలిగి ఉంటారు
తపస్సు చేస్తున్నాము అంటూ వారు ఊళ్ళలోనే మకాం వేస్తారు
సన్య్సాసులకు డబ్బు మీద ప్రేమ ఉంటుంది

హ్రస్వకాయా మహాహారా భూర్యపత్యా గతహ్రియః
శశ్వత్కటుకభాషిణ్యశ్చౌర్యమాయోరుసాహసాః

పొట్టి శరీరముతో ఎక్కువ ఆకలితో, సంతానం ఎక్కువ ఉంటుంది, సిగ్గు లేకుండా ఉంటారు
మాట్లాడుకోవడం అంటే వారి వారి కుటుంబం గురించే ఉంటుంది కానీ వేరే మాటలే ఉండవు.
అది కూడా వారి కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని దొంగతనాలు చేసారో ఎంతమందిని మోసం చేసారో , ఎంత సాహసం చేసారో చెప్పుకుంటూ ఉంటారు

పణయిష్యన్తి వై క్షుద్రాః కిరాటాః కూటకారిణః
అనాపద్యపి మంస్యన్తే వార్తాం సాధు జుగుప్సితామ్

కపటం మోసం చేసేవారు పందాళ్ళూ పెట్టుకుంటూ ఉంటారు.
ఆపద లేని సమయములో కూడా మంచివారు అసహ్యించుకునే వృత్తిని అవలంబిస్తూ ఉంటారు

పతిం త్యక్ష్యన్తి నిర్ద్రవ్యం భృత్యా అప్యఖిలోత్తమమ్
భృత్యం విపన్నం పతయః కౌలం గాశ్చాపయస్వినీః

డబ్బు లేని పతిని భార్య వదలిపెడుతుంది, సేవకులూ విడిచిపెడతారు
సేవకునికి ఆపద కలిగిస్తే రక్షించేబదులు యజమాని వదలిపెడతాడు
పాలు ఇవ్వని ఆవులను విడిచిపెడతారు

పితృభ్రాతృసుహృజ్జ్ఞాతీన్హిత్వా సౌరతసౌహృదాః
ననాన్దృశ్యాలసంవాదా దీనాః స్త్రైణాః కలౌ నరాః

స్త్రీ సమాగమాన్ని కోరేవారు తల్లీ తండ్రీ గురువూ పెదనాన్నా చిన్నాన్నా అనే సంబంధాలను సముద్రములో ముంచివేస్తారు. వారికి కావలసినదల్లా, అమ్మయైతే అబ్బాయి, అబ్బాఇతే అమ్మాయి సావాసం కావాలి. తల్లీ తండ్రీ గురువూ మిత్రుడూ బంధువూ అంటూ ఉండరు
అందరూ బావమరదులతోటీ మరదళ్ళతోనే మాట్లాడతారు. వేరే సంబంధం ఉండదు
నరులు  స్త్రీ మీద వ్యామోహం కలిగిన వారే ఉంటారు కలియుగములో

శూద్రాః ప్రతిగ్రహీష్యన్తి తపోవేషోపజీవినః
ధర్మం వక్ష్యన్త్యధర్మజ్ఞా అధిరుహ్యోత్తమాసనమ్

తపస్సు చేసి బతికేవారి వేషాలను శూద్రులు వేసుకుంటారు
అధర్మం తెలిసినవారే ఉత్తమ ఆసనాన్ని ఎక్కి ధర్మం చెబుతూ ఉంటారు

నిత్యం ఉద్విగ్నమనసో దుర్భిక్షకరకర్శితాః
నిరన్నే భూతలే రాజననావృష్టిభయాతురాః

నిత్యం మనసు ఉద్విగ్నముగా ఉంటుంది.
ఒక పక్కన కరువుతో ఇంకో పక్కన పన్నుతో బాధపడతారు
అనావృష్టితో ఆహారం లేకుండా భయం పుడుతుంది

వాసోऽన్నపానశయన వ్యవాయస్నానభూషణైః
హీనాః పిశాచసన్దర్శా భవిష్యన్తి కలౌ ప్రజాః

వస్త్రమూ అన్నమూ పానమూ నిద్రా సంభోగాదులూ స్నానమూ ఆభరణాలు లేక ప్రజలు
పిశాచాలలా కనపడతారు ప్రజలు.

కలౌ కాకిణికేऽప్యర్థే విగృహ్య త్యక్తసౌహృదాః
త్యక్ష్యన్తి చ ప్రియాన్ప్రాణాన్హనిష్యన్తి స్వకానపి

చిల్లిగవ్వకోసం కూడా మైత్రిని విడిచిపెట్టి విరోధం పెంచుకుని ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు
ఆ చిల్లిగవ్వకోసం ప్రాణం వదలడానికీ ప్రాణం తీయడానికీ కూడా సిద్ధపడతారు

న రక్షిష్యన్తి మనుజాః స్థవిరౌ పితరావపి
పుత్రాన్భార్యాం చ కులజాం క్షుద్రాః శిశ్నోదరంభరాః

వృద్ధ తల్లి తండ్రులను కుమారులు పోషించరు
పిల్లలను కూడా తల్లి తండ్రులు పోషించరు. నాకే లేదు నీకేమి పెడతాను అంటారు. (ఉదర పరులు)
ముసలి వాళ్ళు కూడా పెళ్ళి చేసుకుంటారు. (శిశ్న పరులు)

కలౌ న రాజన్జగతాం పరం గురుం త్రిలోకనాథానతపాదపఙ్కజమ్
ప్రాయేణ మర్త్యా భగవన్తమచ్యుతం యక్ష్యన్తి పాషణ్డవిభిన్నచేతసః

పాపుల వాదముతో భేధించబడిన బుద్ధి గలవారు కలియుగములో భగవదారాథన చేయరు

యన్నామధేయం మ్రియమాణ ఆతురః పతన్స్ఖలన్వా వివశో గృణన్పుమాన్
విముక్తకర్మార్గల ఉత్తమాం గతిం ప్రాప్నోతి యక్ష్యన్తి న తం కలౌ జనాః

చనిపోతున్నవాడూ రోగ గ్రస్థుడూ పడబోతూ జారబోతూ ఉన్నవాడూ పరవశముతో పరమాత్మ నామాన్ని పలికితే  అన్ని కర్మాశయాలనూ వదలి ఉత్తమ గతిని పొందుతాడో అలాంటి పరమాత్మను కలియుగములో మానవులు పూజించరు

పుంసాం కలికృతాన్దోషాన్ద్రవ్యదేశాత్మసమ్భవాన్
సర్వాన్హరతి చిత్తస్థో భగవాన్పురుషోత్తమః

ద్రవ్యమూ దేశమూ మనసూ దోషభూయిష్టమే.
ఇన్ని రకాల మానవుల దోషాలను కూడా హృదయములో అంతర్యామిగా ఉన్న పరమాత్మ హరిస్తాడు

శ్రుతః సఙ్కీర్తితో ధ్యాతః పూజితశ్చాదృతోऽపి వా
నృణాం ధునోతి భగవాన్హృత్స్థో జన్మాయుతాశుభమ్

విన్నా కీర్తించినా ధ్యానించినా పూజించినా, (భక్తులను) ఆదరించినా చాలు.
పదివేల జన్మలలో ఉన్న పాపాలనీ పరమాత్మ పోగొడతాడు

యథా హేమ్ని స్థితో వహ్నిర్దుర్వర్ణం హన్తి ధాతుజమ్
ఏవమాత్మగతో విష్ణుర్యోగినామశుభాశయమ్

బంగారాన్ని నిప్పులో వేస్తే బంగారానికి ఉన్న మలినాన్ని నిప్పు ఎలా పోగొడుతుందో
ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ రోగుల పాపపు స్వభావాన్ని తొలగిస్తాడు.

విద్యాతపఃప్రాణనిరోధమైత్రీ తీర్థాభిషేకవ్రతదానజప్యైః
నాత్యన్తశుద్ధిం లభతేऽన్తరాత్మా యథా హృదిస్థే భగవత్యనన్తే

విద్యా తపస్సూ ప్రాణాయామమూ స్నేహమూ తీర్థాభిషేకమూ వ్రతమూ దానమూ జపమూ, వీటితో అంతగా పరిశుద్ధి కలగదు.
పరమాత్మను హృదయములో ఉంచుకుంటే శుద్ధి వస్తుంది.

తస్మాత్సర్వాత్మనా రాజన్హృదిస్థం కురు కేశవమ్
మ్రియమాణో హ్యవహితస్తతో యాసి పరాం గతిమ్

కలియుగానికి ఒకటే మందు. అన్ని రకములుగా పరమాత్మను హృదయములో ఉంచుకోండి
బతికున్నంత కాలం స్మరించకున్నా, కనీసం మరణించే ముందు ధ్యానం చేసినా చాలు.

మ్రియమాణైరభిధ్యేయో భగవాన్పరమేశ్వరః
ఆత్మభావం నయత్యఙ్గ సర్వాత్మా సర్వసంశ్రయః

భగవానుడు సర్వాత్మ, అందరికీ ఆశ్రయం. ఆయనను స్మరిస్తే ఆయనలో చేర్చుకుంటాడు

కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వ్రజేత్

ఇన్ని దోషాలు ఉన్న కలియుగములో కూడా ఒక మంచి గుణం ఉంది
పరమాత్మను ఒక్క సారి కీర్తిస్తే చాలు. భగవద్కీర్తనతోనే అన్ని బంధాలూ తొలగి పరమాత్మను చేరవచ్చు. ఈ సౌకర్యం వేరే యుగాలలో లేదు

కృతే యద్ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః
ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్

కృత యుగములో ధ్యానమూ, త్రేతా యుగములో యజ్ఞ్యము
ద్వాపరములో సేవ, కలియుగములో నామ సంకీర్తన విధించబడినవి. వేరే వాటితో కలియుగములో పని లేదు. ఒక్క నామ సంకీర్తనతో తరించవచ్చు

                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                             సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Friday, September 27, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయం

                                                    ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తతశ్చానుదినం ధర్మః సత్యం శౌచం క్షమా దయా
కాలేన బలినా రాజన్నఙ్క్ష్యత్యాయుర్బలం స్మృతిః

క్షమా ధర్మ సత్యం శౌచం దయా మొదలైన్వాటిని రాజులే నశింపచేస్తారు
బలమైన కాలం వీటిని పోగొడుతుంది, బలము పోతుంది, స్మృతి (బుద్ధి బలం) కూడా పోతుంది

విత్తమేవ కలౌ నౄణాం జన్మాచారగుణోదయః
ధర్మన్యాయవ్యవస్థాయాం కారణం బలమేవ హి

ఎవడికి బాగా డబ్బు ఉంటే వాడే మంచి ఆచారవంతుడు, గుణవంతుడు, మంచి వంశములో పుట్టినవాడు అవుతాడు. వాడిదే ఉత్తమ ఆచారం.
బలవంతుడు చెప్పినదే ధర్మమ్న్యాం అని నిర్ణ్యైంచడుతుంది

దామ్పత్యేऽభిరుచిర్హేతుర్మాయైవ వ్యావహారికే
స్త్రీత్వే పుంస్త్వే చ హి రతిర్విప్రత్వే సూత్రమేవ హి

అమ్మాయికి అబ్బాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి నచ్చడమే వివాహానికీ దాంపత్యానికీ హేతువు.
వ్యవహారం అంటే మాయ.
స్త్రీత్వం పుంసత్వమే రతికి కారణం. ప్రేమ ఉండదు
యజ్ఞ్యోపవీతం ఉన్నవాడే బ్రాహ్మణుడు

లిఙ్గం ఏవాశ్రమఖ్యాతావన్యోన్యాపత్తికారణమ్
అవృత్త్యా న్యాయదౌర్బల్యం పాణ్డిత్యే చాపలం వచః

కాషాయం వేసుకుంటే సన్యాసి, అమ్మయితో ఉంటే గృహస్థు. ఇలా వేషాన్ని బట్టి ఆశ్రమాన్ని చెబుతారు గానీ వారు ఆయా ఆశ్రమ ధర్మాలు పాటించరు.
బతుకు తెరువు లేదు కాబట్టి అన్యాయం పెరుగుతుంది. బలహీనులవుతారు.
ఎంత అర్థం లేకుండా మాట్లాడితే అంత పండితులు.

అనాఢ్యతైవాసాధుత్వే సాధుత్వే దమ్భ ఏవ తు
స్వీకార ఏవ చోద్వాహే స్నానమేవ ప్రసాధనమ్

డబ్బు లేనివాడే దుర్జనుడు
డాంభికముగా ఉన్నవాడు ఉత్తముడు.
వివాహానికి స్వీకారమే (నచ్చడమే) కారణం
కేవలం స్నానం చేయడమే అలంకారం

దూరే వార్యయనం తీర్థం లావణ్యం కేశధారణమ్
ఉదరంభరతా స్వార్థః సత్యత్వే ధార్ష్ట్యమేవ హి
దాక్ష్యం కుటుమ్బభరణం యశోऽర్థే ధర్మసేవనమ్

ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తే అదే తీర్థం. తీర్థ యాత్ర పేరుతో ఎంత ఎక్కువ దూరానికి వెళితే అంత గొప్ప అన్నమాట.
అందం అంటే కేశ ధారణ. జుట్టు పెంచుకోవడమే అందం
పొట్ట నింపుకోవడమే అందరి ఉద్దేశ్యం
ఎదుటివారిని అదరగొట్టడమే సత్యం
కుటుంబాన్ని బాగా పోషించుకున్నవాడే దక్షుడు
పేరు కోసమే ధర్మాచరణ చేస్తారు

ఏవం ప్రజాభిర్దుష్టాభిరాకీర్ణే క్షితిమణ్డలే
బ్రహ్మవిట్క్షత్రశూద్రాణాం యో బలీ భవితా నృపః

ఇలాంటి దుష్టులతో భూమండలం అంతా నిండిపోతుంది.
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవడు బలవంతుడో వాడే రాజు అవుతాడు

ప్రజా హి లుబ్ధై రాజన్యైర్నిర్ఘృణైర్దస్యుధర్మభిః
ఆచ్ఛిన్నదారద్రవిణా యాస్యన్తి గిరికాననమ్

పిసినారితోటి, డబ్బు మీద ఆశ ఉన్నవారితో దయ లేనివారితో అధర్మాత్ములైన రాజులతో ప్రజలు బాధించబడతారు
చివరకు వచ్చేసరికి భార్యా పిల్లలూ ఎవరూ ఉండరు. ఇంక ఎవరూ ఊరిలో ఉండలేక అడవుల వెంటబడతారు.

శాకమూలామిషక్షౌద్ర ఫలపుష్పాష్టిభోజనాః
అనావృష్ట్యా వినఙ్క్ష్యన్తి దుర్భిక్షకరపీడితాః

కూరగాయలూ మూలములూ మాంసమూ తేనె పళ్ళూ పుష్పాలూ తింటూ ఉంటారు
కరవుతో పంటలు నశిస్తాయి. పన్నుతో అందరూ పీడించబడతారు

శీతవాతాతపప్రావృడ్ హిమైరన్యోన్యతః ప్రజాః
క్షుత్తృడ్భ్యాం వ్యాధిభిశ్చైవ సన్తప్స్యన్తే చ చిన్తయా

చలితో గాలితో ఎండతో వర్షాలతో మంచుతో ఒకరినొకరు బాధించబడతారు
ఆకలీ దప్పులూ వ్యాధులూ. ఇవన్నీ ఎక్కువ గావాడముతో చింతిస్తూ ఉంటారు.

త్రింశద్వింశతి వర్షాణి
పరమాయుః కలౌ నృణామ్

ఇరవై ముప్పయ్యేళ్ళు దాటితే పరిపూర్ణ ఆయువు కింద లెక్క (వారికొచ్చే రోగాల వలన)


క్షీయమాణేషు దేహేషు దేహినాం కలిదోషతః
వర్ణాశ్రమవతాం ధర్మే నష్టే వేదపథే నృణామ్

కలి దోషాల వలన వీరి శరీరాలు క్షీణించిపోతాయి
వర్ణాలూ ఆశ్రమాలు ధర్మాలు వేద మార్గమూ నశిస్తాయి.

పాషణ్డప్రచురే ధర్మే దస్యుప్రాయేషు రాజసు
చౌర్యానృతవృథాహింసా నానావృత్తిషు వై నృషు

పాప ఖండమే ధర్మం (నాస్తికత్వం)
రాజులంటే దొంగలు
మానవులు చౌర్యమూ అబద్దమూ అకారణ హింస అనే నానా వృత్తులను స్వీకరిస్తారు

శూద్రప్రాయేషు వర్ణేషు చ్ఛాగప్రాయాసు ధేనుషు
గృహప్రాయేష్వాశ్రమేషు యౌనప్రాయేషు బన్ధుషు

అన్ని వర్ణాల వారూ శూద్రుల వలనే ఉంటారు
మేకలలాగ ఆవులు ఉంటాయి
సన్యాసుల ఆశ్రమాలు ఇళ్ళలా ఉంటాయి
బంధువులు అంటే భార్య తరపువారే. (యోని సంబంధం ఉన్నవారే  బంధవులు)

అణుప్రాయాస్వోషధీషు శమీప్రాయేషు స్థాస్నుషు
విద్యుత్ప్రాయేషు మేఘేషు శూన్యప్రాయేషు సద్మసు

అణువులా ఉండే ఔషధాలు
పెద్ద వృక్షాలు అంటే జమ్మి చెట్టు అంత ఉంటాయి
మబ్బులు మెరుపులులా ఉంటాయి (అంటే వర్షాలు పడవు)
ఇళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి

ఇత్థం కలౌ గతప్రాయే జనేషు ఖరధర్మిషు
ధర్మత్రాణాయ సత్త్వేన భగవానవతరిష్యతి

గతములో ప్రాయమంతా గడిచి జనులంతా దుష్ట ధర్మాలు ఆచరిస్తూ ఉంటే
మళ్ళీ స్వామి అపుడూ అవతరిస్తాడు

చరాచరగురోర్విష్ణోరీశ్వరస్యాఖిలాత్మనః
ధర్మత్రాణాయ సాధూనాం జన్మ కర్మాపనుత్తయే

పరమాత్మ చరాచర గురువు. ధర్మాన్నీ సాధువులనూ రక్షించడానికీ
వారి జన్మా కర్మా కాపాడడానికీ స్వామి వస్తాడు.

శమ్భలగ్రామముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః
భవనే విష్ణుయశసః కల్కిః ప్రాదుర్భవిష్యతి

శంబల గ్రామములో విష్ణు యశస అనే బ్రాహ్మణునికి కల్కి పుడతాడు

అశ్వమాశుగమారుహ్య దేవదత్తం జగత్పతిః
అసినాసాధుదమనమష్టైశ్వర్యగుణాన్వితః

దేవదత్తం అనే అశ్వమెక్కి ఖడ్గముతో దుష్టులందరినీ సంహరిస్తాడు
అష్టైశ్వర్య గుణాలు గల స్వామి

విచరన్నాశునా క్షౌణ్యాం హయేనాప్రతిమద్యుతిః
నృపలిఙ్గచ్ఛదో దస్యూన్కోటిశో నిహనిష్యతి

గుర్రముతో భూమండలము అంతా తిరిగి రాజుల వేషం వేసుకున్న దుర్మార్గులనూ దొంగలనూ సంహరిస్తాడు

అథ తేషాం భవిష్యన్తి మనాంసి విశదాని వై
వాసుదేవాఙ్గరాగాతి పుణ్యగన్ధానిలస్పృశామ్
పౌరజానపదానాం వై హతేష్వఖిలదస్యుషు

పరమాత్మ రావడముతో అందరి మనసులూ శుద్ధమవుతాయి
వాసుదేవుని శరీరం నుండి ప్రవహించే పరిశుద్ధమైన గాలి తగలడముతో అనదరి మనసులూ పరిశుద్ధములవుతాయి. దొంగలందరూ చంపబడిన తరువాత

తేషాం ప్రజావిసర్గశ్చ స్థవిష్ఠః సమ్భవిష్యతి
వాసుదేవే భగవతి సత్త్వమూర్తౌ హృది స్థితే

ప్రజా సృష్టి స్థవిష్ఠమవుతుంది.
పరమాత్మ మన హృదయములో ఉంటే

యదావతీర్ణో భగవాన్కల్కిర్ధర్మపతిర్హరిః
కృతం భవిష్యతి తదా ప్రజాసూతిశ్చ సాత్త్వికీ

ధర్మ పతి ఐన కల్కి రాగానే కలియుగం కాస్తా కృతయుగమవుతుంది.
ప్రజలు కూడా సత్వ గుణ సంపన్నులు అవుతారు

యదా చన్ద్రశ్చ సూర్యశ్చ తథా తిష్యబృహస్పతీ
ఏకరాశౌ సమేష్యన్తి భవిష్యతి తదా కృతమ్

కృత యుగం అంటే చంద్రుడూ సూర్యుడూ బృహస్పతీ వీరు ఒకే రాశిలో ఉన్నపుడు కృత యుగం అవుతుంది.

యేऽతీతా వర్తమానా యే భవిష్యన్తి చ పార్థివాః
తే త ఉద్దేశతః ప్రోక్తా వంశీయాః సోమసూర్యయోః

గడిచిన వారూ ఉన్నవారూ వచ్చేవారు, (రాజులు) అన్నీ నీకు చెప్పాను.

ఆరభ్య భవతో జన్మ యావన్నన్దాభిషేచనమ్
ఏతద్వర్షసహస్రం తు శతం పఞ్చదశోత్తరమ్

నీ పుట్టుక దగ్గర నుండీ నందాభిషేకం వరకూ అన్నీ చెప్పాను
ఇదంతా పదకొండు వందల పదహేను సంవత్సరాలు

సప్తర్షీణాం తు యౌ పూర్వౌ దృశ్యేతే ఉదితౌ దివి
తయోస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమం నిశి

సప్త ఋషులలో మొదటి ఇద్దరూ ఉదయించినపుడు ,
ఆ ఇద్దరి మధ్యనా ఒక చుక్క కనపడితే,

తేనైవ ఋషయో యుక్తాస్తిష్ఠన్త్యబ్దశతం నృణామ్
తే త్వదీయే ద్విజాః కాల అధునా చాశ్రితా మఘాః

అప్పుడు మానవుల ఆయుష్యం నూరేళ్ళుగా ఉంటుంది.  వారు కూడా మనకు నూరేళ్ళు కనపడతారు
ఇపుడు ఆ ఋషులందరూ మఘా నక్షత్రాన్ని ఆశ్రయించి ఉన్నారు

విష్ణోర్భగవతో భానుః కృష్ణాఖ్యోऽసౌ దివం గతః
తదావిశత్కలిర్లోకం పాపే యద్రమతే జనః

పరమాత్మ యొక్క కృష్ణ భానుడు వైకుంఠానికి వెళ్ళాడు. పరమాత్మ శ్రీకృష్ణుడు వైకుంఠానికి వెళ్ళగానే కలి ప్రవేశించాడు. ఈ కలియుగములో అందరికీ పాపమే నచ్చుతుంది

యావత్స పాదపద్మాభ్యాం స్పృశనాస్తే రమాపతిః
తావత్కలిర్వై పృథివీం పరాక్రన్తుం న చాశకత్

కృష్ణ పరమాత్మ తన పాదములతో భూమిని స్పృశించి ఉన్నంత కాలం కలి భూమి మీదకు రావడానికి సాహసించలేదు

యదా దేవర్షయః సప్త మఘాసు విచరన్తి హి
తదా ప్రవృత్తస్తు కలిర్ద్వాదశాబ్దశతాత్మకః

దేవర్షులు ఏడుగురు మఘా నక్షత్రాలలో విహరించినపుడు కలి వచ్చాడు
ఇది పన్నెండు వందల దివ్య సంవత్సరాలు

యదా మఘాభ్యో యాస్యన్తి పూర్వాషాఢాం మహర్షయః
తదా నన్దాత్ప్రభృత్యేష కలిర్వృద్ధిం గమిష్యతి

సప్త ఋషులు మఘ నుండి పూర్వాషాఢ నక్షత్రానికి వెళ్ళినప్పటినుంచీ నందుల రాజ్యం వస్తుంది
అప్పటినుంచీ కలి పెరుగుతాడు

యస్మిన్కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని
ప్రతిపన్నం కలియుగమితి ప్రాహుః పురావిదః

కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళిన పూటే కలి వచ్చాడు.
పరమాత్మ వెళ్ళిన వెంటనే కలి వచ్చింది అని ప్రాచీన పండితులు చెబుతున్నారు

దివ్యాబ్దానాం సహస్రాన్తే చతుర్థే తు పునః కృతమ్
భవిష్యతి తదా నౄణాం మన ఆత్మప్రకాశకమ్

ఇలా దివ్య సంవత్సరాలు పన్నెండు వందలు గడిస్తే, (1200 - కలియుగం , 2400- ద్వాపర....)
కృత యుగం ఐతే మళ్ళీ మానవుల మనసు ప్రకాశిస్తుంది.

ఇత్యేష మానవో వంశో యథా సఙ్ఖ్యాయతే భువి
తథా విట్శూద్రవిప్రాణాం తాస్తా జ్ఞేయా యుగే యుగే

ఈ రకముగా మానవ వంశాన్ని భూలోకములో ఎలా చెప్పుకుంట్నామో
వైశ్యులూ శూద్రులూ బ్రాహ్మణుల స్వభావాలు ఆయా యుగాలకు అనుగుణముగా చెప్పుకోవాలి.

ఏతేషాం నామలిఙ్గానాం పురుషాణాం మహాత్మనామ్
కథామాత్రావశిష్టానాం కీర్తిరేవ స్థితా భువి

మహాత్ముల నామాలూ రూపాలూ గుర్తులూ చెప్పాము, పరిపాలన చెప్పాము
వారు లేకపోయినా వారి కీర్తి మాత్రమే మిగులుతుంది.

దేవాపిః శాన్తనోర్భ్రాతా మరుశ్చేక్ష్వాకువంశజః
కలాపగ్రామ ఆసాతే మహాయోగబలాన్వితౌ

శంతనుడి సోదరుడు దేవాపి, ఇక్ష్వాకు వంశస్థుడు మరు, వీరిద్దరూ కలాప గ్రామములో వేంచేసి ఉంటారు, మహా యోగబలముతో ఉంటారు

తావిహైత్య కలేరన్తే వాసుదేవానుశిక్షితౌ
వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వవత్ప్రథయిష్యతః

కలియుగం ఐపోయాక వారు మళ్ళీ ఇక్కడకు వచ్చి పరమాత్మ చేత బోధించబడి, వర్ణాశ్రమ ధర్మాలను, యధాపూర్వం ప్రవర్తింపచేస్తారు

కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్
అనేన క్రమయోగేన భువి ప్రాణిషు వర్తతే

కృత త్రేతా ద్వాపర కలియుగాలలో ఇదే క్రమముగా ప్రాణులందరిలో తిరుగుతూ ఉంటాయి
ఇవన్నీ నీకు వరుసలో చెప్పాను

రాజన్నేతే మయా ప్రోక్తా నరదేవాస్తథాపరే
భూమౌ మమత్వం కృత్వాన్తే హిత్వేమాం నిధనం గతాః

రాజుల గురించీ చెప్పాను
వారంతా "నా భూమి నా భూమి" అంటూ మమకారం పెంచుకుని దానితోనే పోయారు

కృమివిడ్భస్మసంజ్ఞాన్తే రాజనామ్నోऽపి యస్య చ
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

క్రిమి విట్ భస్మ అయ్యే ఈశరీరముతో, రాజు అనే పేరుతో ప్రాణులకు ద్రోహం చేస్తున్నారు
నరకం మాత్రమే రప్పించే ఆశరీరముతో ఇలాంటి పని చేస్తూ అదే స్వార్థం అనుకుంటున్నారు
తనకు తాను కీడు తెచ్చుకునే వాడు స్వార్థపరుడెలా అవుతాడు

కథం సేయమఖణ్డా భూః పూర్వైర్మే పురుషైర్ధృతా
మత్పుత్రస్య చ పౌత్రస్య మత్పూర్వా వంశజస్య వా

ఈ భూమి "నా పూర్వులు నన్ను ఎలా ధరించారు, నా తరువాతి వారు ఎలా తయారు చేస్తారు. నా కుమారులకూ మనవలకూ ఈ భూమి ఎలా చెప్పాలి" అనుకుంటూ

తేజోऽబన్నమయం కాయం గృహీత్వాత్మతయాబుధాః
మహీం మమతయా చోభౌ హిత్వాన్తేऽదర్శనం గతాః

నిపూ నీరు అన్నముతో శరీరాన్ని పెంచుకుని జ్ఞ్యానం లేని వారు
ఈ భూమి నాది నాదీ, అనే భావముతో ఆ భూమినే వదలిపెట్టి కనపడకుండా పోయార్య్ ఇపుడు

యే యే భూపతయో రాజన్భుఞ్జతే భువమోజసా
కాలేన తే కృతాః సర్వే కథామాత్రాః కథాసు చ

తన పరాక్రమముతో ఏ ఏ రాజులు భూమిని అనుభవించారో
అలాంటి రాజులందరూ ఇపుడు కథలలో మాత్రమే కనపడుతున్నారు.
వారు కథల్లో దొరుకుతారు. ( ఆ రాజు బాగా పరిపాలించాడట  అని అందరూ అనుకుంటారు గాని , అంతకుమించి వారికి మిగిలేది ఏదీ ఉండదు)

                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                         సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Thursday, September 26, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ప్రథామాధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ప్రథామాధ్యాయం

శ్రీశుక ఉవాచ
యోऽన్త్యః పురఞ్జయో నామ భవిష్యో బారహద్రథః
తస్యామాత్యస్తు శునకో హత్వా స్వామినమాత్మజమ్

యదు వంశ విభూషణుడైన పరమాత్మ తన లోకానికి వెళ్ళిన తరువాత భూమి మీద ఏ రాజ వంశం పరిపాలించింది. ఏ వంశాలు పరిపాలించాయి అని అడుగగా
బృహద్రథుని వంశములో ఉన్న పురంజయుడే రాజుల వంశములో పరిపాలించిన వారిలో చివరివాడు.
రాజుల వంశములో రాజుగా పరిపాలించినవారిలో పురంజయుడు చివరివాడు
తరువాత మంత్రుల పరిపాలణం మొదలయ్యింది

ప్రద్యోతసంజ్ఞం రాజానం కర్తా యత్పాలకః సుతః
విశాఖయూపస్తత్పుత్రో భవితా రాజకస్తతః

అతని మంత్రి ఐన సునతుడు రాజునీ రాజ కుమారుడినీ చంపి తన కుమారుడు ఐన విశాఖుడిని రాజు చేసాడు

నన్దివర్ధనస్తత్పుత్రః పఞ్చ ప్రద్యోతనా ఇమే
అష్టత్రింశోత్తరశతం భోక్ష్యన్తి పృథివీం నృపాః

138 సంవత్సరాలు వీరి వంశం పరిపాలించింది

శిశునాగస్తతో భావ్యః కాకవర్ణస్తు తత్సుతః
క్షేమధర్మా తస్య సుతః క్షేత్రజ్ఞః క్షేమధర్మజః

విధిసారః సుతస్తస్యా జాతశత్రుర్భవిష్యతి
దర్భకస్తత్సుతో భావీ దర్భకస్యాజయః స్మృతః

నన్దివర్ధన ఆజేయో మహానన్దిః సుతస్తతః
శిశునాగా దశైవైతే సష్ట్యుత్తరశతత్రయమ్

వీరందరూ వారి సంతానం. ఈ పది పందినీ శిశునాగులూ అంటారు
360 సంవత్సరాలు రాజ్యం పరిపాలిస్తాడు

సమా భోక్ష్యన్తి పృథివీం కురుశ్రేష్ఠ కలౌ నృపాః
మహానన్దిసుతో రాజన్శూద్రాగర్భోద్భవో బలీ

మహాపద్మపతిః కశ్చిన్నన్దః క్షత్రవినాశకృత్
తతో నృపా భవిష్యన్తి శూద్రప్రాయాస్త్వధార్మికాః

మహానంది సుతుడు శూద్ర స్త్రీ నుండి పుట్టిన మహాపద్మపతి అనే ఒక నందుడు, క్షత్రియ వంశాన్ని నాశనం చేసినవాడు
తరువాత ఇంచుమించు శూద్రులే పరిపాలిస్తారు
వీరు అధార్మికులు

స ఏకచ్ఛత్రాం పృథివీమనుల్లఙ్ఘితశాసనః
శాసిష్యతి మహాపద్మో ద్వితీయ ఇవ భార్గవః

ఇతను పృధ్విని ఏకచత్రముగా పరిపాలించాడు. రెండవ పరశురామునిలా చండశాసనుడై పరిపాలించాడు

తస్య చాష్టౌ భవిష్యన్తి సుమాల్యప్రముఖాః సుతాః
య ఇమాం భోక్ష్యన్తి మహీం రాజానశ్చ శతం సమాః

ఇతనికి ఎనిమిది మంది కుమారులు

నవ నన్దాన్ద్విజః కశ్చిత్ప్రపన్నానుద్ధరిష్యతి
తేషాం అభావే జగతీం మౌర్యా భోక్ష్యన్తి వై కలౌ

ఈ నవ నందులను ఒక  బ్రాహ్మణుడు ఉద్ధరిస్తాడు(చాణక్యుడు)
వీరి తరువాత చంద్రగుప్తుడు (మౌర్యులు) రాజులుగా వస్తారు

స ఏవ చన్ద్రగుప్తం వై ద్విజో రాజ్యేऽభిషేక్ష్యతి
తత్సుతో వారిసారస్తు తతశ్చాశోకవర్ధనః

చాణక్యుడే చంద్రగుప్తున్ని రాజుగా చేస్తాడు

సుయశా భవితా తస్య సఙ్గతః సుయశఃసుతః
శాలిశూకస్తతస్తస్య సోమశర్మా భవిష్యతి
శతధన్వా తతస్తస్య భవితా తద్బృహద్రథః

వీరందరూ అతని కుమారులు

మౌర్యా హ్యేతే దశ నృపాః సప్తత్రింశచ్ఛతోత్తరమ్
సమా భోక్ష్యన్తి పృథివీం కలౌ కురుకులోద్వహ

137 సంవత్సరాలు పరిపాలిస్తారు వీరు

అగ్నిమిత్రస్తతస్తస్మాత్సుజ్యేష్ఠో భవితా తతః
వసుమిత్రో భద్రకశ్చ పులిన్దో భవితా సుతః

తరువాత సేనాపతుల రాజ్యం మొదలవుతుంది.

తతో ఘోషః సుతస్తస్మాద్వజ్రమిత్రో భవిష్యతి
తతో భాగవతస్తస్మాద్దేవభూతిః కురూద్వహ

శుఙ్గా దశైతే భోక్ష్యన్తి భూమిం వర్షశతాధికమ్
తతః కాణ్వానియం భూమిర్యాస్యత్యల్పగుణాన్నృప

వీరందరూ శుంగులు, నూరు సంవత్సరాలు పరిపాలిస్తారు
ఈ కణ్వుడి దగ్గర నుండి భూమి కూడా ఫలితాలను తగ్గించి వేస్తుంది

శుఙ్గం హత్వా దేవభూతిం కాణ్వోऽమాత్యస్తు కామినమ్
స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతిః

కణ్వుడు శుంగున్ని చంపి రాజ్యం తీసుకుంటాడు

తస్య పుత్రస్తు భూమిత్రస్తస్య నారాయణః సుతః
కాణ్వాయనా ఇమే భూమిం చత్వారింశచ్చ పఞ్చ చ
శతాని త్రీణి భోక్ష్యన్తి వర్షాణాం చ కలౌ యుగే

వీరు అతని పుత్రులు.
345 సంవత్సరాలు పరిపాలిస్తారు

హత్వా కాణ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలో బలీ
గాం భోక్ష్యత్యన్ధ్రజాతీయః కఞ్చిత్కాలమసత్తమః

కాణ్వున్ని చంపి ఒక శూద్ర బృత్యుడు, రాజు అవుతాడు
ఇతడు ఆంధ్ర జాతీయుడు.

కృష్ణనామాథ తద్భ్రాతా భవితా పృథివీపతిః
శ్రీశాన్తకర్ణస్తత్పుత్రః పౌర్ణమాసస్తు తత్సుతః

అతని సోదరుడు రాజవుతాడు
వీరు అతని కుమారులు

లమ్బోదరస్తు తత్పుత్రస్తస్మాచ్చిబిలకో నృపః
మేఘస్వాతిశ్చిబిలకాదటమానస్తు తస్య చ

అనిష్టకర్మా హాలేయస్తలకస్తస్య చాత్మజః
పురీషభీరుస్తత్పుత్రస్తతో రాజా సునన్దనః

చకోరో బహవో యత్ర శివస్వాతిరరిన్దమః
తస్యాపి గోమతీ పుత్రః పురీమాన్భవితా తతః


మేదశిరాః శివస్కన్దో యజ్ఞశ్రీస్తత్సుతస్తతః
విజయస్తత్సుతో భావ్యశ్చన్ద్రవిజ్ఞః సలోమధిః

వీరంతా(30) ఆ వంశానికి చెందినవారు

ఏతే త్రింశన్నృపతయశ్చత్వార్యబ్దశతాని చ
షట్పఞ్చాశచ్చ పృథివీం భోక్ష్యన్తి కురునన్దన

వీరంతా 456 సంవత్సరాలు పరిపాలిస్తారు

సప్తాభీరా ఆవభృత్యా దశ గర్దభినో నృపాః
కఙ్కాః షోడశ భూపాలా భవిష్యన్త్యతిలోలుపాః

తరువాత ఏడుగురు ఆభీరులు , పదిమంది గర్ద్భులు, 16 కంకులూ పరిపాలిస్తారు

తతోऽష్టౌ యవనా భావ్యాశ్చతుర్దశ తురుష్కకాః
భూయో దశ గురుణ్డాశ్చ మౌలా ఏకాదశైవ తు

తరువాత యవనులు పాలిస్తారు. 14 మంది తురుష్కులు
పది మంది గరుడులు
11 మౌలులు


ఏతే భోక్ష్యన్తి పృథివీం దశ వర్షశతాని చ
నవాధికాం చ నవతిం మౌలా ఏకాదశ క్షితిమ్

వీరంతా కలసి 1099 సంవత్సరాలు పరిపాలిస్తారు

భోక్ష్యన్త్యబ్దశతాన్యఙ్గ త్రీణి తైః సంస్థితే తతః
కిలకిలాయాం నృపతయో భూతనన్దోऽథ వఙ్గిరిః

మౌలులు 300 సంవత్సరాలు పరిపాలిస్తారు

శిశునన్దిశ్చ తద్భ్రాతా యశోనన్దిః ప్రవీరకః
ఇత్యేతే వై వర్షశతం భవిష్యన్త్యధికాని షట్

వీరు 106 సంవత్సరాలు పరిపాలిస్తారు

తేషాం త్రయోదశ సుతా భవితారశ్చ బాహ్లికాః
పుష్పమిత్రోऽథ రాజన్యో దుర్మిత్రోऽస్య తథైవ చ

ఏకకాలా ఇమే భూపాః సప్తాన్ధ్రాః సప్త కౌశలాః
విదూరపతయో భావ్యా నిషధాస్తత ఏవ హి

13 మంది పుత్రులు వీరికి
7 గురు ఆంధ్రులు కౌసలులూ నిషధులూ పరిపాలిస్తారు

మాగధానాం తు భవితా విశ్వస్ఫూర్జిః పురఞ్జయః
కరిష్యత్యపరో వర్ణాన్పులిన్దయదుమద్రకాన్

తరువాత మాగధులు

ప్రజాశ్చాబ్రహ్మభూయిష్ఠాః స్థాపయిష్యతి దుర్మతిః
వీర్యవాన్క్షత్రముత్సాద్య పద్మవత్యాం స వై పురి
అనుగఙ్గమాప్రయాగం గుప్తాం భోక్ష్యతి మేదినీమ్

ప్రజలకు బ్రాహ్మణుల యందు భక్తి తగ్గుతుంది.
క్షత్రియులను పూర్తిగా సంహరించి పద్మవతీ నగరములో గంగనుంచీ ప్రయాగ వరకూ పరిపాలిస్తాడు

సౌరాష్ట్రావన్త్యాభీరాశ్చ శూరా అర్బుదమాలవాః
వ్రాత్యా ద్విజా భవిష్యన్తి శూద్రప్రాయా జనాధిపాః

వ్రాత్యులు( ఆశ్రమ భ్రష్టులు/ ధర్మభ్రష్టులు/ఉపనయనాది సంస్కారం లేనివారు- రెండు  అర్థాలున్నాయి)
రాజులు శూద్రప్రాయులుగా ఉంటారు

సిన్ధోస్తటం చన్ద్రభాగాం కౌన్తీం కాశ్మీరమణ్డలమ్
భోక్ష్యన్తి శూద్రా వ్రాత్యాద్యా మ్లేచ్ఛాశ్చాబ్రహ్మవర్చసః

వీళ్ళంతా మలేచ్చులు బ్రహ్మవర్చస్సు లేనివారు.

తుల్యకాలా ఇమే రాజన్మ్లేచ్ఛప్రాయాశ్చ భూభృతః
ఏతేऽధర్మానృతపరాః ఫల్గుదాస్తీవ్రమన్యవః

రాజులెవరైనా వారిలాగానే ఉంటారు.
వీరంతా అధర్మమూ అసత్యమూ, కొద్దిగా ఇచ్చి పెద్దగా కోప్పడేవారు

స్త్రీబాలగోద్విజఘ్నాశ్చ పరదారధనాదృతాః
ఉదితాస్తమితప్రాయా అల్పసత్త్వాల్పకాయుషః

స్త్రీ బాల గో బ్రాహ్మణులను చంపేవారు
పరుల ధనమూ పరుల భార్యలనూ, హరించేవారు
పుట్టినంతలోనే పోయేవారు (అల్పాయుష్యులు)
బలం తక్కువ ఆయుష్షు తక్కువ

అసంస్కృతాః క్రియాహీనా రజసా తమసావృతాః
ప్రజాస్తే భక్షయిష్యన్తి మ్లేచ్ఛా రాజన్యరూపిణః

సంస్కార, క్రియా హీనులు
రజో తమో గుణాలు గలవారు
అన్నము కాక డబ్బు తినేవారు
రాజు రూపములో ఉన్న మలేచ్చులు

తన్నాథాస్తే జనపదాస్తచ్ఛీలాచారవాదినః
అన్యోన్యతో రాజభిశ్చ క్షయం యాస్యన్తి పీడితాః

జనపధాలలో వారే రాజులైనపుడు వారి చేత పరిపాలించేవారు  కూడా అదే శీలం ఆచారం గలవారు
వీరంతా పరస్పరం ఒకరిచే ఒకరు పీడించబడి చస్తారు


                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Tuesday, September 24, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

                                                            ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ తత్రాగమద్బ్రహ్మా భవాన్యా చ సమం భవః
మహేన్ద్రప్రముఖా దేవా మునయః సప్రజేశ్వరాః

సరస్వతితో బ్రహ్మా, పార్వతితో శివుడూ
మహేంద్రాది దేవతలూ

పితరః సిద్ధగన్ధర్వా విద్యాధరమహోరగాః
చారణా యక్షరక్షాంసి కిన్నరాప్సరసో ద్విజాః

మునులూ ప్రజాపతులూ పితృదేవతలూ , విద్యాధరులూ, చారణులూ
యక్ష కిన్నెర అప్సరస, ద్విజులూ

ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకాః
గాయన్తశ్చ గృణన్తశ్చ శౌరేః కర్మాణి జన్మ చ

పరమాత్మ ఐన శ్రీకృష్ణ నిర్యానాన్ని చూడగోరి పరమ ఉత్సాహముతో (ఎలా వచ్చాడో చూడలేదు, కనీసం ఎలా వెళతాడో చూడగోరి) పరమాత్మ యొక్క అవతారాన్నీ లీలలనూ గానం చేస్తూ పాడుతూ చెబుతూ పుష్పవర్షాన్ని విమానాల మీద నుంచి కురిపించారు

వవృషుః పుష్పవర్షాణి విమానావలిభిర్నభః
కుర్వన్తః సఙ్కులం రాజన్భక్త్యా పరమయా యుతాః

పరమభక్తితో మొత్తం సంకులం చేసారు

భగవాన్పితామహం వీక్ష్య విభూతీరాత్మనో విభుః
సంయోజ్యాత్మని చాత్మానం పద్మనేత్రే న్యమీలయత్

స్వామి తన విభూతులనూ బ్రహ్మనూ చూచి, ఆత్మలో ఆత్మను యోగం చేసి
తన పద్మం వంటి నేత్రాలను మూసుకున్నాడు

లోకాభిరామాం స్వతనుం ధారణాధ్యానమఙ్గలమ్
యోగధారణయాగ్నేయ్యా దగ్ధ్వా ధామావిశత్స్వకమ్

సకల లోకములకూ పరమ సుందరమైన తన శరీఎరము, ధారణకూ ధ్యానానికీ మంగళం ఐన తన శరీరాన్ని యోగముతో అగ్నిని సృష్టించి ఆ అగ్నితో ఆ శరీరాన్ని దహించి తన ధామానికి వెళ్ళిపోయాడు

దివి దున్దుభయో నేదుః పేతుః సుమనసశ్చ ఖాత్
సత్యం ధర్మో ధృతిర్భూమేః కీర్తిః శ్రీశ్చాను తం యయుః

స్వర్గములో దుందుభులు మోగాయి
ఆకాశములో పుష్పాలు కురిసాయి
సత్యం ధర్మ ధృతీ కీర్తి శ్రీ అన్నీ స్వామి వెంట వెళ్ళాయి

దేవాదయో బ్రహ్మముఖ్యా న విశన్తం స్వధామని
అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుశ్చాతివిస్మితాః

స్వామి వెళ్ళడాన్ని చూద్దామని ఇంత మంది వచ్చిన ఆయన గతిని ఎవరూ చూడలేకపోయారు
స్వామి ఎలా వెళతాడో చూద్దామని వచ్చినా తెలియకపోవడముతో ఆశ్చర్యపోయారు

సౌదామన్యా యథాక్లాశే యాన్త్యా హిత్వాభ్రమణ్డలమ్
గతిర్న లక్ష్యతే మర్త్యైస్తథా కృష్ణస్య దైవతైః

మేఘమండలాన్ని విడిచి మెరుపు పోయినట్లుగా, మెరుపును మనుష్యులు చూడలేనట్లుగా పరమాత్మ గతిని దేవతలు చూడలేకపోయారు

బ్రహ్మరుద్రాదయస్తే తు దృష్ట్వా యోగగతిం హరేః
విస్మితాస్తాం ప్రశంసన్తః స్వం స్వం లోకం యయుస్తదా

బ్రహ్మ రుద్రాదులు పరమాత్మ యోగ గతిని చూచి స్వామిని స్తోత్రం చేస్తూ, ఆశ్చర్యపోతూ వారి వారి లోకాలకు వెళ్ళారు

రాజన్పరస్య తనుభృజ్జననాప్యయేహా
మాయావిడమ్బనమవేహి యథా నటస్య
సృష్ట్వాత్మనేదమనువిశ్య విహృత్య చాన్తే
సంహృత్య చాత్మమహినోపరతః స ఆస్తే

రాజా, చూడు. సృష్టీ స్థితీ సంహారమూ సంకల్పముతో చేసే పరమాత్మ మాయను చూడు
జగత్తును సృష్టించి ఆయన ప్రవేశించి, ఆయన విహరించి, చివరకు శరీరాన్ని ఉపసంహరించి ఆయన ఎప్పటిలాగే ఉన్నాడు, కానీ దేనితో వచ్చాడో దాన్ని విడిచిపెట్టాడు

మర్త్యేన యో గురుసుతం యమలోకనీతం
త్వాం చానయచ్ఛరణదః పరమాస్త్రదగ్ధమ్
జిగ్యేऽన్తకాన్తకమపీశమసావనీశః
కిం స్వావనే స్వరనయన్మృగయుం సదేహమ్

చనిపోయిన గురుపుత్రున్ని, యమలోకానికి పోయిన గురుపుత్రున్ని తెచ్చినవాడు
అశ్వద్ధామ బ్రహ్మాస్త్రమునుండి కాలిపోకుండా నిన్ను రక్షించినవాడు
ఇంత పెద్ద కురుక్షేత్రములో యముడికే యముడయ్యాడు
ఎందరినో కాపాడుకున్న స్వామి ఆయన తనను కాపాడుకోవాలంటే కాపాడుకోలేడా
తన దేహాన్ని వేటగాని బాణానికి గురిచేసి, తాను శరీరాన్ని వదలిపోతూ తనను కొట్టినవానికి స్వర్గాన్ని ఇచ్చిన పరమాత్మ యొక్క ఔదార్యాన్ని దయనూ ఏ మాటలతో వర్ణించాలి.

తథాప్యశేషస్థితిసమ్భవాప్యయేష్వ్
అనన్యహేతుర్యదశేషశక్తిధృక్
నైచ్ఛత్ప్రణేతుం వపురత్ర శేషితం
మర్త్యేన కిం స్వస్థగతిం ప్రదర్శయన్

జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు అనన్య హేతువైన స్వామి, ఆ శరీరాన్ని ఇక్కడే ఉంచాలని అనుకోలేదు.
ఈనాడు తాను తన శరీరాన్ని ఇక్కడే ఉంచడం మొదలుపెడితే అందరూ అలాగే చేయడం మొదలుపెడతాడు. కాబట్టి అటువంటి దురాచారాన్ని వ్యాప్తి చేయకూడదని తన శరీరాన్ని దహించే వేళ్ళాడు

య ఏతాం ప్రాతరుత్థాయ కృష్ణస్య పదవీం పరామ్
ప్రయతః కీర్తయేద్భక్త్యా తామేవాప్నోత్యనుత్తమామ్

ఎవరైతే భక్తితో ఈ కృష్ణ పరమాత్మ యొక్క పరమపద గమనాన్ని శ్రద్ధతో కీర్తిస్తే వింటే వాడు ఆ గతినే పొందుతాడు

దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయోః
పతిత్వా చరణావస్రైర్న్యషిఞ్చత్కృష్ణవిచ్యుతః

దారుకుడు ద్వారకకు వచ్చి, వసుదేవ ఉగ్రసేనుని పాదాల మీద పడి
కన్నీళ్ళతో వాటిని తడిపి

కథయామాస నిధనం వృష్ణీనాం కృత్స్నశో నృప
తచ్ఛ్రుత్వోద్విగ్నహృదయా జనాః శోకవిర్మూర్చ్ఛితాః

కృష్ణ వియోగాన్ని యాదవ నాశాన్ని వివరించాడు
అది విన్నవారు ఉద్విగ్న హృదయులై శోకముతో మూర్చపోయి

తత్ర స్మ త్వరితా జగ్ముః కృష్ణవిశ్లేషవిహ్వలాః
వ్యసవః శేరతే యత్ర జ్ఞాతయో ఘ్నన్త ఆననమ్

కృష్ణ పరమాత్మను విడిచి ఉండలేక అక్కడకు వెళ్ళారు
బంధువులందరూ ప్రాణాలు విడిచి పడుకుని ఉన్నారు

దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథా సుతౌ
కృష్ణరామావపశ్యన్తః శోకార్తా విజహుః స్మృతిమ్

అందరినీ చూచారు గానీ బలరామ కృష్ణులు కనపడకపోవడముతో మూర్చబోయారు

ప్రాణాంశ్చ విజహుస్తత్ర భగవద్విరహాతురాః
ఉపగుహ్య పతీంస్తాత చితామారురుహుః స్త్రియః

కొందరు పరమాత్మ విరహాన్ని సహించలేక ప్రాణాలు విడిచారు
తమ తమ భర్తలను ఆలింగనం చేసుకుని స్త్రీలు చితిలో ప్రవేశించారు

రామపత్న్యశ్చ తద్దేహముపగుహ్యాగ్నిమావిశన్
వసుదేవపత్న్యస్తద్గాత్రం ప్రద్యుమ్నాదీన్హరేః స్నుషాః
కృష్ణపత్న్యోऽవిశన్నగ్నిం రుక్మిణ్యాద్యాస్తదాత్మికాః

బలరామ పత్నులు కూడా ఆయన దేహం తీసుకుని అగ్నిలో ప్రవేశించారు
కృష్ణుని భార్యలూ అగ్నిలో ప్రవేశించారు

అర్జునః ప్రేయసః సఖ్యుః కృష్ణస్య విరహాతురః
ఆత్మానం సాన్త్వయామాస కృష్ణగీతైః సదుక్తిభిః

కృష్ణ విరహముతో ఉన్న అర్జనుడు భగవత్గీతను జ్ఞ్యాపకం చేసుకుని తనను తానే ఓదార్చుకున్నాడు

బన్ధూనాం నష్టగోత్రాణామర్జునః సామ్పరాయికమ్
హతానాం కారయామాస యథావదనుపూర్వశః

ఇలా చనిపోయిన బంధువుల అంత్య క్రియలను వారి వారి యోగ్యతలకు అనుగుణముగా పూర్తిచేసాడు

ద్వారకాం హరిణా త్యక్తాం సముద్రోऽప్లావయత్క్షణాత్
వర్జయిత్వా మహారాజ శ్రీమద్భగవదాలయమ్

స్వామి వదలిపెట్టిన ద్వారకను సముద్రుడు ముంచివేశాడు
పరమాత్మ నివాసం తప్ప తక్కిన భాగాన్ని సముద్రుడు ముంచివేశాడు

నిత్యం సన్నిహితస్తత్ర భగవాన్మధుసూదనః
స్మృత్యాశేషాశుభహరం సర్వమఙ్గలమఙ్గలమ్

స్వామి ఆ నివాసములో నిత్యమూ ఉంటాడు. ఇప్పటికీ ఉన్నాడు
స్మరించినంత మాత్రాన అన్ని అశుభాలూ తొలగేది
అన్ని మంగళాలకూ మంగళ ప్రదుడు

స్త్రీబాలవృద్ధానాదాయ హతశేషాన్ధనఞ్జయః
ఇన్ద్రప్రస్థం సమావేశ్య వజ్రం తత్రాభ్యషేచయత్

ఇలా అందరినీ తీసుకుని ఇంద్రప్రస్థానికి తీసుకు వెళ్ళి వజ్రున్ని యాదవులకు రాజుగా అభిషేకించారు

శ్రుత్వా సుహృద్వధం రాజన్నర్జునాత్తే పితామహాః
త్వాం తు వంశధరం కృత్వా జగ్ముః సర్వే మహాపథమ్

నీ తాతలందరూ ఈ విషయాన్ని విని, నిన్ను వంశ ఉద్ధారకునిగా, రాజుగా అభిషేకం చేసి మహా ప్రస్థానికి వారు కూడా వెళ్ళారు

య ఏతద్దేవదేవస్య విష్ణోః కర్మాణి జన్మ చ
కీర్తయేచ్ఛ్రద్ధయా మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతే

ఎవరైతే పరమాత్మ శ్రీ కృష్ణుని అవతార కథలను శ్రద్ధతో గానం చేస్తే అన్ని పాపాల నుండీ విడువడతాడు

ఇత్థం హరేర్భగవతో రుచిరావతార
వీర్యాణి బాలచరితాని చ శన్తమాని
అన్యత్ర చేహ చ శ్రుతాని గృణన్మనుష్యో
భక్తిం పరాం పరమహంసగతౌ లభేత

పరమాత్మ యొక్క సుందరమైన మధురమైన అవతార కర్మలూ
బాల చరితములు, మంగళకరములు, ఇక్కడ విన్నవీ
మరో చోట విన్నవి, (ఇక్కడ ఆచరించిన కృత్యములూ, మధురా వ్రేపల్లే బృందావనం ద్వారక, ఈ నాలుగు చోట్ల ) ఆచరించిన కర్మలను విన్నవాటిని ఉచ్చరిస్తూ పలుకుతూ మానవుడు, భక్తిని పొందుతాడు.
పరమాత్మ యందు ఉత్తమ భక్తిని పొందుతాడు.

                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                             సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

                                                            ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ తత్రాగమద్బ్రహ్మా భవాన్యా చ సమం భవః
మహేన్ద్రప్రముఖా దేవా మునయః సప్రజేశ్వరాః

సరస్వతితో బ్రహ్మా, పార్వతితో శివుడూ
మహేంద్రాది దేవతలూ

పితరః సిద్ధగన్ధర్వా విద్యాధరమహోరగాః
చారణా యక్షరక్షాంసి కిన్నరాప్సరసో ద్విజాః

మునులూ ప్రజాపతులూ పితృదేవతలూ , విద్యాధరులూ, చారణులూ
యక్ష కిన్నెర అప్సరస, ద్విజులూ

ద్రష్టుకామా భగవతో నిర్యాణం పరమోత్సుకాః
గాయన్తశ్చ గృణన్తశ్చ శౌరేః కర్మాణి జన్మ చ

పరమాత్మ ఐన శ్రీకృష్ణ నిర్యానాన్ని చూడగోరి పరమ ఉత్సాహముతో (ఎలా వచ్చాడో చూడలేదు, కనీసం ఎలా వెళతాడో చూడగోరి) పరమాత్మ యొక్క అవతారాన్నీ లీలలనూ గానం చేస్తూ పాడుతూ చెబుతూ పుష్పవర్షాన్ని విమానాల మీద నుంచి కురిపించారు

వవృషుః పుష్పవర్షాణి విమానావలిభిర్నభః
కుర్వన్తః సఙ్కులం రాజన్భక్త్యా పరమయా యుతాః

పరమభక్తితో మొత్తం సంకులం చేసారు

భగవాన్పితామహం వీక్ష్య విభూతీరాత్మనో విభుః
సంయోజ్యాత్మని చాత్మానం పద్మనేత్రే న్యమీలయత్

స్వామి తన విభూతులనూ బ్రహ్మనూ చూచి, ఆత్మలో ఆత్మను యోగం చేసి
తన పద్మం వంటి నేత్రాలను మూసుకున్నాడు

లోకాభిరామాం స్వతనుం ధారణాధ్యానమఙ్గలమ్
యోగధారణయాగ్నేయ్యా దగ్ధ్వా ధామావిశత్స్వకమ్

సకల లోకములకూ పరమ సుందరమైన తన శరీఎరము, ధారణకూ ధ్యానానికీ మంగళం ఐన తన శరీరాన్ని యోగముతో అగ్నిని సృష్టించి ఆ అగ్నితో ఆ శరీరాన్ని దహించి తన ధామానికి వెళ్ళిపోయాడు

దివి దున్దుభయో నేదుః పేతుః సుమనసశ్చ ఖాత్
సత్యం ధర్మో ధృతిర్భూమేః కీర్తిః శ్రీశ్చాను తం యయుః

స్వర్గములో దుందుభులు మోగాయి
ఆకాశములో పుష్పాలు కురిసాయి
సత్యం ధర్మ ధృతీ కీర్తి శ్రీ అన్నీ స్వామి వెంట వెళ్ళాయి

దేవాదయో బ్రహ్మముఖ్యా న విశన్తం స్వధామని
అవిజ్ఞాతగతిం కృష్ణం దదృశుశ్చాతివిస్మితాః

స్వామి వెళ్ళడాన్ని చూద్దామని ఇంత మంది వచ్చిన ఆయన గతిని ఎవరూ చూడలేకపోయారు
స్వామి ఎలా వెళతాడో చూద్దామని వచ్చినా తెలియకపోవడముతో ఆశ్చర్యపోయారు

సౌదామన్యా యథాక్లాశే యాన్త్యా హిత్వాభ్రమణ్డలమ్
గతిర్న లక్ష్యతే మర్త్యైస్తథా కృష్ణస్య దైవతైః

మేఘమండలాన్ని విడిచి మెరుపు పోయినట్లుగా, మెరుపును మనుష్యులు చూడలేనట్లుగా పరమాత్మ గతిని దేవతలు చూడలేకపోయారు

బ్రహ్మరుద్రాదయస్తే తు దృష్ట్వా యోగగతిం హరేః
విస్మితాస్తాం ప్రశంసన్తః స్వం స్వం లోకం యయుస్తదా

బ్రహ్మ రుద్రాదులు పరమాత్మ యోగ గతిని చూచి స్వామిని స్తోత్రం చేస్తూ, ఆశ్చర్యపోతూ వారి వారి లోకాలకు వెళ్ళారు

రాజన్పరస్య తనుభృజ్జననాప్యయేహా
మాయావిడమ్బనమవేహి యథా నటస్య
సృష్ట్వాత్మనేదమనువిశ్య విహృత్య చాన్తే
సంహృత్య చాత్మమహినోపరతః స ఆస్తే

రాజా, చూడు. సృష్టీ స్థితీ సంహారమూ సంకల్పముతో చేసే పరమాత్మ మాయను చూడు
జగత్తును సృష్టించి ఆయన ప్రవేశించి, ఆయన విహరించి, చివరకు శరీరాన్ని ఉపసంహరించి ఆయన ఎప్పటిలాగే ఉన్నాడు, కానీ దేనితో వచ్చాడో దాన్ని విడిచిపెట్టాడు

మర్త్యేన యో గురుసుతం యమలోకనీతం
త్వాం చానయచ్ఛరణదః పరమాస్త్రదగ్ధమ్
జిగ్యేऽన్తకాన్తకమపీశమసావనీశః
కిం స్వావనే స్వరనయన్మృగయుం సదేహమ్

చనిపోయిన గురుపుత్రున్ని, యమలోకానికి పోయిన గురుపుత్రున్ని తెచ్చినవాడు
అశ్వద్ధామ బ్రహ్మాస్త్రమునుండి కాలిపోకుండా నిన్ను రక్షించినవాడు
ఇంత పెద్ద కురుక్షేత్రములో యముడికే యముడయ్యాడు
ఎందరినో కాపాడుకున్న స్వామి ఆయన తనను కాపాడుకోవాలంటే కాపాడుకోలేడా
తన దేహాన్ని వేటగాని బాణానికి గురిచేసి, తాను శరీరాన్ని వదలిపోతూ తనను కొట్టినవానికి స్వర్గాన్ని ఇచ్చిన పరమాత్మ యొక్క ఔదార్యాన్ని దయనూ ఏ మాటలతో వర్ణించాలి.

తథాప్యశేషస్థితిసమ్భవాప్యయేష్వ్
అనన్యహేతుర్యదశేషశక్తిధృక్
నైచ్ఛత్ప్రణేతుం వపురత్ర శేషితం
మర్త్యేన కిం స్వస్థగతిం ప్రదర్శయన్

జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు అనన్య హేతువైన స్వామి, ఆ శరీరాన్ని ఇక్కడే ఉంచాలని అనుకోలేదు.
ఈనాడు తాను తన శరీరాన్ని ఇక్కడే ఉంచడం మొదలుపెడితే అందరూ అలాగే చేయడం మొదలుపెడతాడు. కాబట్టి అటువంటి దురాచారాన్ని వ్యాప్తి చేయకూడదని తన శరీరాన్ని దహించే వేళ్ళాడు

య ఏతాం ప్రాతరుత్థాయ కృష్ణస్య పదవీం పరామ్
ప్రయతః కీర్తయేద్భక్త్యా తామేవాప్నోత్యనుత్తమామ్

ఎవరైతే భక్తితో ఈ కృష్ణ పరమాత్మ యొక్క పరమపద గమనాన్ని శ్రద్ధతో కీర్తిస్తే వింటే వాడు ఆ గతినే పొందుతాడు

దారుకో ద్వారకామేత్య వసుదేవోగ్రసేనయోః
పతిత్వా చరణావస్రైర్న్యషిఞ్చత్కృష్ణవిచ్యుతః

దారుకుడు ద్వారకకు వచ్చి, వసుదేవ ఉగ్రసేనుని పాదాల మీద పడి
కన్నీళ్ళతో వాటిని తడిపి

కథయామాస నిధనం వృష్ణీనాం కృత్స్నశో నృప
తచ్ఛ్రుత్వోద్విగ్నహృదయా జనాః శోకవిర్మూర్చ్ఛితాః

కృష్ణ వియోగాన్ని యాదవ నాశాన్ని వివరించాడు
అది విన్నవారు ఉద్విగ్న హృదయులై శోకముతో మూర్చపోయి

తత్ర స్మ త్వరితా జగ్ముః కృష్ణవిశ్లేషవిహ్వలాః
వ్యసవః శేరతే యత్ర జ్ఞాతయో ఘ్నన్త ఆననమ్

కృష్ణ పరమాత్మను విడిచి ఉండలేక అక్కడకు వెళ్ళారు
బంధువులందరూ ప్రాణాలు విడిచి పడుకుని ఉన్నారు

దేవకీ రోహిణీ చైవ వసుదేవస్తథా సుతౌ
కృష్ణరామావపశ్యన్తః శోకార్తా విజహుః స్మృతిమ్

అందరినీ చూచారు గానీ బలరామ కృష్ణులు కనపడకపోవడముతో మూర్చబోయారు

ప్రాణాంశ్చ విజహుస్తత్ర భగవద్విరహాతురాః
ఉపగుహ్య పతీంస్తాత చితామారురుహుః స్త్రియః

కొందరు పరమాత్మ విరహాన్ని సహించలేక ప్రాణాలు విడిచారు
తమ తమ భర్తలను ఆలింగనం చేసుకుని స్త్రీలు చితిలో ప్రవేశించారు

రామపత్న్యశ్చ తద్దేహముపగుహ్యాగ్నిమావిశన్
వసుదేవపత్న్యస్తద్గాత్రం ప్రద్యుమ్నాదీన్హరేః స్నుషాః
కృష్ణపత్న్యోऽవిశన్నగ్నిం రుక్మిణ్యాద్యాస్తదాత్మికాః

బలరామ పత్నులు కూడా ఆయన దేహం తీసుకుని అగ్నిలో ప్రవేశించారు
కృష్ణుని భార్యలూ అగ్నిలో ప్రవేశించారు

అర్జునః ప్రేయసః సఖ్యుః కృష్ణస్య విరహాతురః
ఆత్మానం సాన్త్వయామాస కృష్ణగీతైః సదుక్తిభిః

కృష్ణ విరహముతో ఉన్న అర్జనుడు భగవత్గీతను జ్ఞ్యాపకం చేసుకుని తనను తానే ఓదార్చుకున్నాడు

బన్ధూనాం నష్టగోత్రాణామర్జునః సామ్పరాయికమ్
హతానాం కారయామాస యథావదనుపూర్వశః

ఇలా చనిపోయిన బంధువుల అంత్య క్రియలను వారి వారి యోగ్యతలకు అనుగుణముగా పూర్తిచేసాడు

ద్వారకాం హరిణా త్యక్తాం సముద్రోऽప్లావయత్క్షణాత్
వర్జయిత్వా మహారాజ శ్రీమద్భగవదాలయమ్

స్వామి వదలిపెట్టిన ద్వారకను సముద్రుడు ముంచివేశాడు
పరమాత్మ నివాసం తప్ప తక్కిన భాగాన్ని సముద్రుడు ముంచివేశాడు

నిత్యం సన్నిహితస్తత్ర భగవాన్మధుసూదనః
స్మృత్యాశేషాశుభహరం సర్వమఙ్గలమఙ్గలమ్

స్వామి ఆ నివాసములో నిత్యమూ ఉంటాడు. ఇప్పటికీ ఉన్నాడు
స్మరించినంత మాత్రాన అన్ని అశుభాలూ తొలగేది
అన్ని మంగళాలకూ మంగళ ప్రదుడు

స్త్రీబాలవృద్ధానాదాయ హతశేషాన్ధనఞ్జయః
ఇన్ద్రప్రస్థం సమావేశ్య వజ్రం తత్రాభ్యషేచయత్

ఇలా అందరినీ తీసుకుని ఇంద్రప్రస్థానికి తీసుకు వెళ్ళి వజ్రున్ని యాదవులకు రాజుగా అభిషేకించారు

శ్రుత్వా సుహృద్వధం రాజన్నర్జునాత్తే పితామహాః
త్వాం తు వంశధరం కృత్వా జగ్ముః సర్వే మహాపథమ్

నీ తాతలందరూ ఈ విషయాన్ని విని, నిన్ను వంశ ఉద్ధారకునిగా, రాజుగా అభిషేకం చేసి మహా ప్రస్థానికి వారు కూడా వెళ్ళారు

య ఏతద్దేవదేవస్య విష్ణోః కర్మాణి జన్మ చ
కీర్తయేచ్ఛ్రద్ధయా మర్త్యః సర్వపాపైః ప్రముచ్యతే

ఎవరైతే పరమాత్మ శ్రీ కృష్ణుని అవతార కథలను శ్రద్ధతో గానం చేస్తే అన్ని పాపాల నుండీ విడువడతాడు

ఇత్థం హరేర్భగవతో రుచిరావతార
వీర్యాణి బాలచరితాని చ శన్తమాని
అన్యత్ర చేహ చ శ్రుతాని గృణన్మనుష్యో
భక్తిం పరాం పరమహంసగతౌ లభేత

పరమాత్మ యొక్క సుందరమైన మధురమైన అవతార కర్మలూ
బాల చరితములు, మంగళకరములు, ఇక్కడ విన్నవీ
మరో చోట విన్నవి, (ఇక్కడ ఆచరించిన కృత్యములూ, మధురా వ్రేపల్లే బృందావనం ద్వారక, ఈ నాలుగు చోట్ల ) ఆచరించిన కర్మలను విన్నవాటిని ఉచ్చరిస్తూ పలుకుతూ మానవుడు, భక్తిని పొందుతాడు.
పరమాత్మ యందు ఉత్తమ భక్తిని పొందుతాడు.

                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                             సర్వం శ్రీసాయినాథార్పణమస్తు