శ్రీమద్భాగవతం నవమ స్కంధం నాలగవ అధ్యాయం
శ్రీశుక ఉవాచ
నాభాగో నభగాపత్యం యం తతం భ్రాతరః కవిమ్
యవిష్ఠం వ్యభజన్దాయం బ్రహ్మచారిణమాగతమ్
నభగుని కుమారుడు నాభాగుడు. ఇతనికి ఈ పేరు రావడానికి కారణం నభగుడు తన కుమారులకు రాజ్యాన్ని పంచాడు, పంచినపుడు నాభాగుడు అక్కడ లేడు. అందుచే అతనికి భాగం లేదు. అందుచే అతను నాభాగుడు. అతను తిరిగి వచ్చేసరికి జరిగిన తప్పు తెలుసుకున్న నభగుడు నాభాగునికి రెండు మంత్రాలు చెప్పి ఋషులు యజ్ఞ్యం చేస్తుంటే వెళ్ళి పక్కన కూర్చో, ఎవరైనా మరచిపోతే ఆ మంత్రాలను గుర్తు చెయ్యి. నువ్వు గుర్తు చేసిన తరువాత వారేమిస్తే దానితో బతుకు అన్నాడు. సరేనని అంగీకరించాడు. ఎవరో యజ్ఞ్యం చేస్తూ ఆ భాగాన్ని మరచిపోయినపుడు నాభాగుడు మంత్రాన్ని అందించాడు. ఆ యజ్ఞ్యం పూర్తి అయ్యింది. పూర్తి అయ్యాక చివరి భాగం నాభాగుడు అడిగాడు. సరేనని ఇవ్వబోతూ ఉంటే శంకరుడు వచ్చాడు.
భ్రాతరోऽభాఙ్క్త కిం మహ్యం భజామ పితరం తవ
త్వాం మమార్యాస్తతాభాఙ్క్షుర్మా పుత్రక తదాదృథాః
ఇమే అఙ్గిరసః సత్రమాసతేऽద్య సుమేధసః
షష్ఠం షష్ఠముపేత్యాహః కవే ముహ్యన్తి కర్మణి
తాంస్త్వం శంసయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మనః
తే స్వర్యన్తో ధనం సత్ర పరిశేషితమాత్మనః
దాస్యన్తి తేऽథ తానర్చ్ఛ తథా స కృతవాన్యథా
తస్మై దత్త్వా యయుః స్వర్గం తే సత్రపరిశేషణమ్
తం కశ్చిత్స్వీకరిష్యన్తం పురుషః కృష్ణదర్శనః
ఉవాచోత్తరతోऽభ్యేత్య మమేదం వాస్తుకం వసు
మమేదమృషిభిర్దత్తమితి తర్హి స్మ మానవః
స్యాన్నౌ తే పితరి ప్రశ్నః పృష్టవాన్పితరం యథా
యజ్ఞవాస్తుగతం సర్వముచ్ఛిష్టమృషయః క్వచిత్
చక్రుర్హి భాగం రుద్రాయ స దేవః సర్వమర్హతి
శంకరుడు అది నా భాగం అని అన్నాడు.
నాభాగస్తం ప్రణమ్యాహ తవేశ కిల వాస్తుకమ్
ఇత్యాహ మే పితా బ్రహ్మఞ్ఛిరసా త్వాం ప్రసాదయే
వెళ్ళి మీ తండ్రిని ఈ విషయం అడుగు అన్నాడు. అతను వెళ్ళి అడిగి వచ్చి." అది మీ భాగమే నా భాగం కాదు" అని శంకరునితో అన్నాడు.
యత్తే పితావదద్ధర్మం త్వం చ సత్యం ప్రభాషసే
దదామి తే మన్త్రదృశో జ్ఞానం బ్రహ్మ సనాతనమ్
మీ నాన్నగారి ధర్మ వ్రతం నీ సత్య వ్రతం నన్ను సంతోషపెట్టాయి. ఎందుకంటే తండ్రి అంతకుముందు కొడుకుకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పట్టుదల పట్టలేదు. మీ నాన్నగారు ధర్మం తప్పలేదు. నీవు కూడా మీ నాన్నగారు మాట్లాడిన మాటలనే మాట్లాడావు గనుక సత్యం తప్పలేదు.
గృహాణ ద్రవిణం దత్తం మత్సత్రపరిశేషితమ్
ఇత్యుక్త్వాన్తర్హితో రుద్రో భగవాన్ధర్మవత్సలః
ఇప్పటినుంచీ నీకూ ఇందులో భాగం ఇస్తున్నాను. మొదటి సగం నీది. తరువాతి సగం నాది. రుద్రుడు పొందే యజ్ఞ్య భాగములో భాగం పొందినవాడు నాభాగుడు.
య ఏతత్సంస్మరేత్ప్రాతః సాయం చ సుసమాహితః
కవిర్భవతి మన్త్రజ్ఞో గతిం చైవ తథాత్మనః
ఈ నాభాగుని చరిత్రను ఎవరైతే ప్రాతః సాయం సంధ్యలలో స్మరిస్తారో వారు కవీ, మత్రజ్ఞ్యుడూ అవుతాడు. ఉత్తమ గతిని పొందుతాడు.
నాభాగాదమ్బరీషోऽభూన్మహాభాగవతః కృతీ
నాస్పృశద్బ్రహ్మశాపోऽపి యం న ప్రతిహతః క్వచిత్
శివుని దగ్గర నుండి భాగం తీసుకున్న ఫలితానికి నాభాగుని కలిగిన కుమారుడే అంబరీషుడు. ఈయన పరమభాగవతోత్తముడు. ప్రపంచములో దేనికీ ఎదురులేని బ్రాహ్మణుని శాపం కూడా అంబరీషునికి తగల లేదు.
శ్రీరాజోవాచ
భగవన్ఛ్రోతుమిచ్ఛామి రాజర్షేస్తస్య ధీమతః
న ప్రాభూద్యత్ర నిర్ముక్తో బ్రహ్మదణ్డో దురత్యయః
దాట రాని బ్రహ్మదండం కూడా అంబరీషున్ని ఏమి చేయలేదు అన్నారు. ఆ కథ నాకు చెప్పండి
శ్రీశుక ఉవాచ
అమ్బరీషో మహాభాగః సప్తద్వీపవతీం మహీమ్
అవ్యయాం చ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి
సప్త ద్వీప మహికి ఆయన అధినాయకుడు. ఇన్ని చేసి
మేనేऽతిదుర్లభం పుంసాం సర్వం తత్స్వప్నసంస్తుతమ్
విద్వాన్విభవనిర్వాణం తమో విశతి యత్పుమాన్
సప్త ద్వీపాధిపత్యాన్ని పొంది, ఆ ఆధిపత్యం కల లాంటిది అని తెలుసుకున్నాడు. ఇలా భావించి ఏ వైభవం యొక్క గొప్పతనాన్ని చూసి లోకులు అజ్ఞ్యానన్ని పొందుతారో అటువంటి దాన్ని కలలా భావించి
వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు
ప్రాప్తో భావం పరం విశ్వం యేనేదం లోష్ట్రవత్స్మృతమ్
భగవంతుని యందూ భాగవతోత్తముల యందూ పరమ భక్తి భావాన్ని పొందాడు. కాబట్టి ఇంత పెద్ద ప్రపంచాన్నీ సంపదనూ ఒక మట్టి బెడ్డ అనుకున్నాడు
స వై మనః కృష్ణపదారవిన్దయోర్వచాంసి వైకుణ్ఠగుణానువర్ణనే
కరౌ హరేర్మన్దిరమార్జనాదిషు శ్రుతిం చకారాచ్యుతసత్కథోదయే
అంబరీషుడు తన మనసును పరమాత్మ పాదారవిందములయందు ఉంచాడు. వాక్కును పరమాత్మ గుణాన్ని వర్ణించడములో ఉంచాడు. చేతులు పరమాత్మ యొక్క దేవాలయాన్ని ఊడవటములో ఉంచాడు. స్వామి దేవాలయమును ఊడిస్తే ఆ ఊడవటం వలన ఎన్ని దుమ్ముకణాలు బయటకు పోతాయో అన్ని సంవత్సరాలు పరమాత్మ సన్నిధిలో ఉంటాము. చెవులను పరమాత్మ కథలను వినడములో ఉంచాడు.
ముకున్దలిఙ్గాలయదర్శనే దృశౌ తద్భృత్యగాత్రస్పర్శేऽఙ్గసఙ్గమమ్
ఘ్రాణం చ తత్పాదసరోజసౌరభే శ్రీమత్తులస్యా రసనాం తదర్పితే
పరమాత్మ చిహ్నములను కలిగిన దేవాలయములను చూడటములో కన్నులు. పరమాత్మ భక్తులను తాకడానికి శరీరం వాడుకున్నాడు. ముక్కును పరమాత్మ పాదపద్మాలనూ, భాగవతోత్తముల పాద పద్మ సుగంధాన్ని ఆస్వాదించడములో, నాలుకను తులసీ రసాన్ని సేవించడములో
పాదౌ హరేః క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశపదాభివన్దనే
కామం చ దాస్యే న తు కామకామ్యయా యథోత్తమశ్లోకజనాశ్రయా రతిః
పాదములు పరమాత్మ ఆలయాలకు నడచి వెళ్ళడానికి ఉపయోగించుకున్నాడు. శిరస్సును పరమాత్మ పాదములకు నమస్కారం చేయడములో
కోరికను పరమాత్మను దాస్యం చేయడములో తప్ప, ఆడవారికి దాస్యం చేయడములో కాదు. ప్రీతి భగవంతుని భత్కులతో కలిసి ఉండటములోనే
ఏవం సదా కర్మకలాపమాత్మనః పరేऽధియజ్ఞే భగవత్యధోక్షజే
సర్వాత్మభావం విదధన్మహీమిమాం తన్నిష్ఠవిప్రాభిహితః శశాస హ
ఆచరించవలసిన సకల కర్మలనూ భగవంతునీ భగవంతుని భక్తులనూ సేవించడానికే ఉపయోగించుకున్నాడు.
పరిపూర్ణమైన ఆత్మభావాన్ని పరమాత్మ యందే అర్పించి భగవంతుని భక్తులైన బ్రాహ్మణోత్తములు శాసించిన విధముగా వారు చెప్పినది వింటూ రాజ్య పరిపాలన చేసాడు.
ఈజేऽశ్వమేధైరధియజ్ఞమీశ్వరం మహావిభూత్యోపచితాఙ్గదక్షిణైః
తతైర్వసిష్ఠాసితగౌతమాదిభిర్ధన్వన్యభిస్రోతమసౌ సరస్వతీమ్
అద్భుతమైన, ఎవరూ ఊహించలేని గొప్ప దక్షిణలను ఇస్తూ అశ్వమేధ యజ్ఞ్యాలను ఆచరించాడు.
సరవస్తీ నదిన వీరందరూ చేరడముతో, వీరి స్పర్శతో ఆ ప్రాంతం పవిత్రమైనది
యస్య క్రతుషు గీర్వాణైః సదస్యా ఋత్విజో జనాః
తుల్యరూపాశ్చానిమిషా వ్యదృశ్యన్త సువాససః
ఈయన ఆచరించిన అశ్వమేధ యాగములో ప్రత్యేకత ఏమిటంటే, ఆ యజ్ఞ్యములో హవిస్సు తీసుకోవడానికి వచ్చిన దేవతలూ, చూడటానికి వచ్చిన ఋత్విక్కులూ, యజ్ఞ్యములో వేదమంత్రాలతో పరమాత్మను ఆహ్వానించే బ్రాహ్మణోత్తములు వీళ్ళందరూ ఒకే తీరుగా కనపడ్డారు. వీరందరూ రెప్పలు వేయని వారిగా అయ్యారు. వీరు కూడా రెప్పలు వేయడం మరచిపోయారు ఇతని వైభవాన్ని చూసి.
స్వర్గో న ప్రార్థితో యస్య మనుజైరమరప్రియః
శృణ్వద్భిరుపగాయద్భిరుత్తమశ్లోకచేష్టితమ్
అతనే కాదు, అతనిరాజ్యములో ఉన్న ప్రజలు కూడా, అతనూ అతని పరిజనం ఆచరిస్తూ ఉన్న భగవత్ గుణ కథా గానం వినీ వినీ ప్రతిఫలముగా స్వర్గము కావాలని అడగటం మరచిపోయారు. అంబరీషుడే కాక అతని రాజ్యములో ప్రజలు కూడా స్వర్గ పాతాళాది లోకాలు కోరడం మానేసారు.
సంవర్ధయన్తి యత్కామాః స్వారాజ్యపరిభావితాః
దుర్లభా నాపి సిద్ధానాం ముకున్దం హృది పశ్యతః
నిజముగా వారు కావాలని కోరుకుంటే అవి దుర్లభాలు కావు. వారి హృదయములో పరమాత్మ వేంచేసి ఉన్నాడు. అలాంటి వారికి దొరకనిదేముంది. వారికి ఏదీ దుర్లభాలు కావు. కానీ అవి అన్నీ క్షణ బంగురాలు. వాటినెవ్వరూ కోరలేదు.
స ఇత్థం భక్తియోగేన తపోయుక్తేన పార్థివః
స్వధర్మేణ హరిం ప్రీణన్సర్వాన్కామాన్శనైర్జహౌ
ఇలా భక్తి యోగముతో తపస్సుతో ఆ మహారాజు హరిని సంతోషింపచేస్తూ సకల సంసారం విషయ సంగములను విడిచిపెట్టాడు
గృహేషు దారేషు సుతేషు బన్ధుషు ద్విపోత్తమస్యన్దనవాజివస్తుషు
అక్షయ్యరత్నాభరణామ్బరాదిష్వనన్తకోశేష్వకరోదసన్మతిమ్
ఇళ్ళమీదా భారయల మీదా పుత్రుల మీదా బంధువుల మీదా, ఏనుగులూ రథములూ గుర్రములూ సైన్యములూ రత్నాభరణములూ ఆయుధములూ మొదలైనవన్నీ మంచివి కావు, నష్టములు అని భావించి
తస్మా అదాద్ధరిశ్చక్రం ప్రత్యనీకభయావహమ్
ఏకాన్తభక్తిభావేన ప్రీతో భక్తాభిరక్షణమ్
ఇంత అద్భుతముగా అంబరీషుడు అన్నీ మరచి పరమాత్మను సేవిస్తూ ఉంటే అతనికేమైనా ఆపద వస్తే రక్షించాలని అతని భక్తి భావానికి ప్రీతి చెంది తన చక్రాన్ని అతనికిచ్చాడు రక్షణగా.
ఆరిరాధయిషుః కృష్ణం మహిష్యా తుల్యశీలయా
యుక్తః సాంవత్సరం వీరో దధార ద్వాదశీవ్రతమ్
కొన్నాళ్ళకి ఈయన తనతో సమానమైన స్వభావము కల భార్యతో కలసి ఒక సంవత్సర కాలం ద్వాదశీ వ్రతాన్ని చేయ సంకల్పించాడు
వ్రతాన్తే కార్తికే మాసి త్రిరాత్రం సముపోషితః
స్నాతః కదాచిత్కాలిన్ద్యాం హరిం మధువనేऽర్చయత్
మధువనములో యమునా నదిలో స్నానం చేసి వ్రతం పూర్తి ఐన తరువాత కార్తీక మాసములో పరమాత్మను అభిషేకించి
మహాభిషేకవిధినా సర్వోపస్కరసమ్పదా
అభిషిచ్యామ్బరాకల్పైర్గన్ధమాల్యార్హణాదిభిః
ఆకాశాన్నంటే గంధ మాల్యాలతో అర్చించి
తద్గతాన్తరభావేన పూజయామాస కేశవమ్
బ్రాహ్మణాంశ్చ మహాభాగాన్సిద్ధార్థానపి భక్తితః
పుష్పాలు స్వామి మీద వేస్తూ ఉంటే స్వామి చేతిలో పుష్పాలు వేస్తున్నట్లు భావించి చేసాడు. పరమాత్మను ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేస్తున్నానన్న భావనతో చేసాడు. ఈయన పుష్పమాల స్వామి మెడలో వేస్తుంటే అందులో ఒక ముల్లు చూసాడు. అది చూసిన అంబరీషుడు బాధపడి ఒక ఝాము సేపు మూర్చబోయాడు. అంబరీషుడు పరమాత్మ మీదే పరిపూర్ణ భావం ఉంచి పూజించాడు
గవాం రుక్మవిషాణీనాం రూప్యాఙ్ఘ్రీణాం సువాససామ్
పయఃశీలవయోరూప వత్సోపస్కరసమ్పదామ్
బ్రాహ్మణులనూ భాగవతోత్తములనూ పూజించాడు. వేల వేల గోవులను దానం చేసాడు. ఒకే దూడ ఉన్న ఆవును దానం చేసాడు. ఇక ముందు కూడా దూడలను కనే వయసు గల ఆవులను దానం చేసాడు. ఆ ఆవుల గిట్టలకూ కొమ్ములకూ బంగారు తొడుగు వేసాడు. పాలున్నవీ శీలం ఉన్నవీ యవ్వనము ఉన్నావి రూపం ఉన్నవి దూడలను ప్రసవించను ఆవులను ఇచ్చాడు.
ప్రాహిణోత్సాధువిప్రేభ్యో గృహేషు న్యర్బుదాని షట్
భోజయిత్వా ద్విజానగ్రే స్వాద్వన్నం గుణవత్తమమ్
ఆరుకోట్లు (షట్ న్యర్బుదాని) గోవులను దానం చేసాడు. అలా వచ్చిన బ్రాహ్మణోత్తములందరికీ రుచిగల భోజనాన్ని పెట్టి వారికి కావలసినవన్నీ ఇచ్చి వారిని పంపించి వారి అనుమతి తీసుకుని పారణ చేయాలని సంకల్పించాడు
లబ్ధకామైరనుజ్ఞాతః పారణాయోపచక్రమే
తస్య తర్హ్యతిథిః సాక్షాద్దుర్వాసా భగవానభూత్
అపుడు మహానుభావుడైన దుర్వాసుడు వచ్చాడు అతిథిగా
తమానర్చాతిథిం భూపః ప్రత్యుత్థానాసనార్హణైః
యయాచేऽభ్యవహారాయ పాదమూలముపాగతః
ఆయన రావడముతో లేచి వెళ్ళి అర్ఘ్య పాద్యాదులిచ్చి పూజించి పాదముల వద్ద కూర్చున్నాడు, వారిని కూడా భోజనానికి ఆహ్వానించాడు
ప్రతినన్ద్య స తాం యాచ్ఞాం కర్తుమావశ్యకం గతః
నిమమజ్జ బృహద్ధ్యాయన్కాలిన్దీసలిలే శుభే
అలాగే అని నదికి వెళ్ళాడు. నీటిలో మునిగి స్వామిని ధ్యానిస్తున్నాడు. ధ్యానిస్తూ అక్కడే ఎక్కువ సేపు ఉన్నాడు, అన్నీ మరచిపోయి
ముహూర్తార్ధావశిష్టాయాం ద్వాదశ్యాం పారణం ప్రతి
చిన్తయామాస ధర్మజ్ఞో ద్విజైస్తద్ధర్మసఙ్కటే
ద్వాదశి పారణకు సమయం మించిపోవడముతో ధర్మసంకటములో పడ్డాడు. వ్రతభంగం కాకుండా ఏమి చేయాలని అడిగాడు బ్రాహ్మణులను
బ్రాహ్మణాతిక్రమే దోషో ద్వాదశ్యాం యదపారణే
యత్కృత్వా సాధు మే భూయాదధర్మో వా న మాం స్పృశేత్
బ్రాహ్మణాతిక్రమణ దోషం రాకూడదు. ద్వాదశీ పారణ తప్పినవాడినీ కాకూడదు. నన్ను అధర్మం స్పృశించకుండా ఉండే మార్గం చెప్పని అడిగితే.
అమ్భసా కేవలేనాథ కరిష్యే వ్రతపారణమ్
ఆహురబ్భక్షణం విప్రా హ్యశితం నాశితం చ తత్
నీటిని స్పృశించి పారణ చేయమని అడిగాడు. నీరు తీసుకుంటే తీసుకున్నట్లు కాదు తీసుకోనట్లూ కాదు. అన్నదులు కాదు కాబట్టి తిన్నట్లు కాదు. గొంతు దిగింది కాబట్టి పారణ చేసినట్లు.
ఇత్యపః ప్రాశ్య రాజర్షిశ్చిన్తయన్మనసాచ్యుతమ్
ప్రత్యచష్ట కురుశ్రేష్ఠ ద్విజాగమనమేవ సః
అలా ఆచమనం చేసి పరమాత్మ తీర్థాన్ని తీసుకుని మనసులో పరమాత్మను ధ్యానం చేస్తూ బ్రాహ్మణుడు (దుర్వాసుడు) ఎపుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
దుర్వాసా యమునాకూలాత్కృతావశ్యక ఆగతః
రాజ్ఞాభినన్దితస్తస్య బుబుధే చేష్టితం ధియా
పూర్తి చేసుకుని వచ్చిన దుర్వాసుడు మహారాజు స్వాగతం చెప్పగా ఆయనకు విషయం తెలిసిపోయినిది, కనుబొమ్మలు ముడివేసాడు, కోపముతో ఒళ్ళు వణికిపోతోంది
మన్యునా ప్రచలద్గాత్రో భ్రుకుటీకుటిలాననః
బుభుక్షితశ్చ సుతరాం కృతాఞ్జలిమభాషత
అహో అస్య నృశంసస్య శ్రియోన్మత్తస్య పశ్యత
ధర్మవ్యతిక్రమం విష్ణోరభక్తస్యేశమానినః
వీడు విష్ణు భక్తుడా బ్రాహ్మణుని అతిక్రమించాడు, ప్రభువుననుకుంటున్నాడు. ఇలాంటి పని చేసాడు
యో మామతిథిమాయాతమాతిథ్యేన నిమన్త్ర్య చ
అదత్త్వా భుక్తవాంస్తస్య సద్యస్తే దర్శయే ఫలమ్
నన్ను అతిథిగా పిలిచి నాకు పెట్టకుండా తాను భుజించాడు. వెంటనే నేను దాని ఫలితం చూపుతాను
ఏవం బ్రువాణ ఉత్కృత్య జటాం రోషప్రదీపితః
తయా స నిర్మమే తస్మై కృత్యాం కాలానలోపమామ్
కోపముతో ఆయన జటను పెకిలించి మహా కృత్యను సృష్టించాడు. అది కాలనలములా ఉంది.
తామాపతన్తీం జ్వలతీమసిహస్తాం పదా భువమ్
వేపయన్తీం సముద్వీక్ష్య న చచాల పదాన్నృపః
చేతిలో ఖడ్గం పట్టుకుని తన అడుగులతో భూమిని కంపింపచేస్తూ ఉంది. అంత భయంకరముగా వస్తున్నా అంబరీషుడు ఒక్క అంగుళం కూడా కదలలేదు.
ప్రాగ్దిష్టం భృత్యరక్షాయాం పురుషేణ మహాత్మనా
దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః
పగబట్టిన పామును అగ్ని కాల్చి వేసినట్లు, అతను కదలకున్నా అతన్ని రక్షించడానికి పరమాత్మ ఏర్పాటు చేసిన చక్రం జ్వాలలు కమ్ముతూ వచ్చినిది. వచ్చి ఆ కృత్యను భస్మం చేసింది
తదభిద్రవదుద్వీక్ష్య స్వప్రయాసం చ నిష్ఫలమ్
దుర్వాసా దుద్రువే భీతో దిక్షు ప్రాణపరీప్సయా
బతకాలని దుర్వాసుడు పరిగెత్తాడు. ఆయన వెంట చక్రం బయలు దేరింది.
తమన్వధావద్భగవద్రథాఙ్గం దావాగ్నిరుద్ధూతశిఖో యథాహిమ్
తథానుషక్తం మునిరీక్షమాణో గుహాం వివిక్షుః ప్రససార మేరోః
ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళి తన గతిని చెప్పాడు.
దిశో నభః క్ష్మాం వివరాన్సముద్రాన్లోకాన్సపాలాంస్త్రిదివం గతః సః
యతో యతో ధావతి తత్ర తత్ర సుదర్శనం దుష్ప్రసహం దదర్శ
అన్ని దిక్కులూ లోకాలూ సముద్రాలకూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా రక్షించేవారు దొరకక సత్యలోకానికి వెళ్ళాడు.
అలబ్ధనాథః స సదా కుతశ్చిత్సన్త్రస్తచిత్తోऽరణమేషమాణః
దేవం విరిఞ్చం సమగాద్విధాతస్త్రాహ్యాత్మయోనేऽజితతేజసో మామ్
నన్ను కాపాడమని బ్రహ్మగారిని వేడుకుంటే బ్రహ్మ ఇలా అన్నారు
శ్రీబ్రహ్మోవాచ
స్థానం మదీయం సహవిశ్వమేతత్క్రీడావసానే ద్విపరార్ధసంజ్ఞే
భ్రూభఙ్గమాత్రేణ హి సన్దిధక్షోః కాలాత్మనో యస్య తిరోభవిష్యతి
నీవు ఎవరినుండి నన్ను కాపాడమంటున్నావు. తన ఆట పూర్తి ఐన తరువాత ద్విపరార్థ కాలములో ఏ మహానుభావుని కనుబొమ్మ సైగతో ఈ లోకం నా స్థానముతో సహా అంతర్థానం చెందుతుందో ఆయనను
అహం భవో దక్షభృగుప్రధానాః ప్రజేశభూతేశసురేశముఖ్యాః
సర్వే వయం యన్నియమం ప్రపన్నా మూర్ధ్న్యార్పితం లోకహితం వహామః
నేనూ శంకరుడూ దక్షుడూ ప్రజాపతులూ భూతపతులూ దేవపతులు ఆజ్ఞ్యనను అనుసరిస్తూ ఉంటాము. శిరస్సున చేతులు జోడించి ఎవరి ఆజ్ఞ్యను వహిస్తున్నామో అటువంటి వాడి నుండి నేను నిన్ను ఏమి కాపాడతాను
ప్రత్యాఖ్యాతో విరిఞ్చేన విష్ణుచక్రోపతాపితః
దుర్వాసాః శరణం యాతః శర్వం కైలాసవాసినమ్
బ్రహ్మ చేత తిరస్కరించబడి చక్రం వెంట రాగా కైలాసానికి వెళ్ళాడు
శ్రీశఙ్కర ఉవాచ
వయం న తాత ప్రభవామ భూమ్ని యస్మిన్పరేऽన్యేऽప్యజజీవకోశాః
భవన్తి కాలే న భవన్తి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః
నాయనా ఇది మా వలన అయ్యే పని కాదు. మేమే కాదు, బ్రహ్మా ఇతర జీవాత్మలూ, కాలం బాగుంటే ఉంటారు, లేకపోతే పోతున్నారు. ఏ కాల స్వరూపముతో ఇలా అవుతున్నారో, ఎవరి సంకల్పముతో అందరూ ఉదయిస్తున్నారో, మాలాంటి వారం వేల మంది ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నామో,
అహం సనత్కుమారశ్చ నారదో భగవానజః
కపిలోऽపాన్తరతమో దేవలో ధర్మ ఆసురిః
నేనూ సనత్కుమారుడూ నారదుడూ మా తండ్రి ఐన బ్రహ్మ కపిలుడు, అపాంతరతముడు (మొదటి వ్యాసుడు, నారాయణ అంశతో సరస్వతీ రూపములో బయటకు వచ్చాడు, ఇది వ్యాసుని పూర్వ అవతారం)
మరీచిప్రముఖాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః
విదామ న వయం సర్వే యన్మాయాం మాయయావృతాః
వీరందరూ కూడా ఆయన మాయతో కప్పిబుచ్చబడి ఆయన మాయను తెలియలేకున్నాము. ఇది అలాంటి స్వామి యొక్క చక్రం. దీన్ని మేము కూడా సహించలేము.
తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహం హి నః
తమేవం శరణం యాహి హరిస్తే శం విధాస్యతి
ఎవరు ప్రయోగించారో ఆయనే కాపాడాలి. ఆయననే శరణు వేడు
తతో నిరాశో దుర్వాసాః పదం భగవతో యయౌ
వైకుణ్ఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాసః శ్రియా సహ
అక్కడ కూడా నిరాశ ఎదురు అవ్వడముతో పరమాత్మ వద్దకు వెళ్ళాడు. అమ్మవారితో కలిసి ఉన్న స్వామి ఉన్న వైకుంఠనగరానికి వెళ్ళాడు
సన్దహ్యమానోऽజితశస్త్రవహ్నినా తత్పాదమూలే పతితః సవేపథుః
ఆహాచ్యుతానన్త సదీప్సిత ప్రభో కృతాగసం మావహి విశ్వభావన
వణుకుతూ చక్రముతో తపిస్తూ స్వామి యొక్క పాదాల మీద పడ్డాడు. నేను తప్పు చేసాను నన్ను కాపాడు, అచ్యుతా అనంతా, మంచి వారిచేత కోరబడేవాడా
అజానతా తే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణామ్
విధేహి తస్యాపచితిం విధాతర్ముచ్యేత యన్నామ్న్యుదితే నారకోऽపి
నీ ప్రభావం తెలియక నీ మాయలో పడి నీ భక్తులకు అపరాధం చేసాను. ఏ పరమాత్మ యొక్క నామము ఉచ్చరిస్తే నరకం కూడా తొలగిపోతుందో ఆ చక్రం యొక్క తాపం తొలగించవలసింది
శ్రీభగవానువాచ
అహం భక్తపరాధీనో హ్యస్వతన్త్ర ఇవ ద్విజ
సాధుభిర్గ్రస్తహృదయో భక్తైర్భక్తజనప్రియః
నేను భక్త పరాధీనున్ని, నాకు స్వాతంత్ర్యం లేదు. స్వాత్ర్యం లేని వాని వలే భక్తుల అధీనున్ని. నా హృదయం నా దగ్గరలేదు. నేను భక్తుల ప్రియున్ని. వారు చెప్పినట్లే వింటాను
నాహమాత్మానమాశాసే మద్భక్తైః సాధుభిర్వినా
శ్రియం చాత్యన్తికీం బ్రహ్మన్యేషాం గతిరహం పరా
సాధువులైన నా భక్తులు లేకుండా నేను కూడా ఉండాలని అనుకోవడం లేదు.
ఎవరికి నేనే ఉత్తమ గతో అలాంటి వారు లేకుండా నేను నన్నూ కోరుకోనూ, నన్ను నేనే కాదు, అమ్మవారిని కూడా కావాలని కోరుకోను.
యే దారాగారపుత్రాప్త ప్రాణాన్విత్తమిమం పరమ్
హిత్వా మాం శరణం యాతాః కథం తాంస్త్యక్తుముత్సహే
భార్యా ఇలూ పుత్రులూ మిత్రులూ ప్రాణమూ ధనమూ అన్ని వదులుకొని నన్ను శరణు వేడారు. వారిని నేను ఎలా వదలను. ఇన్ని వదలి నన్ను చేరిన వారిని నేను ఎలా విడిచిపెడతాను,
మయి నిర్బద్ధహృదయాః సాధవః సమదర్శనాః
వశే కుర్వన్తి మాం భక్త్యా సత్స్త్రియః సత్పతిం యథా
వారు సమదర్శనులు. వారు నన్ను వైకుంఠములోనే ఉంటారు అని అనుకోరు. అంతటా నన్ను చూసే వారిని నేను వదిలిపెట్టను. అంతటా ఒకే తీరుగా ఉన్న నన్ను చూస్తారు. ఎలా ఐతే పతివ్రతలు భర్తను వశములో ఉంచుకుంటారో నాయందే హృదయం ఉంచిన వారు భక్తితో నన్ను వశం చేసుకుంటారు.
మత్సేవయా ప్రతీతం తే సాలోక్యాదిచతుష్టయమ్
నేచ్ఛన్తి సేవయా పూర్ణాః కుతోऽన్యత్కాలవిప్లుతమ్
సాలోక్యం సాయుజ్యం సామీప్యాదులు నేను ఇస్తానన్నా వారు తీసుకోరు. వారు మోక్షం కూడా వద్దంటారు. మోక్షములనే కోరని వారు కాలానికి నశించే సాంసారిక విషయాలను కోరతారా
సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహమ్
మదన్యత్తే న జానన్తి నాహం తేభ్యో మనాగపి
సాధువులు నా హృదయం, వారి హృదయం నేను. వారు నాకంటే వేరే దాన్ని తెలియరు, నాకు కూడా వారి కంటే వేరేది తెలియదు.
ఉపాయం కథయిష్యామి తవ విప్ర శృణుష్వ తత్
అయం హ్యాత్మాభిచారస్తే యతస్తం యాహి మా చిరమ్
సాధుషు ప్రహితం తేజః ప్రహర్తుః కురుతేऽశివమ్
నీవు కూడా నాకు ప్రీతి పాత్రుడవే కాబట్టి నిన్ను నేను రక్షించలేకున్నా నీకు నేను ఉపాయం చెబుతాను. నీవు అభిచార హోమం నీ మీదే చేసుకున్నావు. ఇది ఎవరి కోసం జరిగిందో అక్కడికి వెళ్ళు. సజ్జనుల మీద శక్తిని ప్రయోగిస్తే అది ప్రయోగించిన వారికే అపకారం చేస్తాయి.
తపో విద్యా చ విప్రాణాం నిఃశ్రేయసకరే ఉభే
తే ఏవ దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యథా
బ్రాహ్మణులకు తపస్సూ విద్యా మోక్షాన్ని ఇవ్వాలి, లోకానికి కళ్యాణం చేయాలి. అవే తపో విద్యలు అహంకారం కలవారికి అపకారం చేస్తాయి.
బ్రహ్మంస్తద్గచ్ఛ భద్రం తే నాభాగతనయం నృపమ్
క్షమాపయ మహాభాగం తతః శాన్తిర్భవిష్యతి
అక్కడికే వెళ్ళు, వెళ్ళి ఆయననే క్షమాపణ వేడుకో నీకు శాంతి కలుగుతుంది.

No comments:
Post a Comment