శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ప్రథమ అధ్యాయం
ఉపోధ్ఘాతం
శ్రీమద్భాగవతంలో అతి ముఖ్యమైనది విదుర మైత్రేయ సంవాదం. తృతీయ పంచమ ఏకాదశ స్కంధాలు ముఖ్యమైనవి. పంచమ స్కంధంలో ఉన్నదంతా భూగోళం గురించి. అదంతా పరమాత్మ స్థూల రూపం. కృష్ణోద్ధవ సంవాదంలో చాలా ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. అది అంతా పూర్తి తత్వం. ఉపాసన అంటే ఏంటి, యోగం అంటే యేంటి సాఖ్యం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి. వీటి వికాస రూపం ఏంటి సంకోచ రూపం ఏమిటి. భక్తి జ్ఞ్యానాల సమన్వయం ఎలా చేయాలి. విధుర మైత్రేయ సంవాదం, కృష్ణ ఉద్ధవ సంవాదం చాలా ముఖ్యమైనవి. ప్రధమ స్కంధం పాదములైతే, ద్వితీయ స్కంధం జానువులైతే, తృతీయ స్కంధం ఊరువులు.
పరమాత్మ యందు భక్తి కలగాలంటే జగత్తు మీద విరక్తి కలగాలి. అందుకు జగత్తు యొక్క పరమాత్మ యొక్క నిజస్వరూపం తెలియాలి. మన శరీరంలో ఊరువులను జ్ఞ్యానంతోనూ, నడుమును వైరాగ్యంతోనూ, స్తనములను భక్తితోనూ పోలుస్తారు. మనకు బుద్ధియోగం ఇచ్చేది భగవానుడే. అందుకే అందులో మొదటి శ్లోకం అదే సూచిస్తుంది.
శ్రీశుక ఉవాచ
ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్కిల
క్షత్త్రా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమత్
వనమునకు ప్రవేశించిన విదురుడు ప్రశ్నించినపుడు మైత్రేయుడు ఏమి చెప్పాడు. సకల ఐశ్వర్యంతో కూడిన తన ఇంటిని విడిచిపెట్టి
యద్వా అయం మన్త్రకృద్వో భగవానఖిలేశ్వరః
పౌరవేన్ద్రగృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతమ్
కౌరవులకు మంత్రిగా ఉన్న విదురుడు (హస్తిన నుంచి లక్క ఇంటికి వెళ్ళేలోపు మూడు సార్లు పాండవులపై హత్యా యత్నం జరిగింది. బిదికృత్ అనే రాక్షసుడు ఒకసారి, కల్పించబడిన దావాగ్నితో ఒక సారి, విషప్రయోగంతో ఒకసారి. ఈ మూడు ప్రయత్నాలను విధురుడు వారించాడు. తద్వారా కౌరవులకు నరకం రాకుండా చేసాడు. యుద్ధంలో మరణిస్తే పాపం పోతుంది. ఇలాంటి పని చేయడంవలన పాపం వస్తుంది. దారిలో ప్రయత్నం చేయొద్దని వారించాడు. పాండవులు ఒక స్థానం ఏర్పరుచుకునే వరకూ వారినేమీ చేయొద్దని చెప్పాడు. అలాగే ధర్మరాజు హస్తిన నుంచి వెళ్ళేప్పుడు ఒక చిన్న ఎలుకని ఇస్తాడు. ధర్మరాజదులు లక్క ఇంటిలోకి వెళ్ళినపుడు ఆ ఎలుక ఒక కన్నంలోకి వెళ్తుంది. ఇది చూసిన ధర్మరాజుకు మనం కూడా ఒక సొరంగం ఏర్పరచుకోవాలన్న ఉపాయం వస్తుంది.),
అలాంటి విధురుడు అడవికి వెళ్ళాడు
రాజోవాచ
కుత్ర క్షత్తుర్భగవతా మైత్రేయేణాస సఙ్గమః
కదా వా సహసంవాద ఏతద్వర్ణయ నః ప్రభో
అసలు విధుర మైత్రేయ సమాగమం ఎలా జరిగింది. వారు ఎపుడు మాట్లాడుకున్నారు.
న హ్యల్పార్థోదయస్తస్య విదురస్యామలాత్మనః
తస్మిన్వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః
విదురునిలాంటి భాగవతుడు సామాన్య ప్రశ్నలు అడగడు. విదురుడు యముని అంశ. పరమాత్మ మాయను తెలిసిన పన్నెండు మంది భాగవతోత్తములలో ఆయన ఒకడు. మొత్తం పదునాలుగు లోకాలలో ఆయన మాయను తెలిసిన వారిలో యముడు నాలగవ వాడు. మనకు భారతంలో 9 మంది కృష్ణులు అయిదుగురు యముళ్ళు, నలుగురు సూర్యులు, ముగ్గురు చంద్రులు, నలుగురు రుద్రులు, శ్రీమన్నారాయణ పరిపూర్ణ తత్వంగా ఒక ముగ్గురూ. ఇలా 27 మంది ఉంటారు. దిక్పాలకులు నారాయ్ణుడు, సూర్యుడు చంద్రుడు. ఉదాహరణకు సాత్యకి, సాంబుడు సైంధవుడు అశ్వద్ధామ రుద్రాంశలు, తొమ్మండుగురు కృష్ణులు, ఐదుగురు యముళ్ళు, ముగ్గురు సూర్యులు. వీరందరూ రాయబారంలో కలిసారు. ఇలాంటి మహాజ్ఞ్యాని అయిన విదురుడు మైత్రేయుని చిన్న విషయాలగురించి అడిగి ఉండడు. చిన్న ప్రయోజనం ఆశించేవారు కాదు.
మైత్రేయుడు వ్యాసుని సహాధ్యాయి. అటువంటి ఉత్తముడైన మైత్రేయునితో అడిగిన ప్రశ్న, పరమాత్మ అయిన భగవంతుని చర్చకు సంబంధించినది అయి ఉంటుంది. పరమాత్మ ఎవరికోసం అవతరిస్తాడో (పరిత్రాణాయ సాధూనాం) వారికోసం మాట్లాడుకున్న మాటలే అవుతాయి గానీ మామూలు కబుర్లు కావు (మనలాగ ఆయుష్షును వృధా చేసే చర్చలు కావు)
సూత ఉవాచ
స ఏవమృషివర్యోऽయం పృష్టో రాజ్ఞా పరీక్షితా
ప్రత్యాహ తం సుబహువిత్ప్రీతాత్మా శ్రూయతామితి
అలా పరీక్షితు చేత అడుగబడిన శుకుడు, మంచి విషయాలను బాగా తెలిసినవాడు (సుబహువిత్ప్రీతాత్మా ) ఇలా చెప్పాడు
శ్రీశుక ఉవాచ
యదా తు రాజా స్వసుతానసాధూన్పుష్ణన్న ధర్మేణ వినష్టదృష్టిః
భ్రాతుర్యవిష్ఠస్య సుతాన్విబన్ధూన్ప్రవేశ్య లాక్షాభవనే దదాహ
దుర్మార్గులైన పుత్రులని పోషిచిస్తూ, తద్వార కలిగిన అధర్మాన్ని వలన దృష్టి (జ్ఞ్యానము) పోయిన దృతరాష్ట్రుడు, తన కన్నా చిన్నవాడైన పాండురాజు పుత్రులను, తండ్రి లేని వారు అయిన పాండవులను.
(ఓర్పు అనేది తల్లి, ధర్మం అనేది తండ్రి. పాండవులకు కుంతి ఉంది. అంటే ఓర్పు ఉంది. వారికే ఓర్పులేకపోతే అంతవరకూ సహించి ఉండి ఉండేవారు కాదు. పాండవులు ధర్మం ఆచరించుట వలన తండ్రి ఉన్నవారే అయినారు.). అటువంటి వారిని లక్క ఇంటిలో ప్రవేశింపచేసి కాల్చాడు
యదా సభాయాం కురుదేవదేవ్యాః కేశాభిమర్శం సుతకర్మ గర్హ్యమ్
న వారయామాస నృపః స్నుషాయాః స్వాస్రైర్హరన్త్యాః కుచకుఙ్కుమాని
నిండు సభలో పతివ్రత కేశాలను పట్టుకున్నారు. సకలవేద సారం పతివ్రత కేశములుగా మారుతాయి (కచ స్పర్శ గతాయుష: అయ్యారు కౌరవులు). ద్రౌపతీ కేశములు స్పృశించుట వలన వారి ఆయుష్షు పోయింది. సామాన్యుల కేశాలు అధర్మానికి చిహ్నం అయితే, పతివ్రత కేశాలు సకల్వేద సారం. తెలిసి అయినా తెలియక అయినా పతివ్రత కేశములు ముట్టుకుంటే కులం మొత్తం నశిస్తుంది.
కురుదేవ దేవి అయిన ద్రౌపతి యొక్క కేశముల స్పర్శించిన, ఆ నిందించవలసిన పనిని తన కుమారులు చేయడం చూసి కూడా ఏమి అనలేదు. విదురుడు అప్పటికే దృతరాష్ట్రునికి చెప్పాడు. ద్రౌపతి కన్నీళ్ళు భూమి మీద పడకముందే వారించు అని చెప్పాడు. యుద్ధములో కూడా రాజు ఓడిపోతే మహారాణిని గౌరవంగా చూచి ఆ రాణి బయటకు వెళ్ళదలచుకుంటే వారిని సమర్యాదగా పంపిస్తారు. అలాంటిది సొంత కోడలికి అవమానం జరుగుతుంటే, ద్రౌపది కన్నీరు వక్ష్స్థలం మీద పడుతున్నా సరే వారించకుండా ఉన్నాడు. స్త్రీ కన్నీరు వక్షస్థలం మీద పడరాదు. అవి సకల జీవకోటికీ ప్రాణం జ్ఞ్యానం ఇచ్చేవి.
ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలమ్బస్య వనం గతస్య
న యాచతోऽదాత్సమయేన దాయం తమోజుషాణో యదజాతశత్రోః
ధర్మరాజు పరమ సాధువు. ఆయనకున్న మరో బిరుదు సత్యావలంబుడు. ఆయనకున్న బలం సత్యం. ఎన్ని పోయినా ఆయన సత్యాన్ని విడిచిపెట్టడు. ఉత్తరగోగ్రహ్ణ ఘట్టములో బీష్ముడు అర్జనుని చూచి అజ్ఞ్యాతవాసము ముగిసే ఉంటుంది ఎందుకంటే "ధర్మరాజుకు తెలిసిన ధర్మములు మనకు తెలియవు " అంటాడు.
అరణ్య అజ్ఞ్యాత వాసాలు గడిచాక కూడా వరికి రాజ్యం ఇవ్వలేదు, ధర్మరాజు అడిగాక కూడ ఇవ్వలేదు. దూతను పంపాక కూడా ఇవ్వలేదు. ఇంకో దూతను పంపాక కూడా ఇవ్వలేదు. అయినా ఇవ్వకుంటే యుద్ధానికి దిగాడు. అజ్ఞ్యానాన్ని బాగా సేవించేవాడై (తమోజుషాణో ) ధర్మరాజుకు రాజ్యం ఇవ్వలేదు. చివరికి సత్యావలంబుడైన ధర్మరాజు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు "నీ రాజ్యము కూడా నాకు కావాలి అని నన్ను అడుగు. నీకు ఇచ్చేస్తాను. " దుర్యోధనుడి వాదం ఏమిటంటే "పాండు మహారాజు పుత్రులు కారు వీరు. అందుకు వీరికి రాజ్యభాగం లేదు". ఆ మాటకొస్తే కౌరవులు కూడా విధవా పుత్రులు. కాని దుర్యోధనుడు అన్నట్లు ధర్మరాజు ఆ మాట ఎప్పుడూ అనలేదు. హక్కుగా తీసుకోవలసిన రాజ్యమును ధర్మరాజు యాచించినా వారికి ఇవ్వలేదు. వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అరణ్య అజ్ఞ్యాత వాసాలు పూర్తి అయ్యాక రాజ్యం ఇవ్వాలి.
యదా చ పార్థప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగాద కృష్ణః
న తాని పుంసామమృతాయనాని రాజోరు మేనే క్షతపుణ్యలేశః
జగత్గురువైన శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన మాటలు కూడా మంచివనుకోలేదు. పుణ్యములేని వాడైన దుర్యోధనుడు, పురుషులకు అమృతములా తోచేమాటలు చెప్పే (లేదా జీవులకు మోక్ష ప్రదమైన మాటలు అయిన) వాక్యములను కూడా గొప్పవిగా భావించలేదు.
మనం చేసే ప్రతీ పని వెనక మన సంస్కారం ప్రేరణ. మనకి పుణ్యమే ఉండి ఉంటే మంచి మాటకి ఒప్పుకుంటాము.
యదోపహూతో భవనం ప్రవిష్టో మన్త్రాయ పృష్టః కిల పూర్వజేన
అథాహ తన్మన్త్రదృశాం వరీయాన్యన్మన్త్రిణో వైదురికం వదన్తి
విదురుడు చెప్పిన నీతి వాక్యాలను కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా సభనుంచి బహిష్కరించాడు. దృతరాష్ట్రుడు మంత్రాంగం కోసం మంత్రులందరిలో వరీయుడైన (గొప్పవాడైన, పరమశ్రేష్టుడైన) విదురుడు చెప్పిన విషయాలని మిగిలిన మంత్రులందరూ విదురనీతి అన్నారు. ఒక మంత్రి రాజ్యసభలో మాట్లాడిన మాటలను ఇంతకాలం పాటు భద్రపరచి పెట్టుకున్నాము. మంత్రి అయిన వాడు కర్తవ్యం గూర్చి రాజు అడిగితే రాజకీయ స్వభావాన్నే చెప్పకూడదు. లోకస్వభావాన్ని, ధర్మస్వభావాన్నీ, రాజ్యకృత్యాన్ని చెప్పాలి. ఇలాంటి విషయాలలో లోకం ఏం చేస్తుంది, ధర్మం ఏం చెబుతుంది, రాజు ఏమి చేయాలి. ఒక్క రాముని దెబ్బ తగలగానే తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రావణుడు. తాను పలికినవన్నీ ప్రగల్భాలు అని తెలుసుకున్నాడు. విభీషణుడు, మాల్యవంతుడు, అకంపనుడు, విద్యున్మాలి చెప్పినపుడు, యమ వజ్రములతో సాటి వచ్చే నా బాణపు దెబ్బ రాముడు చూడలేదు కాబట్టి నా మీదకు వస్తున్నాడు అని. శత్రువు చంపినా ప్రతిక్రియ ఏమాత్రమూ చేయలేని స్థితిలో రావణుడు ఉన్నాడు. రాముడు ధర్మాత్ముడు కాబట్టి వదిలిపెట్టాడు. అపుడు కుంభకర్ణుడు "మొదలు చేయాల్సిన పనులు తరువాత చేసేవాడు నరాధముడు" అని అన్నాడు. మంత్రి అయిన వాడు కేవలం రాజనీతే కాకుండా లోకధర్మాలు చెబుతాడు.
అలా విదురుడు చెప్పినమాటను సభలో ఉన్న మహామంత్రులందరూ ఆ ఉపదేశాన్ని విదురనీతిగా చాటారు. తోటి మంత్రులందరూ మెచ్చుకున్న విదురుని మాటను తిరస్కరించాడు ధుర్యోధనుడు
అజాతశత్రోః ప్రతియచ్ఛ దాయం తితిక్షతో దుర్విషహం తవాగః
సహానుజో యత్ర వృకోదరాహిః శ్వసన్రుషా యత్త్వమలం బిభేషి
మొదటి మాటగా "అజాతశత్రువుకి అతని భాగం ఇవ్వు, ఆ అజాతశత్రువు ఏ మాత్రమూ సహించ శక్యము కాని (దుర్విషహం ) నీ తప్పును క్షమించాడు. నిజముగా నీవు భయపడాల్సింది వృకోదరుని గురించి (ప్రతిజ్ఞ్య చేసాడు గనుక - దృతరాష్ట్ర పుత్రులంతా నా పాలు, వారిని నేను చంపుతా అని చెప్పాడు.). తమ్ములతో కలిసి ఉన్న భీమ సర్పము కోపముతో బుసలు కొడితే, చెప్పడానికి వీలు లేనంతగా నీవు భయము చెందుతావు. " అహంకారమనేది మన అంతఃకరణాన్ని పూర్తిగా పరీక్షిస్తుంది. ప్రతీ క్షణం మన అంతఃకరణం మనకి నిశ్చయతత్వాన్ని బోధిస్తుంది. అయినా మనసు వినదు.
పార్థాంస్తు దేవో భగవాన్ముకున్దో గృహీతవాన్సక్షితిదేవదేవః
ఆస్తే స్వపుర్యాం యదుదేవదేవో వినిర్జితాశేషనృదేవదేవః
పాండవులు మహావీరులు. అంతకన్నా వారందరినీ భగవానుడు పాండవులను తన వారిగా చేసుకున్నాడు. ఆ మహానుభావుడు క్షితి దేవులకు దేవుడు, బ్రాహ్మణులు దేవతలుగా కలవాడు. అలాంటి వాడు పాండవులను తనవారిగా స్వీకరించాడు. ఆయన ఇపుడు ద్వారకా నగరములో ఉన్నాడు. భూమండలంలో ఉన్న సకల రాజులను తన పరాక్రమంతో గెలించిన కృష్ణపరమాత్మ తాను రక్షకుడిగా పాండవులను స్వీకరించాడు. స్వీకరించి తన నగరములో ఉన్నాడు. ఆయన ద్వారకలోనే ఉండటం నీకు క్షేమం. నీవు వారి రాజ్య భాగం వారికిస్తే ఆయన అక్కడే ఉంటాడు. అదే నీకు క్షేమం.
స ఏష దోషః పురుషద్విడాస్తే గృహాన్ప్రవిష్టో యమపత్యమత్యా
పుష్ణాసి కృష్ణాద్విముఖో గతశ్రీస్త్యజాశ్వశైవం కులకౌశలాయ
మీరు చేస్తున్నది ఎంత పెద్ద తప్పో మీకు అర్థం కావట్లేదేమో. నీ పిల్లలు అనుకుని ఇంట్లోకి వచ్చావు. కానీ నీవు కృష్ణ పరమాత్మకు విముఖుడవై సంతానాన్ని పోషిస్తున్నావు. ఇప్పటికైనా ఇటువంటి అమంగళ కృత్యాన్ని విడిచిపెట్టు (త్యజ ఆశు అశైవం - అమంగళకరమైన పనిని వదిలిపెట్టు)
ఇత్యూచివాంస్తత్ర సుయోధనేన ప్రవృద్ధకోపస్ఫురితాధరేణ
అసత్కృతః సత్స్పృహణీయశీలః క్షత్తా సకర్ణానుజసౌబలేన
ఇలా మాట్లాడిన విదురుని మాటలు విని కోపంతో అదురుతున్న పెదవులతో కర్ణ దుశ్శాసన శకునిలతో కలిసి ఉన్న దుర్యోధనుడు సజ్జనులచేత సన్మానించబడే (సత్స్పృహణీయశీలః ) విదురుని అవమానించబడ్డాడు (అసత్కృతః )
క ఏనమత్రోపజుహావ జిహ్మం దాస్యాః సుతం యద్బలినైవ పుష్టః
తస్మిన్ప్రతీపః పరకృత్య ఆస్తే నిర్వాస్యతామాశు పురాచ్ఛ్వసానః
దాసీ పుత్రుడైన, సభలోకి వచ్చే యోగ్యతలేని ఈ కపటిని ఎవరు పిలిచారు. ఎవరి భోజనంతో పోషింపబడ్డాడో, ఎవరి అన్నం తిన్నాడో వారికి వ్యతిరేకంగా ఉన్నాడు, శత్రువుల పని చేస్తున్నాడు. ఇతనిని నగరం నుండి బహిష్కరించండి. ఎవరు మనకు వ్యతిరేకులో వారికి అనుకూలముగా మాట్లాడుతున్నాడు.
స్వయం ధనుర్ద్వారి నిధాయ మాయాం భ్రాతుః పురో మర్మసు తాడితోऽపి
స ఇత్థమత్యుల్బణకర్ణబాణైర్గతవ్యథోऽయాదురు మానయానః
ఇలా మర్మములని తాకే బాణము వంటి మాటలతో తమ్ముడిని అవమానించినా దృతరాష్ట్రుడు ఏమీ అనలేదు.
అన్నగారు మాట్లాడలేదు కాబట్టి, భగవంతుని మాయా చాలా గొప్పదని తలచి, ఏ మాత్రమూ బాధపడకుండా ధనస్సును సభాద్వారములో పెట్టి వెళ్ళాడు. (మంత్రి అలా పెట్టడం ఆ రాజ్యానికి క్షయం, మంత్రి అస్త్ర త్యాగము చేయకూడదు. మహాభారతములో ఐదుగురు అస్త్ర సన్యాసం చేసారు. విదురుడు దృఓణుడు బీష్ముడు అశ్వధ్ధామ (యుద్ధం బయట విడిచాడు), బీష్ముని మాటతో కర్ణుడు వీరందరూ అస్త్ర త్యాగము చేసారు. మహావీరుడు అయిన విదురుడు మొదట అస్త్ర సన్యాసం చేసాడు. అన్ని ఉన్న సమర్ధున్ని యుద్ధానికి ముందు వదులుకున్నాడు దుర్యోధనుడు. విదురుడు ఎలాంటి బాధా లేకుండా వెడలిపోయాడు
స నిర్గతః కౌరవపుణ్యలబ్ధో గజాహ్వయాత్తీర్థపదః పదాని
అన్వాక్రమత్పుణ్యచికీర్షయోర్వ్యామధిష్ఠితో యాని సహస్రమూర్తిః
ఇ
కురువ్ వంశ రాజుల పూర్వ జన్మ పుణ్య లేశముతో దొరికిన విదుర్డు వెళ్ళిపోయాడు. తీర్థపదః - పవిత్రమైన పాదములు గలవాడు, లేదా తీర్థ యాత్రలకు వెళ్ళదలచుకున్నవాడు. తన పాదములతో అన్ని ప్రదేశాలను పవిత్రం చేయగలవాడు. కాస్త పుణ్యాన్ని సంపాదించుకుందామని (ఇంత కాలం దృతరాష్ట్రునికి మంత్రిగా ఉండి సంపాదించుకున్న పాపం పోగొట్టుకోవడానికి) తీర్థయాత్రలకు బయలుదేరాడు. సహస్రమూర్తిః అయిన పరమాత్మ తన నివాసాలుగా వేటిని చేసుకున్నడో అవి దర్శించడానికి వెళ్ళాడు.
పురేషు పుణ్యోపవనాద్రికుఞ్జేష్వపఙ్కతోయేషు సరిత్సరఃసు
అనన్తలిఙ్గైః సమలఙ్కృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః
పవిత్రములైన వనాలు, అద్రులు (పర్వతాలు), తోటలలోనూ( బృందావనం), బురదలేని నీరులేని నీటిలోనూ (సత్వగుణాన్ని వృద్ది పొందిచే నదులు సరస్సులలోనూ), పరమాత్మ అనంతమైన ఆర్చా మూర్తులు ఉన్న క్షేత్రాలు, అనన్యమైన భావనతో (ఎటువంటి విషయములూ ఆలోచించకుండా) బయలుదేరాడు.
గాం పర్యటన్మేధ్యవివిక్తవృత్తిః సదాప్లుతోऽధః శయనోऽవధూతః
అలక్షితః స్వైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని
తీర్థ యాత్రలు ఎలా చేయాలో మనకి చెప్పే శ్లోకం ఇది.
అవధూతగా తిరిగాడు, పవిత్రమైన దాన్ని ఆహారముగా, ఒంటిగా (వివిక్త) భోజనం చేసాడు. రోజూ మూడు పూటలా స్నానము చేస్తూ (సదాప్లుతోऽధః), నేల మీద పడుకుంటూ (అధః శయనో), తనవారెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు, దుమ్ము ధూళితో నిండి ఉండి అవధూత వేషముతో ఉండి, స్వయముగా అందగాడు కాబట్టి తన అందము ఇంకొకరి మనసులో వికారం కలిగించకుండా అవధూత పరమాత్మను సంతోషింపచేసే వేషములో వ్రతములు చేస్తూ
(భార్య భర్తలు కలిసి భోజనం చేయకూడదు. ఒంటరిగా భోజనం చేయాలి. నలుగురిలో కూర్చుని భోజనం చేస్తే పదార్థాలు ఒకటే అయినా తినే తీరుని చూస్తే అధర్మం వస్తుంది. తన చొట్టూ కూర్చున్న వారు అధర్మంగా తింటే దాని మీదకు మనసు పోతుంది. )
అందరూ నిత్య స్నానమూ (మూడు స్నానములు), నిత్య ఉపవాసం (రోజుకు రెండుపూటలా భుజించడం), నిత్య బ్రహ్మచర్యము చేయాలని శాస్త్రం. పరమాత్మ ప్రసాదించిన సకల అవయవములనూ ఇంద్రియములనూ, అన్ని కాలములనూ, అన్ని దేశములనూ, ఆయనకి మాత్రమే ఉపయోగించగలుగుట పరమాత్మకి సంతోషాన్నిస్తాయి. మనం చేసే భోజనం, స్నానం, చేసే సంభాషణలు, మనం అనుభవించే భోగములూ, ఇవన్నీ మన కొరకు కాదు. ఇవి అంతా స్వామి కొరకే , స్వామి సేవే అనుకోవాలి. ప్రాణాయ అపానాయ అంటూ ఆయనకు అర్పిస్తే దానిని భోజనం అనరు. ఇది భాజనం అంటారు. భాజనం అంటే పాత్ర. పరమాత్మ సేవకు ఇది పాత్ర. పరమాత్మ భుజించేది రెండు మార్గాలలో. 1. భక్తుల నాలుకల మీద 2. అగ్ని ద్వారా. అందుకే తదీయ ఆరాధన అని పరమాత్మ భక్తులను ఆరాధిస్తాము.
ఇత్థం వ్రజన్భారతమేవ వర్షం కాలేన యావద్గతవాన్ప్రభాసమ్
తావచ్ఛశాస క్షితిమేక చక్రామ్లేకాతపత్రామజితేన పార్థః
ఇలా పర్యటిస్తూ ప్రభాస తీర్థం చేరాడు. ఇలా ఆయన ప్రభాస తీర్థానికి వెళ్ళేసరికి ఈ భూమండలం ధర్మరాజు పాలనలోకి వచ్చింది.
తత్రాథ శుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజవహ్నిసంశ్రయమ్
సంస్పర్ధయా దగ్ధమథానుశోచన్సరస్వతీం ప్రత్యగియాయ తూష్ణీమ్
ప్రభాస తీర్థంలో తన బంధువుల నాశం విన్నాడు. మహారణ్యంలో వెదురు పొదలు పరస్పరం ఘర్షించుకుంటే వనం మొత్తం కాలుతుంది. ఆ వనంలో పుట్టిన అగ్నితోటే కాలింది. అమర్షం (అసూయ) వలన కలిగిన అగ్ని సమూలముగా నశింపచేస్తుంది. ఎందుకంటే ఆ అగ్ని వారిలోనే పుట్టింది కాబట్టి. అలాగే ఈ వంశంలో కూడా, వారిలో పుట్టిన కోపం చేతనే వారు దహింపబడ్డారు. వారిలో (దుర్యోధనాదులలో) కలిగిన కొపం ఎదుటివారిలో ప్రతిబింబించి వారినే దహించి వేసింది (సూర్యునిబింబం అద్దంలో పడి ఎదురుగా ఉన్న దానిని ఎలా దహిస్తుందో)
రాజసూయం వలన పాండవుల శ్రీ ఎంతో తెలిసింది, వారి సామర్ధ్యం ఎంతో తెలిసింది. నిధికి రక్షకుడిగా దుర్యోధనున్ని ఉంచాడు. కర్ణున్ని దానానికి నియమించాడు. దానం శత్రువులచేత చేయించాలని కృష్ణుడు చెప్పాడు. రాజయ్సూయములో జరాసంధుడు తప్ప మిగతా వారందరూ స్వచ్చందంగానే వచ్చి పాండవులకు దాసోహమన్నారు. ఏదో విధంగా పాండవులను తక్కువగా చూపించాలి అని దుర్యోధనుడు జూదానికి ఆహ్వానించాడు. ఈ వైరం కేవలం స్పర్థతో వచ్చినదే (సంస్పర్ధయా ).
సరస్వతీ నది పశ్చిమానికి పారుతుంది. అలాంటి నది దగ్గరకు ఉదాసీన భావముతో వెళ్ళాడు (తూష్ణీమ్)
తస్యాం త్రితస్యోశనసో మనోశ్చ పృథోరథాగ్నేరసితస్య వాయోః
తీర్థం సుదాసస్య గవాం గుహస్య యచ్ఛ్రాద్ధదేవస్య స ఆసిషేవే
అక్కడ ఆ సరస్వతీ నదీ ప్రాంతములో ఉన్న తీర్థముల గురించి చెబుతున్నారు: ఉశన - శుక్రుడు, మనువు పృధువు అగ్ని వాయువు త్రిత: అశితుడు సుదాసుడు గోవులు గుహుడు శ్రాద్ధ దేవుడు.
అన్యాని చేహ ద్విజదేవదేవైః కృతాని నానాయతనాని విష్ణోః
ప్రత్యఙ్గముఖ్యాఙ్కితమన్దిరాణి యద్దర్శనాత్కృష్ణమనుస్మరన్తి
ఇవే కాకుండా పుణ్యక్షేత్రాలు, ఆ దరిదాపుల్లో బ్రాహ్మణోత్తముల చేతా, వారిని దేవులుగా ఆరాధించే పుణ్యాత్ములచేత ప్రతిష్టించబడిన పుణ్యక్షేత్రాలను దర్శించాడు. ప్రత్యఙ్గముఖ్యాఙ్కితమన్దిరాణి - ప్రత్యఙ్గ అంటే ఆయుధం. ముఖ్యా - ఆయన ఆయుధాలలో ముఖ్యం చక్రం (సుదర్శనం) సుదర్శనం చేత అంకితమైన మందిరాలు. గోపురం మీద చక్రం ఉన్న మందిరాలను దర్శించాడు. అది చూడగానే కృష్ణుడు గుర్తుకు వచ్చే మందిరాలని దర్శించాడు.
తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం సౌవీరమత్స్యాన్కురుజాఙ్గలాంశ్చ
కాలేన తావద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ
ఇలా అవన్నీ సంచరిస్తూ సౌరాష్ట్రాది దేశాలు సంచరిస్తూ, యమునా తీరానికి వచ్చాడు. యమునా తీరములో ఉద్ధవుడు దర్శనమిచ్చాడు. ఏకాదశ స్కంధములో స్వామి చెప్తాడు "నాకన్న ఏ కొంచెమూ తక్కువ కాని వాడు ఉద్ధవుడు "
స వాసుదేవానుచరం ప్రశాన్తం బృహస్పతేః ప్రాక్తనయం ప్రతీతమ్
ఆలిఙ్గ్య గాఢం ప్రణయేన భద్రం స్వానామపృచ్ఛద్భగవత్ప్రజానామ్
ఎలాంటి మానసికమైన ఉద్వేగాలు లేనివాడు, శ్రీ కృష్ణ భగవానునికి సేవకుడు, బృహస్పతికి మొదటి తనయుడు ప్రాక్తనయం. బృహస్పతి వలన నీతి శాస్త్రములను పొందినవాడు. పండితులకు ఇద్దరు పుత్రులుంటారు. మొదటి కొడుకు శిష్యుడు అని శాస్త్రం. అందుకే ప్రాక్తనయం. ఇంకో అర్థం ఉంది ప్రాక్త - నయం. బృహ్స్పతి దగ్గర నీతి శాస్త్రం చదివిన వాడు.
కృష్ణున్ని ఆలింగనం చేసుకున్ననన్న భావనతో ఉద్ధవున్ని ఆలింగనం చేసుకున్నాడు. మూడు రకాల అద్వైతాలు ఉన్నాయి. భావాద్వైతం (సకల జగత్తునీ పరమాత్మ మయం అనుకోవడం) క్రియాద్వైతం (సకల సేవలూ పరమాత్మ కార్యాలు అనుకోవడం) ద్రవ్యాద్వైతం (అన్నీ ఆయన రూపాలు అనుకోవడం)
ఉద్ధవున్ని ప్రేమతో మనగళకరమైన ఆలింగనం చేసుకున్నాడు. తనవారి (కృష్ణపరమాత్మకి సంబంధించిన తనవారి) క్షేమం అడిగాడు.
కచ్చిత్పురాణౌ పురుషౌ స్వనాభ్య పాద్మానువృత్త్యేహ కిలావతీర్ణౌ
ఆసాత ఉర్వ్యాః కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేహే
తన నాభిలో ఉన్న పద్మంలో పుట్టినవాడు ప్రార్థిస్తే వచ్చిన పురాణ పురుషుడు (శ్రీ కృష్ణ బలరాములు) బాగున్నాడా. (పరమాత్మ ఎప్పుడు తనకోసం రాడు. మనం ప్రార్థిస్తే వచ్చాడు)
భూమండలం యొక్క క్షేమమును సంపూర్తిగా ఏర్పరచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారు శూర్సేనుని ఇంట్లో క్షేమంగా ఉన్నారా.
కచ్చిత్కురూణాం పరమః సుహృన్నో భామః స ఆస్తే సుఖమఙ్గ శౌరిః
యో వై స్వస్ణాం పితృవద్దదాతి వరాన్వదాన్యో వరతర్పణేన
కౌరవులకు అత్యంత ప్రీతి పాత్రమైన వాడు, శూరసేనుని మిత్రుడు, బావా అయిన వసుదేవుడు తన చెళ్ళెల్లకు అడిగిన దానికి కన్న తండ్రిలా అన్నీ ఇచ్చేవాడు. వసుదేవుడు చెళ్ళెల్లను ప్రాణాధికముగా ప్రేమించేవాడు. అలాంటి వసుదేవుడు సుఖంగా ఉన్నాడా
కచ్చిద్వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమఙ్గ వీరః
యం రుక్మిణీ భగవతోऽభిలేభే ఆరాధ్య విప్రాన్స్మరమాదిసర్గే
యాదవ సైన్యాధిపతి అయిన ప్రద్యుమ్నుడు సుఖముగా ఉన్నాడా. మొదటి జన్మలో మన్మధుడిగా ఉన్న ఈయనని రుక్మిణి బ్రాహ్మణోత్తములనారాధించి పుత్రునిగా పొందింది.
కచ్చిత్సుఖం సాత్వతవృష్ణిభోజ దాశార్హకాణామధిపః స ఆస్తే
యమభ్యషిఞ్చచ్ఛతపత్రనేత్రో నృపాసనాశాం పరిహృత్య దూరాత్
యాదవులందరికీ రాజ్యాధికారం లేదు కాబట్టి మాతామహుడైన ఉగ్రసేనున్ని రాజుగా చేసాడు కృష్ణుడు. ఆ ఉగ్ర సేనుడు బాగున్నాడా. (యవ్వనాన్ని ఇవ్వనందున యయాతి ఇచ్చిన శాపం ఇది. యయాతికి వార్ధక్యం దేవయానిని వివాహం చేసుకుని కూడా దేవయాని వెంట దాసిగా వచ్చిన క్షత్రియ యువతి షర్మిష్టను కామించినందు వలన శుక్రుడు ఇచ్చిన శాపం. తాను చేసిన తప్పుకు తను అనుభవించవలసిన శిక్షను భరించేందుకు ఒప్పుకోని యదువుకి శాపం ఇచ్చాడు)
సిమ్హాసనం మీద ఆశను పూర్తిగా వదులుకుని శ్రీకృష్ణపరమాత్మ ఎవరికి రాజ్యాభిషేకం చేసాడో ఆయన బాగున్నాడా
కచ్చిద్ధరేః సౌమ్య సుతః సదృక్ష ఆస్తేऽగ్రణీ రథినాం సాధు సామ్బః
అసూత యం జామ్బవతీ వ్రతాఢ్యా దేవం గుహం యోऽమ్బికయా ధృతోऽగ్రే
రధులలో అగ్రుడైన సాంభుడు, పూర్వ జన్మలో పార్వతీ దేవి గర్భంలో ధరించిన కుమారస్వామి అయిన ఈయనని, ఆ కుమారస్వామి ఆరాధనతో జాంబవతి ఈయనను కుమారునిగా పొందింది. ఆయన బాగున్నాడా
క్షేమం స కచ్చిద్యుయుధాన ఆస్తే యః ఫాల్గునాల్లబ్ధధనూరహస్యః
లేభేऽఞ్జసాధోక్షజసేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపామ్
యుయుధానుడైన సాత్యకి, అర్జనుని ద్వారా ధనుర్విద్యను నేర్చుకున్నవాడు బాగున్నాడా. అలా నేర్చుకుని పరమాత్మను సేవించడంతో, ఆయన అనుగ్రహంతో మహాత్ములకి కూడా దుర్లభమైన భగవత్ తత్వ జ్ఞ్యానాన్ని పొందాడు. ఈయన బాగున్నాడా
కచ్చిద్బుధః స్వస్త్యనమీవ ఆస్తే శ్వఫల్కపుత్రో భగవత్ప్రపన్నః
యః కృష్ణపాదాఙ్కితమార్గపాంసుష్వచేష్టత ప్రేమవిభిన్నధైర్యః
శ్వఫల్క పుత్రుడైన అక్రూరుడు (గాంధినీ ఈయన తల్లి ), పాపరహితుడైన వాడు (అనమీవ), పరమాత్మను మాత్రమే ఆశ్రయించినవాడు, ఈయన ఎంత గొప్పవాడంటే కన్సుని పలుపున రథం తీసుకుని బృందావనానికి చేరుతూ దారిలో "దుర్మార్గులని ఆశ్రయించవద్దని చెప్పిన శాస్త్రాలు, మరి నాకు అలాంటి దుర్మార్గుల సావాసముతోనే నాకు కృష్ణ దర్శన భాగ్యం కలుగుతోంది" అని అనుకున్నాడు.ల్ దారిలో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను చూస్తాడా, మాట్లాడతాడా అనుకుంటూ గోధూళి వేలలో గోవుల గిట్టలు చూస్తూ, అద్నులో మధ్యనున్న పరమాత్మ పాద చిహ్నములు చూస్తూ, ఆ ధూళిలో పొర్లుకుంటూ వెళ్ళాడు. అతని ధైర్యమంతా పరమాత్మ మీద ప్రేమతో తొలగిపోయింది. ఆయన బాగున్నాడా
కచ్చిచ్ఛివం దేవకభోజపుత్ర్యా విష్ణుప్రజాయా ఇవ దేవమాతుః
యా వై స్వగర్భేణ దధార దేవం త్రయీ యథా యజ్ఞవితానమర్థమ్
భోజ పుత్రి అయిన, దేవతలను సంతానముగా పొందిన అదితి లాగ, కృహ్స్ణున్ని తన కడుపులో దాచుకున్న తల్లి, ఎలా అయితే వేదం పరమాత్మను తనలో దాచుకుందో, అలా దాచుకున్న దేవకి క్షేమంగా ఉందా.
అపిస్విదాస్తే భగవాన్సుఖం వో యః సాత్వతాం కామదుఘోऽనిరుద్ధః
యమామనన్తి స్మ హి శబ్దయోనిం మనోమయం సత్త్వతురీయతత్త్వమ్
అడిగిన వారందరి కోరికలనూ తీర్చే అనిరుద్ధుడు, (సకల అవతారాల మూలము అయిన వాడు, విరాట్ పురుషుడైన వాడు, బ్రహ్మాండములోంచి ఉద్భవించిన వాడు) వేదములకు మూలం అయినవాడు (ఈయన నిశ్వాసములే వేదములు), ఈయన నుంచే మనసు అవయవాలు వచ్చాయి. ఈయన నాలుగవ ఆకారం (సత్త్వతురీయతత్త్వమ్ - వాసుదేవ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ)
అపిస్విదన్యే చ నిజాత్మదైవమనన్యవృత్త్యా సమనువ్రతా యే
హృదీకసత్యాత్మజచారుదేష్ణ గదాదయః స్వస్తి చరన్తి సౌమ్య
పరమాత్మను ఎవరు తదేక దృష్టితో ఆశ్రయించి సేవిస్తున్నారో వారు బాగున్నారా. ఆత్మ దైవమైన పరమాత్మను, అతని యందే మనసు లగ్నం చేసే వారు బాగున్నారా. ఇలాంటి వారందరూ క్షేమంగా సంచరిస్తున్నారా
అపి స్వదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మః పరిపాతి సేతుమ్
దుర్యోధనోऽతప్యత యత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్త్యా
కృష్ణార్జనులు తమ బాహు బలముతో భూమండలములో ఉన్న అధర్మాన్ని తొలగిస్తుంటే, ధర్మాన్ని స్థాపిస్తుంటే, చూచి సహించలేక ఆ అసూయతో పోయాడు దుర్యోధనుడు. కృష్ణుడు పాండవుల ధార్మిక ప్రవృత్తినీ, అర్జనుని పరాక్రమమునీ సభలో చెబుతూ ఉంటే సహించలేకపోయాడు, సామ్రాజ్యము తనకు లభించదన్న భ్రమతో.
కిం వా కృతాఘేష్వఘమత్యమర్షీ భీమోऽహివద్దీర్ఘతమం వ్యముఞ్చత్
యస్యాఙ్ఘ్రిపాతం రణభూర్న సేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రమ్
పాపము చేసిన వారి పాపమును క్షమించలేక వారి యెడల పాపమును (పాపము అంటే మరణము అని అర్థము) ప్రయోగించిన వాడు భీముడు. పాములాగ ఎప్పటినుంచో వస్తున్న పగను ఎవరి ద్వారా విడిచిపెట్టాడో. అతను పరాక్రమంతో ఉద్వేగంతో గదతో దారి ఏర్పరచుకుంటూ (మార్గము చేసుకుంటూ - అంటే అడ్డు వచ్చినావారిని చంపుకుంటూ), ఒక్కొక్క అడుగూ వేస్తుంటే భూమి అతని పాదముల బరువు భరించలేకపోయింది.
కచ్చిద్యశోధా రథయూథపానాం గాణ్డీవధన్వోపరతారిరాస్తే
అలక్షితో యచ్ఛరకూటగూఢో మాయాకిరాతో గిరిశస్తుతోష
శంకరుడంతటి వాడే మాయా కిరాతుని వేషములో వచ్చి అర్జనుని పరాక్రమం చూసి సంతోషించాడో, బాణములతో గూడు కప్పినట్లుగా బాణములు వచ్చి పడితే సూర్యుడు మేఘములను భేదించుకుంటూ వచ్చినట్లు వాటిని చేధించిన అర్జనుడు బాగున్నాడా
యమావుతస్విత్తనయౌ పృథాయాః పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ
రేమాత ఉద్దాయ మృధే స్వరిక్థం పరాత్సుపర్ణావివ వజ్రివక్త్రాత్
కనుగుడ్లను రెప్పలు కాపాడినట్లుగా పాండవులచేత కాపాడబడే నకుల సహదేవులు బాగున్నారా.
యుద్ధములో గరుడుడు ఇంద్రుని సైన్యమును ఎలా తీసుకున్నాడో, అలా శత్రువుల రాజ్యము తీసుకున్న నకుల సహదేవులు బాగున్నారా
అహో పృథాపి ధ్రియతేऽర్భకార్థే రాజర్షివర్యేణ వినాపి తేన
యస్త్వేకవీరోऽధిరథో విజిగ్యే ధనుర్ద్వితీయః కకుభశ్చతస్రః
నలుదిక్కులా ఉన్న రాజులను గెలిచిన ఏక వీరుడైన పాండురాజు లేకపోయినా కొడుకుల కోసం బ్రతికి ఉన్న కుంతి బాగా ఉన్నదా
సౌమ్యానుశోచే తమధఃపతన్తం భ్రాత్రే పరేతాయ విదుద్రుహే యః
నిర్యాపితో యేన సుహృత్స్వపుర్యా అహం స్వపుత్రాన్సమనువ్రతేన
తనకు సకల సామ్రాజ్య సంపదని కట్టిబెట్టడానికి ఒంటిగా అన్ని దిక్కులకూ వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వచ్చి శత్రు రాజుల సంపదను తెచ్చి పెట్టిన పాండురాజు మరణిస్తే, అతని పుత్రులనూ, కుంతినీ బయటకు పంపి, వారి తరపున మాట్లాడిన నన్నూ బయటకు పంపినవాడు ( దృతరాష్ట్రుడు) బాగున్నాడా
సోऽహం హరేర్మర్త్యవిడమ్బనేన దృశో నృణాం చాలయతో విధాతుః
నాన్యోపలక్ష్యః పదవీం ప్రసాదాచ్చరామి పశ్యన్గతవిస్మయోऽత్ర
ఇలా చిత్ర విచిత్రములైన పరమాత్మ లీలను చూస్తే, కనురెప్పల కదలికతో సకల చరాచర జగత్తు యొక్క గమనాన్ని శాసిస్తున్న పరమాత్మ లీలగా భావించి, పరమాత్మ అనుగ్రహంతో, శోకమూ ఆశ్చర్యమూ, అహంకారమూ లేకుండా, అతని పాదస్థానమైన భూమి మీద సంచరిస్తున్నాను
నూనం నృపాణాం త్రిమదోత్పథానాం మహీం ముహుశ్చాలయతాం చమూభిః
వధాత్ప్రపన్నార్తిజిహీర్షయేశోऽప్యుపైక్షతాఘం భగవాన్కురూణామ్
విద్యా మదం, ధన మదం, ఆభిజాత్య మదం (ఉన్నత కులంలో పుట్టాను అన్న మదం). ఈ మూడు మదాలతో అడ్డదారిలో పడి, వారి సైన్యంతో మాటి మాటికీ భూమి మీద సంచరించేవారిని, ఆశ్రయించే వారి బాధను తొలగించే కోరికతో పరమాత్మ సంహరించాడు. ఇన్ని తప్పులు చేస్తున్న వారిని ఉపేక్షించినతకాలం ఉపేక్షించాడు.
అజస్య జన్మోత్పథనాశనాయ కర్మాణ్యకర్తుర్గ్రహణాయ పుంసామ్
నన్వన్యథా కోऽర్హతి దేహయోగం పరో గుణానాముత కర్మతన్త్రమ్
పాపాన్ని తొలగించడానికి పరమాత్మ అవతరిస్తాడు. ఆయన ఏ పనీ చేయడు (అకర్తుః). కాని సత్పురుషులు అనుసరించడానికి కర్మలు చేస్తున్నాడు. దుర్మార్గులని అణచడానికి పుడుతున్నాడు.
అలా కానట్లైతే ఆయంకు శరీరముతో ఏమి పని? ఇలాంటి శరీరాన్ని చూసి మనమే "ఈ శరీరం లేకుండా ఉంటే బాగుండు " అనుకుంటాము. అలాంటిది పాపుల రూపు మాపడానికి కాకపోతే ఆయన శరీరం ఎందుకు స్వీకరిస్తాడు. పుణ్యాత్ములకు ఆచారం తెలపడానికి కాకపోతే ఆయనకు కర్మ చేయవలసిన ఆవశ్యం ఏముంది
తస్య ప్రపన్నాఖిలలోకపానామవస్థితానామనుశాసనే స్వే
అర్థాయ జాతస్య యదుష్వజస్య వార్తాం సఖే కీర్తయ తీర్థకీర్తేః
పరమాత్మను ఆశ్రయించి ఆయన ఆజ్ఞ్యలో నిలిచి సకల లోకాలని పాలిస్తున్న లోకపాలకులను తన శాసనంలో ఉంచుకున్న వాడు, ఒక ప్రయోజనం ఆశించి పుట్టాడు, పుట్టుక అవసరం లేని వాడు పుట్టాడు . అలాంటి పవిత్రమైన కీర్తి గల పరమాత్మ యొక్క కీర్తిని కీర్తిచు. భగవంతుని లీలలను గానం చేయమని ఉద్ధవున్ని విదురుడు అడిగాడు

No comments:
Post a Comment