Wednesday, July 31, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభయ్యొకటవ అధ్యాయం

                                        ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం యాభయ్యొకటవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తం విలోక్య వినిష్క్రాన్తముజ్జిహానమివోడుపమ్
దర్శనీయతమం శ్యామం పీతకౌశేయవాససమ్

విశాలమైన వక్షస్థలం వనమాల ఆజానుబాహువైన స్వామిని చూచి కాలయవనుడు ఇతను కృష్ణుడే అని నారదుడు చెప్పిన గుర్తులు బట్టి గుర్తుపట్టాడు

శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభాముక్తకన్ధరమ్
పృథుదీర్ఘచతుర్బాహుం నవకఞ్జారుణేక్షణమ్

నిత్యప్రముదితం శ్రీమత్సుకపోలం శుచిస్మితమ్
ముఖారవిన్దం బిభ్రాణం స్ఫురన్మకరకుణ్డలమ్

వాసుదేవో హ్యయమితి పుమాన్శ్రీవత్సలాఞ్ఛనః
చతుర్భుజోऽరవిన్దాక్షో వనమాల్యతిసున్దరః

లక్షణైర్నారదప్రోక్తైర్నాన్యో భవితుమర్హతి
నిరాయుధశ్చలన్పద్భ్యాం యోత్స్యేऽనేన నిరాయుధః

నిరాధుడిగా కృష్ణుడు వచ్చాడు కాబట్టి ఆయుధాన్ని వదలిపెట్టి కాలయవనుడు కూడా వచ్చాడు

ఇతి నిశ్చిత్య యవనః ప్రాద్రవద్తం పరాఙ్ముఖమ్
అన్వధావజ్జిఘృక్షుస్తం దురాపమపి యోగినామ్

కాలయవనుడు ముందుకు రాగానే స్వామి వెనక్కు తిరిగి పారిపోఅవడం మొదలుపెట్టాడు.
ఇంతేనా ఈ స్వామి అని ఆయనను పట్టుకుందామని యోగులకు కూడా దొరకని స్వామిని దొరికిచ్చుకుందామని ఈ అజ్ఞ్యాని స్వామి వెంటబడ్డాడు

హస్తప్రాప్తమివాత్మానం హరీణా స పదే పదే
నీతో దర్శయతా దూరం యవనేశోऽద్రికన్దరమ్

స్వామి కూడా మరీ దూరం పోకుండా, ఎంత దూరం పోయినా చేయి జాపితే అందేంత దూరములో ఉండేట్లుగా పరిగెత్తాడు.ఒక పెద్ద పర్వత గుహలోకి తీసుకు వెళ్ళాడు.

పలాయనం యదుకులే జాతస్య తవ నోచితమ్
ఇతి క్షిపన్ననుగతో నైనం ప్రాపాహతాశుభః

యదుకులములో పుట్టిన నీవు ఇలా పలాయనం చిత్తగించడం సరికాదు. అని రక రకాలుగా నిందిస్తూ అధిక్షేపిస్తూ ఉన్నాడు.

ఏవం క్షిప్తోऽపి భగవాన్ప్రావిశద్గిరికన్దరమ్
సోऽపి ప్రవిష్టస్తత్రాన్యం శయానం దదృశే నరమ్

వాటిని స్వామి ఏ మాత్రం పట్టించుకోలేదు. స్వామి గుహలోకి వెళ్ళగానే కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు

నన్వసౌ దూరమానీయ శేతే మామిహ సాధువత్
ఇతి మత్వాచ్యుతం మూఢస్తం పదా సమతాడయత్

అక్కడ ఒక వృద్ధుడు పడుకుని ఉంటే, ఇతను కృష్ణుడే, నన్ను ఇక్కడిదాకా తీసుకుని వచ్చి ఈ మాయావి ఇక్కడ పడుకున్నాడు. అని తన పాదముతో తన్నాడు.  ఎనభై నాలుగు యుగాల నుండీ పడుకున్న ఆ వృద్ధుడు లేచి కళ్ళు నలుముకుని అన్ని దిక్కులూ చూస్తూ ముందర ఉన్న ఈ యవనుడిని చూచాడు. ఆ దృష్టి పడగానే క్షణ కాలములో భస్మమై పోయాడు

స ఉత్థాయ చిరం సుప్తః శనైరున్మీల్య లోచనే
దిశో విలోకయన్పార్శ్వే తమద్రాక్షీదవస్థితమ్

స తావత్తస్య రుష్టస్య దృష్టిపాతేన భారత
దేహజేనాగ్నినా దగ్ధో భస్మసాదభవత్క్షణాత్

శ్రీరాజోవాచ
కో నామ స పుమాన్బ్రహ్మన్కస్య కింవీర్య ఏవ చ
కస్మాద్గుహాం గతః శిష్యే కింతేజో యవనార్దనః

పరీక్షిత్తు "అతనెవరు, అక్కడ ఎందుకు పడుకున్నాడు. అతను చూడగానే యవనుడు బూడిద ఎలా అయ్యాడు"

శ్రీశుక ఉవాచ
స ఇక్ష్వాకుకులే జాతో మాన్ధాతృతనయో మహాన్
ముచుకున్ద ఇతి ఖ్యాతో బ్రహ్మణ్యః సత్యసఙ్గరః

ఇతను ఇక్ష్వాకు కులములో పుట్టాడు, మాంధాత కుమారుడు, ఇతని పేరు ముచుకుందుడు. బ్రాహ్మణ భక్తుడు సత్యముతో నిలిచేవాడు. ఇతన్ని సాయం చేయమని ఇంద్రుడు అడిగితే ఇంద్రుడికి యుద్ధములో సాయపడ్డాడు

స యాచితః సురగణైరిన్ద్రాద్యైరాత్మరక్షణే
అసురేభ్యః పరిత్రస్తైస్తద్రక్షాం సోऽకరోచ్చిరమ్

లబ్ధ్వా గుహం తే స్వఃపాలం ముచుకున్దమథాబ్రువన్
రాజన్విరమతాం కృచ్ఛ్రాద్భవాన్నః పరిపాలనాత్

ఇలా ఇతను రాక్షసులను సంహరించి స్వర్గాన్ని తన ఆధీనం చేసుకుని ఇంద్రునికి ఇవ్వకుండా తానే పరిపాలిస్తుండగా, ఇంద్రుడు వచ్చి మీ లోకానికి మీరు వెళ్ళండి, మా కొరకు మీ కోరికలనూ భోగాలను విడిచిపెట్టారు కాబట్టి, ఇంటినీ భార్యా పిల్లలను వదలి చాలా కాలం గడిచిపోయింది. ఇపుడు మీ వారు అనుకునేవారెవరూ అక్కడ లేరు.

నరలోకం పరిత్యజ్య రాజ్యం నిహతకణ్టకమ్
అస్మాన్పాలయతో వీర కామాస్తే సర్వ ఉజ్ఝితాః

సుతా మహిష్యో భవతో జ్ఞాతయోऽమాత్యమన్త్రినః
ప్రజాశ్చ తుల్యకాలీనా నాధునా సన్తి కాలితాః

కాలో బలీయాన్బలినాం భగవానీశ్వరోऽవ్యయః
ప్రజాః కాలయతే క్రీడన్పశుపాలో యథా పశూన్

వరం వృణీష్వ భద్రం తే ఋతే కైవల్యమద్య నః
ఏక ఏవేశ్వరస్తస్య భగవాన్విష్ణురవ్యయః

మోక్షం తప్ప మరేదైనా వరం కోరుకోండి. మోక్షమిచ్చేవాడు విష్ణువు ఒక్కడే.

ఏవముక్తః స వై దేవానభివన్ద్య మహాయశాః
అశయిష్ట గుహావిష్టో నిద్రయా దేవదత్తయా

అలా చెబితే ఇతను నమస్కరించి నాకు కాస్త నిద్ర ఇవ్వు అని నిద్రను వరముగా తీసుకుని ఈ గుహలో పడుకున్నాడు.

యవనే భస్మసాన్నీతే భగవాన్సాత్వతర్షభః
ఆత్మానం దర్శయామాస ముచుకున్దాయ ధీమతే

అపుడు ఇంద్రుడు నిద్రతో బాటు ఇంకో వరం కూడా ఇచ్చాడు. నీయంతట నీవు కాకుండా మధయన ఎవరైనా లేపితే అలా లేపినవాడు భస్మమైపోతాడు.
ఆ విషయం తెలియక ఈ కాలయవనుడు అతనిని తన్నాడు

తమాలోక్య ఘనశ్యామం పీతకౌశేయవాససమ్
శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభేన విరాజితమ్

కాలయవనుడు మరణించిన తరువాత పరమాత్మ సాక్షాత్కరించాడు అతనికి.

చతుర్భుజం రోచమానం వైజయన్త్యా చ మాలయా
చారుప్రసన్నవదనం స్ఫురన్మకరకుణ్డలమ్

ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూపించాడు. కనులు తిప్పుకోలేనంత సుందర ఆకరాన్ని చూచి ఆయన తేజస్సుతో కొట్టబడిన వాడై

ప్రేక్షణీయం నృలోకస్య సానురాగస్మితేక్షణమ్
అపీవ్యవయసం మత్త మృగేన్ద్రోదారవిక్రమమ్

పర్యపృచ్ఛన్మహాబుద్ధిస్తేజసా తస్య ధర్షితః
శఙ్కితః శనకై రాజా దుర్ధర్షమివ తేజసా

శ్రీముచుకున్ద ఉవాచ
కో భవానిహ సమ్ప్రాప్తో విపినే గిరిగహ్వరే
పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురుకణ్టకే

ఈ అడవిలోకి వచ్చిన నీవవరు. పద్మ రేకుల వలె పరమ సుకుమారమైన కాళ్ళతో ఈ ముళ్ళు ఉన్న చోటికి వచ్చావా

కిం స్విత్తేజస్వినాం తేజో భగవాన్వా విభావసుః
సూర్యః సోమో మహేన్ద్రో వా లోకపాలో పరోऽపి వా

అగ్నిహోత్రుడవా ఇంద్రుడవా వాయువువా చంద్రుడివా సూర్యుడివా లోకపాలకుడివా లేక అన్ని లోకాలకూ దేవతలందరికీ ఎవరు వృషభుడో ఆయన నీవేనా

మన్యే త్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభమ్
యద్బాధసే గుహాధ్వాన్తం ప్రదీపః ప్రభయా యథా

ఈ గుహలో ఉన్న చీకట్లని నీ తేజస్సుతో పోగొడుతున్నావు

శుశ్రూషతామవ్యలీకమస్మాకం నరపుఙ్గవ
స్వజన్మ కర్మ గోత్రం వా కథ్యతాం యది రోచతే

వయం తు పురుషవ్యాఘ్ర ఐక్ష్వాకాః క్షత్రబన్ధవః
ముచుకున్ద ఇతి ప్రోక్తో యౌవనాశ్వాత్మజః ప్రభో

మాది ఇక్ష్వాకు వంశం, మా తండ్రి మాంధాత, నా పేరు ముచుకుందుడు,

చిరప్రజాగరశ్రాన్తో నిద్రయాపహతేన్ద్రియః
శయేऽస్మిన్విజనే కామం కేనాప్యుత్థాపితోऽధునా

చాలాకాలం మేలుకొని ఉండి అలసిపోయి లేచాను, లేచేసరికి నా ఎదురుగా ఎవడో వచ్చి భస్మమైపోయాడు

సోऽపి భస్మీకృతో నూనమాత్మీయేనైవ పాప్మనా
అనన్తరం భవాన్శ్రీమాంల్లక్షితోऽమిత్రశాసనః

తేజసా తేऽవిషహ్యేణ భూరి ద్రష్టుం న శక్నుమః
హతౌజసా మహాభాగ మాననీయోऽసి దేహినామ్

ఆ తరువాత నీవు వచ్చావు, శ్రీమంతుడవైన నీ తేజస్సుతో సౌందర్యముతో శోభతో ఆభరణములతో ఇలా ఉన్న నీవంటి వాన్ని నేను చూడలేదు.

ఏవం సమ్భాషితో రాజ్ఞా భగవాన్భూతభావనః
ప్రత్యాహ ప్రహసన్వాణ్యా మేఘనాదగభీరయా

నీ వంటి వాన్ని అందరూ ఆరాధిస్తూ ఉండాలి. నీవెవరవో మాకు తెలుపవలసింది అని పరమాత్మను అడిగితే

శ్రీభగవానువాచ
జన్మకర్మాభిధానాని సన్తి మేऽఙ్గ సహస్రశః
న శక్యన్తేऽనుసఙ్ఖ్యాతుమనన్తత్వాన్మయాపి హి

నాకు వేల కొద్దీ పుట్టుకలూ పనులూ పేర్లూ ఇల్లూ ఉన్నాయి. ఇతరులే కాదు వాటిని నేను కూడా లెక్కపెట్టలేను.

క్వచిద్రజాంసి విమమే పార్థివాన్యురుజన్మభిః
గుణకర్మాభిధానాని న మే జన్మాని కర్హిచిత్

ఇది విష్ణు సూక్తములోనిది. ఎవరు భూమి యొక్క ధూళిని లెక్కపెట్టగలరో వారు లెక్కపెట్టగలరు నా గుణాలని,  కర్మలనీ పుట్టుకలనీ.

కాలత్రయోపపన్నాని జన్మకర్మాణి మే నృప
అనుక్రమన్తో నైవాన్తం గచ్ఛన్తి పరమర్షయః

నేను ఇది వరకు పుట్టానూ, ఇక ముందూ పుడతాను, అలాగే ఇప్పుడూ పుట్టి ఉన్నాను. నా వెంటనే ఉంటారు , లెక్కపెడుతూ ఉంటారు గానీ, దీని అంతాన్ని ఋషులు కూడా తెలియలేరు

తథాప్యద్యతనాన్యఙ్గ శృనుష్వ గదతో మమ
విజ్ఞాపితో విరిఞ్చేన పురాహం ధర్మగుప్తయే

ఐనా నీవడిగావు కాబట్టి చెబుతున్నాను. భూభారం తొలగించాలనీ, మిత్రులను కాపాడాలని  యదుకులములో వసుదేవుడి ఇంటిలో పుట్టాను, నన్ను వాసుదేవుడు అంటారు.

భూమేర్భారాయమాణానామసురాణాం క్షయాయ చ
అవతీర్ణో యదుకులే గృహ ఆనకదున్దుభేః
వదన్తి వాసుదేవేతి వసుదేవసుతం హి మామ్

కాలనేమిర్హతః కంసః ప్రలమ్బాద్యాశ్చ సద్ద్విషః
అయం చ యవనో దగ్ధో రాజంస్తే తిగ్మచక్షుషా

ఇపుడు నీవు చంపినది కాలనేమి అన్న రాక్షసున్ని
ప్రలంబుడూ కంసాది రాక్షసులను చంపాను నేను
మహా రాజా నీ తీషణమైన చూపుతో కాలిన వాడు యవనుడు

సోऽహం తవానుగ్రహార్థం గుహామేతాముపాగతః
ప్రార్థితః ప్రచురం పూర్వం త్వయాహం భక్తవత్సలః

నిన్ను అనుగ్రహించడానికి నేను నీ గుహకు వచ్చాను. నీవు ఈ జనంలోనూ (ముచుకుందుడిగా ఉన్నపుడూ) పూర్వ జన్మలో నాకు భక్తుడిగా ఉన్నావు, చాలా సార్లు తపస్సు చేసావు కాబట్టి  భక్తవత్సలుడనైన నేను నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను.

వరాన్వృణీష్వ రాజర్షే సర్వాన్కామాన్దదామి తే
మాం ప్రసన్నో జనః కశ్చిన్న భూయోऽర్హతి శోచితుమ్

నీవేమి కావాలో అడుగు. నన్ను చేరినవాడు విచారించతగడు. నీకేమేమి కావాలో కోరుకో

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకున్దో ముదాన్వితః
జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్

ముచుకుందుడు గర్గుడు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుని ఇలా అన్నాడు

శ్రీముచుకున్ద ఉవాచ
విమోహితోऽయం జన ఈశ మాయయా త్వదీయయా త్వాం న భజత్యనర్థదృక్
సుఖాయ దుఃఖప్రభవేషు సజ్జతే గృహేషు యోషిత్పురుషశ్చ వఞ్చితః

నీ మాయ చేత మోహించబడిన ఈ జీవుడు అనర్థాన్ని మాత్రమే చూస్తాడు. అనర్థాన్ని చూస్తూ పరమాత్మవైన నిన్ను సేవించడు.
సుఖం కావాలి అని ప్రయత్నిస్తాడు. సుఖం కోసం దుఃఖముతో కలిగిన భార్యా పుత్రాదుల యందు ప్రయత్నిస్తాడు. కష్టబడితే లభించేవాటితో సుఖం వస్తుంది అనుకుంటారు. ఇల్లు కావాలనుకుంటారు. దానితో కష్టాలన్నీ ప్రారంభమవుతాయి.

లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం
కథఞ్చిదవ్యఙ్గమయత్నతోऽనఘ
పాదారవిన్దం న భజత్యసన్మతిర్
గృహాన్ధకూపే పతితో యథా పశుః

ఎన్నో జన్మల తరువాత కష్టపడితే వచ్చేది ఈ మానవ జన్మ. అలాంటి జన్మ వచ్చి కూడా నీ పాదారవిందాలని సేవించడు, చెడుబుద్ధి కలవాడై.
వాడు కళ్ళు ఉండీ, గృహమనే చీకటి బావిలో ఉన్నాడు. కళ్ళున్నా చూడలేని స్థితిలో ఉన్నాడు. కళ్ళున్నా గడ్డి మేసేపశువు, మేస్తూ మేస్తూ చీకటి బావిలో పడినట్లు

మమైష కాలోऽజిత నిష్ఫలో గతో రాజ్యశ్రియోన్నద్ధమదస్య భూపతేః
మర్త్యాత్మబుద్ధేః సుతదారకోశభూష్వాసజ్జమానస్య దురన్తచిన్తయా

రాజ్య సంపదతో మధించి నేను చాలా కాలాన్ని వ్యర్థముగా గడిపాను. నేను మనిషిని అనే బుద్ధితో పిల్లలూ భార్యా ధనమూ భూమి అనేవాటి యందు ఆసక్తితో, కొన్నాళ్ళు ఎలా సంపాదించాలీ అని కొన్నాళ్ళు ఎలా కాపాడుకోవాలీ అనే చింతిస్తూ వచ్చాను

కలేవరేऽస్మిన్ఘటకుడ్యసన్నిభే
నిరూఢమానో నరదేవ ఇత్యహమ్
వృతో రథేభాశ్వపదాత్యనీకపైర్
గాం పర్యటంస్త్వాగణయన్సుదుర్మదః

ఒక కుండలాంటిది, ఒక గోడలానిటిది  ఈ శరీరం. ఇందులో ఉండి, ఈ శరీరాన్ని నేను అనుకుంటూ, నేను చక్రవర్తిని అని చెప్పుకుంటూ రథ గజ అశ్వ పదాతి సైన్యాల మీద తిరుగుతూ నీ పేరు కూడా తలవలేదు.

ప్రమత్తముచ్చైరితికృత్యచిన్తయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసమ్
త్వమప్రమత్తః సహసాభిపద్యసే క్షుల్లేలిహానోऽహిరివాఖుమన్తకః

ఎంతసేపూ రేపేమి చేయాలి అన్న దానితోనే గడిపాను. లోభం పెరిగింది. విషయానుభవ లాలస పెరిగింది.
నేను ప్రమత్తుడనై ఉండగా నీవు అప్రమత్తుడిగా ఉంటావు ఎల్లప్పుడూ
ఆకలితో నాలుకను బయటకు చాపుతూ బయట ఉన్న ఎలుకను మింగబోతున్న పాము వలె ( పాము నోటిలో ఉన్న కప్ప వలె, ఇకడ కప్పే పాము వద్దకు వెళుతుంది. గెంతుకుంటూ పాము నోటిలో పడుతుంది. పాము వెంటనే నోరు మూయకపోయినా, కప్ప నోటి మీద నుండి లోపల ఎంత బాగుందీ , చాలా రోజులు ఇక్కడ ఉండి తింటాను అనుకోగానే పాము నోరు మూస్తుంది. కాలం కూడా అంతే)

పురా రథైర్హేమపరిష్కృతైశ్చరన్
మతంగజైర్వా నరదేవసంజ్ఞితః
స ఏవ కాలేన దురత్యయేన తే
కలేవరో విట్కృమిభస్మసంజ్ఞితః

బంగారు రథములూ గుర్రములూ ఏనుగులూ సైన్యములూ, నన్ను మహారాజనీ చక్రవర్తి అనీ అంటూ ఉంటే భోగాలు వస్తూ ఉంటే, కాలం తెలియకుండా, బూడిదగా మారే శరీరం, పురుగులు తినగా, తినబడి జీర్ణమి మలముగా మారే ఈ శరీరాన్నే రాజూ అనీ చక్రవర్తీ అని అనుకుంటూ, యుద్ధములో అందరినీ గెలిచి దేవతలచే కీర్తించబడి పొగడబడి, స్త్రీలకు ఆటబొమ్మలా ఆట మృగముగా మారి ఈ సంసారములో పడిపోయాను

నిర్జిత్య దిక్చక్రమభూతవిగ్రహో వరాసనస్థః సమరాజవన్దితః
గృహేషు మైథున్యసుఖేషు యోషితాం క్రీడామృగః పూరుష ఈశ నీయతే

కరోతి కర్మాణి తపఃసునిష్ఠితో నివృత్తభోగస్తదపేక్షయాదదత్
పునశ్చ భూయాసమహం స్వరాడితి ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే

తపసూ దానాలు ధర్మాలూ అన్నీ చేసి రకరకాలైన కోరికలతో వాటిని వ్యర్థం చేసుకుంటున్నాము. నిన్నెలా కోరుకుంటాము. ఆశలు పెరిగి సుఖం లేకుండా ఐపోతున్నది

భవాపవర్గో భ్రమతో యదా భవేజ్జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమః
సత్సఙ్గమో యర్హి తదైవ సద్గతౌ పరావరేశే త్వయి జాయతే మతిః

ఇంతటీ సంసార సాగరములో ఉండి కొట్టు మిట్టాడుతున్న జీవునికి నీ దయ కలిగితే సజ్జన సావాసం కలుగుతుంది. అపటినుంచీ పరమాత్మ దయ కలిగినట్లు గుర్తు.
సత్సంగం ఉన్నపుడే సద్గతి ఐన నీ యందు బుద్ధి కుదురుతుంది.

మన్యే మమానుగ్రహ ఈశ తే కృతో రాజ్యానుబన్ధాపగమో యదృచ్ఛయా
యః ప్రార్థ్యతే సాధుభిరేకచర్యయా వనం వివిక్షద్భిరఖణ్డభూమిపైః

స్వామి నాకు రాజ్యాన్ని పోగొట్టి ఇందులో పడవేయడం నీ దయా, నీ సంకల్పమే.
రాజులందరూ కూడా బుద్ధిమంతులైతే మమ్ము అడవికి పంపు అని కోరతారు. అలాంటిది నేను ప్రార్థించకుండానే నాకు అందించావు.

న కామయేऽన్యం తవ పాదసేవనాదకిఞ్చనప్రార్థ్యతమాద్వరం విభో
ఆరాధ్య కస్త్వాం హ్యపవర్గదం హరే వృణీత ఆర్యో వరమాత్మబన్ధనమ్

నాకే వరమూ వద్దు. నీ పాద సేవనాన్ని మించిన ఇంకో వరం వద్దు.
నీకంటే వేరే దిక్కులేనివారి చేత ప్రార్తించబడే (అకించనులు - కించన న - ఏ కొంచెమూ లేనివారు) నీ పాద సేవనం కంటే వేరే వరాన్ని కోరను. అన్ని బంధాలనూ విడిపించే నీ పాద సేవనం లభిస్తే అన్ని బంధాలూ ఇచ్చే ఈ సంసారాన్ని కోరతారా

తస్మాద్విసృజ్యాశిష ఈశ సర్వతో రజస్తమఃసత్త్వగుణానుబన్ధనాః
నిరఞ్జనం నిర్గుణమద్వయం పరం త్వాం జ్ఞాప్తిమాత్రం పురుషం వ్రజామ్యహమ్

కేవలం జ్ఞ్యాన స్వరూపుడూ, ఏ సంబంధమూ అనుబంధమూ కోరికా కోపమూ, ఇలా ఏ భావమూ లేని స్వామి వైన నిన్ను కోరుతున్నాను.
చిరమిహ వృజినార్తస్తప్యమానోऽనుతాపైర్
అవితృషషడమిత్రోऽలబ్ధశాన్తిః కథఞ్చిత్
శరణద సముపేతస్త్వత్పదాబ్జం పరాత్మన్
అభయమృతమశోకం పాహి మాపన్నమీశ

ఎంతో కాలం చాలా కష్టాలతో బాధపడి, తాపాలతో తపించబడి
ఏ మాత్రమూ తృప్తి కలిగించని ఆరుగురు శత్రువులూ కలవాడిని, శాంతి పొందని నాకు ఇంతకాలానికి నీ పాదాలు పొందే అవకాశం వచ్చింది. భయం మరణం శోకం లేని నిన్ను చేరాను. నన్ను కాపాడవలసింది.
అని ముచుకుందుడు ప్రార్థిస్తే

శ్రీభగవానువాచ
సార్వభౌమ మహారాజ మతిస్తే విమలోర్జితా
వరైః ప్రలోభితస్యాపి న కామైర్విహతా యతః

మహారాజా నీ మతి శుద్ధముగా ఉన్నది. నేను ఎంత ప్రలోభపెట్టినా నీవు లౌకిక కోరికలు కోరలేదు

ప్రలోభితో వరైర్యత్త్వమప్రమాదాయ విద్ధి తత్
న ధీరేకాన్తభక్తానామాశీర్భిర్భిద్యతే క్వచిత్

నా యందు మాత్రమే భక్తి కలవారిని కోరికలు లోభించలేవు

యుఞ్జానానామభక్తానాం ప్రాణాయామాదిభిర్మనః
అక్షీణవాసనం రాజన్దృశ్యతే పునరుత్థితమ్

భక్తులు కాని వారు ప్రాణాయాముదులతో మనసును తమ వశం చేసుకుని మేము మనసునూ ఇంద్రియాలనూ గెలిచాం అనుకుంటారు కానీ, ఆ మనసు మళ్ళీ వారిని వంచిస్తుంది. నా మీద భక్తి ఉంటేనే మనసు దారికి వస్తుంది..

విచరస్వ మహీం కామం మయ్యావేశితమానసః
అస్త్వేవం నిత్యదా తుభ్యం భక్తిర్మయ్యనపాయినీ

కాబట్టి నీవు ఇదివరకు చేసిన పాపాలు పోవడానికి నిరతన్రం నా యందే మనసు ఉంచి భూమి మీద సంచరిస్తూ తపస్సు చేయి. నీ మనసు నా మీదే ఉంది, ఉంటుంది.

క్షాత్రధర్మస్థితో జన్తూన్న్యవధీర్మృగయాదిభిః
సమాహితస్తత్తపసా జహ్యఘం మదుపాశ్రితః

ఇది వరకు ఆచరించిన అన్ని పాపాలూ పోవడానికి నీవు ఇంకొక జన్మ ఎత్తాలి. బ్రాహ్మణ జన్మ ఎత్తుతావు,. ఆ జన్మతో ఆచరించిన పుణ్యముతో నీవు పాపాలన్నీ పోగొట్టుకుని నాదగ్గరకు వస్తావు

జన్మన్యనన్తరే రాజన్సర్వభూతసుహృత్తమః
భూత్వా ద్విజవరస్త్వం వై మాముపైష్యసి కేవలమ్

ఈ విధముగా పరమాత్మ ముచుకుందునికి వరమిచ్చాడు

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment