Monday, November 26, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పన్నెండవ అధ్యాయం

విమర్శించేవాళ్ళకి విమర్శించడానికి కావలసిన ఆధారాలు చూపడానికి శ్రీ కృష్ణపరమాత్మ స్త్రీలోలుడుగా వారికి అనిపిస్తాడు. నిజానికి ఆయన ఒక్క భక్తులకి మాత్రమే వశమవుతాడు

శౌనక ఉవాచ
అశ్వత్థామ్నోపసృష్టేన బ్రహ్మశీర్ష్ణోరుతేజసా
ఉత్తరాయా హతో గర్భ ఈశేనాజీవితః పునః
తస్య జన్మ మహాబుద్ధేః కర్మాణి చ మహాత్మనః
నిధనం చ యథైవాసీత్స ప్రేత్య గతవాన్యథా
తదిదం శ్రోతుమిచ్ఛామో గదితుం యది మన్యసే
బ్రూహి నః శ్రద్దధానానాం యస్య జ్ఞానమదాచ్ఛుకః

అశ్వథ్థామ విడిచిన బ్రహ్మశిరోనామకాస్త్రంవల్ల రక్షించబడిన గర్భం పుట్టిననతరువాత ఏమి చేసాడు, ఎలా శరీరం విడిచిపెట్టాడుఓ మీరు చెప్పదలచుకుంటే చెప్పండి.

సూత ఉవాచ
అపీపలద్ధర్మరాజః పితృవద్రఞ్జయన్ప్రజాః
నిఃస్పృహః సర్వకామేభ్యః కృష్ణపాదానుసేవయా

పరీక్షిత్తు జననం కలియుగంలోనే జరిగింది.
అన్ని కామముల మీద కామం లేని ధర్మరాజు కృష్ణపరమాత్మ పాదపద్మములు సేవించడం మీదే మనసు ఉండి

సమ్పదః క్రతవో లోకా మహిషీ భ్రాతరో మహీ
జమ్బూద్వీపాధిపత్యం చ యశశ్చ త్రిదివం గతమ్

ఇక్కడ సంపదలు భార్యలు తమ్ములు జంబూద్వీపం అన్నీ తన ఆధీనంలో ఉన్న ధర్మరాజు కీర్తి స్వర్గంవరకూ పాకింది

కిం తే కామాః సురస్పార్హా ముకున్దమనసో ద్విజాః
అధిజహ్రుర్ముదం రాజ్ఞః క్షుధితస్య యథేతరే

అయిన దేవతల చేత కూడా కోరబడే కోరికలు (సురస్పార్హా ) కూడా ధర్మరాజు మనసు అపహరించలేదు. ఎలా అంటే బాగా ఆకలవుతున్నవాడికి ఇతరభోగములు ఎలా రుచించవో పరమాత్మ మీద మనసు లగ్నమయిన వారికి ఇతరవిషయములు రుచించవు.

మాతుర్గర్భగతో వీరః స తదా భృగునన్దన
దదర్శ పురుషం కఞ్చిద్దహ్యమానోऽస్త్రతేజసా

పరీక్షిత్తు గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం అతన్ని బాధించింది. ఆ బాధలోనే ఆయన ఒక పురుషుణ్ణి చూసాడు.

అఙ్గుష్ఠమాత్రమమలం స్ఫురత్పురటమౌలినమ్
అపీవ్యదర్శనం శ్యామం తడిద్వాససమచ్యుతమ్
శ్రీమద్దీర్ఘచతుర్బాహుం తప్తకాఞ్చనకుణ్డలమ్
క్షతజాక్షం గదాపాణిమాత్మనః సర్వతో దిశమ్
పరిభ్రమన్తముల్కాభాం భ్రామయన్తం గదాం ముహుః


అంగుష్టమాత్రంగా ఉన్న ఆయన, ఎర్రబడిన కనుల కొనలతో, గదపట్టుకోని తిరుగుతూ ఆ గదని తిప్పుతూ మాటిమాటికీ అస్త్రతేజస్సును సూర్యుడు మంచును కరిగించినట్లుగా ద్వంసంచేసాడు

అస్త్రతేజః స్వగదయా నీహారమివ గోపతిః
విధమన్తం సన్నికర్షే పర్యైక్షత క ఇత్యసౌ

ఇలా తన గద తేజస్సుతో అస్త్రతేజస్సుని తొలగించినవాడి గురించి చొట్టూచూచాడు

విధూయ తదమేయాత్మా భగవాన్ధర్మగుబ్విభుః
మిషతో దశమాసస్య తత్రైవాన్తర్దధే హరిః

అలా చూస్తూ ఉండగానే అక్కడే అంతర్ధానమయ్యాడు. అప్పటికే తనకి పది నెలలు నిండాయి.

తతః సర్వగుణోదర్కే సానుకూలగ్రహోదయే
జజ్ఞే వంశధరః పాణ్డోర్భూయః పాణ్డురివౌజసా

అన్ని ఉత్తమకాల గుణాలు చేరినపుడు  ఏ ఏ గ్రహములు ఏ ఏ స్థానాల్లో ఉండాలో అలా ఉన్నప్పుడు పాండువంశాన్ని నిలబెట్టే వాడు పాండుమహారాజు వంటి పరాక్రమవంతుడు అవతరించాడు

తస్య ప్రీతమనా రాజా విప్రైర్ధౌమ్యకృపాదిభిః
జాతకం కారయామాస వాచయిత్వా చ మఙ్గలమ్

కృపాచర్యుడు రాజగురువు. దౌమ్యుడు పురోహితుడు. వారిచేత జాతకర్మలు చేయించాడు

హిరణ్యం గాం మహీం గ్రామాన్హస్త్యశ్వాన్నృపతిర్వరాన్
ప్రాదాత్స్వన్నం చ విప్రేభ్యః ప్రజాతీర్థే స తీర్థవిత్

స తీర్థవిత్ - తనతో సారూప్యమున్నవాడు. ధర్మరాజుకు సారుప్యమున్నవాడు ధర్మం.
ధర్మం తెలిసినవాడు కాబట్టి బ్రాహ్మణులకు గోవులను దానం చేసాడు.

తమూచుర్బ్రాహ్మణాస్తుష్టా రాజానం ప్రశ్రయాన్వితమ్
ఏష హ్యస్మిన్ప్రజాతన్తౌ పురూణాం పౌరవర్షభ

ఆ బ్రాహ్మణులు సంతోషించి పరీక్షిత్తు జాతకాన్ని చెప్తున్నారు

దైవేనాప్రతిఘాతేన శుక్లే సంస్థాముపేయుషి
రాతో వోऽనుగ్రహార్థాయ విష్ణునా ప్రభవిష్ణునా

శుక్లే - అంటే కృష్ణుడు.
కృష్ణావతారం ముగిసిన తరువాత ఆ పరమాత్మ చేత ఇవ్వబడ్డాడు. పరమాత్మ చేత ఇవ్వబడ్డాడు కాబట్టి విష్ణురాతుడని పేరు వస్తుంది.

తస్మాన్నామ్నా విష్ణురాత ఇతి లోకే భవిష్యతి
న సన్దేహో మహాభాగ మహాభాగవతో మహాన్

ఇతను గొప్ప భాగవతోత్తముడవుతాడు

శ్రీరాజోవాచ
అప్యేష వంశ్యాన్రాజర్షీన్పుణ్యశ్లోకాన్మహాత్మనః
అనువర్తితా స్విద్యశసా సాధువాదేన సత్తమాః

మా వంశాన్ని నిలబెడతాడా. తనకంటే ముందు ఉన్న రాజర్షుల కీర్తిని నిలబెడతాడా. అందరి చేతా మెప్పుకోలు పొందుతాడా

బ్రాహ్మణా ఊచుః
పార్థ ప్రజావితా సాక్షాదిక్ష్వాకురివ మానవః
బ్రహ్మణ్యః సత్యసన్ధశ్చ రామో దాశరథిర్యథా

మనువంశంలో ఉన్న ఇక్ష్వాకు వలె ఈయన కీర్తివంతుడవుతాడు. సత్యంలో ధశరధ పుత్రుని వంటివాడు.

ఏష దాతా శరణ్యశ్చ యథా హ్యౌశీనరః శిబిః
యశో వితనితా స్వానాం దౌష్యన్తిరివ యజ్వనామ్

శరణువేడినవాడిని కాపాడతాడు. శిబి చక్రవర్తి వంటి దాత
తనవారికీర్తిని తన కీర్తిని వ్యాపింపజేస్తాడు భరతునివలే

ధన్వినామగ్రణీరేష తుల్యశ్చార్జునయోర్ద్వయోః
హుతాశ ఇవ దుర్ధర్షః సముద్ర ఇవ దుస్తరః

ధనుర్ధారులలో ఇద్దరి అర్జనునివలే అవుతాడు (కార్తవీర్యార్జనుడు, అర్జనుడు).
అగ్నిహోత్రంలాగ ఎవ్వరిచేతా ఆక్రమింపజాలనివాడు. సముద్రంలాగా ఇతన్ని ఎవరు దాటలేరు

మృగేన్ద్ర ఇవ విక్రాన్తో నిషేవ్యో హిమవానివ
తితిక్షుర్వసుధేవాసౌ సహిష్ణుః పితరావివ

పరాక్రమంలో సిమ్హంలాంటివాడు. హిమవంతునివలే అందరిచేతా సేవింపదగినవాడు
భూమిలా ఓర్పు ఉన్నవాడు. తల్లితండ్రులవలే తప్పులని సహించేవాడు.

పితామహసమః సామ్యే ప్రసాదే గిరిశోపమః
ఆశ్రయః సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః

జ్ఞ్యానులలో బ్రహ్మవంటివాడు. అనుగ్రహించడంలో శంకరునివంటివాడు
అందరికీ శ్రీమహావిష్ణువులా ఆశ్రయింపదగినవాడిలా ఉంటాడు

సర్వసద్గుణమాహాత్మ్యే ఏష కృష్ణమనువ్రతః
రన్తిదేవ ఇవోదారో యయాతిరివ ధార్మికః

సద్గుణాల్లో శ్రీకృష్ణునివంటివాడు. ఔదార్యంలో రంతిదేవునివంటివాడు
ధర్మప్రవర్తతంలో యయాతివంటివాడు. దైర్యంలో బలి చక్రవర్తి వంటివాడు

హృత్యా బలిసమః కృష్ణే ప్రహ్రాద ఇవ సద్గ్రహః
ఆహర్తైషోऽశ్వమేధానాం వృద్ధానాం పర్యుపాసకః

సజ్జనులని ఆశ్రయించడంలో ప్రహ్లాదునివంటివాడు
చాల అశ్వమేధయాగాలు చేయిస్తాడు.

రాజర్షీణాం జనయితా శాస్తా చోత్పథగామినామ్
నిగ్రహీతా కలేరేష భువో ధర్మస్య కారణాత్

తనంతవాడిని తాను సృష్టించగలడు.
చెడుదారిన నడిచేవారిని శాసించగలవాడు.
భూదేవికి ధర్మ దేవతకూ హాని కలిగించే కలిని నిగ్రహించగలడు.

తక్షకాదాత్మనో మృత్యుం ద్విజపుత్రోపసర్జితాత్
ప్రపత్స్యత ఉపశ్రుత్య ముక్తసఙ్గః పదం హరేః

ఒక ఋషిపుత్రుని శాపంతో తనకి మరణం సంభవిస్తుందని విని పరమాత్మని చేరతాడు

జిజ్ఞాసితాత్మయాథార్థ్యో మునేర్వ్యాససుతాదసౌ
హిత్వేదం నృప గఙ్గాయాం యాస్యత్యద్ధాకుతోభయమ్

ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని తెలియగోరి ప్రాయోపవేశం చేస్తే శుకుడు వచ్చి జ్ఞ్యానం ఉపదేశిస్తాడు
గంగా తీరంలో తన శరీరాన్ని వదిలిపెట్టి మోక్షాన్ని పొందుతాడు.

ఇతి రాజ్ఞ ఉపాదిశ్య విప్రా జాతకకోవిదాః
లబ్ధాపచితయః సర్వే ప్రతిజగ్ముః స్వకాన్గృహాన్

లబ్ధాపచితయః - దక్షిణలు పొంది వారి ఇంటికి వెళ్ళారు.

స ఏష లోకే విఖ్యాతః పరీక్షిదితి యత్ప్రభుః
పూర్వం దృష్టమనుధ్యాయన్పరీక్షేత నరేష్విహ

పరీక్షితని ఇతను పేరు పొందుతాడు.

స రాజపుత్రో వవృధే ఆశు శుక్ల ఇవోడుపః
ఆపూర్యమాణః పితృభిః కాష్ఠాభిరివ సోऽన్వహమ్

శుక్లపక్ష చంద్రుడిలాగా పరీక్ష్త్తు వృధ్ధిచెందుతూ ఉన్నాడు.

యక్ష్యమాణోऽశ్వమేధేన జ్ఞాతిద్రోహజిహాసయా
రాజా లబ్ధధనో దధ్యౌ నాన్యత్ర కరదణ్డయోః

సకలబంధుక్షయం వలన వచ్చిన పాపముని తొలగించుకోవడానికి ధర్మరాజు అశ్వమేధం చేయసంకల్పించాడు. అన్యత్ర కరదణ్డయోః - దానికి ప్రజలడబ్బుని వినియోగించకూడదు. రాజు తన ధనాన్ని మాత్రమే ఉపయోగించాలి.

తదభిప్రేతమాలక్ష్య భ్రాతరో ఞ్చ్యుతచోదితాః
ధనం ప్రహీణమాజహ్రురుదీచ్యాం దిశి భూరిశః

కృష్ణప్రేరేపణ వల్ల దండయాత్రకు బయలుదేరి ఆయా రాజుల ధనం తీసుకుని.


తేన సమ్భృతసమ్భారో ధర్మపుత్రో యుధిష్ఠిరః
వాజిమేధైస్త్రిభిర్భీతో యజ్ఞైః సమయజద్ధరిమ్

యజ్ఞ్యానికి కావలసిన సామాగ్రి తెచ్చి మూడు యజ్ఞ్యములు చేసారు

ఆహూతో భగవాన్రాజ్ఞా యాజయిత్వా ద్విజైర్నృపమ్
ఉవాస కతిచిన్మాసాన్సుహృదాం ప్రియకామ్యయా

ధర్మరాజు ఎప్పుడు అశ్వమేధయాగం చేయాలన్నా కృష్ణుడిని పిలిచేవాడు. కృష్ణుణ్ణి తనదగ్గర ఉంచుకోవాలని నిరంతరం యజ్ఞ్యములు చేసేవాడు. దానివల్ల కృష్ణుడు ఎక్కువకాలం అక్కడే ఉండేవాడు

తతో రాజ్ఞాభ్యనుజ్ఞాతః కృష్ణయా సహబన్ధుభిః
యయౌ ద్వారవతీం బ్రహ్మన్సార్జునో యదుభిర్వృతః

ఇలా యజ్ఞ్యములు పూర్తి అయ్యాక అర్జనుణ్ణి తీసుకుని ద్వారకకు వెళ్ళాడు.

1 comment: