శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
నిశమ్య కౌషారవిణోపవర్ణితాం హరేః కథాం కారణసూకరాత్మనః
పునః స పప్రచ్ఛ తముద్యతాఞ్జలిర్న చాతితృప్తో విదురో ధృతవ్రతః
మైత్రేయుడు బోధించిన, భూమిని పైకి తీసుకు రావడానికి వచ్చిన పరమాత్మ కథను విని, కథలను మాత్రమే వినాలన్న గట్టి వ్రతము పట్టిన విదురుడు
తృప్తి చెందక ఇలా అడిగాడు
విదుర ఉవాచ
తేనైవ తు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తినా
ఆదిదైత్యో హిరణ్యాక్షో హత ఇత్యనుశుశ్రుమ
మునిస్రేష్ఠా, యజ్ఞ్య వరాహ మూర్తి, ఆదిదైత్యుడైన వాడిని సమ్హరించాడని చెప్పారు.
తస్య చోద్ధరతః క్షౌణీం స్వదంష్ట్రాగ్రేణ లీలయా
దైత్యరాజస్య చ బ్రహ్మన్కస్మాద్ధేతోరభూన్మృధః
సముద్రము నుండి భూమిని పైకి తీస్తున్న పరమాత్మతో రాక్షసునికి యుద్ధం ఎలా వచ్చింది
శ్రద్దధానాయ భక్తాయ బ్రూహి తజ్జన్మవిస్తరమ్
ఋషే న తృప్యతి మనః పరం కౌతూహలం హి మే
మైత్రేయ ఉవాచ
సాధు వీర త్వయా పృష్టమవతారకథాం హరేః
యత్త్వం పృచ్ఛసి మర్త్యానాం మృత్యుపాశవిశాతనీమ్
పరమాత్మ యొక్క విషయము బాగా అడిగావు. పరమాత్మ యొక్క కథ, మానవుల మృత్యుపాశాన్ని తెంచేది
యయోత్తానపదః పుత్రో మునినా గీతయార్భకః
మృత్యోః కృత్వైవ మూర్ధ్న్యఙ్ఘ్రిమారురోహ హరేః పదమ్
నారద మహర్షి చెప్పిన పరమాత్మ కథను వినే, ఉత్తాన పాదుని పుత్రుడైన ద్రువుడు సంసారమనే మృత్యువు శిరసు పైన కాలు పెట్టి పరమపదానికి వెళ్ళాడు
అథాత్రాపీతిహాసోऽయం శ్రుతో మే వర్ణితః పురా
బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతామ్
పరమాత్మ యొక్క హిరణ్యాక్ష వధా వృత్తాంతం పూర్వ కాలం దేవతలు అడిగినపుడు దేవ దేవుడైన బ్రహ్మ ఈ కథను చెప్పాడు. అపుడు నేను కూడా విన్నాను
దితిర్దాక్షాయణీ క్షత్తర్మారీచం కశ్యపం పతిమ్
అపత్యకామా చకమే సన్ధ్యాయాం హృచ్ఛయార్దితా
దక్షుని పుత్రిక అయిన దితి తన భర్త అయిన మరీచి కొడుకైన కశ్యప ప్రజాపతి వద్దకు సంతానము కావలన్న కోరికతో సంధ్యాసమయములో మనసులో భర్తృ సమాగమం కోరి కలవరపడిన మనసుతో వెళ్ళింది.
ఇష్ట్వాగ్నిజిహ్వం పయసా పురుషం యజుషాం పతిమ్
నిమ్లోచత్యర్క ఆసీనమగ్న్యగారే సమాహితమ్
కశ్యప ప్రజాపతి అప్పుడే వైశ్వేదేవం (అగ్నిహోత్రం) పూర్తి చేసుకున్నాడు (అగ్ని అంతర్యామిగా ఉన్న పరమాత్మను) పాలతో పూజించి సూర్య భగవానుడు అస్తమిస్తుండగా, అగ్ని శాలలోనే సావధాన మనసుతో కూర్చుని ఉన్నాడు.
దితిరువాచ
ఏష మాం త్వత్కృతే విద్వన్కామ ఆత్తశరాసనః
దునోతి దీనాం విక్రమ్య రమ్భామివ మతఙ్గజః
పండితుడా, మన్మధుడు బాణం ఎక్కుపెట్టి ఏనుగు అరటి చెట్టును పీడించినట్లు బాధపెడుతున్నాడు
తద్భవాన్దహ్యమానాయాం సపత్నీనాం సమృద్ధిభిః
ప్రజావతీనాం భద్రం తే మయ్యాయుఙ్క్తామనుగ్రహమ్
సవతులందరికీ సంతానం ఉంది. నా యందు నీ అనుగ్రహం ఉంచి. నీకు శుభం కలుగుతుంది
భర్తర్యాప్తోరుమానానాం లోకానావిశతే యశః
పతిర్భవద్విధో యాసాం ప్రజయా నను జాయతే
స్త్రీకి కీర్తి భర్త ఆదరించినపుడే వస్తుంది. ఉచిత ప్రవర్తన గల నీలాంటి భర్త భార్య యందు పుడతాడు. నీ లాంటే భర్తే భార్య యందు సంతానముగా కలుగుతాడు. దాని వలన భార్యకు కీర్తి పెరుగుతుంది
పురా పితా నో భగవాన్దక్షో దుహితృవత్సలః
కం వృణీత వరం వత్సా ఇత్యపృచ్ఛత నః పృథక్
పూర్వము మా తండ్రిగారు దక్షుడు, ఆయనకు బిడ్డలంటే చాలా ప్రేమ. ఒక్కొక్కరినే పిలిచి ఎవరిని పెళ్ళి చేసుకుంటావని అడిగినప్పుడు మా మనసులో ఏమున్నదో తెలుసుకున్నాడు.
స విదిత్వాత్మజానాం నో భావం సన్తానభావనః
త్రయోదశాదదాత్తాసాం యాస్తే శీలమనువ్రతాః
మా భావలను తెలుసుకున్న దక్షుడు పదమూడు మందిని మీకిచ్చి వివాహం చేసాడు (అంటే మేము కోరుకుంటేనే మీకిచ్చి వివాహం చేసాడు). మేమందరమూ నీ శీలం అనుసరించిన వారిమి కాబట్టి.
అథ మే కురు కల్యాణం కామం కమలలోచన
ఆర్తోపసర్పణం భూమన్నమోఘం హి మహీయసి
మేము కోరి నిన్ను వరించాము కాబట్టి నాకు ఉత్తమ సంతానాన్ని నీవు ప్రసాదించాలి. బాధ పడుచున్న వారి బాధను తీర్చుట గొప్పవారి లక్షణం. నా ఆర్తిని నీవు తొలగించు.
ఇతి తాం వీర మారీచః కృపణాం బహుభాషిణీమ్
ప్రత్యాహానునయన్వాచా ప్రవృద్ధానఙ్గకశ్మలామ్
మన్మధుడనే బురద పూసుకుని (అనఙ్గకశ్మలామ్) వచ్చిన ఆమెను చూచి ఇంద్రియములను జయించిన కశ్యపుడు (ఇక్కడ మరీచః అంటే మరీచి కొడుకూ అనే కాకుండా ఇంద్రియములు అని కూడా వస్తుంది) సంధ్యాసమయాన్ని దాటించాలని తన వాక్కుతో అనునయింపచేస్తూ
ఏష తేऽహం విధాస్యామి ప్రియం భీరు యదిచ్ఛసి
తస్యాః కామం న కః కుర్యాత్సిద్ధిస్త్రైవర్గికీ యతః
నీ కోరిక నేను తీరుస్తాను. మూడు పురుషార్థాలు భార్య వలననే నెరవేరుతాయి. పురుషార్థాలు నెరవేర్చే భార్య కోరికను తీర్చని వాడెవడు?
సర్వాశ్రమానుపాదాయ స్వాశ్రమేణ కలత్రవాన్
వ్యసనార్ణవమత్యేతి జలయానైర్యథార్ణవమ్
అన్ని ఆశ్రమాల కన్నా ఉత్తమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. బ్రహ్మచారికి భిక్ష వేయాలన్నా గృహస్తే ఇవ్వాలి. ఈ గృహస్తాశ్రమం చక్కగా పాటిస్తేనే ఇంద్రియ జయం కలుగ్తుంది. అర్థానికి కామానికి దానికి కావలసిన ఆహుతినిచ్చి ఆ తరువాత వైరాగ్యాన్ని పొందుతాడు. గృహస్తాశ్రమంతోటే తక్కిన అన్ని ఆశ్రమాలు పూర్తిచేయగలరు ప్రవాహాన్ని నావతో దాటినట్టు తక్కిన అన్ని ఆశ్రమాలను గృహస్తు దాటగలడు
యామాహురాత్మనో హ్యర్ధం శ్రేయస్కామస్య మానిని
యస్యాం స్వధురమధ్యస్య పుమాంశ్చరతి విజ్వరః
భార్య అంటే భర్తలో సగం. ఆత్మనః అర్థం ఆహుః. ఇహ లోకములో పరలోకములో శ్రేయస్సు కోరేవాడికి భార్య అంటే అర్థం. అన్ని బరువులూ భార్య మీద వేసి పురుషుడు విహరిస్తాడు.
యామాశ్రిత్యేన్ద్రియారాతీన్దుర్జయానితరాశ్రమైః
వయం జయేమ హేలాభిర్దస్యూన్దుర్గపతిర్యథా
బ్రహ్మచర్యముతో వానప్రస్థముతో సన్యాసాశ్రమములో గానీ జయించజాలని ఇంద్రియములను గృహ్స్తాశ్రములో గెలుస్తాము. కోటలో ఉన్నవారు దొంగలను జయించినట్లుగా భార్య ఉన్నవాడు ఇంద్రియములను సులభముగా గెలుస్తాడు
న వయం ప్రభవస్తాం త్వామనుకర్తుం గృహేశ్వరి
అప్యాయుషా వా కార్త్స్న్యేన యే చాన్యే గుణగృధ్నవః
మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారము చేయ సమర్ధులము కాము. మంచి గుణములు కావాలనుకున్న వారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారు.
అథాపి కామమేతం తే ప్రజాత్యై కరవాణ్యలమ్
యథా మాం నాతిరోచన్తి ముహూర్తం ప్రతిపాలయ
భార్య కోరిక తీర్చుట మాకు ధర్మం. నన్ను అందరూ తప్పు పట్టకుండా ఉండేట్టుగా ఒక్క ముహూర్త కాలం పాటు ఆగు.
ఏషా ఘోరతమా వేలా ఘోరాణాం ఘోరదర్శనా
చరన్తి యస్యాం భూతాని భూతేశానుచరాణి హ
ఇది మహాఘోరమైన సమయం. పాపము చేయకుండా ఉండేవారి చేత కూడా పాపం చేయించే సమయం ఇది. శంకరుని అనుచరులైన భూతములు ఈ సమయములో సంచరిస్తూ ఉంటాయి.
ఏతస్యాం సాధ్వి సన్ధ్యాయాం భగవాన్భూతభావనః
పరీతో భూతపర్షద్భిర్వృషేణాటతి భూతరాట్
వృషభాన్ని అధిరోహించి, అన్ని ప్రాణులనూ హితమును కలిగించే భూతపతి కూడా సంచరిస్తూ ఉంటారు.
శ్మశానచక్రానిలధూలిధూమ్ర వికీర్ణవిద్యోతజటాకలాపః
భస్మావగుణ్ఠామలరుక్మదేహో దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే
ఈ దేవుడు మూడు కళ్ళతో చూస్తాడు. ఈయన నీకు మరిది. ఆయన జటలలో శ్మశానములో వచ్చిన సుడిగాలితో రేపబడిన దుమ్ము కలిగి ఉంటుంది. ఒంటి నిండా భస్మము పూసుకుని ఉండే బంగారము వంటి వర్ణము గల భగవానుడు.
న యస్య లోకే స్వజనః పరో వా నాత్యాదృతో నోత కశ్చిద్విగర్హ్యః
వయం వ్రతైర్యచ్చరణాపవిద్ధామాశాస్మహేऽజాం బత భుక్తభోగామ్
పరమాత్మ అయిన శంకరునికి తనవారని గానీ శత్రువని గాన్నీ భేధం లేదు. ఆయన బాగా ఆదరించే వాడు, తిరస్కరించేవాడు లేడు. ఆయన సమదృక్. ఎవరి పాదముల కింద ఉండే యోగమాయను మనం సేవిస్తున్నామో, ఆశ్రయించి ఉన్నామో
యస్యానవద్యాచరితం మనీషిణో గృణన్త్యవిద్యాపటలం బిభిత్సవః
నిరస్తసామ్యాతిశయోऽపి యత్స్వయం పిశాచచర్యామచరద్గతిః సతామ్
భేధములు, అభేధములూ తెలుసుకోవాలనుకునేవారు ఈయన పవిత్రమైన ఆచారాన్ని స్మరించే తొలగించుకుంటార్య్. ఈయనకన్నా ఎక్కువ వాడూ లేడు, ఈయన కన్నా సమానుడు లేడు. ఈ స్వామి, ఇంత గొప్ప వాడైనా, పిశాచములాగా ఆచరిస్తాడు.
హసన్తి యస్యాచరితం హి దుర్భగాః స్వాత్మన్రతస్యావిదుషః సమీహితమ్
యైర్వస్త్రమాల్యాభరణానులేపనైః శ్వభోజనం స్వాత్మతయోపలాలితమ్
కొందరు అదృష్టహీనులు ఈ శంకరుని పనులు చూచి అవహేళన చేస్తారు, ఈయన ఆత్మారాముడు. ఎవరైతే వస్త్రములూ మాలలు ఆభరణములు భోజనమూ భోగమూ, ఇలాంటి వాటితో కుక్కలకి ఆహారమైన శరీరమును ఆత్మ అనుకుని పూజిస్తారో, వారు అవహేళన చేస్తారు.
బ్రహ్మాదయో యత్కృతసేతుపాలా యత్కారణం విశ్వమిదం చ మాయా
ఆజ్ఞాకరీ యస్య పిశాచచర్యా అహో విభూమ్నశ్చరితం విడమ్బనమ్
బ్రహ్మాదులు కూడా ఎవరు విధించిన హద్దుని దాటరో, సకల చరాచర జగత్తుకూ ఎవరి మాయ కారణమో, ఈ యోగ మాయ ఎవరి ఆజ్ఞ్యను పాటిస్తూ ఉంటుందో, అలాంటి వాడు పిశాచములా ప్రవర్తించడం సర్వ వ్యాపి అయిన పరమాత్మకు లీల.
మైత్రేయ ఉవాచ
సైవం సంవిదితే భర్త్రా మన్మథోన్మథితేన్ద్రియా
జగ్రాహ వాసో బ్రహ్మర్షేర్వృషలీవ గతత్రపా
స విదిత్వాథ భార్యాయాస్తం నిర్బన్ధం వికర్మణి
నత్వా దిష్టాయ రహసి తయాథోపవివేశ హి
మన్మధుడిచేత చిలుకబడిన హృదయం కలదై, సిగ్గు విడిచి వేశ్య లాగ, అతని వస్త్రాన్ని పట్టి లాగింది. భార్య యొక్క ఆ నిర్భందాన్ని తెలిసి దైవానికి నమస్కారము చేసాడు (నత్వా దిష్టాయ)
అథోపస్పృశ్య సలిలం ప్రాణానాయమ్య వాగ్యతః
ధ్యాయఞ్జజాప విరజం బ్రహ్మ జ్యోతిః సనాతనమ్
తరువాత, స్నానము చేసి ఆచమనం చేసి ప్రాణాయామం చేసి వాక్కును నియమించుకుని సనాతనుడైన పరమాత్మ దివ్య తేజస్సును ధ్యానం చేసాడు.
దితిస్తు వ్రీడితా తేన కర్మావద్యేన భారత
ఉపసఙ్గమ్య విప్రర్షిమధోముఖ్యభ్యభాషత
చేసిన పనికి దితి సిగ్గుపడి భర్త వద్దకు వచ్చి తల దించుకుని ఇలా అంది
దితిరువాచ
న మే గర్భమిమం బ్రహ్మన్భూతానామృషభోऽవధీత్
రుద్రః పతిర్హి భూతానాం యస్యాకరవమంహసమ్
ఈ గర్భాన్ని ఆ భూతాది పతి వధించకుండా ఉండు గాక. ఈ వరమును నాకివ్వండి. నేను భూత పతి అయిన రుద్రున్ని అవమానించాను కాబట్టి ఆయన న బిడ్డను వధించకూడదు
నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీఢుషే
శివాయ న్యస్తదణ్డాయ ధృతదణ్డాయ మన్యవే
దండించేవాడు, దండము శమించేవాడు, మంగళ ప్రదుడు, పరమ భయంకరుడు, శాంతిప్రదుడు, ఇలాంటి రుద్రుని నమస్కారం
స నః ప్రసీదతాం భామో భగవానుర్వనుగ్రహః
వ్యాధస్యాప్యనుకమ్ప్యానాం స్త్రీణాం దేవః సతీపతిః
నా మరిది అయిన శివుడు శాంతించుగాక. పెద్ద అనుగ్రహం కలవాడు కాబట్టి ఈ తప్పుకు నన్ను శిక్షించరాదు. పరమకఠినాత్ములు కూడా దయచూపే స్త్రీల విషయములో భగవానుడైన శంకరుడు దయ చూపకుండా ఉంటాడా
మైత్రేయ ఉవాచ
స్వసర్గస్యాశిషం లోక్యామాశాసానాం ప్రవేపతీమ్
నివృత్తసన్ధ్యానియమో భార్యామాహ ప్రజాపతిః
తనకు కలగబోయే సంతానము యొక్క మంచిని కొరే దితి, తప్పుకు పశ్చాత్తపబడిన దితిని, సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చి, కశ్యపుడు ఇలా మాట్లాడాడు.
కశ్యప ఉవాచ
అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్మౌహూర్తికాదుత
మన్నిదేశాతిచారేణ దేవానాం చాతిహేలనాత్
మనోనిగ్రహం లేనందు వలన (మనో నిగ్రహం ఉండాలంటే శాస్త్ర విశ్వాసం ఉండాలి. ఫలాన తప్పు చేస్తే ఫలాన శిక్ష పడుతుంది అని మనం నమ్మిన నాడు మన మనసు ఆ తప్పు చేయడానికి ప్రేరేపించబడదు. మనసులో దుస్సంకల్పములు కలగకుండా ఉండాలి అంటే శాస్త్ర విశ్వాసం కలిగి ఉండాలి. కేవలం రుచిని చూసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. రుచికరముగా ఉండీ, ఏది ఆరోగ్యాన్నిస్తుందో అదే తినమని చెబుతుంది ఆచారం. ) శాస్త్రాన్ని ఆచారాన్ని ధర్మాన్ని ఉల్లఘించావు. నీవు ఎంచుకున్న సమయం దోషభూయిష్టమైనది. క్షణ కాల సుఖం కోసం ఆచారాన్ని పాడుచేసావు. అది కూడా నీవు ఎంచుకున్న కాలము తప్పు. నా ఆజ్ఞ్యనుకూడా ఉల్లంఘించావు. ఎందుకు చేయకూడదో కూడా చెప్పాను. అయినా నీవు వినలేదంటే, ఆ దేవతలను అవహేళన చేసావు. ఈ నాలుగు తప్పులూ చేసావు
భవిష్యతస్తవాభద్రావభద్రే జాఠరాధమౌ
లోకాన్సపాలాంస్త్రీంశ్చణ్డి ముహురాక్రన్దయిష్యతః
నీవు చేసిన ఈ తప్పుకు శిక్ష నీ బిడ్డలకు పడుతుంది. ఆ పాప ఫలితం సంతానానికి సంక్రమిస్తుంది. దేశాన్ని ధర్మాన్ని సమయాన్ని చూడకుండా భార్యా భర్తలు ప్రవర్తిస్తే ఆ ప్రభావం బిడ్డలపై పడుతుంది. వ్యతిరేక ఆచరణ శీలురాలివి అయిన నీకు అమంగళకరులైన పిల్లలు పుడతారు. నీలోపము వలన, మూడు లోకములనూ, లోకపాలకులనూ, నీ పిల్లలు పరితంపింపచేస్తారు, ఏడిపిస్తారు
ప్రాణినాం హన్యమానానాం దీనానామకృతాగసామ్
స్త్రీణాం నిగృహ్యమాణానాం కోపితేషు మహాత్మసు
కొన్ని లక్షల ప్రాణులు చంపబడతాయి, తప్పు చేయని వాళ్ళు బాధపడతారు, చెరబట్టబడిన స్త్రీల అర్తనాదాలు విన్న మహాత్ములు కోపిస్తారు.
తదా విశ్వేశ్వరః క్రుద్ధో భగవాల్లోకభావనః
హనిష్యత్యవతీర్యాసౌ యథాద్రీన్శతపర్వధృక్
లోకాలను వృద్ధి పొందించే పరమాత్మకు అప్పుడు కోపం వస్తుంది. పర్వత రెక్కలను ఇంద్రుడు ఖండించినట్లుగా అపుడు భూలానికి అవతరించి నీ కుమారులను వధిస్తాడు
దితిరువాచ
వధం భగవతా సాక్షాత్సునాభోదారబాహునా
ఆశాసే పుత్రయోర్మహ్యం మా క్రుద్ధాద్బ్రాహ్మణాద్ప్రభో
వారు దౌర్జన్యం చేస్తారని విని దితి బాధపడింది. పరమాత్మ చేత వధించబడతారు కాబట్టి, వారికి మోక్షం వస్తుంది కాబట్టి, అది విని సంతోషించింది. మునులనూ బ్రాహ్మణులను ఇపుడు కలిగిన పిల్లలు బాధిస్తే, వారి చేత శిక్ష బడకుండా చేయండి.
న బ్రహ్మదణ్డదగ్ధస్య న భూతభయదస్య చ
నారకాశ్చానుగృహ్ణన్తి యాం యాం యోనిమసౌ గతః
బ్రాహ్మణోత్తముల ఋషుల సాధువుల శాపానికి గురైనవారు, బ్రహ్మదండ హతులని చూచి, నరక్ము కూడా భయపడుతుంది. ఇలాంటి పాపులు ఏ జాతిలో పడతారో, ఆ జాతిలో వారందరూ భయపడతారు. అంత నీచమైన జుగుప్సితమైన శిక్ష (బ్రహ్మ దండం) పడకుండా చూడండి.
కశ్యప ఉవాచ
కృతశోకానుతాపేన సద్యః ప్రత్యవమర్శనాత్
భగవత్యురుమానాచ్చ భవే మయ్యపి చాదరాత్
చేసిన తప్పు తెలుసుకున్నావు, తప్పు చేసిన వెంటనే నీవు పరిశీలించుకున్నావు, పరమాత్మ యందు నీకు గౌరవమూ భక్తీ ఉన్నాయి, నా మీదా, శివుని మీదా, ఆదరం చూపావు కాబట్టి,
పుత్రస్యైవ చ పుత్రాణాం భవితైకః సతాం మతః
గాస్యన్తి యద్యశః శుద్ధం భగవద్యశసా సమమ్
నీ కొడుకులకు కలిగే సంతానములో సజ్జనులందరిచేతా అంగీకరింపబడే కుమారుడు పుడతాడు. పరమాత్మ యొక్క కీర్తితో సమానముగా అన్ని లోకాలలో నీ పౌత్రుని కీర్తిని గానం చేస్తారు
యోగైర్హేమేవ దుర్వర్ణం భావయిష్యన్తి సాధవః
నిర్వైరాదిభిరాత్మానం యచ్ఛీలమనువర్తితుమ్
బంగారము యొక్క చెడు రంగు పోవాలంటే ఒక లోహములో వేసి తీస్తారు. అలాగే నీ పౌత్రుని పేరు తలచుకుంటే లోకమంతా శుద్ధి పొందుతుంది. సజ్జనులందరూ ఇతనిని ఆదరితారు. మంచివాడు అంటే ఎలా ఉండాలి, ఎవరిని ఉత్తముడు అని అనాలి అంటే నీ పౌత్రుని శీలాన్ని కొలబద్దగా తీసుకుంటారు.
యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకమ్
స స్వదృగ్భగవాన్యస్య తోష్యతేऽనన్యయా దృశా
మంచి వారంతా నీ మనవడిని ఆదర్శముగా తీసుకుంటారు, అనుకరిస్తారు. సకల చరాచర ప్రపంచం ఎవరి అనుగ్రహ్ముతో ప్రశాంతముగా ఆనందముగా ఉంటుందో, ఆయన నీ మనవడిని చూచి ప్రసన్నుడవుతాడు. భగవంతుని మీద తప్ప ఇంకొకరి మీద దృష్టి ఉండదు. అలాంటి భగవానుడి చేత నీ మనవడు "నా వాడు" అని అనిపించుకుంటాడు.
స వై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్ఠః
ప్రవృద్ధభక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుణ్ఠమిమం విహాస్యతి
పరమభాగవతుడు, గొప్ప మనసు కలవాడు (మహాత్మ), పరమాత్మను మాత్రమే నిరంతరమూ తలుస్తాడు ( మహానుభావ), గొప్పవారందిరిలో గొప్పవాడు (మహతాం మహిష్ఠః). ఇతను పరమాత్మ యందు భక్తి పెరగడం వలన నిరంతరం మనసులో పరమాత్మను మాత్రమే ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా ఆ మహానుభావుడు ఈ లోకాన్ని విడిచి పెట్టి వైకుంఠాన్ని జేరతాడు.
అలమ్పటః శీలధరో గుణాకరో హృష్టః పరర్ద్ధ్యా వ్యథితో దుఃఖితేషు
అభూతశత్రుర్జగతః శోకహర్తా నైదాఘికం తాపమివోడురాజః
దేని యందూ ఆశలేని వాడు, ఎప్పుడు సత్శీలములో ఉండేవాడు, సద్గుణంబుల్లెల్ల సంఘంబులై వచ్చి అసుర రాజ తనయు నందు నిలిచె అన్నట్లు, బోవదలపవు, పరమాత్మ యందు గుణాలు ఎలా తొలగిపోవో ఈయన యందు కూడా అలాగే కళ్యాణ గుణలు ఉంటాయి, నిరంతరమూ ఇతరుల సంతోషాన్ని చూచి సంతోషించేవాడు, ఎదుటివారి బాధను చూచి దుఃఖిస్తాడు. శత్రువులెవరూ లేని వారు. సకల జగత్తు యొక్క శోకాన్ని తొలగించేవాడు. వేసవి కాలములో తాపము చంద్రుని దర్శనముతో ఎలా పోతుందో అలాగ.
అన్తర్బహిశ్చామలమబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీతరూపమ్
పౌత్రస్తవ శ్రీలలనాలలామం ద్రష్టా స్ఫురత్కుణ్డలమణ్డితాననమ్
నీకు నాకూ పిల్లలకూ లేని అదృష్టం నీ మనవడికి కలుగుతున్నది. ఇతను వెలుపలా లోపలా పవిత్రుడు, తన సంకల్పముతో కోరిన రూపము ధరించే, లక్ష్మీ దేవికి (అమ్మవారికి) ఆనందము కలిగించే పరమాత్మ, మకర కుండలములూ హారములూ కేయూరములతో అలంకరించబడి ఉన్న పరమాత్మను నీ పౌత్రుడు ప్రత్యక్షముగా సాక్షాత్కరింపచేసుకుంటాడు. అంతటి ఉత్తముడైన పౌత్రుడు నీకు కలుగుతాడు.
మైత్రేయ ఉవాచ
శ్రుత్వా భాగవతం పౌత్రమమోదత దితిర్భృశమ్
పుత్రయోశ్చ వధం కృష్ణాద్విదిత్వాసీన్మహామనాః
ఇది విని ఆమోదించిన దితి , పరమాత్మ చేత తన పుత్రులు వధింపబడతారనీ, మనవడు అనుగ్రహింపబడతాడనీ విని

No comments:
Post a Comment