Monday, May 27, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదకొండవ అధ్యాయం

                                                                        ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
గోపా నన్దాదయః శ్రుత్వా ద్రుమయోః పతతో రవమ్
తత్రాజగ్ముః కురుశ్రేష్ఠ నిర్ఘాతభయశఙ్కితాః

నలకూబర మణి గ్రీవులు వెళ్ళిపోయే దాకా చెట్లు పడిన శబ్దం ఎవరికీ వినరాలేదు. వారు వెళ్ళిపోయిన తరువాత చెట్లు పడిన శబ్దం విని అందరూ పరుగు పరుగున వచ్చారు.

భూమ్యాం నిపతితౌ తత్ర దదృశుర్యమలార్జునౌ
బభ్రముస్తదవిజ్ఞాయ లక్ష్యం పతనకారణమ్

ఉలూఖలం వికర్షన్తం దామ్నా బద్ధం చ బాలకమ్
కస్యేదం కుత ఆశ్చర్యముత్పాత ఇతి కాతరాః

ఆ జంట చెట్లను చూచారు. రోటికి తాడు, ఆ తాడు పొట్టకు ఉంది, రోకలిని లాగుతున్నాడు. ఇది చూచి, ఇది ఎలా జరిగింది. రోటితో కట్టి వేయబడ్డ పిల్లవాడు చెట్లని లాగలేడు. ఇదీ ఒక ఉత్పాతమేనా

బాలా ఊచురనేనేతి తిర్యగ్గతములూఖలమ్
వికర్షతా మధ్యగేన పురుషావప్యచక్ష్మహి

పక్కనే ఉన్న పిల్లలు కృష్ణుడు రోటిని లాగాడు, అందులోంచి ఇద్దరు పురుషులు వచ్చారు అని చెప్పినా వారు నమ్మలేదు.

న తే తదుక్తం జగృహుర్న ఘటేతేతి తస్య తత్
బాలస్యోత్పాటనం తర్వోః కేచిత్సన్దిగ్ధచేతసః

పిల్లవాడు చెట్లు లాగడం ఎలా సాధ్యం అవుతుంది అని వారు నమ్మలేదు.

ఉలూఖలం వికర్షన్తం దామ్నా బద్ధం స్వమాత్మజమ్
విలోక్య నన్దః ప్రహసద్ వదనో విముమోచ హ

ఈ విషయం నందుడు చూచాడు. వచ్చి ఆ తాడుని విప్పేసాడు.

గోపీభిః స్తోభితోऽనృత్యద్భగవాన్బాలవత్క్వచిత్
ఉద్గాయతి క్వచిన్ముగ్ధస్తద్వశో దారుయన్త్రవత్

గోపికలు వచ్చి పిల్లవాన్ని ఆడించారు. వారు ఆడమంటే ఆడాడు. వారు పాట పాడమంటే పాడాడు. ఒక చెక్క బొమ్మలాగ ప్రవర్తించాడు.

బిభర్తి క్వచిదాజ్ఞప్తః పీఠకోన్మానపాదుకమ్
బాహుక్షేపం చ కురుతే స్వానాం చ ప్రీతిమావహన్

ఏమైనా ఆజ్ఞ్యాపిస్తే చేసేవాడు. చెప్పులని అందించమంటే అందించేవాడు. చెంబు ఇమ్మంటే ఇచ్చేవాడు. కృష్ణుడు చప్పట్లు కొట్టగానే వారు ఇంటిపనులు మాని కృష్ణుడి వద్దకు వెళ్ళేవారు

దర్శయంస్తద్విదాం లోక ఆత్మనో భృత్యవశ్యతామ్
వ్రజస్యోవాహ వై హర్షం భగవాన్బాలచేష్టితైః

ఆ జ్ఞ్యానం ఉన్న వారకు తాను భృత్యవశ్యుడు అని చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నాడు. పరమాత్మ చిన్న పిల్లల చేష్టలతో మొత్తం వ్రేపల్లెను సంతోషింపచేసాడు.

క్రీణీహి భోః ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుతః
ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః

ఇంతలో ఒక పళ్ళు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. కృష్ణుడు నా దగ్గర డబ్బు లేదని రెండు చేతులా ధాన్యం ఇచ్చాడు. ఆయన రెండు దోసిళ్ళ ధాన్యం ఇచ్చాడు. ఆమెను "నీ దోసిళ్ళతో ఇస్తే ఎక్కువ పళ్ళు వస్తాయి" అని రెండు దోసిళ్ళ పళ్ళను ఇమ్మన్నాడు. ఆయన చేతిలో పట్టుకున్నంత వరకే అవి ధాన్యముగా ఉన్నాయి. అవి ఆమె బుట్టలో పడగానే రత్నాలుగా మారిపోయాయి. తాను రత్నాలు ఇచ్చాడు, పళ్ళు తీసుకున్నాడు. మాకేమి కావాలో నీవే ఇవ్వు అంటే ఆయన అన్నీ ఇస్తాడు. పారతంత్ర్య బుద్ధి మనమెపుడూ కలిగి ఉండాలి అని చెప్పడానికి స్వామి ఈ లీల చేసాడు. అన్ని ఫలాలిచ్చే స్వామి ధాన్యం తీసుకుని

ఫలవిక్రయిణీ తస్య చ్యుతధాన్యకరద్వయమ్
ఫలైరపూరయద్రత్నైః ఫలభాణ్డమపూరి చ

వెళ్ళగానే పళ్ళు అమ్మె ఆమె చేతినిండా పళ్ళు పెట్టింది. ఆమె అలా పెట్టగానే ఆమె బుట్టనిండా రత్నాలు నిండాయి.

సరిత్తీరగతం కృష్ణం భగ్నార్జునమథాహ్వయత్
రామం చ రోహిణీ దేవీ క్రీడన్తం బాలకైర్భృశమ్

ఇలా పిల్లలతో ఆడుకుంటున్న కృష్ణుడిని తల్లి దగ్గరకు తీసుకుని ఎంత పిలిచినా వారు ఆటలలో పడి రావట్లేదు

నోపేయాతాం యదాహూతౌ క్రీడాసఙ్గేన పుత్రకౌ
యశోదాం ప్రేషయామాస రోహిణీ పుత్రవత్సలామ్

యశోదమ్మను పిల్లలను తీసుకు రమ్మని పంపగా

క్రీడన్తం సా సుతం బాలైరతివేలం సహాగ్రజమ్
యశోదాజోహవీత్కృష్ణం పుత్రస్నేహస్నుతస్తనీ

రా రా కృష్ణా అని పిలిచింది

కృష్ణ కృష్ణారవిన్దాక్ష తాత ఏహి స్తనం పిబ
అలం విహారైః క్షుత్క్షాన్తః క్రీడాశ్రాన్తోऽసి పుత్రక

పాలు తాగ్డదానికి రా, ఆటలు చాలు అలసి ఉంటావు. వచ్చి పాలు తాగు.నంద గోపుడు నీ కోసం ఎదురుచూస్తున్నాడు

హే రామాగచ్ఛ తాతాశు సానుజః కులనన్దన
ప్రాతరేవ కృతాహారస్తద్భవాన్భోక్తుమర్హతి

ప్రతీక్షతే త్వాం దాశార్హ భోక్ష్యమాణో వ్రజాధిపః
ఏహ్యావయోః ప్రియం ధేహి స్వగృహాన్యాత బాలకాః

ధూలిధూసరితాఙ్గస్త్వం పుత్ర మజ్జనమావహ
జన్మర్క్షం తేऽద్య భవతి విప్రేభ్యో దేహి గాః శుచిః

ఈ రోజు నీ జన్మ నక్షత్రం

పశ్య పశ్య వయస్యాంస్తే మాతృమృష్టాన్స్వలఙ్కృతాన్
త్వం చ స్నాతః కృతాహారో విహరస్వ స్వలఙ్కృతః

నీ తోటి పిల్లలను చూడు. ఇంటికి వెళ్ళారు. తల్లులు వారిని అలంకరించారు. నీవు కూడా నాతో రా

ఇత్థం యశోదా తమశేషశేఖరం మత్వా సుతం స్నేహనిబద్ధధీర్నృప
హస్తే గృహీత్వా సహరామమచ్యుతం నీత్వా స్వవాటం కృతవత్యథోదయమ్

సకల లోక జగన్నాధుడైన పరమాత్మను తన కుమారుడిగా  భావించి బలరామునితో సహా చేయిపట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళి స్నానం చేయించింది

శ్రీశుక ఉవాచ
గోపవృద్ధా మహోత్పాతాననుభూయ బృహద్వనే
నన్దాదయః సమాగమ్య వ్రజకార్యమమన్త్రయన్

వ్రేపల్లెలో ఇన్ని ఉత్పాతాలు కనపడడముతో బృందావనానికి వెళ్ళ నిశ్చయించారు పెద్దలంతా.

తత్రోపానన్దనామాహ గోపో జ్ఞానవయోऽధికః
దేశకాలార్థతత్త్వజ్ఞః ప్రియకృద్రామకృష్ణయోః

అందులో ఉన్న వారందరిలో పెద్ద వాడు ఉపనందుడు. జ్ఞ్యానములో వయసులో అధికుడు.
ఆయనకు ఏ సమయములో ఏ చోట ఏ పని చేయాలో తెలుసు. రామ కృష్ణులకు ప్రియమైన పనులు చేయడములో నేర్పరి

ఉత్థాతవ్యమితోऽస్మాభిర్గోకులస్య హితైషిభిః
ఆయాన్త్యత్ర మహోత్పాతా బాలానాం నాశహేతవః

మనవారంతా క్షేమముగా ఉండాలంటే మనం ఈ ప్రదేశాన్ని వీడాలి. మనం బాగానే ఉంటున్నాము గానీ పిల్లలకు నాశమయ్యే సూచనలు కనపడుతున్నాయి

ముక్తః కథఞ్చిద్రాక్షస్యా బాలఘ్న్యా బాలకో హ్యసౌ
హరేరనుగ్రహాన్నూనమనశ్చోపరి నాపతత్

పూతన అనే బాల గ్రహం నుండీ, బండి కింద పడే ప్రమాదాన్ని నుంచీ భగవంతుని దయ వలన క్షేమముగా పిల్లవాడు బయటపడ్డాడు.

చక్రవాతేన నీతోऽయం దైత్యేన విపదం వియత్
శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః

సుడిగాలి కూడా కింద పడేసింది. బండ మీద పడ్డాడు. ఐన దేవతలు కాపాడుతూ ఉండటం వలన ఏమీ కాలేదు. చెట్లు మధ్య పడ్డా ఏమీ కాలేదు.

యన్న మ్రియేత ద్రుమయోరన్తరం ప్రాప్య బాలకః
అసావన్యతమో వాపి తదప్యచ్యుతరక్షణమ్

జరిగిన అన్ని ఆపదలలో పరమాత్మ వెంట ఉంటూ కాపాడాడు

యావదౌత్పాతికోऽరిష్టో వ్రజం నాభిభవేదితః
తావద్బాలానుపాదాయ యాస్యామోऽన్యత్ర సానుగాః

ఆయన సూచనగా మనను రక్షించాడు. మొత్తం అందరికీ హాని కలిగించే అపాయం రాకముందే అందరం కలసి

వనం వృన్దావనం నామ పశవ్యం నవకాననమ్
గోపగోపీగవాం సేవ్యం పుణ్యాద్రితృణవీరుధమ్

దగ్గరలోనే ఉన్న బృందావనానికి వెళదాము. అక్కడ పశువులు ఉన్నాయి బాగా.
నీరూ చెట్లూ బాగా ఉన్నాయి
గోపాలకులూ గోపీ జనం గోవులూ మూడు సేవించడానికి అనుకూలమైనవు. పవిత్రమైన గోవర్దనం కూడా అక్కడే ఉంది.

తత్తత్రాద్యైవ యాస్యామః శకటాన్యుఙ్క్త మా చిరమ్
గోధనాన్యగ్రతో యాన్తు భవతాం యది రోచతే

అనుకున్న తరువాత ఆలస్యం వద్దు.ఇవ్వాలే బయలు దేరదాము. నా మాట మీకు నచ్చితే అందరూ బళ్ళు కట్టండి

తచ్ఛ్రుత్వైకధియో గోపాః సాధు సాధ్వితి వాదినః
వ్రజాన్స్వాన్స్వాన్సమాయుజ్య యయూ రూఢపరిచ్ఛదాః

అందరూ బాగా చెప్పావని మెచ్చుకున్నారు. అందరూ వెళ్ళ నిశ్చయించుకున్నారు

వృద్ధాన్బాలాన్స్త్రియో రాజన్సర్వోపకరణాని చ
అనఃస్వారోప్య గోపాలా యత్తా ఆత్తశరాసనాః

పెద్దలూ పిల్లలూ స్త్రీలనూ బళ్ళ మీద పెట్టుకుని కౄరమృగాల నుండి రక్షణంగా బాణాలూ ఆయుధాలు తీఉస్కుని కొమ్ములు ఊదుతూ ఆయుధాలు వెంటబెట్టుకుని

గోధనాని పురస్కృత్య శృఙ్గాణ్యాపూర్య సర్వతః
తూర్యఘోషేణ మహతా యయుః సహపురోహితాః

గోప్యో రూఢరథా నూత్న కుచకుఙ్కుమకాన్తయః
కృష్ణలీలా జగుః ప్రీత్యా నిష్కకణ్ఠ్యః సువాససః

అందరూ బయలు దేరారు. కృష్ణుని లీలలు గానం చేస్తూ గోపికలు కూడా బయలు దేరారు. యశోదా రోహిణులు ఒక బండి మీద కూర్చుని రామ కృష్ణులతో కూడి వారి కథలు వింటూ

తథా యశోదారోహిణ్యావేకం శకటమాస్థితే
రేజతుః కృష్ణరామాభ్యాం తత్కథాశ్రవణోత్సుకే

వృన్దావనం సమ్ప్రవిశ్య సర్వకాలసుఖావహమ్
తత్ర చక్రుర్వ్రజావాసం శకటైరర్ధచన్ద్రవత్

అన్ని వేళలలో ఆనందం కలిగించే బృందావనానికి వెళ్ళారు. పరమాత్మఏ సర్వ కాల స్వరూపుడు
ఇళ్ళు కట్టుకునే దాకా బళ్ళతోనే అర్థ చంద్రాకారములో ఆవాసాలు ఏర్పరచుకున్నారు

వృన్దావనం గోవర్ధనం యమునాపులినాని చ
వీక్ష్యాసీదుత్తమా ప్రీతీ రామమాధవయోర్నృప

బృందావనమూ గోవర్ధన పర్వతం యమునా తీరము చూచిన రామ కృష్ణులకు ఆనందం కలిగింది.

ఏవం వ్రజౌకసాం ప్రీతిం యచ్ఛన్తౌ బాలచేష్టితైః
కలవాక్యైః స్వకాలేన వత్సపాలౌ బభూవతుః

ఈ విధముగా చిన్న పిల్లల చేష్టలతో వ్రేపల్లె వాసులకు ప్రీతి కలిగిస్తూ వచ్చీ రాని మాటలతో అందరికీ ప్రీతి కలిగిస్తూ దూడలను పోషించే వయసుకు వచ్చిన వారు అయ్యారు.

అవిదూరే వ్రజభువః సహ గోపాలదారకైః
చారయామాసతుర్వత్సాన్నానాక్రీడాపరిచ్ఛదౌ

రక రకాల ఆటలతో దూడలను తీసుకుని దగ్గరలోనే తిప్పుతూ ఉన్నారు

క్వచిద్వాదయతో వేణుం క్షేపణైః క్షిపతః క్వచిత్
క్వచిత్పాదైః కిఙ్కిణీభిః క్వచిత్కృత్రిమగోవృషైః

ఒక చోట పిల్లన గ్రోవిని మోగిస్తూ ఉన్నారు, ఒక చోట వెక్కిరించే మాటలతో, కొన్ని చోట్ల కాలి మువ్వలతో, కొన్ని చోట్ల కృత్రిమ దూడల వేషం వేసుకుని బలిసిన కోడెల్లా మల్ల యుద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల జంతువుల్లా అరుస్తూ ఉన్నారు

వృషాయమాణౌ నర్దన్తౌ యుయుధాతే పరస్పరమ్
అనుకృత్య రుతైర్జన్తూంశ్చేరతుః ప్రాకృతౌ యథా

కదాచిద్యమునాతీరే వత్సాంశ్చారయతోః స్వకైః
వయస్యైః కృష్ణబలయోర్జిఘాంసుర్దైత్య ఆగమత్

ఇలా చేస్తూ ఉంటే ఒక రాక్షసుడు దూడల్లో తానూ దూడగా వచ్చాడు. వాడే వత్సాసురుడు

తం వత్సరూపిణం వీక్ష్య వత్సయూథగతం హరిః
దర్శయన్బలదేవాయ శనైర్ముగ్ధ ఇవాసదత్

బలరామ కృష్ణులను సంహరించగోరి వచ్చాడు
ఇలా దూడ వేషములో వచ్చిన రాక్షసున్ని స్వామి గుర్తుపట్టి అన్నగారిని పిలిచాడు

గృహీత్వాపరపాదాభ్యాం సహలాఙ్గూలమచ్యుతః
భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గతజీవితమ్
స కపిత్థైర్మహాకాయః పాత్యమానైః పపాత హ

పిలిచి విషయం చెప్పి కొద్దిగా నవ్వాడు. వాడు వచ్చేదాకా ఊరుకోవడం ఎందుకని, బలరాముడు వెళ్ళి దాని వెనక రెండు కాళ్ళూ, తోకా పట్టుకుని బాగా బలముగా తిప్పి దాని పక్కనే ఉన్న వెలగ చెట్టు మీద (ఆ వెలగ చెట్టు కూడా రాక్షసుడే - కపిత్థాసురుడు) వేసి కొట్టాడు. ఒకే దెబ్బకు రెండు రాక్షసులను చంపేసాడు. వత్సాసురినితో కపిథ్థాసురున్ని సంహరించాడు.
స్వామి చెరసాలలో పుట్టాడు. సంసారమనే చెరసాల. అజ్ఞ్యానమనే అర్థరాత్రిలో ఉన్నాము. భగవంతుని పిలిచేదాన్ని దేవకీ అంటారు. దేవకి అంటే భక్తి. వసుదేవుడు అంటే ఎవరికి భగవంతుడే ధనమో ఆయన వసుదేవుడు. వసుదేవుడంటే జ్ఞ్యానం. దేవకి అంటే భక్తి. వీరిద్దరినీ బంధించేవాడు కంసుడు. ఆయన అహంకారం. అహంకారం జ్ఞ్యానభక్తులను సంసారములో బంధిస్తే దాన్ని తొలగించి జ్ఞ్యాన భక్తులని ప్రకాశింపచేయడానికి కృష్ణ పరమాత్మ అవతరిస్తాడు
అవతరించిన పరమాత్మ జ్ఞ్యాన భక్తులతో ఉండడు. వీటితో ఎవరైతే భగవంతుని కోరతారో వారి వద్దకు వెళతాడు. వారే గోవులూ గోపాలురు. గోపాలురు అంటే గురువులు. గోవులు అంటే వేదాలు. గోపికలంటే ఆచార్య పత్నీ (వేదార్థాన్ని ఆచరించేవారు). పరమాత్మ వీరి దగ్గరకు వెళతాడు. అక్కడికి వెళ్ళినా ప్రకృతి సహించదు. చంపేస్తాను అంటూ వస్తుంది. పరమాత్మ నుండి దూరం చేయడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. ప్రకృతిలో ఉన్న గొప్ప తనం ఏమిటంటే అది మనకు అహంకార మమకారాలను చూపుతుంది. పూతనకూడా రెండు స్తనములలో విషాన్ని పెట్టుకుని వచ్చింది. ఇందులో విషమే విషయములు. అహంకారం మమకారాలతో మమం శబ్ద స్పర్శాదుల విషయములను అనుభవిస్తాము. ఆ విషయములను అహంకార మమకారములనే స్తనములలో పెట్టుకుని వచ్చింది. విషము తాగితేనే చంపుతాయి. విషయములు ఆలోచిస్తే చాలు మనను చంపడానికి. తలిస్తేనే చంపుతాయి విషయాలు. విషయములనే విషాన్ని దాచుకుని ప్రకృతి వస్తే " మీరు నన్ను నా భక్తులకు దూరం చేస్తారా అని" గట్టిగా పట్టుకుని స్వామి ప్రాణాలతో సహా పాలను తాగాడు. విషయములను తాగేసాడు. ప్రకృతి మనకు అందించిన అహంకరా మమకారములనే విషయాలు మనం అనుభవిస్తే పతనమవుతాము కానీ స్వామికి అందిస్తే, నాదీ అన్న భావన తొలగిపోతే ప్రకృతి మనను ఏమీ చేయలేదు. అహంకార మమకారములతో ఏర్పడిన విషయములను కృష్ణార్పణం చేస్తే విషయములు నశిస్తాయి. ఇది పూతనా సంహారం.
శకటాసురుడు: శకటం అంటే బండి. ఈ శరీరమే బండి. దీనికీ రెండు చక్రాలు ఉంటాయి. అవే పుణ్యమూ పాపము. పరమాత్మ పాదం తగిలితే బండి తిరగబడి పుణ్య పాపాలు పోయాయి. శకటం అంటే శం కటయితి. ఉన్న సుఖాన్ని నశింపచేస్తుంది. అది మనం పోగొట్టుకోలేము. అది పరమాత్మ పాద స్పర్శ వలనే పోతుంది. ఇలా అన్నీ పోయినా మన చుట్టూ సూక్ష్మ దేహం ఆవహించి ఉంటుంది. అది సుడిగాలిలా మనను ఆవహిస్తుంది. గడ్డి మనను చుట్టు ముట్టింది. ఆహార విహారాలే మనను చుట్టుముట్టి ఉంటాయి. మనను ఎపుడూ సూక్ష్మ శరీరం మనను చుట్టే ఉంటుంది. అది పోవాలంటే పరమాత్మను గట్టిగా పట్టుకుని ఉండాలి
ఇవి పోయినా ఇంకో రెండు ఉంటాయి. కవల చెట్లు. మనలో కలిగే రెండింటికీ (సుఖ దుఃఖాలకూ లాభాలాభములకూ జయాజయములకూ) మూలం మన సంస్కారం. పూర్వ జన్మ కర్మలూ సంస్కారములూ యమలార్జునులు. పరమాత్మ అనుగ్రహం చేతనే అవి పోతాయి.
సంస్కారం పోయినా వదలక ఉండేవి రుచీ వాసనా. వెలగపండు వాసనకు గుర్తు. రుచి అంటే వత్స. దూడ ప్రతీ దన్ని నోటితో తాకి తినదగినదైతే తింటుంది. వీరే వత్సాసుర కపిత్థాసురులంటే రుచీ వాసనలు. ఇలా శరీరాన్నీ మనసునీ సంస్కారాన్ని కర్మనూ రుచీ వాసననూ పరమాత్మ మాత్రమే పొగొడతాడు. స్వామి సంకల్పించినపుడే ఇవన్నీ పోతాయి.
ఈ ఇద్దరు రాక్షసులూ పడుతూ వెలగపళ్ళు కిందకు రాల్చి పడగా, గోపాలకులు అవి ఏరుకుని తిన్నారు

తం వీక్ష్య విస్మితా బాలాః శశంసుః సాధు సాధ్వితి
దేవాశ్చ పరిసన్తుష్టా బభూవుః పుష్పవర్షిణః

దేవతలు కూడా ఇంకో ఇద్దరు రాక్షసులు చనిపోయారని బాగా చేసారని పుష్ప వర్షం కురిపించారు. బాగా చేసావని గోపాలకులు మెచ్చుకున్నారు

తౌ వత్సపాలకౌ భూత్వా సర్వలోకైకపాలకౌ
సప్రాతరాశౌ గోవత్సాంశ్చారయన్తౌ విచేరతుః

వారు దూడలను కాపడేవారు అయ్యారు. పొద్దున్నే ఫలహారం తిని దూడలను తీసుకుని అరణ్యములో తిప్పుతూ ఉన్నారు

స్వం స్వం వత్సకులం సర్వే పాయయిష్యన్త ఏకదా
గత్వా జలాశయాభ్యాశం పాయయిత్వా పపుర్జలమ్

ఇలా ఒక్కో పిల్లవాడు వారి వారి దూడలను నీళ్ళు తాగించడానికి ఒక మడుగుకు తీసుకు వెళ్లారు

తే తత్ర దదృశుర్బాలా మహాసత్త్వమవస్థితమ్
తత్రసుర్వజ్రనిర్భిన్నం గిరేః శృఙ్గమివ చ్యుతమ్

ఇలా ఎవరికి వారు తాగించారు నీళ్ళను. తాము కూడా తాగుతూ ఉన్నారు. ఇలా తాగుతూ ఉంటే ఆ సరస్సు పక్కనే పెద్ద కొంగ కనప్డింది. అది పర్వతాకారములో ఉంది. కొండ నుంచి శిఖరం జారి కింద పడినట్లు ఉంది.

స వై బకో నామ మహానసురో బకరూపధృక్
ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుణ్డోऽగ్రసద్బలీ

వాడు బకాసురుడు. వీడు పూతనకు అన్న. పూతనకు బకీ అని పేరు. వచ్చి కృష్ణున్ని మింగేసాడు

కృష్ణం మహాబకగ్రస్తం దృష్ట్వా రామాదయోऽర్భకాః
బభూవురిన్ద్రియాణీవ వినా ప్రాణం విచేతసః

ప్రాణం లేని శరీరాళ్ళాగ బలరామాది గోపాలకులు నిశ్చేష్టులయ్యారు.

తం తాలుమూలం ప్రదహన్తమగ్నివద్గోపాలసూనుం పితరం జగద్గురోః
చచ్ఛర్ద సద్యోऽతిరుషాక్షతం బకస్తుణ్డేన హన్తుం పునరభ్యపద్యత

స్వామి కూడా నోటిలోకి వెళ్ళాడు కానీ గొంతు దాకా వెళ్ళగానే ఆ కొంగకు రెండు పక్కలా నోరు మండ సాగింది. వెంటనే అది నోటిలో ఉన్న స్వామిని బయటకు పడేసి ముక్కుతో చంపుదామని మీదకు వచ్చింది

తమాపతన్తం స నిగృహ్య తుణ్డయోర్దోర్భ్యాం బకం కంససఖం సతాం పతిః
పశ్యత్సు బాలేషు దదార లీలయా ముదావహో వీరణవద్దివౌకసామ్

కంసుని స్నేహితుడైన వాడు ముక్కుతో పొడవబోతుంటే ఆ ముక్కునే పట్టుకుని ఆ రెంటినీ వేరు చేసాడు కృష్ణుడు. అహంకార మమకారాలు మనకు ఎప్పుడూ కలిసే ఉంటాయి. నాది నేను నా కోసం, తన వారి మీద కానీ తన మీద కానీ ఎక్కువ ప్రేమ ఉంది అని ఎప్పుడు తెలుసుకోవాలి. వాడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంది. ఎంత ఆశగా తింటాడో వాడికి మమకార అహంకారాలు ఉన్నాయి అని అర్థం. అది దేహం మీద వారికి ఎంత మమకారం ఉందో చెబుతుంది. స్వామి అందుకే ఆ రెండు దోషాలనూ వేరు చేసాడు.
బకం అంటే ధంభం. లేని దాన్ని ఉన్నట్లు ఉన్న దాన్ని లేనట్లూ చూపేది ధంభం. ఇంద్రియాలను మూసుకుని ఇంద్రియార్థాలను తెరిచే ఉంచుతాడు (తలుస్తూ ఉంటాడు). కొంగ కూడా ఒంటికాలి మీద నిలబడి రెండు కళ్ళూ మూసుకుని ఉన్నట్లు నటిస్తూ తపస్సు చేస్తూ ఉంటుంది. అందుకే స్వామి నోరు చీల్చి కొంగను చంపివేసాడు. ఇది మన ధమంభాన్ని పోగొట్టేది
యుద్ధానికి వెళ్ళేముందు ఆయుధానికి రక్తం అంటిస్తారు. అది వీరణం అంటారు. అలాగే కంసున్ని చంపబోవుతున్నట్లు బకాసురున్ని చంపడం ద్వారా చెప్పాడు

తదా బకారిం సురలోకవాసినః సమాకిరన్నన్దనమల్లికాదిభిః
సమీడిరే చానకశఙ్ఖసంస్తవైస్తద్వీక్ష్య గోపాలసుతా విసిస్మిరే

నందమల్లికాది పుష్పాలు వర్షించారు. కొంగను చంపితే పైనుంచి పూలూ పడటం మంగళ వాద్యాలు మోగడం ఏమిటని గోప బాలకులు ఆశ్చర్యపడ్డారు. బలరామాదులు ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందపడి కృష్ణున్ని కౌగిలించుకున్నారు. దూడలని తీసుకుని తమ నివాసానికి వెళ్ళి అందరికీ చెప్పారు.

ముక్తం బకాస్యాదుపలభ్య బాలకా రామాదయః ప్రాణమివేన్ద్రియో గణః
స్థానాగతం తం పరిరభ్య నిర్వృతాః ప్రణీయ వత్సాన్వ్రజమేత్య తజ్జగుః

శ్రుత్వా తద్విస్మితా గోపా గోప్యశ్చాతిప్రియాదృతాః
ప్రేత్యాగతమివోత్సుక్యాదైక్షన్త తృషితేక్షణాః

అది విని అందరూ ఆనందించారు. చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన పిల్లవాడిలాగ కృష్ణున్ని చూచి ఆనందించారు. దప్పిగొన్నకళ్ళకు కృష్ణున్ని చూచుట ద్వారా తృప్తి కలగచేసారు

అహో బతాస్య బాలస్య బహవో మృత్యవోऽభవన్
అప్యాసీద్విప్రియం తేషాం కృతం పూర్వం యతో భయమ్

ఇంత చిన్న వయసులో కృష్ణుడికి ఇన్ని ఆపదలు ఎలా వచ్చాయి. ఆపదలు చేయాలనుకున్నవారికే ఆపదలు కలిగాయి కానీ కృష్ణునికి ఏమీ జరగలేదు

అథాప్యభిభవన్త్యేనం నైవ తే ఘోరదర్శనాః
జిఘాంసయైనమాసాద్య నశ్యన్త్యగ్నౌ పతఙ్గవత్

ఐనా మన కృష్ణున్ని అవి ఏమీ చేయలేకపోయాయి. నిప్పుని తినాలను వచ్చిన మిడతలు నిప్పులో పడి చచ్చినట్లుగా స్వామికి ఆపదలు కలిగించడానికి వచ్చినవారు వారే చస్తున్నారు

అహో బ్రహ్మవిదాం వాచో నాసత్యాః సన్తి కర్హిచిత్
గర్గో యదాహ భగవానన్వభావి తథైవ తత్

బ్రహ్మజ్ఞ్యానులు చెప్పినవి ఎపుడూ అబద్దం కాదు కదా. గర్గుడు ముందే చెప్పాడు, చాలా ఆపదలు వస్తాయి.ఇతన్ని నమ్మిన వారు ఎలాంటి ఆపదలకూ గురికారు, ఇతను అందరినీ కాపాడతాడు అని చెప్పాడు. అవి నిజమయ్యాయి

ఇతి నన్దాదయో గోపాః కృష్ణరామకథాం ముదా
కుర్వన్తో రమమాణాశ్చ నావిన్దన్భవవేదనామ్

కృష్ణ బలరాముల లీలలనూ చేష్టలనూ మాటి మాటికీ తలచుకుంటున్న గోపికలకు గోపాలురకూ సంసార వేదన తెలియలేదు

ఏవం విహారైః కౌమారైః కౌమారం జహతుర్వ్రజే
నిలాయనైః సేతుబన్ధైర్మర్కటోత్ప్లవనాదిభిః

ఈ రీతిలో రక రకాల విహారాలతో కోతి గంతులు వేసుకుంటూ దాగుడు మూతలు ఆడుకుంటూ ఈ కౌమారాన్ని పిచుకల గూళ్ళు కట్టుకుంటూ విహరించుకుంటూ కౌమారాన్ని గడుపుతూ ఉన్నారు.

                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదవ అధ్యాయం

                                                                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
కథ్యతాం భగవన్నేతత్తయోః శాపస్య కారణమ్
యత్తద్విగర్హితం కర్మ యేన వా దేవర్షేస్తమః

కుబేరుని కొడుకులైన వారిని నారదుడెందుకు శపించాడు. నారద మహర్షి అంతటి మహానుభావునికి కోపం తెప్పించేంత పని వారేమి చేసారు. ఆ కారణం మాకు చెప్పవలసింది.

శ్రీశుక ఉవాచ
రుద్రస్యానుచరౌ భూత్వా సుదృప్తౌ ధనదాత్మజౌ
కైలాసోపవనే రమ్యే మన్దాకిన్యాం మదోత్కటౌ

వీరిద్దరూ కైలాస పర్వత ప్రాంతములో మొత్తం పరమాత్మ యొక్క భక్తులు లోకపాలకులూ వారి అనుచరులూ వారి కుటుంబాలతో వచ్చి హరి నామ సంకీర్తనం చేద్దామని సంకల్పించారు. దానికి అందరూ వచ్చారు. పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేస్తున్నారు. వీరు కూడా వచ్చారు దానికి. తమ భార్యలతో కలిసి వచ్చారు. అక్కడ ఎన్నో ఉపవనాలూ సరస్సులూ ఉద్యాన వనాలూ ఉన్నాయి. అది చూసి, "మనం చేయకపోతే ఎవరు గుర్తుపడతారులే" అనుకుని భార్యలను తీసుకుని తోటలలో సరసులో విహరిస్తూ పక్కన ఉన్న గంగా తీరములో విహరిస్తూ ఉన్నారు.

వారుణీం మదిరాం పీత్వా మదాఘూర్ణితలోచనౌ
స్త్రీజనైరనుగాయద్భిశ్చేరతుః పుష్పితే వనే

పరమాత్మ సంకల్పముతో అక్కడికి నారదుడు వచ్చాడు.

అన్తః ప్రవిశ్య గఙ్గాయామమ్భోజవనరాజిని
చిక్రీడతుర్యువతిభిర్గజావివ కరేణుభిః

యదృచ్ఛయా చ దేవర్షిర్భగవాంస్తత్ర కౌరవ
అపశ్యన్నారదో దేవౌ క్షీబాణౌ సమబుధ్యత

బాగా మద్యపానం చేసి ఉన్నారు, పక్కన స్త్రీలు ఉన్నారు, మంచి యవ్వనములో ఉన్నారు, మంచి ధనవంతులు, (సంపదా అధికారం అవివేకం యవ్వనం - మనని పాడుచేసే నాలుగూ ఉన్నాయి) దీని వలన వచ్చిన నారదుల వారిని చూడలేదు. మద్యపానం చేసారు శరీరాన్ని మనసును మత్తెక్కించే వాతావరణం ఉంది అక్కడే. పరమార్థాన్ని మరిపించగల వాతావరణములో మదించి ఉన్న వీరిని నారదుడు చూచారు

తం దృష్ట్వా వ్రీడితా దేవ్యో వివస్త్రాః శాపశఙ్కితాః
వాసాంసి పర్యధుః శీఘ్రం వివస్త్రౌ నైవ గుహ్యకౌ

అలా వచ్చిన నారదున్ని వారికంటే వారి భార్యలు ముందు చూచారు. చూచి నారదుడు శపిస్తాడేమో అని భయపడి బయటకు వచ్చి వస్త్రాలు కట్టుకున్నారు.

తౌ దృష్ట్వా మదిరామత్తౌ శ్రీమదాన్ధౌ సురాత్మజౌ
తయోరనుగ్రహార్థాయ శాపం దాస్యన్నిదం జగౌ

కానీ వారిద్దరికీ ఆ ధ్యాస కూడా లేదు. వారు మదిరా మత్తులు. ఇంకో మత్తు స్త్రీ. ధన, ఆభిజాత్య (ఉత్తమ వంశం) స్త్రీ మదం ఉన్నాయి వారికి. వారిని అనుగ్రహించదలచి శపించాడు. వారికి వినవచ్చేలా ఇలా అన్నాడు

శ్రీనారద ఉవాచ
న హ్యన్యో జుషతో జోష్యాన్బుద్ధిభ్రంశో రజోగుణః
శ్రీమదాదాభిజాత్యాదిర్యత్ర స్త్రీ ద్యూతమాసవః

సంపద మత్తు ఇంకొక మూడు మత్తులను అందిస్తుంది. మొదటి మత్తు స్త్రీ. రెండవది జూదం, రెండవది మద్యం (ఆసవః). స్త్రీ ఆభిజాత్య మదముతో ఈ మూడు మదాలు వస్తాయి. ఇవి వస్తే మనం ఎక్కడున్నామో తెలియని స్థితిలో ఉంటాము. ఇలాంటి వాటిని సేవించడం వలన బుద్ధి భ్రంశం అవుతుంది. బుద్ధిని భ్రష్టు పట్టించే ఈ మూడు మదాలను ధన ఆభిజాత్య మదాలు కలిగిస్తాయి

హన్యన్తే పశవో యత్ర నిర్దయైరజితాత్మభిః
మన్యమానైరిమం దేహమజరామృత్యు నశ్వరమ్

ఐశ్వర్యం ఉత్తమ వంశం, స్త్రీ జూదం మద్యం అలవాట్లని చేస్తాయి. దీనికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమి కావాలి. తన శరీరానికి ఉత్తమ లోకాలు కావాలని అలాంటి శరీరం ఉన్న ఇంకో ప్రాణిని హింసిస్తున్నారు. ఇంత కన్నా వేరే నిదర్శనం ఏమి కావాలి.

దేవసంజ్ఞితమప్యన్తే కృమివిడ్భస్మసంజ్ఞితమ్
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

మేము దేవతలం మేము సిద్ధులం మేము యక్షులం అని వారి శరీరానికి ఉన్న పేర్లను చూచి చెప్పుకుంటారు. క్రిముగా మలముగా బూడిదగా మారే శరీరాన్ని చూచి ఈ పేర్లు చెప్పుకుంటారు. అలాంటి శరీరం కోసం తోటిప్రాణులకు ద్రోహం చేస్తున్నారు. వారు తెలిసే చేస్తున్నారా. తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఇతరుల శరీరాన్ని హింసించేవారికి నరకమే వస్తుంది. ఇది తెలిసిన విషయమే ఐనా ఈ మదములో వారు ఈ విషయం మరచిపోతారు

దేహః కిమన్నదాతుః స్వం నిషేక్తుర్మాతురేవ చ
మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శునోऽపి వా

అసలు ఇన్ని పనులు చేస్తున్న ఈ శరీరం ఎవరిది? ఈ శరీరం నీదే ఐతే నీ శరీరానికి ఇంకెవరో అన్నం పెట్టి ఎందుకు పోషించాలి. శరీరం నీదా నీకు అన్నం పెట్టినవారిదా? అన్నం నీకు పెట్టాలంటే అంతకు ముందే నీకు శరీరం ఉండాలి. అది నీకెవరిచ్చారు? తండ్రి. ఆ తండ్రి కేవలం నిశేషిత. కానీ నిన్ను కన్నది తల్లి. ఆ తల్లిని కన్నది ఒక తండ్రి. మరి నీ కన్నా ముందు ఒకడు పుడతాడు. అంటే నీ శరీరం వాడిద? నిన్ను ఎవరో డబ్బులిచ్చి కొనుక్కుంటారు. అపుడు ఎవరిది ఆ శరీరం. ఆ కొన్న వాడిని తన్ని ఇంకొకడు నిన్ను లాక్కుపోతాడు. ఇపుడు ఆ శరీరం ఎవరిది. ఒక వేళ పోతే ఆ శరీఎరాన్ని కాల్చి వేస్తాయి. అంటే ఆ శరీరం ఎవరిది? అగ్నిదా? మరి దహనం చేయలేకపోతే దాన్ని కుక్కలకు పడేస్తారు. అంటే నీ శరీరం కుక్కలదా?

ఏవం సాధారణం దేహమవ్యక్తప్రభవాప్యయమ్
కో విద్వానాత్మసాత్కృత్వా హన్తి జన్తూనృతేऽసతః

ఈ శరీరం సాధారణం (అందరిది). నీ శరీరం ఏ  ఒక్కడిదీ కాదు. శరీరం నీదే ఐతే ఇంకొకరిని ఎందుకు పోషిస్తావు? నీవు ఇంకొకరి కోసం ఉద్యోగం చేస్తావు. నీ కోసం కానిది నీ శరీరం. అది ఎపుడు పుడుతుందో ఎపుడు నశిస్తుందో తెలియదు. తెలిసినవాడైనా తన కోసం అంటూ తోటివారిని హింసిస్తారా

అసతః శ్రీమదాన్ధస్య దారిద్ర్యం పరమఞ్జనమ్
ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే

ఈ గుడ్డితనం శ్రీమదముతో వచ్చింది. శ్రీ మదముతో గుడ్డివారైన మీకు కంటికి దారిద్ర్యం అనే కాటుక పెట్టాలి. దరిద్రుడు మాత్రమే తన లాగే కదా తక్కిన వారు కూడా బాధపడతారూ అని ఆలోచిస్తారు. నాలాగే అందరూ బాగుండాలి అని శ్రీమంతుడు కోరుకోడు. దరిద్రుడు మాత్రమే తనను తాను చూసుకుని తనలాగే ఇతరులు కూడా కష్టాలతో బాధపడతారు అని గ్రహిస్తాడు.

యథా కణ్టకవిద్ధాఙ్గో జన్తోర్నేచ్ఛతి తాం వ్యథామ్
జీవసామ్యం గతో లిఙ్గైర్న తథావిద్ధకణ్టకః

కాలికి ముల్లు గుచ్చుకున్నవాడు మాత్రమే ఆ ముల్లును తీసి ఈ బాధ ఇంకొకరికి కలగకూడదు అని ఆ ముల్లును తీసి పడేస్తాడు. చెప్పులు వేసుకున్నవాడికి అది తెలియదు. ముల్లు గుచ్చుకోని వాడు ముల్లు గుచ్చుకున్నవాడి బాధ తెలియదు. కడుపు నిండా తిన్నవాడికి ఆకలి బాధ తెలుస్తుందా? దరిద్రుడే పది మంది గురించి ఆలోచించగలడు

దరిద్రో నిరహంస్తమ్భో ముక్తః సర్వమదైరిహ
కృచ్ఛ్రం యదృచ్ఛయాప్నోతి తద్ధి తస్య పరం తపః

శరీరం మీద కూడా స్పృహ లేని శరీరం వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. వస్త్రం లేదన్న జ్ఞ్యానం కూడా లేదన్న భావముతో ఉన్నారు మీరు. అందుకే ఆ జ్ఞ్యానం లేని చెట్లుగా పుట్టండి. దరిద్రుడు మాత్రమే అన్ని మదాల నుండి తొలగి భగవత్ సంకల్పం వలన చాలా బాధలూ కష్టాలు పడతాడు. అలా చాలా బాధలు పడడమే అతను చేసే తపస్సు

నిత్యం క్షుత్క్షామదేహస్య దరిద్రస్యాన్నకాఙ్క్షిణః
ఇన్ద్రియాణ్యనుశుష్యన్తి హింసాపి వినివర్తతే

తినడానికి అన్నం కూడా లేక కృశించిన శరీరం కలిగి ఎక్కడైనా అన్నం దొరికితే బాగుండు అనుకుంటాడు. ఇంద్రియాలకు ఆహారం ఇస్తుంటే ఇంకా కావాలి అని కోరతాయి. అదే ఇంద్రియాలకు ఆహారంలేకపోతే ఆహారం ఇమ్మని కూడా అడగలేక ఎండిపోతాయి. అప్పుడు దరిద్రుడు హింస నుండి బయటకు వస్తాడు.

దరిద్రస్యైవ యుజ్యన్తే సాధవః సమదర్శినః
సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాద్విశుద్ధ్యతి

ఉత్తములు సజ్జనులు దరిద్రులతోనే కల్వాలని కోరుకుటారు. అలాంటి సజ్జనుల సాంగత్యముతో దరిద్రులు అన్ని పాపాలూ పోగొట్టుకుంటారు. ఐశ్వర్యం వలన వచ్చే పాపం దారిద్ర్యం కలిగించే మేలూ చెబుతున్నాడు.

సాధూనాం సమచిత్తానాం ముకున్దచరణైషిణామ్
ఉపేక్ష్యైః కిం ధనస్తమ్భైరసద్భిరసదాశ్రయైః

సమచిత్తులూ అందరి యందూ పరమాత్మనే చూడగలిగే వారు. పరమాత్మయొక్క పాద సేవను కోరే వారు. అలాంటి వారికి డబ్బుతో గర్వించి ఎవరినీ లెక్కచేయని దుర్మార్గులని ఆశ్రయించ పని ఏముంది. ధనమదముతో ఉన్నవారికి వారి గురించీ ఎదుటివారి గురించీ తెలియదు.

తదహం మత్తయోర్మాధ్వ్యా వారుణ్యా శ్రీమదాన్ధయోః
తమోమదం హరిష్యామి స్త్రైణయోరజితాత్మనోః

మదిరా పానం చేసి మదించి, స్త్రీ దాసులై శ్రీ మదముతో ఇంద్రియాలను గెలవలేని, ఉన్న వీరి అజ్ఞ్యాన మదాన్ని తొలగిస్తాను.

యదిమౌ లోకపాలస్య పుత్రౌ భూత్వా తమఃప్లుతౌ
న వివాససమాత్మానం విజానీతః సుదుర్మదౌ

వీర్య్ కుబేరుని కొడుకులు. అంత పెద్దవారి పుత్రులై కూడా అజ్ఞ్యానముతో మత్తుతో ఉండిపోయారు. మదముతో తమ ఒంటి మీద వస్త్రం కూడా లేదన్న విషయాన్ని వీరు తెలియలేకపోతున్నారు. కాబట్టి వీరు వృక్షాలుగానే పుడతారు మళ్ళీ వీరు ఇలాంటి తప్పు చేయకుండా

అతోऽర్హతః స్థావరతాం స్యాతాం నైవం యథా పునః
స్మృతిః స్యాన్మత్ప్రసాదేన తత్రాపి మదనుగ్రహాత్

చెట్లుగా ఉన్నా నా అనుగ్రహముతో వీరికి పూర్వ జన్మ స్మృతి కూడా ఉంటుంది. పెద్దలు ఏది మాట్లాడినా ఏమి చేసినా ఫలితం ఉత్తమం. దీని వలన వీరిద్దరికీ ఎలాంటి తప్పు చేసారో నిరంతరం జ్ఞ్యాపకం ఉంటుంది. అది పరిపాకం చెందినపుడు స్వామి వస్తాడు  మనను రక్షించడానికి

వాసుదేవస్య సాన్నిధ్యం లబ్ధ్వా దివ్యశరచ్ఛతే
వృత్తే స్వర్లోకతాం భూయో లబ్ధభక్తీ భవిష్యతః

నూరు దివ్య వర్షములైన తరువాత పరమాత్మ సాన్నిధ్యాన్ని పొంది,పరమాత్మ యందు భక్తి కలవారి తమ తమ లోకాలకు వెళతారు.

శ్రీశుక ఉవాచ
ఏవముక్త్వా స దేవర్షిర్గతో నారాయణాశ్రమమ్
నలకూవరమణిగ్రీవావాసతుర్యమలార్జునౌ

ఇలా నారదుడు చెప్పి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు నారదుడు. ఇలా వీరిద్దరూ మద్ది చెట్లుగా (యమాల - మూలం ఒకటే ఉంటుంది రెండు జంట చెట్లుగా ఉంటాయి)

ఋషేర్భాగవతముఖ్యస్య సత్యం కర్తుం వచో హరిః
జగామ శనకైస్తత్ర యత్రాస్తాం యమలార్జునౌ

పరమ భాగవతోత్తముడైన నారదుని మాట నిజం చేయడానికి ఎక్కడ ఈ జంట చెట్లు ఉన్నాయో అక్కడకు వెళ్ళాడు

దేవర్షిర్మే ప్రియతమో యదిమౌ ధనదాత్మజౌ
తత్తథా సాధయిష్యామి యద్గీతం తన్మహాత్మనా

నారదుడు నాకు ఇష్టుడు. ఆ మహానుభావునితో గానం చేయబడిన దాన్ని నిజం చేస్తాను.

ఇత్యన్తరేణార్జునయోః కృష్ణస్తు యమయోర్యయౌ
ఆత్మనిర్వేశమాత్రేణ తిర్యగ్గతములూఖలమ్

కృష్ణుడు ఈ రెంటి చెట్ల మధ్యలోంచి రోలుతో వెళ్ళగా ఆ నిలువుగా ఉన్న రోలు కాస్తా అడ్డముగా అయ్యింది.

బాలేన నిష్కర్షయతాన్వగులూఖలం తద్
దామోదరేణ తరసోత్కలితాఙ్ఘ్రిబన్ధౌ
నిష్పేతతుః పరమవిక్రమితాతివేప
స్కన్ధప్రవాలవిటపౌ కృతచణ్డశబ్దౌ

కట్టుబడి ఉన్న ఆ బాలుడు తాకడముతో వ్రేళ్ళతో సహా ఆ చెట్లు లేచి వచ్చాయి (తాను బంధములో ఉండి బంధములో ఉన్న వారి బంధాన్ని విడిపించాడు)
అవి కాస్తా కింద పడ్డాయి. మహాబలవంతునితో బాగా ఊపబడ్డాయి, కొమ్మలూ మూలమూ ఆకులూ ఊపబడి భయంకరమైన ధ్వని చేస్తూ అవి పడిపోయాయి.

తత్ర శ్రియా పరమయా కకుభః స్ఫురన్తౌ
సిద్ధావుపేత్య కుజయోరివ జాతవేదాః
కృష్ణం ప్రణమ్య శిరసాఖిలలోకనాథం
బద్ధాఞ్జలీ విరజసావిదమూచతుః స్మ

వారు అందులోంచే పుట్టారా అన్నట్లు గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ పరమాత్మను శిరసా నమస్కారం చేస్తూ, పాపం అంతా పోగొట్టుకుని రజస్సంతా తొలగిపోయి,

కృష్ణ కృష్ణ మహాయోగింస్త్వమాద్యః పురుషః పరః
వ్యక్తావ్యక్తమిదం విశ్వం రూపం తే బ్రాహ్మణా విదుః

నీవే ఆదిపురుషుడవు నీవే పరమ పురుషుడవు. వ్యక్త అవ్య్క్త రూపమైన ఈ జగత్తు నీ శరీరమే అని బ్రాహ్మణులు తెలుసుకుంటారు

త్వమేకః సర్వభూతానాం దేహాస్వాత్మేన్ద్రియేశ్వరః
త్వమేవ కాలో భగవాన్విష్ణురవ్యయ ఈశ్వరః

అఖిల ప్రాణులకు దేహమూ ప్రాణమూ ఆత్మ ఇంద్రియములూ నీవే. వాటికి అధిపతీ నీవే
నీవే కాలము భగవంతుడవు సర్వ వ్యాపకుడవు మాయ లేనివాడవు , నీవే ప్రకృతివీ మహదాదులూ నీవే జీవుడవూ నీవే పర్రమాత్మవూ నీవే అన్ని శరీరాలలో ఉండి మార్పులు తెలుసుకునేదీ నీవే

త్వం మహాన్ప్రకృతిః సూక్ష్మా రజఃసత్త్వతమోమయీ
త్వమేవ పురుషోऽధ్యక్షః సర్వక్షేత్రవికారవిత్

గృహ్యమాణైస్త్వమగ్రాహ్యో వికారైః ప్రాకృతైర్గుణైః
కో న్విహార్హతి విజ్ఞాతుం ప్రాక్సిద్ధం గుణసంవృతః

గ్రహించడానికి ఏదేది సృష్టించావో వాటి చేత నీవు గ్రహించబడవు. నీ స్వరూప స్వభావాన్నీ ప్రభావాన్ని నీవు సృష్టించిన ఇంద్రియాలతో గ్రహించ వీలు లేదు.
నీవు మా బుద్ధికి అందవు
ప్రకృతి గుణాలచే ఆవరించబడిన ఏ జీవుడు నిన్ను తెలుసుకుంటాడు.

తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేధసే
ఆత్మద్యోతగుణైశ్ఛన్న మహిమ్నే బ్రహ్మణే నమః

అలాంటి భగవంతుడు వాసుదేవుడూ జ్ఞ్యానీ ఆత్మ యొక్క ప్రకాశమును అందరికీ తెలియజేసే కాంతితో నీ శరీరాన్ని కప్పి పుచ్చుకున్నావు. నీ కాంతి అందరికీ జగత్తును తెలియజేస్తుంది. సూర్యుని కాంతితోనే ప్రపంచం అంతా చూస్తాము కానీ ఆయన ఇచ్చిన కాంతితో ఆయనను చూడలేము. నీవు మాకు అందుబాటులో దొరకవు.

యస్యావతారా జ్ఞాయన్తే శరీరేష్వశరీరిణః
తైస్తైరతుల్యాతిశయైర్వీర్యైర్దేహిష్వసఙ్గతైః

ఏ శరీరము లేనీ నీవు అవతారాల పేరుతో ఆయా శరీరాలలో ప్రవేశించి అందరిచేతా తెలియబడతావు
ఏ పోలికకూ నీవు సరిపోవు. సాటిలేదు అన్నవాటిని కూడా నీవు మించినవాడు. ఏ శరీరములోనూ ఇమడడానికి వీలు లేని పరాక్రమముతో సకల లోకముల పుట్టకకూ పెరగడానికీ నీవు కారణం.

స భవాన్సర్వలోకస్య భవాయ విభవాయ చ
అవతీర్ణోऽంశభాగేన సామ్ప్రతం పతిరాశిషామ్

నీ కలలతో నీవు అవతరిస్తున్నావు. ఇపుడు అవతరించావు.అన్ని కోరికలకూ నీవు మూల స్థంభమూ. నీవే కళ్యానము మంగళమూ శుభం. ఆత్మకు కలిగేదాన్ని కళ్యాణమూ అంటారు. మనసుకు కలిగే దాన్ని మంగళం అంటారు. శరీరానికి కలిగేదాన్ని శుభం అంటారు.

నమః పరమకల్యాణ నమః పరమమఙ్గల
వాసుదేవాయ శాన్తాయ యదూనాం పతయే నమః

వసుదేవాత్మజుడవు యాదవ పతివి ఐన నీకు నమస్కారం. మాకు మీరు ఆజ్ఞ్య ప్రసాదించండి. నారద మహర్షి అనుగ్రహముతో మీ దర్శనం లభించినది

అనుజానీహి నౌ భూమంస్తవానుచరకిఙ్కరౌ
దర్శనం నౌ భగవత ఋషేరాసీదనుగ్రహాత్

వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం
హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః
స్మృత్యాం శిరస్తవ నివాసజగత్ప్రణామే
దృష్టిః సతాం దర్శనేऽస్తు భవత్తనూనామ్

మాకు మీరు ఈ ఒక్క వరం ఇవ్వండి చాలు.
మా వాక్కు మీ గుణాలను చెప్పడములో  మా చెఉవ్లు నీ గుణములను వినడములో చేతులు నిన్ను ఆరాధించడములో మా మనసు నీ పాదముల స్మరణ యందు,
శిరసు నీవు ఉండే చోట్లను తాకి నమస్కరించడానికి చూపు (కనులు) సజ్జనులను చూడడములో
మా ఇంద్రియాలకు ఈ వరం ఇవ్వు. భగవంతుడు ఈ అవయవాలను ఏ పని కోసం ఇచ్చాడు ఆ పని కోసం వినియోగించమని అడిగారు

శ్రీశుక ఉవాచ
ఇత్థం సఙ్కీర్తితస్తాభ్యాం భగవాన్గోకులేశ్వరః
దామ్నా చోలూఖలే బద్ధః ప్రహసన్నాహ గుహ్యకౌ

ఇలా కీర్తించబడిన రోలుకు తాడుతో కట్టబడి ఉన్న పరమాత్మ నవ్వుతూ ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
జ్ఞాతం మమ పురైవైతదృషిణా కరుణాత్మనా
యచ్ఛ్రీమదాన్ధయోర్వాగ్భిర్విభ్రంశోऽనుగ్రహః కృతః

నాకు మొదలే తెలుసు. ఋషి మీ వద్దకు వచ్చాడంటే మీ శ్రీ మదం తొలగించడానికి. ఋషి మీ మీద చూపింది నిగ్రహం కాదు అనుగ్రహమే.

సాధూనాం సమచిత్తానాం సుతరాం మత్కృతాత్మనామ్
దర్శనాన్నో భవేద్బన్ధః పుంసోऽక్ష్ణోః సవితుర్యథా

సూర్యున్ని చూచిన కనులకు చీకటి కనపడంట్లుగా మహానుభావుల దర్శనం లభిస్తే ఇక వారికి బంధం ఉండదు. సకల చరా చర జగత్తులో పరమాత్మ ఒకే రీతిగా ఉన్నాడని తెలుసుకుని నిరంతరం నాయందే మనసు ఉంచి ఉన్న వారి దర్శనం వలన బంధనం కలగదు.

తద్గచ్ఛతం మత్పరమౌ నలకూవర సాదనమ్
సఞ్జాతో మయి భావో వామీప్సితః పరమోऽభవః

నలకూబరులారా, మీరు మీ ఇళ్ళకు వెళ్ళండి. నా యందు మనసు ఉంచి వెళ్ళండి. నిజముగా మీ మనసులో నా మీద భక్తి కలిగితే అది మోక్షమే (అభవః). వైకుంఠములోకి వెళితేనే మోక్షం కాదు. సంసారములో ఉండే మోక్షం సంపాదించవచ్చు. నా మీద భక్తి కలగడమే మోక్షం. అలాంటి వారు సంసారములో ఉండి అన్ని పనులూ చేస్తూ కూడా మోక్షాన్ని పొందుతారు.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తౌ తౌ పరిక్రమ్య ప్రణమ్య చ పునః పునః
బద్ధోలూఖలమామన్త్ర్య జగ్మతుర్దిశముత్తరామ్

ఈ రీతిలో వారు కట్టుబడి ఉన్న స్వామి చుట్టూ ప్రదక్షిణం చేసి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూ స్వామి ఆజ్ఞ్య పొంది వారి లోకానికి వెళ్ళారు. బంధం పొందిన నలకూబర మణిగ్రీవులు బద్ధుడిగా ఉన్న స్వామిని చూచి బంధం తొలగించుకున్నారు.



                                                                                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏకదా గృహదాసీషు యశోదా నన్దగేహినీ
కర్మాన్తరనియుక్తాసు నిర్మమన్థ స్వయం దధి

యశోదమ్మ,  ఇంటిలోని దాసీ జనమంతా వేరు వేరు పనులు చేయించడానికి నియమించబడినందు వలన, స్వయముగా పెరుగు చిలకడానికి స్వయముగా పూనుకున్నది.

యాని యానీహ గీతాని తద్బాలచరితాని చ
దధినిర్మన్థనే కాలే స్మరన్తీ తాన్యగాయత

పని చేస్తున్నప్పుడు పాట పాడుతూనే పని చేస్తూ ఉంటారు. అది ఏదో పాట కాకుండా కృష్ణ పరమాత్మ శైశవం నుండీ చేస్తున్న పనులనే పాటలు పాడుతూ ఉంది. వ్రేపల్లెలో స్త్రీలందరూ కృష్ణ పరమాత్మ లీలలను గానం చేస్తూనే వారి నిత్య కృత్యములు నిర్వహించేవారు. ధధి యొక్క నిర్మందన ధ్వని,ఆభరణముల ధ్వనీ, పాటల ధ్వనీ కలిసి స్వర్గం వరకూ వ్యాపించింది. ఆ మూడే అకార ఉకార మకారములు. వారు పాడుతున్న హరి కథా గానం మూడు లోకాలనూ పావనం చేస్తున్నది.

క్షౌమం వాసః పృథుకటితటే బిభ్రతీ సూత్రనద్ధం
పుత్రస్నేహస్నుతకుచయుగం జాతకమ్పం చ సుభ్రూః
రజ్జ్వాకర్షశ్రమభుజచలత్కఙ్కణౌ కుణ్డలే చ
స్విన్నం వక్త్రం కబరవిగలన్మాలతీ నిర్మమన్థ

పట్టు వస్త్రం ధరించి, ఆ కుండకు ఉన్న తాడును లాగుతూ ఉంటే కంకణములు ధ్వనిస్తూ ఉన్నాయి. పెరుగు చాలా గట్టిగా ఉండడం వలన, ఎంతో శ్రమ పడుతూ చిలుకుతూ ఉండడం వలన చెమట పడుతూ, కొప్పు జారి, కొప్పులోని పూలు కూడా జారి సుగంధములను వ్యాపింపచేస్తూ ఉంది.

తాం స్తన్యకామ ఆసాద్య మథ్నన్తీం జననీం హరిః
గృహీత్వా దధిమన్థానం న్యషేధత్ప్రీతిమావహన్ఇ

ఈమె చక్కగా పెరుగు చిలకడములో నిమగ్నమై ఉంది. అప్పుడే పిల్లవాడు చూచి స్తన్యమును కోరి కవ్వాన్ని పట్టుకున్నాడు పరుగు పరుగున వచ్చి. అలా ప్రేమతో అడిగితే

తమఙ్కమారూఢమపాయయత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతీ ముఖమ్
అతృప్తముత్సృజ్య జవేన సా యయావుత్సిచ్యమానే పయసి త్వధిశ్రితే

ఆ పని కాస్తా ఆపేసి పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంది. ఇలా పిల్లవానికి పాలు ఇస్తూ ఉండగానే దగ్గరలో పొయ్యి మీద కాగపెట్టిన పాలు పొంగిపోతున్నాయి. అప్పుడు సగం పాలు తాగిన పిల్లవాడిని పక్కన పెట్టి పొయ్యి వద్దకు వెళ్ళగా

సఞ్జాతకోపః స్ఫురితారుణాధరం సన్దశ్య దద్భిర్దధిమన్థభాజనమ్
భిత్త్వా మృషాశ్రుర్దృషదశ్మనా రహో జఘాస హైయఙ్గవమన్తరం గతః

కోపం వచ్చి అప్పుడే కొద్ది కొద్దిగా వస్తున్న పళ్ళతో పెదవులను కొరుకుతూ కుండలను పగులగొట్టి దొంగ కన్నీరుతో, పైకొచ్చిన వెన్నను తీసుకుని, ఆ వెన్న తెల్లగా ఉంటుందా నా నవ్వు తెల్లగా ఉంటుందా అన్నట్లుగా నవ్వాడు.

ఉత్తార్య గోపీ సుశృతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకమ్
భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తజ్జహాస తం చాపి న తత్ర పశ్యతీ

ఆమె కుండను దింపి అక్కడికి వచ్చి చూస్తే మొత్తం పెరుగు కింద పడి ఉంది, అంతా గందరగోళముగా ఉంది.
అర్థం చేసుకుంది. ఇది పిల్లవాడి పనే అని అర్థం చేసుకుని కాస్త నవ్వుకుంది,

ఉలూఖలాఙ్ఘ్రేరుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచి స్థితమ్
హైయఙ్గవం చౌర్యవిశఙ్కితేక్షణం నిరీక్ష్య పశ్చాత్సుతమాగమచ్ఛనైః

తల్లికి కష్టం కలిగించకుండా తల్లి చేయవలసిన పనిని సూచించడానికి కృష్ణుడు రోటి మీద నిలబడి పక్కనున్న కోతి పిల్లలకు వెన్న అందిస్తున్నాడు.
దొంగతనముగా వెన్న తీసుకు వచ్చాడని తల్లి ఏమైనా అంటుందేమో అని మనసులో భయం తొణికిసలాడుతున్నట్లుగా బెదురు చూపులతో తల్లి వైపు చూస్తూ వెన్న తినిపిస్తున్నాడు.

తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరస్
తతోऽవరుహ్యాపససార భీతవత్
గోప్యన్వధావన్న యమాప యోగినాం
క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః

అలాంటి పిల్లవాని వద్దకు చేతిలో బెత్తం పట్టుకుని వెళ్ళింది. అలా తల్లిని చూచి భయపడిన వాడిలా ముందరకు పారిపోయాడు.
నిన్ను ఎలాగైనా పట్టుకుంటాను అని చెబుతూ పిల్లవాడిని బెదిరిస్తూ పిల్లవాని వెంట పరిగెత్తింది. యోగులకు కూడా దొరకని స్వామిని పట్టుకుందామని యశోదమ్మ పరిగెత్తి వెళ్ళింది. తపస్సు చేత పరిశుద్ధమైన మనసులో ఏ స్వామిని చూడటానికి వీలు కాదో ఆ స్వామిని పట్టుకోవడానికి వెళ్ళింది యశోదమ్మ,


అన్వఞ్చమానా జననీ బృహచ్చలచ్ ఛ్రోణీభరాక్రాన్తగతిః సుమధ్యమా
జవేన విస్రంసితకేశబన్ధన చ్యుతప్రసూనానుగతిః పరామృశత్

పట్టుబట్టీ పరిగెడుతున్నది, ఆయన కూడా పరిగెడుతున్నాడు. కొప్పు జారిపోతోంది కాళ్ళు లాగేస్తున్నాయి, ఇంత అవస్థ పడుతోంది. తల్లి కొడుతుందేమో అని భయపడుతూ ఏడుస్తున్నాడు. అసలే నల్లటి స్వామి, కంటికి కాటుకా, ఏడుస్తుంటే వచ్చిన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే, ఇంకా నల్లగా అయి స్వామి ఎక్కడ ఉన్నడో తెలియకుండా అయ్యింది. కాటుకం మొహం అంతా పూసుకుంటున్నాడు

కృతాగసం తం ప్రరుదన్తమక్షిణీ కషన్తమఞ్జన్మషిణీ స్వపాణినా
ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా భిషయన్త్యవాగురత్

భయం భయముగా వస్తుందేమో అని చూస్తున్నాడు, కళ్ళంతా కన్నీరు. కష్టపడి స్వామి దయ చూపగా పట్టుకుంది స్వామిని. పట్టుకుని బెత్తముతో కొడతా అని భయపెట్టింది. పిల్లవాడు ఇంకా భయపడ్డాడు. పిల్లవాడు భయపడుతున్నాడు కదా అని

త్యక్త్వా యష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలా
ఇయేష కిల తం బద్ధుం దామ్నాతద్వీర్యకోవిదా

పిల్లవాడిని చూచి కొట్టలేక పిల్లవాడు భయపడుతున్నాడని తెలుసుకుని బెత్తం పక్కన పడేసింది. భగవంతుని ప్రభావం తెలియని యశోద అతన్ని తాడుతో కట్టేద్దామని అనుకుంది

న చాన్తర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరమ్
పూర్వాపరం బహిశ్చాన్తర్జగతో యో జగచ్చ యః

దేన్నైనా కట్టాలంటే అది నియమిత ప్రాంతములో ఉండాలి. ఫలాన చోట ఫలానా రూపములో ఉన్నదాన్ని పరిమాణం తెలిసినదాన్ని కట్టగలం. మరి ఈయన? లోపలా ఉంటాడు బయటా ఉంటాడు, చూచే వారిలో ఉంటాడు, ఎదురుగా ఉన్నదాన్ని చూచే కనులలో ఆయనే ఉంటాడు, మనసులో ఆయనే ఉంటాడు, వెలుపలా ఆయనే ఉంటాడు. తూర్పూ పశ్చిమా అన్ని దిక్కులూ ఉంటాడు, చిన్నవారికి చిన్నవాడు పెద్దవారికి పెద్దవాడు, మొదటివారికి మొదటివాడు తరువాతి వారికి తరువాతి వాడు. జగత్తుకు ముందూ ఉన్నాడు, జగత్తు తరువాతా ఉన్నాడు, జగత్తూ అయానే అయి ఉన్నాడు.
అలాంటి స్వామిని ఎలా కట్టేయాలి.

తం మత్వాత్మజమవ్యక్తం మర్త్యలిఙ్గమధోక్షజమ్
గోపికోలూఖలే దామ్నా బబన్ధ ప్రాకృతం యథా

ఇంతటి సర్వభూతాత్ముడైన స్వామిని మానవ దేహముతో వచ్చిన పరమాత్మను తన కొడుకుగా భావించి, యోశోదమ్మ మామూలు ప్రాకృతి శిశువుగా భావించి కట్టివేయడానికి పూనుకున్నది.

తద్దామ బధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః
ద్వ్యఙ్గులోనమభూత్తేన సన్దధేऽన్యచ్చ గోపికా

తాడు తెచ్చి పిల్లవాన్ని పట్టుకుంది, పొట్ట చుట్టూ తిప్పేసరికి రెండు అంగుళాలు తక్కువయ్యాయి, ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతోంది. తన దగ్గర ఉన్న గోవులను కట్టేయడానికి ఉన్న తాళ్ళాన్నీ తెచ్చినా చాలలేదు. అనంత కోటి బ్రహ్మాండములు దాగి ఉన్న కడుపు చుట్టూ తిప్పే తాడు కావాలంటే ఎంతటి తాడు కావాలి.

యదాసీత్తదపి న్యూనం తేనాన్యదపి సన్దధే
తదపి ద్వ్యఙ్గులం న్యూనం యద్యదాదత్త బన్ధనమ్

ఏవం స్వగేహదామాని యశోదా సన్దధత్యపి
గోపీనాం సుస్మయన్తీనాం స్మయన్తీ విస్మితాభవత్

గోపికలంతా గోపాలురంతా చూస్తున్నారు. ఇదేమి మాయ ఎన్ని తాళ్ళు తెచ్చినా రెండంగుళాలే తగ్గుతోంది.

స్వమాతుః స్విన్నగాత్రాయా విస్రస్తకబరస్రజః
దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీత్స్వబన్ధనే

ఆ తల్లి ఆయాసపడుతోంది, కొప్పు జారిపోయింది, అందరూ చూస్తున్నారని సిగ్గుపడింది, తల్లిని మరీ ఎక్కువ బాధపెట్టకూడదని కృష్ణుడు కట్టుబడ్డాడు.
ఆ రెండు అంగుళాలూ మనదగ్గరే ఉంటాయి, అవి ఆయనకు ఇస్తే అమాంతం కట్టుబడతాడు. అవే అహంకార మమకారాలు. ఆ రెండు అంగాలే మనకు శరీరాన్ని ఇస్తాయి. మన శరీరాన్ని తెచ్చే రెండూ ఆయనకు ఇచ్చేస్తే మళ్ళీ మనకు శరీరం ఉండదు. యశోదమ్మ ఇక నా వల్ల కాదు అని విశ్రమించగానే ఆయన పట్టుబడ్డాడు. రామాయణములో కూడా స్వామి హనుమ నమోస్తు రామాయ స లక్ష్మణాయా దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అనగానే తల్లి కనపడింది. ఆనాడు జనకునకు కనపడినట్లు ఈనాడు నాకు కనపడు అనగానే కనపడింది. అలాగే యశోదమ్మ కూడా నావల్ల కాదు అనుకోగానే దయ చూపి కట్టు బడటానికి సంకల్పించాడు

ఏవం సన్దర్శితా హ్యఙ్గ హరిణా భృత్యవశ్యతా
స్వవశేనాపి కృష్ణేన యస్యేదం సేశ్వరం వశే

పరమాత్మ దాసులకు దాసుడు. ఆయన భక్తులకు పరాధీనుడు. సకల లోకపాలకులనూ తన వశములో ఉంచుకున్న స్వామి తాను పరిపాలించే ఒక చిన్నలోకములో యశోదమ్మకు వశమయ్యాడు.

నేమం విరిఞ్చో న భవో న శ్రీరప్యఙ్గసంశ్రయా
ప్రసాదం లేభిరే గోపీ యత్తత్ప్రాప విముక్తిదాత్

ఈ భాగ్యాన్ని ఎవరూ పొందలేదు. ఆఖరికి అమ్మవాఉ కూడా స్వామిని బంధించలేకపోయారు. సకల చరాచర జగత్తులో జీవరాశులను విడుదల చేసే స్వామి అందరి బంధాలనూ తెంచే స్వామి తాను బంధించబడ్డాడు. అందరినీ విడుదల చేస్తూ తాను మాత్రం కట్టుబడ్డాడు. ఈ దామ బంధ వృత్తాంతం విన్న వారికి అన్ని బంధాలూ వదులుతాయి. భగవంతునికి సంబంధించిన ఏ కథ వింటే ఆ కథలో ఏ సందర్భం ఉంటే అది మనకు అవుతుంది. ఉదా: రుక్మిణీ కళ్యాణం చదివితే మనకూ కళ్యాణం అవుతుంది. కానీ ఈ వృత్తాంతం చదివితే మనకు బంధనం రాదు మోక్షణమే వస్తుంది. ఏ రీతిలో పరమాత్మను తలచినా మనకు లభించేది మోక్షమే. భగవంతుని బంధం తలచినా మోక్షమే.
చిక్కడు సిరి కౌగిటిలో
చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం
జిక్కడు శ్రుతి లతికావలిం
జిక్కెనతడు తల్లి చేతన్ ఱోలన్

నాయం సుఖాపో భగవాన్దేహినాం గోపికాసుతః
జ్ఞానినాం చాత్మభూతానాం యథా భక్తిమతామిహ

ఇలా యశోదమ్మతో కట్టుబడిన దృష్టాంతం మనకు ఇంకో విషయాన్ని కూడా చెబుతుంది. సకల చరాచర ప్రాణులకు పరమాత్మ కష్టముగా కూడా దొరికేవాడు కాదు. జ్ఞ్యానులకు కూడా దొరకదు. జ్ఞ్యానులు నాకు ఆత్మ అని స్వామి గీతలో చెప్పాడు. తనకు ఆత్మగా ఉండే జ్ఞ్యానులకు కూడా ఇలాంటి భాగ్యం దొరకదు.   భక్తి కలిగే వారికి కల అదృష్టం జ్ఞ్యానులకు కూడా లభించదు అని ఈ దుష్టాంతముతో బోధబడింది. భక్తి ఉన్నవారి చేతిలో స్వామి బంధించబడతాడు.

కృష్ణస్తు గృహకృత్యేషు వ్యగ్రాయాం మాతరి ప్రభుః
అద్రాక్షీదర్జునౌ పూర్వం గుహ్యకౌ ధనదాత్మజౌ

ఇలా స్వామి తన పొట్ట చుట్టూ తాడుతో కట్టివేస్తే ఆ కట్టేసిన తాడు గుర్తు పరమ సుకుమారమైన స్వామి శరీరం మీద ఉండిపోయింది. పరమాత్మకు దామోదరుడు ఈ పేరు చాలా ఇష్టం.పరమాత్మ భక్త సౌలభ్యాన్ని చాటే పేరు ఈ దామోదరుడు. ఇలా పిల్లవాన్న్ కట్టేసి ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. కట్టుబడిన కృష్ణుడు ఆ రోటికి దగ్గరలోనే ఉన్న రెండు మద్ది చెట్లను చూచాడు. ఆ రెండు మద్ది చెట్లూ కుబేరుని కుమారులు. నలకూబర మణిగ్రీవులు. వారు వృక్షములుగా అయ్యారు. కృష్ణపరమాత్మను కట్టివేసిన రోలు ఉన్న పరిధిలోనే ఈ రెండు చెట్లూ ఉన్నాయి. వారికి మోక్షం ఇవ్వడానికే అలా కట్టుబడ్డాడు.

పురా నారదశాపేన వృక్షతాం ప్రాపితౌ మదాత్
నలకూవరమణిగ్రీవావితి ఖ్యాతౌ శ్రియాన్వితౌ

ఇలా స్వామి బంధనాన్ని తెచ్చుకున్నాడు. వీరిద్దరూ పూర్వ కాలము తమ ధన మదముతో విశృంకలముగా ప్రవర్తించి నారద మహర్షి వలన శాపం పొందారు. వీరు కుబేరుని కొడుకులు. నారద శాపముతో వృక్షములయ్యారు.

Sunday, May 26, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

                                                                                             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
గర్గః పురోహితో రాజన్యదూనాం సుమహాతపాః
వ్రజం జగామ నన్దస్య వసుదేవప్రచోదితః

యదువంశపు రాజుల పురోహితుడు గర్గుడు. ఆయన చాలా గొప్పవాడు. గర్గుడు ఆకాశములో చూసి గ్రహాల స్థితి చెప్పేవాడు. ఆయన కూడా అరవై అధ్యాయాల గర్గ భాగవతం వ్రాశాడు. రోలూ రోకలీ పెరట్లోనే పెట్టాలి. ఇంటి ముందర పెట్టరాదు. కత్తి పీట, చీపురు విసురు రాయి కొడవలి వంటివీ, వీటిలో ఒక్కో దానిలో ఒక్కో రాక్షసి ఆవహించబడి ఉంటుంది. మొదలు భాగములో రాక్షసి చివరి భాగములో దేవతా ఆవహించి ఉంటాయి. కత్తి పీటను పడుకోబెట్టాలి, విసురు రాయిని కూడా పైదాన్ని అడుగునా అడుగుదాన్ని పైనా పెట్టకూడదు, రెండూ వేరు చేసి పెట్టకూడదు. పనిలేనప్పుడు రోకలిని రోటి మీద పెట్టి ఉంచకూడదు. ముగ్గు కూడా ఎపుడూ వంగి వేయకూడదు కూర్చుని వేయాలి

తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాఞ్జలిః
ఆనర్చాధోక్షజధియా ప్రణిపాతపురఃసరమ్

పరమాత్మ నోటిలోని అనంతమైన విశ్వాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తరువాత యదువుల పురోహితుడు గర్గుడు. గర్గున్ని వసుదేవుడు పంపాడు. ఆయన వ్రేపల్లెకు వెళ్ళాడు. గర్గుడు వచ్చాడని లేచి ఎదురేగి ఆనందముతో
సాష్టాగపడి నమస్కారం చేసి

సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూనృతయా మునిమ్
నన్దయిత్వాబ్రవీద్బ్రహ్మన్పూర్ణస్య కరవామ కిమ్

ఆసనములో కూర్చిని ఆతిథ్యాన్ని పొంది, ఆయనను అభినందించి స్తోత్రం చేసి, మీరు పరిపూర్ణులు, ఏ కొరతా లేనివారు. మేము మీకు ఏమి చేయగలము.

మహద్విచలనం నౄణాం గృహిణాం దీనచేతసామ్
నిఃశ్రేయసాయ భగవన్కల్పతే నాన్యథా క్వచిత్

పెద్దలూ గొప్పవారు తామున్న చోటి నుండి కదిలారంటే దీనులైన వారికి శ్రేయస్సు కలిగించడానికే. ఇంకో ప్రయోజనం ఉండదు.

జ్యోతిషామయనం సాక్షాద్యత్తజ్జ్ఞానమతీన్ద్రియమ్
ప్రణీతం భవతా యేన పుమాన్వేద పరావరమ్

మీరు కన్నులతోటే నక్షత్రాలను చూచి ఆ శాస్త్రాన్ని రచించారు. అది మామూలు కళ్ళకు కనపడదు. మీరు రచించిన ఆ శాస్త్రముతో మానవుడు శ్రేయస్సును పొందుతాడు.

త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠః సంస్కారాన్కర్తుమర్హసి
బాలయోరనయోర్నౄణాం జన్మనా బ్రాహ్మణో గురుః

మీరు బ్రాహ్మణోత్తములలో శ్రేష్టులు. మా పిల్లలకు నామకరణ సంస్కారాన్ని మీరు పూర్తి చేయండి. ప్రపంచములో అన్ని లోకాలలో పుట్టుకతోనే బ్రాహ్మణుడు గురువు.

శ్రీగర్గ ఉవాచ
యదూనామహమాచార్యః ఖ్యాతశ్చ భువి సర్వదా
సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీసుతమ్

నేనెవరో లోకమంతా తెలుసు. యదు వంశానికి ఆచార్యున్ని. నేను నీ పిల్లవానికి సంస్కారం చేస్తే ఈ పిల్లలు నీ పిల్లలు కారు వసుదేవుని పిల్లలు అనుకుంటుంది.

కంసః పాపమతిః సఖ్యం తవ చానకదున్దుభేః
దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి

పాపమతి ఐన కంసుడు ఇప్పటికే అనుమానముతో ఉన్నాడు. వసుదేవునికీ నీకూ ఉన్న మత్రి వానికి తెలుసు. దేవకి యొక్క ఎనిమిదవ గర్భం స్త్రీ కావడానికి వీలు లేదని అనుమానిస్తూనే ఉన్నాడు. ఇపుడు నేను నామకరణం చేస్తే వాని అనుమానం బలపడుతుంది.

ఇతి సఞ్చిన్తయఞ్ఛ్రుత్వా దేవక్యా దారికావచః
అపి హన్తా గతాశఙ్కస్తర్హి తన్నోऽనయో భవేత్

అందువలన నీకూ హాని కలగవచ్చు, లేదా వారికీ హాని కలగవచ్చు, బంధించవచ్చు. అతను పాపి. చేయరాని పని అంటూ ఏదీ ఉండదు. ఇంత ఆపద పెట్టుకుని నన్ను నామకరణం చేయమంటున్నావు.

శ్రీనన్ద ఉవాచ
అలక్షితోऽస్మిన్రహసి మామకైరపి గోవ్రజే
కురు ద్విజాతిసంస్కారం స్వస్తివాచనపూర్వకమ్

మా వాళ్ళకు కూడా తెలియకుండా అతి రహస్యముగా నామకరణం గోశాలలో చేయండి. మీరు నామకరణం చేస్తున్నట్లు మావాళ్ళకు కూడా తెలియకుండా చేయండి.

శ్రీశుక ఉవాచ
ఏవం సమ్ప్రార్థితో విప్రః స్వచికీర్షితమేవ తత్
చకార నామకరణం గూఢో రహసి బాలయోః

తాను చేయగోరిన పనినే నందుడు ప్రార్థించగా, తాను కూడా తన వేషం మార్చుకుని అతను కూడా ఒక గొల్లవానిలా వచ్చాడు.

శ్రీగర్గ ఉవాచ
అయం హి రోహిణీపుత్రో రమయన్సుహృదో గుణైః
ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్బలం విదుః
యదూనామపృథగ్భావాత్సఙ్కర్షణముశన్త్యపి

ఈ రోహిణీ పుత్రుడు తన ఉత్తమ గుణములతో తనవారందరినీ రమింపచేస్తాడు, ఆనందింపచేస్తాడు. కాబట్టి ఈయనను రాముడు అంటారు. ఉన్నవారందరిలో బలం ఎక్కువ ఉంది కాబట్టి బలుడు. అందుకు ఈయనను బలరాముడు అంటారు. ఈయన యాదవులనూ మిమ్ములనూ కౌరవులనూ, ఎంతో దూరముగా ఉన్నవారిని లాగి ఒకటి చేస్తాడు కాబట్టి ఈయన సంకర్షణుడు, (ఒకే సారి రెండు గర్భాలలో ప్రవేశించినవాడు కాబట్టి సంకర్షణుడు. ఈ సంకర్షణుడే వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణులనే వ్యూహాలలో ఒకటి. ఈయన ప్రళయ కాలములో సకల జగత్తునూ లాక్కుంటాడు. జీవులు ఆచరించిన కర్మల ఫలితాన్ని లాగి జీవులకు అందించేవాడు. ఎక్కడో ఉన్న కర్మ ఫలితాలను వారి వారికి అందిస్తాడు. ఇవన్నీ పరమార్థాలు)
వేరుగా ఉన్న యాదవులను ఒకటి చేస్తాడు కాబట్టి ఈయనను సంకర్షణుడు అంటారు

ఆసన్వర్ణాస్త్రయో హ్యస్య గృహ్ణతోऽనుయుగం తనూః
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః

యశోద కొడుకు ఐన ఈయన రంగు చెబుతూనే ఉంది. ఈయన ఒక్కో యుగానికీ ఒక్కో రంగు తీసుకుంటూ ఉంటాడు. సత్వ రజస్తమో గుణాలకూ మూడు వర్ణాలు, తెలుపూ ఎరుపూ నలుపు. ఆ యుగం ఏ రంగో ఆ రంగు తీసుకుంటాడు. ఒకప్పుడు శుక్ల, ఇంకొప్పడు రక్త, ఇంకొకప్పుడు పీత వర్ణం ఇపుడు నలుపు వర్ణం పొందాడు

ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః
వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాః సమ్ప్రచక్షతే

రంగు నలుపు కాబట్టి ఈయన కృష్ణుడు.కొన్ని జన్మల కింద ఈయన వసుదేవునికి కొడుకుగా ఉన్నాడు. కనుక ఈయన వాసుదేవుడు. తెలిసిన వారు ఇతన్ని వాసుదేవుడు అంటారు. కృష్ణుడు అని కూడా అంటారు . (కృష్ణా అంటే అనంతమైన అపరిచ్చినమైన ఆనందము)

బహూని సన్తి నామాని రూపాణి చ సుతస్య తే
గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః

ఈ పిల్లవానికి చాలా రూపాలూ చాలా పేరులు ఆయన గుణాలను బట్టీ చేసిన పనుల బట్టీ ఉంటాయి. అవి నాకు తెలుసు. వేరే ఎవరికీ తెలియదు.

ఏష వః శ్రేయ ఆధాస్యద్గోపగోకులనన్దనః
అనేన సర్వదుర్గాణి యూయమఞ్జస్తరిష్యథ

ఈయన మీకు ఉత్తమ శ్రేయస్సు ఇస్తాడు. ఈయన గోకులానికి గోపాలురనూ ఆనందింపచేస్తాడు. ఈయన చేత మీకొచ్చిన అన్ని ఆపదలనూ అనాయాసముగా దాటి వేస్తారు.

పురానేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః
అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్సమేధితాః

ఈయన పూర్వ జన్మలో దుర్మార్గుల చేత పీడించబడుతున్న సజ్జనుల బాధ చూడలేక వారిని ఓడించాడు.

య ఏతస్మిన్మహాభాగాః ప్రీతిం కుర్వన్తి మానవాః
నారయోऽభిభవన్త్యేతాన్విష్ణుపక్షానివాసురాః

ఈ పిల్లవాని మీద ఎవరైనా ప్రేమ చూపితే, విష్ణు పదములో ఉన్న వారికి ఆపదలు రానట్లు ఇతన్ని ప్రేమించిన వారికి ఆపదలు రావు.

తస్మాన్నన్దాత్మజోऽయం తే నారాయణసమో గుణైః
శ్రియా కీర్త్యానుభావేన గోపాయస్వ సమాహితః

ఈయన గుణాలతో నారయణుడంతటి వాడు. ఈ నామకరణ ఘట్టాన్ని శ్రద్ధా భక్తులతో విన్న వారు మళ్ళీ పుట్టరు (యాని నామాని గౌణాని)
కొంచెం సావధానముగా పిల్లవాన్ని పెంచు. సంపదతో కీర్తితో ప్రభావముతో, ఈ మూడింటితో పిల్లవాడిని కాపాడు.

శ్రీశుక ఉవాచ
ఇత్యాత్మానం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే
నన్దః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషామ్

ఇలా చెప్పి గర్గుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. నందుడు పరమానందముగా తనకు పూర్తి ఆశీర్వాదం లభించింది, ధన్యుడిని అయ్యాననుకున్నాడు

కాలేన వ్రజతాల్పేన గోకులే రామకేశవౌ
జానుభ్యాం సహ పాణిభ్యాం రిఙ్గమాణౌ విజహ్రతుః

ఇలా కొంత కాలం గడిచేసరికి రామకృష్ణులు చేతులతో కలిసిన మోకాళ్ళతో నడవడం (పాతాళం) ప్రారంభించారు. స్వామి మోకాళ్ళు అతలమూ సుతలము. స్వామి హస్తములు భూభాగాన్ని గట్టిగా పట్టుకుని రక్షిస్తున్నాడు. సకల లోకాధారుడని చెప్పడానికి జానుభ్యాం సహ పాణిభ్యాం

తావఙ్ఘ్రియుగ్మమనుకృష్య సరీసృపన్తౌ
ఘోషప్రఘోషరుచిరం వ్రజకర్దమేషు
తన్నాదహృష్టమనసావనుసృత్య లోకం
ముగ్ధప్రభీతవదుపేయతురన్తి మాత్రోః

మానవుడు శిశువుగా చేసే పనులలో రహస్యం, వీరు కూడా పాకుతున్నవారై వ్రజ కర్దమాలలు ( గోశాలలూ మొదలైనవి), వాటిలో ఆవులూ మేకలూ రకరకాల ధ్వములు చేస్తుంటే పిల్లలు కూడా కేకలేస్తూ అంబాడుతున్నారు.
గోవుల అంబారవం వింటే గోవిందుడికి ఆనందము కలుగుతుంది. అది ప్రణవముతో సమానం. ఆ గోవుల యొక్క ధ్వనితో విని సంతోషించినా, లోకాన్ననుసరించి ముఖములో భయం చూపుతూ (భయం నటిస్తూ) తల్లి వద్దకు వచ్చి చేరాడు. వీరిద్దరూ కాసేపు పాములయ్యారు. ఘోష ప్రఘోషములతో (ఘోషము గరుత్మంతుడు, ప్రఘోషం విశ్వక్సేనుని హెచ్చరిక. పరమాత్మ బయలు దేరబోతూ ఉంటే గరుత్మంతుడు స్వామి నామాన్ని పెద్దగా అరుస్తాడు, కేంకారవం చేస్తాడు, విశ్వక్సేనుడు తన బెత్తముతో కొడుతూ స్వామి వస్తున్నాడని సూచిస్తాడు.)
స్వామి పిల్లవాడిగా తిరుగుతూ ఉన్నా ఆయన సకల రాజ లాంచనాలూ అలాగే  ఉన్నాయి.

తన్మాతరౌ నిజసుతౌ ఘృణయా స్నువన్త్యౌ
పఙ్కాఙ్గరాగరుచిరావుపగృహ్య దోర్భ్యామ్
దత్త్వా స్తనం ప్రపిబతోః స్మ ముఖం నిరీక్ష్య
ముగ్ధస్మితాల్పదశనం యయతుః ప్రమోదమ్

ఆ తల్లులు తమ పిల్లలు పరిగెత్తుకు వస్తే "పిల్లవాడు భయపడ్డాడని" దగ్గరకు తీసుకున్నారు. ఆ పిల్లవాళ్ళు బయట తిరిగినందు వలన ఒళ్ళంతా  బురద పట్టి ఉండగా, వారినెత్తుకుని పాలు ఇచ్చి, అలా పాలు తాగుత్న్న వారి ముఖాన్ని చూసారు. అప్పుడే పుడుతున్న చిన్న దంతములను చూస్తూ అందరికీ పళ్ళు వచ్చిన సంగతి చెప్పి తాము కూడా ఆనందించారు.
ఇక్కడ దశన అంటే చిన్న పళ్ళు వస్తున్నాయి అనే అర్థమే కాకుండా సంహరించడం అని కూడా వస్తుంది. అల్ప దశన అంటే చిన్నవారిని (పూతనాదులను)చంపాడు అని కూడా అర్థం వస్తుంది.

యర్హ్యఙ్గనాదర్శనీయకుమారలీలావ్
అన్తర్వ్రజే తదబలాః ప్రగృహీతపుచ్ఛైః
వత్సైరితస్తత ఉభావనుకృష్యమాణౌ
ప్రేక్షన్త్య ఉజ్ఝితగృహా జహృషుర్హసన్త్యః

ఆడవారు చూచి సంతోషించే చిన్నపిల్లల చేష్టలు చేస్తూ, ఆడవారు కానీ వేరే పిల్లలు కానీ, వారి ఆటలో భాగముగా తోకపట్టుకుని దూడ తోకను లాగుతున్నారు, ఆ దూడలు ముందుకు వెళుతున్నాయి. కానీ బలరామ కృష్ణులు అలా తోకపట్టుకుని లాగితే ఆ దూడలు ముందుకు పోక అక్కడే ఉంటున్నాయి. వారు అది చూసి ఈ దూడలు ముందుకు వెళ్ళట్లేదేంటని భయం నటిస్తూ వెనక్కు వచ్చేసారు. ఇల్లు వదిలిపెట్టి ఇలా వినోదిస్తున్నారు బలరామ కృష్ణులు.

శృఙ్గ్యగ్నిదంష్ట్ర్యసిజలద్విజకణ్టకేభ్యః
క్రీడాపరావతిచలౌ స్వసుతౌ నిషేద్ధుమ్
గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ
శేకాత ఆపతురలం మనసోऽనవస్థామ్

కొమ్ములున్నవాటితో, అగ్నితో, కోరలున్నవాటితో కత్తులతో నీటితో పక్షులతో ముళ్ళతో ఆపద పొంచి ఉండగా మహా చంచలులైన బలరామ కృష్ణులను  కట్టడి చేస్తూ ఇంటి పనులూ చేయలేకపోతున్నారూ, వారినీ పూర్తిగా ఒక కంట కనిపెట్టలేకుండా ఉండలేకున్నారు. మనసును ఒక చోట నిలుపలేకున్నారు.
పైకి అలా కనపడినా వారి అల్లరిని చూసి ఆనందిస్తూ ఉననారు.
లోకములో సంసారులు కూడా ఇల్లూ వాకిలీ భార్యా మొదలైనవారు ఉండటం వలన పూర్తిగా ఇటు భగవంతునీ కొలవలేమూ, పూర్తిగా మన పనులనూ మనం సరిగా చేయలేము.

కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే
అఘృష్టజానుభిః పద్భిర్విచక్రమతురఞ్జసా

కొద్దికాలం అయ్యే సరికి మోకాళ్ళు ఆంచకుండానే భూమి మీద సులభముగా నడవడం నేర్చుకున్నారు.

తతస్తు భగవాన్కృష్ణో వయస్యైర్వ్రజబాలకైః
సహరామో వ్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ముదమ్

కృష్ణుడు రామునితో కలిసి వ్రేపల్లెలో ఉన్న గోపిలకు ఆనందం కలిగించడానికి ఆడటం మొదలుపెట్టాడు

కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమారచాపలమ్
శృణ్వన్త్యాః కిల తన్మాతురితి హోచుః సమాగతాః

కృష్ణ పరమాత్మ చంచలమైన దుడుకు పనులు చూచి, కుమ్మరావస్థలోని చాపల్యం చూచి యశోదమ్మ వద్దకు వచ్చి ఈ విధముగా చెప్పారు.

వత్సాన్ముఞ్చన్క్వచిదసమయే క్రోశసఞ్జాతహాసః
స్తేయం స్వాద్వత్త్యథ దధిపయః కల్పితైః స్తేయయోగైః
మర్కాన్భోక్ష్యన్విభజతి స చేన్నాత్తి భాణ్డం భిన్నత్తి
ద్రవ్యాలాభే సగృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్

నీ పిల్లవాడు సమయం కాని సమయములో దూడలను ఆవు వద్దకు వదులుతున్నాడు. అవి పాలు తాగుతున్నాయి. అవి చూచి మేము ఏడుస్తున్నాము. (మనమందరమూ దూడలమే. స్వామి తన భక్తులను అసమయములో (అకారానికి అర్థం విష్ణువు, అసమయం అంటే తనను సేవించే సమయం వచ్చినపుడు) సంసార బంధము నుండి విడిపించి తన దగ్గరకు తీసుకుపోతాడు. హఠాత్తుగా బంధువులు పోతే తక్కిన వారు ఏడుస్తారు.
వారు ఏడుస్తుంటే స్వామి తాను నవ్వుతుంటాడు.
స్తేయం స్వాద్వత్త్యథ దధిపయః కల్పితైః స్తేయయోగైః దొంగతనానికి పనికొచ్చే సాధనములతో సహచరులతో కలిసి దొంగిలించి తాను బాగా తింటాడు.
మనం దొంగతనానికి కావలసిన అహంకారం మమకారం లాంటి వానితో జీవాత్మని మనం దొంగిలిస్తే, మనం దొంగిలించిన తన వస్తువును తాను తీసుకుని తాను భుజిస్తాడు.
పాలూ పెరుగూ దొంగతనం చేసి తినేస్తున్నాడు. తానొక్కడే తినకుండా పక్కనున్న వారికి పెట్టేస్తున్నాడు. ఎందుకు వారికి కూడా పెడుతున్నావంటే వారు నాకు సహకారం చేసారు అంటున్నాడు
పిల్లవాళ్ళకూ పెడుతున్నాడు, ఇంకా మిగిలితే కోతులకూ పెడుతున్నాడు. వెన్నా పాలూ చేతికి అందకపోతె కుండ పగలగొడుతున్నాడు. (నాకు అందనిదేదీ మీకు అందదు అని చెప్పడం దీని వలన. ఆరగింపు చేసిన తరువాతనే మీరు తినాలి అని చెప్పడం. ఈ శరీరానికే కుండ అని పేరు. పరమాత్మ సేవ చేయకుండా స్వార్థముగా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించకుండా అవయవాలతో ఉన్న ఆ కుండని (శరీరాన్ని) పగలగొట్టి వేరే శరీరాన్నిస్తాడు)
ఇక్కడ కోతి అంటే చపల చిత్తం అని కూడా వస్తుంది. స్వామి వారు వారు ఆచరించిన పనుల , కర్మల ఫలితాన్ని వారి వారికి పంచుతాడు.
ఆ మాత్రం పెరుగూ పాలూ కూడా లభించకపోతే దూడలను అరిపించి వెళ్ళిపోతాడు. పడుకుని ఉన్న పిల్లలను గిల్లి ఏడిపించి వెళ్ళిపోతాడు. మనం కూడా పరమాత్మను పరమాత్మ ఇవ్వని ద్రవ్యాలతో ఆరాధించకుంటే ఆయన కూడా మనని ఏడిపిస్తాడు. పరమాత్మకు అర్పించవలసిన దాన్ని పరమాత్మకు అర్పించాలి. ఆచరించినవన్నీ స్వామికి అర్పించకుంటే ఆ కర్మలౌ మనవవుతాయి. ఆ ఫలితాన్ని మనం అనుభవించాలి.

హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యైశ్
ఛిద్రం హ్యన్తర్నిహితవయునః శిక్యభాణ్డేషు తద్విత్
ధ్వాన్తాగారే ధృతమణిగణం స్వాఙ్గమర్థప్రదీపం
కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః

వెన్నా పాలూ పెరుగూ చేతికి అంటకుంటే ఒక రోలు ఎక్కి ఉట్టిని పట్టుకుంటాడు.
అప్పుడు కూడా అంటకుంటే ఆ కుండకు చిల్లు చేస్తాడు. అందులోంచి వచ్చిన పాలను తాను తాగక పక్కనున్న పిల్లల చేత తాగింపచేస్తాడు.
గోపికలందరూ ఇంటి పనులలో మునిగి బయటకు రాలేనంతగా ఉంటే చీకటి గదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న పాలూ పెరుగూ వెన్నా తీసుకోవడానికి నీవు తొడిగిన కంకణాలూ మణులూ రత్నాలూ వాటి వలన వచ్చే కొంచెం కాంతితో కనపడే పాలూ పెరుగూ వెన్నా కుండలను చూచి,  ఇలా సగం కనపడీ కనపడకుండా పాలూ పెరుగూ వెన్ననూ ఆ భాండాలను భేధించి, అవి చిల్లుపడి మేము తెలుసుకునే లోపలే అందులో ఉన్న పాలూ పెరుగూ వెన్నా పోతున్నాయి.
మనం సంసారములో పడి, పరమాత్మను స్మరించడం మరచిపోయి, అజ్ఞ్యానమనే చీకటి గదిలో ఉండగా, పరమాత్మ రక రకాలుగా తన దివ్య ఆభరణాల వెలుగులను మనకు అందిస్తూ ఉంటాడు. వారే పరమాత్మ మనకు అందించిన ఆచార్యులూ గురువులూ. వారు కూడా మనందరం బాగా పనిలో ఉన్నప్పుడే చెబుతారు. పని చేసుకోలేము, వారు చెబుతున్నది వినలేము. మనం మన కృత్యాలలో పడి గురువుగారు చెప్పినది కూడా వినకపోతే స్వామి మన దగ్గర ఉన్నవన్నీ ఖాళీ చేస్తాడు. ఇంకో జన్మకు మనని సిద్ధం చేస్తాడు. లీలల పేరుతో స్వామి మనకు ఈ విషయం చెబుతున్నాడు.

ఏవం ధార్ష్ట్యాన్యుశతి కురుతే మేహనాదీని వాస్తౌ
స్తేయోపాయైర్విరచితకృతిః సుప్రతీకో యథాస్తే
ఇత్థం స్త్రీభిః సభయనయనశ్రీముఖాలోకినీభిర్
వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ న హ్యుపాలబ్ధుమైచ్ఛత్

మేము ఇంటి పక్కనో వెనకనో గోడ మీద ఒక బొమ్మను గీసి , "ఈయన మన దేవుడు ఈయనను మేము పూజిస్తున్నాము" అని పూజిస్తుంటే కృష్ణుడు వచ్చి దాని మీద మూత్రం పోసి నాకంటే దేవుడు ఎవరున్నారు అంటున్నాడు. ఒక గోడ బొమ్మకు ఒక గోపిక ఆరగింపు చేస్తూ కళ్ళు మూసుకుని తెరిచి చూసే సరికి అది కాస్తా కృష్ణుడు తినేసి నీవు పెట్టింది నాకే కదా, ఇంకో దేవుడేవడున్నాడు నాకంటే అని అన్నాడు. అలా కృష్ణుడు నైవేద్యాన్ని ఎంగిలి చేస్తున్నాడు.
ఇలా ఆడవారు కృష్ణుడంటేనే భయపడుతున్నారు. అలా అని కృష్ణున్ని చూడకుండా ఉండలేకపోతున్నారు.
ఇవన్ని చెబితే యశోదమ్మ నవ్వింది. పిల్లవాడిని తిట్టుటకు కూడా మనసు రాలేదు. అలా పిల్లవాడి మీద నేరాలు చెప్పిన వారినే మందలించింది.

ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః
కృష్ణో మృదం భక్షితవానితి మాత్రే న్యవేదయన్

ఒక సారి పరమాత్మ యశోదమ్మకు తన విశ్వరూపాన్ని చూప సంకల్పించి ఒక చిన్న లీల చేసాడు. చుట్టుపక్కన ఉన్న పిల్లలందరూ కృష్ణుడు మట్టి తిన్నాడు అని చెప్పగా

సా గృహీత్వా కరే కృష్ణముపాలభ్య హితైషిణీ
యశోదా భయసమ్భ్రాన్త ప్రేక్షణాక్షమభాషత

పిల్లవాడి హితము కోరే తల్లి కాబట్టి యశోద పిల్లవాడిని పట్టుకుని చేతిలో బెత్తం పట్టుకుంది. కృష్ణుడు భయముతో రెప్పలు ఆడిస్తూ. భయముతో ఉలికిపడుతూ ఆశ్చర్యపడుతూ అదిరిపడుతూ ఉన్న పిల్లవాడితో

కస్మాన్మృదమదాన్తాత్మన్భవాన్భక్షితవాన్రహః
వదన్తి తావకా హ్యేతే కుమారాస్తేऽగ్రజోऽప్యయమ్

మంద బుద్ధీ మట్టి ఎందుకు తిన్నావు. అని అడిగింది. అపుడు కృష్ణుడు వారందరూ అబద్దం చెబుతున్నారు అన్నాడు. అప్పుడు యశోదమ్మ బలరాముడు కూడా చెబుతున్నాడు. చెప్పు ఎందుకు తిన్నావో

నాహం భక్షితవానమ్బ సర్వే మిథ్యాభిశంసినః
యది సత్యగిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖమ్

నేను మట్టి తినలేదమ్మా. నిజం చెబుతున్నాను. వారు చెబుతున్నది నిజం అని నీవనుకుంటే, నీకు అనుమానం ఉంటే నా నోరు చూడు అన్నాడు

యద్యేవం తర్హి వ్యాదేహీ త్యుక్తః స భగవాన్హరిః
వ్యాదత్తావ్యాహతైశ్వర్యః క్రీడామనుజబాలకః

నోరు చూపమని తల్లి అడుగగా, లీలా మానుష రూపుడైన, తన శాసనానికి అడ్డులేనివాడైన శ్రీకృష్ణుడు నోరు తెరిచాడు. ఈనాడు యశోదమ్మ ముందు పిల్లవాడిలా నటిస్తున్నా అతని శాసకత్వానికి ఎదురులేదు

సా తత్ర దదృశే విశ్వం జగత్స్థాస్ను చ ఖం దిశః
సాద్రిద్వీపాబ్ధిభూగోలం సవాయ్వగ్నీన్దుతారకమ్

పరమాత్మ నోటిలో సకల ప్రపంచాన్నీ స్థావర జంగమాన్నీ ఆకాశాన్ని దిక్కులనూ పర్వతములనూ ద్వీపములనూ సముద్రములనూ పంచభూతాలనూ జ్యోతిస్చక్రాన్నీ, కర్మ జ్ఞ్యానేంద్రియాలనూ మనసునూ పంచ తన్మాత్రలనీ సత్వ రజస్తమోగుణాలనీ, ఇవన్నీ ఏ ఏ సమయములో జరుగుతాయో ఆ కాలాన్నీ జీవులనీ వారి కర్మలనూ ఆ కర్మలను ఆచరింపచేసే సంస్కారాలను, ఆ సంస్కారాల చేత కప్పి వేయబడిన మనసు. ప్రళయ కాలం నుంచీ సృష్టి కాలం వరకు ఉండే అన్ని తత్వాలనూ చూసింది. జీవులనూ వారి కర్మలనూ వారి వాసనలనూ వారి వ్యామోహాలనూ, మహదాది తత్వాలనూ చూసింది. జీవ కాల స్వభావ ఆశయ లింగాలనూ అన్నింటినీ చూచింది. బ్రహ్మాండమంతా చూచింది. అందులో ఉండే ప్రతీ భేధాన్నీ చూచింది. ప్రతీ దానిలో దాని పక్క దానిలో ఉండే భేధాన్నీ చూపించాడు. ప్రపంచం మొత్తాన్నీ చూపాడు.

జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్వియదేవ చ
వైకారికాణీన్ద్రియాణి మనో మాత్రా గుణాస్త్రయః

ఏతద్విచిత్రం సహజీవకాల స్వభావకర్మాశయలిఙ్గభేదమ్
సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే వ్రజం సహాత్మానమవాప శఙ్కామ్

తెరిచిన నోటిలో పిల్లవానిలో అన్నీ చూచింది. చివరికి తాను ఉన్న వ్రేపల్లెనూ వ్రేపల్లెలో తనను కూడా చూచుకుంది.

కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ధిమోహః
అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః

ఇది కలయా లేక వైష్ణవ మాయా, నా బుద్ధిలో ఏమైనా మోహం సంభవించిందా, లేకుంటే ఈ పిల్లవానికి ఏదో ఉత్పాతాల వలన ఇతనికి ఏమైనా ఆత్మ యోగం సిద్ధించిందా?లేదా నాకు మోహం వచ్చిందా. లేక ఇది పరమాత్మ మాయా?

అథో యథావన్న వితర్కగోచరం చేతోమనఃకర్మవచోభిరఞ్జసా
యదాశ్రయం యేన యతః ప్రతీయతే సుదుర్విభావ్యం ప్రణతాస్మి తత్పదమ్

ఎపుడైతే ఏమీ అర్థం కాలేదో, ఏమీ నిర్ణయించుకోలేకపోయిందో ఊహకు అందలేదో, తెలుసుకోవడానికి సాధనములుగా చెప్పబడిన అన్ని సాధనముల(చిత్తమూ మనసూ మాటలూ పనులూ) చేత తెలుసుకోలేక పోయేసరికి, ఈ ప్రపంచం అంతా ఎవరి చేతా ఆశ్రయించబడి ఉంటుందో, మనం భావించడానికి కూడా వీలులేనటువంటి స్వామి పాదములకు నమస్కరిస్తున్నాను.

అహం మమాసౌ పతిరేష మే సుతో వ్రజేశ్వరస్యాఖిలవిత్తపా సతీ
గోప్యశ్చ గోపాః సహగోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతిః స మే గతిః

నేనూ నా పిల్లవాడూ నా భర్తా, వ్రేపల్లెలో ఉండే సకల సంపదలూ వాటిని కాపాడే వారందరూ, గోపికలూ గోపాలురూ గోవులూ, ఇలా ఎవరి మాయతో నాకు ఈ (నా అనే) దుష్ట బుద్ధి పుట్టిందో వాడే నాకు దిక్కు. పరమాత్మ విశ్వరూపాన్ని చూపుటకు కారణం యశోదమ్మ మమకారం పోవడానికే. ఒక్క సారి కృష్ణుడి వలన విశ్వరూపాన్ని చూసే సరికి, అన్నీ "నావి" అనుకోవడం తప్పు అని తెలుసుకుని, ఇలా "నా" అన్న భావన ఎవరి వలన వచ్చిందో వాడే నాకు దిక్కు అని వేదింది యశోదమ్మ.

ఇత్థం విదితతత్త్వాయాం గోపికాయాం స ఈశ్వరః
వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభుః

ఒక్క సారి యశోదమ్మకు తత్వం మొత్తం తెలిసిపోయింది. అప్పుడు స్వామి తన విష్ణు మాయను వ్యాపింపచేసాడు. "అమ్మా పాలివ్వ" మని అడిగాడు. పుత్ర భావముతో స్వామికి యశోదమ్మ పాలిచ్చింది. మనకు కూడా అపుడపుడు భక్తీ వైరాగ్యం కలుగుతూ ఉంటాయి, కానీ వెంటనే పోతూ ఉంటాయి. ఒక సారి స్వామిని శరణు వేడితే ఆయన మనను మాయలో ముంచినా, మనం మాయలో మునిగినా, మనకు నరకం రాదు. మనను పాపం అజ్ఞ్యానం మాయా ముంచదు.

సద్యో నష్టస్మృతిర్గోపీ సారోప్యారోహమాత్మజమ్
ప్రవృద్ధస్నేహకలిల హృదయాసీద్యథా పురా

ఒక్క సారి మరలా ఆయన మాయ కప్పి వేయగా అంతా మరచిపోయి పిల్లవాడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని, బాగా ప్రీతి హృదయములో కలిగి ఎప్పటిలాగానే పాలు ఇచ్చింది.

త్రయ్యా చోపనిషద్భిశ్చ సాఙ్ఖ్యయోగైశ్చ సాత్వతైః
ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజమ్

ఎంత మహానుభావురాలు యశోద. అన్ని వేదములతో ఉపనిషత్తులతో సాంఖ్యములతో ఆగమములతో ఏ మహానుహ్బావుని మహత్యాన్ని స్తోత్రం చేస్తున్నాయో అలాంటి స్వామిని నా పుత్రుడూ అని అనుకుంటున్నది.

శ్రీరాజోవాచ
నన్దః కిమకరోద్బ్రహ్మన్శ్రేయ ఏవం మహోదయమ్
యశోదా చ మహాభాగా పపౌ యస్యాః స్తనం హరిః

ఇలాంటి మహత్ అదృష్టం రావడానికి నంద యశోదలు ఏ తపస్సు చేసారు. యశోద ఏ తపస్సు చేసింది. అసలు ఎవరు తల్లి తండ్రులో ఆ భాగ్యాన్ని వారు పొందలేదు. దేవకీ వసుదేవులు పుత్రున్ని మాత్రం కన్నారు. ఆయన పెరుగుతుండగా చూచే భాగ్యాన్ని నంద యశోదలు పొందారు

పితరౌ నాన్వవిన్దేతాం కృష్ణోదారార్భకేహితమ్
గాయన్త్యద్యాపి కవయో యల్లోకశమలాపహమ్

పండితులూ గురువులూ జ్ఞ్యానులు ఎవరి చరితను గానం చేస్తున్నారో, ఆ గానములో కూడా నంద నందనా యశోదా నందనా అన్న పేరు వచ్చింది. సకల లీలలను వీరికి చూపారంటే వారు ఏ పుణ్యం చేసారు.

శ్రీశుక ఉవాచ
ద్రోణో వసూనాం ప్రవరో ధరయా భార్యయా సహ
కరిష్యమాణ ఆదేశాన్బ్రహ్మణస్తమువాచ హ

నందుడంటే అష్ట వసువులలో ప్రథానుడైన ద్రోణ అనే వసువు. అతని భార్య ధర. ఆమే యశోద. శ్రీమన్నారాయణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరించబోతూ ఉంటే వారికి సహాయముగా బ్రహ్మ మాటను బట్టి దేవతలు అందరూ భూమి మీద అవతరించారు.

జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ
భక్తిః స్యాత్పరమా లోకే యయాఞ్జో దుర్గతిం తరేత్

అపుడు వీరు అలాగే పుడతాము కానీ, పరమాత్మ మా దగ్గరే ఉండాలి. ఆయనకు అన్ని సేవలూ మేమే చేయాలి. ఆ సేవల వలన పరమాత్మ యందు మాకు భక్తీ ప్రీతీ బాగా పెరగాలి అని అడిగారు. మాకు పరమ భక్తి లభించాలి. దాని వలన దుర్గతి తొలగించబడుతుంది

అస్త్విత్యుక్తః స భగవాన్వ్రజే ద్రోణో మహాయశాః
జజ్ఞే నన్ద ఇతి ఖ్యాతో యశోదా సా ధరాభవత్

బ్రహ్మ అలాగే అని వారిని వెళ్ళమన్నాడు. ఈ ద్రోణుడనే వసువు, నందుని రూపములో వ్రేపల్లెలో పుట్టగా, ఆ ధర యశోద అయ్యింది. ఇలా కుమారుడిలా పరమాత్మ పెరిగినందు వలన వీరికి పరమాత్మ యందు ప్రీతీ భక్తీ కలిగింది.

తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే
దమ్పత్యోర్నితరామాసీద్గోపగోపీషు భారత

కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభుః
సహరామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా

బ్రహ్మ యొక్క మాటను నిజం చేయాలనుకున్న పరమాత్మ వ్రేపల్లెలో తాను వచ్చి బలరామునితో కలిసి నివసించి, నంద యశోదలకు (ద్రోణ ధరలకు) వారు కోరిన రీతిలో ప్రీతిని చేకూర్చాడు.

Saturday, May 25, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఏడవ అధ్యాయం

                                                                               ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
యేన యేనావతారేణ భగవాన్హరిరీశ్వరః
కరోతి కర్ణరమ్యాణి మనోజ్ఞాని చ నః ప్రభో

పూతనా మోక్ష వృత్తాంతాన్ని విన్న పరీక్షిత్తు పరమాత్మ ఆచరించే కర్మలన్నీ విశేహ్సముగా ఉంటాయి, వినటానికి చెవులకి ఇంపుగా ఉంటాయి, మనసుకూ నచ్చినవిగా ఉంటాయి.

యచ్ఛృణ్వతోऽపైత్యరతిర్వితృష్ణా సత్త్వం చ శుద్ధ్యత్యచిరేణ పుంసః
భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వద మన్యసే చేత్

పరమాత్మ ఆచరించే విచిత్రమిన లీలలు విన్నవారికి భగవంతుని మీది అరతి (అప్రీతి) తొలగిపోతుంది, సోమరితనం తొలగిపోతుంది. ఆశలేకుండా ఉండుట కలిగి మనసు త్వరగానే శుద్ధి పొందుతుంది. పరమాత్మ యందు భక్తీ పరమాత్మ భక్తుల యందు స్నేహమూ కలుగుతాయి. అటువంటి పరమాత్మ లీలలు మీరు చెప్పాలనుకుంటే చెప్పండి

అథాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతమ్
మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురున్ధతః

పూతనా మోక్ష చరితమే ఇంత అద్భుతముగా ఉంది. శిశువుగా ఉన్న స్వామి చేసిన మిగతా లీలలు కూడా చెప్పవలసింది.

శ్రీశుక ఉవాచ
కదాచిదౌత్థానికకౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేతయోషితామ్
వాదిత్రగీతద్విజమన్త్రవాచకైశ్చకార సూనోరభిషేచనం సతీ

పిల్లవాడు బోర్లా పడ్డాడు అని అందరూ ఉత్సవం చేయాలనుకున్నారు. ఆ రోజే స్వామి యొక్క జన్మ నక్షత్రం. మకు పుట్టిన రోజు నక్షత్రాన్ని బట్టే చేసుకోవాలి.
అక్కడ స్త్రీలూ పురుషులూ కలిసారు,  బ్రాహ్మణులూ గోవులూ అందరూ వచ్చారు.
వాదిత్రములు (మంగళ వాద్యాలు) పాటలు బ్రాహ్మణుల స్వస్తి పుణ్యాహవాచములతో పిల్లవానికి అభిషేచనం (అభ్యంగనం) చేసారు.

నన్దస్య పత్నీ కృతమజ్జనాదికం విప్రైః కృతస్వస్త్యయనం సుపూజితైః
అన్నాద్యవాసఃస్రగభీష్టధేనుభిః సఞ్జాతనిద్రాక్షమశీశయచ్ఛనైః

యశోదమ్మ పిల్లవానికి బాగా అలంకరించి బ్రాహ్మణులు చేసిన స్వస్తి వాక్యాలు తీసుకుని, బ్రాహ్మణులకు భోజనములూ వస్త్రములూ పుష్పమాలలూ గోవులూ ఇచ్చి పూజించారు. ఇలా బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనం చేసిన పిల్లవాడు కనులు మూసుకున్నాడు.

ఔత్థానికౌత్సుక్యమనా మనస్వినీ సమాగతాన్పూజయతీ వ్రజౌకసః
నైవాశృణోద్వై రుదితం సుతస్య సా రుదన్స్తనార్థీ చరణావుదక్షిపత్

పిల్లవాడు బోర్లాపడటం అనే పండుగను ఉత్సాహముగ చేస్తున్న యశోదమ్మ వచ్చిన బంధువులను పూజిస్తూ పిల్లవాడు లేచి ఏడుస్తున్న సంగతి వినలేదు.
ఆ పిల్లవాడు పాలు తాగాలని కోరి తన పాదాలను పైకి లేపాడు

అధఃశయానస్య శిశోరనోऽల్పక ప్రవాలమృద్వఙ్ఘ్రిహతం వ్యవర్తత
విధ్వస్తనానారసకుప్యభాజనం వ్యత్యస్తచక్రాక్షవిభిన్నకూబరమ్

ఒక బండి కింద పడుకోబెట్టారు పిల్లవాడిని. ఆ బండి కింద ఉన్న పిల్లవాడు కాలు ఆడించేసరికి ఆ కాలు పైనున్న బండికి తిరిగి ఆ బండి తిరగపడింది.
ఆ బండి కాస్తా పైకి లేచేసరికి చుట్టుపక్కలా ఉన్న అన్న పాత్రలూ అన్నీ చెల్లా చెదురై పోయాయి. బండి ఇరుసూ చక్రాలూ ఎక్కడపడితే అక్కడ పడిపోయాయి.

దృష్ట్వా యశోదాప్రముఖా వ్రజస్త్రియ
ఔత్థానికే కర్మణి యాః సమాగతాః
నన్దాదయశ్చాద్భుతదర్శనాకులాః
కథం స్వయం వై శకటం విపర్యగాత్

దీన్ని అందరూ చూచారు. బండి ఎలా తిరగబడింది. తనకు తానుగా బండి ఎలా పైకి లేచింది అని ఆశ్చర్యపోతూ ఉంటే

ఊచురవ్యవసితమతీన్గోపాన్గోపీశ్చ బాలకాః
రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయః

అందరూ అడుగుతూ ఉంటే ఆ బండి పక్కనే ఆడుకుంటున్న పిల్లలు పిల్లవాడి కాలు తగిలి పడింది అని చెప్పారు

న తే శ్రద్దధిరే గోపా బాలభాషితమిత్యుత
అప్రమేయం బలం తస్య బాలకస్య న తే విదుః

అది విని వారు నమ్మలేదు. వాళ్ళకు బాలకుడనే తెలుసు గానీ కొలవడానికి వీలు కాని కృష్ణుని బలం ఎలా తెలుసు.

రుదన్తం సుతమాదాయ యశోదా గ్రహశఙ్కితా
కృతస్వస్త్యయనం విప్రైః సూక్తైః స్తనమపాయయత్

యశోదమ్మ ఏడుస్తున్న పిల్లవాడిని తీసుకుని అది ఏదో గ్రహం వలన అయ్యిందేమో అనుకుని బ్రాహ్మణులను పిలిచి రక్ష కలిపించమని అడిగి, పిల్లవానికి పాలిచ్చింది

పూర్వవత్స్థాపితం గోపైర్బలిభిః సపరిచ్ఛదమ్
విప్రా హుత్వార్చయాం చక్రుర్దధ్యక్షతకుశామ్బుభిః

మళ్ళీ వీరు, ఆ బండిని యథా ప్రకారం ఉంచారు. మళ్ళీ హోమం చేసి ఆరాధనం చేసి పెరుగూ పాలూ దర్భలూ నెయ్యితో హోమం చేసి స్వస్తి వాచనం పలికారు

యేऽసూయానృతదమ్భేర్షా హింసామానవివర్జితాః
న తేషాం సత్యశీలానామాశిషో విఫలాః కృతాః

వారందరూ కలిసి, " ఇంత పెద్ద బండి పైకి లేచి కిందబడ్డా పిల్లవానికి ఏమీ కాలేదంటే అసత్యమూ ఈర్ష్య హింస అసూయా ధంబమూ గర్వమూ, ఈ ఆరూ లేని వారు పలికిన ఆశీర్వచనములు ఎన్నడూ వ్యర్థము కావు.

ఇతి బాలకమాదాయ సామర్గ్యజురుపాకృతైః
జలైః పవిత్రౌషధిభిరభిషిచ్య ద్విజోత్తమైః

సామ ఋక్ యజు మంత్రాలతో మంత్రించిన నీటితో పవిత్ర జలముతో బ్రాహ్మణులు మళ్ళీ అభిషేకం చేసారు, మళ్ళీ స్వస్తి వాచనం చేయగా

వాచయిత్వా స్వస్త్యయనం నన్దగోపః సమాహితః
హుత్వా చాగ్నిం ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణమ్

నందుడు బ్రాహ్మణుల చేత హోమం చేయించి వారికి చక్కని భోజనం పెట్టి చక్కని ఆవులను అలంకరించి పంపారు

గావః సర్వగుణోపేతా వాసఃస్రగ్రుక్మమాలినీః
ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాత్తే చాన్వయుఞ్జత

పిల్లవాడు బాగుండాలని వారికి గోవులను దానం చేసారు

విప్రా మన్త్రవిదో యుక్తాస్తైర్యాః ప్రోక్తాస్తథాశిషః
తా నిష్ఫలా భవిష్యన్తి న కదాచిదపి స్ఫుటమ్

మంత్రజ్ఞ్యులూ పండితులూ కలిసి పిల్లవానికి ఆశీర్వాదం ఇచ్చారు. అలాంటి మహానుభావుల చేత చేయబడిన ఆశీర్వాదములు వ్యర్థము కావు అని స్పష్టమయ్యింది అని తమలో తాము అనుకున్నారు

ఏకదారోహమారూఢం లాలయన్తీ సుతం సతీ
గరిమాణం శిశోర్వోఢుం న సేహే గిరికూటవత్

ఇలా కొద్ది రోజులు గడవగా ఒక నాడు పిల్లవాడిని ఒడిలో కూర్చోపెట్టి పాలు తాపింది, అలా పిల్లవాడిని ముద్దు చేస్తూ ఉంటే, ఉన్నట్లుండి పిల్లవాడు బాగా బరువయ్యాడు, పర్వత శిఖరమ అంత  బరువయ్యాడు

భూమౌ నిధాయ తం గోపీ విస్మితా భారపీడితా
మహాపురుషమాదధ్యౌ జగతామాస కర్మసు

అది తట్టుకోలేక పిల్లవాన్ని భూమి మీద కూర్చోబెట్టి ఆశ్చర్యపడి పరమాత్మ యందు మనసు పెట్టి భగవంతుని ధ్యానం చేస్తూ తన ఇంటి పనిలో మునిగిపోయింది

దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యః ప్రణోదితః
చక్రవాతస్వరూపేణ జహారాసీనమర్భకమ్

కంసుడు పంపగా, కంసుని సేవకుడైన తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపములో వచ్చాడు.
సుడిగాలి రూపములో అలా కూర్చున్న పిల్లవాడిని హరించాడు

గోకులం సర్వమావృణ్వన్ముష్ణంశ్చక్షూంషి రేణుభిః
ఈరయన్సుమహాఘోర శబ్దేన ప్రదిశో దిశః

మొత్తం వ్రేపల్లెను చుట్టుముట్టింది సుడిగాలి. అందరి కళ్ళల్లో దుమ్ము పడింది. మహాభయంకరమైన ధ్వనితో అన్ని దిక్కులనూ ప్రతిధ్వనింపచేస్తూ స్వామిని తీసుకు వెళ్ళగా ఒక్క క్షణకాలం దుమ్ము ఆవహించి చీకట్లు వచ్చాయి.

ముహూర్తమభవద్గోష్ఠం రజసా తమసావృతమ్
సుతం యశోదా నాపశ్యత్తస్మిన్న్యస్తవతీ యతః

పిల్లవాడు ఏమయ్యాడో అని భయపడి యశోదరాగా

నాపశ్యత్కశ్చనాత్మానం పరం చాపి విమోహితః
తృణావర్తనిసృష్టాభిః శర్కరాభిరుపద్రుతః

కృష్ణుడు ఎక్కడున్నాడో కనపడలేదు, తాను ఎక్కడున్నాడో తెలియడం లేదు. వ్రేపల్లెలో ఉన్న వారందరిదీ ఇదే స్థితి

ఇతి ఖరపవనచక్రపాంశువర్షే సుతపదవీమబలావిలక్ష్య మాతా
అతికరుణమనుస్మరన్త్యశోచద్భువి పతితా మృతవత్సకా యథా గౌః

ఆ రాక్షసుడు దుమ్ముతో ఆవారించి ఉండగా, ఇటువంటి ఘోరమైన దుమ్ములో పిల్లవాడిని చూడని యశోద వినేవారి మనసు కరిగేలాగ విలపించింది.
దూడ చనిపోయిన ఆవు పడి పొర్లినట్లుగా భూమి మీద పడి పొర్లుతూ ఉంది.

రుదితమనునిశమ్య తత్ర గోప్యో భృశమనుతప్తధియోऽశ్రుపూర్ణముఖ్యః
రురుదురనుపలభ్య నన్దసూనుం పవన ఉపారతపాంశువర్షవేగే

యశోదమ్మ ఏడుపు విన్న చుట్టుపక్కలవారు కన్నీరు పెట్టుకుంటూ వారూ వచ్చారు. దుమ్మేవానలాగ వచ్చింది. అంత వేగములో కూడా వారు ఏడుస్తూ ఉన్నారు

తృణావర్తః శాన్తరయో వాత్యారూపధరో హరన్
కృష్ణం నభోగతో గన్తుం నాశక్నోద్భూరిభారభృత్

తృణావర్తుడు తన పని అయ్యింది కాబట్టి తన వేగాన్ని తగ్గించాడు.
పిల్లవాడిని తీసుకుని కొద్ది దూరం పైకి వెళ్ళాడు. అలా పైభాగానికి వెళ్ళగా కృష్ణుడి బరువును మోయలేక ముందరికి వెళ్ళలేకపోయాడు. ఒక పెద్ద పర్వతాన్ని మెడకు తగిలించుకున్నట్లు అయ్యింది

తమశ్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయా
గలే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోదద్భుతార్భకమ్

తన కంటే బరువు ఉన్నాడు. వదిలించుకుందామని అనుకుంటే స్వామి తన రెండు చేతులతో మెడను పట్టుకున్నాడు.

గలగ్రహణనిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః
అవ్యక్తరావో న్యపతత్సహబాలో వ్యసుర్వ్రజే

మెడ గట్టిగా పట్టుకుంటే విడిపించుకోలేకపోతున్నాడు. మేద పిసికినత పని చేసాడు. రెండు కనుగుడ్లూ బయటకు వచ్చాయి ఆ రాక్షసునికి. గట్టిగా అరుద్దామంటే గొంతు కూడా పెగలక, ప్రాణాలు విడిచి పిల్లవానితో సహా వ్రేపల్లెలో కింద ఒక రాయి మీద పడ్డాడు

తమన్తరిక్షాత్పతితం శిలాయాం విశీర్ణసర్వావయవం కరాలమ్
పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యో దదృశుః సమేతాః

అంత ఎత్తునుంచి కిందబడితే అన్ని అవయవాలూ విరిగిపోయి, శంకరుని బాణముతో (నారాయణుడే శంకరుని బాణం) త్రిపురములు ఎలా చిన్నాభిన్నమయ్యాయో అలా ఈ రాక్షసుని అవయవాలన్నీ చిన్నాభిన్నమయ్యాయి. అలా పడి ఉన్న పిల్లవాన్ని ఏడుస్తున్న స్త్రీలు చూచారు

ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః కృష్ణం చ తస్యోరసి లమ్బమానమ్
తం స్వస్తిమన్తం పురుషాదనీతం విహాయసా మృత్యుముఖాత్ప్రముక్తమ్
గోప్యశ్చ గోపాః కిల నన్దముఖ్యా లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదమ్

అమాంతం పిల్లవాన్ని తీసుకుని తల్లికి ఇచ్చారు. పడిపోయిన రాక్షసుని మీద పిల్లవాడు పడి హాయిగా ఆడుకుంటున్నాడు. అలాంటి పిల్లవాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు. ఇంచుమించు మృత్యువు నుండి బయటపడ్డాడు.గోపికలూ గోపాలురూ నందులూ అందరూ పరమానందాన్ని పొందారు.

అహో బతాత్యద్భుతమేష రక్షసా బాలో నివృత్తిం గమితోऽభ్యగాత్పునః
హింస్రః స్వపాపేన విహింసితః ఖలః సాధుః సమత్వేన భయాద్విముచ్యతే

ఎంత ఆశ్చర్యం ఇది. ఇంత చిన్న పిల్లవాడు రాక్షసుని చేత తీసుకు వెళ్ళబడి కింద పడి కూడా క్షేమముగా ఉన్నాడంటే ఈ సంఘటన కూడా పరమ సత్యాన్ని చెబుతుంది. పది మందిని హింసించేవాడు తాను చేసిన పాపముతోనే హింసించబడతాడు. పది మందికి మంచి కోరేవాడు,సమతావాది తాను చేసే మంచి వలనే, తన సాధు గుణముల చేతనే తాను రక్షింపబడతారౌ. మనం చేసే పుణ్యపాపాలే మనను శిక్షిస్తాయీ రక్షిస్తాయి

కిం నస్తపశ్చీర్ణమధోక్షజార్చనం
పూర్తేష్టదత్తముత భూతసౌహృదమ్
యత్సమ్పరేతః పునరేవ బాలకో
దిష్ట్యా స్వబన్ధూన్ప్రణయన్నుపస్థితః

ఎంత అదృష్టవంతులం మన, ఎదో తపస్సు చేసే ఉంటాము, ఇంద్రియ జయం కలిగించే పరమాత్మను ఆరాధించే ఉంటాము, ఎన్నో యజ్ఞ్యాలూ చేసే ఉంటాము, చెరువులో తోటలో దేవాలయాలో కట్టించి ఉంటాము, పాడు బడిన దేవాయలాన్ని బాగు చేసి ఉంటాము, (కొత్త గుళ్ళు కట్టించడం కంటా జీర్ణమైపోతున్న పాత గుడిని ఉద్ధరిచడం వేయిరెట్లు పుణ్యాన్ని ఇస్తుంది) ఎంతో మంది పిల్లలకు పూర్వ జన్మలో మేలు చేసి ఉంటాము.
అందరమూ పోయాడనుకున్న పిల్లవాడు మనందరికీ ఆనందం కలిగిస్తూ క్షేమముగా వచ్చాడు.

దృష్ట్వాద్భుతాని బహుశో నన్దగోపో బృహద్వనే
వసుదేవవచో భూయో మానయామాస విస్మితః

ఇలాంటి అద్భుతాలను చూచిన నందుడు వసుదేవుడు చెప్పిన మాట నిజమే, అతను నిజముగా మహాయోగి అని అతని మాటలు తలచుకున్నాడు, ఆశ్చర్యపోయాడు

ఏకదార్భకమాదాయ స్వాఙ్కమారోప్య భామినీ
ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుతా

ఒక సారి పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. తల్లికి ముద్దు వచ్చి ఆడిస్తూ పాలిచ్చింది. ఇలా పాలు తాగిన తరువాత పిల్లవాడి చిరునవ్వు చూస్తూ ఉంది. ముఖాన్ని లాలిస్తూ, ముఖాన్ని తుడిచి ముద్దాడుతూ ఉండగా

పీతప్రాయస్య జననీ సుతస్య రుచిరస్మితమ్
ముఖం లాలయతీ రాజఞ్జృమ్భతో దదృశే ఇదమ్

అప్పుడు స్వామి ఒకసారి ఆవలించాడు

ఖం రోదసీ జ్యోతిరనీకమాశాః సూర్యేన్దువహ్నిశ్వసనామ్బుధీంశ్చ
ద్వీపాన్నగాంస్తద్దుహితౄర్వనాని భూతాని యాని స్థిరజఙ్గమాని

అప్పుడు అన్ని లోకాలూ చూపించాడు, ఆ ముఖములో ఆకాశమూ భూమీ అగ్నిహోత్రుడూ దిక్కులూ సూర్యుడూ చంద్రుడూ వనాలూ అరణ్యాలూ సకల చరాచర జగత్తుం మొత్తం చూసింది.

సా వీక్ష్య విశ్వం సహసా రాజన్సఞ్జాతవేపథుః
సమ్మీల్య మృగశావాక్షీ నేత్రే ఆసీత్సువిస్మితా

అలా చూడగా వణుకు పుట్టి కళ్ళు మూసుకుంది. ఆశ్చర్యాన్ని పొందింది.

                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Thursday, May 23, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఆరవ అధ్యాయం

                                                             ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
నన్దః పథి వచః శౌరేర్న మృషేతి విచిన్తయన్
హరిం జగామ శరణముత్పాతాగమశఙ్కితః

నందునికి కూడా అనుమానం వచ్చింది వసుదేవుని మాటలవలన. శ్రీమన్నారాయణనున్ని శరణు వేడాడు

కంసేన ప్రహితా ఘోరా పూతనా బాలఘాతినీ
శిశూంశ్చచార నిఘ్నన్తీ పురగ్రామవ్రజాదిషు

కంసుని ఆజ్ఞ్య వలన చిన్న పిల్లలల్ను చంపే గ్రహమైన పూతన, పట్టణాలలో నగరాలలో ఊళ్ళలో ఉన్న శిశువులను చంపుకుంటూ తిరుగుతోంది

న యత్ర శ్రవణాదీని రక్షోఘ్నాని స్వకర్మసు
కుర్వన్తి సాత్వతాం భర్తుర్యాతుధాన్యశ్చ తత్ర హి

ఎక్కడైతే పరమాత్మ కథలు కానీ నామములు కానీ పూజలు కానీ జరగవో అక్కడ ఇలాంటి రాక్షసులు తిరుగుతూ ఉంటారు. తాము ఆచరించే పనులలో రాక్షసులను సంహరించే శ్రవణ స్మరణ కీర్తనాదులు ఎక్కడ ఉండవో అక్క్డ రాక్షసులు ఉంటారు

సా ఖేచర్యేకదోత్పత్య పూతనా నన్దగోకులమ్
యోషిత్వా మాయయాత్మానం ప్రావిశత్కామచారిణీ

ఈమె ఒక సారి రేపల్లెకు వచ్చింది. తనను తాను ఒక చక్కని సౌందర్యవతి ఐన స్త్రీగా తన మాయతో ఏర్పాటు చేసుకుని అనుకున్న చోటుకు వెళ్ళగలిగినది కాబట్టి బయలు దేరింది

తాం కేశబన్ధవ్యతిషక్తమల్లికాం
బృహన్నితమ్బస్తనకృచ్ఛ్రమధ్యమామ్
సువాససం కల్పితకర్ణభూషణ
త్విషోల్లసత్కున్తలమణ్డితాననామ్

పూతన చక్కగా అలంకరించుకుంది. మెళ్ళో హారాలూ వడ్డాణాలూ అంగదములూ కంకణములూ పట్టువస్త్రాలు,సుగంధాలూ, అత్తర్లూ అన్ని జల్లుకునీ ఆమె

వల్గుస్మితాపాఙ్గవిసర్గవీక్షితైర్
మనో హరన్తీం వనితాం వ్రజౌకసామ్
అమంసతామ్భోజకరేణ రూపిణీం
గోప్యః శ్రియం ద్రష్టుమివాగతాం పతిమ్

తీయని చక్కని కమ్మని చిరునవ్వుతో చూపులతో మనసు హరిస్తూ, రేపల్లెలో ఉండే ఒక గోపికా స్త్రీ అన్న వేషం వేసుకుని, ఆమె వస్తోంతే రేపల్లెలో ఒక్కరూ ఆపలేదు. ఈమె వస్తూ వస్తూ చేతితో పద్మం పట్టుకుని వచ్చింది. అమ్మవారు తన భర్తను చూచుకోవడానికి వచ్చిందేమో అనుకున్నారు అందరూ.

బాలగ్రహస్తత్ర విచిన్వతీ శిశూన్యదృచ్ఛయా నన్దగృహేऽసదన్తకమ్
బాలం ప్రతిచ్ఛన్ననిజోరుతేజసం దదర్శ తల్పేऽగ్నిమివాహితం భసి

ఆమె రేపల్లె అంతా తిరుగుతూ పిల్లలను వెతుకుతూ పరమాత్మ సంకల్పముతోనే నందుని ఇంటికి వచ్చింది . నివురు గప్పిన నిప్పులా తన కాంతిని తాను కప్పేసుకున్న ఉన్న, యమునిలా ఉన్న బాలున్ని చూచినది. శయ్యమీద పడుకున్నాడు.

విబుధ్య తాం బాలకమారికాగ్రహం చరాచరాత్మా స నిమీలితేక్షణః
అనన్తమారోపయదఙ్కమన్తకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీః

చరాచరాత్మ అయిన స్వామి కూడా ఆమె రాకను తెలుసుకుని కావాలనే కళ్ళు మూసుకున్నాడు
పడుకుని ఉన్న పాముని తాడు అనుకుని ఒడిలోకి తీసుకున్నట్లుగా ఒడిలోకి తీసుకుంది ఆ బాలున్ని

తాం తీక్ష్ణచిత్తామతివామచేష్టితాం వీక్ష్యాన్తరా కోషపరిచ్ఛదాసివత్
వరస్త్రియం తత్ప్రభయా చ ధర్షితే నిరీక్ష్యమాణే జననీ హ్యతిష్ఠతామ్

తల్లులిద్దరూ బొమ్మల్లాగ చూస్తూ కూర్చున్నారు. అన్నీ వంకర పనులు చేసేది 
ఒరలో దాగి ఉన్న కత్తిలా ఉంది. చూడడానికి అందముగా ఉన్నా లోపల మనసు అంత భయంకరమైనది. ఆమె కాంతితో పక్కనే ఉన్నా ఆ తల్లులు అవాక్కయ్యారు

తస్మిన్స్తనం దుర్జరవీర్యముల్బణం
ఘోరాఙ్కమాదాయ శిశోర్దదావథ
గాఢం కరాభ్యాం భగవాన్ప్రపీడ్య తత్
ప్రాణైః సమం రోషసమన్వితోऽపిబత్

ఎంత గొప్ప వారు కూడా అరిగించుకోలేని మహాభయంకరమైన విషమును స్థలములలో ఉంచుకున్న ఆమె తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ పిల్లవానికి స్తన్యం ఇచ్చింది. ఆ పిల్లవాడు కూడా రెండు చేతులతో రెండు స్తనములను గట్టిగా పట్టుకుని పీడించి మహాకోపముతో ఒక్క పాలే కాదు ప్రాణాలు కూడా లాగేసాడు

సా ముఞ్చ ముఞ్చాలమితి ప్రభాషిణీ నిష్పీడ్యమానాఖిలజీవమర్మణి
వివృత్య నేత్రే చరణౌ భుజౌ ముహుః ప్రస్విన్నగాత్రా క్షిపతీ రురోద హ

ఆమె బాధను తాళలేక విడు విడు మంది. అన్ని ప్రాణాలూ లాగేయబడుతూ ఉన్నాయి. గుడ్లు తేలేసింది. కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ ఉండగా ఒళ్ళంతా చెమట పట్టి గట్టిగా ఏడ్చింది

తస్యాః స్వనేనాతిగభీరరంహసా సాద్రిర్మహీ ద్యౌశ్చ చచాల సగ్రహా
రసా దిశశ్చ ప్రతినేదిరే జనాః పేతుః క్షితౌ వజ్రనిపాతశఙ్కయా

ఆమె ఏడిస్తే చుట్టుపక్కల పన్నెండు యోజనాల చుట్టూ పర్వతాలు కంపించాయి. ఆకాశమూ భూమీ నీరు సముద్రాలూ అన్ని కంపించాయి. జనాలు వణికిపోయారు. పిడుగు పడుతుందేమో అని భయపడ్డారు

నిశాచరీత్థం వ్యథితస్తనా వ్యసుర్
వ్యాదాయ కేశాంశ్చరణౌ భుజావపి
ప్రసార్య గోష్ఠే నిజరూపమాస్థితా
వజ్రాహతో వృత్ర ఇవాపతన్నృప

వెంట్రుకలన్నీ ఊడిపోగా కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ ఉండగా తన నిజరూపాన్ని పొందింది. వజ్రాయుధము చేత కొట్టబడిన పర్వతములాగ పడిపోయింది .
ఆరు క్రోసుల దూరం వరకూ ఉన్న చెట్లు మొత్తం పొడి ఐపోయాయి

పతమానోऽపి తద్దేహస్త్రిగవ్యూత్యన్తరద్రుమాన్
చూర్ణయామాస రాజేన్ద్ర మహదాసీత్తదద్భుతమ్

ఈషామాత్రోగ్రదంష్ట్రాస్యం గిరికన్దరనాసికమ్
గణ్డశైలస్తనం రౌద్రం ప్రకీర్ణారుణమూర్ధజమ్

ఒక్కొక్క పన్నూ నాగలి అంత  ఉన్నది. ఒక్కో ముక్కూ పర్వత గుహలాగ ఉంది. ఒక్కో స్తనమూ పర్వతములా ఉంది.మహా భయంకరముగా ఎర్రని కేశములు విరబోసుకుని ఉన్నాయి.

అన్ధకూపగభీరాక్షం పులినారోహభీషణమ్
బద్ధసేతుభుజోర్వఙ్ఘ్రి శూన్యతోయహ్రదోదరమ్

చీకటి బావుల్లాగ ఉన్నాయి కళ్ళు, నది మీదా సముద్ర మీదా వారధి కట్టినట్లు తొడలు ఉన్నాయి. నీరు లేని పాడు బడిన బావిలాగ పొట్ట ఉంది. ఈ ఆకారాన్ని చూచి గోపికలూ గోపాలకులూ వణికిపోయారు

సన్తత్రసుః స్మ తద్వీక్ష్య గోపా గోప్యః కలేవరమ్
పూర్వం తు తన్నిఃస్వనిత భిన్నహృత్కర్ణమస్తకాః

బాలం చ తస్యా ఉరసి క్రీడన్తమకుతోభయమ్
గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాతసమ్భ్రమాః

ఆమె వక్షస్థలం మీద కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నాడు భయములేకుండా . గోపికలు వెంటనే వచ్చి ఆ పిల్లవాడిని తీసుకున్నారు

యశోదారోహిణీభ్యాం తాః సమం బాలస్య సర్వతః
రక్షాం విదధిరే సమ్యగ్గోపుచ్ఛభ్రమణాదిభిః

యశొదా రోహిణులు  ఆ బాలకునికి స్నానం చేయించి రక్ష చేయించారు. ఆవు తోకతో ఒళ్ళంతా నిమిరారు శిరస్సు నుండీ పాదముల దాక.

గోమూత్రేణ స్నాపయిత్వా పునర్గోరజసార్భకమ్
రక్షాం చక్రుశ్చ శకృతా ద్వాదశాఙ్గేషు నామభిః

గోప్యః సంస్పృష్టసలిలా అఙ్గేషు కరయోః పృథక్
న్యస్యాత్మన్యథ బాలస్య బీజన్యాసమకుర్వత

గోమూత్రముతో స్నానం చేయించి గోధూళితో ఒల్లంతా స్నానం చేయించి గోమయముతో రాసి పరమాత్మ పన్నెండు పేర్లతో పన్నెండు అవయవాలనూ ప్రోక్షం చేసారు
నీటితో ఆచమనం చేసి, అంగన్యాస కరన్యాసములే కాక వీర్యన్యాసం కూడా చేసారు

అవ్యాదజోऽఙ్ఘ్రి మణిమాంస్తవ జాన్వథోరూ
యజ్ఞోऽచ్యుతః కటితటం జఠరం హయాస్యః
హృత్కేశవస్త్వదుర ఈశ ఇనస్తు కణ్ఠం
విష్ణుర్భుజం ముఖమురుక్రమ ఈశ్వరః కమ్



చక్ర్యగ్రతః సహగదో హరిరస్తు పశ్చాత్
త్వత్పార్శ్వయోర్ధనురసీ మధుహాజనశ్చ
కోణేషు శఙ్ఖ ఉరుగాయ ఉపర్యుపేన్ద్రస్
తార్క్ష్యః క్షితౌ హలధరః పురుషః సమన్తాత్

ఇన్ద్రియాణి హృషీకేశః ప్రాణాన్నారాయణోऽవతు
శ్వేతద్వీపపతిశ్చిత్తం మనో యోగేశ్వరోऽవతు

పృశ్నిగర్భస్తు తే బుద్ధిమాత్మానం భగవాన్పరః
క్రీడన్తం పాతు గోవిన్దః శయానం పాతు మాధవః

వ్రజన్తమవ్యాద్వైకుణ్ఠ ఆసీనం త్వాం శ్రియః పతిః
భుఞ్జానం యజ్ఞభుక్పాతు సర్వగ్రహభయఙ్కరః

డాకిన్యో యాతుధాన్యశ్చ కుష్మాణ్డా యేऽర్భకగ్రహాః
భూతప్రేతపిశాచాశ్చ యక్షరక్షోవినాయకాః

కోటరా రేవతీ జ్యేష్ఠా పూతనా మాతృకాదయః
ఉన్మాదా యే హ్యపస్మారా దేహప్రాణేన్ద్రియద్రుహః

స్వప్నదృష్టా మహోత్పాతా వృద్ధా బాలగ్రహాశ్చ యే
సర్వే నశ్యన్తు తే విష్ణోర్నామగ్రహణభీరవః

 పుట్టుక లేని పరమాత్మ నీ పాదములనూ, నీ మోకాళ్ళూ ఊరువులనూ అణిమా (సూక్ష్ముడు), నడుమును అచ్యుతుడు, గర్భాన్ని హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడూ, వక్షస్థలాన్ని ఈశ్వరుడూ, సూర్యుడు కంఠాన్నీ, విష్ణువు భుజం ముఖం ఉరుక్రముడు, చక్రాయుధం కలవాడు ముందర గధాయుధ ధారి వెనకా, రెండు పక్కలా మధుసూధనుడు, మూలలలో శంఖం ధరించినవాడు, పైన ఉపేంద్రుడు, భూమి మీద గరుడుడు, అన్ని దిక్కులా ఆదిశేషుడు, ఇంద్రియాలను హృషీకేశుడు, ప్రాణాలని నారాయణుడు, శతద్వీపాధిపతి చిత్తాన్ని, మనసును యోగీశ్వరుడు, పృష్ణి గర్భుడు బుద్ధినీ, ఆత్మను పరమాత్మ కాపాడాలి
ఆడుకుంటున్నపుడు గోవిందుడు పడుకున్నపుడు మాధవుడు నడుస్తున్నవాడిని వైకుంఠుడూ  కూర్చున్న వాడిని శ్రీపతి భోజనం చేస్తున్నప్పుడు సర్వ గ్రహ భయంకరుడైన యజ్ఞ్యేశ్వరుడు కాపాడాలి
డాకినీ శాకినీ అనే బాల గ్రహాలన్నీ భూత ప్రేత పిశాచాలు యక్ష రక్షాదులూ ఉన్మాదములూ అపస్మారములూ, దేహానికి ప్రాణానికి ఇంద్రియాలకూ ద్రోహం కలిగించేవీ, కలలో కలిగించే ఉత్పాతాలూ, వృద్ధ బాల గ్రహాలూ అన్నీ పరమాత్మ పేరు తలచడం వలన నశించు గాక.
మా పిల్లవాడు క్షేమముగా ఉండాలి

శ్రీశుక ఉవాచ
ఇతి ప్రణయబద్ధాభిర్గోపీభిః కృతరక్షణమ్
పాయయిత్వా స్తనం మాతా సన్న్యవేశయదాత్మజమ్

ప్రేమతో ఉన్న గోపికలు స్వామికి రక్ష గావించారు. చనుబాలు త్రాపి పిల్లవాడిని పడుకోబెట్టారు. అంతలో నందాది గోపాలకులు వ్రేపల్లెకు వచ్చి పడి ఉన్న పూతన దేహాన్ని చూచి అత్యాశ్చర్యాన్ని  పొందారు

తావన్నన్దాదయో గోపా మథురాయా వ్రజం గతాః
విలోక్య పూతనాదేహం బభూవురతివిస్మితాః

నూనం బతర్షిః సఞ్జాతో యోగేశో వా సమాస సః
స ఏవ దృష్టో హ్యుత్పాతో యదాహానకదున్దుభిః

వసుదేవుడు మామూలు మానవుడు కాడు. ఆయన ఋషో యోగీశ్వరుడో అయి ఉంటాడు

కలేవరం పరశుభిశ్ఛిత్త్వా తత్తే వ్రజౌకసః
దూరే క్షిప్త్వావయవశో న్యదహన్కాష్ఠవేష్టితమ్

గొడ్డళ్ళతో ఆ అవయవాలను ఖండించి ముక్కలు చేసి తగలబెట్టారు. ఒక్కో అవయవాన్నీ మళ్ళీ ముక్కలు  చేసారు

దహ్యమానస్య దేహస్య ధూమశ్చాగురుసౌరభః
ఉత్థితః కృష్ణనిర్భుక్త సపద్యాహతపాప్మనః

కట్టెలు పేర్చి దహనం చేయగా, శరీరం తగలబడుతూ ఉంటే పొగతో బాటు చక్కని సుగంధం వచ్చింది

పూతనా లోకబాలఘ్నీ రాక్షసీ రుధిరాశనా
జిఘాంసయాపి హరయే స్తనం దత్త్వాప సద్గతిమ్

కిం పునః శ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే
యచ్ఛన్ప్రియతమం కిం ను రక్తాస్తన్మాతరో యథా

పరమాత్మ స్పర్శ వలన అన్ని పాపాలు తొలగి మోక్షం వచ్చింది పూతనకు. పరమ దుర్మార్గురాలు లోక బాలకులను చంపి నెత్తురు తాగే పూతన కృష్ణున్ని చంపాలని పాలు ఇచ్చి మోక్షాన్ని పొందింది. అదే కొంచెం ప్రేమతో భక్తితో శ్రద్ధగా చేస్తే ఇంకేమి వస్తుంది వారికి

పద్భ్యాం భక్తహృదిస్థాభ్యాం వన్ద్యాభ్యాం లోకవన్దితైః
అఙ్గం యస్యాః సమాక్రమ్య భగవానపి తత్స్తనమ్

యాతుధాన్యపి సా స్వర్గమవాప జననీగతిమ్
కృష్ణభుక్తస్తనక్షీరాః కిము గావోऽనుమాతరః

ఆమె ఎంత అదృష్టవంతురాలంటే ప్రపంచములో నమస్కరించదగిన వారందరిచేత నమస్కరించదగిన పాదములతో శరీరాన్ని ఆక్రమించి తాను పాలు తాగాడు. ఆ పాదలతో తొక్కుకుంటూ పాలు తాగాడు. అందుకే మోక్షం వచ్చింది.

పయాంసి యాసామపిబత్పుత్రస్నేహస్నుతాన్యలమ్
భగవాన్దేవకీపుత్రః కైవల్యాద్యఖిలప్రదః

తాసామవిరతం కృష్ణే కుర్వతీనాం సుతేక్షణమ్
న పునః కల్పతే రాజన్సంసారోऽజ్ఞానసమ్భవః

విషమిచ్చిన పూతనే మోక్షానికి వెళితే కృష్ణ పరమాత్మ పాలు తాగుతున్న ఆవులూ, తల్లులూ ఎక్కడికి వెళతారో వేరే చెప్పలా. నా కుమారుడనే ప్రేమతో వారిచ్చిన పాలు తాగిన దేవకీ పుత్రుడు, నిరంతరం తన కుమారునిగా చూస్తున్న వారు ఈ సంసారములో మళ్ళీ పుట్టరు

కటధూమస్య సౌరభ్యమవఘ్రాయ వ్రజౌకసః
కిమిదం కుత ఏవేతి వదన్తో వ్రజమాయయుః

ఆ సుగంధాన్ని చూచి అందరూ ఆశ్చర్యపడుతూ వెళ్ళిపోయారు.
ఈ నందాదులకు ఆమె ఎలా వచ్చింది పాలిచ్చినదీ అన్న విషయాలు వర్ణించి చెప్పగా వారందరు జరిగిందేదో జరిగిందిలే పిల్లవాడు బాగున్నాడు కదా అనుకున్నారు

తే తత్ర వర్ణితం గోపైః పూతనాగమనాదికమ్
శ్రుత్వా తన్నిధనం స్వస్తి శిశోశ్చాసన్సువిస్మితాః

నన్దః స్వపుత్రమాదాయ ప్రేత్యాగతముదారధీః
మూర్ధ్న్యుపాఘ్రాయ పరమాం ముదం లేభే కురూద్వహ

చనిపోయి మళ్ళీ బతికినట్లుగా వచ్చిన కృష్ణున్ని చూచుకుని నుదుట ముద్దాడి సంతోషాన్ని పొందాడు

య ఏతత్పూతనామోక్షం కృష్ణస్యార్భకమద్భుతమ్
శృణుయాచ్ఛ్రద్ధయా మర్త్యో గోవిన్దే లభతే రతిమ్

పరమాత్మ ప్రసాదించిన అద్భుతమైన పూతనా మోక్ష గాధను శ్రద్ధతో ఎవరు వింటారో వారికి పరమాత్మ యందు భక్తి కలుగుతుంది
  
                                                          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఐదవ అధ్యాయం

                                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
నన్దస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః
ఆహూయ విప్రాన్వేదజ్ఞాన్స్నాతః శుచిరలఙ్కృతః

నందుడు కుమారుడు కలగడము వలన మహా సంతోషం కలవాడై వేదం బ్రాహ్మణులను పిలిచి స్వస్తి పుణ్యాహవచనములను చేయించుకుని జాతకర్మ చేసి పితృదేవతలను అర్చించాడు

వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మాత్మజస్య వై
కారయామాస విధివత్పితృదేవార్చనం తథా

ధేనూనాం నియుతే ప్రాదాద్విప్రేభ్యః సమలఙ్కృతే
తిలాద్రీన్సప్త రత్నౌఘ శాతకౌమ్భామ్బరావృతాన్

బాగుగా అలంకరించబడి ఉన్న రెండు లక్షల గోవులను బ్రాహ్మణులకు దానం చేసాడు

కాలేన స్నానశౌచాభ్యాం సంస్కారైస్తపసేజ్యయా
శుధ్యన్తి దానైః సన్తుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మవిద్యయా

అద్రి దానం చేసాడు. రత్నపు రాసులూ బంగారమూ వస్త్రాలతో కప్పబడిన ఏడు గుట్టలను దానం చేసాడు. ఒక్కో దాని శుద్ధికీ ఒక్కోటి అవసరం. పది రోజులు ఐతే కానీ     తల్లి తండ్రులు శుద్ధి చెందుతారు. స్నానముతో శరీరం శుద్ధమవుతుంది. శౌచముతో బుద్ధి శుద్ధి పొందుతుంది. సంస్కారముతో మనసు శుద్ధి చెందుతుంది, పూజతో సంకల్పం శుద్ధి చెందుతుంది, దానముతో ద్రవ్యం శుద్ధి చెందుతుంది. నాది అన్న అహంకార గ్రస్థమై మురికి పట్టి ఉంటుంది ద్రవ్యానికి. దానము వలన ఆ మురికి పోతుంది.

సౌమఙ్గల్యగిరో విప్రాః సూతమాగధవన్దినః
గాయకాశ్చ జగుర్నేదుర్భేర్యో దున్దుభయో ముహుః

 అందరూ మంగళ వాక్యములు పలుకుతూ బ్రాహ్మణులూ సూతులూ మాగధులూ వందులూ గానం చేసారు

వ్రజః సమ్మృష్టసంసిక్త ద్వారాజిరగృహాన్తరః
చిత్రధ్వజపతాకాస్రక్ చైలపల్లవతోరణైః

 వ్రేపల్లె మొత్తం వీధులలో ప్రతి ఇంటి ముందరా గంధ జలం చల్లారు

గావో వృషా వత్సతరా హరిద్రాతైలరూషితాః
విచిత్రధాతుబర్హస్రగ్ వస్త్రకాఞ్చనమాలినః

మహార్హవస్త్రాభరణ కఞ్చుకోష్ణీషభూషితాః
గోపాః సమాయయూ రాజన్నానోపాయనపాణయః


ముత్యాలతో ముగ్గులు పెట్టారు.ద్వారములకూ ఇంటిలోపలా ముందరా అలంకరించి రకరకాల పూల మాలలూ దండలూ వస్త్రాలూ చిగురుటాకులూ తోరణాలతో ఆవులూ  ఎద్దులూ దూడలనూ అలంకరించి పసుపూ నూనే కలిపి రాసారు. వారు కూడా రక రకాలైన వస్త్రాభరణాలు ధరించారు. తలపాగాలు బంగారు భాగాలు ధరించిన గోపికలందరూ"మన రాజుకు కొడుకు పుట్టాడు " అని కానుకలు పట్టుకుని గోపికలుకూడా " మా యశోదామ్మకు కొడుకు పుట్టాడు" అని స్నానం చేసి అలంకరించుకున్నారు

గోప్యశ్చాకర్ణ్య ముదితా యశోదాయాః సుతోద్భవమ్
ఆత్మానం భూషయాం చక్రుర్వస్త్రాకల్పాఞ్జనాదిభిః

నవకుఙ్కుమకిఞ్జల్క ముఖపఙ్కజభూతయః
బలిభిస్త్వరితం జగ్ముః పృథుశ్రోణ్యశ్చలత్కుచాః

గోప్యః సుమృష్టమణికుణ్డలనిష్కకణ్ఠ్యశ్
చిత్రామ్బరాః పథి శిఖాచ్యుతమాల్యవర్షాః
నన్దాలయం సవలయా వ్రజతీర్విరేజుర్
వ్యాలోలకుణ్డలపయోధరహారశోభాః

పూజా ద్రవ్యాలు చేతిలో పట్టుకుని చాలా మంది పరిగెత్తుకుని వచ్చారు. వారు తొందరగా వెళుతూ ఉంటే కదులుతున్న గొప్ప స్తనములూ పిరుదులూ కలవారై వచ్చారు.
ఇక్కడ వారు పురుషున్ని చూడటానికి వెళుతున్నారు అని ఉంది. యశోదమ్మ పురుషున్ని ఎలా కన్నది? ఆయన పరమ పురుషుడు. వారు పరమాత్మను చూడడానికి వెళుతున్నాము అన్న భావనతో వెళ్ళారు. ఇక్కడ స్తనం అంటే భక్తి. ఆ భక్తి సౌందర్యము చేతనే పురుషుడైన పరమాత్మ ఆకర్షించబడతాడు
పర భకతి పరమ భక్తి అని రెండు రకముల భక్తి. ఆ భక్తే వారి స్తనములుగా కదిలాయి. పరమాత్మను సాత్క్షాత్కరించుకున్నామన్న దృఢమైన బుద్ధి పర భక్తి. సాక్షాత్కరించుకున్న పరమాత్మనుండి విడిపోతామేమో అన్న భయం పరంభక్తి. వేదాంత శాస్త్రములో భక్తిని స్తనములతో పోలుస్తారు. నడుము ఎంత సన్నగా ఉన్నా స్తనములకు ఆధారం. నడుము భక్తిని మోసేది. అదే వైరాగ్యం. నడుమును మోసేది పిరుదులు. పిరుదులంటే  జ్ఞ్యానం. పరమాత్మను చూడకుండా బతకలేని పారవశ్య స్థ్తిని వర్ణించాలని చెప్పిన మాటలు ఇవి
గోపికలు వెళుతూ ఉంటే వారి కొప్పులోంచి పూలు జారిపడి వారు అనుకోకుండానే మార్గాన్ని పూలతో అలంకరించారు
చేతులకి కంకణాలు పెట్టుకుని మెళ్ళో హారాలు ధరించి నంద భవనానికి వెళ్ళారు. వారంతా పరమాత్మా మా పిల్లవాన్ని కాపాడు . అని ఒకరి మీద ఒకరు పసుపు నీళ్ళు జల్లుకున్నారు

తా ఆశిషః ప్రయుఞ్జానాశ్చిరం పాహీతి బాలకే
హరిద్రాచూర్ణతైలాద్భిః సిఞ్చన్త్యోऽజనముజ్జగుః

అవాద్యన్త విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే
కృష్ణే విశ్వేశ్వరేऽనన్తే నన్దస్య వ్రజమాగతే

పెద్దగా పాడుకుంటూ వెళ్ళారు, గొప్ప వాద్యాలు మోగించారు.

గోపాః పరస్పరం హృష్టా దధిక్షీరఘృతామ్బుభిః
ఆసిఞ్చన్తో విలిమ్పన్తో నవనీతైశ్చ చిక్షిపుః

గోపాలకులు పరస్పరం ఆనందించారు.పాలూ పెరుగూ వెన్నా పూసుకున్నారు

నన్దో మహామనాస్తేభ్యో వాసోऽలఙ్కారగోధనమ్
సూతమాగధవన్దిభ్యో యేऽన్యే విద్యోపజీవినః

తైస్తైః కామైరదీనాత్మా యథోచితమపూజయత్
విష్ణోరారాధనార్థాయ స్వపుత్రస్యోదయాయ చ

అలా చల్లుతున్నారూ రాసుకుంటూ ఉన్నారు. అలా వచ్చిన వారికి నందుడుకొత్తబట్టలు ఇచ్చాడు. ఆభరణాలిచ్చాడు. సూత మాగధ వందులకు గోవులను ఇచ్చాడు. ఎవరెవరు ఏమేమి కావాలనుకున్నారో వరందరికీ అవి ఇచ్చాడు

రోహిణీ చ మహాభాగా నన్దగోపాభినన్దితా
వ్యచరద్దివ్యవాసస్రక్ కణ్ఠాభరణభూషితా

తన కుమారుడు వృద్ధి పొందడానికి రోహిణి కూడా ఆ ప్రాంగణమంతా తిరిగింది కొత్తబట్టలూ ఆభరణాలూ ధరించి

తత ఆరభ్య నన్దస్య వ్రజః సర్వసమృద్ధిమాన్
హరేర్నివాసాత్మగుణై రమాక్రీడమభూన్నృప

ఆనాటి నుండి వ్రేపల్లె అన్ని సమృద్ధులూ కలిగి ఉంది. దేనికీ లోటు లేకుండా
పరమాత్మ యొక్క నివాసము వలన ఏర్పడిన అనంతమైన ఆత్మ గుణములు కలిగి ఉండుటతో వ్రేపల్లె అమ్మవారి ఆట భూమి అయ్యింది (సంపదలు బాగా పెరిగాయి) వ్రేపల్లె కాస్తా శ్రీనివాసమయ్యింది

గోపాన్గోకులరక్షాయాం నిరూప్య మథురాం గతః
నన్దః కంసస్య వార్షిక్యం కరం దాతుం కురూద్వహ

నందుడు కూడా ఆనందముతో పాలూ పెరుగూ మొదలైనవీ తీసుకుని, కట్టవలసిన పన్ను తీసుకుని, అక్కడున్నవారికి వ్రేపల్లె అప్పగించి పన్ను ఇవ్వడానికి మధుర వచ్చాడు. కంసునికి నందుడు పన్ను కట్టాడన్న విషయం తెలుసుకున్న వసుదేవుడు అతను దిగిన ప్రదేశానికి వెళ్ళాడు

వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నన్దమాగతమ్
జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనమ్

తం దృష్ట్వా సహసోత్థాయ దేహః ప్రాణమివాగతమ్
ప్రీతః ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమవిహ్వలః

అలా వచ్చిన వసుదేవున్ని చూచి ప్రాణాలు వస్తే శరీరమెలా లేచి కూర్చుంటుందో అలా లేచి వెంటనే బాహువులతో మిత్రున్ని ప్రేమతో విహ్వలుడై ఆలింగనం చేసుకుని పూజించాడు

పూజితః సుఖమాసీనః పృష్ట్వానామయమాదృతః
ప్రసక్తధీః స్వాత్మజయోరిదమాహ విశామ్పతే

అందరి క్షేమాలూ విచారించాక తన పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగాడు

దిష్ట్యా భ్రాతః ప్రవయస ఇదానీమప్రజస్య తే
ప్రజాశాయా నివృత్తస్య ప్రజా యత్సమపద్యత

భగవంతుని దయతో చాలా కాలం సంతానం లేకున్నా సంతానం కలిగే వయసుదాటిన తరువాత నీకు సంతానం కలిగింది

దిష్ట్యా సంసారచక్రేऽస్మిన్వర్తమానః పునర్భవః
ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనమ్

నీవు మళ్ళీ పుట్టావు నీ కొడుకు రూపములో. ఈ రోజున నీవు మాకు దొరికావు. ప్రపంచములో అన్నీ దొరుకుతాయి కానీ మనకు ఇష్టమైనవి దొరకవు. (నేను ఈ సంసార చక్రములో ఉండి మళ్ళీ బయటకు వస్తానో లేదో అనుకున్న నేను మళ్ళీ పుట్టాను.అలాంటి నేను మళ్ళీ నిన్ను చూస్తా అని అనుకోలేదు. ఇది రెండవ అర్థం. సంసారం అనే చక్రములో తిరుగ్తూ మాటిమాటికీ పుట్టే జీవుడు పరమాత్మ సంకల్పముతో భగవంతుని సాక్షాత్కారాన్ని పొందుతాడు. మనకు ప్రియమైన పరమాత్మను సాక్షాత్కరానం చేసుకోవడం దుర్లభం కదా. ఇది ఇంకో అర్థం)

నైకత్ర ప్రియసంవాసః సుహృదాం చిత్రకర్మణామ్
ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా

ఎంత స్నేహం ప్రీతీ ఎక్కువ ఉంటే వారు అంత దూరముగా ఉంటారు. ఎవరి పనులు వారికుంటాయి.
పడవలు తనతట తాము పోతే ఒకే దిక్కున పోగలవు కానీ ప్రవాహముతో కొట్టుకుపోతే ఒకే దిక్కుకు పోతాయా

కచ్చిత్పశవ్యం నిరుజం భూర్యమ్బుతృణవీరుధమ్
బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః

నీ పశువులకు ఏ రోగాలూ లేకుండా ఉన్నాయా, గడ్డీపంటలూ బాగా పండుతూ ఉన్నాయా. వ్రేపల్లె (బృహద్వనం - బృందావననానికి ఇంకో పేరు ). ఇపుడు నీవెక్కడ ఉన్నావో అది  బాగుందా.

భ్రాతర్మమ సుతః కచ్చిన్మాత్రా సహ భవద్వ్రజే
తాతం భవన్తం మన్వానో భవద్భ్యాముపలాలితః

సోదరా నా కుమారుడు తన తల్లితో నీ ఇంటిలో నీవు పోషిస్తుండగా లాలిస్తుండగా బాగున్నాడా. (దీనికి బలరాముడూ కృష్ణుడూ అన్న అర్థం వస్తుంది)

పుంసస్త్రివర్గో విహితః సుహృదో హ్యనుభావితః
న తేషు క్లిశ్యమానేషు త్రివర్గోऽర్థాయ కల్పతే

భగవంతుడు ఒక వైపు ధర్మార్థ కామాలనూ ఇచ్చాడు, మంచి మిత్రుడూ ఇచ్చాడు. మిత్రుడు బాగుంటేనే ఇవన్నీ బాగుంటాయి. నీవు బాగుంటేనే నా ధర్మార్థ కామాలు (త్రివర్గములు) బాగుంటాయి.

శ్రీనన్ద ఉవాచ
అహో తే దేవకీపుత్రాః కంసేన బహవో హతాః
ఏకావశిష్టావరజా కన్యా సాపి దివం గతా

అయ్యో! దేవకీ పుత్రులందరినీ చంపేసాడు అని విన్నా.

నూనం హ్యదృష్టనిష్ఠోऽయమదృష్టపరమో జనః
అదృష్టమాత్మనస్తత్త్వం యో వేద న స ముహ్యతి

మన జీవితం అంతా అదృష్టం మీద ఆధార పడి ఉన్నది, మనం దానికి పరతంత్ర్యులం. మనదంటూ ఏదీ లేదు అంతా మన అదృష్టం అని తెలుసుకున్నవాడు బాధపడడు

శ్రీవసుదేవ ఉవాచ
కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయం చ వః
నేహ స్థేయం బహుతిథం సన్త్యుత్పాతాశ్చ గోకులే

నీవు వచ్చిన పని ఐపోయింది కదా. ఎక్కువ సేపు ఇక్కడ ఉండవద్దు.  వ్రేపల్లెలో ఉత్పాతాలు జరగబోతున్నాయి.

శ్రీశుక ఉవాచ
ఇతి నన్దాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః
అనోభిరనడుద్యుక్తైస్తమనుజ్ఞాప్య గోకులమ్

వసుదేవుడు నందాది గోపకులకు ఇలా చెబితే అతని ఆజ్ఞ్య పొంది బళ్ళు కట్టుకుని వ్రేపల్లెకు వెళ్ళారు.

                                                     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నాలుగవ అధ్యాయం


                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
బహిరన్తఃపురద్వారః సర్వాః పూర్వవదావృతాః
తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాః సముత్థితాః

ఇలా అన్ని తలుపులూ ఎప్పటిలాగే మూసుకుని ఉన్న తరువాత వచ్చిన పాప ఏడ్చింది. పిల్ల ఏడుపు విని భటులు కంసునికి నివేదించారు

తే తు తూర్ణముపవ్రజ్య దేవక్యా గర్భజన్మ తత్
ఆచఖ్యుర్భోజరాజాయ యదుద్విగ్నః ప్రతీక్షతే

ఎప్పుడు కృష్ణుడు పుడతాడా అని ఉద్విగ్న మనసుతో ఉన్నాడు

స తల్పాత్తూర్ణముత్థాయ కాలోऽయమితి విహ్వలః
సూతీగృహమగాత్తూర్ణం ప్రస్ఖలన్ముక్తమూర్ధజః

భయముతో వణుకుతూ భయపడుతూ జుట్టు విడిపోగా భయపడుతూ ఖడ్గం తీసుకుని అక్కడికి వెళ్ళాడు

తమాహ భ్రాతరం దేవీ కృపణా కరుణం సతీ
స్నుషేయం తవ కల్యాణ స్త్రియం మా హన్తుమర్హసి

అప్పుడు దేవకి "ఈమె నీ కోడలు, స్త్రీ శిశువు."

బహవో హింసితా భ్రాతః శిశవః పావకోపమాః
త్వయా దైవనిసృష్టేన పుత్రికైకా ప్రదీయతామ్

నా ఎందరి పిల్లలనో చంపావు. నాకు ఈ పుత్రికా భిక్ష ఐనా పెట్టు.

నన్వహం తే హ్యవరజా దీనా హతసుతా ప్రభో
దాతుమర్హసి మన్దాయా అఙ్గేమాం చరమాం ప్రజామ్

పరమ దీనముగా ఏడుస్తున్న చెల్లెలు నుండి పిల్లను లాక్కుని ఆమె మాటను కాదని

శ్రీశుక ఉవాచ
ఉపగుహ్యాత్మజామేవం రుదత్యా దీనదీనవత్
యాచితస్తాం వినిర్భర్త్స్య హస్తాదాచిచ్ఛిదే ఖలః

తాం గృహీత్వా చరణయోర్జాతమాత్రాం స్వసుః సుతామ్
అపోథయచ్ఛిలాపృష్ఠే స్వార్థోన్మూలితసౌహృదః

అప్పుడే పుట్టి కనులు కూడా తెరవని శిశువుని, చెల్లెలు పుత్రికనూ, స్వార్థముతో ప్రేమ అడుగంటిపోగా ఆ అమ్మాయిని పైకి లేపి నేలకేసి కొట్టాడు

సా తద్ధస్తాత్సముత్పత్య సద్యో దేవ్యమ్బరం గతా
అదృశ్యతానుజా విష్ణోః సాయుధాష్టమహాభుజా

పైకి లేవగానే ఆ పాప అతని చేతినుండి ఇంకాస్త పైకి వెళ్ళింది. ఆమె విష్ణువు యొక్క చెల్లెలు కాబట్టి, ఎనిమిది భుజాలతో అన్ని చేతులలో ఆయుధాలతో

దివ్యస్రగమ్బరాలేప రత్నాభరణభూషితా
ధనుఃశూలేషుచర్మాసి శఙ్ఖచక్రగదాధరా

రత్న ఆభరణములూ  ధనువూ మొదలైన అన్ని ఆయుధాలతో

సిద్ధచారణగన్ధర్వైరప్సరఃకిన్నరోరగైః
ఉపాహృతోరుబలిభిః స్తూయమానేదమబ్రవీత్

సిద్ధాదులు అన్నో కానుకలు తెచ్చి అర్పిస్తూ స్తోత్రం చేస్తూ ఉంటే అలా వారి చేత స్తోత్రం చేయబడుతూ కంసుడితో ఇలా అంది

కిం మయా హతయా మన్ద జాతః ఖలు తవాన్తకృత్
యత్ర క్వ వా పూర్వశత్రుర్మా హింసీః కృపణాన్వృథా

బుద్ధి హీనుడా నన్ను చంపి ఏమి లాభం, నిన్ను చంపేవాడు పుట్టాడు. ఎక్కడో ఉన్నాడు. నీకు పాత శత్రువే వాడు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దీనులని హింసించకు.

ఇతి ప్రభాష్య తం దేవీ మాయా భగవతీ భువి
బహునామనికేతేషు బహునామా బభూవ హ

ఇలా మాట్లాడి ఆ దేవి చాలా పేర్లతో చాలా నివాసాలలో ఆ అమ్మవారు ఏరపడి ఈనాటికీ అమే చాలా పేర్లతో వ్యవహరించబడుతున్నది

తయాభిహితమాకర్ణ్య కంసః పరమవిస్మితః
దేవకీం వసుదేవం చ విముచ్య ప్రశ్రితోऽబ్రవీత్

ఆమె చెప్పిన మాటలు విని పరమ ఆశ్చర్యం పొంది వెంటనే దేవకీ వసుదేవులను చెరసాల నుండి విడిపించి సంకెళ్ళు తీసి స్నానం చేయించి వస్త్రాలు ఇచ్చి క్షమాపణ వేడాడ్. రాక్షసుడిలా మీ సంతానాన్ని వధించి, దయను కూడా విడిచిపెట్టాను. నేను ఎలాంటి నరక లోకాలకు వెళతాను బ్రహ్మ హత్య చేసినవాడిలాగ.

అహో భగిన్యహో భామ మయా వాం బత పాప్మనా
పురుషాద ఇవాపత్యం బహవో హింసితాః సుతాః

స త్వహం త్యక్తకారుణ్యస్త్యక్తజ్ఞాతిసుహృత్ఖలః
కాన్లోకాన్వై గమిష్యామి బ్రహ్మహేవ మృతః శ్వసన్

దైవమప్యనృతం వక్తి న మర్త్యా ఏవ కేవలమ్
యద్విశ్రమ్భాదహం పాపః స్వసుర్నిహతవాఞ్ఛిశూన్

మౌషులే కాదు, దైవం కూడా అబద్దం ఆడుతుందని నాకు ఇపుడు అర్థం అయ్యింది. దైవం మాటలు నమ్మి నా తోడబుట్టిన చెల్లెల పిల్లలను చంపాను, ఎంత దుర్మార్గుడిని.

మా శోచతం మహాభాగావాత్మజాన్స్వకృతం భుజః
జాన్తవో న సదైకత్ర దైవాధీనాస్తదాసతే

పిల్లలంతా చనిపోయారని విచారించకండి. అందరూ తాము చేసుకున్న దానినే అనుభవిస్తారు. అంతా దైవం చేతిలో ఉంది

భువి భౌమాని భూతాని యథా యాన్త్యపయాన్తి చ
నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూః

భూమి మీద గాలి వస్తే అది పైకి లేస్తుంది. మళ్ళీ కింద పడుతుంది. మనం కూడా అంతే. శరీరాలు వస్తాయి గానీ ఆత్మ వెళ్ళదూ రాదు.

యథానేవంవిదో భేదో యత ఆత్మవిపర్యయః
దేహయోగవియోగౌ చ సంసృతిర్న నివర్తతే

ఆత్మకు కూడా ఇవన్నీ ఉన్నాయి అనుకోవడం భ్రమ మాత్రమే. సంసారం అంటే శరీరం పుట్టుటా శరీరం పోవుట. ఆత్మకు అది లేదు. శరీరం పోయినంత మాత్రాన సంసారం పోదు

తస్మాద్భద్రే స్వతనయాన్మయా వ్యాపాదితానపి
మానుశోచ యతః సర్వః స్వకృతం విన్దతేऽవశః

నీ పిల్లలను నేను చంపినా విచారించకూ. ప్రతీ జీవుడు తాను చేసుకున్నదానినే తాను పొందుతాడు, స్వతంత్రుడు కాడు. ఇలా హతునిగా హంతకునిగా భావిస్తాడు. ఆ అభిమానముతోటే బాధించేవాడిగా బాధించబడ్డాడిగా తాను భావిస్తూ ఉంటాడు

యావద్ధతోऽస్మి హన్తాస్మీ త్యాత్మానం మన్యతేऽస్వదృక్
తావత్తదభిమాన్యజ్ఞో బాధ్యబాధకతామియాత్

క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాః
ఇత్యుక్త్వాశ్రుముఖః పాదౌ శ్యాలః స్వస్రోరథాగ్రహీత్

నన్ను మీరు క్షమించండి అని కన్నీళ్ళతో బావ కాళ్ళు పట్టుకున్నాడు

మోచయామాస నిగడాద్విశ్రబ్ధః కన్యకాగిరా
దేవకీం వసుదేవం చ దర్శయన్నాత్మసౌహృదమ్

వాళ్ళకు సంకెళ్ళు తీసేసారు. దేవకీ వసుదేవులు కూడా కంసున్ని క్షమించారు.

భ్రాతుః సమనుతప్తస్య క్షాన్తరోషా చ దేవకీ
వ్యసృజద్వసుదేవశ్చ ప్రహస్య తమువాచ హ

వైరాన్ని ద్వేషన్ని వారుకూడా వదిలిపెట్టారు

ఏవమేతన్మహాభాగ యథా వదసి దేహినామ్
అజ్ఞానప్రభవాహంధీః స్వపరేతి భిదా యతః

శోకహర్షభయద్వేష లోభమోహమదాన్వితాః
మిథో ఘ్నన్తం న పశ్యన్తి భావైర్భావం పృథగ్దృశః

వసుదేవుడు "ఈ జీవులకు ఇవన్నీ నిజమే" అజ్ఞ్యానము వలన జీవులు వీడు వేరు నేను వేరు అన్న భావంతో ఉంటారు. శొకమూ భేధమూ మోహముతో ఒకరినొకరు చంపుకుంటూ నేను చంపాననీ నేను చచ్చాననీ వాడు చచ్చాడని భావాలతో ఉంటారు

శ్రీశుక ఉవాచ
కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః
దేవకీవసుదేవాభ్యామనుజ్ఞాతోऽవిశద్గృహమ్

తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం కంస ఆహూయ మన్త్రిణః
తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగనిద్రయా

దేవకీ వసుదేవులు ప్రసన్నులై మాట్లాడితే కంసుడు తన అంతః పురానికి వెళ్ళిపోయాడు. తెల్లవారగానే తన మంత్రులందరినీ పిలిచి "నన్ను చంపేవాడు ఎక్కడో ఒక చోట పుట్టాడని చెప్పింది"

ఆకర్ణ్య భర్తుర్గదితం తమూచుర్దేవశత్రవః
దేవాన్ప్రతి కృతామర్షా దైతేయా నాతికోవిదాః

దేవ శత్రులైన వారందరూ అజ్ఞ్యానులై, చాతుర్యం లేని వారై, "దీనికి భయం ఎందుకు నిన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడని చెప్పారు కదా. నీ రాజ్యములో ఎక్కడున్నా పది రోజులు దాటినవారినీ పది రోజులు దాటని వారినీ చంపేస్తాము

ఏవం చేత్తర్హి భోజేన్ద్ర పురగ్రామవ్రజాదిషు
అనిర్దశాన్నిర్దశాంశ్చ హనిష్యామోऽద్య వై శిశూన్

కిముద్యమైః కరిష్యన్తి దేవాః సమరభీరవః
నిత్యముద్విగ్నమనసో జ్యాఘోషైర్ధనుషస్తవ

దేవతలు ఏమి చేయగలరు. దేవతలందరూ యుద్ధమంటే భయపడతారు. మేము ధనువు యొక్క తాడును లాగితే వారు పారిపోతారు. వారికి యుద్ధమంటే భయం. ధనువు యొక్క తాడును లాగితేనే భయప్పడి ప్రాణాలు దక్కించుకోవడానికి అంతా పారిపోతారు.

అస్యతస్తే శరవ్రాతైర్హన్యమానాః సమన్తతః
జిజీవిషవ ఉత్సృజ్య పలాయనపరా యయుః

కొందరికి జుట్టుముడులూ ఊడిపోయాయి, కొందరి వస్త్రాలు జారిపోయాయి.

కేచిత్ప్రాఞ్జలయో దీనా న్యస్తశస్త్రా దివౌకసః
ముక్తకచ్ఛశిఖాః కేచిద్భీతాః స్మ ఇతి వాదినః

న త్వం విస్మృతశస్త్రాస్త్రాన్విరథాన్భయసంవృతాన్
హంస్యన్యాసక్తవిముఖాన్భగ్నచాపానయుధ్యతః

కిం క్షేమశూరైర్విబుధైరసంయుగవికత్థనైః
రహోజుషా కిం హరిణా శమ్భునా వా వనౌకసా
కిమిన్ద్రేణాల్పవీర్యేణ బ్రహ్మణా వా తపస్యతా

శస్త్రాస్త్రాలు వారెపూడో మరచిపోయారు. నీవు అలా అస్త్రాలు మరచిపోయినవాళ్ళనూ భయపడిన వాళ్ళను చంపవు.అందు వలన వారు అలా పారిపోతున్నారు. దేవతలంతా క్షేమ శూర్యులు (ఇంటిలోనే శూరులు). యుద్ధములో మాత్రం గొప్పలు చెప్పకుంటారు.

తథాపి దేవాః సాపత్న్యాన్నోపేక్ష్యా ఇతి మన్మహే
తతస్తన్మూలఖననే నియుఙ్క్ష్వాస్మాననువ్రతాన్

యథామయోऽఙ్గే సముపేక్షితో నృభిర్న శక్యతే రూఢపదశ్చికిత్సితుమ్
యథేన్ద్రియగ్రామ ఉపేక్షితస్తథా రిపుర్మహాన్బద్ధబలో న చాల్యతే

మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః
తస్య చ బ్రహ్మగోవిప్రాస్తపో యజ్ఞాః సదక్షిణాః

తస్మాత్సర్వాత్మనా రాజన్బ్రాహ్మణాన్బ్రహ్మవాదినః
తపస్వినో యజ్ఞశీలాన్గాశ్చ హన్మో హవిర్దుఘాః

విప్రా గావశ్చ వేదాశ్చ తపః సత్యం దమః శమః
శ్రద్ధా దయా తితిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః

స హి సర్వసురాధ్యక్షో హ్యసురద్విడ్గుహాశయః
తన్మూలా దేవతాః సర్వాః సేశ్వరాః సచతుర్ముఖాః
అయం వై తద్వధోపాయో యదృషీణాం విహింసనమ్

ఇంద్రుడు అల్పవీర్యుడు, విష్ణువు ఎక్కడో దాక్కుని ఉంటాడు, శంకరుడు ఎక్కడో అడవిలో ఉంటాడు, బ్రహ్మ ఎపుడూ తపస్సు చేస్తూ ఉంటాడు. వారి వలన నీకేమి భయం. ఐనా వారు మనకు శత్రువులు కాబట్టి వారిని ఉపేక్షించరాదు. వారందరూ కొమ్మలు, వారికి ఉన్న మూలాన్ని మనం నరకవేయాలి. వ్యాధి మొదలు కాగానే తొలగించాలి, ముదిరినపుడు కాదు. ఉపేక్షిస్తే ఇంద్రియములు మన చెప్పు చేతల్లో ఉండవు. అలాగే శత్రువును ఉపేక్షిస్తే మన చెప్పు చేతల్లో ఉండరు.  దేవతలకు మూలం విష్ణువు, ఆయన ధర్మమెక్కడ ఉంటే అక్కడ  ఉంటాడు. దానికి గుర్తులు బ్రాహ్మణులూ గోవులూ తపస్సులూ దక్షిణలతో కూడిన యజ్ఞ్యములు. వేదం చదివే బ్రాహ్మణులనూ హింసించి యజ్ఞ్యాలను విఘ్నం చేస్తాము. పరమాత్మ యొక్క శరీరమే ఈ విప్రులూ గోవులూ తపస్సు యజ్ఞ్యములూ సత్యం దమం శ్రద్ధా శమం ఓర్పు దయ. వీటిని లేకుండా చేస్తాము. వాడు మొత్తం దేవతలకు అధ్యక్షుడు, మనని ద్వేషిస్తాడు. పట్టుకోవడానికి దొరకడు. ఎక్కడో ఉంటాడు. వాడితోనే వీరందరూ ఉంటారు. ఋషులనూ బ్రాహ్మణులనూ గోవులనూ యజ్ఞ్యములనూ హింసిస్తే వాడూ ఉండడు.

శ్రీశుక ఉవాచ
ఏవం దుర్మన్త్రిభిః కంసః సహ సమ్మన్త్ర్య దుర్మతిః
బ్రహ్మహింసాం హితం మేనే కాలపాశావృతోऽసురః

దుష్టమంత్రులచేత ఆలోచించబడి కాలపాశం చుట్టబడి ఉన్నవాడై బ్రాహ్మణులను హింసించుటే మేలు అని భావించాడు. యుద్ధం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూచే రాక్షసులను మీరు బ్రాహ్మణుల మీదకు వెళ్ళండి అని కామ రూపులైన ఆరాక్షసులను పంపించి తాను ఇల్లు చేరాడు

సన్దిశ్య సాధులోకస్య కదనే కదనప్రియాన్
కామరూపధరాన్దిక్షు దానవాన్గృహమావిశత్

తే వై రజఃప్రకృతయస్తమసా మూఢచేతసః
సతాం విద్వేషమాచేరురారాదాగతమృత్యవః

చావు మూడిన వాడై రజః ప్రకృతులూ మూడ తములు సజ్జనులకు ద్రోహం చేసారు

ఆయుః శ్రియం యశో ధర్మం లోకానాశిష ఏవ చ
హన్తి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః

మానవుడు గొప్పవారికి అపచారం చేస్తే మహానుభావులను అతిక్రమిస్తే ఆయుష్యమూ సంపదా కీర్తీ సంపదా లోకములూ ధర్మమూ నశిస్తాయి. 

                                                         సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు