Saturday, December 1, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేడవ అధ్యాయం


పరీక్షిన్మహారాజు విజయ యాత్రల కోసమని బయలు దేరి మార్గమధ్యంలో - భూమి ధర్మం. గోరూపంలో, వృష రూపం. వారిద్దరినీ దూరం నుంచి తన్న బోతున్నటువంటి విషయాన్ని చూచి, ఎవరు ఈ పని చేస్తున్నారు. అర్జనుని యొక్క కౌరవ వంశంలో ఉన్నవారి పరిపాలనలో ఇలా జరగడానికి వీలు లేదు . ఎవరిలా చేశారు

 సూత ఉవాచ
తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్
దణ్డహస్తం చ వృషలం దదృశే నృపలాఞ్ఛనమ్

అప్పుడు పరీక్షిత్తు ఒక శూద్రుడు రాజు వేషం ధరించి గోవునీ వృషభాన్ని కొట్టడం చూచాడు

వృషం మృణాలధవలం మేహన్తమివ బిభ్యతమ్
వేపమానం పదైకేన సీదన్తం శూద్రతాడితమ్

వృషభం తెల్ల తామర పూవులా ఉంది, తనను కొడుతున్న శూద్రుడు మీద భయపడుతూ ఒక కాలి మీద నిలబడి వణుకుతూ మూత్రం పోసింది

గాం చ ధర్మదుఘాం దీనాం భృశం శూద్రపదాహతామ్
వివత్సామాశ్రువదనాం క్షామాం యవసమిచ్ఛతీమ్

ఆ శూద్రునిచే కొట్ట్బడిన గోవు కళ్ళనీళ్ళతో బలహీనముగా ఉంది

పప్రచ్ఛ రథమారూఢః కార్తస్వరపరిచ్ఛదమ్
మేఘగమ్భీరయా వాచా సమారోపితకార్ముకః

రథాన్ని అధిరోహించిన పరీక్షిత్తు గంభీరస్వనంతో ఇలా అన్నాడు

కస్త్వం మచ్ఛరణే లోకే బలాద్ధంస్యబలాన్బలీ
నరదేవోऽసి వేషేణ నటవత్కర్మణాద్విజః

ఎవరు నీవు నా రాజ్యంలో నా రక్షణలో అబలులని హింసిస్తున్నావు. రాజు వేషం వేసుకుని బ్రాహ్మణులకు వ్యతిరేకమైన పని చేస్తున్నావు

యస్త్వం కృష్ణే గతే దూరం సహగాణ్డీవధన్వనా
శోచ్యోऽస్యశోచ్యాన్రహసి ప్రహరన్వధమర్హసి

కృష్ణార్జనులు లేరని నీవు గోవుని హింసిస్తున్నావు. నీవు వధార్హుడివి.

త్వం వా మృణాలధవలః పాదైర్న్యూనః పదా చరన్
వృషరూపేణ కిం కశ్చిద్దేవో నః పరిఖేదయన్

నీవు నిజముగా వృషబానివేనా లేక దేవతవా. నీవు మూడు కాళ్ళు పోగొట్టుకుని ఒక కాలితో ఉన్నావు. వృషబ రూపంలో బాధపడుతున్న దేవతవా నీవు

న జాతు కౌరవేన్ద్రాణాం దోర్దణ్డపరిరమ్భితే
భూతలేऽనుపతన్త్యస్మిన్వినా తే ప్రాణినాం శుచః

నీవు తప్ప ఇంతవరకూ ఈ కురు సామ్రాజ్యంలో ఎవరూ ఇలా ధు:కించలేదు

మా సౌరభేయాత్ర శుచో వ్యేతు తే వృషలాద్భయమ్
మా రోదీరమ్బ భద్రం తే ఖలానాం మయి శాస్తరి

సురభి పుత్రుడా.ఇక నీవు దుఖించవలదు. ఈ దుర్మార్గుడికి ఇక నీవు భయపడవలదు. ధేనువా నేను రాజుగా ఉన్నంతవరకూ నీవు ధుకించడానికి కారణం ఉండకూడదు

యస్య రాష్ట్రే ప్రజాః సర్వాస్త్రస్యన్తే సాధ్వ్యసాధుభిః
తస్య మత్తస్య నశ్యన్తి కీర్తిరాయుర్భగో గతిః
ఏష రాజ్ఞాం పరో ధర్మో హ్యార్తానామార్తినిగ్రహః
అత ఏనం వధిష్యామి భూతద్రుహమసత్తమమ్

దుర్మార్గుల వలన ప్రజలు భయపడుతూ ఉంటే ఆ రాజు పేరు ఆయువు పోతుంది. అలాంటి స్థితికి కారణమైన వాడిని చంపి తీరాలి

కోऽవృశ్చత్తవ పాదాంస్త్రీన్సౌరభేయ చతుష్పద
మా భూవంస్త్వాదృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినామ్

ఎవరు నీ మూడు పాదాలు పోవడానికి కారణం. కృష్ణాను వర్తుడైన రాజు పరిపాలించే ఈ రాజ్యంలో నీలా బాధపడే వారు ఎవరూ లేరు.

ఆఖ్యాహి వృష భద్రం వః సాధూనామకృతాగసామ్
ఆత్మవైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణమ్

నీకు భద్రమవుగాక. రాజుయొక్క కీర్తిని తగ్గించే ఈ పని చేసింది ఎవరు

జనేऽనాగస్యఘం యుఞ్జన్సర్వతోऽస్య చ మద్భయమ్
సాధూనాం భద్రమేవ స్యాదసాధుదమనే కృతే

ఎవరైతే అమాయకులను హింసిస్తారో వారు నా వల్ల భయము పొందుతారు. ఇలాంటి వారిని దండించుట వలన మంగళమే జరుగుతుంది.

అనాగఃస్విహ భూతేషు య ఆగస్కృన్నిరఙ్కుశః
ఆహర్తాస్మి భుజం సాక్షాదమర్త్యస్యాపి సాఙ్గదమ్

అలాంటి వారు ఏ ఆయుధం ధరించిన వారు స్వర్గంలో ఉన్నా ఇటువంటి పనులు చేసేవారిని నేను ఏరిపారేస్తాను

రాజ్ఞో హి పరమో ధర్మః స్వధర్మస్థానుపాలనమ్
శాసతోऽన్యాన్యథాశాస్త్రమనాపద్యుత్పథానిహ

ధర్మమాచరించే వారిని కాపాడుట అధర్మాత్ములని శాస్త్రాలను పాటించనివారిని శిక్షించుట రాజు యొక్క పరమ ధర్మం

రాజోవాచ
న తే గుడాకేశయశోధరాణాం బద్ధాఞ్జలేర్వై భయమస్తి కిఞ్చిత్
న వర్తితవ్యం భవతా కథఞ్చన క్షేత్రే మదీయే త్వమధర్మబన్ధుః

న వర్తితవ్యం తదధర్మబన్ధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే
బ్రహ్మావర్తే యత్ర యజన్తి యజ్ఞైర్యజ్ఞేశ్వరం యజ్ఞవితానవిజ్ఞాః

యజ్ఞ్యములు ధర్మములు ఇలాంటివాటిని ఆచరించే ఈ బ్రహ్మావర్తంలో ఈ అధరమాన్ని చేస్తున్నది ఎవరు
అప్పుడు ధర్మం ఇలా చెబుతుంది

ఏతద్వః పాణ్డవేయానాం యుక్తమార్తాభయం వచః
యేషాం గుణగణైః కృష్ణో దౌత్యాదౌ భగవాన్కృతః
పాండవ వంశంలో ఆర్తులకు  అభయమిచ్చే ఈ మాట నీకు యోగయమైనది
ఇంతటి ఉత్తమ గుణాలు కలవారగుటచే పరమాత్మ మీకు దౌత్యము సారధ్యము ఇలా అన్ని రకములా మిమ్ములని వెంట వుండి పరిపాలించారు. స్వామి స్వయం గా ఇలా ప్రవర్తించడాన్నిబట్టి మీ ఉత్తమ గుణాలు చెప్పకనే చెప్పబడుతోంది

న వయం క్లేశబీజాని యతః స్యుః పురుషర్షభ
పురుషం తం విజానీమో వాక్యభేదవిమోహితాః

ధర్మం కాబట్టి చాలా ధర్మ బద్ధంగా చెబుతోంది. ఎవరు మీకు ఇలాంటి అవస్థ కలిగించారని మీరు అడిగారు కానీ, ఒక్క మాకే కాదు ఈ ప్రకృతిలోనే సుఖాలకు గాని కష్టములకి కాని వాటిని కలిగించే కర్మలకు గాని కారణం ఇది అని చెప్పలేమి ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఈ పని ఎందుకు జరింగింది అంటే వందమంది వంద కారణాలు చెబుతారు.  కనుక మాకు కలిగిన దానికి ఇదీ కారణం అని చెప్పలేము

కేచిద్వికల్పవసనా ఆహురాత్మానమాత్మనః
దైవమన్యేऽపరే కర్మ స్వభావమపరే ప్రభుమ్

కొందరు జ్ఞ్యానులు ఆత్మే అన్నిటికీ కారణం అన్నారు కొందరు మనసే కారణం అన్నారు కొందరు దైవం కారణమని కొందరు స్వభావం కారణం అని అన్నారు (మీమాన్స - కర్మే కారణమని, తర్కం ఆత్మే కారణమని వైషేషికం సంకల్పం కారణం అని వేదాంతం సంస్కారం కారణమని ) .

అప్రతర్క్యాదనిర్దేశ్యాదితి కేష్వపి నిశ్చయః
అత్రానురూపం రాజర్షే విమృశ స్వమనీషయా

మరి కొందరు (అప్రతర్క్యాద) దీనివల్లనే జరుగుతుంది అని మనం ఊహించలేము కాబట్టి ఏమి కారణమో చెప్పలేమంటారు. ఇంకొందరు మనం ఊహించగలిగినా ఊహించినది ఇదే అని వేలుబట్టి చూపలేము (అనిర్దేశ్యాదితి ).
ఇన్ని కారణాలున్నాయి. నీవు నీ బుద్దితో ఏమి కారణమో తెలుసుకో
సూత ఉవాచ
ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాడ్ద్విజసత్తమాః
సమాహితేన మనసా విఖేదః పర్యచష్ట తమ్

సావధానమైన చిత్తంతో రాజు ఇలా అన్నాడు

రాజోవాచ
ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మోऽసి వృషరూపధృక్
యదధర్మకృతః స్థానం సూచకస్యాపి తద్భవేత్

నీవు ధర్మానివే ఎందుకంటే - బాధ పడుతూ , నిన్ను ఇంత వేదనకు గురిచేసిన్ వాడిని శిక్షిస్తానని అన్నప్పుడు , 'దీని వల్ల కారణమని చెప్పలేను అన్నావు" వృషరూపంలో ఉన్న నీవు ధర్మానివే
ఫలానావాడు నాకు ఈఎ అపకారం చేసాడని నీవెందుకు చెప్పలేకపోతున్నావో నేను ఊహించగలను. వీడు అధర్మం చేసాడని సూచించిన వాడికి కూడా అధర్మ దోషం వస్తుంది.
అందుకే చేతనైతే ఎదుటివాడిన్ స్తోత్రం చేయమని ధర్మ శాస్త్రం. అందువల్ల ఆ మహాత్ములు ఆచరించిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది. పొరబాటున కూడా నిందించకు విమర్శించకు. చేసిన తప్పుకు గాని చేయని తప్పుకు గాని నిందించితే అకారణంగా ఆ తప్పులోని భాగం నీకు కూడా వస్తుంది . ఈ సంగతి ధర్మానికి తెలుసు కాబట్టి నీవు ధర్మానివే

అథవా దేవమాయాయా నూనం గతిరగోచరా
చేతసో వచసశ్చాపి భూతానామితి నిశ్చయః

ప్రపంచంలో కలిగే ప్రతీ మార్పూ పరమాత్మ సంకల్పంతో జరుగుతాయి. భగవత్సంకల్పానికి మనం కారణం చెప్పలేము. దేవ మాయ ప్రవృత్తి ఇలా ఉంటుంది అని ఎవరికీ తెలీదు. ఎవరి మనసు ఎలా ఉంటుందో మాట ఎలా ఉంటుందో. వారి మనసు ఎందుకిలా అయింద్ వారు ఎందుకిలా మాట్లాడారని ఎవరు చెప్పగలరు

తపః శౌచం దయా సత్యమితి పాదాః కృతే కృతాః
అధర్మాంశైస్త్రయో భగ్నాః స్మయసఙ్గమదైస్తవ

కృత యుగంలో నీకు తపః శౌచం దయా సత్య అని నాలుగు పాదాలు. ఈ కలియుగం లో మూడు పోయాయి.
స్మయ సఙ్గం మదైస్తవ  - గర్వం ఆసక్తి మదం అనే మూటి చేత తపసు శౌచం దయ పోయాయి.
గర్వం వల్ల తపసు. ఆసక్తి వల్ల శౌచం మదం వల్ల దయ  పోయాయి. ఇపుడు సత్యం మాత్రమే ఉన్నది

ఇదానీం ధర్మ పాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః
తం జిఘృక్షత్యధర్మోऽయమనృతేనైధితః కలిః

అందులో కలికి పనికి రానిదే ఈ సత్యం. అసత్యంతో బాగా పెరిగిన కలి (అనృతేన ఏధితః కలిః) ఈ సత్యాన్ని కూడా తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు (తం జిఘృక్షత్)

ఇయం చ భూమిర్భగవతా న్యాసితోరుభరా సతీ
శ్రీమద్భిస్తత్పదన్యాసైః సర్వతః కృతకౌతుకా

ఈ గోవు ఉన్నదే అదే భూమి.  పరమత్మ అవతరించి (భగవతా న్యాసితోరుభరా) ఈమే భారాన్నంతా తొలగించాడు. పరమాత్మ పాద ముద్రలటొ పులకించబడిన శరీరం కల ఈ భూమి

శోచత్యశ్రుకలా సాధ్వీ దుర్భగేవోజ్ఝితా సతీ
అబ్రహ్మణ్యా నృపవ్యాజాః శూద్రా భోక్ష్యన్తి మామితి

పరమాత్మచేత విడువబడిన ఈ భూమి దౌర్భాగ్యురాలు లాగ అదృష్టహీనురాలులాగ దు:ఖిస్తోంది. బ్రాహ్మణ భక్తిలేని రాజులాంటి శూద్రులు నన్ను అనుభవించడానికి చూస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రాహ్మణులనీ వేదం అని కూఒడా అర్థం.

ఇతి ధర్మం మహీం చైవ సాన్త్వయిత్వా మహారథః
నిశాతమాదదే ఖడ్గం కలయేऽధర్మహేతవే

ఇలా ఇద్దరినీ ఓదార్చి అధర్మం ఆచరించినందుకు కలిని సమ్హరించడానికి ఖడ్గం స్వీకరించాడు

తం జిఘాంసుమభిప్రేత్య విహాయ నృపలాఞ్ఛనమ్
తత్పాదమూలం శిరసా సమగాద్భయవిహ్వలః

నృపలాఞ్ఛనమ్ విహాయ  -అపుడు కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. అతని పాదమూలాన్ని ఆశ్రయించాడు (తత్పాదమూలం ).

పతితం పాదయోర్వీరః కృపయా దీనవత్సలః
శరణ్యో నావధీచ్ఛ్లోక్య ఆహ చేదం హసన్నివ

దీనవత్సలుడు కాబట్టి శరణ్యుడు కాబట్టి అతన్ని చంపకుండా

రాజోవాచ
న తే గుడాకేశయశోధరాణాం బద్ధాఞ్జలేర్వై భయమస్తి కిఞ్చిత్
న వర్తితవ్యం భవతా కథఞ్చన క్షేత్రే మదీయే త్వమధర్మబన్ధుః

గుడాకేశయశోధరాణాం - అర్జనుని కీర్తిని మోస్తున్న వాళ్ళం (గుడాక అంటే నిద్ర . నిద్రకు అధిపతి. గుడాక అంటే స్మృతి అని కూడా అర్థం. మానవులు జరిగిన దాన్ని ఒక పట్టాన మర్చిపోలేరు. చెడును ఎక్కువ గుర్తు ఉంచుకుని మంచిని మర్చిపోతాం. ఏది తల్చుకుంటే కష్టం కలిగిస్తుందో దన్ని మర్చిపోము).
ఇలాంటి మమ్ములను చేతులు జోడించి శరణు వేడిన వారికి ఎక్కడినుంచీ భయం ఉండదు.
అధర్మ బంధువైన నీవు నారాజ్యం లో ఉండొద్దు,

త్వాం వర్తమానం నరదేవదేహేష్వనుప్రవృత్తోऽయమధర్మపూగః
లోభోऽనృతం చౌర్యమనార్యమంహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దమ్భః

నీవు రాజులలోనే వచ్చి చేరుతున్నావు. పరిపాలకుడు అధర్మాత్ముడైతే ప్రపంచం మొత్తం అధర్మం అవుతుంది. లోభోऽనృతం చౌర్యమనార్యమంహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దమ్భః - ఇవన్నీ అధర్మ లక్షణాలు
కలి ఉన్నట్లు మొదటి గుర్తు లోభం. అంతా నాకే కావాలి అనే గుణం. లోభి ధనం మీద ఆశతో భారయతో కాపురం కూడా చెయ్యడు. పొరబాటున కొడుకు పుడితే ఆస్తిని గుంజుకుంటాడని. కలి ప్రధమ లక్షణం లోభం. లోభాన్ని పోషించుకోవడానికి అబద్దం, చౌర్యం, అనార్యం (దుర్జనత), అమ్హ (పాపం), మాయ (మోసం), కలహం, ధంభం (ఇంద్రియాలను మూసుకుని మనసుతో ఇంద్రియ విషయాలని ఆలోచిస్తూ ఉండటం ధంభం)

న వర్తితవ్యం తదధర్మబన్ధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే
బ్రహ్మావర్తే యత్ర యజన్తి యజ్ఞైర్యజ్ఞేశ్వరం యజ్ఞవితానవిజ్ఞాః

నా రాజ్యం లో ధర్మ సత్యములతోటే మీరు ప్రవర్తించాలి.
ఇది బ్రహ్మావర్తం. ఇక్కడ మహాత్ములందరు యజ్ఞ్యములతో యజ్ఞ్యపురుషున్ని ఆరాధిస్తారు

యస్మిన్హరిర్భగవానిజ్యమాన ఇజ్యాత్మమూర్తిర్యజతాం శం తనోతి
కామానమోఘాన్స్థిరజఙ్గమానామన్తర్బహిర్వాయురివైష ఆత్మా

ఈ ఆర్యావరతంలో మహానుభావులు యజ్ఞ్యములతో పరమాత్మను ఆరాధిస్తుంటే ఆయాన మంగళములను కలిగిస్తున్నాడు (శం తనోతి). కేవలం మంగళములనే కాదు కోరిన కోరికరలను అందిస్తున్నడు ఎందుకంటే ఈయనే మనలోపలా బయటా ఉన్నాడు కాబట్టి. (అమోఘాన్, స్థిర జంగమానా ). ఎలా ఐతే వాయువు లోపలా బయటా సంచరిస్తో అలాంటివాడివి నీవు
ప్రాణములేని వాటికి కూడా కోరికలు ఉంటాయి. కదలిక లేనంతా మాత్రాన జీవాత్మలేనట్లు కాదు.
పెద్దపులి గాని చిన్న పులి గాని తాను తినవలసిన జంతువు ఎదురుగా ఉంటే దాని ఎదురుగా ఉంటుంది కదలకుండా. ఎంత సేపంటే ఆ జంతువుకి ఇది ప్రాణం లేని జంతువు అని నమ్మకం కుదిరేదాక. అది ముందుకు అడుగేయగానే పులి దాని మీద పడుతుంది. ఎదుటివాన్ని తన వశం చేసుకోవడానికి తనలో ఉన్న చైతన్యాన్ని చలనాన్ని ప్రణాన్ని మరుగు పరిచి స్థావరంలాగ ఉన్న జీవులు తరువాతి జన్మలో స్థావరం గానే పుడతారు. చలనం లేని వాటికి కోరికలుండవని స్థావరములకు ఆశలుండవని అనుకోవధ్ధు. అత్రిమహర్షి ఆశ్రమానికి కొంచెం దూరం ఉండగా రాముడు చెమట పడుతున్నదని ఒక రాతిమీద కూర్చుంటాడు. లక్ష్మణుడికి ఒక అనుమానం వచ్చి 'అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడికి 10 నిముషాలే దూరం ఉంది. ఈ మాత్రానికి ఇక్కడికెందుకు కూర్చున్నారూ అని అడుగగా. 'మనం చిత్రకూటంలో ఉండగా మరీచుడు లేడి రూపంలో వచ్చాడు (రావణుడు పంపగా). నేను బాణం తీయగానే పారిపోయాడు. పారిపోతూ అలసి ఈ రాయిమీద విశ్రమించాడు. ఇక్కడ నేను కూర్చుంటే నేను వాడి దగ్గరకు వస్తున్నట్లు వాడికి సమాచరమొచ్చి తపస్సు కొంచెం పెంచుతాడు. ఈ శిల అయోధ్యా నగరంలో నా అంతపురంలో మణిమయ మండపాన్ని నిర్మించింది ఈ శిల్పియే. వాడికి మోక్షం ఇవ్వడానికి, మరీచుడికి సంకేతం ఇవ్వడానికీ ఇక్కడ కూర్చున్నా' అని అన్నాడు.

సూత ఉవాచ
పరీక్షితైవమాదిష్టః స కలిర్జాతవేపథుః
తముద్యతాసిమాహేదం దణ్డపాణిమివోద్యతమ్

ఇలా కలిపురుషున్ని శాసించేసరికి

కలిరువాచ
యత్ర క్వ వాథ వత్స్యామి సార్వభౌమ తవాజ్ఞయా
లక్షయే తత్ర తత్రాపి త్వామాత్తేషుశరాసనమ్
తన్మే ధర్మభృతాం శ్రేష్ఠ స్థానం నిర్దేష్టుమర్హసి
యత్రైవ నియతో వత్స్య ఆతిష్ఠంస్తేऽనుశాసనమ్

నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. ఉన్నా నేను ఇలాంటి దౌర్జన్య ప్రవృత్తి కలిగి ఉండను. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా దనుర్బాణాలను పట్టుకుని నీవే కనపడుతున్నావు.
నేను ఎక్కడ ఉండాలో నీవే చెప్పు. నీవు చెప్పిన చోట నీవు చెప్పిన ఆజ్ఞ్యను పరిపాలిస్తూనే ఉంటాను.

సూత ఉవాచ
అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ
ద్యూతం పానం స్త్రియః సూనా యత్రాధర్మశ్చతుర్విధః

నాలుగు చోట్లు ఇచ్చారు 1. జూతం 2. మద్యపానం 3. స్త్రీలు 4. పశు హింసలు. ఎవరికీ పనికి రాని పశువులని చంపేవారు ఉంటారు కొందరు.

పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ప్రభుః
తతోऽనృతం మదం కామం రజో వైరం చ పఞ్చమమ్

ఇంకా మళ్ళి అడగగా జాతరూపమదాత్ప్రభుః - బంగారం రూపంలో ఉండూ అన్నాడు.
అబద్దం మదం కోరిక రజో గుణం వైరం . మొత్తం కలిపి పది.

అమూని పఞ్చ స్థానాని హ్యధర్మప్రభవః కలిః
ఔత్తరేయేణ దత్తాని న్యవసత్తన్నిదేశకృత్

ఇలా పది స్థానాల్లో కలి పరీక్షిత్తు ఇచ్చిన ఈ ప్రదేశాల్లో నివసించాడు

అథైతాని న సేవేత బుభూషుః పురుషః క్వచిత్
విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురుః

జ్ఞ్యానం కావలనుకున్నవాడెవ్వడు వీటిని సేవించకూడదు
1. జ్యూదం  2. పానం 3. స్త్రీ 4. పశు హింస 5. బంగారం 6. అబద్దం 7. మదం 8 కోరిక 9. రజో గుణం 10. వైరం.
సామాన్యులు సేవించడం కన్నా రాజు సేవించడం వలన ప్రమాదం ఎక్కువ 

వృషస్య నష్టాంస్త్రీన్పాదాన్తపః శౌచం దయామితి
ప్రతిసన్దధ ఆశ్వాస్య మహీం చ సమవర్ధయత్

ఇలా కలిపురుషున్ని శాసించి అతన్ని వెళ్ళగొట్టి ధర్మ దేవతకు దానం తపం శౌచం అనే పాదాలు సంధింపజేసాడు. భూమిని కూడా ఓదార్చి పెంపొందింపచేసాడు (సమవర్ధయత్)

స ఏష ఏతర్హ్యధ్యాస్త ఆసనం పార్థివోచితమ్
పితామహేనోపన్యస్తం రాజ్ఞారణ్యం వివిక్షతా

అలాంటి వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు పరిపాలన చేస్తున్నాడు.

ఆస్తేऽధునా స రాజర్షిః కౌరవేన్ద్రశ్రియోల్లసన్
గజాహ్వయే మహాభాగశ్చక్రవర్తీ బృహచ్ఛ్రవాః

ఇప్పటికీ ఆయన కౌరవేంద్ర శ్రీ ని, రాజ్యాన్ని గొప్ప కీర్తిని ధరించి అనుభవిస్తున్నాడు.

ఇత్థమ్భూతానుభావోऽయమభిమన్యుసుతో నృపః
యస్య పాలయతః క్షౌణీం యూయం సత్రాయ దీక్షితాః

ఆయన ధర్మముగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు కాబట్టే మనం ధరియంతో వేయి సంవత్స్రాలు గల సత్రాన్ని చేస్తున్నాము

No comments:

Post a Comment