ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం రెండవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
ప్రలమ్బబకచాణూర తృణావర్తమహాశనైః
ముష్టికారిష్టద్వివిద పూతనాకేశీధేనుకైః
ప్రలంబ బక చాణూర తృణావర్త మొదలైన అనుచరులని తీసుకుని యదువంశ రాజులతో యుద్ధం చేసాడు
అన్యైశ్చాసురభూపాలైర్బాణభౌమాదిభిర్యుతః
యదూనాం కదనం చక్రే బలీ మాగధసంశ్రయః
ఇతని బాధలను భరించలేక అందరూ వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయారు
తే పీడితా నివివిశుః కురుపఞ్చాలకేకయాన్
శాల్వాన్విదర్భాన్నిషధాన్విదేహాన్కోశలానపి
ఏకే తమనురున్ధానా జ్ఞాతయః పర్యుపాసతే
హతేషు షట్సు బాలేషు దేవక్యా ఔగ్రసేనినా
వెళ్ళలేని వారు అతని ఆధిపత్యాన్ని ఒప్పుకున్నారు
సప్తమో వైష్ణవం ధామ యమనన్తం ప్రచక్షతే
గర్భో బభూవ దేవక్యా హర్షశోకవివర్ధనః
ఇలా ఆరుగురు చనిపోగా ఏడవ గర్భం ఐన ఆదిశేషుడు గర్భములో పుట్టాడు. దుఃఖాన్నీ సంతోషాన్నీ పెంచే గర్భం ఇది.
భగవానపి విశ్వాత్మా విదిత్వా కంసజం భయమ్
యదూనాం నిజనాథానాం యోగమాయాం సమాదిశత్
పరమాత్మ కూడా దేవకీ వసుదేవులకూ కంసుని వలన కలిగే భయం తెలుసుకుని, తనను దిక్కుగా నమ్ముకున్న యాదవులకు క్షేమం కలిగించడానికి తన యోగమాయను, గోవులూ గోపాలురూ ఉన్న గోకులానికి వెళ్ళి
గచ్ఛ దేవి వ్రజం భద్రే గోపగోభిరలఙ్కృతమ్
రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నన్దగోకులే
అన్యాశ్చ కంససంవిగ్నా వివరేషు వసన్తి హి
నందగోకులములో వసుదేవుని భార్య ఐన రోహిణి ఉంది. వారు కూడా కంసునికి భయపడి అక్కడ ఉన్నారు. నా అంశ ఐన ఆదిశేషుడిని తీసుకుని వెళ్ళి
దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామ మామకమ్
తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ
రోహిణీ గర్భములో ప్రవేశపెట్టు, తరువాత నేను దేవకికి కొడుకుగా పుడతాను
అథాహమంశభాగేన దేవక్యాః పుత్రతాం శుభే
ప్రాప్స్యామి త్వం యశోదాయాం నన్దపత్న్యాం భవిష్యసి
నీవు నందగోప యశోదలకు ఆడపిల్లగా జన్మించు
అర్చిష్యన్తి మనుష్యాస్త్వాం సర్వకామవరేశ్వరీమ్
ధూపోపహారబలిభిః సర్వకామవరప్రదామ్
అలా పుట్టిన నిన్ను మనుషులు తమ సకల కోరికలూ తీర్చే దానిగా నిన్ను ఆరాధ్సితారు. ధూపములతో దీపములతో నైవేద్యములతో నిన్ను ఆరాధిస్తారు.
నామధేయాని కుర్వన్తి స్థానాని చ నరా భువి
దుర్గేతి భద్రకాలీతి విజయా వైష్ణవీతి చ
నీకు ఎన్నో పేర్లు పెడతారు, ఎన్నో దేవాలయాలు కడతారు. దుర్గా భద్ర కాళీ విజయా వైష్ణవీ
కుముదా చణ్డికా కృష్ణా మాధవీ కన్యకేతి చ
మాయా నారాయణీశానీ శారదేత్యమ్బికేతి చ
కుముదా చండికా కృష్ణా మాధవీ కన్యకా మాయా నారాయణీ ఈశానీ శారదా అంబికా అనే ఈ పేర్లతో నిన్ను ఆరాధిస్తారు. నిన్ను కామప్రదాయినిగా ఆరాధిస్తారు అందరూ
గర్భసఙ్కర్షణాత్తం వై ప్రాహుః సఙ్కర్షణం భువి
రామేతి లోకరమణాద్బలభద్రం బలోచ్ఛ్రయాత్
ఇక్కడినుంచి గర్భాన్ని లాగి అక్కడ పుట్టాడు కాబట్టి అతనిని సంకర్షణుడు అంటారు. లోకం మొత్తాన్ని ఆనందింపచేస్తాడు కాబట్టి రాముడనీ, బలం ఉన్నవాడు కాబట్టి బలుడనీ, బలరాముడనీ అంటారు
సన్దిష్టైవం భగవతా తథేత్యోమితి తద్వచః
ప్రతిగృహ్య పరిక్రమ్య గాం గతా తత్తథాకరోత్
యోగ మాయ స్వామి చెప్పిన మాటలకు సరే అని , ప్రదక్షిణం చేసి భూలోకానికి వెళ్ళి గర్భాన్ని తీసుకుని రోహిణి యందు ఉంచగా
గర్భే ప్రణీతే దేవక్యా రోహిణీం యోగనిద్రయా
అహో విస్రంసితో గర్భ ఇతి పౌరా విచుక్రుశుః
అయ్యో దేవకి కడుపు జారిపోయిందీ అని లోకులు చెప్పుకున్నారు
భగవానపి విశ్వాత్మా భక్తానామభయఙ్కరః
ఆవివేశాంశభాగేన మన ఆనకదున్దుభేః
పరమాత్మ కూడా లోకానికి అభయమిచ్చేవాడు వసుదేవుడి మనసులో ప్రవేశించాడు
స బిభ్రత్పౌరుషం ధామ భ్రాజమానో యథా రవిః
దురాసదోऽతిదుర్ధర్షో భూతానాం సమ్బభూవ హ
పరమాత్మ తేజస్సు పొందిన వసుదేవుడు రెండవ సూర్యునిలాగ ప్రకాశించాడు.లోకములో ఎవ్వరూ వసుదేవున్ని చూసి తట్టుకోలేనంత తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు
తతో జగన్మఙ్గలమచ్యుతాంశం సమాహితం శూరసుతేన దేవీ
దధార సర్వాత్మకమాత్మభూతం కాష్ఠా యథానన్దకరం మనస్తః
పరమాత్మ యొక్క అంశం వసుదేవుని ద్వారా దేవకి లోనికి ప్రవేశించింది. ఆ తేజస్సుని దేవకి వహిస్తోంది.
సా దేవకీ సర్వజగన్నివాస నివాసభూతా నితరాం న రేజే
భోజేన్ద్రగేహేऽగ్నిశిఖేవ రుద్ధా సరస్వతీ జ్ఞానఖలే యథా సతీ
సకల జగత్తునూ తనలో ఉంచుకున్న జగన్నివాసునికి నివాసమైనది దేవకి. అయినా అంతగా ప్రకాశించలేదు. పైన మూసి వేసిన దీప శిఖలాగ కంసుని ఇంటిలో ఉండటం వలన ఉత్సాహముగా ఉండలేదు. దుర్మార్గుడైన వాడికి వచ్చిన విద్యలాగ దేవకి కూడా శోభించలేదు.
తాం వీక్ష్య కంసః ప్రభయాజితాన్తరాం
విరోచయన్తీం భవనం శుచిస్మితామ్
ఆహైష మే ప్రాణహరో హరిర్గుహాం
ధ్రువం శ్రితో యన్న పురేయమీదృశీ
కంసుడు చూసాడు ఈమె ప్రకాశిస్తూ ఉండటం. ఎందుకంటే ఇన్ని గర్భాలు ధరించింది కానీ దేవకి ఇంత తేజస్సుతో విరాజిల్లలేదు. నన్ను కాపాడుకోవడానికి నేనేమి చేయాలి. ఇప్పుడు ఈమెను చంపితే ఆడదాన్నీ చెల్లెలనూ గర్భవతినీ చంపితే కీర్తీ సంపదా ఆయువూ పోతుంది.
కిమద్య తస్మిన్కరణీయమాశు మే యదర్థతన్త్రో న విహన్తి విక్రమమ్
స్త్రియాః స్వసుర్గురుమత్యా వధోऽయం యశః శ్రియం హన్త్యనుకాలమాయుః
స ఏష జీవన్ఖలు సమ్పరేతో వర్తేత యోऽత్యన్తనృశంసితేన
దేహే మృతే తం మనుజాః శపన్తి గన్తా తమోऽన్ధం తనుమానినో ధ్రువమ్
అలా ఆమెను చంపి నేను బతికినా నన్ను అందరూ జీవచ్చవమే అంటారు. శరీరం పోయిన తరువాత కూడా పర దుర్మార్గుడు వీడు అంటే అటువంటి చావు నీచమైన చావు. చనిపోయిన తరువాత కూడా నిందించబడే జన్మ నికృష్ట జన్మ. ఇపుడు నేను ఈమెను చంపితే నేను బతికున్నంతకాలమూ, చనిపోయిన తరువాత కూడా ప్రజలు నన్ను అసహ్యించుకుంటారు.
ఇతి ఘోరతమాద్భావాత్సన్నివృత్తః స్వయం ప్రభుః
ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరేర్వైరానుబన్ధకృత్
ఈ చెడ్డపేరు నాకెందుకు అని, ఆమెను చంపకుండా ఎప్పుడు కుమారుడు పుడతాడా అని చూస్తూ
ఆసీనః సంవిశంస్తిష్ఠన్భుఞ్జానః పర్యటన్మహీమ్
చిన్తయానో హృషీకేశమపశ్యత్తన్మయం జగత్
కూర్చున్నా నిలబడ్డా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా, తింటున్నా భూమంతా పర్యటిస్తున్నా, కృష్ణుడి గురించే చింతిస్తూ ఉన్నాడు. అతనికి అంతా విష్ణు మయం అయ్యింది. మొత్తం ప్రపంచం అంతా హరి మయం అయింది.
బ్రహ్మా భవశ్చ తత్రైత్య మునిభిర్నారదాదిభిః
దేవైః సానుచరైః సాకం గీర్భిర్వృషణమైడయన్
బ్రహ్మా శంకరుడూ నారదాదులు దేవతలతో వేదములతో సహా వచ్చారు. స్తోత్రం చేసారు
సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం
సత్యస్య యోనిం నిహితం చ సత్యే
సత్యస్య సత్యమృతసత్యనేత్రం
సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః
ఇది బ్రహ్మగారి యొక్క స్తోత్రం. సకల ఉపనిషద్జ్యానం.
పరమాత్మ సత్యమే వ్రతముగా కలవాడు. సత్యము కంటే పరుడు. పరమాత్మ ఎప్పుడూ ఉండే వాడు, త్రికాల సత్యం. సత్యమునకూ ఇతనే కారణం. సత్యములో ఉన్నవాడూ ఇతనే. సత్యమునకు తాను సత్యము. సత్యముతోనే సకల జగత్తునూ చూచేవాడు. ఇతను సత్యాత్మకుడు
ఏకాయనోऽసౌ ద్విఫలస్త్రిమూలశ్చతూరసః పఞ్చవిధః షడాత్మా
సప్తత్వగష్టవిటపో నవాక్షో దశచ్ఛదీ ద్విఖగో హ్యాదివృక్షః
సంసార మహావృక్షం ఇది. దీనికి ఒక్కడే ఆధారం. పరమాత్మ. దానికి రెండు ఉంటాయి. జీవాత్మ పరమాత్మ. దానికి మూడు మూలమైనవి. సత్వమూ రజస్సూ తమస్సూ. నాలుగు రసాలు ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయి. ఐదు ప్రాణములు, ఆరు అరిషడ్వర్గాలు ఆత్మ,
పంచభూతములూ, మనసూ బుద్ధి అనే ఏడూ త్వక్కులూ, అహంకారాన్ని కలుపుకుంటే ఎనిమిది శాఖలు,
నవ ఇంద్రియములూ, పది ఇంద్రియములు. రెండే పక్షులు. ఒకటి జీవాత్మ రెండవది పరమాత్మ. ఇదే సంసార వృక్షం.
త్వమేక ఏవాస్య సతః ప్రసూతిస్త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ
త్వన్మాయయా సంవృతచేతసస్త్వాం పశ్యన్తి నానా న విపశ్చితో యే
నీవు మాత్రమే సకల జగత్తుకూ కారణం. నీవే ఉండేవాడవూ కాపాడేవాడవు, నీ మాయతోనే నిన్ను చూస్తారు, నీ మాయతోనే నిన్ను చూడరు
బిభర్షి రూపాణ్యవబోధ ఆత్మా క్షేమాయ లోకస్య చరాచరస్య
సత్త్వోపపన్నాని సుఖావహాని సతామభద్రాణి ముహుః ఖలానామ్
సకల చరాచర జగత్తు క్షేమానికి నీవు ఎన్నో అవతారాలు ధరిస్తావు. సత్వగుణముతో కూడుకున్నవీ, సుఖమును కలిగించేవి ఐనవి, సత్పురుషులకు సుఖావహములూ దుర్మార్గులకు అమంగళ కరములు నీ అవతారాలు
త్వయ్యమ్బుజాక్షాఖిలసత్త్వధామ్ని సమాధినావేశితచేతసైకే
త్వత్పాదపోతేన మహత్కృతేన కుర్వన్తి గోవత్సపదం భవాబ్ధిమ్
నీయందు మనసు లగ్నం చేసి నీ పాదాలనే నావతో సంసార సముద్రాన్ని గోపాదములా దాటుతారు
స్వయం సముత్తీర్య సుదుస్తరం ద్యుమన్
భవార్ణవం భీమమదభ్రసౌహృదాః
భవత్పదామ్భోరుహనావమత్ర తే
నిధాయ యాతాః సదనుగ్రహో భవాన్
అటువంటి వారు సంసార సముద్రాన్ని తాము దాటి దాట లేని వారికి కూడా వారు దారి చూపుతారు. ఇది సత్పురుషుల యొక్క ప్రభావం. వారిని నీవు అనుగ్రహిస్తావు. వారు లోకాలను నీ అనుగ్రహ రూపముగా అనుగ్రహిస్తారు.
యేऽన్యేऽరవిన్దాక్ష విముక్తమానినస్
త్వయ్యస్తభావాదవిశుద్ధబుద్ధయః
ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతః
పతన్త్యధోऽనాదృతయుష్మదఙ్ఘ్రయః
మహానుభావా, అపరిశుద్ధమైన బుద్ధి కలవారు స్వర్గానికి వెళ్ళినా అక్కడినుంచి భ్రష్టులవుతారు. ఎందుకంటే పరమాత్మ పాద పద్మాలను ఆదరించిన వారు ఎంత జ్ఞ్యానవంతులై ఎన్ని లోకాలకూ వెళ్ళినా మళ్ళీ అక్కడినుంచి తిరిగి కిందబడతారు.
తథా న తే మాధవ తావకాః క్వచిద్భ్రశ్యన్తి మార్గాత్త్వయి బద్ధసౌహృదాః
త్వయాభిగుప్తా విచరన్తి నిర్భయా వినాయకానీకపమూర్ధసు ప్రభో
అదే నీవు కాపాడితే వారు అంతటా క్షేమముగా ఉంటారు. శుద్ధ సత్వ గుణాన్నే ఆశ్రయిస్తారు. నీవు
సత్త్వం విశుద్ధం శ్రయతే భవాన్స్థితౌ
శరీరిణాం శ్రేయౌపాయనం వపుః
వేదక్రియాయోగతపఃసమాధిభిస్
తవార్హణం యేన జనః సమీహతే
నీ శరీరం ఎలాంటిది అంటే. నీయందు అమితమైన భక్తి కలిగిన వారికి కానుక వంటిది.
సత్త్వం న చేద్ధాతరిదం నిజం భవేద్
విజ్ఞానమజ్ఞానభిదాపమార్జనమ్
గుణప్రకాశైరనుమీయతే భవాన్
ప్రకాశతే యస్య చ యేన వా గుణః
వేదాలు క్రియలూ యోగములూ తపస్సూ సమాధి అనే వాటితో నిన్ను ఆరాధించేవారికి సత్వగుణం వారి దగ్గర లేకుంటే ఆ విజ్ఞ్యానం అంతా అజ్ఞ్యానం అవుతుంది.నీ గుణాలను చూస్తే ఎవరినా నీవే పరమాత్మ అని గుర్తుపడతారు.
న నామరూపే గుణజన్మకర్మభిర్నిరూపితవ్యే తవ తస్య సాక్షిణః
మనోవచోభ్యామనుమేయవర్త్మనో దేవ క్రియాయాం ప్రతియన్త్యథాపి హి
మాలాంటి వారికైతే నీ పేరేంటి రూపేంటి అని అడగాలి గానీ నీ విషయములో ఏమీ అడగక్కరలేదు. నిన్ను చూడటముతోనే గుర్తుపడతారు. నీ రూపమే చెబుతుంది. మనసుతో వాక్కుతో శరీరముతో నీ మార్గమిలా ఉంటుంది అని ఎవరూ ఊహించలేరు.
శృణ్వన్గృణన్సంస్మరయంశ్చ చిన్తయన్
నామాని రూపాణి చ మఙ్గలాని తే
క్రియాసు యస్త్వచ్చరణారవిన్దయోర్
ఆవిష్టచేతా న భవాయ కల్పతే
ఐనా నీ కథలు వింటూ నీ నామాన్ని జపిస్తూ స్మరిస్తూ పరమ మంగళమైన నీ నామాలనూ స్మరించిన వాడు మళ్ళీ సంసారములోకి రాడు
దిష్ట్యా హరేऽస్యా భవతః పదో భువో
భారోऽపనీతస్తవ జన్మనేశితుః
దిష్ట్యాఙ్కితాం త్వత్పదకైః సుశోభనైర్
ద్రక్ష్యామ గాం ద్యాం చ తవానుకమ్పితామ్
నీ అనుగ్రహముతో నీవు భూమి మీద అడుగుపెడుతున్నావు. పెద్ద బరువు పడితేనే చిన్న బరువు పోదు. గీతను చిన్నది చేయాలంటే దాని పక్కన పెద్ద గీతను గీసినట్లుగా పెద్ద బరువును తొలగించడానికి నీవు వస్తున్నావు. ఇప్పటినుంచీ భూమినీ స్వర్గాన్ని నీ పాదచిహ్నములతో చూసి మేము తరిస్తాము
న తేऽభవస్యేశ భవస్య కారణం వినా వినోదం బత తర్కయామహే
భవో నిరోధః స్థితిరప్యవిద్యయా కృతా యతస్త్వయ్యభయాశ్రయాత్మని
మేము పుట్టాలంటే మా పాపాలూ కర్మలూ కారణం. నీవు పుట్టడానికి నీ వినోదం తప్ప వేరే కారణాలు మేము ఊహించలేము. సృష్టి రక్షణా ప్రళయాలు నీకు అన్నీ వినోదాలే కదా. నీవు అభయమూర్తివి
మత్స్యాశ్వకచ్ఛపనృసింహవరాహహంస
రాజన్యవిప్రవిబుధేషు కృతావతారః
త్వం పాసి నస్త్రిభువనం చ యథాధునేశ
భారం భువో హర యదూత్తమ వన్దనం తే
మత్స్య హయగ్రీవ కూర్మ నృసింహ వరాహ రాజన్య విప్ర అవతారాలలో నీవు పుట్టి మమ్ము కాపాడావో. ఇది వరకు ఎలా కాపాడి భూభారాన్ని తొలగించావో ఇప్పుడు కూడా అటువంటి పని చేస్తున్న నీకు నమస్కారం.
దిష్ట్యామ్బ తే కుక్షిగతః పరః పుమాన్
అంశేన సాక్షాద్భగవాన్భవాయ నః
మాభూద్భయం భోజపతేర్ముమూర్షోర్
గోప్తా యదూనాం భవితా తవాత్మజః
ఇలా స్తోత్రం చేసి "అమ్మా, అదృష్టం వలన పరమాత్మ నీ కడుపులో చేరాడు, మనం అందరికీ మేలు చేయడానికి. చావబోతున్న కంసుని వలన మీరు భయపడకండి. నీ కుమారుడు సకల యదువంశం వారినీ కాపాడతాడు"
శ్రీశుక ఉవాచ
ఇత్యభిష్టూయ పురుషం యద్రూపమనిదం యథా
బ్రహ్మేశానౌ పురోధాయ దేవాః ప్రతియయుర్దివమ్
బ్రహ్మ శంకరున్ని ముందర పెట్టుకుని దేవతలు వెళ్ళిపోయారు.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment