Friday, November 16, 2012

ప్రథమ స్కంధం ప్రధమ శ్లోకం - పరమాత్మ తత్వ నిరూపణం


ఒక పని చెయ్యాలంటే నాలుగు కావాలి- జ్ఞ్యానం ఇచ్చ సంకల్పం కృతి (ప్రయత్నం)
తినడంవల్ల ఆకలి పోతుంది అనే జ్ఞ్యానం కలగాలి. జ్ఞ్యానం కలిగాక తినాలి అనే కోరిక కలగాలి. కోరిక ఉన్నాక సంకల్పం కావాలి తరువాత ప్రయత్నం కావలి. ఈ నాలుగు చేసేది చైతన్యం ఉన్నవాడే కావాలి. మరి ప్రకృతికి చైతన్యం ఉందా? జడమైన ప్రకృతిలో కదలిక కలగాలంటే ప్రయత్నం ఉండాలి.
విత్తులేకుండా చెట్టు మొలవదు. మరి గడ్డి మొలవడానికి విత్తు ఎవరువేస్తున్నారు? ప్రకృతి సంకల్పించదు కాబట్టి ప్రకృతి సృష్టి చెయ్యలేదు. సంకల్పమున్నవాడే సృష్టి చెయ్యగలడు. జ్ఞ్యానం ఉన్నవాడే సంకల్పించగలడు. ఆ పరమాత్మ జ్ఞ్యాన స్వరూపుడు. ఈరోజు ఉండి రేపు పోయేవాడు కాదు - సత్యం. ఆయనకు ఉన్న జ్ఞ్యానం కూడా ఎప్పుడూ పోదు. మనకి సంకల్పం ఉన్నా మనం ఈ శరీరంలో శాశ్వతంగా ఉండము.
అనంతము స్థితమూ శాశ్వతమూ స్వప్రకాశమూ కావాలి కాబట్టి వేదం పరమాత్మే సృష్టికర్తా అని అంది

ప్రత్య్క్షం అనుమానం ఉపమానం అని నాలుగు ప్రమాణాలు
అక్షం అంటే ఇంద్రియం. ప్రతి అక్షం అంటే ఇంద్రియాలకు తెలియబడే విషయాలు.ఇంద్రియాలలో కూడా ప్రాప్య ప్రకాశకారి అప్రాప్య ప్రకాశకారి అని ఉన్నాయి.చక్షు ఇంద్రియం వస్తువుదగ్గరకి వెళ్తుందా లేదా వస్తువు ఇంద్రియం వద్దకు వస్తుందా? కన్ను విషయంలో ఇంద్రియమే వస్తువు వరకూ వెళ్తుంది. శబ్దం ఇంద్రియం
వద్దకు వస్తుందా చెవి శబ్దం దగ్గరకు వెళ్తుందా? శబ్దమే చెవి వద్దకు వస్తుంది. నాలుక మీద పడితేనే రుచి తెలుస్తుంది. ఇంద్రియమును ఆ వస్తువు చేరుతున్నది. కాని కన్నే ఆ వస్తువు వద్దకు వెళ్ళి వస్తోంది.
ఇంద్రియములు రెండు రకాలు ఇంద్రియములచే తెలియబడే దాన్ని ప్రత్యక్షం అంటారు. ప్రత్యక్షంగా చూడకపొఇనా తెలుస్కునే దన్ని అనుమానం అంటారు. మానం అంటే ప్రమాణం. అను అంటే వెంట.

ప్రత్యక్షాన్ని అనుసరించి వెళ్ళేది. నిప్పు లేనిదే పొగ రాదు. అంటే పొగను చూసి నిప్పు ఉంది అనుకోవడం.
మూడవది ఉపమానం
నల్గవది శబ్దం. ఆప్తవాక్యాన్ని శబ్దం అంటాం. పెద్దలు చెప్పేది.
పరమాత్మ ఉన్నాడని యే ప్రమాణం చెప్తుంది. పరమాత్మకి మొదటి మూడు ప్రమాణాలు కుదరవు. కేవలం శబ్ద ప్రమాణం కుదురుతుంది. శబ్దం అంటే వేదం.

"తేనే బ్రహమ ... " అని చెప్పడం వల్ల పరమాత్మ సంకల్పం తరువాతే బ్రహ్మాదులందరూ పుట్టారు.
ప్రకృతి సృష్టి ఎందుకు చెయ్యకూడదు? చైతన్యం ఉన్నవాడు మాత్రమే సృష్టిచెయ్యాలి. కాని ప్రకృతి జడం. ప్రకృతి లో చైతన్యం రావాలంటే విత్తనం వెయ్యాలి.
సంకల్పించగలగడం వల్లనే సృష్టీ జరగాలి. ప్రకృతి సంకల్పించలేదు కాబట్టి సృష్టి చెయ్యలేదు.
సంకల్పమున్నవాడే సృష్టి చెయ్యగలడు. గ్న్యానం ఉన్నవాడే సంకల్పించగలడు. అందుకే సత్యం గ్న్యానం అనంతం బ్రహ్మ. అతడు సర్వకాలలలో ఉంటాడు - సత్యం.

మనంపర తంత్రులం. పోదగినవాడు  పోయేవాడు సృష్టిచెయ్యలేడు. .
అనంతం స్థిరం శాశ్వతం స్వప్రకాశం గలవాడే సృష్టిచెయ్యాలి కాబట్టి పరమాత్మే సృష్టి చెయ్యాలి.
'అర్థేషు అబిగ్న్యా' తెలిసినవాడే సంకల్పించగలడు.

పరమాత్మ సంకల్పం నెర్వేరుతుందని ప్రమాణం ఉందా? పరమాత్మ ఇతరుల సాయంతో సృష్టి చేస్తాడా? పరమాత్మ చేత ఎవరైనా చేయిస్తున్నారా? 'స్వరాట్' అనే పదం దీనికి సమాధానం. దీనికి తర్కం కుదరదు.

భాగవత ప్రధమ శ్లోకాన్ని మహా మోహినీ మంత్రంగా, తత్వ కల్పవృక్షంగా, ఫల రసంగా, సూర్యునిగా, దీపముగా అభివర్ణించారు. ఈ శ్లోకానికి రాధాపరమైన వ్యాఖ్యానంలోకృష్ణుని రుపాన్ని రాధానామాన్ని ధ్యానం చెయ్యమంటారు. కృష్ణుడి కన్నా ముందు రాధని ధ్యానం చెయ్యాలి
ఆద్యస్య జన్మ యత: కృష్ణ పరమాత్మ మనకు రాధా అమ్మవారివల్లే మనకు కనపడతాడు
అన్వయాత్ ఇతరత: కృష్ణుడు అందరినీ వదిలిపెట్టి రాధతోనే ఉంటాడు

ఈ శ్లోకం భక్తిని కూడా సూచిస్తుంది. "నన్ను వాస్తవంగా తెలుస్కోవాలంటే అనన్యమైన భక్తి ఉన్నవాడే తెలుసుకోగలడు" పరమాత్మ ఆవిర్భావం భక్తివల్ల జరుగుతుంది. ఈ భక్తిలో తక్కినవన్నీ కలిసిపోతాయి. నైష్కర్మ్యమపి అచ్యుత భావ వర్జితం వృధా. అంటే కర్మను ఆచరించే వాడు ఆచరింపజేసే వాడు పరమాత్మ అనే జ్ఞ్యానం కలిగి కూడా పరమాత్మను ఆర్ధించకుంటే ఆ జ్ఞ్యానం మోక్షం ఇవ్వదు.
తక్కిన విష్యాలని సమగ్రంగా తెలుస్కుని వాటిని పక్కన పెట్టి భక్తిని మాత్రమే ముందు నిలుపుతుంది (అర్థేషు అభిజ్ఞ్య:)
భక్తి పరమాత్మను ప్రకాశింపజేస్తుంది భక్తితోనే ప్రకాశిస్తాడు (స్వరాట్ )

2 comments:

  1. మీరు చాలా అద్భుతం గా గురువుగారి ప్రవచనాలు పొందిపరిచారు

    ReplyDelete