Thursday, January 24, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం



శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం 

మైత్రేయ ఉవాచ
అవధార్య విరిఞ్చస్య నిర్వ్యలీకామృతం వచః
ప్రహస్య ప్రేమగర్భేణ తదపాఙ్గేన సోऽగ్రహీత్

బ్రహ్మ మాటలలోని నిష్కాపట్యాన్ని గుర్తించాడు స్వామి. ఏ దాపరికములేని బ్రహ్మగారి మాటలని విని చిరునవ్వు నవ్వాడు. యుద్ధం చేస్తూనే బ్రహ్మగారి వైపు ప్రేమనిండిన కడగంటి చూపుతో బ్రౌఅం స్తోత్రాన్ని స్వీకరించాడు.

తతః సపత్నం ముఖతశ్చరన్తమకుతోభయమ్
జఘానోత్పత్య గదయా హనావసురమక్షజః

హిరణ్యాక్షుడి దవడ మీద ఒక దెబ్బ కొట్టాడు.

సా హతా తేన గదయా విహతా భగవత్కరాత్
విఘూర్ణితాపతద్రేజే తదద్భుతమివాభవత్

ఆ వేగముగా కొట్టడములో గద చేతిలోంచి జారి కింద పడింది. చూచేవారికి అది పరమ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయుధం జారిపడ్డ స్వామి మీద హిరణ్యాక్షుడు ఆయుధం ప్రయోగించలేదు.

స తదా లబ్ధతీర్థోऽపి న బబాధే నిరాయుధమ్
మానయన్స మృధే ధర్మం విష్వక్సేనం ప్రకోపయన్

అది చూచిన స్వామికి మరింత కోపము వచ్చింది.

గదాయామపవిద్ధాయాం హాహాకారే వినిర్గతే
మానయామాస తద్ధర్మం సునాభం చాస్మరద్విభుః

గద జారిపోతే చూసిన అన్ని లోకాలు హాహాకారాలు చేసాయి. కిందపడిన ఆయుధం తీసుకోరు. అందుకు స్వామి సుదర్శనాన్ని స్మరించాడు,

తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన స్వపార్షదముఖ్యేన విషజ్జమానమ్
చిత్రా వాచోऽతద్విదాం ఖేచరాణాం తత్ర స్మాసన్స్వస్తి తేऽముం జహీతి

తన సేవకుడితో విషాదం (ఓటమి) పొంది, దితి పుత్రులలో అధముడు (చిన్నవాడు) . ఆకాశములో తిరిగే చారణులు చిత్ర విచిత్రమైన బాషలో మాట్లాడుతున్నారు. తత్వము తెలియక (భగవంతుడే గెలుస్తాడని తెలియక, తెల్సినా ప్రేమతో మరచిపోయి) మంగళాశాసనం చేస్తున్నారు - "నీకు శుభము కలుగుగాక. నీవు గెలవాలి"

స తం నిశామ్యాత్తరథాఙ్గమగ్రతో వ్యవస్థితం పద్మపలాశలోచనమ్
విలోక్య చామర్షపరిప్లుతేన్ద్రియో రుషా స్వదన్తచ్ఛదమాదశచ్ఛ్వసన్

చక్రం ధరించి పద్మము వంటి ఎర్రబారిన విశాలమైన నేత్రములు గల ఎదురుగా ఉన్న స్వామిని చూచాడు. చూచి అసహనానికి గురయ్యాడు. కోపంతో పెద్విని కొరుక్కుంటూ, ఊపిరి ఎగదోస్తూ

కరాలదంష్ట్రశ్చక్షుర్భ్యాం సఞ్చక్షాణో దహన్నివ
అభిప్లుత్య స్వగదయా హతోऽసీత్యాహనద్ధరిమ్

భయంకరమైన కోరలతో కాల్చివేస్తున్నట్లు చూచి గదతో స్వామిని కొట్టాడు.

పదా సవ్యేన తాం సాధో భగవాన్యజ్ఞసూకరః
లీలయా మిషతః శత్రోః ప్రాహరద్వాతరంహసమ్

అలా కొట్టబోయినప్పుడు ఎడమ కాలితో గదను కొట్టగా ఆ గద కిందపడింది. అపుడు స్వామి

ఆహ చాయుధమాధత్స్వ ఘటస్వ త్వం జిగీషసి
ఇత్యుక్తః స తదా భూయస్తాడయన్వ్యనదద్భృశమ్

"ఆయుధము తీసుకుని యుద్ధము చేయి" అనగా, ఆయుధం తీసుకోకుండా ముష్టిఘాతం విసిరాడు స్వామి వైపు

తాం స ఆపతతీం వీక్ష్య భగవాన్సమవస్థితః
జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పన్నగీమ్

పాముకాటును గరుత్మంతుడు ఎలా స్వీకరిస్తాడో, ఆ ముష్టిఘాతాన్ని అలా స్వీకరించాడు

స్వపౌరుషే ప్రతిహతే హతమానో మహాసురః
నైచ్ఛద్గదాం దీయమానాం హరిణా విగతప్రభః

తన కాలితో గదని ఎత్తి ఆ రాక్షసుడికి ఇచ్చాడు. ఆ రాక్సుడు దానికి ఒప్పుకోక, కాంతి తగ్గిన వాడై

జగ్రాహ త్రిశిఖం శూలం జ్వలజ్జ్వలనలోలుపమ్
యజ్ఞాయ ధృతరూపాయ విప్రాయాభిచరన్యథా

త్రిశూలాన్ని స్వీక్రించహాడు. ఎలా ఐతే అభిచార హోమములో మంత్రించి ఇచ్చిన నెయ్యి అగ్నిహోత్రుడు స్వీకర్చడో, అలా ఈ రాక్షసుడు స్వామి ఇచ్చిన గదను తీసుకోలేదు. ఈ త్రిశూలం అభిచార హోమములోంచి వచ్చిన ఆయుధములాగ ఉంది

తదోజసా దైత్యమహాభటార్పితం చకాసదన్తఃఖ ఉదీర్ణదీధితి
చక్రేణ చిచ్ఛేద నిశాతనేమినా హరిర్యథా తార్క్ష్యపతత్రముజ్ఝితమ్

అలాంటి త్రిశూలాన్ని చక్రముతో చేధించాడు. ఇంద్రుడు విశ్వరూపున్ని, వృత్తాసురున్ని కొట్టినట్టుగా, గరుత్మంతుడు సర్పాన్ని కొట్టినట్టుగా శూలాన్ని ఖండించాడు

వృక్ణే స్వశూలే బహుధారిణా హరేః ప్రత్యేత్య విస్తీర్ణమురో విభూతిమత్
ప్రవృద్ధరోషః స కఠోరముష్టినా నదన్ప్రహృత్యాన్తరధీయతాసురః

ఆ రాక్షసుడు మహావేగముతో వక్షస్థలాన్ని ముందుకు చరిచి ముష్టిఘాతముతో స్వామి మీద దాడి చేసి అదృశ్యమయ్యాడు.

తేనేత్థమాహతః క్షత్తర్భగవానాదిసూకరః
నాకమ్పత మనాక్క్వాపి స్రజా హత ఇవ ద్విపః

ఆ ముష్టిఘాతం ఏనుగు మీద పూల మాల వేసినట్లు ఉంది.

అథోరుధాసృజన్మాయాం యోగమాయేశ్వరే హరౌ
యాం విలోక్య ప్రజాస్త్రస్తా మేనిరేऽస్యోపసంయమమ్

యోగమాయాధిపతి అయిన పరమాత్మ మీద అన్ని మాయలూ ప్రయోగించాడు. ఆ మాయలను చూచిన వేరే ప్రజాపతులందరూ "ఈ ప్రపంచానికి అకాల ప్రళయం వచ్చింది" అనుకొని భయపడ్డారు

ప్రవవుర్వాయవశ్చణ్డాస్తమః పాంసవమైరయన్
దిగ్భ్యో నిపేతుర్గ్రావాణః క్షేపణైః ప్రహితా ఇవ

చండవాయువులు వీచడముతో దుమ్ముతో నిండిపోయింది, ఎవరో విసిరినట్లు రాళ్ళు వచ్చి పడుతున్నాయి. ఆకాశములో నక్షత్రాలు మబ్బులూ ఏమీ లేకుండా ఉరుములూ మెరుపులూ పిడుగులూ పడుతున్నాయి

ద్యౌర్నష్టభగణాభ్రౌఘైః సవిద్యుత్స్తనయిత్నుభిః
వర్షద్భిః పూయకేశాసృగ్ విణ్మూత్రాస్థీని చాసకృత్

ఎముకలూ మూత్రము మలము దుర్గంధము కేశము రక్తమూ వర్షిస్తున్నాయి. ఇవన్నీ మేఘము లేకుండానే వస్తున్నాయి

గిరయః ప్రత్యదృశ్యన్త నానాయుధముచోऽనఘ
దిగ్వాససో యాతుధాన్యః శూలిన్యో ముక్తమూర్ధజాః

పర్వతాలన్నీ ఎగిరి వచ్చి ఆయుధాలు ప్రయోగిస్తున్నాయి. రాక్షస స్త్రీలు వెంట్రుకలు విరబోసుకుని శూలము పోసుకుని దిగంబరముగా పరిగెత్తుకుని వస్తున్నారు

బహుభిర్యక్షరక్షోభిః పత్త్యశ్వరథకుఞ్జరైః
ఆతతాయిభిరుత్సృష్టా హింస్రా వాచోऽతివైశసాః

యక్ష రాక్షస పిశాచ శాకినీ ఢాకినీలు పరుషమైన వాక్యాలు మాట్లాడుతూ, హింసను ప్రకోపించే ప్రేలాపనలతో పరిగెత్తుకుంటూ వచ్చారు.

ప్రాదుష్కృతానాం మాయానామాసురీణాం వినాశయత్
సుదర్శనాస్త్రం భగవాన్ప్రాయుఙ్క్త దయితం త్రిపాత్

అప్పుడు స్వామి సుదర్శనాన్ని చూపాడు. అది కనపడగానే అన్ని మాయలూ పోయాయి. వాడి మాయలన్నీ పోయాయి.

తదా దితేః సమభవత్సహసా హృది వేపథుః
స్మరన్త్యా భర్తురాదేశం స్తనాచ్చాసృక్ప్రసుస్రువే

ఆ సుదర్శనాన్ని చూపిన సమయములో దితికి వణుకు పుట్టింది. ఆమె స్తనములలో రక్తం స్రవించింది

వినష్టాసు స్వమాయాసు భూయశ్చావ్రజ్య కేశవమ్
రుషోపగూహమానోऽముం దదృశేऽవస్థితం బహిః

ఇన్ని మాయలూ వ్యర్థమవగా స్వామిని చూచి కోపించి, ముష్టిఘాతము చేస్తే,

తం ముష్టిభిర్వినిఘ్నన్తం వజ్రసారైరధోక్షజః
కరేణ కర్ణమూలేऽహన్యథా త్వాష్ట్రం మరుత్పతిః

కర్ణమూలము మీద చేతితో స్వామిని కొట్టగా, ఇంద్రుడు వృత్తాసురున్ని కొట్టినట్లుగా,

స ఆహతో విశ్వజితా హ్యవజ్ఞయా పరిభ్రమద్గాత్ర ఉదస్తలోచనః
విశీర్ణబాహ్వఙ్ఘ్రిశిరోరుహోऽపతద్యథా నగేన్ద్రో లులితో నభస్వతా

ఆ చిన్న దెబ్బకే శరీరము కళ్ళూ తిరిగి, కాళ్ళూ చేతులూ వేళ్ళాడేస్తూ, వెంట్రుకలు విరబోసుకుని, వాయువు చేత కూల్చబడిన చెట్టులాగ కిందపడిపోయాడు.

క్షితౌ శయానం తమకుణ్ఠవర్చసం కరాలదంష్ట్రం పరిదష్టదచ్ఛదమ్
అజాదయో వీక్ష్య శశంసురాగతా అహో ఇమం కో ను లభేత సంస్థితిమ్

భూమి మీద పడిపోయినా అతని దివ్య తేజస్సు మాత్రమూ తగ్గలేదు. పెద్ద కోరలు ఉన్న నోరు, కొరకబడిన పెదవులు గలిగిన వాడిని చూచి. "ఈ స్థితి ఎవడు పొందుతాడు" అని బ్రహ్మాదులు అన్నారు. పరమాత్మ పాదముతో కొట్టబడి, పరమాత్మ ముఖాన్ని చూస్తూ, స్వామి ముందర పడి మరణించాడు. ఎంతటి మహానుభావుడు కాకుంటే ఈ స్థితి ఎవరికి వస్తుంది.

యం యోగినో యోగసమాధినా రహో ధ్యాయన్తి లిఙ్గాదసతో ముముక్షయా
తస్యైష దైత్యఋషభః పదాహతో ముఖం ప్రపశ్యంస్తనుముత్ససర్జ హ

మహాయోగులు తమ యోగముతో సమాధితో ఏకాంతముగా "పరమాత్మ ఇలా ఉండి ఉండవచ్చు " అనో, లేక పరమాత్మ విగ్రహాన్ని చిత్రించుకుని ధ్యానం చేస్తారో అలాంటి పరమాత్మ కాలిచేత కొట్టబడి పరమాత్మ ముఖాన్ని చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాడు

ఏతౌ తౌ పార్షదావస్య శాపాద్యాతావసద్గతిమ్
పునః కతిపయైః స్థానం ప్రపత్స్యేతే హ జన్మభిః

వీరు శ్రీమహావిష్ణువు ద్వారపాలకులే, మళ్ళీ కొద్ది రోజుల్లోనే (ఇక్కడ కొద్దిరోజులు అంటే కొన్ని మన్వంతరాలు)

దేవా ఊచుః
నమో నమస్తేऽఖిలయజ్ఞతన్తవే స్థితౌ గృహీతామలసత్త్వమూర్తయే
దిష్ట్యా హతోऽయం జగతామరున్తుదస్త్వత్పాదభక్త్యా వయమీశ నిర్వృతాః

అనేక యజ్ఞ్యములను విస్తరింపచేసిన నీకు నమస్కారము. జగత్తును కాపాడడానికి సాత్విక రూపము ధరించినవాడివి. నీ అనుగ్రహం వలనా మా అదృష్టము వలన ఈ రాక్షసుడు నశించాడు. మీ పాద భక్తి ఉన్న మేము సంతోషించాము.

మైత్రేయ ఉవాచ
ఏవం హిరణ్యాక్షమసహ్యవిక్రమం స సాదయిత్వా హరిరాదిసూకరః
జగామ లోకం స్వమఖణ్డితోత్సవం సమీడితః పుష్కరవిష్టరాదిభిః

సహింపవీలుకాని పరాక్రమం గల హిరణ్యాక్షున్ని సంహరించిన ఆదిసూకర అవతారములో వచ్చిన స్వామి పని పూర్తి కాగానే నిరంతరమూ ఉత్సవం జరిగే తన లోకానికి బ్రహ్మాది దేవతలచేత స్తోత్రం చేయబడుతూ వెళ్ళాడు

మయా యథానూక్తమవాది తే హరేః కృతావతారస్య సుమిత్ర చేష్టితమ్
యథా హిరణ్యాక్ష ఉదారవిక్రమో మహామృధే క్రీడనవన్నిరాకృతః

నీవడిగిన విధముగా అంతకు ముందు చెప్పని దాన్నంతా వివరించాను. వరాహావతారం ధరించి ఏ ఏ పనులు చేసాడో వివరించాను. ఇంత గొప్ప బల పరాక్రమములు గల హిరణ్యాక్షుడు బొమ్మలాగ గెలవబడ్డాడు.

సూత ఉవాచ
ఇతి కౌషారవాఖ్యాతామాశ్రుత్య భగవత్కథామ్
క్షత్తానన్దం పరం లేభే మహాభాగవతో ద్విజ

ఇలా పరమాత్మ యొక్క వరాహ స్వామి యొక్క కథను హాయిగా విని పరమానందమును పొందాడు.భగవంతుని కథ విన్న విదురుడు భగవంతున్నే పొందిన ఆనందం పొందాడు

అన్యేషాం పుణ్యశ్లోకానాముద్దామయశసాం సతామ్
ఉపశ్రుత్య భవేన్మోదః శ్రీవత్సాఙ్కస్య కిం పునః

పదిమంది చేత కీర్తించబడే సజ్జనుల కథ వింటేనే ఆనందం కలిగితే భగవంతుని కథ వింటే ఆనందము కలుగుతుంది అని వేరే చెప్పాలా.

యో గజేన్ద్రం ఝషగ్రస్తం ధ్యాయన్తం చరణామ్బుజమ్
క్రోశన్తీనాం కరేణూనాం కృచ్ఛ్రతోऽమోచయద్ద్రుతమ్

మనకి మనం తీర్చుకోలేని గొప్ప ఆపద వచ్చినప్పుడు గజేంద్రమోక్షన కథను గుర్తు చేసుకోవాలి. అలాగే మనము తొలగించుకోలేము అని నిశ్చయించుకున్న ఆపద తొలగిపోయిన తరువాత కూడా గజేంద్ర మోక్ష కథని తలచుకోవాలి. చివరి ఊపిరితో స్వామిని స్తోత్రం చేసాడు. పదివేల ఏళ్ళు కోట్లాడాడు, ఒక వేయి ఏళ్ళు స్తోత్రం చేసాడు. మహత్యాపద సంప్రాప్తే స్మర్తవ్యే భగవాన్ హరిః. ఇక్కడ హరి అనేది కూడా అవతారం. చాక్షుష మన్వంతరములో హరి కూడా ఒక అవతారము. ఉలూక ప్రజాపతికి స్వామి హరిగా అవతరిచాడు.  ఆపద వచ్చినా తొలగినా ఆయననే తలచాలి. అందుకే అన్నిలోక దేవతలూ గజేంద్ర మోక్షాన్ని తలచుకుంటున్నారు
ఆడ యేనుగులు మొత్తుకుంటుంటే పరమాత్మను ధ్యానం చేస్తున్న ఏనుగుని ఎవరు కాపాడారో, అలాంటి శ్రీమన్నారాయణున్ని ధ్యానం చేయడం అత్యంత సులభం. సుఖారాధ్యుడు.

తం సుఖారాధ్యమృజుభిరనన్యశరణైర్నృభిః
కృతజ్ఞః కో న సేవేత దురారాధ్యమసాధుభిః

ఎవరి ప్రవర్తనలో మనసులో కపటము ఉండదో వారు మాత్రమే పరమాత్మని ఆరాధించగలరు. కపటములేకుండా ఉన్నట్లు గుర్తు ఏమిటంటే పరమాత్మ ఒక్కడే రక్షకుడు అన్న భావము నిశ్చలముగా ఉండటం. ఇలాంటి పరమాత్మను కృతజ్ఞ్యత ఉన్నవాడు ఎవడు సేవించడు? 

యో వై హిరణ్యాక్షవధం మహాద్భుతం విక్రీడితం కారణసూకరాత్మనః
శృణోతి గాయత్యనుమోదతేऽఞ్జసా విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః

పరమాద్భుతమైన గాధ అయిన హిరణ్యాక్ష వధను, ఒక ప్రయోజనాన్ని ఆశించి వరాహ అవతారం ధరించిన స్వామి క్రీడను ఎవరు వింటారో, చదువుతారో, గానం చేస్తారో, ఆమోదిస్తారో, చదువుతారో, చెబుతారో, అలాంటి వాడికి బ్రహ్మ హత్యా పాతకం కూడా పోతుంది. అంటే తొలగింపబడని పాపం లేదు. వింటే భుక్తి (ఇహ లోక సుఖమూ) ముక్తి (పరలోక సుఖం)

ఏతన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషామ్
ప్రాణేన్ద్రియాణాం యుధి శౌర్యవర్ధనం నారాయణోऽన్తే గతిరఙ్గ శృణ్వతామ్

మనమందరం ఉండటానికి కావలసిన ఆధారము దొరికింది. దొరికిన భూమికి వచ్చిన ఆపద తొలగింది. స్మరించగానే ప్రత్యక్షమైన పరమాత్మ అవతారము వరాహ అవతారం. మనకి ఆపద వస్తున్న విషయం తెలియకున్నా తానొచ్చి అడ్డుగా నిలబడి ఆ ఆపదను తొలగిస్తాడు. ప్రతీ నిత్యం స్మరించ వలసిన అవతారం. తలిస్తే వచ్చే అవతారం. పిలిస్తే పలికే అవతారం. మత్స్య కూర్మాది ఇతర అవతారాల కంటే విశిష్టమైన అవతారం. స్మరణ మాత్రాన పాపములు తొలగించే అవతారం. సంధ్యావందనములో "ఆసనే వినియోగః" అన్నప్పుడు ఆ ఆసనం రావడానికి స్థానాన్ని ప్రసాదించిన అవతారం వరాహవతారం. ఇది చాలా మంచి రోజు గొప్ప ఫలమును ప్రసాదించే పరమ పవిత్రమైన రోజు. ఈ స్వామి భూమిని పైకి తీసుకుని వచ్చిన తరువాత కాళ్ళ గిట్టలకూ మూతి పైభాగానికి అంటిన మట్టిని దులిపాడు. కిందపడిన ఆ మట్టిని తన కేశముల మీద( దర్భల మీద) మూడు మూడు మూడు గా పెట్టి పితృదేవతారాధన చేసాడు. ఆ సాంపరదాయాన్ని ఆయనే ప్రారంభించాడు. ధన్యమైనది - ధనానికి యోగమైంది. యశస్త్యం - కీర్తి వస్తుంది. దీర్ఘ ఆయువు వస్తుంది. అన్ని కోరికలూ తీరుతాయి. యుద్ధములో ప్రాణములకు ఇంద్రియములకూ శౌర్యం పెరుగుతుంది. మనందరమూ యుద్ధం చేస్తూనే ఉన్నాం ఇంద్ర్యములతో విషయములతో ప్రతీక్షణం చేస్తూనే ఉన్నాము. విషయ ఇంద్రియాలకు జరిగే యుద్ధములో విషయాల మీద ఇంద్రియములు విజయం సాధించాలంటే ఇంద్రియాధిపతైన స్వామిని ప్రార్ధించాలి. చెప్పేవారికీ వినేవారికీ చివరికి శ్రీమన్నారాయణుడే గతి. మోక్షం లభిస్తుంది. జీవించి ఉన్ననతకాలం శరీరేంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు.

No comments:

Post a Comment