Saturday, August 3, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవయ్యవ అధ్యాయం

                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవయ్యవ అధ్యాయం

ఇది రుక్మిణీ కృష్ణుల ప్రణయ కలహం. దీనిలో ఉన్నవి నర్మోక్తులు .
ఈ అధ్యాయాన్ని కలహించుకునే భార్యా భర్తలు పారాయణం చేస్తే అనురాగవంతులవుతారు అని శాత్రం. విడిపోయిన దంపతులను కలిపే అధ్యాయం ఇది.

శ్రీబాదరాయణిరువాచ
కర్హిచిత్సుఖమాసీనం స్వతల్పస్థం జగద్గురుమ్
పతిం పర్యచరద్భైష్మీ వ్యజనేన సఖీజనైః

శయ్య మీద సుఖముగా నిదురిస్తున్న భర్తను రుక్మిణి చామరముతో వీహ్చడం మొదలు పెట్టింది

యస్త్వేతల్లీలయా విశ్వం సృజత్యత్త్యవతీశ్వరః
స హి జాతః స్వసేతూనాం గోపీథాయ యదుష్వజః

సకల చరాచర జగత్తును సృష్టించి రక్షించి లయం చేసే పరమాత్మ తానేర్పరచిన మర్యాదలను కాపాడటానికి, ధర్మాన్ని ప్రవర్తింపచేయడానికి యదువంశములో అవతరించాడు

తస్మినన్తర్గృహే భ్రాజన్ ముక్తాదామవిలమ్బినా
విరాజితే వితానేన దీపైర్మణిమయైరపి

మణిమయ దీపాలతో సకల అలంకారాలతో ప్రకాశించే ఆ మందిరములో

మల్లికాదామభిః పుష్పైర్ద్విరేఫకులనాదితే
జాలరన్ధ్రప్రవిష్టైశ్చ గోభిశ్చన్ద్రమసోऽమలైః

చక్కని మల్లెపూల మాలలు. ఆ మల్లెపూల వాసనకు తుమ్మెదలు వచ్చి చేరాయి. వాటి ఝుంకారముతో అలంకరించబడి ఉన్నాయి ఆ మెల్లెమాలలు
చంద్రుని చల్లని కిరణాలు కిటికీల రంధ్రాల నుండి లోపలకు ప్రసరిస్తూ ఉన్నాయి

పారిజాతవనామోద వాయునోద్యానశాలినా
ధూపైరగురుజై రాజన్జాలరన్ధ్రవినిర్గతైః

పారిజాత వృక్షం నుంచి సువాసనలు వస్తున్నాయి
ధూప దీపములూ

పయఃఫేననిభే శుభ్రే పర్యఙ్కే కశిపూత్తమే
ఉపతస్థే సుఖాసీనం జగతామీశ్వరం పతిమ్

పాల నురుగు వంటి చక్కని శయ్య మీద, జగన్నాధుడు స్వామి హాయిగా కూర్చుని వున్నాడు. ఆయనను సేవించడం మొదలుపెట్టింది

వాలవ్యజనమాదాయ రత్నదణ్డం సఖీకరాత్
తేన వీజయతీ దేవీ ఉపాసాం చక్ర ఈశ్వరమ్

దాసీ విసన కర్రతో వీస్తూ ఉంటే, రుక్మిణి వచ్చి అది తీసుకుని ఆమెను పంపేసి , విసన కర్రతో స్వామికి వీస్తూ ఉన్నది. మణిమయ కంకణాలూ ధ్వనిస్తూ ఉండగా

సోపాచ్యుతం క్వణయతీ మణినూపురాభ్యాం
రేజేऽఙ్గులీయవలయవ్యజనాగ్రహస్తా
వస్త్రాన్తగూఢకుచకుఙ్కుమశోణహార
భాసా నితమ్బధృతయా చ పరార్ధ్యకాఞ్చ్యా

కంకణములూ ఉంగరములూ హారములూ, వీటితో రూపు దాలొచిన లక్ష్మిలా ఉంది,

తాం రూపిణీం శ్రీయమనన్యగతిం నిరీక్ష్య
యా లీలయా ధృతతనోరనురూపరూపా
ప్రీతః స్మయన్నలకకుణ్డలనిష్కకణ్ఠ
వక్త్రోల్లసత్స్మితసుధాం హరిరాబభాషే

పరమాత్మ తప్ప వేరే గతి లేని ఆమెను చూచి. (స్వామి రాముడైతే ఈమె సీత, స్వామి కృష్ణుడైతే ఈమె రుక్మిణి, స్వామి ఏ ఏ అవతారాలలో ఏ ఏ రూపాలను ధరిస్తే స్వామిని విడువకుండా ఆయా రూపాలు ధరించి ఉంటుంది) ఆయనకు ఏ రూపములో ఉంటే దానికి తగిన రూపములో ఉంటుంది
స్వామి చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు. ముంగురులూ కుండలములూ కంఠహారములతో, వాటి కాంతితో ప్రకాశించే చక్కని చిరునవ్వుతో మాట్లాడుతున్నాడు.
(ఆయన చిరునవ్వు చక్కనిదే గానీ, ఇపుడు మాత్రం ఆభరణాలతోనే ప్రకాశిస్తోంది. అంటే స్వామి చిరునవ్వు వెనక వేరే ఏదో ఉద్దేశ్యం ఉంది)

శ్రీభగవానువాచ
రాజపుత్రీప్సితా భూపైర్లోకపాలవిభూతిభిః
మహానుభావైః శ్రీమద్భీ రూపౌదార్యబలోర్జితైః

రాజపుత్రీ, అష్ట దిక్పాలకుల కంటే ఎక్కువ సంపద కలిగిన వారెందరో నిన్ను వివాహం చేసుకుంటామని కోరారు. రూపమూ ఔదార్యమూ సంపదా కలవారు నిన్ను కోరి వచ్చారు తమకు తాముగా

తాన్ప్రాప్తానర్థినో హిత్వా చైద్యాదీన్స్మరదుర్మదాన్
దత్తా భ్రాత్రా స్వపిత్రా చ కస్మాన్నో వవృషేऽసమాన్

శిశుపాలాదులను విడిచిపెట్టావు. నీ తండ్రీ అన్నా అందరూ ఒప్పుకున్నా వారిని వదిలిపెట్టి నన్ను ఎందుకు వరించావు. నీకు నేను ఎందులోనూ సముడిని కాదు కదా

రాజభ్యో బిభ్యతః సుభ్రు సముద్రం శరణం గతాన్
బలవద్భిః కృతద్వేషాన్ప్రాయస్త్యక్తనృపాసనాన్

రాజులంటే భయపడి భూమి మీద ఉండలేక సముద్రములో దాక్కున్నాము. బలవంతులతో వైరం పెట్టుకున్నవారం. రాజాసనానికి యోగ్యం లేని వాళ్ళం (యదువులము కాబట్టి)


అస్పష్టవర్త్మనామ్పుంసామలోకపథమీయుషామ్
ఆస్థితాః పదవీం సుభ్రు ప్రాయః సీదన్తి యోషితః

అసలు మా దారి ఏదో ఎవరికీ తెలియదు. మేమెక్కడికి వెళతామో ఎవరికీ తెలియదు. మా మార్గం ఏ లోకం వారికీ తెలియదు. ఒక దారీ తెన్నూ లేక ఉండడానికి నీడలేక సముద్రములో దాక్కుని బలవంతులతో విరోధం పెంచున్నవారిని కట్టుకున్న స్త్రీలు ఎంతో బాధపడతారు


నిష్కిఞ్చనా వయం శశ్వన్నిష్కిఞ్చనజనప్రియాః
తస్మా త్ప్రాయేణ న హ్యాఢ్యా మాం భజన్తి సుమధ్యమే

మాకెటువంటి ఆస్తీ లేదు. మా వాళ్ళకూ ఏదీ లేదు. ఏమీ లేనివాళ్ళకే మేము ప్రియులము.
అందుకే లోకములో ధనవంతులెవరూ నా జోలికి రారు, నన్ను  తలవరు.

యయోరాత్మసమం విత్తం జన్మైశ్వర్యాకృతిర్భవః
తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయోః క్వచిత్

విత్తం వంశం సంపదా రూపం శాస్త్రం పరాక్రమం సమానముగా ఉన్నవారిని పెళ్ళి చేసుకోవాలి. ఎందులోనూ నీకు సాటి వారం కాము మేము

వైదర్భ్యేతదవిజ్ఞాయ త్వయాదీర్ఘసమీక్షయా
వృతా వయం గుణైర్హీనా భిక్షుభిః శ్లాఘితా ముధా

ఏమీ తెలియక ముందూ వెనకా ఆలోచించక గుణ హీనులమైన మమ్ము దూరపు చూపు లేక వరించావు. భిక్షకులూ సన్యాసులు (నారదుడు) స్తోత్రం చేస్తే నన్ను వరించావు.

అథాత్మనోऽనురూపం వై భజస్వ క్షత్రియర్షభమ్
యేన త్వమాశిషః సత్యా ఇహాముత్ర చ లప్స్యసే

నీకు తగినవారిని వరించాలి, తగినవారిని సేవించాలి.
అలాంటి ఉత్తమున్ని ఎవరినైనా మంచివారిని వరించి ఉంటే ఇహలోకములో పరలోకములో కోరికలు తీరి ఉండేవి

చైద్యశాల్వజరాసన్ధ దన్తవక్రాదయో నృపాః
మమ ద్విషన్తి వామోరు రుక్మీ చాపి తవాగ్రజః

శిశుపాల శాల్వుడూ జరాసంధుడు దంతవక్తృడు మీ అన్నా, అందరూ నన్ను ద్వేషిస్తారు. వారంతా రాజులూ, ఆలోచన ఉన్నవారు, ముందూ వెనకలు బాగా తెలిసినవారు.

తేషాం వీర్యమదాన్ధానాం దృప్తానాం స్మయనుత్తయే
ఆనితాసి మయా భద్రే తేజోపహరతాసతామ్

వాళ్ళ పొగరు అణచాలని  ,వారు బలవంతులు కారని లోకానికి చెప్పడానికి అలాంటి వారందరినీ ఓడించి నిన్ను తీసుకుని వచ్చాను. దుర్మార్గుల తేజస్సును హరించడానికి తీసుకుని వచ్చాను. మమ్ము అందరూ ఉదాసీనులంటారు. మాకే కోరికా లేదు..

ఉదాసీనా వయం నూనం న స్త్ర్యపత్యార్థకాముకాః
ఆత్మలబ్ధ్యాస్మహే పూర్ణా గేహయోర్జ్యోతిరక్రియాః

స్త్రీలనూ సంతానాన్నీ ధనాన్నీ కోరేవారము కాము. ఆత్మారాములము మేము. ఆత్మానందం ఉంటే చాలు
మాకు  నగరమూ ఇల్లూ రాజ్యమూ ధనమూ లేవు. మేము ఏ పనీ చేయని వారము. నిష్కాములము. ఏ పనీ లేదు. ఏ కోరికా లేదు. మమ్ములను పెళ్ళి చేసుకున్నావు.
మొత్తం తన స్వరూపాన్ని తానే వివరించాడు.

శ్రీశుక ఉవాచ
ఏతావదుక్త్వా భగవానాత్మానం వల్లభామివ
మన్యమానామవిశ్లేషాత్తద్దర్పఘ్న ఉపారమత్

నేనే అందరికన్నా స్వామికి ఎక్కువ ప్రీతి పాత్రురాలిని అన్న రుక్మిణి దర్పాన్ని పోగొట్టడానికి ఈ మాత్రం పలికి ఊరుకున్నాడు.

ఇతి త్రిలోకేశపతేస్తదాత్మనః ప్రియస్య దేవ్యశ్రుతపూర్వమప్రియమ్
ఆశ్రుత్య భీతా హృది జాతవేపథుశ్చిన్తాం దురన్తాం రుదతీ జగామ హ

ఇది వరకు ఎపుడూ స్వామి నుండి విని ఉండని ఈ మాటలను విని, విడిచిపెడతాడేమో అని భయం కలిగి ఏడుస్తూ చినతని పొంది, కాలి బొటన వేలితో భూమి మీద గీతలు గీస్తూ

పదా సుజాతేన నఖారుణశ్రీయా భువం లిఖన్త్యశ్రుభిరఞ్జనాసితైః
ఆసిఞ్చతీ కుఙ్కుమరూషితౌ స్తనౌ తస్థావధోముఖ్యతిదుఃఖరుద్ధవాక్

కాన్నీటితో వక్షస్థలాన్ని తడుపుతూ తల నేల వైపు ఉంచి దుఃకముతో మాట పెగలక, దుఃఖం బాధా ఆర్తి వేదనా అన్నీ ఒక్కసారి రాగా వణుకు వచ్చి చేతిలోంచి విసన కర్ర జారి కిందపడింది. తాను కూడా కిందపడి మూర్చపోయింది

తస్యాః సుదుఃఖభయశోకవినష్టబుద్ధేర్
హస్తాచ్ఛ్లథద్వలయతో వ్యజనం పపాత
దేహశ్చ విక్లవధియః సహసైవ ముహ్యన్
రమ్భేవ వాయువిహతో ప్రవికీర్య కేశాన్

కొప్పు కూడా విడిపోయింది

తద్దృష్ట్వా భగవాన్కృష్ణః ప్రియాయాః ప్రేమబన్ధనమ్
హాస్యప్రౌఢిమజానన్త్యాః కరుణః సోऽన్వకమ్పత

ప్రియురాలి ప్రేమబంధనం చూచి హాస్యం తెలియని ఆమె ప్రేమని చూచి కరుణతో జాలిపడి

పర్యఙ్కాదవరుహ్యాశు తాముత్థాప్య చతుర్భుజః
కేశాన్సముహ్య తద్వక్త్రం ప్రామృజత్పద్మపాణినా

శయ్య నుండి కిందకు దిగి, నాలుగు చేతులతో, కొప్పును దువ్వి, ముఖాన్ని తుడిచాడు

ప్రమృజ్యాశ్రుకలే నేత్రే స్తనౌ చోపహతౌ శుచా
ఆశ్లిష్య బాహునా రాజననన్యవిషయాం సతీమ్

కళ్ళను కూడా తుడిచాడు, స్తనములను తుడిచి గట్టిగా కౌగిలించుకుని స్వామి తప్ప ఎవరూ తెలియని అమ్మను

సాన్త్వయామాస సాన్త్వజ్ఞః కృపయా కృపణాం ప్రభుః
హాస్యప్రౌఢిభ్రమచ్చిత్తామతదర్హాం సతాం గతిః

ఎలా ఓదార్చాలో తెలుసు కాబట్టి ఓదార్చాడు. కాస్త హాస్యం ముదిరి కలత చెందిన మనసు  గలది ఐన రుక్మిణి ఓదార్చాడు

శ్రీభగవానువాచ
మా మా వైదర్భ్యసూయేథా జానే త్వాం మత్పరాయణామ్
త్వద్వచః శ్రోతుకామేన క్ష్వేల్యాచరితమఙ్గనే

వైదర్భీ నా మాటలలో దోషాన్ని చూడకు. నీవు నాయందే మనసు ఉంచిన దానవు అని తెలుసు. ఇలా అంటే నీవేమంటావో విందామని సరసముగా అన్నాను.

ముఖం చ ప్రేమసంరమ్భ స్ఫురితాధరమీక్షితుమ్
కటాక్షేపారుణాపాఙ్గం సున్దరభ్రుకుటీతటమ్

ఎప్పుడూ నవ్వుతూ ప్రేమ ఒలికిస్తూ ఉంటావు. కోపముతో నీ కనులు ఎర్రబారి సిగ్గుతో పెదవి అదురుతూ ఉండి ముఖం కందగడ్డై ఓరకంట చూస్తూ ఉంటే నీ అందం చూద్దామని సరసానికి అన్నాను

అయం హి పరమో లాభో గృహేషు గృహమేధినామ్
యన్నర్మైరీయతే యామః ప్రియయా భీరు భామిని

గృహస్థులకు అసలు లాభం ఇదే. కాస్త భయపడే ప్రియురాలితో, పరిహాసమైన మాటలతో సరస వినోదముతో రాత్రి గడుపుటే గృహస్థులకు లాభం

శ్రీశుక ఉవాచ
సైవం భగవతా రాజన్వైదర్భీ పరిసాన్త్వితా
జ్ఞాత్వా తత్పరిహాసోక్తిం ప్రియత్యాగభయం జహౌ

ఇలా ఓదార్చబడి, పరిహాసం అని తెలుసుకుని, ఎక్కడ వదిలిపెడతాడో అని ఉన్న భయాన్ని వదలిపెట్టి

బభాష ఋషభం పుంసాం వీక్షన్తీ భగవన్ముఖమ్
సవ్రీడహాసరుచిర స్నిగ్ధాపాఙ్గేన భారత

ఆయన ఎలా చూడమన్నాడో అలానే చూస్తూ ఇలా అంది

శ్రీరుక్మిణ్యువాచ
నన్వేవమేతదరవిన్దవిలోచనాహ యద్వై భవాన్భగవతోऽసదృశీ విభూమ్నః
క్వ స్వే మహిమ్న్యభిరతో భగవాంస్త్ర్యధీశః క్వాహం గుణప్రకృతిరజ్ఞగృహీతపాదా

స్వామీ, నవ్వుకుంటూ అన్నా, ఉన్నమాటే అన్నారు. మీకు నేను సమానురాలు ఎలా అవుతాను. అన్నిటా అసమానురాలినే కదా. నాలాంటి దీనురాలు నిన్ను కోరడం తప్పే. మీది భగవద్విభూతి.
నీవు వేదాధిపతివి, గుణత్రయాధిపతివి. జ్ఞ్యానం లేని వాళ్ళే నన్ను సేవిస్తారు. జ్ఞ్యానులు మాత్రమే సేవించేవారు మీరు. మీరు గుణాతీతులు, నేను గుణప్రకృతిని

సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాన్తః
శేతే సముద్ర ఉపలమ్భనమాత్ర ఆత్మా
నిత్యం కదిన్ద్రియగణైః కృతవిగ్రహస్త్వం
త్వత్సేవకైర్నృపపదం విధుతం తమోऽన్ధమ్

మీరు భయపడే సముద్రములో దాక్కున్నారు. గుణములకు భయపడిన వారికి వలే సముద్రములో దాక్కున్నారు.
మీకు ద్వేషం దుష్ట ఇంద్రియ సమూహములే. మీ సేవకులు దేన్నీ కోరరు. మహా సామ్రాజ్యాన్ని కూడా తిరస్కరిస్తారు.

త్వత్పాదపద్మమకరన్దజుషాం మునీనాం
వర్త్మాస్ఫుటం న్ర్పశుభిర్నను దుర్విభావ్యమ్
యస్మాదలౌకికమివేహితమీశ్వరస్య
భూమంస్తవేహితమథో అను యే భవన్తమ్

మీ దారే కాదు. మీ పాదపద్మములను ఆస్వాదించే మునుల దారి కూడా ఎవరికీ తెలియదు. పశువులవంటి మానవులకు ఆలోచించడానికి కూడా అందదు ఆ మార్గం.
దానికి తోడు మీ కోరికలన్నీ అలౌకికములే. మిమ్ములని అనుసరించేవారికి కూడా అంతే. మీకూ మీ వాళ్ళకూ లౌకికమైన కోరికలు ఉండవు. లోక జ్ఞ్యానం ఉండదు.

నిష్కిఞ్చనో నను భవాన్న యతోऽస్తి కిఞ్చిద్
యస్మై బలిం బలిభుజోऽపి హరన్త్యజాద్యాః
న త్వా విదన్త్యసుతృపోऽన్తకమాఢ్యతాన్ధాః
ప్రేష్ఠో భవాన్బలిభుజామపి తేऽపి తుభ్యమ్

మీకు ఏమీ లేకపోవడం కాదు. మీకంటే అవతల ఏమీ లేదు. మీరు నిష్కించనులు. ఎవరెవరు బాగా శ్రీమంతులు అనుకుంటున్నారో, అణిమాది అష్ట సిద్ధులు ఉన్న బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా తమకు ఉన్న సంపదలను మీకు అర్పిస్తారు. ఉన్నవారందరూ మిమ్ములనే పూజిస్తారు

మిమ్ములను ఎవరూ తెలియలేరు. శరీరాన్ని  జాగ్రత్తగ పోసించుకోవాలి అని వ్యామోహం ఉన్నవారెవరూ మిమ్ము తెలుసుకోలేరు. మీరు అందరికీ అంతకులు. మేము ధనవంతులం అని ధన మదముతో గుడ్డివారైన వారు నీ స్వరూపాన్ని అర్థం చేసుకోరు. నిన్ను ఆరాధించేవారికి నీవు ఇష్టుడవు.ఆరాధించేవారంటే నీకు ఇష్టం

త్వం వై సమస్తపురుషార్థమయః ఫలాత్మా
యద్వాఞ్ఛయా సుమతయో విసృజన్తి కృత్స్నమ్
తేషాం విభో సముచితో భవతః సమాజః
పుంసః స్త్రియాశ్చ రతయోః సుఖదుఃఖినోర్న

ఎన్ని పురుషార్థాలు ఉన్నాయో అవి అన్నీ నీవే. నీవే ఫలాత్మ, ఫల స్వరూపం నీవే. నిన్ను పొందాలన్న కోరికతోనే తమకున్నవాటిని అన్నిటినీ విడిచిపెడతారు
అలాంటి వారికి నీవు తగినవాడివి. తమకున్నవన్నీ నీ పూజకు  వదిలిపెడతారు. నీకున్న వన్నీ వారికి విడిచిపెడతావు.
స్త్రీ పురుషులు పరస్పరం ప్రీతి కలవారై ఇలా నిన్ను సేవించుకుంటే కష్ట సుఖాలు  పంచుకుంటారు. నీవు పొందేవారందరూ స్త్రీలు, నీవు పురుషుడవు.

త్వం న్యస్తదణ్డమునిభిర్గదితానుభావ
ఆత్మాత్మదశ్చ జగతామితి మే వృతోऽసి
హిత్వా భవద్భ్రువ ఉదీరితకాలవేగ
ధ్వస్తాశిషోऽబ్జభవనాకపతీన్కుతోऽన్యే

నిన్ను వరించుటకు కారణం, అన్ని పనులూ మానేసినవారు నిన్ను వరించారు. పనులు మానేసినవారందరికీ పని చూపేవాడవని వారందరూ నిన్ను వరించారు. ( యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్| యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్) నాకుకూడా ఏమైన పని చూపిస్తావని వచ్చాను.
సకల పురుషార్థములు అన్నీ విడిచిపెట్టిన వారి చేత పొగడబడినవాడవు నీవు. ఆత్మను ఇచ్చేవాడిగా అన్నీ వదలిపెట్టినవారు పొగిడారు. నేను కూడా ఆత్మను ఇస్తావని నిన్ను వరించాను. అందరూ నశించేవాటిని ఇస్తారు, నీవొక్కడవే నశించని వాటిని ఇస్తావని అంటే విని వచ్చాను.
ఒక సారి నీవు కనుబొమ్మ కోపముతో ముడివేస్తే సకల లోకములూ ప్రళయం పాలవుతాయంట. నీ కనుబొమ్మల ముడితో పోయేవారు నాకెందుకు, అని నిన్ను వరించాను. అలాంటి వారినే విడిచిపెట్టానంటే ఇంక ఇతరుల విషయం చెప్పవలసిన అవసరమేముంది.

జాడ్యం వచస్తవ గదాగ్రజ యస్తు భూపాన్
విద్రావ్య శార్ఙ్గనినదేన జహర్థ మాం త్వమ్
సింహో యథా స్వబలిమీశ పశూన్స్వభాగం
తేభ్యో భయాద్యదుదధిం శరణం ప్రపన్నః

కొంచెం ఆలోచిస్తే నీ బుద్ధిలో కొంచెం జాడ్యముందేమో అనిపిస్తోంది. నన్ను కోరిన రాజూల్ను నీ బలపరాక్రమముతో పారగొట్టి సింహం తన భాగాన్ని కోరిన నక్కలను తరిమి తన భాగాన్ని తెచ్చుకున్నట్లుగా నన్ను కోరిన రాజులను నీ పరాక్రమముతో ఓడించి నన్ను తెచ్చుకున్నావని చెప్పావు.నీ పరాక్రమముతో ఓడించిన రాజులకు భయపడి సముద్రములో దాక్కున్నావని నీవంటున్నావు. దీనికి పొంతన కుదరడం లేదు. ధనస్సు టంకారముతో రాజులందరినీ పరిగెత్తించి నన్ను హరించుకుని వచ్చానని చెప్పావు. సింహం ఇతర మృగాలని పారద్రోలి తన భాగాన్ని తెచ్చుకున్నట్లుగా. మరి వారికి భయపడి సముద్రములో దాక్కున్నావా?

యద్వాఞ్ఛయా నృపశిఖామణయోऽన్గవైన్య
జాయన్తనాహుషగయాదయ ఐక్యపత్యమ్
రాజ్యం విసృజ్య వివిశుర్వనమమ్బుజాక్ష
సీదన్తి తేऽనుపదవీం త ఇహాస్థితాః కిమ్

నేను నిన్ను కోరడం ఏమిటి. మహాచక్రవర్తులు, పృధు చక్రవర్తి నహుషుడు గయుడు ఇలాంటి ఏకచద్రాధిపతులు, అరణ్యానికి చేరారు నిన్ను చేరడానికి. నీవు ఎపుడూ ఉండేవాడివి. అందుకే నిన్ను కోరుకున్నాను

కాన్యం శ్రయేత తవ పాదసరోజగన్ధమ్
ఆఘ్రాయ సన్ముఖరితం జనతాపవర్గమ్
లక్ష్మ్యాలయం త్వవిగణయ్య గుణాలయస్య
మర్త్యా సదోరుభయమర్థవివీతదృష్టిః

సకల జనులకు మోక్షమిచ్చే,, ఒక్క సారి పాదపద్మ గంధాన్ని వాసన చూచిన జ్ఞ్యానుల చేతా పండితుల చేతత్ స్తోత్రం చేయబడే, లక్ష్మీ నివాసమైన నీ పదాన్ని. సకల గుణాలకూ ఆలయం ఐన దాన్ని లెక్కించక, మహాభయం కలిగిన ధన దాన్య సంపదలనే నశ్వరమైన సంపదలు పొంది, నిరంతరం భయపడే సంపద కలవారిని ఎవరైనా వరిస్తారా.

తం త్వానురూపమభజం జగతామధీశమ్
ఆత్మానమత్ర చ పరత్ర చ కామపూరమ్
స్యాన్మే తవాఙ్ఘ్రిరరణం సృతిభిర్భ్రమన్త్యా
యో వై భజన్తముపయాత్యనృతాపవర్గః

తగినవాడవని నిన్ను వరించాను. జగన్నాధుడవు. ఇహ పరలోకములో కోరికలు తీర్చేవాడు కావాలి భర్త. ఇహ పరములలో అన్ని కోరికలు తీర్చే భర్త కావాలనుకున్నా. అది నీవొక్కడవే. సంసారములో పరిభ్రమిస్తున్న నాకు నీ పాదమూలమే శరణం కావాలి. అబద్దపు స్వర్గాది లోకాలను ఇవ్వదు. ఆశ్రయించిన వారిని వెంట ఉండి కాపాడుతుంది నీ పాదమూలం.

తస్యాః స్యురచ్యుత నృపా భవతోపదిష్టాః
స్త్రీణాం గృహేషు ఖరగోశ్వవిడాలభృత్యాః
యత్కర్ణమూలమన్కర్షణ నోపయాయాద్
యుష్మత్కథా మృడవిరిఞ్చసభాసు గీతా

నీవన్నట్లు నీవు చెప్పిన రాజులను వివాహం చేసుకుంటే వారి ఇంటిలో భృత్యులుగా గాడిదలూ గుర్రాలూ కుక్కలూ నక్కలూ ఉంటాయి. పొరబాటున కూడా బ్రమ్హ రుద్రేంద్రాది లోకాలలో గానం చేయబడిన నీ కథ చెవిలో పడని వారి ఇంటిలో భృత్యులుగా గుర్రాలూ కుక్కలూ నక్కలే ఉంటాయి
వారు నాకు అక్కరలేదు.

త్వక్శ్మశ్రురోమనఖకేశపినద్ధమన్తర్
మాంసాస్థిరక్తకృమివిట్కఫపిత్తవాతమ్
జీవచ్ఛవం భజతి కాన్తమతిర్విమూఢా
యా తే పదాబ్జమకరన్దమజిఘ్రతీ స్త్రీ

లోకములో ప్రియుడూ అందగాడు సౌందర్వంతుడూ అని ప్రియురాలు పొందేది శరీరాన్నే కదా. చర్మమూ మీసమూ గోళ్ళూ కేశములూ, మాంసమూ ఎముకలూ రక్తమూ పురుగులూ మలమూ కఫమూ వాతమూ పిత్తము. ఇవన్నీ నిండి ఉన్న జీవచ్చవాన్ని సేవించమంటావా నన్ను. మూర్ఖులైతే సుందరమూ అందమూ అన్న పేరుతో సప్త ధాతువులు చెందిన శరీరాన్ని సేవిస్తారు. నీ పాద పద్మ మకరంద వాసన చూడని స్త్రీ ఇలాంటి శరీరాన్ని ప్రేమిస్తుంది. అందుకే నిన్ను కోరాను, నిన్నే సేవిస్తున్నాను

అస్త్వమ్బుజాక్ష మమ తే చరణానురాగ
ఆత్మన్రతస్య మయి చానతిరిక్తదృష్టేః
యర్హ్యస్య వృద్ధయ ఉపాత్తరజోऽతిమాత్రో
మామీక్షసే తదు హ నః పరమానుకమ్పా

నాకు నేనున్నంత కాలం నీ పాదముల యందే అనురాగం ఉండని. నీవు ఆత్మారాముడవే. ఐనా, నీవు నన్ను ప్రేమించకున్నా, నా ప్రేమ నీ మీదనే ఎల్ల కాలం ఉండనీ. నన్ను కూడా నీకంటే వేరుగా చూడకుండా ఉండే నీ మీదనే నా ప్రేమ ఎల్లకాలం ఉండనీ
మేము రజో గుణాన్ని తీసుకుని పెరుగుతున్న వారము. అలాంటి రజోగుణం ఉన్న మమ్ములను దయతో చూస్తున్నది మా గొప్ప కాదు, నీ దయ. నీ కృప.

నైవాలీకమహం మన్యే వచస్తే మధుసూదన
అమ్బాయా ఏవ హి ప్రాయః కన్యాయాః స్యాద్రతిః క్వచిత్

స్వామీ నీవు చెప్పిన మాట అబద్దం అని నేను అనుకోవడం లేదు. తల్లి, (కన్యా వరయితే రూపం, మాతా విత్తం, పితా శృతం, బాంధవాః కులం, మృష్టాన్నం హీతరే జనా)
అంబ ఏ విధముగా ఒకరి మీద మనసు ఉంచి ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడానికి వచ్చిందో కన్యలు కూడా తమ మనసు ఒకరి మీద ఉంచి ఇతరులను పెళ్ళి చేసుకునే పద్దతి లోకములో ఉంది కానీ నేను అలాంటి దానను కాను.

వ్యూఢాయాశ్చాపి పుంశ్చల్యా మనోऽభ్యేతి నవం నవమ్
బుధోऽసతీం న బిభృయాత్తాం బిభ్రదుభయచ్యుతః

కొందరు పెళ్ళి చేసుకుని  భర్త ఉన్నా, ఇంకా అందగాడు కావాలి అని కోరుకుంటారు. అలాంటి చపల చిత్తురాలిని పండితులు సేవించరాదు. ఒక వేళ సేవిస్తే వారు ఉభయ భ్రష్టులవుతారు.
కేవల లక్ష్మీ దేవిని ఎవరూ సేవించరాదు. లక్ష్మీ నారాయణులను సేవించాలి

శ్రీభగవానువాచ
సాధ్వ్యేతచ్ఛ్రోతుకామైస్త్వం రాజపుత్రీ ప్రలమ్భితా
మయోదితం యదన్వాత్థ సర్వం తత్సత్యమేవ హి

నీవు ఇలాంటి మాటలు మాట్లాడితే వినాలని సరదాగా పరిహాసమాడాను. నీవు చెప్పినదంతా సత్యమే.

యాన్యాన్కామయసే కామాన్మయ్యకామాయ భామిని
సన్తి హ్యేకాన్తభక్తాయాస్తవ కల్యాణి నిత్యద

ఏ కోరికా లేని నా కోసం ఏమేమి కోరికలు కోరుకుంటావో, ఏకాంత భక్తురాలవైన నీ విషయములో అన్నీ నెరవేరుతాయి.

ఉపలబ్ధం పతిప్రేమ పాతివ్రత్యం చ తేऽనఘే
యద్వాక్యైశ్చాల్యమానాయా న ధీర్మయ్యపకర్షితా

భర్త ప్రేమనూ  పొందావు, నీ పాతివ్రత్యమూ అద్భుతము. నేను ఇన్ని రకాలుగా మాట్లాడినా నీ మనసు నా నుండి వేరే చోటికి వెళ్ళలేదు

యే మాం భజన్తి దామ్పత్యే తపసా వ్రతచర్యయా
కామాత్మానోऽపవర్గేశం మోహితా మమ మాయయా

ఇతరులు నా మాయతో మోహించబడి నన్ను పెళ్ళి చేసుకోవాలనీ, నాతో దాంపత్యం పొందాలని కోరతారు కానీ మోక్షం కోరరు. కాని నీవు అది కోరావు

మాం ప్రాప్య మానిన్యపవర్గసమ్పదం
వాఞ్ఛన్తి యే సమ్పద ఏవ తత్పతిమ్
తే మన్దభాగా నిరయేऽపి యే నృణాం
మాత్రాత్మకత్వాత్నిరయః సుసఙ్గమః

మోక్ష సంపద ఇచ్చే నన్ను పొంది కూడా సంసారములో లౌకిక సంపదలు కోరితే అలాంటి వారు దురదృష్టవంత్లు. భాగ్య రహితులు. అలాంటి వారికి నరకం కూడా రాదు. ఒక విధముగా నరకము కూడా మంచిదే, పాపాలు పోతాయి.

దిష్ట్యా గృహేశ్వర్యసకృన్మయి త్వయా కృతానువృత్తిర్భవమోచనీ ఖలైః
సుదుష్కరాసౌ సుతరాం దురాశిషో హ్యసుంభరాయా నికృతిం జుషః స్త్రియాః

నీవు సంసారాన్ని విడిపించే విజ్ఞ్యానమయమైన దృష్టిని నాయందు ఉంచావు. ఖలులూ మూర్ఖులూ అలా ఉంచలేరు. ప్రాణాలు మాత్రం నిలిపుకునేది, నరకాన్ని అనుభవించే (మనకున్న ఇంద్రియాలలో ఉపస్థకు నికృతి అంటారు) స్త్రీ పురుషులకు మోక్ష బుద్ధి రాదు. నీకు కలిగినది.

న త్వాదృశీమ్ప్రణయినీం గృహిణీం గృహేషు
పశ్యామి మానిని యయా స్వవివాహకాలే
ప్రాప్తాన్నృపాన్న విగణయ్య రహోహరో మే
ప్రస్థాపితో ద్విజ ఉపశ్రుతసత్కథస్య

నీవంటి ప్రేమ పాత్రురాలు నాకు ఏ ఇంటిలోనూ దొరకదు. నీ పెళ్ళి సమయములో ఎంతో మంది మహారాజులు వచ్చారు. వారిన్ తృణీ కరించి రహస్యముగా సందేశ హరున్ని నా వద్దకు పంపావు, నా కథలు బాగా విన్నవాడిని, నా భక్తుడని పంపావు. నీ వంటి ఉత్తమ ప్రియురాలు నాకెక్కడ దొరుకుతుంది.

భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య
ప్రోద్వాహపర్వణి చ తద్వధమక్షగోష్ఠ్యామ్
దుఃఖం సముత్థమసహోऽస్మదయోగభీత్యా
నైవాబ్రవీః కిమపి తేన వయం జితాస్తే

వివాహ కాలములో నీ అన్నకు నేను వైరూప్యం చేసాను, మనువడి పెళ్ళిలో నీ అన్నను జూదం ఆటలో చంపాను, ఇలాంటి వాటిని కూడా నీవు సహించావు. ఒక్క మాటను కూడా అనలేదు,  నా ఎడబాటు కలుగుతుందేమో అన్న భయముతో. ఇలాంటి నీ సత్ప్రవర్తనతో మమ్ము గెలుచుకున్నావు

దూతస్త్వయాత్మలభనే సువివిక్తమన్త్రః
ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్
మత్వా జిహాస ఇదం అఙ్గమనన్యయోగ్యం
తిష్ఠేత తత్త్వయి వయం ప్రతినన్దయామః

నీవు పంపిన దూత కొంచెం ఆలస్యం చేస్తే, ఇంక నా జీవితం ఎందుకు అని బాధపడ్డావు. నాకు చెందని శరీరాన్ని విడిచిపెడదామని అనుకున్నావు. అలాంటి నీకు ప్రత్యుపకారం ఏమీ చేయలేను

శ్రీశుక ఉవాచ
ఏవం సౌరతసంలాపైర్భగవాన్జగదీశ్వరః
స్వరతో రమయా రేమే నరలోకం విడమ్బయన్

పరమాత్మ ఇలా సరస భాషణతో, ఆత్మారాముడైన స్వామి రుక్మిణితో మానవ లోకములో ఉన్నందున మానవ లోక ఆచారాన్ని అనుసరించి ఆమెతో రమించాడు

తథాన్యాసామపి విభుర్గృహేసు గృహవానివ
ఆస్థితో గృహమేధీయాన్ధర్మాన్లోకగురుర్హరిః

ఇతర భార్యల గృహాలలో కూడా గృహమేధీ ధర్మాలను లోక గురువైన హరి ఎవరికీ అనుమామం రాకుండా, ఈయన స్త్రీలోలుడు అని అందరూ అనుకునేలా సామాన్య గృహస్థ ధర్మాలను ఆచరించాడు.


                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                        సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment