ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై ఎనిమిదవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
శిశుపాలస్య శాల్వస్య పౌణ్డ్రకస్యాపి దుర్మతిః
పరలోకగతానాం చ కుర్వన్పారోక్ష్యసౌహృదమ్
ఈ దంతవక్తృడు చనిపోయిన శాల్వునికీ పౌణ్డ్రకునికీ శిశుపాలునికీ ముగ్గురికీ పరోక్షముగా స్నేహ భావాన్ని చూపడానికి ఒక్కడే పదాతి అయి గదను తీసుకు వచ్చాడు
ఏకః పదాతిః సఙ్క్రుద్ధో గదాపాణిః ప్రకమ్పయన్
పద్భ్యామిమాం మహారాజ మహాసత్త్వో వ్యదృశ్యత
తం తథాయాన్తమాలోక్య గదామాదాయ సత్వరః
అవప్లుత్య రథాత్కృష్ణః సిన్ధుం వేలేవ ప్రత్యధాత్
అలా వచ్చిన వాడిని చూచి కృష్ణుడు గదను తీసుక్ని వాడి మీదకు వెళ్ళాడు
గదాముద్యమ్య కారూషో ముకున్దం ప్రాహ దుర్మదః
దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టిపథం గతః
కృష్ణా నా అదృష్ట వశాత్తు నీవు నా కంట బడ్డావు
త్వం మాతులేయో నః కృష్ణ మిత్రధ్రుఙ్మాం జిఘాంససి
అతస్త్వాం గదయా మన్ద హనిష్యే వజ్రకల్పయా
నీవు మాకు మేన మామ కొడుకువు. ఐనా నీవు మిత్ర ద్రోహం బంధు ద్రోహం చేసావు. నన్ను చంపడానికి వస్తున్నావు. ఈ గదతో చంపుతాను
తర్హ్యానృణ్యముపైమ్యజ్ఞ మిత్రాణాం మిత్రవత్సలః
బన్ధురూపమరిం హత్వా వ్యాధిం దేహచరం యథా
నిన్ను నేను చంపగలిగితే మావారి అందరి ఋణాన్నీ తీర్చుకున్నవాడిని అవుతాను. శరీరములో వ్యాధిని తొలగించుకుంటే ఎంత ఆనందము కలుగుతుందో బంధు రూపములో ఉన్న శత్రువు ఐన నిన్ను చంపి అంత ఆనందమూ పొందుతాను.
ఏవం రూక్షైస్తుదన్వాక్యైః కృష్ణం తోత్రైరివ ద్విపమ్
గదయాతాడయన్మూర్ధ్ని సింహవద్వ్యనదచ్చ సః
ఇలా కఠినముగా మాట్లాడుతు గదతో కృష్ణుడి శిరస్సున కొట్టి సింహనాదం చేసాడు
గదయాభిహతోऽప్యాజౌ న చచాల యదూద్వహః
కృష్ణోऽపి తమహన్గుర్వ్యా కౌమోదక్యా స్తనాన్తరే
కృష్ణుడు గదతో కొట్టబడి కూడా కదలేదు. తన కౌమోదకీ గదను తీసుకుని దంతవక్తృని వక్షస్థలము మీద కొట్టాడు
గదానిర్భిన్నహృదయ ఉద్వమన్రుధిరం ముఖాత్
ప్రసార్య కేశబాహ్వఙ్ఘ్రీన్ధరణ్యాం న్యపతద్వ్యసుః
గదతో చీల్చబడి వక్షస్థలమూ కాళ్ళూ చేతులూ వేళ్ళాడదీస్తు పడిపోయాడు
తతః సూక్ష్మతరం జ్యోతిః కృష్ణమావిశదద్భుతమ్
పశ్యతాం సర్వభూతానాం యథా చైద్యవధే నృప
వీడి శరీరమునుండి కూడా ఒక జ్యోతి బయలుదేరి కృష్ణునిలో కలిసింది.
విదూరథస్తు తద్భ్రాతా భ్రాతృశోకపరిప్లుతః
ఆగచ్ఛదసిచర్మాభ్యాముచ్ఛ్వసంస్తజ్జిఘాంసయా
వాడి సోదరుడు విదూరథుడు ఖడ్గమూ డాలూ తీసుకుని కృష్ణున్ని చంపడానికి వచ్చాడు
తస్య చాపతతః కృష్ణశ్చక్రేణ క్షురనేమినా
శిరో జహార రాజేన్ద్ర సకిరీటం సకుణ్డలమ్
అలా వచ్చిన వాడి శిరస్సును చక్రముతో ఖండించాడు కృష్ణుడు
ఏవం సౌభం చ శాల్వం చ దన్తవక్రం సహానుజమ్
హత్వా దుర్విషహానన్యైరీడితః సురమానవైః
ఇలా శాల్వున్నీ దంతవక్తృన్నీ అందరినీ చంపి దేవ దానవ మానవులతో మునులతో సిద్ధ గంధర్వ ప్రజాపతులతో స్తోత్రం చేయబడుతూ ఉంటే పరమాత్మ చరిత్రను అప్సరసలు గంధర్వులూ నాట్యమూ గానమూ చేస్తుండగా పుష్పవర్షం కురిపించబడింది
మునిభిః సిద్ధగన్ధర్వైర్విద్యాధరమహోరగైః
అప్సరోభిః పితృగణైర్యక్షైః కిన్నరచారణైః
ఉపగీయమానవిజయః కుసుమైరభివర్షితః
వృతశ్చ వృష్ణిప్రవరైర్వివేశాలఙ్కృతాం పురీమ్
ఏవం యోగేశ్వరః కృష్ణో భగవాన్జగదీశ్వరః
ఈయతే పశుదృష్టీనాం నిర్జితో జయతీతి సః
తన యాదవులందరితో కలసి తన నగరాన్ని తాను ప్రవేశించాడు. సామాన్యమైన మానవులు కృష్ణుడు వీరందరీ గెలిచారు అని గొప్పగా చెప్పుకుంటారు. కృష్ణుడు గెలవడమూ గొప్ప కాదు, ఆయన ఓడడమూ నిజం కాదు
శ్రుత్వా యుద్ధోద్యమం రామః కురూణాం సహ పాణ్డవైః
తీర్థాభిషేకవ్యాజేన మధ్యస్థః ప్రయయౌ కిల
తరువాత కౌరవ పాండవుల యుద్ధ ప్రయత్నం చూచి ఇరువురికీ ఈయన ఉదాసీనుడు కాబట్టి తీర్థ యాత్రకు వెళ్ళిపోయాడు
స్నాత్వా ప్రభాసే సన్తర్ప్య దేవర్షిపితృమానవాన్
సరస్వతీం ప్రతిస్రోతం యయౌ బ్రాహ్మణసంవృతః
ప్రభాసములో స్నాన తర్పణాదులు చేసుకుని ఆయా తీర్థాలకు వెళ్ళాడు
పృథూదకం బిన్దుసరస్త్రితకూపం సుదర్శనమ్
విశాలం బ్రహ్మతీర్థం చ చక్రం ప్రాచీం సరస్వతీమ్
యమునామను యాన్యేవ గఙ్గామను చ భారత
జగామ నైమిషం యత్ర ఋషయః సత్రమాసతే
ఇలా అన్నీ తిరిగి నైమిషారణ్యానికి వెళ్ళగా అక్కడ ఋషులందరూ దీర్ఘ సత్రము చేస్తున్నారు.
తమాగతమభిప్రేత్య మునయో దీర్ఘసత్రిణః
అభినన్ద్య యథాన్యాయం ప్రణమ్యోత్థాయ చార్చయన్
సోऽర్చితః సపరీవారః కృతాసనపరిగ్రహః
రోమహర్షణమాసీనం మహర్షేః శిష్యమైక్షత
అది చూద్దామని బలరాముడు వెళ్ళాడు. అలా వెళ్ళిన బలరాముని ఋషులందరూ లేచి వెళ్ళి ఎదురేగి స్వాగతాదు చెప్పి పిలుచుకుని వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు
ఇలా బలరాముడు తన సింహాసం మీద కూర్చుండబోతూ తాను వచ్చినా లేవకుండా అలాగే కూర్చుని ఉన్న రోమహర్షణుడిని (సూతుడు) చూచాడు
అప్రత్యుత్థాయినం సూతమకృతప్రహ్వణాఞ్జలిమ్
అధ్యాసీనం చ తాన్విప్రాంశ్చుకోపోద్వీక్ష్య మాధవః
అందరూ లేచారు గానీ ఈయన లేవలేదు చేతులు జోడించలేదు నమస్కరించలేదు, కూర్చున్నవాడిని చూచి కోపించి
యస్మాదసావిమాన్విప్రానధ్యాస్తే ప్రతిలోమజః
ధర్మపాలాంస్తథైవాస్మాన్వధమర్హతి దుర్మతిః
ఈ ప్రతిలోమజుడు (క్షత్రియునికి బ్రాహ్మణురాలు వలన పుట్టినవాడు) ధర్మపాలురందరినీ అధిగమించి ఋషులందరి పైనా కూర్చున్నాడు. ఇతను వధకు యోగ్యుడు.
ఋషేర్భగవతో భూత్వా శిష్యోऽధీత్య బహూని చ
సేతిహాసపురాణాని ధర్మశాస్త్రాణి సర్వశః
వ్యాసుని వలన అంతా నేర్చుకున్నాడు. అన్నీ విని చదువుకుని ఇంత జ్ఞ్యానం సంపాదించి కూడా సక్రమముగా ప్రవర్తించని ఈయన వధార్హుడు
అదాన్తస్యావినీతస్య వృథా పణ్డితమానినః
న గుణాయ భవన్తి స్మ నటస్యేవాజితాత్మనః
మనో నిగ్రహం నీతీ వినయం లేని ఈయన నటునికి ఆభరణాలు అలంకారం కానట్లుగా అహంకారికి చదివిన శాస్త్ర పురాణములు సార్థకం కావు
ఏతదర్థో హి లోకేऽస్మిన్నవతారో మయా కృతః
వధ్యా మే ధర్మధ్వజినస్తే హి పాతకినోऽధికాః
ఇలాంటి వారిని శిక్షించడానికే మా అవతారం. ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు నటించే వారిని వధించడమే మా పని అని పలికి
ఏతావదుక్త్వా భగవాన్నివృత్తోऽసద్వధాదపి
భావిత్వాత్తం కుశాగ్రేణ కరస్థేనాహనత్ప్రభుః
ఇలా జరుగ వలసింది కాబట్టి చేతిలో ఉన్న దర్భను ఆయన మీద పడవేయగానే సూతుడు పడిపోయాడు
అపుడు మునులందరూ కలసి "నీవు చేసినది అధర్మం
హాహేతివాదినః సర్వే మునయః ఖిన్నమానసాః
ఊచుః సఙ్కర్షణం దేవమధర్మస్తే కృతః ప్రభో
అస్య బ్రహ్మాసనం దత్తమస్మాభిర్యదునన్దన
ఆయుశ్చాత్మాక్లమం తావద్యావత్సత్రం సమాప్యతే
మేమందరం కలసి ఈయనకు బ్రహ్మాసనాన్నీ దీర్ఘాయిష్యునీ ఇచ్చాము. సత్రం అయ్యే వరకూ ఈయన బ్రతికి ఉండాలి. అలా మేమే ఇచ్చాము. బ్రహ్మాసనములో ఉన్న వాడు బ్రహ్మ వచ్చినా లేవరాదు. తెలిసినా తెలియకున్న నీవు బ్రహ్మహత్య చేసావు
అజానతైవాచరితస్త్వయా బ్రహ్మవధో యథా
యోగేశ్వరస్య భవతో నామ్నాయోऽపి నియామకః
ఐనా బ్రహ్మ హత్య తప్పు అన్న వేద శాత్రం యోగేశ్వరుడవైన నిన్ను శాసించలేదు
యద్యేతద్బ్రహ్మహత్యాయాః పావనం లోకపావన
చరిష్యతి భవాంల్లోక సఙ్గ్రహోऽనన్యచోదితః
ఐనా నీవు నీ తరువాతి వారికి ఆ శాసనాన్ని మన్నించి దీనికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే రాబోయే జగత్తు దీనిని మరికాస్త జాగ్ర్త్తగా ఆచరిస్తుంది. లోకాన్ని అనుగ్రహించడానికి మీరు ఈ శాసనాన్ని అమోదించండి
శ్రీభగవానువాచ
చరిష్యే వధనిర్వేశం లోకానుగ్రహకామ్యయా
నియమః ప్రథమే కల్పే యావాన్స తు విధీయతామ్
బ్రహ్మహత్యా దోషానికి లోకానుగ్రహము కోసం నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. దానికి ఏమి చేయాలో చెప్పండి
దీర్ఘమాయుర్బతైతస్య సత్త్వమిన్ద్రియమేవ చ
ఆశాసితం యత్తద్బ్రూతే సాధయే యోగమాయయా
నా యోగ మాయతో ఇతనికి దీర్గాయుష్షు బలమూ ఇంద్రియాలూ ఇస్తాను.
ఋషయ ఊచుః
అస్త్రస్య తవ వీర్యస్య మృత్యోరస్మాకమేవ చ
యథా భవేద్వచః సత్యం తథా రామ విధీయతామ్
ఇందులో చాలా సూక్ష్మాలున్నాయి. ఈయన బతికితే నీవు ప్రయోగించిన అస్త్రం వ్యర్థమవుతుంది. నీవు ప్రయోగించిన అస్త్రం వ్యర్థం కాకూడదు. అలా అని ఇతను మరణిస్తే దీర్ఘ కాలం ఆయువు ఇచ్చిన మా వరం వ్యర్థమవుతుంది. నీ బలమూ అస్త్రమూ యోగమాయ , ఇతని మృత్యువూ మేమిచ్చిన వరమూ, ఇవన్నీ ఎలా నిజమవుతుందో అలా చేయి.
శ్రీభగవానువాచ
ఆత్మా వై పుత్ర ఉత్పన్న ఇతి వేదానుశాసనమ్
తస్మాదస్య భవేద్వక్తా ఆయురిన్ద్రియసత్త్వవాన్
అలాగే చేస్తాను. పుత్రుడంటే ఆత్మే కదా. ఇతని పుత్రున్ని ఇతని స్థానములో పెడతాను. అతను బతికినట్లూ అవుతుంది. బతకనట్లూ అవుతుంది.
కిం వః కామో మునిశ్రేష్ఠా బ్రూతాహం కరవాణ్యథ
అజానతస్త్వపచితిం యథా మే చిన్త్యతాం బుధాః
నా ఆయుధమూ అతని మృత్యువూ పని చేసినట్లు, నా పరాక్రమం కూడా సార్థకమయ్యింది మీ వరం కూడా దక్కింది. అతని పుత్రున్ని వక్తగా దీర్ఘాయుష్మంతునిగా బలవంతునిగా నేను అభిషేకం చేస్తున్నాను. ఇప్పటినుంచీ అతని కుమారుడు సూతుని పేరుతో పురాణాదులను చెబుతాడు
ఇది కాక ఇంకేమైనా కావాలా మీకు. తెలియక చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తముగా మీకు మరే కోరిక ఉంటే చెప్పండి
ఋషయ ఊచుః
ఇల్వలస్య సుతో ఘోరో బల్వలో నామ దానవః
స దూషయతి నః సత్రమేత్య పర్వణి పర్వణి
ఇల్వలుని కొడుకైన బల్వలుడు అనే రాక్షసుడు మేము చేస్తున్న యజ్ఞ్యాన్ని పర్వ పర్వలలో వచ్చి చెడగొడుతున్నాడు. వాడిని సంహరించు. ఇది మాకు ఉత్తమ సేవ
తం పాపం జహి దాశార్హ తన్నః శుశ్రూషణం పరమ్
పూయశోణితవిన్మూత్ర సురామాంసాభివర్షిణమ్
యజ్ఞ్యం చేస్తుంటే యజ్ఞ్య కుండాలలో పూయమునూ మాంఅసమునూ సురనూ శోణితమునూ వర్షిస్తున్నాడు
తతశ్చ భారతం వర్షం పరీత్య సుసమాహితః
చరిత్వా ద్వాదశమాసాంస్తీర్థస్నాయీ విశుధ్యసి
అతన్ని సంహరించిన తరువాత పరిపూణమైన భారత వర్షాన్ని సంచరించి అక్కడ ఉన్న అన్ని తీర్థములలో స్నానం చేస్తే నీవు ఈ పాపం నుండి పరిశుద్ధుడవవుతావు. నీవు చేసిన దానికి ఇది ప్రాయశ్చిత్తమవుతుంది. అని చెప్పారు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వం సాయినాథార్పణమస్తు

No comments:
Post a Comment