Friday, February 22, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ప్రజాపతేర్దుహితరం శిశుమారస్య వై ధ్రువః
ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ

శింశుమార ప్రజాపతి పుత్రిక అయిన భ్రమి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకుని కల్ప, వత్సర అనే పిల్లలను కన్నాడు

ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్ర్యాం మహాబలః
పుత్రముత్కలనామానం యోషిద్రత్నమజీజనత్

వాయుదేవుని పుత్రిక అయిన ఇంకో భార్య ఐన ఇల అనే ఆమె యందు ఉత్కలః అనే పుత్రుడు, ఇంకో అమ్మాయి కలిగారు

ఉత్తమస్త్వకృతోద్వాహో మృగయాయాం బలీయసా
హతః పుణ్యజనేనాద్రౌ తన్మాతాస్య గతిం గతా

ఉత్తముడికి వివాహం జరగక ముందే వేటకని హిమాలయ పర్వతానికి వెళ్ళి యక్షులతో కలహం కలిగి మరణించాడు. అతని తల్లి పిల్లవాన్ని వెతకడానికి వెళ్ళి కార్చిచ్చు వలన మరణించింది
యవ్వనమూ బలమూ అధికారమూ అవకాశమూ, ఈ నలుగూ ఉన్ననాడు తనకు భోగ్యము కాని, ఇతరులవైన భోగ్యములను అనుభవించాలని చూస్తే అవసాన కాలమప్పుడు ఆ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అవకాశం దొరికినా అవసరం లేని భోగాలను అనుభవిస్తే, అవసరం ఉన్నప్పుడు అనుభవించడానికి ఏమీ ఉండవు . సుఖం వస్తున్నది కదా అని అవసరం లేని దాన్ని అనుభవించే ప్రయత్నం చేయకూడదు. అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అవసరమైన దాన్ని మితముగా వాడుకోవాలి. అమితముగా వాడుకొంటే అవసరమైనప్పుడు మనకు దొరకదు.
ఒక యక్షుడు ధౄవున్ని చంపాడు. అతని తల్లి కూడా మరణించింది

ధ్రువో భ్రాతృవధం శ్రుత్వా కోపామర్షశుచార్పితః
జైత్రం స్యన్దనమాస్థాయ గతః పుణ్యజనాలయమ్

తన తమ్నున్ని యక్షులు చంపాడన్న విషయం తెలుసుకున్న ధృవుడు కోపముతో అసహనముతో దుఃఖముతో తన రథం ఎక్కి అలకాపురికి వెళ్ళాడు

గత్వోదీచీం దిశం రాజా రుద్రానుచరసేవితామ్
దదర్శ హిమవద్ద్రోణ్యాం పురీం గుహ్యకసఙ్కులామ్

అలకాపురిని చూచి, తన శంఖ ధవ్ని చేసాడు. ఆ ధ్వని అన్ని దిక్కులకూ ప్రతిధ్వనించింది.

దధ్మౌ శఙ్ఖం బృహద్బాహుః ఖం దిశశ్చానునాదయన్
యేనోద్విగ్నదృశః క్షత్తరుపదేవ్యోऽత్రసన్భృశమ్

ఆ ధ్వని విని యక్షుల భార్యలు భయపడ్డారు. ఆ ధ్వనిని సహించని ఉపదేవతలైన యక్షులు ఆయుధాలు తీసుకుని ధృవుని మీదకు రాగా ఒక్కొక్కరి లలాటము మీదా, వక్షస్థలం మీదా పదేసి బాణాలు నాటాడు.

తతో నిష్క్రమ్య బలిన ఉపదేవమహాభటాః
అసహన్తస్తన్నినాదమభిపేతురుదాయుధాః

స తానాపతతో వీర ఉగ్రధన్వా మహారథః
ఏకైకం యుగపత్సర్వానహన్బాణైస్త్రిభిస్త్రిభిః

తే వై లలాటలగ్నైస్తైరిషుభిః సర్వ ఏవ హి
మత్వా నిరస్తమాత్మానమాశంసన్కర్మ తస్య తత్

తేऽపి చాముమమృష్యన్తః పాదస్పర్శమివోరగాః
శరైరవిధ్యన్యుగపద్ద్విగుణం ప్రచికీర్షవః

తతః పరిఘనిస్త్రింశైః ప్రాసశూలపరశ్వధైః
శక్త్యృష్టిభిర్భుశుణ్డీభిశ్చిత్రవాజైః శరైరపి

అభ్యవర్షన్ప్రకుపితాః సరథం సహసారథిమ్
ఇచ్ఛన్తస్తత్ప్రతీకర్తుమయుతానాం త్రయోదశ


ధృవుని యుద్ధం చూసి యక్షులు ధౄవున్ని పొగిడారు. తోక తొక్కిన తాచులా లేచి పరిఘలతో పాశములతో రకరకాలైన ఆయుధాలతో శరములతో ధృవుని మీదా సారధి మీదా వర్షించారు

ఔత్తానపాదిః స తదా శస్త్రవర్షేణ భూరిణా
న ఏవాదృశ్యతాచ్ఛన్న ఆసారేణ యథా గిరిః

అయుతమంటే 10000. పదమూడు అయుతాల సైన్యం యుద్ధానికి వస్తే ధౄవుడు వారికి శస్త్రమూలతో సమాధానం చెప్పాడు. యక్షుల శరవర్షం ధౄవునికి కొండ మీద వానలా అయ్యింది. అంటే ఎలాంటి హానీ కలగలేదు

హాహాకారస్తదైవాసీత్సిద్ధానాం దివి పశ్యతామ్
హతోऽయం మానవః సూర్యో మగ్నః పుణ్యజనార్ణవే

యుద్ధాన్ని చూడటానికి వచ్చిన దేవతలు "అనవసరముగా ఈ మానవుడు యుద్ధానికి వచ్చాడు. ఈ పుణ్య జనుల (యక్షులకు ఇది ఒక పేరు) మరణించి ఉంటాడు " అని భావించి బాధపడుతూ ఉంటే

నదత్సు యాతుధానేషు జయకాశిష్వథో మృధే
ఉదతిష్ఠద్రథస్తస్య నీహారాదివ భాస్కరః

మంచును తొలగించుకుని సూర్యుడు వచ్చినట్లుగా అందరి బాణాలను తొలగించుకుని ధౄవుని రథం వచ్చింది.

ధనుర్విస్ఫూర్జయన్దివ్యం ద్విషతాం ఖేదముద్వహన్
అస్త్రౌఘం వ్యధమద్బాణైర్ఘనానీకమివానిలః

మబ్బులను వాయువు చెదరగొట్టినట్లుగా బాణ వర్షం కురిపిస్తూ సైన్యాన్ని చెల్లా చెదురు చేసాడు

తస్య తే చాపనిర్ముక్తా భిత్త్వా వర్మాణి రక్షసామ్
కాయానావివిశుస్తిగ్మా గిరీనశనయో యథా

పర్వతాల మీద పిడుగు పడ్డట్లుగా ధౄవుని బాణాలు వారి మీద పడుతున్నాయి, తలలు తెగిపడుతున్నాయి, కాళ్ళూ చేతులూ చిన్నభిన్నమయ్యాయి.

భల్లైః సఞ్ఛిద్యమానానాం శిరోభిశ్చారుకుణ్డలైః
ఊరుభిర్హేమతాలాభైర్దోర్భిర్వలయవల్గుభిః

హారకేయూరముకుటైరుష్ణీషైశ్చ మహాధనైః
ఆస్తృతాస్తా రణభువో రేజుర్వీరమనోహరాః

యుద్ధానికి బాగా అలంకరించుకుని వచ్చిన యక్షులు వారి శరీర భాగాలు తెగి వారి ఆభరణాలు చెల్లా చెదురుగా పడి, ఆ రణరంగమంతా బంగారం అమ్మే భూమిలా అయ్యింది. వీరుల మనసుని హరించేట్లుగా ఆభరణాలన్నీ వరుసగా పేర్చబడి ఉన్నాయి

హతావశిష్టా ఇతరే రణాజిరాద్రక్షోగణాః క్షత్రియవర్యసాయకైః
ప్రాయో వివృక్ణావయవా విదుద్రువుర్మృగేన్ద్రవిక్రీడితయూథపా ఇవ

చనిపోగా మిగిలిన వారు, చేతులూ కాళ్ళూ కనులూ చెవులూ పోగొట్టుకొని, సిమ్హం పరిగెత్తుకుంటూ వస్తే ఏనుగులు పారిపోయినట్లు వారందరూ పారిపోయారు.

అపశ్యమానః స తదాతతాయినం మహామృధే కఞ్చన మానవోత్తమః
పురీం దిదృక్షన్నపి నావిశద్ద్విషాం న మాయినాం వేద చికీర్షితం జనః

కొద్ది క్షణాల్లో యుద్ధ రంగమంతా ఖాళీ అయిపోయింది. ప్రతి క్రియ ఏమీ లేకపోయే సరికి నగరాన్ని చూడాలని అనిపించినా ధౄవుడు వెళ్ళలేదు. శత్రువుల తరువాతి పన్నాగం తెలియకుండా రాజ నీతి తెలిసిన వాడు ముందుకు వెళ్ళడు. అందులో శత్రువులు మాయ తెలిసిన వారు. ధౄవుడు మాయావులు చేయదలచుకున్న పని తెలిసిన వాడు కాబట్టి నగరానికి వెళ్ళలేదు

ఇతి బ్రువంశ్చిత్రరథః స్వసారథిం యత్తః పరేషాం ప్రతియోగశఙ్కితః
శుశ్రావ శబ్దం జలధేరివేరితం నభస్వతో దిక్షు రజోऽన్వదృశ్యత

ఇదే విషయం సారధితో అంటూ శత్రువులేదైనా ప్రతీకారం చేస్తారేమో అనుకుంటూ ఉంటే, అల్లకల్లోఅమైన సముద్రము నుండి ధ్వని ఎలా దిక్కులని పెక్కుటిల్లిస్తుండో అలాంటి ధ్వని వచ్చి.
క్షణేనాచ్ఛాదితం వ్యోమ ఘనానీకేన సర్వతః
విస్ఫురత్తడితా దిక్షు త్రాసయత్స్తనయిత్నునా

క్షణములో ఆకాశమంతా మబ్బులు పట్టి, రక్త వర్షం కురుస్తోంది, దుర్గంధమూ మలమూ మూత్రమూ కూడా కురుస్తున్నాయి. వారు మాయా యుద్ధానికి దిగారు
వవృషూ రుధిరౌఘాసృక్ పూయవిణ్మూత్రమేదసః
నిపేతుర్గగనాదస్య కబన్ధాన్యగ్రతోऽనఘ

రాళ్ళూ, పరిఘలూ,గదలూ రోకళ్ళూ పడుతున్నాయి. పాములు కురుస్తున్నాయి. పిడుగులు పడుతున్నాయి, తుఫానులా గాలి వీస్తోంది

తతః ఖేऽదృశ్యత గిరిర్నిపేతుః సర్వతోదిశమ్
గదాపరిఘనిస్త్రింశ ముసలాః సాశ్మవర్షిణః

అహయోऽశనినిఃశ్వాసా వమన్తోऽగ్నిం రుషాక్షిభిః
అభ్యధావన్గజా మత్తాః సింహవ్యాఘ్రాశ్చ యూథశః

సముద్ర ఊర్మిభిర్భీమః ప్లావయన్సర్వతో భువమ్
ఆససాద మహాహ్రాదః కల్పాన్త ఇవ భీషణః

ప్రళయకాలం వచ్చేస్తోందా అన్నట్లు వర్షాలు పడుతున్నాయి ఆయుధాలు వస్తున్నాయి, సముద్రాలు ఉప్పొంగి వస్తున్నాయి, పర్వతాలు వస్తున్నాయి,

ఏవంవిధాన్యనేకాని త్రాసనాన్యమనస్వినామ్
ససృజుస్తిగ్మగతయ ఆసుర్యా మాయయాసురాః

రాక్షస మాయతో ధృవుని మీద ఈ మాయ ప్రయోగించారు.

ధ్రువే ప్రయుక్తామసురైస్తాం మాయామతిదుస్తరామ్
నిశమ్య తస్య మునయః శమాశంసన్సమాగతాః

దాన్ని చూచి మునులు ఇలా అన్నారు

మునయ ఊచుః
ఔత్తానపాద భగవాంస్తవ శార్ఙ్గధన్వా
దేవః క్షిణోత్వవనతార్తిహరో విపక్షాన్
యన్నామధేయమభిధాయ నిశమ్య చాద్ధా
లోకోऽఞ్జసా తరతి దుస్తరమఙ్గ మృత్యుమ్

నాయనా, ఒక్క సారి నీవు మీ స్వామిని గుర్తు చేసుకో అన్నారు. ఆశ్రయించిన వారి బాధను తొలగించే పరమాత్మ నీ శత్రువులను సంహరించుగాక. ఏ మహానుభావుని నామధేయాన్ని పలికినా విన్నా లోకమంతా సంసారాన్ని సులభముగా దాటి పరమపదానికి చేరుతుందో అటువంటె మహానుభావుడు నిన్ను రక్షిస్తాడు.

No comments:

Post a Comment