Sunday, September 1, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదహారవ అధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదహారవ అధ్యాయం    

శ్రీభగవానువాచ
ఏవమేతదహం పృష్టః ప్రశ్నం ప్రశ్నవిదాం వర
యుయుత్సునా వినశనే సపత్నైరర్జునేన వై

ఉద్ధవా, ఈ ప్రశ్నే కురుక్షేత్ర సంగ్రామములో అర్జనుడు అడిగినపుడు నేను వివరించాను.

జ్ఞాత్వా జ్ఞాతివధం గర్హ్యమధర్మం రాజ్యహేతుకమ్
తతో నివృత్తో హన్తాహం హతోऽయమితి లౌకికః

రాజ్యం కోసం బధు వధ అధర్మం అని అనుకుని, నేనే చంపేవాడినీ, వీడు చచ్చేవాడు అన్న లౌకికమైన భ్రమలో పడి యుద్ధం చేయడం మాని వేస్తే నేను ఈ యుక్తితోనే అతన్ని మేలుకొలిపాను.

స తదా పురుషవ్యాఘ్రో యుక్త్యా మే ప్రతిబోధితః
అభ్యభాషత మామేవం యథా త్వం రణమూర్ధని

నీవు అడిగినట్లుగానే అర్జనుడు కూడా ఆనాడు యుద్ధములో అడిగాడు.

అహమాత్మోద్ధవామీషాం భూతానాం సుహృదీశ్వరః
అహం సర్వాణి భూతాని తేషాం స్థిత్యుద్భవాప్యయః

ఉద్ధవా, ఈ సకల ప్రాణూలకూ భూతములకూ నేనే ఆత్మనూ, సుహృత్ (ఎదుటివాడి నుండి ఉపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసేవాడిని సుహృత్ అంటారు). నేనే ఈశ్వరున్ని. అన్ని ప్రాణులూ వాటి పుట్టుకా రక్షణా ప్రళయం నేనే

అహం గతిర్గతిమతాం కాలః కలయతామహమ్
గునాణాం చాప్యహం సామ్యం గుణిన్యౌత్పత్తికో గుణః

గతి ఉన్నవారందరిలో నేనే గతిని. అన్నిటినీ కలిపేవాటికి నేనే కాలాన్ని. నేనే సామ్యగుణాన్ని. సృష్టి కలిగించే గుణాన్ని

గుణినామప్యహం సూత్రం మహతాం చ మహానహమ్
సూక్ష్మాణామప్యహం జీవో దుర్జయానామహం మనః

నేను ప్రథాన సూత్రాన్ని.సూక్ష్మాలన్నిటిలో నేనే జీవుడిని. జయింపరాని వాటిలో నేను మనసును

హిరణ్యగర్భో వేదానాం మన్త్రాణాం ప్రణవస్త్రివృత్
అక్షరాణామకారోऽస్మి పదాని చ్ఛన్దుసామహమ్

వేదాలలో హిరణ్య గర్భున్ని, మంత్రాలలో ఓంకారాన్ని
అక్షరములలో అకారాన్ని చందస్సులలో పదాన్ని

ఇన్ద్రోऽహం సర్వదేవానాం వసూనామస్మి హవ్యవాట్
ఆదిత్యానామహం విష్ణూ రుద్రాణాం నీలలోహితః

సకల దేవతలలో ఇంద్రున్ని, వసువులలో హవ్యవాహనున్ని
ఆదిత్యులలో విష్ణువునూ రుద్రులలో నీలలోహితున్ని

బ్రహ్మర్షీణాం భృగురహం రాజర్షీణామహం మనుః
దేవర్షీణాం నారదోऽహం హవిర్ధాన్యస్మి ధేనుషు

బ్రహ్మృషులలో భృగువునూ రాజఋషులలో మనువునూ
దేవఋషులలో నారదున్న్ని ఆవులలో కామధేనువునూ

సిద్ధేశ్వరాణాం కపిలః సుపర్ణోऽహం పతత్రిణామ్
ప్రజాపతీనాం దక్షోऽహం పితౄణామహమర్యమా

సిద్ధులలో కపిలున్ని, పక్షులలో గరుడుడినీ
ప్రజాపతులలో దక్షున్ని, పితృ దేవతలలో నేను అర్యమను

మాం విద్ధ్యుద్ధవ దైత్యానాం ప్రహ్లాదమసురేశ్వరమ్
సోమం నక్షత్రౌషధీనాం ధనేశం యక్షరక్షసామ్

దైత్యులలో ప్రహ్లాదున్ని, నక్షత్రములూ ఔషధులలో చంద్రున్ని
యక్ష రక్షసుల్లో కుబేరున్ని

ఐరావతం గజేన్ద్రాణాం యాదసాం వరుణం ప్రభుమ్
తపతాం ద్యుమతాం సూర్యం మనుష్యాణాం చ భూపతిమ్

ఏనుగులలో ఐరావతాన్ని,
మానవులలో నేను రాజును

ఉచ్చైఃశ్రవాస్తురఙ్గాణాం ధాతూనామస్మి కాఞ్చనమ్
యమః సంయమతాం చాహమ్సర్పాణామస్మి వాసుకిః

గుఱ్ఱాలలో ఉచ్చైశ్రవాన్ని, అన్ని లోహాలలో కాంచనాన్ని
సర్పాలలో వాసుకిని

నాగేన్ద్రాణామనన్తోऽహం మృగేన్ద్రః శృఙ్గిదంష్ట్రిణామ్
ఆశ్రమాణామహం తుర్యో వర్ణానాం ప్రథమోऽనఘ

మృగాలలో సింహాన్ని
ఆశ్రమాలలో సన్యాసాన్ని
వర్ణములలో బ్రాహ్మణున్ని

తీర్థానాం స్రోతసాం గఙ్గా సముద్రః సరసామహమ్
ఆయుధానాం ధనురహం త్రిపురఘ్నో ధనుష్మతామ్

తీర్థాలలో గంగనూ
సరస్సులలో సముద్రాన్ని
ధనుర్ధారులలో నేను శంకరున్ని

ధిష్ణ్యానామస్మ్యహం మేరుర్గహనానాం హిమాలయః
వనస్పతీనామశ్వత్థ ఓషధీనామహం యవః

నేను మేరుపర్వతాన్ని, గహనాలలో హిమాలయాన్ని
అన్ని వనస్పతులలో అశ్వద్ధాన్ని, ఔషధులలో నేను యవమును

పురోధసాం వసిష్ఠోऽహం బ్రహ్మిష్ఠానాం బృహస్పతిః
స్కన్దోऽహం సర్వసేనాన్యామగ్రణ్యాం భగవానజః

పురోహితులలో వషిష్ఠున్ని
కుమారస్వామిని, నేనే బ్రహ్మను

యజ్ఞానాం బ్రహ్మయజ్ఞోऽహం వ్రతానామవిహింసనమ్
వాయ్వగ్న్యర్కామ్బువాగాత్మా శుచీనామప్యహం శుచిః

యజ్ఞ్యములలో బ్రహ్మ యజ్ఞ్యాన్ని.
వ్రతములలో అహింసా వ్రతాన్ని
నేనే పంచ భూత స్వరూపున్ని, పవిత్రులలో నేనే పవిత్రున్ని

యోగానామాత్మసంరోధో మన్త్రోऽస్మి విజిగీషతామ్
ఆన్వీక్షికీ కౌశలానాం వికల్పః ఖ్యాతివాదినామ్

మనో నిరోధమనే యోగాన్ని
అన్ని కౌశల్యాలలో అన్వీక్షకినీ
ఖ్యాతిని పొగిడేవారికి కాదనే వాడినీ

స్త్రీణాం తు శతరూపాహం పుంసాం స్వాయమ్భువో మనుః
నారాయణో మునీనాం చ కుమారో బ్రహ్మచారిణామ్

స్త్రీలలో శతరూపను, పురుషూలో స్వాయంభువ మనువును
మునులలో నారాయణున్ని బ్రహ్మచారులలో సనత్కుమారున్ని

ధర్మాణామస్మి సన్న్యాసః క్షేమాణామబహిర్మతిః
గుహ్యానాం సునృతం మౌనం మిథునానామజస్త్వహమ్

అన్ని ధర్మాలలో నేను సన్యాసిని
అన్ని రహస్యాలలో నేను మౌనాన్ని

సంవత్సరోऽస్మ్యనిమిషామృతూనాం మధుమాధవౌ
మాసానాం మార్గశీర్షోऽహం నక్షత్రాణాం తథాభిజిత్

ఋతువులలో వసంత ఋతువునూ
మాసాలలో మార్గశీర్షమును
నక్షత్రాలలో అభిజిత్తును

అహం యుగానాం చ కృతం ధీరాణాం దేవలోऽసితః
ద్వైపాయనోऽస్మి వ్యాసానాం కవీనాం కావ్య ఆత్మవాన్

యుగాలలో కృతమును
వ్యాసులలో ద్వైపాయనున్ని

వాసుదేవో భగవతాం త్వం తు భాగవతేష్వహమ్
కిమ్పురుషానాం హనుమాన్విద్యాధ్రాణాం సుదర్శనః

భాగవతులలో నీవే నేను
కింపురుషులలో హనుమంతున్ని

రత్నానాం పద్మరాగోऽస్మి పద్మకోశః సుపేశసామ్
కుశోऽస్మి దర్భజాతీనాం గవ్యమాజ్యం హవిఃష్వహమ్

దర్భలలో కుశమును. అన్ని హవిస్సులలో గో హృతాన్ని

వ్యవసాయినామహం లక్ష్మీః కితవానాం ఛలగ్రహః
తితిక్షాస్మి తితిక్షూణాం సత్త్వం సత్త్వవతామహమ్

ప్రయత్న శీలురకు నేనే లక్ష్మినీ
జ్యూతం ఆడేవారిలో పందాన్ని నేనే
క్షమావతుల క్షమను నేనే

ఓజః సహో బలవతాం కర్మాహం విద్ధి సాత్వతామ్
సాత్వతాం నవమూర్తీనామాదిమూర్తిరహం పరా

నేనే బలవతుల యొక్క కర్మను
తొమ్మిది మూర్తులలో మొదటి వాడిని నేనే

విశ్వావసుః పూర్వచిత్తిర్గన్ధర్వాప్సరసామహమ్
భూధరాణామహం స్థైర్యం గన్ధమాత్రమహం భువః

పర్వతాలలో స్థైర్యాన్ని
భూమిలో గంధాన్ని

అపాం రసశ్చ పరమస్తేజిష్ఠానాం విభావసుః
ప్రభా సూర్యేన్దుతారాణాం శబ్దోऽహం నభసః పరః

సూర్య చంద్ర నక్షత్రాలకు కాంతిని
ఆకాశానికి నేనే శబ్ధాన్ని

బ్రహ్మణ్యానాం బలిరహం వీరాణామహమర్జునః
భూతానాం స్థితిరుత్పత్తిరహం వై ప్రతిసఙ్క్రమః

గత్యుక్త్యుత్సర్గోపాదానమానన్దస్పర్శలక్షనమ్
ఆస్వాదశ్రుత్యవఘ్రాణమహం సర్వేన్ద్రియేన్ద్రియమ్

పంచ భూతములూ మహత్ తత్వములూ నేనే

పృథివీ వాయురాకాశ ఆపో జ్యోతిరహం మహాన్
వికారః పురుషోऽవ్యక్తం రజః సత్త్వం తమః పరమ్
అహమేతత్ప్రసఙ్ఖ్యానం జ్ఞానం తత్త్వవినిశ్చయః

మయేశ్వరేణ జీవేన గుణేన గుణినా వినా
సర్వాత్మనాపి సర్వేణ న భావో విద్యతే క్వచిత్

జ్ఞ్యానం తత్వ విజ్ఞ్యానం నేనే
నేను లేకుండా గుణ రూపములో గానీ గుణి రూపములో గానీ ఈశ్వర రూపములో గానీ జీవ రూపములో గానీ, నేను లేని ఏ భావమూ ఎక్కడా లేదు

సఙ్ఖ్యానం పరమాణూనాం కాలేన క్రియతే మయా
న తథా మే విభూతీనాం సృజతోऽణ్డాని కోటిశః

పరమాణువు యొక్క లెక్కను ఐనా లెక్క పెట్ట వచ్చు గానీ అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించే నా విభూతిని ఎవరూ లెక్క పెట్టజాలరు

తేజః శ్రీః కీర్తిరైశ్వర్యం హ్రీస్త్యాగః సౌభగం భగః
వీర్యం తితిక్షా విజ్ఞానం యత్ర యత్ర స మేऽంశకః

ఇవన్నీ ఎక్కడ ఎక్కడ ఉంటాయో అవి అన్ని నా అంశే

ఏతాస్తే కీర్తితాః సర్వాః సఙ్క్షేపేణ విభూతయః
మనోవికారా ఏవైతే యథా వాచాభిధీయతే

సంక్షేపముగా నా ఈ అన్ని విభూతులూ చెప్పాను
ఇవన్నీ మనసు యొక్క వికారముచే అనేకముగా కనపడే ఒకటే ఐన నా రూపం

వాచం యచ్ఛ మనో యచ్ఛ ప్రాణాన్యచ్ఛేద్రియాణి చ
ఆత్మానమాత్మనా యచ్ఛ న భూయః కల్పసేऽధ్వనే

రోజూ చదువుకోవలసిన శ్లోకం ఇది, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే
వాక్కును  నియమించుకోవాలి మనసును నియమించుకోవాలి ప్రాణాన్ని నియమించుకోవాలి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. పరమాత్మతో ఈ ఆత్మను నిగ్రహించుకుంటే మళ్ళీ పుట్టవు.

నోటిని అదుపులో పెట్టడం ప్రారంభించాలి. దాని వెనక మనసూ ప్రాణమూ ఇంద్రియమూ వస్తాయి.

యో వై వాఙ్మనసీ సంయగసంయచ్ఛన్ధియా యతిః
తస్య వ్రతం తపో దానం స్రవత్యామఘటామ్బువత్

వాక్కునూ మనసునూ బుద్ధితో నిగ్రహించకుండా ఆచరించే వ్రతమూ దానమూ మనసూ, పచ్చి కుండలో నీరు పోసిన దానితో సమానం. కాలని పచ్చి కుండలో నీటిని తెచ్చి పోస్తే ఎలా కరిగిపోతాయో బుద్ధితో వాక్కు మనసునూ నియమించకుండా ఆచరించే వ్ర్తమూ దానమూ తపస్సూ, ఇవన్నీ కాలనికుండలో నీరు లాగ కారిపోతాయి

తస్మాద్వచో మనః ప్రాణాన్నియచ్ఛేన్మత్పరాయణః
మద్భక్తియుక్తయా బుద్ధ్యా తతః పరిసమాప్యతే

మనసునూ వాక్కునూ ప్రాణమునూ నాయందే ఉంచి నియమించాలి. నా భక్తితో కూడి ఉన్న బుద్ధితో నన్నే ధ్యానిస్తూ ఈ మూడింటినీ నియమిస్తే అన్నీ ముగుస్తాయి


                                                       సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                       సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment