ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం
పరమాత్మ అన్ని రకముల లీఎలలనూ అనుకరించి, ప్రతీ పుట్టనూ గుట్టనూ నదినీ అడిగారు. స్వామి వేరొక గోపికతో విహరించినట్లు చూసారు. ఆమె అదృష్టవంతురాలు అనుకున్నారు. ఆమెకు కూడా స్వామి అంతర్ధానం చెందాడు. ఇపుడు అందరూ కలసి పరమాత్మ మళ్ళీ ఒకసారి ప్రార్థించడానికి కాళిందీ నదికి వెళ్ళారు. కృష్ణ పరమాత్మను మనసులో ఉంచుకుని కాళిందీ తీరం చేరి పరమాత్మ రావాలని కోరుకుంటూ పరమాత్మ గురించి గానం చేసారు. వీటిని గోపికా గీతలు అంటారు
గోపికలు తత్వజ్ఞ్యులు. కేవలం అబలలూ కామినులూ కారు. కామినులు లా వ్యవహరించారు. పరమాత్మ కూడా ప్రియురాళ్ళలా చూసారు. యోగులు పరమాత్మను చేరడానికి పడిన తపన ఇందులో కనిపిస్తుంది.
గోపికా గీతలతో వారు ఎంత తత్వజ్ఞ్యులో అర్థమవుతుంది
గోప్య ఊచుః
జయతి తేऽధికం జన్మనా వ్రజః శ్రయత ఇన్దిరా శశ్వదత్ర హి
దయిత దృశ్యతాం దిక్షు తావకాస్త్వయి ధృతాసవస్త్వాం విచిన్వతే
తే జన్మనా వ్రజః అధికం జయతి - నీ పుట్టుకతో అవతారముతో ఈ వ్రేపల్లె మునుపటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువైన శోభను సంతరించుకున్నది.
ఎందుకంటే నీతో బాట్ అమ్మవారు కూడా వచ్చారు. అమ్మవారు నిన్ను వీడి ఉండలేదు. ఆమె రాకతో వ్రేపల్లె శోభే మారిపోయింది.
(బాధలో ఉన్నవారూ వేదనలో ఉన్నవారు, అప్పుడో మాటా ఇప్పుడో మాట,మాట్లాడుతూ నిస్సారముగా నీరసముగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతారు) . ప్రియా కనపడు. నీ జనం నీ మీదే ప్రాణం నింపుకుని ఉన్నారు. నిన్ను వెతుకుతున్నారు.
శరదుదాశయే సాధుజాతసత్ సరసిజోదరశ్రీముషా దృశా
సురతనాథ తేऽశుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వధః
పరమాత్మ చూపు పద్మ గర్భము యొక్క శోభను దొంగలించే చూపు.శరత్ కాలములో జలాశయములో చక్కగా పుట్టి, వికసించిన పద్మం యొక్క మధ్యభాగం యొక్క శోభను దొంగిలించే నీ చూపుతో మాకు ప్రీతి కలిగించే వాడా, మేము నీకు దాసీలము. కూలి తీసుకోని దాసిలం మేము. (ఫలాకాంక్ష రాహిత్యముగా నిన్ను సేవిస్తున్నాము)
నీ మీద భక్తితో ప్రేమతో పారవశ్యముతో నీకు సేవ చేస్తున్నాము. ఇటువంటి దాసీలను, ఏ వేతనం తీసుకోని దాసీలను చంపితే అది వధ అవ్వదా? నీవు రాక్షసులనూ కౄరులనూ దుర్మార్గులనూ చంపుతావని తెలుసు. మాకు దాస్యం ప్రసాదించకుండుట వధ కదా?
విషజలాప్యయాద్వ్యాలరాక్షసాద్వర్షమారుతాద్వైద్యుతానలాత్
వృషమయాత్మజాద్విశ్వతో భయాదృషభ తే వయం రక్షితా ముహుః
అలాంటప్పుడు అన్ని సార్లు ఎందుకు కాపాడావు. విష జలం తాగి మరణించిన మమ్ము కాపాడావు. కాళీయ విషం నిండిన యమునా నదిలోంచి కాపాడావు. అఘాసురుడి నుండి కాపాడావు. రాళ్ళ వాన వచ్చినపుడూ, దావాగ్ని నుండి కాపాడావు. శంఖచూడుడినుండి కాపాడావు, రకరకాల ఆపదలనుండి నీ చేత మేము కాపాడబడ్డాము.
ఇన్ని సార్లు కాపాడి ఇపుడు చంపుతున్నావు.నీకు మా మీద ప్రేమ లేకపోతే ఇన్ని సార్లలో ఏ ఒక్కసారి ఊరుకున్నా మేము బతికి ఉండేవారముకాము.
న ఖలు గోపీకానన్దనో భవానఖిలదేహినామన్తరాత్మదృక్
విఖనసార్థితో విశ్వగుప్తయే సఖ ఉదేయివాన్సాత్వతాం కులే
నీవెవరో మాకు తెలుసు. అందరూ అనుకున్నట్లు నీవు గోపికా నందుడవు కావు. నీవు సకల చరాచరభూత రాశికీ అంతర్యామిగా ఉండేవాడవు. బ్రహ్మ ప్రార్థన మీద నీవు అవతరించావు.
విరచితాభయం వృష్ణిధూర్య తే చరణమీయుషాం సంసృతేర్భయాత్
కరసరోరుహం కాన్త కామదం శిరసి ధేహి నః శ్రీకరగ్రహమ్
వృష్ణి వంశములో జన్మించి ఆ వంశం భారాన్ని మోసేవాడా. అన్ని రకాల అభయాన్ని ప్రసాదించే, అమ్మ వారు ప్రేమతో పట్టుకున్న నీ చేతిని మా శిరస్సున ఉంచు.
సంసార భయాన్ని తొలగించమని నీ పాదములను పట్టుకుని ఉన్న మా శిరసును అమ్మవారు పట్టుకున్న మీ చేతిని ఉంచండి
వ్రజజనార్తిహన్వీర యోషితాం నిజజనస్మయధ్వంసనస్మిత
భజ సఖే భవత్కిఙ్కరీః స్మ నో జలరుహాననం చారు దర్శయ
వ్రేపల్లెలో ఉండే జనుల బాధలను తొలగించేవాడవు.స్త్రీల యొక్క, నీ వారైన స్త్రీల యొక్క గర్వాన్ని అణచడానికే నీవు అంతర్థానమైనట్లు మాకు తెలిసింది. మా గర్వాన్ని అణచి నీవు నవ్వుతున్నావు.మేము నీ దాసీ జనము. నిన్ను సేవించేవారం. అటువంటి మాకు నీ సుందరమైన ముఖపద్మాన్ని చూపించు
ప్రణతదేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనమ్
ఫణిఫణార్పితం తే పదామ్బుజం కృణు కుచేషు నః కృన్ధి హృచ్ఛయమ్
నమస్కరించిన జీవుల యొక్క పాపాలు తొలగించేవి, గడ్డి మేసే పశువుల వెంట నడిచేటువంటివీ, సకల శోభలకూ ఆలవాలమైనటువంటివి, కాళీయుని పడగలమీద ఉంచిన నీ పాదపద్మాలను మా స్తనముల యందు ఉంచి , మా హృదయములో ఉండే ఆర్తిని చేధించు
మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ
విధికరీరిమా వీర ముహ్యతీరధరసీధునాప్యాయయస్వ నః
నీ మాటలలో ఉండే మాధుర్యం, సంసారములో ఉండేవారికి సంసారాన్ని మరిపించే మాధుర్యం, వైకుంఠాన్ని పరమపదాన్నీ పరమాత్మ సాన్నిధ్యాన్ని లభింపచేసే మాధుర్యం.
నీ గొంతూ, చక్కని తీయని, పండితుల మనసుకు కూడా నచ్చే మాటా , సారవంతమైన, అనంత జ్ఞ్యానం కలిగించే మాట. మేము నీవు చెప్పే పనినీ చేసేవారము. నీ మీద మోహాన్ని పొందాము. మాకు దర్శనమీయి
తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహమ్
శ్రవణమఙ్గలం శ్రీమదాతతం భువి గృణన్తి యే భూరిదా జనాః
తపించిన వారికి బతికించేది. కవులు గానం చేసినది నీ కథ. అన్ని రకముల పాపములనూ పోగొట్టేది నీ కథ.
వింటున్న వారికి అనేకమైన శుభ పరమపరను అందించేది. సంపత్ప్రదము. అంతటా వ్యాపించి శరీరాన్నీ మనసునూ బుద్ధినీ ఆత్మ దాకా వ్యాపించేది. ఇలాంటి నీ కథను భూమి మీద గానం చేస్తారు నీకు అన్నీ ఇచ్చేవారైన నీ భక్తులు (తమకు ఉన్నవన్నీ నీకు అర్పించే భ్కతులు)
ప్రహసితం ప్రియప్రేమవీక్షణం విహరణం చ తే ధ్యానమఙ్గలమ్
రహసి సంవిదో యా హృది స్పృశః కుహక నో మనః క్షోభయన్తి హి
నీ నవ్వు, చూపూ, నీ విహారమూ, రహస్యముగా ఏకాంతములో ఉన్నప్పుడు నీవు మాట్లాడిన మాటలను నీవు ఎదురుగా లేనపుడు గుర్తుచేసుకుంటే మా పరిస్థితి ఏమిటి? నీవు కప్టివి (కుహక) . (ఈ మాట అనవలసినది గోపికలే కాదు మనం కూడా)
చలసి యద్వ్రజాచ్చారయన్పశూన్నలినసున్దరం నాథ తే పదమ్
శిలతృణాఙ్కురైః సీదతీతి నః కలిలతాం మనః కాన్త గచ్ఛతి
నీవు పశువులను తీసుకు అరణ్యానికి బయలు దేరుతావు. పరమ సుకుమారమైనవి నీ పాదాలు (సప్రేమభీతి కమలాకర పల్లవాభ్యాం - అమ్మవారే కందిపోతాయేమో అన్నంత సుకుమారమైనవి) మార్గమధ్యములో రాళ్ళ వలన ఎంత కందిపోతోందో అని మా మనసు తల్లడిల్లిపోతోంది
దినపరిక్షయే నీలకున్తలైర్వనరుహాననం బిభ్రదావృతమ్
ఘనరజస్వలం దర్శయన్ముహుర్మనసి నః స్మరం వీర యచ్ఛసి
సాయం కాలం కాగానే నల్లని ముంగురులతో పద్మం వంటి ముఖాన్ని కప్పి ఉన్న నల్లని ముంగురులతో,దుమ్ము కొట్టుకుపోయిన నీ ముఖం చూడగానే మా మనసులో మన్మధాభిలాష పెరుగుతోంది
ప్రణతకామదం పద్మజార్చితం ధరణిమణ్డనం ధ్యేయమాపది
చరణపఙ్కజం శన్తమం చ తే రమణ నః స్తనేష్వర్పయాధిహన్
ఆశ్రయించిన వారికోరిక తీర్చేది,బ్రహ్మ చేత పూజించబడేది, ఆపదలో స్మరించుకోదగినది పరమ శుభప్రదమైనదీ ఐన నీ పాదమును మా వక్షస్థలములో ఉంచి మా బాధను తొలగించు
సురతవర్ధనం శోకనాశనం స్వరితవేణునా సుష్ఠు చుమ్బితమ్
ఇతరరాగవిస్మారణం నృణాం వితర వీర నస్తేऽధరామృతమ్
కోరికను బాగా పెంచేదీ, అన్ని దుఃఖాలనూ తొలగించేదీ,చక్కని మురళిచేత చాలాసార్లు ముద్దు పెట్టుకోబడినది,ఒక సారి పరమాత్మ పెదవులు తాగితే ఇక ముందు ఏ కోరికలూ లేకపోవడమే కాక ఇదివరకు ఉన్న ప్రేమ కూడా, ఇతరములైన ప్రేమలను మరచిపోతాము. అటువంటి నీ అధరామృతాన్ని మాకు ఇవ్వు.
అటతి యద్భవానహ్ని కాననం త్రుటి యుగాయతే త్వామపశ్యతామ్
కుటిలకున్తలం శ్రీముఖం చ తే జడ ఉదీక్షతాం పక్ష్మకృద్దృశామ్
పగలు పశువుల వెంట అడవులకు వెళతావు. నిన్ను చూడని ఒక తృటి కాలం కూడా మాకు ఒక యుగం అవుతుంది. వంకరగా ఉన్న నీ కేశాలను చూస్తున్న మాకు ఒక జడుడు (బ్రహ్మ) రెప్పలు పెట్టాడు.
పతిసుతాన్వయభ్రాతృబాన్ధవానతివిలఙ్ఘ్య తేऽన్త్యచ్యుతాగతాః
గతివిదస్తవోద్గీతమోహితాః కితవ యోషితః కస్త్యజేన్నిశి
అచ్యుతా, మేము నీ దగ్గరకు వచ్చాము. భర్తలనూ పిల్లలనూ సోదరులనూ బంధువులనూ మొదలైనా మా అనే వారందరినీ వదలి నీ దగ్గరకు వచ్చాము.
నిన్ను పొందుటే ఉత్తమ గతి అని మాకు తెలుసు.వేణు గానము చేత మోహించబడ్డ స్త్రీలను నీలా ఎవరైనా అర్థరాత్రి వదిలిపెట్టి వెళతారా
రహసి సంవిదం హృచ్ఛయోదయం ప్రహసితాననం ప్రేమవీక్షణమ్
బృహదురః శ్రియో వీక్ష్య ధామ తే ముహురతిస్పృహా ముహ్యతే మనః
రహస్యముగా ఏకాంతములో కలసి మాట్లాడుకునేటువంటిది.హృదయములో కోరికను పెంచేది,నవ్వు ముఖాన్ని చూపేది, ప్రేమవీక్షణమైనది, నిరంతరం అమ్మవారు నివసించే నీ వక్షస్తలాన్ని చూచి,మేము కూడా ఇలాగే ఈయనతో కలసి ఉంటే బాగుండేది. నీతోనే కలసి ఉండాలి.
అనే ఇలాంటి స్పృహ చేత మేము నిత్యం మోహించబడుతూ ఉన్నాము
వ్రజవనౌకసాం వ్యక్తిరఙ్గ తే వృజినహన్త్ర్యలం విశ్వమఙ్గలమ్
త్యజ మనాక్చ నస్త్వత్స్పృహాత్మనాం స్వజనహృద్రుజాం యన్నిషూదనమ్
వ్రేపల్లెలో ఉన్న వారి కష్టాలను తొలగించడానికే నీ అవతారం. నీ దర్శనం అన్ని పాపాలను తొలగిస్తుంది.ప్రపంచ కళ్యాణమంగళం.నీవారి హృదయములో ఉండే బాధను నీవే తొలగించు. నిత్య నైమిత్తిక కర్మలను కూడా నీ మీదే మనసు లగ్నం చేస్తేనే చేయగలము
(పరమాత్మ కైంకర్యం చేస్తూ నిత్య నైమిత్తిక కర్మలు చేయడం మరచిపోతే అటువంటి వారి కర్మలను ఆచరించడానికి మూడు కోట్ల మంది ఋషులను స్వామి నియమించాడు)
యత్తే సుజాతచరణామ్బురుహం స్తనేషు
భీతాః శనైః ప్రియ దధీమహి కర్కశేషు
తేనాటవీమటసి తద్వ్యథతే న కిం స్విత్
కూర్పాదిభిర్భ్రమతి ధీర్భవదాయుషాం నః
నీవారిగా చెప్పుకునే వారి హృదయ బాధను తొలగించు. నీయందు మాత్రమే మనసు పెట్టుకునే ఉండే వారమైన మాకు నీ వారి హృదయ బాధను తొలగించే నీ కటాక్షాన్ని ప్రసాదించు
కఠినముగా ఉండే మా స్తనములలో నీ పాదం పెట్టుకుందామని, అవి కందిపోతాయేమో అని భయపడుతూ మేము ఉంటే నీవు అడవిలో ముళ్ళూ రాళ్ళూ తొక్కుకుంటూ వెళుతున్నావు. అలా వెళుతూ అరణ్యం అంతా తిరుగూ ఉన్నావు. మామూఉలుగా చిన్న దర్భల మీద పాదం పెడితేనే అది ఎక్కడ కందిపోతుందో అని క్షణ క్ష్ణం గడుపుతోంటే నీవు ఎన్నో రాళ్ళూ రప్పల మీద నడుస్తూ వెళుతున్నావు
ఈ గోపికా గీతలలో కృష్ణున్ని పరమాత్మగానే చూపారు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment