శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
పీతే గరే వృషాఙ్కేణ ప్రీతాస్తేऽమరదానవాః
మమన్థుస్తరసా సిన్ధుం హవిర్ధానీ తతోऽభవత్
మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు.అప్పుడు కామధేనువు వచ్చింది. కామధేనువుకు హవిర్ధాని అని పేరు, యజ్ఞ్యమునకు కావలసిన, హవిస్సుకు పనికి వచ్చే పాలూ పెరుగూ వెన్నా నెయ్యీ ఇలాంటి ద్రవ్యాలని ఇస్తుంది.
తామగ్నిహోత్రీమృషయో జగృహుర్బ్రహ్మవాదినః
యజ్ఞస్య దేవయానస్య మేధ్యాయ హవిషే నృప
దానికే మరొక పేరు అగ్నిహోత్రి (అగ్నిహోత్ర ప్రక్రియకు పనికోచ్చేది). బ్రహ్మవాదులైన వేదాధ్యనం చేసే ఋషులు ఆ కామధేనువును తీసుకున్నారు. గోవు యొక్క ఉపయోగం 1. యజ్ఞ్యానికీ 2. అర్చి మార్గానికి పంపించేది ధేనువే (జాత కర్మలో గోపుచ్చముతో పిల్లవాడిని చేటలో పెట్టి గోపుచ్చముతో రాస్తారు. ఉగ్ర నక్షత్రాలకు గోప్రస్వ శాంతి చేస్తారు. చాటలో పిల్లవాన్ని పెట్టి ఆవు శిరసు నుంచీ పుచ్చం వరకూ తీసుకుని వెళ్ళి, ఈ పిల్లవాన్ని గోవే ప్రసవించింది అన్నట్లు. పుట్టుక నుంచీ చనిపోయేవరకూ గోవుతోనే ముడిపడి ఉంది. గోవును చనిపోయిన శరీరం చుట్టూ తిప్పుతారు, అలాగే చనిపోయిన శరీరాన్ని గోవు చుట్టూ తిప్పుతారు.) నరకమార్గం వదిలి దేవ మార్గానికి పంపించేది గోవే 3. పవిత్రమైన హవిర్ద్రవ్యానికి 4. మేధ్యానికి
తత ఉచ్చైఃశ్రవా నామ హయోऽభూచ్చన్ద్రపాణ్డురః
తస్మిన్బలిః స్పృహాం చక్రే నేన్ద్ర ఈశ్వరశిక్షయా
చంద్రుని వలె తెల్లని అశ్వం ఉన్నతమైన చెవులు కలిగి (ఊర్ధ్వ మార్గానికి తీసుకు వెళ్ళే శ్రుతిని అందించేది) ఉన్న ఉచ్చైశ్రవం వచ్చింది. ఈ గుర్రాన్ని బలి చక్రవర్తి కోరాడు. ఇంద్రునికీ లోపల ఆశ ఉన్నా స్వామి వద్దని వారించడముతో మాట్లాడలేదు.
తత ఐరావతో నామ వారణేన్ద్రో వినిర్గతః
దన్తైశ్చతుర్భిః శ్వేతాద్రేర్హరన్భగవతో మహిమ్
ఐరావతం తరువాత వచ్చింద్, నాలుగు దంతాలతో శ్వేతాద్రి మహిమనూ పరమాత్మ ప్రభావాన్ని తెలియజేస్తూ వచ్చింది
ఐరావణాదయస్త్వష్టౌ దిగ్గజా అభవంస్తతః
అభ్రముప్రభృతయోऽష్టౌ చ కరిణ్యస్త్వభవన్నృప
కౌస్తుభాఖ్యమభూద్రత్నం పద్మరాగో మహోదధేః
తస్మిన్మణౌ స్పృహాం చక్రే వక్షోऽలఙ్కరణే హరిః
తరువాత కౌస్తుభ మణి వచ్చింది, అది స్వామి తీసుకున్నాడు
తతోऽభవత్పారిజాతః సురలోకవిభూషణమ్
పూరయత్యర్థినో యోऽర్థైః శశ్వద్భువి యథా భవాన్
తరువాత పారిజాత వృక్షం వచ్చింది. అది దేవ లోక అలంకారము. అడిగిన వారికి అడిగినంత నీవు ఎలా ఇస్తున్నావో ఈ పారిజాతం కూడా అలాగే ఇస్తుంది.
తతశ్చాప్సరసో జాతా నిష్కకణ్ఠ్యః సువాససః
రమణ్యః స్వర్గిణాం వల్గు గతిలీలావలోకనైః
తరువాత అప్సరసలు వచ్చారు ఆభరణాలూ వస్త్రాలూ ధరించి. సుందరమైన గమనం చూపులూ ఉన్నవారు వారు. స్వర్గములో ఉన్న దేవతలను ఆనందింపచేసే వారు
తతశ్చావిరభూత్సాక్షాచ్ఛ్రీ రమా భగవత్పరా
రఞ్జయన్తీ దిశః కాన్త్యా విద్యుత్సౌదామనీ యథా
తరువాత అమ్మవారు ఆవిర్భవించారు. భగవంతునికి అంకితమైనది. మెరుపు తీగ అన్ని దిక్కులనీ ప్రకాశింపచేస్తున్నట్లుగా ఈ తల్లి అన్ని దిక్కూల్నూ ప్రకాశింపచేసింది
తస్యాం చక్రుః స్పృహాం సర్వే ససురాసురమానవాః
రూపౌదార్యవయోవర్ణ మహిమాక్షిప్తచేతసః
సకల స్వరూపములతో ఔదార్యములతో వయసుతో మహిమత అందరూ చిత్తం హరించబడ్డారు.
తస్యా ఆసనమానిన్యే మహేన్ద్రో మహదద్భుతమ్
మూర్తిమత్యః సరిచ్ఛ్రేష్ఠా హేమకుమ్భైర్జలం శుచి
అమ్మవారిని అన్ని పుణ్య నదులూ శరీరం దాల్చి బంగారు కుంభములతో జలములను అభిషేకానికి తీసుకు వచ్చాయి. భూమి కూడా అభిషేకానికి జలాన్ని తీసుకు వచ్చింది
ఆభిషేచనికా భూమిరాహరత్సకలౌషధీః
గావః పఞ్చ పవిత్రాణి వసన్తో మధుమాధవౌ
గోవులు పంచ గవ్యాన్ని తీసుకు వచ్చాయి
ఋషయః కల్పయాం చక్రురాభిషేకం యథావిధి
జగుర్భద్రాణి గన్ధర్వా నట్యశ్చ ననృతుర్జగుః
వసంతుడు మధు మాధవుడూ వచ్చారు. ఋషువులు అభిషేకానికి ఏర్పాట్లు చేసారు. గంధర్వులు గానం నాట్యం చేసారు
మేఘా మృదఙ్గపణవ మురజానకగోముఖాన్
వ్యనాదయన్శఙ్ఖవేణు వీణాస్తుములనిఃస్వనాన్
మేఘములే ఆయా మంగళ వాద్యాలై మోగించాయి. శంఖ భేరీ నినాదాలు వినిపించాయి
తతోऽభిషిషిచుర్దేవీం శ్రియం పద్మకరాం సతీమ్
దిగిభాః పూర్ణకలశైః సూక్తవాక్యైర్ద్విజేరితైః
అమ్మవారిని అందరూ కలిసి, గజములు సముద్రుడు తెచ్చిన స్వర్ణ కలశ జలములతో అభిషేకించాయి. ఋషుల వాక్యాలతో అభిషేకించారు.
సముద్రః పీతకౌశేయ వాససీ సముపాహరత్
వరుణః స్రజం వైజయన్తీం మధునా మత్తషట్పదామ్
తండ్రి ఐన సముద్రుడు పసుపు పచ్చని బట్ట ఇచ్చారు. వరుణుడు వైజయంతీ మాలను ఇచ్చాడు. అందులో ఉన్న మకరందం చేత మత్తిల్లిన షట్పదులు ఉన్నాయి
భూషణాని విచిత్రాణి విశ్వకర్మా ప్రజాపతిః
హారం సరస్వతీ పద్మమజో నాగాశ్చ కుణ్డలే
ప్రజాపతి ఐన విశ్వకర్మ విచిత్ర ఆభరణాలను ఇచ్చాడు. సరస్వతి హారాలను, బ్రహ్మ పద్మాలనూ నాగులు కుండలాలనూ ఇచ్చారు
తతః కృతస్వస్త్యయనోత్పలస్రజం నదద్ద్విరేఫాం పరిగృహ్య పాణినా
చచాల వక్త్రం సుకపోలకుణ్డలం సవ్రీడహాసం దధతీ సుశోభనమ్
ఇలా మంగళ స్నానం ఆచరించారు అమ్మవారు. తుమ్మెదలు ఝంకారం చేస్తున్న మాలను చేతితో తీసుకుని ముఖాన్ని ఒక్క సారి కదిలించింది. కొంచెం సిగ్గుతో వచ్చే నవ్వు చిందిస్తూ ముఖాన్న్ని తిప్పింది
స్తనద్వయం చాతికృశోదరీ సమం నిరన్తరం చన్దనకుఙ్కుమోక్షితమ్
తతస్తతో నూపురవల్గు శిఞ్జితైర్విసర్పతీ హేమలతేవ సా బభౌ
కాలికి కట్టుకున్న అందెలు బాగా ధ్వనిస్తూ ఉంటే బంగారు తీగలా కదులుతూ ప్రకాశించింది.
విలోకయన్తీ నిరవద్యమాత్మనః పదం ధ్రువం చావ్యభిచారిసద్గుణమ్
గన్ధర్వసిద్ధాసురయక్షచారణ త్రైపిష్టపేయాదిషు నాన్వవిన్దత
ఒక సారి చేరితే మళ్ళీ చెదిరిపోని ధ్రువమైన స్థానం ఎక్కడ ఉందీ అని చూసింది. ఎప్పుడూ మంచి గుణాలు ఎవరిదగ్గర ఉన్నాయో అని చూసింది. ఒక చూపు చూస్తేనే గంధర్వ సిద్ధ అసుర చారణ మొదలైన వారి దగ్గర ఆ గుణాలు లేవు అని తెల్సింది.
నూనం తపో యస్య న మన్యునిర్జయో జ్ఞానం క్వచిత్తచ్చ న సఙ్గవర్జితమ్
కశ్చిన్మహాంస్తస్య న కామనిర్జయః స ఈశ్వరః కిం పరతో వ్యపాశ్రయః
ఒకరు తపస్సు బాగా చేస్తారు కానీ కోపాన్ని గెలవలేకపోయారు, ఇంకొకరికి జ్ఞ్యానం బాగా ఉంది సంగాన్ని వదిలిపెట్టలేదు, చాలా మంది గొప్పవారు ఉన్నారు గానీ వారు కామున్ని గెలిచిన వారు కారు. ఇంకొకరు ఉన్నారు మూడు లోకాలకూ అధిపతి. కానీ ఒకరు (పరమాత్మ) ఇస్తే తీసుకునేవాడు.
ధర్మః క్వచిత్తత్ర న భూతసౌహృదం త్యాగః క్వచిత్తత్ర న ముక్తికారణమ్
వీర్యం న పుంసోऽస్త్యజవేగనిష్కృతం న హి ద్వితీయో గుణసఙ్గవర్జితః
ధర్మాన్ని ఆచరించేవారు ఉన్నారు గానీ వారి దగ్గర సకల భూత సౌహృదం లేదు. త్యాగం చేసే వారు ఉన్నారు గానీ వారికి ముక్తి మీద కోరిక లేదు. వీరులు ఉన్నారు గానీ వారు కాల వేగముతో పోయే వారే. గుణ సంగతి లేని తక్కిన వారెవరూ లేరు
క్వచిచ్చిరాయుర్న హి శీలమఙ్గలం క్వచిత్తదప్యస్తి న వేద్యమాయుషః
యత్రోభయం కుత్ర చ సోऽప్యమఙ్గలః సుమఙ్గలః కశ్చ న కాఙ్క్షతే హి మామ్
దీర్గాయుష్మంతులు ఉన్నారు గానీ మంగళ స్వభావం లేదు, కొందరు మహానుభావులు ఉన్నారు కానీ వారికి దీర్ఘాయుష్షు లేదు. కొందరికి అన్నీ ఉన్నాయి గానీ అమంగళముగా ఉంటాడు. అన్ని మంగళములూ కలవాడు ఒకడు ఉన్నాడు గానీ ఆయన నన్ను కోరట్లేదు.
ఏవం విమృశ్యావ్యభిచారిసద్గుణైర్వరం నిజైకాశ్రయతయాగుణాశ్రయమ
వవ్రే వరం సర్వగుణైరపేక్షితం రమా ముకున్దం నిరపేక్షమీప్సితమ్
ఈ రీతిగా మొత్తం దేవతలందరినీ విమర్శించి, ఎన్నడూ చలించని అనంత కళ్యాణ గుణాలు గల స్వామిని, మంచి గుణాలన్నీ వెతుక్కుంటూ వరించే స్వామినీ, ఏ కోరికా లేని స్వామిని అమ్మవారు వరునిగా వరించింది
తస్యాంసదేశ ఉశతీం నవకఞ్జమాలాం
మాద్యన్మధువ్రతవరూథగిరోపఘుష్టామ్
తస్థౌ నిధాయ నికటే తదురః స్వధామ
సవ్రీడహాసవికసన్నయనేన యాతా
వరించిన తుమ్మెదల సమూహముతో ఉన్న వనమాలని స్వామివారి మెడలో వేసింది. సిగ్గుతో సగం చిరునవ్వుతో ఆయనను చూస్తూ నిలబడి ఉంది.
తస్యాః శ్రియస్త్రిజగతో జనకో జనన్యా
వక్షో నివాసమకరోత్పరమం విభూతేః
శ్రీః స్వాః ప్రజాః సకరుణేన నిరీక్షణేన
యత్ర స్థితైధయత సాధిపతీంస్త్రిలోకాన్
అమ్మవారు మెడలో మాల వేయగానే ఆయన మూడు లోకాలకూ తండ్రి అయ్యాడు. ఆ జగజ్జనకుడు అమ్మవారిని ఆమె కోరిన వక్షస్థలములో నివాసం ఇచ్చాడు. అమ్మవారు ఉంటేనే వైకుంఠం నిత్య విభూతి అవుతుంది. స్వామి యొక్క వక్షస్థలములో చేరిన అమ్మవారు తన సంతానాన్ని సంతోషముగా తిలకించి వారందరికీ సంపదలనూ అనుగ్రహించింది. త్రిలోకములనూ త్రిలోకపాలకులనూ తన కటాక్షముతో వృద్ధి చేసింది.
శఙ్ఖతూర్యమృదఙ్గానాం వాదిత్రాణాం పృథుః స్వనః
దేవానుగానాం సస్త్రీణాం నృత్యతాం గాయతామభూత్
లక్ష్మీ నారాయణుల దివ్య కళ్యాన వైభవాన్ని తక్కిన దేవతలూ సిద్ధులూ సాధ్యులూ మంగళ ధ్వనులు గావించారు, అందరూ గానం చేసారు
బ్రహ్మరుద్రాఙ్గిరోముఖ్యాః సర్వే విశ్వసృజో విభుమ్
ఈడిరేऽవితథైర్మన్త్రైస్తల్లిఙ్గైః పుష్పవర్షిణః
బ్రహ్మాదులు స్వచ్చమైన మంత్రములతో పరమాత్మ స్వరూపాన్ని ప్రకటింపచేసే మంత్రాలతో , విష్నువు చిహ్నాలను చెప్పే మంత్రాలతో స్తోత్రం చేసారు
శ్రియావలోకితా దేవాః సప్రజాపతయః ప్రజాః
శీలాదిగుణసమ్పన్నా లేభిరే నిర్వృతిం పరామ్
అమ్మవారి చేత చూడబడిన దేవతలకు వారి వారి శీలం వారికి వచ్చింది. సంపదా ధైర్యమూ బలమూ వారి వారికి మళ్ళీ వచ్చాయి.
నిఃసత్త్వా లోలుపా రాజన్నిరుద్యోగా గతత్రపాః
యదా చోపేక్షితా లక్ష్మ్యా బభూవుర్దైత్యదానవాః
అమ్మవారు రాక్షసులను చూడలేదు. రాక్షసులు బలహీనులుగా లోభులుగా అయ్యారు. లక్ష్మీ కటాక్షం లేని వారికే లోభత్వం ఉంటుంది. ఉద్యోగం లేదు సిగ్గు విడిచారు. అమ్మవారి చేత ఉపేక్షించబడ్డారు
అథాసీద్వారుణీ దేవీ కన్యా కమలలోచనా
అసురా జగృహుస్తాం వై హరేరనుమతేన తే
లక్ష్మీ కళ్యాణం ఐన తరువాత మళ్ళీ చిలికారు అప్పుడు వరుణుని పుత్రిక ఐన వారుణి పుట్టింది. మహా విష్ణువు ఆజ్ఞ్యతో ఆ వారుణిని రాక్షసులు తీసుకున్నారు
అథోదధేర్మథ్యమానాత్కాశ్యపైరమృతార్థిభిః
ఉదతిష్ఠన్మహారాజ పురుషః పరమాద్భుతః
అమృతాన్ని కోరిన కశ్యప సంతానం మళ్ళీ చిలుకుతూ ఉంటే ఒక మాహా పురుషుడు ఆవిర్భవించాడు
దీర్ఘపీవరదోర్దణ్డః కమ్బుగ్రీవోऽరుణేక్షణః
శ్యామలస్తరుణః స్రగ్వీ సర్వాభరణభూషితః
ఆజానుబాహుడు నీల మేఘశ్యాముడు హారములు ధరించిన వాడు
పీతవాసా మహోరస్కః సుమృష్టమణికుణ్డలః
స్నిగ్ధకుఞ్చితకేశాన్త సుభగః సింహవిక్రమః
కేశముల కొసలు వంకరలు తిరిగి ఉన్నాయి. సుందరుడు సింహం లాంటి పరాక్రమం గల మహా పురుషుడు అమృత కలశం పట్టుకుని వచ్చాడు
అమృతాపూర్ణకలసం బిభ్రద్వలయభూషితః
స వై భగవతః సాక్షాద్విష్ణోరంశాంశసమ్భవః
ఆ చేతులు కంకణములతో అలంకరించబడి ఉన్నాయి. ఆయన శ్రీమన్నారాయణుని అంశాంశ.
ధన్వన్తరిరితి ఖ్యాత ఆయుర్వేదదృగిజ్యభాక్
తమాలోక్యాసురాః సర్వే కలసం చామృతాభృతమ్
ఈయన ధన్వంతరి. ఆయుర్వేదాన్ని మనకు అందించాడు. అన్ని పూజలకూ అర్హుడు. సందురం నుండి ఆవిర్భవించాడు
లిప్సన్తః సర్వవస్తూని కలసం తరసాహరన్
నీయమానేऽసురైస్తస్మిన్కలసేऽమృతభాజనే
అది చూసారు రాక్షసులు. దాన్ని లాక్కొని వెళ్ళిపోయారు. మనకెంత కోరికా ఆకాంక్షా అవసరం ఉన్నా, పెద్దలు ఉన్నప్పుడు వారు అనుగ్రహించి ఆమోదించినప్పుడే అది మనకు దక్కుతుంది. ఆశతో తీసుకుంటే మనకు అది దక్కదు. రాక్షసులకు అమృతం దొరకకపోవడానికి ఇదే కారణం. పెద్దలనుంచి రావలసిన వస్తువు వారిని ధిక్కరించి లాక్కొంటే అది వారికి దక్కదు.
విషణ్ణమనసో దేవా హరిం శరణమాయయుః
ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్భృత్యకామకృత్
మా ఖిద్యత మిథోऽర్థం వః సాధయిష్యే స్వమాయయా
అది చూసిన దేవతలు హరిని శరణు వేడారు. భృత్యుల కోరికలు తీర్చే స్వామి, మీరు విచారించకండి, మీకు కావలసిన దాన్ని నేను నా మాయతో సాధిస్తాను.
మిథః కలిరభూత్తేషాం తదర్థే తర్షచేతసామ్
అహం పూర్వమహం పూర్వం న త్వం న త్వమితి ప్రభో
అమృతం ఇద్దరూ సాధించారు కాబట్టి ఆ రాక్షసులు వారిలో వారు కోట్లాడుకుంటున్నారు. నాకు ముందు అంటే నాకు ముందూ అని
దేవాః స్వం భాగమర్హన్తి యే తుల్యాయాసహేతవః
సత్రయాగ ఇవైతస్మిన్నేష ధర్మః సనాతనః
ఆ రాక్షసులలోనే కాస్త బలహీనులు, "దేవతలకు కూడా భాగం ఇవ్వాలి. ప్రయత్నమూ కష్టమూ కారణమూ అందరికీ సమానమే కాబట్టి సత్ర యాగం లాగ ఫలితాన్ని సమానముగా మనం పంచుకోవాలి." అని అన్నారు కొందరు దుర్బలులు.
ఇతి స్వాన్ప్రత్యషేధన్వై దైతేయా జాతమత్సరాః
దుర్బలాః ప్రబలాన్రాజన్గృహీతకలసాన్ముహుః
అన్ని ఉపాయాలూ తెలిసిన పరమాత్మ ఇలా ఉంటుంది అని చెప్పలేని ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని తీసుకున్నాడు
ఏతస్మిన్నన్తరే విష్ణుః సర్వోపాయవిదీశ్వరః
యోషిద్రూపమనిర్దేశ్యం దధారపరమాద్భుతమ్
ప్రేక్షణీయోత్పలశ్యామం సర్వావయవసున్దరమ్
సమానకర్ణాభరణం సుకపోలోన్నసాననమ్
అన్ని అవయవాలూ సుందరముగ ఉన్న అమ్మాయి రూపాన్ని తీసుకున్నాడు. చెవి ఎంత ఉందో అంతే ఆభరణం ఉన్నాయి. చెవులని దాటి ఆభరణం కిందకి వస్తే చెక్కిళ్ళు కనపడవు. అవి కనపడే విధముగా ఉన్నాయి ఆ కర్ణాభరణాలు.
నవయౌవననిర్వృత్త స్తనభారకృశోదరమ్
ముఖామోదానురక్తాలి ఝఙ్కారోద్విగ్నలోచనమ్
నవ యవ్వనముతో ఉన్నది, సన్నని కడుపుతో ఉంది.
బిభ్రత్సుకేశభారేణ మాలాముత్ఫుల్లమల్లికామ్
సుగ్రీవకణ్ఠాభరణం సుభుజాఙ్గదభూషితమ్
ముఖము నుండి వచ్చే సుగంధానికి ఆశపడి పైపైకి వస్తున్న తుమ్మెదల వలన కలత చెంది ఉన్నది. కేశభారమునకు తగినంత పుష్పాలను తగిలించుకుంది. కంఠాభరణములూ భుజాభరణములూ
విరజామ్బరసంవీత నితమ్బద్వీపశోభయా
కాఞ్చ్యా ప్రవిలసద్వల్గు చలచ్చరణనూపురమ్
వడ్డాణం అందెలూ వాటి ధ్వనితో, కొంచెం సిగూ, చిరునవ్వుతో చూపులను పారవేస్తూ ఉన్నది.
సవ్రీడస్మితవిక్షిప్త భ్రూవిలాసావలోకనైః
దైత్యయూథపచేతఃసు కామముద్దీపయన్ముహుః
దేవతల వైపు చూడటం లేదు. రాక్షసుల మనసులో కామోద్దీపనం వెదజల్లుతున్నది.
కూర్మ ధన్వంతరీ లక్ష్మీ మోహినీ అవతారాలు ఈ క్షీరసాగర మధనములో వచ్చాయి.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment