Friday, August 2, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఏడవ అద్యాయం

                                             ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభై ఏడవ అద్యాయం

శ్రీబాదరాయణిరువాచ
విజ్ఞాతార్థోऽపి గోవిన్దో దగ్ధానాకర్ణ్య పాణ్డవాన్
కున్తీం చ కుల్యకరణే సహరామో యయౌ కురూన్

సత్యభామా కళ్యాణం జరిగిన తరువాత కొద్ది రోజులకే పాండవులూ కుంతీ లక్క ఇంటిలో దగ్ధమైపోయారన్న వార్త వహ్చింది. జరిదేది జరిగినదీ తెలిసిన వారైనా అది విని బాధపడి కృష్ణ బలరాములు ఏడుస్తూ పరిగెత్తుకుని వారి వద్దకు వెళ్ళారు

భీష్మం కృపం స విదురం గాన్ధారీం ద్రోణమేవ చ
తుల్యదుఃఖౌ చ సఙ్గమ్య హా కష్టమితి హోచతుః

ఇలా అందరినీ వారితో సమానమైన శోకం కలిగి, ఇంత  బాధ కలిగినదా అని ఒకరినొకరు ఓదార్చుకున్నారు

లబ్ధ్వైతదన్తరం రాజన్శతధన్వానమూచతుః
అక్రూరకృతవర్మాణౌ మనిః కస్మాన్న గృహ్యతే

ఇదే సమయములో అకౄరుడూ కృతవర్మలు శతధన్వుడిని పిలిచారు. నీకు కూతురిని ఇస్తానన్న వాడు మణినీ అమ్మాయినీ కృష్ణునికి ఇచ్చాడు. ఇదే సమయం సత్రాజిత్తుని చంపడానికి.

యోऽస్మభ్యం సమ్ప్రతిశ్రుత్య కన్యారత్నం విగర్హ్య నః
కృష్ణాయాదాన్న సత్రాజిత్కస్మాద్భ్రాతరమన్వియాత్


శమంతక మణిని కృష్ణుడు తీసుకుని సత్రాజిత్తుకు ఇవ్వక ముందు తన కూతురైన సత్యభామను అతనికిచ్చి వివాహం చేస్తా అని శత్ధన్వుడికి మాట ఇచ్చాడు

ఏవం భిన్నమతిస్తాభ్యాం సత్రాజితమసత్తమః
శయానమవధీల్లోభాత్స పాపః క్షీణ జీవితః

అకౄర కృతవర్మలచే ప్రేరేపించబడి శతధన్వుడు అర్థరాత్రి వెళ్ళి నిదురపోతున్న సత్రాజిత్తుని శిరస్సును ఖడ్గముతో ఖండించి పారిపోయాడు మణిని తీసుకుని

స్త్రీణాం విక్రోశమానానాం క్రన్దన్తీనామనాథవత్
హత్వా పశూన్సౌనికవన్మణిమాదాయ జగ్మివాన్

సత్య భామ తండ్రి శరీరాన్ని తైలద్రోణిలో ఉంచి విషయాన్ని కృష్ణునికి చెప్పింది.

సత్యభామా చ పితరం హతం వీక్ష్య శుచార్పితా
వ్యలపత్తాత తాతేతి హా హతాస్మీతి ముహ్యతీ

తైలద్రోణ్యాం మృతం ప్రాస్య జగామ గజసాహ్వయమ్
కృష్ణాయ విదితార్థాయ తప్తాచఖ్యౌ పితుర్వధమ్

తదాకర్ణ్యేశ్వరౌ రాజన్ననుసృత్య నృలోకతామ్
అహో నః పరమం కష్టమిత్యస్రాక్షౌ విలేపతుః

ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు వచ్చి, అంత్యక్రియలను పక్కనబెట్టి క్షత్రియ ఆచారం ప్రకారం చంపినవాడిని చంపేంత వరకూ అంత్యక్రియలు చేయలేదు. గుర్రం తీసుకుని బయలుదేరాడు

ఆగత్య భగవాంస్తస్మాత్సభార్యః సాగ్రజః పురమ్
శతధన్వానమారేభే హన్తుం హర్తుం మణిం తతః


సోऽపి కృతోద్యమం జ్ఞాత్వా భీతః ప్రాణపరీప్సయా
సాహాయ్యే కృతవర్మాణమయాచత స చాబ్రవీత్

నాహమీస్వరయోః కుర్యాం హేలనం రామకృష్ణయోః
కో ను క్షేమాయ కల్పేత తయోర్వృజినమాచరన్

కంసః సహానుగోऽపీతో యద్ద్వేషాత్త్యాజితః శ్రియా
జరాసన్ధః సప్తదశ సంయుగాద్విరథో గతః

ప్రత్యాఖ్యాతః స చాక్రూరం పార్ష్ణిగ్రాహమయాచత
సోऽప్యాహ కో విరుధ్యేత విద్వానీశ్వరయోర్బలమ్

య ఇదం లీలయా విశ్వం సృజత్యవతి హన్తి చ
చేష్టాం విశ్వసృజో యస్య న విదుర్మోహితాజయా

యః సప్తహాయనః శైలముత్పాట్యైకేన పాణినా
దధార లీలయా బాల ఉచ్ఛిలీన్ధ్రమివార్భకః

నమస్తస్మై భగవతే కృష్ణాయాద్భుతకర్మణే
అనన్తాయాదిభూతాయ కూటస్థాయాత్మనే నమః

ప్రత్యాఖ్యాతః స తేనాపి శతధన్వా మహామణిమ్
తస్మిన్న్యస్యాశ్వమారుహ్య శతయోజనగం యయౌ

గరుడధ్వజమారుహ్య రథం రామజనార్దనౌ
అన్వయాతాం మహావేగైరశ్వై రాజన్గురుద్రుహమ్

మిథిలాయాముపవనే విసృజ్య పతితం హయమ్
పద్భ్యామధావత్సన్త్రస్తః కృష్ణోऽప్యన్వద్రవద్రుషా

ఈ విషయం శతధన్వుడికి తెలిసి అందరినీ ఆశ్రయించాడు. కృతవర్మకు మణిని ఇవ్వజూపాడు. అతను తీసుకోలేదు. అకౄరునికి ఇవ్వబోయాడు.కృష్ణుడు ఈ సకల జగత్తునీ సృష్టించి రక్షించి లయం చేస్తాడు. అతనితో వైరం పెట్టుకోలేను అన్నాడు. సరే నన్ను కాపాడకు ఈ మణిని మాత్రం నీ దగ్గర దాచు అని మణిని అకౄరునికి ఇచ్చి గుర్రం ఎక్కి  పారిపోతున్నాడు. నూరు యోజనాలు ఆగకుండా పరిగెత్తగలిగిన గుర్రం ఎక్కాడు. అశ్వానికి ఆయువు యోజనాల బట్టి ఉంటుంది.
 అంత మాత్రమే అది పరిగెత్తగలదు. అలా గుర్రం వంద యోజనాలవ్వగానే పడిపోయింది. ఆ ప్రాంతం మిధిలా రాజ్య ఉపవనం. గుర్రం పడిపోగానే గుర్రం దిగి పరిగెత్తాడు

పదాతేర్భగవాంస్తస్య పదాతిస్తిగ్మనేమినా
చక్రేణ శిర ఉత్కృత్య వాససోర్వ్యచినోన్మణిమ్

అలబ్ధమణిరాగత్య కృష్ణ ఆహాగ్రజాన్తికమ్
వృథా హతః శతధనుర్మణిస్తత్ర న విద్యతే

తత ఆహ బలో నూనం స మణిః శతధన్వనా
కస్మింశ్చిత్పురుషే న్యస్తస్తమన్వేష పురం వ్రజ

వెళ్ళి వాడిని చంపి , వాడి  దగ్గర మణి లేకపోవడం చూచి తిరిగి వచ్చి, బలరామునితో చెప్పాడు ఆ విషయం. ఎక్కడో పెట్టి ఉంటాడులే అన్నాడు బలరాముడు. కృష్ణుడు మణి లేదు అన్న మాటను బలరాముడు నమ్మలేదు. నమ్మినట్టు నటించాడు.

అహం వైదేహమిచ్ఛామి ద్రష్టుం ప్రియతమం మమ
ఇత్యుక్త్వా మిథిలాం రాజన్వివేశ యదనన్దనః

తం దృష్ట్వా సహసోత్థాయ మైథిలః ప్రీతమానసః
అర్హయాం ఆస విధివదర్హణీయం సమర్హణైః

ఉవాస తస్యాం కతిచిన్మిథిలాయాం సమా విభుః
మానితః ప్రీతియుక్తేన జనకేన మహాత్మనా
తతోऽశిక్షద్గదాం కాలే ధార్తరాష్ట్రః సుయోధనః

 మిథిలా రాజు నాకు మిత్రుడు, అక్కడ కొన్ని రోజులు ఉండి వస్తానని చెప్పి, బలరాముడు కృష్ణున్ని వెనక్కు పంపి తాను మిథిలలో ఆరు నెలలు ఉన్నాడు. ఆ సమయములోనే దుర్యోధనుడు వచ్చి గదా యుద్ధం నేర్చుకున్నాడు. బలరాముడు తరువాత ద్వారకకు వచ్చాడు.

కేశవో ద్వారకామేత్య నిధనం శతధన్వనః
అప్రాప్తిం చ మణేః ప్రాహ ప్రియాయాః ప్రియకృద్విభుః

తతః స కారయామాస క్రియా బన్ధోర్హతస్య వై
సాకం సుహృద్భిర్భగవాన్యా యాః స్యుః సామ్పరాయికీః

అక్రూరః కృతవర్మా చ శ్రుత్వా శతధనోర్వధమ్
వ్యూషతుర్భయవిత్రస్తౌ ద్వారకాయాః ప్రయోజకౌ

 ఎపుడైతే కృష్ణుడు ద్వారకకు వచ్చాడో అకౄరుడు కూడా భయపడి ద్వారకను వదలి వేరే రాజ్యములో దాక్కున్నాడు.

అక్రూరే ప్రోషితేऽరిష్టాన్యాసన్వై ద్వారకౌకసామ్
శారీరా మానసాస్తాపా ముహుర్దైవికభౌతికాః

ఇత్యఙ్గోపదిశన్త్యేకే విస్మృత్య ప్రాగుదాహృతమ్
మునివాసనివాసే కిం ఘటేతారిష్టదర్శనమ్

దేవేऽవర్షతి కాశీశః శ్వఫల్కాయాగతాయ వై
స్వసుతాం గాణ్దినీం ప్రాదాత్తతోऽవర్షత్స్మ కాశిషు

తత్సుతస్తత్ప్రభావోऽసావక్రూరో యత్ర యత్ర హ
దేవోऽభివర్షతే తత్ర నోపతాపా న మారీకాః

ఇతి వృద్ధవచః శ్రుత్వా నైతావదిహ కారణమ్
ఇతి మత్వా సమానాయ్య ప్రాహాక్రూరం జనార్దనః

అకౄరుడు వెళ్ళగానే ఆ ద్వారకలో వర్షాలు ఆగిపోయాయి. కరువు వచ్చింది. దుర్భిక్షం రాగానే అందరూ వచ్చి అకౄరున్ని రప్పించమని ప్రార్థించారు. అతని తల్లి, అతని తండ్రితో వేయి ఆవులు రోజూ, ఒక సంవత్సరం పాటు దానం చేస్తే పెళ్ళి చేసుకుంటానని అంది. స్వఫల్కుడు ఉన్ననంతకాలం కరువూ కాటకాలు లేవు. అతని కొడుకైన అకౄరినికి కూడా ఆ లక్షణాలు ఉన్నాయి.అతను ఉన్నంతకాలం కరువూ కాటకాలు ఉండవు. అతనిని పిలిపిస్తే మనకు వచ్చిన కరువు పోతుంది అని కృష్ణున్ని వేడుకున్నారు. అతని కుమారుడు కూడా అంతటి ప్రభావం గలవాడే. అతను ఉన్న చోట కరువు ఉండదు అని ప్రజల చేత అనిపించి స్వామి అకౄరున్ని పిలిపించాడు.

పూజయిత్వాభిభాష్యైనం కథయిత్వా ప్రియాః కథాః
విజ్ఞతాఖిలచిత్త జ్ఞః స్మయమాన ఉవాచ హ

నను దానపతే న్యస్తస్త్వయ్యాస్తే శతధన్వనా
స్యమన్తకో మనిః శ్రీమాన్విదితః పూర్వమేవ నః

సత్రాజితోऽనపత్యత్వాద్గృహ్ణీయుర్దుహితుః సుతాః
దాయం నినీయాపః పిణ్డాన్విముచ్యర్ణం చ శేషితమ్

తథాపి దుర్ధరస్త్వన్యైస్త్వయ్యాస్తాం సువ్రతే మణిః
కిన్తు మామగ్రజః సమ్యఙ్న ప్రత్యేతి మణిం ప్రతి

దర్శయస్వ మహాభాగ బన్ధూనాం శాన్తిమావహ
అవ్యుచ్ఛిన్నా మఖాస్తేऽద్య వర్తన్తే రుక్మవేదయః

సభలో అతన్ని పూజించి,అన్ని కథలూ చెప్పి అందరి మనసూ తెలిసిన కృష్ణుడు "నాయనా అకౄరా నీ వద్ద మణి ఉన్న సంగతి నాకు ముందరే తెలుసు. కానీ సత్రాజిత్తుకు కొడుకు లేదు. అతని ఆస్తి అంతా బిడ్డలకే వస్తుంది. బిడ్డ ఒకతే. సత్యభామ. ఎవరు  సత్రాజిత్తుకు అంత్యక్రియలు చేస్తారో వారే తీసుకుంటారు. ఐనా అది నేను కోరట్లేదు. మణిని నీ వద్దే ఉంచుకో. ఇతరులు దాన్ని భరించలేరు. నియమాలు చాలా ఉంటాయి. నీవు ఉత్తముడివి భక్తుడివి. నీ దగ్గరే ఉంచుకో. మా అన్నగారు నన్ను నమ్మట్లేదు. ఆయనకు చూపించి  మణిని నీవే తీసుకో. నా మీద నిందను తొలగించడానికి నిన్ను పిలిపించాను.

ఏవం సామభిరాలబ్ధః శ్వఫల్కతనయో మణిమ్
ఆదాయ వాససాచ్ఛన్నః దదౌ సూర్యసమప్రభమ్

స్యమన్తకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మనః
విమృజ్య మణినా భూయస్తస్మై ప్రత్యర్పయత్ప్రభుః

అపుడు అకౄరుడు గుడ్డలో దాచిపెట్టిన ఆ మణిని తీసి అందరికీ చూపాడు. ఈ మణిని శతధన్వుడు నాకే ఇచ్చాడు అని చెప్పాడు. తరువాత కృష్ణుడు ఆ మణిని అకౄరునికే ఇచ్చాడు. అడుగడుగునా అపనిందలే ఈ శమంతక మణి వలన.భగవంతుడి వలన జ్ఞ్యానాన్ని మనం పొంది, దానితో భగవంతుని ఆరాధించకుండా మనం ఏదో గొప్పతనాన్ని చాటుకోవాలంటే మనకు కష్టాలు తప్పవు.

యస్త్వేతద్భగవత ఈశ్వరస్య విష్ణోర్
వీర్యాఢ్యం వృజినహరం సుమఙ్గలం చ
ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా
దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాన్తిమ్

 ఈ శమంతక ఉపాఖ్యానం పరమాత్మ యొక్క పరాక్రమం చెప్పేది పాపాలను తొలగించేది, పరమ సుమంగళమైనది ఈ ఆఖ్యానం. దీనిని చదివిన వారూ వినేవారూ స్మరించేవారు అన్ని రకాల చెడు కీర్తినీ పాపాన్ని అపనిందనూ చెడునూ తొలగించుకుంటాడు. అపవాదులూ అపకీర్తీ ఇబ్బందీ సంసారములో కష్టాలు వస్తే శమంతక మణి ఉపాఖానాన్ని పదకొండు రోజులు పదకొండు సార్లు పారాయణం చేస్తారు.


                                                     సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                     సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment