Monday, December 31, 2012

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ద్వితీయ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ద్వితీయ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఇతి భాగవతః పృష్టః క్షత్త్రా వార్తాం ప్రియాశ్రయామ్
ప్రతివక్తుం న చోత్సేహ ఔత్కణ్ఠ్యాత్స్మారితేశ్వరః

విదురుని ప్రశ్న విన్న ఉద్ధవుడు పరమాత్మ యందు తనకున్న సహజమైన భక్తిచే అతని గొంతు పూడుకుపోయింది

యః పఞ్చహాయనో మాత్రా ప్రాతరాశాయ యాచితః
తన్నైచ్ఛద్రచయన్యస్య సపర్యాం బాలలీలయా

శ్రీ కృష్ణుని పేరు వింటే పులకించిపోయేవాడు ఉద్ధవుడు. ఐదేళ్ళ వయసులో ఉపాహారానికి (ప్రాతరాశాయ  - బాల భోగం అని అంటారు) పిలిస్తే వచ్చేవాడు కాడు. కృష్ణపరమాత్మ లీలలనే బాల్యక్రీడలుగా ఆడుకొనేవాడు. అలా నిమగ్నమై ఉండి తల్లి పిలిస్తే వచ్చేవాడు కాడు.

స కథం సేవయా తస్య కాలేన జరసం గతః
పృష్టో వార్తాం ప్రతిబ్రూయాద్భర్తుః పాదావనుస్మరన్

పరమాత్మ సేవలో పూర్తిగ తన వయసు ఉడిగిపోయింది. కృష్ణుణ్ణి ఆరాధించుటలోనే వార్ధక్యాన్ని పొందాడు. అలాంటి భాగవతోత్తముడైన ఉద్ధవుడు "కృష్ణుడు ఎలా ఉన్నాడన్న " ప్రశ్నకు ఏమి చెప్పాలో తెలియక కృష్ణపాదపద్మములను స్మరించాడు

స ముహూర్తమభూత్తూష్ణీం కృష్ణాఙ్ఘ్రిసుధయా భృశమ్
తీవ్రేణ భక్తియోగేన నిమగ్నః సాధు నిర్వృతః

అడిగిన దానికి సమాధానం చెప్పేముందు పరమాత్మ పాదం స్మరించడంతో అన్ని ఇంద్రియములకూ విశ్రాంతి లభించింది. ఏ పని చేస్తే ఇంద్రియాలకు ఇష్టమో అది చేయడమే విశ్రాంతి. దేని వలన మనో ఇంద్రియాలు ప్రశాంతతను పొందుతాయో అదే విశ్రాంతి. ఒక్క సారి తీవ్రమైన భక్తియోగములో మునిగిపోయాడు.

పులకోద్భిన్నసర్వాఙ్గో ముఞ్చన్మీలద్దృశా శుచః
పూర్ణార్థో లక్షితస్తేన స్నేహప్రసరసమ్ప్లుతః

శరీరం అంతా పులకింతలు వచ్చాయి. ఒక్క సారి కనులు మూసుకున్నాడు. ఆనందబాష్పాలు రాలుస్తూ, ఎదురుగా ఉన్నవాడు, అడిగిన వాడు, అడిగిన ప్రశ్న విన్నవారు, ఒకే విధమైన అనుభూతి పొందుతారు. వారి "అర్థం" పరిపూర్ణమైనది. ఆనందబాష్పాలతో అభిషేకం చేసుకున్నట్లు కనిపించాడు

శనకైర్భగవల్లోకాన్నృలోకం పునరాగతః
విమృజ్య నేత్రే విదురం ప్రీత్యాహోద్ధవ ఉత్స్మయన్

ఉద్ధవుడు మెల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఒక సారి తన కళ్ళను తుడుచుకున్నాడు. పరమాశ్చర్యాన్ని పొందుతూ (కలియుగం వచ్చినా కృష్ణుడి గురించి అడిగినందుకు)

ఉద్ధవ ఉవాచ
కృష్ణద్యుమణి నిమ్లోచే గీర్ణేష్వజగరేణ హ
కిం ను నః కుశలం బ్రూయాం గతశ్రీషు గృహేష్వహమ్

నీవు అందరి క్షేమం అడిగావు. ఏమి చెప్పమంటావు. కాలం అనే పెద్ద కొండచిలువ శ్రీకృష్ణుడనే సూర్యున్ని మ్రింగివేసింది. ఇంకా కుశలం అనేది ఏముంటుంది. ఆయన ఉంటేనే ఇంటికి ఒక కళ. ఇక క్షేమం గురించి ఇపుడు చెప్పేదేముంది

దుర్భగో బత లోకోऽయం యదవో నితరామపి
యే సంవసన్తో న విదుర్హరిం మీనా ఇవోడుపమ్

ప్రపంచం దౌర్భాగ్యం అయింది. లోకం కన్నా యాదవులు మరీ దౌర్భాగ్యులు. కృష్ణ పరమాత్మతో కలిసి మెలిసి తిరిగినా ఆయన తమ లాంటి మానవుడనుకున్నారు కానీ పరమాత్మ అనుకోలేదు. ఒక నదిలో చేపలుంటాయి, అదే నీటిలో పడవకూడా ఉంటుంది. తమకు అడ్డం వచ్చిన పడవను చేపలు ఇంకో చేప అనుకుంటాయి గానీ, అది నీటి నుంచి దాటించే పడవ అనుకోరు. సంసారం నుంచి ఉద్ధరించే పరమాత్మ సంసారంలో ఉంటటం చూచి "ఆయన కూడా మాలాంటి మనిషే" అనుకున్నారు

ఇఙ్గితజ్ఞాః పురుప్రౌఢా ఏకారామాశ్చ సాత్వతాః
సాత్వతామృషభం సర్వే భూతావాసమమంసత

పరమాత్మ హృదయాన్ని, ఎదుటివారి అభిప్రాయాన్ని, ఈ రెండూ తెలుసుకున్న వారు ఉత్తమ పరిజ్ఞ్యానం కలవారు. జ్ఞ్యానులకు అధిపతి అయిన స్వామిని ప్రాణులతో కలిసి ఈ లోకంలో ఉండేవానిగా తలిచారు గానీ, సకల భూతములలో ఉండేవాడు అని గానీ, సకల భూతములకూ నివాసమని గానీ తెలుసుకోలేకపోయారు. ఆయన శ్రీమన్నారాయనుడని జ్ఞ్యానులు కూడా తెలుసుకోలేకపోయారు. యాదవులు అసలు తెలుసుకోలేకపోయారు

దేవస్య మాయయా స్పృష్టా యే చాన్యదసదాశ్రితాః
భ్రామ్యతే ధీర్న తద్వాక్యైరాత్మన్యుప్తాత్మనో హరౌ

పరమాత్మ మాయచేత ఆవరింపబడిన వారు కాబట్టి దుర్జనుల సావాసం చేసి ఉంటారు. పరమాత్మ యందే మనసు అర్పించిన వారు ఇలాంటి దుర్జనులు మాట్లాడిన మాటలకు చలించరు.

ప్రదర్శ్యాతప్తతపసామవితృప్తదృశాం నృణామ్
ఆదాయాన్తరధాద్యస్తు స్వబిమ్బం లోకలోచనమ్

పరమాత్మ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుంటూనే ఉండాలి అన్న కోరికతో చాలా మంది చాలా కాలము తపసు చేసారు, అలా చేసి కృష్ణ పరమాత్మ ఉన్న చోట పుట్టారు, కృష్ణ పరమాత్మను నిరంతరమూ దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎంతమంది భార్యలున్నా చాలు అని అనుకోలేనట్లు, ఎంత కాలం పరమాత్మ దివ్య విగ్రహాన్ని దర్శనం చేసుకున్నా కనులకు తృప్తి కలగదు. అంతలోనే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని తీసుకుని స్వామి అంతర్ధానం చెందాడు.

యన్మర్త్యలీలౌపయికం స్వయోగ మాయాబలం దర్శయతా గృహీతమ్
విస్మాపనం స్వస్య చ సౌభగర్ద్ధేః పరం పదం భూషణభూషణాఙ్గమ్

మానవలోకానికి తగిన యోగమాయా బలాన్ని స్వీకరించి అందరికీ చూపడానికి, చూచిన ప్రతీ వారు అత్యాశ్చర్యం పొందే ఆయన విగ్రహం, అన్ని రకాల సౌభాగ్యాలకి పరమపదమైన ఆయన శరీరం, ఆభరణాలకే ఆభరణమైన ఆయన శరీరం,

యద్ధర్మసూనోర్బత రాజసూయే నిరీక్ష్య దృక్స్వస్త్యయనం త్రిలోకః
కార్త్స్న్యేన చాద్యేహ గతం విధాతురర్వాక్సృతౌ కౌశలమిత్యమన్యత

అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అతిలోక మోహమైన శరీరాన్ని ధర్మరాజు చేసిన రాజసూయయాగములో చూచారు, దానికి దేవలోకం వారు కూడా వచ్చారు. కన్నులకు మంగళకరమైన, నేత్రములకు శుభము యొక్క నిలయం అయిన స్వామిని చూచి "కృష్ణుని శరీరం నిర్మించిన తరువాత బ్రహ్మగారు ఇంక సృష్టి చేసి ఉండకపోవచ్చు" అని అనుకున్నారు. ఆయన సౌందర్య పరాకాష్టలో అన్ని విషయాలు మర్చిపోయి, కృష్ణుడు కూడా బ్రహ్మగారి సృష్టిలో భాగం అనుకున్నారు. (గోపికలు కూడా స్వామిని కనులారా చూస్తూ రెప్పలు పడటంతో బ్రహ్మగారు కంటికి రెప్పలు సృష్టించకుండా ఉండవలసింది అనుకున్నారు). బ్రహ్మగారి సృష్టిలో చాతుర్యం ఇంతటితో అయిపోయింది అనుకున్నారు

యస్యానురాగప్లుతహాసరాస లీలావలోకప్రతిలబ్ధమానాః
వ్రజస్త్రియో దృగ్భిరనుప్రవృత్త ధియోऽవతస్థుః కిల కృత్యశేషాః

పరమాత్మ విలాసవంతమైన కటాక్షం (రాస లీలావలోకం) నిరంతరం గోపికలమీద పడి (ఉదాహరణకు రామాయణంలో యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి | నిందితస్స జనో లోకే స్వాఽఽత్మాప్యేనం విగర్హతే ||) ప్రేమతో నిండిన, చిరునవ్వుతో కలిగ్నటువంటి రసిక హృదయంతో ఏర్పడిన లీలను కురిపించే చూపు. పరమాత్మ లీలలో విలాసము ప్రేమ, రాసము, లీల ఇవన్నీ కలిసి ఉన్న చూపు వారి మీద పడింది. సహజముగా లోకములో బుద్ధినిన్ కనులు అనుసరిస్తాయి. గోపికలకు మాత్రం కన్నులనే బుద్ధి అనుసరించింది. జడమైన అవయవాలకే చైతన్యం వస్తుంది. చూపులవెంట బుద్ధి పోయింది గానీ, బుద్ధి వెంట చూపులు పోలేదు. తాము చేయవలసిన పనులు అంటూ ఏమీ లేని వారు గోపికలు (కిల కృత్యశేషాః)

స్వశాన్తరూపేష్వితరైః స్వరూపైరభ్యర్ద్యమానేష్వనుకమ్పితాత్మా
పరావరేశో మహదంశయుక్తో హ్యజోऽపి జాతో భగవాన్యథాగ్నిః

అందరూ తమ సంకల్పముతోటే పుట్టిన వారు, తమ సేవతో తమ ధ్యానంతో తమ స్మరణతో ప్రశాంతముగా జీవితం గడపాలనుకునే వారు ఇతరులచే పీడించబడుతుండగా, వారి ప్రాథనవలన, దయకలిగిన వాడై, పరావరేశుడై (పెద్దవారికీ పెద్దవాడు, చిన్నవారికీ ఈశుడే) మహదంశతో (బలరామునితో - బలరాముడు మహత్ తత్వం) అవతరించాడు. పుట్టుకలేనివాడు అయి ఉండి పుట్టాడు. ఎలా అయితే కట్టెలోంచి అగ్ని పుడుతుందో. పరమాత్మ అవతరించాడంటే ఆయన వైకుంఠములో లేడా? రెండు కట్టెలను రాపిడి చేస్తే అగ్ని పుడుతుంది. మరి అగ్ని పుట్టింది కాబట్టి కట్టెలో ఇంక అగ్ని లేదు అనగలమా...ఎన్ని సార్లు కట్టెలోంచి అగ్ని పుట్టినా ఆ కట్టెలలో అగ్ని ఉంటూనే ఉంటుంది. అలాగే స్వామి అవతరించినా వైకుంఠములో కూడా ఆయనే ఉంటాడు

మాం ఖేదయత్యేతదజస్య జన్మ విడమ్బనం యద్వసుదేవగేహే
వ్రజే చ వాసోऽరిభయాదివ స్వయం పురాద్వ్యవాత్సీద్యదనన్తవీర్యః

ఇంతటి మహానుభావుడైన వాడు, సకల జగత్తుని సంకల్పమాత్రం చేత ఇంతటి అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించి కాపాడే పరమాత్మ వసుదేవుడి ఇంటిలో చెరసాలలో పుట్టాడు (ఇదే అర్థాన్ని భావించి నమ్మాళ్వారు మూర్చపోయారు). పుట్టుక లేని పరమాత్మ వసుదేవుని ఇంటిలో పుట్టినట్టు చూపాడు. శత్రువులకు భయపడి అక్కడినుంచి తప్పించుకుని రేపల్లెలో దాక్కున్నాడు. అనంత పరాక్రమం గలవాడు భయపడినట్లు నటించాడు. అది తలచుటచేతనే నా మనసు బాధపడుతోంది.

దునోతి చేతః స్మరతో మమైతద్యదాహ పాదావభివన్ద్య పిత్రోః
తాతామ్బ కంసాదురుశఙ్కితానాం ప్రసీదతం నోऽకృతనిష్కృతీనామ్

గుండెను పిండివేసే (దునోతి చేతః ) ఇంకో ఉదంతం దేవకీ వసుదేవల పాదములు పట్టుకుని కన్నీళ్ళతో "కంసునికి భయపడి ఇంతవరకూ మిమ్ములను సరిగా సేవించలేకపోయాము క్షమించండి " అన్న మాటను వింటే నా గుండె పిండి వేసినట్లు అవుతోంది. ప్రేమతో వెళ్ళి పిల్లలు తల్లి ఒడిలో కూర్చుని పాలు త్రాగడమే సేవ, దుమ్ము పోసుకుని తండ్రి ఒడిలో పొర్లడమే సేవ. అలాంటి సేవ కృష్ణుడు దేవకీ వసుదేవులకు చేయలేకపోయాడు

కో వా అముష్యాఙ్ఘ్రిసరోజరేణుం విస్మర్తుమీశీత పుమాన్విజిఘ్రన్
యో విస్ఫురద్భ్రూవిటపేన భూమేర్భారం కృతాన్తేన తిరశ్చకార

ఒక్క సారి ఈయన పాదపద్మాలను అఘ్రాణించినవాడు మరచిపోగలడా, దుర్మార్గులతో భూమి చాలా బరువెక్కిందని అందరూ విలపిస్తే, ప్రకాశించే కనుబొమ్మలతో (యముడుగా ఉన్న కనుబొమ్మల కదలికతో) సకల భూభారాన్ని తొలగించాడు.

దృష్టా భవద్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణం ద్విషతోऽపి సిద్ధిః
యాం యోగినః సంస్పృహయన్తి సమ్యగ్యోగేన కస్తద్విరహం సహేత

రాజసూయ యాగములో క్ర్ష్ణపరమాత్మకు అగ్రపూజ జరుగుతుంటే చూసి సహించని శిశుపాలునికి కూడా, మహాయోగులు కూడా "మాకిది లభించాలని" అభిలషించే మోక్షమును ప్రసాదించాడు. లోకములో పొగడినవాడికే మేలు జరుగుతుంది. పరమాత్మ విషయములో పొగడినా తెగడినా మోక్షమే వస్తుంది. మనదగ్గర ఉనందాన్ని ఇస్తే, ఏమి ఇచ్చినా ఆయన మోక్షము ఇస్తాడు. ఒక్క సారి చూస్తే ఈయనని మరచిపోలేము. రాజసూయ యాగములో ద్వేషించిన శిశుపాలునికి కూడా సిద్ధి పొందడం చూసరు కద. ద్వేషించిన వారికి కూడా మోక్షమిచ్చ్చే స్వామిని ఎవరైనా ఎలా మరచిపోతారు.

తథైవ చాన్యే నరలోకవీరా య ఆహవే కృష్ణముఖారవిన్దమ్
నేత్రైః పిబన్తో నయనాభిరామం పార్థాస్త్రపూతః పదమాపురస్య

కౌరవ పాండవ మహాసంగ్రామంలో శరవర్షం కురిపిస్తున్న అర్జనుని వద్దకే సైన్యం వస్తోంది. దానికి కారణం "ఒక్క సారి కృష్ణుణ్ణి చూసి మరణిద్దాం" అని అనుకున్నారు. కృష్ణపరమాత్మ ముఖాన్ని చూస్తూ పార్థుని బాణాలతో కొట్టబడి మరణించారు. కనులకు తృప్తినిచ్చే పరమాత్మ ముఖ పద్మాన్ని కనులతో త్రాగుతూ మోక్షాన్ని పొందారు. మామూలు యుద్ధంలో మరణిస్తే స్వర్గం వస్తుంది. ఈ యుద్ధంలో మరణిస్తే మోక్షం వస్తుంది. బహుశా అందుకే కృష్ణుడు తన సైన్యం మొత్తాన్ని కౌరవులకు ఇచ్చాడేమో. మొత్తం కౌరవ సైన్యాలకు మోక్షం ఇచ్చాడు. కృష్ణుడు పరమాత్మ అవతారం అని అందరికీ పరిపూర్ణ విశ్వాసం ఉంది.

స్వయం త్వసామ్యాతిశయస్త్ర్యధీశః స్వారాజ్యలక్ష్మ్యాప్తసమస్తకామః
బలిం హరద్భిశ్చిరలోకపాలైః కిరీటకోట్యేడితపాదపీఠః

సామ్యంలో కానీ ఆధిక్యంలో గానీ ఆయనకు సాటి ఇంకొకరు లేరు. మూడు లోకాలకు మూడు గుణాలకు, మూడు వేదాలకు అధిపతి ఆయన. తనలో తానే రమించేవాడు (స్వారాజ్యలక్ష్మ్యా), ఆయన స్వయం ప్రకాశకుడు, ఆయన మీద నమ్మకాన్ని ఆయనే కలిగిస్తాడు (శ్రీమద్రామాయణంలో రామసుగ్రీవ మైత్రిలో ఈ విషయం తెలుస్తుంది. శ్రీరాముడు సుగ్రీవుడు నమ్మడానికి సుగ్రీవుడు పెట్టిన పరీక్షలకు తల వొగ్గి తనను తాను నిరూపించుకున్నాడు రామచంద్రప్రభువు.). లోకపుర కిరీటముల మణుల కాంతిచే ప్రకాశించే పాద పద్మములు కలవాడు

తత్తస్య కైఙ్కర్యమలం భృతాన్నో విగ్లాపయత్యఙ్గ యదుగ్రసేనమ్
తిష్ఠన్నిషణ్ణం పరమేష్ఠిధిష్ణ్యే న్యబోధయద్దేవ నిధారయేతి

కంసున్ని సంహరించి రాజ్య సిమ్హాసనంలో ఉగ్రసేనున్ని కూర్చోబెట్టి "నేను నీ రాజ్య పాలకుడుగా ఉంటున్నాను. " అని చెప్పి "మహారాజా కటాక్షించు" (దేవా నిధారయ) అని చేతులు జోడించి అడిగిన సన్నివేశాన్ని చూచిన నా మనసు విలపిస్తోంది. అది నా మనసుని చీల్చి వేస్తోంది. ఇంద్ర సిమ్హాసనంలో ఉగ్రసేనుడు కూర్చుంటే కృష్ణుడు నిలబడ్డాడు.

అహో బకీ యం స్తనకాలకూటం జిఘాంసయాపాయయదప్యసాధ్వీ
లేభే గతిం ధాత్ర్యుచితాం తతోऽన్యం కం వా దయాలుం శరణం వ్రజేమ

పూతన (బకీ) తన స్తనములలో ఉన్న కాలకూటాన్ని చంపడానికి ఇస్తే, తనను పెంచిన తల్లి చేరిన మోక్షాన్ని పొందింది. ఏ కొంచెం బుద్ధి ఉన్నా ఇతని కన్నా వేరైన వారెవరు మనకు శరణు ఇవ్వగలరు. చంపుతా అన్న వారికి మోక్షం ఇచ్చాడు.

మన్యేऽసురాన్భాగవతాంస్త్ర్యధీశే సంరమ్భమార్గాభినివిష్టచిత్తాన్
యే సంయుగేऽచక్షత తార్క్ష్యపుత్రమంసే సునాభాయుధమాపతన్తమ్

కృష్ణ పరమాత్మ చక్రంతో మరణించిన వారంతా భాగవతులు. స్వామిని తలుచుకుంటేనే మోక్షం వస్తుంది. అలాంటిది వీరు పరమాత్మ యానాన్ని (గరుడున్ని), ఆయుధాన్ని (చక్రాన్ని) , పరమాత్మనీ చూస్తూ మోక్షాన్ని పొందారు కాబట్టి రాక్షసులందరూ పరమభాగవతులే. క్రోధ మార్గంలో చిత్తాన్ని పెట్టిన ఈ రాక్షసులు గరుడుడి (తార్క్ష్యపుత్ర) భుజాల మీద కూర్చుని చక్రాయుధం మీద కూర్చున్న పరమాత్మని దర్శించిన రాక్షసులు భాగవతోత్తములని  నేను అనుకుంటున్నాను.

వసుదేవస్య దేవక్యాం జాతో భోజేన్ద్రబన్ధనే
చికీర్షుర్భగవానస్యాః శమజేనాభియాచితః

ఈయన బ్రహ్మ ప్రార్థిస్తే లోకానికి మంగళం కలిగించాలని దేవకీ వసుదేవులకు సంభవించాడు

తతో నన్దవ్రజమితః పిత్రా కంసాద్విబిభ్యతా
ఏకాదశ సమాస్తత్ర గూఢార్చిః సబలోऽవసత్

కంసుని వలన భయపడుతున్న తల్లి తండ్రుల కోరిక తీర్చడానికి రేపల్లె జేరి పదకొండు సంవత్సరాలు తన తేజస్సును దాచుకున్నాడు

పరీతో వత్సపైర్వత్సాంశ్చారయన్వ్యహరద్విభుః
యమునోపవనే కూజద్ ద్విజసఙ్కులితాఙ్ఘ్రిపే

కౌమారీం దర్శయంశ్చేష్టాం ప్రేక్షణీయాం వ్రజౌకసామ్
రుదన్నివ హసన్ముగ్ధ బాలసింహావలోకనః

స ఏవ గోధనం లక్ష్మ్యా నికేతం సితగోవృషమ్
చారయన్ననుగాన్గోపాన్రణద్వేణురరీరమత్

ప్రయుక్తాన్భోజరాజేన మాయినః కామరూపిణః
లీలయా వ్యనుదత్తాంస్తాన్బాలః క్రీడనకానివ

విపన్నాన్విషపానేన నిగృహ్య భుజగాధిపమ్
ఉత్థాప్యాపాయయద్గావస్తత్తోయం ప్రకృతిస్థితమ్

అయాజయద్గోసవేన గోపరాజం ద్విజోత్తమైః
విత్తస్య చోరుభారస్య చికీర్షన్సద్వ్యయం విభుః

వర్షతీన్ద్రే వ్రజః కోపాద్భగ్నమానేऽతివిహ్వలః
గోత్రలీలాతపత్రేణ త్రాతో భద్రానుగృహ్ణతా


దూడలతోటీ గోపాలురతోటీ కలిసి బృందావనంలో యమునాతీరములో విహరించాడు. రేపల్లెలో ఉన్నవారికి బాల చేష్టలు చూపించడానికి, రేపల్లెలో ఉన్నవారిని నవ్వడానికి స్వామి ఏడిచాడు. ఏడుస్తున్నట్లుగా ఉన్నటువంటి నవ్వుని చూపాడు. చిన్న బాలసిమ్హం లాంటి చూపులు చూసిన మహానుభావుడు. వేణువును వాయిస్తూ, లక్ష్మీ నివాసమైన గోధనాన్ని కాపాడుతూ, బొమ్మలని తీసి పారేసినట్లుగా కంసుడు పంపిన రాక్షసులని సంహరిస్తూ. కాళీయ హ్రదంలో ఆ విషం తాగి మరణించిన గోపాలురని తన దివ్య కటాక్షంతో బ్రతికించాడు. నదునితో గోరసంతో (పాలు పెరుగు వెన్న నెయ్యి) యజ్ఞ్యం చేయించాడు, తద్వారా బాగా పెరిగిన ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలో నేర్పాడు. నాకు ఆచరించే యజ్ఞ్యాన్ని భంగం చేస్తారా అని ఇంద్రుడు కోపించి వర్షం కురిపిస్తే ఇంద్రున్ని గోపాలురనీ, ఉభయులనూ అనుగ్రహించాలని గోవధన పర్వతాన్ని గొడుగులా ఎత్తి కాపాడిన మహానుభావుడు

శరచ్ఛశికరైర్మృష్టం మానయన్రజనీముఖమ్
గాయన్కలపదం రేమే స్త్రీణాం మణ్డలమణ్డనః

శరత్కాలంలో అహ్లాదాన్ని కలిగించే చంద్రుని కిరణములచే అలంకరించబడిన బృందావనంలో రాత్రిని అతి మధురంగా గానం చేస్తూ గోపికా మండలం (రాసమండలం) ఏర్పరచుకుని గోపికలను ఆనందింపచేసిన మహానుభావుడు

ఈ అధ్యాయం అంతా పరమాత్మ కొన్ని లీలలను తలచుకోవడమే. పరమాత్మ విరహాన్ని భరించలేని విదురుడు చేసిన స్తోత్రమే ఇది.

Saturday, December 29, 2012

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ప్రథమ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ప్రథమ అధ్యాయం

ఉపోధ్ఘాతం
శ్రీమద్భాగవతంలో అతి ముఖ్యమైనది విదుర మైత్రేయ సంవాదం. తృతీయ పంచమ ఏకాదశ స్కంధాలు ముఖ్యమైనవి. పంచమ స్కంధంలో ఉన్నదంతా భూగోళం గురించి. అదంతా పరమాత్మ స్థూల రూపం. కృష్ణోద్ధవ సంవాదంలో చాలా ముఖ్యమైన అధ్యాయాలు ఉన్నాయి. అది అంతా పూర్తి తత్వం. ఉపాసన అంటే ఏంటి, యోగం అంటే యేంటి సాఖ్యం అంటే ఏంటి భక్తి అంటే ఏంటి.  వీటి వికాస రూపం ఏంటి సంకోచ రూపం ఏమిటి. భక్తి జ్ఞ్యానాల సమన్వయం ఎలా చేయాలి. విధుర మైత్రేయ సంవాదం, కృష్ణ ఉద్ధవ సంవాదం చాలా ముఖ్యమైనవి. ప్రధమ స్కంధం పాదములైతే, ద్వితీయ స్కంధం జానువులైతే, తృతీయ స్కంధం ఊరువులు.
పరమాత్మ యందు భక్తి కలగాలంటే జగత్తు మీద విరక్తి కలగాలి. అందుకు జగత్తు యొక్క పరమాత్మ యొక్క నిజస్వరూపం తెలియాలి. మన శరీరంలో ఊరువులను జ్ఞ్యానంతోనూ, నడుమును వైరాగ్యంతోనూ, స్తనములను భక్తితోనూ పోలుస్తారు. మనకు బుద్ధియోగం ఇచ్చేది భగవానుడే. అందుకే అందులో మొదటి శ్లోకం అదే సూచిస్తుంది.

శ్రీశుక ఉవాచ
ఏవమేతత్పురా పృష్టో మైత్రేయో భగవాన్కిల
క్షత్త్రా వనం ప్రవిష్టేన త్యక్త్వా స్వగృహమృద్ధిమత్

వనమునకు ప్రవేశించిన విదురుడు ప్రశ్నించినపుడు మైత్రేయుడు ఏమి చెప్పాడు. సకల ఐశ్వర్యంతో కూడిన తన ఇంటిని విడిచిపెట్టి

యద్వా అయం మన్త్రకృద్వో భగవానఖిలేశ్వరః
పౌరవేన్ద్రగృహం హిత్వా ప్రవివేశాత్మసాత్కృతమ్

కౌరవులకు మంత్రిగా ఉన్న విదురుడు (హస్తిన నుంచి లక్క ఇంటికి వెళ్ళేలోపు మూడు సార్లు పాండవులపై హత్యా యత్నం జరిగింది. బిదికృత్ అనే రాక్షసుడు ఒకసారి, కల్పించబడిన దావాగ్నితో ఒక సారి, విషప్రయోగంతో ఒకసారి. ఈ మూడు ప్రయత్నాలను విధురుడు వారించాడు. తద్వారా కౌరవులకు నరకం రాకుండా చేసాడు. యుద్ధంలో మరణిస్తే పాపం పోతుంది. ఇలాంటి పని చేయడంవలన పాపం వస్తుంది. దారిలో ప్రయత్నం చేయొద్దని వారించాడు. పాండవులు ఒక స్థానం ఏర్పరుచుకునే వరకూ వారినేమీ చేయొద్దని చెప్పాడు. అలాగే ధర్మరాజు హస్తిన నుంచి వెళ్ళేప్పుడు ఒక చిన్న ఎలుకని ఇస్తాడు. ధర్మరాజదులు లక్క ఇంటిలోకి వెళ్ళినపుడు ఆ ఎలుక ఒక కన్నంలోకి వెళ్తుంది. ఇది చూసిన ధర్మరాజుకు మనం కూడా ఒక సొరంగం ఏర్పరచుకోవాలన్న ఉపాయం వస్తుంది.),
అలాంటి విధురుడు అడవికి వెళ్ళాడు

రాజోవాచ
కుత్ర క్షత్తుర్భగవతా మైత్రేయేణాస సఙ్గమః
కదా వా సహసంవాద ఏతద్వర్ణయ నః ప్రభో

అసలు విధుర మైత్రేయ సమాగమం ఎలా జరిగింది. వారు ఎపుడు మాట్లాడుకున్నారు.

న హ్యల్పార్థోదయస్తస్య విదురస్యామలాత్మనః
తస్మిన్వరీయసి ప్రశ్నః సాధువాదోపబృంహితః

విదురునిలాంటి భాగవతుడు సామాన్య ప్రశ్నలు అడగడు. విదురుడు యముని అంశ. పరమాత్మ మాయను తెలిసిన పన్నెండు మంది భాగవతోత్తములలో ఆయన ఒకడు. మొత్తం పదునాలుగు లోకాలలో ఆయన మాయను తెలిసిన వారిలో యముడు నాలగవ వాడు. మనకు భారతంలో 9 మంది కృష్ణులు అయిదుగురు యముళ్ళు, నలుగురు సూర్యులు, ముగ్గురు చంద్రులు, నలుగురు రుద్రులు, శ్రీమన్నారాయణ పరిపూర్ణ తత్వంగా ఒక ముగ్గురూ. ఇలా 27 మంది ఉంటారు. దిక్పాలకులు నారాయ్ణుడు, సూర్యుడు చంద్రుడు. ఉదాహరణకు సాత్యకి, సాంబుడు సైంధవుడు అశ్వద్ధామ రుద్రాంశలు, తొమ్మండుగురు కృష్ణులు, ఐదుగురు యముళ్ళు, ముగ్గురు సూర్యులు. వీరందరూ రాయబారంలో కలిసారు. ఇలాంటి మహాజ్ఞ్యాని అయిన విదురుడు మైత్రేయుని చిన్న విషయాలగురించి అడిగి ఉండడు. చిన్న ప్రయోజనం ఆశించేవారు కాదు.
మైత్రేయుడు వ్యాసుని సహాధ్యాయి. అటువంటి ఉత్తముడైన మైత్రేయునితో అడిగిన ప్రశ్న, పరమాత్మ అయిన భగవంతుని చర్చకు సంబంధించినది అయి ఉంటుంది. పరమాత్మ ఎవరికోసం అవతరిస్తాడో (పరిత్రాణాయ సాధూనాం) వారికోసం మాట్లాడుకున్న మాటలే అవుతాయి గానీ మామూలు కబుర్లు కావు  (మనలాగ ఆయుష్షును వృధా చేసే చర్చలు కావు)

సూత ఉవాచ
స ఏవమృషివర్యోऽయం పృష్టో రాజ్ఞా పరీక్షితా
ప్రత్యాహ తం సుబహువిత్ప్రీతాత్మా శ్రూయతామితి

అలా పరీక్షితు చేత అడుగబడిన శుకుడు, మంచి విషయాలను బాగా తెలిసినవాడు (సుబహువిత్ప్రీతాత్మా ) ఇలా చెప్పాడు

శ్రీశుక ఉవాచ
యదా తు రాజా స్వసుతానసాధూన్పుష్ణన్న ధర్మేణ వినష్టదృష్టిః
భ్రాతుర్యవిష్ఠస్య సుతాన్విబన్ధూన్ప్రవేశ్య లాక్షాభవనే దదాహ

దుర్మార్గులైన పుత్రులని పోషిచిస్తూ, తద్వార కలిగిన అధర్మాన్ని వలన దృష్టి (జ్ఞ్యానము) పోయిన దృతరాష్ట్రుడు, తన కన్నా చిన్నవాడైన పాండురాజు పుత్రులను, తండ్రి లేని వారు అయిన పాండవులను.
(ఓర్పు అనేది తల్లి, ధర్మం అనేది తండ్రి. పాండవులకు కుంతి ఉంది. అంటే ఓర్పు ఉంది. వారికే ఓర్పులేకపోతే అంతవరకూ సహించి ఉండి ఉండేవారు కాదు. పాండవులు ధర్మం ఆచరించుట వలన తండ్రి ఉన్నవారే అయినారు.). అటువంటి వారిని లక్క ఇంటిలో ప్రవేశింపచేసి కాల్చాడు

యదా సభాయాం కురుదేవదేవ్యాః కేశాభిమర్శం సుతకర్మ గర్హ్యమ్
న వారయామాస నృపః స్నుషాయాః స్వాస్రైర్హరన్త్యాః కుచకుఙ్కుమాని

 నిండు సభలో పతివ్రత కేశాలను పట్టుకున్నారు. సకలవేద సారం పతివ్రత కేశములుగా మారుతాయి (కచ స్పర్శ గతాయుష: అయ్యారు కౌరవులు). ద్రౌపతీ కేశములు స్పృశించుట వలన వారి ఆయుష్షు పోయింది. సామాన్యుల కేశాలు అధర్మానికి చిహ్నం అయితే, పతివ్రత కేశాలు సకల్వేద సారం. తెలిసి అయినా తెలియక అయినా పతివ్రత కేశములు ముట్టుకుంటే కులం మొత్తం నశిస్తుంది.
కురుదేవ దేవి అయిన ద్రౌపతి యొక్క కేశముల స్పర్శించిన, ఆ నిందించవలసిన పనిని తన కుమారులు చేయడం చూసి కూడా ఏమి అనలేదు. విదురుడు అప్పటికే దృతరాష్ట్రునికి చెప్పాడు. ద్రౌపతి కన్నీళ్ళు భూమి మీద పడకముందే వారించు అని చెప్పాడు. యుద్ధములో కూడా రాజు ఓడిపోతే మహారాణిని గౌరవంగా చూచి ఆ రాణి బయటకు వెళ్ళదలచుకుంటే వారిని సమర్యాదగా పంపిస్తారు. అలాంటిది సొంత కోడలికి అవమానం జరుగుతుంటే, ద్రౌపది కన్నీరు వక్ష్స్థలం మీద పడుతున్నా సరే వారించకుండా ఉన్నాడు. స్త్రీ కన్నీరు వక్షస్థలం మీద పడరాదు. అవి సకల జీవకోటికీ ప్రాణం జ్ఞ్యానం ఇచ్చేవి.

ద్యూతే త్వధర్మేణ జితస్య సాధోః సత్యావలమ్బస్య వనం గతస్య
న యాచతోऽదాత్సమయేన దాయం తమోజుషాణో యదజాతశత్రోః

ధర్మరాజు పరమ సాధువు. ఆయనకున్న మరో బిరుదు సత్యావలంబుడు. ఆయనకున్న బలం సత్యం. ఎన్ని పోయినా ఆయన సత్యాన్ని విడిచిపెట్టడు. ఉత్తరగోగ్రహ్ణ ఘట్టములో బీష్ముడు అర్జనుని చూచి అజ్ఞ్యాతవాసము ముగిసే ఉంటుంది ఎందుకంటే "ధర్మరాజుకు తెలిసిన ధర్మములు మనకు తెలియవు " అంటాడు.
అరణ్య అజ్ఞ్యాత వాసాలు గడిచాక కూడా వరికి రాజ్యం ఇవ్వలేదు, ధర్మరాజు అడిగాక కూడ ఇవ్వలేదు. దూతను పంపాక కూడా ఇవ్వలేదు. ఇంకో దూతను పంపాక కూడా ఇవ్వలేదు. అయినా ఇవ్వకుంటే యుద్ధానికి దిగాడు. అజ్ఞ్యానాన్ని బాగా సేవించేవాడై (తమోజుషాణో ) ధర్మరాజుకు రాజ్యం ఇవ్వలేదు. చివరికి సత్యావలంబుడైన ధర్మరాజు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు "నీ రాజ్యము కూడా నాకు కావాలి అని నన్ను అడుగు. నీకు ఇచ్చేస్తాను. " దుర్యోధనుడి వాదం ఏమిటంటే "పాండు మహారాజు పుత్రులు కారు వీరు. అందుకు వీరికి రాజ్యభాగం లేదు". ఆ మాటకొస్తే కౌరవులు కూడా విధవా పుత్రులు.  కాని దుర్యోధనుడు అన్నట్లు ధర్మరాజు ఆ మాట ఎప్పుడూ అనలేదు. హక్కుగా తీసుకోవలసిన రాజ్యమును ధర్మరాజు యాచించినా వారికి ఇవ్వలేదు. వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం అరణ్య అజ్ఞ్యాత వాసాలు పూర్తి అయ్యాక రాజ్యం ఇవ్వాలి.

యదా చ పార్థప్రహితః సభాయాం జగద్గురుర్యాని జగాద కృష్ణః
న తాని పుంసామమృతాయనాని రాజోరు మేనే క్షతపుణ్యలేశః

జగత్గురువైన శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన మాటలు కూడా మంచివనుకోలేదు. పుణ్యములేని వాడైన దుర్యోధనుడు, పురుషులకు అమృతములా తోచేమాటలు చెప్పే (లేదా జీవులకు మోక్ష ప్రదమైన మాటలు అయిన) వాక్యములను కూడా గొప్పవిగా భావించలేదు.
 మనం చేసే ప్రతీ పని వెనక మన సంస్కారం ప్రేరణ. మనకి పుణ్యమే ఉండి ఉంటే మంచి మాటకి ఒప్పుకుంటాము.

యదోపహూతో భవనం ప్రవిష్టో మన్త్రాయ పృష్టః కిల పూర్వజేన
అథాహ తన్మన్త్రదృశాం వరీయాన్యన్మన్త్రిణో వైదురికం వదన్తి

విదురుడు చెప్పిన నీతి వాక్యాలను కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా సభనుంచి బహిష్కరించాడు. దృతరాష్ట్రుడు మంత్రాంగం కోసం మంత్రులందరిలో వరీయుడైన (గొప్పవాడైన, పరమశ్రేష్టుడైన) విదురుడు చెప్పిన విషయాలని మిగిలిన మంత్రులందరూ విదురనీతి అన్నారు. ఒక మంత్రి రాజ్యసభలో మాట్లాడిన మాటలను ఇంతకాలం పాటు భద్రపరచి పెట్టుకున్నాము. మంత్రి అయిన వాడు కర్తవ్యం గూర్చి రాజు అడిగితే రాజకీయ స్వభావాన్నే చెప్పకూడదు. లోకస్వభావాన్ని, ధర్మస్వభావాన్నీ, రాజ్యకృత్యాన్ని చెప్పాలి. ఇలాంటి విషయాలలో లోకం ఏం చేస్తుంది, ధర్మం ఏం చెబుతుంది, రాజు ఏమి చేయాలి. ఒక్క రాముని దెబ్బ తగలగానే తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రావణుడు. తాను పలికినవన్నీ ప్రగల్భాలు అని తెలుసుకున్నాడు. విభీషణుడు, మాల్యవంతుడు, అకంపనుడు, విద్యున్మాలి చెప్పినపుడు, యమ వజ్రములతో సాటి వచ్చే నా బాణపు దెబ్బ రాముడు చూడలేదు కాబట్టి నా మీదకు వస్తున్నాడు అని. శత్రువు చంపినా ప్రతిక్రియ ఏమాత్రమూ చేయలేని స్థితిలో రావణుడు ఉన్నాడు. రాముడు ధర్మాత్ముడు కాబట్టి వదిలిపెట్టాడు. అపుడు కుంభకర్ణుడు "మొదలు చేయాల్సిన పనులు తరువాత చేసేవాడు నరాధముడు" అని అన్నాడు. మంత్రి అయిన వాడు కేవలం రాజనీతే కాకుండా లోకధర్మాలు చెబుతాడు.
అలా విదురుడు చెప్పినమాటను సభలో ఉన్న మహామంత్రులందరూ ఆ ఉపదేశాన్ని విదురనీతిగా చాటారు. తోటి మంత్రులందరూ మెచ్చుకున్న విదురుని మాటను తిరస్కరించాడు ధుర్యోధనుడు

అజాతశత్రోః ప్రతియచ్ఛ దాయం తితిక్షతో దుర్విషహం తవాగః
సహానుజో యత్ర వృకోదరాహిః శ్వసన్రుషా యత్త్వమలం బిభేషి

మొదటి మాటగా "అజాతశత్రువుకి అతని భాగం ఇవ్వు, ఆ అజాతశత్రువు ఏ మాత్రమూ సహించ శక్యము కాని (దుర్విషహం ) నీ తప్పును క్షమించాడు. నిజముగా నీవు భయపడాల్సింది వృకోదరుని గురించి (ప్రతిజ్ఞ్య చేసాడు గనుక - దృతరాష్ట్ర పుత్రులంతా నా పాలు, వారిని నేను చంపుతా అని చెప్పాడు.). తమ్ములతో కలిసి ఉన్న భీమ సర్పము కోపముతో బుసలు కొడితే, చెప్పడానికి వీలు లేనంతగా నీవు భయము చెందుతావు. " అహంకారమనేది మన అంతఃకరణాన్ని పూర్తిగా పరీక్షిస్తుంది. ప్రతీ క్షణం మన అంతఃకరణం మనకి నిశ్చయతత్వాన్ని బోధిస్తుంది. అయినా మనసు వినదు.

పార్థాంస్తు దేవో భగవాన్ముకున్దో గృహీతవాన్సక్షితిదేవదేవః
ఆస్తే స్వపుర్యాం యదుదేవదేవో వినిర్జితాశేషనృదేవదేవః

పాండవులు మహావీరులు. అంతకన్నా వారందరినీ భగవానుడు పాండవులను తన వారిగా చేసుకున్నాడు. ఆ మహానుభావుడు క్షితి దేవులకు దేవుడు, బ్రాహ్మణులు దేవతలుగా కలవాడు. అలాంటి వాడు పాండవులను తనవారిగా స్వీకరించాడు. ఆయన ఇపుడు ద్వారకా నగరములో ఉన్నాడు. భూమండలంలో ఉన్న సకల రాజులను తన పరాక్రమంతో గెలించిన కృష్ణపరమాత్మ తాను రక్షకుడిగా పాండవులను స్వీకరించాడు. స్వీకరించి తన నగరములో ఉన్నాడు. ఆయన ద్వారకలోనే ఉండటం నీకు క్షేమం. నీవు వారి రాజ్య భాగం వారికిస్తే ఆయన అక్కడే ఉంటాడు. అదే నీకు క్షేమం.

స ఏష దోషః పురుషద్విడాస్తే గృహాన్ప్రవిష్టో యమపత్యమత్యా
పుష్ణాసి కృష్ణాద్విముఖో గతశ్రీస్త్యజాశ్వశైవం కులకౌశలాయ

మీరు చేస్తున్నది ఎంత పెద్ద తప్పో మీకు అర్థం కావట్లేదేమో. నీ పిల్లలు అనుకుని ఇంట్లోకి వచ్చావు. కానీ నీవు కృష్ణ పరమాత్మకు విముఖుడవై సంతానాన్ని పోషిస్తున్నావు. ఇప్పటికైనా ఇటువంటి అమంగళ కృత్యాన్ని విడిచిపెట్టు (త్యజ ఆశు అశైవం - అమంగళకరమైన పనిని వదిలిపెట్టు)

ఇత్యూచివాంస్తత్ర సుయోధనేన ప్రవృద్ధకోపస్ఫురితాధరేణ
అసత్కృతః సత్స్పృహణీయశీలః క్షత్తా సకర్ణానుజసౌబలేన

ఇలా మాట్లాడిన విదురుని మాటలు విని కోపంతో అదురుతున్న పెదవులతో కర్ణ దుశ్శాసన శకునిలతో కలిసి ఉన్న దుర్యోధనుడు సజ్జనులచేత సన్మానించబడే (సత్స్పృహణీయశీలః ) విదురుని అవమానించబడ్డాడు (అసత్కృతః )

క ఏనమత్రోపజుహావ జిహ్మం దాస్యాః సుతం యద్బలినైవ పుష్టః
తస్మిన్ప్రతీపః పరకృత్య ఆస్తే నిర్వాస్యతామాశు పురాచ్ఛ్వసానః

దాసీ పుత్రుడైన, సభలోకి వచ్చే యోగ్యతలేని ఈ కపటిని ఎవరు పిలిచారు. ఎవరి భోజనంతో పోషింపబడ్డాడో, ఎవరి అన్నం తిన్నాడో వారికి వ్యతిరేకంగా ఉన్నాడు, శత్రువుల పని చేస్తున్నాడు. ఇతనిని నగరం నుండి బహిష్కరించండి. ఎవరు మనకు వ్యతిరేకులో వారికి అనుకూలముగా మాట్లాడుతున్నాడు.

స్వయం ధనుర్ద్వారి నిధాయ మాయాం భ్రాతుః పురో మర్మసు తాడితోऽపి
స ఇత్థమత్యుల్బణకర్ణబాణైర్గతవ్యథోऽయాదురు మానయానః

ఇలా మర్మములని తాకే బాణము వంటి మాటలతో తమ్ముడిని అవమానించినా దృతరాష్ట్రుడు ఏమీ అనలేదు.
అన్నగారు మాట్లాడలేదు కాబట్టి, భగవంతుని మాయా చాలా గొప్పదని తలచి, ఏ మాత్రమూ బాధపడకుండా ధనస్సును సభాద్వారములో పెట్టి వెళ్ళాడు. (మంత్రి అలా పెట్టడం ఆ రాజ్యానికి క్షయం, మంత్రి అస్త్ర త్యాగము చేయకూడదు. మహాభారతములో ఐదుగురు అస్త్ర సన్యాసం చేసారు. విదురుడు దృఓణుడు బీష్ముడు అశ్వధ్ధామ (యుద్ధం బయట విడిచాడు), బీష్ముని మాటతో కర్ణుడు వీరందరూ అస్త్ర త్యాగము చేసారు. మహావీరుడు అయిన విదురుడు మొదట అస్త్ర సన్యాసం చేసాడు. అన్ని ఉన్న సమర్ధున్ని యుద్ధానికి ముందు వదులుకున్నాడు దుర్యోధనుడు. విదురుడు ఎలాంటి బాధా లేకుండా వెడలిపోయాడు

స నిర్గతః కౌరవపుణ్యలబ్ధో గజాహ్వయాత్తీర్థపదః పదాని
అన్వాక్రమత్పుణ్యచికీర్షయోర్వ్యామధిష్ఠితో యాని సహస్రమూర్తిః

కురువ్ వంశ రాజుల పూర్వ జన్మ పుణ్య లేశముతో దొరికిన విదుర్డు వెళ్ళిపోయాడు. తీర్థపదః - పవిత్రమైన పాదములు గలవాడు, లేదా తీర్థ యాత్రలకు వెళ్ళదలచుకున్నవాడు. తన పాదములతో అన్ని ప్రదేశాలను పవిత్రం చేయగలవాడు. కాస్త పుణ్యాన్ని సంపాదించుకుందామని (ఇంత కాలం దృతరాష్ట్రునికి మంత్రిగా ఉండి సంపాదించుకున్న పాపం పోగొట్టుకోవడానికి) తీర్థయాత్రలకు బయలుదేరాడు. సహస్రమూర్తిః అయిన పరమాత్మ తన నివాసాలుగా వేటిని చేసుకున్నడో అవి దర్శించడానికి వెళ్ళాడు.

పురేషు పుణ్యోపవనాద్రికుఞ్జేష్వపఙ్కతోయేషు సరిత్సరఃసు
అనన్తలిఙ్గైః సమలఙ్కృతేషు చచార తీర్థాయతనేష్వనన్యః

పవిత్రములైన వనాలు, అద్రులు (పర్వతాలు), తోటలలోనూ( బృందావనం), బురదలేని నీరులేని నీటిలోనూ (సత్వగుణాన్ని వృద్ది పొందిచే నదులు సరస్సులలోనూ), పరమాత్మ అనంతమైన ఆర్చా మూర్తులు ఉన్న క్షేత్రాలు, అనన్యమైన భావనతో (ఎటువంటి విషయములూ ఆలోచించకుండా) బయలుదేరాడు.

గాం పర్యటన్మేధ్యవివిక్తవృత్తిః సదాప్లుతోऽధః శయనోऽవధూతః
అలక్షితః స్వైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని

తీర్థ యాత్రలు ఎలా చేయాలో మనకి చెప్పే శ్లోకం ఇది.
అవధూతగా తిరిగాడు, పవిత్రమైన దాన్ని ఆహారముగా, ఒంటిగా (వివిక్త) భోజనం చేసాడు. రోజూ మూడు పూటలా స్నానము చేస్తూ (సదాప్లుతోऽధః), నేల మీద పడుకుంటూ (అధః శయనో), తనవారెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు, దుమ్ము ధూళితో నిండి ఉండి అవధూత వేషముతో ఉండి, స్వయముగా అందగాడు కాబట్టి తన అందము ఇంకొకరి మనసులో వికారం కలిగించకుండా అవధూత పరమాత్మను సంతోషింపచేసే వేషములో వ్రతములు చేస్తూ
(భార్య భర్తలు కలిసి భోజనం చేయకూడదు. ఒంటరిగా భోజనం చేయాలి. నలుగురిలో కూర్చుని భోజనం చేస్తే పదార్థాలు ఒకటే అయినా తినే తీరుని చూస్తే అధర్మం వస్తుంది. తన చొట్టూ కూర్చున్న వారు అధర్మంగా తింటే దాని మీదకు మనసు పోతుంది. )
అందరూ నిత్య స్నానమూ (మూడు స్నానములు), నిత్య ఉపవాసం (రోజుకు రెండుపూటలా భుజించడం), నిత్య బ్రహ్మచర్యము చేయాలని శాస్త్రం. పరమాత్మ ప్రసాదించిన సకల అవయవములనూ ఇంద్రియములనూ, అన్ని కాలములనూ, అన్ని దేశములనూ, ఆయనకి మాత్రమే ఉపయోగించగలుగుట పరమాత్మకి సంతోషాన్నిస్తాయి. మనం చేసే భోజనం, స్నానం, చేసే సంభాషణలు, మనం అనుభవించే భోగములూ, ఇవన్నీ మన కొరకు కాదు. ఇవి అంతా స్వామి కొరకే , స్వామి సేవే అనుకోవాలి. ప్రాణాయ అపానాయ అంటూ ఆయనకు అర్పిస్తే దానిని భోజనం అనరు. ఇది భాజనం అంటారు. భాజనం అంటే పాత్ర. పరమాత్మ సేవకు ఇది పాత్ర. పరమాత్మ భుజించేది రెండు మార్గాలలో. 1. భక్తుల నాలుకల మీద 2. అగ్ని ద్వారా. అందుకే తదీయ ఆరాధన అని పరమాత్మ భక్తులను ఆరాధిస్తాము.

ఇత్థం వ్రజన్భారతమేవ వర్షం కాలేన యావద్గతవాన్ప్రభాసమ్
తావచ్ఛశాస క్షితిమేక చక్రామ్లేకాతపత్రామజితేన పార్థః

ఇలా పర్యటిస్తూ ప్రభాస తీర్థం చేరాడు. ఇలా ఆయన ప్రభాస తీర్థానికి వెళ్ళేసరికి ఈ భూమండలం ధర్మరాజు పాలనలోకి వచ్చింది.

తత్రాథ శుశ్రావ సుహృద్వినష్టిం వనం యథా వేణుజవహ్నిసంశ్రయమ్
సంస్పర్ధయా దగ్ధమథానుశోచన్సరస్వతీం ప్రత్యగియాయ తూష్ణీమ్

ప్రభాస తీర్థంలో తన బంధువుల నాశం విన్నాడు. మహారణ్యంలో వెదురు పొదలు పరస్పరం ఘర్షించుకుంటే వనం మొత్తం కాలుతుంది. ఆ వనంలో పుట్టిన అగ్నితోటే కాలింది. అమర్షం (అసూయ) వలన కలిగిన అగ్ని సమూలముగా నశింపచేస్తుంది. ఎందుకంటే ఆ అగ్ని వారిలోనే పుట్టింది కాబట్టి. అలాగే ఈ వంశంలో కూడా, వారిలో పుట్టిన కోపం చేతనే వారు దహింపబడ్డారు. వారిలో (దుర్యోధనాదులలో) కలిగిన కొపం ఎదుటివారిలో ప్రతిబింబించి వారినే దహించి వేసింది (సూర్యునిబింబం అద్దంలో పడి ఎదురుగా ఉన్న దానిని ఎలా దహిస్తుందో)
రాజసూయం వలన పాండవుల శ్రీ ఎంతో తెలిసింది, వారి సామర్ధ్యం ఎంతో తెలిసింది. నిధికి రక్షకుడిగా దుర్యోధనున్ని ఉంచాడు. కర్ణున్ని దానానికి నియమించాడు. దానం శత్రువులచేత చేయించాలని కృష్ణుడు చెప్పాడు. రాజయ్సూయములో జరాసంధుడు తప్ప మిగతా వారందరూ స్వచ్చందంగానే వచ్చి పాండవులకు దాసోహమన్నారు. ఏదో విధంగా పాండవులను తక్కువగా చూపించాలి అని దుర్యోధనుడు జూదానికి ఆహ్వానించాడు. ఈ వైరం కేవలం స్పర్థతో వచ్చినదే (సంస్పర్ధయా ).

సరస్వతీ నది పశ్చిమానికి పారుతుంది. అలాంటి నది దగ్గరకు ఉదాసీన భావముతో వెళ్ళాడు (తూష్ణీమ్)

తస్యాం త్రితస్యోశనసో మనోశ్చ పృథోరథాగ్నేరసితస్య వాయోః
తీర్థం సుదాసస్య గవాం గుహస్య యచ్ఛ్రాద్ధదేవస్య స ఆసిషేవే

అక్కడ ఆ సరస్వతీ నదీ ప్రాంతములో ఉన్న తీర్థముల గురించి చెబుతున్నారు: ఉశన - శుక్రుడు, మనువు పృధువు అగ్ని వాయువు త్రిత: అశితుడు సుదాసుడు గోవులు గుహుడు శ్రాద్ధ దేవుడు.

అన్యాని చేహ ద్విజదేవదేవైః కృతాని నానాయతనాని విష్ణోః
ప్రత్యఙ్గముఖ్యాఙ్కితమన్దిరాణి యద్దర్శనాత్కృష్ణమనుస్మరన్తి

ఇవే కాకుండా పుణ్యక్షేత్రాలు, ఆ దరిదాపుల్లో బ్రాహ్మణోత్తముల చేతా, వారిని దేవులుగా ఆరాధించే పుణ్యాత్ములచేత ప్రతిష్టించబడిన పుణ్యక్షేత్రాలను దర్శించాడు. ప్రత్యఙ్గముఖ్యాఙ్కితమన్దిరాణి  - ప్రత్యఙ్గ అంటే ఆయుధం. ముఖ్యా - ఆయన ఆయుధాలలో ముఖ్యం చక్రం (సుదర్శనం) సుదర్శనం చేత అంకితమైన మందిరాలు. గోపురం మీద చక్రం ఉన్న మందిరాలను దర్శించాడు. అది చూడగానే కృష్ణుడు గుర్తుకు వచ్చే మందిరాలని దర్శించాడు.

తతస్త్వతివ్రజ్య సురాష్ట్రమృద్ధం సౌవీరమత్స్యాన్కురుజాఙ్గలాంశ్చ
కాలేన తావద్యమునాముపేత్య తత్రోద్ధవం భాగవతం దదర్శ

ఇలా అవన్నీ సంచరిస్తూ సౌరాష్ట్రాది దేశాలు సంచరిస్తూ, యమునా తీరానికి వచ్చాడు. యమునా తీరములో ఉద్ధవుడు దర్శనమిచ్చాడు. ఏకాదశ స్కంధములో స్వామి చెప్తాడు "నాకన్న ఏ కొంచెమూ తక్కువ కాని వాడు ఉద్ధవుడు "

స వాసుదేవానుచరం ప్రశాన్తం బృహస్పతేః ప్రాక్తనయం ప్రతీతమ్
ఆలిఙ్గ్య గాఢం ప్రణయేన భద్రం స్వానామపృచ్ఛద్భగవత్ప్రజానామ్

ఎలాంటి మానసికమైన ఉద్వేగాలు లేనివాడు, శ్రీ కృష్ణ భగవానునికి సేవకుడు, బృహస్పతికి మొదటి తనయుడు ప్రాక్తనయం. బృహస్పతి వలన నీతి శాస్త్రములను పొందినవాడు. పండితులకు ఇద్దరు పుత్రులుంటారు. మొదటి కొడుకు శిష్యుడు అని శాస్త్రం. అందుకే ప్రాక్తనయం. ఇంకో అర్థం ఉంది ప్రాక్త - నయం. బృహ్స్పతి దగ్గర నీతి శాస్త్రం చదివిన వాడు.
కృష్ణున్ని ఆలింగనం చేసుకున్ననన్న భావనతో ఉద్ధవున్ని ఆలింగనం చేసుకున్నాడు. మూడు రకాల అద్వైతాలు ఉన్నాయి. భావాద్వైతం (సకల జగత్తునీ పరమాత్మ మయం అనుకోవడం) క్రియాద్వైతం (సకల సేవలూ పరమాత్మ కార్యాలు అనుకోవడం) ద్రవ్యాద్వైతం (అన్నీ ఆయన రూపాలు అనుకోవడం)
ఉద్ధవున్ని ప్రేమతో మనగళకరమైన ఆలింగనం చేసుకున్నాడు. తనవారి (కృష్ణపరమాత్మకి సంబంధించిన తనవారి) క్షేమం అడిగాడు.

కచ్చిత్పురాణౌ పురుషౌ స్వనాభ్య పాద్మానువృత్త్యేహ కిలావతీర్ణౌ
ఆసాత ఉర్వ్యాః కుశలం విధాయ కృతక్షణౌ కుశలం శూరగేహే

తన నాభిలో ఉన్న పద్మంలో పుట్టినవాడు ప్రార్థిస్తే వచ్చిన పురాణ పురుషుడు (శ్రీ కృష్ణ బలరాములు) బాగున్నాడా. (పరమాత్మ ఎప్పుడు తనకోసం రాడు. మనం ప్రార్థిస్తే వచ్చాడు)
భూమండలం యొక్క క్షేమమును సంపూర్తిగా ఏర్పరచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారు శూర్సేనుని ఇంట్లో క్షేమంగా ఉన్నారా.

కచ్చిత్కురూణాం పరమః సుహృన్నో భామః స ఆస్తే సుఖమఙ్గ శౌరిః
యో వై స్వస్ణాం పితృవద్దదాతి వరాన్వదాన్యో వరతర్పణేన

కౌరవులకు అత్యంత ప్రీతి పాత్రమైన వాడు, శూరసేనుని మిత్రుడు, బావా అయిన వసుదేవుడు తన చెళ్ళెల్లకు అడిగిన దానికి కన్న తండ్రిలా అన్నీ ఇచ్చేవాడు. వసుదేవుడు చెళ్ళెల్లను ప్రాణాధికముగా ప్రేమించేవాడు. అలాంటి వసుదేవుడు సుఖంగా ఉన్నాడా

కచ్చిద్వరూథాధిపతిర్యదూనాం ప్రద్యుమ్న ఆస్తే సుఖమఙ్గ వీరః
యం రుక్మిణీ భగవతోऽభిలేభే ఆరాధ్య విప్రాన్స్మరమాదిసర్గే

యాదవ సైన్యాధిపతి అయిన ప్రద్యుమ్నుడు సుఖముగా ఉన్నాడా. మొదటి జన్మలో మన్మధుడిగా ఉన్న ఈయనని రుక్మిణి బ్రాహ్మణోత్తములనారాధించి పుత్రునిగా పొందింది.

కచ్చిత్సుఖం సాత్వతవృష్ణిభోజ దాశార్హకాణామధిపః స ఆస్తే
యమభ్యషిఞ్చచ్ఛతపత్రనేత్రో నృపాసనాశాం పరిహృత్య దూరాత్

యాదవులందరికీ రాజ్యాధికారం లేదు కాబట్టి మాతామహుడైన ఉగ్రసేనున్ని రాజుగా చేసాడు కృష్ణుడు. ఆ ఉగ్ర సేనుడు బాగున్నాడా. (యవ్వనాన్ని ఇవ్వనందున యయాతి ఇచ్చిన శాపం ఇది. యయాతికి వార్ధక్యం దేవయానిని వివాహం చేసుకుని కూడా దేవయాని వెంట దాసిగా వచ్చిన క్షత్రియ యువతి షర్మిష్టను కామించినందు వలన శుక్రుడు ఇచ్చిన శాపం. తాను చేసిన తప్పుకు తను అనుభవించవలసిన శిక్షను భరించేందుకు ఒప్పుకోని యదువుకి శాపం ఇచ్చాడు)
సిమ్హాసనం మీద ఆశను పూర్తిగా వదులుకుని శ్రీకృష్ణపరమాత్మ ఎవరికి రాజ్యాభిషేకం చేసాడో ఆయన బాగున్నాడా

కచ్చిద్ధరేః సౌమ్య సుతః సదృక్ష ఆస్తేऽగ్రణీ రథినాం సాధు సామ్బః
అసూత యం జామ్బవతీ వ్రతాఢ్యా దేవం గుహం యోऽమ్బికయా ధృతోऽగ్రే

రధులలో అగ్రుడైన సాంభుడు, పూర్వ జన్మలో పార్వతీ దేవి గర్భంలో ధరించిన కుమారస్వామి అయిన ఈయనని, ఆ కుమారస్వామి ఆరాధనతో జాంబవతి ఈయనను కుమారునిగా పొందింది. ఆయన  బాగున్నాడా

క్షేమం స కచ్చిద్యుయుధాన ఆస్తే యః ఫాల్గునాల్లబ్ధధనూరహస్యః
లేభేऽఞ్జసాధోక్షజసేవయైవ గతిం తదీయాం యతిభిర్దురాపామ్

యుయుధానుడైన సాత్యకి, అర్జనుని ద్వారా ధనుర్విద్యను నేర్చుకున్నవాడు బాగున్నాడా. అలా నేర్చుకుని పరమాత్మను సేవించడంతో, ఆయన అనుగ్రహంతో మహాత్ములకి కూడా దుర్లభమైన భగవత్ తత్వ జ్ఞ్యానాన్ని పొందాడు. ఈయన బాగున్నాడా

కచ్చిద్బుధః స్వస్త్యనమీవ ఆస్తే శ్వఫల్కపుత్రో భగవత్ప్రపన్నః
యః కృష్ణపాదాఙ్కితమార్గపాంసుష్వచేష్టత ప్రేమవిభిన్నధైర్యః

శ్వఫల్క పుత్రుడైన అక్రూరుడు (గాంధినీ ఈయన తల్లి ), పాపరహితుడైన వాడు (అనమీవ), పరమాత్మను మాత్రమే ఆశ్రయించినవాడు, ఈయన ఎంత గొప్పవాడంటే కన్సుని పలుపున రథం తీసుకుని బృందావనానికి చేరుతూ దారిలో "దుర్మార్గులని ఆశ్రయించవద్దని చెప్పిన శాస్త్రాలు, మరి నాకు అలాంటి దుర్మార్గుల సావాసముతోనే నాకు కృష్ణ దర్శన భాగ్యం కలుగుతోంది" అని అనుకున్నాడు.ల్ దారిలో శ్రీకృష్ణ పరమాత్మ నన్ను చూస్తాడా, మాట్లాడతాడా అనుకుంటూ గోధూళి  వేలలో గోవుల గిట్టలు చూస్తూ, అద్నులో మధ్యనున్న పరమాత్మ పాద చిహ్నములు చూస్తూ, ఆ ధూళిలో పొర్లుకుంటూ వెళ్ళాడు. అతని ధైర్యమంతా పరమాత్మ మీద ప్రేమతో తొలగిపోయింది. ఆయన బాగున్నాడా

కచ్చిచ్ఛివం దేవకభోజపుత్ర్యా విష్ణుప్రజాయా ఇవ దేవమాతుః
యా వై స్వగర్భేణ దధార దేవం త్రయీ యథా యజ్ఞవితానమర్థమ్

భోజ పుత్రి అయిన, దేవతలను సంతానముగా పొందిన అదితి లాగ, కృహ్స్ణున్ని తన కడుపులో దాచుకున్న తల్లి, ఎలా అయితే వేదం పరమాత్మను తనలో దాచుకుందో, అలా దాచుకున్న దేవకి క్షేమంగా ఉందా.

అపిస్విదాస్తే భగవాన్సుఖం వో యః సాత్వతాం కామదుఘోऽనిరుద్ధః
యమామనన్తి స్మ హి శబ్దయోనిం మనోమయం సత్త్వతురీయతత్త్వమ్

అడిగిన వారందరి కోరికలనూ తీర్చే అనిరుద్ధుడు, (సకల అవతారాల మూలము అయిన వాడు,  విరాట్ పురుషుడైన వాడు, బ్రహ్మాండములోంచి ఉద్భవించిన వాడు) వేదములకు మూలం అయినవాడు (ఈయన నిశ్వాసములే వేదములు), ఈయన నుంచే మనసు అవయవాలు వచ్చాయి. ఈయన నాలుగవ ఆకారం (సత్త్వతురీయతత్త్వమ్ - వాసుదేవ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ)

అపిస్విదన్యే చ నిజాత్మదైవమనన్యవృత్త్యా సమనువ్రతా యే
హృదీకసత్యాత్మజచారుదేష్ణ గదాదయః స్వస్తి చరన్తి సౌమ్య

పరమాత్మను ఎవరు తదేక దృష్టితో ఆశ్రయించి సేవిస్తున్నారో వారు బాగున్నారా. ఆత్మ దైవమైన పరమాత్మను, అతని యందే మనసు లగ్నం చేసే వారు బాగున్నారా. ఇలాంటి వారందరూ క్షేమంగా సంచరిస్తున్నారా

అపి స్వదోర్భ్యాం విజయాచ్యుతాభ్యాం ధర్మేణ ధర్మః పరిపాతి సేతుమ్
దుర్యోధనోऽతప్యత యత్సభాయాం సామ్రాజ్యలక్ష్మ్యా విజయానువృత్త్యా

కృష్ణార్జనులు తమ బాహు బలముతో భూమండలములో ఉన్న అధర్మాన్ని తొలగిస్తుంటే, ధర్మాన్ని స్థాపిస్తుంటే, చూచి సహించలేక ఆ అసూయతో పోయాడు దుర్యోధనుడు. కృష్ణుడు పాండవుల ధార్మిక ప్రవృత్తినీ, అర్జనుని పరాక్రమమునీ సభలో చెబుతూ ఉంటే సహించలేకపోయాడు, సామ్రాజ్యము తనకు లభించదన్న భ్రమతో.

కిం వా కృతాఘేష్వఘమత్యమర్షీ భీమోऽహివద్దీర్ఘతమం వ్యముఞ్చత్
యస్యాఙ్ఘ్రిపాతం రణభూర్న సేహే మార్గం గదాయాశ్చరతో విచిత్రమ్

పాపము చేసిన వారి పాపమును క్షమించలేక వారి యెడల పాపమును (పాపము అంటే మరణము అని అర్థము) ప్రయోగించిన వాడు భీముడు. పాములాగ ఎప్పటినుంచో వస్తున్న పగను ఎవరి ద్వారా విడిచిపెట్టాడో. అతను పరాక్రమంతో ఉద్వేగంతో గదతో దారి ఏర్పరచుకుంటూ (మార్గము చేసుకుంటూ - అంటే అడ్డు వచ్చినావారిని చంపుకుంటూ), ఒక్కొక్క అడుగూ వేస్తుంటే భూమి అతని పాదముల బరువు భరించలేకపోయింది.

కచ్చిద్యశోధా రథయూథపానాం గాణ్డీవధన్వోపరతారిరాస్తే
అలక్షితో యచ్ఛరకూటగూఢో మాయాకిరాతో గిరిశస్తుతోష

శంకరుడంతటి వాడే మాయా కిరాతుని వేషములో వచ్చి అర్జనుని పరాక్రమం చూసి సంతోషించాడో, బాణములతో గూడు కప్పినట్లుగా బాణములు వచ్చి పడితే సూర్యుడు మేఘములను భేదించుకుంటూ వచ్చినట్లు వాటిని చేధించిన అర్జనుడు బాగున్నాడా

యమావుతస్విత్తనయౌ పృథాయాః పార్థైర్వృతౌ పక్ష్మభిరక్షిణీవ
రేమాత ఉద్దాయ మృధే స్వరిక్థం పరాత్సుపర్ణావివ వజ్రివక్త్రాత్

కనుగుడ్లను రెప్పలు కాపాడినట్లుగా పాండవులచేత కాపాడబడే నకుల సహదేవులు బాగున్నారా.
యుద్ధములో గరుడుడు ఇంద్రుని సైన్యమును ఎలా తీసుకున్నాడో, అలా శత్రువుల రాజ్యము తీసుకున్న నకుల సహదేవులు బాగున్నారా

అహో పృథాపి ధ్రియతేऽర్భకార్థే రాజర్షివర్యేణ వినాపి తేన
యస్త్వేకవీరోऽధిరథో విజిగ్యే ధనుర్ద్వితీయః కకుభశ్చతస్రః

నలుదిక్కులా ఉన్న రాజులను గెలిచిన ఏక వీరుడైన పాండురాజు లేకపోయినా కొడుకుల కోసం బ్రతికి ఉన్న కుంతి బాగా ఉన్నదా

సౌమ్యానుశోచే తమధఃపతన్తం భ్రాత్రే పరేతాయ విదుద్రుహే యః
నిర్యాపితో యేన సుహృత్స్వపుర్యా అహం స్వపుత్రాన్సమనువ్రతేన

తనకు సకల సామ్రాజ్య సంపదని కట్టిబెట్టడానికి ఒంటిగా అన్ని దిక్కులకూ వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వచ్చి శత్రు  రాజుల సంపదను తెచ్చి పెట్టిన పాండురాజు మరణిస్తే, అతని పుత్రులనూ, కుంతినీ బయటకు పంపి, వారి తరపున మాట్లాడిన నన్నూ బయటకు పంపినవాడు ( దృతరాష్ట్రుడు) బాగున్నాడా

సోऽహం హరేర్మర్త్యవిడమ్బనేన దృశో నృణాం చాలయతో విధాతుః
నాన్యోపలక్ష్యః పదవీం ప్రసాదాచ్చరామి పశ్యన్గతవిస్మయోऽత్ర

ఇలా చిత్ర విచిత్రములైన పరమాత్మ లీలను చూస్తే, కనురెప్పల కదలికతో సకల చరాచర జగత్తు యొక్క గమనాన్ని శాసిస్తున్న పరమాత్మ లీలగా భావించి, పరమాత్మ అనుగ్రహంతో, శోకమూ ఆశ్చర్యమూ, అహంకారమూ లేకుండా,  అతని పాదస్థానమైన భూమి మీద సంచరిస్తున్నాను

నూనం నృపాణాం త్రిమదోత్పథానాం మహీం ముహుశ్చాలయతాం చమూభిః
వధాత్ప్రపన్నార్తిజిహీర్షయేశోऽప్యుపైక్షతాఘం భగవాన్కురూణామ్

విద్యా మదం, ధన మదం, ఆభిజాత్య మదం (ఉన్నత కులంలో పుట్టాను అన్న మదం). ఈ మూడు మదాలతో అడ్డదారిలో పడి, వారి సైన్యంతో మాటి మాటికీ భూమి మీద సంచరించేవారిని, ఆశ్రయించే వారి బాధను తొలగించే కోరికతో పరమాత్మ సంహరించాడు. ఇన్ని తప్పులు చేస్తున్న వారిని ఉపేక్షించినతకాలం ఉపేక్షించాడు.

అజస్య జన్మోత్పథనాశనాయ కర్మాణ్యకర్తుర్గ్రహణాయ పుంసామ్
నన్వన్యథా కోऽర్హతి దేహయోగం పరో గుణానాముత కర్మతన్త్రమ్

పాపాన్ని తొలగించడానికి పరమాత్మ అవతరిస్తాడు. ఆయన ఏ పనీ చేయడు (అకర్తుః). కాని సత్పురుషులు అనుసరించడానికి కర్మలు చేస్తున్నాడు. దుర్మార్గులని అణచడానికి పుడుతున్నాడు.
అలా కానట్లైతే ఆయంకు శరీరముతో ఏమి పని? ఇలాంటి శరీరాన్ని చూసి మనమే "ఈ శరీరం లేకుండా ఉంటే బాగుండు " అనుకుంటాము. అలాంటిది పాపుల రూపు మాపడానికి కాకపోతే ఆయన శరీరం ఎందుకు స్వీకరిస్తాడు. పుణ్యాత్ములకు ఆచారం తెలపడానికి కాకపోతే ఆయనకు కర్మ చేయవలసిన ఆవశ్యం ఏముంది

తస్య ప్రపన్నాఖిలలోకపానామవస్థితానామనుశాసనే స్వే
అర్థాయ జాతస్య యదుష్వజస్య వార్తాం సఖే కీర్తయ తీర్థకీర్తేః

పరమాత్మను ఆశ్రయించి ఆయన ఆజ్ఞ్యలో నిలిచి సకల లోకాలని పాలిస్తున్న లోకపాలకులను తన శాసనంలో ఉంచుకున్న వాడు, ఒక ప్రయోజనం ఆశించి పుట్టాడు, పుట్టుక అవసరం లేని వాడు పుట్టాడు . అలాంటి పవిత్రమైన కీర్తి గల పరమాత్మ యొక్క కీర్తిని కీర్తిచు. భగవంతుని లీలలను గానం చేయమని ఉద్ధవున్ని విదురుడు అడిగాడు

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 5

1. తీర్థ యాత్రలు ఎలా చేయాలో మనకి చెప్పే శ్లోకం ఇది.

గాం పర్యటన్మేధ్యవివిక్తవృత్తిః సదాప్లుతోऽధః శయనోऽవధూతః
అలక్షితః స్వైరవధూతవేషో వ్రతాని చేరే హరితోషణాని

అవధూతగా తిరిగాడు, పవిత్రమైన దాన్ని ఆహారముగా, ఒంటిగా (వివిక్త) భోజనం చేసాడు. రోజూ మూడు పూటలా స్నానము చేస్తూ (సదాప్లుతోऽధః), నేల మీద పడుకుంటూ (అధః శయనో), తనవారెవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు, దుమ్ము ధూళితో నిండి ఉండి అవధూత వేషముతో ఉండి, స్వయముగా అందగాడు కాబట్టి తన అందము ఇంకొకరి మనసులో వికారం కలిగించకుండా అవధూత పరమాత్మను సంతోషింపచేసే వేషములో వ్రతములు చేస్తూ

2. భార్య భర్తలు కలిసి భోజనం చేయకూడదు. ఒంటరిగా భోజనం చేయాలి. నలుగురిలో కూర్చుని భోజనం చేస్తే పదార్థాలు ఒకటే అయినా తినే తీరుని చూస్తే అధర్మం వస్తుంది. తన చొట్టూ కూర్చున్న వారు అధర్మంగా తింటే దాని మీదకు మనసు పోతుంది.

3.  అహంకారమనేది మన అంతఃకరణాన్ని పూర్తిగా పరీక్షిస్తుంది. ప్రతీ క్షణం మన అంతఃకరణం మనకి నిశ్చయతత్వాన్ని బోధిస్తుంది. అయినా మనసు వినదు.

4. శిశుపాలుడు రాజసూయానికి వచ్చేసరికే 92 తప్పులు జరిగాయి. రాజసూయములో మిగిలిన ఎనిమిదీ చేసాడు

5. రధులలో అగ్రుడైన , పూర్వ జన్మలో పార్వతీ దేవి గర్భంలో ధరించిన కుమారస్వామి అయిన సాంబుడిని, ఆ కుమారస్వామి ఆరాధనతో జాంబవతి ఈయనను కుమారునిగా పొందింది.

6. సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైః సుఖం వాన్యదుపారమం వా
విన్దేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్వదేన్నః

ఇది మనమందరమూ వేసుకోవాలసిన ప్రశ్న. ప్రపంచములో ప్రతీ ప్రాణీ ఎందుకు పని చేస్తుంది? సుఖం కోసం. కానీ వాళ్ళు చేసే పనుల వలన సుఖం కలుగుతున్నదా? పోనీ దుఖమైనా తొలగుతోందా (అన్యదుపారమం వా).
ఈ రెండూ లేకపోగా, ఆ  పనుల వలన మరికాస్త దుఃఖం కలుగుతోంది. ఇది న్యాయమేనా. దీనిలో ఏది యుక్తమో మీరు చెప్పండి. సుఃఖం కోసం పని చేస్తుండగా దుఃఖం ఎందుకు కలుగుతోంది.

7.  ప్రతీ దానిలో ఉన్న సూక్ష్మ పరిశీలనాత్మక బుద్ధిని చిత్తం అంటారు. పరిశీలించే పని చిత్తానిది. నిశ్చయించే పని అంతఃకరణానిది ఆలోచించే పని బుద్ధిది, మార్పు చెందే పని మనసుది. ఈ నాలుగూ వేరు.

8. భాగవత పరంపర: మైత్రేయుడు విదురునితో ఈ విధంగా చెప్పాడు
సనత్కుమారులు అడిగితే నివృత్తి ధర్మ పరివృత్తుడైన సనత్కుమారునికి ఆదిశేషుడు (సంకర్షణుడు) ఈ భాగవతం వివరించారు. సంకర్షుని ద్వారా సనత్కుమారుడు భాగవతాన్ని విన్నాడు. ఆ సనత్కుమారున్ని సాంఖ్యాయన మహర్షి అడిగారు.
భగవత విభూతులు చెప్పాలనుకున్న పారమహంస్య ముఖ్యుడైన  సాంఖ్యాయనుడు మా గురువుగారైన పరాశరునికి, బృహస్పతికీ చెప్పాడు. ఆ పరాశరుడు పరమదయాళువు కాబట్టి నాకు చెప్పాడు. ఈ పరాశరుడు వశిష్టుడికి మనుమడు (వశిష్టుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు, ఒక రాక్షసుడు శక్తిని తినివేసాడు. ఆ విషయం తెలుసుకున్న పరాశరుడు రాక్షస వినాశానికి ఒక యజ్ఞ్యం చేసాడు. అప్పుడు పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వచ్చి వారించాడు. అప్పుడు పులస్త్యుడు సంతోషించి పురాణ కర్తవి అవ్వమని వరమిచ్చాడు. పురాణానికి ఆద్యం విష్ణు పురాణం), పులస్త్య బ్రహ్మ ఇచ్చిన వరము వలన మా గురువుగారు భాగవతాన్ని నాకు వివరించాడు. నేను నీకు దాన్నే చెప్పబోవుతున్నాను

9. ప్రణత అర్తి అర్థ ప్రదుడు అని కంచి వరదరాజ స్వామికి పేరు.

10. పూర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగసమాధినా
రాద్ధం నిఃశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్త్వవిన్మతమ్

యజ్ఞ్య యాగాదులూ చేసి, తోటలూ దేవాలయాలు, చెరువులూ బావులు నిర్మించడం - ఇలా పూర్తములతో, దానములతో యోగములతో సమాధులతో, వీటన్నిటి వలన కలిగే ఉత్తమ శ్రేయస్సు ఒకటే. నేను సంతోషించుటే. నేను సంతోషించుటే దేనికైనా ఫలము. (పరమ శివుడు హాలాహలాన్ని తాగుతూ "ఇలా చేస్తే హరి సంతోషితాడు" అని అంటారు). ప్రపంచంలో చేసే అన్ని పనులకూ ఏకాంత ఫలం నా సంతోషమే అని తత్వము తెలిసిన వారి సిద్ధాంతం. అందుకే మనం భగవదాజ్ఞ్యతో భగవంతుని ప్రీతి కొరకు భగవంతుని కైంకర్యముగా పనులు చేస్తాము.

11. పాపమే అజ్ఞ్యానానికి కారణం. అలాంటి పాపం మన దరికి రాకుండా చేయమని స్వామిని ప్రార్థిస్తాము. మనం ఏ సమయములో ఏమి అనుభవించాలో ముందే రాసి ఉంటుంది. పూర్వ జన్మలో చేసిన పాపమే ఇపుడు ఆలోచన రూపములో బుద్ధిరూపములో వచ్చి పాప కర్మ అనుభవించేట్లు చేస్తింది. ఎపుడైతే మనం చేసిన పుణ్యం సాత్విక భావాన్ని భక్తినీ కలిగించిందో, ఎపుడైతే మనం పుణ్య ఫలితాన్ని అనుభవిస్తున్నమో ఆ సమయాములోనే "పరమాత్మా, మళ్ళీ నా దగ్గరకి పాపం వంతు రానివ్వకూ, నీవు సర్వ సమర్ధుడవు, దయా మయుడవు. ఆ పాపమును శమింపచేసి నాకు ఇలాంటి సాత్విక బుద్ధినే కలగనీ". మనం చెడుపని చేసామంటే అది పాప ఫలితమే. గతం అనుభవించడానికే కాదు, ముందు అనుభవించాల్సిన దానికి కూడా సిద్ధం చేసుకుంటున్నాము. అలా సిద్ధం చేసుకోకుండా చేయమని ప్రార్థిస్తాము.

12. రుద్రుడు ఉండే స్థానాలు పదకొండు 1. హృదయము 2. ఇంద్రియములూ 3. ప్రాణములు 4. ఆకాశము 5. వాయువు 6. అగ్ని 7. జలం 8. భూమి 9. సూర్యుడు 10. చంద్రుడు 11. తపస్సు 

Wednesday, December 26, 2012

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం పదవ అధ్యాయం


                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం పదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః
మన్వన్తరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయః

దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణమ్
వర్ణయన్తి మహాత్మానః శ్రుతేనార్థేన చాఞ్జసా

సర్గ  - సృష్టి, ప్రతి సర్గ - ప్రళయము, వంశము, మన్వంతరములు, వంశానుచరితములూ - ఇవి అయిదు లక్షణాలు.
అన్ని పురాణాలు ప్రతిపాదించేది దశమాన్ని (ఆశ్రయాన్ని). సకల జగత్తుకీ ఆధారం పరమాత్మ స్వరూప రూప గుణ విభూతుల యొక్క యాదాత్మ్య అవగాహన. పరమాత్మ గుణాలను చెప్పడానికే అన్ని పురాణాలు. మాహానుభావులందరూ వారి గురువు గారి దగ్గర విన్న దానితో, శాస్త్ర బలంతో, శాస్త్ర పరిజ్ఞ్యానంతో పురాణ లక్షణాలను ఉదహరిస్తారు

భూతమాత్రేన్ద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః
బ్రహ్మణో గుణవైషమ్యాద్విసర్గః పౌరుషః స్మృతః

బ్రహ్మాండ సృష్టిని సర్గ అంటారు. అంటే పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములూ, పంచ జ్ఞ్యానేంద్రియాలు, అహంకారము. వీటి సృష్టిని సర్గము అంటారు.
చతుర్ముఖ బ్రహ్మగారు చేసే సృష్టిని విసర్గ అంటారు. బ్రహ్మ కంటే ముందు ఉన్న సృష్టి సర్గ ( (భూతములు, తన్మాత్రలు, జ్ఞ్యాన కర్మేంద్రియాలు, మహత్ అహంకారం ప్రకృతి అంతఃకరణం 24)అయితే బ్రహ్మాగారిచే చేయబడిన సృష్టిని విసర్గము అంటారు. పురుష సృష్టిని విసర్గము అంటారు. బ్రహ్మచేసే సృష్టి విసర్గము

స్థితిర్వైకుణ్ఠవిజయః పోషణం తదనుగ్రహః
మన్వన్తరాణి సద్ధర్మ ఊతయః కర్మవాసనాః

స్థానం: పరమాత్మ యొక్క దుష్ట శిక్షణ స్థానం
పోషణం: భక్తులని అనుగ్రహించుట
మన్వంతరం: పరమాత్మ చేత ప్రతిపాదిచబడిన వేదములచే ప్రతిపాదించబడిన ధర్మాలు.
ఊతి: కర్మల వలన కలిగే వాసనలు

అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినామ్
పుంసామీశకథాః ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాః

ఈశ కథ: పరమాత్మ అవతారాలు, అవతరించిన పరమాత్మను అనుసరించిన సజ్జనుల కథలు, వాటికి సంబంధించిన వివిధ కథలు

నిరోధోऽస్యానుశయనమాత్మనః సహ శక్తిభిః
ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః

నిరోధ:  జీవాత్మ ప్రకృతి సంబంధమైన సకల శక్తులతో సూక్ష్మావస్థలోకి వెళ్ళుట.
ముక్తి: మనది కాని దాన్ని వదిలిపెట్టి మన రూపాన్ని పొందటం. స్వస్వరూపస్థితి.

ఆభాసశ్చ నిరోధశ్చ యతోऽస్త్యధ్యవసీయతే
స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే

సకల ప్రపంచము ఏర్పడుట, ఉన్నట్లు తోచుట, లేకుండా పోవుటా ఎవరి సంకల్పం వలన జరుగుతున్నాయో ఆ పరమాత్మే సకల జగత్తుకూ ఆశ్రయం

యోऽధ్యాత్మికోऽయం పురుషః సోऽసావేవాధిదైవికః
యస్తత్రోభయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః

సృష్టి మొత్తాన్ని జ్ఞ్యానము (తెలియబడేది) జ్ఞేయమూ (తెలుసుకొనేది) జ్ఞ్యాతగా (తెలిసేది) లేదా శరీరము ఇంద్రియములూ విషయములూ అనుకుంటే, వీటిలో ఇంద్రియాలు ఆదిదైవికములు అంటాము (దేవతలచే అధిస్టించబడినవి), జ్ఞేయము (విషయములు) ఆది భౌతికములు అంటాము (శబ్ద స్పర్శాది మొ అన్నీ భౌతికములు) , శరీరాన్ని అధ్యాత్మం అంటాం. జ్ఞ్యాత ఆత్మ, జ్ఞేయం విషయం, జ్ఞ్యానం ఇంద్రియముల ద్వారా
శరీర ఇంద్రియ విషయములు - ఆధ్యాత్మ ఆదిదైవిక ఆదిభౌతములు - జ్ఞ్యాన్ము జ్ఞ్యాత జ్ఞేయము
ఐతే ఈ మూడూ ఒక్కటా వేరా? సూక్ష్మ రూపంలో ఉన్న పరమాత్మ స్థూలరూపాన్ని చెందాడు. కారణం ఎప్పుడూ సూక్ష్మరూపంలో ఉంటుంది, కార్యం స్థూలరూపంలో ఉంటుంది. ఇక్కడా కారణమే కార్యంగా మారింది. అలాంటప్పుడు జ్ఞ్యతృ జ్ఞ్యాన జ్ఞేయములూ మూడూ ఒకటే.

ఎవరిని శరీరము ఆత్మగా చెప్పుకుంటున్నామో ఆయనే  ఇంద్రియములను శబ్దాది విషయములను ఏర్పాటుచేసాడు. కనుక ఆయనే ఆదిదైవికుడు, ఆయనే ఆది భౌతికుడు, ప్రకృతీ ఆయనే, ప్రకృతి నుండి మహత్ తత్వం , మహత్ తత్వం నుండి అహంకారం, అహంకారం యొక్క త్రైవర్గీకరణం, అందులోని కర్మేంద్రియములూ జ్ఞ్యానేంద్రియములూ, ఇవన్నీ పరమాత్మే. అందువల్ల ఆధ్యాత్మకమైన ఆయనే, ఆది భౌతికుడు. ఆది భౌతికుడే ఆది దైవికుడు. అంతా పరమాత్మ స్వరూపమే.

జ్ఞ్యాత జ్ఞ్యానం ఈ రెండూ మారేవి జ్ఞేయమును బట్టే, తెలియవలసిన దాన్ని బట్టే, తెలిసేవాడు, తెలియుట ఉంటుంది. విషయములే, విషయములకొరకే, శరీరమూ ఇంద్రియములు. అందుకే ప్రకృతి తత్వమూ, ప్రకృతినుండి మహత్ తత్వమూ, మహత్ తత్వాన్ని మూడు భాగాలు చేసి అందులో కర్మేంద్రియములనూ , జ్ఞ్యానేంద్రియములనూ సృష్టించి, పంచభూతములూ, వాటిగుణములు (భూతాది). పంచభూతముల గుణములకొరకే ఇంద్రియములు శబ్ద స్పర్శ రూప రస గంధములను స్వీకరించుటకే ఇంద్రియములు. విషములూ, విషయములను స్వీకరించే ఇంద్రియములూ, ఈ రెండూ కలవాడే శరీరి.

ఆధ్యాత్మ ఆదిదైవికములను విభజిస్తే ఆది భౌతికమేర్పడుతుంది. విషయములు జ్ఞ్యానము జ్ఞ్యాతను బట్టి, జ్ఞేయము కొరకు. శబ్ద స్పర్శాది ఇంద్రియ విషయములని గ్రహించేవి ఇంద్రియములు. వాటికి అధిష్టానం ఆత్మ, శరీరం.

ఏకమేకతరాభావే యదా నోపలభామహే
త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః

ఇలా జ్ఞ్యాన్ము జ్ఞేయమూ జ్ఞ్యాతా, ఈ మూటిలో ఏ ఒక్కటి లేకున్నా తక్కినవి పని చేయవు. కన్ను ఉండి, వెలుతురూ ఉండి, రూపం లేకపోయినా, కన్నూ రూపం ఉండి వెలుతురు లేకపోయినా, కన్నులేకుండా వెలుతురూ రూపమూ ఉన్నా పని చేయదు. అలాగే శరీర ఇంద్రియ విషయములు లేకుండా క్రియాశీలములు కాదు. ఈ మూడూ లేకున్నా కూడా ఉండేది ఆత్మ. ఆ పరమాత్మే ఈ మూడిటినీ లేకుండా చేయగలడు, ఉండేలా చేయగలడు.

అలాంటి చోటా ఆ మూటినీ (తెలుసుకునేదీ తెలిపేదీ తెలియబడేదీ) ఎవరు తెలుసుకుంటారో ఆయనే పరమాత్మ.

పురుషోऽణ్డం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః
ఆత్మనోऽయనమన్విచ్ఛన్నపోऽస్రాక్షీచ్ఛుచిః శుచీః

సమష్టి సృష్టి - బ్రహ్మగారిలో ఏమేమి ఏర్పడ్డాయో వాటినుంచే మనకు ఉన్నవన్నీ ఏర్పడ్డాయి. సకల అవయవాలకీ మూలం బ్రహ్మ. ఆయననే విరాట్ పురుసుడు, హిరణ్యగర్భుడు, సూత్రాత్మా అంటాము. 24 తత్వములతో కల అండాన్ని భేధించుకుని వచ్చాడు. ఆయన నివాసముండటానికి జలాన్ని సృష్టించుకున్నాడు. అలా సృష్టించుకున్న జలములో వేయి దివ్య సంవత్సరాలు ఉన్నాడు.

తాస్వవాత్సీత్స్వసృష్టాసు సహస్రం పరివత్సరాన్
తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవాః

కొన్ని వేల సంవత్స్రాలు నివసించాడు. కాబట్టే ఆయనను నారాయణుడు అంటున్నము. పురుషున్నించి పుట్టాయి కబట్టి ఆ జలాన్ని నారములు అంటున్నాము. నరుడి నుంచి వచ్చినవి నారములు. వాటియందు ఉన్నవాడు నారాయణుడు.

ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ
యదనుగ్రహతః సన్తి న సన్తి యదుపేక్షయా

ఈ జగత్తులో మనము ద్రవ్యమూ కర్మ కాలము స్వభావమూ జీవుడు, ఈ ఐదింటినీ చూస్తున్నాము. ఈ ఐదు పరమాత్మ అనుగ్రహం వలన, సంకల్పము చేత ఏర్పడతాయి

ఏకో నానాత్వమన్విచ్ఛన్యోగతల్పాత్సముత్థితః
వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్త్రిధా

బహుశ్యాం ప్రజాయేయా - నేను చాలా రూపాలుగా మారాలి అనుకున్నాడు. ఒకడుగా ఉన్న ఆయన నేను అనేకమవ్వాలి అనుకున్నాడు. ఇక్కడ యోగతల్పము. యోగమంటే యుజ్యతే ఇతి యోగః. కూర్చడమే యోగము. శరీర ఇంద్రియ విషయములు లేని ఆత్మకు, వాటితో సంబంధము కలుపుట. ఆయన కడుపులో ఉన్న ఆత్మలకి ఆకారాన్ని కూర్చుట యోగము. దానికోసం ఆయన నిద్రలో ఉన్నాడు. అదే యోగ తల్పం, ఆదిశేషుడు అని కూడా అంటారు.
అప్పుడు హిరణ్మయమైన వీర్యాన్ని ఆధ్యాత్మ ఆదైవికం ఆదిభౌతికం, (శరీరము ఇంద్రియములు విషయాలు) అనే మూడు భాగాలుగా చేసాడు.

అధిదైవమథాధ్యాత్మమధిభూతమితి ప్రభుః
అథైకం పౌరుషం వీర్యం త్రిధాభిద్యత తచ్ఛృణు

ఒక్కడిగా ఉన్న పరమాత్మ వీర్యం మూడు ఎలా అయింది? పరమాత్మ సంకల్పం వలన అవుతుంది. మనము చూస్తున్నాము అంటే, మనకన్నా ముందు ఆ కంటితో చూసేది ఆయనే. అలాగే ఏ ఇంద్రియముతో మనం అనుభవించిన ముందు వచ్చేది పరమాత్మ నుంచే. ఓజః ప్రవృత్తి సామర్ధ్యం, సహః వేగ సామర్ధ్యం బలం అంటే ధారణ సామర్ధ్యం. విషయములయందు ప్రవర్తించే సామర్ధ్యం ఇంద్రియములకుంటుంది (ఉదా ఒక శబం వస్తే వెంటనే చెవి వింటుంది ). విషయములయందు ప్రవర్తించే సామర్ధ్యం ఇంద్రియములకు ఉంటుంది. ఇదే ఓజ సామర్ధ్యం. మనం ఒక్క చోటనే ఉన్నా మనసు వేగంగా పరుగెడుతుంది. సహం మనసుది. బలం శరీరానిది.

అన్తః శరీర ఆకాశాత్పురుషస్య విచేష్టతః
ఓజః సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుః

అంతఃశరీర ఆకాశంలో స్వామి సంకల్పిస్తే ఓజః సహః బలమః పుట్టాయి. వాటిలో చలనం కావాలి, అంటే వాయువు కావాలి. ఉన్నదాన్ని నిలిపేది, లేనిదాన్ని కలిగించేది కావాలి. దానినే ప్రాణం అంటారు. అపుడు కలిగినటువంటి ఓజస్సు సహస్సు బలములను సంచరింపజేయడానికి ప్రవర్తింపచేయడానికి ప్రాణ వాయువును ఏర్పరిచాడు.

అనుప్రాణన్తి యం ప్రాణాః ప్రాణన్తం సర్వజన్తుషు
అపానన్తమపానన్తి నరదేవమివానుగాః

ప్రాణముంటేనే అన్ని ఇంద్రియాలు రాజును సేవకులు అనుసరించినట్లు అనుసరిస్తాయి.

ప్రాణేనాక్షిపతా క్షుత్తృడన్తరా జాయతే విభోః
పిపాసతో జక్షతశ్చ ప్రాఙ్ముఖం నిరభిద్యత

ఓజ సహ బలం ప్రాణము వచ్చాయి. వాయువు వచ్చిందంటే అగ్ని పుట్టాలి. ప్రాణం రాగానే జఠరాగ్ని పుట్టింది. దానివలన ఆకలి దప్పి పుట్టాయి. వాయువు సంచరించగానే అగ్ని పుడుతుంది. సమిధలు వేస్తున్నతసేపే అగ్ని ఉంటుంది, అలాగే ఘన లేదా ద్రవ పదార్ధం వేసేనే ఆ ఆగ్ని ఉంటుంది. ప్రాణం వచ్చిన వెంటనే క్షుత్ పిపాస పుట్టింది. దాహం అంటే దహించుట. మంచు కూడా అదే పనిగా పెడితే అందులోంచి కూడా అగ్ని పుడుతుంది. అందుకే బాగా చల్లగా ఉండే ద్రవం త్రాగవద్దంటారు. దాహం గానీ ఆకలి గాని రోగ నివారణ మాత్రమే గానీ భోగము కొరకు కాదు

ముఖతస్తాలు నిర్భిన్నంజిహ్వా తత్రోపజాయతే
తతో నానారసో జజ్ఞే జిహ్వయా యోऽధిగమ్యతే

అలా నీరు తాగి అన్నం తినాలి అంటే ఒక ద్వారం ఉండాలి, అదే నోరు (ముఖము) పుట్టింది. కేవలం రంధ్రం కాకుణ్డ, ఏ భాగంలోంచి కడుపులోకి వెళ్ళాలో ఆ భాగంలోకి పంపాలి, అదే తాళువు. రెండు దవడల మూల భాగంలో ఉండే కొండ నాలుక. దాని నుంచే అసలు నాలుక (జిహ్వ) వచ్చింది. పదార్థాలను అటు ఇటు పోకుండా జీర్ణకోశంలోకి పంపే పని తాళువు చేస్తుంది. పదార్థాల రుచిని జిహ్వ చూస్తుంది

వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వాగ్వ్యాహృతం తయోః
జలే చైతస్య సుచిరం నిరోధః సమజాయత

ఎపుడైతే నాలుకా, తాళువు, అందులో రంధ్రమూ వచ్చినపుడు, ఆ నాలుకకు ఎప్పుడు ఏ రుచి కావాలో చెప్పదలచుకోవడానికి వాక్కు పుట్టింది. దీనికి అగ్ని దేవత.
అగ్ని - వాక్కు - వ్యాహృతం(పలుకుట) : దేవత ఇంద్రియం కర్మ

నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి
తత్ర వాయుర్గన్ధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః

లోపలకి పోయిన వాయువు కంఠంలో ఉండి కంఠాన్ని నిర్భందిస్తుంది. ఆ వాయువు బయటకి పోవడానికి నాసా రంధ్రాలు పుట్టాయి. వాయువు అటూ ఇటూ ఊగుతూ ఉంటే నాసికపుట్టింది. వాయువుని విడిచి స్వీకరిస్తుంది (నసి జిఘృక్షతః)

యదాత్మని నిరాలోకమాత్మానం చ దిదృక్షతః
నిర్భిన్నే హ్యక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహః

మనము చేస్తున్న దాని యొక్క రూపం చూడటానికి రెండు నేత్రాలు ఏర్పడ్డాయి. నేత్రాలకి సూర్యుడు అధిపతి. చక్షు ఇంద్రియం వస్తువు యొక్క గుణమును గ్రహిస్తుంది.

బోధ్యమానస్య ఋషిభిరాత్మనస్తజ్జిఘృక్షతః
కర్ణౌ చ నిరభిద్యేతాం దిశః శ్రోత్రం గుణగ్రహః

వేదములు చేప్పేవాటిని వినడాని కర్ణములు వచ్చాయి. దిక్కులు దేవతగా, శ్రోత్రము ఇంద్రియముగా, గుణములని గ్రహించడం దాని పని

వస్తునో మృదుకాఠిన్య లఘుగుర్వోష్ణశీతతామ్
జిఘృక్షతస్త్వఙ్నిర్భిన్నా తస్యాం రోమమహీరుహాః
తత్ర చాన్తర్బహిర్వాతస్త్వచా లబ్ధగుణో వృతః

స్పర్శను గ్రహించడానికి త్వగింద్రియం ఏర్పడింది. ఒక్క త్వగ్ ఇంద్రియమే కాక రోమాలు ఏర్పడ్డాయి. చర్మానికి కలిగే బాధను ముందు భరించేవి రోమాలు. అవి త్వగింద్రియాన్ని కాపాడతాయి. మనసులో కలిగే వికారాలను కూడా రోమాలు చెబుతాయి. చర్మమునకు కలిగించే వికారాన్ని తప్పించడానికి అవి లేస్తాయి
చర్మము లోపలా బయటా ఉన్న వాయు సంచారాన్ని తెలిపేది త్వగింద్రియం, స్పర్శ. ఒక వస్తువును తాకితే, ఆ వస్తువుకీ చేతికీ మధ్య ఉన్న గాలిని వత్తిడి కలిగిస్తుంది. త్వగింద్రియం వాయ్వును స్వీకరించి బయటకు పంపుతుంది. మన మనసులో ఉండే భావముల వల్లనే కఠిన స్పర్శ, మృదు స్పర్శ ఉంటుంది.

హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మచికీర్షయా
తయోస్తు బలవానిన్ద్ర ఆదానముభయాశ్రయమ్

హస్తములకు అధిదేవత ఇంద్రుడు. హస్తములు చేసే పని ఆదానం (తీసుకొనుట లేదా ఇచ్చుట)

గతిం జిగీషతః పాదౌ రురుహాతేऽభికామికామ్
పద్భ్యాం యజ్ఞః స్వయం హవ్యం కర్మభిః క్రియతే నృభిః

పాముల అధిదేవత యజ్ఞ్యుడు. హోమ ద్రవ్యములు తీసుకుని వచ్చుటకు ఏర్పడ్డవి కాళ్ళు.

నిరభిద్యత శిశ్నో వై ప్రజానన్దామృతార్థినః
ఉపస్థ ఆసీత్కామానాం ప్రియం తదుభయాశ్రయమ్

కూడగట్టుకున్న శక్తిని శరీరంలోనే ఉంచకుండా, దాన్ని బయటకు విడిచిపెట్టడానికి, అది కూడా ఇష్టపూర్వకంగా విడిచిపెట్టడానికి, దాన్ని వీర్య రూపంలో విడిచి పెట్టడానికి ఉపస్థ ఇంద్రియం, శిశ్నం అనే అవయవం. ప్రజాతి ఆనంద నిర్వృతి. సంతానం కలగడానికి కావల్సిన ఆనందంతో ఏర్పడే భోగము.

ఉత్సిసృక్షోర్ధాతుమలం నిరభిద్యత వై గుదమ్
తతః పాయుస్తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయః

సారం వదిలిపెట్టడానికి ఉపస్థ అయితే, నిస్సారం వదలడానికి పాయు ఇంద్రియము, గుదం అవయవం, అదిదేవత మిత్రుడు.

ఆసిసృప్సోః పురః పుర్యా నాభిద్వారమపానతః
తత్రాపానస్తతో మృత్యుః పృథక్త్వముభయాశ్రయమ్

ఇలా సంచరించే వాయువును క్రమబద్దీకరించేందుకు నాభిని సృష్టించాడు. ఏ ఏ రంధ్రముల, ఇంద్రియముల ద్వారా ఎంత వాయువు లోపల ఉంచాలి, ఎంత బయటకు పోవాలనేది నాభి చేస్తుంది. వాయువును అధోభాగమునుండి బయటకు పంపించడానికి ఉన్న ద్వారం నాభి. నాభికి అధిష్టాన దేవత మృత్యువు. వేరు చేసినా కలిపినా నాభి నుంచే (పృథక్త్వముభయాశ్రయమ్)

ఆదిత్సోరన్నపానానామాసన్కుక్ష్యన్త్రనాడయః
నద్యః సముద్రాశ్చ తయోస్తుష్టిః పుష్టిస్తదాశ్రయే

తీసుకున్న ఆహారం ఎక్కడ ఉండాలి? అదే కడుపులోని నరములూ ప్రేగులు. ప్రేగులకు అదిష్టాన దేవతలు నదులు సముద్రాలు. తుష్టి పుష్టి అనేవి వీటికున్న రెండు గుణాలు

నిదిధ్యాసోరాత్మమాయాం హృదయం నిరభిద్యత
తతో మనశ్చన్ద్ర ఇతి సఙ్కల్పః కామ ఏవ చ

తన ప్రకృతినీ ధ్యానం చేయడానికి హృదయాన్ని. అందులో మనసు పుట్టింది. ఆ మనసుకి చంద్రుడు దేవత. ప్రతీ సంకల్పమూ కోరికా పుట్టేది మనసులోనే

త్వక్చర్మమాంసరుధిర మేదోమజ్జాస్థిధాతవః
భూమ్యప్తేజోమయాః సప్త ప్రాణో వ్యోమామ్బువాయుభిః

సప్త ధాతువులు ఏర్పడ్డాయి: త్వక్, చర్మ మాన్స మేధో రుధిర మధ్య అస్తి. పై భాగాన్ని చర్మం అంటాం. లోపల భాగాన్ని త్వక్ అంటాం. ఈ సప్త ధాతువులూ త్రిభూతములతో వచ్చాయి. భూమి జలము తేజస్సు. ప్రాణవాయువు ఆకాశము వాయువు జలముతో ఏర్పడింది. ప్రాణము నిలవాలంటే నీరు కావాలి. అందుకే నీరు వాయువు ఆకాశమూ కావాలి ప్రాణానికి

గుణాత్మకానీన్ద్రియాణి భూతాదిప్రభవా గుణాః
మనః సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞానరూపిణీ

శబ్ద స్పర్శ మొదలైన విషయాలను అనుభవింపచేసేవి ఇంద్రియాలు. వాటి గుణాలు పంచభూతాలతో ఏర్పడతాయి. అన్ని వికారాలకు మూలం మనసు. జ్ఞ్యానాన్ని కలిగించేది బుద్ధి. వికారాన్ని కలిగించేది మనసు.

ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా
మహ్యాదిభిశ్చావరణైరష్టభిర్బహిరావృతమ్

ఇది పరమాత్మ యొక్క స్థూల రూపం. దీని నుండే అనతకోటిబ్రహ్మాండంలో అన్ని జీవుల శరీరాలు ఏర్పడ్డాయి. పృధ్వి అప్ తేజో వాయు ఆకాశం అవ్యక్తం మహత్ అహంకారం అనే అష్ట ఆవరణలతో ఉన్నది.

అతః పరం సూక్ష్మతమమవ్యక్తం నిర్విశేషణమ్
అనాదిమధ్యనిధనం నిత్యం వాఙ్మనసః పరమ్

ఇప్పటిదాకా స్థూలరూపాన్ని చెప్పాను. ఇక వాక్కుకూ మనసుకూ అందనిదీ ప్రకృతి మహదహంకారానికంటే సూక్షమమైనది సూక్ష్మరూపం. దీనిలో ఎటువంటి వికారం ఉండదు. ఆది అంతములు ఉండవు.

అమునీ భగవద్రూపే మయా తే హ్యనువర్ణితే
ఉభే అపి న గృహ్ణన్తి మాయాసృష్టే విపశ్చితః

విజ్ఞ్యానులు ఈ రెంటినీ తీసుకోరు (ప్రకృతినీ, ఇంద్రియాలనూ, వాటికతీతంగా ఉండే మాయనూ తీసుకోరు).

స వాచ్యవాచకతయా భగవాన్బ్రహ్మరూపధృక్
నామరూపక్రియా ధత్తే సకర్మాకర్మకః పరః

మనం వేటిని చెప్పుకుంటున్నామో, వస్తువులూ వాటి గుణములు రెండు భగవానునివే. ఆ పరమాత్మే వీటికి నామము రూపమూ క్రియా కలిపించాడు.

ప్రజాపతీన్మనూన్దేవానృషీన్పితృగణాన్పృథక్
సిద్ధచారణగన్ధర్వాన్విద్యాధ్రాసురగుహ్యకాన్
కిన్నరాప్సరసో నాగాన్సర్పాన్కిమ్పురుషాన్నరాన్
మాత్రక్షఃపిశాచాంశ్చ ప్రేతభూతవినాయకాన్
కూష్మాణ్డోన్మాదవేతాలాన్యాతుధానాన్గ్రహానపి
ఖగాన్మృగాన్పశూన్వృక్షాన్గిరీన్నృప సరీసృపాన్
ద్వివిధాశ్చతుర్విధా యేऽన్యే జలస్థలనభౌకసః
కుశలాకుశలా మిశ్రాః కర్మణాం గతయస్త్విమాః
సత్త్వం రజస్తమ ఇతి తిస్రః సురనృనారకాః
తత్రాప్యేకైకశో రాజన్భిద్యన్తే గతయస్త్రిధా
యదైకైకతరోऽన్యాభ్యాం స్వభావ ఉపహన్యతే

రెండు కాళ్ళ వారు నాలుగు కాళ్ళ వారు, ఆకాశములో భూమిలో ఉండేవారు, కుశలులు (నేర్పరులూ), అకుశలులు. సత్వమంటే దేవతలు, రజస్సు అంటే నరులు, తమస్సు అంటే నరకములు
ఈ నరులు దేవతలూ రాక్షసులలో కూడా సాత్విక రాజస తామస భేధాలు ఉంటాయి. తన స్వభావం తాను అనుసరించి ఆచరిస్తే అందరికీ క్షేమం. లేకపోతే ఒక స్వభావన్ని ఒకటి పాడుచేస్తుంది. దాని వలననే రాగద్వేషాదులు వస్తాయి. దానినే నరకం అంటాము.

స ఏవేదం జగద్ధాతా భగవాన్ధర్మరూపధృక్
పుష్ణాతి స్థాపయన్విశ్వం తిర్యఙ్నరసురాదిభిః

ఈ సకల జగత్తునీ ధరించేవాడు, ధర్మాన్ని స్వరూపంగా ఉండే వాడు అయిన పరమాత్మ. ఈయనే ప్రపంచాన్ని సృష్టించి పోషిస్తాడు

తతః కాలాగ్నిరుద్రాత్మా యత్సృష్టమిదమాత్మనః
సన్నియచ్ఛతి తత్కాలే ఘనానీకమివానిలః

విష్ణు రూపంలో కాపాడతాడు, బ్రహ్మరూపంలో సృష్టిస్తాడు, కాలాగ్ని రుద్రుని రూపంలో సంహరిస్తాడు.

ఇత్థమ్భావేన కథితో భగవాన్భగవత్తమః
నేత్థమ్భావేన హి పరం ద్రష్టుమర్హన్తి సూరయః

ఇవన్నీ చేయడం వలన ఆయనని భగవానుడంటారు. అన్నీ తెలిసినవాడు (జ్ఞ్యానము), శక్తిమంతుడు, ఐశ్వర్యం కలవాడు (శాసకత్వం), ఆయన అందరిలో ఉండి శాసితాడు

నాస్య కర్మణి జన్మాదౌ పరస్యానువిధీయతే
కర్తృత్వప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్

ఈయన కర్మలూ అవతారాలు మనకి ఎప్పుడు సుస్పష్టంగా తెలియదు. పరమాత్మే అంతా చేయిస్తున్నాడని తెలియక మనమే చేస్తున్నాము అనుకుంటాము. మధ్యలో ఉన్న మాయ "అంతా ఆయనే చేసాడన్న" భావన రాకుండ చేస్తుంది.

అయం తు బ్రహ్మణః కల్పః సవికల్ప ఉదాహృతః
విధిః సాధారణో యత్ర సర్గాః ప్రాకృతవైకృతాః

ఇప్పటివరకూ బ్రహ్మకల్పముని చెప్పాను. ప్రాకృత సృష్టి (బ్రహ్మగారి సృష్టికి ముందు ఉన్న 24 తత్వాలు), వైకృత సృష్టి (బ్రహ్మగారి సృష్టి - దేవ తిర్యక్ మనుష్యాదులు)

పరిమాణం చ కాలస్య కల్పలక్షణవిగ్రహమ్
యథా పురస్తాద్వ్యాఖ్యాస్యే పాద్మం కల్పమథో శృణు

ఇపుడు పద్మ కల్పాన్ని చెబుతాను విను. కాలము కాల పరిణామం, కల్పమంటే ఏమిటి అనేవి చెబుతాను

శౌనక ఉవాచ
యదాహ నో భవాన్సూత క్షత్తా భాగవతోత్తమః
చచార తీర్థాని భువస్త్యక్త్వా బన్ధూన్సుదుస్త్యజాన్

శౌనకుడు "భాగవతోత్తముడైన (క్షత్తా ) విధురుడు యుద్ధం ప్రారంభం కాకముందు తీర్థయాత్రలకు వెళ్ళాడని చెప్పారు కదా, విడిచిపెట్టజాలని బంధువులందరినీ వదిలిపెట్టి వెళ్ళాడే"

క్షత్తుః కౌశారవేస్తస్య సంవాదోऽధ్యాత్మసంశ్రితః
యద్వా స భగవాంస్తస్మై పృష్టస్తత్త్వమువాచ హ

అలాంటి విధురినికి మైత్రేయునితో (కౌశారవేస్తస్య ) సమాగమం ఎక్కడ కలిగినది. ఆ ఆధ్యాత్మిక విద్య (సంవాదం) ఎలా జరిగింది. ఆ తత్వాన్ని మైత్రేయుడు విధురునికి ఏమి చెప్పాడు

బ్రూహి నస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితమ్
బన్ధుత్యాగనిమిత్తం చ యథైవాగతవాన్పునః

బంధువులకు ఎందుకు విడిచిపెట్టాడు, విడిచిపెట్టి మరలా ఎందుకు వచ్చాడు. వెళ్ళడానికి ప్రయోజనమేమిటి, తిరిగి రావడానికి ప్రయోజనమేమిటి.

సూత ఉవాచ
రాజ్ఞా పరీక్షితా పృష్టో యదవోచన్మహామునిః
తద్వోऽభిధాస్యే శృణుత రాజ్ఞః ప్రశ్నానుసారతః

ఓ మహామునీ ఇవన్నీ పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని అడిగితే శుకుడు చెప్పగా నేను విన్నది చెబుతాను. పరీక్షిత్తు ఏ విధంగా అడిగాడో దానిననుసరించి నీకు వివరిస్తాను

                                                        సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Monday, December 24, 2012

చతుః శ్లోకీ భాగవతం

దీనిని చతుః శ్లోకీ భాగవతం అంటారు. పరమాత్మ బ్రహ్మగారికీ, బ్రహమ నారదునికీ, నారదుడు, వ్యాసునికి, వ్యాసుడు శుకునికీ బోధించినది. ఈ నాలుగు శ్లోకాలలో, పరమాత్మ అంటే ఏమిటి, జగత్తు అంటే ఏమిటి,

శ్రీభగవానువాచ
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్
సరహస్యం తదఙ్గం చ గృహాణ గదితం మయా

విజ్ఞ్యానంతో (శాస్త్ర జ్ఞ్యానంతో) కూడిన అతిరహస్యమైన నా తత్వాన్ని చెప్పే జ్ఞ్యానం, రహస్యములతో కూడి ఉన్న (మంత్రములతో కూడి ఉన్న) దానిని నేను ఉపదేశిస్తున్నాను, స్వీకరించు.
(మంత్రములు మంత్రాంగములు యోగము శాస్త్రము వేదాంగములతో కూడిన దాన్ని చెప్పబోవుతున్నాను అని వ్యాఖ్యానం). ఈ శ్లోకంతో విధురమైత్రేయ, కృష్ణ ఉద్ధవ సంవాదం, ప్రహ్లాద అవధూత సంవాదం, రుద్రహీతలు , మొదలైన సంవాదాలన్నీ ఈ శ్లోకంతో వస్తుంది. అవి నాలుగున్నరవేల శ్లోకాలు.

యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్

అహం యావాన్: నా స్వరూపం ఏమిటీ. నా వ్యాప్తి ఎంతవరకూ ఉందో
యధా భావ: నా స్వభావమేమిటో,
యద్రూపగుణకర్మకః - నేను ఏ రూపంలో ఉంటానో ఏ గుణములతో ఉంటానో ఏ కర్మలు చేస్తానో
(ఈ ఒక్క పాదంతో భాగవతంలో ఉన్న బ్రహ్మ సృష్టి, ప్రజాపతి సృష్టి, ప్రకృతి సృష్టి, ఆత్మ సృష్టి అన్ని వస్తాయి, )
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ - నా స్వరూప స్వభావ రూప గుణ కర్మలు అన్నీ ఉన్నదున్నట్లుగా నా అనుగ్రహంతో నీకు కలగాలి.

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్
పశ్చాదహం యదేతచ్చ యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్

అహమేవాసమేవాగ్రే  - ప్రళయకాలంలో, సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నది నేను ఒక్కడినే
నాన్యద్యత్సదసత్పరమ్- నేను తప్ప సత్, అసత్ , కాలం లేదు. జీవుడు ప్రకృతి పరం ఏవి లేవు. (పరమాత్మ సంకల్పమే కాలం). ప్రళయకాలంలో నాకంటే భిన్నమైనవి ఏమీ లేవు.
సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టి కాలంలోనూ నేనే ఉన్నాను, సృష్టి లయం అయ్యాక కూడా (పశ్చాదహం ) నేనే ఉన్నాను.
యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్ - ఏది మిగులుతుందో అదే నేను

(ఈ శ్లోకం వలన భాగవతంలో ఉన్న అన్ని రకాల సృష్టి రక్షణ ప్రళయములూ చెప్పబడ్డాయి)

ఋతేऽర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః

ఋతేऽర్థం యత్ప్రతీయేత - నా సంకల్పం మేరకే అన్నీ జరుగుతాయి
నేను ఉన్నాను కాబట్టే ఇవన్నీ కనపడుతున్నాయి. నేను లేకపోతే నీకు నీవే కనపడవు. (మనలని "మనం" అని మనం అనుకోవడానికి కూడా మనలో ఆయన ఉంటేనే అనుకోగలము. మనకు ఏమైన విషయం తెలిసిందీ అంటే తెలియబడిన విషయంలోనూ, తెలుసుకున్నవాడిలోనూ, తెలుసుకోవడంలోనూ, జ్ఞ్యాతా జ్ఞ్యేయమూ జ్ఞ్యానము ఈ మూడింటిలోనూ ఆయన ఉన్నప్పుడే ఆ జ్ఞ్యానం కలుగుతుంది. అనుభూతి మనకి కలుగ్తోంది అంటే అది పరమాత్మ కలిగించిందే. ఏ జ్ఞ్యానమైనా అతని సంబంధంతోటే కలుగుతుంది )
న ప్రతీయేత చాత్మని - నేను లేకుంటే ఆత్మలో ఎలాంటి స్వరూప స్వభావ జ్ఞ్యానములు కలగవు
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః
తెలిసినదీ అన్నా, తెలియందీ అన్నా, ఈ రెండూ నా మాయే. వెలుతురూ చీకటి లాగ ప్రకృతి సంబంధం ఉంటే నా జ్ఞ్యానం ఉండదు. నా జ్ఞ్యానం ఉంటే వాడు ప్రకృతితో మోహింపబడడు. ఐతే ఈ ఆత్మజ్ఞ్యానమైనా ప్రకృతి జ్ఞ్యానమైనా నా సంకల్పంతోనే కలుగుతాయి.

యథా మహాన్తి భూతాని భూతేషూచ్చావచేష్వను
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్

సకల జగత్తులో పరమాత్మ అంతర్యామిగా ఉంటున్నాడు. (కుండ పగలగొట్టినా అందులో ఉండే ఆకాశం అలాగే ఉంటుంది ఎందుకంటే కుండ కూడా ఆకాశంలో ఉంటుంది. అయినా మనం కుండలో ఆకాశం ఉంది అంటాం. మరి కుండ విరిగితే ఆకాశం ఎక్కడికీ పోకుండా అలాగే ఉంటుంది. )
ప్రతీ ప్రాణిలోనూ (చిన్న ప్రాణిలోనూ పెద్ద ప్రాణిలోనూ) పంచభూతాలు ఉన్నాయి. పంచభూతములతోనే మనం ఏర్పడ్డాము. మనమే పంచభూతములలోకి వెళ్ళాము. పంచభూతములు ప్రవేశించినట్లూ ఉంటాయి, ప్రవేశించనట్లూ ఉంటాయి. మనలో అన్ని రంధ్రములలో ఆకాశం ఉంది, ద్రవమంతా జలం, వేడి అంతా అగ్ని, ఘనమైన శరీరమంతా భూమి, శరీరమంతా వాయువూ, ఇలా అన్ని భూతాలు మనలో ఉన్నాయి. పంచభూతాలు మనలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది, అలాగే వెళ్ళిపోయినట్లు కనపడతాయి. అలా పంచభూతాలు వచ్చి వెళ్ళినట్లు అనిపిస్తాయి.
నేను ఆ పంచభూతాలలో ఉంటాను. కనీ అవి నాకు అంటవు. పాప పుణ్యాలు, న్యాయాన్యాలు, హితాహితాలు అన్నీ ప్రకృతి సంబంధాలు. ప్రకృతికి సంబంధించిన ఏ దోషాలూ నాకు అంటవు. నేను అన్నింటిలోనూ ఉంటాను. నాకేదీ అంటదు. అన్నిట్లో ఉన్నట్లే ఉంటాను, ఎందులోనూ ఉండను. వేటిలో లేను అనుకుంటారు, గానీ అన్నిటిలో నేను ఉంటాను

(దీనితో మొత్తం భక్తుల చరిత్రలు వస్తాయి)

ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాత్మనః
అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా

ప్రతీ వ్యక్తీ ప్రపంచములో తెలుసుకోవలసినది ఇదే. ఆత్మ తత్వం తెలుసుకోవాలి అనుకునే వాడు తెలుసుకోవలసిన విషయం ఇదే. అన్వయవ్యతిరేకాభ్యాం  - ఏది తెలిస్తే మనకు విషయం తెలుస్తుందో అది అన్వయం. ఏది లేకపోతే మనకి విషయం తెలియదో అది వ్యతిరేక్వ్యాప్తి (వ్యతిరేకం కారణం నుంచి వస్తుంది. ఉదా: "జ్య్నానం లేకుంటే పరమాత్మ తెలియబడదు"). ఏ జ్ఞ్యానంతో పరమాత్మ తెలుస్తాడొ, ఏ అజ్ఞ్యానంతో పరమాత్మ ప్రచ్చనంగా ఉంటాడో , ఇలాంటి రెంటితోటీ. పరమాత్మ అన్ని వేళలా, అన్ని రూపాలలో, అన్ని సంకల్పాలలో ఉన్నాడు.

ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా
భవాన్కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్

మీరు ఇంక తపస్సు చేయాండి. కానీ ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. ఈ విజ్ఞ్యానాన్ని నీవు మనసులో పెట్టుకుంటే ఎన్ని వికల్పములు వచ్చినా నీవు మోహింపబడవు, నా మాయ నిన్ను ఏమీ చెయ్యదు

Sunday, December 23, 2012

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

ఏడు ధాతువులూ లేని జీవునికి శరెరంతో సంబంధం ఎలా వచ్చింది. ఈ ఏడు ధాతువులూ లేనిది జీవుడు. ఈ శరీర సంబంధం జీవుడికి అకారణంగా ఏర్పడుతుందా, సకారణంగా ఏర్పడుతుందా? అనేది పరీక్షిత్తు మొదటి ప్రశ్న కిందటి అధ్యాయంలో

శ్రీశుక ఉవాచ
ఆత్మమాయామృతే రాజన్పరస్యానుభవాత్మనః
న ఘటేతార్థసమ్బన్ధః స్వప్నద్రష్టురివాఞ్జసా

శరీరానికి ఉన్నవాటిని నాకు ఉన్నాయి అనుకుంటున్నాడు జీవుడు. అనుభవమే స్వరూపముగా కలది ఆత్మ. తనవి కానిది తనకి కానిది తనది అనుకుంటున్నాడు. అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనుకునేది ఆత్మ. ఈ ఆత్మ పరస్య - అంటే ప్రకృతి కంటే విలక్షణము. ప్రకృతిలో ఉన్న గుణత్రయం ఆత్మకు అంటదు. ఆత్మ పుట్టదు. ప్రకృతి లేకుండా జీవునికి శరీరముతో సంబంధం కుదరదు. ఆ సంబంధానికి కారణం ఉందా? కారణముంది. తనది కాని ప్రకృతిని తనది అనుకుంటున్నాడు. ప్రకృతితో నాకు సంబంధం లేదు అనుకుంటే తనకి శరీరమూ జన్మ లేదు. జీవునికి శరీర సంబంధం సహేతుకమే, నిర్హేతుకం కాదు. స్వప్నంలో అనుభవించే మనం ఎక్కడున్నము, అనుభవించే వస్తువులు ఎక్కడ ఉన్నాయి?  ఇక్కడ పొందలేని విషయాలు మనసు స్వపనంలో పొందుతుంది. ఆ అనుభవాలన్నీ ఎక్కడివి? అవి కేవలం అనుభవమే. ఈ శరీరానికీ మనసుకూ ఆత్మకూ సంబంధం లేదు. శరీరమూ మనసు కలిసి ఉన్నప్పుడు వచ్చిన తలపులే కలలుగా వస్తాయి. నిద్ర వేరు స్వప్నం వేరు. కల వచ్చింది అంటే నిద్ర రాలేదు అని అర్థం. అలాగే ఆత్మకు లేని శరీరాన్ని కూడా, ప్రకృతియొక్క గుణాలు కావాలి అనుకోవడంతో శరీరం వస్తుంది. సంసారానికి శరీరానికి మూలం కోరిక. సుఖదుఖాలకి మూలం అనుభవం

బహురూప ఇవాభాతి మాయయా బహురూపయా
రమమాణో గుణేష్వస్యా మమాహమితి మన్యతే

ఏ రూపమూ లేని జీవుడు అన్ని రూపాలు నావే అనుకుంటాడు. ప్రకృతి రూపాలని చూసి తనవే అనుకుంటాడు. ప్రకృతి గుణాలలో రమిస్తూ ఉంటాడు. ప్ర్కృతి గుణాలతో రమిచాలనుకోవడం వలనే అవి సంక్రమిస్తాయి. దాని వల్ల నేను నాది అనుకుంటాడు

యర్హి వావ మహిమ్ని స్వే పరస్మిన్కాలమాయయోః
రమేత గతసమ్మోహస్త్యక్త్వోదాస్తే తదోభయమ్

కాలముతోటి మాయతోటి బంధిచబడుతున్నాము. ప్రకృతితో ఘనిష్టమైన సంబంధం ఏర్పడుతుంది. మనల్ని బంధిచేది ఒకటి కాలం అయితే, ఇంకోటి మాయ. అలాంటి వాడు ఎలాంటి మోహం లేకుండా పరమాత్మ యందు రమిస్తాడు. ప్రకృతి సంబంధం నాది కాదు అనుకున్నవాడికి కాలముతో గానీ ప్రకృతితో గానీ సంబంధం ఉండదు.

ఆత్మతత్త్వవిశుద్ధ్యర్థం యదాహ భగవానృతమ్
బ్రహ్మణే దర్శయన్రూపమవ్యలీకవ్రతాదృతః

ప్రకృతి సంబంధాన్ని గుర్తించి, నాకు ప్రకృతికీ సంబంధం లేదు, కనపడేవి ఏవీ నావి కావు అనుకున్నవాడి ఏ బాధ ఉండదు. మనసు శుద్ధి ఉన్నవాడికి ప్రకృతి సంబంధముండదు. ప్రకృతిని నుంచి అహంకారం పుడితే, అహంకారమునుంచి మనసు పుట్టింది. అది ఎలా శుద్ధిగా ఉంటుంది అంటే, ఇదే విషయాన్ని పరమాత్మ బ్రహ్మగారికి బోధించాడు. కపటములేని స్వచ్చమైన నిష్కామమైన వ్రతముని ఆచరించుట వలన ప్రసన్నుడైన పరమాత్మ తన దివ్య మంగళ విగ్రహాన్ని సాక్షాత్కరింపచేసి ఏమి చెప్పడొ అదే నీకు చెప్పబోవుతున్నాను

స ఆదిదేవో జగతాం పరో గురుః స్వధిష్ణ్యమాస్థాయ సిసృక్షయైక్షత
తాం నాధ్యగచ్ఛద్దృశమత్ర సమ్మతాం ప్రపఞ్చనిర్మాణవిధిర్యయా భవేత్

ఆదైదేవుడైన బ్రహ్మ తన నివాసమైన వేయి రేకుల పద్మము మీద చేరి సృష్టి చేయాలని సంకల్పంతో చుట్టూ చూచాడు. ఎంత ఆలోచించినా ప్రపంచాన్ని సృష్టించడానికి కావలిసిన జ్ఞ్యానాన్ని పొందలేకపోయాడు. తన మూలాన్ని తెల్సుకోవడానికి సృష్టిచేసే విధానాన్ని ఆలోచిస్తున్న బ్రహ్మకు రెండు అక్షరములు కలది రెండు సార్లు వినపడింది.

స చిన్తయన్ద్వ్యక్షరమేకదామ్భస్యుపాశృణోద్ద్విర్గదితం వచో విభుః
స్పర్శేషు యత్షోడశమేకవింశం నిష్కిఞ్చనానాం నృప యద్ధనం విదుః

స్పర్శలలో పదహారవది ఇరవైయొకటవది వినపడింది. క నించి మ వరకు ఉన్న అక్షరాలు స్పర్శలు (క చ ట త ప లు, ఐదక్షరాలు ఉంటే వర్గలు ఐదు. ఈ ఇరవై అయిదు అక్షరాలకు స్పర్శలు ). క నుంచి పదహారవది త, ఇరవై ఒకటవది ప. ఈ రెందూ వినపడ్డాయి. "తప తప" అని వినపడింది. నాది అంటూ ఏదీ లేని వారికి, పరమాత్మను పొందడానికి ఏ సాధనం లేని వారు నిష్కించనులు, అలాంటి నిష్కించులకు ఇది ధనం. నాది అని చెప్పుకోడానికి ఏది లేని వారికి ఇది ధనం.

నిశమ్య తద్వక్తృదిదృక్షయా దిశో విలోక్య తత్రాన్యదపశ్యమానః
స్వధిష్ణ్యమాస్థాయ విమృశ్య తద్ధితం తపస్యుపాదిష్ట ఇవాదధే మనః

ఒక వెయ్యి ఏళ్ళు వెతికాడు ఆ శబ్దం అన్నవారి గురించి. చూచి, ఏమి దొరకక, తన ఆసనాన్నే చేరి, ఉపదేశించిన విధానంలోనే తపస్సుని ఆచరించాడు.

దివ్యం సహస్రాబ్దమమోఘదర్శనో జితానిలాత్మా విజితోభయేన్ద్రియః
అతప్యత స్మాఖిలలోకతాపనం తపస్తపీయాంస్తపతాం సమాహితః

దివ్యమైన వేయి సంవత్సరములు సఫలమైన జ్ఞ్యానము కల వాడై, వాయువును గెలిచి, జ్ఞ్యాన కర్మేంద్రియాలను గెలిచి, అన్ని లోకాలను తపింపచేసే తపసు (అన్ని లోకాలను సృష్టింపచేసే తపసు )
తపసులో చాల శ్రేష్టుడై, తపసు యొక్క మూలాన్ని దర్శించగల వాడైన బ్రహ్మ తపస్సు చేసాడు.

తస్మై స్వలోకం భగవాన్సభాజితః సన్దర్శయామాస పరం న యత్పరమ్
వ్యపేతసఙ్క్లేశవిమోహసాధ్వసం స్వదృష్టవద్భిర్పురుషైరభిష్టుతమ్

ఇంత ఘోరమైన ఏకాగ్రమైన తపసు చేసిన బ్రహ్మకు మన్నింపుగా తన లోకాన్ని చూపించాడు. ఆ లోకం కన్నా పరమైన లోఖం ఇంకోటి లేదు. ఆలోకంలో కష్టములూ మోహములూ బాధలూ తొందరపాటులూ ఏమీ లేవి, తనకి కనపడే దేవతల చేతా (నిత్యసూరులు) స్తోత్రం చేయబడుతున్నాడు

ప్రవర్తతే యత్ర రజస్తమస్తయోః సత్త్వం చ మిశ్రం న చ కాలవిక్రమః
న యత్ర మాయా కిముతాపరే హరేరనువ్రతా యత్ర సురాసురార్చితాః

ఆ వైకుంఠములో రజ తమ సత్వ గుణాలు పనిచేయవు, కాలము తన ప్రభావం చూపించదు, అగ్ని ప్రభావం కూడాలేదు. అక్కడ ప్రకృతీ, గుణాలూ లేవు లేదు. అక్కడున్నవారందరూ శ్రీహరి భక్తులు. వారు దేవతలచేతా అసురులచేతా నిత్యమూ పూజింపబడే వారు.

శ్యామావదాతాః శతపత్రలోచనాః పిశఙ్గవస్త్రాః సురుచః సుపేశసః
సర్వే చతుర్బాహవ ఉన్మిషన్మణి ప్రవేకనిష్కాభరణాః సువర్చసః
ప్రవాలవైదూర్యమృణాలవర్చసః పరిస్ఫురత్కుణ్డలమౌలిమాలినః

వారందరూ నీలమేఘశ్యాములే పద్మాక్షులే పీతాంబరధారులే, చక్కని కాంతి, ప్రభావం, అందరూ చతుర్భుజులూ, నవరత్నఖచితమైన ఆభరణాలను ధరించినవారే

భ్రాజిష్ణుభిర్యః పరితో విరాజతే లసద్విమానావలిభిర్మహాత్మనామ్
విద్యోతమానః ప్రమదోత్తమాద్యుభిః సవిద్యుదభ్రావలిభిర్యథా నభః

వారి దివ్యదేహ కాంతులూ ఆభరణాలు, విహరించడానికి విమానాలు, విమానాలతో పైన తిరుగుతూ ఉంటే మెరుపులతో కూడిన మేఘంలాగ వైకుంఠం భాసించింది.

శ్రీర్యత్ర రూపిణ్యురుగాయపాదయోః కరోతి మానం బహుధా విభూతిభిః
ప్రేఙ్ఖం శ్రితా యా కుసుమాకరానుగైర్విగీయమానా ప్రియకర్మ గాయతీ

అక్కడ అమ్మవారు రూపుదాల్చి పరమాత్మ పాదములను అన్ని రకములుగా అన్ని విభూతులతో సంవాహనం చేస్తూ గౌరవం చేస్తూ ఉన్నారు. అమ్మవారు తూగుటుయలలో ఊగుతూ పరమాత్మ పాద సంవాహనం చేస్తోంది. (అమ్మవారు వక్షస్థలంలో ఉంటుంది, అక్కడే స్వామి వనమాల ఉంటుంది. అలా ఆ వనమాలలో ఊగుతూ తనకున్న సకల విభూతులతో సంవాహనం చేస్తోంది). సకల ఋతువులతో ఏర్పడిన సుగంధములకు ఆశపడిన తుమ్మెదలతో గానం చేయబడుతున్న అమ్మవారు, స్వామివారి పాదాలను సంవాహనం చేస్తోంది.

దదర్శ తత్రాఖిలసాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిమ్
సునన్దనన్దప్రబలార్హణాదిభిః స్వపార్షదాగ్రైః పరిసేవితం విభుమ్

ఇవన్ని చూచిన తరువాత బ్రహ్మగారు, శ్రియపతి, యజ్ఞ్యపతి అయిన స్వామిని చూచారు. వీరందరిచేతా ఆరాధించబడే పరమాత్మను చూచారు.

భృత్యప్రసాదాభిముఖం దృగాసవం ప్రసన్నహాసారుణలోచనాననమ్
కిరీటినం కుణ్డలినం చతుర్భుజం పీతాంశుకం వక్షసి లక్షితం శ్రియా

అధ్యర్హణీయాసనమాస్థితం పరం వృతం చతుఃషోడశపఞ్చశక్తిభిః
యుక్తం భగైః స్వైరితరత్ర చాధ్రువైః స్వ ఏవ ధామన్రమమాణమీశ్వరమ్

వనమాలా పీతాంబరం కౌస్తుభంతో ప్రకాశిస్తూ, భగములన్నీ (జ్ఞ్యానాది షడ్ గుణాలు) రూపు దాల్చి ఆయన ఆధీనంలో ఉన్నాయి. ఈ భగములు (జ్ఞ్యాన శక్తి ఐశ్వర్య వీర్య తేజస్సులు) ఇంకోచోట చంచలంగా ఉండేవి, పరమాత్మ ధామంలో పరమాత్మను సేవిస్తూ ఉన్నాయి.


తద్దర్శనాహ్లాదపరిప్లుతాన్తరో హృష్యత్తనుః ప్రేమభరాశ్రులోచనః
ననామ పాదామ్బుజమస్య విశ్వసృగ్యత్పారమహంస్యేన పథాధిగమ్యతే

పరమాత్మ దివ్య మంగళ రూపాన్ని చూచి భక్తితో ఆనందాశ్రువులు నిండి ఉండగా ఆయనకు నమస్కారం చేసాడు. ఈయన పాదాలు దొరకాలంటే పరమహంస మార్గాన్ని అవలంబించాలి. అలా పొందదగినవి ఆయన పాదాలు

తం ప్రీయమాణం సముపస్థితం కవిం ప్రజావిసర్గే నిజశాసనార్హణమ్
బభాష ఈషత్స్మితశోచిషా గిరా ప్రియః ప్రియం ప్రీతమనాః కరే స్పృశన్

తనను చూచి తన సాక్షాత్కారంతో ఆనందిస్తూ, తన ఆజ్ఞ్యతో సకల జగత్తునూ సృష్టిచాలనై ఉవ్విళ్ళొరుతున్న బ్రహ్మగారిని చూస్తూ, చిరునవ్వు అనే అలంకారాన్ని కూర్చి ఆ వాక్కుతో, ప్రీతిపాత్రుడైన బ్రమ్హగారి చేతిని చేతితో స్పృశిస్తూ సంతోషాన్ని ప్రక్టిస్తూ మాట్లాడాడు.

శ్రీభగవానువాచ
త్వయాహం తోషితః సమ్యగ్వేదగర్భ సిసృక్షయా
చిరం భృతేన తపసా దుస్తోషః కూటయోగినామ్

నీచేత నేను చాలా చక్కగా సంతోషింపచేయబడ్డాను, నీవు సృష్టి చేయాలన్న కోరికతోటి, నీవు చేసిన తపసుతోటి నేను సంతోషించాను. నన్ను సంతోషింపచేయుట అంత సులభం కాదు. "యోగిలాగ" ఆచరించేవారికి నేను సులభంగా సంతోషించను.

వరం వరయ భద్రం తే వరేశం మాభివాఞ్ఛితమ్
బ్రహ్మఞ్ఛ్రేయఃపరిశ్రామః పుంసాం మద్దర్శనావధిః

నేను సంతోషించాను కాబట్టి ఏదైనా వరము కోరుకో. ప్రపంచంలో మేలు కలగకుండా ఎంత కాలం ఉంటుంది లేదా అసలు శ్రేయస్సు కలగడం అనేది ఎప్పటినుంచి  ప్రారంభవముతుంది? ఎప్పుడు నా సాక్షాత్కారమవుతుందో అప్పటినుంచి. నా దర్శనం ఐతే పరిశ్రంలేకుండా ఫలితం కలుగుతుంది. నా దర్శనంతో నిశ్రేయసం (మోక్షం) లభిస్తుంది.

మనీషితానుభావోऽయం మమ లోకావలోకనమ్
యదుపశ్రుత్య రహసి చకర్థ పరమం తపః

నా అనుగ్రహం, సంకల్పం వలననే నీకు నా లోకం చూసే అవకాశం కలిగింది. (శ్రీమన్నారాయణుడు మొదట అహంకారం పోగొడతాడు. మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో అది అంతా ఆయన సంకల్పమే అని మనకు తెలుస్తుంది.)
నా మాట విని, నా సంకల్పానుగుణంగా నీవు చాలా పెద్ద తపస్సు చేసావు, నీవు నాలోకం చూచుటా నా అనుగ్రహప్రభావం.

ప్రత్యాదిష్టం మయా తత్ర త్వయి కర్మవిమోహితే
తపో మే హృదయం సాక్షాదాత్మాహం తపసోऽనఘ

ఏమి చేయాలో తెలియక నీవు ఇబ్బంది పడుతున్నప్పుడు తపసు చేయమని నేను చెప్పాను. తపసు అంటే నా హృదయం. తపసుకు నేనే ఆత్మను. నేను కూడా తపసుతోటే జగత్తుని సృష్టించి రక్షించి లయం చేస్తున్నాను

సృజామి తపసైవేదం గ్రసామి తపసా పునః
బిభర్మి తపసా విశ్వం వీర్యం మే దుశ్చరం తపః

నా అసలైన బలం తపస్సే

బ్రహ్మోవాచ
భగవన్సర్వభూతానామధ్యక్షోऽవస్థితో గుహామ్
వేద హ్యప్రతిరుద్ధేన ప్రజ్ఞానేన చికీర్షితమ్

అపుడు బ్రహ్మగారు "అందరినీ కనిపెట్టే వారు మీరు (అధ్యక్షులు), అందరి హృదయంలో నీవు అంతర్యామిగా ఉన్నావు". ఎవరెవరు ఏమేమి చేయాలనుకుంటున్నారో నీవు అదే తెలుసుకుంటావు. నీ జ్ఞ్యాన వీర్య తేజస్సులకు అడ్డు ఉండదు.

తథాపి నాథమానస్య నాథ నాథయ నాథితమ్
పరావరే యథా రూపేజానీయాం తే త్వరూపిణః

నేనేమి చేయాలనుకుంటున్నానో నీకు తెలుసు. నీవు నన్ను తపస్సు చేయమని చెప్పావంటే నీవనుకున్నది తపస్సుతోనే సాధ్యము. నాథితమ్ నాథయ - నా కోరికను పరిపూర్తి చేయవలసింది. పరిపూర్ణ ప్రదున్ని నాథుడు అంటారు. పరమాత్మ పరావరుడు (అందరికంటే పెద్దవాడు, అందరికంటే చిన్నవాడూ. ప్రపంచంలో అతి చిన్న వస్తువుకంటే చిన్నవాడు, అతి పెద్దవస్తువుకంటే పెద్దవాడు). వాస్తవముగా నీకు ఏ రూపమూ లేదు, ఆచరించిన కర్మలు అనుభవించవలసిన పాంచభౌతికరూపం లేదు. నీ రూపం అప్రాకృతం. కర్మఫలంగా వచ్చే రూపం కాదు నీది. అలాంటి నీయొక్క రూపం (పెద్దరూపమూ, చిన్నరూపమూ రెండూనూ) నాకు తెలియాలి. నీవు ఎంత చిన్నగా ఉంటావో ఎంత పెద్దగా ఉంటావో తెలియాలి. నీ సౌలభ్యం తెలియాలి, నీ స్వామిత్వం తెలియాలి.

యథాత్మమాయాయోగేన నానాశక్త్యుపబృంహితమ్
విలుమ్పన్విసృజన్గృహ్ణన్బిభ్రదాత్మానమాత్మనా

సత్వ రజ తమ శక్తులు గల పరమాత్మ, ఈ త్రిగుణాత్మకములైన కార్యక్రమములు చేస్తున్నాడు. ఏ పని ఏ గుణానిదో ఆ పని చేయడానికి ఆ గుణాన్ని నీవు తీసుకుంటావు. ప్రకృతిలో నీవు ప్రవేశించి, ఆ గుణాలు స్వీకరించి, అ గుణాలతో విలుంపన్ - లోపింపచేస్తూ, విసృజన్ - లోపించిన దాన్ని సృష్టిచేసి విగృహ్ణన్ - మళ్ళి దాన్ని కాపాడుతూ (విలుంపన్ - సృష్టి తరువాత ముగించుట, విసృజన్ -పోయినదాన్ని రప్పించుట విగృహ్ణన్ - రప్పించిన దాన్ని రక్షించుట )

క్రీడస్యమోఘసఙ్కల్ప ఊర్ణనాభిర్యథోర్ణుతే
తథా తద్విషయాం ధేహి మనీషాం మయి మాధవ

నీ సంకల్పం అమోఘం (వ్యర్థం కాదు). సాలె పురుగు ఎలా నోటినుండి దారాన్ని సృష్టించి, తను వెళ్ళదలచుకున్నప్పుడు ఎలా దాన్నే తింటుందో. ఆ సృష్టిలో నీవు ఎలా ఉంటున్నావో, నీలో ఆ సృష్టిని ఎలా ఉంచుకుంటున్నావో అది నాకు చెప్పవలసింది.

భగవచ్ఛిక్షితమహం కరవాణి హ్యతన్ద్రితః
నేహమానః ప్రజాసర్గం బధ్యేయం యదనుగ్రహాత్

మీరు నాకు ఏ విషయం చెప్పారో, నేను దాన్ని ఏ మాత్రం సోమరితనం లేకుండా చేస్తాను. మీరు నేర్పిన విధంగా సృష్టిస్తాను గానీ, నీ అనుగ్రహంతో నేను చేసిన సృష్టిలో నేనే బంధించబడకుండా ఉంచమని ప్రార్థన.

యావత్సఖా సఖ్యురివేశ తే కృతః ప్రజావిసర్గే విభజామి భో జనమ్
అవిక్లవస్తే పరికర్మణి స్థితో మా మే సమున్నద్ధమదో ఞ్జ మానినః

నీవు నాకు సాక్షాత్కరించి నన్ను కూడా నీ యంతటి వాడిగా భావించి ఒక మిత్రుడిలాగ చేతిలో చేయి వేసావు, కాబట్టి నీవు చెప్పినట్లుగా నీ సంకల్పానుగుణంగా సృష్టి చేస్తాను. నీ సంకల్పానుగుణంగా సృష్టిస్తాను. నీవాజ్ఞ్యాపించిన పనిలో నేను దైన్యం పొందకుండా నిర్వహిస్తాను. కానీ "నేనే నిర్వహించాను అనిపించవద్దు" ఆ మదం నాకు రాకుండా అనుగ్రహించు. అహకారాన్ని రానీయకు

దీనిని చతు శ్లోకీ భాగవతం అంటారు. పరమాత్మ బ్రహ్మగారికీ, బ్రహమ నారదునికీ, నారదుడు, వ్యాసునికి, వ్యాసుడు శుకునికీ బోధించినది. ఈ నాలుగు శ్లోకాలలో, పరమాత్మ అంటే ఏమిటి, జగత్తు అంటే ఏమిటి,

శ్రీభగవానువాచ
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్
సరహస్యం తదఙ్గం చ గృహాణ గదితం మయా

విజ్ఞ్యానంతో (శాస్త్ర జ్ఞ్యానంతో) కూడిన అతిరహస్యమైన నా తత్వాన్ని చెప్పే జ్ఞ్యానం, రహస్యములతో కూడి ఉన్న (మంత్రములతో కూడి ఉన్న) దానిని నేను ఉపదేశిస్తున్నాను, స్వీకరించు.
(మంత్రములు మంత్రాంగములు యోగము శాస్త్రము వేదాంగములతో కూడిన దాన్ని చెప్పబోవుతున్నాను అని వ్యాఖ్యానం). ఈ శ్లోకంతో విధురమైత్రేయ, కృష్ణ ఉద్ధవ సంవాదం, ప్రహ్లాద అవధూత సంవాదం, రుద్రహీతలు , మొదలైన సంవాదాలన్నీ ఈ శ్లోకంతో వస్తుంది. అవి నాలుగున్నరవేల శ్లోకాలు.

యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్

అహం యావాన్: నా స్వరూపం ఏమిటీ. నా వ్యాప్తి ఎంతవరకూ ఉందో
యధా భావ: నా స్వభావమేమిటో,
యద్రూపగుణకర్మకః - నేను ఏ రూపంలో ఉంటానో ఏ గుణములతో ఉంటానో ఏ కర్మలు చేస్తానో
(ఈ ఒక్క పాదంతో భాగవతంలో ఉన్న బ్రహ్మ సృష్టి, ప్రజాపతి సృష్టి, ప్రకృతి సృష్టి, ఆత్మ సృష్టి అన్ని వస్తాయి, )
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ - నా స్వరూప స్వభావ రూప గుణ కర్మలు అన్నీ ఉన్నదున్నట్లుగా నా అనుగ్రహంతో నీకు కలగాలి.

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్
పశ్చాదహం యదేతచ్చ యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్

అహమేవాసమేవాగ్రే  - ప్రళయకాలంలో, సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నది నేను ఒక్కడినే
నాన్యద్యత్సదసత్పరమ్- నేను తప్ప సత్, అసత్ , కాలం లేదు. జీవుడు ప్రకృతి పరం ఏవి లేవు. (పరమాత్మ సంకల్పమే కాలం). ప్రళయకాలంలో నాకంటే భిన్నమైనవి ఏమీ లేవు.
సృష్టికి ముందు నేనే ఉన్నాను, సృష్టి కాలంలోనూ నేనే ఉన్నాను, సృష్టి లయం అయ్యాక కూడా (పశ్చాదహం ) నేనే ఉన్నాను.
యోऽవశిష్యేత సోऽస్మ్యహమ్ - ఏది మిగులుతుందో అదే నేను

(ఈ శ్లోకం వలన భాగవతంలో ఉన్న అన్ని రకాల సృష్టి రక్షణ ప్రళయములూ చెప్పబడ్డాయి)

ఋతేऽర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః

ఋతేऽర్థం యత్ప్రతీయేత - నా సంకల్పం మేరకే అన్నీ జరుగుతాయి
నేను ఉన్నాను కాబట్టే ఇవన్నీ కనపడుతున్నాయి. నేను లేకపోతే నీకు నీవే కనపడవు. (మనలని "మనం" అని మనం అనుకోవడానికి కూడా మనలో ఆయన ఉంటేనే అనుకోగలము. మనకు ఏమైన విషయం తెలిసిందీ అంటే తెలియబడిన విషయంలోనూ, తెలుసుకున్నవాడిలోనూ, తెలుసుకోవడంలోనూ, జ్ఞ్యాతా జ్ఞ్యేయమూ జ్ఞ్యానము ఈ మూడింటిలోనూ ఆయన ఉన్నప్పుడే ఆ జ్ఞ్యానం కలుగుతుంది. అనుభూతి మనకి కలుగ్తోంది అంటే అది పరమాత్మ కలిగించిందే. ఏ జ్ఞ్యానమైనా అతని సంబంధంతోటే కలుగుతుంది )
న ప్రతీయేత చాత్మని - నేను లేకుంటే ఆత్మలో ఎలాంటి స్వరూప స్వభావ జ్ఞ్యానములు కలగవు
తద్విద్యాదాత్మనో మాయాం యథాభాసో యథా తమః
తెలిసినదీ అన్నా, తెలియందీ అన్నా, ఈ రెండూ నా మాయే. వెలుతురూ చీకటి లాగ ప్రకృతి సంబంధం ఉంటే నా జ్ఞ్యానం ఉండదు. నా జ్ఞ్యానం ఉంటే వాడు ప్రకృతితో మోహింపబడడు. ఐతే ఈ ఆత్మజ్ఞ్యానమైనా ప్రకృతి జ్ఞ్యానమైనా నా సంకల్పంతోనే కలుగుతాయి.

యథా మహాన్తి భూతాని భూతేషూచ్చావచేష్వను
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్

సకల జగత్తులో పరమాత్మ అంతర్యామిగా ఉంటున్నాడు. (కుండ పగలగొట్టినా అందులో ఉండే ఆకాశం అలాగే ఉంటుంది ఎందుకంటే కుండ కూడా ఆకాశంలో ఉంటుంది. అయినా మనం కుండలో ఆకాశం ఉంది అంటాం. మరి కుండ విరిగితే ఆకాశం ఎక్కడికీ పోకుండా అలాగే ఉంటుంది. )
ప్రతీ ప్రాణిలోనూ (చిన్న ప్రాణిలోనూ పెద్ద ప్రాణిలోనూ) పంచభూతాలు ఉన్నాయి. పంచభూతములతోనే మనం ఏర్పడ్డాము. మనమే పంచభూతములలోకి వెళ్ళాము. పంచభూతములు ప్రవేశించినట్లూ ఉంటాయి, ప్రవేశించనట్లూ ఉంటాయి. మనలో అన్ని రంధ్రములలో ఆకాశం ఉంది, ద్రవమంతా జలం, వేడి అంతా అగ్ని, ఘనమైన శరీరమంతా భూమి, శరీరమంతా వాయువూ, ఇలా అన్ని భూతాలు మనలో ఉన్నాయి. పంచభూతాలు మనలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది, అలాగే వెళ్ళిపోయినట్లు కనపడతాయి. అలా పంచభూతాలు వచ్చి వెళ్ళినట్లు అనిపిస్తాయి.
నేను ఆ పంచభూతాలలో ఉంటాను. కనీ అవి నాకు అంటవు. పాప పుణ్యాలు, న్యాయాన్యాలు, హితాహితాలు అన్నీ ప్రకృతి సంబంధాలు. ప్రకృతికి సంబంధించిన ఏ దోషాలూ నాకు అంటవు. నేను అన్నింటిలోనూ ఉంటాను. నాకేదీ అంటదు. అన్నిట్లో ఉన్నట్లే ఉంటాను, ఎందులోనూ ఉండను. వేటిలో లేను అనుకుంటారు, గానీ అన్నిటిలో నేను ఉంటాను

(దీనితో మొత్తం భక్తుల చరిత్రలు వస్తాయి)

ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాత్మనః
అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా

ప్రతీ వ్యక్తీ ప్రపంచములో తెలుసుకోవలసినది ఇదే. ఆత్మ తత్వం తెలుసుకోవాలి అనుకునే వాడు తెలుసుకోవలసిన విషయం ఇదే. అన్వయవ్యతిరేకాభ్యాం  - ఏది తెలిస్తే మనకు విషయం తెలుస్తుందో అది అన్వయం. ఏది లేకపోతే మనకి విషయం తెలియదో అది వ్యతిరేక్వ్యాప్తి (వ్యతిరేకం కారణం నుంచి వస్తుంది. ఉదా: "జ్య్నానం లేకుంటే పరమాత్మ తెలియబడదు"). ఏ జ్ఞ్యానంతో పరమాత్మ తెలుస్తాడొ, ఏ అజ్ఞ్యానంతో పరమాత్మ ప్రచ్చనంగా ఉంటాడో , ఇలాంటి రెంటితోటీ. పరమాత్మ అన్ని వేళలా, అన్ని రూపాలలో, అన్ని సంకల్పాలలో ఉన్నాడు.

ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా
భవాన్కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్

మీరు ఇంక తపస్సు చేయాండి. కానీ ఈ సూత్రాన్ని మర్చిపోవద్దు. ఈ విజ్ఞ్యానాన్ని నీవు మనసులో పెట్టుకుంటే ఎన్ని వికల్పములు వచ్చినా నీవు మోహింపబడవు, నా మాయ నిన్ను ఏమీ చెయ్యదు

శ్రీశుక ఉవాచ
సమ్ప్రదిశ్యైవమజనో జనానాం పరమేష్ఠినమ్
పశ్యతస్తస్య తద్రూపమాత్మనో న్యరుణద్ధరిః

ఇలా పరమాత్మ బ్రహ్మగారు చూస్తుండగానే అంతర్థానమయ్యాడు

అన్తర్హితేన్ద్రియార్థాయ హరయే విహితాఞ్జలిః
సర్వభూతమయో విశ్వం ససర్జేదం స పూర్వవత్

బ్రహ్మగారు ఆ దిక్కుకే నమస్కారం చేసి పరమాత్మ సంకల్పంతో జరిగిన దానిని చూచి జరగబోయే దానిని ఏర్పరచాడు

ప్రజాపతిర్ధర్మపతిరేకదా నియమాన్యమాన్
భద్రం ప్రజానామన్విచ్ఛన్నాతిష్ఠత్స్వార్థకామ్యయా

ఇలా సృష్టి చేసి, తాను చేసిన సృష్టిలో క్షేమం ఎలా కలుగుతుందో అని ధ్యానమగ్నుడయ్యాడు. ఆయన ధ్యానంలో ఉండగా

తం నారదః ప్రియతమో రిక్థాదానామనువ్రతః
శుశ్రూషమాణః శీలేన ప్రశ్రయేణ దమేన చ

నారదుడు భాగములు తీసుకునే వారితో (రిక్థాదానామనువ్రతః - అన్నలతో) కలిసి వచ్చాడు, ఉత్తమ స్వభావంతో నియమంతో ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మను సేవిస్తూ శ్రీమన్నారాయణుని ప్రభావాన్ని తెలుసుకుందామని వచ్చాడు.

మాయాం వివిదిషన్విష్ణోర్మాయేశస్య మహామునిః
మహాభాగవతో రాజన్పితరం పర్యతోషయత్

తన శుశ్రూషతో సేవతో తండ్రిని మెప్పించాడు

తుష్టం నిశామ్య పితరం లోకానాం ప్రపితామహమ్
దేవర్షిః పరిపప్రచ్ఛ భవాన్యన్మానుపృచ్ఛతి

అన్ని లోకాలకు ముత్తాత అయిన బ్రహ్మగారు సంతోషించాడన్న విషయాన్ని తెలుసుకుని, ఇప్పటిదాకా నీవేమి అడిగావో అది నారదుడు బ్రహ్మగారిని అడిగాడు.

తస్మా ఇదం భాగవతం పురాణం దశలక్షణమ్
ప్రోక్తం భగవతా ప్రాహ ప్రీతః పుత్రాయ భూతకృత్

ఇలా అడిగిన నారద మహర్షికి బ్రహ్మగారు భాగవత పురాణ లక్షణం చెప్పారు. శ్రీమన్నారాయణుడు తనకు ఇంతకు ముందు ఏమి చెప్పాడో బ్రహ్మగారు నారదునికి అదే చెప్పారు.

నారదః ప్రాహ మునయే సరస్వత్యాస్తటే నృప
ధ్యాయతే బ్రహ్మ పరమం వ్యాసాయామితతేజసే

అలాంటి నారదుడు విని తాను బయలుదేరి వచ్చి బదరికాశ్రమంలో సరస్వతీ తీరంలో పరమాత్మయొక్క ధ్యాన ముద్రలో ఉన్న, మహాతేజస్వి అయిన, వేదవ్యాసునికి చెప్పాడు.

యదుతాహం త్వయా పృష్టో వైరాజాత్పురుషాదిదమ్
యథాసీత్తదుపాఖ్యాస్తే ప్రశ్నానన్యాంశ్చ కృత్స్నశః

ఇప్పుడు నీవడిగినట్లుగా విరాట్ పురుషున్నించి ఎలా సృష్టి జరిగిందీ అని, దానికి సమాధానంతో బాటుగా, నీవు అడగని దానికి కూడా సమాధానం చెబుతాను.

                                               సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం అష్టమాధ్యాయం

                                                      ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం అష్టమాధ్యాయం

ఏడవ అధ్యాయంలో పరమాత్మ అవతారాలను వివరించారు. దాని వల్ల ఆయుష్షు సత్ వ్యయం అవుతుంది. దానికి ఫల శృతిగా మాయా స్వరూపుడైన పరమాత్మ లీలలను కథలను గుణములనూ కీర్తన చేసిన వారికీ, చేసిన కీర్తనను ఆమోదించిన వారికి పరమాత్మ మాయ వారి మీద పడదు. బ్రహ్మగారు నారదునితో భాగవతాన్ని విస్తరింపచేయమని చెప్పారు.

రాజోవాచ
బ్రహ్మణా చోదితో బ్రహ్మన్గుణాఖ్యానేऽగుణస్య చ
యస్మై యస్మై యథా ప్రాహ నారదో దేవదర్శనః

దేవదర్శనుడైఅన (పరమాత్మను సాక్షాత్కరించుకున్న) నారదుడు ఏ ప్రాకృతిక గుణములూ లేని వాడి గుణాలు కీర్తించడానికి బ్రహ్మగారిచేత ప్రేరేపించబడి అడిగిన వారికి నారదుడు ఎలా వివరించాడు

ఏతద్వేదితుమిచ్ఛామి తత్త్వం తత్త్వవిదాం వర
హరేరద్భుతవీర్యస్య కథా లోకసుమఙ్గలాః

వేదం తెలిసిన వారిలో ఉత్తముడైన శుకా, నాకు ఈ విషయం తెలుసుకోవాలని ఉంది. అద్భుతమైన వీరుడైన పరమాత్మ కథలను, లోకానికి శుభము కలిగించేటువంటి వాటినీ తెలుసుకోవాలనుకుంటున్నాను

కథయస్వ మహాభాగ యథాహమఖిలాత్మని
కృష్ణే నివేశ్య నిఃసఙ్గం మనస్త్యక్ష్యే కలేవరమ్

సకల జగత్స్వరూపుడైన కృష్ణ పరమాత్మ యందు ప్రవేశింపచేసి, ఆ నిస్సంగమైన (సంసారం యందు ఆసక్తి లేని మనసును) మనసును ఆయన యందు ఉంచి, ఈ శరీరాన్ని విడిచిపెడతాను.

శృణ్వతః శ్రద్ధయా నిత్యం గృణతశ్చ స్వచేష్టితమ్
కాలేన నాతిదీర్ఘేణ భగవాన్విశతే హృది

అలాంటి మనసును పరమాత్మ యందు ఉంచడం సాధ్యమేనా? మనం ఏమి చేస్తున్నా మన మనసు మాత్రం సంసారమ్యందే ఉంటుంది కదా? అలాంటి మనసులో పరమాత్మ ఉంటాడా? ఆయన లీలనూ గుణములనూ కథలను శ్రద్ధతో నిత్యమూ వింటూ కీర్తిస్తూ ఉన్నవారి హృదయంలోకి ఆయనే ప్రవేశిస్తాడు. మనం చేయవలసిన పని ఆయన కథలను విని గుణములను కీర్తించడమే, అతి త్వరలోనే ఆయన వస్తాడు. మనం వింటూ ఉంటే శబ్దములతో బాటు శబ్ద ప్రతిపాద్యుడైన పరమాత్మ కర్ణ రంధ్రములగుండా ప్రవేశిస్తాడు.

ప్రవిష్టః కర్ణరన్ధ్రేణ స్వానాం భావసరోరుహమ్
ధునోతి శమలం కృష్ణః సలిలస్య యథా శరత్

హృదయంలోకి ప్రవేశించి అంతవరకూ హృదయంలో ఉన్న మాలిన్యాన్ని తొలగిస్తాడు ఎలాగంటే శరత్ కాలం నీటి మురికిని తొలగించినట్లు.

ధౌతాత్మా పురుషః కృష్ణ పాదమూలం న ముఞ్చతి
ముక్తసర్వపరిక్లేశః పాన్థః స్వశరణం యథా

ఎపుడైతే మనసు పరిశుద్ధి పొందిందో పరమాత్మను మనము విడిచిపెట్టలేము. ఆ మనసు పరిసుద్ధి కూడా మనము చేసుకోలేము, పరమాత్మే చేస్తాడు. హృదయమాలిన్యం తొలిగాక మనము ఇక ఆయనను విడిచిపెట్టము. తన ఇంటికి చేరగానే ఎలా బాటసారి కష్టాలు తొలగిపోతాయో, పరమాత్మ చేరగానే మన కష్టాలు తొలగిపోతాయి. మన ఇళ్ళు పరమాత్మ, సంసారం అంటే మహారణ్యం, కోరికలు అనే పెద్ద మృగాలు బాధిస్తున్నాయి. ఆ అరణ్యంలో కష్టాలు విడిచిపెట్టాలంటే మనం మన ఇంటికి వెళ్ళాలి. అదే పరమాత్మ.

యదధాతుమతో బ్రహ్మన్దేహారమ్భోऽస్య ధాతుభిః
యదృచ్ఛయా హేతునా వా భవన్తో జానతే యథా

పరమాత్మ 24 తత్వాలతో సృష్టి చేసాడని అన్నారు. ఇవన్నీ కలిసి ఒక ఆకారంగా ఏర్పడింది అని చెప్పారు. ఈ శరీరం ఏర్పడేది ఎవరికి ? శరీరం లేని వారికి. అంటే జీవుడికి. అంటే జీవుడు వాస్తవంగా శరీరంలేనివాడే. శరీరం ఏర్పడుట అంటే ఏడు ధాతువులు ఏర్పడటం. ఈ ఏడు ధాతువులూ లేనిది జీవుడు. ఈ శరీర సంబంధం జీవుడికి అకారణంగా ఏర్పడుతుందా, సకారణంగా ఏర్పడుతుందా? మీరెలా భావిస్తున్నారో అలా మాకు వివరిచండి.

ఆసీద్యదుదరాత్పద్మం లోకసంస్థానలక్షణమ్
యావానయం వై పురుష ఇయత్తావయవైః పృథక్
తావానసావితి ప్రోక్తః సంస్థావయవవానివ

వరాహ పాద్మ మొదలైన కల్పములలో సకల చరాచర జగత్తుకు ప్రతీకగా పరమాత్మ ఒక పద్మాన్ని సృష్టించాడు, అందునుండి బ్రహ్మ, అందునుండి లోకాలు ఏర్పడ్డాయి. అన్ని లోకములకూ పద్మమే ప్రతీక. అన్ని లోకాలు పద్మంలోనే ఉన్నాయి. ఎవరి హృదయం నుండి ఆ పద్మం వెలువడిందో, ఆ పద్మమునుండే పురుషుడు ఉద్భవించాడు. (సృష్టిలో భోగ్యములు (షడ్రసములు కలిగిన పదార్థములు, రూపములూ, గుణములు భోగ్యములు) , భోగ్యోపకరణములు (వాటిని అనుభవించే ఇంద్రియములు ), భోగస్థానములు (అనుభవించడానికి కావలిసిన స్థానములు). విషయములు, ఇంద్రియములు, శరీరము) పరమాత్మకు ఎలాంటి ఆకారాలు అవయవాలు లేవు, కానీ అవయవాలున్నవానివలే అవి అన్నీ ఉన్న వారిని (బ్రహ్మను) సృష్టించాడు.  పరమాత్మ నుండి వచ్చినవారికి అవయవాలుంటే ఆయనకు అవయవాలున్నట్లా లేనట్లా.

అజః సృజతి భూతాని భూతాత్మా యదనుగ్రహాత్
దదృశే యేన తద్రూపం నాభిపద్మసముద్భవః

అన్ని లోకాలను ప్రాణులను పరమాత్మ అనుగ్రహంతోటి బ్రహ్మగారు సృష్టించారు, ఆయన అనుగ్రహాన్ని పొందినట్లు గుర్తుగా బ్రహ్మగారు పరమాత్మ దివ్యమంగళరూపాన్ని సాక్షాత్కరించుకున్నాడు. పరమాత్మ నాభిపద్మం నుండి పుట్టిన బ్రహ్మ ఎవరి దయతో పరమాత్మ రూపాన్ని సాక్షాత్కరించుకున్నాడో

స చాపి యత్ర పురుషో విశ్వస్థిత్యుద్భవాప్యయః
ముక్త్వాత్మమాయాం మాయేశః శేతే సర్వగుహాశయః

ఆ పరమాత్మ సకల చరాచర సృష్టి స్థ్తి లయములకూ మూలం అని చెప్పారు. ఈ పరమాత్మ తన మాయను విడిచిపెట్టి తానే వచ్చి ప్రతీ వారి హృదయంలో అంతర్యామిగా నివస్తూ ఉంటాడు అని చెప్పారు

పురుషావయవైర్లోకాః సపాలాః పూర్వకల్పితాః
లోకైరముష్యావయవాః సపాలైరితి శుశ్రుమ

ఈ పరమాత్మ అవయములతోటే అన్ని లోకాలు కల్పించబడ్డాయి అన్నారు. ఇంకోసారి పరమాత్మ నాభిపద్మంలోంచి వచ్చిన బ్రహ్మగారు లోకాలని సృష్టించాడని అన్నారు, మరోసారి పరమాత్మ తన సంకల్పంతో లోకాలని సృష్టించాడని చెప్పారు. ఇక్కడ పరస్పరం విరోధం కనపడుతున్నది. మరొక చోట పరమాత్మ అవయములే లోకములు అయ్యాయి అని చెప్పారు. లోకపాలకు లోకములూ కలిసే పరమాత్మ శరీరం అని చెప్పారు.

యావాన్కల్పో వికల్పో వా యథా కాలోऽనుమీయతే
భూతభవ్యభవచ్ఛబ్ద ఆయుర్మానం చ యత్సతః

తరువాత కల్పము (ప్రాకృతిక ప్రళయం, బ్రహ్మకు నూరేళ్ళు నిండుట) వికల్పము (నైమిత్తిక ప్రళయం), ఈ రెంటితోటే కాలమును ఊహిస్తున్నాము. జరబోయే కాలం, జరుగుతున్న కాలం, జరిగిపోయిన కాలం. దేవ గంధర్వ మాన్సవుల మొదలైన వారి ఆయువు.
(నిత్య ప్రళయం: ప్రపంచంలోనూ మన శరీరములోనూ ప్రతీక్షణం కలిగే మార్పు. శిశువు గర్భంలో పడినప్పటినుంచీ ప్రతీక్షణం కలిగే అన్ని అవస్థలూ శరీరానికి వస్తూనే ఉంటాయి. ఈ మార్పులే నిత్య ప్రళయం.
నైమిత్తిక ప్రళయం: బ్రహ్మకు ఒక పగలు అయితే వచ్చేది
ప్రాకృతిక ప్రళయం: బ్రహ్మకు నూరేళ్ళు వస్తే వచ్చేది
ఆత్యంతిక ప్రళయం: ఇది మోక్షం
)

కాలస్యానుగతిర్యా తు లక్ష్యతేऽణ్వీ బృహత్యపి
యావత్యః కర్మగతయో యాదృశీర్ద్విజసత్తమ

కాలం యొక్క మానం అతి సూక్ష్మమైన తృటి నుంచి అతి బృహత్ అయిన పరార్థం వరకూ జీవుల యొక్క కర్మలు స్వరూపములు ఎన్ని రకాలుగా ఉంటాయి

యస్మిన్కర్మసమావాయో యథా యేనోపగృహ్యతే
గుణానాం గుణినాం చైవ పరిణామమభీప్సతామ్

ఆచరించే అన్ని కర్మలూ ఎక్కడ చేరుతాయి. మనం చేస్తున్న కర్మలు ఎవరి స్వీకరిస్తారు (మనం ఆచారించే కర్మలు మనం ఆచరించట్లేదు, పరమాత్మ మనచే ఆచరింపచేస్తున్నారు, తోలుబొమ్మలాటలాగ మనకు దారాలు కట్టి తెరలోపల ఉండి ఆడిస్తూ ఉంటాడు), మన చేత కర్మలు ఎవరు చేయిస్తున్నారు. గుణపరిణామం ఏమిటి గుణి పరిణామము ఏమిటి, గుణముల వికారాలు (దంభమ్మ్ దర్పం క్రోధం), గుణములు లేని వారి వికారాలు

భూపాతాలకకుబ్వ్యోమ గ్రహనక్షత్రభూభృతామ్
సరిత్సముద్రద్వీపానాం సమ్భవశ్చైతదోకసామ్

సకలలోకముల భూతముల సృష్టి, ఆ లోకములలో ఉండేవారి వివర్ణ

ప్రమాణమణ్డకోశస్య బాహ్యాభ్యన్తరభేదతః
మహతాం చానుచరితం వర్ణాశ్రమవినిశ్చయః
యుగాని యుగమానం చ ధర్మో యశ్చ యుగే యుగే
అవతారానుచరితం యదాశ్చర్యతమం హరేః
నృణాం సాధారణో ధర్మః సవిశేషశ్చ యాదృశః
శ్రేణీనాం రాజర్షీణాం చ ధర్మః కృచ్ఛ్రేషు జీవతామ్

బ్రహ్మాండం లోపల ఎంత ఉంది, బయట ఎంత ఉంది. మహాత్ముల చరిత్ర వర్ణ ధర్మములూ, ఆశ్రంధర్మములూ, యుగాలూ, వాటి ప్రమాణాలు, యుగధర్మాలు, ఏ ఏ యుగములలో పరమాత్మ ఏ ఏ అవతారాలు ధరించి ఆశ్చర్యములు గొలిపే చర్యలు చేసాడో, మానవుల సాధారణ ధర్మాలు, విశేష ధర్మములు, రాజ ధర్మాలు, రాజ ఋషులలోని ధర్మాలు, ఆపద వచ్చినపుడు (ఆపదలలో బ్రతికేవారు) ఆచరించవలసిన ధర్మాలు

తత్త్వానాం పరిసఙ్ఖ్యానం లక్షణం హేతులక్షణమ్
పురుషారాధనవిధిర్యోగస్యాధ్యాత్మికస్య చ

తతవములూ వాటి లక్షణములూ, పరమాత్మ ఆరాధనా విధానం, యోగం, ఆధ్యాత్మ యోగం

యోగేశ్వరైశ్వర్యగతిర్లిఙ్గభఙ్గస్తు యోగినామ్
వేదోపవేదధర్మాణామితిహాసపురాణయోః

యోగీశ్వరుడైన పరమాత్మ శాసకత్వం ఎలా ఉంటుంది, యోగుల ప్రభావం ఏమిటి, యోగుల  శరీర నాశం (లింగభంగం) ఎలా జరుగుతుంది. వేదములూ, ఉపవేదములూ (ఆయుర్వేదం, ధనుర్వేదం, మొదలైనవి) ధర్మములూ, ఇతిహాస పురాణాలు

సమ్ప్లవః సర్వభూతానాం విక్రమః ప్రతిసఙ్క్రమః
ఇష్టాపూర్తస్య కామ్యానాం త్రివర్గస్య చ యో విధిః

అన్ని ప్రాణుల ప్రళయం, సృష్టి, ప్రళయం, దాని రక్షణ, ఇష్టములని (యజ్ఞ్య యాగాదులు) పూర్తములనే (నదులూ బావులూ దేవాలయాలు తోటలు చెరువులూ ఏర్పాటు చేయడం) కర్మలు, ఇష్టాపూర్తములలో కూడా కామ్యములూ నిష్కామ్యములూ, ధర్మార్థ కామముల యొక్క విధి,

యో వానుశాయినాం సర్గః పాషణ్డస్య చ సమ్భవః
ఆత్మనో బన్ధమోక్షౌ చ వ్యవస్థానం స్వరూపతః

పాఖండ ధర్మములూ, ఆత్మ ఎపుడు బంధిచబడుతుంది, ఎపుడు మోక్షం వస్తుంది, ఎపుడు స్వస్వరూపంతో ఉంటుంది  (కైల్వల్యం)

యథాత్మతన్త్రో భగవాన్విక్రీడత్యాత్మమాయయా
విసృజ్య వా యథా మాయాముదాస్తే సాక్షివద్విభుః

ఇవన్నీ నిజంగా మనము చేస్తున్నవేనా, మనకు వస్తున్నవా? మనకే వస్తున్నాయి. మనం అనుకుంటే వస్తున్నాయా, అనుకోకుండానే వస్తున్నాయా? సర్వతంత్ర స్వతంత్ర్యుడు ఐన పరమాత్మ ఆత్మ మాయ వలన ఆయన క్రీడలో భాగంగా ఇదంతా చేస్తూ మాయను విడిచి పెట్టి పరమాత్మ సాక్షిగా ఉండి తామరాకు మీద నీటిబొట్టులాగా అంటుకోకుండా, చూస్తూ ఉంటాడు

సర్వమేతచ్చ భగవన్పృచ్ఛతో మేऽనుపూర్వశః
తత్త్వతోऽర్హస్యుదాహర్తుం ప్రపన్నాయ మహామునే

నిన్నే ఆశ్రయించిన నాకు వీటన్నిటికీ ప్రశ్నానుగుణంగా, యధాక్రమంగా సమాధానం చెప్పవలసింది.

అత్ర ప్రమాణం హి భవాన్పరమేష్ఠీ యథాత్మభూః
అపరే చానుతిష్ఠన్తి పూర్వేషాం పూర్వజైః కృతమ్

సృష్టికి బ్రహ్మగారు ఎలా ప్రమాణమో నేనడిగిన అన్ని విషయాలకు మీరే ప్రమాణం. ఉన్నవారి అందరికంటే ముందు వారు ఏమి చేసారో తరువాతి వారంతా అదే చేస్తారు.

న మేऽసవః పరాయన్తి బ్రహ్మన్ననశనాదమీ
పిబతో ఞ్చ్యుతపీయూషమ్తద్వాక్యాబ్ధివినిఃసృతమ్

నా ప్రాణములకి ఏడు రోజుల దాకా ఎటువంటి ప్రమాదం లేదు, నీరసం గానీ ఆకలి గానీ దప్పి గానీ రాదు. మూర్చ కూడా రాదు. ఎందుకంటే నేను అమృతం త్రాగుతున్నాను. పరమాత్మ అనే అమృతాన్ని త్రాగుతున్నాను.

సూత ఉవాచ
స ఉపామన్త్రితో రాజ్ఞా కథాయామితి సత్పతేః
బ్రహ్మరాతో భృశం ప్రీతో విష్ణురాతేన సంసది

ప్రాహ భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్
బ్రహ్మణే భగవత్ప్రోక్తం బ్రహ్మకల్ప ఉపాగతే

ఇలా పరీక్షిత్తు (విష్ణురాతుడు) చేత ప్రేరేపించబడిన బ్రహ్మరాతుడు (శుకుడు) బ్రహ్మకల్పంలో శ్రీమన్నారాయణుడు చెప్పిన భాగవతాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు
భగవంతున్ని అందించేవాడు శుకయోగీంద్రుడు. భగవంతుని చేత కాపాడ బడిన వాడు పరీక్షిత్తు

యద్యత్పరీక్షిదృషభః పాణ్డూనామనుపృచ్ఛతి
ఆనుపూర్వ్యేణ తత్సర్వమాఖ్యాతుముపచక్రమే

పాండవ శ్రేష్టుడైన పరీక్షిత్తు ఏ ఏ వరుసలో అడిగాడో ఆ వరుసలోనే చెప్పడానికి ఉపక్రమించాడు


                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Thursday, December 20, 2012

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 4

1. రామావతార సారం మొత్తం పెద్దల మాట వినుట. గురోర్నిదేశే తిష్ఠన్:  దేవతలు కోరితే అవతరించాడు. విశ్వామిత్రుడి మాట మేరకే ఆయనతో వెళ్ళాడు. విస్వామిత్రుని మాటమేరకే తాటకిని సంహరించాడు. ఆయన మాట మేరకే యజ్ఞ్యాన్ని కాపాడాడు, ఆయన ఆజ్ఞ్యను అనుసరించి మిథిలా నగరానికి బలయలు దేరి, అహల్యను శాపవిమోచనం గావించి, ఆయన మాటమేరకే శివ ధనుర్భంగం చేసాడు, దశరధుడు చెప్తే సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. తండ్రి మరియు కైక ఆజ్ఞ్యతో అరణ్యానికి బయలుదేరాడు. భరద్వాజుని ఆజ్ఞ్యతో చిత్రకూటంలో నివాసం ఏర్పరుచుకున్నాడు, చిత్రకూటంలో కులపతి ఆజ్ఞ్యతో అక్కడినుంచి బయలుదేరి దండకారణ్యానికి వెళ్ళాడు . దండకారణ్యంలో సుతీక్షుని ఆజ్ఞ్యతో అక్కడ ఋషుల ఆశ్రమాలు దర్శించాడు, అగస్త్య ముని ఆజ్ఞ్యతో పంచవటికి బయలుదేరాడు, పంచవటిలో జటాయువు నిర్దేశంతో ఆశ్రమం నిర్మించుకున్నాడు. కబంధ్ని, శబరి ఆజ్ఞ్యతో సుగ్రీవుడితో స్నేహం చేసి. సుగ్రీవుని మాటతో వాలిని  చంపాడు, సుగ్రీవుని మాటతోనే హనుమంతాదులను సర్వదిక్కులకూ పంపాడు. హనుమంతుడు చెప్పినదాన్ని బట్టి, సుగ్రీవుని సలహామేరకూ యుద్ధానికీ బయలుదేరాడు, విభీషణుని సలహా మేరకూ సముద్రున్ని శరణు వేడాడు, సముద్రుని మాటమేరకూ సముద్రానికి వారధి కట్టాడు. రామ రావణ యుద్ధంలో కూడా మాతలి చెబితే రావణున్ని చంపాడు. అగ్నిహోత్రుడు చెబితే సీతమ్మవారిని స్వీకరించాడు, భరద్వాజుడు చెబితే అయోధ్యకు మళ్ళీ వెళ్ళాడు, భరతుడు చెబితే పట్టభిషేకం చేసుకున్నాడు. యమధర్మరాజు చెబితే అవతారాన్ని చాలించుకున్నాడు.

2. కాళీయమర్దన ఘట్టం: దూడలు ఆవులూ కొందరు గోపబాలులతో కలిసి స్వామి వెళ్తుండగా, కొందరు ఆ నదిలో నీరు  త్రాగారు. ఆ నీరు త్రాగి మరణించిన వారిని పరమాత్మ తన అనుగ్రహ దృష్టితో బ్రతికించాడు. మరునాడు పొద్దున్న కొందరు పిల్లలను తీసుకొని బలరాముడి కూడా చెప్పకుండా వచ్చాడు. వచ్చి చెట్టు ఎక్కి దూకాడు.  ఈ కాళీయ హ్రదమంటే మన సంసారమే. మనలో విషాలను తొలగించడానికే స్వామి వస్తాడు. కాళీయుడు గరుడునితో విరోధం పెట్టుకుని వచ్చాడు. గరుడుడు అంటే  పక్షి, అంటే ఆచర్యుడు. భాగవతులతో విరోధం పెట్టుకుంటే విషమయమైన సంసారంలో పడతాము. మళ్ళీ స్వామి కరుణించి ఆ భవతోత్తముల ఆగ్రహాన్ని శమింపచేసి, సంసారం నుంచి విడుదల చేసి నిత్య విభూతికి పంపుతాడు. అలాగే కాళీయ్డుఇని హ్రదం నుండి సముద్రానికి పంపాడు. జీవున్ని పరమాత్మ వైకుంఠానికి ఎలా పంపుతాడో చెప్పే అధ్యాయం. అలాగే పూతన స్తనంలో విషము పెట్టుకుంది. ఈ విషము అంటే విషయములు. అహంకార మమకారాలు స్తనములైతే , అందులో ఉండే శబ్దాది విషయాలు విషములు. విషము తాగితే ప్రమాదం. విషయం ఆలోచిస్తేనే ప్రమాదం. అందుకే కృష్ణుడి లీలల్లో దావాగ్నీ విషమూ పెక్కు సార్లు వస్తాయి. ఆ రాత్రి గోపాలురందరూ అక్కడ విశ్రమించగా దావాగ్ని వచ్చింది. ఆ అగ్నిని కృష్ణుడు తాగేసాడు. మన కామములే అగ్ని. అంతకు ముందు ఆ మడుగులో ఉన్నది అహంకారం అనే విషము. కాళీయుడు ఏ విధంగా ప్రాణ రక్షణ కోసం ఆ హ్రదంలోకి వచ్చి మిగతా జీవులు జేరకుండా హింసించాడో, మనం కూడా సంసారములో కర్మ అనుభవించడానికి వచ్చాము. అది అనుభవించడం చాలక, మరి కాస్త కర్మను మూటగట్టుకుని పోతున్నాము. బృహధారణ్యక ఉపనిషత్సారం ఈ కాళీయ మధన వృత్తాంతం.
ఆ కాళీయ హ్రదంలో స్వామి విహరించాడు. ఆ కాళీయున్ని బయటకు వెళ్ళగొట్టాడు (ఉచ్చాటయిష్యదురగం )

అందరూ ఆనందముతో ఆ రోజు అక్కడ పడుకుంటే దావాగ్ని వచ్చింది. అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు, తాను కూడా మూసుకున్నాడు. అందరినీ తెరవమన్నప్పుడు చూచేసరికి అగ్నిలేదు. (నొట్లోకి ఏ పదార్థం పోతున్నా చూడకూడదని శాస్త్రం. లోపటికి వేడి వెళ్తున్నప్పుడు, కళ్ళలో జ్యోతికూడా మూసుకోవాలని శాస్త్రం). ఒక్క బలరాముడు మాత్రం మూసుకోలేదు. నైవేద్యం పెట్టేప్పుడు అర్చకునికి మాత్రమే మినహాయింపు చూడటానికి. అర్చకుడు కూడా స్వామికి నైవేద్యం పెట్టేప్పుడు ప్రసాదం చూడకూడదు.

 3. ఈ శ్లోకానికి అపవర్గప్రదం అని పేరు. పరమాత్మ స్వరూపం, పరమాత్మ సన్నిధి కావాలనుకునేవారు నిరంతరం ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. పంచభూతాలు గాని,కాలము గానీ దేశం కానీ, వ్యక్తి కానీ, అవస్థలు కానీ, నిరంతరం మన ప్రయత్నం చేయకుండా ఉచ్చ్వాస నిశ్వాసలు తీసుకుంటామో మనం ఈ శ్లోకాన్ని అలా అనుసంధానం చేసుకోవాలి
శశ్వత్ప్రశాన్తమభయం ప్రతిబోధమాత్రం
శుద్ధం సమం సదసతః పరమాత్మతత్త్వమ్
శబ్దో న యత్ర పురుకారకవాన్క్రియార్థో
మాయా పరైత్యభిముఖే చ విలజ్జమానా

పరమాత్మ తత్వాన్ని నూటికి నూరుపాళ్ళు మన బుద్ధిలో కూర్చోపెట్టడానికి చేసే ప్రయత్నం ఇది. ఇలా చేస్తే మనకు సందేహాలే కలగవు. సర్వదా, అన్నిసమయాలలో (శశ్వత్) ప్రశాంతంగా ఉండి (గుణాలన్నీ అణగారిపోయి), ప్రకృతికంటే అతీతుడైనవాడు అయిన పరమాత్మకు గుణాలు ఎలా ఉంటాయి? అందుకే ఆయన ప్రశాంతాత్మ. ఆయనకెప్పుడు భయం ఉండదు (భయం అంటే ప్రమాదం కలుగుతుందేమో అని ఉండే శంక), సత్యం జ్ఞ్యానం అనంతం బ్రహ్మ అన్నట్లుగా పరమాత్మ జ్ఞ్యాన స్వరూపుడు, ఆయన శుద్దుడు (నిర్వికారుడు), సమం (ద్వేషం అసూయ లాంటివి లేని వాడు,) ఆయన సత్ అసత్ రెండిటికీ సమం (ఉన్నవాళ్ళకి ఉన్నట్లుగా కనపడతాడు, దేవుడు లేడు అనే వారికి లేనట్లుగా కనపడతాడు)
పరమాత్మ విషయంలో వేదం కూడా చేసే పని ఏమీ ఉండదు ( పురుకారకవాన్). వేద వాక్కు కూడా అక్కడిదాకా వెళ్ళి వెనక్కు వస్తాయి. వేదము కూడా పరమాత్మ స్వరూపాన్ని చెప్పలేదు. అది కూడా పనికి రాదు (నక్రియార్థో). మాయ కూడా పరమాత్మ ఎదురుగా వస్తే సిగ్గుపడి మొహం తిప్పుకుని వెళ్ళిపోతుంది.

4. ఈ శరీరం ఉన్నంత వరకూ మనం "చాలా సౌందర్యంగా ఉంది" అని చెప్పుకుంటాం. చాలా కాలం బ్రతుకుతాము అని అనుకున్నా ఆ కాలం దాటిన తరువాత ఉండము అని అందులోనే ఉంది. కనుకూ క్షీర్యతే ఇతి శరీరం, క్షీణించే దాన్ని శరీరం అంటాం, వృద్ధి చెందే దాన్ని దేహం అంటాం. 38 ఏళ్ళ దాక ఇది దేహం, అది దాటగానే అది శరీరం అవుతుంది.

5. మగవారికన్నా ఆడవారికి తెలివి 32 పాళ్ళు, 8 పాళ్ళు కామం, 16 రెట్లు బుద్ధి, 32 రెట్లు ఆకలి, 64 రెట్లు కార్యదక్షత, లెక్కలేనన్ని రెట్లు అసూయా ఉంటుంది

6. నిత్య ప్రళయం: ప్రపంచంలోనూ మన శరీరములోనూ ప్రతీక్షణం కలిగే మార్పు. శిశువు గర్భంలో పడినప్పటినుంచీ ప్రతీక్షణం కలిగే అన్ని అవస్థలూ శరీరానికి వస్తూనే ఉంటాయి. ఈ మార్పులే నిత్య ప్రళయం.
నైమిత్తిక ప్రళయం: బ్రహ్మకు ఒక పగలు అయితే వచ్చేది
ప్రాకృతిక ప్రళయం: బ్రహ్మకు నూరేళ్ళు వస్తే వచ్చేది
ఆత్యంతిక ప్రళయం: ఇది మోక్షం

7. ఇష్టములనీ పూర్తములనీ రెండు రకాల కర్మలు: ఇష్టములని (యజ్ఞ్య యాగాదులు) పూర్తములనే (నదులూ బావులూ దేవాలయాలు తోటలు చెరువులూ ఏర్పాటు చేయడం) కర్మలు

8.  విదురుడు యముని అంశ. పరమాత్మ మాయను తెలిసిన పన్నెండు మంది భాగవతోత్తములలో ఆయన ఒకడు. మొత్తం పదునాలుగు లోకాలలో ఆయన మాయను తెలిసిన వారిలో యముడు నాలగవ వాడు. మనకు భారతంలో 9 మంది కృష్ణులు అయిదుగురు యముళ్ళు, నలుగురు సూర్యులు, ముగ్గురు చంద్రులు, నలుగురు రుద్రులు, శ్రీమన్నారాయణ పరిపూర్ణ తత్వంగా ఒక ముగ్గురూ. ఇలా 27 మంది ఉంటారు. దిక్పాలకులు నారాయ్ణుడు, సూర్యుడు చంద్రుడు. ఉదాహరణకు సాత్యకి, సాంబుడు సైంధవుడు అశ్వద్ధామ రుద్రాంశలు, తొమ్మండుగురు కృష్ణులు, ఐదుగురు యముళ్ళు, ముగ్గురు సూర్యులు. వీరందరూ రాయబారంలో కలిసారు. ఇలాంటి మహాజ్ఞ్యాని అయిన విదురుడు మైత్రేయుని చిన్న విషయాలగురించి అడిగి ఉండడు. చిన్న ప్రయోజనం ఆశించేవారు కాదు.
మైత్రేయుడు వ్యాసుని సహాధ్యాయి. అటువంటి ఉత్తముడైన మైత్రేయునితో అడిగిన ప్రశ్న, పరమాత్మ అయిన భగవంతుని చర్చకు సంబంధించినది అయి ఉంటుంది. పరమాత్మ ఎవరికోసం అవతరిస్తాడో (పరిత్రాణాయ సాధూనాం) వారికోసం మాట్లాడుకున్న మాటలే అవుతాయి గానీ మామూలు కబుర్లు కావు  (మనలాగ ఆయుష్షును వృధా చేసే చర్చలు కావు)

9. హస్తిన నుంచి లక్క ఇంటికి వెళ్ళేలోపు మూడు సార్లు పాండవులపై హత్యా యత్నం జరిగింది. బిదికృత్ అనే రాక్షసుడు ఒకసారి, కల్పించబడిన దావాగ్నితో ఒక సారి, విషప్రయోగంతో ఒకసారి. ఈ మూడు ప్రయత్నాలను విధురుడు వారించాడు. తద్వారా కౌరవులకు నరకం రాకుండా చేసాడు. యుద్ధంలో మరణిస్తే పాపం పోతుంది. ఇలాంటి పని చేయడంవలన పాపం వస్తుంది. దారిలో ప్రయత్నం చేయొద్దని వారించాడు. పాండవులు ఒక స్థానం ఏర్పరుచుకునే వరకూ వారినేమీ చేయొద్దని చెప్పాడు. అలాగే ధర్మరాజు హస్తిన నుంచి వెళ్ళేప్పుడు ఒక చిన్న ఎలుకని ఇస్తాడు. ధర్మరాజదులు లక్క ఇంటిలోకి వెళ్ళినపుడు ఆ ఎలుక ఒక కన్నంలోకి వెళ్తుంది. ఇది చూసిన ధర్మరాజుకు మనం కూడా ఒక సొరంగం ఏర్పరచుకోవాలన్న ఉపాయం వస్తుంది

10. ఓర్పు అనేది తల్లి, ధర్మం అనేది తండ్రి. పాండవులకు కుంతి ఉంది. అంటే ఓర్పు ఉంది. వారికే ఓర్పులేకపోతే అంతవరకూ సహించి ఉండి ఉండేవారు కాదు. పాండవులు ధర్మం ఆచరించుట వలన తండ్రి ఉన్నవారే అయినారు.

11.  స్త్రీ కన్నీరు వక్షస్థలం మీద పడరాదు. అవి సకల జీవకోటికీ ప్రాణం జ్ఞ్యానం ఇచ్చేవి.  యుద్ధములో కూడా రాజు ఓడిపోతే మహారాణిని గౌరవంగా చూచి ఆ రాణి బయటకు వెళ్ళదలచుకుంటే వారిని సమర్యాదగా పంపిస్తారు.
 
12. దృతరాష్ట్రుడు మంత్రాంగం కోసం మంత్రులందరిలో వరీయుడైన (గొప్పవాడైన, పరమశ్రేష్టుడైన) విదురుడు చెప్పిన విషయాలని మిగిలిన మంత్రులందరూ విదురనీతి అన్నారు. ఒక మంత్రి రాజ్యసభలో మాట్లాడిన మాటలను ఇంతకాలం పాటు భద్రపరచి పెట్టుకున్నాము. మంత్రి అయిన వాడు కర్తవ్యం గూర్చి రాజు అడిగితే రాజకీయ స్వభావాన్నే చెప్పకూడదు. లోకస్వభావాన్ని, ధర్మస్వభావాన్నీ, రాజ్యకృత్యాన్ని చెప్పాలి. ఇలాంటి విషయాలలో లోకం ఏం చేస్తుంది, ధర్మం ఏం చెబుతుంది, రాజు ఏమి చేయాలి. ఒక్క రాముని దెబ్బ తగలగానే తాను చేసిన పని ఎంత తప్పో తెలుసుకున్నాడు రావణుడు. తాను పలికినవన్నీ ప్రగల్భాలు అని తెలుసుకున్నాడు. విభీషణుడు, మాల్యవంతుడు, అకంపనుడు, విద్యున్మాలి చెప్పినపుడు, యమ వజ్రములతో సాటి వచ్చే నా బాణపు దెబ్బ రాముడు చూడలేదు కాబట్టి నా మీదకు వస్తున్నాడు అని.