Sunday, September 29, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                                     ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

సూత ఉవాచ
సంస్తుతో భగవానిత్థం మార్కణ్డేయేన ధీమతా
నారాయణో నరసఖః ప్రీత ఆహ భృగూద్వహమ్

ఇలా స్తోత్రం చేయబడిన పరమాత్మ సంతోషించి

శ్రీభగవానువాచ
భో భో బ్రహ్మర్షివర్యోऽసి సిద్ధ ఆత్మసమాధినా
మయి భక్త్యానపాయిన్యా తపఃస్వాధ్యాయసంయమైః

మహానుభావా నీవు ఆత్మ సమాధి స్థితిఓ సిద్ధుడవయ్యావు
నా యందు భక్తితో, తపస్వాధ్యాయ ఇంద్రియ నిగ్రహాదులతో నీవు సాధించావు

వయం తే పరితుష్టాః స్మ త్వద్బృహద్వ్రతచర్యయా
వరం ప్రతీచ్ఛ భద్రం తే వరదోऽస్మి త్వదీప్సితమ్

మేము సంతోషించాము నీ బ్రహ్మ చర్య వ్రతముతో
వరాన్ని కోరుకో నీకు శుభం కలుగుతుంది. వరములిచ్చేవారందరికీ నేనే అధిపతిని (కంచి వరదరాజస్వామి)

శ్రీఋషిరువాచ
జితం తే దేవదేవేశ ప్రపన్నార్తిహరాచ్యుత
వరేణైతావతాలం నో యద్భవాన్సమదృశ్యత

ఇంకా నాకు వరములెందుకు. దేవ దేవా నీవు ఆశ్రయించిన వారి బాధలను తొలగిస్తావు
నీవు నాకు ఇచ్చిన ఈ వరము చాలు. నీ సాక్షాత్కారమే చాలు.

గృహీత్వాజాదయో యస్య శ్రీమత్పాదాబ్జదర్శనమ్
మనసా యోగపక్వేన స భవాన్మేऽక్షిగోచరః

బ్రహ్మాది దేవతలు కూడా యోగముతో నీ పాద పద్మాలను దర్శించాలని ఎంతో తపిస్తూ ఉంటారు
అలాంటి మీరు నా కన్నులకు కనపడ్డారు

అథాప్యమ్బుజపత్రాక్ష పుణ్యశ్లోకశిఖామణే
ద్రక్ష్యే మాయాం యయా లోకః సపాలో వేద సద్భిదామ్

నాకు ఒక్కసారి నీ మాయను చూడాలని ఉంది. లోకములూ లోకపాలకులూ పోతున్నారూ వస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందో చూడాలని ఉంది అని అడుగగా

సూత ఉవాచ
ఇతీడితోऽర్చితః కామమృషిణా భగవాన్మునే
తథేతి స స్మయన్ప్రాగాద్బదర్యాశ్రమమీశ్వరః

అది విని భగవానుడు అలాగే అని బదరికాశ్రమానికి వెళ్ళారు

తమేవ చిన్తయన్నర్థమృషిః స్వాశ్రమ ఏవ సః
వసన్నగ్న్యర్కసోమామ్బు భూవాయువియదాత్మసు

పంచభూతాలనూ వాటి స్వరూపాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ
తాను పరమాత్మను కోరిన వరాన్ని గురించి ఆలోచిస్తూ కొన్నాళ్ళు కాలం గడిపాడు

ధ్యాయన్సర్వత్ర చ హరిం భావద్రవ్యైరపూజయత్
క్వచిత్పూజాం విసస్మార ప్రేమప్రసరసమ్ప్లుతః

పరమాత్మను చూచినందు వలన నిరంతరం ఆ రూపమే కళ్ళముందు కదలాడుతూ
ఆ ప్రేమా ఆ ఆకారమూ తలచుకున్నప్పుడల్లా కళ్ళూ చెమ్మగిలూతూ, సంధ్యావందనం మరచిపోయాడు పూజా స్నానం మరచిపోయాడు

తస్యైకదా భృగుశ్రేష్ఠ పుష్పభద్రాతటే మునేః
ఉపాసీనస్య సన్ధ్యాయాం బ్రహ్మన్వాయురభూన్మహాన్

ఇలా ఉండగా, ఈ ముని పుషభద్రా నదీ తీరములో సంధ్యావందనం చేస్తూ ఉండగా పెద్ద వాయువు వచ్చింది మహాప్రళయముగా

తం చణ్డశబ్దం సముదీరయన్తం బలాహకా అన్వభవన్కరాలాః
అక్షస్థవిష్ఠా ముముచుస్తడిద్భిః స్వనన్త ఉచ్చైరభి వర్షధారాః

దాని వెంటనే పెద్ద పెద్ద మేఘాలూ వచ్చాయి
మెరుపులతో కనులూ అన్ని ఇంద్రియాలూ మిరుమిట్లు గొలిపాయి.
ఉరుముతూ మెరుస్తూ గాలితో బ్రహ్మాండమైన వర్షం కురిసింది

తతో వ్యదృశ్యన్త చతుః సముద్రాః సమన్తతః క్ష్మాతలమాగ్రసన్తః
సమీరవేగోర్మిభిరుగ్రనక్ర మహాభయావర్తగభీరఘోషాః

ఈ ఆశ్రమములోకే నాలుగు సముద్రాలూ వచ్చాయి.
మొత్తం భూమండలాన్ని మింగివేస్తున్నాయి
వాయు వేగముతో తరంగాలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి

అన్తర్బహిశ్చాద్భిరతిద్యుభిః ఖరైః
శతహ్రదాభిరుపతాపితం జగత్
చతుర్విధం వీక్ష్య సహాత్మనా మునిర్
జలాప్లుతాం క్ష్మాం విమనాః సమత్రసత్

ముసళ్ళూ తిమింగలాలతో సుడిగుండాలతో లోపలా వెలుపలా ఎక్కడ చూచినా నీరే
మెరుపులే మేఘాలే
జగత్తు మొత్తం మెరుపులతో ఉరుములతో వణికిపోయింది
ఎక్కడ చూసినా నాలుగు దిక్కులా నీరే. మార్కండేయుని మనసు ఖేధబడి కొద్దిగా భయపడ్డాడు

తస్యైవముద్వీక్షత ఊర్మిభీషణః ప్రభఞ్జనాఘూర్ణితవార్మహార్ణవః
ఆపూర్యమాణో వరషద్భిరమ్బుదైః క్ష్మామప్యధాద్ద్వీపవర్షాద్రిభిః సమమ్

ఇలా ఉండగానే నీరు అంతటా వ్యాపించి ఎత్తూ వంపూ ఏమీ లేకుండా మొత్తం నీటితో సమానమైపోయినిద్

సక్ష్మాన్తరిక్షం సదివం సభాగణం
త్రైలోక్యమాసీత్సహ దిగ్భిరాప్లుతమ్
స ఏక ఏవోర్వరితో మహామునిర్
బభ్రామ విక్షిప్య జటా జడాన్ధవత్

ఆకాశమూ భూమీ స్వర్గమూ నక్షత్రాలూ  మూడు లోకాలూ దిగ్గజాలూ
అంతా జలమే.
ఈ మహాప్రళయముతో భయపడిన మార్కండేయుడు తన జటలను విప్పి అందులో సంచరిస్తున్నాడు ఏమీ గానక.

క్షుత్తృట్పరీతో మకరైస్తిమిఙ్గిలైర్
ఉపద్రుతో వీచినభస్వతాహతః
తమస్యపారే పతితో భ్రమన్దిశో
న వేద ఖం గాం చ పరిశ్రమేషితః

ఆకలీ దప్పీ వేస్తున్నాయి
ముసళ్ళూ తిమింగలాలూ మీదకు వస్తున్నాయి మింగడానికి
పక్కకు పోతే తరంగాలూ వాయువు
ఇంకో దిక్కుకు వెళితే ఉరుములూ మెరుపులూ వస్తున్నాయి
మొత్తం కటిక చీకటి
భూమి ఎక్కడ ఉందో
ఆకాశస్మ్ ఎక్కడ ఉందో తాను ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు

క్రచిన్మగ్నో మహావర్తే తరలైస్తాడితః క్వచిత్
యాదోభిర్భక్ష్యతే క్వాపి స్వయమన్యోన్యఘాతిభిః

ఇలా వెళ్ళి వెళ్ళి తరంగాలచేత కొట్టబడి ఒక పెద్ద సుడిగుండం లోపలకు వెళ్ళాడు
అక్కడ పెద చేపలు చిన చేపలను తింటూ ఉన్నాయి

క్వచిచ్ఛోకం క్వచిన్మోహం క్వచిద్దుఃఖం సుఖం భయమ్
క్వచిన్మృత్యుమవాప్నోతి వ్యాధ్యాదిభిరుతార్దితః

ఒక చోట మోహం ఒక చోట శోకమూ భయమూ దుఃఖమూ మృత్యువూ
కొందరు వ్యాధులతో చస్తున్నారు, కొందరు దుఃఖిస్తున్నారు
కొందరికి జ్వరాలు వస్తున్నాయి. కొందరు ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు,
కొందరు చస్తున్నారు కొందరు పుడుతున్నారు

అయుతాయతవర్షాణాం సహస్రాణి శతాని చ
వ్యతీయుర్భ్రమతస్తస్మిన్విష్ణుమాయావృతాత్మనః

ఇలా మొత్తం ఒక పది లక్షల సంవత్సరాలు తిరిగుతూనే ఉన్నాడు భగవంతుని మాయతో

స కదాచిద్భ్రమంస్తస్మిన్పృథివ్యాః కకుది ద్విజః
న్యాగ్రోధపోతం దదృశే ఫలపల్లవశోభితమ్

ఇలా తిరుగుతూ ఉండగా ఒక గడ్డ కనపడింది. దాని మీద ఒక చిన్న మఱ్ఱి చెట్టు కనపడింది
దానికి మఱ్ఱి కాయలూ పళ్ళూ చిగురుటాకులూ ఆకులూ అన్నీ ఉన్నాయి

ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుమ్
శయానం పర్ణపుటకే గ్రసన్తం ప్రభయా తమః

ఆ చెట్టుకు ఈశాన్య శాఖ యందు ఒక చిన్న పిల్లవాడిని చూచాడు
మఱ్ఱి ఆకు యొక్క పుట భాగం యందు పడుకుని తన కాంతితో మొత్తం చీకటిని మింగివేస్తున్నాడు

మహామరకతశ్యామం శ్రీమద్వదనపఙ్కజమ్
కమ్బుగ్రీవం మహోరస్కం సునసం సున్దరభ్రువమ్

శ్వాసైజదలకాభాతం కమ్బుశ్రీకర్ణదాడిమమ్
విద్రుమాధరభాసేషచ్ ఛోణాయితసుధాస్మితమ్

పద్మగర్భారుణాపాఙ్గం హృద్యహాసావలోకనమ్
శ్వాసైజద్వలిసంవిగ్న నిమ్ననాభిదలోదరమ్

పగడం వంటి పెదవుల కాంతి పళ్ళ మీద పడి చిరునవ్వు ఎర్రగా ప్రకాశిస్తోంది.
ఆయన నవ్వూ చూపూ హృద్యముగా ఉన్నాయి

చార్వఙ్గులిభ్యాం పాణిభ్యామున్నీయ చరణామ్బుజమ్
ముఖే నిధాయ విప్రేన్ద్రో ధయన్తం వీక్ష్య విస్మితః

ఆ స్వామి పరమ సుకుమారమైన తన వేళ్ళతో తన పాదపద్మాన్ని తీసుకుని నోటిలో పెట్టుక్ని బొటన వేలుని ఆస్వాదిస్తున్నాడు
ఆ స్వామిని చూచి మార్కండేయుడు ఆశ్చర్యపోయి

తద్దర్శనాద్వీతపరిశ్రమో ముదా ప్రోత్ఫుల్లహృత్పౌల్మవిలోచనామ్బుజః
ప్రహృష్టరోమాద్భుతభావశఙ్కితః ప్రష్టుం పురస్తం ప్రససార బాలకమ్

మొత్తం అలసట పోయింది
సంతోషముతో హృదయమూ కనులూ వికసించాయి.
ఇంత చిన్న చెట్టుకు,ఇంత చిన్న ఆకు మీద చిన్న పిల్లవాడా, ఆయనకు ఈ ఆభరణాలా

తావచ్ఛిశోర్వై శ్వసితేన భార్గవః
సోऽన్తః శరీరం మశకో యథావిశత్
తత్రాప్యదో న్యస్తమచష్ట కృత్స్నశో
యథా పురాముహ్యదతీవ విస్మితః

ఈ పిల్లవాడెవరు అని అడుగుదామని దగ్గరకు వెళ్ళగా
ఆ పిల్లవాడు ఉచ్చ్వాస తీసుకున్నాడు
వెంటనే గాలి పీల్చుకుంటే దోమ నోటిలోకి వెళ్ళినట్లుగా పరమాత్మ గాలి పీల్చుకోగానే మార్కండేయుడు లోపలకు వెళ్ళాడు
అక్కడకు వెళ్ళగా తాను అంతకు ముందు వేటి  వేటిని చూచాడో, మునిగిపోయినవీ, కనపడకుండా పోయినవి నశించనివీ నశించినవీ చూచి ఆశ్చర్యపోయాడు

ఖం రోదసీ భాగణానద్రిసాగరాన్ద్వీపాన్సవర్షాన్కకుభః సురాసురాన్
వనాని దేశాన్సరితః పురాకరాన్ఖేటాన్వ్రజానాశ్రమవర్ణవృత్తయః

ఆకాశమూ దిక్కులూ అంతరిక్షమూ భూమీ స్వర్గమూ నక్షత్రాలూ సముద్రాలూ ద్వీపములూ పర్వతాలూ నదులూ దిక్కులూ దేవతలూ రాక్షసులూ అడవులూ దేశములూ పురములూ వ్ర్జములూ పల్లెలూ పట్టణములూ ఆశ్రమాలూ మహాభూతాలూ కాలమూ

మహాన్తి భూతాన్యథ భౌతికాన్యసౌ కాలం చ నానాయుగకల్పకల్పనమ్
యత్కిఞ్చిదన్యద్వ్యవహారకారణం దదర్శ విశ్వం సదివావభాసితమ్

మనం ప్రపంచములో వేటి వేటిని వ్యవహరిస్తామో అది మొత్తం ఉన్నట్టే కనపడింది
అది చూచి

హిమాలయం పుష్పవహాం చ తాం నదీం నిజాశ్రమం యత్ర ఋషీ అపశ్యత
విశ్వం విపశ్యఞ్ఛ్వసితాచ్ఛిశోర్వై బహిర్నిరస్తో న్యపతల్లయాబ్ధౌ

అందులో హిమాలయాన్నీ, తను ఉన్న నదీ తన ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న ఋషులనూ చూచాడు
అవి అన్నీ చూచి ఆశ్చర్యముతో ఇదేమిటా అనుకుంటూ ఉంటే స్వామి మళ్ళీ శ్వాస తీయగా బయటకు వచ్చి ప్రళయ సాగరములో పడ్డాడు

తస్మిన్పృథివ్యాః కకుది ప్రరూఢం వటం చ తత్పర్ణపుటే శయానమ్
తోకం చ తత్ప్రేమసుధాస్మితేన నిరీక్షితోऽపాఙ్గనిరీక్షణేన

మళ్ళీ బయటకు వచ్చి చెట్టూ ఆకూ పిల్లవాడు ఆయన నవ్వునీ చూచాడు
ఈయనను ఆ పిల్లవాడు (స్వామి) చూచాడు

అథ తం బాలకం వీక్ష్య నేత్రాభ్యాం ధిష్ఠితం హృది
అభ్యయాదతిసఙ్క్లిష్టః పరిష్వక్తుమధోక్షజమ్

పిల్లవాడు ముద్దుగా ఉండడముతో కౌగిలించుకుందామని దగ్గరకు వచ్చాడు

తావత్స భగవాన్సాక్షాద్యోగాధీశో గుహాశయః
అన్తర్దధ ఋషేః సద్యో యథేహానీశనిర్మితా

అంతలోనే స్వామి అంతర్ధానమయ్యాడు
సామర్ధ్యం లేని వారు పెంచుకున్న ఆశలాగ అంతర్ధానమయ్యాడు పరమాత్మ

తమన్వథ వటో బ్రహ్మన్సలిలం లోకసమ్ప్లవః
తిరోధాయి క్షణాదస్య స్వాశ్రమే పూర్వవత్స్థితః

పరమాత్మ అంతర్ధానమవ్వగానే సముద్రమూ తుఫానూ గాలీ భూతాలూ ఏదీ లేక మళ్ళీ తాను తన ఆశ్రమ నదీ తీరములో సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment