Sunday, March 31, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

రాజోవాచ
మహర్ష ఏతద్వైచిత్ర్యం లోకస్య కథమితి

ఇన్ని రకముల పరిణామాలు ఎందుకు ఉన్నాయి. నరకములన్ని స్వరగ్మనీ ఎందుకు ఉన్నాయి. భగవంతుడు అందరినీ ఒకే తీరుగా ఎందుకు సృష్టించలేదు.

ఋషిరువాచ
త్రిగుణత్వాత్కర్తుః శ్రద్ధయా కర్మగతయః పృథగ్విధాః సర్వా ఏవ సర్వస్య తారతమ్యేన భవన్తి
అథేదానీం ప్రతిషిద్ధలక్షణస్యాధర్మస్య తథైవ కర్తుః శ్రద్ధాయా వైసాదృశ్యాత్కర్మఫలం
విసదృశం భవతి యా హ్యనాద్యవిద్యయా కృతకామానాం తత్పరిణామలక్షణాః సృతయః సహస్రశః
ప్రవృత్తాస్తాసాం ప్రాచుర్యేణానువర్ణయిష్యామః

కర్త త్రిగుణం కాబట్టి, వారి వారి గుణములకు తగిన శ్రద్ధ వారికి ఉంటుంది. వారి వారి కర్మాధికారాన్ని బట్టి వారికి ఫలం ఉంటుంది.  అనంతమైన అవిద్య చేత కోరికలు ఏర్పడతాయి. వాటి కొరకు సృష్టి జరుగుతుంది. సృష్టిలోని వైషమ్యం పరమాత్మ సంకల్పం కాదు, జీవులు చేసుకున్న కర్మ.

రాజోవాచ
నరకా నామ భగవన్కిం దేశవిశేషా అథవా బహిస్త్రిలోక్యా ఆహోస్విదన్తరాల ఇతి

ఈ  నరకాలు అంటారే. అవి కూడా ఒక లోకమేనా? అవి త్రిలోకములలో అంతర్భూతములా, వాటి బయట ఉన్నాయా?

ఋషిరువాచ
అన్తరాల ఏవ త్రిజగత్యాస్తు దిశి దక్షిణస్యామధస్తాద్భూమేరుపరిష్టాచ్చ
జలాద్యస్యామగ్నిష్వాత్తాదయః పితృగణా దిశి స్వానాం గోత్రాణాం పరమేణ సమాధినా సత్యా ఏవాశిష ఆశాసానా
నివసన్తి

దక్షిణ దిక్కులో భూమికి కిందగా ఉంది నరకం. నీటికన్నా పైన భూమీ కన్నా కింద. అందుకే మూడు వందల అడుగులు దాటి భూమిని త్రవ్వద్దు అంటారు. లేకపోతే అంతకన్నా లోతు ఉన్న నీరు త్రాగితే ఆ ప్రవృత్తే వస్తుంది. అక్కడ పితృదేవతలూ, కింద భూలోకములో తమ తమ గణాలు బాగుండాలని ఉంటారు.

యత్ర హ వావ భగవాన్పితృరాజో వైవస్వతః స్వవిషయం ప్రాపితేషు స్వపురుషైర్జన్తుషు
సమ్పరేతేషు
యథాకర్మావద్యం దోషమేవానుల్లఙ్ఘితభగవచ్ఛాసనః సగణో దమం ధారయతి

యముడు పితృ రాజు. మరణించి తన లోకానికి వచ్చినవారు, వారి వారి శరీరములో ఉండగా వారి కర్మానుసారముగా చేసిన పాపాన్ని తన వారితో శిక్షిస్తూ ఉంటాడు. పరమాత్మ ఆజ్ఞ్య మేరకూ తన గణముతో శిక్షిస్తూ ఉంటాడు

తత్ర హైకే నరకానేకవింశతిం గణయన్తి అథ తాంస్తే రాజన్నామరూపలక్షణతో
ऽనుక్రమిష్యామస్తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం
సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః
ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానమితి కిఞ్చ క్షారకర్దమో రక్షోగణ
భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖమిత్యష్టావింశతిర్నరకా వివిధ
యాతనాభూమయః

కొందరు ఈ నరకాలు ఇరవై ఒకటనీ అరవై ఒకటనీ అంటారు. పేర్లూ ఆకారములూ లక్షణములను వివరిస్తాము. తామిస్రోऽన్ధతామిస్రో రౌరవో మహారౌరవః కుమ్భీపాకః కాలసూత్రమసిపత్రవనం
సూకరముఖమన్ధకూపః కృమిభోజనః సన్దంశస్తప్తసూర్మిర్వజ్రకణ్టకశాల్మలీ వైతరణీ పూయోదః ప్రాణరోధో విశసనం లాలాభక్షః సారమేయాదనమవీచిరయఃపానం.
ఇవి కాక ఇంకో ఏడు ఉన్నాయి.క్షారకర్దమో రక్షోగణ భోజనః శూలప్రోతో దన్దశూకోऽవటనిరోధనః పర్యావర్తనః సూచీముఖం. ఇవి యాతనా భూములు.

తత్ర యస్తు పరవిత్తాపత్యకలత్రాణ్యపహరతి స హి కాలపాశబద్ధో యమపురుషైరతి
భయానకైస్తామిస్రే నరకే బలాన్నిపాత్యతే అనశనానుదపానదణ్డతాడన
సన్తర్జనాదిభిర్యాతనాభిర్యాత్యమానో జన్తుర్యత్ర కశ్మలమాసాదిత ఏకదైవ మూర్చ్ఛాముపయాతి తామిస్ర
ప్రాయే

ఎవరెవరికి ఎలాంటి నరకం వస్తుంది. పరుల ధనాన్ని స్త్రీలనూ సంతానాన్ని హరిస్తారో అతను యముని పాశముతో బంధించబడి,  మహా భయంకరులైన యమభటులు తామిశ్రమనే నరకములో పడేస్తారు. ఇలాంటి వారికి శిక్షగా, ఆహరం ఇవ్వరు, నీరూ ఇవ్వరు, కట్టెలతో కొడుతూ ఉంటారు, కొడతానని భయపెడతారు. ఈ జీవుడు దుఃఖాన్ని పొంది ఒక దానికే మూర్చపోతాడు.

ఏవమేవాన్ధతామిస్రే యస్తు వఞ్చయిత్వా పురుషం దారాదీనుపయుఙ్క్తే యత్ర శరీరీ నిపాత్యమానో
యాతనా
స్థో వేదనయా నష్టమతిర్నష్టదృష్టిశ్చ భవతి యథా వనస్పతిర్వృశ్చ్యమానమూలస్తస్మాదన్ధతామిస్రం
తముపదిశన్తి

అంధ తామిశ్రమనే ఇంకో నరకం ఉంది. భర్తను మోసగించి ఇంకో భార్యను అనుభవించేవాడు. వాడి బుద్ధీ చూపూ నశిస్తుంది. వేర్లు కోసేసిన వృక్షములాగ అవుతాడు. అందుకే ఇది కటిక చీకటి, అంధ తామిశ్రం.

యస్త్విహ వా ఏతదహమితి మమేదమితి భూతద్రోహేణ కేవలం స్వకుటుమ్బమేవానుదినం
ప్రపుష్ణాతి స తదిహ విహాయ స్వయమేవ తదశుభేన రౌరవే నిపతతి

"నేను నేనంటూ" భావించి ఇతరులకు ద్రోహం చేస్తూ తన కుటుంబాన్ని మాత్రం పోషించుకునే వాడు రౌరవములో పడతాడు. ఇతరులకు ద్రోహం చేయకూడదు.

యే త్విహ యథైవామునా విహింసితా జన్తవః పరత్ర యమయాతనాముపగతం త ఏవ రురవో
భూత్వా
తథా తమేవ విహింసన్తి తస్మాద్రౌరవమిత్యాహూ రురురితి సర్పాదతిక్రూరసత్త్వస్యాపదేశః

ఇది రౌరవం ఎందుకంటే అక్కడ రురు అన్న జంతువు (ముళ్ళ పంది) వీడిని బాధిస్తుంది. ఇక్కడ జీవి ఈ లోకములో ఉన్నప్పుడు ఏ ఏ జంతువులని హింసించాడో ఆ జంతువులే పరలోకములో జంతువులుగా అవతరించి బాధిస్తాడు. అందుకే అది రౌరవం అంటారు. ఆవుల మందలో వేల ఆవులున్నా ఎలాగైతే దూడ తన తల్లిని గుర్తు పడుతుందో అలాగే కర్తను ఆ కర్మ గుర్తుపడుతుంది. పాము తన దగ్గరకు వెళితేనే ప్రమాదం, కానీ ఈ రురువు అంతకన్నా ప్రమాదకరం

ఏవమేవ మహారౌరవో యత్ర నిపతితం పురుషం క్రవ్యాదా నామ రురవస్తం క్రవ్యేణ ఘాతయన్తి యః
కేవలం దేహమ్భరః

మహారౌరవం: భయంకరముగా బాధపెట్టిన వారిని జంతువులన్నీ చుట్టూ చేరి జీవుల మాంసాన్ని మెల్ల మెల్లగా తింటూ ఉంటాయి. ఎవడు తన శరీరమును మాత్రమే పోషించుకోవడానికి ప్రయత్నించాడో వాడు ఈ నరకం పాలవుతాడు.

యస్త్విహ వా ఉగ్రః పశూన్పక్షిణో వా ప్రాణత ఉపరన్ధయతి తమపకరుణం పురుషాదైరపి
విగర్హితమముత్ర యమానుచరాః కుమ్భీపాకే తప్తతైలే ఉపరన్ధయన్తి

పక్షుల పశువుల ప్రాణం తీసి బాధపెట్టే రాక్షసుల కంటే హీనుడైన వాడు, అలాంటి వాళ్ళను కుంభీపాకము (పెద్ద మూకుడు నిండా నూనె మసలుతూ ఉంటుంది) లో పడేస్తారు.

యస్త్విహ బ్రహ్మధ్రుక్స కాలసూత్రసంజ్ఞకే నరకే అయుతయోజనపరిమణ్డలే తామ్రమయే తప్త
ఖలే ఉపర్యధస్తాదగ్న్యర్కాభ్యామతితప్యమానేऽభినివేశితః క్షుత్పిపాసాభ్యాం చ దహ్యమానాన్తర్బహిః
శరీర ఆస్తే శేతే చేష్టతేऽవతిష్ఠతి పరిధావతి చ యావన్తి పశురోమాణి తావద్వర్షసహస్రాణి

తల్లి తండ్రులకూ బ్రాహ్మణులకూ బ్రాహ్మణ భక్తులకూ ద్రోహం చేస్తారో పది వేల యోజనాల మండలాకారములో ఉన్న కాల సూత్రమనే నరకములో పడతారు. అది బాగా కాల్చబడిన రాగి పల్లెములా ఉంటుంది. బాగా కాచిన పల్లెములో అట్టూ ఇటూ తిప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ మంటలకు తోడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. పెట్టే బాధను తట్టుకోవడానికి ఆకలికి ఆహారం అడుగుతారు. పై శరీరమూ లోపల శరీరం అగ్నితో , జఠరాగ్నితో కాలుతూ ఉంటుంది. కింద కూడా అగ్ని ఉంటుంది. అక్కడే ఉండి పడుకుని పరిగెత్తుతూ ఉంటాడు. ఇలా ఏ ఏ పశువులను చంపారో, ఆ చంపిన పశువులకు ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు అక్కడ ఉంటాడు.

యస్త్విహ వై నిజవేదపథాదనాపద్యపగతః పాఖణ్డం చోపగతస్తమసిపత్రవనం
ప్రవేశ్య కశయా ప్రహరన్తి తత్ర హాసావితస్తతో ధావమాన ఉభయతో ధారైస్తాలవనాసిపత్రైశ్ఛిద్యమాన
సర్వాఙ్గో హా హతోऽస్మీతి పరమయా వేదనయా మూర్చ్ఛితః పదే పదే నిపతతి స్వధర్మహా పాఖణ్డానుగతం
ఫలం భుఙ్క్తే

వేద మార్గమును ఆపద లేనప్పుడు తప్ప బ్రాహ్మణులు తప్పితే, తన మార్గాన్ని తాను విడిచి పెట్టి పాఖండ మార్గాన్ని అవలంబిస్తే, అతిపత్ర వనం అనే నరకములో పడతారు. అక్కడ కొరడాలతో కొడతారు. ఇటూ అటూ పరిగెడుతూ ఉంటారు. కింద ఆకుల లాంటి కత్తులు ఉంటాయి. కింద కాళ్ళు పెట్టడానికీ లెడు ఆగడానికీ లేదు. ఆ కత్తులకు రెండు వైపులా అంచు ఉంటుంది. పదే పదే ఘోరమైన ఆపదతో మూర్చపోతూ ఉంటారు. తన ధర్మాన్ని విడిచి పెట్టి పాఖండ మతాన్ని అనుసరించినందు వలన ఈ ఫలితాన్ని అనుభవిస్తారు.

యస్త్విహ వై రాజా రాజపురుషో వా అదణ్డ్యే దణ్డం ప్రణయతి బ్రాహ్మణే వా శరీరదణ్డం స
పాపీయాన్నరకేऽముత్ర సూకరముఖే నిపతతి తత్రాతిబలైర్వినిష్పిష్యమాణావయవో యథైవేహేక్షుఖణ్డ ఆర్త
స్వరేణ స్వనయన్క్వచిన్మూర్చ్ఛితః కశ్మలముపగతో యథైవేహాదృష్టదోషా ఉపరుద్ధాః

రాజు గానీ రాజు దగ్గర పని చేసిన వారు గానీ, శిక్షించదగని వారిని శిక్షినట్లైతే, బ్రాహ్మణులకి శరీర దండం విధిస్తే సూకర ముఖం అనే నరకం విధిస్తారు. ఆ వరాహాల మూతులు దబ్బనాలలా ఉండి చిల్లులు పొడుస్తూ, పిండబడుతూ (చెరుకు గడలను పిండినట్లుగా) ఉంటారు. మూర్చపోతూ కొందరు, అధికారముగా ఉన్నప్పుడు ఈ లోకములో తప్పు చేయని వారిని ఎలా హింసిస్తారో అవి అన్నీ గుర్తుకు వస్తాయి. తాను బాధించిన వారిని తలచుకుంటారు. తప్పులేని వారినెలా హింసించావో  అలా వారు హింసిస్తారు.

యస్త్విహ వై భూతానామీశ్వరోపకల్పితవృత్తీనామవివిక్తపరవ్యథానాం స్వయం పురుషోపకల్పిత
వృత్తిర్వివిక్తపరవ్యథో వ్యథామాచరతి స పరత్రాన్ధకూపే తదభిద్రోహేణ నిపతతి తత్ర హాసౌ
తైర్జన్తుభిః పశుమృగపక్షిసరీసృపైర్మశకయూకామత్కుణమక్షికాదిభిర్యే కే చాభిద్రుగ్ధాస్తైః
సర్వతోऽభిద్రుహ్యమాణస్తమసి విహతనిద్రానిర్వృతిరలబ్ధావస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః

అంధ కూప నరకం: కొన్ని ప్రాణులు మన నుండి ఏమీ ఆశించక పరమాత్మ ఏర్పాటు చేసిన వసతిని బట్టి బతుతుకూ ఉంటాయి, ఇతరులను బాధించడం వాటికి తెలియదు. పరమాత్మ చేత పోషింపబడేవి, ఇతరులని బాధించబడే వాటిని, ఇతరుల చేత పోషింపబడే వాడు బాధించినట్లైతే పరలోకములో వాడు అంధకూప నరకములో పడతాడు. పరలోకములో పశువులూ మృగములూ జంతువులూ సర్పములూ దోమలూ పేలూ నల్లులు ఈగలు ఇలాంటి వాటి చేత బాధించబడతాడు. నల్లూ ఈగలూ దోమలూ మనని బాధిస్తున్నాయన్న సంగతి వారికి తెలియదు. అందుకు వాటిని మనం చంపకూడదు. వాటిని బాధిస్తే వాటి చేతనే బాధకు గురవుతారు (మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే). ఇలా అవస్థలు పడుతూ చెడిపోయిన శరీరములో జీవుడు ఉండలేక వెళ్ళలేక ఉంటాడో, ఈ నరకములో కూడా నానా యాతనలు పడుతూ ఉంటాడు.

యస్త్విహ వా అసంవిభజ్యాశ్నాతి యత్కిఞ్చనోపనతమనిర్మితపఞ్చయజ్ఞో వాయససంస్తుతః స
పరత్ర కృమిభోజనే నరకాధమే నిపతతి తత్ర శతసహస్రయోజనే కృమికుణ్డే కృమిభూతః స్వయం
కృమిభిరేవ భక్ష్యమాణః కృమిభోజనో యావత్తదప్రత్తాప్రహూతాదోऽనిర్వేశమాత్మానం యాతయతే

కృమిభోజనం: మనం తినేవాటిని మన చుట్టు పక్కల వారికి పంచకుండా తింటే ఈ నరకం వస్తుంది. ఇలా లక్ష యోజనాల విస్తీర్ణములో ఈ నరకం ఉంటుంది. అది కృమి కుండం. పితృ శ్రాద్ధాదులూ యజ్ఞ్య యాగాదులూ (దేవ యజ్ఞ్య పితృ యజ్ఞ్యములు చేయకుండా భుజించిన వాడు) దానములూ చేయని వాడు. ఏ మాత్రం జాలి లేకుండా ప్రేమ లేకుండా తనను తాను హింసించుకుంటాడు.

యస్త్విహ వై స్తేయేన బలాద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వాపహరత్యన్యస్య వానాపది
పురుషస్తమముత్ర రాజన్యమపురుషా అయస్మయైరగ్నిపిణ్డైః సన్దంశైస్త్వచి నిష్కుషన్తి

అగ్నిపిండ నరకం. ఇతరుల, బ్రాహ్మణుల దీనుల ధనాన్ని దొంగతనముగా ఆపదలేనప్పుడు అపహరిస్తాడో ఉక్కు పిండములను నిప్పులో కాల్చి శరీరములో కొడుతూ ఉంటారు.

యస్త్విహ వా అగమ్యాం స్త్రియమగమ్యం వా పురుషం యోషిదభిగచ్ఛతి తావముత్ర కశయా
తాడయన్తస్తిగ్మయా సూర్మ్యా లోహమయ్యా పురుషమాలిఙ్గయన్తి స్త్రియం చ పురుషరూపయా సూర్మ్యా

పొందకూడని స్త్రీని పొందిన వాడు, పొందకూడని పురుషున్ని పొందిన స్త్రీని ఒక ఉక్కు స్తంభాన్ని బాగా కాల్చి దానిని ఆలింగనం చేసుకోమని అంటారు. కొరడాలతో కొడుతూ ఉంటారు. మహా వేడి ఉన్న దానిని, పొందకూడని పురుషున్ని పొందిన స్త్రీని పురుషాకారములో ఉన్న స్తంభాన్ని ఆలింగనం చేసుకోమని కొరడాలతో కొడతారు.

యస్త్విహ వై సర్వాభిగమస్తమముత్ర నిరయే వర్తమానం వజ్రకణ్టకశాల్మలీమారోప్య
నిష్కర్షన్తి

వావీ వరసలూ పాటించకుండా (మనుషులతోనే కాకుండా, జంతువులతో కూడా రమించేవారిని) ముళ్ళతో ఉన్న బూరుగు చెట్టును ఎక్కించి కిందకి లాగుతారు.

యే త్విహ వై రాజన్యా రాజపురుషా వా అపాఖణ్డా ధర్మసేతూన్భిన్దన్తి తే సమ్పరేత్య వైతరణ్యాం
నిపతన్తి భిన్నమర్యాదాస్తస్యాం నిరయపరిఖాభూతాయాం నద్యాం యాదోగణైరితస్తతో భక్ష్యమాణా
ఆత్మనా న వియుజ్యమానాశ్చాసుభిరుహ్యమానాః స్వాఘేన కర్మపాకమనుస్మరన్తో విణ్మూత్రపూయశోణిత
కేశనఖాస్థిమేదోమాంసవసావాహిన్యాముపతప్యన్తే

కొందరు రాజులూ రాజ ఉద్యోగులు పుణ్యమును ఆచరించే మర్యాదను ఉల్లంఘిస్తారో ధర్మాన్ని ఆచరించే వారిని నిందిస్తారో వారు వైతరిణీ నదిలో పడతారు. వైతరిణీ అంటే నరకానికి కందకం. ఆ నదిలో మలం మూత్రం దుర్గంధం నెత్తురూ కేశములూ గోళ్ళూ ఎముకలు మధ్యా మాంసం చీము ఉంటాయి. అందులో పడేస్తారు. అక్కడ కొన్ని జంతువులూ క్రిమికీటకాలూ ఉంటాయి. అక్కడ రాక్షసులతో తినబడుతూ ఆత్మ వియోగం లేకుండా ప్రాణములతో ఉన్నట్లే ఉండి "అయ్యో క్షణికమైన ఆనందం లాంటి దాని కోసం ఈ పాపాలు చేసామా" అని బాధపడతారు.

యే త్విహ వై వృషలీపతయో నష్టశౌచాచారనియమాస్త్యక్తలజ్జాః పశుచర్యాం చరన్తి తే చాపి ప్రేత్య
పూయవిణ్మూత్రశ్లేష్మమలాపూర్ణార్ణవే నిపతన్తి తదేవాతిబీభత్సితమశ్నన్తి

బ్రాహ్మణోత్తములూ క్షత్రియులూ వేద వాక్యాలనూ ధర్మాలనూ విడిచిపెట్టి శూద్ర స్త్రీలతో రమించి శౌచమూ ఆచారమూ సిగ్గూ విడిచి  పశుచర్యతో పశువులలాగ ప్రవర్తిస్తారో వారు మల మూత్ర దుర్గంధ శ్లేషముతో ఉన్న సముద్రములో పడవేయబడి దానినే తాగుతూ తింటూ ఉంటారు.

యే త్విహ వై శ్వగర్దభపతయో బ్రాహ్మణాదయో మృగయా విహారా అతీర్థే చ మృగాన్నిఘ్నన్తి
తానపి
సమ్పరేతాన్లక్ష్యభూతాన్యమపురుషా ఇషుభిర్విధ్యన్తి

బ్రాహ్మణులు కొంతమంది కుక్కలనూ గాడిదలనూ పెంచుకుంటారు. అలా పెంచుకునే వారూ, శ్రాద్ధాదులు లేనప్పుడు మృగాలని చంపితే వారు నరకానికి వెళ్ళినప్పుడు, ఎలా ఇక్కడ వీరు బాణాలతో జంతువులను చంపారో అక్కడ యమబటులు వీళ్ళని కొడుతూ ఉంటారు.

యే త్విహ వై దామ్భికా దమ్భయజ్ఞేషు పశూన్విశసన్తి తానముష్మిన్లోకే వైశసే నరకే
పతితాన్నిరయపతయో యాతయిత్వా విశసన్తి

ఎవరైతే డాంబికముగా ఉంటారో, పదిమంది మనను భక్తులనుకోవాలని వచనతో యజ్ఞాలు చేసి పశువులని చంపేవారు నరకానికి వెళ్ళిన తరువాత యజ్ఞ్య పశువును ఎలా బాధించి హింసించి చంపుతారో అక్కడికి వెళ్ళిన తరువాత యమభటులు అలాగే చేస్తారు.

యస్త్విహ వై సవర్ణాం భార్యాం ద్విజో రేతః పాయయతి కామమోహితస్తం పాపకృతమముత్ర రేతః
కుల్యాయాం పాతయిత్వా రేతః సమ్పాయయన్తి

కొందరు తమ భార్యలతో తమ వీర్యమును తాగిస్తారు. అలాంటి పాపం చేసిన వారిని వీర్యముతో ఉన్న బురదలో పడేస్తారు.

యే త్విహ వై దస్యవోऽగ్నిదా గరదా గ్రామాన్సార్థాన్వా విలుమ్పన్తి రాజానో రాజభటా వా
తాంశ్చాపి హి
పరేత్య యమదూతా వజ్రదంష్ట్రాః శ్వానః సప్తశతాని వింశతిశ్చ సరభసం ఖాదన్తి

కొందరు దొంగలు దొంగతనానికి వచ్చి ఊళ్ళకు ఊళ్ళను తగలబెట్టి, విషాన్నం పెడతారు. రాజభటులు కూడా తమ మాట వినని వారిని ఇలాగే చేస్తారు. అలాంటి వారిని వజ్రములాంటి కోరలున్న కుక్కలతో కరిపిస్తారు.

యస్త్విహ వా అనృతం వదతి సాక్ష్యే ద్రవ్యవినిమయే దానే వా కథఞ్చిత్స వై ప్రేత్య నరకే
ऽవీచిమత్యధఃశిరా నిరవకాశే యోజనశతోచ్ఛ్రాయాద్గిరిమూర్ధ్నః సమ్పాత్యతే యత్ర జలమివ స్థలమశ్మ
పృష్ఠమవభాసతే తదవీచిమత్తిలశో విశీర్యమాణశరీరో న మ్రియమాణః పునరారోపితో నిపతతి

అబద్దం ఆడేవాడు, అబద్ద సాక్ష్యం చెప్పేవాడూ, ఎలాంటి గాలీ వెలుతురూ లేని చోట పెద్ద సొరగమునుంచి పర్వత పైభాగం నుంచి పడవేస్తారు. అక్కడ నీరూ భూమీ రెండూ ఉక్కుతో ఉంటాయి. అలాంటి చోట పడ్డప్పుడు నువ్వుల గింజలుగా శరీరం ఐపోతుంది. చావు లేదు కాబట్టి మళ్ళీ లేస్తాడు.

యస్త్విహ వై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపీథస్తత్కలత్రం వా సురాం వ్రతస్థోऽపి వా పిబతి
ప్రమాదతస్తేషాం నిరయం నీతానామురసి పదాక్రమ్యాస్యే వహ్నినా ద్రవమాణం కార్ష్ణాయసం నిషిఞ్చన్తి

బ్రాహ్మణుడు రాజూ వైశ్యుడూ సోమయాగం చేసేవాడు వ్రతములో ఉన్నవాడు కానీ తన వారిని భార్యనూ గానీ తన వారితో గాని సురాపానం చేస్తేలేవకుండా వక్షస్థలం మీద కాలుపెట్టి కాలే నిప్పును నోట్లో పోస్తారు, నిప్పులో బాగా కరిగించిన సీసాన్ని నోట్లో పోస్తారు. మద్యం పానం చేస్తే నాలుకా నోరూ మొత్తం మండుతుంది, ఆ మంటే రుచి ఉందని తాగుతారు. వారికి ఈ శిక్ష.

అథ చ యస్త్విహ వా ఆత్మసమ్భావనేన స్వయమధమో జన్మతపోవిద్యాచారవర్ణాశ్రమవతో
వరీయసో న బహు మన్యేత స మృతక ఏవ మృత్వా క్షారకర్దమే నిరయేऽవాక్శిరా నిపాతితో దురన్తా యాతనా
హ్యశ్నుతే

శరీరముతో జాతితో వృత్తితో విద్యతో గానీ, ఏ రకముగా చూసినా తక్కువగా ఉండేవాడు, ఎక్కువగా ఉండేవాడిని తగిన రీతిలో గౌరవించకుంటే బతికున్నప్పుడూ చనిపోయినవాడితో సమానమే, చనిపోయిన తరువాత కూడా ఒక క్షారకర్దమములో (బురద) త్రల్ల కిందుగా పడేస్తారు.

యే త్విహ వై పురుషాః పురుషమేధేన యజన్తే యాశ్చ స్త్రియో నృపశూన్ఖాదన్తి తాంశ్చ తే పశవ ఇవ
నిహతా యమసదనే యాతయన్తో రక్షోగణాః సౌనికా ఇవ స్వధితినావదాయాసృక్పిబన్తి నృత్యన్తి చ గాయన్తి చ
హృష్యమాణా యథేహ పురుషాదాః

కొంతమంది పురుషమేధం చేసి నరున్ని బలి ఇస్తారు, స్త్రీలు కూడా పురుషులని తిని వేస్తారు (వాడిని నిర్వీర్యుడయ్యేంత వరకూ రమిస్తారు), అలాంటి వారు యమలోకములో రాక్షసులై కసాయి వారిగా (సౌనికా ) ఎలాంటి జాలీ దయా లేకుండా ఒక దబ్బనం గుచ్చి వారి రక్తాన్ని తాగుతారు. అలా త్రాగుతూ నాట్యం చేస్తారు గానం చేస్తారు. ఇక్కడ పురుషులను భుజించేవారు ఎంత ఆనందముగా గానం చేస్తారో వీరు కూడా అంతగానే చేస్తారు.

యే త్విహ వా అనాగసోऽరణ్యే గ్రామే వా వైశ్రమ్భకైరుపసృతానుపవిశ్రమ్భయ్య జిజీవిషూన్శూల
సూత్రాదిషూపప్రోతాన్క్రీడనకతయా యాతయన్తి తేऽపి చ ప్రేత్య యమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానః
క్షుత్తృడ్భ్యాం
చాభిహతాః కఙ్కవటాదిభిశ్చేతస్తతస్తిగ్మతుణ్డైరాహన్యమానా ఆత్మశమలం స్మరన్తి

కొందరు ఏ తప్పూ చేయకుండా ఎవరికీ హాని చేయకుండా గ్రామాలలో కానీ అరణ్యాలలో కానీ బ్రతకగోరే జంతువులూ పక్షులనూ ఆటకోసం పొడుస్తూ వినోదిస్తే వారిని యమలోకములో శూలముతో పొడుస్తారు, అన్నమూ పానీయమూ ఉండదు. డేగలూ గద్దలూ పొడిచి శరీర భాగాలను తీసుకుంటాయి

యే త్విహ వై భూతాన్యుద్వేజయన్తి నరా ఉల్బణస్వభావా యథా దన్దశూకాస్తేऽపి ప్రేత్య నరకే
దన్దశూకాఖ్యే నిపతన్తి యత్ర నృప దన్దశూకాః పఞ్చముఖాః సప్తముఖా ఉపసృత్య గ్రసన్తి యథా బిలేశయాన్

ఏ ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతర ప్రాణులని కలతకు గురిచేస్తారు. ఏ లాభము ఉండదు దాని వలన. మానవులనే కాకుండా పాములను పట్టి వారి కోరలు తీసి ఆనందిస్తూ ఉంటారు. మిగతా జంతువులతో కూడా అలాగే ఆడిస్తారు తమ వినోదము కోసము. తమ సంతోషం కోసం స్వేచ్చగా ఎవరికీ అపకారం చేయని మృగాలను కట్టివేసి కొట్టి చెప్పినట్లు చేయించుకుని వినోదించేవారు. అలాంటి వారికి సూదులు ఒళ్ళంతా చిలూ చేస్తాయి ఆ జంతువులు. బిలములో ఉన్నవాటిని ఎలా తినేస్తాయో అలా తినేస్తాయి. కరుస్తున్నాయి అంటే అవి మెలుకువగా ఉన్నప్పుడే కరుస్తాయి. తెలిసే బాధిస్తాయి.

యే త్విహ వా అన్ధావటకుసూలగుహాదిషు భూతాని నిరున్ధన్తి తథాముత్ర తేష్వేవోపవేశ్య సగరేణ
వహ్నినా ధూమేన నిరున్ధన్తి

కొందరు గుహలలో సొరంగాలలో చెట్టు తొర్రలలో ఉండే ప్రాణులని పట్టుకుంటారు. వారిని అలాంటి చోటే పట్టుకుని మంట పెడతారు

యస్త్విహ వా అతిథీనభ్యాగతాన్వా గృహపతిరసకృదుపగతమన్యుర్దిధక్షురివ పాపేన
చక్షుషా నిరీక్షతే తస్య చాపి నిరయే పాపదృష్టేరక్షిణీ వజ్రతుణ్డా గృధ్రాః కఙ్కకాకవటాదయః ప్రసహ్యోరు
బలాదుత్పాటయన్తి

ఇంటికొచ్చిన అతిథులనూ యాచకులనూ మహాకోపముతో చూసే వారి కళ్ళను గద్దలు బలవంతముగా లాగేస్తాయి.

యస్త్విహ వా ఆఢ్యాభిమతిరహఙ్కృతిస్తిర్యక్ప్రేక్షణః సర్వతోऽభివిశఙ్కీ అర్థవ్యయనాశచిన్తయా
పరిశుష్యమాణహృదయవదనో నిర్వృతిమనవగతో గ్రహ ఇవార్థమభిరక్షతి స చాపి ప్రేత్య తద్
ఉత్పాదనోత్కర్షణసంరక్షణశమలగ్రహః సూచీముఖే నరకే నిపతతి యత్ర హ విత్తగ్రహం పాపపురుషం
ధర్మరాజపురుషా వాయకా ఇవ సర్వతోऽఙ్గేషు సూత్రైః పరివయన్తి

నేను ధనవంతున్ని అని వంకర చూపు చూస్తూ ఉంటాడు. అందరూ తనను దోచడానికే వస్తారని ప్రతీ వారినీ ప్రతీ చోటా శంకిస్తూ, అర్థం వ్యయమైనప్పుడల్లా చింతిస్తూ శరీరమూ ముఖమూ హృదయమూ మాడి, తృప్తినీ పొందలేక, గ్రహములాగ (దయ్యములాగ) ఆ ధనం చుట్టే ఉండి ఆ డబ్బును కాపాడుకోవడమే తమ పని అనుకొని బ్రతికేవారు. ఇలా ఒక దాన్ని ఏర్పరచాలి, ఏర్పరచిన డబ్బును లాగాలి, లాగిన దాన్ని కాపాడుకోవాలి, అనుకునేవారు సూచీ ముఖం అనే నరకానికి వెళ్ళి, ఈ లోకములో ఉన్నప్పుడు డబ్బును ఎవరికీ దొరకకుండా దాచడానికి బొంతలలో వేసి కుట్టారు కనుక, వారి ఒళ్ళంతా సూది దారాలతోట్బట్టకుట్టేవారిలా (వాయకా ) కుడతారు.

ఏవంవిధా నరకా యమాలయే సన్తి శతశః సహస్రశస్తేషు సర్వేషు చ సర్వ ఏవాధర్మవర్తినో యే
కేచిదిహోదితా అనుదితాశ్చావనిపతే పర్యాయేణ విశన్తి తథైవ ధర్మానువర్తిన ఇతరత్ర ఇహ తు పునర్భవే త
ఉభయశేషాభ్యాం నివిశన్తి

ఇలాంటి నరకములు యమలోకములో వందలూ వేలూ ఉన్నాయి. మనం చేసే ప్రతీ తప్పుకూ ఒక శిక్ష ఉంటుంది. అన్ని రకముల పాపములతో అధర్మముగా ఉండేవారు పుట్టినవారు పుట్టని వారు పుట్టబోయే వారు చేసిన చేస్తున్న చేయబోయే పాపాలకూ నరకాలు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఒక్కసారే పుట్టరు. పుట్టినవారు చేస్తూ ఉంటారు, పుట్టబోయే వారు చేయబోతారు. అధర్మం చేసిన వారు ఎంతోకొంతైనా ధర్మం చేస్తారు. అలాంటి వారు పుణ్యాన్ని అనుభవించి, పుణ్యం కొంచెం మిగిలాక నరకానికి వచ్చి, అవి అనుభవించి మళ్ళీ పుడతారు. ఎలాంటి పాపం చేసిన వారు మళ్ళీ పుట్టినప్పుడు ఎలాంటి పుట్టుక పుడతారో, అలాంటి పాపం చేసిన వారు ఎలాంటి పనులు చేస్తారో ముందే వారికి తెలుసు కాబట్టి వారి కొరకు నరకములు సిద్ధముగా ఉంటాయి. మళ్ళి పుట్టడములో పాపం మిగిలి ఉండగా పుడతారు. కొందరు పుణ్యము కొద్దిగా మిగిలి ఉండగా పుడతారు.

నివృత్తిలక్షణమార్గ ఆదావేవ వ్యాఖ్యాతః ఏతావానేవాణ్డకోశో యశ్చతుర్దశధా పురాణేషు వికల్పిత
ఉపగీయతే యత్తద్భగవతో నారాయణస్య సాక్షాన్మహాపురుషస్య స్థవిష్ఠం రూపమాత్మమాయా
గుణమయమనువర్ణితమాదృతః పఠతి శృణోతి శ్రావయతి స ఉపగేయం భగవతః పరమాత్మనోऽగ్రాహ్యమపి
శ్రద్ధాభక్తివిశుద్ధబుద్ధిర్వేద

ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. త్యాగం యాగం విరక్తీ ఉండాలి. ఇదంతా బ్రహ్మాండ కోశం. ఇదే పధ్నాలుగు లోకాలుగా వివరించబడింది. ఇది పరమాత్మ శ్రీమన్నారాయణుని స్థూల రూపమే. ఇది ఆత్మ మాయా గుణమయం. పరమాత్మ మాయా (ప్రకృతి )గుణములతో ఉన్నదానిని శ్రద్ధతో ఆదరముతో చదివే వాడూ వినేవాడూ వినిపించేవాడూ, అలాంటివాడు ఆయా వేద పురాణ శాస్త్రములలో పరమాత్మ యొక్క ఏ ఏ రూపాలను వర్ణించారో అవి మన బుద్ధికి అందనివైనా దీన్ని చదివి వినిపించడం వలన పరమాత్మ రూపాన్ని అర్థం చేసుకుంటాడు. ఇవి విని వినిపిస్తే పరమాత్మ గుణము యందు శ్రద్ధా భక్తులు కలిగి బుద్ధి పరిశుద్ధమై పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడు.

శ్రుత్వా స్థూలం తథా సూక్ష్మం రూపం భగవతో యతిః
స్థూలే నిర్జితమాత్మానం శనైః సూక్ష్మం ధియా నయేదితి

మన బుద్ధిని పరమాత్మ యందు ఉంచాలంటే పరమాత్మ యొక్క స్థూల రూపములో బుద్ధిని ఉంచడం అభ్యాసం చేసుకోవాలి. అప్పుడు పరమాత్మ సూక్ష్మ రూపములో బుద్ధి నిలుస్తుంది. అప్పుడు పరమాత్మ సూక్ష్మ రూపములో బుద్ధిని నిలపాలి.

భూద్వీపవర్షసరిదద్రినభఃసముద్ర
పాతాలదిఙ్నరకభాగణలోకసంస్థా
గీతా మయా తవ నృపాద్భుతమీశ్వరస్య
స్థూలం వపుః సకలజీవనికాయధామ

భూ ద్వీప వర్షా సరస్సూ అద్రి నభ సముద్ర పాతాళ మొదలైనవి పరమాత్మ యొక్క అత్యద్భుతమైన స్థూల రూపం. సకల ప్రాణులకూ ఇదే నివాసం, దీన్ని జాగ్రత్తగా నెమరు వేస్తే పరమాత్మ కృపకు పాత్రులవుతాము.

Saturday, March 30, 2013

భూగోళము యొక్క సంక్షేప వర్ణనం

భూగోళము యొక్క సంక్షేప వర్ణనం

జంబూ  ద్వీపములో నవ వర్షాలు. తొమ్మిది వేల యోజనాల వెడల్పు ఒక్కొక్కటీ. మొత్తం ఈ ద్వీపములో మర్యాదా గిరులు (హద్దులు) ఉన్నాయి. గుండ్రముగా ఉన్న భూమిలో నిలువుగా ఒక గీతా అడ్డముగా ఒక గీతా గీస్తే ఆ మధ్య నుండే దానిలో ఇలావృతమనే వర్షముంది. అది నాభి యందు ఉంది, అక్కడ ఉన్న పర్వతం పేరు మేరువు. అది
బంగారములా మెరుస్తూ ఉంటుంది. అది ముప్పై రెండు వేల యోజనాలు వెడల్పు. మొదలు పదహారు వేలు భూమిలోకి పదహారు వేలు. ఇలా వృతమనేది మధ్యలో ఉంది. దానికి ఉత్తరముగా (అంటే మీదకి) మూడు ఉన్నాయి నీలా శ్వేత శృంగవాన్ అని మూడు కొండలు. అక్కడ రమ్యక హిరణ్మయ కురు అనే మూడు వర్షాలు ఇలావృత వర్షం మీద ఉన్నాయి. దానికి ఈ పక్కా ఆ పక్కా ఉప్పు సముద్రం. అది ఒక్కో దానికంటే రెండవది రెండు
వేల యోజనాల ఎక్కువ ఉంటుంది. ఇంక కిందకు వస్తే నిషధం హేమకూటం హిమాలయం అంటే మూడు పర్వతాలు. మధ్యభాగానికి దక్షిణం వైపు ఉంది. అక్కడ హరి వర్షమూ కింపురుష వర్షమూ భారత వర్షమూ ఉన్నాయి. మొదట ఇలా వృతానికి దగ్గరగా ఉన్నది హరి వర్షం, దానికింద కింపురుష, దాని కింద భారత. ఇలా వృత వర్షానికి పడమట వైపు మాల్యవత్ అనే పర్వతం తూర్పు వైపు గంధమాధనమనే పర్వతం ఉన్నాయి. అక్కడ కేతు మాల భద్రాశ్వమనే వర్షం ఉన్నాయి. ఇవి మొత్తం తొమ్మిది వర్షముల యొక్క సంస్థానం. వీటిలో మందరమూ మేరు మందరమూ సుపార్శ్వమూ కుముదమూ అని మధ్యలో ఉన్న మేరుపర్వతానికి దగ్గరలో దాని అంత ఎత్తుకాకుండా దానికి కాపలాగా అన్నట్లుగా ఈ నాలుగు పర్వతాలూ ఉన్నాయి. తామర మధ్య చుట్టూ ఉన్న రేకులలాగ. ఈ నాలుగు పర్వతాల మీదా నాలుగు చెట్లున్నాయి మామిడీ నేరేడు కదంబ మర్రి చెట్లు. ఈ పర్వతాలు కొన్ని వేల యోజనాల ఎత్తు ఉన్నాయి, ఎన్నో శాఖలు కలిగి ఉన్నాయి, విశాలమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మంచి నీళ్ళ సరస్సు ఒకటి తేనే సరస్సు ఒకటి చెరుకు సరస్సు పాల సరస్సూ ఉన్నాయి. అక్కడ దేవతల ఉద్యానాలు ఉన్నాయి - నందనం చైత్రథం వైభ్రాజకం సర్వతోభద్రమని. అక్కడి దేవతలందరూ వారి వారి భార్యలతో కలిసి వచ్చి విహరిస్తూ ఉంటారు.

ఈ మందర పర్వతం మీద కొండంత మామిడి పళ్ళు పండుతాయి. అవి రాలి కిందపడి వాటి రసం పారుతూ ఉంటుంది. అదే అరుణోదా అనే నది మందర గిరి శిఖరం నుండి ఇలావృత వర్షమునకు వస్తుంది ఆ నది. దానిని చుట్టుపక్కలా ఉండే యక్షులు అనుభ్వైస్తూ ఉంటారు. మరొక పర్వతం (దక్షిణ భాగం మీద ఉన్న కొండమీద) జంబూ అనే నేరేడు చెట్టు చాలా ఎత్తుగా ఉండి ఏనుగంత నేరేడు పళ్ళు కిందపడి వాటి రసం పారి, మేరు మందర శిఖరం కంటే ఎత్తైన దానినుండి ఇలావృతానికి దక్షిణముగా పారుతోంది. ఈ రెండు వైపులా ఉన్న మట్టి ఈ నేరేడు పళ్ళు రసములు తగలడం వలన బంగారములా మెరుస్తూ ఉంటుంది. మెరవడం చేతనూ ఆ మట్టి చేతనే బంగారం రావడం చేతనూ దానికి జాంబూనదం అని పేరు పెట్టారు. ఆ జంబూ నది ఒడ్డులో బంగారం పండుతుంది.

మహా కదంబనే మర్రి చేట్టు సుపార్శ్వమనే పర్వతం మీద ఉంది, దానిలోంచి ఐదు మంచి మధు ధారలు ప్రవహిస్తూ ఉండి ఇలా వృతాన్ని సుగంధబరితము చేస్తూ ఉంటాయి. కుముదమునండు శత్వల్మమని ఒక మర్రి చేట్టు ఉంది. దాని నుంచి కిందకి, ఇలావృతానికి ఉత్తరముగా ఒక నది పారుతూ ఉంటుంది. ఇలా మేరువూ, నాలుగు పర్వతాలూ, నాలుగు పర్వతాల మీద నాలుగు చెట్లూ, వాటి నుంచి వచ్చిన నాలుగు నదులు.
ఈ మేరువుకు తూర్పు వైపున జఠరమూ దేవకూపమనే రెండు పర్వతాలున్నాయి. అవి పద్దెనిమిద్వేల యోజనాలు దూరముగా ఉండి ఎత్తుగా ఉంటాయి, మేరువు పర్వతానికి తూర్పు వైపున పవనా పారివాత్రమని రెండు పర్వతాలున్నాయి. ఇలా చుట్టూ ఎనిమిది.
 మొదట నాలుగు కొండలూ, తరువాత ఒక్కో దానికీ రెండేసి కొండలూ. ఇది మొత్తం రేకులు గల పూవులా ఉంటుంది.
మేరు పర్వత శిఖరం మీద బ్రహంగారి పట్టణముంది. ఆ పట్టణం కొన్ని వేల యోజనాల పొడవు, సమ చతురస్రముగా ఉంటుంది. దానికి చుట్టూ లోకపాలకు ఎనమండుగురూ పట్టణాలలో ఉన్నారు. శ్రీమహావిష్ణువు వామనుడుగా వచ్చి కొలిచినప్పుడు, ఆయన ఎడమపాదం పైకి చాస్తే ఆయన బొటన వేలు పైకి వెళ్ళి ఆ మీద భాగానికి తగిలితే, అది చిట్లితే దానిలో ఉన్న జలం లోపలికి వస్తే, ఆ జలం ఆకాశం మీద నుండి కిందకి పడ్డాయి గనుక, ఆ వచ్చిన నదికి విష్ణు పది అని పేరు, ఆకాశానికి విష్ణు పాదం అని పేరు.
అక్కడే మన వంశమునకు మూల పురుషుడైన ద్రువుడు భక్తియోగముతో చాలా కాలం ఎప్పుడు  పరమాత్మను ధ్యానం చేస్తూ ఉంటాడు. అందుకే చివరలను ద్రువాలంటారు (ఉత్తరద్రువం దక్షిణ ద్రువం), మీదకు మేరువని పేరు.ద్రువుని కింద సప్తర్షులుంటారు. ఆ సప్తర్షులు ఆయనను సేవిస్తూ జటాజూటములతో మోక్షమునందు ఇచ్చ కలవారి ఉంటారు. అనేక సహస్ర కోటి విమానాలతో దేవతలు చంద్రమండలాన్ని ఆవరించి బ్రహ్మలోకములో ఉంటారు. ఆకాశములోంచి వచ్చిన ఈ నది నాలుగు రకముల నీరు నిండగా, సీతా, అలకనందా, చక్షు, భద్రా అని నాలుగు నదులుగా పారింది. సీత అనే నది బ్రహ్మలోకం నుండి కేసరాచలమ  అనే బంగారు శిఖరం నుండి, కిందకి పారుతూ గంధమాధనమనే పర్వత శిఖరం మీద పడి భద్రాశ్వమనే తూర్పు నుంచి ఉప్పు సముద్రములో కలుస్తుంది. అలాగే మాల్యవత్ అనే పర్వత శిఖరం మీద నుండి పడి, ఏమాత్రం వేగం తగ్గకుండా,
వడిగా, కేతుమాలమనే వర్షానికి, చక్షు అనే రెండవ నది పడమటి దిక్కుగా ప్రవహించి సముద్రములో కలుస్తుంది. భద్రా అనే నది మేరు శిఖరం నుండి కిందకు పడి ఉత్తర శిఖరమునుండి పడి కురుదేశమును ఆక్రమించి సముద్రములో కలుస్తుంది.
అలకనందా అనే నది, ఈ మేరువు యొక్క పైభాగం (దక్షిణం) వైపు వచ్చి బ్రహ్మ సదనం అనే బదరికాశ్రమం కొండలన్నీ దాటి హిమాలయ శిఖరం నుంచి భారత వర్షమునకు వచ్చి దక్షిణం వైపు సముద్రములో కలుస్తోంది.
ఎన్నో నదులూ నదములూ ఉన్నాయి గానీ మిగిలిన క్షేత్రములేవీ కర్మ క్షేత్రములు కావు. అక్కడ భగవంతుని ఆరాధించడానికి యజ్ఞ్యము లాంటి ఉండవు. భారత దేశం మాత్రం కర్మ క్షేత్రం. మిగిలినవి భోగ భూములు.
మనుష్యులకు వయస్సు చాలా ఎక్కువ ఉండేది. త్రేతా యుగములో సమానమైన కాలం జరుగుతూ ఉండేది. ఈ తొమ్మిది వర్షాలలో కూడా శ్రీమన్నారాయణుడు అధిదైవముగా ఉంటాడు. ఇలావృతమనే వర్షములో పరమ శివుడు దేవత. ఆయన ఒక్కడే అక్కడ మగవాడు.
అక్కడ ఎవరు వెళ్ళిన పార్వతి శాపం వలన ఆడవారిగా మారుతారు. అక్కడ భవాని(పార్వతి) పరిపాలకురాలు. అక్కడ తామస మూర్తి అయిన సంకర్షణ మూర్తి  ఉంటాడు. తన శక్తితో దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇలావృత వర్షమువారు ఆయనను కీరిస్తారు.
"ప్రళయమునకు అధిష్ఠాన దేవత అయిన ఆదిశేషుడు, రుద్రుడు. తనను సేవించిన వారి శరణు ఇచ్చే పాదపదములు కలవాడు, సంసారములో ఉన్న వారికి మోక్షం ఇచ్చేవాడు. సమస్తలోకముల పుట్టుకా నిలకడా అంతమూ చేసే వాడు, తనకు అవి లేని వాడు ఆయన. "భద్రాశ్వ వర్షము పడమటి వైపు ఉంది, అక్కడ హయగ్రీవ మూర్తి అధిదైవత. "ఓం నమో భగవతే ధర్మాయాత్మవిశోధనాయ నమ ఇతి" అని ధ్యానం చేస్తారు. ఏమి ఆశ్చర్య కరమైనవి ఆయన చేష్టలు. ఆయనే సృష్టిస్తాడూ దహిస్తాడు.
హరి వర్షములో నరహరి ఉంటాడు. ఇక్కడ మహాభాగవతుడైన ప్రహ్లాదుడుంటాడు. "ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్ష్రౌమ్"  ఈ మంత్రముతో ఆరాధిస్తూ ఉంటాడు. నరసింహ మూర్తిని ఉపాసన చేసే మంత్రం. లోకానికి మేలు కలుగుగాకా, నీచుల మీద మాకు కోపం రాకుండుగాక, అందరు
ఒకరికి ఒకరు మంచి కలగాలని కోరుకొను గాక, మా మనసు ఎప్పుడు భగవత్ తత్వాన్ని సేవించు గాక. ఇంద్రియములను గోచరం కానీ సర్వత్ర వ్యాపించి ఉన్న భగవంతుని యందు మా మనసు నిలుచు గాక. ఇల్లూ వాకలీ పిల్లలూ డబ్బూ ఇవే బతుకు అన్న స్థితి  రాకుండుగాక. భగవత్ భక్తుల సేవకే ఇవన్నీ ఉపయోగపడాలి. ఎవరికైతే భగవంతుని యందు ప్రీతి కలుగుతుందో అక్కడకు అందరు దేవతలూ వచ్చి అన్ని గుణాలతో వచ్చి
కూర్చుంటారు. ఆ భక్తి లేకపోతే అవేవీ రావు. మంచి గుణములు కావాలంటే "లోపలకు" వెళ్ళాలి. శరీరమున్న మనందరకూ లోపల వ్యాపించి ఆ భగవానుడు ఉన్నాడు. చేపకు నీరు ఎంత అవసరమో మనకు భగవంతుడు అంత అవసరం. ఆయనను విడిచిఎట్టేసి, ఇల్లూ, భార్యా అని అంటున్నాము. గొప్పతనం కలవారి యందు (భగవానుని యందు) మనసు లగ్నం కాలేదు. దాని వలన గొప్పతనం రాదు, ముసలితనం వస్తుంది. మనసు దాని మీద ఉంచకు.
ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం దుఃఖం పగా అహంకారం అన్నీ కావాలనిపించడం, భయం, యాచించడం, మనో బాధలూ, వీటన్నిటికీ ఇల్లు భార్య మీద మనసు పెట్టుకోవడం కారణం. ఇది పోవాలంటే ఆ నృసింహావతారాన్ని సేవించాలి.
కేతుమాలములో భగవానుడు ప్రద్యుమ్నుడుగా ఉంటాడు. కాముడంటే మన్మధుడు, ఆయనే ప్రద్యుమ్నుడు. ఆ వర్షములో ఉండేవారికి ఆనందం కలిగిస్తూ ఉంటాడు. గర్భములో ఉండే పిల్లలు సంవత్స్రం ఉంటారు అక్కడ. అక్కడ భగవంతుని మాయా మయమైన రూపాన్ని లక్ష్మీ దేవి రాత్రి వేల కుమార్తెలతో పగటి వేల భర్తలఓ కలిసి సేవిస్తూ ఉంటుంది.
"ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ
సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం
చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ
సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్"
ఓం అనగా నేను భగవానునికే చెందిన వాడను. ఇతరుల కొరకు కాదు. మాలో ఉండే ఇంద్రియాలను ప్రేరణ చేసేవాడివి. సర్వ గుణాలతో కూడిన సమస్త పదార్థాలతో గుర్తింపబడే రూపం కలవాడివి నీవు. అకూతి (చేసే పనులు) చిత్తీ (జ్ఞ్యానం) చేతస్సు (సంకల్పం అధ్యవసాయం) విశేషాణాం (భూమి) వీటికి నీవే ఆధారం నీవే. షోడశకలాయ - జ్ఞ్యాన కర్మ పంచభూతాలకు మనసుకూ అధిపతి. సమస్తలోకాలనూ నిలిపేవాడు. మనం తినే అన్నమే మనను తింటుంది. అన్నమయుడు, అమృతమయుడు (ఈలోకములో పరలోకములో భోగం ఇచ్చేవాడు) సహః అంటే మనసులో దార్ధ్యం. ఓజస్సు అంటే ఇంద్రియ బలం. బలమంటే శరీర బలం. కాంతాయ - చూస్తే ప్రేమించాలనిపిస్తుంది. కామాయ - ప్రీతి కలుగుతోందంటే ఆయన ఉండబట్టి కలుగుతోంది. భర్తగా ఆయనను పొందాలని, మిగతావారిని సేవించరు. లోపల ఉన్న వాడొక్కడే భర్త. ఎవ్వరి వలనా ఎప్పుడూ భయం పొందని వాడు భర్త. ఎక్కడ భయం ఉన్నా భయం లేకుండా కాపాడతాడు.  అటువంటి నీవు మాకు కూడా భక్తుల శిరసు మీద ఉంచిన హస్తముంచి కాపాడు
రమ్యక వర్షములో మత్స్య మూర్తిని ఆరాధిస్తాడు. "ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్త్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి" అని ఆరాధిస్తారు. హిరణ్మయ ద్వీపములో స్వామి తాబేలు రూపములో ఉంటాడు. అర్యముడు (పితృగణాధిపతి) సేవిస్తాడు. సంసారమును దాటించేవాడు. అనేక గుణములు గలవాడు. సముద్రములో మందర పర్వతం అడుగున ఉన్నాడు గానీ ఎవరికీ కనపడడు. మన శరీరములో శరీరం అడుగున, నాభికి అడుగున, కూర్మాకార నాడీ మండలములో భగవంతుడు ఉంటారు. అందుకే దేవాలయములో తాబేలు ఉంటుంది. ఏ రూపమూ లేని వాడు.
కురు వర్షము ఉత్తర దేశములో వరాహ స్వామి ఉంటాడు. ఆయనను భూదేవి సేవిస్తూ ఉంటుంది. "ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్త్వగుణవిశేషణాయానుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమోऽవస్థానాయ నమస్తే". ఆయన శరీరమంతా యజ్ఞ్యమే. అగ్ని కర్రలలో దాగి ఉంటుంది. అలాగే నీవు కూడా మాలో ఉన్నావు. కర్రలోంచి అగ్ని తీసినట్లుగా మనస్సనే కవ్వముతో మధిస్తే వెలిక్కి వస్తావు.  మనం చేసే సర్వ వ్యాపారాలను ఆయనకు అర్పిస్తే ఆయన వెలికి వస్తాడు. సముద్రములో మునిగి ఉన్న నన్ను విలాసముగా నీ కోర చివరపై ఉంచి వెలికి  తీసావు.
కింపురుష వర్షములో రామచంద్రుడు అధి దైవం. లక్ష్మణాగ్రజుడైన సీతారామున్ని పాదముల దగ్గర హనుమ నిలుబడి ఉండగా కింపురుషులు సేవిస్తారు. ఉత్తమ నడువడి కలవాడు, పెద్దలు చెప్పిన ప్రకారముగా శాస్త్రము చెప్పిన ప్రకారముగా నడిచే మనస్తత్వం కలవాడు, రాజ్యాన్ని ఉపాసించిన వాడు (ఆయన రాజ్యాన్ని ఆరాధించాడు), లోకములో మంచితనానికి గీటురాయి, వేదమే శరణ్యమని నమ్మే వారికి దేవుడు, పురుషులలో మహాపురుషుడు, రాజులలో మహారాజు, ఆయన రాజాధిరాజు. కేవల సత్వ రజస్ తమో గుణాలకు అతీతమైన, ఊర్ములు లేని, క్లేశములు లేని వానినీ, అహంకారం లేని స్వామిని, మర్త్య రూపములో దిగి వచ్చిన స్వామి, జగత్ ప్రభువైన నీవు సీతమ్మ కోసం బాధపడ్డావు. నీ జన్మ నిజము కాదు. మా మాటలకందేది కాదు. ఎవరూ నిన్ను తెలుసుకోలేడు. అందరినీ నీవు వైకుంఠానికి తీసుకుని వెళ్ళావు. చిన్న గడ్డీ చీమా కూడా పరంపదానికి వెళ్ళావు.
భారత వర్షములో నర నారాయణులు ప్రధానం. అందుకే నారాయణ నారాయణ అంటూ ఉంటాము. భార్త దేశములో ఉండే దైవం నర నారాయణులు. స్వామి బదరికాశ్రమములో తపస్సు చేస్తున్నాడు. నారదుల వారు నర నారాయణున్ని సేవిస్తూ ఉంటారు. సాంఖ్య యోగముతో సేవిస్తూ ఉంటారు. ఉపశం లీలాయ - కోరికలన్నీ ఉపశమిస్తాయి. సన్యసించిన వారు అస్తమానం నారాయణా అంటూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే ఉవ్వెత్తున లేచే కోరికలు తగ్గుతాయి. దిక్కులేని వారికి దిక్కు ఆయన. డబ్బులేని వారికి డబ్బు ఆయన. అకించన విత్తం. ఉపాయం లేని వారికి నారయణ మంత్రమే ఉపాయం. సమస్తమైన నిత్య పదార్థములలోపల ఉండువాడు, వాటిని ఆధారముగా చేసుకుని ఉండేవాడు. లోపలా వెలుపలా వ్యాపించి ఉంటాడు. సన్యాసులకు గురువు ఆయన. ఆత్మారాములకు అధిపతి. ఈ లోకములో పైలోకములో వస్తువుల మీద కోరికతో ఉండి వాటి గురించి ఆలోచిస్తూ ఉండి, "ఎప్పుడు చచ్చిపోతామో" అన్న భయముతో కష్టపడుతూ ఉంటాము. అన్నిటిలో ఉన్న నారాయణున్ని తెలుసుకోకుంటే శ్రమంతా వ్యర్థం కదా. నీ అనుగ్రహం చేత ఇంతకాలం మాలో ఉన్న అహంకారం చేదించబడు గాక.
భారత వర్షములో అనేక నదులూ పర్వతాలూ ఉన్నాయి. మలయమూ గంధమాధనం త్రికూటము మైనాకం శ్రీశైలమూ వేంకటాచలమూ గోవర్ధనమూ, మొదలైన పర్వతాలున్నాయి. ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి గోదావరీ నర్మదా కృష్ణా, త్రిసామ సరస్వతి చంద్రభాగ మొదలైన ఎన్నో నదులు ఉన్నాయి. ఈ భారత వర్షములో ఎవరు జన్మిస్తారో వారు అదృష్టవంతులు. అన్నింటిలో వ్యాపించి ఉన్నవాడు నారాయణుడని తెలుసుకున్నవారు వారిలో ఉన్న అవిద్యా గ్రంధిని చేదిస్తారు. భారత దేశములో పుట్టిన వారెంత అదృష్టవంతులు. ఎక్కడకు వెళ్ళినా భగవంతుడు జ్ఞ్యాపకం వస్తారో. శ్రమపడే క్రతువులూ నోములూ దానాలు అక్కర్లేదు. నారాయణ పాద పంకజ ధ్యానం చాలు. కల్ప కాలం బతికి ఎన్నో ఉత్తమమైన స్థానాలు పొందిన వారు కన్నా క్షణ కాలం ఆయుష్షు ఉన్నా భారత భూమిలో పుట్టాలి. ఒక్కసారి "నాదేమి కాదు తండ్రీ" అని తరించగలం. ఎక్కడ శ్రీమన్నారాయణుని కథా ప్రసంగం ఉండదో, ఎక్కడ భగవత్ భక్తులు ఉండరో, ఎక్కడ నారాయణున్ని ఆరాధించే యజ్ఞ్యములు చేయరో, అది ఆదరించే స్థలం కాదు. ఎవరైతే అన్నీ నారాయణునికి అన్నీ అర్పిస్తారో వారికి మరలా జనం ఉండదు. కోరితే ఇచ్చే వాడైన నారాయణుడు, మళ్ళీ మనం ఎవరినీ యాచించనవసరం లేకుండా చేస్తాడు. మళ్ళీ మనం యాచకులం కాకుండా చేస్తాడు. కోరికలు పుట్టే మనసులో కోరికల ఊట ఊరకుండా ఉండటానికి ఆయన తన వేలితో అడ్డు వేస్తాడు. అటువంటిది మన భారతదేశము. అందులో జన్మ కలిగి మేము స్వామిని సేవించగాక.

ఈ జంబూ ద్వీపం ఎంత వెడల్పూ పొడువూ ఉన్నదో అంత వెడల్పూ పొడవూ గల ఉప్పు సముద్రం ఉన్నది. మేరూ పర్వతం మధ్యలో ఉంది, దాని చుట్టు జంబూ ద్వీపమనే ప్రదేశం, దాని చుట్టూ ఉప్పు సముద్రం. ఆ ఉప్పుసముద్రం ఎంత ఉన్నదో అంత పొడుగూ అంత వెడల్పూ గల ప్లక్ష్య ద్వీపం ఉంది. దీనికి అది అగడ్తలా ఉంది. సముద్రమునకు అవతల ప్లక్ష్య ద్వీపం. ప్లక్ష్య ద్వీపం బంగారు కాంతితో ఉంటుంది. అక్కడ అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియవ్రతుని కుమారుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయనకు ఏడుగురు కుమారుడు. వారికి ఏడు పేర్లు కల వర్షాలని ఇచ్చేశాడు. జంబూ ద్వీపము లాగే అక్కడా పర్వతాలూ నదులూ ఉన్నాయి. అక్కడ కూడా నాలుగు వర్ణాలు ఉంటాయి. ఇక్కడ ప్లక్ష్యమనే చెట్టు ఎక్కువ.

ప్లక్ష్యం తరువాత చెరుకు సముద్రం. దాని తరువాత శాల్మల ద్వీపం. శాల్మలీ (బూరుగు) అని ఒక చెట్టు ఉంది. అక్కడా ఏడు ద్వీపాలూ, నదులూ పర్వతాలూ ఉన్నాయి.
ఇది దాటాక్ కలూతో చేసిన సముద్ర. తరువాత నేతితో నిండిన సముద్రం. దాని తరువాత కుశ ద్వీపం. ఇక్కడ దర్బలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా ప్రియవ్రతుని ఒక కుమారుడు తన ఏడుగురు కుమారులకూ ఏడు ద్వీపాలుగా ఇచ్చాడు.
దీనికవతల క్రౌంచ ద్వీపం, దానికవతల పాల సముద్రం. అక్కడ వరుణున్ని ఆరాధిస్తారు. అక్కడ కూడా ప్రియవ్రతుని  ఒక కుమారుడు, తన ఏడుగురు కుమారులకూ ఇచ్చాడు. పాల సముద్రానికి అవతల శాఖ సముద్రం ఉంది. తరువాత పెరుగు మీద ఉండే తేట లాంటి సముద్రం. ఇక్కడ శాఖమనే కూర పెరుగుతుంది, కాబట్టి దానికి శాఖమని పేరు.
తరువాత పెరుగు మీద నిండిన తేటతో సముద్రం. తరువాత పుష్కర సముద్రం. తరువాత మంచినీటి సముద్రం. అక్కడ మానసోత్తర పర్వతం ఉంది. దాని తరువాత ఏముందో ఎవరికీ తెలియదు. నాలుగు దిక్కులా నాలుగు పట్టణాలున్నాయి. ఇంద్రుడు వరుణునికి కుబేరునికి యమునికి. పర్వతాక్నికి చివర సూర్యుని రథం తిరుగుతూ ఉంటుంది.
మేరువూ మానస పర్వతం, రెండూ చక్రం తిరగడానికి ఇరుసులాగ పని చేస్తాయి. దాని మీద సూర్యుడు తిరుగుతాడు. సూర్యుని కదలిక మీద మనకు రాత్రీ పగలూ ఉంటుంది. ఆ వర్షములో ఉండేవారు కేవలం బ్రహ్మ రూపి అయిన స్వామిని కర్మలతో ఆరాధిస్తూ ఉంటారు. మనలోపల ఉన్న భగవంతుని పని చేసి మనం ఆయనను సేవించాలి.
లోకాలోకమని ఒక కొండ. ఇవతలి వైపు వెలుగూ, అవతల వైపు చీకటి ఉంటుంది. దానికి అవతల హద్దు మేరువు, ఇవతల హద్దు మానసోత్తర పర్వతం. ఇక్కడునుంచి అక్కడి దాకా ఉన్నదే మనకు తెలిసిన భూమి. దీని తరువాత బంగారు రంగుతో కాంచన భూమి, దాని పైన అద్దములా ప్రకాశిస్తూ ఉండేది ఒకటి ఉంటుంది. అక్కడ పడినదేదీ కనపడదు, పడిన వస్తువు వెనక్కు రాదు. మేరువు నుంచీ మానసోత్తరం వరకూ ఉన్న భూమి కోటీ యాభై ఏడున్నర లక్షల యోజనాలు. ఎనిమిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల జాగా ఉంది. ఆపైన అద్దములా మెరిసేది కూడా అంతే వైశాల్యం గలది. ఈ మూడింటికీ అవతలకు వెళితే అక్కడ జ్యోతిర్మండలాలు ఉంటాయి. మెరిసే గ్రహాలు.

అక్కడ లోకాలను కాపాడే ఇంద్ర వరుణ యమ కుబేరులు ఉన్నారు. భగవానుడు తన యోగ మాయతో వీటిని సృష్టించి తన పరివారముతో కాపాడుతున్నాడు. ఈ విధముగా గుండ్రముగా ఉండే ఈ వలయములో తొమ్మిది వర్షములూ, వీటిలో ద్వీపములతో సముద్రాలతో కూడి ఉన్నది, మొత్తం యాభై కోట్ల యోజనాలు. దీని నంతటినీ అండమంటారు. ఇరవై ఐదు కోట్ల యోజనాలొక పక్కా, ఇరవై ఐదు కోట్ల యోజనాలొక పక్కా ఉంటాయి. దీనిని అండమంటారు. సూర్యుడు దీని మధ్యన  ఉంటాడు. ఈ చివరా ఆచివరా ఉందేవి ద్రువాలు. మేరువూ మనసోత్తరములూ. ఈ రెంటి ఇరుసు మీదా తిరుగుతూ ఉంటుంది. యాభైకోట్లలో ఈ పక్క ఇరవై ఐదూఉ ఈ పక్క ఇరవై ఐదు కోట్లు వస్తుంది.

దీనికి పైనున్నవి స్వర్గమూ మోక్షములూ. కింద ఉండేవి పాతాళాది లోకాలు. సర్వ జీవులకూ సూర్యుడే ఆత్మ.

అంతరిక్షము యొక్క సంక్షేప వర్ణనం

అంతరిక్షము యొక్క సంక్షేప వర్ణనం

భూమికి పైనా కిందా ఉండే లోకాల మధ్య ఉన్నదానిని అంతరిక్షం అంటారు. భూః భువః సువః లోకాలని ప్రకాశిస్తూ ఉంటాడు. సూర్యుడు తిరుగుతూ ఉండడములోనే ఉత్తరాయాణ దక్షిణం విశువత్ (రాత్రి పగల్లు సమానముగా ఉండటం). చుట్టూ ఉండే వాటిని పన్నెండు భాగాలుగా విడదీసి పన్నెండు రాశులుగా చేసి. మేషములో సూర్యుడు ప్రవేశించి మకరములోకి రావడానికి మధ్యలో తులలోకి వస్తాడు. అలా తులలోకి వచ్చినపుడు రాత్రి పగల్లు సమానముగా ఉంటాడు. మేషమునుంచి సూర్యుడు మిథునము ... కన్యా రాశిలోకి వచ్చేసరికి రాత్రి తరుగుతుంది. తులనుంచి వృశ్చుకములో ప్రవేశించేసరికి దక్షిణాయనం, రాత్రి ఎక్కువ ఉంటుంది.
మానసోత్తరపర్వతము తూర్పు వైపు ఇంద్రుని పట్టణం రాజధాని, దక్షిణం వైపు యముడు, ఉత్తరం వైపు కుబేరుడు పడమర వైపు వరుణుడు. సూర్య ప్రవృత్తి బట్టి ఉదయం మధ్యాన్నం రాత్రీ అంటున్నము. ఎక్కడ బయటకు సూర్యుడు కనిపిస్తాడో, అక్కడ ఒక తాడు పెట్టి కొలిస్తే, అవతలి వైపు ఉండే చోట సూర్యుడు అస్తమిస్తాడు. ఏక రేఖ మీద ఉదయాస్తమాలు జరుగుతాయి. పదిహేను ఘడియలకొక ఝాము. పడమటికి వెళ్ళినపుడు సూర్యుడు కనపడకుండా పోతాడు. ఈ చుట్టూ ఉన్న గ్రహమండలం ముప్పైనాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు తిరుగుతుంది.
ఈ సూర్యుని రథమే కాల చక్రం, ఏడు గుఱ్ఱాలు. దానికి పన్నెండు అరలు (రేకులు) ఉన్నాయి. పన్నెండు మాసాలు. ఆరు నేములున్నాయి. ఆరు ఋతువులు. మూడు నాభులు (వేసవి వర్ష శీతా కాలాలు) సూర్యుడు నడిచే యంత్రము ఎప్పుడూ ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు నడుస్తూ ఉంటే అరుణుడు (అందుకే సూర్యుడు ఉదయించినా అస్తమించినా ఎర్రదనం వస్తుంది) వాలఖిల్యులు సూర్య సూక్తాన్ని చదువుతూ ఉంటారు. దేవతలూ యక్షులూ నాగులూ గుంపులుగా ఉండి సూర్యుని ఉపాసన చేస్తూ ఉంటారు. సూర్యునికి మేరువూ ద్రువునికీ ప్రదక్షిణం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. రాశులు వాటికి వ్యతిరేక దిశలో అప్రదక్షిణముగా తిరుగుతూ ఉంటాయి. కుడి నుంచి ఎడమకొస్తాయి.
చక్రముతోబాటే అక్కడ ఉన్న గ్రహములు తిరుగుతూ ఉంటాయి. కుమ్మరి కుండ మీద ఈగ వాలితే కుండతో బాటు తిరుగుతూ ఉంటాయి.
పౌర్ణమి నాడు చంద్రుడు చిత్తా నక్షత్రములో ఉంటే చైత్రం. విశాఖ నక్షత్రములో పూర్ణిమనాడు ఉంటే- వైశాఖ, జ్యేష్ట - జ్యేష్ఠా, ఉత్తరా/పూర్వాషాడ నక్షత్రం - ఆషాడ మాసం, ఉత్తరా/పూర్వా భాద్ర - భాద్రపద మాసం, అశ్వినీ నక్షత్రములో పూర్ణిమ నాడు ఉంటే- ఆశ్వియుజ మాసం, కృతిక నక్షత్రములో పూర్ణిమనాడు ఉంటే - కార్తీక మాసం, మృగశీర్ష - మార్గశీర్ష, పుష్య - పుష్య, మఖ - మాఘ, ఫాల్గుణీ నక్షత్రం - పాల్గుణ మాసం.
ఒక సారి ఈ చక్రమంతా తిరిగ్తే ఒక సంవత్సరం. చద్రుని చుట్టూ తిరిగితే పరివత్సరం, బృహస్పతి చుట్టూ తిరిగ్తే ఇడావత్సరం, నక్షత్రాల చుట్టూ తిరిగితే - విద్వత్సరం.
చంద్రుడు సూర్యమండలానికి పైన ఉన్నాడు. అది లక్ష యోజనాల పైన ఉన్నది. వెన్నెల నిండిన పక్షములో దేవతలకూ వెన్నెల క్షీణించే పక్షం పితృదేవతలకు ప్రీతి. ముప్పై ముహూర్తాలు ఒక నక్షత్రం తిరుగుతుంది. దేవతలకూ పితృదేవతలకూ మనుష్యులకూ లతలకూ పక్షులకూ అన్నిటికీ పోషణాన్ని అందిస్తాడు.
చంద్రునికి చుట్టూ మూడు లక్షల యోజనాల మేర ఇరవై ఏడు నక్షత్రాలు. అభిజిత్ అనేది ఇర్వై ఎనిమిదవ నక్షత్రం. ఆకడే శుక్రుడూ, బుధుడూ ఉన్నాడు. దాని పైన కుజుడు (అంగారకుడు) బృహస్పతీ శనీ ఇలా అందరూ ఒకరికన్నా ఒకరు రెండు లక్షల యోజనాల దూరములో ఉంటారు.
పదకొండు లక్షల యోజనల పైన భగవానుని పరమపదమున్నదని అంటారు.

మేడీ స్తంభం - పశువులను కట్టే ఒక కర్ర. అలాగే ఈ మండలాలన్నీ ద్రువునికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ జ్యోతిర్మండలాలన్నీ శింశుమారమనే రూపములో ఉంటాయి. దాని తోక దగ్గర ద్రువుడు ఉంటాడు. దాని వెనక ప్రజాపతీ అగ్ని ఇంద్రుడు ధర్మ. కటి యందు సప్తర్షులు. వంగిన శరీరం దగ్గర నక్షత్రాలు.సర్వ గ్రహమండలములూ మృగాకారములో ఉన్నారు. ఇది భగవంతుని సర్వదేవతా మయమైన రూపము. మనకు వెలుగునిచ్చేవాడు ఆధారముగా ఉన్నవాడు సూర్యభగవానుడు. ఆయనకు నమస్కార్మ్ చేస్తే ఆయనలో ఉన్న నారాయణునికి నమస్కారం చేసినట్లు.

రాహువూ కేతువూ సూర్యమండలం కిందన ఉంటాడు. సూర్యుని కాంతి వ్యాపిస్తున్న తరువాత రాహువు ఉంటాడు. సూర్య చంద్ర మండలానికి కిందన రాహువు ఉంటాడు. కాని అక్కడ స్వామి చక్రం ఉండటం వలన ఎక్కువ సేపు ఉండలేడు.  ఈ వరుసలో నక్షత్ర - గ్రహ - చంద్ర - సూర్య - సిద్ధ చారణులు ఉండే లోకాలు - యక్ష రాక్షస పిశాచాలు ఉండేవి - భూమి.
అలాగే కింద ఏడు లోకాలున్నాయి. స్వర్గాది విహారాలు అనుభవించిన తరువాత మాయ చేత ఆవరించబడిన వారు భూమి కిందలోకాలలో వస్తారు. అక్కడ ఇంద్రియాలకు ఆనందం కలిగించే సన్నివేశాలూ, చెట్లూ, నదులూ ఉంటాయి.కంటికీ మనసుకీ ఉత్సవం కలిగించే కాంతులు.
అక్కడ ఒక పాము ఉంటుంది. అంతా చీకటిగా ఉన్నా, పాముల తల మీద మణుల వలన అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ దివ్య ఔషధులూ రసాయనాలు ఉంటాయి. అక్కడ రోగాలూ ముసలితనం చెమటా ఏమీ ఉండవు.
వారికి చావు అనేది ఎప్పుడొస్తుందో తెలియదు. భగవానుని చక్రం మాత్రమే వారిని వధిస్తుంది. అక్కడ వారికి భయం వలనే పురుడు వస్తుంది. అతలం అనేది మీద లోకం. అక్కడ మయుడి కొడుకు బలుడు ఉంటాడు. అతడు మాయను సృష్టించాడు. ఇంద్రజాలాలు అవి ఇక్కడనుంచి వచ్చినవే. ఒకసారి అతను ఆవలిస్తే మూడు రకాలైన అందమైన ఆడవారు వచ్చారు. వారు ముగ్గురే లోకములో విచ్చలవిడిగా తిరిగి, మగవారికంటే ఎక్కువగా తిరిగి, ఎవరిని పడితే వారిని ప్రేమించేవారు కొందరూ, తమ భర్తను విడిచి మిగతావారితో తిర్గేవారు కొందరు. ఈ మూడు జాతులూ పుట్టాయి. స్వైణ్యః కామిన్యః పుంశ్చల్యః అని. వారు ఆలోకములో బంగారం అంటే మోజు. వారు బంగారముతో పురుషులను లోభపెట్టి, వారిని గాఢాలింగనం చేసుకుని ఆనందింపచేస్తూ ఉంటారు. పురుషులు వారిని ఆనందింపచేసి మధాందుడై గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.
దాని కింద వితల లోకములో హాఠకేశ్వరుడు శివుడు ఉంటాడు. భూత గణాలతో పార్వతీ దేవితో ఉంటాడు. హాటకీ నది అక్కడ ఉంటుంది. అక్కడ చిత్రభానువు (అగ్ని) వాయువుతో కలిసి అక్కడ జలాన్ని పానం చేస్తూ ఉండటం వలన అది బంగారం అవుతూ ఉంటుంది.
దానికింద సుతలం అనే లోకం. అక్కడ విలోచనుని కుమారుడు బలి పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ద్వారం దగ్గర భగవానుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆ బలి చక్రవర్తి భగవంతుని యందు మనసు నిలిపి భగవంతుని నామం చెప్పుకుంటూ పాపం పోగొట్టుకుంటూ ఉంటాడు. ఇది సుతల లోకం. ఇలా ఆయన దాస్యం కావాలనే ప్రహ్లాదుడు కోరుకున్నాడు.
తరువాత తలాతల లోకములో మయుడనే రాక్షసుడు, త్రిపురాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం చేత అక్కడ ఉండేవారికి మహాసుఖాలు లభిస్తాయి
మహాతలములో ఒక శిరస్సూ అనేక శిరస్సులూ కల పాములుంటాయి. దాని అడుగున రసాతలం ఉంటుంది. అక్కడి వారు భగవంతుని ప్రేమించిన వారిని ద్వేషిస్తారు. దాని కింద పాతాళం ఉంది. అక్కడ నాగాధిపతులు ఉంటారు.
అట్టడుగున మూల దేశములో ముప్పై వేల యోజనాల దూరములో సంకర్షణుడు వేయిపడగలు కలిగి ఉంటాడు. ప్రళయం వచ్చినపుడు ఆయన పదకొండు రుద్రులను బయటకు పంపిస్తాడు. అక్కడ ఉండే నాగములన్నీ స్వామి అనంతుని పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఆయనను సేవిస్తూ ఉంటారు. లోకాలను మోస్తూ కాపాడుతూ ప్రళయములో ఉపశమిస్తూ ఉంటారు. నారదుడు ఈయనను స్తోత్రం చేస్తూ ఉంటారు.
భూః భువః సువః లోకాల మధ్యనే ఉంటాయి నరకాలు. భూమి కిందన ఉంటాయి. పితృ దేవతలకు అధిపతి యముడు ఉంటాడు. ఆయన తన లోకానికి వచ్చిన వారిని వారి వారి దోషాలకు తగిన శిక్షను అనుభవింపచేస్తూ ఉంటాడు.

Friday, March 29, 2013

శ్రీమధాగవతం పంచమ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం

శ్రీమధాగవతం పంచమ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తస్య మూలదేశే త్రింశద్యోజనసహస్రాన్తర ఆస్తే యా వై కలా భగవతస్తామసీ సమాఖ్యాతానన్త ఇతి
సాత్వతీయా ద్రష్టృదృశ్యయోః సఙ్కర్షణమహమిత్యభిమానలక్షణం యం సఙ్కర్షణమిత్యాచక్షతే

ఈ పాతాళము యొక్క మూల ప్రాంతములో ముప్పై వేల యోజనాల దూరములో పరమాత్మ యొక్క కల అయిన అనంతుడూ, సంకర్షణుడు. కల తామసీ కల అయిన ఈయన చేసేది సాత్వతీయమైన పని. భాగవతానికి పేరు సాత్వత సంహిత అని. సతతం తపస్యంతియే తే సాత్వతా. పరమాత్మ కీర్తిని వృద్ధిని పొందించేవారు సాత్వతులు. పారమార్ధిక జ్ఞ్యాన వంతులు పారమార్థిక జ్ఞ్యాన ప్రబోధికులు సాత్వతులు. అనంతుడు తామస మూర్తి అయినా ఆయన పారమార్ధిక జ్ఞ్యానన్ని ఉపదేశిస్తాడు. నారాయణుడు బ్రహ్మ ఆది శేషుడు పరాశరుడు మైత్రేయుడు ఉద్దవుడు ఇలా భాగవతాన్ని ప్రచారం చేసే వరుసలో అనంతుడు కూడా ఉన్నాడు.
 ద్రష్టృదృశ్యయోః సఙ్కర్షణమహం - సంకర్షణుడు బాగా ఆకర్షిస్తాడు. ఒక వస్తువు చూడదగినదీ చూచేవాడూ ఉన్నాడు. చూడదగినదీ అంటే చూడబడే దానికీ చూచేవాడికీ పరస్పరం ఆకర్షణ ఉన్నది. నేను దానిని ఆకర్షించుకుంటున్నానని ద్రష్ట అనుకుంటాడు. ఇలా "నేను" అనే భావం వచ్చేది ఈయన వల్లనే. సంకర్షనుని అధిష్ఠానం అహంకారం. శంకరుడు గానీ సంకర్షణుడు గానీ అభిమాన దేవత.

యస్యేదం క్షితిమణ్డలం భగవతోऽనన్తమూర్తేః సహస్రశిరస ఏకస్మిన్నేవ శీర్షణి ధ్రియమాణం
సిద్ధార్థ ఇవ లక్ష్యతే

అనంతుని వేయి శిరస్సులో ఏదో ఒక శిరస్సులో ఏదో ఒక కోణములో ఇంత పెద్ద భూమండలం ఒక ఆవగింజలా భాసిస్తుంది.

యస్య హ వా ఇదం కాలేనోపసఞ్జిహీర్షతోऽమర్షవిరచితరుచిరభ్రమద్భ్రువోరన్తరేణ సాఙ్కర్షణో
నామ రుద్ర ఏకాదశవ్యూహస్త్ర్యక్షస్త్రిశిఖం శూలముత్తమ్భయన్నుదతిష్ఠత్

ఈయనే ప్రళయ కాలములో లోకాలను సంహరించదలచిన వాడై కోపముతో భృకుటి ముడి వేస్తాడు. దాని నుంచి ఒక రుద్రుడు పుడతాడు. పద కొండు రూపాలలో పుట్టి మూడు కన్నులూ మూడు శిఖలతో త్రిశూలాన్ని తిప్పుతూ లేస్తాడు.

యస్యాఙ్ఘ్రికమలయుగలారుణవిశదనఖమణిషణ్డమణ్డలేష్వహిపతయః సహ
సాత్వతర్షభైరేకాన్తభక్తియోగేనావనమన్తః స్వవదనాని పరిస్ఫురత్కుణ్డలప్రభామణ్డితగణ్డ
స్థలాన్యతిమనోహరాణి ప్రముదితమనసః ఖలు విలోకయన్తి

ఈయన పాదపద్మముల యొక్క లేలేత ఎర్రని గోళ్ళ సమూహాన్ని ఏకాంత భక్తులు నమస్కరిస్తారు. అహిపతులందరూ కలిసి పరమాత్మ పాద స్పర్శతో కలిగిన ఆనందమును వికసించిన ముఖముతో ఎదుటి వారి ముఖాన్ని చూచుకుంటూ వారి ఆనందాన్ని చూచి ఆనందిస్తూ ఉంటారు.

యస్యైవ హి నాగరాజకుమార్య ఆశిష ఆశాసానాశ్చార్వఙ్గవలయవిలసితవిశదవిపులధవల
సుభగరుచిరభుజరజతస్తమ్భేష్వగురుచన్దనకుఙ్కుమపఙ్కానులేపేనావలిమ్పమానాస్తద్
అభిమర్శనోన్మథితహృదయమకరధ్వజావేశరుచిరలలితస్మితాస్తదనురాగమదముదితమద
విఘూర్ణితారుణకరుణావలోకనయనవదనారవిన్దం సవ్రీడం కిల విలోకయన్తి

ఇక నాగరాజ పుత్రికలు ఈయన ఆశీర్వాదాన్ని కోరుతూ పరమాత్మ ఆదిశేషుని భుజాల మీద గంధమూ చందనాన్ని వేస్తూ ఉంటారు. ప్రియుని శరీర స్పర్శ వలన కలిగిన మన్మధ వికారముతో సంతోషముగా చూస్తూ ఉంటారు.

స ఏవ భగవాననన్తోऽనన్తగుణార్ణవ ఆదిదేవ ఉపసంహృతామర్షరోషవేగో లోకానాం స్వస్తయ ఆస్తే

ఈయన గుణములకు అంతము లేదు కాబట్టి ఈయన బలమునకు అంతు లేదు కాబట్టి ఈయనను అనంతుడని అంటారు. ఈ నాగపుత్రికలు ఈ రకమైన సేవ చేసి అతనిలో కూడా మన్మధ వికారం కలగడానికి కారణం అతని కోపం తగ్గించడం.

ధ్యాయమానః సురాసురోరగసిద్ధగన్ధర్వవిద్యాధరమునిగణైరనవరతమదముదితవికృత
విహ్వలలోచనః సులలితముఖరికామృతేనాప్యాయమానః స్వపార్షదవిబుధయూథపతీనపరిమ్లానరాగనవ
తులసికామోదమధ్వాసవేన మాద్యన్మధుకరవ్రాతమధురగీతశ్రియం వైజయన్తీం స్వాం వనమాలాం నీల
వాసా ఏకకుణ్డలో హలకకుది కృతసుభగసున్దరభుజో భగవాన్మహేన్ద్రో వారణేన్ద్ర ఇవ కాఞ్చనీం
కక్షాముదారలీలో బిభర్తి

ఈయన దేవ దానవ యక్ష కిన్నెర కింపురుషులతో సేవించబడుతూ నిరంతరం మదముతో ఎఱ్ఱబడిన నేత్రములు కలవాడై ఉంటాడు. ఇతని నిగ్రహం పోయి అనుగ్రహం కలిగి, అనుగ్రహముతో కూడిన చిరునవ్వుతో కలిగిన చూపులు చూస్తూ, తన చుట్టు పక్కల ఉండి అన్ని రకముల సేవలు చేసే వారిని చల్లని చూపుతో చూస్తూ ఏ మాత్రం వాడని ప్రేమ గలవాడై, అప్పుడే అంకురించిన తులసి యొక్క రసాన్ని పానం చేస్తూ, ఆ సుగంధం మీద ఆశతో తుమ్మెదలు వచ్చి చుట్టు తిరుగుతూ ఉండగా, తాను ధరించిన వనమాల సౌగంధ్యాన్ని చూడడానికి తుమ్మెదలన్నీ వస్తాయి. వనమాలలో పదహారు రకాల పుష్పాలు ఉంటాయి. ఇతను నీలాంబరుడు (తామసుడు కాబట్టి నల్లని వస్త్రం ధరించి ఉన్నాడు). ఇతనికి ఒకే కుండలం (పాము చూచినప్పుడు వినలేదు, విన్నప్పుడు చూడలేదు. అందుకే ఒకే చెవి). నాగలీ రోకలీ రెంటినీ భుజముల మీద పెట్టుకుని ఇతను ఏనుగు వలే ఈ వనమాలనూ ఆభరణాలనూ గొలుసునూ విలాసముగా వేసుకుని ఉన్నాడు.

య ఏష ఏవమనుశ్రుతో ధ్యాయమానో
ముముక్షూణామనాదికాలకర్మవాసనాగ్రథితమవిద్యామయం
హృదయగ్రన్థిం సత్త్వరజస్తమోమయమన్తర్హృదయం గత ఆశు నిర్భినత్తి
తస్యానుభావాన్భగవాన్స్వాయమ్భువో నారదః సహ తుమ్బురుణా సభాయాం బ్రహ్మణః సంశ్లోకయామాస

ఇలాంటి మహానుభావుని స్వరూపాన్ని ధ్యానం చేస్తే కాలం యొక్క కర్మ వాసనచే వచ్చిన అవిద్యా, సత్వ రజో తమోమయమైన హృదయ గ్రంధి తొలగిస్తుంది. సంకర్షణుని ప్రభావాన్ని నారదుడు ఇలా నిరంతరం కీర్తిస్తూ ఉన్నాడు.

ఉత్పత్తిస్థితిలయహేతవోऽస్య కల్పాః
సత్త్వాద్యాః ప్రకృతిగుణా యదీక్షయాసన్
యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్
నానాధాత్కథము హ వేద తస్య వర్త్మ

సృష్టి స్థితి లయములు (రాజస సాత్విక తామసిక) ఈ మూడు నిరంతరం పరమాత్మ సంకల్పము కటాక్షము వలననే జరుగుతాయి. పరమాత్మ రూపం నాశం లేనిది సృష్టి కూడా లేనిది (అకృతం). ఒకే పరమాత్మ తన సంకల్పముతో ఇన్ని రూపాలు ధరించి ఉంటాడు. అసలు పరమాత్మను చూడాలంటే అల్పబుద్ధులైన మనం ఎలా తెలుసుకోగలము.

మూర్తిం నః పురుకృపయా బభార సత్త్వం
సంశుద్ధం సదసదిదం విభాతి తత్ర
యల్లీలాం మృగపతిరాదదేऽనవద్యామ్
ఆదాతుం స్వజనమనాంస్యుదారవీర్యః

ఈయన గొప్ప దయతో మనకూ శరీరాన్నిచ్చాడూ, మనం చూడటానికి అతను కూడా శరీరాన్ని ఏర్పరచుకున్నాడు. పరమాత్మ తన దివ్య కృప చేత సకల జీవ రాశులకూ కావలసిన ఆహార విహారాలిచ్చాడు.

యన్నామ శ్రుతమనుకీర్తయేదకస్మాద్
ఆర్తో వా యది పతితః ప్రలమ్భనాద్వా
హన్త్యంహః సపది నృణామశేషమన్యం
కం శేషాద్భగవత ఆశ్రయేన్ముముక్షుః

ఇలాంటి పరమ కారుణికుడైన పరమాత్మ లీలలను మనం గానం చేస్తూ ఉండాలి. రోగార్తుడైనా కామార్తుడైనా కలహార్తుడైనా మోసగించబడినవాడైనా పలికిన నారాయణ నామం సకల జనుల పాపాన్ని సమూలముగా తొలగిస్తుంది. ఇన్ని చేస్తున్నప్పుడు మోక్షం మీద కోరిక ఉన్నవాడెవడు పరమాత్మని ఆశ్రయించడు.

మూర్ధన్యర్పితమణువత్సహస్రమూర్ధ్నో
భూగోలం సగిరిసరిత్సముద్రసత్త్వమ్
ఆనన్త్యాదనిమితవిక్రమస్య భూమ్నః
కో వీర్యాణ్యధి గణయేత్సహస్రజిహ్వః

ఈయన చేసే సృష్టి స్థితి లయములను ఎవరు అర్థం చేసుకోగలరు. వేయి శిరస్సులు గల పరమాత్మలో భూగోళము ఏదో ఒక శిరస్సు మీద భూమి ఒక అణువులా ఉంది. పరమాత్మ ఆదిశేషుని పరాక్రమం దేనితో మనం కొలవగలము. ఒక హద్దూ మర్యాద లేనిది ఆయన పరాక్రమం. వేయి ఏనుగుల బలం ఉన్న వాడు కూఒడా తన బాధను తాను తొలగించలేడు, పరమాత్మ అనుగ్రహముతోనే పోగొట్టుకుంటాడు. వేయి నాలుకలున్న వాడు కూడా పరమాత్మ అనంతుని పరాక్రమం లెక్కపెట్టలేడు

ఏవమ్ప్రభావో భగవాననన్తో
దురన్తవీర్యోరుగుణానుభావః
మూలే రసాయాః స్థిత ఆత్మతన్త్రో
యో లీలయా క్ష్మాం స్థితయే బిభర్తి

హద్దు లేని పరాక్రమం గలిగిన ఈయన ఎక్కడో పాతాళ లోకములో ఉండి తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఎక్కడ ఎక్కువ ఏకాంతం లభిస్తుందో అలాంటి చోట ఉంటాడు. ఈయన విలాసముగా ఇంత పెద్ద భూమండలాన్నీ వహిస్తున్నాడు, రక్షిస్తున్నాడు

ఏతా హ్యేవేహ నృభిరుపగన్తవ్యా గతయో యథాకర్మవినిర్మితా యథోపదేశమనువర్ణితాః
కామాన్కామయమానైః

మానవులు తిరగదగిన ప్రదేశాలన్నీ చెప్పాను, ఇది దాటి మానవుడు వెళ్ళలేడు. ఈ లోకాలన్నీ మనం ఆచరించే కర్మల ఫలితాన్ని ప్రసాదించేవే. ఉపదేశానుగుణముగా నీకు వర్ణించాను. నిరంతరం వీరు తమ కోరికలను తీర్చమని పరమాత్మను కోరుతూ ఉంటారు.

ఏతావతీర్హి రాజన్పుంసః ప్రవృత్తిలక్షణస్య ధర్మస్య విపాకగతయ ఉచ్చావచా విసదృశా యథా
ప్రశ్నం వ్యాచఖ్యే కిమన్యత్కథయామ ఇతి

ఇంతవరకూ నీవడిగినవన్నీ చెప్పాను. నిరంతరం కోరికలతో మగ్గే వారు ఎలా పుడతారు, ఎలాంటి రూపము పొందుతారు, ఎలాంటి పనులు చేస్తారో చెప్పాను. మానవుడు ప్రవృత్తి లక్షణుడు.  ఈ లక్షణం గలవాడు ధర్మమును ఆచరించుట వలన ఆచరించిన కర్మ పక్వమవుతుంది. మనమాచరించిన కర్మా జ్ఞ్యానం పక్వమైతేనే మనం పరలోకాలలో సుఖ దుఃఖాలను పొందుతాము. నీవడిగినవన్నీ ప్రశ్నకు తగ్గట్టుగా చెప్పాము.

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అధస్తాత్సవితుర్యోజనాయుతే స్వర్భానుర్నక్షత్రవచ్చరతీత్యేకే యోऽసావమరత్వం గ్రహత్వం
చాలభత భగవదనుకమ్పయా స్వయమసురాపసదః సైంహికేయో హ్యతదర్హస్తస్య తాత జన్మ కర్మాణి
చోపరిష్టాద్వక్ష్యామః

సూర్యునికి పదివేల యోజనాల కింద భాగములో రాహువుంటాడని కొందరంటారు. ఈయన నక్షత్రములా తిరుగుతాడని కొందరంతారు.. పరమాత్మ దయతో ఇతను రాక్షసుడై కూడా గ్రహత్వాన్నీ అమరత్వాన్నీ పొందాడు. రాహువు సింహికా పుత్రుడు. సింహిక ప్రహ్లాదుని చెల్లెలు. అమరత్వానికి యోగ్యుడు కాడు. అయినా పరమాత్మ దయతో అమరుడయ్యాడు. రాహువు ఎలా అమరత్వం పొందాడో తరువాత చెబుతాను.

యదదస్తరణేర్మణ్డలం ప్రతపతస్తద్విస్తరతో యోజనాయుతమాచక్షతే ద్వాదశసహస్రం
సోమస్య త్రయోదశసహస్రం రాహోర్యః పర్వణి తద్వ్యవధానకృద్వైరానుబన్ధః సూర్యా
చన్ద్రమసావభిధావతి

సూర్యభగవానుడు కింది భాగాన్ని ప్రకాశింపచేస్తున్నపుడు వైశాల్యం పదివేల యోజనాలు. చంద్రునికి అది పన్నెండు వేల యోజనాలు. రాహువు సూర్యునికి పదివేల, చంద్రునికి పదమూడువేల యోజనాలు.పర్వ కాలములో సూర్య రాహువుల మధ్య దూరం తగ్గుతుంది. సూర్య భూ చంద్ర రాహువులకు దూరం తగ్గుతుంది. గమనములో దూరం తగ్గినపుడు నీడ పడుతుంది. అదే గ్రహణం. సూర్య చంద్రులంటే వైరం ఉంది రాహువుకు. ఈ వైరం వల్లనే దగ్గరకొస్తాడు రాహువు. ఇదే పీడించడం.

తన్నిశమ్యోభయత్రాపి భగవతా రక్షణాయ ప్రయుక్తం సుదర్శనం నామ భాగవతం
దయితమస్త్రం తత్తేజసా దుర్విషహం ముహుః పరివర్తమానమభ్యవస్థితో ముహూర్తముద్విజమానశ్చకిత
హృదయ ఆరాదేవ నివర్తతే తదుపరాగమితి వదన్తి లోకాః

రాహువు పూర్తిగా దగ్గరకు రాకుండా పరమాత్మ సుదర్శనాన్ని ప్రయోగిస్తాడు. రాహువు దానికి దూరముగా జరుగుతాడు. తల తెగి, తల రాహువూ, తోక కేతువూ అయ్యింది. ఒక్క క్షణ కాలం కలత చెంది హృదయం కంపించి దగ్గరగా వెళతాడు. దుష్టులు దగ్గరగా ఉండటమే హృదయం కంపించడానికి కారణం. దీన్ని ఉపరాగమంటాము.

తతోऽధస్తాత్సిద్ధచారణవిద్యాధరాణాం సదనాని తావన్మాత్ర ఏవ

రాహువుకు కిందగా సిద్ధ చారణ లోకాలూ, దాని కింద ఎంతవరకూ వాయువు ప్రసరిస్తుందో అంతవరకూ భూత పిశాచాలు ఉంటాయి. వాయు మేఘ సంచారం ఉన్న అంతరిక్షములో వీటి నివాసాలు ఉంటాయి.

తతోऽధస్తాద్యక్షరక్షఃపిశాచప్రేతభూతగణానాం విహారాజిరమన్తరిక్షం యావద్వాయుః ప్రవాతి
యావన్మేఘా ఉపలభ్యన్తే

తతోऽధస్తాచ్ఛతయోజనాన్తర ఇయం పృథివీ యావద్ధంసభాసశ్యేనసుపర్ణాదయః పతత్త్రి
ప్రవరా ఉత్పతన్తీతి

దాని దగ్గర నుంచీ నూరు యోజనాల కింద పృధ్వి ఉంది. ఎక్కడి వరకూ పక్షులు సంచరిస్తున్నాయో అక్కడిదాకా అది భూమే.

ఉపవర్ణితం భూమేర్యథాసన్నివేశావస్థానమవనేరప్యధస్తాత్సప్త భూవివరా ఏకైకశో
యోజనాయుతాన్తరేణాయామవిస్తారేణోపక్లృప్తా అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం
పాతాలమితి

భూమి కింద, ఏడు లోకాలు ఉన్నాయి పదివేల యోజన దూరములో అతల వితలాది లోకాలు.

ఏతేషు హి బిలస్వర్గేషు స్వర్గాదప్యధికకామభోగైశ్వర్యానన్దభూతివిభూతిభిః సుసమృద్ధ
భవనోద్యానాక్రీడవిహారేషు దైత్యదానవకాద్రవేయా నిత్యప్రముదితానురక్తకలత్రాపత్యబన్ధుసుహృద్
అనుచరా గృహపతయ ఈశ్వరాదప్యప్రతిహతకామా మాయావినోదా నివసన్తి

ఇవన్నీ భూమి యొక్క బిలాలే. దైత్యులూ దానవులూ సర్పాలూ ఉంటాయి. ఇక్కడ భోగాలు ఎక్కువ. నిరంతరం భార్యా పిల్లల ప్రేమలో పడి ఉంటారు. వాళ్ళ కోరికలను పరమాత్మ కూడా అడ్డుకోడు. వారికంతా మాయా వినోదాలే ఉంటాయి. మయ మహారాజు ఇక్కడి భవనాలను నిర్మించాడు. మణులతో ఏర్పరచిన భవనాలు, ప్రాకారాలూ సభలూ దైవ మందిరాలూ కోటలతో అక్కడ పావురాల రామచిలుకల పాముల రాక్షస గూళ్ళూ ఉంచి.

యేషు మహారాజ మయేన మాయావినా వినిర్మితాః పురో నానామణిప్రవరప్రవేకవిరచితవిచిత్రభవన
ప్రాకారగోపురసభాచైత్యచత్వరాయతనాదిభిర్నాగాసురమిథునపారావతశుకసారికాకీర్ణకృత్రిమ
భూమిభిర్వివరేశ్వరగృహోత్తమైః సమలఙ్కృతాశ్చకాసతి

కృత్రిమముగా ఒక గూడు తయారు చేసారు. రాజుల యొక్క భవనాలు ఇలా ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడి ఉద్యానాలు మనస్సునూ ఇంద్రియాలనూ అహ్లాదముగా ఉంచుతాయి

ఉద్యానాని చాతితరాం మనైన్ద్రియానన్దిభిః కుసుమఫలస్తబకసుభగకిసలయావనతరుచిర
విటపవిటపినాం లతాఙ్గాలిఙ్గితానాం శ్రీభిః సమిథునవివిధవిహఙ్గమజలాశయానామమలజలపూర్ణానాం
ఝషకులోల్లఙ్ఘనక్షుభితనీరనీరజకుముదకువలయకహ్లారనీలోత్పలలోహితశతపత్రాదివనేషు కృత
నికేతనానామేకవిహారాకులమధురవివిధస్వనాదిభిరిన్ద్రియోత్సవైరమరలోకశ్రియమతిశయితాని

పూలూ పిందెలూ కాయలతో చెట్లు కలిగి లతలు చుట్టుకుని ఉన్న పొదలతో జలాశయములతో అన్ని ఇంద్రియాలకూ ఆననందమిస్తాయి. పగలూ రాత్రి అన్న భేధం ఉండదు. కాల భయం లేదు, మహా సర్పాల మణుల వలన చీకటే లేదు.

యత్ర హ వావ న భయమహోరాత్రాదిభిః కాలవిభాగైరుపలక్ష్యతే

యత్ర హి మహాహిప్రవరశిరోమణయః సర్వం తమః ప్రబాధన్తే

దివ్యమైన అన్నమునూ జలమునూ సేవించడం వలన ఆదులూ వ్యాధులూ లేక ముసలితనం కూడా రాదు. శరీరం రంగు మారదూ చెమట రాదూ, వయోభేధాలుండవు

న వా ఏతేషు వసతాం దివ్యౌషధిరసరసాయనాన్నపానస్నానాదిభిరాధయో వ్యాధయో వలీపలిత
జరాదయశ్చ దేహవైవర్ణ్యదౌర్గన్ధ్యస్వేదక్లమగ్లానిరితి వయోऽవస్థాశ్చ భవన్తి

ప్రళయకాలములో తప్ప మృత్యువు లేదు. ఫరమాత్మకు కోపం రాకుండా చూసుకుంటే వారికి మృత్యువులేదు. సుదర్శన చక్రం రాగానే ఆ రాక్షస స్త్రీల గర్భాలు జారిపోతాయి.

న హి తేషాం కల్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవత్తేజసశ్చక్రాపదేశాత్

యస్మిన్ప్రవిష్టేऽసురవధూనాం ప్రాయః పుంసవనాని భయాదేవ స్రవన్తి పతన్తి చ

పాతాళానికి ముప్పై వేల యోజనాలలో పరమాత్మ యొక్క తామసిక కళ అయిన సంకర్షణుడు. అతని కళ తామసికమైనా సాత్వికమైన పని చేస్తూ ఉన్నాడు. సాత్వతులంటే వేదాంత జ్ఞ్యానం కలవారు. అనంతుడు తామస మూర్తి అయినా ఆయనే పరమాత్మ తత్వాన్ని ఉపదేశిస్తాడు. అహంకారమే సంకర్షణ తత్వం. వేయి శిరస్సులలో ఏదో ఒక మూల ఇంత భూలోకమూ భాసిస్తుంది. బ్రహ్మాండమంతా సంకర్షుణి ఒక శిరస్సులో ఆవగించ అంత భాసిస్తుంది

అథాతలే మయపుత్రోऽసురో బలో నివసతి యేన హ వా ఇహ సృష్టాః షణ్ణవతిర్మాయాః
కాశ్చనాద్యాపి
మాయావినో ధారయన్తి యస్య చ జృమ్భమాణస్య ముఖతస్త్రయః స్త్రీగణా ఉదపద్యన్త స్వైరిణ్యః కామిన్యః
పుంశ్చల్య ఇతి యా వై బిలాయనం ప్రవిష్టం పురుషం రసేన హాటకాఖ్యేన సాధయిత్వా స్వవిలాసావలోకనానురాగ
స్మితసంలాపోపగూహనాదిభిః స్వైరం కిల రమయన్తి యస్మిన్నుపయుక్తే పురుష ఈశ్వరోऽహం సిద్ధో
ऽహమిత్యయుతమహాగజబలమాత్మానమభిమన్యమానః కత్థతే మదాన్ధ ఇవ

తతోऽధస్తాద్వితలే హరో భగవాన్హాటకేశ్వరః స్వపార్షదభూతగణావృతః ప్రజాపతి
సర్గోపబృంహణాయ భవో భవాన్యా సహ మిథునీభూత ఆస్తే యతః ప్రవృత్తా సరిత్ప్రవరా హాటకీ నామ
భవయోర్వీర్యేణ యత్ర చిత్రభానుర్మాతరిశ్వనా సమిధ్యమాన ఓజసా పిబతి తన్నిష్ఠ్యూతం హాటకాఖ్యం
సువర్ణం భూషణేనాసురేన్ద్రావరోధేషు పురుషాః సహ పురుషీభిర్ధారయన్తి

తతోऽధస్తాత్సుతలే ఉదారశ్రవాః పుణ్యశ్లోకో విరోచనాత్మజో బలిర్భగవతా మహేన్ద్రస్య ప్రియం
చికీర్షమాణేనాదితేర్లబ్ధకాయో భూత్వా వటువామనరూపేణ పరాక్షిప్తలోకత్రయో భగవదనుకమ్పయైవ
పునః ప్రవేశిత ఇన్ద్రాదిష్వవిద్యమానయా సుసమృద్ధయా శ్రియాభిజుష్టః స్వధర్మేణారాధయంస్తమేవ
భగవన్తమారాధనీయమపగతసాధ్వస ఆస్తేऽధునాపి

నో ఏవైతత్సాక్షాత్కారో భూమిదానస్య యత్తద్భగవత్యశేషజీవనికాయానాం జీవభూతాత్మభూతే
పరమాత్మని వాసుదేవే తీర్థతమే పాత్ర ఉపపన్నే పరయా శ్రద్ధయా పరమాదరసమాహితమనసా
సమ్ప్రతిపాదితస్య సాక్షాదపవర్గద్వారస్య యద్బిలనిలయైశ్వర్యమ్

యస్య హ వావ క్షుతపతనప్రస్ఖలనాదిషు వివశః సకృన్నామాభిగృణన్పురుషః కర్మ
బన్ధనమఞ్జసా విధునోతి యస్య హైవ ప్రతిబాధనం ముముక్షవోऽన్యథైవోపలభన్తే

తద్భక్తానామాత్మవతాం సర్వేషామాత్మన్యాత్మద ఆత్మతయైవ

న వై భగవాన్నూనమముష్యానుజగ్రాహ యదుత పునరాత్మానుస్మృతిమోషణం మాయామయ
భోగైశ్వర్యమేవాతనుతేతి

యత్తద్భగవతానధిగతాన్యోపాయేన యాచ్ఞాచ్ఛలేనాపహృతస్వశరీరావశేషితలోకత్రయో వరుణ
పాశైశ్చ సమ్ప్రతిముక్తో గిరిదర్యాం చాపవిద్ధ ఇతి హోవాచ

నూనం బతాయం భగవానర్థేషు న నిష్ణాతో యోऽసావిన్ద్రో యస్య సచివో మన్త్రాయ వృత ఏకాన్తతో
బృహస్పతిస్తమతిహాయ స్వయముపేన్ద్రేణాత్మానమయాచతాత్మనశ్చాశిషో నో ఏవ తద్దాస్యమతిగమ్భీర
వయసః కాలస్య మన్వన్తరపరివృత్తం కియల్లోకత్రయమిదమ్

యస్యానుదాస్యమేవాస్మత్పితామహః కిల వవ్రే న తు స్వపిత్ర్యం యదుతాకుతోభయం పదం
దీయమానం భగవతః పరమితి భగవతోపరతే ఖలు స్వపితరి

తస్య మహానుభావస్యానుపథమమృజితకషాయః కో వాస్మద్విధః పరిహీణభగవదనుగ్రహ
ఉపజిగమిషతీతి

తస్యానుచరితముపరిష్టాద్విస్తరిష్యతే యస్య భగవాన్స్వయమఖిలజగద్గురుర్నారాయణో ద్వారి
గదాపాణిరవతిష్ఠతే నిజజనానుకమ్పితహృదయో యేనాఙ్గుష్ఠేన పదా దశకన్ధరో యోజనాయుతాయుతం దిగ్
విజయ ఉచ్చాటితః

తతోऽధస్తాత్తలాతలే మయో నామ దానవేన్ద్రస్త్రిపురాధిపతిర్భగవతా పురారిణా త్రిలోకీశం
చికీర్షుణా నిర్దగ్ధస్వపురత్రయస్తత్ప్రసాదాల్లబ్ధపదో మాయావినామాచార్యో మహాదేవేన పరిరక్షితో
విగతసుదర్శనభయో మహీయతే

తతోऽధస్తాన్మహాతలే కాద్రవేయాణాం సర్పాణాం నైకశిరసాం క్రోధవశో నామ గణః కుహక
తక్షకకాలియసుషేణాదిప్రధానా మహాభోగవన్తః పతత్త్రిరాజాధిపతేః పురుష
వాహాదనవరతముద్విజమానాః స్వకలత్రాపత్యసుహృత్కుటుమ్బసఙ్గేన క్వచిత్ప్రమత్తా విహరన్తి

తతోऽధస్తాద్రసాతలే దైతేయా దానవాః పణయో నామ నివాతకవచాః కాలేయా హిరణ్యపురవాసిన
ఇతి విబుధప్రత్యనీకా ఉత్పత్త్యా మహౌజసో మహాసాహసినో భగవతః సకలలోకానుభావస్య హరేరేవ తేజసా
ప్రతిహతబలావలేపా బిలేశయా ఇవ వసన్తి యే వై సరమయేన్ద్రదూత్యా వాగ్భిర్మన్త్రవర్ణాభిరిన్ద్రాద్బిభ్యతి

తతోऽధస్తాత్పాతాలే నాగలోకపతయో వాసుకిప్రముఖాః శఙ్ఖకులికమహాశఙ్ఖశ్వేత
ధనఞ్జయధృతరాష్ట్రశఙ్ఖచూడకమ్బలాశ్వతరదేవదత్తాదయో మహాభోగినో మహామర్షా నివసన్తి
యేషాము హ వై పఞ్చసప్తదశశతసహస్రశీర్షాణాం ఫణాసు విరచితా మహామణయో రోచిష్ణవః పాతాల
వివరతిమిరనికరం స్వరోచిషా విధమన్తి

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ తస్మాత్పరతస్త్రయోదశలక్షయోజనాన్తరతో యత్తద్విష్ణోః పరమం పదమభివదన్తి యత్ర
హ మహాభాగవతో ధ్రువ ఔత్తానపాదిరగ్నినేన్ద్రేణ ప్రజాపతినా కశ్యపేన ధర్మేణ చ సమకాలయుగ్భిః
సబహుమానం దక్షిణతః క్రియమాణ ఇదానీమపి కల్పజీవినామాజీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణితః

ఋషిమండలానికి పదమూడు లక్షల యోజనాల దూరములో ద్రువమండలం ఉంటుంది. అందరూ ద్రువునికి గౌరవముతో ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. బ్రహ్మ కల్ప కాలం బతికిన వారితో ఇప్పటికీ ద్రువుడు ఆరాధించబడుతూ ఉన్నాడు. ద్రువుడే జీవనాధారం. ఆయన వలనే ఈ జీవులు తృప్తి పొందుతారు. ఆ ద్రువ చరిత్ర చెప్పుకుని ఉన్నాము.

స హి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహనక్షత్రాదీనామనిమిషేణావ్యక్తరంహసా భగవతా కాలేన
భ్రామ్యమాణానాం స్థాణురివావష్టమ్భ ఈశ్వరేణ విహితః శశ్వదవభాసతే

ఇంతవరకూ చెప్పిన అన్ని రాశులూ నక్షత్రాలూ తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్య ఉన్న ద్రువుడు చలనం లేకుండా స్థిరముగా ఉంటాడు. ఈ ఏర్పాటు చేసింది పరమాత్మ. రెప్పపాటు లేని పరమాత్మ చేసిన ఏర్పాటు వలన స్థాణువులా ఉంటాడు. ద్రువమండలం ప్రకాశిస్తూ ఉంటుంది

యథా మేఢీస్తమ్భ ఆక్రమణపశవః సంయోజితాస్త్రిభిస్త్రిభిః సవనైర్యథాస్థానం మణ్డలాని
చరన్త్యేవం భగణా గ్రహాదయ ఏతస్మిన్నన్తర్బహిర్యోగేన కాలచక్ర ఆయోజితా ధ్రువమేవావలమ్బ్య
వాయునోదీర్యమాణా ఆకల్పాన్తం పరిచఙ్క్రమన్తి నభసి యథా మేఘాః శ్యేనాదయో వాయువశాః కర్మసారథయః
పరివర్తన్తే ఏవం జ్యోతిర్గణాః ప్రకృతిపురుషసంయోగానుగృహీతాః కర్మనిర్మితగతయో భువి న పతన్తి

అన్నీ తిరుగుతూ ఉంటే ఆయన ఎందుకు తిరగదు. గానుగ స్తంభములో మేడీ స్తంభం తిరగకుండా ఉంటుంది. దన్ని ఆశ్రయించుకుని మిగతావన్నీ వేగన్ని పెంచుకుంటాయి. ద్రువుడు అలాంటి వాడు. ఇరుసు తిరుగుతున్నట్లు కనపడుతుంది గానీ అది తిరగదు. కాల చక్రం నక్షత్రం రాశులూ సూర్యాది మండలాలూ ద్రువమండలాన్ని ఆధారముగా చేసుకుని సంచరిస్తూ ఉంటాయి. వాయువు లేకుండా కదలిక ఉండదు కాబట్టి అంత వేగ్ముగా వాయువు వీచాలి. ఆకాశములో మబ్బులు వాయువశమై తిరుగుతున్నట్లు ఆకల్పాంతం తిరుగుతూ ఉంటాయి. గ్రహములూ నక్షత్రాలూ రాశులూ కర్మసారధులు. ప్రకృతి పురుష సమ్యోగము వలనే నక్షత్రాలూ రాశులూ పుడతాయి (ప్రకృతి నుండి మహత్ తత్వం పుట్టింది, ఆ ప్రకృతిని పరమాత్మ క్షోభింపచేసాడు), వారు వారు ఆచరించిన కర్మ చేతనే వారి (నక్షత్ర రాశుల) గమనం ఏర్పడింది. గ్రహాలూ రాశులూ నక్షత్రాలూ కూడా కర్మబద్దులైన జీవులే. కర్మ అనే దారముతో కట్టబడి ఉన్నాయి. అవి కిందపడకుండా గుద్దుకోకుండా బద్దమై ఉంటాయి.

కేచనైతజ్జ్యోతిరనీకం శిశుమారసంస్థానేన భగవతో వాసుదేవస్య యోగ
ధారణాయామనువర్ణయన్తి

ఈ శింశుమారమంతా పరమాత్మ వాసుదేవుని యోగధారణలో ఉంటుంది

యస్య పుచ్ఛాగ్రేऽవాక్శిరసః కుణ్డలీభూతదేహస్య ధ్రువ ఉపకల్పితస్తస్య లాఙ్గూలే
ప్రజాపతిరగ్నిరిన్ద్రో ధర్మ ఇతి పుచ్ఛమూలే ధాతా విధాతా చ కట్యాం సప్తర్షయః తస్య దక్షిణావర్తకుణ్డలీ
భూతశరీరస్య యాన్యుదగయనాని దక్షిణపార్శ్వే తు నక్షత్రాణ్యుపకల్పయన్తి దక్షిణాయనాని తు సవ్యే యథా
శిశుమారస్య కుణ్డలాభోగసన్నివేశస్య పార్శ్వయోరుభయోరప్యవయవాః సమసఙ్ఖ్యా భవన్తి పృష్ఠే
త్వజవీథీ ఆకాశగఙ్గా చోదరతః

శరీరం మొత్తం గుండ్రముగా ఉంటుంది. తోక కొసకు శిరసు ఉంటుంది.ఆ కుండలిలా గుండ్రముగా ఉన్నది ద్రువ మండలం.  శింశుమారం యొక్క లాంగూలములో ప్రజాపతీ అగ్నీ ఇంద్రుడూ ధర్మం ఉంటారు. మొదటి భాగములో ధాతా విధాతా ఉంటారు. నడుములో సప్తఋషులు ఉంటారు. శింశుమారం కుండలిగా ఉంటుంది, దక్షిణ భాగం తిరిగి ఉంటుంది. అలాగే శంఖాలలో కూడా దక్షిణావర్తనం, వామావర్తమూ ఉంటాయి. వామావర్తం లభించడం కష్టం. ఉత్తరాయణములు దక్షిణ భాగములో ఉంటాయి, దక్షిణాయనములు ఉత్తరభాగములో ఉంటాయి. దానికి దక్షిణావర్తం మనకు ఉత్తరావర్తం. అందుకే ఉత్తరాయణం ప్రశస్తమైనది. రెండు పక్కలా గల నక్షత్రాల గ్రహాల సంఖ్యా సమానముగా ఉంటాయి. అజ వీధి అంటే పాలపుంత. బ్రహ్మదారి అంటారు. శింశుమారం యొక్క ఉదరస్థానములో ఆకాశగంగ. పునర్వసూ పుష్యమీ నక్షత్రాలు దక్షిణ వామ పార్శ్వాలు. ఆర్థ్రా ఆశ్లేషలు దక్షిణ (వెనక భాగములో), అభిజిత్ ఉత్తరాషాడలు దక్షిణ వామ నాసికలలో

పునర్వసుపుష్యౌ దక్షిణవామయోః శ్రోణ్యోరార్ద్రాశ్లేషే చ దక్షిణవామయోః పశ్చిమయోః
పాదయోరభిజిదుత్తరాషాఢే దక్షిణవామయోర్నాసికయోర్యథాసఙ్ఖ్యం శ్రవణపూర్వాషాఢే దక్షిణ
వామయోర్లోచనయోర్ధనిష్ఠా మూలం చ దక్షిణవామయోః కర్ణయోర్మఘాదీన్యష్ట నక్షత్రాణి దక్షిణాయనాని
వామపార్శ్వవఙ్క్రిషు యుఞ్జీత తథైవ మృగశీర్షాదీన్యుదగయనాని దక్షిణపార్శ్వవఙ్క్రిషు ప్రాతిలోమ్యేన
ప్రయుఞ్జీత శతభిషాజ్యేష్ఠే స్కన్ధయోర్దక్షిణవామయోర్న్యసేత్

కుడి ఎడుమ కన్నులలో శ్రవణమూ పూర్వాషాడ. మఖా నుంచీ జ్యేష్ఠా వరకూ దక్షిణ పార్శ్వములో ఉంటాయి. మృగశీర్షా ఆర్థ్రా దక్షిణాయనం. శతబిష జ్యేష్టలు స్కంధములు. ముఖములో అంగారకుడు, ఉపస్థలో శనైశ్వరుడు, కకుది (వీపు) బృహస్పతి, వక్షములో బృహస్పతి, హృదయములో నారాయణుడు, మనసులో చంద్రుడు, నాభిలో శుక్రుడు, అశ్వనీ దేవతలు రెండు స్తనములలో. ప్రాణాపానములలో బుధుడు, రాహువు మెడలో ఉంటాడు,

ఉత్తరాహనావగస్తిరధరాహనౌ యమో ముఖేషు చాఙ్గారకః శనైశ్చర ఉపస్థే బృహస్పతిః కకుది
వక్షస్యాదిత్యో హృదయే నారాయణో మనసి చన్ద్రో నాభ్యాముశనా స్తనయోరశ్వినౌ బుధః ప్రాణాపానయో
రాహుర్గలే కేతవః సర్వాఙ్గేషు రోమసు సర్వే తారాగణాః

కేతువులు ప్రతీ అవయవములోనూ ఉంటాయి. రోమములో నక్షత్రాలు. రోమకూపాన్ని వక్షస్థలాన్ని కళ్ళనూ పరిశీలించి, ఒక్కో కూపములో రెండు ఉంటే సంపత్తూ, ఒకటి ఉంటే బిక్షుకుడు, రెండు కంటే ఎక్కువ ఉంటే దరిద్రుడు. గళము నుంచి వక్షస్థలానికి ఒక రేఖ ఉంటుంది. అది మూడు భాగాలలో ఉంటుంది. తాడు, సర్పమూ గొళుసుగా ఉండి దక్షిణ స్థనం (శని) నుండి ఉత్తర స్థనం (గురువు) వరకూ వస్తే విద్యావంతుడు అవుతారు. దానికి వ్యతిరేకముగా వస్తే దౌర్భాగ్యుడు. భగవదారాధనతో రేఖలు కూడా మారుతాయి.

ఏతదు హైవ భగవతో విష్ణోః సర్వదేవతామయం రూపమహరహః సన్ధ్యాయాం ప్రయతో వాగ్యతో
నిరీక్షమాణ ఉపతిష్ఠేత నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయానిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహీతి

ఈ శిశుమార చక్రం వాసుదేవుడే. విశ్వం విష్ణుః. పరమాత్మ యొక్క సర్వ దేవతా స్వరూపము ఇది.  పరమాత్మ యొక్క స్థూల రూపం, పధ్నాలుగు లోకాలూ పరమాత్మ అవయవాలే. మనమారాధించే దేవత పరమాత్మ శరీరములో ఏ భాగమో తెలుసుతుంది. రాహు దోషమున్న వారు పూల మాల తయారు చేసి పరమాత్మ మెడలో వేయాలి. రాహువు పరమాత్మ యొక్క మెడ. కేతు దోషముంటే తులసితో పూజ చేయి. పరమాత్మ రోమాలను కప్పిపుచ్చేది తులసి. కేతువు పరమాత్మ రోమాలు. ఏ దేవత పరమాత్మకు ఏ అవయవమో ఆ ఆరాధన పరమాత్మ యొక్క ఆ అవయవానికి చెందుతుంది. చెట్టు బాగా ఉండాలంటే చెట్టు యొక్క ప్రతీ ఆకుకీ నీరు పోయక్కరలేదు. మూలానికి నీరు పోస్తే చాలు. ఈ అధ్యాయాన్ని ప్రతీ రోజు సంధ్యాకాలములో శ్రద్ధగా మాటను నియంత్రించుకుని చూస్తూ "నమో జ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహీ" అనే మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రాన్ని సర్వదా చదువుతూ ఉండాలి. ఇందులో ప్రణవం లేదు, బీజాక్షరం లేదు. సర్వ దేశ సర్వ కాలాలలో అవస్థలలో చదువుకోవచ్చు. ప్రకృతి వలన వచ్చే ఉత్పాతాలకు గురికాడు. ధీమహీ అంటే గాయత్రీ మంత్రం.

గ్రహర్క్షతారామయమాధిదైవికం పాపాపహం మన్త్రకృతాం త్రికాలమ్
నమస్యతః స్మరతో వా త్రికాలం నశ్యేత తత్కాలజమాశు పాపమ్

ఆది దైవికం అంటే గ్రహస్థ నక్షత్ర తారామయం (తొంభై వంతులు పుణ్యం ఉన్నవారు నక్షత్రాలవుతారు. ఇంకొంచెం పుణ్యం తక్కువ ఉన్నవారు తారలు అవుతారు. అష్టకోణం నక్షత్రం, షట్ కోణం తార).  ఈ ఆది దైవికం మంత్రములను జపం చేసే వారి పాపాలను పోగొడుతుంది. పెద్దలు మనకుపదేశించిన మత్రాన్ని జపిస్తూ ఉండగా వచ్చే తప్పులను ఈ మంత్రం పోగొడుతుంది. ఆయా మంత్రములను జపించేవారు తాము జపించిన మంత్రములలో కలిగిన లోపాలను పోగొడుతుంది. అంతే కాక ఈ మంత్రాన్ని జపించిన వారికి నమస్కరించినా వారి పాపం వెంటనే పోతుంది.

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం

రాజోవాచ
యదేతద్భగవత ఆదిత్యస్య మేరుం ధ్రువం చ ప్రదక్షిణేన పరిక్రామతో రాశీనామభిముఖం
ప్రచలితం చాప్రదక్షిణం భగవతోపవర్ణితమముష్య వయం కథమనుమిమీమహీతి

ఈ సూర్యభగవానుడు మేరువునూ ద్రువ మండలాన్నీ ప్రదక్షిణం చేస్తున్నాడనీ, మేరువుకూ ద్రువునకూ ప్రదక్షిణమవుతున్నప్పుడు ఈ భాగములో ఉన్న రాశులకు అప్రదక్షిణమవుతున్నది. దీన్ని ఎలా తెలుసుకోవాలి.ప్రదక్షిణ అప్రదక్షిణల యొక్క వివరాన్ని ఎలా గుర్తించాలి. సూర్యభగవానుడు  ప్రదక్షిణముగా తిరిగితే రాశులన్నీ అప్రదక్షిణముగా ఎలా తిరుగుతాయి

స హోవాచ
యథా కులాలచక్రేణ భ్రమతా సహ భ్రమతాం తదాశ్రయాణాం పిపీలికాదీనాం గతిరన్యైవ
ప్రదేశాన్తరేష్వప్యుపలభ్యమానత్వాదేవం నక్షత్రరాశిభిరుపలక్షితేన కాలచక్రేణ ధ్రువం మేరుం చ
ప్రదక్షిణేన పరిధావతా సహ పరిధావమానానాం తదాశ్రయాణాం సూర్యాదీనాం గ్రహాణాం గతిరన్యైవ
నక్షత్రాన్తరే రాశ్యన్తరే చోపలభ్యమానత్వాత్

కుమ్మర్ చక్రం తిరుగుతూ ఉంటే దాని మీద ఉన్న చీమలు అదే దిశలో తిరగాలన్న నియమమేమీ లేదు. అలాగే ఇది కూడా. కాల చక్రాన్ని గుర్తించడానికి మనకు రాశులు నక్షత్రాలూ ప్రమాణికం. సూర్యుడు తిరిగేది మాత్రం మేరువు చుట్టూ ధ్రువుని చుట్టూ. మనకి కనపడేవి మాత్రం రాశులూ నక్షత్రాలే కాబట్టి వాటినాధారముగా చేసుకుని కాలగణం చేస్తాం. ఎదురుగా ఉన్నవి నక్షత్రాలూ రాశులూ. సూర్యుడు ఒక సారి అశ్వనిలో ఉంటాడు,  తరువాత భరణిలో ఉంటాడు. ఆయన మారడు. సూర్యుడూ నక్షత్రాలూ తిరుగుతూ ఉండగా అవి ఎక్కడ కలిస్తే అవి కాల మానం. అశ్వనీ భరణీ సూర్యునితో కలిస్తే అది మేషరాశి. కృత్తిక రెండవ పాదముతో కలిస్తే అది మిథున రాశి.

స ఏష భగవానాదిపురుష ఏవ సాక్షాన్నారాయణో లోకానాం స్వస్తయ ఆత్మానం త్రయీమయం
కర్మ విశుద్ధినిమిత్తం కవిభిరపి చ వేదేన విజిజ్ఞాస్యమానో ద్వాదశధా విభజ్య షట్సు వసన్తాదిష్వృతుషు యథోప
జోషమృతుగుణాన్విదధాతి

ఈ సూర్యభగవానుడే సాక్షాత్ నారాయణుడు. సకల లోక కళ్యానం కొరకు తనను వేద పురుషునిగా కర్మ విశుద్ధి కొరకు ఆయన ఉన్నాడు.పసి పిల్లలను ప్రాతః కాలములో సూర్యభగవానుని ఎదుట ఒక ఘడియపాటు ఎదురుగా పెట్టమని చెబుతారు. పండితులూ జ్ఞ్యానుల చేత వేదముతో కూడా సూర్యభగవానుని స్వరూపం తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు.

తమేతమిహ పురుషాస్త్రయ్యా విద్యయా వర్ణాశ్రమాచారానుపథా ఉచ్చావచైః
కర్మభిరామ్నాతైర్యోగ
వితానైశ్చ శ్రద్ధయా యజన్తోऽఞ్జసా శ్రేయః సమధిగచ్ఛన్తి

అనుభవించే విధానానికనుగుణముగా ఋతువులను విభాగం చేసారు. ఇక్కడుండే ఋషులందరూ వేద విద్యతో సూర్యభగవానుని వర్ణాశ్రమ ధర్మాలకనుగుణముగా  హెచ్చు తగ్గుల పనులతో యోగముతో శ్రద్ధగా ఆరాధిస్తున్నారు. మనకు ప్రత్యక్షముగా కనపడుతున్న సూర్యభగవానుని మన వర్ణాశ్రమాలకనుగుణముగా ఆరాధిస్తే మనకు శ్రేయస్సు కలుగుతుంది. విహిత కర్మలే సూర్యభగవానునికి అరాధన 

అథ స ఏష ఆత్మా లోకానాం ద్యావాపృథివ్యోరన్తరేణ నభోవలయస్య కాలచక్రగతో ద్వాదశ
మాసాన్భుఙ్క్తే రాశిసంజ్ఞాన్సంవత్సరావయవాన్మాసః పక్షద్వయం దివా నక్తం చేతి సపాదర్క్ష
ద్వయముపదిశన్తి యావతా షష్ఠమంశం భుఞ్జీత స వై ఋతురిత్యుపదిశ్యతే సంవత్సరావయవః

అన్ని లోకాలకూ ఆయనే ఆత్మ. ఆకాశం భూమి మధ్య ఈయన కాల చక్రములో ఉండి సూర్యభగవానుడే పన్నెండు మాసాలను అనుభవిస్తున్నాడు. రాశులూ సంవత్సరానికి అవయవాలు. మాసాలు రాశుల సంజ్యలు. మాసాలు రెండు పక్షాలు.శుక్ల పక్షమంటే తెలుపు (పగలు) కృష్ణ పక్షమంటే నలుపు. ఒక్కో రాశి రెండు నక్షత్రాలూ ఒక పాదం. ఆరవ భాగం అనుభవిస్తే ఋతువు. ఇరవై నాలుగవ భాగమనుభవిస్తే పక్షం. ఇవన్నీ సంవత్సరానికి అవయవములు

అథ చ యావతార్ధేన నభోవీథ్యాం ప్రచరతి తం కాలమయనమాచక్షతే

సూర్యుడు ఆకాశములో సగభాగం దాటితే అయనం. అందులో ఆరవ భాగం ఋతువు, పన్నెండవ భాగం మాసం, ఇరవై నాలుగవ భాగం పక్షం. సూర్య రథం ఏ భాగాన్ని అతిక్రమిస్తోందో అదే కాలం

అథ చ యావన్నభోమణ్డలం సహ ద్యావాపృథివ్యోర్మణ్డలాభ్యాం కార్త్స్న్యేన స హ భుఞ్జీత తం
కాలం సంవత్సరం పరివత్సరమిడావత్సరమనువత్సరం వత్సరమితి భానోర్మాన్ద్యశైఘ్ర్యసమ
గతిభిః సమామనన్తి

భూమ్యాకాశాల మధ్య ఉండే రాశి చక్రమంతా తిరిగితే సంవత్సరం. సూర్యుని గమనముతో కలిసి తిరిగే నక్షత్రం రాశి మొదలైన వాటితో కలిసి సంవత్సరం పేర్లు మారతాయి. సూర్యుడు బాగా వేగముగా ఉంటే సంవత్సరం,కొంచెం తగ్గితే పరివత్సరం, ఇంకొంచెం తగ్గితే  ఇలావత్సరం, మరికాస్త తగ్గితే విద్వత్సరం, మధ్యభాగములో ఉంటే వత్సరం. సూర్యుడు చాలల వేగముగా ఉన్నపుడు నక్షత్రాలను తొందరగా దాటుతాడు. నక్షత్ర మానములో నెలకు ఇరవై ఏడు రోజులే అవుతాయి.మరి ఇరవై ఏడు రోజుల నెలకూ ముప్పై రోజుల నెలకూ తేడా ఏమిటి? సూర్యుడు వేగముగా ఉన్నప్పుడు ఇరవై ఏడుకు వస్తాడు, ఇది నక్షత్ర మానం. మెల్లగ వేళితే ముప్పైకి వస్తుంది, ఇది రాశి మానం. మరికాస్త వేగముగా వెళితే ఇరవై తొమ్మిది రోజుల నెల ఉంటుంది, ఈ ముప్పై ఇరవై తొమ్మిదీ ముప్పై ఒకటిని కలుపుకోవడం బట్టే తిథులను గణిస్తాము. ఒకే రోజు రెండు తిథులూ, ఒకే తిథి రెండు రోజులూ వస్తాయి. జ్యోతిష్య శాస్త్రములో తితులను సూర్య రథ చక్ర నేమి ఏ తిథి నక్షత్రం దగ్గరకు వచ్చిందో లెక్క కట్టి చెబితే ఆ సమయములో తిథి నక్షత్రం చెప్పగలము. రథ నేమీ నక్షత్ర నేమి తిథి నేమి రాశి నేమి కరణ యోగముల నేమి ఒకే దగ్గరకు వస్తాయో అది వర్జ్యం. రాశికి మొదటి భాగం నక్షత్రానికి మధ్యభాగం తిథికి మూడవ భాగం కరణ యోగాలకు నాలగవ భాగం, వీటిని లెక్కించి దాన్ని కలుపుకొని అది ఎన్ని విఘడియలో లెక్కపెట్టి ఆ భాగాన్ని వర్జ్యం అంటారు. నక్షత్ర భుక్తి తిథి బుక్తి  రాశి బుక్తి కలిపి దాన్ని కలిపి తొమ్మిదవ భాగముతో భాగించి వచ్చిన దాన్ని మూడుతో హెచ్చవేసి రెండు తీసేస్తే వచ్చింది వర్జ్యం
 కాలములో ఏ చిన్న దాన్ని గుర్తించినా సూర్యునితోనే. అమృత ఘడియలను దాటి విషఘడియలకు పోతుంటే దుర్ముహూర్తం
రాహు కాలం అనేది రాశిని బట్టి గుర్తించాలి. అది సౌరమానాన్ని బట్టి ఉంటుంది. చంద్రమానం పాటించేవారు వర్జ్యాన్ని చూస్తారు

ఏవం చన్ద్రమా అర్కగభస్తిభ్య ఉపరిష్టాల్లక్షయోజనత ఉపలభ్యమానోऽర్కస్య సంవత్సర
భుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం సపాదర్క్షాభ్యాం దినేనైవ పక్షభుక్తిమగ్రచారీ ద్రుతతరగమనో
భుఙ్క్తే

సూయ్రభగవానుని కిరణాల కంటే లక్ష యోజనాల పైన ఉన్నాడు చంద్రుడు. సూర్యుడు ఒక సంవత్సరములో తిరిగే భాగాన్ని చంద్రుడు ఒక పక్షములో తిరుగుతాడు. సూర్యుడు ఒక నెలలో తిరిగే దాన్ని చంద్రుడు ఒక రోజులో తిరుగుతాడు. సూర్యుని కన్నా ముందర ఉంటాడు. చాలా వేగముగా వెళతాడు

అథ చాపూర్యమాణాభిశ్చ కలాభిరమరాణాం క్షీయమాణాభిశ్చ కలాభిః పిత్ణామహోరాత్రాణి
పూర్వ
పక్షాపరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవనివహప్రాణో జీవశ్చైకమేకం నక్షత్రం త్రింశతా
ముహూర్తైర్భుఙ్క్తే

నిండుగా ఉన్న కళలతో దేవతలకూ క్షీణించే కళలతో పితృదేవతలకూ భోజనం పెడతాడు.  శుక్ల పక్షం దేవతలకూ కృష్ణ పక్షం పితృదేవతలకూ. పగలూ రాత్రి శుక్ల కృష్ణ పక్షమని ఉంటుంది. సకల జీవులకూ ఈయన ప్రాణం. చంద్రుడు ఒక్కో నక్షత్రాన్ని ముప్పై ముహూర్తాలని ఒక్క రోజులో తిరుగుతాడు, పదహారు కళలతో ఉంటాడు

య ఏష షోడశకలః పురుషో భగవాన్మనోమయోऽన్నమయోऽమృతమయో
దేవపితృమనుష్యభూతపశు
పక్షిసరీసృపవీరుధాం ప్రాణాప్యాయనశీలత్వాత్సర్వమయ ఇతి వర్ణయన్తి

అందరికీ భోజనం పెట్టి బతికించేవాడు, మనుష్యులకు అన్నం, దేవతలకు అమృతం, మనః స్వరూపముతో పితృదేవతలకు. చంద్రుడు మనో మయుడు కాబట్టి, మనో మయ రూపములో పితృదేవతలకు ఆరాధిస్తున్నాడు కాబట్టి దాన్ని శ్రాద్ధం అంటాం.  శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసేది. ఏకాగ్రముగా ఉండే మనసుతో చేస్తే అది శ్రాద్ధం. అలా చేస్తే మనో రూపములో ఉన్న చంద్రుడు తీసుకుంటాడు. అందరి ప్రాణాలనూ తృప్తి పరుస్తాడు.

తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనతో నక్షత్రాణి మేరుం దక్షిణేనైవ కాలాయన ఈశ్వరయోజితాని
సహాభిజితాష్టావింశతిః

చంద్రునికి ఇంకా పైన నక్షత్రాలుంటాయి.నక్షత్రాలన్ని మేరువుకు దక్షిణ దిక్కులో సంచరిస్తూ ఉంటాయి. పరమాత్మే అక్కడ నక్షత్రాలను ఉంచాడు. అభిజిత్ తో కలిసి ఇరవై ఎనిమిది నక్షత్రాలు. నక్షత్ర మండలానికి రెండు లక్షల యోజనాలలో ఉండేవాడు శుక్రుడు. సూర్యునికి ముందర సంచరిస్తే పులస్ శుక్ర దోషం.
అపుడు సూర్యుని కంటే ముందు ఉంటాడు. అప్పుడు సూర్య ప్రభావం కంటే శుక్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. శుక్రుడు రాక్షసుల గురువు. పశ్చాత్ శుక్ర దోషమంటే సూర్యుని కంటే వెనక ఉంటాడు. సూర్యునితో సమానముగా శుక్రుడు ఉంటే అది మూఢం. సూర్యకాంతిలో శుక్రుడు కనపడడు, అది మూఢం.  సూర్యునికి శుక్రుడు వెనకభాగములో ఉన్నప్పుడే వివాహం చేయాలి. సర్వదా శుక్రుడు లోకాలకు అనుకూలుడు. వర్షాలను కురిపించేవాడు శుక్రుడు. వర్షాధిపతి శుక్రుడు. అందుకే విరాట పర్వం పారాయణతో వర్షాలు పడతాయి. విరాట పర్వములో గోగ్రహణం ఉంది. గోవులకు శుక్రుడు అధిపతి. అందుకే విరాట పర్వములో గోవులను కాపాడిన పాండవులకు మేలు జరిగింది. వృష్టికున్న విఘ్నాన్ని పోగొడతాడు శుక్రుడు. కానీ శుక్రుడు సూర్యునికి వెనక ఉండాలి.

తత ఉపరిష్టాదుశనా ద్విలక్షయోజనత ఉపలభ్యతే పురతః పశ్చాత్సహైవ వార్కస్య శైఘ్ర్య
మాన్ద్యసామ్యాభిర్గతిభిరర్కవచ్చరతి లోకానాం నిత్యదానుకూల ఏవ ప్రాయేణ వర్షయంశ్చారేణానుమీయతే స
వృష్టివిష్టమ్భగ్రహోపశమనః

శుక్రుని కంటే రెండు లక్షల యోజనాల దూరములో చంద్రుని కుమారుడు బుధుడు ఉంటాడు. బుధుడు శుభమును కలిగిస్తాడు. సూర్యునికంటే చాలా దూరములో ఉంటే ఉత్పాతములు కలుగుతాయి. సూర్యునికి బుధుడు దగ్గరగా ఉండాలి. మబ్బులు ఎక్కువగా ఉండి కూడా వర్షం పడలేదంటే బుధుడు వ్యతిరేకముగా (సూర్యునికి దూరముగా) ఉన్నాడు. అంతకన్నా దూరముగా అంగారకుడు ఉంటాడు. సూర్యుడు ఏడాదిలో తిర్గేది ఈయన వక్రగతి లేకుంటే ఒక్కో రాశిని నలభై ఐదు రోజులలో తిరుగుతాడు. ఈయన ఋణ కారకుడు. సరి అయిన స్థానములో లేని అంగారకుడు అప్పు చేయిస్తాడు.

ఉశనసా బుధో వ్యాఖ్యాతస్తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనతో బుధః సోమసుత ఉపలభ్యమానః
ప్రాయేణ శుభకృద్యదార్కాద్వ్యతిరిచ్యేత తదాతివాతాభ్రప్రాయానావృష్ట్యాదిభయమాశంసతే

హనుమంతుడు అంగారకునికి శాంతి కారకుడు. కుజ దోషమున్నప్పుడు అందుకే సుందరకాండ పారాయణ చేయాలి.

అత ఊర్ధ్వమఙ్గారకోऽపి యోజనలక్షద్వితయ ఉపలభ్యమానస్త్రిభిస్త్రిభిః పక్షైరేకైకశో
రాశీన్ద్వాదశానుభుఙ్క్తే యది న వక్రేణాభివర్తతే ప్రాయేణాశుభగ్రహోऽఘశంసః

తత ఉపరిష్టాద్ద్విలక్షయోజనాన్తరగతా భగవాన్బృహస్పతిరేకైకస్మిన్రాశౌ పరివత్సరం
పరివత్సరం చరతి యది న వక్రః స్యాత్ప్రాయేణానుకూలో బ్రాహ్మణకులస్య

ఈయన మీద రెండు లక్షల యోజనాలలో బృహస్పతి. పరివత్సరం పాటు తిరుగుతాడు (సూర్యుని మాంద్యము - పరివత్సరం, 366 రోజులు) . వంకరగా వెళ్ళకుంటే ఈయన బ్రాహ్మణులకు అనుకూలం

తత ఉపరిష్టాద్యోజనలక్షద్వయాత్ప్రతీయమానః శనైశ్చర ఏకైకస్మిన్రాశౌ
త్రింశన్మాసాన్విలమ్బమానః సర్వానేవానుపర్యేతి తావద్భిరనువత్సరైః ప్రాయేణ హి సర్వేషామశాన్తికరః

ఈయనకన్న పైన శని. ఈయన ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలుంటాడు. చాలా మెల్లగా వెళతాడు. ఈయన అశాంతిని కలిగిస్తాడు

తత ఉత్తరస్మాదృషయ ఏకాదశలక్షయోజనాన్తర ఉపలభ్యన్తే య ఏవ లోకానాం
శమనుభావయన్తో
భగవతో విష్ణోర్యత్పరమం పదం ప్రదక్షిణం ప్రక్రమన్తి

దీని తరువత ఇంకా పైన ఋషుల లోకముంటుంది. సకల లోకాల మంగళాన్ని ఆశిస్తూ ద్రువమండలం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు

Thursday, March 28, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవైయొకటవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవైయొకటవ అధ్యాయం

అనారోగ్యముగా ఉండేవారు ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే అన్ని జబ్బులూ పోతాయి.

శ్రీశుక ఉవాచ
ఏతావానేవ భూవలయస్య సన్నివేశః ప్రమాణలక్షణతో వ్యాఖ్యాతః

భూమండలం గురించి నీకు చెప్పాను.

ఏతేన హి దివో మణ్డలమానం తద్విద ఉపదిశన్తి యథా ద్విదలయోర్నిష్పావాదీనాం తే
అన్తరేణాన్తరిక్షం తదుభయసన్ధితమ్

భూమండలం గురించి తెలిస్తే ఆకాశ మండలం కూడా సులభముగా తెలుసుతుంది. ఒక పప్పును రెండు భాగాలుగా చేస్తే ఒక భాగం కొలత తెలిస్తే రెండవ భాగం కొలత చెప్పకర్లేదు.

యన్మధ్యగతో భగవాంస్తపతాం పతిస్తపన ఆతపేన త్రిలోకీం ప్రతపత్యవభాసయత్యాత్మ
భాసా స ఏష ఉదగయనదక్షిణాయనవైషువతసంజ్ఞాభిర్మాన్ద్యశైఘ్ర్య
సమానాభిర్గతిభిరారోహణావరోహణసమానస్థానేషు యథాసవనమభిపద్యమానో మకరాదిషు
రాశిష్వహోరాత్రాణి దీర్ఘహ్రస్వసమానాని విధత్తే

రెండు పప్పు భాగాల మధ్యలో సూర్యుడు ఉన్నాడు. ద్యౌ అంటే పై పప్పు, భూమి కింద పప్పు. వీటి మధ్య సూర్యుడున్నాడు. ఈయన తన ఎండతో మూడు లోకాలను తపింపచేస్తాడు. తన కాంతితో మూడు లోకాలనూ ప్రకాశింపచేస్తాడు. సూర్యుడు ఉత్తరాయణ (మకర సంక్రమణం) దక్షిణాయన(కర్కాటక సంక్రమణం) విషువ (మేష తుల సంక్రమణం). సూర్య భగవానుని గమనం బట్టే కాలాన్ని నిర్ణ్యైస్తున్నాము. భూమధ్య భాగానికి దక్షిణ భాగాన్నికి సూర్యుడు వస్తే దక్షిణాయణం. మన కిటీలోంచి వెలుతురు ఏ దిక్కులోంచి వస్తే ఆ ఆయనం. కర్కాటకం వస్తే దక్షిణాయనం. కర్కాటకం నుంచీ మకరం వరకూ దక్షిణ, మకరములోకి రాగానే ఉత్తరాయణం. సగ భాగానికి వచ్చేది ఆయనం. నాలుగవ భాగానికి వచ్చేది విశువ. ఉత్తరాయణ కాలములో సూర్యుడు మెల్లగా నడుస్తాడు. దక్షిణాయనములో వేగముగా నడుస్తాడు. మేష తులా సంక్రమణములో (విశువ) సమానముగా ఉంటాడు. ఒక సమయములో ఎత్తులో ఒక సమయములో కిందిభాగములో ఉంటాడు.

(శ్లో|| తులాయ జాయతే శీతం, వృశ్చికేషు ప్రవర్ధతే

ధనురే ధనురాకారే, మకరే కుండలాకృతిం

కుంభం శీతం -శీతం వా, మీనే శీతవారణం||

అంటే తులరాశిలో సూర్యుడు సంచరించినప్పుడు చలి పుడుతుంది. వృశ్చికరాశిలో సూర్యుడు సంచరించినప్పుడు చలి పెరుగుతుంది. ధనుస్సులో చలికి మానవుడు విల్లు వంగినట్లుగా అర్ధచంద్రాకారంలా అయిపోతాడు. మకరంలో చలికి తట్టుకోలేక గొంగళిపురుగులా కంబళి కప్పుకు పడుకుంటాడు. కుంభరాశిలో చలి ఉందా లేదా అన్నట్లుండి, సూర్యుడు మీనరాశిలో సంచరించినప్పుడు చలి వారితమవుతుంది.)

యదా మేషతులయోర్వర్తతే తదాహోరాత్రాణి సమానాని భవన్తి యదా వృషభాదిషు పఞ్చసు చ
రాశిషు
చరతి తదాహాన్యేవ వర్ధన్తే హ్రసతి చ మాసి మాస్యేకైకా ఘటికా రాత్రిషు

మేషములో తులలో ఉన్నప్పుడు పగలూ రాత్రీ సమానముగా ఉంటాయి. వృషభం నుంచీ ఐదు రాశులలో పగలు పెరుగుతాయి. ఒక్కొక్క నెలకూ ఒక్కొక్క ఘడియ రాత్రులలో తరుగుతుంది. వృశ్చికం నుంచి ఐదు రాశులలో దీనికి విపర్యయముగా ఉంటుంది. దక్షిణాయనములో పగల్లూ ఉత్తరాయణములో రాత్రులూ తగ్గుతాయి.

యదా వృశ్చికాదిషు పఞ్చసు వర్తతే తదాహోరాత్రాణి విపర్యయాణి భవన్తి

యావద్దక్షిణాయనమహాని వర్ధన్తే యావదుదగయనం రాత్రయః

ఏవం నవ కోటయ ఏకపఞ్చాశల్లక్షాణి యోజనానాం మానసోత్తరగిరిపరివర్తనస్యోపదిశన్తి
తస్మిన్నైన్ద్రీం పురీం పూర్వస్మాన్మేరోర్దేవధానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ
పశ్చాద్వారుణీం నిమ్లోచనీం నామ ఉత్తరతః సౌమ్యాం విభావరీం నామ తాసూదయమధ్యాహ్నాస్తమయ
నిశీథానీతి భూతానాం ప్రవృత్తినివృత్తినిమిత్తాని సమయవిశేషేణ మేరోశ్చతుర్దిశమ్

సూర్యభగవానుడు ఒక పూటలో తొమ్మిది కోట్ల యాభై యొక్క కోట్ల యోజనాలు తిరుగుతాడు. మానస ఉత్తర గిరి చుట్టూ తిరుగుతాడు. అక్కడ ఇంద్రుని పురముంటుంది. మేరువు కంటే తూర్పు దిక్కులో ఉంటుంది. దాని పేరు దేవధాని. తూర్పు దిక్కున యమ నగరం సమ్యమని, పశ్చిమాన నిమ్నోచని అని వరుణ నగరం, ఉత్తరములో చంద్రుని నగరం విభావరి. ఈ ప్రాంతాలలో సూర్యుడు సంచరిస్తున్నపుడు సూర్యోదయమని అస్తమయమనీ అంటున్నాము. ఉదయము కాగానే ప్రాణులన్నీ ప్రవృత్తిలోకి దిగుతాయి. అస్తమయం కాగానే నివృత్తి.  మేరువు యొక్క నాలుగు దిక్కులలో సూర్యభగవానుని సంచారాన్ని బట్టే ప్రాణుల ప్రవృత్తి నివృత్తులు ఆధారపడి ఉన్నాయి.

తత్రత్యానాం దివసమధ్యఙ్గత ఏవ సదాదిత్యస్తపతి సవ్యేనాచలం దక్షిణేన కరోతి

ఆయన ఏ భాగానికి వస్తే దాని వెనక భాగం దిక్కు మారుతుంది.

యత్రోదేతి తస్య హ సమానసూత్రనిపాతే నిమ్లోచతి యత్ర క్వచన స్యన్దేనాభితపతి తస్య హైష
సమాన
సూత్రనిపాతే ప్రస్వాపయతి తత్ర గతం న పశ్యన్తి యే తం సమనుపశ్యేరన్

సూర్యుడు ఏ ప్రాంతములో ఉదయిస్తున్నాడో ఆ ప్రాంతములో దారము పట్టి కొలిస్తే ఆ ప్రాంతానికి వ్యతిరేక దిశలో అస్తమిస్తాడు. మనకు ఋతువులు మారినప్పుడు అప్పుడప్పుడు పక్కకి జరుగుతాడు. ఎంత భాగములో ఏ దిక్కులో ఉదయించాడో అంత భాగం ఆ వ్యతిరేక దిక్కులో అస్తమిస్తాడు. మహానుభావులు ఎక్కడ అస్తమిస్తాడో ఎవరూ చూడలేరు.

యదా చైన్ద్ర్యాః పుర్యాః ప్రచలతే పఞ్చదశఘటికాభిర్యామ్యాం సపాదకోటిద్వయం యోజనానాం
సార్ధద్వాదశలక్షాణి సాధికాని చోపయాతి

సూర్యభగవానుడు తూర్పు దిక్కు ఇంద్రుని నగరానికి వెళ్ళినప్పుడు పదిహేను ఘడియల్లో రెండుకోట్ల ఇరవైఐదు లక్షల యోజనాలు ప్రయాణిస్తాడు. అందులో సగం పన్నెండు లక్షల యాభై వేలు యోజనాలు. రెండూ కలిపితే దక్షిణ భాగములో ఉన్నప్పుడు సూర్యుడు దాటిన దూరము

ఏవం తతో వారుణీం సౌమ్యామైన్ద్రీం చ పునస్తథాన్యే చ గ్రహాః సోమాదయో నక్షత్రైః సహ జ్యోతిశ్
చక్రే సమభ్యుద్యన్తి సహ వా నిమ్లోచన్తి

రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల యాభై వేల యోజనాలు ఒక్కో దిక్కూ ఉన్నప్పుడు ఆయన సంచరిస్తాడు. అది పదిహేను ఘడియలు. నాలుగు దిక్కులు అంటే అరవై ఘడియలు. తొమ్మిది కోట్ల యాభై లక్షల యోజనాలను అరవై ఘడియల్లో సంచరిస్తున్నాడు. సూర్యభగవానుడు ఏ ఏ దిక్కులలో సంచరించి ఉదయించి అస్తమిస్తూ ఉన్నప్పుడు ఆయా సమయములలో మిగతా గ్రహాలు ఉదయించి అస్తమిస్తూ ఉంటాయి.

ఏవం ముహూర్తేన చతుస్త్రింశల్లక్షయోజనాన్యష్టశతాధికాని సౌరో రథస్త్రయీమయోऽసౌ చతసృషు
పరివర్తతే పురీషు

ఒక ముహూర్త కాలములో (ముప్పై ముహూర్తాలకు ఒక రోజు; ఒక ముహూర్తం రెండు ఘడియలు) ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వందల యోజనాలు ఒక ముహూర్త కాలములో సూర్యుని రథం సంచరిస్తుంది. సూర్యుని రథం వేద మయం. రెండుకోట్ల ముప్పై ఏడు లక్షల యోజనాలు పదిహేను ఘడియలలో తిరుగుతాడు.

యస్యైకం చక్రం ద్వాదశారం షణ్నేమి త్రిణాభి సంవత్సరాత్మకం సమామనన్తి తస్యాక్షో
మేరోర్మూర్ధని కృతో మానసోత్తరే కృతేతరభాగో యత్ర ప్రోతం రవిరథచక్రం తైలయన్త్ర
చక్రవద్భ్రమన్మానసోత్తరగిరౌ పరిభ్రమతి

సూర్యుని రథ చక్రానికి పన్నెండు ఆకులుంటాయి. ఆరు నేములు (అంచులు ఉంటాయి), మూడు ఇరుసులు ఉంటాయి. రథ చక్రాన్ని బట్టే సంవత్సరాన్ని గురించి చెబుతాము. దాని అక్ష  భాగం (ఇరుసు) మేరు పైభాగములో ఉంటుంది. కుమ్మరి కుండ చేస్తే ఎలా తిరుగుతుందో సూర్యుని రథ చక్రం అలా తిరుగుతుంది. సూర్యుని రథ చక్రం తిరిగేసరికి ఒక సంవత్సరం అవుతుంది. తైలయన్త్ర - ఒక గానుగలాగ చక్రం తిరుగుతుంది. కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు, గుండ్రముగా తిరుగుతాడు గానీ ముందుకు వెళ్ళడు. ఆయన ఎంత తిరిగినా మేరు పర్వతం మానసోత్తరం చుట్టుకొలత దాటి వెళ్ళడు

తస్మిన్నక్షే కృతమూలో ద్వితీయోऽక్షస్తుర్యమానేన సమ్మితస్తైలయన్త్రాక్షవద్ధ్రువే కృతోపరి
భాగః

ఆ ఇరుసు యొక్క పైభాగం ధ్రువమండల, కింది భాగం మేరు పర్వతం, దాని అవతల భాగం మానసోత్తరం.

రథనీడస్తు షట్త్రింశల్లక్షయోజనాయతస్తత్తురీయభాగవిశాలస్తావాన్రవిరథయుగో యత్ర
హయాశ్ఛన్దోనామానః సప్తారుణయోజితా వహన్తి దేవమాదిత్యమ్

ఆ రథం యొక్క చాయ ముప్పై ఆరు లక్షల యోజనాలు ఉంటుంది. అందులో నాలుగవ భాగం వైశాల్యం. ఆ నొగలు వద్ద వేద స్వరూపాలైన గుఱ్ఱాలు ఉంటాయి. అరుణుడనే సారధితో కలిసి ఉన్న సూర్యభగవానుని మోస్తుంటారు. సూర్యుని రథ నీడ ముప్పై ఆరు లక్షణాల యోజనాలు కలిగి ఉంటుంది.అందులో నాలుగ భాగం వైశాల్యం నొగలు. ఏడు గుర్రాలు అరుణునిచేత పూంచబడి సూర్యభగవానుని మోయుచున్నాయి

పురస్తాత్సవితురరుణః పశ్చాచ్చ నియుక్తః సౌత్యే కర్మణి కిలాస్తే

సూర్యభగవానుని ముందూ వెనకా కూడా పూంచబడి సూర్యభగవానుని సారధ్యములో . సూర్యుడు ముందర ఉన్నప్పుడు అరుణుడు సూర్యుని ముందర ఉంటాడు, వెళుతున్నప్పుడు వెనక ఉంటాడు

తథా వాలిఖిల్యా ఋషయోऽఙ్గుష్ఠపర్వమాత్రాః షష్టిసహస్రాణి పురతః సూర్యం సూక్తవాకాయ
నియుక్తాః
సంస్తువన్తి

సూర్యుని ముందర అరవై వేల మంది వాలఖిల్యులు బొటన వ్రేలి ప్రమాణములో ఉంటారు అరుణ సూక్తాన్ని చేస్తూ ఉంటారు.

తథాన్యే చ ఋషయో గన్ధర్వాప్సరసో నాగా గ్రామణ్యో యాతుధా

గంధర్వులూ అప్సరసలూ నాగులూ ఋషి గణం దేవతా గణం ఇలా ఒక్కో గణం గంధర్వులూ అప్సరసలూ నాగులూ ఋషి గణం దేవతా గణం ఇలా ఒక్కో గణం

నా దేవా ఇత్యేకైకశో గణాః సప్త
చతుర్దశ మాసి మాసి భగవన్తం సూర్యమాత్మానం నానానామానం పృథఙ్నానానామానః పృథక్
కర్మభిర్ద్వన్ద్వశ ఉపాసతే

తొమ్మిది కోట్ల యాభై యొక్క లక్షల యోజనాల దూరములో క్షణ కాలములో రెండు వేల యోజనాల రెండు కోసుల దూరాన్ని తిరుగుతాడు 

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అతః పరం ప్లక్షాదీనాం ప్రమాణలక్షణసంస్థానతో వర్షవిభాగ ఉపవర్ణ్యతే

జమ్బూద్వీపోऽయం యావత్ప్రమాణవిస్తారస్తావతా క్షారోదధినా పరివేష్టితో యథా
మేరుర్జమ్బ్వాఖ్యేన
లవణోదధిరపి తతో ద్విగుణవిశాలేన ప్లక్షాఖ్యేన పరిక్షిప్తో యథా పరిఖా బాహ్యోపవనేన ప్లక్షో జమ్బూ
ప్రమాణో ద్వీపాఖ్యాకరో హిరణ్మయ ఉత్థితో యత్రాగ్నిరుపాస్తే సప్తజిహ్వస్తస్యాధిపతిః ప్రియవ్రతాత్మజ
ఇధ్మజిహ్వః స్వం ద్వీపం సప్తవర్షాణి విభజ్య సప్తవర్షనామభ్య ఆత్మజేభ్య ఆకలయ్య స్వయమాత్మ
యోగేనోపరరామ

జంబూ ద్వీపం ఎంత పొడవూ వెడల్పూ వైశాల్యమూ ఉన్నదో అంత కొలతా ఉన్న ఉప్పు సముద్రం జంబూ ద్వీపం చుట్టూ ఉంది. మేరు పర్వతం జంబూ ద్వీపముతో ఆవరించబడి ఉనట్లుగా ఉప్పు సముద్రం కూడా దాని కంటే రెండు రెట్లు వైశాల్యం ఉన్న ప్లక్ష ద్వీపముతో ఆవరించబడి ఉన్నది . అంబూ ద్వీపమూ దాని చుట్టూ లవణ సముద్రం, దాని చుట్టూ ప్లక్షం. ద్వీపమూ - సముద్రమూ - ద్వీపము. ద్వీపానికి సముద్రము హద్దు, సముద్రానికి ద్వీపం హద్దు. ప్లక్ష ద్వీపములో ఏడు నాలికలు గల అగ్ని ఆరాధించబడతాడు. ప్రియవ్రతుని కుమారుడైన ఇద్మ జిహ్వుడు ఆరాధిస్తాడు. ప్లక్ష ద్వీపాన్ని ఏడూ వర్షాలుగా విభజించి, ఏడు కుమారుల పేర్లు వాటికి పెట్టి, వారికి అవి పెంచి; పరమాత్మను ఆరాధించడానికి వెళ్ళిపోయాడు

శివం యవసం సుభద్రం శాన్తం క్షేమమమృతమభయమితి వర్షాణి తేషు గిరయో నద్యశ్చ
సప్తైవాభిజ్ఞాతాః
శివం యవసం సుభద్రం శాన్తం క్షేమమమృతమభయమితి - ఈ ఏడూ వర్షాలు
మణికూటో వజ్రకూట ఇన్ద్రసేనో జ్యోతిష్మాన్సుపర్ణో హిరణ్యష్ఠీవో మేఘమాల ఇతి సేతుశైలాః - ఇవి పర్వతాలూ
అరుణా
నృమ్ణాఙ్గిరసీ సావిత్రీ సుప్తభాతా ఋతమ్భరా సత్యమ్భరా ఇతి మహానద్యః - ఇవి మహానదులు యాసాం జలోపస్పర్శనవిధూతరజస్
తమసో హంసపతఙ్గోర్ధ్వాయనసత్యాఙ్గసంజ్ఞాశ్చత్వారో వర్ణాః సహస్రాయుషో విబుధోపమసన్దర్శన
ప్రజననాః స్వర్గద్వారం త్రయ్యా విద్యయా భగవన్తం త్రయీమయం సూర్యమాత్మానం యజన్తే

ఈ నదుల జలమును స్పృశిస్తే అన్ని పాపాలూ తొలగిపోతాయి. ఈ ద్వీపములో నాలుగు జాతులున్నాయి. హంస, పతంగ ఊర్ధ్వాయన సత్యాంగ అనే వర్ణాలున్నాయి. పరమాత్మ వేద మంత్రాలతో సూర్య భగవానుని ఆరాధిస్తారు

ప్రత్నస్య విష్ణో రూపం యత్సత్యస్యర్తస్య బ్రహ్మణః
అమృతస్య చ మృత్యోశ్చ సూర్యమాత్మానమీమహీతి

ఇది సూర్య భగవానుని మంత్రం.
సనాతనుడైన పరమాత్మ, సత్యుడు మంగళ కరుడు. పరమాత్మ మోక్షానికీ సంసారమునకూ ఆత్మ పుట్టాలన్నా పుట్టిన వారు బతకాలన్నా బతికిన వారు మరణించాలన్నా సూర్యుడే మూలం. అటువంటి సూర్యున్ని ఆరాధిస్తున్నాము. ప్లక్ష్యాది ద్వీపాలలో పుట్టినప్పటినుంచే ఇంద్రియ బలం మొదలైనవి ఉంటాయి.

ప్లక్షాదిషు పఞ్చసు పురుషాణామాయురిన్ద్రియమోజః సహో బలం బుద్ధిర్విక్రమ ఇతి చ
సర్వేషామౌత్పత్తికీ సిద్ధిరవిశేషేణ వర్తతే

ఈ ద్వీపాలలో శక్తి తరుగుటలేదు. చెరుకు రసము గల సముద్రం.ఇక్కడ శాల్మలీ వృక్షం, దాని చుట్టూ సురా సముద్రం ఉంటుంది

ప్లక్షః స్వసమానేనేక్షురసోదేనావృతో యథా తథా ద్వీపోऽపి శాల్మలో ద్విగుణవిశాలః సమానేన
సురోదేనావృతః పరివృఙ్క్తే

యత్ర హ వై శాల్మలీ ప్లక్షాయామా యస్యాం వావ కిల నిలయమాహుర్భగవతశ్ఛన్దఃస్తుతః పతత్త్రి
రాజస్య సా ద్వీపహూతయే ఉపలక్ష్యతే

ఈ శాల్మలీ ద్వీపం ప్లక్ష ద్వీపం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. గరుడున్ని ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారు. ప్రియవ్రతుని కుమారుడైన యజ్ఞ్యబాహువు అధిపతి. ఇతను కూడా ఈ వర్షాన్ని ఏడు భాగాలు చేసి ఏడు వర్షాలను ఏడుగురు కొడుకులకు ఇచ్చాడు.

తద్ద్వీపాధిపతిః ప్రియవ్రతాత్మజో యజ్ఞబాహుః స్వసుతేభ్యః సప్తభ్యస్తన్నామాని సప్తవర్షాణి
వ్యభజత్సురోచనం సౌమనస్యం రమణకం దేవవర్షం పారిభద్రమాప్యాయనమవిజ్ఞాతమితి

తేషు వర్షాద్రయో నద్యశ్చ సప్తైవాభిజ్ఞాతాః స్వరసః శతశృఙ్గో వామదేవః కున్దో ముకున్దః పుష్ప
వర్షః సహస్రశ్రుతిరితి అనుమతిః సినీవాలీ సరస్వతీ కుహూ రజనీ నన్దా రాకేతి

ఏడు పర్వతాలూ ఏడు నదులూ ఉన్నాయి

తద్వర్షపురుషాః శ్రుతధరవీర్యధరవసున్ధరేషన్ధరసంజ్ఞా భగవన్తం వేదమయం
సోమమాత్మానం వేదేన యజన్తే

ఇక్కడ ఉండే వర్ణాల పేర్లు: శ్రుతధరవీర్యధరవసున్ధరేషన్ధర. ఇక్కడ చంద్రున్ని ఆరాధిస్తారు వేద మంత్రాలతో..

స్వగోభిః పితృదేవేభ్యో విభజన్కృష్ణశుక్లయోః
ప్రజానాం సర్వాసాం రాజా న్ధః సోమో న ఆస్త్వితి

తన కిరణములతో దేవతలకూ పితృదేవతలకూ ఆహారమిస్తాడు. శుక్లపక్షములో దేవతలకూ కృష్ణ పక్షములో పితృదేవతలకూ (అంధః అంటే ఆహారం)ఆహారం ఇస్తాడు కాబట్టి రాజు

ఏవం సురోదాద్బహిస్తద్ద్విగుణః సమానేనావృతో ఘృతోదేన యథాపూర్వః కుశద్వీపో
యస్మిన్కుశ
స్తమ్బో దేవకృతస్తద్ద్వీపాఖ్యాకరో జ్వలన ఇవాపరః స్వశష్పరోచిషా దిశో విరాజయతి

దానికి రెట్టింపుగా ఘృత సముద్రం, అందులో కుశ ద్వీపం, అందులో ఒక కుశ (దర్భ) వృక్షముంది. మరొక అగ్ని హోత్రునిలా తన కాంతితో అన్ని దిక్కులనీ ప్రకాశింపచేస్తుంది. ప్రియవ్రతుని కుమారుడైన హిరణ్యరేతుడు తన ఏడుగురు కొడుకులకీ ఏడు భాగాలూ ఇచ్చి  తపస్సుకి వెళ్ళిపోయాడు

తద్ద్వీపపతిః ప్రైయవ్రతో రాజన్హిరణ్యరేతా నామ స్వం ద్వీపం సప్తభ్యః స్వపుత్రేభ్యో యథా
భాగం విభజ్య స్వయం తప ఆతిష్ఠత వసువసుదానదృఢరుచినాభిగుప్తస్తుత్యవ్రతవివిక్తవామదేవ
నామభ్యః

తేషాం వర్షేషు సీమాగిరయో నద్యశ్చాభిజ్ఞాతాః సప్త సప్తైవ చక్రశ్చతుఃశృఙ్గః కపిలశ్చిత్రకూటో
దేవానీక ఊర్ధ్వరోమా ద్రవిణ ఇతి రసకుల్యా మధుకుల్యా మిత్రవిన్దా శ్రుతవిన్దా దేవగర్భా ఘృతచ్యుతా
మన్త్రమాలేతి

 చక్రశ్చతుఃశృఙ్గః కపిలశ్చిత్రకూటో దేవానీక ఊర్ధ్వరోమా ద్రవిణ - వర్షములూ
రసకుల్యా మధుకుల్యా మిత్రవిన్దా శ్రుతవిన్దా దేవగర్భా ఘృతచ్యుతా మన్త్రమాలేతి - నదులు

యాసాం పయోభిః కుశద్వీపౌకసః కుశలకోవిదాభియుక్తకులకసంజ్ఞా భగవన్తం జాతవేద
సరూపిణం కర్మకౌశలేన యజన్తే

కుశద్వీపౌకసః కుశలకోవిదాభియుక్త - ఇవి వర్ణాలు

పరస్య బ్రహ్మణః సాక్షాజ్జాతవేదోऽసి హవ్యవాట్
దేవానాం పురుషాఙ్గానాం యజ్ఞేన పురుషం యజేతి

ఈ ద్వీపములో అగ్నిహోత్రుడు ప్రధాన దైవం. ఈయన జాత వేదుడు - వేదం దేనితో పుట్టినదో. నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వస్వరూపాన్ని తెలిపేవాడవు, హవ్యాన్ని వహించేవాడవు.దేవతలను కాదు. దేవతల పేరుతో ఉన్న పరమాత్మ యొక్క అవయవాలను యజ్ఞ్యమనే పేరుతో ఆరాధిస్తున్నాము. పరమాత్మ అవయవాలుగా ఉన్న ఇతర దేవతలను ఆరాధిస్తున్నాము. అవయవాలకు చేసిన ఆరాధన అవయవే పొందుతాడు. వీటిని అగ్ని హోత్రుడే మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఆయన పేరు జాత వేద

తథా ఘృతోదాద్బహిః క్రౌఞ్చద్వీపో ద్విగుణః స్వమానేన క్షీరోదేన పరిత ఉపక్లృప్తో వృతో యథా
కుశద్వీపో ఘృతోదేన యస్మిన్క్రౌఞ్చో నామ పర్వతరాజో ద్వీపనామనిర్వర్తక ఆస్తే

క్రౌంచ ద్వీపం తన కన్నా పూర్వం ఉన్న ద్వీపముల కన్నా రెండింతలు ఉండి పాల సముద్రముతో వ్యాపించి ఉంటుంది. కుశ ద్వీపం ఘృత సముద్రముతో ఉన్నట్లు ఈ ద్వీపం క్షీర సముద్రముతో ఉంటుంది. ఇక్కడుండే పర్వతం పేరు క్రౌంచ పర్వతం.

యోऽసౌ గుహప్రహరణోన్మథితనితమ్బకుఞ్జోऽపి క్షీరోదేనాసిచ్యమానో భగవతా
వరుణేనాభిగుప్తో
విభయో బభూవ

ఈ క్రౌంచ పర్వతమును కుమారస్వామి తన శూలముతో కొట్టగా ఆ పైభాగం గాయపడింది. అలా గాయపడిన దాన్ని పరమాత్మ క్షీరసముద్రములో ఉన్న పాలతో బాగు చేయగా ఇప్పుడు మరలా ప్రకాశిస్తోంది. వరుణుడు కాపడగా ఇపుడు భయము లేనిదై ఉన్నది

తస్మిన్నపి ప్రైయవ్రతో ఘృతపృష్ఠో నామాధిపతిః స్వే ద్వీపే వర్షాణి సప్త విభజ్య తేషు పుత్రనామసు
సప్త రిక్థాదాన్వర్షపాన్నివేశ్య స్వయం భగవాన్భగవతః పరమకల్యాణయశస ఆత్మభూతస్య
హరేశ్చరణారవిన్దముపజగామ

దీన్ని పరిపాలించేవాడు ప్రియవ్రతుని కుమారుడు ఘృతపృష్ఠ. ఇతను కూడా ఏడుగా విభజించి ఏడుగురికి ఏడు వర్షాలిచ్చి రాజ్యాన్ని వారికి వదిలి పరమాత్మను ఆరాధిస్తున్నాడు. వారి కొడుకుల పేర్లతోటే వర్షాల పేర్లు ఉన్నాయి.

ఆమో మధురుహో మేఘపృష్ఠః సుధామా భ్రాజిష్ఠో లోహితార్ణో వనస్పతిరితి
ఘృతపృష్ఠసుతాస్తేషాం
వర్షగిరయః సప్త సప్తైవ నద్యశ్చాభిఖ్యాతాః శుక్లో వర్ధమానో భోజన ఉపబర్హిణో నన్దో నన్దనః
సర్వతోభద్ర ఇతి అభయా అమృతౌఘా ఆర్యకా తీర్థవతీ రూపవతీ పవిత్రవతీ శుక్లేతి

దీనికీ ఏడు నదులూ పర్వతాలూ ఉన్నాయి.  ఇక్కడ పురుష వృషభ ద్రవిణా దేవ అని నాలుగు వర్ణాలు. ఇక్కడ వరుణ దేవతని ఆరాధిస్తారు

యాసామమ్భః పవిత్రమమలముపయుఞ్జానాః పురుషఋషభద్రవిణదేవకసంజ్ఞా వర్షపురుషా
ఆపోమయం దేవమపాం పూర్ణేనాఞ్జలినా యజన్తే

ఆపః పురుషవీర్యాః స్థ పునన్తీర్భూర్భువఃసువః
తా నః పునీతామీవఘ్నీః స్పృశతామాత్మనా భువ ఇతి

జలమంటే పరమాత్మ వీర్యము (శక్తి). ఈ జలమే మూడు లోకాలనూ పునీతం చేస్తుంది. ఈ జలం పాపమును (అమీవ) హరిస్తుంది (అమీవఘ్ని). నదీ స్నానం వలన గ్రహబాధలు పోతాయి.

ఏవం పురస్తాత్క్షీరోదాత్పరిత ఉపవేశితః శాకద్వీపో ద్వాత్రింశల్లక్షయోజనాయామః సమానేన చ
దధిమణ్డోదేన పరీతో యస్మిన్శాకో నామ మహీరుహః స్వక్షేత్రవ్యపదేశకో యస్య హ మహాసురభి
గన్ధస్తం ద్వీపమనువాసయతి

దాని చుట్టూ ఉండే ద్వీపం శాఖ ద్వీపం. ఇక్కడ పెరుగు సముద్రం, శాక వృక్షం ఉంటుంది. ఆ సువాసన వ్యాపించి ఉంటుంది .

తస్యాపి ప్రైయవ్రత ఏవాధిపతిర్నామ్నా మేధాతిథిః సోऽపి విభజ్య సప్త వర్షాణి పుత్రనామాని తేషు
స్వాత్మజాన్పురోజవమనోజవపవమానధూమ్రానీకచిత్రరేఫబహురూపవిశ్వధార
సంజ్ఞాన్నిధాప్యాధిపతీన్స్వయం భగవత్యనన్త ఆవేశితమతిస్తపోవనం ప్రవివేశ

మేధాతిథిః అనే ప్రియవ్రతుని పుత్రుడు ఏడు వర్షాలుగా విభజించి ఏడుగుర్ కొడుకులకు ఇచ్చారు.

ఏతేషాం వర్షమర్యాదాగిరయో నద్యశ్చ సప్త సప్తైవ ఈశాన ఉరుశృఙ్గో బలభద్రః శతకేసరః
సహస్రస్రోతో దేవపాలో మహానస ఇతి అనఘాయుర్దా ఉభయస్పృష్టిరపరాజితా పఞ్చపదీ సహస్రస్రుతిర్నిజధృతిరితి



తద్వర్షపురుషా ఋతవ్రతసత్యవ్రతదానవ్రతానువ్రతనామానో భగవన్తం వాయ్వాత్మకం
ప్రాణాయామవిధూతరజస్తమసః పరమసమాధినా యజన్తే

పరమాత్మ వాయు రూపములో ఉంటాడు. శరీరములో మనసులో ఉండే దోషాలను పోగొట్టేది ప్రాణాయామము.

అన్తఃప్రవిశ్య భూతాని యో బిభర్త్యాత్మకేతుభిః
అన్తర్యామీశ్వరః సాక్షాత్పాతు నో యద్వశే స్ఫుటమ్

వాయువు ప్రతీ ప్రాణిలోపల ప్రవేశించి కాపాడుతుంది. పరమాత్మ ప్రతీవాని లోపల ప్రవేశించి వ్యాపిస్తాడు. తన చిహ్నములతో (పది వాయువుల పేర్లతో) అందరిలో ప్రవేశించి నిలుపుతున్నాడు

ఏవమేవ దధిమణ్డోదాత్పరతః పుష్కరద్వీపస్తతో ద్విగుణాయామః సమన్తత ఉపకల్పితః
సమానేన స్వాదూదకేన సముద్రేణ బహిరావృతో యస్మిన్బృహత్పుష్కరం జ్వలనశిఖామలకనక
పత్రాయుతాయుతం భగవతః కమలాసనస్యాధ్యాసనం పరికల్పితమ్

పుష్కర ద్వీపములో తీయని నీరు ఉంది.  ఇక్కడున్న పద్మం (పుష్కరమంటే పద్మం) బ్రహ్మకు ఆసనం. ఈ ద్వీపం మధ్యన . ఇక్కడ మానసోత్తరం సరిహద్దు పర్వతం. పది వేల యోజనాల ఎత్తూ వైశాల్యం ఉన్నది. ఇక్కడ నాలుగు దిక్కులలో నలుగురు లోకపలాకుల భవనాలున్నాయి.

తద్ద్వీపమధ్యే మానసోత్తరనామైక ఏవార్వాచీనపరాచీనవర్షయోర్మర్యాదాచలోऽయుత
యోజనోచ్ఛ్రాయాయామో యత్ర తు చతసృషు దిక్షు చత్వారి పురాణి లోకపాలానామిన్ద్రాదీనాం
యదుపరిష్టాత్సూర్య
రథస్య మేరుం పరిభ్రమతః సంవత్సరాత్మకం చక్రం దేవానామహోరాత్రాభ్యాం పరిభ్రమతి

ఈ (సూర్య) రథానికి ఒకే చక్రం, సారధికి కాళ్ళు లేవు, గుఱ్ఱాలకు (కిరణాలకు) ఆకారం లేదు. ఇవేవీ లేకున్నా ఆయనకు సత్వం (సంకల్పం మనసూ ధైర్యం ఉంది) ఉంది. అది ఉంటే సాధనాలు అవసరం లేదు.

తద్ద్వీపస్యాప్యధిపతిః ప్రైయవ్రతో వీతిహోత్రో నామైతస్యాత్మజౌ రమణకధాతకినామానౌ వర్ష
పతీ నియుజ్య స స్వయం పూర్వజవద్భగవత్కర్మశీల ఏవాస్తే

తద్వర్షపురుషా భగవన్తం బ్రహ్మరూపిణం సకర్మకేణ కర్మణారాధయన్తీదం చోదాహరన్తి

యత్తత్కర్మమయం లిఙ్గం బ్రహ్మలిఙ్గం జనోऽర్చయేత్
ఏకాన్తమద్వయం శాన్తం తస్మై భగవతే నమ ఇతి

పగలూ రాత్రి రూపములో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది.  తమ పుత్రులకు ఆ భాగాన్ని ఇచ్చేసి ఈ ఇద్దరు కొడుకులూ భగవానుని ఆరాధించడానికి వెళ్ళాడు. ఈ ద్వీపాధిపతి బ్రహ్మ.  రజస్సు తమస్సు లాంటి గుణాలు లేని ఏకాంతుడు పరమాత్మ. అదే గుర్తుగా కలిగిన పరమాత్మను మానవులు పూజించాలి. ఇలాంటి పరమాత్మకు నమస్కారం

తతః పరస్తాల్లోకాలోకనామాచలో లోకాలోకయోరన్తరాలే పరిత ఉపక్షిప్తః

లోకాలోకమనే పర్వతం. ఇక్కడితో సూర్య సంచారం ఆగిపోతుంది.

యావన్మానసోత్తరమేర్వోరన్తరం తావతీ భూమిః కాఞ్చన్యన్యాదర్శతలోపమా యస్యాం ప్రహితః
పదార్థో న కథఞ్చిత్పునః ప్రత్యుపలభ్యతే తస్మాత్సర్వసత్త్వపరిహృతాసీత్

ఆలోకమంటే వెలుతురు. లోకములలో ఉండే వెలుతురు. ఆ వెలుతురుకు అది హద్దు. దాని అవతల వెలుతురు లేదు.  మేరు మానస పర్వతాల మధ్యలో ఉన్న భూమి. లోకాలోకములలో ఏ పదార్థాన్ని పడవేసినా ఇంక అది ఎవరికీ దొరకదు. ఆ భూమి అంతా బంగారు భూమి.  కానీ వస్తువు పడేస్తే మళ్ళీ దొరకదు. పడ్డట్టు అనుభూతి మాత్రం ఉంటుంది. అందు వలన ఈ ప్రాంతములో ఎలాంటి ప్రాణీ ఉండదు. అందుకు అన్ని ప్రాణులచే ఇది వదిలివేయబడినది.

లోకాలోక ఇతి సమాఖ్యా యదనేనాచలేన లోకాలోకస్యాన్తర్వర్తినావస్థాప్యతే

స లోకత్రయాన్తే పరిత ఈశ్వరేణ విహితో యస్మాత్సూర్యాదీనాం ధ్రువాపవర్గాణాం జ్యోతిర్గణానాం
గభస్తయోऽర్వాచీనాంస్త్రీన్లోకానావితన్వానా న కదాచిత్పరాచీనా భవితుముత్సహన్తే తావదున్నహనాయామః

ఈ పర్వతముతో లోకాలోకముల యొక్క (వెలుత్రూ చీకటి మధ్య ఉన్న భాగనికి) భాగానికి ఆ పేరు వచ్చింది. ఇది పరమాత్మచేత జాగ్ర్త్తగా పరిపాలిచబడుతున్నాయి. ఇక్కడే సూర్యుడిమొదలు ధ్రువుని వరకూ. జ్యోతి కిరణములూ, దాని తరువాత ఉన్న మూడు లోకాలనూ ప్రకాశింపచేస్తున్నవై, అవి ఎప్పుడూ ముందరభాగానికే వెళతాయి గానీ, ఆ కిరణములు వెనక భాగానికి ప్రసరించవు. ఆ ప్రాంతం ఎంత వైశాల్యమూ ఔన్నత్యమో అంతా వ్యాపిస్తాయి. గానీ సాధారణముగా ఏ కిరణమైనా అన్ని దిక్కులకూ వస్తాయి. సూర్యుని వెలుగు అడ్డముగా వెళుతుంది.  కానీ ఇది మాత్రం ముందుకే వస్తుంది వెలుతురు.  అద్దము ముందర ఉన్న భాగాన్ని చూపుతుంది గానీ వెనక భాగాన్ని చూపదు. దీప కిరణములు కిందభాగానికి రావు. ఆదర్శము (అద్దము) వెనకభాగానికి రాదు, సూర్యుని కిరణములు అన్ని దిక్కులకీ వెళతాయి

ఏతావాన్లోకవిన్యాసో మానలక్షణసంస్థాభిర్విచిన్తితః కవిభిః స తు పఞ్చాశత్కోటిగణితస్య భూ
గోలస్య తురీయభాగోऽయం లోకాలోకాచలః

ఇది లోఖముల యొక్క సంగతి. దాని కొలతలూ స్వరూప స్వభావములను జ్ఞ్యానులు వివరించారు. భూగోళ వైశాల్యం యాభై కోట్ల యోజనాలు.  ఇందులో నాలగవ భాగం లోకాలోకాచలం.

తదుపరిష్టాచ్చతసృష్వాశాస్వాత్మయోనినాఖిలజగద్గురుణాధినివేశితా యే ద్విరదపతయ
ఋషభః
పుష్కరచూడో వామనోऽపరాజిత ఇతి సకలలోకస్థితిహేతవః

దీని పైన నాలుగు దిక్కులలో ఆత్మ యోని (బ్రహ్మ) చేత ఒక్కో దిక్కునకూ ఒక్కో గజరాజు నియమించబడి ఉంది.  ఋషభ పుష్కర చూడా వామన అపరాజిత. ఈ నాలుగు ఆయా ప్రాంతములు సక్రమముగా ఉండడానికి భారమును ఈ ఏనుగులు మోస్తాయి.

తేషాం స్వవిభూతీనాం లోకపాలానాం చ వివిధవీర్యోపబృంహణాయ భగవాన్పరమమహాపురుషో
మహావిభూతిపతిరన్తర్యామ్యాత్మనో విశుద్ధసత్త్వం ధర్మజ్ఞానవైరాగ్యైశ్వర్యాద్యష్టమహాసిద్ధ్య్
ఉపలక్షణం విష్వక్సేనాదిభిః స్వపార్షదప్రవరైః పరివారితో నిజవరాయుధోపశోభితైర్నిజభుజదణ్డైః
సన్ధారయమాణస్తస్మిన్గిరివరే సమన్తాత్సకలలోకస్వస్తయ ఆస్తే

కానీ ఇవేవి మనకు కనపడవు. కానీ మనం ఉండడానికి ఇవే కారణం. పని చేసే వారు ఇలాగే పైకి చెప్పుకోకుండా ఉండాలి. వారి వారి విభూతులూ లోకపలకులూ పరమాత్మే తన ప్రభావం చూపించడానికి. తన విభూతులతో ఆయా పేర్లతో ప్రపంచం బాగా సాగడానికి ఈ పని చేస్తుంటాడు. తన పేరు మాత్రం బయట రాదు. ఆ దిగ్గజాలకు అంతర్యామిగా పరమాత్మే ఉన్నాడు. ఈయన అంతర్యామి, ఆత్మ యొక్క గుణత్రయ రహితమైన విశుద్ధమైన సత్వం.ధర్మ జ్ఞ్యాన వైరాగ్యం ఐశ్వర్యం అనే నాలుగు కాళ్ళు గల పీఠములు ఉంటాయి. తన పరివారముతో కలిసి ఉండి తన భుజ దండములతో (అష్టాయుధములతో) లోకాలోక పర్వతము మీద ఏ ప్రాణీ ఉండదు.కానీ అక్కడ ఉండేది ఈ స్వామే. అక్కడినుంచి తన విభూతులతో తన పరివారాన్ని పంపుతాడులోకాలోక పర్వతము మీద ఏ ప్రాణీ ఉండదు.కానీ అక్కడ ఉండేది ఈ స్వామే.

ఆకల్పమేవం వేషం గత ఏష భగవానాత్మయోగమాయయా విరచితవివిధలోకయాత్రా
గోపీయాయేత్యర్థః

కల్పాంతం వరకూ తన ఆత్మమాయతో సకల లోకాల స్థితి రక్షణ ప్రవృత్తినీ కాపాడుతూ ఉంటాడు

యోऽన్తర్విస్తార ఏతేన హ్యలోకపరిమాణం చ వ్యాఖ్యాతం యద్బహిర్లోకాలోకాచలాత్తతః
పరస్తాద్యోగేశ్వరగతిం విశుద్ధాముదాహరన్తి

ప్రపంచము లోపల ఎంత భాగమో వెలుపల ఎంత భాగమో తెలిస్తుంది ఈ లోకాలోకాచలము గురించి తెలుసుకోవడం వలన. ఇది దాటి మన బుద్ధి వెళ్ళలేదు. అది దాటి ఏముందో మనకు తెలియదు

అణ్డమధ్యగతః సూర్యో ద్యావాభూమ్యోర్యదన్తరమ్
సూర్యాణ్డగోలయోర్మధ్యే కోట్యః స్యుః పఞ్చవింశతిః

సూర్యభగవానుడు బ్రహ్మాండం యొక్క మధ్య భాగములో ఉన్నాడు. పైన ఆకాశం కింద భూమి, మధ్య సూర్యభగవానుడు ఉండి, పైలోకాలకూ కింద లోకాలకూ వెలుగును ఇస్తాడు. సూర్యునికీ అండగోళానికి మధ్య ఉన్న విస్తీర్ణం ఇరవై ఐదు కోట్ల యోజనాలు. సూర్యుడు బ్రహ్మాండములో పుట్టాడు. బ్రహ్మాండములోనుండి బ్రహ్మ బయటకు వచ్చాక పుట్టాడు

మృతేऽణ్డ ఏష ఏతస్మిన్యదభూత్తతో మార్తణ్డ ఇతి వ్యపదేశః హిరణ్యగర్భ ఇతి యద్ధిరణ్యాణ్డ
సముద్భవః

మరణించిన అండములోంచి పుట్టాడు కాబట్టి ఆయన మార్తాండుడు. గుడ్డు మధ్య భాగం బంగారు రంగులో ఉంటుంది. అందులోంచి వచ్చాడు కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు.

సూర్యేణ హి విభజ్యన్తే దిశః ఖం ద్యౌర్మహీ భిదా
స్వర్గాపవర్గౌ నరకా రసౌకాంసి చ సర్వశః

సకల దిగ్ విభాగం చేసేవాడు సూర్యుడే. దిక్కులూ ఆకాశం స్వర్గం అపవర్గం నరకం భూమి మొదలైన విభాగాలన్నీ సూర్యుని వలనే జరిగాయి. దేవతలు సూర్యునికి పైన ఉన్నారు, మనం కింద ఉన్నాము. అందుకే అవి ఊర్ధ్వ లోకాలు, కిందవి అధోలోకాలు

దేవతిర్యఙ్మనుష్యాణాం సరీసృపసవీరుధామ్
సర్వజీవనికాయానాం సూర్య ఆత్మా దృగీశ్వరః

దేవతలతో మొదలుకొని సకల ప్రాణులకూ సూర్యుడే ఆత్మ కన్నూ శాసకుడు. సూర్య ఆత్మ జగతః స్తస్తుశశ్చ. సూర్యకిరణాలు మన శరీరం మీద పడే లోపల చేయాలి. తడిసీ తడియని శరీరం మీఎద ఆయన కిరణాలు పడితే ఆరోగ్యానికి మంచి. శరీరానికి ఏ భాగానికి ఎంత నీరు రావాలో అంత నీరు ఇస్తాడు

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
కిమ్పురుషే వర్షే భగవన్తమాదిపురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ
సన్నికర్షాభిరతః పరమభాగవతో హనుమాన్సహ కిమ్పురుషైరవిరతభక్తిరుపాస్తే

కింపురుష వర్షములో శ్రీరామచంద్రుడు ఆరాధించబడే దైవం. ఆరాధించే వాడు హనుమ. హనుమ కింపురుషునిగా పేరు పొందినవాడు. పరమాత్మ పాదముల యందే ప్రీతికలిగినవాడు, పరంభాగవతుడు తోటి కింపురుషులతో కలిసి స్వామిని ఆరాధిస్తున్నాడు

ఆర్ష్టిషేణేన సహ గన్ధర్వైరనుగీయమానాం పరమకల్యాణీం భర్తృభగవత్కథాం సముపశృణోతి
స్వయం చేదం గాయతి

ఓం నమో భగవతే ఉత్తమశ్లోకాయ నమ ఆర్యలక్షణశీలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మన ఉపాసిత
లోకాయ నమః సాధువాదనికషణాయ నమో బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇతి

ఈ మంత్రాన్ని ఉపాసించినందు వలన్ కీర్తీ సంపదా మనసుకు స్థైర్యం కలుగుతాయి.  ఉత్తముల చేత కీర్తించబడే వాడు, సజ్జనులు ఎలాంటి స్వభావముతో ఉండి ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తారో అలాంటి ధర్మాన్ని ఆచరిస్తాడు. రామచంద్రుడు మూడు రకముల వృద్ధులను సేవించేవాడు 1. జ్ఞ్యాన వృద్ధులూ 2. శీల వృద్ధులూ 3. వయో వృద్ధులు. ఒక అస్త్ర విద్యకూ ఇంకో అస్త్ర విద్యకూ మధ్య ఉన్న విరామములో వీరిని సేవించేవాడు. అన్నీ నేర్చుకున్నవాడూ, ప్రజలను ఆరాధించిన వాడు, మంచివారికి ఒరిపిడి రాయి వంటి వాడు.  బ్రాహ్మణులయందు ప్రీతి కలవారిని ఎక్కువ ఆరాధించేవాడు, బ్రాహ్మణుల యందు ప్రీతికలవాడు. మహా పురుషుడూ మహారాజు. ఈ మంత్రం వలన ఆయువూ స్థైర్యం కీర్తి లభిస్తాయి.

యత్తద్విశుద్ధానుభవమాత్రమేకం స్వతేజసా ధ్వస్తగుణవ్యవస్థమ్
ప్రత్యక్ప్రశాన్తం సుధియోపలమ్భనం హ్యనామరూపం నిరహం ప్రపద్యే

రామావతారం ఎవ్వరికీ అర్థం కాదు. అతి సామాన్యుడిగా ఒక సారి అతి మానుషుడుగా ఒక సారి కనిపిస్తాడు. స్వామి పరమాత్మా మానవుడా అన్నది ప్రశ్న కాదు. ఆయనను అనుభవించడమే ప్రయోజనం. తన దివ్య తేజస్సుతో ప్రకృతి ప్రభావాలను ధ్వంసం చేసినవాడు. తనకు మాత్రమే తెలిసిన ( ప్రత్యగాత్మ),  ప్రశాంతుడు, జ్ఞ్యానం కలిగినవారికి లభించేవాడు. అనామరూపుడివి. అలాంటి స్వామికి నమస్కారం

మర్త్యావతారస్త్విహ మర్త్యశిక్షణం రక్షోవధాయైవ న కేవలం విభోః
కుతోऽన్యథా స్యాద్రమతః స్వ ఆత్మనః సీతాకృతాని వ్యసనానీశ్వరస్య

మానవుడిగా అవతరించి ఆచరించిన పనులకు అర్థం, మనిషైనవాడు ఇలా ప్రవర్తించాలని నేర్పడానికే వచ్చాడు గానీ, రావణున్ని చంపడానికి మాత్రమే కాదు.  ఒక వేళ రావణున్నే చంపడానికే వచ్చాడంటే, భార్యా వియోగం అరణ్యవాసం రామునికి ఎందుకొస్తాయి? మానవులకు పూర్వ జన్మ కృతముగా సుఖములు గానీ దుఃఖములు గానీ వస్తాయి.

న వై స ఆత్మాత్మవతాం సుహృత్తమః సక్తస్త్రిలోక్యాం భగవాన్వాసుదేవః
న స్త్రీకృతం కశ్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి

జగత్తుని శాసించేవాడు తన చేత శాసించబడే వారి చేత బాధపడగలడా? అదంతా మన శిక్షణ గురించే. ఆయన ఆత్మ కలవారందరికీ మిత్రుడు. ఆత్మ జ్ఞ్యానం మనోనిగ్రహం కలవారికి. మనసు తన వశములో లేని వాడు సుఖమూ దుఃఖమునూ నియంత్రించలేడు. మనకు దైవకృతముగా కామమునకూ లోభమునకూ లొంగితే మనం మోహములో పడతాము. ఆశనూ లోభాన్నీ పోగొట్టుకున్నవాడిని ప్రకృతి శాసించదు
అరణ్యములో ప్రయాణిస్తున్న ఒక బ్రాహ్మణోత్తమునికి అప్పుడే చెట్టుమీద నుండి రాలిన ఒక పండు కనపడింది. ఆకలిగొన్న అతను అది చూసి స్నాన సంధ్యాదులు ముగించుకొని పరమాత్మకు అర్పించి ఆ పండు తాను తిన్నాడు. తినగానే తన వయసు సగం తగ్గింది, ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక అందమైన యువతి కనపడి నన్ను పెండ్లాడమని అడిగింది. సంతోషముగా ఆమెను స్వీకరించి ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఒక రాక్షసుడు నోరు తెరుచుకుని ఉన్నాడు. వీరిని చూచి మింగుతా అని అన్నాడు. బ్రాహ్మణుడు కారణమడుగగా "నీవు పండు పడితే తిన్నావు కదా. నాకు ఒక నియమం ఉంది, ఆ చెట్టు పండును తినీ, ఈ యువతిని పెళ్ళి చేసుకున్నవారిని తినాలి అని" అన్నాడు.
రాముడూ మనసు గలవారికీ ఆత్మ స్వరూపం తెలిసిన వారికీ మిత్రుడు. ఆయన మూడు లోకాలనూ సృష్టించినా ఆ మూడు లోకాలలో దేని మీదా ఆసక్తి లేదు. ఈయన సర్వత్రా వ్యాపించి ఉంటాడు.  ఇలాంటి పరమాత్మ ఒక స్త్రీ కోసం దుఃఖాన్ని అనుభవిస్తాడా? నరునిగా అవతరించినా పరమాత్మ స్వరూపాన్ని వదులుకుంటాడా? స్వామిత్వాన్ని వదిలిపెట్టి భార్య దూరమవడం వలన దు@ఖించాడంటే అది మానవులకు ఈ జీవితం గురించి నేర్పడానికే

న జన్మ నూనం మహతో న సౌభగం న వాఙ్న బుద్ధిర్నాకృతిస్తోషహేతుః
తైర్యద్విసృష్టానపి నో వనౌకసశ్చకార సఖ్యే బత లక్ష్మణాగ్రజః

పరమాత్మ ఒక్కొక్క చర్యతో ఒక్కో ధర్మాన్నీ మనకు చెప్పాడు. సంపదా స్త్రీ ఆస్తి, వీటిని ప్రేమించినవాడికి దుఃఖం తప్పదు అని సీతా వియోగ సమయములో చూపించాడు. మనం ఈ లోకములో దేన్ని గూర్చి మనం గొప్పది అనుకుంటామో దానితో పరమాత్మకు సంబందం లేదు. ఉత్తం కులములో పుట్టడం కానీ, మహత్వం గానీ, సౌభగం గానీ, మంచి వాక్కూ బుద్ధీ రూపం, పాండిత్యం, సౌజన్యం, ఇవన్నీ పరమాత్మను సంతోషింపచేయజాలవు. ఒక్క భక్తి ఉంటే ఇవనీ ఉన్నట్లే లెక్క అని చెప్పాడు. పరమాత్మ రామావతారములో ఇవేవీ లేని వారితో స్నేహం చేసాడు. వానరులతో ఆటవికులతో పక్షులతో స్నేహం చేసాడు. మనకు తన స్వరూపాన్ని తెలిపాడు. పైన చెప్పిన వాటితో సంబంధం లేని వానరులతో స్నేహం చేసి ఆయన అనుగ్రహం పొందడానికి పైన చెప్పినవేమీ కారణాలు కావు అని నిరూపించాడు..

సురోऽసురో వాప్యథ వానరో నరః సర్వాత్మనా యః సుకృతజ్ఞముత్తమమ్
భజేత రామం మనుజాకృతిం హరిం య ఉత్తరాననయత్కోసలాన్దివమితి

దేవత కానీ సురులు గానీ అసురులు గానీ నరులు గానీ వానరులు గానీ పరమాత్మ అయిన రామున్ని మనిషిగా సేవిస్తే తన లోకాన్నిచ్చాడు. ఆయనను సేవించని వారిని కూడా మోక్షానికి తీసుకుని వెళ్ళాడు. గడ్డిపరకకు కూడా మోక్షాన్నిచ్చాడు స్వామి. తానెంతమేరకూ తిర్గాడో ఆ భాగాన్నంతా మోక్షానికి తీసుకెళ్ళాడు. ఆయనను సేవించాలన్న బుద్ధి ఉంటే చాలు.

భారతేऽపి వర్షే భగవాన్నరనారాయణాఖ్య ఆకల్పాన్తముపచితధర్మజ్ఞాన
వైరాగ్యైశ్వర్యోపశమోపరమాత్మోపలమ్భనమనుగ్రహాయాత్మవతామనుకమ్పయా తపోऽవ్యక్తగతిశ్చరతి

భారత వర్షములో ఆరాధిచవలసిన దేవతలు నర నారాయణులు. వీరు కల్పం చివర దాకా ఉండి, ఉపచితధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యోపశమ. వృద్ధి పొందిన ధర్మ జ్ఞ్యాన వైరాగ్య ఇంద్రియ నిగ్రహ ఆత్మా రామం కలిగిన వారిని అనుగ్రహించడానికి, ఎలా తపస్సు చేయాలో మనకు చెప్పారు. ఎవరికీ అర్థం కాని సుధీర్ఘమైన తపస్సు కల్పాంతం దాకా చేస్తూ ఉంటాడు.

తం భగవాన్నారదో వర్ణాశ్రమవతీభిర్భారతీభిః ప్రజాభిర్భగవత్ప్రోక్తాభ్యాం సాఙ్ఖ్య
యోగాభ్యాం భగవదనుభావోపవర్ణనం సావర్ణేరుపదేక్ష్యమాణః పరమభక్తిభావేనోపసరతి ఇదం
చాభిగృణాతి

ఈ నర నారాయణులను నారదుడు ఆరాధిస్తాడు.

ఓం నమో భగవతే ఉపశమశీలాయోపరతానాత్మ్యాయ నమోऽకిఞ్చనవిత్తాయ ఋషిఋషభాయ
నరనారాయణాయ పరమహంసపరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమ ఇతి

పై వర్షాలలో వర్ణాలూ ఆశ్రమాలూ లేవు. కానీ ఈ వర్షములో వర్ణాశ్రమాలుంటాయి. గీతలో చెప్పినట్లుగా సాంఖ్యయోగముతో పరమాత్మను అనుభవించే విధానాన్ని సావర్ణి అనే మనువుకు ఇది వరకు భగవానుడు చెప్పిన సాంఖ్య యోగాన్ని ఉపదేశిస్తూ భాగవానుని ఆరాధిస్తాడు. ఈ మంత్రముతో స్తోత్రం చేస్తాడు.
నర నారాయణుల లక్షణం ఉపశమం - ఇంద్రియ నిగ్రహం. ఆనాత్మ్య భావమేమీ లేని వాడు. శారీరిక సంబంధములూ శరీర భావములూ శోక మోహ ఆకలీ దప్పీ జరా రోగమూ లేని వాడు. ఇవి కేవలం శరీరానికి ఉండేవే, ఆత్మకు కావు. తొలగిన శరీర సంబంధం కలవాడు.దరిద్రులకు ధనవంతుడు. ఋషులకు శ్రేష్టుడు. యోగులకు అధిపతి. అటువంటి స్వామికి నమస్కారం

గాయతి చేదమ్
కర్తాస్య సర్గాదిషు యో న బధ్యతే న హన్యతే దేహగతోऽపి దైహికైః
ద్రష్టుర్న దృగ్యస్య గుణైర్విదూష్యతే తస్మై నమోऽసక్తవివిక్తసాక్షిణే

సకల చరాచర జగత్తునీ సృష్టించి రక్షించి సంహరిస్తూ జగత్తులో ఉన్న దోషాలతో అంటబడని వాడు. శరీరములో ఉన్నా శరీరము లేకపోతే లేని వాడు కాడు.  దేహధర్మాలతో (ఆకలీ దప్పి మొదలైనవి) ఆయన బాధించబడడు. చూచేవాడికి కనపడని వాడు. చూచేవాడికి ఇతను కన్ను కూడా కాడు.ఇది ప్రకృతి గుణములతో దూషించబడదు. అటువంటి స్వామికి నమస్కారం. దేనియందూ తగులు కొనడూ అన్నిటికంటే వేరుగా ఉంటూ అన్నిటినీ చూస్తూ ఉంటాడు - అసక్తవివిక్తసాక్షిణే
 
ఇదం హి యోగేశ్వర యోగనైపుణం హిరణ్యగర్భో భగవాఞ్జగాద యత్
యదన్తకాలే త్వయి నిర్గుణే మనో భక్త్యా దధీతోజ్ఝితదుష్కలేవరః

ఇదే యోగ నైపుణ్యం ( చేసే పనులలో చాతుర్యం. చాతుర్యమంటే ఫలం అంటకుండా పని చేయడం). బతికున్నప్పుడు ఎలా ఉన్నా ప్రాణం పోయేప్పుడు ఎవరైతే పరమాత్మ నామాన్ని శరీరం యందు మోహాన్ని వదిలిపెట్టి మనసును భక్తితో నీయందు నిలిపి, స్మరిస్తాడో వాడు నిపుణుడు

యథైహికాముష్మికకామలమ్పటః సుతేషు దారేషు ధనేషు చిన్తయన్
శఙ్కేత విద్వాన్కుకలేవరాత్యయాద్యస్తస్య యత్నః శ్రమ ఏవ కేవలమ్

భార్యా పిల్లలూ ఆస్తి అన్నం సంపాదించుకోవడం వాటి గురించే ఆలోచించడం, "నేను చినపోతానేమో" అని ఆలోచిస్తూ ఉండి ఇహ పర లోకాలలో సుఖం కోసం వారు చేసే పని అంతా ఆయాసం తప్ప ఏమీ కాదు. చెడు శరీరం ఉన్నందు వలన రెండు రకాల భావాలు కలుగుతాయి. అహంకారం మమకారం. శరీరాన్ని నేను అనుకోవడం శరీరముతో వచ్చినవారిని నావారు అనుకోవడం.

తన్నః ప్రభో త్వం కుకలేవరార్పితాం త్వన్మాయయాహంమమతామధోక్షజ
భిన్ద్యామ యేనాశు వయం సుదుర్భిదాం విధేహి యోగం త్వయి నః స్వభావమితి

 ఇవన్నీ చెడు శరీరముతో వచ్చినవే. వాటిని భేధించాలి. ఎంత కష్టపడ్డా ఈ భావాలను భేధించుకోలేము. వాటిని భేధించి నా మనసుని నీ యందు లగ్నం చేయి

భారతేऽప్యస్మిన్వర్షే సరిచ్ఛైలాః సన్తి బహవో మలయో మఙ్గలప్రస్థో మైనాకస్త్రికూట ఋషభః
కూటకః కోల్లకః సహ్యో దేవగిరిరృష్యమూకః శ్రీశైలో వేఙ్కటో మహేన్ద్రో వారిధారో విన్ధ్యః శుక్తిమానృక్షగిరిః
పారియాత్రో ద్రోణశ్చిత్రకూటో గోవర్ధనో రైవతకః కకుభో నీలో గోకాముఖ ఇన్ద్రకీలః కామగిరిరితి చాన్యే చ
శతసహస్రశః శైలాస్తేషాం నితమ్బప్రభవా నదా నద్యశ్చ సన్త్యసఙ్ఖ్యాతాః

ఏతాసామపో భారత్యః ప్రజా నామభిరేవ పునన్తీనామాత్మనా చోపస్పృశన్తి

ఇలాంటి భారత వర్షములో కూడా నదులూ నదములూ ఉన్నాయి. మలయ మంగల ప్రస్థ మైనాక ఋష్యమూక శ్రీశైల ద్రోణ చిత్రకూటా నీలా ఇంద్రకీల మొదలైన ముప్పై రెండు పర్వతాలున్నాయి భారత పర్వతములో

చన్ద్రవసా తామ్రపర్ణీ అవటోదా కృతమాలా వైహాయసీ కావేరీ వేణీ పయస్వినీ శర్కరావర్తా
తుఙ్గభద్రా కృష్ణావేణ్యా భీమరథీ గోదావరీ నిర్విన్ధ్యా పయోష్ణీ తాపీ రేవా సురసా నర్మదా చర్మణ్వతీ సిన్ధురన్ధః
శోణశ్చ నదౌ మహానదీ వేదస్మృతిరృషికుల్యా త్రిసామా కౌశికీ మన్దాకినీ యమునా సరస్వతీ దృషద్వతీ గోమతీ
సరయూ రోధస్వతీ సప్తవతీ సుషోమా శతద్రూశ్చన్ద్రభాగా మరుద్వృధా వితస్తా అసిక్నీ విశ్వేతి మహానద్యః

ఇవే కాక చిన్న చిన్న గుట్టలు లక్షల కొలదీ ఉన్నాయి. ఎన్ని పర్వతాలున్నాయో అలాగే నదులూ నదములూ లెక్కలేనన్నివి ఉన్నాయి. గంగా నది నామస్మరణ చేసినా చాలు. అలాంటి నది దగ్గరకు వెళ్ళి స్నానం చేసిన వారు పరమపవిత్రులవుతారు. ఈ నలభై రెండూ మహా నదులు.

అస్మిన్నేవ వర్షే పురుషైర్లబ్ధజన్మభిః శుక్లలోహితకృష్ణవర్ణేన స్వారబ్ధేన కర్మణా దివ్య
మానుషనారకగతయో బహ్వ్య ఆత్మన ఆనుపూర్వ్యేణ సర్వా హ్యేవ సర్వేషాం విధీయన్తే యథావర్ణ
విధానమపవర్గశ్చాపి భవతి

ఈ భారత వర్షములో ఉన్నవారు మంచి పనీ చెడు పనీ రెండూ కాని పనీ చేస్తూ (తెల్ల నల్ల ఎరుపు పనులు) మానవ దేవత తిర్యక్ జన్మలు ఎత్తుతూ

యోऽసౌ భగవతి సర్వభూతాత్మన్యనాత్మ్యేऽనిరుక్తేऽనిలయనే పరమాత్మని వాసుదేవేऽనన్య
నిమిత్తభక్తియోగలక్షణో నానాగతినిమిత్తావిద్యాగ్రన్థిరన్ధనద్వారేణ యదా హి మహాపురుషపురుష
ప్రసఙ్గః

ఆయా వర్ణాశ్రములకు విధించబడిన ధర్మం ఆచరించిన వారికి మోక్షమూ కైవల్యమూ వస్తాయి. అందరిలో ఉన్న పరమాత్మ, శరీర సంబంధం లేని వాడు, ఇలా ఉంటాడన్న లక్షణం గలిగినవాడు కాదు.  ప్రతిఫలాపేక్ష లేకుండా ఉండే స్వభావముతో ఆచరించే అనేక పనుల వలన కలిగిన సంస్కారముతో ఏర్పడిన జన్మ జరాది దు@ఖాలను పోగొట్టడానికి పరమాత్మ మీద ఫలాకాంక్ష లేని భక్తి  కారణం. ఈ భక్తి అవిద్యా గ్రంధిని పోగొడుతుంది . ఇలా అవ్వడానికి పరమాత్మ భక్తులతో సావాసం చేయాలి. భగవంతుని భక్తులతో కలిసి పరమాత్మ నామ సంకీర్తన చేస్తుంటే దేహం వలన వచ్చిన వాటితో ఏ ఇబ్బందీ ఉండదు.

ఏతదేవ హి దేవా గాయన్తి
అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్న ఏషాం స్విదుత స్వయం హరిః
యైర్జన్మ లబ్ధం నృషు భారతాజిరే ముకున్దసేవౌపయికం స్పృహా హి నః

ఇదే విషయాన్ని దేవతలు గానం చేస్తున్నారు. భారత వర్షములో జన్మించినవారెంత సుకృతం చేసుకున్నారు. వారి విషయములో పరమాత్మ ఎప్పుడూ ప్రసన్నముగా ఉంటాడు. ఇక్కడ జన్మించిన వారు పరమాత్మ సేవే ప్రయోజనముగా ఉంటారు. భారత దేశములో జన్మ భగవానుని సేవించడానికే ఉపయోగిస్తుంది. ఆయనను సేవించడానికి ఉపయోగపడే జన్మ ఎంత పుణ్యం చేస్తే రావాలి? మేము కూడా ఇక్కడ పుట్టి ఉండాలని కోరుకుంటున్నాము

కిం దుష్కరైర్నః క్రతుభిస్తపోవ్రతైర్దానాదిభిర్వా ద్యుజయేన ఫల్గునా
న యత్ర నారాయణపాదపఙ్కజ స్మృతిః ప్రముష్టాతిశయేన్ద్రియోత్సవాత్

స్వర్గమును పొందించే యజ్ఞ్య దాన తపములతో ఏమి లాభము. ఎక్కడైతే పరమాత్మ పాద పంకజములను స్మరించడం ఉండదో, అలాంటి ఇంద్రియ వ్యామోహము తుడిచిపెట్టకుండా ఉండే దాన ధర్మాలూ కర్తువూ ఉత్సవాల వలన ఏమి ప్రయోజనం. ఇంద్ర్యోత్సవాన్ని మరచిపోయి పరమాత్మ పాదాలను స్మరించని యజ్ఞ్య దాన తపములు వ్యర్థములు.

కల్పాయుషాం స్థానజయాత్పునర్భవాత్క్షణాయుషాం భారతభూజయో వరమ్
క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్న్యస్య సంయాన్త్యభయం పదం హరేః

కల్పం ఆయుష్యముగా ఉండే ఇతరలోక నివాసముల కంటే క్షణ కాలము ఆయుషు ఉండే భారత వర్షములో ఆయువు సార్ధకం. ఇక్కడ ఒక క్షణ కాలం బతికినా ఆ క్షణ కాలములోనే సంసారం మీద విరక్తి కలిగి వైకుంఠానికి చేరగలడు.

న యత్ర వైకుణ్ఠకథాసుధాపగా న సాధవో భాగవతాస్తదాశ్రయాః
న యత్ర యజ్ఞేశమఖా మహోత్సవాః సురేశలోకోऽపి న వై స సేవ్యతామ్

పరమాత్మ కథలేని చోట సజ్జనులు లేని చోట భాగవతోత్తములు లేని చోట యజ్ఞ్య యాగాదులు లేని చోట, అది స్వర్గమైనా సరే దానిని సేవించకండి

ప్రాప్తా నృజాతిం త్విహ యే చ జన్తవో జ్ఞానక్రియాద్రవ్యకలాపసమ్భృతామ్
న వై యతేరన్నపునర్భవాయ తే భూయో వనౌకా ఇవ యాన్తి బన్ధనమ్

భారత వర్షముల్ (జ్ఞ్యాన క్రియల సమావేశముతో గల) మానవులుగా పుట్టి కూడా మరలా మానవులుగా పుట్టకుండా ఉండేందుకు ప్రయత్నించనట్లతే వారు ఆరణ్య మృగముల వలె బంధనములు పొందుతారు {తురంగ (లేడి - శబ్దం) మాతంగ (ఏనుగు - స్పర్శ)  పతంగ (మిడత రూప)  మీన (రసం)  బృంగ ( తుమ్మెద)}

యైః శ్రద్ధయా బర్హిషి భాగశో హవిర్నిరుప్తమిష్టం విధిమన్త్రవస్తుతః
ఏకః పృథఙ్నామభిరాహుతో ముదా గృహ్ణాతి పూర్ణః స్వయమాశిషాం ప్రభుః

మానవుడు భగవానుని పేరుతో చేసే ఏ ఆరాధనైనా ఏ దేవత పేరు బెట్టినా ఏ పని చేసినా దానిని అందుకొనే వాడు పరమాత్మ ఒక్కడే. ఏ పేరుతో ఏ విధితో ఏ మంత్రముతో మన ఆహుతి చేసినా ఆ పరమాత్మే సంతోషముతో స్వీకరిస్తాడు. ఇచ్చేవాడు ఆయనే - స్వయమాశిషాం ప్రభుః

సత్యం దిశత్యర్థితమర్థితో నృణాం నైవార్థదో యత్పునరర్థితా యతః
స్వయం విధత్తే భజతామనిచ్ఛతామిచ్ఛాపిధానం నిజపాదపల్లవమ్

మళ్ళీ అడగవలసిన అవసరం లేకుండా ఇచ్చేవాడు పరమాత్మ మాత్రమే. కోరిక చావని మనకు కోరికే లేకుండా చేస్తాడు పరమాత్మ. ఆ శక్తి పరమాత్మ పాదాలకు ఉన్నది.

యద్యత్ర నః స్వర్గసుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనమ్
తేనాజనాభే స్మృతిమజ్జన్మ నః స్యాద్వర్షే హరిర్యద్భజతాం శం తనోతి

మనం ఈ లోకములో ఆచరించిన సత్యమూ  యజ్ఞ్యమూ మొదలైన మంచి పనులూ పుణ్యాలకూ ఫల రూపముగా అజనాభ వర్షములో పూర్వ జన్మ్న జ్ఞ్యానం ఉన్న జన్మ ఉంటే చాలు. పూర్వ జన్మ జ్ఞ్యానం లేకున్నా జ్ఞ్యానమొక్కటి చాలు. అజనాభ వర్షములో పరమాత్మ తనను సేవించే వారికి మోక్షమిస్తాడు.

శ్రీశుక ఉవాచ
జమ్బూద్వీపస్య చ రాజన్నుపద్వీపానష్టౌ హైక ఉపదిశన్తి సగరాత్మజైరశ్వాన్వేషణ ఇమాం
మహీం పరితో నిఖనద్భిరుపకల్పితాన్

జంబూ ద్వీపానికి ఒక ఎనిమిది ఉప ద్వీపాలున్నాయి. సగర చక్రవర్తి యజ్ఞ్యం చేసినప్పుడు ఇంద్రుడు అశ్వాన్ని మాయం చేసినపుడు అరవై వేలమంది పుత్రులు దాన్ని వెతకడానికి పాతాళం వెళ్ళడానికి తవ్వుకుంటూ వెళ్ళారు. ఆ తవ్వడములో ఎనిమిది ఉపద్వీపములు ఏర్పడ్డాయి.

తద్యథా స్వర్ణప్రస్థశ్చన్ద్రశుక్ల ఆవర్తనో రమణకో మన్దరహరిణః పాఞ్చజన్యః సింహలో
లఙ్కేతి

ఏవం తవ భారతోత్తమ జమ్బూద్వీపవర్షవిభాగో యథోపదేశముపవర్ణిత ఇతి

జంబూద్వీపముల సర్వ వర్షములూ వివరించాను.