Wednesday, March 20, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం


శ్రీమద్భాగవతం పంచమ స్కంధం తొమ్మిదవ అధ్యాయం 

శ్రీశుక ఉవాచ
అథ కస్యచిద్ద్విజవరస్యాఙ్గిరఃప్రవరస్య శమదమతపఃస్వాధ్యాయాధ్యయనత్యాగసన్తోష
తితిక్షాప్రశ్రయవిద్యానసూయాత్మజ్ఞానానన్దయుక్తస్యాత్మసదృశశ్రుతశీలాచారరూపౌదార్యగుణా నవ సోదర్యా
అఙ్గజా బభూవుర్మిథునం చ యవీయస్యాం భార్యాయామ్యస్తు తత్ర పుమాంస్తం పరమభాగవతం రాజర్షి
ప్రవరం భరతముత్సృష్టమృగశరీరం చరమశరీరేణ విప్రత్వం గతమాహుః

తరువాత ఒక బ్రాహ్మణోత్తమునికి కుమారునిగా పుట్టాడు. అతను అంగీరస గోత్రీకుడు. శమము దమమూ తపస్సు స్వాధ్యాయమూ అధ్యయనం త్యాగం సంతోషం తితీక్ష ప్రశ్రయణం విద్యా అనసూయా ఆత్మజ్ఞ్యానం. బ్రాహ్మణుడైన వాడికి ఈ పన్నెండు గుణాలూ ఉండాలి. తొమ్మిది మంది సోదరీ మణులూ సోదరులూ ఏర్పడ్డారు. కవలలు కూడా కలిగారు. ఇతనికే భరతుడు కూడా బ్రాహ్మణోత్తమునిగా జన్మించాడు.

తత్రాపి స్వజనసఙ్గాచ్చ భృశముద్విజమానో భగవతః కర్మబన్ధవిధ్వంసనశ్రవణ
స్మరణగుణవివరణచరణారవిన్దయుగలం మనసా విదధదాత్మనః ప్రతిఘాతమాశఙ్కమానో భగవద్
అనుగ్రహేణానుస్మృతస్వపూర్వజన్మావలిరాత్మానమున్మత్తజడాన్ధబధిరస్వరూపేణ దర్శయామాస
లోకస్య

ఇతను బంధువులంటేనే ఉలిక్కిపడేవాడు. ఉద్వేగాన్ని పొందేవాడు. పరమాత్మ పాదపద్మాలను నిరంత్రం ధ్యానం చేస్తూ. ఎప్పుడు ఏ అడ్డంకి వస్తుందో అన్న భయముతో పూర్వ జన్మ జ్ఞ్యానముండడం వలన చెవిటి వాడిలా మూగ వాడిలా పిచ్చివాడిలా జడుడిలా

తస్యాపి హ వా ఆత్మజస్య విప్రః పుత్రస్నేహానుబద్ధమనా ఆసమావర్తనాత్సంస్కారాన్యథోపదేశం
విదధాన ఉపనీతస్య చ పునః శౌచాచమనాదీన్కర్మనియమాననభిప్రేతానపి సమశిక్షయదనుశిష్టేన హి
భావ్యం పితుః పుత్రేణేతి

కాని తండ్రికి పిల్లవాడిమీద ప్రేమ ఉండడముతో సమావర్తనం చేసి ఉపనయనం చేసి, అతనికి ఇష్టములేకున్నా తండ్రి దగ్గర ఉండి అన్నీ నేర్పాడు. ఇతనూ నేర్చుకున్నాడు.  తండ్రి దగ్గరే ఉండేవాడు కానీ సరిగ ప్రవర్తించేవాడు కాడు

స చాపి తదు హ పితృసన్నిధావేవాసధ్రీచీనమివ స్మ కరోతి ఛన్దాంస్యధ్యాపయిష్యన్సహ
వ్యాహృతిభిః సప్రణవశిరస్త్రిపదీం సావిత్రీం గ్రైష్మవాసన్తికాన్మాసానధీయానమప్యసమవేతరూపం
గ్రాహయామాస

ఏ మాసములో ఏ ఋతువులో ఏ వేద భాగాన్ని అధ్యాయం చేయాలో అవి అధ్యయనం చేస్తూ మనస్సు పెట్టకున్నా అవన్నీ వచ్చేసాయి

ఏవం స్వతనుజ ఆత్మన్యనురాగావేశితచిత్తః శౌచాధ్యయనవ్రతనియమగుర్వనలశుశ్రూషణాద్య్
ఔపకుర్వాణకకర్మాణ్యనభియుక్తాన్యపి సమనుశిష్టేన భావ్యమిత్యసదాగ్రహః పుత్రమనుశాస్య
స్వయం తావదనధిగతమనోరథః కాలేనాప్రమత్తేన స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృతః

ఆధ్యాత్మ జ్ఞ్యానం కలవాడు కాబట్టి శుచమూ అధ్యాయం నియమ గురువు నిత్యాగ్నిహోత్రం మొదలైన కర్మలు ఆచరించుకుంటూ, ఇష్టము లేకపోయినా ఎవరి మధ్య ఉంటే వారి ధర్మం ఆచరించాలి కాబట్టి

అథ యవీయసీ ద్విజసతీ స్వగర్భజాతం మిథునం సపత్న్యా ఉపన్యస్య స్వయమనుసంస్థయా
పతిలోకమగాత్

పితర్యుపరతే భ్రాతర ఏనమతత్ప్రభావవిదస్త్రయ్యాం విద్యాయామేవ పర్యవసితమతయో న
పరవిద్యాయాం జడమతిరితి భ్రాతురనుశాసననిర్బన్ధాన్న్యవృత్సన్త

కాలం అప్రమత్తమైనా ఇతను మాత్రం ప్రమత్తుడై సాంసారిక విషయములో ఉన్నాడు. కొంతకాలానికి తల్లులు అరణ్యానికి వెళ్ళారు, తండ్రి కాలం చేసారు, తొమ్మిది మంది తమ్ముళ్ళు ఇతనికి భాగం ఇవ్వలేదు. ఇతని సోదరులు త్రైవిద్యలో ఆసక్తులు. వేద విద్యలో ఆసక్తులు కానీ వేదాంతానికి వెళ్ళలేదు.

స చ ప్రాకృతైర్ద్విపదపశుభిరున్మత్తజడబధిరమూకేత్యభిభాష్యమాణో యదా తదనురూపాణి
ప్రభాషతే కర్మాణి చ కార్యమాణః పరేచ్ఛయా కరోతి విష్టితో వేతనతో వా యాచ్ఞ్యా యదృచ్ఛయా
వోపసాదితమల్పం
బహు మృష్టం కదన్నం వాభ్యవహరతి పరం నేన్ద్రియప్రీతినిమిత్తమ్నిత్యనివృత్తనిమిత్తస్వసిద్ధ
విశుద్ధానుభవానన్దస్వాత్మలాభాధిగమః సుఖదుఃఖయోర్ద్వన్ద్వనిమిత్తయోరసమ్భావిత
దేహాభిమానః

భాగం పంచుకుని భరతునికి భాగం ఇవ్వలేదు. ఇవ్వకపోగా అతనిని బెదిరించి కాలం గడుపుతున్నారు. పామరులైన రెండుకాళ్ళ పశువులచే వెక్కిరించబడుతూ ఉన్నాడు. ఎలాగా పిచ్చివాడన్న పేరు వచ్చింది కాబట్టి వారేపేరు పెట్టారో అలాంటి వారు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు.చెవిటివాడూ అంటే చెవిటి వాడిలాగే ప్రవర్తించాడు. ఎవరేపని చెబితే ఆపని చేసేవాడు. పొలం కాపలా కాస్తున్నాడు, గడ్డిపీకుతున్నాడు. తమ్ములే కాక దారిన పోయే వారు ఏ పని చెప్పినా చేసేవాడు. మంచి భోజనం చేసేవాడూ, చెడుభోగనమూ చేసేవాడు. బ్రతకడానికి తినేవాడు తప్ప ఇంద్రియ ప్రీతి కొరకు భుజించలేదు. నిత్య నివృత్త నిమిత్త - సుఖ దుఃఖాలకు నిమిత్తాలాఇన పాప పుణ్యాలు తొలగిపోతాయి. పరమాత్మను మాత్రమే అనుభవించేవాడు. భగవంతుడు శుద్ధుడూ భాగవతుడు విశుద్ధుడు. ఇలా భగవత్ భాగవతుల గుణానుసంధానం చేస్తూ సుఖ దుఃఖాలను మానావమానాలను విడిచిపెట్టాడు.

శీతోష్ణవాతవర్షేషు వృష ఇవానావృతాఙ్గః పీనః సంహననాఙ్గః స్థణ్డిల
సంవేశనానున్మర్దనామజ్జనరజసా మహామణిరివానభివ్యక్తబ్రహ్మవర్చసః కుపటావృత
కటిరుపవీతేనోరుమషిణా ద్విజాతిరితి బ్రహ్మబన్ధురితి సంజ్ఞయాతజ్జ్ఞజనావమతో విచచార

చలి పుట్టినా వాన వచ్చిన మీద ఉన్న శాలువ తీసే వాడు. ఒక ఎద్దులా తిరిగేవాడు. దాని వలన బాగా బలిసి ఉండేవాడు. అవయములు దృఢముగా ఉండేవి. కింద కూర్చునే వాడు. ఒళ్ళంతా దుమ్ము గప్పి నివురు గప్పిన నిప్పులా ఉండేవాడు. బ్రహ్మ వర్చస్సు కూడా వ్యకపరచకుండా. యజ్ఞ్యోపవీతం కూడా దుమ్ములో కొట్టుకుని ఉందా లేదా అన్నట్లుగా కనపడలేదు .

యదా తు పరత ఆహారం కర్మవేతనత ఈహమానః స్వభ్రాతృభిరపి కేదారకర్మణి నిరూపితస్తదపి
కరోతి కిన్తు న సమం విషమం న్యూనమధికమితి వేద కణపిణ్యాకఫలీకరణకుల్మాష
స్థాలీపురీషాదీన్యప్యమృతవదభ్యవహరతి

తాను బతకాలి కాబట్టి ఆహరం తీసుకోవాలి. ఊరికే తీసుకుంటే బిక్ష అవుతుంది కాబట్టి పని చేసి ఆహారం తీసుకునే వాడు. తన సోదరులు అడిగితే పొలానికి కాపలా కాసేవాడు. పరమాత్మను స్మరింపచేసే ఆహారం తీసుకునేవాడు. చద్ది పాసిపోయిన బూజుపట్టిన మురికి అయినా అన్నాన్నీ, పిండినీ రవ్వనూ గోధుమనూ ఏదైనా ఏది పెట్టినా తినేవాడు.

అథ కదాచిత్కశ్చిద్వృషలపతిర్భద్రకాల్యై పురుషపశుమాలభతాపత్యకామః

తస్య హ దైవముక్తస్య పశోః పదవీం తదనుచరాః పరిధావన్తో నిశి నిశీథసమయే
తమసావృతాయామనధిగతపశవ ఆకస్మికేన విధినా కేదారాన్వీరాసనేన మృగవరాహాదిభ్యః
సంరక్షమాణమఙ్గిరఃప్రవరసుతమపశ్యన్

ఇలా అడవిలో ఊరిలో అన్ని చోట్లా తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు ఒక ఆటవిక రాజు భద్రకాళికి కొడుకును కోరి బలి ఇవ్వదలచి అలాంటి వాడికోసం వెతుకుతూ ఉంటే దైవ వశం వలన ఇతను దొరికాడు. ఇతను దోషం లేకుండా సక్రమముగా ఉన్నాడు. యజమాని పని పూర్తవుతుందని ఇతన్ని కట్టేసి తీసుకుని వచ్చాడు.

అథ త ఏనమనవద్యలక్షణమవమృశ్య భర్తృకర్మనిష్పత్తిం మన్యమానా బద్ధ్వా రశనయా
చణ్డికాగృహముపనిన్యుర్ముదా వికసితవదనాః

అథ పణయస్తం స్వవిధినాభిషిచ్యాహతేన వాససాచ్ఛాద్య భూషణాలేపస్రక్తిలకాదిభిరుపస్కృతం
భుక్తవన్తం ధూపదీపమాల్యలాజకిసలయాఙ్కురఫలోపహారోపేతయా వైశససంస్థయా మహతా గీతస్తుతి
మృదఙ్గపణవఘోషేణ చ పురుషపశుం భద్రకాల్యాః పురత ఉపవేశయామాసుః

అథ వృషలరాజపణిః పురుషపశోరసృగాసవేన దేవీం భద్రకాలీం యక్ష్యమాణస్తద్
అభిమన్త్రితమసిమతికరాలనిశితముపాదదే

తలంటు పోసి మంచి వస్త్రాలు కట్టి పూల మాలలూ చందమూ గంధమూ మొదలైన వాటితో అలంకరించి పూజించి పళ్ళు  పెట్టి కానుకలిచ్చి, మంగళ వాద్యాలు మోగించుకుంటూ బలిపీఠానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఆటవిక రాజు కూడా భద్ర కాళికి బలి ఇవ్వదలచి కత్తి తీసుకున్నాడు.

ఇతి తేషాం వృషలానాం రజస్తమఃప్రకృతీనాం ధనమదరజౌత్సిక్తమనసాం భగవత్కలావీర
కులం కదర్థీకృత్యోత్పథేన స్వైరం విహరతాం హింసావిహారాణాం కర్మాతిదారుణం యద్బ్రహ్మభూతస్య
సాక్షాద్బ్రహ్మర్షిసుతస్య నిర్వైరస్య సర్వభూతసుహృదః సూనాయామప్యననుమతమాలమ్భనం
తదుపలభ్య బ్రహ్మతేజసాతిదుర్విషహేణ దన్దహ్యమానేన వపుషా సహసోచ్చచాట సైవ దేవీ భద్రకాలీ

ధన మదం రజ మదం కలిగి సాక్షాత్ పరమాత్మ అంశతో పుట్టిన వాడూ, బ్రహ్మర్షి అయిన అంగీరసుని పుత్రుడు, ఎవరినీ హింసించని సకల జీవుల యందు ప్రేమకలిగిన వాడి బలి ఇవ్వబోతూ ఉంటే, ఇతని బ్రహ్మ తేజస్సును సహించలేక కాళికా దేవి ఒళ్ళుమండి ఆమె బయటకు వచ్చి

భృశమమర్షరోషావేశరభసవిలసితభ్రుకుటివిటపకుటిలదంష్ట్రారుణేక్షణాటోపాతిభయానక
వదనా హన్తుకామేవేదం మహాట్టహాసమతిసంరమ్భేణ విముఞ్చన్తీ తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం
తేనైవాసినా వివృక్ణశీర్ష్ణాం గలాత్స్రవన్తమసృగాసవమత్యుష్ణం సహ గణేన నిపీయాతిపానమద
విహ్వలోచ్చైస్తరాం స్వపార్షదైః సహ జగౌ ననర్త చ విజహార చ శిరఃకన్దుకలీలయా

మహాకోపముతో పళ్ళుకొరుకుతూ మొత్తం ప్రపంచాన్ని చంపేస్తా అని మహాట్టహాసం చేసి ఏ ఖడ్గముతో ఈ  బ్రాహ్మణోత్తముని చంపాలని చూసారో ఆ కత్తితో అక్కడున్న వారిని సంహరించి తన గణముతో ఆ రక్తాన్ని. తాగేసి, గానమూ నాట్యమూ చేసి శిరస్సులతో ఆడుకొని వెళ్ళిపోయింది.

ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమః కార్త్స్న్యేనాత్మనే ఫలతి

గొప్పవారికి అపకారం చేయాలనుకుంటే ఆ అపకారం తనకే జరుగుతుంది

న వా ఏతద్విష్ణుదత్త మహదద్భుతం యదసమ్భ్రమః స్వశిరశ్ఛేదన ఆపతితేऽపి విముక్త
దేహాద్యాత్మభావసుదృఢహృదయగ్రన్థీనాం సర్వసత్త్వసుహృదాత్మనాం నిర్వైరాణాం
సాక్షాద్భగవతానిమిషారివరాయుధేనాప్రమత్తేన తైస్తైర్భావైః పరిరక్ష్యమాణానాం తత్పాద
మూలమకుతశ్చిద్భయముపసృతానాం భాగవతపరమహంసానామ్

ఇంత జరిగినా భరతునిలో ఎటువంటి చలనమూ లేదు.  తల నరకడానికి వచ్చినా ఎటువంటి తొట్రుపాటూ కనపడలేదు. దేహాత్మాభిమానం తొలగడమంటే ఇదే. వీరు సకల ప్రాణులకూ బంధువులూ, పరమాత్మ నిరంతరం వారి హృదయాంతరంగములో ఉంటాడు. అలాంటి మహానుభావులకు ఎక్కడినుంచీ ఎలాంటి భయమూ ఉండదు. వీరు భాగవత పరమహంసలు.

No comments:

Post a Comment