Friday, July 19, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఒకటవ అధ్యాయం

                                        ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభై ఒకటవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
స్తువతస్తస్య భగవాన్దర్శయిత్వా జలే వపుః
భూయః సమాహరత్కృష్ణో నటో నాట్యమివాత్మనః

ఇలా స్తోత్రం చేసిన అకౄరునికి కొద్ది సేపట్లో తాను సాక్షాత్కరించిన రూపాన్ని అంతర్ధానం చేసాడు.

సోऽపి చాన్తర్హితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః
కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్

స్వామి అంతర్థానం కావడం చూసి అకౄడు సంధ్యావందనాది కృత్యములు పూర్తి చేసుకుని నీటినుండి బయటకు వచ్చి ఆశ్చర్యముతో రథం దగ్గరకు వచ్చాడు.

తమపృచ్ఛద్ధృషీకేశః కిం తే దృష్టమివాద్భుతమ్
భూమౌ వియతి తోయే వా తథా త్వాం లక్షయామహే

రథం దగ్గరకు రాగానే 'చాలా సేపు నదిలో ఉన్నట్లున్నావు. ఏమైనా అద్భుతాన్ని చూసావా నీటిలో. భూమిలో ఆకాశములో నీటిలో ఏదో వింత చూసి పరవశములో ఉన్నట్లు ఉంది నీ ముఖం'

శ్రీక్రూర ఉవాచ
అద్భుతానీహ యావన్తి భూమౌ వియతి వా జలే
త్వయి విశ్వాత్మకే తాని కిం మేऽదృష్టం విపశ్యతః

అన్ని ఆశ్చర్యాలూ నీలోనే ఉన్నాయి. భూమీ ఆకాశమూ నీరు అన్నిటిలో ఉన్న అద్భుతాలు నీలోనే ఉన్నాయి.

యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే
తం త్వానుపశ్యతో బ్రహ్మన్కిం మే దృష్టమిహాద్భుతమ్

ఇలా సకల భూమీ ఆకాశమూ జలములో ఉన్న అద్భుతాలేవీ నిన్ను చూసేవాడికి విశేషముగా అనిపించవు.

ఇత్యుక్త్వా చోదయామాస స్యన్దనం గాన్దినీసుతః
మథురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే

ఇలా అని అకౄరుడు రథాన్ని నడిపాడు. సాయంకాలం అయ్యేసరికి రామ కృష్ణులను మధురా నగరానికి తీసుకు వెళ్ళాడు

మార్గే గ్రామజనా రాజంస్తత్ర తత్రోపసఙ్గతాః
వసుదేవసుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం న చాదదుః

మధురా నగర మార్గములో గ్రామాలలో ఉన్న జనం గుంపులు గుంపులుగా చేరి వీరిద్దరనీ చూస్తూ ప్రీతి చేత చూపు మరల్చుకోలేకపోయారు.

తావద్వ్రజౌకసస్తత్ర నన్దగోపాదయోऽగ్రతః
పురోపవనమాసాద్య ప్రతీక్షన్తోऽవతస్థిరే

వ్రేపల్లెలో ఉండేవారందరూ కూడా మధురా పురము యొక్క ఉపవనానికి వచ్చి వీరికోసం ఎదురుచూఒస్తూ ఉన్నారు.

తాన్సమేత్యాహ భగవానక్రూరం జగదీశ్వరః
గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ

ఇలా అద్నరినీ కలసిన తరువాత అకౄరుని చేతిలో చేయి వేసి నవ్వుతూ ఇలా అంటున్నాడు.

భవాన్ప్రవిశతామగ్రే సహయానః పురీం గృహమ్
వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీమ్

రథముతో నీవు ముందు నగరములోకి ప్రవేశించి నీ ఇంటికి నీవు వెళ్ళు . మేము ఈ విడిదిలోనే ఉండి ఈ సాయంకాలం నగరాన్ని చూస్తాము

శ్రీక్రూర ఉవాచ
నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో
త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల

అకౄరునికి ఈ కాసేపటిలోనే కృష్ణున్ని విడిచిపెట్టి పోవాలని అనిపించలేదు. మీరు లేకుండా నేను నగరములోకి ప్రవేశించలేను అని అన్నాడు. నన్ను మీరు విడిచిపెట్టకండి, మీరు భక్తవత్సలురు.

ఆగచ్ఛ యామ గేహాన్నః సనాథాన్కుర్వధోక్షజ
సహాగ్రజః సగోపాలైః సుహృద్భిశ్చ సుహృత్తమ

మా ఇంటికి వచ్చి మా ఇంటిని నీ ప్రవేశముతో రక్షకుడు ఉన్నదానిగా చేయి. అన్నగారితో గోపాలురితో మిత్రులతో  బంధువులతో కలిపి రండి

పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినామ్
యచ్ఛౌచేనానుతృప్యన్తి పితరః సాగ్నయః సురాః

గృహస్థులమైన మా ఇంటిని నీ పాద పరాగముతో పావనం చేయి. ఎవరి పాద ప్రవేశముతో పవిత్రం ఐతే పితృ దేవతలూ అగ్నులూ దేవతలూ తృప్తి పొందుతారో

అవనిజ్యాఙ్ఘ్రియుగలమాసీత్శ్లోక్యో బలిర్మహాన్
ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాన్తినాం తు యా

చాలా గొప్పవాడైన బలి చక్రవర్తి నీ పాదములు కడిగి ఆ జలములు నెత్తిన వేసుకున్నందుకు రసాతలాధిపతి అయ్యాడు, భవీష్యత్తు ఇంద్రుడయ్యాడు. త్రైలోక్య ఐశ్వర్యం పొందాడు. పరమ భక్తుల గతిని పొందాడు.

ఆపస్తేऽఙ్ఘ్ర్యవనేజన్యస్త్రీంల్లోకాన్శుచయోऽపునన్
శిరసాధత్త యాః శర్వః స్వర్యాతాః సగరాత్మజాః

నీ పాద ప్రక్షాళణ జలం మూడు లోకములను పావనం చేస్తుంది. సగరుడి పుత్రుడు కూడా నీపాదం వలన వచ్చిన తీర్థాన్ని తాము ధరించి పావనులై స్వర్గానికి వెళ్ళారు

దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణకీర్తన
యదూత్తమోత్తమఃశ్లోక నారాయణ నమోऽస్తు తే

జగన్నాధా, పవిత్రుల చేత పాడబడే కీర్తి కలవాడవు. యాదవులందరిలో ఎవరు ఉత్తములో వారి చేత గానం చేయబడే వాడవు. నారాయణ నీకు నమస్కారం

శ్రీభగవనువాచ
ఆయాస్యే భవతో గేహమహమర్యసమన్వితః
యదుచక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియమ్

నాయనా, దిగులు పడకు. నేను తప్పకుండా మా అన్నగారితో కలసి మీ ఇంటికి వస్తాను. మా యాదవ వంశానికి ద్రోహం చేస్తున్న కంసున్ని చంపి వస్తాను. మిత్రులకు ప్రీతిని కలిగిస్తాను. ఇపుడు వస్తే కంసుడు నీ మీద ఆగ్రహిస్తాడు.

శ్రీశుక ఉవాచ
ఏవముక్తో భగవతా సోऽక్రూరో విమనా ఇవ
పురీం ప్రవిష్టః కంసాయ కర్మావేద్య గృహం యయౌ

మనసుని చిన్నబుచ్చుకుని అకౄరుడు నగరానికి వెళ్ళి కంసునికి వీరు వచ్చిన విషయం చెప్పి, తన ఇంటికి తాను వెళ్ళాడు.

అథాపరాహ్నే భగవాన్కృష్ణః సఙ్కర్షణాన్వితః
మథురాం ప్రావిశద్గోపైర్దిదృక్షుః పరివారితః

ఇక్కడ నుంచీ షోడశొపచార పూజ. సయంకాలం ఉన్నాడు. సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకుని, మధ్యాహ్నం భోజనం చేసి మిత్రులతో సంకర్షనుతో కలసి

దదర్శ తాం స్ఫాటికతుణ్గగోపుర ద్వారాం బృహద్ధేమకపాటతోరణామ్
తామ్రారకోష్ఠాం పరిఖాదురాసదాముద్యానరమ్యోపవనోపశోభితామ్

స్ఫటిక మణులతో గోపురాలు కలిగి ద్వారాలు కలిగి బంగారు తోరణాలు కలిగి. ఉద్యానవనాలతో బంగారు గోపురాలతో భవనాలతో, వరుసగా ఇళ్ళు ఉన్నాయి

సౌవర్ణశృఙ్గాటకహర్మ్యనిష్కుటైః శ్రేణీసభాభిర్భవనైరుపస్కృతామ్
వైదూర్యవజ్రామలనీలవిద్రుమైర్ముక్తాహరిద్భిర్వలభీషు వేదిషు

నవ రత్నముల చేత ఏర్పరచబడిన గోడలు, కిటికీల పైన పావురాళ్ళకు చిలుకలకూ నెమళ్ళకు కావలసిన గూళ్ళు ఏర్పాటు చేస్తుంటే వాటికి కావలసిన ఆహారం ఏర్పాటు చేస్తుంటే, ఆ ఆహారం తీసుకుని అవి గానం చేస్తున్నాయి.

జుష్టేషు జాలాముఖరన్ధ్రకుట్టిమేష్వావిష్టపారావతబర్హినాదితామ్
సంసిక్తరథ్యాపణమార్గచత్వరాం ప్రకీర్ణమాల్యాఙ్కురలాజతణ్డులామ్

మొత్తం భూమిని గంధ జలముతో అత్తరుతో పూల మాలలతో అలంకరించి పేలాలనూ బియ్యమునూ ముగ్గుల మధ్యలో ఉంచారు.ముత్యాలు ఉంచారు

ఆపూర్ణకుమ్భైర్దధిచన్దనోక్షితైః ప్రసూనదీపావలిభిః సపల్లవైః
సవృన్దరమ్భాక్రముకైః సకేతుభిః స్వలఙ్కృతద్వారగృహాం సపట్టికైః

పూర్ణ కుంభాలతో పెరుగూ గందహాలతో తడిపి చిగురుటాకులతో అలమర్కించిన దీపములు కలిగి

తాం సమ్ప్రవిష్టౌ వసుదేవనన్దనౌ వృతౌ వయస్యైర్నరదేవవర్త్మనా
ద్రష్టుం సమీయుస్త్వరితాః పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహుర్నృపోత్సుకాః

ఇలాంటి అందమైన మధురా నగరములోకి ప్రవేశించాడు వసుదేవ నందనుడు. రాజమార్గాలలో (రహదారులలో) వెళుతున్నారు.
అలా రాజ మార్గములో వెళుతున్న కృష్ణ బలరాములను చూడడానికి మధురా నగర స్త్రీలు, బయటకు వచ్చారు

కాశ్చిద్విపర్యగ్ధృతవస్త్రభూషణా
విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః
కృతైకపత్రశ్రవనైకనూపురా
నాఙ్క్త్వా ద్వితీయం త్వపరాశ్చ లోచనమ్

కృష్ణ బలరాములు వచ్చేస్తున్నారని తొందర పెట్టేసరికి కాళ్ళ కడియాలు చేతులకు, చేతులకు తొడగాల్సినవి కాళ్ళకూ తొడుక్కున్నారు. తలకిందల ధరించారు వస్త్ర భూషణాలు. నడుమునుండి కింద భాగానికి ధరించాల్సిన దాన్ని పైన ధరించారు. కొందరు పైన ఎటువంటి వస్త్రాలు కట్టుకోకుండా వచ్చారు. ఒక చెవికి ఆభరణం ఒక కాలికి అందే ఒక చేతికి భూషణం ధరించారు

అశ్నన్త్య ఏకాస్తదపాస్య సోత్సవా అభ్యజ్యమానా అకృతోపమజ్జనాః
స్వపన్త్య ఉత్థాయ నిశమ్య నిఃస్వనం ప్రపాయయన్త్యోऽర్భమపోహ్య మాతరః

తింటున్న వారు భోజనం మధ్యలో వచ్చారు, పడుకున్నవారు లేచి వచ్చారు. స్నానం చేస్తున్నవారు మధ్యలోనే వచ్చారు, పిల్లలకు పాలిస్తున్న తల్లులు పిల్లలను వదిలి వచ్చారు.

మనాంసి తాసామరవిన్దలోచనః ప్రగల్భలీలాహసితావలోకైః
జహార మత్తద్విరదేన్ద్రవిక్రమో దృశాం దదచ్ఛ్రీరమణాత్మనోత్సవమ్

అలా వచ్చిన స్త్రీల అందరి మనసును నైపుణ్యం గల విలాసం కూడి ఉన్న చూపులతో వారి మనసులను హరించాడు.
మదించిన ఏనుగు వంటి నడక గల స్వామి. అమ్మవారి మనసుకు ఆనందం కలిగించే అందమైన దివ్యమంగళ విగ్రహాన్ని మధురా పుర స్త్రీలకు చూపిస్తూ నడుస్తున్నాడు

దృష్ట్వా ముహుః శ్రుతమనుద్రుతచేతసస్తం
తత్ప్రేక్షణోత్స్మితసుధోక్షణలబ్ధమానాః
ఆనన్దమూర్తిముపగుహ్య దృశాత్మలబ్ధం
హృష్యత్త్వచో జహురనన్తమరిన్దమాధిమ్

బాగా తెలిసి ఉన్నవాడిని చూచారు. చాలా సార్లు విన్నారు 'ఇలా ఉంటాడు కృష్ణుడూ అని.  అలా వినీ వినీ ఎలా ఉంటాడని ఊహించారో అలాగే ఉన్నారు కృష్ణ బలరాములు. ఇన్నాళ్ళకు చూడగలిగాము అని సంతోషించలేదు. మేము చూసి ఏమి లాభం ఆయన చూడాలి కదా అనుకుంటూ ఉండగా మధురమైన ప్రేమతో దరహాసం నిండిన చూపులు స్వామి వారి పైన ప్రసరించాడు. పరమాత్మ చూపును వారు పొందారు. కళ్ళతోటే వారు ఆకృష్ణున్ని లోపలకు ప్రవేశింపచేసుకుని మనసుతో ఆలింగనం చేసుకుని హృదయమంతా పులకించగా ఆనందించారు. మానసిక ఆదిని వారు స్వామిని ఆలింగనం చేసుకుని విడిచిపెట్టారు

ప్రాసాదశిఖరారూఢాః ప్రీత్యుత్ఫుల్లముఖామ్బుజాః
అభ్యవర్షన్సౌమనస్యైః ప్రమదా బలకేశవౌ

స్త్రీలందరూ బలరామ కృష్ణులపై పుష్ప వర్షం కురిపించారు. పెరుగు అక్షతలతో జలముతో గంధముతో పూలమాలలూ గంధములూ దీపములూ ధధీ అక్షతలూ ఉదకపాత్రలూ వీటితో

దధ్యక్షతైః సోదపాత్రైః స్రగ్గన్ధైరభ్యుపాయనైః
తావానర్చుః ప్రముదితాస్తత్ర తత్ర ద్విజాతయః

బ్రాహ్మణోత్తములు కూడా అర్ఘ్య, ఉదక పాత్రతో పరమాత్మ వచ్చాడని ఆనందించారు

ఊచుః పౌరా అహో గోప్యస్తపః కిమచరన్మహత్
యా హ్యేతావనుపశ్యన్తి నరలోకమహోత్సవౌ

వీరిని చూచిన ఆ పుర వాసులు. గోపికలు ఎంత గొప్ప తపస్సు చేసారో కదా. నరలోకానికే పెద్ద పండుగగా ఉన్న వీరిద్దరినీ ఇంతకాలం చూచిన గోపికలు ఎంత గొప్ప తపస్సు చేసారో

రజకం కఞ్చిదాయాన్తం రఙ్గకారం గదాగ్రజః
దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ

ఇలా వెళుతూ ఉంటే ఎదురుగా ఉతికిన బట్టలు తీసుకు వచ్చిన చాకలి వాడు ఎదురు వచ్చాడు. వాడు రాజుగారి బట్టలు ఉతుకుతాడు. (ఉతికిన బట్టలు తీసుకు వచ్చిన చాకలి ఎదురు రావడం శుభశకునం)

దేహ్యావయోః సముచితాన్యఙ్గ వాసాంసి చార్హతోః
భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః

అతన్ని చూచిన కృష్ణుడు మాకు కాస్త మంచి బట్టలు ఇవ్వు. మేము తగిన వారమే. రాజుగారు మమ్ము పిలిచారు. మాకు కాస్త మంచి బట్టలు ఇవ్వు. దిగులు పడకు. మాకు ఇస్తే చాలా శ్రేయస్సు కలుగుతుంది. మాకేది అర్పించినా మేలు జరుగుతుంది.

స యాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః
సాక్షేపం రుషితః ప్రాహ భృత్యో రాజ్ఞః సుదుర్మదః

నిత్య పూర్ణుడైన స్వామి యాచించాడు. అటువంటీ స్వామిని బాగా మదించి ఉన్న రాజు గారి బృత్యుడు ఆక్షేపిస్తూ ఇలా అన్నాడు

ఈదృశాన్యేవ వాసాంసీ నిత్యం గిరివనేచరః
పరిధత్త కిముద్వృత్తా రాజద్రవ్యాణ్యభీప్సథ

రోజూ మీరు ఇలాంటి బట్టలే కట్టుకుంటున్నారా. ఇవి మీకు కావాలా? మీరు వన చరులు. మదించారా. మీకు రాజ ద్రవ్యాలు కావాలా.

యాతాశు బాలిశా మైవం ప్రార్థ్యం యది జిజీవీషా
బధ్నన్తి ఘ్నన్తి లుమ్పన్తి దృప్తం రాజకులాని వై

బతకాలనుకుంటే ఇలాంటి వాటిని మళ్ళీ యాచించవద్దు. మీకు తెలియదేమో కొత్తవాళ్ళేమో, రాజుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగే ఉంటే బంధిస్తారు చంపుతారు లాగుతారు, గర్వించిన వారిని రాజు క్షమించడు.

ఏవం వికత్థమానస్య కుపితో దేవకీసుతః
రజకస్య కరాగ్రేణ శిరః కాయాదపాతయత్

ఆ మాట విని కోపించిన దేవకీ సుతుడు, చేతితో వాడి తల మీద కొట్టగానే వాడి శరీరం నుండి శిరస్సు బయట పడింది.

తస్యానుజీవినః సర్వే వాసఃకోశాన్విసృజ్య వై
దుద్రువుః సర్వతో మార్గం వాసాంసి జగృహేऽచ్యుతః

ఒకరి శిరస్సు ఖండించే సరికి వాడి వెంట ఉన్న చాకళ్ళ్ అందరూ బట్టల మూటలు అక్కడే పడేసి పారిపోయారు, కృష్ణ బలరాములు వాటిలోంచి మంచి బట్టలు తీసుకు వేసుకున్నారు

వసిత్వాత్మప్రియే వస్త్రే కృష్ణః సఙ్కర్షణస్తథా
శేషాణ్యాదత్త గోపేభ్యో విసృజ్య భువి కానిచిత్

ఉన్నవాటిలో వారు కట్టుకుని మిగిలినవాటిని తమ మిత్రులకు ఇచ్చారు, ఇంకా మిగిలితే ఆడువారికి ఇచ్చారు

తతస్తు వాయకః ప్రీతస్తయోర్వేషమకల్పయత్
విచిత్రవర్ణైశ్చైలేయైరాకల్పైరనురూపతః

ఒక బట్టలు నేసేవాడు బట్టలు నేసే రంగు రంగులా దారాలను కొన్ని కొన్ని రంగులను కలిపి వాటిని మాలలుగా చేసి బలరామ కృష్ణులకు మాలలుగా అలంకరించాడు (వీటినే ఇపుడు పవిత్రోత్సవం అంటున్నాము)

నానాలక్షణవేషాభ్యాం కృష్ణరామౌ విరేజతుః
స్వలఙ్కృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ

వీటితో బాగా ప్రకాశించారు కృష్ణ బలరాములు. పండుగలో అమావాస్యా పూర్ణమీ దినములలో బాగా బలిసిన తెలుపూ నలుపూ వర్ణం గల ఏనుగులలా ఉన్న్నారు

తస్య ప్రసన్నో భగవాన్ప్రాదాత్సారూప్యమాత్మనః
శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్యస్మృతీన్ద్రియమ్

ఈ తంతు వాయకుడి (పవిత్రాన్ని దానం చేసినవాడికి) విషయములో ప్రసన్నుడైన కృష్ణుడు అతనికి మోక్షాన్ని ఇచ్చాడు. అతను మోక్షం పొందేదాకా ఉత్తమ సంపదనూ కృష్ణుని యందు స్మృతినీ అంతకాలములో మోక్షాన్ని ఇచ్చాడు.

తతః సుదామ్నో భవనం మాలాకారస్య జగ్మతుః
తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి

ఆ పక్కనే సుదాముడనే మాలాకారుడు ఉన్నాడు. మహానుభావులు మా ఇంటికి వచ్చారని పరమానందముతో భూమి మీద పడ్డాడు. కూర్చోబెట్టి ఆసనం అర్ఘ్యం పాద్యం ఇచ్చి, పుష్పహారములూ తాంబూలములూ గంధములతో పూజించాడు.

తయోరాసనమానీయ పాద్యం చార్ఘ్యార్హణాదిభిః
పూజాం సానుగయోశ్చక్రే స్రక్తామ్బూలానులేపనైః

ప్రాహ నః సార్థకం జన్మ పావితం చ కులం ప్రభో
పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వామ్

నా పుట్టుక సార్థకమయ్యింది, ,మా కులం తరించింది, మా పితృదేవతలూ తరించారు

భవన్తౌ కిల విశ్వస్య జగతః కారణం పరమ్
అవతీర్ణావిహాంశేన క్షేమాయ చ భవాయ చ

సకల జగత్తుకూ ఉత్తమ కారణం మీరు. సకల లోకముల వృద్ధీ క్షేమాలకు మీరు అంశలతో అవతరించారు.

న హి వాం విషమా దృష్టిః సుహృదోర్జగదాత్మనోః
సమయోః సర్వభూతేషు భజన్తం భజతోరపి

సకల జగత్తు స్వరూపముగా ఉన్న మీరు, సకల జగత్తుకూ మిత్రులైన మీకు విషమ దృష్టి ఉండదు. అఖిల లోకముల యందూ సమ భావముతో ఉంటారు. నీవు మావాడివి అంటే వారి వాడిగా ఉంటారు.

తావజ్ఞాపయతం భృత్యం కిమహం కరవాణి వామ్
పుంసోऽత్యనుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే

ఏమి చేయాలో ఆజ్ఞ్యాపించండి ఈ భృత్యున్ని. భగవానుని శాసనాన్ని పొందడం అంటే పరమాత్మ అనుగ్రహాన్ని పొందడమే కదా

ఇత్యభిప్రేత్య రాజేన్ద్ర సుదామా ప్రీతమానసః
శస్తైః సుగన్ధైః కుసుమైర్మాలా విరచితా దదౌ

ఇలా ప్రార్థించి ఉత్తత్మమైన పరిమళం కల పూల మాలను వారికి ఇచ్చాడు.

తాభిః స్వలఙ్కృతౌ ప్రీతౌ కృష్ణరామౌ సహానుగౌ
ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్

ఇలా చక్కగా అలంకరించుకోబడిన కృష్ణ బలరాములు అతనికి వరాన్ని ఇచ్చారు

సోऽపి వవ్రేऽచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని
తద్భక్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరామ్

ఏమి కావాలో కోరుకోమనగా, నీ యందు తరగని భక్తీ నీ భక్తుల యందు ప్రీతి, సకల భూతముల యందు దయా కావాలి అని అడిగాడు

ఇతి తస్మై వరం దత్త్వా శ్రియం చాన్వయవర్ధినీమ్
బలమాయుర్యశః కాన్తిం నిర్జగామ సహాగ్రజః

అటువంటి వరమిచ్చారు. వంశం ఉన్నంత కాలం తరగని సంపదా బలం ఆయుష్షు కీర్తీ అన్నీ ఇచ్చి అన్నగారితో కలసి బయటకు వచ్చారు

                                                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment