ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం నలభయ్యవ అధ్యాయం
అకౄర కృత దశవతార స్తుతి, సర్వ రోగ నిబర్హణం.
శ్రీక్రూర ఉవాచ
నతోऽస్మ్యహం త్వాఖిలహేతుహేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయమ్
యన్నాభిజాతాదరవిన్దకోషాద్బ్రహ్మావిరాసీద్యత ఏష లోకః
అన్ని కారణములకూ కారణమైన వాడు, నారాయణుడు ,అందరికంటే మొదటి వాడు, నాశం లేనివాడు, ఈయన నాభినుండి పుట్టిన పద్మం నుండి బ్రహ్మ ఆవిర్భవించాడు. ఆ బ్రహ్మ నుంచి ఈ జగత్తు ఏర్పడింది
భూస్తోయమగ్నిః పవనం ఖమాదిర్మహానజాదిర్మన ఇన్ద్రియాణి
సర్వేన్ద్రియార్థా విబుధాశ్చ సర్వే యే హేతవస్తే జగతోऽఙ్గభూతాః
అహంకారమూ మనసూ ఇంద్రియాదులూ విషయములూ సకల ఇంద్రియ అధిష్ఠాన దేవతలూ ఏవేవి కారణములో ఏవేవి జగత్తుకు అవయవాలుగా కనపడుతున్నాయో వీరందరూ కూడా నీ యధార్థ స్వరూపాన్ని తెలియజాలరు.
నైతే స్వరూపం విదురాత్మనస్తే హ్యజాదయోऽనాత్మతయా గృహీతః
అజోऽనుబద్ధః స గుణైరజాయా గుణాత్పరం వేద న తే స్వరూపమ్
ఎందుకంటే బ్రహ్మకు కూడా నేను అన్న భావన ఉంది. అలాంటి బ్రహ్మ కూడా పరమాత్మ యొక్క మాయతో బంధించబడి నీ స్వరూపం అన్ని గుణములకూ అవతల ఉంటుందని తెలియలేరు
త్వాం యోగినో యజన్త్యద్ధా మహాపురుషమీశ్వరమ్
సాధ్యాత్మం సాధిభూతం చ సాధిదైవం చ సాధవః
నిన్ను యోగులు మహా పురుషునిగా ఈశ్వరునిగా పూజిస్తారు.
త్రయ్యా చ విద్యయా కేచిత్త్వాం వై వైతానికా ద్విజాః
యజన్తే వితతైర్యజ్ఞైర్నానారూపామరాఖ్యయా
అన్ని తాపాలూ అన్ని స్వరూపాలూ ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికమూ నీవే. కొందరు నిన్ను వేద విద్యతో ఆరాధిస్తారు. రక రకలా విద్యలతో స్తోత్రాలతో ఆరాధిస్తారు
ఏకే త్వాఖిలకర్మాణి సన్న్యస్యోపశమం గతాః
జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజన్తి జ్ఞానవిగ్రహమ్
కొందరు ఆచరించే అన్ని కర్మలనూ నీయందే ఉంచి శాంతిని పొందుతారు. జ్ఞ్యాన స్వరూపుడవైన నిన్ను జ్ఞ్యానులు జ్ఞ్యాన యజ్ఞ్యముతో ఆరాధిస్తారు.
అన్యే చ సంస్కృతాత్మానో విధినాభిహితేన తే
యజన్తి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికమ్
సంస్కారం కలిగిన మనసు కలవారై ఇతరులు శాస్త్రములో చెప్పిన విధముగా ఆరాధిస్తారు. కొందరు అనేక మూర్తులుగా ఆరాధిస్తారు. కొందరు ఒకే మూర్తిగా ఆరాధిస్తారు.
త్వామేవాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణమ్
బహ్వాచార్యవిభేదేన భగవన్తర్నుపాసతే
మరి కొందరు నిన్ను శివోక్త మార్గముగా మంగళ రూపముగా ఆరాధిస్తారు. వారి వారి ఆచర్య సిద్ధాంతానికి అనుగుణముగా వారు ఆయా రూపాలతో వారు నిన్ను ఆరాధిస్తారు.
సర్వ ఏవ యజన్తి త్వాం సర్వదేవమయేశ్వరమ్
యేऽప్యన్యదేవతాభక్తా యద్యప్యన్యధియః ప్రభో
ఏ ఆచారమైన ఏ సిద్ధానంతైనా ఏ గురువుగారు చెప్పినా ఏ బోధ ఐనా చెప్పేది నీ పూజే. ఏ మతం వారైనా ఏ సిద్ధాంతం వారైనా నిన్నే ఆరాధిస్తారు. సర్వ దేవయ మయుడవు నీవే. ఇతర దేవతలకు భక్తులైన వారు కానీ ,మనసులో మరొక ఆలోచన గలిగినవారు ఐనా సరే,
యథాద్రిప్రభవా నద్యః పర్జన్యాపూరితాః ప్రభో
విశన్తి సర్వతః సిన్ధుం తద్వత్త్వాం గతయోऽన్తతః
మబ్బులు వర్షించి రక రకాల ప్రవాహాలుగా పర్వతాల మీద నుంచి జారిపడి, నదులుగా ప్రవహించి వేరు వేరు దారుల గుండా ప్రవహించి సముద్రములో కలుస్తాయి. అలాగే ఈ మతాలూ ఆచారాలూ సిద్ధాంతాలు అన్నీ నీలోనే కలుస్తాయి.
సత్త్వం రజస్తమ ఇతి భవతః ప్రకృతేర్గుణాః
తేషు హి ప్రాకృతాః ప్రోతా ఆబ్రహ్మస్థావరాదయః
ప్రకృతి గుణాలు మూడు.. సత్వ రజో తమో గుణాలు. ప్రకృతి వలన పుట్టినవారూ, ప్రకృతిలోని వారూ ప్రకృతికి సంబంధ్చిన గుణాలు కలిగి ఉంటారు. ప్రకృతిలో పుట్టినవారు దానిలోనే చిక్కుకునే ఉంటారు
తుభ్యం నమస్తే త్వవిషక్తదృష్టయే
సర్వాత్మనే సర్వధియాం చ సాక్షిణే
గుణప్రవాహోऽయమవిద్యయా కృతః
ప్రవర్తతే దేవనృతిర్యగాత్మసు
నీవు దేని యందూ మనసు లగ్నం చేయవు. ఎందుకంటే నీకంటే వేరుగా ఏదీ ఉండదు కాబట్టి. నీవు కోరవలసినదంటూ ఏదీ లేదు. నీవు పొందనిది ఏదీ లేదు. నీ మాయతో గుణ ప్రవాహం మానవులలో పశువులలో ప్రవహిస్తూ ఉంటుంది
అగ్నిర్ముఖం తేऽవనిరఙ్ఘ్రిరీక్షణం
సూర్యో నభో నాభిరథో దిశః శ్రుతిః
ద్యౌః కం సురేన్ద్రాస్తవ బాహవోऽర్ణవాః
కుక్షిర్మరుత్ప్రాణబలం ప్రకల్పితమ్
అగ్ని నీ ముఖం భూమి పాదములూ నీ చూపులు సూర్య చంద్రులు ఆకాశం నాభి దిక్కులు చెవులు దేవతలు బాహువులు సముద్రాలు నీకు కుక్షి, నీ ప్రాణం వాయువు
రోమాణి వృక్షౌషధయః శిరోరుహా
మేఘాః పరస్యాస్థినఖాని తేऽద్రయః
నిమేషణం రాత్ర్యహనీ ప్రజాపతిర్
మేఢ్రస్తు వృష్టిస్తవ వీర్యమిష్యతే
రోమములు చెట్లు తీగలు కూపములు, మేఘములు కేశములు వర్షం నీ రేతస్సు,
త్వయ్యవ్యయాత్మన్పురుషే ప్రకల్పితా లోకాః సపాలా బహుజీవసఙ్కులాః
యథా జలే సఞ్జిహతే జలౌకసోऽప్యుదుమ్బరే వా మశకా మనోమయే
సకల లోకపాలకులతో ఏర్పడిన అన్ని లోకాలూ నీ యందే కల్పించబడి ఉంటాయి. జల చరములు నీటిలో ఉన్నట్లుగా మేడిపండులో పురుగులు ఉన్నట్లుగా, నీలో అన్ని జీవులూ ఉంటాయి
యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి హి
తైరామృష్టశుచో లోకా ముదా గాయన్తి తే యశః
నీవే ఏ ఏ లోకములో ఏ ఏ పనులకోసం ఏ ఏ రూపాలను ధరించి ఉంటావో ఆయా రూపాలను ఆయా లోకాల వారు ఆయా సమయాలలో స్తోత్రం చేస్తూ ఉంటారు
నమః కారణమత్స్యాయ ప్రలయాబ్ధిచరాయ చ
హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభమృత్యవే
ప్రళయ సాగరములో సంచరించిన అవతారం మత్స్యావతరాం. హయగ్రీవ అవతారములో మధు కైటబులను సంహరించావు
అకూపారాయ బృహతే నమో మన్దరధారిణే
క్షిత్యుద్ధారవిహారాయ నమః శూకరమూర్తయే
తాబేలుగా మంధర పర్వతాన్ని ఉంచుకున్న కూర్మానికి నమస్కారం.
నమస్తేऽద్భుతసింహాయ సాధులోకభయాపహ
వామనాయ నమస్తుభ్యం క్రాన్తత్రిభువనాయ చ
సజ్జనుల భయాన్ని తొలగించే అద్భుత సింహమా నీకు నమస్కారం
మూడు లోకాలనూ ఆక్రమించిన వామనావతారనికి నమస్కారం
నమో భృగుణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే
నమస్తే రఘువర్యాయ రావణాన్తకరాయ చ
గర్వించిన క్షత్రియ అరణ్యాన్ని చేధించిన పరశు రామునికి నమస్కార
రావణుని సంహరించిన రామ చంద్రునికి నమస్కారం
నమస్తే వాసుదేవాయ నమః సఙ్కర్షణాయ చ
ప్రద్యుమ్నాయనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః
బలరామ కృష్ణులకూ, ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలకు నమస్కారం
నమో బుద్ధాయ శుద్ధాయ దైత్యదానవమోహినే
మ్లేచ్ఛప్రాయక్షత్రహన్త్రే నమస్తే కల్కిరూపిణే
దైత్యులనూ దానవులనూ మోహింపచేసిన బుద్ధునకు నమస్కారం. (విగ్రహారాధాన నుండీ కర్మ ప్రవృత్తినుండీ తప్పించడానికి బుద్ధుడిగా వచ్చి విగ్రహారాధాను ఖండించాడు, దూషించాడు)
కలియుగం చివరలో ంలేచ్చులే క్షత్రియులవుతారు. బతికి ఉన్న మనుషులను సంహరించకుండానే వారి శరీర భాగాలను తినేవారిన్ ంలేచ్చులంటారు. వారితో సమానమైన రాజులను సంహరించడానికి అవతరించే కల్కికి నమస్కారం
భగవన్జీవలోకోऽయం మోహితస్తవ మాయయా
అహం మమేత్యసద్గ్రాహో భ్రామ్యతే కర్మవర్త్మసు
ఈ సకల జీవ లోకం నీ మాయచే మోహించబడినది. లేనివాటిని రెంటిని తీసుకోవడం వలన మోహం. నేను నాది అనే ఈ రెండూ ఉండడం వలననే మోహం. కనపడే శరీరాన్ని నాది అనుకుని, ఆశరీరముతో వచ్చినవారిని నావారు అనుకుంటున్నారు.
అహం చాత్మాత్మజాగార దారార్థస్వజనాదిషు
భ్రమామి స్వప్నకల్పేషు మూఢః సత్యధియా విభో
శరీరం సంతానం ఇల్లూ భార్యా ధనం బంధువులు, ఇలాంటి కల లాంటి వాటి చుట్టూ మూఢున్నై తిరుగుతున్నాను. స్వప్నాన్ని సత్యం అనుకుని సంచరిస్తున్నాను
అనిత్యానాత్మదుఃఖేషు విపర్యయమతిర్హ్యహమ్
ద్వన్ద్వారామస్తమోవిష్టో న జానే త్వాత్మనః ప్రియమ్
ఆత్మకు దుఃఖం కలిగంచేవాటిని గురించి సుఖం అనుకుని తిరుగుతున్నాను. ద్వంద్వముల యందే పూర్తిగా రమిస్తూ ఏది నాకు ప్రియమో ఏది కాదో తెలియలేకపోతున్నాను.
యథాబుధో జలం హిత్వా ప్రతిచ్ఛన్నం తదుద్భవైః
అభ్యేతి మృగతృష్ణాం వై తద్వత్త్వాహం పరాఙ్ముఖః
తెలియని వాడు నాచుతో కప్పబడి ఉన్న నీటిని చూచి నీరు లేదనుకున్నట్లు ఆత్మను కప్పి ఉన్న శరీరాన్ని చూచి ఆత్మలేదనుకుంటున్నాడు. నాచు కప్పబడినందు వలన నీరు కనపడకుంటే, నీటిలా కనపడుతోన్న ఎండమావుల వైపు పరిగెడుతున్నాడు
నోత్సహేऽహం కృపణధీః కామకర్మహతం మనః
రోద్ధుం ప్రమాథిభిశ్చాక్షైర్హ్రియమాణమితస్తతః
పరాన్ముఖున్నై కామ్య కర్మల యందు మనసు లగ్నంచేసి నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాను. పరమ బలీయమైన, మోసపుచ్చే ఇంద్రియాలు మనసును హరిస్తున్నాయి.
సోऽహం తవాఙ్ఘ్ర్యుపగతోऽస్మ్యసతాం దురాపం
తచ్చాప్యహం భవదనుగ్రహ ఈశ మన్యే
పుంసో భవేద్యర్హి సంసరణాపవర్గస్
త్వయ్యబ్జనాభ సదుపాసనయా మతిః స్యాత్
దుర్మార్గులకు పొందశక్యం కాని నీ పాద పద్మాలన్ శరణు వేడుతున్నాను. సంసారములో ఉండి ,లేని దాన్ని ఉన్నదనుకుని దుఃఖాన్ని సుఖం అనుకునే నాకు నీ పాద పద్మాలను సేవించాలని బుద్ధి పుట్టిందంటే అది నీ అనుగ్రహమే. సాంసారిక సుఖ దుఃఖాలలో నిరంతరం భ్రమించే మనసు పరమాత్మ ఐన నీ యందు లగ్నం కావాలంటే సజ్జన సాంగత్యం ఏర్పడాలి
ఇంతకాలం నందునితో వసుదేవునితో సఖ్యముగా ఉన్నాను కాబట్టే నీవు దొరికావు
నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే
పురుషేశప్రధానాయ బ్రహ్మణేऽనన్తశక్తయే
నీవు విజ్ఞ్యానమయ స్వరూపుడవు. అన్ని విశ్వాసాలకూ జ్ఞ్యానాలకూ కారణం నీవే. నీవు ఉన్నావని నమ్మినా, నీవు లేవు అని నమ్మినా వారిలో ఉండి వారిలో కారణమైన వాడవు నీవే. వారి సిద్ధాంతం మీద పరిపూర్ణ విశ్వాసం కలిగించడానికి నీవే కారణం. మనలో ఎలాంటి సిద్ధాంతం నమ్మకం అభిప్రాయం కలగాలన్నా పరమాత్మే కారణం. నీవే పురుషుడవు ఈశుడవు ప్రకృతివి .
నీవు అనంత శక్తుడవు
నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ
హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో
నీవే వాసుదేవుడవు సకల ప్రాణులనూ క్ష్యయింపచేసే వాడవు, హృషీకేశా నిన్ను ఆశ్రయించి ఉన్నాము. మమ్ము రక్షించవలసింది. అని ప్రార్థించాడు.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment