Monday, September 23, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం

                                      ఓం నమో భగవతే    వాసుదేవాయ                                                      

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం

శ్రీభగవానువాచ
పరస్వభావకర్మాణి న ప్రశంసేన్న గర్హయేత్
విశ్వమేకామకం పశ్యన్ప్రకృత్యా పురుషేణ చ

పరమాత్మ యందు ఇంత దృఢమైన భక్తి భావం, సంసారం యందు ఆసక్తి లేకుండుటా ఎలా వస్తుందంటే, ఇతరుల స్వభావములను గానీ, ఇతరులు చేసే పనులను గానీ పొగడాకూడదు, తెగడాకూడదు. ప్రశంస చేసినా అది క్రమముగా అసూయను కలగచేస్తుంది. ప్రపంచమంతా ఏకాత్మకం అని తెలుసుకుంటే దేన్ని పొగడాలీ దేన్ని నిందించాలి

పరస్వభావకర్మాణి యః ప్రశంసతి నిన్దతి
స ఆశు భ్రశ్యతే స్వార్థాదసత్యభినివేశతః

ఎవరు ఇతరుల స్వభావాలని ప్రశంసిస్తూ నిందిస్తూ ఉంటాడో, సత్యం కాని దాని యందు మనసు ఉంచిన వలన వాడు త్వరగా భ్రష్టుడవుతాడు

తైజసే నిద్రయాపన్నే పిణ్డస్థో నష్టచేతనః
మాయాం ప్రాప్నోతి మృత్యుం వా తద్వన్నానార్థదృక్పుమాన్

నూనెతో తయారు చేసిన వస్తువులు వాడకుండా కొంతకాలం ఉంచితే ఎలా పాడవుతాయో, అలా మాయను పొందుతాడు లేదా మృత్యువును పొందుతాడు. నూనె పదార్థాలను ఎక్కడో చేస్తే ఆ దరిదాపులలో ఉన్న మనకు ఎలా తెలుస్తుందో అలా ఉన్న చోట ఉండక పక్కవారి గుణాలనూ దోషాలనూ ఎంచుతాడు. వాడు అనర్థాన్నే కలిగించుకుంటున్నాడు

కిం భద్రం కిమభద్రం వా ద్వైతస్యావస్తునః కియత్
వాచోదితం తదనృతం మనసా ధ్యాతమేవ చ

ఏది శుభం, ఏది అశుభం. భేధభావం ఉన్నవాడికి ఏది శుభం ఏది అశుభం.
వాక్కుతో పలికిన అబద్దం కానీ, మనసుతో ధ్యానం చేసినది కానీ,

ఛాయాప్రత్యాహ్వయాభాసా హ్యసన్తోऽప్యర్థకారిణః
ఏవం దేహాదయో భావా యచ్ఛన్త్యామృత్యుతో భయమ్

నీడ లాగ అబద్దమైనది. లేని దాన్ని భాసిస్తుంది.
మరణం వరకూ ఈ శరీరం భయాన్నే కలిగిస్తుంది.
అందరూ చేసేవాటిని మనం చర్చిస్తే, వారు ఒక్కొక్కరూ ఒక్కో పపాం చేస్తే, వారందరూ కలసి చేసిన పాపాలన్నీ మనకే వస్తాయి.

ఆత్మైవ తదిదం విశ్వం సృజ్యతే సృజతి ప్రభుః
త్రాయతే త్రాతి విశ్వాత్మా హ్రియతే హరతీశ్వరః

పరమాత్మ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, ప్రపంచం సృష్టించబడుతుంది.
పరమాత్మ ప్రపంచాన్ని కాపాడతాడు, ప్రపంచం కాపాడబడుతుంది
పరమాత్మ ప్రపంచాన్ని హరిస్తాడు, పరపంచం హరించబడుతుంది.

తస్మాన్న హ్యాత్మనోऽన్యస్మాదన్యో భావో నిరూపితః
నిరూపితేऽయం త్రివిధా నిర్మూల భాతిరాత్మని
ఇదం గుణమయం విద్ధి త్రివిధం మాయయా కృతమ్

కాబట్టి ఆత్మ కన్న భిన్నమైన వేరే భావం ఏదీ లేదు
మనకు ఈ ఆభాసం నిర్మూలమే (దానికి ఒక ఆధారం లేదు) అని నిరూపించాను
ఇది గుణమయము, మాయతో చేయబడినది

ఏతద్విద్వాన్మదుదితం జ్ఞానవిజ్ఞాననైపుణమ్
న నిన్దతి న చ స్తౌతి లోకే చరతి సూర్యవత్

తెలిసినవాడు, నేను చెప్పిన ఈ భావాన్ని విని, నిందించడూ, స్తుతించడూ. సూర్యభగవానుడు సంచరిస్తూనే ఉంటాడు. పాపం చేసినా చూస్తాడు. పుణ్యం చేసినా చూస్తూ ఉంటాడు,
మనమూ అలాగే ఉండాలి. పట్టించుకోకూడదు

ప్రత్యక్షేణానుమానేన నిగమేనాత్మసంవిదా
ఆద్యన్తవదసజ్జ్ఞాత్వా నిఃసఙ్గో విచరేదిహ

కనపడేదంతా చూచేదంతా ఆది అంతములు కలదే. ఇదంతా లేనిదే అని తెలుసుకుని నిస్సంగుడై సంచరించాలి
ఇలా తెలుసుకోవడానికి ప్రత్యక్షమూ అనుమానమూ వేదమూ ఆత్మ జ్ఞ్యానము ఉండాలి
నిస్సంగుడు కావాలి

శ్రీద్ధవ ఉవాచ
నైవాత్మనో న దేహస్య సంసృతిర్ద్రష్టృదృశ్యయోః
అనాత్మస్వదృశోరీశ కస్య స్యాదుపలభ్యతే

సంసారము ఆత్మకా దేహానికా? సంసారం దేహానిదీ కాదు, ఆత్మదీ కాదు. మనసుది.
ఆత్మకు కానప్పుడు, ఆత్మ కానిదాన్ని చూచేవాడికి ఏమి అంటుంది. ఆత్మకానిదాన్ని ఆత్మ అంటే ఆత్మ కాదు. అలాగే ఆత్మను ఆత్మ కాదు అనకుంటే దాని తత్వం తొలగదు కదా

ఆత్మావ్యయోऽగుణః శుద్ధః స్వయంజ్యోతిరనావృతః
అగ్నివద్దారువదచిద్దేహః కస్యేహ సంసృతిః

ఆత్మ తరుగులేనిది, గుణం లేనిది, శుద్ధమైనది, స్వయం ప్రకాశం
కప్పిపెట్టలేనిది, అగ్ని లాంటిది,
ఆత్మ వ్యయం కాదు. శరీరం కట్టెలాంటిది, దేహం దారువులాంటిది.
కాబట్టి దేహానికీ ఆత్మాకూ కాని సంసారం దేనికి ఉంది.

శ్రీభగవానువాచ
యావద్దేహేన్ద్రియప్రాణైరాత్మనః సన్నికర్షణమ్
సంసారః ఫలవాంస్తావదపార్థోऽప్యవివేకినః

ఆత్మ దేహ ఇంద్రియ ప్రాణములకు దగ్గరగా ఉన్నంతవరకూ సంసారం ఫలమును కలిగిస్తుంది.
వివేకం లేని వాడి అపార్థం కూడా సంసారాన్ని కలిగిస్తుంది

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
ధ్యాయతో విషయానస్య స్వప్నేऽనర్థాగమో యథా

అర్థం లేకున్నా, వస్తువులేకున్నా సంసారం మాత్రం తొలగిపోదు
వస్తువు ఇక్కడ లేకున్నా మనసులో ఉంటుంది. విషయాలను ధ్యానం చేస్తున్నవాడికి స్వప్నములో అనర్థం వచ్చినట్లుగా సంసారం తప్పదు

యథా హ్యప్రతిబుద్ధస్య ప్రస్వాపో బహ్వనర్థభృత్
స ఏవ ప్రతిబుద్ధస్య న వై మోహాయ కల్పతే

మెలకువ రాని వాడికి నిద్ర అన్ని అనర్థాలనూ మోహాలనూ కలిగిస్తుంది
అదే మెలకువ ఉన్నవాడికి మోహం ఉండదు

శోకహర్షభయక్రోధ లోభమోహస్పృహాదయః
అహఙ్కారస్య దృశ్యన్తే జన్మమృత్యుశ్చ నాత్మనః

శోకం హర్షం భయం క్రోధం లోభం మోహం స్పృహ జన్మ మృత్యువు
ఇవన్నీ అహంకారానికే గానీ ఆత్మకు కాదు

దేహేన్ద్రియప్రాణమనోऽభిమానో జీవోऽన్తరాత్మా గుణకర్మమూర్తిః
సూత్రం మహానిత్యురుధేవ గీతః సంసార ఆధావతి కాలతన్త్రః

ఈ అంతరాత్మ గుణములతో కర్మలతో ఆకారం ఏరపరచుకున్నదై, దాన్నే సూత్రమనీ మహత్ తత్వం అని గానం చేయబడి, కాలతంత్రుడై సంసారములో పడి పరిగెత్తుతూ ఉంటాడు

అమూలమేతద్బహురూపరూపితం మనోవచఃప్రాణశరీరకర్మ
జ్ఞానాసినోపాసనయా శితేన చ్ఛిత్త్వా మునిర్గాం విచరత్యతృష్ణః

ఏ మూలమూ లేని దీనికి ఎన్నో రూపాలు చుట్టూ చేరుతూ ఉంటాయి
మనసూ వచస్సూ ప్రాణమూ శరీరమూ కర్మా అంటూ అనేక రూపాలతో ఏర్పడి, ముని ఐన వాడు జ్ఞ్యాన ఖడ్గముతో ఉపాసనతో ఈ బంధాలు చేదించి భూమండలములో సంచరిస్తుంటాడు, ఎలాంటి ఆశా లేకుండా

జ్ఞానం వివేకో నిగమస్తపశ్చ ప్రత్యక్షమైతిహ్యమథానుమానమ్
ఆద్యన్తయోరస్య యదేవ కేవలం కాలశ్చ హేతుశ్చ తదేవ మధ్యే

ఈ ప్రకృతికీ సంసారానికీ ఆద్యంతములకు ఏది కారణమో మధ్యలో కూడా అదే కారణం.

యథా హిరణ్యం స్వకృతం పురస్తాత్పశ్చాచ్చ సర్వస్య హిరణ్మయస్య
తదేవ మధ్యే వ్యవహార్యమాణం నానాపదేశైరహమస్య తద్వత్

బంగారం మొదలూ బంగారమే, వస్తువు తయారు చేసిన తరువాతా బంగారమే, మొదలూ మధ్యా అంతమూ అంతా బంగారమే. ఏ ఆభరణం చేసినా అదీ బంగారమే.
ఇది కూడా అంతే

విజ్ఞానమేతత్త్రియవస్థమఙ్గ గుణత్రయం కారణకర్యకర్తృ
సమన్వయేన వ్యతిరేకతశ్చ యేనైవ తుర్యేణ తదేవ సత్యమ్

దీనికి జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు ఉంటాయి
మూడు గుణాలూ, అలాగే కారణమూ కార్యమూ కర్త.
సమన్వయముతో గానీ వ్యతిరేకముతో గానీ ఏది ఐతే సత్యముగా ఉంటుందో అదే సత్యం

న యత్పురస్తాదుత యన్న పశ్చాన్మధ్యే చ తన్న వ్యపదేశమాత్రమ్
భూతం ప్రసిద్ధం చ పరేణ యద్యత్తదేవ తత్స్యాదితి మే మనీషా

ముందరా వెనుకా లేకుంటే మధ్యన కూడా ఉండదు
ముందర ఉన్నదే మధ్యానా ఉంటుంది, చివరా ఉంటుంది
ఏది మనం పరముతో ప్రసిద్ధముగా భావిస్తామో అదే మనకు సత్యం అని నా అభిప్రాయం

అవిద్యమానోऽప్యవభాసతే యో వైకారికో రాజససర్గ ఏసః
బ్రహ్మ స్వయం జ్యోతిరతో విభాతి బ్రహ్మేన్ద్రియార్థాత్మవికారచిత్రమ్

ఈ సంసారములో మనకు అవిద్యతో సృష్టి ఏర్పడుతూ ఉన్నది.
సత్వ గుణాన్ని తీసుకుని ఆధ్యాత్మ వికారం అనే తత్వాన్ని అవగాహన చేసుకున్నపుడే పరమాత్మ తత్వం మనకు భాసిస్తుంది.
పర బ్రహ్మ అనీ, జీవాత్మ అనీ, ప్రకృతీ ఇంద్రియములూ విషయములూ వికారములతో కూడి ఉన్నదిగా భాసితుంది

ఏవం స్ఫుతం బ్రహ్మవివేకహేతుభిః
పరాపవాదేన విశారదేన
ఛిత్త్వాత్మసన్దేహముపారమేత
స్వానన్దతుష్టోऽఖిలకాముకేభ్యః

ఇలా బ్రహ్మను తెలుసుకునే హేతువులతో ఎదుటిదాన్ని భాధించే వైశారద విద్యతో ఆత్మకూ (మనసుకు) ఉన్న అన్ని సందేహాలనూ తొలగించి, ఆత్మారాముడై అన్ని కోరికల నుండీ తాను బయటకు రావాలి, వదలిపెట్టాలి

నాత్మా వపుః పార్థివమిన్ద్రియాణి దేవా హ్యసుర్వాయుర్జలమ్హుతాశః
మనోऽన్నమాత్రం ధిషణా చ సత్త్వమహఙ్కృతిః ఖం క్షితిరర్థసామ్యమ్

ఇవన్ని కలసి ఉన్నపుడు ఏ కరణములతో ఏ  గుణములతో, ఈ గుణము ఈ గుణిగా వ్యవహరించబడుతుంది

సమాహితైః కః కరణైర్గుణాత్మభిర్
గుణో భవేన్మత్సువివిక్తధామ్నః
విక్షిప్యమాణైరుత కిం ను దూషణం
ఘనైరుపేతైర్విగతై రవేః కిమ్

నా యందు చక్కని వివేకం కలిగి నన్ను  దర్శించేవారికి ఇవేవీ గుణములు కావు
సూర్యభగవానున్ని మేఘాలు ఆపేస్తాయా. కనీసం కాంతి తగ్గిస్తాయా.. కాస్త గాలి వస్తే అవి ఎగిరిపోతాయి. గాలి  వస్తే ఎగిరిపోయే మేఘాలతో సూర్యభగవానునికి ఎలాంటి ఇబ్బందీ అడ్డమూ ఎలా ఉండదో, తత్వ జ్ఞ్యానమూ స్వరూప జ్ఞ్యానమూ కలిగితే తొలగిపోయే మాయా గుణత్రయముతో జీవునికి ఎలాంటి ఆపదా, ఇబ్బందీ కలగదు.

యథా నభో వాయ్వనలామ్బుభూగుణైర్
గతాగతైర్వర్తుగుణైర్న సజ్జతే
తథాక్షరం సత్త్వరజస్తమోమలైర్
అహంమతేః సంసృతిహేతుభిః పరమ్

కాబట్టి, మనసు యొక్క సంగాన్ని విడిచిపెట్టాలి. మాయతో విడిచ్పెట్టిన గుణాల యందు సంగాన్ని పూర్తిగా వదిలిపెట్టి, దృఢమైన నా భక్తితో మనసుని పాడు చేసే రజో గుణాన్ని తొలగించినట్లైతే

తథాపి సఙ్గః పరివర్జనీయో గుణేషు మాయారచితేషు తావత్
మద్భక్తియోగేన దృఢేన యావద్రజో నిరస్యేత మనఃకషాయః

సంపూర్ణముగా తొలగించాలి, పూర్తిగా తొలగించాలి, సరి ఐన పద్దతిలో తొలగించాలి.
లేకుంటే, మన శరీరములో వచ్చిన రోగం సరి ఐన ఔషధముతో చికిత్స చేయకుంటే మళ్ళీ మళ్ళీ వచ్చి ఎలా బాధిస్తుందో, ఈ మాయా ప్రకృతీ గుణాలను భక్తి భావముతో వివేకముతో జాగ్రత్తగా పక్కకు తొలగించకుంటే, అవే మిగులుతాయి, మనమే పోతాము.

యథామయోऽసాధు చికిత్సితో నృణాం పునః పునః సన్తుదతి ప్రరోహన్
ఏవం మనోऽపక్వకషాయకర్మ కుయోగినం విధ్యతి సర్వసఙ్గమ్

పక్వం కాని మనసును అఖిల కషాయములతో కూడిన వాడిని అన్ని సంగములూ వాడిని ఆకర్షించి, ముంచి బాధపెడతాయి

కుయోగినో యే విహితాన్తరాయైర్మనుష్యభూతైస్త్రిదశోపసృష్టైః
తే ప్రాక్తనాభ్యాసబలేన భూయో యుఞ్జన్తి యోగం న తు కర్మతన్త్రమ్

స్వర్గములో దేవతలచే సృష్టించబడిన, పంపబడిన , మనుష్యులనే (బంధువులనే) ఈ విఘ్నాలు ఎన్ని సార్లు వచ్చినా, ఎంత మంది బంధువులు వచ్చినా, వారు మళ్ళీ తాము పొందిన యోగముతో ఆగిన పరమాత్మ ఆరాధనను కొనసాగిస్తూనే ఉంటారు, ఆపరు. యోగాన్ని మానేసి కర్మను ప్రారంభించరు.

కరోతి కర్మ క్రియతే చ జన్తుః కేనాప్యసౌ చోదిత ఆనిపతాత్
న తత్ర విద్వాన్ప్రకృతౌ స్థితోऽపి నివృత్తతృష్ణః స్వసుఖానుభూత్యా

పుట్టినప్పటినుంచీ మరణించే వరకూ ఏదో పని చేస్తూనే ఉంటాము
ఎవరో ఒకరు చేయిస్తూనే ఉంటారు
జ్ఞ్యాని ఐన వాడు ప్రకృతిలో ఉన్నప్పటికీ, ఆత్మా రాముడు కాబట్టి అతనికి దేనిమీదా ఆశే ఉండదు.

తిష్ఠన్తమాసీనముత వ్రజన్తం శయానముక్షన్తమదన్తమన్నమ్
స్వభావమన్యత్కిమపీహమానమాత్మానమాత్మస్థమతిర్న వేద

ఈ బుద్ధి ఆత్మలో ఉన్న పరమాత్మను గానీ శరీరములో ఉన్న ఆత్మను గానీ ఈ బుద్ధి తెలియదు
నిలబడ్డా కూర్చున్నా వెళుతున్నా, నిద్రపోయినా అన్నం తింటూ ఉన్నా, ఏమైనా, అతను ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడో అలాంటి స్వభావాన్ని ఆత్మలో గల బుద్ధి కలవాడై వాడు ఆ విషయాన్ని పట్టించుకోడు. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నాడో దాన్ని చూస్తాడు ఆత్మ జ్ఞ్యాని.

యది స్మ పశ్యత్యసదిన్ద్రియార్థం నానానుమానేన విరుద్ధమన్యత్
న మన్యతే వస్తుతయా మనీషీ స్వాప్నం యథోత్థాయ తిరోదధానమ్

దుష్టమైన ఇంద్రియాలచే అనుభవించే విషయాలను, నానా అనుమానాలతో విరుద్ధముగా ఉన్నట్లుగా దాన్ని భావించి, బుద్ధిమంతుడు దాన్ని వాస్తవం అని భావించడు.
కలగన్న వాడు లేవగానే అంతర్థానమైన దాన్ని ఎలా వాస్తవం అనుకోడో, ఇన్ని రకములతో మనకు కనపడుతున్న ప్రపంచాన్నీ, ప్రకృతీ స్వభావాన్ని ఆత్మ జ్ఞ్యానం ఉన్నవాడు వాస్తవం అనుకోడు

పూర్వం గృహీతం గుణకర్మచిత్రమజ్ఞానమాత్మన్యవివిక్తమఙ్గ
నివర్తతే తత్పునరీక్షయైవ న గృహ్యతే నాపి విసృయ్య ఆత్మా

అజ్ఞ్యానం కలిగి, ఆత్మలో వివేకం లేక, పూర్వం చేసుకున్న వాటిని కూడా పరమాత్మ తన సంకల్పముతో మానేస్తాడు
తీసుకున్నా విడిచిపెట్టినా ఆత్మ దేని చేతా గ్రహించబడేది కాదు.

యథా హి భానోరుదయో నృచక్షుషాం తమో నిహన్యాన్న తు సద్విధత్తే
ఏవం సమీక్షా నిపుణా సతీ మే హన్యాత్తమిస్రం పురుషస్య బుద్ధేః

సూర్యూభగవానుడు ఉదయిస్తే, అంతకుముందే వ్యాపించి ఉన్న చీకటిని పోగొడతాడు తప్ప కొత్త వెలుగు తేవడు. అలాగే నా ఆలోచన నిపుణమైనపుడు, పురుషుని యొక్క బుద్ధి యొక్క అంధకారం తొలగిస్తుంది.

ఏష స్వయంజ్యోతిరజోऽప్రమేయో మహానుభూతిః సకలానుభూతిః
ఏకోऽద్వితీయో వచసాం విరామే యేనేషితా వాగసవశ్చరన్తి

పరమాత్మ స్వయం జ్యోతి, పుట్టుకలేనివాడు, ఇంతా అని చెప్పలేనివాడు
మనసు యొక్క అనుభూతిగానీ, ఇతరానుభూతిగానీ, అంతా పరమాత్మే.
అతనొక్కడే అద్వితీయుడు. మన మాటలన్నీ ఆగిపోతే అతను పంపిన వాక్కు మనను నడిప్స్తుంది
లౌకిక వాక్కు ఆపేసినపుడు పరమాత్మ పంపిన వేదవక్కు మనను నడిపిస్తుంది

ఏతావానాత్మసమ్మోహో యద్వికల్పస్తు కేవలే
ఆత్మనృతే స్వమాత్మానమవలమ్బో న యస్య హి

ఇది కేవల వికల్పములో కలిగే ఆత్మ సమ్మోహం
ఎవరికీ ఆత్మను మించిన్ ఆధారం, పట్టుకొమ్మా వేరే ఏదీ ఉండదు

యన్నామాకృతిభిర్గ్రాహ్యం పఞ్చవర్ణమబాధితమ్
వ్యర్థేనాప్యర్థవాదోऽయం ద్వయం పణ్డితమానినామ్

పేరుతో ఆకృతితో దేన్ని దేన్ని మనం గ్రహిస్తామో, ఆ గ్రహించడం వలన కలిగేది సమ్మోహం మాత్రం
కాబట్టి అర్థవాదం వ్యర్థం. అలా చెప్పినవారందరూ తమను తాము పండితులు అనుకుని చెప్పినదే తప్ప అది వాస్తవం కాదు

యోగినోऽపక్వయోగస్య యుఞ్జతః కాయ ఉత్థితైః
ఉపసర్గైర్విహన్యేత తత్రాయం విహితో విధిః

యోగం పూర్తిగా పక్వం కాని వారికీ, కొత్తగా యోగం నేర్చుకున్నవారికీ, శరీరం నుండి పుట్టిన విఘ్నాలతోనేవాడు పడిపోతాడు
అపుడు అలాంటివాడు ఈ విధానాలను అనుసరించాలి

యోగధారణయా కాంశ్చిదాసనైర్ధారణాన్వితైః
తపోమన్త్రౌషధైః కాంశ్చిదుపసర్గాన్వినిర్దహేత్

ధారణతో కూడిన ఆసనములతో, యోగసాధనతో
తపో మంత్రమ ఔషధములతో కొన్నిటినీ

కాంశ్చిన్మమానుధ్యానేన నామసఙ్కీర్తనాదిభిః
యోగేశ్వరానువృత్త్యా వా హన్యాదశుభదాన్శనైః

కొన్ని విఘ్నాలను ఆసన ధారణ యమ నియమ ప్రాణాయామాలతో ఒక్కో దానితో కొన్ని కొన్నిటిని జయించాలి

కేచిద్దేహమిమం ధీరాః సుకల్పం వయసి స్థిరమ్
విధాయ వివిధోపాయైరథ యుఞ్జన్తి సిద్ధయే

ఇలా రకరకాల ఉపాయాలతో ప్రయత్నిస్తే ఎపుడొ ఒకపుడు ఆ యోగం కుదురుతుంది.

న హి తత్కుశలాదృత్యం తదాయాసో హ్యపార్థకః
అన్తవత్త్వాచ్ఛరీరస్య ఫలస్యేవ వనస్పతేః

కౌశల్యం లేకుండా దాన్ని ఆరంభిస్తే క్షేమం కంటే అపార్థం(హాని) కలిగిస్తుంది
చెట్టుకు పండు వచ్చిన తరువాత, దాన్ని ఎంతకీ తెంపకపోతే ఎలా పడిపోతుందో శరీరం కూడా అలాగే పడిపోతుంది

యోగం నిషేవతో నిత్యం కాయశ్చేత్కల్పతామియాత్
తచ్ఛ్రద్దధ్యాన్న మతిమాన్యోగముత్సృజ్య మత్పరః

క్రమక్రమముగా పరమాత్మ యందు మనసు నిలువడానికి యోగాన్ని తీసుకుని
బుద్ధిమంతుడైన్వాడు శ్రద్ధాళువైన వాడు యోగముతో సంబంధములేకుండా


యోగచర్యామిమాం యోగీ విచరన్మదపాశ్రయః
నాన్తరాయైర్విహన్యేత నిఃస్పృహః స్వసుఖానుభూః

ఇలాంటి యోగచర్యను ఆచరిస్తూ ఉండగా ఎలాంటి విఘ్నాలు కలగవు
తన సుఖాన్ని తాను అనుభవిస్తూ ఉండేవాడు నిస్పృహుడే అవుతాడు



                                                     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                     సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment