ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఎనభై ఒకటవ అధ్యాయం
కృష్ణ పరమాత్మ రెండు విషయాలను స్పష్టముగా చెప్పాడు. అగ్నిహోత్రములో వేసినదానికంటే బ్రాహ్మణోత్తములకు భోజనం పెడితే వారి నాలుకలలో నేనుండి భుజిస్తాను అని
నేను నేనుగా కంటే గుర్వుగారి నాలుక మీద కూర్చుని మాట్లాడిస్తాను
శ్రీశుక ఉవాచ
స ఇత్థం ద్విజముఖ్యేన సహ సఙ్కథయన్హరిః
సర్వభూతమనోऽభిజ్ఞః స్మయమాన ఉవాచ తమ్
ఇలా కుచేలుడితో మాట్లాడుతూ ప్రతీ ప్రాణి యొక్క మనసునూ తెలుసుకొనగలిగే స్వామి
బ్రహ్మణ్యో బ్రాహ్మణం కృష్ణో భగవాన్ప్రహసన్ప్రియమ్
ప్రేమ్ణా నిరీక్షణేనైవ ప్రేక్షన్ఖలు సతాం గతిః
బ్రాహ్మణుల యందు ప్రీతి కలిగిన స్వామి నావుతూ ప్రేమ చూపులతో చూస్తూ, సత్పురుషులకు ఆధారభూతమైన స్వామి ఇలా అన్నాడు
శ్రీభగవానువాచ
కిముపాయనమానీతం బ్రహ్మన్మే భవతా గృహాత్
అణ్వప్యుపాహృతం భక్తైః ప్రేమ్ణా భుర్యేవ మే భవేత్
భూర్యప్యభక్తోపహృతం న మే తోషాయ కల్పతే
నా కోసం ఏమి తెచ్చావో చెప్పు. స్నేహితుడు ఇంటికి ఉత్తి చేతులతో రారు కదా.
మీ ఇంటినుంచి నా కొరకు ఏ కానుక తెచ్చావు. ప్రేమతో తెచ్చింది ఎంత కొంచెమైనా నాకు ఇష్టమే. కొద్దిగా తెచ్చావని దిగులుపెట్టుకోకు. భక్తులు ప్రేమతో కొద్దిగా తెచ్చినా అది నాకు చాలా అవుతుంది. భక్తులుకాని వారు ఎంత ఇచ్చినా నాకు సతోషం కలగదు.
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః
ఒక ఆకూ పూవూ పండూ నీరు ఏదైనా భకితో నాకి ఇస్తే చాలు. నాకు అంతా ఇచ్చినట్లే. పని వెనక ఉన్న భావం ముఖ్యం. పని కాదు.
భక్తి చేత తేబడినది నేను స్వయముగా ఆరగిస్తాను.
ఇత్యుక్తోऽపి ద్వియస్తస్మై వ్రీడితః పతయే శ్రియః
పృథుకప్రసృతిం రాజన్న ప్రాయచ్ఛదవాఙ్ముఖః
ఇంత చెప్పినా కుచేలుడు బిడియపడుతున్నాడు అటుకులు ఇవ్వడానికి. శ్రియఃపతికి ఏమివ్వాలి? అని సిగ్గుపడుతున్నాడు. తల నేల కేసి ఉంచి చూస్తూ ఇవ్వలేకపోయాడు
సర్వభూతాత్మదృక్సాక్షాత్తస్యాగమనకారణమ్
విజ్ఙాయాచిన్తయన్నాయం శ్రీకామో మాభజత్పురా
సర్వ ప్రాణుల మనసును చూచే స్వామి, కుచేలుడు ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాడు. ఇతను సంపద కోరి నన్ను ఎన్నడూ సేవించలేదు.
పత్న్యాః పతివ్రతాయాస్తు సఖా ప్రియచికీర్షయా
ప్రాప్తో మామస్య దాస్యామి సమ్పదోऽమర్త్యదుర్లభాః
పతివ్రత ఐన భార్యకు కొంచెమైనా ప్రీతి కలిగించకుంటే భర్తృ ధర్మం పరిపూర్ణం కాదేమో అని ఆమెకు ప్రీతి కలిగించడానికి వచ్చాడు. ఆమె కూడా కోరకూడని కోరిక కోరలేదు. ఆకలికి అన్నం అడిగింది. కాబట్టి ఇతనికి దేవతలకు కూడా లభించనంతటి గొప్ప సంపదలు ఇస్తాను
ఇత్థం విచిన్త్య వసనాచ్చీరబద్ధాన్ద్విజన్మనః
స్వయం జహార కిమిదమితి పృథుకతణ్డులాన్
అని ఆలోచించి ఆ ఉత్తరీయం కొంగునకు కట్టి ఉంటే దాన్ని విప్పి, "ఆ కొంగులో ఏదో కనపడుతోంది, ఏమిటిది" అని అడుగుతూ
నన్వేతదుపనీతం మే పరమప్రీణనం సఖే
తర్పయన్త్యఙ్గ మాం విశ్వమేతే పృథుకతణ్డులాః
నా కోసం అటుకులు తెచ్చావా. నాకు చాలా ఇష్టం అని తెలుసు కదా
సకల ప్రపంచానికీ తృప్తి కలిగించేవి ఈ అటుకులు.
ధాన్యాన్ని ఉడకబెట్టి ఎండబెట్టి వేయించి దంచి చేసేవాటిన్ ఈటుకులూ అంటారు. ఒక బీజాన్ని ఎన్ని తీరులుగా మారిస్తే అది ఉపభోగ్యమవుతుందో. మనను కూడా జ్ఞ్యానాగ్నిలో ఉడకపెట్టాలి. వేడితో బాటు తడి కూడా ఉంటుంది. జ్ఞ్యానం వచ్చినా ప్రీతీ స్నేహం పోదు. అది పోవడానికి ఎండబెట్టాలి. ఐనా ఇంకా మనకు కావలసిన పరిమాణం (అభివృద్ధి )రావాలి కాబట్టి వేయిస్తారు. ఈ అగ్ని గుర్వుగారి ఉపదేశం. ఈ ఉపదేశముతో అవి బాగా ఉబ్బుతాయి. వీటిని రోకటి పోటితో దంచితే, (మన హృదయం రోలు, మన బుద్ధి రోకలి) హృదయాన్ని బుద్ధితో మర్దన చేస్తే అవి విస్తరించి ఉపభోగ్య స్థానమవుతాయి. అవి పరామతకు ఇష్టం. పృథుకతణ్డులాః అంటారు అటుకులు. బియ్యాన్ని అలాగే తినలేము. అన్నాన్ని అలాగే తినలేము. కానీ ఈ అటుకులని అనుకున్నపుడు తినవచ్చి. దానిలో మజ్జిగా, లేదా బెల్లం, లేదా కారం, లేదా ఏమైనా వేసుకుని అనుకున్న రీతిలో మార్చుకుని అనుభవించదగినవి. ఆచార్య ఉపదేశముతో గురుభక్తి కలిగిన జీవాత్మే అటుకులు. గురు భక్తి కలిగి, గురువుగారి ఉపదేశాన్ని పొంది పరమాత్మ యందు అత్యంత ప్రీతి కలిగిన వాడిని పరమాత్మ, తాను అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో అనుభవిస్తాడు. అటుకులూ అంటే ముక్తాత్మలు. పరమాత్మకు సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో సర్వ విధ కైంకర్యములకు యోగ్యమైన స్థితి పృథుకతణ్డులాః
నాలుగు ఇళ్ళలో అడిగి తీసుకు వచ్చినవి ఆ అటుకులు. నాలుగు పురుషార్థాలతో ఏర్పాటైన పురుషుడే ముక్తాత్మ
ముక్తులు సకల ప్రపంచానికీ ఆనందం కలిగించే వారు
ఇతి ముష్టిం సకృజ్జగ్ధ్వా ద్వితీయాం జగ్ధుమాదదే
తావచ్ఛ్రీర్జగృహే హస్తం తత్పరా పరమేష్ఠినః
ఇలా చేసి ఒక పిడికిలి తీసుకు తిన్నాడు. ఇంకో పిడికిలి తీసుకు తినబోతుంటే రుక్మిణీ అమ్మవారు చేయిపట్టుకుంది
అమ్మవారు ఆయననే చూస్తూ ఉన్నది.
ఏతావతాలం విశ్వాత్మన్సర్వసమ్పత్సమృద్ధయే
అస్మిన్లోకేऽథ వాముష్మిన్పుంసస్త్వత్తోషకారణమ్
పరమాత్మా నీవు అనుకున్న అన్ని సంపదల సమృద్ధీ చేకూరడానికి ఈ ఒక్క పిడికిలీ చాలు, మళ్ళీ రెండవది ఎందుకు.
ఇహ పర లోకములో మీ సంతోషానికి కారణం కలిగించే సర్వ సంపదా సమృద్ధి (నిరంతరం పెరిగే సమృద్ధి) పురుషునికి కలగడానికి ఇది చాలు. ఆ సమృద్ధిలో ప్రతీ వ్యయమూ నీకు సంతోషం కలిగిస్తుంది. పరమాత్మకు సంతోషం కలిగించే విధముగా వ్యయం చేయబడిన సంపద పరమాత్మ ఇచ్చాడు. మనం కోరుకున్నట్లు సంపద ఇస్తే శ్రీమదం పెరుగుతుంది. అటువంటి వారిని అనుగ్రహించాలంటే స్వామి వారి సంపదలను హరిస్తాడు. హరిస్తానన్న స్వామి ఇక్కడ సమప్దలిచ్చాడు. కానీ ఈ సంపద పరమాత్మ సంతోషానికి కారణమయ్యే విధముగా వ్యయమయ్యే సంపద. అసలు సంపద బుద్ధి. పరమాత్మనే సేవించగల బుద్ధి ఉండాలి. భగవంతుడు ప్రసాదించినది సర్వ కాలములలో భగవానుని కైంకర్యానికే ఉపయోగించాలి.
కుచేలుడికి పరమాత్మ ఏ ఉద్దేశ్యముతో సంపద ఇచ్చాడో అమ్మవారు గుర్తించింది.
బ్రాహ్మణస్తాం తు రజనీముషిత్వాచ్యుతమన్దిరే
భుక్త్వా పీత్వా సుఖం మేనే ఆత్మానం స్వర్గతం యథా
ఇదే భాగాన్ని పద్మపురాణములో చెబుతారు. స్వామీ అమ్మవారు ఏమి మాట్లాడుకున్నారో కుచేలుడికి అర్థం కాలేదు. కుచేలుడు అమ్మవారు వద్దనందుకు ఆ అటుకులు బాగా లేవేమో అందుకే స్వామి తినలేదు అనుకున్నాడు. సిగ్గుపడ్డాడు. మనం దానం చేసేప్పుడు కూడ్దా సిగ్గుతో దానంచేయాలి. భగవానునికి నివేదనం చేసేప్పుడు కూడా. అందుకే అన్ని ఉపచారాలూ చేసి చివరలో "నీకు ఉపచారాలు చేసాననుకుంటున్న నేను నిజానికి చేసినవన్నీ అపచారాలు, వాటిని మన్నించు" అంటాము
పరమాత్మ మందిరములో ఆ రాత్రి బ్రాహ్మణోత్తముడు ఉండి, భుజించి, పానీయాలు తాగి, నేను స్వర్గములో ఉన్నాను అనుకున్నాడు
శ్వోభూతే విశ్వభావేన స్వసుఖేనాభివన్దితః
జగామ స్వాలయం తాత పథ్యనవ్రజ్య నన్దితః
తెల్లవారగానే పరమాత్మ తన సంపదతో ఆరాధించాడు. అలా ఆరాధించబడి కృష్ణ పరమాత్మ చేత ఆమోదించబడి అభినందించబడి తన ఇంటికి తాను బయలుదేరాడేఉ
స చాలబ్ధ్వా ధనం కృష్ణాన్న తు యాచితవాన్స్వయమ్
స్వగృహాన్వ్రీడితోऽగచ్ఛన్మహద్దర్శననిర్వృతః
దారిలో అనుకున్నాడు. స్వామి దక్షిణ ఈయలేదే. నేను కూడా అడుగలేదు.
ఇపుడు నేను ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళను. అనుకుంటూ వెళ్ళాడు. పరమాత్మను దర్శించానన్న తృప్తితో వెళ్ళాడు.
అహో బ్రహ్మణ్యదేవస్య దృష్టా బ్రహ్మణ్యతా మయా
యద్దరిద్రతమో లక్ష్మీమాశ్లిష్టో బిభ్రతోరసి
కృష్ణ పరామాత్మ బ్రాహ్మణులను దేవతలలా ఆరాధిస్తాడని చెబితే విన్నాను కానీ ఇపుడు ప్రత్యక్షముగా చూచాను. నా అంతటి దరిద్రున్ని అమ్మవారిని హృదయములో దాచుకున్న స్వామి పూజించాడు.
క్వాహం దరిద్రః పాపీయాన్క్వ కృష్ణః శ్రీనికేతనః
బ్రహ్మబన్ధురితి స్మాహం బాహుభ్యాం పరిరమ్భితః
పరమ పాపిని నేను. సాక్షాత్ కృష్ణ పరమాత్మ శ్రియఃపతి. బ్రాహ్మణుడు అన్న ఒక్క కారణముతో రెండు చేతులఓ
నివాసితః ప్రియాజుష్టే పర్యఙ్కే భ్రాతరో యథా
మహిష్యా వీజితః శ్రాన్తో బాలవ్యజనహస్తయా
ప్రియురాలు వేంచేసి ఉన్న పర్యంకం మీద పెద్దన్నను ఎలా కూర్చోబెట్టి ఆదరిస్తారో అలా ఆదరించాడు
పట్టమహిషి ఐన రుక్మిణీ దేవి చామరముతో నాకు వీచింది
శుశ్రూషయా పరమయా పాదసంవాహనాదిభిః
పూజితో దేవదేవేన విప్రదేవేన దేవవత్
ఆ పరమాత్మ నా కాళ్ళు వత్తాడు. దేవ దేవుడైన పరమాత్మ, బ్రాహ్మణులను దేవతలుగా భావించే పరమాత్మ నన్ను పూజించాడు
స్వర్గాపవర్గయోః పుంసాం రసాయాం భువి సమ్పదామ్
సర్వాసామపి సిద్ధీనాం మూలం తచ్చరణార్చనమ్
పధ్నాలుగు లోకాలూ అనంత కోటి బ్రహ్మానడములూ సంపదలూ రావాలంటే ఎవరైనా ఆ పరమాత్మ పాదాలు పట్టుకోవాలి. స్వర్గమూ మోక్షమూ రసాతలములో సంపదా, అన్ని సిద్ధులకూ మూలం పరమాత్మ పాదములను అర్చించుటే.
అలాంటి పరమాత్మ నా పాదాలను వత్తాడు
అధనోऽయం ధనం ప్రాప్య మాద్యన్నుచ్చైర్న మాం స్మరేత్
ఇతి కారుణికో నూనం ధనం మేऽభూరి నాదదాత్
మరి ఇంత గొప్పవాడైన పరమాత్మ నాకు ధనం ఎందుకు ఇవ్వలేదు. నాకు ధనం ఇస్తే స్వామిని ఎక్కడ మరచిపోతానో ఏమో అని స్వామి నాకు ధనం ఇచ్చి ఉండకపోవవచ్చు. నేను పతనం కాకుండా ఉండాలన్న దయతో స్వామి నాకు ధనం ఇవ్వలేదు
ఇతి తచ్చిన్తయన్నన్తః ప్రాప్తో నియగృహాన్తికమ్
సూర్యానలేన్దుసఙ్కాశైర్విమానైః సర్వతో వృతమ్
ఇలా ఆలోచించుకుంటూ తన ఇంటి పరిసర ప్రాంతాలకు చేరాడు
సుర్ర్యున్నీ చంద్రున్నీ నక్షత్రాలనూ అందుకునే గోపురాలతో ఎత్తైన భవనాలు కనపడుతున్నాయి
విచిత్రోపవనోద్యానైః కూజద్ద్విజకులాకులైః
ప్రోత్ఫుల్లకముదామ్భోజ కహ్లారోత్పలవారిభిః
ఉద్యాన వనాలూ సరస్సులూ పక్షులూ పూవులూ తుమ్మెదలూ కోకిలలూ హంసలూ
జుష్టం స్వలఙ్కృతైః పుమ్భిః స్త్రీభిశ్చ హరిణాక్షిభిః
కిమిదం కస్య వా స్థానం కథం తదిదమిత్యభూత్
ఎవరిది ఈ ఇల్లు. నా ఇల్లనుకుని వచ్చాను. నాదనుకుని ఎవరింటికైనా వచ్చానా? దారి తప్పానా.
ఏవం మీమాంసమానం తం నరా నార్యోऽమరప్రభాః
ప్రత్యగృహ్ణన్మహాభాగం గీతవాద్యేన భూయసా
ఇలా ఆలోచిస్తూ ఉంటే దేవతల వంటి కాంతి గల స్త్రీ పురుషులు అతనికి ఎదురేగి ఆథిద్యమిచ్చి మంగళ వాద్యాలతో స్వాగతం చెప్పి తీసుకు వచ్చారు
పతిమాగతమాకర్ణ్య పత్న్యుద్ధర్షాతిసమ్భ్రమా
నిశ్చక్రామ గృహాత్తూర్ణం రూపిణీ శ్రీరివాలయాత్
భర్త వచ్చాడని భార్య కూడా ఆనందముగా ఇంటిలోనుంచి , రూపు దాల్చిన లక్ష్మిలా వచ్చింది
పతివ్రతా పతిం దృష్ట్వా ప్రేమోత్కణ్ఠాశ్రులోచనా
మీలితాక్ష్యనమద్బుద్ధ్యా మనసా పరిషస్వజే
పతివ్రత భర్తను చూచి కనులు మూసుకుని నమస్కరించి మనసులోనే ఆలింగనం చేసుకుంది
పత్నీం వీక్ష్య విస్ఫురన్తీం దేవీం వైమానికీమివ
దాసీనాం నిష్కకణ్ఠీనాం మధ్యే భాన్తీం స విస్మితః
దైవ విమానాలలో సంచరించే దేవతా స్త్రీలా ఉండే తన భార్యను చూచి, అనేక ఆభరణాలు ధరించిన దాసీల మధ్య ఉన్న తన భార్యను చూచి ఆశ్చర్యాన్ని పొందాడు
ప్రీతః స్వయం తయా యుక్తః ప్రవిష్టో నిజమన్దిరమ్
మణిస్తమ్భశతోపేతం మహేన్ద్రభవనం యథా
ఆమెతో కలసి తన మందిరములో ప్రవేశించాడు. మహేంద్ర భవనములా ఉన్న ఆ ఇంటిలోకి వెళ్ళాడు. మణిస్తంభాలతో కూడి ఉంది
పయఃఫేననిభాః శయ్యా దాన్తా రుక్మపరిచ్ఛదాః
పర్యఙ్కా హేమదణ్డాని చామరవ్యజనాని చ
పాల నురుగులాంటి శయ్య ఏనుగు దంతములతో చేయబడిన మంచము, బంగారు తొడుగు తొడగబడిన మంచములూ శయ్యలూ. చామరములూ
ఆసనాని చ హైమాని మృదూపస్తరణాని చ
ముక్తాదామవిలమ్బీని వితానాని ద్యుమన్తి చ
బంగారు సింహాసనాలూ, మెత్తని పరుపులూ, ముత్యాల హారాలు అన్నిటికీ వేళ్ళాడుతూ ఉన్నాయి.
స్వచ్ఛస్ఫటికకుడ్యేషు మహామారకతేషు చ
రత్నదీపాన్భ్రాజమానాన్లలనా రత్నసంయుతాః
స్వచ్చమైన స్ఫటిక మణులతో గోడలు వాటి మధ్యలో మరకత మణులు, రత్న దీపములూ, రత్న దీపాలను పట్టుకున్న మెడలో హారాలు ధరించిన లలనలు.
విలోక్య బ్రాహ్మణస్తత్ర సమృద్ధీః సర్వసమ్పదామ్
తర్కయామాస నిర్వ్యగ్రః స్వసమృద్ధిమహైతుకీమ్
ఇవాన్నీ చూచాడు బ్రాహ్మణుడు. కారణమేదీ లేకుండా హఠాత్తుగా ఈ సంపద ఎలా వచ్చింది
నూనం బతైతన్మమ దుర్భగస్య శశ్వద్దరిద్రస్య సమృద్ధిహేతుః
మహావిభూతేరవలోకతోऽన్యో నైవోపపద్యేత యదూత్తమస్య
నేను దౌర్భాగ్యున్ని, నాకు ఇంత సమృద్ధికి కారణం ఏమై ఉంటుంది. మహా విభూతి ఐన పరమాత్మ కటాక్షం కటే వేరే ఏ కారణం ఉంటుంది. స్వామిని చూచినవారిని కంటే స్వామి చూచిన వారు అదృష్టవంతులు. మనసునూ బుద్ధినీ శరీరాన్ని పవిత్రం చేసుకుంటే భగవంతుడు మనను చూస్తాడు
నన్వబ్రువాణో దిశతే సమక్షం యాచిష్ణవే భూర్యపి భూరిభోజః
పర్జన్యవత్తత్స్వయమీక్షమాణో దాశార్హకాణామృషభః సఖా మే
నోరు తెరచి ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత సంపద ఇచ్చాడా. ఇంత ఇచ్చి కూడా నా మిత్రుడు మేఘములా ఇచ్చాడు. నేనింత నీరు ఇచ్చాను అని మేఘం చెప్పదు. స్వామి కూడా ఇంత ఇచ్చీ నోరు విడిచి చెప్పడు.
కిఞ్చిత్కరోత్యుర్వపి యత్స్వదత్తం
సుహృత్కృతం ఫల్గ్వపి భూరికారీ
మయోపణీతం పృథుకైకముష్టిం
ప్రత్యగ్రహీత్ప్రీతియుతో మహాత్మా
తాను ఇచ్చినది ఎంత పెద్దదైనా చాలా తక్కువ అంటాడు. తన భక్తుడు ఎంత కొద్దిగా ఇచ్చినా ఎంతో ఇచ్చావు అంటాడు. నేను తీసుకు వెళ్ళిన ఒక పిడికెడు అటుకులను ప్రేమతో స్వీకరించాడు కృష్ణుడు. ఈ సంపదలు నాకెందుకు. అటువంటి మహానుహ్బావుని స్నేహమూ దాస్యమూ జన్మ జన్మలకూ కావాలి
తస్యైవ మే సౌహృదసఖ్యమైత్రీ దాస్యం పునర్జన్మని జన్మని స్యాత్
మహానుభావేన గుణాలయేన విషజ్జతస్తత్పురుషప్రసఙ్గః
అఖిల గుణములకూ ఆలవాలమైన పరమాత్మతో కలసి ఉంటే, పరమాత్మ భక్తుల కథలను చెప్పుకోవచ్చు. భక్తులతో కలసి ఉండడానికి భగవంతుని యందు మనసు లంగం కావాలి.
భక్తాయ చిత్రా భగవాన్హి సమ్పదో రాజ్యం విభూతీర్న సమర్థయత్యజః
అదీర్ఘబోధాయ విచక్షణః స్వయం పశ్యన్నిపాతం ధనినాం మదోద్భవమ్
పరమాత్మ తన భక్తులకు ఎపుడూ సంపదలనూ భోగాలనూ ఐశ్వర్యాలనూ ఇవ్వడానికి ఒప్పుకోడు. చిత్ర విచిత్ర విభూతులను తన భక్తులకు ఇవ్వడానికి ఒప్పుకోడు.
చాలా దూరముగా చూచి, విపులమైన జ్ఞ్యానం కలగాడానికి, ధనం ఇస్తే మదం కలుగుతుందనీ, ధనవంతులు పతనమవుతారని తన భక్తులకు సంపదలు ఇవ్వడానికి స్వామి ఒప్పుకోడు
ఇత్థం వ్యవసితో బుద్ధ్యా భక్తోऽతీవ జనార్దనే
విషయాన్జాయయా త్యక్ష్యన్బుభుజే నాతిలమ్పటః
ఐనా నాకు ఇచ్చాడంటే నా మనసులో ఏముందో స్వామి తెలుస్కున్నాడు. నా భార్యకు ప్రీతి కలిగించాలని అనుకున్నానని తెలుసుకున్నాడు. ఇలా పరమాత్మ యందు భక్తి మరి కాస్త పెరిగింది. సంపద చూస్తోన్న కొద్దీ పరమాత్మ మీద భక్తి పెరుగుతోంది.
భార్యతో కలసి సాంసారిక విషయాలను అనుభవిస్తున్నాడు కానీ. లౌల్యముతో అనుభవించలేదు. విషయములను విడిచిపెడుతూనే భగవత్ప్రసాదముగా భావించి అనుభవించాడు.
తస్య వై దేవదేవస్య హరేర్యజ్ఞపతేః ప్రభోః
బ్రాహ్మణాః ప్రభవో దైవం న తేభ్యో విద్యతే పరమ్
ఆ పరమాత్మ, యజ్ఞ్యపతి, ఈయనకు బ్రాహ్మణులు దైవం, బ్రాహ్మణులే ప్రభువులు. బ్రాహ్మణులకంటే అధికమైన శ్రేష్టమైన వస్తువులేదు
ఏవం స విప్రో భగవత్సుహృత్తదా దృష్ట్వా స్వభృత్యైరజితం పరాజితమ్
తద్ధ్యానవేగోద్గ్రథితాత్మబన్ధనస్తద్ధామ లేభేऽచిరతః సతాం గతిమ్
పరమాత్మకు అజితుడు అని పేరు ఉంది.తన భక్తుల చేత ఓడించబడే అజితుడు పరమాత్మ. ఎవరి చేతా ఓడిపోని పరమాత్మ తన భక్తుల చేతిలో ఓడిపోవడం చూచి , అతని ధ్యానముతో ఆత్మను బంధించే అన్ని సంసార బంధనములనూ చేదించుకుని అతి త్వరలోనే పరమ పదాన్ని పొందాడు
ఏతద్బ్రహ్మణ్యదేవస్య శ్రుత్వా బ్రహ్మణ్యతాం నరః
లబ్ధభావో భగవతి కర్మబన్ధాద్విముచ్యతే
ఇది పరమాత్మ యొక్క బ్రాహ్మణ ప్రియత్వం. దీన్ని పరమాత్మ యందే మనసు ఉంచి వింటే, తన్మయత్వముతో వింటే సాంసారిక కర్మ బంధములన్నీ తొలగిపోతాయి. సంపద మీద ఆశ కూడా తొలగిపోతుంది. అందుకు ఈ ఉపాఖ్యానాన్ని అందరూ పారాయణ చేయాలి
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment