శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం రెండవ అధ్యాయం
విదుర ఉవాచ
భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః
విద్వేషమకరోత్కస్మాదనాదృత్యాత్మజాం సతీమ్
1. దుత్రు వత్సలః - పుత్రికల మీద ఎంతో వాత్సల్యమున్న దక్షుడు, ఉత్తమమైన శీలము కలవాడైన పరమశివున్ని, అల్లుడని కూడా చూడకుండా ఎలా ద్వేషించాడు. అమ్మాయి మీద ప్రేమ ఉన్నవాడు అల్లుడిని ఎలా ద్వేషించాడు.
కస్తం చరాచరగురుం నిర్వైరం శాన్తవిగ్రహమ్
ఆత్మారామం కథం ద్వేష్టి జగతో దైవతం మహత్
అసలు ద్వేషించడానికి ఏమాత్రమూ యోగ్యము కాని వాడుం, సకల చరాచర జగత్తుకీ, యోగులకూ, మునులకూ, అచలములకూ కూడా జ్ఞ్యానం ఇచ్చేవాడూ, వైరమనే మాటే తెలియని వాడూ, శాంత విగ్రహుడూ, ఆత్మారాముడు (తనలో ఉన్న పరమాత్మనే ధ్యానిస్తూ ఆనందములో ఉండే వాడు), సకల జగత్తు చేతా దైవముగా ఆరాధించబడే వాడు అయిన శంకరున్ని దక్ష ప్రజాపతి (కః ) ఎలా ద్వేషించాడు.
ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్జామాతుః శ్వశురస్య చ
విద్వేషస్తు యతః ప్రాణాంస్తత్యజే దుస్త్యజాన్సతీ
తన పుత్రిక మరణానికే కారణమైన ఈ ఆఖ్యానం నాకు వివరించవలసింది
మైత్రేయ ఉవాచ
పురా విశ్వసృజాం సత్రే సమేతాః పరమర్షయః
తథామరగణాః సర్వే సానుగా మునయోऽగ్నయః
ప్రజాపతులందరూ వేయి సంవత్సరాలు ఆచరించే దీక్షకు (సత్రానికి) సంకల్పించారు. సత్రమంటే బహుకర్తృకం. చాలా యజ్ఞ్యాన్లు ఒకే శాలలో జరుగుతాయి. చాలమంది కర్తలుంటారు. పూర్ణాహుతి మాత్రం ఒకసారే జరుగుతుంది. సత్రములో అందరూ కూడి, దేవతలందరూ అనుచరులతో అక్కడికి వచ్చారు. అప్పట్లో దేవతలు ప్రత్యక్షముగా వచ్చి హవిర్భాగమును స్వీకరించేవారు. అలాగే మునులు కూడా వచ్చారు. అలాంటి సత్రములోకీ, తాను కూడా పల్గొనడానికి దక్షుడు తన పరివారముతో వచ్చాడు.
తత్ర ప్రవిష్టమృషయో దృష్ట్వార్కమివ రోచిషా
భ్రాజమానం వితిమిరం కుర్వన్తం తన్మహత్సదః
ఆయన సూర్యభగవానునిలాగ తన తేజస్సుతో భాసిస్తున్నాడు. అంత పెద్ద సభయొక్క చీకటిని పారద్రోలుతున్నాడు. సదస్యులందరూ తమ తమ ఆసనములందరూ అగ్నిహోత్రములతో సహా లేచారు.
ఉదతిష్ఠన్సదస్యాస్తే స్వధిష్ణ్యేభ్యః సహాగ్నయః
ఋతే విరిఞ్చాం శర్వం చ తద్భాసాక్షిప్తచేతసః
సదసస్పతిభిర్దక్షో భగవాన్సాధు సత్కృతః
అజం లోకగురుం నత్వా నిషసాద తదాజ్ఞయా
ఒక ఇద్దరు మాత్రం లేవలేదు. తండ్రి కాబట్టి బ్రహ్మగారు లేవలేదు. ఆత్మారాముడైన శంకరుడు లేవలేదు. మిగతావారు దక్షుని దివ్యతేజస్సుని చూచి లేచారు. వారందరూ దక్షప్రజాపతిని ఆహ్వానించారు..
ప్రాఙ్నిషణ్ణం మృడం దృష్ట్వా నామృష్యత్తదనాదృతః
ఉవాచ వామం చక్షుర్భ్యామభివీక్ష్య దహన్నివ
బ్రహ్మ ఆజ్ఞ్యను పొంది ఈయన కూర్చున్నాడు. ఈ కూర్చుంటూ ఉండగా అంతకు ముందే కూర్చుని ఉన్న శంకరుడు కనిపించాడు. చూచి సహించలేదు(నామృష్యత్). వంకరగా(వామం ), కాలుస్తున్నట్లు చూసాడు
శ్రూయతాం బ్రహ్మర్షయో మే సహదేవాః సహాగ్నయః
సాధూనాం బ్రువతో వృత్తం నాజ్ఞానాన్న చ మత్సరాత్
దేవతలూ అగ్నిహోత్రులూ ఋషులందరూ, నేను చెప్పేది వినండి. సజ్జనులు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నాను. నాకు మాత్రమే తెలుసు అని చెప్పట్లేదు (న చ మత్సరాత్), మీకు తెలియదనీ చెప్పట్లేదు (నాజ్ఞానాన్న )
అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః
సద్భిరాచరితః పన్థా యేన స్తబ్ధేన దూషితః
లోకపాలకుడై కూడా ఇతను సిగ్గువిడిచి తన తోటి లోకపాలకుల కీర్తికి మచ్చ తెస్తున్నాడు. మంచి వారు నడిచే మార్గాన్ని కలుషితం చేసాడు
ఏష మే శిష్యతాం ప్రాప్తో యన్మే దుహితురగ్రహీత్
పాణిం విప్రాగ్నిముఖతః సావిత్ర్యా ఇవ సాధువత్
బ్రాహ్మణ సాక్షిగా అగ్ని సాక్షిగా నా పుత్రిక పాణి గ్రహణం చేసాడు. ఎప్పుడైతే అల్లుడయ్యడో గాయత్రీ మంత్రం తీసుకున్న సద్బ్రాహ్మణుడి వలె (సావిత్ర్యా ఇవ సాధువత్) నాకు శిష్యుడయ్యాడు.
గృహీత్వా మృగశావాక్ష్యాః పాణిం మర్కటలోచనః
ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృత నోచితమ్
లేడి కన్నులు వంటి కన్నులు గలది అయిన మా అమ్మాయికి కోతి కన్నులున్న ఇతనికి ఇచ్చాము. అల్లుడూ, శిష్యుడూ అయిన వాడు మామగారు వస్తే చేయాల్సిన మర్యాద చేయలేదు. కనీసం వాక్కుతో కూడా మర్యాద చేయలేదు.
లుప్తక్రియాయాశుచయే మానినే భిన్నసేతవే
అనిచ్ఛన్నప్యదాం బాలాం శూద్రాయేవోశతీం గిరమ్
ఇతను అన్ని ఆచారాలను విడిచి పెట్టాడు, అపవిత్రుడూ, అహంకారం కలవాడు, పెద్దల ఆచారాన్ని భంగం చేసిన వాడు. అసలు మా అమ్మాయిని ఇవ్వడం నాకు ఇష్టం లేదు.
ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృతః
అటత్యున్మత్తవన్నగ్నో వ్యుప్తకేశో హసన్రుదన్
ఇతని ఇల్లు శ్మశానం, భూత ప్రేతాలు ఉంటాయి అక్కడ, ఇతను ఒక పిచ్చివాడిలాగ బట్టలు లేకుండా ఉంటాడు.
జుట్టు విరబూసుకుని ఏడుస్తూ నవ్వుతూ తిరుగుతాడు
చితాభస్మకృతస్నానః ప్రేతస్రఙ్న్రస్థిభూషణః
శివాపదేశో హ్యశివో మత్తో మత్తజనప్రియః
పతిః ప్రమథనాథానాం తమోమాత్రాత్మకాత్మనామ్
కాష్ఠములోని బూడిద పూసుకుంటాడు, ఎముకలను అలంకారముగా వేసుకుని ఉంటాడు, ఇతని దగ్గర మంచిదీ అంటూ ఏదీ లేదు. ఇతని పేరు మాత్రమే శివుడు గానీ ఈయన అశివుడు. ఎప్పుడూ మదించి ఉంటాడు. తమో గుణం మాత్రమే ప్రధానముగా ఉండే భూత ప్రేతములకు నాయకుడు. ఉన్మాదులకు నాధుడు.
తస్మా ఉన్మాదనాథాయ నష్టశౌచాయ దుర్హృదే
దత్తా బత మయా సాధ్వీ చోదితే పరమేష్ఠినా
ఆచారము లేని వాడు, దుష్ట హృదయుడు, అయినా మా తండ్రి అయిన బ్రహ్మగారు చెబితే, ఆయన మాట కాదనలేక ఇతనికి ఇచ్చాను
మైత్రేయ ఉవాచ
వినిన్ద్యైవం స గిరిశమప్రతీపమవస్థితమ్
దక్షోऽథాప ఉపస్పృశ్య క్రుద్ధః శప్తుం ప్రచక్రమే
ఇన్ని మాట్లన్నా, ఇంత నిందిస్తున్నా, శంకరుడు ప్రాశంతముగా ఉన్నాడు, ప్రతీకారం చేయలేదు. దక్షుడు ఆచమనం చేసి అతన్ని శపించడానికి సిద్ధపడ్డాడు
అయం తు దేవయజన ఇన్ద్రోపేన్ద్రాదిభిర్భవః
సహ భాగం న లభతాం దేవైర్దేవగణాధమః
దేవతలందరిలో అధముడైన ఈయనకు, మిగతా దేవతలకు చేసే యజ్ఞ్యములో ఈయనకు భాగము లేకుండుగాక.
నిషిధ్యమానః స సదస్యముఖ్యైర్దక్షో గిరిత్రాయ విసృజ్య శాపమ్
తస్మాద్వినిష్క్రమ్య వివృద్ధమన్యుర్జగామ కౌరవ్య నిజం నికేతనమ్
ఇలా శాపం పెట్టబోతూ ఉంటే మిగతా వారు వారిస్తూ ఉన్నా, వినకుండా శాపం పెట్టి, ఇంకా పెరుగుతూ ఉన్న కోపాన్ని అణచుకోలేక అక్కడినుంచి తన ఇంటికి వెళ్ళాడు
విజ్ఞాయ శాపం గిరిశానుగాగ్రణీర్నన్దీశ్వరో రోషకషాయదూషితః
దక్షాయ శాపం విససర్జ దారుణం యే చాన్వమోదంస్తదవాచ్యతాం ద్విజాః
శంకరుడు ప్రశాంతముగా ఉన్నా, శంకరుడి ప్రధాన సేవకుడు అయిన నందీశ్వరునికి రోషం వచ్చి దక్షునికి శాపమిచ్చాడు. ఈ శాపాన్ని ఒక్క దక్షునికే కాక, దక్షుడు శంకరున్ని శపిస్తూ ఉంటే ఆమోదించినవారందరికీ ఇచ్చాడు.
య ఏతన్మర్త్యముద్దిశ్య భగవత్యప్రతిద్రుహి
ద్రుహ్యత్యజ్ఞః పృథగ్దృష్టిస్తత్త్వతో విముఖో భవేత్
"వీరందరూ తత్వమును తెలియకుందురు గాక" తత్వమంటే దేహము వేరు ఆత్మ వేరూ, అలాగే ఆత్మలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు అనే తత్వము. ఈ మర్త్యున్ని గురించి ప్రతిద్రోహం చేయని వాడు అయిన శంకరుని గురించి దక్షుడు జ్ఞ్యానము లేని వాడై, భేధ దృష్టితో ద్రోహం చేసాడు. వీరు తత్వమును తెలియని వారవుతారు
గృహేషు కూటధర్మేషు సక్తో గ్రామ్యసుఖేచ్ఛయా
కర్మతన్త్రం వితనుతే వేదవాదవిపన్నధీః
కపటమే ధర్మముగా ఉన్న గృహముల (గృహస్థులు) యందు ఆసక్తి కలవారు. స్త్రీ సమాగమను మద్యపానమూ మొదలైన గ్రామ్య సుఖములను పొందాలన్న కోరికచే, కామ్యకర్మలను ఆచరిస్తారు. వేద వాక్యముల యొక్క అర్థాన్ని అపార్థము చేసుకుని కామ్య కర్మలు చేస్తారు. ఇది రెండవ శాపం.
బుద్ధ్యా పరాభిధ్యాయిన్యా విస్మృతాత్మగతిః పశుః
స్త్రీకామః సోऽస్త్వతితరాం దక్షో బస్తముఖోऽచిరాత్
పరమును మరచిపోయి (శరీరమే ఉత్తమమైనదీ అని ఇందులో ఉన్న ఆత్మను మరచి, శరీరమునే ప్రధానముగా భావినిచి) పశువు లాగ (ఆత్మజ్ఞ్యానం గురించి పట్టించుకోకుండా ఆకలేస్తే తిని, నిద్రవస్తే పడుకుని భయమేస్తే పరిగెత్తి), నిరంతర్ము స్త్రీ కామాన్ని కోరేవాడిగా ఉండనీ. ఇది ఇంకో శాపం. శివ ద్వేషులందరూ ఇలాంటి వారు అవుతారు.
దక్షుడు మేక ముఖముగా కలవాడు అవుగాక. యజ్ఞ్యములో మేక శిరస్సును హవిస్సుగా ఇస్తారు. మేక ముఖముగా అవ్వుగాక అంటే, ఆ తల యజ్ఞ్యములో హవిస్సు కానీ అని అర్థం.
విద్యాబుద్ధిరవిద్యాయాం కర్మమయ్యామసౌ జడః
సంసరన్త్విహ యే చాముమను శర్వావమానినమ్
దక్షుడు అవిద్యను విద్యా అనుకుంటున్నాడు, కర్మ మయమైన అవిద్యను విద్యగా భావిస్తున్న వాడు జడుడు. ఇలాంటి వన్ని అనుసరించి ఉన్నవారు ఇతని లాగానే సంసారములో పడి ఉండనీ. అంటే వీరికి మోక్షమ్ము గానీ జ్ఞ్యానం గానీ రాకుండుగాక.
గిరః శ్రుతాయాః పుష్పిణ్యా మధుగన్ధేన భూరిణా
మథ్నా చోన్మథితాత్మానః సమ్ముహ్యన్తు హరద్విషః
యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః| వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః - గీతా వాక్యం)
విచ్చుకున్న పుష్పాన్ని చూచి పుష్పం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అనుకునే వాడు ఎంత అజ్ఞ్యానో, శరీరముతో ఉన్నవన్నీ శాశ్వతం అనుకునే వాడు అంత అజ్ఞ్యాని
పైమెరుగులని చూచి పుష్పాలన్నీ శాశ్వతమైన ఆనందాన్ని కలిగించేవాటిగా భావించినట్లు, పైమెరుగులు చూపే వేద వాక్యాలను నమ్మే వారుగా ఈ శంకర ద్వేషులు అవు గాక.
ఆశచే మనసు చిలకబడి మోహాన్ని పొందుగాక. అనిత్యాన్ని నిత్యం అనుకుంటారు. దేహమే ఆత్మా అనుకుంటారు.
సర్వభక్షా ద్విజా వృత్త్యై ధృతవిద్యాతపోవ్రతాః
విత్తదేహేన్ద్రియారామా యాచకా విచరన్త్విహ
అలాంటి వారు ఆరాధన పేరుతో అన్నీ తింటారు. చదువుకుని తపస్సు చేసి వ్రతములూ పూజలూ చేస్తారు. కానీ ఇవన్నీ బ్రతుకు తెరువు కోసమే చేస్తారు. బ్రతుకు తెరువు కోసమే విద్యా, తపస్సు, పూజలూ, వ్రతాలూ చేస్తారు. వాళ్ళకు సంతోషం కేవలం డబ్బు మీదా, శరీరం మీద, ఇంద్రియాలతో ఆనందించేవాటిమీదా. డబ్బు ఎప్పుడూ ఉండాలంటే సంపాదించేది సరిపోదు. అందుకు యాచకులై తిరుగుచుందురు గాక. శివ ద్వేషులకు ఈ గతి పట్టు గాక అని శపించాడు.
తస్యైవం వదతః శాపం శ్రుత్వా ద్విజకులాయ వై
భృగుః ప్రత్యసృజచ్ఛాపం బ్రహ్మదణ్డం దురత్యయమ్
బృగు మహర్షి లేచి ప్రతిశాపమిచ్చాడు. బ్రాహ్మణుడైన దాటడానికి వీలు లేని బ్రహ్మ శాపాన్ని ఇచ్చాడు
భవవ్రతధరా యే చ యే చ తాన్సమనువ్రతాః
పాషణ్డినస్తే భవన్తు సచ్ఛాస్త్రపరిపన్థినః
శివుని వ్రతం అని పేరు పెట్టుకుని ఉండేవారు పాఖండులవుదురు గాక. సచ్ఛాస్త్రపరిపన్థినః - వేదాన్ని ద్వేషించేవరు అవుతారు. వీఅరంతా నాస్తికులవుదురుగాక
నష్టశౌచా మూఢధియో జటాభస్మాస్థిధారిణః
విశన్తు శివదీక్షాయాం యత్ర దైవం సురాసవమ్
వీరికి ఆచరం ఉండదు, మోహింపచేసే బుద్ధి ఉంటుంది, జటలు ధరిస్తారు, బూడిదలు పూసుకుంటారు. వీరు ఆరాధించే దైవం, ఒకటి మద్యం ఇంకోటి మాసం
బ్రహ్మ చ బ్రాహ్మణాంశ్చైవ యద్యూయం పరినిన్దథ
సేతుం విధారణం పుంసామతః పాషణ్డమాశ్రితాః
వేదాలను బ్రాహ్మణులను నిందించేవారు పాఖండులవుతారు.
ఏష ఏవ హి లోకానాం శివః పన్థాః సనాతనః
యం పూర్వే చానుసన్తస్థుర్యత్ప్రమాణం జనార్దనః
అన్ని లోకాలకు పరమ పదాన్ని ఇచ్చే మార్గమూ, సనాతనమైనదీ, పూర్వులందరూ ఆచరించిన మార్గమూ, ఏ మార్గానికి శ్రెమన్నారాయణుడు ప్రామాణమో
తద్బ్రహ్మ పరమం శుద్ధం సతాం వర్త్మ సనాతనమ్
విగర్హ్య యాత పాషణ్డం దైవం వో యత్ర భూతరాట్
అలాంటి నారాయణున్ని నిందించి అనాదరించి వెళ్ళి పాఖండులని అనుసరించండి. మీకు భూతాధిపతి దైవం.
మైత్రేయ ఉవాచ
తస్యైవం వదతః శాపం భృగోః స భగవాన్భవః
నిశ్చక్రామ తతః కిఞ్చిద్విమనా ఇవ సానుగః
ఇలా ఒకరిని చూచి ఒకరు పరస్పరం శపించుకోవడం చూసి, కాస్త మనసు చిన్నబుచ్చుకున్న వాడిలాగ భగవానుడైన శంకరుడు తన గణముతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు
తేऽపి విశ్వసృజః సత్రం సహస్రపరివత్సరాన్
సంవిధాయ మహేష్వాస యత్రేజ్య ఋషభో హరిః
ఈ ఋషులు తాము ఆరంభించిన సత్రాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ సత్రములో ప్రధానముగా ఆరాధించబడిన పరమాత్మ హరి.
ఆప్లుత్యావభృథం యత్ర గఙ్గా యమునయాన్వితా
విరజేనాత్మనా సర్వే స్వం స్వం ధామ యయుస్తతః
అవభృథ స్నానం గంగా యమునలలో చేసి పవిత్రమైన మనసులతో తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment