ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం నాలుగవ అధ్యాయం
శ్రీరాజోవాచ
యాని యానీహ కర్మాణి యైర్యైః స్వచ్ఛన్దజన్మభిః
చక్రే కరోతి కర్తా వా హరిస్తాని బ్రువన్తు నః
పరమాత్మ ఏ ఏ అవతారాలలో ఏ ఏ పనులు ఎలా ఎలా ఎవరికోసం చేసాడో చెప్పండి
ఇది వరకేమి చేసాడు, ఇపుడేమి చేస్తున్నాడు ఇక ముందు ఏమి చేయబోతున్నాడు
శ్రీద్రుమిల ఉవాచ
యో వా అనన్తస్య గునాననన్తాననుక్రమిష్యన్స తు బాలబుద్ధిః
రజాంసి భూమేర్గణయేత్కథఞ్చిత్కాలేన నైవాఖిలశక్తిధామ్నః
పరమాత్మ అనంతమైన గుణములను చెప్పాలి అనుకున్నవాడు బాలుడు
భూమిలో ఎన్ని రేణువులున్నాయో లెక్కపెట్టవచ్చు గానీ పరమాత్మ గుణాలను లెక్కపెట్టలేము.
భూతైర్యదా పఞ్చభిరాత్మసృష్టైః
పురం విరాజం విరచయ్య తస్మిన్
స్వాంశేన విష్టః పురుషాభిధానమ్
అవాప నారాయణ ఆదిదేవః
పంచ తన్మాత్రలూ, జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియ, పంచ విషయములతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి , పరమాత్మ తానుగా అందులో ప్రవేశించి, ఆయన విరాట్ పురుషుడు అయ్యాడు. ఆయన నారాయణుడు. ఆది దేవుడు. బ్రహ్మాండములో ఉన్న జలములో ఉన్నాడు కాబట్టి ఆయన (జలములు - నారములు) నారాయణుడు.
యత్కాయ ఏష భువనత్రయసన్నివేశో
యస్యేన్ద్రియైస్తనుభృతాముభయేన్ద్రియాణి
జ్ఞానం స్వతః శ్వసనతో బలమోజ ఈహా
సత్త్వాదిభిః స్థితిలయోద్భవ ఆదికర్తా
ఆ విరాట్ పురుషుని యొక్క శరీరమే మూడు లోకముల సమూహం. పరమాత్మ శరీరమే మూడు లోకాలు. ఆయన(విరాట్ పురుషుని) శరీరమే మనకు జ్ఞ్యాన కర్మేంద్రియాలు.
ఆయన జ్ఞ్యానము స్వయం జ్ఞ్యానం. ఆయన వాయువుతోనే బలమూ ఓజస్సు సహస్సూ కోరిక. ఆ విరాట్ పురుషుడే సత్వ రజో తమో గుణాలు తీసుకుని, వాటితో జగత్తుని సృష్టిస్తాడు. విరాట్ పురుషుడే ఆది కర్త
ఆదావభూచ్ఛతధృతీ రజసాస్య సర్గే
విష్ణుః స్థితౌ క్రతుపతిర్ద్విజధర్మసేతుః
రుద్రోऽప్యయాయ తమసా పురుషః స ఆద్య
ఇత్యుద్భవస్థితిలయాః సతతం ప్రజాసు
ఈ నారాయణుడే సృష్టి చేయాలి అనుకున్నప్పుడు రజో గుణాన్ని తీసుకున్నప్పుడు బ్రహ్మగా అయ్యాడు. సత్వ గుణాన్ని తీసుకుని జగత్తు యొక్క రక్షణకు విష్ణువు అయ్యాడు. ఈయన క్రతు పతి. బ్రాహ్మణులకూ ధర్మమునకు హద్దు. తమో గుణము తీసుకుని ఈ ఆది పురుషుడే రుద్రుడయ్యాడు.
ప్రపంచములో ప్రతీ క్షణం సృష్టి స్థితి సంహారములు జరుగుతూ ఉన్నాయి . అది నిరంతర ప్రవాహం.
జరిగే సృష్టి అంతా బ్రహ్మ కృత్యమే. రక్షణ విష్ణు కృత్యమే. సంహారం రుద్ర కృత్యమే. ఇది ప్రతీ క్షణం జరిగే ప్రక్రియ. అందుకే త్రిమూర్తులు నిరంతరం క్రియాశీలురు. ఈ భావన ఎంత హేతుబద్ధమై ఎంత దృఢమై ఎంత విశ్వసించబడుతుందో, కర్తృత్వ భావన అదే పోతుంది.
అది పోయాక అహంకారమమకారాలెక్కడివి. సృష్టి యొక్క ఈ స్వరూపాన్ని గమనించగలిగితే కర్తృత్వాభిమానం తొలగిపోతుంది.
ప్రజలలో ఈ మూడు కార్యక్రమములూ నిరంతరం జరుగుతూ ఉంటాయి
ధర్మస్య దక్షదుహితర్యజనిష్ట మూర్త్యాం
నారాయణో నర ఋషిప్రవరః ప్రశాన్తః
నైష్కర్మ్యలక్షణమువాచ చచార కర్మ
యోऽద్యాపి చాస్త ఋషివర్యనిషేవితాఙ్ఘ్రిః
ధర్ముడూ, మూర్తి (దక్షుని కుమార్తె), వీరిద్దరికీ పరమాత్మ నర నారాయణ రూపములో అవతరించాడు. వీరు ప్రశాంతులు. ఎలా మనం కర్మలు చేయాలి, చేసిన కర్మలు అంటకుండా ఎలా చేయాలో అందరికీ బోధించి ప్రచారం చేసాడు.ఈ నరనారాయణులు ఇప్పటికీ బదరికాశరమములో ఋషులచేత ఆరాధించబడుతూ ఉన్నారు
ఇన్ద్రో విశఙ్క్య మమ ధామ జిఘృక్షతీతి
కామం న్యయుఙ్క్త సగణం స బదర్యుపాఖ్యమ్
గత్వాప్సరోగణవసన్తసుమన్దవాతైః
స్త్రీప్రేక్షణేషుభిరవిధ్యదతన్మహిజ్ఞః
ఇలా నర నారాయణులు తపస్సు చేస్తూ ఉంటే అది చూసిన ఇంద్రుడు రంభా మేనకాదులందరినీ పంపాడు వారి తపస్సు భంగం చేయడానికి. మలయానిలయం మన్మధుడూ వసంతుడితో కలసి ఆడవారి చూపుల బాణమును స్వామి ప్రతాపం తెలియక ప్రయోగించారు. అది తెలుసుకున్న పరమాత్మ వారిని చూచి, వారు భయపడుతూ ఉండగా.
విజ్ఞాయ శక్రకృతమక్రమమాదిదేవః
ప్రాహ ప్రహస్య గతవిస్మయ ఏజమానాన్
మా భైర్విభో మదన మారుత దేవవధ్వో
గృహ్ణీత నో బలిమశూన్యమిమం కురుధ్వమ్
అపుడు స్వామి "మన్మధా మలయానిలయమా అప్సరస స్త్రీలారా భయపడవలదు. రండి మా పూజలను తీసుకోండి, గంగా నదిలో స్నానం చేసి పళ్ళు తీసుకుని మా సేవలను గొనిపొండి" అన్నాడు
ఇత్థం బ్రువత్యభయదే నరదేవ దేవాః
సవ్రీడనమ్రశిరసః సఘృణం తమూచుః
నైతద్విభో త్వయి పరేऽవికృతే విచిత్రం
స్వారామధీరనికరానతపాదపద్మే
అపుడు అప్సరసలు నమస్కారం చేసి ఇలా అన్నారు.
స్వామీ ఇది నీకు మాత్రమే తగినది. నీ విషయములో ఇది పెద్ద వింత కాదు. తనలో తాను ఆరాధించే వారి సమూహము చేత నమస్కరించబడే పాద పద్మములు గల నీ విషయములో ఇది విచిత్రం కాదు.
త్వాం సేవతాం సురకృతా బహవోऽన్తరాయాః
స్వౌకో విలఙ్ఘ్య పరమం వ్రజతాం పదం తే
నాన్యస్య బర్హిషి బలీన్దదతః స్వభాగాన్
ధత్తే పదం త్వమవితా యది విఘ్నమూర్ధ్ని
నిన్ను సేవించే వారికి దేవతల విఘ్నాలు కలిగిస్తారు. (మనం భగవదారాధన చేయలనుకున్నప్పుడు కానీ, గుడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ వచ్చే విఘ్నాలు దేవతలు కలిగించేవే). వారి ఆరాధన అందుకోవాలి అని నీవనుకుంటే నీవే విఘ్నముల నెత్తిన పాదం పెట్టి వారి ఆరాధనను అందుకుంటావు. భక్తులకు కలిగే విఘ్నాలను తొలగించే నీకు విఘ్నం కలిగించడం సాధ్యమా
క్షుత్తృట్త్రికాలగుణమారుతజైహ్వశైష్ణాన్
అస్మానపారజలధీనతితీర్య కేచిత్
క్రోధస్య యాన్తి విఫలస్య వశం పదే గోర్
మజ్జన్తి దుశ్చరతపశ్చ వృథోత్సృజన్తి
ఆకలి దప్పి కఫ వాత పిత్తములూ సత్వ రజసత్మో గుణములూ భూతాది కాలములలో ఉండే జిహ్వా దోషం, ఉపస్థ దోషాలతో ఉండే మమ్ములను, సంసారం దాటలేము మేము. ఇలాంటి విఘ్నాలనూ కొందరు జయిస్తారు కానీ,వారు కోపానికి వశమవుతారు. ఇంతకాల సాధించిన తపస్సును వ్యర్థం చేసుకుంటారు
ఇతి ప్రగృణతాం తేషాం స్త్రియోऽత్యద్భుతదర్శనాః
దర్శయామాస శుశ్రూషాం స్వర్చితాః కుర్వతీర్విభుః
ఈ రీతిలో వారు స్వామిని స్తోత్రం చేస్తే పరమాత్మ వారికి ఎలా సేవ చేయాలో చెప్పాడు. తన కుడి తొడను కొట్టి అందులోంచి ఊర్వశిని సృష్టించాడు
తే దేవానుచరా దృష్ట్వా స్త్రియః శ్రీరివ రూపిణీః
గన్ధేన ముముహుస్తాసాం రూపౌదార్యహతశ్రియః
తానాహ దేవదేవేశః ప్రణతాన్ప్రహసన్నివ
ఆసామేకతమాం వృఙ్ధ్వం సవర్ణాం స్వర్గభూషణామ్
ఓమిత్యాదేశమాదాయ నత్వా తం సురవన్దినః
ఉర్వశీమప్సరఃశ్రేష్ఠాం పురస్కృత్య దివం యయుః
ఇన్ద్రాయానమ్య సదసి శృణ్వతాం త్రిదివౌకసామ్
ఊచుర్నారాయణబలం శక్రస్తత్రాస విస్మితః
వారు అమ్మవారిలా అందమైన ఆకారం ధరించిన , స్వామి సృష్టించిన స్త్రీలను చూచి వారి సుగంధం సౌందర్యముతో కొట్టబడ్డారు, ఓడించబడ్డారు. అందులోంచి ఎవరైనా ఒక్కరిని కోరుకోమని అడుగగా, వారు ఊర్వశిని ఎన్నుకొని ఆమెను తీసుకుని స్వర్గానికి వెళ్ళారు. స్వర్గములో ఇంద్రునికి నమస్కారం చేసి పరమాత్మ బలాన్ని వివరించారు.అది విని ఇంద్రుడు కాస్త భయపడ్డాడు, కొంత ఆశ్చర్యపడ్డాడు
హంసస్వరూప్యవదదచ్యుత ఆత్మయోగం
దత్తః కుమార ఋషభో భగవాన్పితా నః
విష్ణుః శివాయ జగతాం కలయావతిర్ణస్
తేనాహృతా మధుభిదా శ్రుతయో హయాస్యే
పరమాత్మ హంసలా అవతరించాడు. దత్తాత్రేయునిగా సనత్కుమారునిగా, భరతునిగా, వృషభునిగా, ఇలాంటి రూపాలలో పుట్టి జగత్తుకు కళ్యాణం కోసం తన కలతో అవతరించాడు. మధు కైటబులు వేదాలను అపహరిస్తే హయగ్రీవావతారం తీసుకున్నాడు
గుప్తోऽప్యయే మనురిలౌషధయశ్చ మాత్స్యే
క్రౌడే హతో దితిజ ఉద్ధరతామ్భసః క్ష్మామ్
కౌర్మే ధృతోऽద్రిరమృతోన్మథనే స్వపృష్ఠే
గ్రాహాత్ప్రపన్నమిభరాజమముఞ్చదార్తమ్
అన్ని ఔషధులనూ ప్రళయకాలములో తరువాత రాబోయే ప్రపంచానికోసం కాపాడడానికి మత్స్యావతారం ధరించాడు. మళ్ళీ రాబోయే సృష్టికి పనికొచ్చే విత్తనాలను పడవలో ఉంచి కాపాడాడు.వరాహ అవతారములో భూమిని ఉద్ధరించాడు, హిరణ్యాక్షున్ని సంహరించి, కూర్మావతరములో మందర పర్వతాన్ని మోసి అమృతాన్ని మధించడానికి ఉపయోగించాడు
హరి అవతారములో వచ్చి ముసలి పట్టిన ఏనుగును కాపాడాడు
సంస్తున్వతో నిపతితాన్శ్రమణానృషీంశ్చ
శక్రం చ వృత్రవధతస్తమసి ప్రవిష్టమ్
దేవస్త్రియోऽసురగృహే పిహితా అనాథా
జఘ్నేऽసురేన్ద్రమభయాయ సతాం నృసింహే
తరువాత ఇంద్రుఇతో వృత్తాసురున్ని సంహరింపచేసి దేవతలను కాపాడాడు
హిరణ్యకశిపుడూ దేవతలనూ దేవతా స్త్రీలనూ చెరసాలలో ఉంచి బాధపెడితే, నృసింహావతారములో వెళ్ళి వాడిని సంహరించి వీరిని కాపాడాడు
దేవాసురే యుధి చ దైత్యపతీన్సురార్థే
హత్వాన్తరేషు భువనాన్యదధాత్కలాభిః
భూత్వాథ వామన ఇమామహరద్బలేః క్ష్మాం
యాచ్ఞాచ్ఛలేన సమదాదదితేః సుతేభ్యః
దేవాసుర యుద్ధములో ఓడిపోతున్న దేవతలను తన కలలతో ఆవేశింపచేసి వీర్యం కలిగించాడు. అదే యుద్ధములో దేవతలు ఓడిపోతే వారి రాజ్యాన్ని వారికి అందించడానికి తాను వామనావతారములో వెళ్ళి త్రివిక్రముడై మూడు లోకాలను మూడు పాదాలతో కొలచి రాజ్యాన్ని మళ్ళీ ఇంద్రునికి అప్పగించాడు
నిఃక్షత్రియామకృత గాం చ త్రిఃసప్తకృత్వో
రామస్తు హైహయకులాప్యయభార్గవాగ్నిః
సోऽబ్ధిం బబన్ధ దశవక్త్రమహన్సలఙ్కం
సీతాపతిర్జయతి లోకమలఘ్నకీఋతిః
పరశురామునిగా వెళ్ళి హైహైయ కులములో కార్తవీర్యార్జున్ని సంహరించి అతనితో బాటు క్షత్రియులందరినీ 21 సార్లు భూమండలమంతా తిరిగి భూఒలోకములో క్షత్రియులు లేకుండా చేసాడు
ఈయనే రామావతారములో వెళ్ళి సముద్రాన్ని సేతువుగా కట్టి లంకను గెలిచి, లోక పాపాలు తొలగించే కీర్తి గల స్వామి రామ చంద్రునిగా అవతరించి సీతా పతి అయి వారధి కట్టి రావణున్ని సంహరించాడు.
భూమేర్భరావతరణాయ యదుష్వజన్మా
జాతః కరిష్యతి సురైరపి దుష్కరాణి
వాదైర్విమోహయతి యజ్ఞకృతోऽతదర్హాన్
శూద్రాన్కలౌ క్షితిభుజో న్యహనిష్యదన్తే
ఈయనే యాదవ కులములో జన్మించి దేవతలు కూడా చేయలేని కర్మలను ఆచరించాడు. బుద్ధుడు రూపములో వచ్చి ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు నటిస్తూ అధర్మాన్ని ఆచరించే రాక్షసులను నశింపచేయడానికి యజ్ఞ్యములనూ విగ్రహారాధననూ పనికిరానివిగా ప్రచారం చేసి వారిని మోహింపచేసి, రాక్షసుల చేత యజ్ఞ్య్హ యాగాలు మాంపింపచేసాడు
ఏవంవిధాని జన్మాని కర్మాణి చ జగత్పతేః
భూరీణి భూరియశసో వర్ణితాని మహాభుజ
కలియుగములో కల్కి అవతారములో అధర్మముగా పరిపాలించే శూద్రాదులను సంహరిస్తాడు. పరమాత్మ యొక్క ఈ అనేకములైన కర్మలూ జన్మలూ అనంతమైనవి, చాలా పెద్దవి. వీటిని వివరముగా చెప్పలేము కాబట్టి సంగ్రహముగా చెప్పాను.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment