శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం
సూత ఉవాచ
మహీపతిస్త్వథ తత్కర్మ గర్హ్యం విచిన్తయన్నాత్మకృతం సుదుర్మనాః
అహో మయా నీచమనార్యవత్కృతం నిరాగసి బ్రహ్మణి గూఢతేజసి
నిందింపబడిన పని చేసిన రాజు చాల బాధపడ్డాడు. పరమ దుర్మార్గుడిలా ప్రవర్తించాడు. ఏ తప్పు చేయని నివురు గప్పిన నిప్పులాంటి తేజసు గల్గిన (గూఢతేజసి) బ్రాహ్మణుని విషయంలో తప్పు చేసాను
ధ్రువం తతో మే కృతదేవహేలనాద్దురత్యయం వ్యసనం నాతిదీర్ఘాత్
తదస్తు కామం హ్యఘనిష్కృతాయ మే యథా న కుర్యాం పునరేవమద్ధా
ఇది చేసినది బ్రాహ్మణునికే గాని నిజంగా చేసినది భగవత అపచారం. దీనికి తగిన ఫలితాన్ని నేను చాలా త్వరలోనే పొందుతాను. ఇది దాటలేని కష్టం (దురత్యయం వ్యసనం). నేను భయపడటంలేదు. అలాంటి కష్టం నాకు రావాలి ఆ పాపం పరిహారమవాలంటే (అఘనిష్కృతాయ). అది వస్తే మళ్ళీ ఇలాంటి పొరబాటు చేయకుండా ఉంటాను.
అద్యైవ రాజ్యం బలమృద్ధకోశం ప్రకోపితబ్రహ్మకులానలో మే
దహత్వభద్రస్య పునర్న మేऽభూత్పాపీయసీ ధీర్ద్విజదేవగోభ్యః
బ్రాహ్మణులకి గోవులకీ మళ్ళి అపకారంచేసే బుద్ధి మళ్ళీ నాకు కల్గకుండా, ధనం సైన్యం పరిపూర్ణంగా ఉన్న నా రాజ్యాన్ని కోపించబడిన బ్రాహ్మణ అగ్ని వచ్చి సమూలంగా దహింపచేయుగాక.
స చిన్తయన్నిత్థమథాశృణోద్యథా మునేః సుతోక్తో నిరృతిస్తక్షకాఖ్యః
స సాధు మేనే న చిరేణ తక్షకా నలం ప్రసక్తస్య విరక్తికారణమ్
ఋషి రాజు వద్దకు బాలురని పంపి వార్త తెలియచేసారు. బాగా చేసారు అన్నాడు (స సాధు మేనే). ఇంకోరకంగా కాకుండా మంచి శిక్ష వేసాడు, త్వర్లో విరక్తి కలిగే మార్గం చూపాడు తక్షకాగ్నిలో చేరే నాకు (తక్షకా నలం ప్రసక్తస్య )
అథో విహాయేమమముం చ లోకం విమర్శితౌ హేయతయా పురస్తాత్
కృష్ణాఙ్ఘ్రిసేవామధిమన్యమాన ఉపావిశత్ప్రాయమమర్త్యనద్యామ్
వెంటనే గంగా నదిలో ప్రాయోపవేశం చేసాడు. మనసుని శరీరాన్ని లోకాన్ని, జాగ్రత్తగా అలోచిస్తే ఇవన్ని పనికి రావు అని శరీరం ఉన్నంతవరకూ పరమాత్మ పాదాలని సేవించగలగాలని అనుకొని ప్రాయోపవేశం చేసాడు
యా వై లసచ్ఛ్రీతులసీవిమిశ్ర కృష్ణాఙ్ఘ్రిరేణ్వభ్యధికామ్బునేత్రీ
పునాతి లోకానుభయత్ర సేశాన్కస్తాం న సేవేత మరిష్యమాణః
తులసితో కలపబడిన పరమాత్మ పాదపద్మాల జలం బ్రహ్మరుద్రెంద్రులతో గూడి ఉన్న లోకాలను పావనం చేస్తుంది. మొదటినుండీ సేవిచకపోయినా చనిపోయేముందైనా సేవించకపోతే విరక్తి కలగపోతే ఇంకెందుకు అని
ఇతి వ్యవచ్ఛిద్య స పాణ్డవేయః ప్రాయోపవేశం ప్రతి విష్ణుపద్యామ్
దధౌ ముకున్దాఙ్ఘ్రిమనన్యభావో మునివ్రతో ముక్తసమస్తసఙ్గః
గంగా నదిలో ప్రాయోపవేశం చేయాలని నిర్ణయానికి వచ్చి మనసులో కృష్ణ పరమాత్మ పాదపద్మాలను ధరించి అన్నీ వదిలిపెట్టి ముని అయ్యాడు.
తత్రోపజగ్ముర్భువనం పునానా మహానుభావా మునయః సశిష్యాః
ప్రాయేణ తీర్థాభిగమాపదేశైః స్వయం హి తీర్థాని పునన్తి సన్తః
ఈ వార్త తెలుసుకొని సాయంకాలం కాకముందే అందరూ (యోగమార్గంలో) వచ్చారు. సత్పురుషులు తీర్థ యాత్రలనే మిషతోటి తీర్థాలను పవిత్రం చేస్తారు.
అత్రిర్వసిష్ఠశ్చ్యవనః శరద్వానరిష్టనేమిర్భృగురఙ్గిరాశ్చ
పరాశరో గాధిసుతోऽథ రామ ఉతథ్య ఇన్ద్రప్రమదేధ్మవాహౌ
మేధాతిథిర్దేవల ఆర్ష్టిషేణో భారద్వాజో గౌతమః పిప్పలాదః
మైత్రేయ ఔర్వః కవషః కుమ్భయోనిర్ద్వైపాయనో భగవాన్నారదశ్చ
అన్యే చ దేవర్షిబ్రహ్మర్షివర్యా రాజర్షివర్యా అరుణాదయశ్చ
నానార్షేయప్రవరాన్సమేతానభ్యర్చ్య రాజా శిరసా వవన్దే
శర్ద్వాన్ - కృపాచార్యులు, గాది సుత: - విశ్వామిత్రుడు
కుంభయోని - అగస్త్యుడు, నారదుడు
ఇలా వచ్చిన ఋషులందరికీ నమస్కరించాడు
సుఖోపవిష్టేష్వథ తేషు భూయః కృతప్రణామః స్వచికీర్షితం యత్
విజ్ఞాపయామాస వివిక్తచేతా ఉపస్థితోऽగ్రేऽభిగృహీతపాణిః
ముందు అందరికీ నమస్కారం చేసి, తాను ఏమి చేయాలనుకున్నాడో వివరించాడు
రాజోవాచ
అహో వయం ధన్యతమా నృపాణాం మహత్తమానుగ్రహణీయశీలాః
రాజ్ఞాం కులం బ్రాహ్మణపాదశౌచాద్దూరాద్విసృష్టం బత గర్హ్యకర్మ
మేము చాలా ధన్యులము (మా వంశం) మహానుభావుల అనుగ్రహానికి పాత్రులయ్యాము.
రాజ్యం బ్రాహ్మణ పాద తీర్థంతోటే చెడు పని చేయకుండా జాగ్రత్తగా ఉంటుందని శాస్త్రం.
తస్యైవ మేऽఘస్య పరావరేశో వ్యాసక్తచిత్తస్య గృహేష్వభీక్ష్ణమ్
నిర్వేదమూలో ద్విజశాపరూపో యత్ర ప్రసక్తో భయమాశు ధత్తే
ఆ మాట నావిషయంలో ఋజువైంది. నేను పాపం చేసాను. దానికి పరమాత్మ (పరావరేశో ) తగిన శిక్షవేసాడు. శంసారం మీద ఆసక్తితో ఉన్నాను (వ్యాసక్తచిత్తస్య గృహేష్వభీక్ష్ణమ్). బ్రాహ్మణ శాపమని ఒక మిష నా వైరాగ్యానికి మూలమయింది. ఎంత గొప్పవాడైన బ్రాహ్మణ శాపానికి భయపడతాడు (యత్ర ప్రసక్తో భయమాశు ధత్తే).
తం మోపయాతం ప్రతియన్తు విప్రా గఙ్గా చ దేవీ ధృతచిత్తమీశే
ద్విజోపసృష్టః కుహకస్తక్షకో వా దశత్వలం గాయత విష్ణుగాథాః
నా మనసును పరమాత్మ యందు లగ్నం చేసాను. ప్రాయోపవేశం చేయదలచాను. గంగతో కూడి మీరు కూడా ఆ సంకల్పానికి ఒప్పుకోవలసిది. తక్షకుడు ఏడో రోజు వచ్చి పరమాత్మ నామాన్ని గానం చేస్తున్న నన్ను కాటువేయని, కాల్చనీ.
పునశ్చ భూయాద్భగవత్యనన్తే రతిః ప్రసఙ్గశ్చ తదాశ్రయేషు
మహత్సు యాం యాముపయామి సృష్టిం మైత్ర్యస్తు సర్వత్ర నమో ద్విజేభ్యః
మళ్ళీ జన్మ ఉంటే పరమాత్మ యందు భక్తి కలగాలి, వారి భక్తులతో కలయిక ఉండాలి.
నేను ఏ ఏ జన్మలు ఎత్తుతానో ఆయా జన్మలలో మహానుభావులలో మహానుభావులతో పుట్టనీ. సకల జగత్తు మీదా మైత్రీ భావన ఉండనీ. బ్రాహ్మణోత్తములకు నమస్కారం చేస్తున్నాను
ఇతి స్మ రాజాధ్యవసాయయుక్తః ప్రాచీనమూలేషు కుశేషు ధీరః
ఉదఙ్ముఖో దక్షిణకూల ఆస్తే సముద్రపత్న్యాః స్వసుతన్యస్తభారః
తూర్పు దిక్కున దర్భ భాగం పరచి ఉత్తరముఖంగా కూర్చుని, కుమారుడైన జనమేజయుడిమీదా రాజ్యభారముంచాడు
ఏవం చ తస్మిన్నరదేవదేవే ప్రాయోపవిష్టే దివి దేవసఙ్ఘాః
ప్రశస్య భూమౌ వ్యకిరన్ప్రసూనైర్ముదా ముహుర్దున్దుభయశ్చ నేదుః
ఇలా చేస్తే, స్వర్గంలో ఉన్న దేవతలందరూ 'రాజంటే ఈయనే' అని పుష్పవృష్టి కురిపించి దివ్య దుందుభులను మ్రోగించారు
మహర్షయో వై సముపాగతా యే ప్రశస్య సాధ్విత్యనుమోదమానాః
ఊచుః ప్రజానుగ్రహశీలసారా యదుత్తమశ్లోకగుణాభిరూపమ్
మహర్షులందరూ ప్రశంసించారు, వారుకూడా పరమాత్మ గుణాలను కీర్తించాడానికి కావలసిన రీతిలో మాట్లాడారు.
న వా ఇదం రాజర్షివర్య చిత్రం భవత్సు కృష్ణం సమనువ్రతేషు
యేऽధ్యాసనం రాజకిరీటజుష్టం సద్యో జహుర్భగవత్పార్శ్వకామాః
మహారాజా, కృష్ణ పరమాత్మను ఆశ్రయించిన నీకు ఇలాంటి బుద్ధి రావడం, ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. ఎంతో మంది సామంతులు సేవిస్తున్న మహారాజ్యాన్ని తృణప్రాయంతో విడిచిపెట్టుట మీ వంశానికి వింతకాదు
సర్వే వయం తావదిహాస్మహేऽథ కలేవరం యావదసౌ విహాయ
లోకం పరం విరజస్కం విశోకం యాస్యత్యయం భాగవతప్రధానః
మేముకూడా చెబుతున్నాము. నీవు పరమపదం చేరే వరకూ మేమందరం ఇక్కడే ఉంటాము.
ఆశ్రుత్య తదృషిగణవచః పరీక్షిత్సమం మధుచ్యుద్గురు చావ్యలీకమ్
ఆభాషతైనానభినన్ద్య యుక్తాన్శుశ్రూషమాణశ్చరితాని విష్ణోః
మహానుభావుల మాటలు విని అభినందించి వారిని సేవిస్తూ, ఈ ఏడు రోజులూ పరమాత్మ గుణాలని గానం చేయండి.
సమాగతాః సర్వత ఏవ సర్వే వేదా యథా మూర్తిధరాస్త్రిపృష్ఠే
నేహాథ నాముత్ర చ కశ్చనార్థ ఋతే పరానుగ్రహమాత్మశీలమ్
వేదములు ఆకారం ధరించి స్వర్గంలో ఉన్నట్లుగా సకల ధర్మ శాస్త్రాలు రూపు దాల్చి ఇక్కడ ఉన్నట్లు మీరు ఉన్నారు. ఇక్కడ లేనిది ఇంకో చోట లేదు - ఇతరులననుగ్రహించడమే ప్రధాన స్వభాముగా గల మీవంటివారి సన్నిధి లభించడం.
తతశ్చ వః పృచ్ఛ్యమిమం విపృచ్ఛే విశ్రభ్య విప్రా ఇతి కృత్యతాయామ్
సర్వాత్మనా మ్రియమాణైశ్చ కృత్యం శుద్ధం చ తత్రామృశతాభియుక్తాః
నేను ఒక విషయం అడుగుతున్నాను,. మీరు విశ్రాంతి తీసుకుని నాకు కర్తవ్యం బోధించండి. మరణించే వాడు చేయవలసిన పని ఏమిటి
తత్రాభవద్భగవాన్వ్యాసపుత్రో యదృచ్ఛయా గామటమానోऽనపేక్షః
అలక్ష్యలిఙ్గో నిజలాభతుష్టో వృతశ్చ బాలైరవధూతవేషః
భగవత్సంకల్పం వల్ల సరిగా అదే సమయానికి అపేక్షలేకుండా దేశమంతా సంచరిస్తూ ఉన్న, ఇతను మహానుభావుడని మహర్షి అని గుర్తుపట్టలేని విధంగా ఉన్న, తననకు లభించిన వాటితో తృప్తిగా ఉండే, పిల్లలచేత పరివేష్టితమైన్ ఉన్న వ్యాస సూనుడు శుకయోగీంద్రుడు వేంచేశాడు.
తం ద్వ్యష్టవర్షం సుకుమారపాద కరోరుబాహ్వంసకపోలగాత్రమ్
చార్వాయతాక్షోన్నసతుల్యకర్ణ సుభ్ర్వాననం కమ్బుసుజాతకణ్ఠమ్
ఆయన వయసు రెండు ఎనిమిదులు (16). సుకుమారమైన శరీర భాగాలు కలిగి విశాల నేత్రాలు కంబుకణ్థము
నిగూఢజత్రుం పృథుతుఙ్గవక్షసమావర్తనాభిం వలివల్గూదరం చ
దిగమ్బరం వక్త్రవికీర్ణకేశం ప్రలమ్బబాహుం స్వమరోత్తమాభమ్
మెడ భుజాలలో కలిసి (నిగూఢజత్రుం ). విశాల వక్షస్థలం కలిగి, సుడులు తిరిగిన నాభి కలిగి, వస్త్రములు లేకుండా, కేశములు శరీరం మొత్తాన్ని అలుముకుని ఉండి, ఆజానుబాహుడు
శ్యామం సదాపీవ్యవయోऽఙ్గలక్ష్మ్యా స్త్రీణాం మనోజ్ఞం రుచిరస్మితేన
ప్రత్యుత్థితాస్తే మునయః స్వాసనేభ్యస్తల్లక్షణజ్ఞా అపి గూఢవర్చసమ్
శ్యామ సుందరుడు, స్త్రీల మనసులలో సుదరమైన చిరునవుతో అలజడి రేపిన వాడు.
ఆయనను చూచి మునులందరూ లేచారు
స విష్ణురాతోऽతిథయ ఆగతాయ తస్మై సపర్యాం శిరసాజహార
తతో నివృత్తా హ్యబుధాః స్త్రియోऽర్భకా మహాసనే సోపవివేశ పూజితః
వచ్చిన అతిధికి తలవంచి నమస్కరించి సకల మర్యాదలూ చేసాడు
అతను రాగానే అక్కడ ఉండదగని వారు లేచి వెళ్ళిపోయారు, జ్ఞ్యానంలేని వారు, మూర్ఖులు, పనికిరాకుండా ఉండే స్త్రీలు, పసిపాపలు వెళ్ళిపోయిన తరువాత శుకుడు ఉన్నతాసనం మీద కూర్చున్నాడు
స సంవృతస్తత్ర మహాన్మహీయసాం బ్రహ్మర్షిరాజర్షిదేవర్షిసఙ్ఘైః
వ్యరోచతాలం భగవాన్యథేన్దుర్గ్రహర్క్షతారానికరైః పరీతః
బ్రహ్మఋషులు రాజఋషులు దేవఋషులతో గ్రహములతో తారలతో కూడిన చంద్రుడిలాగ ప్రకాశించాడు
ప్రశాన్తమాసీనమకుణ్ఠమేధసం మునిం నృపో భాగవతోऽభ్యుపేత్య
ప్రణమ్య మూర్ధ్నావహితః కృతాఞ్జలిర్నత్వా గిరా సూనృతయాన్వపృచ్ఛత్
ప్రాశంతంగా కూర్చుని ఉన్నాడు. ఏ పొరబాటునీ చేయని బుద్ధి కలవాడు. ఒక సారి సాష్టాంగ దండ ప్రమాణం చేసి, చేతులు జోడించి మళ్ళి నమస్కారం చేసి, వినగానే మనసుకు అహ్లాదం చేసే సత్యమైన మాటతో అడిగాడు
పరీక్షిదువాచ
అహో అద్య వయం బ్రహ్మన్సత్సేవ్యాః క్షత్రబన్ధవః
కృపయాతిథిరూపేణ భవద్భిస్తీర్థకాః కృతాః
మేము క్షత్రియ అధములము అనుకుంటున్నాము. కాని ఇప్పుడు మంచి వారిని సేవించగలిగినవారము మేము. నీలాంటి వారు అతిథిగా వచ్చారు అంటే మమ్మల్ని చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటారు
యేషాం సంస్మరణాత్పుంసాం సద్యః శుద్ధ్యన్తి వై గృహాః
కిం పునర్దర్శనస్పర్శ పాదశౌచాసనాదిభిః
మీలంటివారి నామం తల్చుకుంటే మా సంసారములన్ని పరిశుద్దమవుతాయి. అలాంటి మిమ్ములని చూచి స్పృశించి పాదాలు కడిగి మాట్లాడుతున్నామంటే మీ అనుగ్రహమే.
సాన్నిధ్యాత్తే మహాయోగిన్పాతకాని మహాన్త్యపి
సద్యో నశ్యన్తి వై పుంసాం విష్ణోరివ సురేతరాః
విష్ణుభగవానున్ని చూచి రాక్షసులు పారిపోయినట్లుగా మీ లాంటివారిని చూస్తే మా పాపాలు పారిపోతాయి
అపి మే భగవాన్ప్రీతః కృష్ణః పాణ్డుసుతప్రియః
పైతృష్వసేయప్రీత్యర్థం తద్గోత్రస్యాత్తబాన్ధవః
పాండవులంటే ప్రీతి గలిగి ఉన్న కృష్ణ భగవానుడు మా విషయంలో ప్రేమగలిగి ఉన్నట్లు అయితే,
అన్యథా తేऽవ్యక్తగతేర్దర్శనం నః కథం నృణామ్
నితరాం మ్రియమాణానాం సంసిద్ధస్య వనీయసః
కృష్ణ పరమాత్మ అనుగ్రహం ప్రీతి నామీద ప్రసరించింది. దానికి నిదర్శనం మీ దర్శనం.
అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుమ్
పురుషస్యేహ యత్కార్యం మ్రియమాణస్య సర్వథా
యచ్ఛ్రోతవ్యమథో జప్యం యత్కర్తవ్యం నృభిః ప్రభో
స్మర్తవ్యం భజనీయం వా బ్రూహి యద్వా విపర్యయమ్
సాక్షాత్ పరమయోగులు మీరే వేంచేసారు కాబట్టి మిమ్మల్నే అడుగుతున్నను. మరణించబోయే వాడు చేయవలసినది ఏమిటి, ఏమి వినాలి, దేన్ని జపించాలి, దేన్ని చేయాలి, దేన్ని స్మరించాలి, దేన్ని సేవించాలో చెప్పండి. ఇలా కాకుంటే విపర్యయంగా అయినా (ఏది చేయకూడదో అది చెప్పండి)
నూనం భగవతో బ్రహ్మన్గృహేషు గృహమేధినామ్
న లక్ష్యతే హ్యవస్థానమపి గోదోహనం క్వచిత్
గోవునుంచి పాలుపిండుతుంటే ఆ పాలు నేల మీద పడేలోపు మీరు ఆ చోటు విడిచి వెళ్ళిపోతారు. నేను అడిగిన రెండిటిలో ఏది తొందరగా చెప్పగలిగితే అది చెప్పండి.
సూత ఉవాచ
ఏవమాభాషితః పృష్టః స రాజ్ఞా శ్లక్ష్ణయా గిరా
ప్రత్యభాషత ధర్మజ్ఞో భగవాన్బాదరాయణిః
ఇలా వినయంతో (శ్లక్ష్ణయా ) కూడిన మాటను విని శుకుడు ఈ విధంగా బదులు పలికాడు
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

No comments:
Post a Comment