Sunday, June 30, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

                                                                ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం


శ్రీగోప ఊచుః
రామ రామ మహాబాహో కృష్ణ దుష్టనిబర్హణ
ఏషా వై బాధతే క్షున్నస్తచ్ఛాన్తిం కర్తుమర్హథః

మహాయోగీ దుష్ట సంహారకా కృష్నా రామా ఆకలి మమ్ము బాధిస్తోంది మీరే మాకు శాంతి కలుగజేయాలి.

శ్రీశుక ఉవాచ
ఇతి విజ్ఞాపితో గోపైర్భగవాన్దేవకీసుతః
భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్

దగ్గరలో ఉన్న ఋషుల పత్నులను అనుగ్రహించదలచి ఇలా అన్నాడు

ప్రయాత దేవయజనం బ్రాహ్మణా బ్రహ్మవాదినః
సత్రమాఙ్గిరసం నామ హ్యాసతే స్వర్గకామ్యయా

దగ్గరలో ఋషులు ఉన్నారు ఆంగీరస సత్ర యాగం చేస్తున్నారు. అక్కడకు వెళ్ళి మాకు భోజనం పెట్టమని అడగండి.

తత్ర గత్వౌదనం గోపా యాచతాస్మద్విసర్జితాః
కీర్తయన్తో భగవత ఆర్యస్య మమ చాభిధామ్

బలరామ కృష్ణులు వచ్చారు. ఆకలిగొన్నారు. వారికీ మాకు భోజనం కావాలి అని వారిని అడగండి అని స్వామి ఆజ్ఞ్యాపిస్తే

ఇత్యాదిష్టా భగవతా గత్వా యాచన్త తే తథా
కృతాఞ్జలిపుటా విప్రాన్దణ్డవత్పతితా భువి

అందరూ చేతులు జోడించి వెళ్ళీ బ్రాహ్మణోత్తములకు దండ ప్రణామం చేసారు.

హే భూమిదేవాః శృణుత కృష్ణస్యాదేశకారిణః
ప్రాప్తాఞ్జానీత భద్రం వో గోపాన్నో రామచోదితాన్

మేము కృష్ణ పరమాత్మ చెబితే వచ్చాము. బ్రాహ్మణోత్తములారా వినండి. వారు పంపగా వచ్చాము.

గాశ్చారయన్తావవిదూర ఓదనం రామాచ్యుతౌ వో లషతో బుభుక్షితౌ
తయోర్ద్విజా ఓదనమర్థినోర్యది శ్రద్ధా చ వో యచ్ఛత ధర్మవిత్తమాః

ఆవులను మేపుతూ వచ్చాము. మాకు ఆకలి వేస్తోంది భోజనం కావాలి. ధర్మము తెలిసిన వారు కాబట్టి, మీకు శ్రద్ధా భక్తీ ఉంటే అన్నాన్ని కాంక్షించే కృష్ణ బలరాములకు భోజనం పెట్టండి

దీక్షాయాః పశుసంస్థాయాః సౌత్రామణ్యాశ్చ సత్తమాః
అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్నన్హి దుష్యతి

ఇది వేద వాక్యం. కొందరు యజ్ఞ్యం ఆచరిస్తూ ఉంటే యజ్ఞ్యం ఆచరించని వారు ఆకలి వేస్తే  భోజనం చేస్తే అది దోషం కాదు.

ఇతి తే భగవద్యాచ్ఞాం శృణ్వన్తోऽపి న శుశ్రువుః
క్షుద్రాశా భూరికర్మాణో బాలిశా వృద్ధమానినః

వారు ఇలా స్వామి అడిగాడు అన్న మాటను విని కూడా విననట్లే ఉన్నారు. అందుకు కారణం వారు చిన్న (క్షుద్రమైన) ఆశతో పెద్ద పని చేసే వారు. తెలివైన వారిమనుకునేవారు. వీరు శిశువులకంటే చిన్నవారు, కానీ వృద్ధులమనుకుంటున్నారు.

దేశః కాలః పృథగ్ద్రవ్యం మన్త్రతన్త్రర్త్విజోऽగ్నయః
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః

వీరు ఆచరించే యజ్ఞ్యమునకు పనికొచ్చే వస్తువులన్నీ కృష్ణుడే. ఆ పరమాత్మ అన్నం అడిగితే పెట్టలేదు. దేశ కాల ద్రవ్య హవ్యం మంత్ర తంత్ర ఋత్విక్ దేవతలూ యజన్మానీ అన్నీ ఆయన స్వరూపం.

తం బ్రహ్మ పరమం సాక్షాద్భగవన్తమధోక్షజమ్
మనుష్యదృష్ట్యా దుష్ప్రజ్ఞా మర్త్యాత్మానో న మేనిరే

అటువంటి స్వామిని మనుష్య బుద్ధితో భగవంతుడని తెలుసుకోలేకపోయారు

న తే యదోమితి ప్రోచుర్న నేతి చ పరన్తప
గోపా నిరాశాః ప్రత్యేత్య తథోచుః కృష్ణరామయోః

అవునూ అనలేదూ కాదు అనలేదు. ఇలా అనేసరికి గోపాల బాలకులు వెనక్కు వచ్చేశారు.

తదుపాకర్ణ్య భగవాన్ప్రహస్య జగదీశ్వరః
వ్యాజహార పునర్గోపాన్దర్శయన్లౌకికీం గతిమ్

ఒక సారి నవ్వాడు భగవానుడ్. లౌకిగ గతిని చూపుతూ

మాం జ్ఞాపయత పత్నీభ్యః ససఙ్కర్షణమాగతమ్
దాస్యన్తి కామమన్నం వః స్నిగ్ధా మయ్యుషితా ధియా

వారిని కాదు, వెళ్ళి వారి భార్యలను అడగండి. బల రామ కృష్ణులు వచ్చారు అని చెప్పండి. వీళ్ళంతా నా యందు బాగా స్నేహముతో ఉన్నారు. అందుకు వారి వద్దకు వెళ్ళి అన్నం అడగండి.

గత్వాథ పత్నీశాలాయాం దృష్ట్వాసీనాః స్వలఙ్కృతాః
నత్వా ద్విజసతీర్గోపాః ప్రశ్రితా ఇదమబ్రువన్

పత్నీ శాలకు వెళ్ళగా వారు చక్కగా అలంకరించుకుని ఉన్నారు. వారికి వినయముతో నమస్కరించి

నమో వో విప్రపత్నీభ్యో నిబోధత వచాంసి నః
ఇతోऽవిదూరే చరతా కృష్ణేనేహేషితా వయమ్

అమ్మలారా మీకు నమస్కారం. మా మాటలు వినండి. కృష్ణ బలరాములతో కలసి వచ్చాము. వారికి ఆకలి వేస్తోంది. వారు ఇక్కడకు పంపారు

గాశ్చారయన్స గోపాలైః సరామో దూరమాగతః
బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతామ్

ఆకలిగా ఉన్న బలరామ కృష్ణులకు అన్నం ప్రసాదించండి

శ్రుత్వాచ్యుతముపాయాతం నిత్యం తద్దర్శనోత్సుకాః
తత్కథాక్షిప్తమనసో బభూవుర్జాతసమ్భ్రమాః

బలరామ కృష్ణులు వచ్చారని విన్న ఋషిపత్నులు, నిరంతరం ఆయనను చూడాలని అభిలషించే వారు, ఆయన గురించి బాగా విని ఉన్నారు. అలా విన్నవారు ఒక సారి కృష్ణ బలరాములు అక్కడ ఉన్నారు, అన్నం అడిగారని తెలుసుకుని,

చతుర్విధం బహుగుణమన్నమాదాయ భాజనైః
అభిసస్రుః ప్రియం సర్వాః సముద్రమివ నిమ్నగాః

యజ్ఞ్యం కోసం తయారయి ఉన్న అన్నాన్నీ, పాలూ పెరుగూ నేయీ వెన్నా, ఇలా నాలుగు రకాలుగా ఉన్న అన్నాన్నీ, పాలు పెరుగునూ కూడా తీసుకుని సముద్రములోకి నదులు ప్రవహిస్తున్నట్లుగా అభిసరించారు. (అభిసస్రుః - అభిసారికలు - అంటే తనకు నచ్చిన ప్రియునికోసం అతను ఉన్న చోటికి వెళ్ళే స్త్రీని అభిసారిక అంటారు. మనమందరం అభిసారికలమే, నిరంతరం భగవంతుని చేరడానికి చేతగాకున్నా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. మనం చేసే ప్రయత్నం ఫలించదు. ఆయనకు ఆయనగా తీసుకురావాలి. అది చెప్పడానికే పరమాత్మ తనవారిని పంపి ఋషిపత్నులను తీసుకు వచ్చాడు. విరజానదిలో స్నానం చేసిన తరువాత ఐదువేల మంది అప్సరసలను పంపుతారు ఆ జీవుడు పరమాత్మను చేరడానికి. విరజా నది వరకూ వెళ్ళినా మనమంతట మనం స్వామి వద్దకు వెళ్ళలేము. స్వామే రప్పించుకోవాలి. ఇక్కడ కూడా స్వామి పంపిన గోపాలకులు ఋషిపత్నులను తీసుకుని స్వామి వద్దకు వెళుతున్నారు. ఈ ఉదంతం అర్చిరాది మార్గానికి వివరణ )

నిషిధ్యమానాః పతిభిర్భ్రాతృభిర్బన్ధుభిః సుతైః
భగవత్యుత్తమశ్లోకే దీర్ఘశ్రుత ధృతాశయాః

వెళుతుంటే భర్తలూ సోదరులూ అన్నలూ తండ్రులూ మిత్రులూ మొదలైన వారందరూ అడ్డారు. ఎంతమంది వారిస్తున్నా పరమాత్మయందు మాత్రమే మనసు లగ్నమై ఉన్నవారు కాబట్టి కృష్ణుని గురించి ఎంతో కాలం నుండీ వినడం వలన మనసు నిలిపిన వారై.

యమునోపవనేऽశోక నవపల్లవమణ్డితే
విచరన్తం వృతం గోపైః సాగ్రజం దదృశుః స్త్రియః

యమునా నదీ తీరములో రకరకాల చిగురుటాకులూ పుష్పాలూ ఫలాలతో అలంకరించబడి తోటి గోపాల బాలకులతో విహరిస్తున్న కృష్ణ పరమాత్మను చూసారు

శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హ
ధాతుప్రవాలనటవేషమనవ్రతాంసే
విన్యస్తహస్తమితరేణ ధునానమబ్జం
కర్ణోత్పలాలకకపోలముఖాబ్జహాసమ్

శ్యామ వర్ణముతో పీతాంబరధారి అయి, అడవిలో దొరికే పూలతో గుచ్చిన మాలలూ నెమలి పించములూ గైరికాధి ధాతువులూ మొదలైన వాటితో అలంకరించుకుని నటునిలా ఉన్నాడు. ఒక చేయి ఎప్పుడూ పక్కన ఉన్న (సుదాముని) వారిపై వేసి ఉంటాడు. ఇంకో చేత్తో విలాసముగా పద్మాన్ని తిప్పుతూ ఉన్నాడు. చెవిలో కూడా కలువలను పెట్టుకున్నాడు, వాటి మీద నుంచి వెంట్రుకలు వచ్చి ముఖాన్ని కప్పేస్తున్నాయి. ఆ వెంట్రుకల సందులోంచి తెల్లటి పలు వరుసలు కనిపిస్తున్నాయి. ఆయన చిరునవ్వు కనపడుతోంది. అలాంటి కృష్ణ పరమాత్మను మునిపత్నులు దర్శించారు.

ప్రాయఃశ్రుతప్రియతమోదయకర్ణపూరైర్
యస్మిన్నిమగ్నమనసస్తమథాక్షిరన్ద్రైః
అన్తః ప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం
ప్రాజ్ఞం యథాభిమతయో విజహుర్నరేన్ద్ర

చెవులతో వినడముతోనే ఆ కృష్ణుడి మీద ప్రీతి కలిగింది ఆ మునిపత్నులకి. మునిపత్నులకే కాదు అందరికీ ప్రీతి కలిగింది. పరమాత్మ కూడా శ్రుతులతోనే కొనియాడ బడుతూ ఉంటాఉ. చూడకపోయినా ఆయనంటే ఇష్టం అందరికీ. వేదముచే కొనియాడబడిన ఆయన గుణములని వినడముచేతనే అందరికీ ఇష్టం. మునిపత్నులకు కూడా కృష్ణ పరమాత్మ లీలలను వినడము చేతనే ఇష్టం. అలాంటి స్వామి ముందు ఉన్నాడు. చెవులతో వినీ వినీ ఎవరి యందు మనసు నిలిపారో ఆయన ఎదురుగా ఉన్నాడు. ఒకరికి తెలియకుండా ఒకరు కౌగిలించుకున్నారు. స్వామి హృదయములో ప్రవేశించారు. కనుల రంధ్రములలోనుంచి లోపలకు ప్రవేశించి మనసుతో ఆలింగనం చేసుకున్నారు. అలా చాలా సేపు కౌగిలుంచుకున్నారు. పరమాత్మ యొక్క జ్ఞ్యానం కలవారు జ్ఞ్యానముతో పరమాత్మని తెలిసి ఆలింగనం చేసుకుంటే ఎలాంటి ఆనందాన్ని పొందుతారో, ఋషి పత్నులు కూడా ఇంతకాలమూ ఉన్న తాపాన్ని విడిచిపెట్టారు.

తాస్తథా త్యక్తసర్వాశాః ప్రాప్తా ఆత్మదిదృక్షయా
విజ్ఞాయాఖిలదృగ్ద్రష్టా ప్రాహ ప్రహసితాననః

వారు ఎలా వచ్చారు స్వామి తెలుసుకున్నాడు. అన్నీ, అందరినీ విడిచిపెట్టి వచ్చారు. ఎవరు వద్దన్నా పట్టించుకోలేదు. ఇలా అన్నీ అందరినీ వదిలిపెట్టి వచ్చిన వారిని చూచి, సంసతాన్ని చూచే పరమాత్మ చిరునవ్వుతో ఇలా అంటున్నాడు

స్వాగతం వో మహాభాగా ఆస్యతాం కరవామ కిమ్
యన్నో దిదృక్షయా ప్రాప్తా ఉపపన్నమిదం హి వః

మహానుభావులారా మీకు స్వాగతం. మీకు ఏ సపర్యలు చేయాలో చెప్పండి. మమ్ములను చూడాలని వచ్చారు మీరు. ఇలా వచ్చుట యోగ్యమే.

నన్వద్ధా మయి కుర్వన్తి కుశలాః స్వార్థదర్శినః
అహైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా

నైపుణ్యం కలిగిన నిజమైన స్వార్థపరులు నన్ను చూడడానికే వస్తారు. ఆత్మకు స్వార్థం పరమాత్మను చేరుటే. వారు నాయందు ప్రయోజనాన్ని ఆశించని భక్తి కలిగి ఉంటారు. అది కూడా నిరంతరమూ ఉండాలి. నిరంతరమూ ఉండాలీ, నిష్ప్రయోజనముగా ఉండాలి. ఆయన స్వామి, మనం దాసులం. ఆయన భర్తా మనం భార్యలము. ఆయన యజమాని మనం సేవకులం. ప్రయోజనాన్ని ఆశించకుండా నిరంతరం ఉండే భక్తినే స్వార్థం తెలిసిన భక్తులు నిరంతరం చేస్తారు.

ప్రాణబుద్ధిమనఃస్వాత్మ దారాపత్యధనాదయః
యత్సమ్పర్కాత్ప్రియా ఆసంస్తతః కో న్వపరః ప్రియః

నన్ను ద్వేషిస్తున్నా, నన్ను పూజించకున్నా, అందరూ నన్నే ప్రేమిస్తూ ఉంటారు. ప్రతీ వారికీ తమ ప్రాణం మీద తీపి, బుద్ధీ మనసూ తన శరీరం భార్యా సంతానం ధనం, వీటి మీద ఇష్టం. ఇవన్నీ ఆత్మ ఉన్నప్పుడే. నేను లోపల ఉంటేనే ఇవన్నీ ప్రియం. అటువంటి నాయందు ప్రేమ సహజముగానే ఉంటుంది. కాని అది నా వరకూ రాదు. ఏ నా కలయికతో ఇవన్నీ ప్రియం అవుతున్నాయో అటువంటి నాకన్నా ప్రియమైన వారు ఇంకొకరు ఉంటారా. వీటన్నిటినీ ప్రేమిస్తున్నవాడు నన్ను ప్రేమిచేవాడే.

తద్యాత దేవయజనం పతయో వో ద్విజాతయః
స్వసత్రం పారయిష్యన్తి యుష్మాభిర్గృహమేధినః

ఇక మీరంతా మీ యజ్ఞ్య శాలకు వెళ్ళండి. అక్కడ మీ భర్తలు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పత్ని లేకుండా యజ్ఞ్యం చేయలేరు. (యజ్ఞ్యములో హవిస్సు అందించేవారినే భార్య అంటారు. యజ్ఞ్యములో పనికొచ్చే ఉపకరణం అందించే వారినే పత్ని అంటారు)

శ్రీపత్న్య ఊచుః
మైవం విభోऽర్హతి భవాన్గదితుం న్ర్శంసం
సత్యం కురుష్వ నిగమం తవ పదమూలమ్
ప్రాప్తా వయం తులసిదామ పదావసృష్టం
కేశైర్నివోఢుమతిలఙ్ఘ్య సమస్తబన్ధూన్

ఇటువంటి మాట మీరు మాట్లాడ కూడదు. నీ పాద మూలం చేరిన వారిని తిప్పి పంపరు అని వేదం చెబుతుంది. మేము నీ పాద మూలాన్ని చేరాము. అక్కడ ఉండే తులసిని మా శిరస్సున ఉంచడానికి బంధువులందరినీ దాటి వచ్చాము.

గృహ్ణన్తి నో న పతయః పితరౌ సుతా వా
న భ్రాతృబన్ధుసుహృదః కుత ఏవ చాన్యే
తస్మాద్భవత్ప్రపదయోః పతితాత్మనాం నో
నాన్యా భవేద్గతిరరిన్దమ తద్విధేహి

భర్తలూ తల్లి తండ్రులూ కొడుకులూ సోదరులూ బంధువులూ మిత్రులూ ఎవ్వరూ మమ్ము స్వీకరించరు. ఇంక వేరే వారి సంగతి చెప్పాలా? మేము నీ పాదాల చెంత పడ్డాము. నీ పాదాలు చేరినవారికి ఇంకో గతి ఉంటుందా. మాకు నీ పాదములనే ప్రసాదించు. మేము వెళ్ళినా వారు స్వీకరించరు.

శ్రీభగవానువాచ
పతయో నాభ్యసూయేరన్పితృభ్రాతృసుతాదయః
లోకాశ్చ వో మయోపేతా దేవా అప్యనుమన్వతే

భర్తను స్వీకరించరు అన్నదే మీ భయం ఐతే మీ భర్తలూ తల్లి తండ్రులూ పుత్రులూ బంధువులూ మిత్రులూ  లోకమూ మిమ్ములని తప్పు బట్టరు. నన్ను పూజిస్తే దేవతలు కూడా ఒప్పుకుంటారు.

న ప్రీతయేऽనురాగాయ హ్యఙ్గసఙ్గో నృణామిహ
తన్మనో మయి యుఞ్జానా అచిరాన్మామవాప్స్యథ

జీవులందరికీ శరీరాన్ని ఇచ్చింది ఐహిక సాంసారిక విషయ భోగానికి కాదు, నాయందు ప్రీతి కలగడానికీ, నాయందు ఉంచడానికే. జీవులకు దేహ సంబంధం కలిగింది అందుకే. అది తెలుసుకున్న మీకు ప్రత్యక్షముగా కలిగింది. నా యందు మనసు ఉంచిన మీరు త్వరలోనే నన్ను చేరుతారు.

శ్రవణాద్దర్శనాద్ధ్యానాన్మయి భావోऽనుకీర్తనాత్
న తథా సన్నికర్షేణ ప్రతియాత తతో గృహాన్

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తా ద్విజపత్న్యస్తా యజ్ఞవాటం పునర్గతాః
తే చానసూయవస్తాభిః స్త్రీభిః సత్రమపారయన్

ఇలా చెప్పగా వారు యజ్ఞ్య వాటానికి వెళ్ళారు. స్వామి చెప్పినట్లుగా ఆ భర్తలు కూడా వారి మీద కోపించలేదు. యజ్ఞ్యాన్ని పూర్తి చేసారు.

తత్రైకా విధృతా భర్త్రా భగవన్తం యథాశ్రుతమ్
హృడోపగుహ్య విజహౌ దేహం కర్మానుబన్ధనమ్

ఇలా గోపాల బాలకులు వచ్చి చెబితే మునిపత్నులు అందరూ వెళ్ళగా, అలా వెళుతున్న వారిలో ఒక ముని పత్ని వెనకబడింది. ఆమెను భర్త గట్టిగా నిర్భందించాడు, వెళ్ళనివ్వలేదు. అందుచేత ఆమె శరీరముతో కృష్ణి వద్దకు వెళ్ళలేదు. పరమాత్మను చూడడానికి అడ్డు వచ్చిన శరీరాన్ని విడిచి స్వామినే చేరింది. రక రకముల కర్మల చేత వచ్చిన శరీరాన్ని విడిచిపెట్టింది.

భగవానపి గోవిన్దస్తేనైవాన్నేన గోపకాన్
చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః

ఇలా మునిపత్నులు తెచ్చిన చతుర్విధ అన్న పానీయాలను తన తోటి గోపాలురకు పెట్టి బలరామ కృష్ణులిద్దరూ భుజించారు.

ఏవం లీలానరవపుర్న్ర్లోకమనుశీలయన్
రేమే గోగోపగోపీనాం రమయన్రూపవాక్కృతైః

శరీరముతో రూపముతో మాటలతో చేతలతో ఈ ప్రపంచాన్ని రమింపచేస్తూ పరమాత్మ కాలం గడిపాడు. కొందరు సౌందర్యాని చూచి సేవించారు, కొందరు మాటలను చూచి సేవించారు, మరికొందరు కర్మలను చూచి సేవించారు.ఇలా అందరి మనసులనూ ఆనందింపచేస్తూ కాలం గడిపాడు.

అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్కృతాగసః
యద్విశ్వేశ్వరయోర్యాచ్ఞామహన్మ నృవిడమ్బయోః

దీని తరువాత ఋషులు యజ్ఞ్యం పూర్తి చేయగా, ఋషిపత్నులలో ఒకరు మోక్షానికే వెళ్ళగా ఇది చూసిన ఋషులకు పశ్చాత్తాపం కలిగింది. మేము ఏ స్వామిని చూచుటకు యజ్ఞ్యం చేసామో వారు ఆ స్వామి వద్దకే వెళ్ళారు. మానవాకారం ధరించి ఉన్న జగన్నాధుని కోరికనే కాదన్నామే.

దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీమ్
ఆత్మానం చ తయా హీనమనుతప్తా వ్యగర్హయన్

వారు స్త్రీలై ఉండి కూడా పరమాత్మయందు అలౌకికమైన భక్తి కలిగి ఉన్నారు. ఇలా ప్రతీ క్షణం తపించారు. నిందించుకున్నారు.

ధిగ్జన్మ నస్త్రివృద్యత్తద్ధిగ్వ్రతం ధిగ్బహుజ్ఞతామ్
ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖా యే త్వధోక్షజే

మా జన్మ వ్యధం, మా వేదం, మా జ్ఞ్యానం మా కులం సకల యజ్ఞ్యములూ అన్నీ వ్యర్థం. పరమాత్మ యందు వైముఖ్యం వహించి ఎన్ని యజ్ఞ్యాలు చేసి ఏమి లాభం. స్వామి మాట కాదని చేసిన యజ్ఞ్యాలూ వ్రతములూ నోములూ ఫలిస్తాయా?

నూనం భగవతో మాయా యోగినామపి మోహినీ
యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామహే ద్విజాః

"మనం జ్ఞ్యానం ఉన్న వారం " అని అనుకుంటే చెల్లదు. పరమాత్మ ఎవరికి జ్ఞ్యానం కలిగించాలనుకుంటాడో , ఎవరిని దయ చూడాలనుకుంటాడో వారికి జ్ఞ్యానం కలిగిస్తాడు. "నన్ను చేరడానికి కావలసిన బుద్ధిని నేనే కలిగిస్తాను" అన్నాడు గీతలో.అందుకే జ్ఞ్యానం మనది కాదు. అది ఆయనే ఇవ్వాలి. అందుకే పరమాత్మ మాయ మామూలు వారినే కాదు, యోగులను కూడా మోహింపచేస్తుంది. మమ్ములను అందరూ గురువులని అంటారు అందరూ. కానీ సామాన్య మానవులకున్న భక్తిలో మాకు ఎన్నో వంతు ఉంది?

అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురౌ
దురన్తభావం యోऽవిధ్యన్మృత్యుపాశాన్గృహాభిధాన్

జగద్గురువు ఐన పరమాత్మయందు స్త్రీలకు ఉన్న దృఢమైన భక్తి భావం ఏదైతే ఉందో అది ఎంత ఘనమైన భక్తి. ఆ భక్తి గట్టిగా అల్లుకుని ఉన్న సాంసారిక పాశములను చేదించింది. అడ్డు వచ్చిన వారందరినీ తోసి పారేసేట్లు చేసింది వారి భక్తి.

నాసాం ద్విజాతిసంస్కారో న నివాసో గురావపి
న తపో నాత్మమీమాంసా న శౌచం న క్రియాః శుభాః

ఆడువారికి ఉపనయనం. గురు కుల వేదాధ్యయనం లేదు, తపస్సూ ఆత్మ జ్ఞ్యానం లేదు, శౌచమూ ఆచారమూ ఏదీ లేదు.

తథాపి హ్యుత్తమఃశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే
భక్తిర్దృఢా న చాస్మాకం సంస్కారాదిమతామపి

ఇవేమీ లేకున్నా ఉత్తశ్లోకుడూ యోగీశ్వరులకు ఈశ్వరుడైన కృష్ణ పరమాత్మ మీద భక్తి ఉంది. ఆ సంస్కారాలన్నీ మాకున్న మాకు భక్తిలేదు. పరమాత్మయందు భక్తిలేని అవి అన్నీ ఎందుకు. భక్తి ఉంటే అవేవీ అక్కరలేదు. అవేమీ లేని ఆడువారే నయం.

నను స్వార్థవిమూఢానాం ప్రమత్తానాం గృహేహయా
అహో నః స్మారయామాస గోపవాక్యైః సతాం గతిః

పరమాత్మ తన పిల్లలను పంపి గుర్తు చేసాడు తాను వచ్చానని. వారు అంత స్పష్టముగా చెప్పినా సంసారం మీద ఆశతో స్వార్థముతో మూఢులమై మత్తులో ఉన్నాము. సజ్జనులు ఎలా ప్రవర్తించాలో స్వామి చాలా స్పష్టముగా చెప్పాడు

అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యశిషాం పతేః
ఈశితవ్యైః కిమస్మాభిరీశస్యైతద్విడమ్బనమ్

 మేము తెలుసుకోలేకపోయాము. అన్నం అడుగుతున్నారు బలరామ కృష్ణులు అని అంటే, గొల్లపిల్లల మాటలు అనుకున్నాము. జీవూలందరూ పరమాత్మకు అన్నం. ప్రళయకాలములో జీవూలందరినీ ఒక ముద్దగా చేసుకుని మింగేస్తాడు. యమధర్మరాజు అంటాడు : ప్రపంచమంతా అన్నమైతే నన్ను పెరుగుగా కలుపుకుని తింతాడు. అటువంటి స్వామికి అన్నంకావాలా. నిరంతరం పరమాత్మనే యాచించే మనతో ఆయనకేమి పని. ఇది పరమాత్మకు ఒక నాటకం. పరమాత్మకు ఏ విధమైన కోరికా ఉండదు. "నేను పొందవలసినదీ, పొందనిదీ అంటూ ఏదీ లేదు. ఐనా నేను పని చేస్తూనే ఉంటాను - గీత వాక్యం".

హిత్వాన్యాన్భజతే యం శ్రీః పాదస్పర్శాశయాసకృత్
స్వాత్మదోషాపవర్గేణ తద్యాచ్ఞా జనమోహినీ

ఒక్కసారి పరమాత్మ పాదములను స్పృశించాలన్న కోరికతో లక్ష్మీ దేవి బ్రహ్మరుద్రేంద్రాదులను కాదని ఎవరికోసం తపస్సు చేసిందో, తప్పులూ పాపాలూ (లక్ష్మీ దేవికి చాంచల్యం అనే ఒక లక్షణం ఉంది) పోగొట్టుకోవడానికి ఎవరి గురించి తపస్సు చేసిందో అటువంటి స్వామి అన్నం యాచించాడంటే మనను మోహింపచేయడానికా నిజముగా యాచించడానికా.

దేశః కాలః పృథగ్ద్రవ్యం మన్త్రతన్త్రర్త్విజోऽగ్నయః
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః

ప్రపంచములో ఉన్నవన్నీ పరమాత్మ స్వరూపమే. దేశ కాల ద్రవ్య మంత్ర తంత్ర ఋత్విక్ దేవతలూ యజమానులూ అందరూ పరమాత్మ స్వరూపమే.

స ఏవ భగవాన్సాక్షాద్విష్ణుర్యోగేశ్వరేశ్వరః
జాతో యదుష్విత్యాశృణ్మ హ్యపి మూఢా న విద్మహే

అటువంటి పరమాత్మే యదువంశములో పుట్టాడని విని ఉన్నాము. ఐనా మూఢులమై మరచిపోయాము. ఐన తెలుసుకోలేకపోయాము. మనం కూడా రామాయణ భారత భాగవతాలు చదివీ కోట్లాడుతూ ఉంటాము. అది ఆయన మాయే.

తస్మై నమో భగవతే కృష్ణాయాకుణ్ఠమేధసే
యన్మాయామోహితధియో భ్రమామః కర్మవర్త్మసు

ఒక రకముగా మనం అదృష్టవంతులమే. పరమాత్మ యందు అత్యంత భక్తికలిగిన భార్యలు ఉన్నారు. వారి సంబంధముతో మనం తరిస్తాము. వారి వలననే మాకు ఈనాడు స్వరూపం తెలిసి మాకూ భక్తి కలిగింది. పొరబాటు పడని మేధస్సు గల పరమాత్మకు నమస్కారం.

స వై న ఆద్యః పురుషః స్వమాయామోహితాత్మనామ్
అవిజ్ఞతానుభావానాం క్షన్తుమర్హత్యతిక్రమమ్

ఎవరి మాయచే మాబుద్ధి మోహించబడి కర్మ మార్గములో పడి సంసారములో సంచరిస్తూ ఉన్నామో. అటువంటి మాయ చే మోహించబడిన బుద్ధి మనసు గల మాకు ఆయన ప్రభావం తెలియదు. అటువంటి మా తప్పును స్వామి క్షమించుగాక.

ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృతహేలనాః
దిదృక్షవో వ్రజమథ కంసాద్భీతా న చాచలన్

ఈ రీతిలో పరమాత్మ యందు అపరాధం చేసి మళ్ళీ తమ స్వరూపం తెలుసుకుని. ఐనా సరే "ఇపుడు చూస్తే కంసుడు ఏమనుకుంటాడో" అని భయపడి ఆ ఋషులు స్వామి వద్దకు వెళ్ళలేకపోయారు. పరమాత్మ మాయ తెలుపుతుందీ, మోహింపచేస్తుంది.


                                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Friday, June 28, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం

                                                                  ఓం నమో భగవతే వాసుదేవాయ 


శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవైరెండవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
హేమన్తే ప్రథమే మాసి నన్దవ్రజకమారికాః
చేరుర్హవిష్యం భుఞ్జానాః కాత్యాయన్యర్చనవ్రతమ్

కుమార వయసులో ఉన్న బాలికలు పరమాత్మ యొక్క ప్రసాదం (హోమ ద్రవ్యం, పురోడాశం) మాత్రమే భుజిస్తూ కాత్యాయనీ వ్రతాన్ని చేసారు. కాళిందీ నదీ జలములో సూర్యోదయం కాక ముందే స్నానం చేసి ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని చేసుకుని ఆమెను ఆరాధించారు.

ఆప్లుత్యామ్భసి కాలిన్ద్యా జలాన్తే చోదితేऽరుణే
కృత్వా ప్రతికృతిం దేవీమానర్చుర్నృప సైకతీమ్

గన్ధైర్మాల్యైః సురభిభిర్బలిభిర్ధూపదీపకైః
ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాలఫలతణ్డులైః

ధూప దీప గంధములూ పాలు పెరుగూ వన్నె చిగురుటాకులూ పుష్పములూ పళ్ళూ బియ్యమూ మొదలైన వాటితో పూజించి ఈ మంత్రాన్ని చదివారు

కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి
నన్దగోపసుతం దేవి పతిం మే కురు తే నమః
ఇతి మన్త్రం జపన్త్యస్తాః పూజాం చక్రుః కమారికాః

నీకు నమస్కారం, నంద గోప కుమారుడైన కృష్ణున్ని మాకు కుమారున్ని చేయి. అని ఈ మంత్రాన్ని వారు జపించారు. వారెవరూ వివాహం ఐన వారు కారు (ప్రౌఢులు కారు, కుమారికలు)..

ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యః కృష్ణచేతసః
భద్రకాలీం సమానర్చుర్భూయాన్నన్దసుతః పతిః

ఇలా నెల రోజుల పాటు చేసారు కృష్ణ పరమాత్మ్య యందు మనసు లగ్నం చేసి ఆయన భర్తగా కావాలని భద్రకాళిని పూజించారు

ఊషస్యుత్థాయ గోత్రైః స్వైరన్యోన్యాబద్ధబాహవః
కృష్ణముచ్చైర్జగుర్యాన్త్యః కాలిన్ద్యాం స్నాతుమన్వహమ్

ఉషః కాలములో లేచి ఒకరి చేయి ఒకరు పట్టుకుని కృష్ణపరమాత్మ కీర్తి గానం చేస్తూ ప్రతీ కాళిందీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారు.

నద్యాః కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్
వాసాంసి కృష్ణం గాయన్త్యో విజహ్రుః సలిలే ముదా

వస్త్రాలన్నీ ఒడ్డు మీద పెట్టి కృష్ణున్ని ధ్యానిస్తూ జలక్రీడలాడుతున్నారు.

భగవాంస్తదభిప్రేత్య కృష్నో యోగేశ్వరేశ్వరః
వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మసిద్ధయే

ఈ విషయం యోగీశ్వరులకు ఈశ్వరుడైన కృష్ణపరమాత్మ తెలుసుకున్నాడు. తన వారు ఆచరించే పనిని సిద్ధింపచేయడానికి. స్నేహితులతో కలసి అక్కడకు వెళ్ళారు.

తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః
హసద్భిః ప్రహసన్బాలైః పరిహాసమువాచ హ

వాటిని తీసుకుని వృక్షాన్ని అధిరోహించి తోటి పిల్లలందరితో కలసి నవ్వుతూ నవ్విస్తూ పరిహాసముగా ఆ గోపకుమారికలతో ఇలా అంటున్నాడు

అత్రాగత్యాబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతామ్
సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్శితాః

అమ్మాయిలూ మీరు అందరూ నా ముందుకు వచ్చి మీ మీ వస్త్రాలను తీసుకోండి. నేను నిజమే చెబుతున్నాను. పరిహాసం కాదు (నో నర్మ). వ్రతములో ఉన్న వారితో వ్రతములో లేని వారు పరిహాసం చేయకూడదు

న మయోదితపూర్వం వా అనృతం తదిమే విదుః
ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవేతి సుమధ్యమాః

ఇపుడే కాదు. నేను ఇంతవరకూ ఎపుడూ అబద్దం చెప్పలేదు. వీరే(సహ గోపాలురు) సాక్షి అందుకు.
ఒక్కొక్కరూ వచ్చైనా తీసుకోండి. కలసి వచ్చి ఐనా తీసుకోండి. ఒడ్డుకు వచ్చి మీ మీ వస్త్రాలను తీసుకోండి.

తస్య తత్క్ష్వేలితం దృష్ట్వా గోప్యః ప్రేమపరిప్లుతాః
వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతహాసా న నిర్యయుః

పరిహాసం ఆడటం లేదంటూనే పరిహాసముగా మాట్లాడుతున్నాడని తెలుసుకుని అతని మీద ప్రేమ అడ్డువస్తోంటే సిగ్గుపడి ఒకరినొకరు చూసుకుని, వచ్చిన నవ్వును లోపల పెట్టుకుని బయటకు వెళ్ళకుండా నీటిలోనే అలా ఉనారు.

ఏవం బ్రువతి గోవిన్దే నర్మణాక్షిప్తచేతసః
ఆకణ్ఠమగ్నాః శీతోదే వేపమానాస్తమబ్రువన్

కృష్ణ పరమాత్మ మాటలను పరిహాసముగానే ఎంచారు. వారి మనసు పరిహాసముతొ నిండిపోయి చల్లటి నీరు కంఠం వరకూ నిండిపోయి వణుకుతూ ఇలా అన్నారు

మానయం భోః కృథాస్త్వాం తు నన్దగోపసుతం ప్రియమ్
జానీమోऽఙ్గ వ్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః

నీవు అన్యాయం చేయవద్దు. నీవెవరవో మాకు తెలుసు. నంద గోపుని కుమారుడవు.ఆయన మాకు రాజు. నీవు అధర్మం చేయవు. వ్రేపల్లెలో ఉన్నవారందరిచేత కీర్తించబడే చరిత్ర ఉన్నవాడిగా మాకు తెలుసు.మా వస్త్రాలు మాకు ఇవ్వు. చలితో వణికిపోతున్నాము .

శ్యామసున్దర తే దాస్యః కరవామ తవోదితమ్
దేహి వాసాంసి ధర్మజ్ఞ నో చేద్రాజ్ఞే బ్రువామ హే

మేము నీకు దాసీ జనము. ఇలా వస్త్రం తీసుకుని ఇబ్బంది పెట్టకు. ధర్మం తెలిసినవాడవు. నీవు మర్యాదగా ఇవ్వకపోతే నీ మీద మీ తండ్రికి చెబుతాము.

శ్రీభగవానువాచ
భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ
అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛత శుచిస్మితాః
నో చేన్నాహం ప్రదాస్యే కిం క్రుద్ధో రాజా కరిష్యతి

మీరే చెబుతున్నారు దాసీ జనమని. దాసీ జనం చెప్పినట్లు వింటారు. మీరూ అలాగే చేయండి. ఇక్కడకు వచ్చి పవిత్రమైన చిరునవ్వుతో రండి. (సుందరకాండలో కూడా సీతమ్మ రావణునితో మాట్లాడేప్పుడు సీతమ్మను శుచిస్మిత అని వర్ణిస్తారు. స్త్రీ పవిత్రముగా నవ్వేది తన పిల్లల దగ్గరే. )

తతో జలాశయాత్సర్వా దారికాః శీతవేపితాః
పాణిభ్యాం యోనిమాచ్ఛాద్య ప్రోత్తేరుః శీతకర్శితాః

ఎక్కువ సేపు సరస్సులో ఉండలేక చలికి వణికిపోతూ చేతులతో కొన్ని అవయవాలను కప్పుకుని బయటకు వచ్చారు.

భగవానాహతా వీక్ష్య శుద్ధ భావప్రసాదితః
స్కన్ధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితమ్

అంటే ఇంకా వారు పరమాత్మను పరమాత్మగా చూడటములేదు. భగవంతుని ముందర సిగ్గు తగదు. ఆయన దగ్గర మనలో ఏ వస్తువైనా దాచవలసిన వస్తువు లేదు. మనకు అవయవాలు ఇచ్చినది, ఇంద్రియాలు ఇచ్చినదీ, అధిష్ఠాన దేవతలనిచ్చిన్నదీ ఆయనే. ఆయన కానిదంటూ ఏదీ లేదు. అంటే వారికి ఇంకా తాము ఆడువారం అన్న భావన ఉంది. ఇంకా వీరి దగ్గర సంకోచం పోలేదు అన్న భావం తెలుసుకున్నాడు కృష్ణుడు. వారి భావములో పరిశుద్ధి వలన్ (చెప్పినట్లు విన్నారు కాబట్టి) వారిని అనుగ్రహించి వస్త్రాలను చెట్టు కొమ్మపై ఉంచి నవ్వుతూ ఇలా అన్నాడు

యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా వ్యగాహతైతత్తదు దేవహేలనమ్
బద్ధ్వాఞ్జలిం మూర్ధ్న్యపనుత్తయేऽంహసః కృత్వా నమోऽధోవసనం ప్రగృహ్యతామ్

మీరు వ్రతాన్ని స్వీకరించారు కదా. వ్రతాన్ని తీసుకుని వస్త్రాలు లేకుండా నీటిలోకి మునిగారు. ఇది భగవదపచారం కాదా. మీరు తప్పు చేయలేదా. దేవతలను మీరు అవమానించారు. తిరస్కరించారు. చేసిన తప్పు దండముతో సరి. చేతులెత్తి నమస్కరించండి అందుకు ప్రాయశ్చిత్తముగా. శిరస్సు మీద చేతులు జోడించి పాపాన్ని తొలగించుకోండి. అలా చేసి మీ వస్త్రాలను మీరు తీసుకోండి

ఇత్యచ్యుతేనాభిహితం వ్రజాబలా మత్వా వివస్త్రాప్లవనం వ్రతచ్యుతిమ్
తత్పూర్తికామాస్తదశేషకర్మణాం సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యతః

ఇది వారి మనసులో బాగా నాటింది. మేము తప్పు చేసాము, దాని వలన మా వ్రతం భగ్నం కాకూడదు. ఇది తప్పూ అని తెలుసుకుని, ఒక చేతితో నమస్కారం చేసారు. ఒక చేతితో కొన్ని అవయవాలను దాచిపెట్టుకుని రెండవ చేతితో స్వామికి నమస్కరించారు. అపుడు కృష్ణుడు "ఒక చేతితో నమస్కారం చేస్తే ఆ చేతిని నరికేయాలని శాస్త్రం". మీరు రెండవ తప్పు చేసిన వారవుతారు. అనగా, వారిలో అన్ని సంకోచాలూ అపవిత్ర భావాలు తొలిగాయి. ఇలా స్పష్టముగా చెప్పిన తరువాత మనమాచరించే అన్ని కర్మలకూ సాక్షీ భూతుడైన పరమాత్మకు నమస్కరించాడు. ఆయన చూడకుండా ఆయనకు తెలియకుండా మనం ఏ కర్మలూ చేయజాలము. అన్ని పాపములనూ తొలగించేవాడు పరమాత్మ. చేసిన తప్పులను క్షమించేవాడు. చేసిన ప్రతీ పనినీ చూసేవాడు పరమాత్మ.

తాస్తథావనతా దృష్ట్వా భగవాన్దేవకీసుతః
వాసాంసి తాభ్యః ప్రాయచ్ఛత్కరుణస్తేన తోషితః

వారు చెప్పినట్లు విని తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం ఆచరించారు కాబట్టి స్వామి సంతోషించి దయ కలవాడై వారి వారి వస్త్రాలను ఇచ్చ్చాడు.

దృఢం ప్రలబ్ధాస్త్రపయా చ హాపితాః
ప్రస్తోభితాః క్రీడనవచ్చ కారితాః
వస్త్రాణి చైవాపహృతాన్యథాప్యముం
తా నాభ్యసూయన్ప్రియసఙ్గనిర్వృతాః

ఇంచుమించు పరిహాసం చేసాడు, వారి సిగ్గునూ విడిపించాడు, హేలన కూడా చేసాడు, ఆటబొమ్మల లాగ వారిని ఆడించాడు, వారి వస్త్రాలను కూడా అపహరించాడు. ఇంత చేసినా వారికి స్వామి మీద కోపం రాలేదు. స్వామి చర్యను వారు తప్పు బట్టలేదు. ఆయనే తమ ప్రియుడు. ప్రియుడి యొక్క దర్శనముతో తృప్తి పొందినవారై ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆయన మీద కోపించక సంతోషించారు.

పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసఙ్గమసజ్జితాః
గృహీతచిత్తా నో చేలుస్తస్మిన్లజ్జాయితేక్షణాః

ఇలా వారి వారి వస్త్రాలను ధరించి కృష్ణ సమాగమం వలన తృప్తి పొందిన వారై, వస్త్రాలను కట్టుకుని కృష్ణుని ఎదుట నిలబడ్డారు, ఆయన  యందే మనసు లగ్నం చేసారు, సిగ్గు తొణికిసలాడే చూపులతో స్వామిని చూస్తూ ఉంటే

తాసాం విజ్ఞాయ భగవాన్స్వపాదస్పర్శకామ్యయా
ధృతవ్రతానాం సఙ్కల్పమాహ దామోదరోऽబలాః

ఎపుడైతే వారు ఇలా వస్త్రాలు కట్టుకుని కూడా అక్కడనుంచి వెళ్ళకుండా స్వామి వైపే చూస్తూ ఉంటే వారి అభిప్రాయం తెలుసుకున్నాడు, తన పాదాలను పట్టుకోవాలనే వారి సంకల్పాన్ని తెలుసుకున్నాడు దామోదరుడు. దామోదర శబ్దముతో భక్త పరాధీనత తెలుస్తుంది. ఎలాగైతే ఆనాడు యశోదమ్మ సంకల్పాన్ని పూర్తి చేసాడో అలాగే ఈనాడు వారి సంకల్పాన్ని కూడా పూర్తి చేయదలచి

సఙ్కల్పో విదితః సాధ్వ్యో భవతీనాం మదర్చనమ్
మయానుమోదితః సోऽసౌ సత్యో భవితుమర్హతి

సాధ్వీమణులారా మీ సంకల్పం నాకు తెలిసింది. నన్ను మీరు ఎందుకు ఆరాధించారో నాకు తెలిసింది (వారు ఆరాధించినది కాత్యాయని అమ్మవారిని. కానీ ఇక్కడ స్వామి "నన్ను ఆరాధించారు" అంటున్నాడు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి | తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ అన్నది గీతా వాక్యం అర్థమవుతుంది మనకు. ఎవరిని ఆరాధించినా అందులో ఉన్న అంతర్యామి కృష్ణుడే. సర్వదేవ నమస్కార: కేశవం ప్రతిగచ్ఛతి. ) మీ సంకల్పాన్ని నేను ఆమోదించాను. నాచేత ఆమోదించబడి ఆ సంకల్పం నిజమే అవుతుంది.

న మయ్యావేశితధియాం కామః కామాయ కల్పతే
భర్జితా క్వథితా ధానాః ప్రాయో బీజాయ నేశతే

నా మీద ఉన్న కామం కామాన్ని ప్రసాదించదు. నా మీద కోరిక సాంసారిక విషయాల మీద ప్రసరించదు. భూమి మీద విత్తనం వేస్తే మొలక వస్తుంది. కానీ వేసే ముందు ఆ ధాన్యాన్ని వేపి, లేదా దంచి భూమిలో వేస్తే మొలక ఎత్తదు. నా కామన ఇతర కామములకు దారి చూపదు.

యాతాబలా వ్రజం సిద్ధా మయేమా రంస్యథా క్షపాః
యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యార్చనం సతీః

మీరు నిస్సందేహముగా మీ మీ ఇళ్ళకు వెళ్ళండి. ఈ కొద్ది రోజులలోనే చక్కని వెన్నెల రాత్రులలో మీరు నాతఓ రమిస్తారు. మీరు సతులుగా భక్తురాళ్ళుగా దేన్ని మనసులో పెట్టుకుని కాత్యయనీని ఆరాధించారో ఆ మీ సంకల్పం నెరవేరుతుంది. కానీ ఆ నెరవేరిన సంకల్పం కామాన్ని ప్రసాదించదు. ఉద్వేగాన్ని పెంచదు. నా మీద కామం కూడా మోక్షాన్నే ఇస్తుంది.

శ్రీశుక ఉవాచ
ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామాః కుమారికాః
ధ్యాయన్త్యస్తత్పదామ్భోజమ్కృచ్ఛ్రాన్నిర్వివిశుర్వ్రజమ్

ఇలా స్వామి ఆజ్ఞ్య ఇస్తే తమ కోరిక నెరవేరింది కాబట్టి ఆ పరమాత్మ పాదములను ధ్యానం చేస్తూ వెళ్ళలేక వెళ్ళలేక అతి కష్టం మీద వారు వారి ఇళ్ళకు వెళ్ళారు

అథ గోపైః పరివృతో భగవాన్దేవకీసుతః
వృన్దావనాద్గతో దూరం చారయన్గాః సహాగ్రజః

తోటి గోపాలకురల్తో కలసి కృష్ణ పరమాత్మ బృందావనానికి వెళ్ళాడు.

నిదఘార్కాతపే తిగ్మే ఛాయాభిః స్వాభిరాత్మనః
ఆతపత్రాయితాన్వీక్ష్య ద్రుమానాహ వ్రజౌకసః

పగలంతా ఎండ బాగా ఉండి ఆ ఎండ వేడికి ఇబ్బంది పడతారేమో అని చెట్లు తమ కొమ్మలతో నీడను ఇస్తున్నాయి.

హే స్తోకకృష్ణ హే అంశో శ్రీదామన్సుబలార్జున
విశాల వృషభౌజస్విన్దేవప్రస్థ వరూథప

కొంతమంది గోపాలబాలకులను పేరు పెట్టి పిలుస్తూ గోపాలబాలకులు ఇలా అంటున్నారు. ఈ వృక్షాలను చూసారా. ఇవి ఎలాంటి వృక్షాలంటే పరోపకార పరాయణులు. నిరతంతరం పరోపకారానికే ప్రయత్నిస్తున్నారు. వాటికి ఎటువంటి స్వార్థం లేదు. గాలీ నీరూ వర్షమూ ఎండా మంచూ, వీటిని తాము భరిస్తూ , వాటి నుండి మనను కాపాడుతున్నాయి. మనుషులకంటే చెట్ల పుట్టుకే ఎంతో అదృష్టవంతమైన గొప్పదైన జన్మ.

పశ్యతైతాన్మహాభాగాన్పరార్థైకాన్తజీవితాన్
వాతవర్షాతపహిమాన్సహన్తో వారయన్తి నః

అహో ఏషాం వరం జన్మ సర్వ ప్రాణ్యుపజీవనమ్
సుజనస్యేవ యేషాం వై విముఖా యాన్తి నార్థినః

ఉత్తములైతే తమ ఇంటికొచ్చిన అతిథులను ఒట్టిచేత్తో పంపించరు. అలాగే ఈ చెట్ల వద్దకు వచ్చిన వారు నిరాశతో వెళ్ళరు.

పత్రపుష్పఫలచ్ఛాయా మూలవల్కలదారుభిః
గన్ధనిర్యాసభస్మాస్థి తోక్మైః కామాన్వితన్వతే

పత్రములూ ఆకులూ పూవులూ పళ్ళూ నీడనూ బెరడునూ చెక్కనూ గంధమునూ నిర్యాతమనూ భస్మమునూ ఎండిన భాగాన్ని (అస్థి)ఇచ్చి కోరిన వారి అన్ని కోరికలనూ నెరవేరుస్తున్నారు.

ఏతావజ్జన్మసాఫల్యం దేహినామిహ దేహిషు
ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయఆచరణం సదా

ఎవరు కోరితే అది లేదనకుండా ఇస్తున్నారు. లోకములో శరీర ధారులకు జన్మ సాఫల్యం ఎప్పుడంటే ప్రాణములతో అర్థములతో బుద్ధితో వాక్కుతో ఎదుటివారికి శ్రేయస్సునే అందించాలి. పరులకు శ్రేయస్సును ఆచరించుటే మన జన్మకు సార్ధక్యము. దానిని మన కంటే ఈ చెట్లే బాగా చేస్తున్నాయి.

ఇతి ప్రవాలస్తబక ఫలపుష్పదలోత్కరైః
తరూణాం నమ్రశాఖానాం మధ్యతో యమునాం గతః

వంగి ఉన్న చెట్ల కొమ్మల మధ్యనుండి వాటిని చూస్తూ చూస్తూ ఆహా ఎంత పుణ్యం చేసుకున్నాయి, ఎంత ధన్యములు ఈ వృక్షములు. నిజముగా వీరు కదా అదృష్టవంతులు. చెట్లూ పళ్ళూ ఆ చెట్లు ఇచ్చేవి తమ కోసం కాదు. సత్పురుషుల యొక్క సంపదలు స్వార్థం కోసం కాదు. పరోపకారం కోసమే.

తత్ర గాః పాయయిత్వాపః సుమృష్టాః శీతలాః శివాః
తతో నృప స్వయం గోపాః కామం స్వాదు పపుర్జలమ్

అక్కడ ఆవులను చక్కటి తీయటి కమ్మని నీరు తాగించి, మొదలు పశువులకు నీరు తాపించిన తరువాత తాము తాగారు. (మనం, మనం తాగగా మిగిలిన నీరు వాటికిస్తాము. తమచే పోషింపబడే వారికి ముందు భోజనం పెట్టి తరువాత మిగిలితే మనం తినాలి. భార్య పిల్లలూ అందరూ తిన్న తరువాతే భర్త తినాలి.భార్యా భర్తలు ఒకరు భోజనం చేస్తున్నప్పుడు ఒకరు చూడరాదు. )

తస్యా ఉపవనే కామం చారయన్తః పశూన్నృప
కృష్ణరామావుపాగమ్య క్షుధార్తా ఇదమబ్రవన్

ఇలా ఆ బృందావన ఉపవనములో ఆవులను తిప్పుతూ ఉండగా మధ్యాన్నం అయ్యింది. తెచ్చుకున్న చద్ది మూటలైపోగా మళ్ళీ ఆకలయ్యింది. అపుడు ఆకలవుతుంది అని చెప్పడానికి స్వామిని చేరారు అందరూ.


                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Wednesday, June 26, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం

                                                               ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఇత్థం శరత్స్వచ్ఛజలం పద్మాకరసుగన్ధినా
న్యవిశద్వాయునా వాతం స గోగోపాలకోऽచ్యుతః

ఇంత చల్లని చక్కని వాతావరణములో కృష్ణుడు కూడా ఆనందముగా ఉన్నాడు

కుసుమితవనరాజిశుష్మిభృఙ్గ ద్విజకులఘుష్టసరఃసరిన్మహీధ్రమ్
మధుపతిరవగాహ్య చారయన్గాః సహపశుపాలబలశ్చుకూజ వేణుమ్

కొత్తగా పుష్పించిన పూవులతో కూడి ఉన్న తోటలలో పూసిన పూవుల యందు మకరందాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెదలు. ఫలించిన పళ్ళ రుచిని చూచిన చిలుకలు, మధుపతి ఐన శ్రీకృష్ణుడు వనమంతా సంచరిస్తూ, పశుపాలురతో బలరామునితో కలసి వేణువుని గానం చేసాడూ

తద్వ్రజస్త్రియ ఆశ్రుత్య వేణుగీతం స్మరోదయమ్
కాశ్చిత్పరోక్షం కృష్ణస్య స్వసఖీభ్యోऽన్వవర్ణయన్

కృష్ణ పరమాత్మ మ్రోగించిన వేణు గానాన్ని విన్న గోపికలు ఎక్కడో ఉన్న కృష్ణ పరమాత్మను తమ ఎదురుగా చూడలేనటువంటి విరహ తాపముతో పరమాత్మను స్తోత్రం చేస్తారు. ఇది గోపికా విరహ గీతములు. పొద్దున్నే లేవగానే అనుసంధానం చేయవలసిన స్తోత్రములు ఇవి
కృష్ణ పరమాత్మ విరహముతో గోపికలు కామాతురతో ఈ గీతం పాడారు. ఒక సారి కలిసిన పరమాత్మ విడిపోతాడేమో అన్న భయమే పరమ భక్తి.
తెగని నూనె ధార లాగ నిరంతరమూ పరమాత్మ యందు ఉండే స్మృతి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మన ముందర సాక్షాత్కరింపచేస్తుంది. ఒక సారి కనపడ్డ తరువాత మళ్ళీ కనపడడేమో అన్న భయాన్ని పరమ భక్తి అంటారు.

తద్వర్ణయితుమారబ్ధాః స్మరన్త్యః కృష్ణచేష్టితమ్
నాశకన్స్మరవేగేన విక్షిప్తమనసో నృప

బర్హాపీడం నటవరవపుః కర్ణయోః కర్ణికారం
బిభ్రద్వాసః కనకకపిశం వైజయన్తీం చ మాలామ్
రన్ధ్రాన్వేణోరధరసుధయాపూరయన్గోపవృన్దైర్
వృన్దారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తిః

మన్మధ వేగముతో పారవేసుకోబడిన మనసు గల గోపికలు కృష్ణ పరమాత్మ ఎడబాటుని సహించలేకపోయారు. మగవాళ్ళు కూడా మోహించబడేంత ముద్దుగా ఉన్నాడు. శిరస్సులో నెమలిపించం. నాట్యం చేసేవాడికి ఎంత చక్కని ఆకారం ఉంటుందో అలా, రెండు చెవులలో రెండు కర్ణికా పుష్పాలను ధరించి, బంగారం వంటి పట్టు వస్త్రాన్ని ధరించాడు, మెడలో వైజయంతీ మాలను ధరించాడు. ఐదు రకముల పుష్పములను ఐదు తీరులుగా ఐదు చోట్ల వేయబడిన మాల వైజయంతీ మాల. వేణువును ఊదుతున్నాడు. వేణువులో రంధ్రాలను అధరామృతముతో నింపుతున్నాడు.
గోపికల గోపాలుర చేత గుంపులు గుంపులుగా చేరి తన చరితను గానం చేస్తుంటే తన పదముల, పాదముల స్పర్శతో ఆనందం పొందుతున్న బృందావనాన్ని స్వామి ప్రవేశించాడు

ఇతి వేణురవం రాజన్సర్వభూతమనోహరమ్
శ్రుత్వా వ్రజస్త్రియః సర్వా వర్ణయన్త్యోऽభిరేభిరే

కృష్ణ పరమాత్మ వేణు రవం చేస్తుంటే గోపికలే కాక సకల ప్రాణులూ ఆ ధ్వనిని విని సంతోషించాయి. అది విన్న వ్రజ స్త్రీలు అందరూ
అతనినీ అతని వేణు గానాన్ని వర్ణిస్తూ పాటలు పాడారు, వారిలో వారు పరమాత్మ స్వరూపాన్ని సాక్షాత్కరించుకున్నారు, క్రీడించారు

శ్రీగోప్య ఊచుః
అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః
సఖ్యః పశూననవివేశయతోర్వయస్యైః
వక్త్రం వ్రజేశసుతయోరనవేణుజుష్టం
యైర్వా నిపీతమనురక్తకటాక్షమోక్షమ్

కృష్ణ పరమాత్మను చూస్తే మాకు ఈ విషయం అర్థమయ్యింది. కనులు కలిగి ఉండుటకు ఇదే ఫలం
కళ్ళు ఉండి కూడా ఆయనను చూడకపోతే వారు కళ్ళు లేని వారితోనే సమానం.
తోటి గొల్ల పిల్లలతో గోవులతో దూడలతో కలిసి ఆ దుమ్మంతా ఒంటి మీద పడుతూ ఉంటే అడవిలో ప్రవేశిస్తున్న స్వామిని, పరత్వ సౌలభ్యాలను ఒకే సారి చూపిచే గోపయ్యను చూడాలి. పరత్వ పరాకాష్ట సౌలభ్య పరాకాష్ట ఉన్న స్వామిని చూడడం కన్న పరము మాకు తెలియదు.
బలరామ కృష్ణులిద్దరి ముఖములూ వేణువులచే సేవించబడినవు. అలా వస్తున్న స్వామి మీద కొన్ని లక్షల చూపులు పడతాయి. ప్రేమ నిండిన లక్షల చూపులు అవి. నిరంతరం వేణువు యందు అధరామృతాన్ని అందించిన, అందరి చేతా ఆస్వాదించబడుతున్న, తోటి గోపబాలురతో విహరించుచున్న, అడవి నుండి పల్లెకు వస్తున్న కృష్ణ పరమాత్మను చూడడమే ఫలము కనులు ఉన్నందుకు.

చూతప్రవాలబర్హస్తబకోత్పలాబ్జ మాలానుపృక్తపరిధానవిచిత్రవేశౌ
మధ్యే విరేజతురలం పశుపాలగోష్ఠ్యాం రఙ్గే యథా నటవరౌ క్వచ గాయమానౌ

మామిడి చిగురాకులతోటి దడకూర్చి, నెమలి పించములూ, కొన్ని పూల గుత్తులూ కలువలూ పద్మములూ వీటి మాలల చేత గుచ్చబడిన వస్త్రములతో విచిత్ర వేషముతో గోపాలకుల సభలో మధ్యన తగినంతా ప్రకాశించాడు, తెర మీద నటులు ప్రకాశించినట్లుగా గానం చేస్తూ ప్రకాశిస్తున్నారు

గోప్యః కిమాచరదయం కుశలం స్మ వేణుర్
దామోదరాధరసుధామపి గోపికానామ్
భుఙ్క్తే స్వయం యదవశిష్టరసం హ్రదిన్యో
హృష్యత్త్వచోऽశ్రు ముముచుస్తరవో యథార్యః

గోపికలకు వేణువు మీద అసూయ, గోపికలను చూస్తే వేరేవాళ్ళకు అసూయూ. ఇంతటి నేర్పరి తనం సంపాదించడానికి గోపికలు ఏమి పుణ్యం చేసారు. వ్యాసుడు భాగవతములో రాధను వేణువుగా చూపాడు (ఈ రహస్యం మనకు పాద్మ పురాణాంతర్గతమైన భాగవత మాహాత్మ్యములో ఉంది. భాగవత మాహాత్యం పాద్మములో మూడు సార్లు చెప్పబడి ఉన్నది). బ్రహ్మవైవర్తములో కృష్ణపరమాత్మ దగ్గర వేణువు లేదు. భాగవతములో రాధ లేదు. వేణువే రాధ. వ్యాసుడు రాధనే వేణువుగా మలిచాడు. వేణువు తాగగా మిగిలిన కృష్ణ అధరామృతమును గోపికలు తాగారు. వారి తాగగా మిగిలిన దాన్ని మడుగులూ సరస్సులూ తాగాయి. స్వామి వేణు గానం చేసి, దప్పి గొని, వేణువు పక్కన పెట్టి అందరూ చూస్తుండగా మడుగులో నీరు తాగుతాడు. ఎవరూ చూడనప్పుడు దూడలు చూస్తుండగా రెండు చేతులూ వెనక్కు కట్టుకుఇ ముందుకు వంగి దూడలకు నీరు తాగడం నేర్పడానికా అన్నట్లు చేయి పెట్టకుండా నోటితోనే నీరు తాగుతాడు. ఇలా కృష్ణ పరమాత్మ అధరామృతాన్ని వారు వారు పానం చేస్తూ ఉంటే చూస్తున్న వృక్షాలు వారికంటే ఎక్కువ ఆనందించాయి. ఆర్యులు (సజ్జనులు) తాము సంతోషిస్తే సంతోషించరు, ఎదుటివారు సంతోషిస్తే సంతోషిస్తారు. అలాగే చెట్లు కూడా ఉత్తములలాగ ఆనందిస్తున్నారు. అవి ఆనందబాష్పాలు రాల్చాయి

వృన్దావనం సఖి భువో వితనోతి కీఋతిం
యద్దేవకీసుతపదామ్బుజలబ్ధలక్ష్మి
గోవిన్దవేణుమను మత్తమయూరనృత్యం
ప్రేక్ష్యాద్రిసాన్వవరతాన్యసమస్తసత్త్వమ్

బృందావనం కూడా కీర్తిని వ్యాపింపచేస్తూ ఉన్నది.దేవకీ పుత్రుని పాద పద్మముల సంపద కల బృందావనం కీర్తిని వ్యాపింపచేస్తూ ఉన్నది. బృందావనములో కృష్ణ పరమాత్మ వేణువును ఊదుతున్నాడు. కమ్మని పాటకు నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యమును చూచి పర్వతములలో లోయలలో గుహల్లో ఉన్న అన్ని రకముల జీవులూ తమను తాము మరచిపోయి పులకించిపోతున్నారు.మేము (గోపికలు) అక్కడ ఉండి చూడలేకపోతున్నాము.

ధన్యాః స్మ మూఢగతయోऽపి హరిణ్య ఏతా
యా నన్దనన్దనముపాత్తవిచిత్రవేశమ్
ఆకర్ణ్య వేణురణితం సహకృష్ణసారాః
పూజాం దధుర్విరచితాం ప్రణయావలోకైః

బుద్ధీ జ్య్నానమూ లేకున్నా ఈ ఆడ లేళ్ళు ధన్యులు. ఈ లేళ్ళు ఎంత గొప్పవంటే ఇటువంటి విచిత్ర వేషం కలిగిన పరమాత్మను కనులారా చూస్తూ ఆయన వేణుగానాన్ని వింటూ, తమ ప్రియులైన మగ లేళ్ళతో కలసి పరమాత్మను చూస్తూ ఆయన వేణు గానాన్ని వింటున్నాయి. తమకు ఇంతటి గొప్ప అదృష్టాన్ని కలిగించిన కృష్ణపరమాత్మను మరొక రకముగా పూజించే శక్తి లేదు కాబట్టి ప్రేమ నిండిన చూపుతో పూజిస్తున్నార్యి.దగ్గరకు చేరలేకున్నా ఆనందాన్ని ప్రకటింపచేయడానికి వేరే మారగములేకున్నా ప్రేమ రసం తొణికిసలాడే చూపులతో కృష్ణపరమాత్మను చూస్తున్న మగలేళ్ళతో కలసి ఉన్న ఆడలేళ్ళు చాలా అదృష్టవంతులు

కృష్ణం నిరీక్ష్య వనితోత్సవరూపశీలం
శ్రుత్వా చ తత్క్వణితవేణువివిక్తగీతమ్
దేవ్యో విమానగతయః స్మరనున్నసారా
భ్రశ్యత్ప్రసూనకబరా ముముహుర్వినీవ్యః

ఆడవారికి పండుగ కలిగించే రూపం కలవాడు కృష్ణుడు. పరమాత్మ చేత గానం చేయబడిన విచిత్ర గీతమును విని ఆకాశములో విమానాలలో విహరించే దేవతా స్త్రీలు కూడా మన్మధునిచే తొలగించబడిన బలం కలవారై సిగముడులు విడిపోతూ పూలు రాలిపోతూ ఉండగా మోహాన్ని చెందుతున్నారు

గావశ్చ కృష్ణముఖనిర్గతవేణుగీత
పీయూషముత్తభితకర్ణపుటైః పిబన్త్యః
శావాః స్నుతస్తనపయఃకవలాః స్మ తస్థుర్
గోవిన్దమాత్మని దృశాశ్రుకలాః స్పృశన్త్యః

మాకు తప్ప అందరికీ భాగ్యమే. అందరూ వింటున్నారు ఈ వేణుగానం. ఆవులు కూడా కృష్ణ పరమాత్మ ముఖం నుండి వెలువడిన వేణుగానం చేత నింపబడిన చెవులనే దొప్పలతో తాగుతూ దూడలు ఆకలై తల్లుల వద్దకు వెళుతున్నాయి. తల్లులు వేణుగానముతో ఉప్పొంగి ధారగా పాలిస్తున్నాయి. దూడలు ఆ తాగిన పాలు నోటిలోనే పెట్టుకున్నాయి.కృష్ణుని వేణు గానానికి మైమరచి నోటిలో పాల ముద్దలు పెట్టుకుని ఉన్నాయి గానీ మింగలేదు.  నోటిలో ఉన్న పాలు గడ్డకట్టి పాల ముద్దలయ్యాయి.

ప్రాయో బతామ్బ విహగా మునయో వనేऽస్మిన్
కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతమ్
ఆరుహ్య యే ద్రుమభుజాన్రుచిరప్రవాలాన్
శృణ్వన్తి మీలితదృశో విగతాన్యవాచః

ఈ బృందావనములో ఉన్న పక్షులన్నీ పక్షులు కావు మునులే. దూరముగా ఉన్నవారు కనపడాలంటే ఎత్తు ఎక్కినట్లు ఈ పక్షులు చెట్ల చిటారు కొమ్మ ఎక్కి కృష్ణున్ని చూస్తున్నాయి. ఇవి పక్షులు కావు మునులే.
కనులు మూసుకోకుండా కనులు తెరుచుకుని చూస్తున్నాయి. వాటి అరుపు మానేసారు. స్వామినే చూస్తున్నాయి.

నద్యస్తదా తదుపధార్య ముకున్దగీతమ్
ఆవర్తలక్షితమనోభవభగ్నవేగాః
ఆలిఙ్గనస్థగితమూర్మిభుజైర్మురారేర్
గృహ్ణన్తి పాదయుగలం కమలోపహారాః

నదులు కూడా కృష్ణపరమాత్మ వేణు గానాన్ని విని ఆనందిస్తున్నాయి. విని ఆనందిస్తున్నట్లు గుర్తుగా పరమాత్మ వేణు గానం వినడం వలన కలిగిన మన్మధావేశములో సుడులు  తిరిగి వేగం తగ్గిస్తున్నాయి. ఒక్క సారి తరంగాలతో గట్టిగా పద్మాలను కౌగిలించుకుని శ్రీకృష్ణుని పాదముల యందు కానుకలుగా ఉంచుతున్నాయి. తాము కౌగిలించుకున్న పద్మములు స్వామి పాదాలను తాకడముతో తాము కూడా స్వామిని కౌగిలించుకున్నట్లు భావించాయి.

దృష్ట్వాతపే వ్రజపశూన్సహ రామగోపైః
సఞ్చారయన్తమను వేణుముదీరయన్తమ్
ప్రేమప్రవృద్ధ ఉదితః కుసుమావలీభిః
సఖ్యుర్వ్యధాత్స్వవపుషామ్బుద ఆతపత్రమ్

మేము చేయలేని సేవలను వనకాంత (అడవి) చేస్తోంది. బలరామునితో గోపాలకులతో కలసి గోవులను ఎండలో తిప్పుతూ వేణువును ఊదుతున్న స్వామిని చూచి వీరందరికీ ప్రేమ పెరిగి తన శరీరముతో స్వామి నడిచే దారిలో పూలు పరచింది. కొమ్మలతో ఆకాశాన్ని కప్పింది. గొడుగుగా పాదుకలుగా వనకాంత కృష్ణున్ని సేవిస్తోంది. ఎంత దుర్మార్గులారు. మేము చేసుకుని మురవవలసిన సేవలను వనకాంత చేస్తోంది.

పూర్ణాః పులిన్ద్య ఉరుగాయపదాబ్జరాగ
శ్రీకుఙ్కుమేన దయితాస్తనమణ్డితేన
తద్దర్శనస్మరరుజస్తృణరూషితేన
లిమ్పన్త్య ఆననకుచేషు జహుస్తదాధిమ్

నదుల ఓడ్డులో ఉండే ఇసుక తిన్నెలనూ, అడవి స్త్రీలనూ పులిన్ద్య అంటారు. పెద్దల చేత నిరంతరం గానం చేయబడే శ్రీమన్నారాయణుడి పాద పద్మముల ఎరుపు అంటింది. కనుక స్తనముల యందు అలంకరించుకోదగిన కుంకుమ అది. పరమాత్మ ఇసుక తిన్నెల మీద నడుస్తూ ఉంటే పడుతున్న అడుగు జాడలను కింద ఉన్న చెట్ల కొమ్మలు తుడిచివేస్తున్నాయి. "కృష్ణ పాద పరాగమును మేమే తీసుకుంటాం" అన్నట్లుగా ఆ కొమ్మలు తమ మూర్ధ్న భాగాన అంటించుకుంటున్నాయి. అది మేము స్తనముల మీద ధరించకుండా చేస్తున్నాయి.

హన్తాయమద్రిరబలా హరిదాసవర్యో
యద్రామకృష్ణచరణస్పరశప్రమోదః
మానం తనోతి సహగోగణయోస్తయోర్యత్
పానీయసూయవసకన్దరకన్దమూలైః

ఈ పర్వతం కూడా చూడడానికి మగవేషములో కనపడుతున్నా, ఇది కూడా పరమాత్మకు ఉత్తమ దాసులైన అబల. రామకృష్ణుల పాద స్పర్శతో కలిగిన ఆనందముతో గోవులకూ గోపాలకురకూ మంచి నీళ్ళూ కందములూ మూలములూ మంచినీళ్ళూ ఆసనములూ పళ్ళూ పూలూ మొగ్గలూ కాయలూ ఇచ్చింది. తాను ఎవరి వలన ఆనందం పొందారో వారికి సంబందించిన వారు వస్తే అంత ఆనందమూ కలుగుతుంది.

గా గోపకైరనువనం నయతోరుదార
వేణుస్వనైః కలపదైస్తనుభృత్సు సఖ్యః
అస్పన్దనం గతిమతాం పులకస్తరుణాం
నిర్యోగపాశకృతలక్షణయోర్విచిత్రమ్

పర్వతమే కాదు ప్రతీ చెట్టూ అమ్మాయే. కొత్త కొత్త పూలు వస్తున్నాయి. శరీరం పులకించినట్లుగా. కొత్త చిగురాకులూ పూవులూ కలుగుతున్నాయి. గోవులతో కలసి ఆవులను వనానికి తీసుకు వెళుతున్న వారి యొక్క చక్కని వేణు గానముతో మంచి పాటలతో శరీరం పులకించి గమనం ఉన్నవారు కూడా గమనం మాని వేసారు. ఏ మాత్రం సంబంధం లేకున్నా ఎంతో కాలం నుంచి ఏర్పడిన పాశముతో పులకింతలు చెట్లకు కూడా కలుగుతున్నాయి.

ఏవంవిధా భగవతో యా వృన్దావనచారిణః
వర్ణయన్త్యో మిథో గోప్యః క్రీడాస్తన్మయతాం యయుః

ఇలా పరమాత్మ యొక్క రకరకాల లీలలను గానం చేస్తూ ఇళ్ళలో ఉన్న గోపికలు కూడా తన్మయ్త్వాన్ని పొందారు. నిరంతరం కృష్ణ పరమాత్మ ధ్యానము చేత వారు కూడా కృష్ణులే అయ్యారు.


                                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 

Tuesday, June 25, 2013

శ్రీమద్భాగవతం దశం స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

                                                                 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశం స్కంధం ఇరవయ్యవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తయోస్తదద్భుతం కర్మ దావాగ్నేర్మోక్షమాత్మనః
గోపాః స్త్రీభ్యః సమాచఖ్యుః ప్రలమ్బవధమేవ చ

ఇంటికి వచ్చిన పిల్లలు ప్రలంబవధా కృష్ణుడు గోవులను కాపాడడం చెప్పగా గోపవృద్ధులు బలరామ కృష్ణులు సామాన్య మానవులు కారని అనుకున్నారు

గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః
మేనిరే దేవప్రవరౌ కృష్ణరామౌ వ్రజం గతౌ

తతః ప్రావర్తత ప్రావృట్సర్వసత్త్వసముద్భవా
విద్యోతమానపరిధిర్విస్ఫూర్జితనభస్తలా

ఇలా ఉండగా అన్ని ప్రాణులా వృక్షములా పుట్టుకకు కారణమైన వర్ష ఋతువు వచ్చింది. వెలుతురు ఉండీ లేనట్లుగా ఉంది. ఆకాశమంతా గర్ఝిస్తూ చుట్టుపక్కల మెరుస్తూ నల్లని మేఘాలతో ఉంది.

సాన్ద్రనీలామ్బుదైర్వ్యోమ సవిద్యుత్స్తనయిత్నుభిః
అస్పష్టజ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం బభౌ

మెరుపులు మెరిసినపుడు కనపడుతున్నట్లూ, మెరుపులు పోగానే మసక చీకటీ ఉంది. సమాధిలో ఉన్నవాడికి ఎలా ఐతే సగుణ బ్రహ్మ కనపడీకనపడనట్లు ఎలా ఉంటుందో అలా ఉంది మెరుపుల వెలుతురులో

అష్టౌ మాసాన్నిపీతం యద్భూమ్యాశ్చోదమయం వసు
స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే

తొమ్మిది నెలలు గర్భం మోసిన గర్భవతి (కాల ఆగతే  - సమయం వచ్చిన తరువాత) ఎలా ఐతే శిశువుని ప్రసవిస్తుందో సూర్యభగవానుడు తనలో దాచుకున్న నీటిని విడిచిపెట్టాడు

తడిద్వన్తో మహామేఘాశ్చణ్డ శ్వసన వేపితాః
ప్రీణనం జీవనం హ్యస్య ముముచుః కరుణా ఇవ

మెరుపుతో ఉన్న మేఘాలన్నీ గొప్ప వాయువుతో కదిలించబడి సకల ప్రాణులకూ బతుకు ఇచ్చే జలాన్ని కరుణతో విడిచిపెట్టాయి

తపఃకృశా దేవమీఢా ఆసీద్వర్షీయసీ మహీ
యథైవ కామ్యతపసస్తనుః సమ్ప్రాప్య తత్ఫలమ్

ఎండాకాలం వేడితో కృశించిన భూమి వర్షం పడగానే సంతోషముతో ఉబ్బిపోయింది.
తపస్సు చేసిన వారు బక్క చిక్కి, ఫలం పొందగానే పుష్టి పొందినట్లుగా ఉంది.

నిశాముఖేషు ఖద్యోతాస్తమసా భాన్తి న గ్రహాః
యథా పాపేన పాషణ్డా న హి వేదాః కలౌ యుగే

రాత్రి పూట మిణుగురు పురుగులు (ఖద్యోతా) మెరుస్తూ ఉన్నాయి. నక్షత్రములూ గ్రహములూ కనపడడం లేదు. కలియుగములో ఎలా ఐతే పాపాత్ముల వాక్కులు వినబడి వేదములు వినబడనట్లు

శ్రుత్వా పర్జన్యనినదం మణ్డుకాః ససృజుర్గిరః
తూష్ణీం శయానాః ప్రాగ్యద్వద్బ్రాహ్మణా నియమాత్యయే

వర్షా కాలములో మేఘములు గర్ఝిస్తుంటే మేఘ గర్ఝనలు విని కింద ఉన్న కప్పలు అరుస్తున్నాయి. అప్పటిదాకా మౌనముగా ఉన్న కప్పలు వర్షాకాలములో అరుస్తున్నాయి. నియమం ఆచరించిన వారు వ్రతములో ఉన్నంతకాలం మౌనం వహించి వ్రతం అవ్వగానే ఎలా మాట్లాడతారో అలా ఉంది.

ఆసన్నుత్పథగామిన్యః క్షుద్రనద్యోऽనుశుష్యతీః
పుంసో యథాస్వతన్త్రస్య దేహద్రవిణ సమ్పదః

వర్షాలు బాగా పడి వరదలు వచ్చి, చిన్న చిన్న నదులు అడ్డదారిలో పోతున్నాయి. బుద్ధి స్థిరముగా లేని వారికి వచ్చిన సంపదలలాగ. నియమం లేని మనోనిగ్రహం లేని మానవుని యొక్క శరీరం యొక్క ప్రవృత్తీ, ధనమూ, ఇతర సంపదలూ ఎలా అడ్డదారి తొక్కు తాయో అలా అడ్డదారిలో ప్రవహిస్తున్నాయి.

హరితా హరిభిః శష్పైరిన్ద్రగోపైశ్చ లోహితా
ఉచ్ఛిలీన్ధ్రకృతచ్ఛాయా నృణాం శ్రీరివ భూరభూత్

వర్షం పడి పచ్చగా మొత్తం గడ్డితో ఇంద్రనీలమణుల ఆకారములో గడ్డి బాగా పెరిగి పుట్టగొడుగులు (ఉచ్ఛిలీన్ధ్ర) అంతటా వ్యాపించాయి. పుట్టగొడుగుల కింద నీడ ఉంది. అది చూసి మురుస్తున్నారు. కొద్దిగా డబ్బు రాగానే నాకెంతో డబ్బు ఉంది అని ఎలా మురుస్తాడో పుట్ట గొడుగుల నీడ ఉంది. ధనవంతుల ధన మదాన్ని పుట్టగొడుగుల నీడతో పోల్చడమైనది.రెండూ అశాశ్వతాలే.

క్షేత్రాణి శష్యసమ్పద్భిః కర్షకాణాం ముదం దదుః
మానినామనుతాపం వై దైవాధీనమజానతామ్

చక్కగా పైరు పెరిగాయి. అవి రైతులకు సంతోషాన్ని కలిగించాయి. ధనవంతులకు ఇబ్బంది కలిగించాయి. రైతులకు పంటలు కలిగితే ధనవంతుల వద్దకు అప్పుకు రారు కాబట్టి.

జలస్థలౌకసః సర్వే నవవారినిషేవయా
అబిభ్రన్రుచిరం రూపం యథా హరినిషేవయా

నీరు ఉన్న చోటు, నీరు లేని చోటు రెండూ కూడా కొత్త రూపాన్న్ పొందాయి వర్షం పడడం వలన, పరమాత్మను సేవించిన వారి మనసు ఎంత నిత్య ఉత్సాహముతో ఉంటుందో భూమీ నీరు అలా కొత్త రూపముతో ఉంది

సరిద్భిః సఙ్గతః సిన్ధుశ్చుక్షోభ శ్వసనోర్మిమాన్
అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా

వరదలు బాగా వచ్చి నదులు పొంగి సముద్రములో కలిసాయి. సముద్రం పొంగింది. నదుల జలమంతా మహావేగముతో వచ్చి సముద్రములో పడితే సముద్రం ఉప్పొంగితే, కెరటాలతో ఎగిసిపడుతోంది. ఎలా అంటే పక్వం కాని యోగి మనసు కోరికలతో నిండిపోయి ఉప్పొంగుతున్నట్లు. అదే యోగం పరిపక్వమైతే మనసు ప్రశాంతముగా ఉంటుంది. .

గిరయో వర్షధారాభిర్హన్యమానా న వివ్యథుః
అభిభూయమానా వ్యసనైర్యథాధోక్షజచేతసః

పర్వతముల మీద వర్ష ధారలు కప్పేసాయి. భగవంతుని మీద మనసు ఉంచిన భక్తులకు ఆపదలు ముట్టినట్లు.

మార్గా బభూవుః సన్దిగ్ధాస్తృణైశ్ఛన్నా హ్యసంస్కృతాః
నాభ్యస్యమానాః శ్రుతయో ద్విజైః కాలేన చాహతాః

దారులు కూడా వర్షం పడి, గడ్డి మొలచి తెలియకుండా అయ్యాయి. వేదం చదువుకున్న మహాత్ములు కొన్ని రోజులు వేదాన్ని అధ్యయనం చేయడం మానేస్తే ఏ మంత్రం ఏమిటో తెలియనట్లు దారులు కూడా తెలియబడకుండా అయ్యాయి. అభ్యసించబడని వేదములు కాలక్రమములో ఎలా మరుగుపడతాయో

లోకబన్ధుషు మేఘేషు విద్యుతశ్చలసౌహృదాః
స్థైర్యం న చక్రుః కామిన్యః పురుషేషు గుణిష్వివ

ఇంత మందికి ఆనందాన్ని పంచడమే స్వభావముగా కల మేఘముల విషయములో మెరుపులు చంచలమైన ప్రీతినే కలిగి ఉంటున్నాయి. గుణవంతులైన పురుషుల యందు వేశ్యలు ప్రీతి ఉంచనట్లుగా.
లోకబంధువులైన మేఘముల యందు మెరుపులు కూడా ఎక్కువ స్నేహాన్ని చూపలేదు

ధనుర్వియతి మాహేన్ద్రం నిర్గుణం చ గుణిన్యభాత్
వ్యక్తే గుణవ్యతికరేऽగుణవాన్పురుషో యథా

ఆకాశములో ఇంద్రధనస్సు వచ్చింది.అది ఆకాశములో వ్యాపిస్తే ఎలాంటి గుణములూ లేని ఆకాశములో గుణము ఉన్నట్లు కనపడుతోంది. సృష్టి కార్యక్రమములో (గుణ వ్యతికరే) ఎలా ఐతే ఏ గుణములూ లేని పరమాత్మ అన్ని గుణములూ ఉన్నట్లు ఎలా కనపడతాడో

న రరాజోడుపశ్ఛన్నః స్వజ్యోత్స్నారాజితైర్ఘనైః
అహంమత్యా భాసితయా స్వభాసా పురుషో యథా

చంద్రుడు కూడా తన వెన్నెలతో ప్రకాశించలేదు మబ్బులు కమ్మడం వలన. అహంకారం కమ్మినవాడికి ఆత్మ స్వరూపం కనపడనట్లుగా.

మేఘాగమోత్సవా హృష్టాః ప్రత్యనన్దఞ్ఛిఖణ్డినః
గృహేషు తప్తనిర్విణ్ణా యథాచ్యుతజనాగమే

నెమళ్ళు మేఘాలు రాగానే ఆనందముతో తాండవం చేసాయి. పరమాత్మను సేవిస్తూ పరమాత్మ యందు భక్తి కలిగి ఉన్న భక్తులకు, అలాంటి భక్తులు వస్తే ఎలాంటి సంతోషం కలుగుతుందో అలాంటి సంతోషం కలిగింది

పీత్వాపః పాదపాః పద్భిరాసన్నానాత్మమూర్తయః
ప్రాక్క్షామాస్తపసా శ్రాన్తా యథా కామానుసేవయా

వేసవి కాలములో ఎండిపోయి ఆకులు రాలిపోయి ఉన్న వృక్షాలు వర్షం రాగానే బాగా పుష్టిగా అయ్యాయి. కొంతకాలం తపస్సు చేసి ఎండిపోయిన వారు ఆ వ్రతం తపస్సు కాగానే మళ్ళీ అన్నీ తిని ఎలా బలుస్తారో అలా

సరఃస్వశాన్తరోధఃసు న్యూషురఙ్గాపి సారసాః
గృహేష్వశాన్తకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః

బాగా నీరు ప్రవహిస్తూ ఉంటే సారసములు (హంసల లాంటి పక్షులు) అందులో ఉంటున్నాయీ వెళుతున్నాయి ( పూర్తిగా ఉంటే కొట్టుకొపోతాయి కాబట్టి)
తమో గుణముతో భయంకరమైన వారి ఇళ్ళలో గృహస్థులు ఎలా ఐతే ఉండలేక వెళ్ళలేక ఉంటారో అలా

జలౌఘైర్నిరభిద్యన్త సేతవో వర్షతీశ్వరే
పాషణ్డినామసద్వాదైర్వేదమార్గాః కలౌ యథా

జల ప్రవాహముతో కట్టిన సేతువులు తెగిపోతున్నాయి. కలియుగములో నాస్తికుల నాస్తిక వాదముతో వేద మార్గములు చిన్నాభిన్నమవుతున్నట్లుగా

వ్యముఞ్చన్వాయుభిర్నున్నా భూతేభ్యశ్చామృతం ఘనాః
యథాశిషో విశ్పతయః కాలే కాలే ద్విజేరితాః

వర్షాకాలములో మేఘములు కదిలిస్తే మబ్బులు చక్కని అమృతములాంటి జలాన్ని విడిచిపెడుతున్నాయి. బ్రాహ్మణుల ఆశీర్వాదములు గృహస్థులకు సంపదలు ఇచ్చినట్లుగా

ఏవం వనం తద్వర్షిష్ఠం పక్వఖర్జురజమ్బుమత్
గోగోపాలైర్వృతో రన్తుం సబలః ప్రావిశద్ధరిః

వర్ష ఋతువు సమృద్ధముగా వర్షించి ఇలా నిత్య శోభతో ఉన్న వనములో వర్షాలు కొంత తగ్గగానే కృష్ణ బలరాములతో కలసి గోపాలురు చేరుకున్నారు

ధేనవో మన్దగామిన్య ఊధోభారేణ భూయసా
యయుర్భగవతాహూతా ద్రుతం ప్రీత్యా స్నుతస్తనాః

మేత మేసి బలిసి ఉన్న ఆవులూ, బలిసి ఉన్న వాటి పొదుగులూ పరమాత్మ పిలిస్తే పరిగెత్తుకు వస్తున్నాయి. అడవిలో వారు  కూడా ఎవరికి కావలసిన తేనెలూ పుష్పాలూ మొదలైన సంపద లభిస్తున్నందు వలన ఆనందముగా ఉన్నారు

వనౌకసః ప్రముదితా వనరాజీర్మధుచ్యుతః
జలధారా గిరేర్నాదాదాసన్నా దదృశే గుహాః

పర్వతముల నుండి ప్రవహిస్తున్న నీటి ధారలతో గుహలు వాయువు నిండిన ధ్వనితో ప్రతిధ్వనిస్తున్నాయి

క్వచిద్వనస్పతిక్రోడే గుహాయాం చాభివర్షతి
నిర్విశ్య భగవాన్రేమే కన్దమూలఫలాశనః

కంద మూలములూ ఫలములనూ ఆహారముగా చేసుకుని పరమాత్మ ఆనందిస్తున్నాడు.

దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాన్తికే
సమ్భోజనీయైర్బుభుజే గోపైః సఙ్కర్షణాన్వితః

పెరుగున్నాన్ని తీసుకుని అందరూ కలసి కూర్చుని తిన్నాడు. కలసి కూర్చుని భోజనం చేయదగిన వారితో కలసి తిన్నాడు

శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితేక్షణాన్
తృప్తాన్వృషాన్వత్సతరాన్గాశ్చ స్వోధోభరశ్రమాః

ఆవులనూ వృషభములనూ పచ్చిక బయల్లనూ దూడలనూ, అవి అన్నీ వర్షాకాలం తెచ్చిన సంపదతో తృప్తిగా ఉన్నాయి.

ప్రావృట్శ్రియం చ తాం వీక్ష్య సర్వకాలసుఖావహామ్
భగవాన్పూజయాం చక్రే ఆత్మశక్త్యుపబృంహితామ్

ఋతువు మారగానే ఋతు పూజ చేస్తారు. వర్ష ఋతువు యొక్క సంపద చూసి కృష్ణుడు తన వారందరితో కలసి ఆ (తన శక్తితో పెంపొందిన వర్షాకాల లక్ష్మిని)  వనన్ని పూజించాడు

ఏవం నివసతోస్తస్మిన్రామకేశవయోర్వ్రజే
శరత్సమభవద్వ్యభ్రా స్వచ్ఛామ్బ్వపరుషానిలా

వర్ష ఋతువు అయి శరదృతువు అయ్యింది. శరత్కాలములో నీరజములు (పద్మములు) వికసించడము వలన జలములన్నీ కొత్త శోభను పొందాయి. సంసార వ్యామోహముతో యోగము మధ్యన ఉన్నవారి మనసు కలత చెంది మళ్ళీ యోగం అభ్యసించడం వలన ప్రసన్నమైనట్లుగా

శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః
భ్రష్టానామివ చేతాంసి పునర్యోగనిషేవయా

వ్యోమ్నోऽబ్భ్రం భూతశాబల్యం భువః పఙ్కమపాం మలమ్
శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథాశుభమ్

ఆకాశములో మబ్బుల మురికినీ భూమిలో నీటితో వచ్చిన బురద మురికినీ శర్దృతువు పోగొట్టింది.
బ్రహ్మచర్యాది ఆశ్రమాలలో ఉన్న వారిలో ఉన్న కల్మశాన్ని పరమాత్మ మీద భక్తి పోగొట్టినట్లుగా

సర్వస్వం జలదా హిత్వా విరేజుః శుభ్రవర్చసః
యథా త్యక్తైషణాః శాన్తా మునయో ముక్తకిల్బిషాః

నాలుగు నెలలు నిండి నిండి ఉన్న నీటిని విడిచిపెట్టిన మబ్బులు ప్రశాంతముగా ఉన్నాయి. దాచుకున్నవన్నీ ఇచ్చి ప్రశాంతతను పొందాయి. అన్ని కోరికలనూ విడిచిపెట్టిన ఋషులు ఎలా ప్రశాంతముగా ఉంటారో
పాపాలన్ని తొలగినట్లుగా ఆకాశం ప్రకాశిస్తోంది

గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచుః శివమ్
యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే న వా

వానలూ వరదలూ తగ్గిపోయాయి కాబట్టి, పర్వతాలు నీటిని ఒకసారి విడిచిపెడుతున్నాయి ఒక సారి విడిచిపెట్టట్లేదు. జ్ఞ్యానులు తమ జ్ఞ్యానామృతాన్ని వినే వారి ప్రవృత్తి బట్టి ఒక సారి చెబుతారు ఒక సారి చెప్పరు. అలా పర్వతములు జలాన్ని విడిచీ విడువనట్లు ఉన్నాయి

నైవావిదన్క్షీయమాణం జలం గాధజలేచరాః
యథాయురన్వహం క్షయ్యం నరా మూఢాః కుటుమ్బినః

నీరు జలాశయాల్లో బాగా నిండి ఉన్నాయి. జల చరాలు బాగా వచ్చి చేరాయి. అందులో బతుకున్న జల చరములు తాము ఏ నీటిలో ఉన్నామో ఆ నీరు రోజు రోజుకూ తరిగిపోతోంది అని తెలియలేరు. మూఢులైన కుటుంబీకులు ప్రతీ రోజూ ఆయువు తరిగిపోతోందని తెలియనట్లుగా

గాధవారిచరాస్తాపమవిన్దఞ్ఛరదర్కజమ్
యథా దరిద్రః కృపణః కుటుమ్బ్యవిజితేన్ద్రియః

నీరు తగ్గుతున్న కొద్దీ లోతు తెలుస్తుంది. నీరు తగ్గుతున్న కొద్దీ నీటి అడుగున ఉన్న జల చరములకు సూర్య కిరణముల వేడి తగులుతూ ఉంటుంది. ఎలా అంటే పెద్ద కుటుంబములో ఉన్నవాడు తాను సంపాదించిన ధనం ఐపోతే అందులోని బాధ తెలిసినట్లుగా. డబ్బు బాగా ఉన్నప్పుడు భోగాలు అనుభవించిన వ్యక్తి డబ్బు ఐపోగానే బాధ తెలిసినట్లుగా.

శనైః శనైర్జహుః పఙ్కం స్థలాన్యామం చ వీరుధః
యథాహంమమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు

క్రమ క్రమముగా వర్షాకాలం పోయి శరత్కాలం వచ్చింది కాబట్టి బురద అంతా తగ్గిపోయింది. మొలకలూ పోయాయీ, బురదలూ పోయాయి. ఇంద్రియ నిగ్రహం కల ధీరులు శరీరా భార్యా గృహముల యందు అహంకార మమకారాలు విడిచిపెట్టినట్లుగా బురదను విడిచిపెడుతున్నాయీ

నిశ్చలామ్బురభూత్తూష్ణీం సముద్రః శరదాగమే
ఆత్మన్యుపరతే సమ్యఙ్మునిర్వ్యుపరతాగమః

సముద్రం కూడా ఎక్కువ తరంగాలు లేకుండా ఉంది.

కేదారేభ్యస్త్వపోऽగృహ్ణన్కర్షకా దృఢసేతుభిః
యథా ప్రాణైః స్రవజ్జ్ఞానం తన్నిరోధేన యోగినః

రైతులు కూడా చెరువు నీటికి కట్టలు కట్టి వారి పోలానికి కావలసిన నీరు తీసుకుంటున్నారు.ప్రాణం పోతున్నప్పుడు పోతున్న జ్ఞ్యానాన్నీ ప్రాణాన్ని చివరి ప్రయత్నముతో ప్రాణాన్ని నిలుపుకో యత్నిస్తున్నట్లుగా రైతులు నీటిని ఆప ప్రయత్నిస్తున్నారు

శరదర్కాంశుజాంస్తాపాన్భూతానాముడుపోऽహరత్
దేహాభిమానజం బోధో ముకున్దో వ్రజయోషితామ్

శరత్కాలం సూర్యభగవానుని వలన వచ్చే వేడి వలన తాపాన్ని తొలగించింది. కృష్ణ పరమాత్మ వ్రేపల్లెలో ఉండే గోపికలకు దేహాత్మాభిమానాన్ని పోగొట్టినట్లుగా

ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకమ్
సత్త్వయుక్తం యథా చిత్తం శబ్దబ్రహ్మార్థదర్శనమ్

శరదృతువులో ఆకాశం స్వచ్చముగా ఉంది. నక్షత్రాలన్నీ ప్రకాశిస్తున్నాయి. సత్వ గుణముతో ఉన్న మనసు శబ్ద బ్రహ్మాన్నీ చూచినట్లుగా ఉంది.

అఖణ్డమణ్డలో వ్యోమ్ని రరాజోడుగణైః శశీ
యథా యదుపతిః కృష్ణో వృష్ణిచక్రావృతో భువి

ఆకాశములో చంద్రుడు కూడా శరత్కాలములో ప్రకాశిస్తున్నాడు కృష్ణ పరమాత్మ సకల యాదవులతో కలసి యదుకులములో ప్రకాశించినట్లుగా

ఆశ్లిష్య సమశీతోష్ణం ప్రసూనవనమారుతమ్
జనాస్తాపం జహుర్గోప్యో న కృష్ణహృతచేతసః

ఎక్కువ వేడీ ఎక్కువ చలీ లేకుండా సమ శీతోష్ణముతో ఉంది. పూవుల నుండి వచ్చే గాలిని సేవించి జనులందరూ తాపాన్ని విడిచిపెట్టారు. గోపికలు మాత్రం తాపాన్ని వదలిపెట్టలేకపోయారు కృష్ణుని మీద భక్తి వలన

గావో మృగాః ఖగా నార్యః పుష్పిణ్యః శరదాభవన్
అన్వీయమానాః స్వవృషైః ఫలైరీశక్రియా ఇవ

ఆవులూ మృగములూ పక్షులూ స్త్రీలూ అందరూ పుష్పవతులు అయ్యారు. ఆవూలకు పూలు రావడం అంటే దూడలు పుట్టడం. ఇలా తమ తమ వృషములతో కూడిన గోవులూ  ఫలములతో కూడిన పుష్పములూ పరమాత్మ వలన సకల జగత్తు ఎలా ఫలవంతమవుతుందో అలా ఉంది వ్రేపల్లె

ఉదహృష్యన్వారిజాని సూర్యోత్థానే కుముద్వినా
రాజ్ఞా తు నిర్భయా లోకా యథా దస్యూన్వినా నృప

సూర్యుడు ఉదయిస్తే కలువలు తప్ప కమలాలన్నీ వికసించాయి. పద్మాలు వికసించాయి, కలువలు కాదు. మంచి రాజుని చూచి ప్రజలు సంతోషిస్తారు కానీ దొంగలు సంతోషించరు కదా

పురగ్రామేష్వాగ్రయణైరిన్ద్రియైశ్చ మహోత్సవైః
బభౌ భూః పక్వశష్యాఢ్యా కలాభ్యాం నితరాం హరేః

ఇలా నగరములూ పల్లెలూ గ్రామములూ వ్రజములూ పంటలు బాగా పండి పశువులు బాగా పాలిస్తుంటే ఇంద్రోత్సవం చేసారు. పరమాత్మ యొక్క కళతో పండిన పంటలతో భూమి శోభిస్తూ ఉంది.

వణిఙ్మునినృపస్నాతా నిర్గమ్యార్థాన్ప్రపేదిరే
వర్షరుద్ధా యథా సిద్ధాః స్వపిణ్డాన్కాల ఆగతే

వ్య్పారులూ మునులూ రాజులూ శరత్కాలం వచ్చింది కాబట్టి, అంతవరకూ ఎవరి ఇంటిలో వారు ఉన్నవారు బయటకు వచ్చి తమ తమ కార్యక్రమాలు ప్రారంభించారు. సిద్ధులు కూడా వర్షాకాలం వచ్చినపుడు తమ తమ సిద్ధులు ఆపుకుని మళ్ళీ యోగములోకి ఎలా ప్రవేశిస్తారో అలా

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

20

శ్రీశుక ఉవాచ
తయోస్తదద్భుతం కర్మ దావాగ్నేర్మోక్షమాత్మనః
గోపాః స్త్రీభ్యః సమాచఖ్యుః ప్రలమ్బవధమేవ చ

ఇంటికి వచ్చిన పిల్లలు ప్రలంబవధా కృష్ణుడు గోవులను కాపాడడం చెప్పగా గోపవృద్ధులు బలరామ కృష్ణులు సామాన్య మానవులు కారని అనుకున్నారు

గోపవృద్ధాశ్చ గోప్యశ్చ తదుపాకర్ణ్య విస్మితాః
మేనిరే దేవప్రవరౌ కృష్ణరామౌ వ్రజం గతౌ

తతః ప్రావర్తత ప్రావృట్సర్వసత్త్వసముద్భవా
విద్యోతమానపరిధిర్విస్ఫూర్జితనభస్తలా

ఇలా ఉండగా అన్ని ప్రాణులా వృక్షములా పుట్టుకకు కారణమైన వర్ష ఋతువు వచ్చింది. వెలుతురు ఉండీ లేనట్లుగా ఉంది. ఆకాశమంతా గర్ఝిస్తూ చుట్టుపక్కల మెరుస్తూ నల్లని మేఘాలతో ఉంది.

సాన్ద్రనీలామ్బుదైర్వ్యోమ సవిద్యుత్స్తనయిత్నుభిః
అస్పష్టజ్యోతిరాచ్ఛన్నం బ్రహ్మేవ సగుణం బభౌ

మెరుపులు మెరిసినపుడు కనపడుతున్నట్లూ, మెరుపులు పోగానే మసక చీకటీ ఉంది. సమాధిలో ఉన్నవాడికి ఎలా ఐతే సగుణ బ్రహ్మ కనపడీకనపడనట్లు ఎలా ఉంటుందో అలా ఉంది మెరుపుల వెలుతురులో

అష్టౌ మాసాన్నిపీతం యద్భూమ్యాశ్చోదమయం వసు
స్వగోభిర్మోక్తుమారేభే పర్జన్యః కాల ఆగతే

తొమ్మిది నెలలు గర్భం మోసిన గర్భవతి (కాల ఆగతే  - సమయం వచ్చిన తరువాత) ఎలా ఐతే శిశువుని ప్రసవిస్తుందో సూర్యభగవానుడు తనలో దాచుకున్న నీటిని విడిచిపెట్టాడు

తడిద్వన్తో మహామేఘాశ్చణ్డ శ్వసన వేపితాః
ప్రీణనం జీవనం హ్యస్య ముముచుః కరుణా ఇవ

మెరుపుతో ఉన్న మేఘాలన్నీ గొప్ప వాయువుతో కదిలించబడి సకల ప్రాణులకూ బతుకు ఇచ్చే జలాన్ని కరుణతో విడిచిపెట్టాయి

తపఃకృశా దేవమీఢా ఆసీద్వర్షీయసీ మహీ
యథైవ కామ్యతపసస్తనుః సమ్ప్రాప్య తత్ఫలమ్

ఎండాకాలం వేడితో కృశించిన భూమి వర్షం పడగానే సంతోషముతో ఉబ్బిపోయింది.
తపస్సు చేసిన వారు బక్క చిక్కి, ఫలం పొందగానే పుష్టి పొందినట్లుగా ఉంది.

నిశాముఖేషు ఖద్యోతాస్తమసా భాన్తి న గ్రహాః
యథా పాపేన పాషణ్డా న హి వేదాః కలౌ యుగే

రాత్రి పూట మిణుగురు పురుగులు (ఖద్యోతా) మెరుస్తూ ఉన్నాయి. నక్షత్రములూ గ్రహములూ కనపడడం లేదు. కలియుగములో ఎలా ఐతే పాపాత్ముల వాక్కులు వినబడి వేదములు వినబడనట్లు

శ్రుత్వా పర్జన్యనినదం మణ్డుకాః ససృజుర్గిరః
తూష్ణీం శయానాః ప్రాగ్యద్వద్బ్రాహ్మణా నియమాత్యయే

వర్షా కాలములో మేఘములు గర్ఝిస్తుంటే మేఘ గర్ఝనలు విని కింద ఉన్న కప్పలు అరుస్తున్నాయి. అప్పటిదాకా మౌనముగా ఉన్న కప్పలు వర్షాకాలములో అరుస్తున్నాయి. నియమం ఆచరించిన వారు వ్రతములో ఉన్నంతకాలం మౌనం వహించి వ్రతం అవ్వగానే ఎలా మాట్లాడతారో అలా ఉంది.

ఆసన్నుత్పథగామిన్యః క్షుద్రనద్యోऽనుశుష్యతీః
పుంసో యథాస్వతన్త్రస్య దేహద్రవిణ సమ్పదః

వర్షాలు బాగా పడి వరదలు వచ్చి, చిన్న చిన్న నదులు అడ్డదారిలో పోతున్నాయి. బుద్ధి స్థిరముగా లేని వారికి వచ్చిన సంపదలలాగ. నియమం లేని మనోనిగ్రహం లేని మానవుని యొక్క శరీరం యొక్క ప్రవృత్తీ, ధనమూ, ఇతర సంపదలూ ఎలా అడ్డదారి తొక్కు తాయో అలా అడ్డదారిలో ప్రవహిస్తున్నాయి.

హరితా హరిభిః శష్పైరిన్ద్రగోపైశ్చ లోహితా
ఉచ్ఛిలీన్ధ్రకృతచ్ఛాయా నృణాం శ్రీరివ భూరభూత్

వర్షం పడి పచ్చగా మొత్తం గడ్డితో ఇంద్రనీలమణుల ఆకారములో గడ్డి బాగా పెరిగి పుట్టగొడుగులు (ఉచ్ఛిలీన్ధ్ర) అంతటా వ్యాపించాయి. పుట్టగొడుగుల కింద నీడ ఉంది. అది చూసి మురుస్తున్నారు. కొద్దిగా డబ్బు రాగానే నాకెంతో డబ్బు ఉంది అని ఎలా మురుస్తాడో పుట్ట గొడుగుల నీడ ఉంది. ధనవంతుల ధన మదాన్ని పుట్టగొడుగుల నీడతో పోల్చడమైనది.రెండూ అశాశ్వతాలే.

క్షేత్రాణి శష్యసమ్పద్భిః కర్షకాణాం ముదం దదుః
మానినామనుతాపం వై దైవాధీనమజానతామ్

చక్కగా పైరు పెరిగాయి. అవి రైతులకు సంతోషాన్ని కలిగించాయి. ధనవంతులకు ఇబ్బంది కలిగించాయి. రైతులకు పంటలు కలిగితే ధనవంతుల వద్దకు అప్పుకు రారు కాబట్టి.

జలస్థలౌకసః సర్వే నవవారినిషేవయా
అబిభ్రన్రుచిరం రూపం యథా హరినిషేవయా

నీరు ఉన్న చోటు, నీరు లేని చోటు రెండూ కూడా కొత్త రూపాన్న్ పొందాయి వర్షం పడడం వలన, పరమాత్మను సేవించిన వారి మనసు ఎంత నిత్య ఉత్సాహముతో ఉంటుందో భూమీ నీరు అలా కొత్త రూపముతో ఉంది

సరిద్భిః సఙ్గతః సిన్ధుశ్చుక్షోభ శ్వసనోర్మిమాన్
అపక్వయోగినశ్చిత్తం కామాక్తం గుణయుగ్యథా

వరదలు బాగా వచ్చి నదులు పొంగి సముద్రములో కలిసాయి. సముద్రం పొంగింది. నదుల జలమంతా మహావేగముతో వచ్చి సముద్రములో పడితే సముద్రం ఉప్పొంగితే, కెరటాలతో ఎగిసిపడుతోంది. ఎలా అంటే పక్వం కాని యోగి మనసు కోరికలతో ఉప్పొంగుతున్నట్లు

గిరయో వర్షధారాభిర్హన్యమానా న వివ్యథుః
అభిభూయమానా వ్యసనైర్యథాధోక్షజచేతసః



మార్గా బభూవుః సన్దిగ్ధాస్తృణైశ్ఛన్నా హ్యసంస్కృతాః
నాభ్యస్యమానాః శ్రుతయో ద్విజైః కాలేన చాహతాః

లోకబన్ధుషు మేఘేషు విద్యుతశ్చలసౌహృదాః
స్థైర్యం న చక్రుః కామిన్యః పురుషేషు గుణిష్వివ

ధనుర్వియతి మాహేన్ద్రం నిర్గుణం చ గుణిన్యభాత్
వ్యక్తే గుణవ్యతికరేऽగుణవాన్పురుషో యథా

న రరాజోడుపశ్ఛన్నః స్వజ్యోత్స్నారాజితైర్ఘనైః
అహంమత్యా భాసితయా స్వభాసా పురుషో యథా

మేఘాగమోత్సవా హృష్టాః ప్రత్యనన్దఞ్ఛిఖణ్డినః
గృహేషు తప్తనిర్విణ్ణా యథాచ్యుతజనాగమే

పీత్వాపః పాదపాః పద్భిరాసన్నానాత్మమూర్తయః
ప్రాక్క్షామాస్తపసా శ్రాన్తా యథా కామానుసేవయా

సరఃస్వశాన్తరోధఃసు న్యూషురఙ్గాపి సారసాః
గృహేష్వశాన్తకృత్యేషు గ్రామ్యా ఇవ దురాశయాః

జలౌఘైర్నిరభిద్యన్త సేతవో వర్షతీశ్వరే
పాషణ్డినామసద్వాదైర్వేదమార్గాః కలౌ యథా

వ్యముఞ్చన్వాయుభిర్నున్నా భూతేభ్యశ్చామృతం ఘనాః
యథాశిషో విశ్పతయః కాలే కాలే ద్విజేరితాః

ఏవం వనం తద్వర్షిష్ఠం పక్వఖర్జురజమ్బుమత్
గోగోపాలైర్వృతో రన్తుం సబలః ప్రావిశద్ధరిః

ధేనవో మన్దగామిన్య ఊధోభారేణ భూయసా
యయుర్భగవతాహూతా ద్రుతం ప్రీత్యా స్నుతస్తనాః

వనౌకసః ప్రముదితా వనరాజీర్మధుచ్యుతః
జలధారా గిరేర్నాదాదాసన్నా దదృశే గుహాః

క్వచిద్వనస్పతిక్రోడే గుహాయాం చాభివర్షతి
నిర్విశ్య భగవాన్రేమే కన్దమూలఫలాశనః

దధ్యోదనం సమానీతం శిలాయాం సలిలాన్తికే
సమ్భోజనీయైర్బుభుజే గోపైః సఙ్కర్షణాన్వితః

శాద్వలోపరి సంవిశ్య చర్వతో మీలితేక్షణాన్
తృప్తాన్వృషాన్వత్సతరాన్గాశ్చ స్వోధోభరశ్రమాః

ప్రావృట్శ్రియం చ తాం వీక్ష్య సర్వకాలసుఖావహామ్
భగవాన్పూజయాం చక్రే ఆత్మశక్త్యుపబృంహితామ్

ఏవం నివసతోస్తస్మిన్రామకేశవయోర్వ్రజే
శరత్సమభవద్వ్యభ్రా స్వచ్ఛామ్బ్వపరుషానిలా

శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతిం యయుః
భ్రష్టానామివ చేతాంసి పునర్యోగనిషేవయా

వ్యోమ్నోऽబ్భ్రం భూతశాబల్యం భువః పఙ్కమపాం మలమ్
శరజ్జహారాశ్రమిణాం కృష్ణే భక్తిర్యథాశుభమ్

సర్వస్వం జలదా హిత్వా విరేజుః శుభ్రవర్చసః
యథా త్యక్తైషణాః శాన్తా మునయో ముక్తకిల్బిషాః

గిరయో ముముచుస్తోయం క్వచిన్న ముముచుః శివమ్
యథా జ్ఞానామృతం కాలే జ్ఞానినో దదతే న వా

నైవావిదన్క్షీయమాణం జలం గాధజలేచరాః
యథాయురన్వహం క్షయ్యం నరా మూఢాః కుటుమ్బినః

గాధవారిచరాస్తాపమవిన్దఞ్ఛరదర్కజమ్
యథా దరిద్రః కృపణః కుటుమ్బ్యవిజితేన్ద్రియః

శనైః శనైర్జహుః పఙ్కం స్థలాన్యామం చ వీరుధః
యథాహంమమతాం ధీరాః శరీరాదిష్వనాత్మసు

నిశ్చలామ్బురభూత్తూష్ణీం సముద్రః శరదాగమే
ఆత్మన్యుపరతే సమ్యఙ్మునిర్వ్యుపరతాగమః

కేదారేభ్యస్త్వపోऽగృహ్ణన్కర్షకా దృఢసేతుభిః
యథా ప్రాణైః స్రవజ్జ్ఞానం తన్నిరోధేన యోగినః

శరదర్కాంశుజాంస్తాపాన్భూతానాముడుపోऽహరత్
దేహాభిమానజం బోధో ముకున్దో వ్రజయోషితామ్

ఖమశోభత నిర్మేఘం శరద్విమలతారకమ్
సత్త్వయుక్తం యథా చిత్తం శబ్దబ్రహ్మార్థదర్శనమ్

అఖణ్డమణ్డలో వ్యోమ్ని రరాజోడుగణైః శశీ
యథా యదుపతిః కృష్ణో వృష్ణిచక్రావృతో భువి

ఆశ్లిష్య సమశీతోష్ణం ప్రసూనవనమారుతమ్
జనాస్తాపం జహుర్గోప్యో న కృష్ణహృతచేతసః

గావో మృగాః ఖగా నార్యః పుష్పిణ్యః శరదాభవన్
అన్వీయమానాః స్వవృషైః ఫలైరీశక్రియా ఇవ

ఉదహృష్యన్వారిజాని సూర్యోత్థానే కుముద్వినా
రాజ్ఞా తు నిర్భయా లోకా యథా దస్యూన్వినా నృప

పురగ్రామేష్వాగ్రయణైరిన్ద్రియైశ్చ మహోత్సవైః
బభౌ భూః పక్వశష్యాఢ్యా కలాభ్యాం నితరాం హరేః

వణిఙ్మునినృపస్నాతా నిర్గమ్యార్థాన్ప్రపేదిరే
వర్షరుద్ధా యథా సిద్ధాః స్వపిణ్డాన్కాల ఆగతే

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

                                              ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం దశమ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
క్రీడాసక్తేషు గోపేషు తద్గావో దూరచారిణీః
స్వైరం చరన్త్యో వివిశుస్తృణలోభేన గహ్వరమ్

కాళీయ హ్రద తీరములో దావాగ్ని కొద్దిగానే వచ్చింది. ఈ సారి పగటిపూటే వచ్చింది. వారందరూ చూడకుండా ఉండడానికి మీరందరూ కళ్ళు మూసుకోండి కాపాడబడతారు అన్నాడు.
అందరూ హాయిగా విహరిస్తూ ఉన్నారు. ఆవులూ దూడలూ ఒక వనం నుంచి ఇంకో వనానికి హాయిగా వెళ్ళాయి

అజా గావో మహిష్యశ్చ నిర్విశన్త్యో వనాద్వనమ్
ఈషీకాటవీం నిర్వివిశుః క్రన్దన్త్యో దావతర్షితాః

తేऽపశ్యన్తః పశూన్గోపాః కృష్ణరామాదయస్తదా
జాతానుతాపా న విదుర్విచిన్వన్తో గవాం గతిమ్

తృణైస్తత్ఖురదచ్ఛిన్నైర్గోష్పదైరఙ్కితైర్గవామ్
మార్గమన్వగమన్సర్వే నష్టాజీవ్యా విచేతసః

అలా చాలా దూరం వెళ్ళాయి. కనపడడం లేదు ఎక్కడికి వెళ్ళాయో. బాగా గడ్డి ఏపుగా పెరగడముతో అడుగుజాడలు కూడా లేవు . వాటిని ఎలా వెతకాలో పరితాపం పొందుతూ ప్రాణాలు పోయిన వారిలాగ వాటిని వెతుక్కుంటూ

ముఞ్జాటవ్యాం భ్రష్టమార్గం క్రన్దమానం స్వగోధనమ్
సమ్ప్రాప్య తృషితాః శ్రాన్తాస్తతస్తే సన్న్యవర్తయన్

ఆవులు కూడా దారి తప్పి అంబారావం చేస్తున్నాయి. ఆ అరుపులు వినవస్తున్నాయి గానీ అవి ఎక్కడ ఉన్నాయో కనపడడం లేదు. ఇక మా వల్ల కాదు అని వెతకలేక వెనక్కు వచ్చి కృష్ణునితో చెప్పారు

తా ఆహూతా భగవతా మేఘగమ్భీరయా గిరా
స్వనామ్నాం నినదం శ్రుత్వా ప్రతినేదుః ప్రహర్షితాః

అపుడు మేఘ గంభీర నాదముతో ఒక్కో ఆవు పేరునూ గట్టిగా పిలిస్తూ ఉంటే అవి కూడా అంబారావములో వాటి పేరు పలుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చాయి

తతః సమన్తాద్దవధూమకేతుర్యదృచ్ఛయాభూత్క్షయకృద్వనౌకసామ్
సమీరితః సారథినోల్బణోల్ముకైర్విలేలిహానః స్థిరజఙ్గమాన్మహాన్

హమ్మయ్య ఆవులు వచ్చేసాయి మనం వెళ్ళవచ్చు అనుకుంటూ ఉంటే, వాటితోబాటే దావాగ్ని కూడా వచ్చింది. గాలి చేత ప్రోత్సహించబడి మహా వృక్షాలను కాలుస్తూ మహావేగముగా వస్తోంది. అందరూ భయపడి మృత్యు భయం ఆవరించిన మానవులు పరమాత్మను ఎలా పిలుస్తారో అలా కృష్ణున్ని ఆశ్రయించి కాపాడమని అన్నారు. మేము నీ బంధువులము. నీ బంధువులకు ఆపద రావచ్చా?

తమాపతన్తం పరితో దవాగ్నిం గోపాశ్చ గావః ప్రసమీక్ష్య భీతాః
ఊచుశ్చ కృష్ణం సబలం ప్రపన్నా యథా హరిం మృత్యుభయార్దితా జనాః

కృష్ణ కృష్ణ మహావీర హే రామామోఘ విక్రమ
దావాగ్నినా దహ్యమానాన్ప్రపన్నాంస్త్రాతుమర్హథః

నూనం త్వద్బాన్ధవాః కృష్ణ న చార్హన్త్యవసాదితుమ్
వయం హి సర్వధర్మజ్ఞ త్వన్నాథాస్త్వత్పరాయణాః

మేమంతా నిన్నే దిక్కుగా భావించాము. నీవే మాకు శరణం.

శ్రీశుక ఉవాచ
వచో నిశమ్య కృపణం బన్ధూనాం భగవాన్హరిః
నిమీలయత మా భైష్ట లోచనానీత్యభాషత

ఏమీ భయపడకండి అందరూ మీ కన్నులు ఒకసారి మూసుకోండి అన్నాడు.

తథేతి మీలితాక్షేషు భగవానగ్నిముల్బణమ్
పీత్వా ముఖేన తాన్కృచ్ఛ్రాద్యోగాధీశో వ్యమోచయత్

పరమాత్మ చెప్పగానే కళ్ళు గట్టిగా మూసుకున్నారు అందరూ.మళ్ళీ అగ్నిని పానం చేసి వారిని అవతలకు దాటించాడు. అందరూ కళ్ళు తెరిచి చూసి ఇళ్ళకు చేరారు

తతశ్చ తేऽక్షీణ్యున్మీల్య పునర్భాణ్డీరమాపితాః
నిశమ్య విస్మితా ఆసన్నాత్మానం గాశ్చ మోచితాః

మాకూ ఆవులకూ కూడా ఆపద తప్పిందని చూచి, పరమాత్మ యొక్క యోగ మాయా ప్రభావాన్ని గుర్తించారు

కృష్ణస్య యోగవీర్యం తద్యోగమాయానుభావితమ్
దావాగ్నేరాత్మనః క్షేమం వీక్ష్య తే మేనిరేऽమరమ్

గాః సన్నివర్త్య సాయాహ్నే సహరామో జనార్దనః
వేణుం విరణయన్గోష్ఠమగాద్గోపైరభిష్టుతః

ఇంత పెద్ద దావాని నుండి మమ్ములను సురక్షితముగా ఉంచాడంటే ఈయన మామూలు మహాత్ముడు కాడు అని ఆవులను  తీస్కుకుని ఇళ్ళకు వెళ్ళారు

గోపీనాం పరమానన్ద ఆసీద్గోవిన్దదర్శనే
క్షణం యుగశతమివ యాసాం యేన వినాభవత్

కృష్ణ పరమాత్మ వచ్చాడన్న విషయం తెలుసుకున్న గోపికలు పరమానందాన్ని పొందారు. 


                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం


                                                  ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ కృష్ణః పరివృతో జ్ఞాతిభిర్ముదితాత్మభిః
అనుగీయమానో న్యవిశద్వ్రజం గోకులమణ్డితమ్

ఇలా అన్ని బాధాలు ఐపోయాక అందరూ కలసి తమ నివాసానికి మళ్ళీ వెళ్ళారు

వ్రజే విక్రీడతోరేవం గోపాలచ్ఛద్మమాయయా
గ్రీష్మో నామర్తురభవన్నాతిప్రేయాఞ్ఛరీరిణామ్

ఇలా వీరందరూ ఆడుతూ పాడుతూ ఉన్న సమయములో ఎవరికీ అంతగా ఇష్టము కాని గ్రీష్మ ఋతువు వచ్చింది

స చ వృన్దావనగుణైర్వసన్త ఇవ లక్షితః
యత్రాస్తే భగవాన్సాక్షాద్రామేణ సహ కేశవః

మామూలుగా ఐతే గ్రీష్మ ఋతువు అందరినీ ఇబ్బంది పెట్టేదే. కానీ బలరామ కృష్ణులు ఉండుటచే గ్రీష్మ ఋతువు కూడా వసంత ఋతువులా ఉంది

యత్ర నిర్ఝరనిర్హ్రాద నివృత్తస్వనఝిల్లికమ్
శశ్వత్తచ్ఛీకరర్జీష ద్రుమమణ్డలమణ్డితమ్

బృందావనములో కొండల మీద నుండి పారే సెలయేర్లు అనేకం ఉన్నయి. రాత్రి ఐతే కీచురాళ్ళ ధ్వని వినవస్తుంది. అంత పెద్దగా ఉండే కీచురాళ్ళ ధ్వని కూడా  సెలయేర్లు వలన వచ్చే ధ్వని ముందు వినరాలేదు. ఆ సెలయేర్లు కొండల మీద నుంచి ప్రవహిస్తున్నాయి. ఆ సెలయేటి తుంపరలు చెట్ల మీద పడి చల్లగా అవుతున్నాయి

సరిత్సరఃప్రస్రవణోర్మివాయునా కహ్లారకఞ్జోత్పలరేణుహారిణా
న విద్యతే యత్ర వనౌకసాం దవో నిదాఘవహ్న్యర్కభవోऽతిశాద్వలే

గ్రీష్మఋతువులో దావాగ్ని భయం ఉంటుంది. కానీ బృందావనములో ఆ భయం లేదు. ఎంతటి కార్చిచ్చు ఉందో అన్ని సెలయేర్లు ఉన్నాయి.
పచ్చగడ్డి బాగా ఉంది, సెలయేర్లు బాగా ఉన్నాయి, అందుచే దావాగ్ని లేదు

అగాధతోయహ్రదినీతటోర్మిభిర్ద్రవత్పురీష్యాః పులినైః సమన్తతః
న యత్ర చణ్డాంశుకరా విషోల్బణా భువో రసం శాద్వలితం చ గృహ్ణతే

సూర్యభగవానుని కిరణములు కూడా ఏపుగా ఉన్న గడ్డితో సెలయేర్లతో ఉన్న ఆ ప్రాంతాన్ని వేడి చేయలేకపోయాయి

వనం కుసుమితం శ్రీమన్నదచ్చిత్రమృగద్విజమ్
గాయన్మయూరభ్రమరం కూజత్కోకిలసారసమ్

ఆ అరణ్యములో కొత్త పిందెలూ పూలూ, కోకిలలు కూస్తున్నాయి, ఆ వాతావరణములో గోవులతో పిల్లలతో పిల్లనగ్రోవి ఊదుతూ ప్రవేశించాడు. రక రకాల ఆభరణములు చిగురుటాకులూ కాయలూ పళ్ళు పిందెలూ అన్నీ అలంకారములుగా వేసుకున్నారు

క్రీడిష్యమాణస్తత్క్ర్ష్ణో భగవాన్బలసంయుతః
వేణుం విరణయన్గోపైర్గోధనైః సంవృతోऽవిశత్

ప్రవాలబర్హస్తబక స్రగ్ధాతుకృతభూషణాః
రామకృష్ణాదయో గోపా ననృతుర్యుయుధుర్జగుః

ఇలా అందరూ నాట్యం చేస్తున్నారు, పరస్పరం పాటలు పాడుకుంటున్నారు, మల్ల యుద్ధం చేస్తున్నారు. కృష్ణుడు నాట్యం చేస్తుంటే కొందరు గానం చేసారు, కొందరు మంగళ వాద్యాలను వాయించారు. కొమ్ములను ఊదుతూ కృష్ణుని నాట్యాన్ని వారు మెచ్చుకున్నారు.

కృష్ణస్య నృత్యతః కేచిజ్జగుః కేచిదవాదయన్
వేణుపాణితలైః శృఙ్గైః ప్రశశంసురథాపరే

గోపజాతిప్రతిచ్ఛన్నా దేవా గోపాలరూపిణౌ
ఈడిరే కృష్ణరామౌ చ నటా ఇవ నటం నృప

ఇలా కృష్ణుడు నాట్యం చేస్తుంటే తోటి వారు పాటలు పాడుతుంటే మరికొంతమంది అవి చూస్తూ ఉంటే, దేవతలందరూ కూడా గోపాల బాలకుల వేషం వేసుకుని కృష్ణున్ని స్తోరం చేయడం మొదలుపెట్టారు. దేవతలు కూడా గోపాలుర రూపములో అక్కడికి వచ్చారు. తోటి నటున్ని నటులు మెచ్చుకున్నట్లుగా ఉంది.

భ్రమణైర్లఙ్ఘనైః క్షేపైరాస్ఫోటనవికర్షణైః
చిక్రీడతుర్నియుద్ధేన కాకపక్షధరౌ క్వచిత్

దూకుతున్నారు తిరుగుతున్నారు తిప్పుతున్నారు గర్ఝిస్తున్నారు మల్ల యుద్ధం చేస్తున్నారు కొందరు నాట్యం చేస్తున్నారు, కొందరు గానం చేస్తున్నారు.

క్వచిన్నృత్యత్సు చాన్యేషు గాయకౌ వాదకౌ స్వయమ్
శశంసతుర్మహారాజ సాధు సాధ్వితి వాదినౌ

ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు.

క్వచిద్బిల్వైః క్వచిత్కుమ్భైః క్వచామలకముష్టిభిః
అస్పృశ్యనేత్రబన్ధాద్యైః క్వచిన్మృగఖగేహయా

కనులు మూసుకుని దాగుడు మూతలు ఆడుతున్నారు.  లేళ్ళలాగ పక్షుల్లాగ జింకల్లాగ రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు

క్వచిచ్చ దర్దురప్లావైర్వివిధైరుపహాసకైః
కదాచిత్స్యన్దోలికయా కర్హిచిన్నృపచేష్టయా

కాసేపు రాజులాట, కాసేపు వ్యాపారమాట, పాములాటా పక్షులాట లోకములో చాలా ప్రసిద్ధి పొందిన ఆటలతోటి వీళ్ళందరూ

ఏవం తౌ లోకసిద్ధాభిః క్రీడాభిశ్చేరతుర్వనే
నద్యద్రిద్రోణికుఞ్జేషు కాననేషు సరఃసు చ

నదులలో పర్వత ప్రాంతాలలో గుహలలో అడవులలో సరస్సులో పశువులను తిప్పుతూ తాము తిరుగుతూ ఆడుతూ పాడుతూ ఉంటే వీరందరూ మరచిపోయిన సంగతి చూచి ఒక పెద్ద రాక్షసుడు, ప్రలంబుడనేవాడు

పశూంశ్చారయతోర్గోపైస్తద్వనే రామకృష్ణయోః
గోపరూపీ ప్రలమ్బోऽగాదసురస్తజ్జిహీర్షయా

గోపాలురను దాచిపెడదామనే ఉద్దేశ్యముతో గోపాల రూపములో వచ్చాడు.

తం విద్వానపి దాశార్హో భగవాన్సర్వదర్శనః
అన్వమోదత తత్సఖ్యం వధం తస్య విచిన్తయన్

ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు వాడితో స్నేహం చేసాడు.  పెద్ద పులి గానీ సింహం గానీ ఒక మృగాన్ని పట్టాలంటే ముందు కాపు గాచి, జంతువుకి నమ్మకం కలిగిస్తుంది. వాడిని వధించడానికి ఆలోచించిన స్వామి అతనితో స్నేహాన్ని ఆమోదించాడు

తత్రోపాహూయ గోపాలాన్కృష్ణః ప్రాహ విహారవిత్
హే గోపా విహరిష్యామో ద్వన్ద్వీభూయ యథాయథమ్

అప్పటిదాకా ఊరుకున్న కృష్ణుడు ఒక కొత్త ఆట ఆడదామని అందరినీ పిలిచి రెండు జట్లుగా విభజించి ఒక జట్టుకు తాను నాయకుడై రెండవ జట్టుకు బలరాముడు నాయకుడు. ఓడిన వాడు గెలిచిన వాడిని మోయాలి అన్నది నియమం. 

తత్ర చక్రుః పరివృఢౌ గోపా రామజనార్దనౌ
కృష్ణసఙ్ఘట్టినః కేచిదాసన్రామస్య చాపరే

ఆచేరుర్వివిధాః క్రీడా వాహ్యవాహకలక్షణాః
యత్రారోహన్తి జేతారో వహన్తి చ పరాజితాః

వహన్తో వాహ్యమానాశ్చ చారయన్తశ్చ గోధనమ్
భాణ్డీరకం నామ వటం జగ్ముః కృష్ణపురోగమాః

రామసఙ్ఘట్టినో యర్హి శ్రీదామవృషభాదయః
క్రీడాయాం జయినస్తాంస్తానూహుః కృష్ణాదయో నృప

ఉవాహ కృష్ణో భగవాన్శ్రీదామానం పరాజితః
వృషభం భద్రసేనస్తు ప్రలమ్బో రోహిణీసుతమ్

అవిషహ్యం మన్యమానః కృష్ణం దానవపుఙ్గవః
వహన్ద్రుతతరం ప్రాగాదవరోహణతః పరమ్

తముద్వహన్ధరణిధరేన్ద్రగౌరవం
మహాసురో విగతరయో నిజం వపుః
స ఆస్థితః పురటపరిచ్ఛదో బభౌ
తడిద్ద్యుమానుడుపతివాడివామ్బుదః

నిరీక్ష్య తద్వపురలమమ్బరే చరత్
ప్రదీప్తదృగ్భ్రుకుటితటోగ్రదంష్ట్రకమ్
జ్వలచ్ఛిఖం కటకకిరీటకుణ్డల
త్విషాద్భుతం హలధర ఈషదత్రసత్

ప్రలంబాసురుడు బలరాముని జట్టులోకి వెళ్ళాడు. ఓదిపోయిన వారు మోస్తారు, గెలిచిన వారు మోయబడతారు. అక్కడ ఒక వట వృక్షం ఉంది, అది ఋషులకూ దేవతలకూ నివాసం, అక్కడకు వెళ్ళారు. ఎప్పుడూ కృష్ణుడు ఓడిపోయేవాడు, ఓడిపోయి శ్రీధామున్ని తీసుకు వెళ్ళాడు. ప్రలంబాసురుడు ఓడిపోయి బలరామున్ని మోసుకు వెళ్ళాడు. ఇక్కడ మోసుకుని అక్కడకు వెళ్ళి దింపాలి. దింపాల్సిన చోటు దాటి అవతలకు వెళ్ళాడు ఆ రాక్షసుడు. అక్కడ ఎందుకు ఆగలేదా అని బలరాముడు చూచి, కాస్త బరువయ్యాడు. ఆ రాక్షసుడు ఆ బరువును భరించడానికి తన నిజ రూపం దాల్చాడు. భయంకరమైన ఆకారముతో ఉన్నాడు. కిరీటమూ కుండలాలూ కోరలూ మొదలైనవి గల ఆకారం చూచి బలరాముడు కొద్దిగా భయపడ్డాడు. మొదలు భయపడ్డాడు గానీ వెంటనే తానెవరో గుర్తు చేసుకున్నాడు. పిడికిలి బిగించి తాను ఆదిశేషుడని తలచుకుని ఒక చిన్న దెబ్బ కొట్టాడు. (రామాయణములో కూడా రావణుడు మూర్చపోయిన లక్ష్మణుని ఎత్తుకోలేకపోతాడు. పడిపోయే ముందు లక్ష్మణుడు "నేను విష్ణువులో సగభాగము కదా" అనుకుని పడ్డాడు. అప్పుడు హనుమంతుడు రావణున్ని ఒక గుద్దు గుద్ది లక్ష్మణున్ని అవలీలగా ఎత్తుకు వెళ్ళాడు). బలరాముడు తన స్వరూపాన్ని జ్ఞ్యాపకం చేసుకుని ఒక ముష్టిఘాతముతో శిరస్సున కొడితే ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతాన్ని కొట్టినట్లై తల పగిలి రక్తం గక్కుకుంటూ పెద్దగా అరచి ప్రాణాలు కోల్పోయాడు.

అథాగతస్మృతిరభయో రిపుం బలో విహాయ సార్థమివ హరన్తమాత్మనః
రుషాహనచ్ఛిరసి దృఢేన ముష్టినా సురాధిపో గిరిమివ వజ్రరంహసా

స ఆహతః సపది విశీర్ణమస్తకో ముఖాద్వమన్రుధిరమపస్మృతోऽసురః
మహారవం వ్యసురపతత్సమీరయన్గిరిర్యథా మఘవత ఆయుధాహతః

వాడు పడగానే పెద్ద గాలి చుట్టుముట్టింది

దృష్ట్వా ప్రలమ్బం నిహతం బలేన బలశాలినా
గోపాః సువిస్మితా ఆసన్సాధు సాధ్వితి వాదినః

ప్రలంబుని వధను చూచిన గోపాలురందరూ బలరామున్ని మెచ్చుకున్నారు.

ఆశిషోऽభిగృణన్తస్తం ప్రశశంసుస్తదర్హణమ్
ప్రేత్యాగతమివాలిఙ్గ్య ప్రేమవిహ్వలచేతసః

మహానుభావుడని స్తోత్రం చేసారు బ్రాహ్మణులు ఆశీర్వాదం చేసారు. చనిపోయినవాడు మళ్ళీ వచ్చినట్లుగా భావించారు.

పాపే ప్రలమ్బే నిహతే దేవాః పరమనిర్వృతాః
అభ్యవర్షన్బలం మాల్యైః శశంసుః సాధు సాధ్వితి

పాపి ఐన ప్రలంబాసురుడు మరణిస్తే దేవతలందరూ పరమానందాన్ని పొందారు. అందరూ సంతోషించారు. బలరామున్ని మెచ్చుకున్నారు.

                                           సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహేడవ అధ్యాయం

                                                         ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
నాగాలయం రమణకం కథం తత్యాజ కాలియః
కృతం కిం వా సుపర్ణస్య తేనైకేనాసమఞ్జసమ్

గరుత్మంతుని భయముతో కాళీయుడు ఈ నదికి వచ్చాడని చెప్పారు. గరుత్మంతునికి కాళీయుడు చేసిన అపచారం ఏమిటి

శ్రీశుక ఉవాచ
ఉపహార్యైః సర్పజనైర్మాసి మాసీహ యో బలిః
వానస్పత్యో మహాబాహో నాగానాం ప్రాఙ్నిరూపితః

గరుడుడి ఆహారం సర్పాలు. సర్పాలన్నీ "మేమే మీ దగ్గరకు వస్తాము రోజు. నెల ఒకరము వచ్చి నీకు తీసుకుని వచ్చి ఒక చెట్టు దగ్గర పెట్టి వెళతాము"

స్వం స్వం భాగం ప్రయచ్ఛన్తి నాగాః పర్వణి పర్వణి
గోపీథాయాత్మనః సర్వే సుపర్ణాయ మహాత్మనే

ఎవరు ఏ  రోజు వచ్చి తీసుకు రావాలో ఆ వరుసలో వచ్చి తీసుకు వెళుతున్నారు. ఇలా అందరూ చేసారు కానీ కాళీయుడు తాను బలాడ్యుడని గర్వించి, తాను గరుత్మంతునికి ఆహరం పెట్టక ఆ ఆహారం తానే తినేశాడు

విషవీర్యమదావిష్టః కాద్రవేయస్తు కాలియః
కదర్థీకృత్య గరుడం స్వయం తం బుభుజే బలిమ్

గరుడుడు అది తెలుసుకుని అతన్ని చంపాలని సముద్రం వద్దకు వచ్చాడు. అప్పుడు గరుత్మంతున్ని కాటు వేయడానికి ప్రయత్నించాడు. అపుడు గరుడుడు ఎడమ రెక్క కొసభాగముతో కొట్టగా కాళీయుడు ఈ నది వద్దకు వచ్చి పడ్డాడు

తచ్ఛ్రుత్వా కుపితో రాజన్భగవాన్భగవత్ప్రియః
విజిఘాంసుర్మహావేగః కాలియం సమపాద్రవత్

తమాపతన్తం తరసా విషాయుధః ప్రత్యభ్యయాదుత్థితనైకమస్తకః
దద్భిః సుపర్ణం వ్యదశద్దదాయుధః కరాలజిహ్రోచ్ఛ్వసితోగ్రలోచనః

తం తార్క్ష్యపుత్రః స నిరస్య మన్యుమాన్
ప్రచణ్డవేగో మధుసూదనాసనః
పక్షేణ సవ్యేన హిరణ్యరోచిషా
జఘాన కద్రుసుతముగ్రవిక్రమః

ఎడమ రెక్కతో మెల్లగా కొట్టగా ఈ హ్రదములోకి వచ్చిపట్టాడు కాళీయుడు కుంగిపోయి. ఈ హ్రదములో వచ్చి దాక్కున్నాడు

సుపర్ణపక్షాభిహతః కాలియోऽతీవ విహ్వలః
హ్రదం వివేశ కాలిన్ద్యాస్తదగమ్యం దురాసదమ్

అన్ని లోకాలలో గర్తుమంతుడు రావడానికి వీలు లేని మడుగు ఇది ఒక్కటే. ఈ మడుగులో సౌభరి అనే ముని ఉన్నాడు. గరుత్మంతుడు పైన వెళుతూ ఉంటే ఒకసారి ఒక చేప కనపడింది. ఆ మడులో ఉన్న సౌభరిని ఆ చేపలు శరణు వేడాయి. సౌభరి ఇక్కడకు రాకు, ఇది ముని ఆశ్రమం అని అన్నాడు. ఐనా వినకుండా గరుత్మంతుడు రాగా, ఈ మడుగులోకి వచ్చావంటే నీ తల ముక్కలవుతుంది అని శపించాడు. అది తెలుసుకున్న కాళీయుడు ఇక్కడ ప్రవేశించాడు

తత్రైకదా జలచరం గరుడో భక్ష్యమీప్సితమ్
నివారితః సౌభరిణా ప్రసహ్య క్షుధితోऽహరత్

మీనాన్సుదుఃఖితాన్దృష్ట్వా దీనాన్మీనపతౌ హతే
కృపయా సౌభరిః ప్రాహ తత్రత్యక్షేమమాచరన్

అత్ర ప్రవిశ్య గరుడో యది మత్స్యాన్స ఖాదతి
సద్యః ప్రాణైర్వియుజ్యేత సత్యమేతద్బ్రవీమ్యహమ్

తత్కాలియః పరం వేద నాన్యః కశ్చన లేలిహః
అవాత్సీద్గరుడాద్భీతః కృష్ణేన చ వివాసితః

కృష్ణం హ్రదాద్వినిష్క్రాన్తం దివ్యస్రగ్గన్ధవాససమ్
మహామణిగణాకీర్ణం జామ్బూనదపరిష్కృతమ్

కాళీయుడు సంపరించిన మణులు ధరించి కృష్ణ పరమాత్మ పైకి వచ్చాడు

ఉపలభ్యోత్థితాః సర్వే లబ్ధప్రాణా ఇవాసవః
ప్రమోదనిభృతాత్మానో గోపాః ప్రీత్యాభిరేభిరే

చాలా కాలానికి పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినంతగా కృష్ణున్ని చూచి సంతోషముతో అతన్ని దగ్గరకు తీసుకుని సంతోషించారు

యశోదా రోహిణీ నన్దో గోప్యో గోపాశ్చ కౌరవ
కృష్ణం సమేత్య లబ్ధేహా ఆసన్శుష్కా నగా అపి

ఇప్పటికి మా మనసు కుదుట పడింది అనుకున్నారు

రామశ్చాచ్యుతమాలిఙ్గ్య జహాసాస్యానుభావవిత్
ప్రేమ్ణా తమఙ్కమారోప్య పునః పునరుదైక్షత
గావో వృషా వత్సతర్యో లేభిరే పరమాం ముదమ్

అందరూ కౌగిలించుకుని వదిలిపెట్టాక బలరామున్ని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని ఒక చిరునవ్వు నవ్వాడు. కృష్ణుని ప్రభావం తెలిసిన బలరాముడు ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. గోపికలూ గోపాలురే కాక గోవులూ దూడలూ చెట్లు పర్వతములూ శిలలు పక్షులు కూడా పైకి వచ్చిన కృష్ణ పరమాత్మను చూచి పరమానందాన్ని పొందారు

నన్దం విప్రాః సమాగత్య గురవః సకలత్రకాః
ఊచుస్తే కాలియగ్రస్తో దిష్ట్యా ముక్తస్తవాత్మజః

బ్రాహ్మణులూ గురువులూ వచ్చి నందునితో "నందా నీవు చాలా అదృష్టవంతుడవు. కాళీయుని చేత ఇంచుమించు మింగబడిన నీ కుమారుడు మళ్ళీ బయటకు వచ్చాడంటే ఎంతో ప్రభావం కలవాడు నీ కుమారుడు. మనకు ఒక ఆపద తొలగిందంటే మనం చేయవలసింది, గోబ్రాహ్మణులకూ భోజనం పెట్టాలి, బ్రాహ్మణులకు వస్త్రములూ ఆభరణములూ దక్షిణలూ ఇవ్వాలి. వారి ఆశీర్వాదమూ అనుగ్రహ్మూ లేకుండా నీవు ఇంత ఆపదను తప్పించుకోలేవు.కృష్ణుడు కాళీయుని నుంచి ముక్తిపొందిన ఈ సందర్భములో బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలి అని చెప్పగా నందుడు అలాగే చేసాడు

దేహి దానం ద్విజాతీనాం కృష్ణనిర్ముక్తిహేతవే
నన్దః ప్రీతమనా రాజన్గాః సువర్ణం తదాదిశత్

యశోదాపి మహాభాగా నష్టలబ్ధప్రజా సతీ
పరిష్వజ్యాఙ్కమారోప్య ముమోచాశ్రుకలాం ముహుః

తల్లికూడా పిల్లవాన్ని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుంది, నీటి ధారలతో అతన్ని తడిపింది

తాం రాత్రిం తత్ర రాజేన్ద్ర క్షుత్తృడ్భ్యాం శ్రమకర్షితాః
ఊషుర్వ్రయౌకసో గావః కాలిన్ద్యా ఉపకూలతః

ఆ హ్రదములోకి వెళ్ళడానికి ఆంక్షలు లేకపోవడముతో అందరూ ఆ హ్రదములో ఆడుకున్నారు. అక్కడే పడుకున్నారు. 

తదా శుచివనోద్భూతో దావాగ్నిః సర్వతో వ్రజమ్
సుప్తం నిశీథ ఆవృత్య ప్రదగ్ధుముపచక్రమే

తత ఉత్థాయ సమ్భ్రాన్తా దహ్యమానా వ్రజౌకసః
కృష్ణం యయుస్తే శరణం మాయామనుజమీశ్వరమ్

అప్పుడు దావాగ్ని మొత్తం అడవిని చుట్టుముట్టింది, అందరూ పరుగెత్తుకుని వచ్చి కృష్ణున్ని శరణు వేడారు. రామా! కృష్ణా! ఈ దావాగ్ని మీవారమైన మమ్ము మింగుతున్నది

కృష్ణ కృష్ణ మహాభగ హే రామామితవిక్రమ
ఏష ఘోరతమో వహ్నిస్తావకాన్గ్రసతే హి నః

సుదుస్తరాన్నః స్వాన్పాహి కాలాగ్నేః సుహృదః ప్రభో
న శక్నుమస్త్వచ్చరణం సన్త్యక్తుమకుతోభయమ్

ఎలాంటి ఆపదలోనైనా అందరికీ దిక్కు నీ పాదములే. వాటినే శరణముగా స్వీకరించాము అని ఏక కంఠముతో అందరూ ప్రార్థన చేస్తే

ఇత్థం స్వజనవైక్లవ్యం నిరీక్ష్య జగదీశ్వరః
తమగ్నిమపిబత్తీవ్రమనన్తోऽనన్తశక్తిధృక్

మీరేమీ భయపడకండీ అంటూ స్వామి అగ్నిని అంతా తాగేసాడు అనంత శక్తిధరుడు . (ఆయన ముఖమే అగ్నిహోత్రుడు)

                                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Tuesday, June 18, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహారవ అధ్యాయం

                                                          ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం పదహారవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాహినా విభుః
తస్యా విశుద్ధిమన్విచ్ఛన్సర్పం తముదవాసయత్

ఇలా జలం విషయమయమవడం చూచిన కృష్ణుడు అవినయముతో ఆ సర్పము చేసిన పని తెలుసుకుని ఆ సర్పాన్ని అక్కడి నుంచి పంపించి వేసాడు.

శ్రీరాజోవాచ
కథమన్తర్జలేऽగాధే న్యగృహ్ణాద్భగవానహిమ్
స వై బహుయుగావాసం యథాసీద్విప్ర కథ్యతామ్

నీటిలో ఎక్కడో ఉన్న మహాసర్పాన్ని కృష్ణుడెలా పంపాడు. ఇంతకాల ఆ సర్పం ఎలా ఉన్నాడు. ఇంతకాలమున్న ఆ సర్పాన్ని కృష్ణుడు ఎలా బయటకు పంపాడు

బ్రహ్మన్భగవతస్తస్య భూమ్నః స్వచ్ఛన్దవర్తినః
గోపాలోదారచరితం కస్తృప్యేతామృతం జుషన్

అమృతాన్ని తాగుతున్న వాడికి తృప్తి ఉంటుందా. గోపాలుని యొక్క ఔదార్యాన్ని (తనని నమ్మి ఉన్న గోపాలబాలురకు శుభం చేకూర్చడానికి తనను తాను సర్పానికి అర్పించుకున్నాడు) పానం చేస్తున్న వాడెవడైనా తృప్తి పొందుతాడా

శ్రీశుక ఉవాచ
కాలిన్ద్యాం కాలియస్యాసీధ్రదః కశ్చిద్విషాగ్నినా
శ్రప్యమాణపయా యస్మిన్పతన్త్యుపరిగాః ఖగాః

కాళీయుని విషముతో ఈ సరస్సులో నీళ్ళు ఎప్పుడూ మరుగుతూ ఉంటాయి. ఆ మడుగుపైనుంచి కూడా పక్షులు వెళ్ళవు. తెలియక పక్షులు వస్తే ఆ విషవాయుకు కింద పడిపోతాయి

విప్రుష్మతా విషదోర్మి మారుతేనాభిమర్శితాః
మ్రియన్తే తీరగా యస్య ప్రాణినః స్థిరజఙ్గమాః

ఆ విషపు వాయువు వలన ఆ నది దగ్గరలో ఉన్న చెట్లు మాడిపోయాయి.

తం చణ్డవేగవిషవీర్యమవేక్ష్య తేన
దుష్టాం నదీం చ ఖలసంయమనావతారః
కృష్ణః కదమ్బమధిరుహ్య తతోऽతితుఙ్గమ్
ఆస్ఫోట్య గాఢరశనో న్యపతద్విషోదే

దుష్టులను నిగ్రహించడానికి అవతరించిన పరమాత్మ మహాభయంకరమైన వేగముతో విషయమయమైన ఆ నదిని చూచి, ఒక చెట్టు  ఎక్కి నడుము కట్టుకుని, చేతులు చరిచాడు, బాహువులను చరిచి, గట్టిగా వస్త్రాన్ని బిగించి, ఆ విష జలములో పడిపోయాడు.

సర్పహ్రదః పురుషసారనిపాతవేగ
సఙ్క్షోభితోరగవిషోచ్ఛ్వసితామ్బురాశిః
పర్యక్ప్లుతో విషకషాయబిభీషణోర్మిర్
ధావన్ధనుఃశతమనన్తబలస్య కిం తత్

అంత చిన్న పిల్లవాడు అందులో దూకితే నూరు ధనువుల దూరం పారిపోయాయి ఆ నదిలో తరంగాలు. ఇది వరకు సర్పము యొక్క విషముతో మరుగూ ఉన్నది. అందులో కృష్ణుడు  పడి ఆ నీటిని దూరముగా తరిమి వేశాడు. అనంత బలుడైన స్వామి బలానికి ఆ నీరు అంత దూరం పోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు

తస్య హ్రదే విహరతో భుజదణ్డఘూర్ణ
వార్ఘోషమఙ్గ వరవారణవిక్రమస్య
ఆశ్రుత్య తత్స్వసదనాభిభవం నిరీక్ష్య
చక్షుఃశ్రవాః సమసరత్తదమృష్యమాణః

స్వామి దూకి ఈదుతున్నాడు. ఒక ఏనుగు మడుగులోకి దూకి విహరిస్తున్నట్లు ఉంది. నా ఇంటికి వచ్చినది ఎవడని కాళీయుడు చూచాడు. తన ఇంటిని ఎవడు అవమానించాడని కన్నులే చెవులుగా గల (చక్షు శ్రవ) కాళీయుడు చూచాడు. మనను  కాపాడడానికి పరమాత్మ అవతరించి మన వద్దకు వస్తే "మనదగ్గరకు ఎందుకు వచ్చాడంటాం " మనం. మనం కూడా చక్షు శ్రవలమే.
మనం కూడా విషము నిండిన సంసారమనే హ్రదములో ఉన్నాము, శబ్దాది విషయములే విషములు. ఇదే కాళీయ హ్రదం. మనమంతా కాళీయులమే. అక్కడి నుంచి సముద్రానికి తరిమేసాడు స్వామి. ఏక పాత్ నుండి త్రిపాద్ విభూతికి పంపాడు స్వాము.

తం ప్రేక్షణీయసుకుమారఘనావదాతం
శ్రీవత్సపీతవసనం స్మితసున్దరాస్యమ్
క్రీడన్తమప్రతిభయం కమలోదరాఙ్ఘ్రిం
సన్దశ్య మర్మసు రుషా భుజయా చఛాద

విష జలములో ఈదు కొడుతున్నా, అందులో ఉన్న వారికి కూడా చూడాలనిపించేలా ఉన్న కృష్ణుడు, సుకుమారముగా ఉన్నవాడు, నీల మేఘశ్యాముడు, పీతాంబరధారి ఐన స్వామిని చూచి, చిరునవ్వుతో అందమైన ముఖం కలిగినవాడు, భయములేక హాయిగా ఆడుకుంటున్నవాడు, పద్మ గర్భము వంటి సుకుమారమైన పాదములు కల స్వామిని కాళీయుడు వచ్చి కాట్లు వేసాడు, విషమంతా కురిపించి, తోకతో స్వామిని చుట్టి వేశాడు.

తం నాగభోగపరివీతమదృష్టచేష్టమ్
ఆలోక్య తత్ప్రియసఖాః పశుపా భృశార్తాః
కృష్ణేऽర్పితాత్మసుహృదర్థకలత్రకామా
దుఃఖానుశోకభయమూఢధియో నిపేతుః

పాము తోకతో మొత్తం చుట్టేసి కాటేసే సరికి స్వామి కదలిక లేక చెతలుడిగి ఉన్నాడు. ఆయనను చూచిన నిరంతరమూ పరమాత్మ యందే మనసు ఉంచీ, తమను, పుత్రులనూ భార్యలనూ ఆయన యందే అర్పించిన మిత్రులందరూ మూర్చపోయారు, దుఃఖముతో శోకముతో భయముతో.

గావో వృషా వత్సతర్యః క్రన్దమానాః సుదుఃఖితాః
కృష్ణే న్యస్తేక్షణా భీతా రుదన్త్య ఇవ తస్థిరే

ఆవులూ కోడెలూ దూడలూ అరుస్తున్నాయి కృష్ణుని కోసం
కృష్ణుని మీదే కనులు ఉన్నాయి. బొమ్మల లాగ ఐపోయాయి.

అథ వ్రజే మహోత్పాతాస్త్రివిధా హ్యతిదారుణాః
ఉత్పేతుర్భువి దివ్యాత్మన్యాసన్నభయశంసినః

వ్రేపల్లె వాడలో దుశ్శకునాలు కనపడ్డాయి. ఆకాశములో భూమిలో ఉత్పాతాలు కనపడ్డాయి
కృష్ణునికేదో ఆపద జరిగింది అని సూచించే ఉత్పాతాలు కలిగాయి.

తానాలక్ష్య భయోద్విగ్నా గోపా నన్దపురోగమాః
వినా రామేణ గాః కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతమ్

అందరికీ భయం వేసింది. అపుడు అర్థం అయ్యింది. ఆరోజు బలరాముడు లేకుండా కృష్ణుడు ఒక్కడే బయలుదేరాడని

తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్విదః
తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖశోకభయాతురాః

కృష్ణునికి పెద్ద ఆపదే వచ్చింది. ప్రాణం కూడా పోయిందేమో అన్న భయముతో బయలుదేరారు. వ్రేపల్లెలో గోపాలురి ప్రాణాలన్నీ మనసులన్నీ కృష్ణుని మీదే ఉన్నాయి. దుఃఖమూ శోకమూ భయమూ కలిగాయి. శరీరానికి కలిగే బాధను దుఃఖం అంటారు. మానసిక వ్యధ శోకము. శరీరానికి కలిగిన హాని వలన కలిగే బాధను దుఃఖము అంటారు.

ఆబాలవృద్ధవనితాః సర్వేऽఙ్గ పశువృత్తయః
నిర్జగ్ముర్గోకులాద్దీనాః కృష్ణదర్శనలాలసాః

బాలురూ వృద్ధులూ స్త్రీలు అన్న భేధం లేకుండా పశువులతో బతికేవారందరూ కలసి వెళ్ళారు.
కృష్ణుని చూడడానికి ఆరాటముతో అందరూ వెళ్ళారు.

తాంస్తథా కాతరాన్వీక్ష్య భగవాన్మాధవో బలః
ప్రహస్య కిఞ్చిన్నోవాచ ప్రభావజ్ఞోऽనుజస్య సః

ఇందరూ ఇంతగా పరిగెత్తుతూ ఉంటే తమ్ముడి సంగతి తెలిసిన బలరాముడు మాత్రం ఒక నవ్వు నవ్వి మౌనం వహించాడు.

తేऽన్వేషమాణా దయితం కృష్ణం సూచితయా పదైః
భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యా యమునాతటమ్

కృష్ణ పరమాత్మ అడుగుజాడలు చూచుకుంటూ ఆయన ఉన్న చోటికి వెళ్ళారు. కృష్ణుని పాదాలు గుర్తుపట్టవీలుగా శంఖ చక్ర గద మొదలైన గుర్తులు ఉన్నాయి.

తే తత్ర తత్రాబ్జయవాఙ్కుశాశని ధ్వజోపపన్నాని పదాని విశ్పతేః
మార్గే గవామన్యపదాన్తరాన్తరే నిరీక్షమాణా యయురఙ్గ సత్వరాః

శంఖమూ చక్రమూ అంకుశమూ వజ్రమూ ధ్వజమూ మొదలైన చిహ్నములు కలిగి ఉన్నాయి ఆ పాదాలు. కృష్ణ పరమాత్మ ఆవుల వెంట వెళ్ళడం కూడా ఒక విలక్షణముగా ఉండేది. పశువులు ఒక పక్క వెళుతూ ఉంటే సాధారణముగా వేరొక పక్క వెళుతూ ఉంటారు పశువులను కాచేవారు. ఒక వేళ పశువులు కొట్టుకుంటూ ఉంటే వారు మధ్యలో ఉంటే నలిగిపోతారు. ఇది సామాన్య గోపాలకుల విషయం. కానీ కృష్ణుడు మాత్రం ఆవుల మధ్యలోనే వెళతాడు. గోవుల యొక్క పాదముల మధ్య ఉన్న పాదములు కృష్ణుడివి. కృష్ణుడు ఒక్కడే అలా నడుస్తాడు. ( ఈ విషయం బ్రహ్మవైవర్తములో పాద్మములోనూ చెప్పబడింది)

అన్తర్హ్రదే భుజగభోగపరీతమారాత్
కృష్ణం నిరీహముపలభ్య జలాశయాన్తే
గోపాంశ్చ మూఢధిషణాన్పరితః పశూంశ్చ
సఙ్క్రన్దతః పరమకశ్మలమాపురార్తాః

అక్కడకు వెళ్ళి చూడగా పాము చేత చుట్టబడి నిశ్చేష్టుడై ఉన్నాడు కృష్ణుడు. శ్వాస కూడా తీయుట లేదు. అది చూచి గోపాలకులు అంతా బిత్తరపోయి నిలబడ్డారు. ఆవులన్నీ అరుస్తున్నాయి. అందరూ ఎంతో దుఃఖం పొందారు.

గోప్యోऽనురక్తమనసో భగవత్యనన్తే
తత్సౌహృదస్మితవిలోకగిరః స్మరన్త్యః
గ్రస్తేऽహినా ప్రియతమే భృశదుఃఖతప్తాః
శూన్యం ప్రియవ్యతిహృతం దదృశుస్త్రిలోకమ్

గోపికలు పరమాత్మ యందే నిరంతరం అనురాగం కలిగి ఉన్నారు కాబట్టి, ఈ స్థితిలో ఉన్న కృష్ణున్ని చూచి కృష్ణుడి అసలు స్వరూపాన్నీ జ్ఞ్యాపకాలనీ తలచుకుంటూ మూడులోకాలూ శూన్యమైపోయాయి అనుకుంటున్నారు. నిజముగా కృష్ణుడికే ఆపద కలిగి ఉంటే ఆయన లేని జగత్తు శూన్యముగా భావించారు.

తాః కృష్ణమాతరమపత్యమనుప్రవిష్టాం
తుల్యవ్యథాః సమనుగృహ్య శుచః స్రవన్త్యః
తాస్తా వ్రజప్రియకథాః కథయన్త్య ఆసన్
కృష్ణాననేऽర్పితదృశో మృతకప్రతీకాః

కృష్ణుని తల్లి కృష్ణుని కోసం ఎంత ఆవేదన పడుతుందో ఎంతగా ఆక్రోశిస్తుందో ఎంతగా బాధపడుతుందో అక్కడ ఉన్న గోప గోపిక గోపాలురలో అంతకన్నా తక్కువగా ఆక్రోశించినవారెవరూ లేరు. వారిని చూస్తే ఎవరు తల్లో ఎవరు ఇతరులో ఎవరూ గుర్తుపట్టలేరు. ఎంత బాధ కృష్ణుని తల్లికి ఉందో అంత బాధ వీరికీ ఉంది.
ఇంచు మించు చనిపోయిన వారితో సమానమైపోయారు. ఆయన అంతవరకూ చేసిన చేష్టములను తలచుకుంటూ నిలబడిన శవాలయ్యారు

కృష్ణప్రాణాన్నిర్విశతో నన్దాదీన్వీక్ష్య తం హ్రదమ్
ప్రత్యషేధత్స భగవాన్రామః కృష్ణానుభావవిత్

నంద యశోదులు బాధ భరించలేక ఆ మడుగులోకి వారు కూడా దూకబోయారు. వారిని పరమాత్మ ప్రభావం తెలిసిన బలరాముడు నిలువరించాడు

ఇత్థమ్స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య
సస్త్రీకుమారమతిదుఃఖితమాత్మహేతోః
ఆజ్ఞాయ మర్త్యపదవీమనువర్తమానః
స్థిత్వా ముహూర్తముదతిష్ఠదురఙ్గబన్ధాత్

బలరాముడు నంద యశోదాదులతో ఆగమని చెప్పడాన్ని చూచిన కృష్ణుడు తన కంటే వేరే గతి లేని గోకులాన్ని చూచీ, స్త్రీలూ పెద్దలూ పిల్లలూ పడుతున్న బాధను చూచి మనిషిలాగ నటించిన కృష్ణుడు ఒక్క సారిగా చుట్టుకున్న పామును విదిలించాడు.

తత్ప్రథ్యమానవపుషా వ్యథితాత్మభోగస్
త్యక్త్వోన్నమయ్య కుపితః స్వఫణాన్భుజఙ్గః
తస్థౌ శ్వసఞ్ఛ్వసనరన్ధ్రవిషామ్బరీష
స్తబ్ధేక్షణోల్ముకముఖో హరిమీక్షమాణః

ఆ కాళీయుడు కృష్ణుని చేష్టితముకు ఆశ్చర్య్పడి విషం వెలువరించే తన శ్వాసను ఇంకొంచెం చిమ్ముతూ కాళీయుడు తన విష శ్వాసలనే మూకుడులో విషాన్ని వేడి చేసి పోస్తున్నట్లుగా విషాన్ని కృష్ణుడి మీద చిమ్మాడు. ఇక్కడ అంబరీష అంటే మూకుడు అని అర్థం. కాళియుని ముక్కు రంధ్రాలు వేడి మూకుడులా ఉన్నాయి. వాడి ముఖములోంచి మంటలు వస్తున్నాయి. అలా స్వామిని చూస్తూ నాలికలతో కృష్ణున్ని నాకుతున్నాడు.

తం జిహ్వయా ద్విశిఖయా పరిలేలిహానం
ద్వే సృక్వణీ హ్యతికరాలవిషాగ్నిదృష్టిమ్
క్రీడన్నముం పరిససార యథా ఖగేన్ద్రో
బభ్రామ సోऽప్యవసరం ప్రసమీక్షమాణః

ఎంత గొప్ప సర్పాన్నైనా గరుత్మంతుడు ముక్కుతో పట్టుకుని ఆడుకుంటాడో స్వామి కాళీయునితో వాడికి చిక్కకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆడుకున్నాడు.  కాళీయున్ని ఆ హ్రదం చుట్టూ తిప్పాడు. సమయముకోసం స్వామి వేచి చూస్తున్నాడు

ఏవం పరిభ్రమహతౌజసమున్నతాంసమ్
ఆనమ్య తత్పృథుశిరఃస్వధిరూఢ ఆద్యః
తన్మూర్ధరత్ననికరస్పర్శాతితామ్ర
పాదామ్బుజోऽఖిలకలాదిగురుర్ననర్త

ఇలా తిరిగి తిరిగి బలము తగ్గిన కాళీయుడు ఎత్తుగా ఉన్న పడగ భాగాన్ని వంచి అతని పెద్ద శిరస్సును పరమాత్మ అధిరోహించాడు.
ఎర్రగా సుకుమారముగా ఉండే పరమాత్మ పాదాలు కాళీయుని పడగల పై ఉన్న పగడములతో మరింతగా ఎర్రబారాయి, అన్ని కళలకూ ఆది గురువైన స్వామి ఆ శిరస్సు మీద నాట్యం చేసాడు.

తం నర్తుముద్యతమవేక్ష్య తదా తదీయ
గన్ధర్వసిద్ధమునిచారణదేవవధ్వః
ప్రీత్యా మృదఙ్గపణవానకవాద్యగీత
పుష్పోపహారనుతిభిః సహసోపసేదుః

పైనుంచి గంధర్వాదులు చూచారు ఇదంతా. స్వామి నాట్యం చేయబోతున్నాడని తెలుసుకుని అందరూ వారి వారి వాద్యాలు మృదంగమూ పణవమూ దుందుభులూ వేణువులూ తీసుకుని సమీపించారు.

యద్యచ్ఛిరో న నమతేऽఙ్గ శతైకశీర్ష్ణస్
తత్తన్మమర్ద ఖరదణ్డధరోऽఙ్ఘ్రిపాతైః
క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతోऽసృఙ్
నస్తో వమన్పరమకశ్మలమాప నాగః

నూరు పడగలు ఉన్నాయి ఆ కాళీయునికి, వంచని తలను తొక్కుతున్నాడు కృష్ణ్డు. ఇది పరమాత్మ దయకు పరాకాష్ఠ. వంచని తలను మర్దించాడు. పరమాత్మ మనను "నీవే రక్షకుడవు"అనకుంటే శిక్షిస్తాడు.మనం ఒక క్షణం తల వంచితే నిరంతరం మనకు వంగి ఉంటాడు. మనం వంచకపోతే ఆయనే వంచుతాడు.
ఎంత దయాళువో ఎంత వాత్సల్యం చూపేవాడో అంత కఠినముగా శిక్షిస్తాడు స్వామి. అడుగులు పైకెత్తి వేస్తున్నాడు శిరస్సు మీద. ముక్కులోంచీ నోట్లోంచీ విషమును గక్కుతున్నాడు. ఆయుష్యం కూడా తగ్గిపోతోంది. ప్రాణాలూ తగ్గిపోతున్నాయి.

తస్యాక్షిభిర్గరలముద్వమతః శిరఃసు
యద్యత్సమున్నమతి నిఃశ్వసతో రుషోచ్చైః
నృత్యన్పదానునమయన్దమయాం బభూవ
పుష్పైః ప్రపూజిత ఇవేహ పుమాన్పురాణః

చెవులనుంచే కాకుండా కళ్ళ నుంచి కూడా విషాన్ని గక్కుతున్నాడు కాళీయుడు. కోపముతో బుసలు కొడుతూ ఏ ఏ పడగ పైకి లేస్తోందో దాని మీద నాట్యం చేస్తున్నాడు. వంగని తలని పాదములతో మర్దిస్తున్నాడు. వంగిన పడగలు ఎత్తిన పడగల మీద పెట్టిన కాళ్ళకు పూలలా కనపడుతున్నాయి.

తచ్చిత్రతాణ్డవవిరుగ్నఫణాసహస్రో
రక్తం ముఖైరురు వమన్నృప భగ్నగాత్రః
స్మృత్వా చరాచరగురుం పురుషం పురాణం
నారాయణం తమరణం మనసా జగామ

ఇలా విచిత్రమైన గొప్ప తాండవముతో బాగా అలసిపోయి అన్ని పడగలూ అలసిపోయాయి. నోటితో రక్తాన్ని వదులుతున్నాడు, కక్కుతున్నాడు. శరీరమంతా వాడిపోయింది.
నూరు శిరస్సులు ఉన్న తనను తన ఇంటికి వచ్చి ఆడి తన శిరస్సును అధిరోహించి నాట్యం చేసాడంటే ఈ వచ్చిన పిల్లవాడు పిల్లవాడు కాదు, ఇతను చరాచర గురువే, పురాణ పురుషుడే. ఈయన మాత్రమే రక్షకుడు అని తెలుసుకుని మనసులోనే ధ్యానించాడు

కృష్ణస్య గర్భజగతోऽతిభరావసన్నం
పార్ష్ణిప్రహారపరిరుగ్నఫణాతపత్రమ్
దృష్ట్వాహిమాద్యముపసేదురముష్య పత్న్య
ఆర్తాః శ్లథద్వసనభూషణకేశబన్ధాః

జగత్తు మొత్తాన్నే గర్భములో దాచుకున్న కృష్ణుని పాదముల వత్తిడికి ఆగలేకపోయాడు. బరువు మోయలేక అన్ని పడగలూ వంగాయి. అరి కాళ్ళ తాకిడికి అన్ని పడగలూ చితికిపోయాయి. అప్పటిదాగా చూస్తూ కూర్చున్న కాళీయుని భార్యలకు పరిస్థితి అర్థమయ్యింది. వస్త్రమూ ఆభరణాలూ జారిపోతూ ఉండగా ఆర్తితో వచ్చారు

తాస్తం సువిగ్నమనసోऽథ పురస్కృతార్భాః
కాయం నిధాయ భువి భూతపతిం ప్రణేముః
సాధ్వ్యః కృతాఞ్జలిపుటాః శమలస్య భర్తుర్
మోక్షేప్సవః శరణదం శరణం ప్రపన్నాః

ఆడవారిని దయ చూడాలంటే వారు ప్రయోగించే ఆయుధం ముందర పసిపిల్లలను పట్టుకు రావడం. ఈ నాగ పత్నులు కూడా పిల్లలను పట్టుకుని వచ్చారు. శరీరాన్ని కింద పడేసి దండ ప్రణామం చేసి నమస్కరించి తన భర్త యొక్క దుఃఖాన్ని తొలగించాలని కోరుతూ సకల లోకములకూ రక్షణ ఇచ్చే స్వామిని వీరు శరణు పొందారు

నాగపత్న్య ఊచుః
న్యాయ్యో హి దణ్డః కృతకిల్బిషేऽస్మింస్
తవావతారః ఖలనిగ్రహాయ
రిపోః సుతానామపి తుల్యదృష్టిర్
ధత్సే దమం ఫలమేవానుశంసన్

మేము నిన్ను తప్పు బట్టడానికి రాలేదు. తప్పు చేసిన వారిని దండించడం న్యాయమే. నీ అవతారం ఉన్నదే దుష్టులను శిక్షించడానికి. లోకములో ఉండే తక్కిన వారి విషయం పక్కన పెడితే నీవు మాత్రం శత్రువునైనా మిత్రున్నైనా సమదృష్టితోనే శిక్షిస్తావు. నీవు శిక్షిస్తే ఫలమే కలుగుతుంది. దీన్ని ఫలముగానే భావిస్తున్నాము.

అనుగ్రహోऽయం భవతః కృతో హి నో దణ్డోऽసతాం తే ఖలు కల్మషాపహః
యద్దన్దశూకత్వమముష్య దేహినః క్రోధోऽపి తేऽనుగ్రహ ఏవ సమ్మతః

పాదములతో శిరస్సున నీవు చేసిన తాండవం శిక్షణ కాదు అనుగ్రహమే. దురజనుల విషయములో దండించడం అనేది మా పాపములను పోగొట్టడానికే. శిక్ష వలన తప్పు చేయడం వలన వచ్చిన పాపం పోతుంది.
కాటేయడం బుసకొట్టడం పాము స్వభావం. అది నీవు సృష్టించినదే.నీ క్రోధం కూడా మాకు అనుగ్రహమే.

తపః సుతప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన
ధర్మోऽథ వా సర్వజనానుకమ్పయా యతో భవాంస్తుష్యతి సర్వజీవః

 పాముగా సృష్టించబడ్డాడు, మహా కోపిష్ఠీ, అందరినీ కాటేస్తాడు, ఇంతటి పాపపు జన్మ ఇచ్చావు. ఐన ఇతడు కొన్ని లక్షల జన్మలు గొప్ప తపస్సు చేసి ఉంటాడు. నీ పాదాలే ఎవరికీ కనపడవు. అటువంటి పాదాలతో తొక్కావు. ఇతను ఎంత తపస్సు చేసాడో. ఎంత మందిని దయతో కాపాడి ధర్మాన్ని ఆచరించాడో
పరమాత్మ నమస్కారాలతో ప్రదక్షిణలతో కానుకలతో తపస్సుతో సంతోషించడు, దీనులను సేవిస్తే ఆర్తులను కాపాడితే సంతోషిస్తాడు. ఇతను ఇంతకు ముందు జన్మలో ఎంత మందిని దయ చూచాడో, అందువలన నీవు అనుగ్రహించావు.

కస్యానుభావోऽస్య న దేవ విద్మహే తవాఙ్ఘ్రిరేణుస్పరశాధికారః
యద్వాఞ్ఛయా శ్రీర్లలనాచరత్తపో విహాయ కామాన్సుచిరం ధృతవ్రతా

మా భర్త ఏమి పుణ్యం చేస్తే ఈ అనుగ్రహం కలిగిందో మాకు అర్థం కావట్లేదు. నీ పాద పరాగం స్పృశించే యోగ్యత లభించింది. ఏ పాద పరాగాన్ని స్పృశించాలన్న కోరికతో లక్ష్మీ దేవి అన్నీ మానుకుని ఘోరమైన తపస్సు చేసింది. అమ్మవారికి కూడా పొందడానికి తపస్సు కావలసి వచ్చింది.అట్టిది నీ పాద పరాగం, అటువంటి దాన్ని పొందిన వీడు చాలా కాలం చాలా గొప్ప తపస్సు చేసి ఉంటాడు

న నాకపృష్ఠం న చ సార్వభౌమం
న పారమేష్ఠ్యం న రసాధిపత్యమ్
న యోగసిద్ధీరపునర్భవం వా
వాఞ్ఛన్తి యత్పాదరజఃప్రపన్నాః

పరమాత్మ పాద పరాగాన్ని ఆశించేవారు దాని కంటే వేరేదాన్ని దేన్నీ కోరదు. స్వర్గాన్నీ, చక్రవర్తిత్వాన్నీ, బ్రహ్మపదవినీ, రసాతలాధిపత్యాన్నీ, యోగ సిద్ధినీ, మోక్షాన్నీ కూడా కోరరు.

తదేష నాథాప దురాపమన్యైస్తమోజనిః క్రోధవశోऽప్యహీశః
సంసారచక్రే భ్రమతః శరీరిణో యదిచ్ఛతః స్యాద్విభవః సమక్షః

తమో జీవీ, కోపానికి లొంగేవాడు ఐన ఇతడు ఇతరులెవరూ పొందలేని నీ పాదపరాగాన్ని పొందగలిగాడు. సంసారములో సంచరించే జీవుడికి పొందేటువంటి భోగాలూ సంతోషాలూ సుఖాలూ  అన్నీ నీ సంకల్పముతోనే లభిస్తాయి. ఇతని శిరసు మీద నీ పాదం పడింది అంటే అది నీ దయే.
(మిమ్ము చేరడానికి నాకంటూ నేను చేసుకున్న పుణ్యం ప్రత్యేకముగా ఏమీ లేదు. నన్ను కాపాడుకోవడానికి నాకుగా నేను ఏర్పరచుకున్న రక్షత్వం లేదు. )

నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే
భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే

సకల భూతములకు నివాసము,నీవే సకల భూత స్వరూపుడవు, నీవే పరుడవూ, పరమాత్మవు, అటువంటి నీకు నమస్కారం.

జ్ఞానవిజ్ఞాననీధయే బ్రహ్మణేऽనన్తశక్తయే
అగుణాయావికారాయ నమస్తే ప్రాకృతాయ చ

ప్రకృతి గుణాలు లేనివాడవు, ప్రకృతిని అతిక్రమించినవాడవు

కాలాయ కాలనాభాయ కాలావయవసాక్షిణే
విశ్వాయ తదుపద్రష్ట్రే తత్కర్త్రే విశ్వహేతవే

కాల స్వరూపుడవు, కాలానికి మధ్య బిందువువు. కాలములో అన్నిటిలో దాగి ఉండి నీవే సాక్షిగా ఉంటావు. సూర్యునిగా అంతర్యామిగా నేత్రముగా శరీరావయములుగా, కాలముగా ఉండి సాక్షిగా ఉంటావు.

భూతమాత్రేన్ద్రియప్రాణ మనోబుద్ధ్యాశయాత్మనే
త్రిగుణేనాభిమానేన గూఢస్వాత్మానుభూతయే

సకల ప్రపంచాన్ని సృష్టించి రక్షించి నాశనం చేసేవాడవు నీవే. పంచభూతాత్మకమైన (పంచ భూతాలు పంచ తన్మాత్రలూ, పంచ జ్ఞ్యాన కర్మేంద్రియములూ మనసూ బుద్ధీ అన్నీ )జగత్తు నీవే.
అంతర్యామిగా ఉండి గుణాలు పెంచుతాడు. అలా పెంచిన గుణముల వలన ఎటువంటి అనుభూతులు కలుగుతున్నాయో చూస్తాడు. పాపములు చేస్తున్నప్పుడూ చూస్తాడు, చేసిన పాపం ఫల రూపములో అనుభవానికి వచ్చినపుడూ చూస్తాడు. మారిన ఫలం అనుభవించేప్పుడూ చూస్తాడు, అనుభవించేప్పుడు ఏమనుకుంటున్నాడో కూడా చూస్తాడు.
గుణ త్రయ అభిమాన అనుభూతి ప్రదాయకుడు స్వామి.

నమోऽనన్తాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే
నానావాదానురోధాయ వాచ్యవాచకశక్తయే

ఇంత చేయించి కూడా ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మ నా హృదయములోనే దాగి ఉన్నాను కదా అని అనుకోడు. పరమాత్మ మాత్రం రహస్యముగా ఉండి, తాను రహస్యముగా ఉన్న అనుభూతిని తానే పొందేవాడు, చూడగలిగిన వారికి సాక్షాత్కరింపచేస్తాడు, చూడలేని వారిని చూచి దరహాసం చేస్తాడు. ఆయనే అనంతుడు సూక్ష్ముడు ఏమాత్రం మార్పు లేని వాడు, అన్నీ తెలిసినవాడు, ఎంత అతీతుడో అంత సులభుడు. ఎవరు ఏది వాదిస్తే అలాగే అంటాడు (నానావాదానురోధాయ).

నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే
ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః

శబ్దమూ తానే అర్థమూ తానే. అన్ని ప్రమాణాలకూ అతనే మూలం.
అతనే కవి. శాస్త్రాలకు మూలం. ప్రవృత్తీ నివృతీ ఆయనే. చేసే పనీ మానే పనీ ఆయనే. వేదములన్నీ ఆయనే

నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః

వసుదేవుని పుత్రుడవైన, రాముడవైన కృష్ణుడవైన నీకు నమస్కారం. అన్ని గుణాలనూ ప్రకాశింపచేసేదీ కప్పి పుచ్చేదీ నీవే.

నమో గుణప్రదీపాయ గుణాత్మచ్ఛాదనాయ చ
గుణవృత్త్యుపలక్ష్యాయ గుణద్రష్ట్రే స్వసంవిదే

గుణప్రదీపుడూ, గుణాలను కప్పిపుచ్చుతాడు. మనం ఆయా గుణాలతో ప్రవర్తిస్తూ ఉండేట్లు చేసేవాడు.
గుణ వృత్తులతో గుర్తించదగిన వాడు.


అవ్యాకృతవిహారాయ సర్వవ్యాకృతసిద్ధయే
హృషీకేశ నమస్తేऽస్తు మునయే మౌనశీలినే

ప్రకృతి అంతా విహరించేవాడు, జరిగే ప్రతీ వికారం నీవు చేసేదే. ఇంద్రియాలకు అధిపతివి నీవు. మౌనశీలివి.

పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః
అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రష్ట్రేऽస్య చ హేతవే

పెద్దవాళ్ళకూ చిన్నవారికీ ఆయనే రక్షణ. ఎవరికి ఎలాంటి ఫలితం ఎప్పుడు ఇవ్వాలో తెలిసినవాడు. ప్రపంచమూ ప్రళయమూ ఆయనే. ఆ ప్రపంచాన్ని చూచేవాడూ, ప్రపంచానికి కారణమూ తానే.

త్వం హ్యస్య జన్మస్థితిసంయమాన్విభో
గుణైరనీహోऽకృతకాలశక్తిధృక్
తత్తత్స్వభావాన్ప్రతిబోధయన్సతః
సమీక్షయామోఘవిహార ఈహసే

ఏ ప్రకృతి గుణాలూ లేకున్నా ఏ కోరికలూ లేకున్నా కాల శక్తి అనుసరించి ప్రపంచహాన్ని సృష్టించి రక్షిస్తావు. ఎవరికి ఏ ఏ స్వాభావాలు ఎపుడెపుడు కలగాలో కలిగిస్తావు. నీ విహారం ఏదీ వ్యర్ధం కాదు

తస్యైవ తేऽమూస్తనవస్త్రిలోక్యాం
శాన్తా అశాన్తా ఉత మూఢయోనయః
శాన్తాః ప్రియాస్తే హ్యధునావితుం సతాం
స్థాతుశ్చ తే ధర్మపరీప్సయేహతః

వీళ్ళందరూ నీ రూపాలే. సాత్విక రాజస తామసులూ మూర్ఖులూ ఉగ్రూ శాంతులూ అందరూ నీ రూపాలే. ఘోరులనూ  మూఢులనూ ఉగ్రులనూ శిక్షించి శాంతులను రక్షించడానికి నీవు వచ్చావు. మన శరీరానికి ప్రమాదకరమైన అంగమును మనమే తొలగించుకుంటాము.

అపరాధః సకృద్భర్త్రా సోఢవ్యః స్వప్రజాకృతః
క్షన్తుమర్హసి శాన్తాత్మన్మూఢస్య త్వామజానతః

యజమానీ ప్రభువూ ఐన వాడూ అప్పుడపుడైనా సేవకులు చేసిన తప్పులను క్షమించాలి. వాడు మూఢుడు, తెలియకవాడు చేసిన తప్పును క్షమించాలి

అనుగృహ్ణీష్వ భగవన్ప్రాణాంస్త్యజతి పన్నగః
స్త్రీణాం నః సాధుశోచ్యానాం పతిః ప్రాణః ప్రదీయతామ్

నీవిలాగే కొంతసేపు ఆటలాడితే అతను ప్రాణాలు కోల్పోతాడు. (మంచి వారి చేత కరుణించబడేవారమైన) స్త్రీలమైన మాకు భర్తే ప్రాణము.

విధేహి తే కిఙ్కరీణామనుష్ఠేయం తవాజ్ఞయా
యచ్ఛ్రద్ధయానుతిష్ఠన్వై ముచ్యతే సర్వతో భయాత్

మేము ఏమి చేయాలో ఆజ్ఞ్యాపించు. ఏ పరమాత్మ ఆజ్ఞ్యను పాలిస్తే అన్ని భయాలూ తొలగిపోతాయో అటువంటి ఆజ్ఞ్య ఇవ్వు

శ్రీశుక ఉవాచ
ఇత్థం స నాగపత్నీభిర్భగవాన్సమభిష్టుతః
మూర్చ్ఛితం భగ్నశిరసం విససర్జాఙ్ఘ్రికుట్టనైః

నాగపత్నుల ప్రార్థన విన్న కృష్ణుడు నాట్యం ఆపేసాడు.

ప్రతిలబ్ధేన్ద్రియప్రాణః కాలియః శనకైర్హరిమ్
కృచ్ఛ్రాత్సముచ్ఛ్వసన్దీనః కృష్ణం ప్రాహ కృతాఞ్జలిః

నాట్యమాపగానే బలం పుంజుకున్న కాళీయుడు స్వామితో చేతులు జోడించి ఇలా అన్నాడు

కాలియ ఉవాచ
వయం ఖలాః సహోత్పత్త్యా తమసా దీర్ఘమన్యవః
స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః

నేను దుర్మార్గుడిని పుట్టుకతోనే, నీ ఆజ్ఞ్య వలనే మాకు తొందరగా కోపం వస్తుంది, చాలా కాలం ఆ కోపం ఉంటుంది.అది నీవు చెప్పినదే. ఎంత గొప్పవారైనా దేన్నైనా విడిచిపెడతారు గానీ స్వభావాన్ని వదిలిపెట్టరు.

త్వయా సృష్టమిదం విశ్వం ధాతర్గుణవిసర్జనమ్
నానాస్వభావవీర్యౌజో యోనిబీజాశయాకృతి

బ్రహ్మ చేత ప్రపంచాన్ని నీవే సృష్టించావు. రకరకాల స్వభావాలూ జాతులూ ప్రవృత్తులూ గుణాలు ఉండేట్లు నీవే సృష్టించావు. పాములమైన మమ్ము సృష్టించావు. గొప్ప కోపంగల మమ్మూ సృష్టించావు.

వయం చ తత్ర భగవన్సర్పా జాత్యురుమన్యవః
కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితాః స్వయమ్

స్వభావం ఏర్పరచిన నీవే ఇపుడు ఆ స్వభావం ఎల వదలమంటున్నావు. ఎలా వదలాలి. నీ మాయచేత మోహించబడుతున్నాము.

భవాన్హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః
అనుగ్రహం నిగ్రహం వా మన్యసే తద్విధేహి నః

ఇలాంటి మా స్వభావానికి కూడా నీవే కారణం. మా కోపం ఇలా ఉంటుంది అని నీకు చెప్పాలా. అది నీవు సృష్టించినదే. నీవే ఈశుడవూ, ప్రభువువూ. అనుగ్రహించినా నిగ్రహించినా అది నీ ఇష్టం.

శ్రీశుక ఉవాచ
ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్కార్యమానుషః
నాత్ర స్థేయం త్వయా సర్ప సముద్రం యాహి మా చిరమ్
స్వజ్ఞాత్యపత్యదారాఢ్యో గోనృభిర్భుజ్యతే నదీ

మానవ శరీరాన్ని ఏర్పరచుకుని వచ్చిన స్వామి, "ఇక్కడ నీవు ఉండవద్దు, సముద్రానికి వెళ్ళు. నీ భార్యా బంధువులను తీసుకుని సముద్రానికి వెళ్ళు, గోవులూ గోపికలూ గోపాలురు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇదంతా వారి భూమి"

య ఏతత్సంస్మరేన్మర్త్యస్తుభ్యం మదనుశాసనమ్
కీర్తయన్నుభయోః సన్ధ్యోర్న యుష్మద్భయమాప్నుయాత్

ప్రాతః కాలం సాయం కాలం నేను నీకు చెప్పిన ఈ ఆజ్ఞ్యను స్మరిస్తే అటువంటి వారికి సర్పముల వలన భయం కలగదు.

యోऽస్మిన్స్నాత్వా మదాక్రీడే దేవాదీంస్తర్పయేజ్జలైః
ఉపోష్య మాం స్మరన్నర్చేత్సర్వపాపైః ప్రముచ్యతే

తరువాత ఎవడైనా ఈ నదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి నా లీలను స్మరించుకుంటే అన్ని పాపాలూ తొలగిపోతాయి

ద్వీపం రమణకం హిత్వా హ్రదమేతముపాశ్రితః
యద్భయాత్స సుపర్ణస్త్వాం నాద్యాన్మత్పాదలాఞ్ఛితమ్

సముద్రములో రమణక ద్వీపన్ని గరుత్మంతుని భయముతో విడిచిపెట్టి వచ్చావు.  ఆ గరుత్మంతుడు నీ  పడగల మీద ఉన్న నా పదముల గుర్తులను చూచి నిన్ను ఏమీ చేయడు

శ్రీఋషిరువాచ
ముక్తో భగవతా రాజన్కృష్ణేనాద్భుతకర్మణా
తం పూజయామాస ముదా నాగపత్న్యశ్చ సాదరమ్

ఇలా చెప్పగా కాళీయుడూ ఆయన భార్యలు స్వామిని పూజించారు. దివ్య మణులూ వస్త్రములూ మాలలూ

దివ్యామ్బరస్రఙ్మణిభిః పరార్ధ్యైరపి భూషణైః
దివ్యగన్ధానులేపైశ్చ మహత్యోత్పలమాలయా

గంధములూ వస్త్రములు మాలలూ మనులూ అర్ఘ్య గంధములూ ఇవన్నీ ఇచ్చి పరమాత్మను పూజించి ప్రసన్నున్ని చేసుకుని

పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజమ్
తతః ప్రీతోऽభ్యనుజ్ఞాతః పరిక్రమ్యాభివన్ద్య తమ్

సకలత్రసుహృత్పుత్రో ద్వీపమబ్ధేర్జగామ హ
తదైవ సామృతజలా యమునా నిర్విషాభవత్
 అనుగ్రహాద్భగవతః క్రీడామానుషరూపిణః

స్వామికి ప్రదక్షిణం చేసి భార్య పిల్లలతో కలసి సముద్రములో ఉన్న రమణుక ద్వీపాన్ని చేరారు. వారు వెళ్ళిన వెంటనే ఆ నదిలో ఉన్న నీరు ఆటగా ఒక మానుష్య రూపం ధరించిన పరమాత్మ అనుగ్రహం వలన అమృతమయం అయ్యింది. 


                                   సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు