Thursday, January 24, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

శౌనక ఉవాచ
మహీం ప్రతిష్ఠామధ్యస్య సౌతే స్వాయమ్భువో మనుః
కాన్యన్వతిష్ఠద్ద్వారాణి మార్గాయావరజన్మనామ్

క్షత్తా మహాభాగవతః కృష్ణస్యైకాన్తికః సుహృత్
యస్తత్యాజాగ్రజం కృష్ణే సాపత్యమఘవానితి

ద్వైపాయనాదనవరో మహిత్వే తస్య దేహజః
సర్వాత్మనా శ్రితః కృష్ణం తత్పరాంశ్చాప్యనువ్రతః

కిమన్వపృచ్ఛన్మైత్రేయం విరజాస్తీర్థసేవయా
ఉపగమ్య కుశావర్త ఆసీనం తత్త్వవిత్తమమ్

తయోః సంవదతోః సూత ప్రవృత్తా హ్యమలాః కథాః
ఆపో గాఙ్గా ఇవాఘఘ్నీర్హరేః పాదామ్బుజాశ్రయాః

తా నః కీర్తయ భద్రం తే కీర్తన్యోదారకర్మణః
రసజ్ఞః కో ను తృప్యేత హరిలీలామృతం పిబన్

ఏవముగ్రశ్రవాః పృష్ట ఋషిభిర్నైమిషాయనైః
భగవత్యర్పితాధ్యాత్మస్తానాహ శ్రూయతామితి

సూత ఉవాచ
హరేర్ధృతక్రోడతనోః స్వమాయయా నిశమ్య గోరుద్ధరణం రసాతలాత్
లీలాం హిరణ్యాక్షమవజ్ఞయా హతం సఞ్జాతహర్షో మునిమాహ భారతః

విదుర ఉవాచ
ప్రజాపతిపతిః సృష్ట్వా ప్రజాసర్గే ప్రజాపతీన్
కిమారభత మే బ్రహ్మన్ప్రబ్రూహ్యవ్యక్తమార్గవిత్

యే మరీచ్యాదయో విప్రా యస్తు స్వాయమ్భువో మనుః
తే వై బ్రహ్మణ ఆదేశాత్కథమేతదభావయన్

సద్వితీయాః కిమసృజన్స్వతన్త్రా ఉత కర్మసు
ఆహో స్విత్సంహతాః సర్వ ఇదం స్మ సమకల్పయన్

మైత్రేయ ఉవాచ
దైవేన దుర్వితర్క్యేణ పరేణానిమిషేణ చ
జాతక్షోభాద్భగవతో మహానాసీద్గుణత్రయాత్

ప్రకృతిలో పరమాత్మ స్పందన కలిగించాడు. ఆ పరమాత్మ ఏ మాత్రం ఊహకు అందని వాడు. తర్కానికి అందనివాడు. మనకెంత తెలుసో, మనం గొప్పవారిగా ఎవరిని అంటున్నామో, వారందరికన్నా గొప్పవాడు. ఏ చేష్టలూ లేని వాడు. ఇలాంటి పరమాత్మ నుండి క్షోభ కలిగితే ప్రకృతి తత్వము నుండి మహత్ తత్వం ఆవిర్భవించింది.

రజఃప్రధానాన్మహతస్త్రిలిఙ్గో దైవచోదితాత్
జాతః ససర్జ భూతాదిర్వియదాదీని పఞ్చశః

ఈ మహత్ తత్వములో రజో గుణం ప్రధానముగా ఉంటుంది. పరమాత్మ ప్రేరణతో ఇది సాత్విక రాజస తామస అహంకారం పుడుతుంది. ఈ అహంకారం త్రిలింగం. సాత్వికాహంకారం నుండి మనసు దేవతలూ రాజసాహంకారం నుండి ఇంద్రియాలు, తామసాహంకారము నుండి తన్మాత్రలు పుట్టాయి. ఈ తన్మాత్రల నుండి పంచభూతాలు.

తాని చైకైకశః స్రష్టుమసమర్థాని భౌతికమ్
సంహత్య దైవయోగేన హైమమణ్డమవాసృజన్

ఈ తత్వములు ఒక చోట కలిసినా తరువాత కావల్సిన పనిని చేయడానికి అవి అసమర్ధులయ్యాయి. వీటి నుండి పరమాత్మ బ్రహ్మాండాన్ని సృజించాడు.

సోऽశయిష్టాబ్ధిసలిలే ఆణ్డకోశో నిరాత్మకః
సాగ్రం వై వర్షసాహస్రమన్వవాత్సీత్తమీశ్వరః

ఈ తత్వాలలో జీవుడు లేడు ఇంతవరకూ. జీవుడు లేని, నీటిలో మునిగి ఉన్న అండకోశము వంద సంవత్సరాలు సముద్రములో ఉండగా స్వామి అందులో ప్రవేశించి వెయ్యి సంవత్సరములు అందులో ఉన్నారు.

తస్య నాభేరభూత్పద్మం సహస్రార్కోరుదీధితి
సర్వజీవనికాయౌకో యత్ర స్వయమభూత్స్వరాట్

ఆ స్వామి నాభి నుండి పద్మమావిర్భవించింది. ఒకే సారి వేయి మంది సూర్యుల కాంతితో ఒక పద్మం పుట్టింది. సకల చరాచర ప్రాణులన్నీ ఉన్నాయి. అలా వేంచేసిన పరమాత్మ సకల జగత్తునీ ఇదివరకు ఉన్నది ఉన్నట్లుగా నిర్మించాడు. దీని తరువాత తామస సృష్టి

సోऽనువిష్టో భగవతా యః శేతే సలిలాశయే
లోకసంస్థాం యథా పూర్వం నిర్మమే సంస్థయా స్వయా

ససర్జ చ్ఛాయయావిద్యాం పఞ్చపర్వాణమగ్రతః
తామిస్రమన్ధతామిస్రం తమో మోహో మహాతమః

తన చాయతో సృష్టి జరిపాడు. ఇది తామస (మోహ) సృష్టి. అది చూసి తృప్తి పడలేదు. ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు (లేదా ఆ తామస భావాన్ని విడిచిపెట్టాడు)

విససర్జాత్మనః కాయం నాభినన్దంస్తమోమయమ్
జగృహుర్యక్షరక్షాంసి రాత్రిం క్షుత్తృట్సముద్భవామ్

క్షుత్తృడ్భ్యాముపసృష్టాస్తే తం జగ్ధుమభిదుద్రువుః
మా రక్షతైనం జక్షధ్వమిత్యూచుః క్షుత్తృడర్దితాః

బ్రహ్మ విడిచిపెట్టిన రూపముతో రాత్రి పుట్టింది. ఈ రాత్రిగా ఉన్న ఈ తామస భావాన్ని యక్షులు రాక్షసులూ తీసుకున్నారు. అంటే  యక్ష రాక్షసులు తామస గుణాన్ని స్వీకరించారు. ఈ రాత్రి వలన ఆకలీ దప్పి బాగా అవుతుంది. రాత్రి బాగా నిదురపోయినపుడు తిన్నది అరిగి ఆకలి దప్పి పుడుతుంది. అంటే వీటికి మూలం నిద్ర. ఇలాంటి రాత్రిని వారు స్వీకరించారు.
అలాంటి రాత్రిని స్వీకరించడం వలన ఆకలి ఎక్కువైన రాక్షసులు బ్రహ్మగారిమీదకు వెళ్ళారు

దేవస్తానాహ సంవిగ్నో మా మాం జక్షత రక్షత
అహో మే యక్షరక్షాంసి ప్రజా యూయం బభూవిథ

"ఇతన్ని కాపాడద్దు తినండి " అని బ్రహ్మ మీదకు వెళ్ళగానే. "నన్ను తినవద్దు" అని అన్నారు. రక్షించవద్దు అన్న వారు రాక్షసులు అయ్యారు. తినండి (జక్షత) అన్నవారు యక్షులు (జక్షులు) అయ్యారు.

దేవతాః ప్రభయా యా యా దీవ్యన్ప్రముఖతోऽసృజత్
తే అహార్షుర్దేవయన్తో విసృష్టాం తాం ప్రభామహః

తరువాత దైవ సృష్టి చేసాడు. సత్వ గుణముతో తేజో మయముగా ఉంది. ఆ శరీరాన్ని విడిచిపెడితే వెలుతురు అయ్యింది. తన నడుము నుండి కొంతమంది సృష్టించారు. వీరు రాక్షసులకంటే భయంకరులు. కామోద్రేకులు.

దేవోऽదేవాఞ్జఘనతః సృజతి స్మాతిలోలుపాన్
త ఏనం లోలుపతయా మైథునాయాభిపేదిరే

వీరంతా సమాగమంకోసం బ్రహ్మగారి వైపు వెళ్ళారు.

తతో హసన్స భగవానసురైర్నిరపత్రపైః
అన్వీయమానస్తరసా క్రుద్ధో భీతః పరాపతత్

సిగ్గు విడిచిన వీరి ప్రవృత్తి చూసి నవ్వి, పరిగెత్తాడు.

స ఉపవ్రజ్య వరదం ప్రపన్నార్తిహరం హరిమ్
అనుగ్రహాయ భక్తానామనురూపాత్మదర్శనమ్

"నన్ను కాపాడ" మని హరిని శరణు వేడాడు

పాహి మాం పరమాత్మంస్తే ప్రేషణేనాసృజం ప్రజాః
తా ఇమా యభితుం పాపా ఉపాక్రామన్తి మాం ప్రభో

త్వమేకః కిల లోకానాం క్లిష్టానాం క్లేశనాశనః
త్వమేకః క్లేశదస్తేషామనాసన్నపదాం తవ

నీవొక్కడివే కష్టాలపాలైన వారి కష్టాలను తొలగిస్తావు. నిన్నాశ్రయించని వారికి కష్టాలు కలిగించి, ఆశ్రయించిన వారికి తొలగిస్తావు.

సోऽవధార్యాస్య కార్పణ్యం వివిక్తాధ్యాత్మదర్శనః
విముఞ్చాత్మతనుం ఘోరామిత్యుక్తో విముమోచ హ

నీకు భయమెందుకు ఈ శరీరాన్ని విడిచిపెట్టు. అనగా బ్రహ్మ కామోద్రేక భావాన్ని విడిచిపెట్టాడు. అపుడు అది సంధ్యగా మారి,ఆ సంధ్యాకాలం ఒక స్త్రీగా మారి కామోద్రేకముతో ఉన్న వారికి ఇవ్వబడింది.

తాం క్వణచ్చరణామ్భోజాం మదవిహ్వలలోచనామ్
కాఞ్చీకలాపవిలసద్ దుకూలచ్ఛన్నరోధసమ్

అన్యోన్యశ్లేషయోత్తుఙ్గ నిరన్తరపయోధరామ్
సునాసాం సుద్విజాం స్నిగ్ధ హాసలీలావలోకనామ్

గూహన్తీం వ్రీడయాత్మానం నీలాలకవరూథినీమ్
ఉపలభ్యాసురా ధర్మ సర్వే సమ్ముముహుః స్త్రియమ్

ఇలాంటి సౌంద్రయ రాశి అయిన స్త్రీ ఆకారాన్ని సృష్టించగా. ఈమెను చూసి మోహాన్ని పొంది, ఆమెను మోహించారు

అహో రూపమహో ధైర్యమహో అస్యా నవం వయః
మధ్యే కామయమానానామకామేవ విసర్పతి

ఆమె సౌందర్యానికి మురిసి, "మేమందరమూ కోరుతూ ఆమే వెంటపడుతుంటే ఆమే పట్టించుకోవట్లేదు ఏమిటి"

వితర్కయన్తో బహుధా తాం సన్ధ్యాం ప్రమదాకృతిమ్
అభిసమ్భావ్య విశ్రమ్భాత్పర్యపృచ్ఛన్కుమేధసః

మోహముతో తడబాటుతో ఆమెతో మాట్లాడుతున్నారు

కాసి కస్యాసి రమ్భోరు కో వార్థస్తేऽత్ర భామిని
రూపద్రవిణపణ్యేన దుర్భగాన్నో విబాధసే

ఎవరివి ఎవరిదానవు ఎక్కడికి వెళ్తున్నావు. మేము అదృష్టములేని వారిమా.మమ్మల్ని పట్టించుకోవట్లేదు

యా వా కాచిత్త్వమబలే దిష్ట్యా సన్దర్శనం తవ
ఉత్సునోషీక్షమాణానాం కన్దుకక్రీడయా మనః

నైకత్ర తే జయతి శాలిని పాదపద్మం
ఘ్నన్త్యా ముహుః కరతలేన పతత్పతఙ్గమ్
మధ్యం విషీదతి బృహత్స్తనభారభీతం
శాన్తేవ దృష్టిరమలా సుశిఖాసమూహః

ఆటతో విహరిస్తున్న నీ పాదపద్మాలు ఏ ఒక్క చోట నిలవట్లేదు. నీ అపాంగ వీక్షణముతో మమ్మల్ని కలవరపెడుతున్నావు

ఇతి సాయన్తనీం సన్ధ్యామసురాః ప్రమదాయతీమ్
ప్రలోభయన్తీం జగృహుర్మత్వా మూఢధియః స్త్రియమ్

ఈ సంధ్యను స్త్రీ అనుకొని మూఢులై స్వీకరించారు. సంధ్యాసమయం రాక్షస భావాలకు ఆస్పదం. ఆ సమయములో భగవత్ పూజ స్తోత్రమూ పూజా తప్ప ఏ పనీ చేయకూడదు (భోజనం గానీ, పని గానీ)

ప్రహస్య భావగమ్భీరం జిఘ్రన్త్యాత్మానమాత్మనా
కాన్త్యా ససర్జ భగవాన్గన్ధర్వాప్సరసాం గణాన్

ఇలా అసురులు తన మీద చూపిన దౌర్జన్యాన్ని శరీర త్యాగముతో తప్పించుకున్న బ్రహ్మ సంధ్యాకాలాన్ని తమో రజో గుణ భూయిష్టముగా కోరికలకు ఆస్పదముగా ఏర్పరచి,ఆ సమయములో అందరూ జాగ్రత్తగా ఉండాలని మనకి చెప్పి, సత్వ గుణముతో దివ్య కాంతితో గంధర్వ అప్సరసలతో సృష్టించాడు. ఆ శరీరాన్ని విడిచిపెడితే అది వెన్నెలగా మారింది

విససర్జ తనుం తాం వై జ్యోత్స్నాం కాన్తిమతీం ప్రియామ్
త ఏవ చాదదుః ప్రీత్యా విశ్వావసుపురోగమాః

విశ్వావసు హాహా హూహూ వీరందరూ గంధర్వులు.

సృష్ట్వా భూతపిశాచాంశ్చ భగవానాత్మతన్ద్రిణా
దిగ్వాససో ముక్తకేశాన్వీక్ష్య చామీలయద్దృశౌ

తనలో ఏప్రడిన సోమరితనముతో భూత ప్రేత పిశాచాలను సృష్టించాడు. (పిశాచ భూతాలు మన దగ్గరకు రావు. మనం వాటి దగ్గరకు వెళ్తే మనల్ని వదలకుండా అంటిపెట్టుకుని ఉంటాయి) ఈ భూత ప్రేత పిశాచాలను చూసి బ్రహ్మే కళ్ళు మూసుకున్నాడు. వస్త్రాలు లేవు, వెంట్రుకలు విరబూసుకుని ఉన్నారు.

జగృహుస్తద్విసృష్టాం తాం జృమ్భణాఖ్యాం తనుం ప్రభోః
నిద్రామిన్ద్రియవిక్లేదో యయా భూతేషు దృశ్యతే
యేనోచ్ఛిష్టాన్ధర్షయన్తి తమున్మాదం ప్రచక్షతే

వెంటనే ఆ దేహాన్ని విడిచి పెట్టాడు. ఆ దేహం నిద్ర అయ్యింది. (నిద్రలో అందుకే జుట్టు చెదిరిపోతుంది, వస్త్రం తొలగుతుంది) అప్పుడు ఈ భూతాలు దాన్ని స్వీకరించాయి. ఈ నిద్ర ఇంద్రియములకు అలసట ఏర్పరిస్తే వస్తుది.

ఊర్జస్వన్తం మన్యమాన ఆత్మానం భగవానజః
సాధ్యాన్గణాన్పితృగణాన్పరోక్షేణాసృజత్ప్రభుః

తనను తాను తేజోవంతునిగా అద్వితీయమైన కాంతి తేజస్సు బలము ఉన్నవానిగా భావించి సాధ్యులనూ సిద్ధులనూ పితృగణములనూ సృష్టించాడు. ఆ తరువాత శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆ శరీరాన్ని పితృదేవతలు తీసుకున్నారు. విధ్యాధరులను సిద్ధులనూ స్వామి అంతర్ధానమయి సృష్టించాడు. అందుకే వారికి అంతర్ధానమయ్యే శక్తి ఉంది. తరువాత తన స్వరూపాన్ని తాను చూచుకుంటూ కిన్నెర కింపురుషులను సృష్టించాడు. వారు గాయకులు అయ్యారు. గంధర్వ కిన్నెరులు గానం చేస్తారు

త ఆత్మసర్గం తం కాయం పితరః ప్రతిపేదిరే
సాధ్యేభ్యశ్చ పితృభ్యశ్చ కవయో యద్వితన్వతే

సిద్ధాన్విద్యాధరాంశ్చైవ తిరోధానేన సోऽసృజత్
తేభ్యోऽదదాత్తమాత్మానమన్తర్ధానాఖ్యమద్భుతమ్

స కిన్నరాన్కిమ్పురుషాన్ప్రత్యాత్మ్యేనాసృజత్ప్రభుః
మానయన్నాత్మనాత్మానమాత్మాభాసం విలోకయన్

తే తు తజ్జగృహూ రూపం త్యక్తం యత్పరమేష్ఠినా
మిథునీభూయ గాయన్తస్తమేవోషసి కర్మభిః

దేహేన వై భోగవతా శయానో బహుచిన్తయా
సర్గేऽనుపచితే క్రోధాదుత్ససర్జ హ తద్వపుః

ఇదంతా చేసి అలసి శరీరానికి విశ్రాంతి ఇద్దామని పడుకుంటే, కొన్ని కేశములు జారిపోయాయి కొన్ని పారిపోయాయి. అవే పాములయ్యయి. పాములకు ఉండేధి భోగము. వాటి శరీరం మృదువుగా ఉంటుంది. పరమాత్మ భోగమును కోరి పడుకున్నపుడు వచ్చినవి కాబట్టి అవి భోగులు, జారిపోయాయి కాబట్టి సర్పములు, తరగకుండా ఉన్నాయి కాబట్టి అహిః అంటారు

యేऽహీయన్తాముతః కేశా అహయస్తేऽఙ్గ జజ్ఞిరే
సర్పాః ప్రసర్పతః క్రూరా నాగా భోగోరుకన్ధరాః

తరగకుండా ఉన్న కేశాలు అహి అయ్యాయి. వీటికే నాగములు అనీ (నాగ - అంటే ఏ మాత్రం ఎప్పుడూ కదలకుండా ఆగకుండా వెళ్ళేవి, జరజరా పాకేవి సరపములు, సుతిమెత్తని శరీరం కలవి కాబట్టి సర్పములు)

స ఆత్మానం మన్యమానః కృతకృత్యమివాత్మభూః
తదా మనూన్ససర్జాన్తే మనసా లోకభావనాన్

అంతా సృష్టించాను, కృతకృత్యున్నయ్యాను అని మనసుతో సంకల్పముతో మనువులను సృష్టించాడు.

తేభ్యః సోऽసృజత్స్వీయం పురం పురుషమాత్మవాన్
తాన్దృష్ట్వా యే పురా సృష్టాః ప్రశశంసుః ప్రజాపతిమ్

అప్పుడు ఈ మనువుల నుండి పురుష, మానవ ఆకారాన్ని సృష్టించాడు. చివరికి పురుషాకారం వచ్చింది. ఈ పురుషాకారాన్ని చూచి అందరూ మెచ్చుకున్నారు

అహో ఏతజ్జగత్స్రష్టః సుకృతం బత తే కృతమ్
ప్రతిష్ఠితాః క్రియా యస్మిన్సాకమన్నమదామ హే

"నీ పుణ్యం ఇప్పుడు ఫలించింది " అన్నారు బ్రహ్మతో. ఇలాంటి పురుషాకారముతోనే అన్ని క్రతువులూ చేయవచ్చు. భగవంతున్ని ఆరాధించడానికి సరిపోయే శరీరం ఉన్నది మానవులకి.

తపసా విద్యయా యుక్తో యోగేన సుసమాధినా
ఋషీనృషిర్హృషీకేశః ససర్జాభిమతాః ప్రజాః

బ్రహ్మ తపస్సు చేసి సమాధితోటి విద్యతోటి యోగముతోటీ ఇంకాస్త మెరుగైన సృష్టి చేయసంకల్పించి ఋషులని సృష్టించాడు.

తేభ్యశ్చైకైకశః స్వస్య దేహస్యాంశమదాదజః
యత్తత్సమాధియోగర్ద్ధి తపోవిద్యావిరక్తిమత్

అలాంటి వారికి పరమాత్మ ఒక్కొక్కరికీ పరమాత్మ తన శరీరము యందు ఒక్కొక్క అంశలు నిలిపాడు. తపో విద్యా సమాధి యోగ ప్రభావం ఉన్న తన శరీర అంశను వారికిచ్చాడు.

No comments:

Post a Comment