Thursday, November 15, 2012

పురాణం


ఇతిహాస పురాణాభ్యాం వేదం ఉపబృంహయేత్:
అంటే వేదసారాన్ని పురాణ ఇతిహాసాల వివరణల, వ్యాఖ్యానాల రూపంలో సామాన్యమానవుడికి అందజేయడమే లక్ష్యమని చెప్పబడింది
రామాయణం: దేవుడు పరమాత్మ నుంచి ఎలా దూరం అవుతాడో - మళ్ళీ పరమాత్మను ఎలా కలుస్తాడో చెప్తుంది. అమ్మవారు పురుషకారం.
రామాయణం - అమ్మవారి వైభవం
భారతం - స్వామి వైభవం
మ ద్వయం - మత్స్య మార్కండేయ
భ ద్వయం - భవిష్య భాగవతం
బ్ర త్రయం - బ్రహ్మాండ బ్రహ్మ బ్రహ్మ వైవర్త
వ - వరహ విష్ణు వామన వాయు
అ అగ్ని
న నారద
ప పద్మ
లి లింగ
గ గరుడ
కు కూర్మం
స్క స్కంధ

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపలింగ కూస్కాని పురాణాని తథైవచ
భాగవతానికి చాల ప్రాశస్త్యం ఉంది

అర్థోయం బ్రహ్మసూత్రనాం - భాగవతం బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం, మహాభారతంలో ప్రతిపాదించబడిన అర్థం (అందుకే ముందు భాగవతం చదవాలి), గాయత్రీ మంత్రానికి వ్యాక్యానం.
పురాణానికి ఐదు లక్షణాలుంటాయి. అదే మహాపురాణానికి పది లక్షణాలుంటాయి. శ్రీమద్భాగవతం మహా పురాణం. ఆ లక్షణాలేంటో తరువాత చూద్దాం.
అసలు  ముందు భాగవతం అని దేన్ని అంటారు మనం దేన్ని చదవాలి. చాలా పురాణాలు భాగవతం యొక్క లక్షణాలు చెప్పాయి
భాగవత పురాణ లక్షణం - 18000 శ్లోకాలు, 12 స్కంధాలు ఉండాలి, హయగ్రీవ బ్రహ్మవిద్య ఉండాలి (నారాయణ కవచం), వృత్తాసురవధ, గాయత్రీ మంత్రంతో ప్రారంభించబడాలి
భాగవతం చదువుకునే ముందు భాగవత మాహాత్మ్యాన్ని చదవాలి. (అలాగే గీత చదివే ముందు గీత మాహాత్మ్యాన్ని చదవాలి)
భాగవత మాహాత్యం: (స్కంధ పురాణం, పద్మ, లింగ, విష్నుధర్మొత్తర పురాణం లో వివరించబడింది)
పద్మపురాణంలో ఉన్న భాగవత మాహాత్యం అనుసంధానం చేసుకోవాలి
మనకి శ్రీ శ్రీ శ్రీ కందాడై రామానుజాచార్యులు వారు భాగవతం  యొక్క ప్రతీ శ్లోకానికి అర్థం చెప్పారు. అది నేను వింటూ విన్నదాంట్లొంచి గ్రహించిన దాంట్లోంచి చేతనైనంత వరకూ బ్లాగుపరచాలనుకుంటున్నాను . భగవంతుని ఆజ్ఞ ఎంతవరకూ ఉంటే అంతవరకూ జరుగుతుంది
ఇది నిర్విఘ్నంగా జరగాలని విఘ్నేశ్వరున్ని ప్రార్థిస్తున్నాను. శ్రీ షిరిడీ సాయినాథుడు దానికి తగ్గా శక్తినిచ్చి నన్ను పనిముట్టుగా చేసుకుని నా చేత ఈ కార్యం నిర్వహించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు నా బుద్ధిని సరిగ్గా ప్రచోదనం చెయ్యాలని ప్రార్థిస్తున్నాను


No comments:

Post a Comment