ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఐదవ అధ్యాయం
శ్రీరాజోవాచ
భగవన్తం హరిం ప్రాయో న భజన్త్యాత్మవిత్తమాః
తేషామశాన్తకామానాం క నిష్ఠావిజితాత్మనామ్
లోకములో చాలా మంది శ్రీమన్నారాయణున్ని ఆరాధించరు. ఇతర దేవతలను ఆరాధించడానికే మొగ్గు చూపుతారు. కోరికలు చల్లారక నిరంతరం కోరికలతో ఇతరులను ఆరాధించేవారికి పట్టే గతి ఏమిటి.
శ్రీచమస ఉవాచ
ముఖబాహూరుపాదేభ్యః పురుషస్యాశ్రమైః సహ
చత్వారో జజ్ఞిరే వర్ణా గుణైర్విప్రాదయః పృథక్
పరమాత్మ ముఖ బాహు ఊరు పాదములతో నాలుగు వర్ణాలూ నాలుగు ఆశ్రమాలూ ఏర్పడ్డాయి. గుణములూ కర్మనూ బట్టి నాలుగు వర్ణములు. బ్రాహ్మణులు సాత్వికులు. క్షత్రియ వైశ్యులు రాజసికులు. శూద్రులు తామసికులు. సత్వ గుణము బర్హ్మ చర్యములో రజో గుణం గృహస్థాశ్రమములో విశుద్ధ సత్వం సన్యాసములో, సత్వ రజ సమ్మిశ్రము వానప్రస్థములో ఉంటుంది. ఇలా పరమాత్మ సృష్టి చేసాడు.
య ఏషాం పురుషం సాక్షాదాత్మప్రభవమీశ్వరమ్
న భజన్త్యవజానన్తి స్థానాద్భ్రష్టాః పతన్త్యధః
ఇలా అన్ని క్రియలకూ అన్ని వర్ణములకూ అన్ని ఆశ్రమములకూ అన్ని రక్షణలకూ అన్ని స్వరూపాలకూ మూలమైన పరమాత్మను అజ్ఞ్యానముతో కామోపహతులై ఎవరతిఏ ఆరాధించరో వారు భ్రష్టులై కర్మ భ్రష్టులై పతనమైపోతారు.
దూరే హరికథాః కేచిద్దూరే చాచ్యుతకీర్తనాః
స్త్రియః శూద్రాదయశ్చైవ తేऽనుకమ్ప్యా భవాదృశామ్
కొందరికి హరి కథ వినడం అంటే అసలు పడదు. హరి నామం కీర్తించడమంటే పడదు
వేద విహిత కర్మలు ఆచరించలేని స్త్రీ శూద్రులకు జ్ఞ్యానం ఉన్నవారు అనుగ్రహించాలి
విప్రో రాజన్యవైశ్యౌ వా హరేః ప్రాప్తాః పదాన్తికమ్
శ్రౌతేన జన్మనాథాపి ముహ్యన్త్యామ్నాయవాదినః
వేదమును బాగా చదివేవారు కూడా మోహమును పొందుతున్నారు. వేదాధ్యయనముతో గానీ బ్రాహ్మణ జన్మతో కానీ, విప్రులూ రాజులూ వైశ్యులూ పరమాత్మ యొక్క పాదముల ఆరాధనను చేయవచ్చు అని చెప్పబడినా అది చేయలేక మోహాన్ని పొందుతున్నారు
కర్మణ్యకోవిదాః స్తబ్ధా మూర్ఖాః పణ్డితమానినః
వదన్తి చాటుకాన్మూఢా యయా మాధ్వ్యా గిరోత్సుకాః
పరమాత్మను ఆరాధించే కర్మను ఎలా చేయాలో తెలియలేని వారు, స్తబ్ధముగా ఉండేవారు, కొందరు మూర్ఖులు, కొందరు తమను తాము పండితులమనుకునేవారు.
చాటు మాటలను వినగానే నచ్చే మాటలను, తీయని మాటలతో మనసుని బోల్తాగొట్టించేవారు, రజో గుణసంపన్నులు,
రజసా ఘోరసఙ్కల్పాః కాముకా అహిమన్యవః
దామ్భికా మానినః పాపా విహసన్త్యచ్యుతప్రియాన్
పాము లాంటి కోపముతో బుస కొడుతూ ఉంటారు. ఇలాంటి వారందరూ పరమాత్మ భక్తులని అవహేళన చేస్తారు.
వదన్తి తేऽన్యోన్యముపాసితస్త్రియో గృహేషు మైథున్యపరేషు చాశిషః
యజన్త్యసృష్టాన్నవిధానదక్షిణం వృత్త్యై పరం ఘ్నన్తి పశూనతద్విదః
సంసారం యందు గృహస్థాశ్రమం యందు భార్య సంగమము చేత ఉన్న జీవితాన్నీ, అన్నమూ దక్షిణా మొదలైన వాటిని తీర్చే పనులు ఆచరించడానికి పూనుకుంటారు. తమ సుఖం కోసం పశువులను చంపుతారు. దేవతారాధన పేరుతో పశువులను చంపుతారు.తత్వం తెలియక పశువులను చంపుతారు.
శ్రియా విభూత్యాభిజనేన విద్యయా త్యాగేన రూపేణ బలేన కర్మణా
జాతస్మయేనాన్ధధియః సహేశ్వరాన్సతోऽవమన్యన్తి హరిప్రియాన్ఖలాః
సంపదా అధికారం ఉత్తమ వంశం, విద్యా త్యాగమూ సౌందర్యమూ బలమూ కర్మలూ ఆచరిస్తూ మా అంతవారెవరూ లేరు, మేమే ఈ ఘనకార్యాలు చేస్తున్నాము అని వీటన్నిటితో, గర్వించి గుడ్డి బుద్ధి కలవారై పరమాత్మనూ, ఇతర దేవతలనూ అవమానిస్తారు. కర్మలనూ బ్రహ్మనూ పరమాత్మనూ దేవతలనూ అవమానించి నిందిస్తారు
సర్వేషు శశ్వత్తనుభృత్స్వవస్థితం
యథా ఖమాత్మానమభీష్టమీశ్వరమ్
వేదోపగీతం చ న శృణ్వతేऽబుధా
మనోరథానాం ప్రవదన్తి వార్తయా
అంతటా ఆకాశం ఎలా వ్యాపించి ఉందో అన్ని ప్రాణులలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. వేదం "అందరిలో పరమాత్మ ఉన్నాడు" అని చెప్పినా వినక జ్ఞ్యానం లేని వారై తమకు ఉన్న కోరికలతో వాటిని పెంచుకుంటూ ఉంటారు. పరమాత్మను తలచరు
లోకే వ్యవాయామిషమద్యసేవా నిత్యా హి జన్తోర్న హి తత్ర చోదనా
వ్యవస్థితిస్తేషు వివాహయజ్ఞ సురాగ్రహైరాసు నివృత్తిరిష్టా
స్త్రీ పురుష సంగమాన్ని, మద్యపానాన్నీ, మాంస భక్షణముతో సుఖించమని ఎవరూ చెప్పనక్కరలేకుండానే ప్రవర్తిస్తారు. అలాంటి వాటికి కూడా నియమం ఉండాలి. వివాహమైన తరువా భార్యతో మాత్రమే కలవాలి. యజ్ఞ్యములోనే మద్యమును కానీ మాంసమును కానీ తీసుకోవాలి. వేద విహితమైన కర్మలలోనే సురాపానం గానీ, మాంస భక్షణం కానీ వారి ఇంద్రియ చాపల్యముతో చేయరాదు. వేద విహిత కర్మలలో తప్ప వీటిని వేరే విధముగా చేయరాదు.
ధనం చ ధర్మైకఫలం యతో వై
జ్ఞానం సవిజ్ఞానమనుప్రశాన్తి
గృహేషు యుఞ్జన్తి కలేవరస్య
మృత్యుం న పశ్యన్తి దురన్తవీర్యమ్
ధనాన్ని ధర్మాన్ని ఆచరించి మాత్రమే సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని ధర్మం కోసమే ఖర్చుపెట్టాలి. ధర్మముతో ధనాన్ని సంపాదించి, ధనాన్ని ధర్మం కోసమే ఖర్చుపెడితేనే జ్ఞ్యానం విజ్ఞ్యానం ఏర్పడతాయి. అది తెలుసుకోక గృహస్థాశ్రమములో తామనుకున్న కోరికలను తీర్చుకోవడానికి అన్ని అడ్డదారులలో ప్రవేశిస్తారు కానీ నెత్తిన కూర్చున్న మృత్యువుని, ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆపరాని మృత్యువుని చూడడం లేదు.
యద్ఘ్రాణభక్షో విహితః సురాయాస్తథా పశోరాలభనం న హింసా
ఏవం వ్యవాయః ప్రజయా న రత్యా ఇమం విశుద్ధం న విదుః స్వధర్మమ్
యజ్ఞ్యములో మద్యమును వాసన మాత్రం చూడాలి. ఏ పశువును యజ్ఞ్యములో వధించామో ఆ పశువు యొక్క మాంసాన్ని స్పృశించాలి. అంతే కానీ యజ్ఞ్యములో మద్యపానం, మాంస భక్షణం చేయమని చెప్పబడలేదు. స్త్రీ పురుష సమాగమం కూడా సంతానం కోసమే. కోరికా సంతోషం ఇష్టం ప్రీతి కోసం కాదు. వివాహం సంతానం కోసం. స్త్రీ పురుష సమాగమం సంతాన కలగడానికి మాత్రమే.
ఇది స్వధర్మమంటే. దీన్ని తెలియక జిహ్వాది చాపల్యములో దిగి వేద విహితమైన ధర్మాన్ని పక్కదారి పట్టించి అపార్థాలు చెప్పి అపవ్యాఖ్యానాలు చేసి తమ ఇష్టమొచ్చి రీతిలో ప్రచారం చేసి తాము భ్రష్టులై లోకాన్ని భ్రంశం చేస్తున్నారు.
యే త్వనేవంవిదోऽసన్తః స్తబ్ధాః సదభిమానినః
పశూన్ద్రుహ్యన్తి విశ్రబ్ధాః ప్రేత్య ఖాదన్తి తే చ తాన్
ధర్మం ఇలా ఉంటే దాన్ని తెలియక స్తభ్దులై దుర్మార్గులై, మేమే సజ్జనులమని తమను తాము మెచ్చుకుని, తమ మాంస భక్షణం కోసమే పశువులను యజ్ఞ్యములో హింసిస్తున్నారు. ఇక్కడ ఏ జంతువు యొక్క ఏ అవయవాన్ని ఇష్టముగా తింటామో, మనం నరకానికి వెళ్ళినపుడు మన ఆ అవయవాన్ని తినడానికి సిద్ధముగా ఉంటాయి.
ద్విషన్తః పరకాయేషు స్వాత్మానం హరిమీశ్వరమ్
మృతకే సానుబన్ధేऽస్మిన్బద్ధస్నేహాః పతన్త్యధః
ఎదుటివారి శరీరములో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ద్వేషిస్తున్నారు. ఏనాటికైనా పడిపోయే శరీరాన్ని ప్రేమిస్తూ, శరీరములో అంతర్యామిగా ఉన్న పరమాత్మను ద్వేషిస్తున్నారు. శరీరాన్నే కాక, శరీరముతో ఉన్న బంధువులను ప్రేమించి పరమాత్మను ద్వేషించి పతనమవుతున్నాడు.
యే కైవల్యమసమ్ప్రాప్తా యే చాతీతాశ్చ మూఢతామ్
త్రైవర్గికా హ్యక్షణికా ఆత్మానం ఘాతయన్తి తే
వీరంతా ఆత్మ హత్య చేసుకున్నవారితో సమానం. ధర్మార్థ కామాలనూ, సత్వ రజస్తమో గుణాలనూ మాత్రమే ఆరాధిస్తూ వాటినే నిత్యం అనుకుని వారు ఆత్మ హత్య చేసుకుంటున్నారు.
ఏత ఆత్మహనోऽశాన్తా అజ్ఞానే జ్ఞానమానినః
సీదన్త్యకృతకృత్యా వై కాలధ్వస్తమనోరథాః
వీరు ఆత్మ హత్య చేసుకున్న వారు, అశాంతులు, అజ్ఞ్యానులు, అజ్ఞ్యానములో జ్ఞ్యానాన్ని భావిస్తూ, చేయవలసిన దాన్ని చేయకుండా కష్టపడుతున్న వీరి కోరికలను కాలమే ధ్వంసం చేస్తుంది.
హిత్వాత్మమాయారచితా గృహాపత్యసుహృత్స్త్రియః
తమో విశన్త్యనిచ్ఛన్తో వాసుదేవపరాఙ్ముఖాః
ఎంతో కష్టపడి ఎన్నో అప్పులు చేసి ఇల్లు కట్టుకుని పెళ్ళి చేసుకుని, భార్యను ప్రేమించి, సంతానాన్ని పొంది, వారిని పెంచి, సంపదను పెంచి, ఇంత కష్ట పడి కూడబెట్టుకున్నవి వెళ్ళేప్పుడు తీసుకుని వెళ్ళరు. మూర్ఖులు. అన్నిటినీ విడిచిపెట్టి కోరకున్నా నరకమునకు వెళతారు. పరమాత్మకు విముఖముగా ఉండేవారికి పట్టే గతి ఇది.
శ్రీ రాజోవాచ
కస్మిన్కాలే స భగవాన్కిం వర్ణః కీదృశో నృభిః
నామ్నా వా కేన విధినా పూజ్యతే తదిహోచ్యతామ్
పరమాత్మ ఏ కాలములో ఏ వర్ణములో ఏ స్వరూపముతో ఏ పేరుతో ఏ విధానముతో అవతరించాడు, పూజించబడుతున్నాడు? అన్నియుగాలలో స్వామి యొక్క పూజావిధానాలు చెప్పవలసినది
శ్రీకరభాజన ఉవాచ
కృతం త్రేతా ద్వాపరం చ కలిరిత్యేషు కేశవః
నానావర్ణాభిధాకారో నానైవ విధినేజ్యతే
పరమాత్మ నాలుగు యుగాలలో (కృత త్రేత ద్వాపర కలి)నానా వర్ణాలూ నామాలు స్వరూపాలూ రూపాలుగా శాస్త్రోక్త విధితో పూజించబడతాడు
కృతే శుక్లశ్చతుర్బాహుర్జటిలో వల్కలామ్బరః
కృష్ణాజినోపవీతాక్షాన్బిభ్రద్దణ్డకమణ్డలూ
కృత యుగములో తెలుపు వర్ణముతో నాలుగు భుజాలతో జటలు ధరించి నార వస్త్రాలు కట్టుకొని , కృష్ణాజినం యజ్ఞ్యోపవీతం జపమాల దండ కమండలాలూ ధరించి ఉంటారు
మనుష్యాస్తు తదా శాన్తా నిర్వైరాః సుహృదః సమాః
యజన్తి తపసా దేవం శమేన చ దమేన చ
అప్పటి కాలములో మనుష్యులు శాంతులు, వైరం లేని వారు, మిత్రులూ సమదృష్టి కలవారు, తపస్సుతో అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహముతో ఆ కాలములో అర్చిస్తారు
హంసః సుపర్ణో వైకుణ్ఠో ధర్మో యోగేశ్వరోऽమలః
ఈశ్వరః పురుషోऽవ్యక్తః పరమాత్మేతి గీయతే
ఈ పేర్లతో కృతయుగములో స్వామి వ్యవహరించబడతాడు
త్రేతాయాం రక్తవర్ణోऽసౌ చతుర్బాహుస్త్రిమేఖలః
హిరణ్యకేశస్త్రయ్యాత్మా స్రుక్స్రువాద్యుపలక్షణః
త్రేతా యుగములో ఎరుపు రంగులో ఉంటాడు. నాలుగు బాహువులు కలిగి ఉంటాడు, మూడు హద్దులు కలిగి, బంగారు రంగు కేశములు, శ్రుక్కూ శ్రువమూ పట్టుకుని ఉంటాడు.
తం తదా మనుజా దేవం సర్వదేవమయం హరిమ్
యజన్తి విద్యయా త్రయ్యా ధర్మిష్ఠా బ్రహ్మవాదినః
ఆ సర్వ దేవమయుడైన స్వామిని పరమాత్మను, మానవులు వేద విద్యతో ధర్మిష్టులై బ్రహ్మవాదులై ఆరాధిస్తారు.
విష్ణుర్యజ్ఞః పృశ్నిగర్భః సర్వదేవ ఉరుక్రమః
వృషాకపిర్జయన్తశ్చ ఉరుగాయ ఇతీర్యతే
ఇవి ఆ యుగములో స్వామి నామాలు
ద్వాపరే భగవాఞ్శ్యామః పీతవాసా నిజాయుధః
శ్రీవత్సాదిభిరఙ్కైశ్చ లక్షణైరుపలక్షితః
ద్వాపర యుగములో నలుపు వర్ణముతో పీతాంబరధారి, శంఖ చక్రాది ఆయుధాలు ధరించి శ్రీవత్సాది లక్షణాలు ధరించి
తం తదా పురుషం మర్త్యా మహారాజోపలక్షణమ్
యజన్తి వేదతన్త్రాభ్యాం పరం జిజ్ఞాసవో నృప
మహారాజు లక్షణములతో ఉన్న స్వామిని వేదములతో తంత్రములతో తెలియగోరిన మానవులు పూజిస్తారు
నమస్తే వాసుదేవాయ నమః సఙ్కర్షణాయ చ
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ తుభ్యం భగవతే నమః
నారాయణాయ ఋషయే పురుషాయ మహాత్మనే
విశ్వేశ్వరాయ విశ్వాయ సర్వభూతాత్మనే నమః
ఈ మంత్రాలతో స్వామిని ద్వారపములో పూజిస్తారు
ఇతి ద్వాపర ఉర్వీశ స్తువన్తి జగదీశ్వరమ్
నానాతన్త్రవిధానేన కలావపి తథా శృణు
కలియుగములో పరమాత్మను నానా తంత్ర విధానాలతో ఆరాధిస్తారు
కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాఙ్గోపాఙ్గాస్త్రపార్షదమ్
యజ్ఞైః సఙ్కీర్తనప్రాయైర్యజన్తి హి సుమేధసః
నల్లని వర్ణం, అన్ని అస్త్రములూ ద్వరపాలకులూ పరిజనం ఉన్న స్వామిని సంకీర్తనతో ఆరాధ్సితారు. కలియుగములో నామ సంకీర్తనమే యజ్ఞ్యం
ధ్యేయం సదా పరిభవఘ్నమభీష్టదోహం
తీర్థాస్పదం శివవిరిఞ్చినుతం శరణ్యమ్
భృత్యార్తిహం ప్రణతపాల భవాబ్ధిపోతం
వన్దే మహాపురుష తే చరణారవిన్దమ్
నిరంతరం పరమాత్మను సేవించాలి. మనకు కలిగే అన్ని పరాభవాలనూ ఆయన తొలగిస్తాడు, మనం కోరిన శరీరం ధరిస్తాడు, అన్ని పవిత్రాలకూ మూలం, బ్రహ్మేంద్రాదులచే సేవించబడేవాడు.
రక్షకుడు. సేవకుల బాధలు తొలగించేవాడు, నమస్కరించేవారి సంసార సముద్రానికి ఓడలాంటి వాడు. అలాంటి పాద పద్మాలకు నమస్కరిస్తున్నాను
త్యక్త్వా సుదుస్త్యజసురేప్సితరాజ్యలక్ష్మీం
ధర్మిష్ఠ ఆర్యవచసా యదగాదరణ్యమ్
మాయామృగం దయితయేప్సితమన్వధావద్
వన్దే మహాపురుష తే చరణారవిన్దమ్
ఎంత ప్రయత్నం చేసినా వదిలిపెట్ట శక్యం కాని, దేవతల చేత కోరబడే రాజ్య సంపదను వదిలిపెట్టి ధర్మిష్టుడై పెద్దల మాటతో అరణ్యానికి వెళ్ళాడు (శ్రీరాముడు).
భార్యను తీసుకుని వెళ్ళాడు. తండ్రి మాటకు రాజ్యం వదిలాడు. ప్రియురాలు కోరినదని ఆమెను విడిచిపెట్టి మాయా మృగాన్ని అనుసరించాడు. రాజ్యమూ భార్యా పుత్రులూ బంధువులూ కోరికలూ ఎంత గాఢమైనవో నీ ఆచరణతో మాకు నేర్పిన నీకు మా నమస్కారం
ఏవం యుగానురూపాభ్యాం భగవాన్యుగవర్తిభిః
మనుజైరిజ్యతే రాజన్శ్రేయసామీశ్వరో హరిః
పరమాత్మ ఆయా యుగములకు అనుగుణమైన ఆయా రూపముతో మానవులు సేవిస్తారు. పరమాత్మ మనకు కావలసిన శ్రేయస్సును అందిస్తూ ఉంటాడు
కలిం సభాజయన్త్యార్యా గుణ జ్ఞాః సారభాగినః
యత్ర సఙ్కీర్తనేనైవ సర్వస్వార్థోऽభిలభ్యతే
అన్ని గుణాల కంటే, గుణములు తెలిసిన వారు సారం గ్రహించిన వారు కలియుగాన్నే ఆరాధిస్తారు. తక్కిన యుగాలలో ఎంతో కష్టపడితే కానీ లభించని ఫలం,ఎక్కువ కష్టం లేకుండా పరమాత్మ నామ సంకీర్తనతోనే లభిస్తాయి. ఈ కలియుగాన్ని సారం తెలిసిన గుణజ్ఞ్యులు ఎక్కువగా కోరతారు
న హ్యతః పరమో లాభో దేహినాం భ్రామ్యతామిహ
యతో విన్దేత పరమాం శాన్తిం నశ్యతి సంసృతిః
ఇంత కంటే మంచి యుగం, మంచి లాభం మరి ఇంకొకటి లేదు. ఇలాంటి నామ సంకీర్తన కంటే గొప్ప లాభం మరింకొకటిలేదు. దీనితో పరమ శాంతిని పొందుతారు, సంసారం నశిస్తుంది
కృతాదిషు ప్రజా రాజన్కలావిచ్ఛన్తి సమ్భవమ్
కలౌ ఖలు భవిష్యన్తి నారాయణపరాయణాః
కృత యుగములో మొదలైన యుగాలలో పుట్టినవారు కలియుగములో పుట్టాలని కోరుకుంటారు,
కలియుగములో ఎక్కువ శ్రీమన్నారయణుని భక్తులుగా ఉంటారు
క్వచిత్క్వచిన్మహారాజ ద్రవిడేషు చ భూరిశః
తామ్రపర్ణీ నదీ యత్ర కృతమాలా పయస్వినీ
తక్కిన ప్రాంతములలో కంటే ద్రావిడ భూములలో ఎక్కువ మంది పుడతారు
కావేరీ చ మహాపుణ్యా ప్రతీచీ చ మహానదీ
యే పిబన్తి జలం తాసాం మనుజా మనుజేశ్వర
ప్రాయో భక్తా భగవతి వాసుదేవేऽమలాశయాః
ఇలాంటి ఉత్తమ నదులు ఉన్న ద్రావిడ ప్రాంతములో ఆ పవిత్ర జలమును తాగిన వారు, పరమాత్మ యందు భక్తులై, పరమాత్మ యందు ఉన్నతమైన భావన కలవారవుతారు.
దేవర్షిభూతాప్తనృణాం పితౄణాం న కిఙ్కరో నాయమృణీ చ రాజన్
సర్వాత్మనా యః శరణం శరణ్యం గతో ముకున్దం పరిహృత్య కర్తమ్
అక్కడ ఉన్న వారు దేవ ఋషి భూత ఆప్త పితృ దేవతలకు కింకరులవుతారు. అన్ని కృత్యములూ ఆచరించి అన్ని ఋణాలనూ తీర్చుకుంటారు. అన్ని వదలిపెట్టి సర్వ భావముతో పరమాత్మను చేరతారు.
స్వపాదమూలమ్భజతః ప్రియస్య త్యక్తాన్యభావస్య హరిః పరేశః
వికర్మ యచ్చోత్పతితం కథఞ్చిద్ధునోతి సర్వం హృది సన్నివిష్టః
అలాంటి భక్తునికి , అన్నీ వదలినవాడికి పరమాత్మ, చేయకూడని పనీ అధర్మం వంటివి మీద వచ్చి పడ్డా తొలగిస్తాడు. మన హృదయములో ఉన్న అంతర్యామి అన్నిటినీ పోగొడతాడు.
శ్రీనారద ఉవాచ
ధర్మాన్భాగవతానిత్థం శ్రుత్వాథ మిథిలేశ్వరః
జాయన్తేయాన్మునీన్ప్రీతః సోపాధ్యాయో హ్యపూజయత్
ఈ రీతిలో మిథిలేశ్వరుడు భాగవత ధర్మాలనన్నిటినీ విని, వారందరినీ పూజించాడు
తతోऽన్తర్దధిరే సిద్ధాః సర్వలోకస్య పశ్యతః
రాజా ధర్మానుపాతిష్ఠన్నవాప పరమాం గతిమ్
అన్ని లోకాలూ చూస్తుండగా వారు అంతర్థానం చెందాడు. ఈ మహారాజు కూడా ధర్మాన్ని సక్రమముగా విని పరమగతిని పొందాడు
త్వమప్యేతాన్మహాభాగ ధర్మాన్భాగవతాన్శ్రుతాన్
ఆస్థితః శ్రద్ధయా యుక్తో నిఃసఙ్గో యాస్యసే పరమ్
నీవు కూడా విన్న ఈ భాగవత ధర్మాలను, విన్నవాటిని ఆచరించి ఆశ్రయించి, సంగమమును వదలిపెట్టి పరమపదాన్ని పొందుతావు
యువయోః ఖలు దమ్పత్యోర్యశసా పూరితం జగత్
పుత్రతామగమద్యద్వాం భగవానీశ్వరో హరిః
సకల జగత్తూ నీ కీర్తితో నిండి ఉంటుంది. స్వయముగా పరమాత్మే మీకు పుత్రుడిగా పుట్టాడు
దర్శనాలిఙ్గనాలాపైః శయనాసనభోజనైః
ఆత్మా వాం పావితః కృష్ణే పుత్రస్నేహం ప్రకుర్వతోః
పరమాత్మను మీరు నిత్యమూ చూస్తూ కౌగిలించుకుంటూ మాట్లాడుతూ పడుకోబెడుతూ కలసి పడుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారు. వీటితో మీ మనసును పరిశుద్ధం చేసుకున్నారు
వైరేణ యం నృపతయః శిశుపాలపౌణ్డ్ర
శాల్వాదయో గతివిలాసవిలోకనాద్యైః
ధ్యాయన్త ఆకృతధియః శయనాసనాదౌ
తత్సామ్యమాపురనురక్తధియాం పునః కిమ్
కృష్ణ పరమాత్మ యందు పుత్రుడనే ప్రేమతో మిమ్ములను పావనం చేసుకున్నారు.
శతృత్వముతో శిశుపాలుడు దంతవక్తృడూ శాల్వుడూ పౌండ్రుడూ, శతృత్వమున్నా కృష్ణుని అందాలకు ముగ్ధులయ్యారు. కృష్ణున్నే ధ్యానం చేసేవారు. పడుకున్నా కూర్చున్న భోజనం చేస్తున్నా అతనినే తలచుకుని అతని గతినే పొందారు. శతృత్వముతో తలచినవారికే మోక్షం వచ్చిందంటే, ప్రేమించి ధ్యానించేవారికి వస్తుంది అని వేరే చెప్పాలా.
మాపత్యబుద్ధిమకృథాః కృష్ణే సర్వాత్మనీశ్వరే
మాయామనుష్యభావేన గూఢైశ్వర్యే పరేऽవ్యయే
ఈయన సర్వాత్మ, పరమాత్మ, ఈయన యందు సంతానం అన్న బుద్ధి చేయకండి. మనుష్యభావముతో తన శాస్కత్వాన్ని ఐశ్వర్యాన్ని దాచి ఉంచాడు. అతడు పరుడు అవ్యయుడు
భూభారాసురరాజన్య హన్తవే గుప్తయే సతామ్
అవతీర్ణస్య నిర్వృత్యై యశో లోకే వితన్యతే
భూమికి భారముగా మారిన అసుర రాజులను చంపేవాడు, సత్పురుషులను రక్షించేవాడు, అవతరించిన పనిని పరిపూర్ణముగా చేసి లోకములో కీర్తిని వ్యాపింపచేస్తాడు
శ్రీశుక ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా మహాభాగో వసుదేవోऽతివిస్మితః
దేవకీ చ మహాభాగా జహతుర్మోహమాత్మనః
నారదుని వలన ఈ వృత్తాంతాన్ని విన్న వసుదేవుడు దేవకితో కలసి తన మోహాన్ని విడిచిపెట్టాడు
ఇతిహాసమిమం పుణ్యం ధారయేద్యః సమాహితః
స విధూయేహ శమలం బ్రహ్మభూయాయ కల్పతే
పరమ పవిత్రమైన ఈ సంవాదాన్ని సావధానముతో విన్నవాడు అన్ని పాపాలూ పోగొట్టుకొని, పరమాత్మ సారూప్యాన్ని పొందుతాడు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment