Thursday, August 8, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై తొమ్మిదవ అధ్యాయం

                          ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
సరస్వత్యాస్తటే రాజన్నృషయః సత్రమాసత
వితర్కః సమభూత్తేషాం త్రిష్వధీశేషు కో మహాన్

తస్య జిజ్ఞాసయా తే వై భృగుం బ్రహ్మసుతం నృప
తజ్జ్ఞప్త్యై ప్రేషయామాసుః సోऽభ్జగాద్బ్రహ్మణః సభామ్

న తస్మై ప్రహ్వణం స్తోత్రం చక్రే సత్త్వపరీక్షయా
తస్మై చుక్రోధ భగవాన్ప్రజ్వలన్స్వేన తేజసా

సరస్వతీ నదీ తీరములో ఋషులందరూ ఒక పెద్ద సత్రయాగం చేసారు. నూరేళ్ళకంటే ఎక్కువ వ్యవధి ఉంటే అది సత్రం. వారిలో వారికి ఒక సందేహం కలిగింది. త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు. ఎవరిని మనం ఆరాధించాలి. అని తెలుసుకోమని బ్రహ్మ పుత్రుడైన బృగుమహర్షిని పంపితే ఆయన బ్రహ్మ లోకానికి వెళ్ళి వినయముతో నమస్కరించి స్తోత్రం చేస్తే బ్రహ్మకు కోపం వచ్చింది

స ఆత్మన్యుత్థితమ్మన్యుమాత్మజాయాత్మనా ప్రభుః
అశీశమద్యథా వహ్నిం స్వయోన్యా వారిణాత్మభూః

తతః కైలాసమగమత్స తం దేవో మహేశ్వరః
పరిరబ్ధుం సమారేభ ఉత్థాయ భ్రాతరం ముదా

తనకు కలిగిన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. భృగువు అది గమనించి వెళ్ళిపోయాడు
కైలాసానికి వెళ్ళాడు. సోదరుడు కదా అని శంకరున్ని ఆలింగనం చేసుకోబోతే

నైచ్ఛత్త్వమస్యుత్పథగ ఇతి దేవశ్చుకోప హ
శూలముద్యమ్య తం హన్తుమారేభే తిగ్మలోచనః

పతిత్వా పాదయోర్దేవీ సాన్త్వయామాస తం గిరా
అథో జగామ వైకుణ్ఠం యత్ర దేవో జనార్దనః

శయానం శ్రియ ఉత్సఙ్గే పదా వక్షస్యతాడయత్
తత ఉత్థాయ భగవాన్సహ లక్ష్మ్యా సతాం గతిః

స్వతల్పాదవరుహ్యాథ ననామ శిరసా మునిమ్
ఆహ తే స్వాగతం బ్రహ్మన్నిషీదాత్రాసనే క్షణమ్
అజానతామాగతాన్వః క్షన్తుమర్హథ నః ప్రభో

శంకరుడు కోపముతో చూసి, త్రిశూలముతో చంపుతా అని బెదిరిస్తే పార్వతీ దేవి వారించింది

అక్కడ నుండి స్వామి వైకుంఠానికి వెళ్ళాడు. పరమాత్మ పడుకుని ఉన్నాడు. అపుడు వక్షస్థలములో తన్నాడు. స్వామి లేచి, కిందకు దిగి నమస్కారం చేసి , ఇలా అన్నాడు. మీకు స్వాగతం. మీరు వస్తున్నట్లు తెలియని మా తప్పును క్షమించండి.

పునీహి సహలోకం మాం లోకపాలాంశ్చ మద్గతాన్
పాదోదకేన భవతస్తీర్థానాం తీర్థకారిణా

అద్యాహం భగవంల్లక్ష్మ్యా ఆసమేకాన్తభాజనమ్
వత్స్యత్యురసి మే భూతిర్భవత్పాదహతాంహసః

సుకుమారమైన మీ పాదములు నా వక్షస్థలానికి తగిలి ఎంత నొప్పి పడి ఉంటాయో. అంటూ ఆయన పాదాలను వత్తుతున్నాడు. నన్ను నా లోకాలనూ లోకపాలురనూ నీ పాద స్పర్శతో పవిత్రం చేసావు. ఇంకా ఏమైనా దోషాలు ఉంటే పవిత్రం చేయవలసింది.
సకల తీర్థాలనూ కూడా పవిత్రం చేసే నీ పాదోదకముతో నన్ను పవిత్రం చేయి. ఈ రోజు నేనూ లక్ష్మీ దేవి నీ పాదోదకముతో పవిత్రులం అయ్యాము.
ఇపుడు నీ పాద స్పర్శతో నా వక్ష స్థలములో ఏమైనా మురికి ఉంటే పోయింది. లక్ష్మీ దేవి కూడా ఇంక హాయిగా ఉండగలదు

శ్రీశుక ఉవాచ
ఏవం బ్రువాణే వైకుణ్ఠే భృగుస్తన్మన్ద్రయా గిరా
నిర్వృతస్తర్పితస్తూష్ణీం భక్త్యుత్కణ్ఠోऽశ్రులోచనః

పునశ్చ సత్రమావ్రజ్య మునీనాం బ్రహ్మవాదినామ్
స్వానుభూతమశేషేణ రాజన్భృగురవర్ణయత్

తన్నిశమ్యాథ మునయో విస్మితా ముక్తసంశయాః
భూయాంసం శ్రద్దధుర్విష్ణుం యతః శాన్తిర్యతోऽభయమ్

ధర్మః సాక్షాద్యతో జ్ఞానం వైరాగ్యం చ తదన్వితమ్
ఐశ్వర్యం చాష్టధా యస్మాద్యశశ్చాత్మమలాపహమ్

మునీనాం న్యస్తదణ్డానాం శాన్తానాం సమచేతసామ్
అకిఞ్చనానాం సాధూనాం యమాహుః పరమాం గతిమ్

సత్త్వం యస్య ప్రియా మూర్తిర్బ్రాహ్మణాస్త్విష్టదేవతాః
భజన్త్యనాశిషః శాన్తా యం వా నిపుణబుద్ధయః

త్రివిధాకృతయస్తస్య రాక్షసా అసురాః సురాః
గుణిన్యా మాయయా సృష్టాః సత్త్వం తత్తీర్థసాధనమ్

అన్నీ విన్నాడు భృగువు. భక్తి పెరిగి కళ్ళ వెంబడ నీళ్ళు శ్రవిస్తూ ఉండగా యజ్ఞ్యానికి మరలి వచ్చి బ్రహ్మ వాదులకు తాను అనుభవించినవన్నీ వివరించాడు. దాన్ని విని మునులందరూ పరమాశ్చర్యాన్ని పొంది అన్ని సందేహాలూ తొలగించుకుని, ఎక్కడ శాంతమూ సత్వమూ అభయమూ ఉన్నాయో అతనే సత్వ గుణ విశిష్టుడు అని శ్రీమన్నారాయణున్ని ఉన్న ముగ్గురిలో అగ్రుడిగా చెప్పారు. జ్ఞ్యానమూ వైరాగ్యమూ ధర్మమూ ఎవరి నుండి లభిస్తాయో, అష్ట విధ ఐశ్వర్యులు, మనసుకు పట్టిన మురికి పోగొట్టే స్వామి కీర్తిని, అన్ని వదిలిపెట్టిన మునులూ శాంతులూ పరమాత్మ కంటే భిన్నమైన దేన్నీ కోరని సాధువులకూ ఎవరు ఉత్తమ గతో, ఎవరికి సత్వ గుణమంటే ప్రీతో, ఎవరికి బ్రాహ్మణులు ఇష్ట దైవమో, అందరూ ఎవరిని పరమ శాంత్ ఉనిగా ఆరాధిస్తారో అలాంటి సత్వ గుణాన్ని పెంచేవారిని సేవించడమే మనం చేయదగినది అని తీర్మానించారు


శ్రీశుక ఉవాచ
ఇత్థం సారస్వతా విప్రా నృణామ్సంశయనుత్తయే
పురుషస్య పదామ్భోజ సేవయా తద్గతిం గతాః

ఆ ఋషులు ఇలా మానవుల సందేహం తీర్చడానికి ఇలా ప్రవర్తించి వారు పరమాత్మ పదాన్ని పొందారు

శ్రీసూత ఉవాచ
ఇత్యేతన్మునితనయాస్యపద్మగన్ధ
పీయూషం భవభయభిత్పరస్య పుంసః
సుశ్లోకం శ్రవణపుటైః పిబత్యభీక్ష్ణమ్
పాన్థోऽధ్వభ్రమణపరిశ్రమం జహాతి

సంసార భయాన్ని తొలగించే పరమాత్మ యొక్క పవిత్రమైన చరిత్రను, చెవులతో మాటి మాటికీ పానం చేస్తే బాటసారికి బాటలో పడిన శ్రమ తొలగుతుంది

శ్రీశుక ఉవాచ
ఏకదా ద్వారవత్యాం తు విప్రపత్న్యాః కుమారకః
జాతమాత్రో భువం స్పృష్ట్వా మమార కిల భారత

విప్రో గృహీత్వా మృతకం రాజద్వార్యుపధాయ సః
ఇదం ప్రోవాచ విలపన్నాతురో దీనమానసః

బ్రహ్మద్విషః శఠధియో లుబ్ధస్య విషయాత్మనః
క్షత్రబన్ధోః కర్మదోషాత్పఞ్చత్వం మే గతోऽర్భకః

ద్వారకా నగరములో ఒక బ్రాహ్మణొత్తమునికి వివాహం ఐన తరువాత భార్య గర్భవతి కావడం, కుమారుడు పుట్టడం పుట్టి మరణించడం జరుగుతూ ఉంది. ఆ చనిపోయిన కుమారున్ని తీసుకుని ఆ బ్రాహ్మణుడు "పెద్దవారి ముందర చిన్నవారు చనిపోతూ ఉన్నారంటే రాజు అధర్మముగా ఉన్నాడని అర్థం. క్షత్రియుని యొక్క ఈ కర్మ దోషముతో నా పిల్లవాడు చనిపోతున్నాడు.

హింసావిహారం నృపతిం దుఃశీలమజితేన్ద్రియమ్
ప్రజా భజన్త్యః సీదన్తి దరిద్రా నిత్యదుఃఖితాః

బ్రాహ్మణులను ద్వేషించేవాడూ, వంచన బుద్ధి కలవాడు, లోభి, విషయముల యందు ఆసక్తి గల క్షత్రియుని దోషం వలన నా కుమారుడు మరణించాడు.ఇలాంటి మహారాజును సేవించే ప్రజలు నిత్యం దుఃఖపడతారు. ఇంద్రియ జయం లేని వాడిని సేవిస్తే నిత్యం దుఃఖాన్ని పొందుతారు


ఏవం ద్వితీయం విప్రర్షిస్తృతీయం త్వేవమేవ చ
విసృజ్య స నృపద్వారి తాం గాథాం సమగాయత

తామర్జున ఉపశ్రుత్య కర్హిచిత్కేశవాన్తికే
పరేతే నవమే బాలే బ్రాహ్మణం సమభాషత

కిం స్విద్బ్రహ్మంస్త్వన్నివాసే ఇహ నాస్తి ధనుర్ధరః
రాజన్యబన్ధురేతే వై బ్రాహ్మణాః సత్రమాసతే

ధనదారాత్మజాపృక్తా యత్ర శోచన్తి బ్రాహ్మణాః
తే వై రాజన్యవేషేణ నటా జీవన్త్యసుమ్భరాః

అహం ప్రజాః వాం భగవన్రక్షిష్యే దీనయోరిహ
అనిస్తీర్ణప్రతిజ్ఞోऽగ్నిం ప్రవేక్ష్యే హతకల్మషః

మూడు సార్లూ ఇలాగే అయ్యిది ఆ బ్రాహ్మణుండికి. మరో సారి ఇలా అతను రాజ ద్వాం ముందర నిలబడినపుడు అర్జనుడు చూచాడు. అలా తొమ్మిది మంది చనిపోయిన తరువాత ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. ఈ రాజ్యములో ధనువు పట్టుకుని యుద్ధం చేయగలవాడు ఎవరూ లేరా. నీవింత ఆక్రోషిస్తూ ఉన్నా ఎవరికీ పట్టడం లేదు. బ్రాహ్మణులు ధనం దారా పుత్రులు ఇలాంటి వాటితో కలిగిన బాధలతో దుఃఖిస్తే తమ ప్రాణాలను పోషించుకునే దొంగల వేషములో ఉన్నవారిగా రాజులు పరిగణింపబడతారు.నీ కుమారున్ని నేను కాపాడతాను అని ప్రతిజ్ఞ్య చేసాడు అర్జనుడు

శ్రీబ్రాహ్మణ ఉవాచ
సఙ్కర్షణో వాసుదేవః ప్రద్యుమ్నో ధన్వినాం వరః
అనిరుద్ధోऽప్రతిరథో న త్రాతుం శక్నువన్తి యత్

తత్కథం ను భవాన్కర్మ దుష్కరం జగదీశ్వరైః
త్వం చికీర్షసి బాలిశ్యాత్తన్న శ్రద్దధ్మహే వయమ్

సంకర్షణుడూ వాసుదేవుడూ ప్రద్యుమ్నుడూ అనిరుద్ధుడూ ఇలాంటి మహావీరులంతా రక్షించలేని నన్ను నీవు రక్షిస్తావా. జగదీశ్వరులే మావల్ల కాదంటే నీవెలా చేస్తావు



శ్రీర్జున ఉవాచ
నాహం సఙ్కర్షణో బ్రహ్మన్న కృష్ణః కార్ష్ణిరేవ చ
అహం వా అర్జునో నామ గాణ్డీవం యస్య వై ధనుః

మావమంస్థా మమ బ్రహ్మన్వీర్యం త్ర్యమ్బకతోషణమ్
మృత్యుం విజిత్య ప్రధనే ఆనేష్యే తే ప్రజాః ప్రభో

నేను బలరామున్నీ కృష్ణున్ని ప్రద్యుమ్నున్నీ కాదు. నేను అర్జనున్ని,గాండీవం నా ధనసూ. శంకరున్ని కూడా నా పరాక్రమముతో సంతోషబెట్టాను. అవసరమైతే మృత్యువును కూడా గెలిచి నీ సంతానాన్ని తీసుకు వస్తానని నమ్మకం కలిగించాడు

ఏవం విశ్రమ్భితో విప్రః ఫాల్గునేన పరన్తప
జగామ స్వగృహం ప్రీతః పార్థవీర్యం నిశామయన్

అతని కాపలా ఉంచాడు బ్రాహ్మణుడు. ప్రసూతి కాలం వచ్చింది. ఈ సంతానాన్ని నీవు కాపాడు అనగా, ఆచమనం చేసి శంకరునికి నమస్కారం చేసి దివ్యాస్త్రములతో ప్రసూతి గృహాన్ని శర పంజరం చేసాడు. కాసేపటికి పిల్లవాడు పుట్టినట్లు ఏడుపు వినిపించింది. ఇంతవరకూ పిల్లవాడు పుట్టి పోయేవాడు. ఈసారి ఆ దేహం కూడ మాయమయ్యింది.

ప్రసూతికాల ఆసన్నే భార్యాయా ద్విజసత్తమః
పాహి పాహి ప్రజాం మృత్యోరిత్యాహార్జునమాతురః

స ఉపస్పృశ్య శుచ్యమ్భో నమస్కృత్య మహేశ్వరమ్
దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సజ్యం గాణ్డీవమాదదే

న్యరుణత్సూతికాగారం శరైర్నానాస్త్రయోజితైః
తిర్యగూర్ధ్వమధః పార్థశ్చకార శరపఞ్జరమ్

తతః కుమారః సఞ్జాతో విప్రపత్న్యా రుదన్ముహుః
సద్యోऽదర్శనమాపేదే సశరీరో విహాయసా

తదాహ విప్రో విజయం వినిన్దన్కృష్ణసన్నిధౌ
మౌఢ్యం పశ్యత మే యోऽహం శ్రద్దధే క్లీబకత్థనమ్

న ప్రద్యుమ్నో నానిరుద్ధో న రామో న చ కేశవః
యస్య శేకుః పరిత్రాతుం కోऽన్యస్తదవితేశ్వరః

మళ్ళీ కృష్ణుని దగ్గరకు వచ్చి ఈ బ్రాహ్మణుడు అర్జనున్ని నిందిస్తూ నపుంసకుని మాటలు నమ్మాను


ధిగర్జునం మృషావాదం ధిగాత్మశ్లాఘినో ధనుః
దైవోపసృష్టం యో మౌఢ్యాదానినీషతి దుర్మతిః

ఏవం శపతి విప్రర్షౌ విద్యామాస్థాయ ఫాల్గునః
యయౌ సంయమనీమాశు యత్రాస్తే భగవాన్యమః

విప్రాపత్యమచక్షాణస్తత ఐన్ద్రీమగాత్పురీమ్
ఆగ్నేయీం నైరృతీం సౌమ్యాం వాయవ్యాం వారుణీమథ

రసాతలం నాకపృష్ఠం ధిష్ణ్యాన్యన్యాన్యుదాయుధః
తతోऽలబ్ధద్విజసుతో హ్యనిస్తీర్ణప్రతిశ్రుతః
అగ్నిం వివిక్షుః కృష్ణేన ప్రత్యుక్తః ప్రతిషేధతా

దర్శయే ద్విజసూనూంస్తే మావజ్ఞాత్మానమాత్మనా
యే తే నః కీర్తిం విమలాం మనుష్యాః స్థాపయిష్యన్తి

ఇతి సమ్భాష్య భగవానర్జునేన సహేశ్వరః
దివ్యం స్వరథమాస్థాయ ప్రతీచీం దిశమావిశత్

బలరమ కృష్ణాదులు రక్షించలేని వారిని అర్జనుడు రక్షిస్తాడు అని నమ్మడం నా మూర్ఖత్వం. అబద్దం చెప్పే, తనను తాను గొప్పవాడిగా చెప్పుకునే అర్జనున్ని నమ్మాను. పరమాత్మే కాపాడనపుడు ఇతను ఏమి కాపాడతాడు. అపుడు అర్జనుడు కోపముతో తన యోగ ప్రభావముతో స్వర్గానికీ యమ పురికీ, అగ్నిపురీ చంద్రపురీ వాయుపురీ రసాతలం , ఇలా తన యోగ శక్తితో ఎక్కడెక్కడకు వెళ్ళగలడో అన్ని చోట్లకూ వెళ్ళి ఎక్కడా పిల్లవాడు కనిపించనపుడు ప్రాయోపవేశానికి ఏర్పాట్లు చేసుకుని అగ్నిలో ప్రవేశిచబోతూ ఉంటే కృష్ణుడు ఆపి "నిన్ను నీవు నిందించుకోవలదు. అది నీ చేతిలో లేదు. ఆ పిల్లలను నేను చూపెడతాను. వారిని ఎవరు తీసుకు వెళ్ళారో నేను చూపిస్తాను" అని ఓదార్చాడు
ఈనాడు నిన్ను నన్ను ఎవరు నిందించారో వారే రేపు మనను పొగడుతారు. లోకులు చేసే నిందకు చలించరాదు అని చెప్పాడు.

సప్త ద్వీపాన్ససిన్ధూంశ్చ సప్త సప్త గిరీనథ
లోకాలోకం తథాతీత్య వివేశ సుమహత్తమః

తత్రాశ్వాః శైబ్యసుగ్రీవ మేఘపుష్పబలాహకాః
తమసి భ్రష్టగతయో బభూవుర్భరతర్షభ

తాన్దృష్ట్వా భగవాన్కృష్ణో మహాయోగేశ్వరేశ్వరః
సహస్రాదిత్యసఙ్కాశం స్వచక్రం ప్రాహిణోత్పురః

తమః సుఘోరం గహనం కృతం మహద్
విదారయద్భూరితరేణ రోచిషా
మనోజవం నిర్వివిశే సుదర్శనం
గుణచ్యుతో రామశరో యథా చమూః

ద్వారేణ చక్రానుపథేన తత్తమః పరం పరం జ్యోతిరనన్తపారమ్
సమశ్నువానం ప్రసమీక్ష్య ఫాల్గునః ప్రతాడితాక్షో పిదధేऽక్షిణీ ఉభే

తతః ప్రవిష్టః సలిలం నభస్వతా బలీయసైజద్బృహదూర్మిభూషణమ్
తత్రాద్భుతం వై భవనం ద్యుమత్తమం భ్రాజన్మణిస్తమ్భసహస్రశోభితమ్

కృష్ణుడు తన దివ్య రథాన్ని తీసుకుని బయలుదేరాడు. పశ్చిమ దిక్కుకు బయలుదేరి ఏడు ద్వీపములనూ సముద్రములను ఏడు కులాచలములను , లోకాలోకము దాకా వెళ్ళాడు. అది దాటగానే కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఆవరించింది. గుర్రాలకు కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. అపుడు మహా యోగీశ్వరుడైన కృష్ణుడు సుదర్శనాన్ని ముందుకు పంపాడు. వేయి మంది సూర్యులలా ప్రకాశించే తన దివ్యమైన చక్రాన్ని పంపగా దివ్యమైన కాంతితో సుదర్శనం పరమఘోరమైన చీకటిని చీల్చి వేసినిది, నారినుండి బయలుదేరిన రాముని బాణము శత్రువును చీల్చినట్లు. చక్రం చూపించిన దారితో
ఆ తరువాత కలిగిన దివ్య జ్యోతినీ చూచి అర్జనుడు కళ్ళు మూసుకున్నాడు
ఆ తేజస్సులో అద్భుతమైన భవనం, కొన్ని వెల మణిస్తంభాలుకలది ఐనది, వేయిపడగల మణులతో సకల లోకములనూ ప్రకాశింప్చేసేది ఐన భవనం కనపడింది, తెల్లని పర్వతము వంటి శంకరుడే నాలుకగా కలవాడు ఐన స్వామి కనపడ్డాడు

తస్మిన్మహాభోగమనన్తమద్భుతం
సహస్రమూర్ధన్యఫణామణిద్యుభిః
విభ్రాజమానం ద్విగుణేక్షణోల్బణం
సితాచలాభం శితికణ్ఠజిహ్వమ్

దదర్శ తద్భోగసుఖాసనం విభుం
మహానుభావం పురుషోత్తమోత్తమమ్
సాన్ద్రామ్బుదాభం సుపిశఙ్గవాససం
ప్రసన్నవక్త్రం రుచిరాయతేక్షణమ్

మహామణివ్రాతకిరీటకుణ్డల
ప్రభాపరిక్షిప్తసహస్రకున్తలమ్
ప్రలమ్బచార్వష్టభుజం సకౌస్తుభం
శ్రీవత్సలక్ష్మం వనమాలయావృతమ్

అలాంటి నీల మేఘ శ్యాముడూ పీతాంబర ధారి, అందమైన విశాలమైన నేత్రములు గల స్వామి, మణుల కాంతితో కేశములు ప్రకాశిస్తూ ఉండగా, దివ్యమైన ఎనిమిది భుజములు గలవాడు. ద్వారపాలకులచే సేవించబడుతూ, శంఖ చక్రాది ఆయుధాలు రూపం ధరించి స్వామిని సేవిస్తూ ఉన్నాయి.
అష్ట శక్తులచే సేవించబడే వాడు, నవ బ్రహ్మలకూ  పతీ,

మహామణివ్రాతకిరీటకుణ్డల
ప్రభాపరిక్షిప్తసహస్రకున్తలమ్
ప్రలమ్బచార్వష్టభుజం సకౌస్తుభం
శ్రీవత్సలక్ష్మం వనమాలయావృతమ్

వవన్ద ఆత్మానమనన్తమచ్యుతో జిష్ణుశ్చ తద్దర్శనజాతసాధ్వసః
తావాహ భూమా పరమేష్ఠినాం ప్రభుర్బేద్ధాఞ్జలీ సస్మితమూర్జయా గిరా

ద్విజాత్మజా మే యువయోర్దిదృక్షుణా మయోపనీతా భువి ధర్మగుప్తయే
కలావతీర్ణావవనేర్భరాసురాన్హత్వేహ భూయస్త్వరయేతమన్తి మే

పూర్ణకామావపి యువాం నరనారాయణావృషీ
ధర్మమాచరతాం స్థిత్యై ఋషభౌ లోకసఙ్గ్రహమ్

తనకు ఆత్మ ఐన స్వామికి కృష్ణుడు నమస్కరించాడు. అర్జనుడు కూడా నమస్కరించాడు.ఇలా ఇద్దరూ నమస్కరిస్తే, అపుడు  స్వామి చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. "మీకు ఈ లోకం జ్ఞ్యాపకం చేద్దామని ఆ పిల్లలను నేనే తెచ్చాను"
భూభారాన్ని తొలగించడానికి నా కలగా అవతరించిన మీరు త్వరలో నా దగ్గరకు రావాలి కాబట్టి, అది గుర్తు చేయడానికి పిల్లలను ఇక్కడకు రప్పించాను

ఇత్యాదిష్టౌ భగవతా తౌ కృష్ణౌ పరమేష్ఠినా
ఓం ఇత్యానమ్య భూమానమాదాయ ద్విజదారకాన్

న్యవర్తేతాం స్వకం ధామ సమ్ప్రహృష్టౌ యథాగతమ్
విప్రాయ దదతుః పుత్రాన్యథారూపం యథావయః

నిశామ్య వైష్ణవం ధామ పార్థః పరమవిస్మితః
యత్కిఞ్చిత్పౌరుషం పుంసాం మేనే కృష్ణానుకమ్పితమ్

మీరు పూర్ణ కాములూ నర నారాయణులు ఐనా లోఖ శిక్షణ  కోసం ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అలా కృష్ణుని ఆజ్ఞ్యను పొంది, అలాగే అని బ్రాహ్మణ పుత్రులను తీఎసుకుని బ్రాహ్మణుని వద్దకు తీసుకు వచ్చారు. ఏ రూపమూ ఏ వయసూ ఉందో అలాంటి పిల్లలను వారికి ఇచ్చారు.పరమాత్మ వైకుంఠాన్ని చూచిన తరువాత అన్ని లోకాలలో జీవులు చూపే ప్రతీ చిన్న శక్తీ బలం ప్రతాపం బుద్ధీ తేజస్సు ఆయన దయతో ఇస్తే వచ్చేవే అని తెలుసుకున్నాడు

ఇతీదృశాన్యనేకాని వీర్యాణీహ ప్రదర్శయన్
బుభుజే విషయాన్గ్రామ్యానీజే చాత్యుర్జితైర్మఖైః

ఇలా అనేక లీలల్ను చేస్తూ పరమాత్మ ప్రజలకూ బ్రాహ్మణులకూ వారు కోరిన అన్ని కోరికలనూ ప్రసాదించాడు

ప్రవవర్షాఖిలాన్కామాన్ప్రజాసు బ్రాహ్మణాదిషు
యథాకాలం యథైవేన్ద్రో భగవాన్శ్రైష్ఠ్యమాస్థితః

ఇంద్రుడు కాలానుగుణముగా వర్షాదులు ఎలా ఇస్తాడో పరమాత్మ కూడా కాల దేశ వ్యక్త్యానుగుణముగా వారి కోరికలు తీరుస్తూ

హత్వా నృపానధర్మిష్ఠాన్ఘాటయిత్వార్జునాదిభిః
అఞ్జసా వర్తయామాస ధర్మం ధర్మసుతాదిభిః

కొందరు దుర్మార్గులను తాను చంపి కొందరిని అర్జనుని చేత చంపించి ధర్మరాజాదుల చేత ధర్మాన్ని భూమండలములో ధర్మాన్ని అనాయాసముగా ప్రవర్తింపచేసాడు
                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                  సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment