Tuesday, April 16, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

                                                   ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
వ్రతం పుంసవనం బ్రహ్మన్భవతా యదుదీరితమ్
తస్య వేదితుమిచ్ఛామి యేన విష్ణుః ప్రసీదతి

దితి పుంసవన వ్రతమాచరించిందీ అన్నారు. ఆ విషయం నాకు చెప్పండి. అది ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తాడని చెప్పరు.

శ్రీశుక ఉవాచ
శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయా
ఆరభేత వ్రతమిదం సార్వకామికమాదితః

మార్గ శీర్ష శుక్ల పాడ్యమి నాడు భర్త అనుమతి పొంది అన్ని కోరికలూ ప్రసాదించే వ్రతం ప్రారంభించాలి.

నిశమ్య మరుతాం జన్మ బ్రాహ్మణాననుమన్త్ర్య చ
స్నాత్వా శుక్లదతీ శుక్లే వసీతాలఙ్కృతామ్బరే
పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్భగవన్తం శ్రియా సహ

మరుత్తుల ఉత్పత్తి కథను వినాలు. బ్రాహ్మణులను పూజించాలి.

అలం తే నిరపేక్షాయ పూర్ణకామ నమోऽస్తు తే
మహావిభూతిపతయే నమః సకలసిద్ధయే

యథా త్వం కృపయా భూత్యా తేజసా మహిమౌజసా
జుష్ట ఈశ గుణైః సర్వైస్తతోऽసి భగవాన్ప్రభుః

విష్ణుపత్ని మహామాయే మహాపురుషలక్షణే
ప్రీయేథా మే మహాభాగే లోకమాతర్నమోऽస్తు తే

తెల్లని పలు వరస కలిగి స్నానం చేయాలి (పళ్ళు తోముకుని స్నానం చేయాలి)
వస్త్రాలూ దంతములూ తెల్లగా ఉండాలి. చక్కగా అలంకరించుకోవాలి. అమ్మవారితో ఉన్న పరమాత్మను పొద్దున్నే ఏమీ చేయకుండా
పూర్ణ కాముడూ నిరపేక్షుడు మహావిభూతి పతి అయిన స్వామికి నమస్కరించాలి. జ్ఞ్యాన శక్త్యాది గుణములు కలిగి నీవెలా ఉన్నావో అందుకే నీవు మాకు ప్రభువు.
విష్ణు పత్నీ మహా మాయా లోక మాతా నాకు ప్రసన్నమవ్వాలి. అని అమ్మను పూజించి.


ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ
మహావిభూతిభిర్బలిముపహరామీతి అనేనాహరహర్మన్త్రేణ
విష్ణోరావాహనార్ఘ్యపాద్యోపస్పర్శనస్నానవాసౌపవీతవిభూషణగన్ధపుష్పధూపదీపోపహారాద్యుపచారాన్సుస్
అమాహితోపాహరేత్

హవిఃశేషం చ జుహుయాదనలే ద్వాదశాహుతీః
ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి

ఈ మంత్రముతో మూడు పూటలా షోడశోపచారాలు సమర్పించి సావధానముతో స్వామిని అర్చించాలి. హవిస్సును అగ్ని హోత్రములో ద్వాదశాహుతులు ఇవ్వాలి ఈ మంత్రముతో.

శ్రియం విష్ణుం చ వరదావాశిషాం ప్రభవావుభౌ
భక్త్యా సమ్పూజయేన్నిత్యం యదీచ్ఛేత్సర్వసమ్పదః

అన్ని సంపదలూ కావాలంటే అమ్మవారితో కలిసి ఉన్న స్వామిని ఆరాధించి భక్తితో నిండిన మనసుతో దండ ప్రణామం గావించి పది సార్లు ఈ మంత్రాన్ని జపించి పరమాత్మ యొక్క స్తోత్రాన్ని పఠించాలి.
"మీరిద్దరూ సకల జగత్తుకూ ప్రభువులూ కారణము. అమ్మవారి ప్రకృతీ, మాయా శక్తి, ఎవ్వరికీ అందేది కాదు, అర్థమయ్యేది కాదు. అలాంటి శక్తికి నీవే పురుషుడవు. అన్ని యజ్ఞ్యములూ పూజలూ క్రియలూ క్రియా ఫలములూ నీవే. దేవి గుణాలను ఆవిష్కరిస్తుంది. నీవా గుణాలను అనుభవిస్తావు.

ప్రణమేద్దణ్డవద్భూమౌ భక్తిప్రహ్వేణ చేతసా
దశవారం జపేన్మన్త్రం తతః స్తోత్రముదీరయేత్

యువాం తు విశ్వస్య విభూ జగతః కారణం పరమ్
ఇయం హి ప్రకృతిః సూక్ష్మా మాయాశక్తిర్దురత్యయా

తస్యా అధీశ్వరః సాక్షాత్త్వమేవ పురుషః పరః
త్వం సర్వయజ్ఞ ఇజ్యేయం క్రియేయం ఫలభుగ్భవాన్

గుణవ్యక్తిరియం దేవీ వ్యఞ్జకో గుణభుగ్భవాన్
త్వం హి సర్వశరీర్యాత్మా శ్రీః శరీరేన్ద్రియాశయాః
నామరూపే భగవతీ ప్రత్యయస్త్వమపాశ్రయః

నీవు అందరి ఆత్మవూ. అమ్మవారు అందరి శరీరమూ ఇంద్రియమూ. మీరే, ఒకరు నామం, ఒకరు రూపం. నీవే నమ్మకం సిద్ధీ. ఎలాగైతే మీరు మూడు లోకాలకూ అధిపతులై అందరికీ వరాలిస్తారో నా ఈ చిన్న కోరికను ప్రసాదించండి.

యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ
తథా మ ఉత్తమశ్లోక సన్తు సత్యా మహాశిషః

ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రియా సహ
తన్నిఃసార్యోపహరణం దత్త్వాచమనమర్చయేత్

తతః స్తువీత స్తోత్రేణ భక్తిప్రహ్వేణ చేతసా
యజ్ఞోచ్ఛిష్టమవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిమ్

పతిం చ పరయా భక్త్యా మహాపురుషచేతసా
ప్రియైస్తైస్తైరుపనమేత్ప్రేమశీలః స్వయం పతిః
బిభృయాత్సర్వకర్మాణి పత్న్యా ఉచ్చావచాని చ

ఈ రీతిలో పరమాత్మను అమ్మవారితో కలిపి స్తోత్రం చేసి పూజా ద్రవ్యాలు సమర్పించి స్వామిని ఆరాధించి, మళ్ళీ స్తోత్రం చేసి, యజ్ఞ్య ఉచ్చిష్టాన్ని వాసన మాత్రమే చూచి, మళ్ళీ మూడవ సారి స్వామిని అర్చించాలి. అదే భక్తితో భర్తను కూడా సేవించాలి. భర్త కూడా ప్రేమను కలిగి ఆమెను ఆదరించాలి. వ్రతం చేస్తున్న సమయములో భర్తకూడా భార్య చేసే పనులని పంచుకోవాలి

కృతమేకతరేణాపి దమ్పత్యోరుభయోరపి
పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిరేతత్సమాహితః


ఇలా ఒకరినొకరు సేవించుకోవాలి. ఇలాంటి వ్రతం చేయడానికి భార్య అసమర్ధురాలైతే ఆమెకు బదులుగా భర్త కూడా ఈ వ్రతన్ని చేయవచ్చు. మొదటి నియమం ఏమిటంటే, ఒక్కసారి వ్రతాన్ని స్వీకరించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో వ్రత విఘ్నం కలగరాదు. బ్రాహ్మణులనూ ముత్తైదువులనూ పుష్పములతో పూజా ద్రవ్యాలతో భక్తితో ఆరాధించి పరమాత్మని కూడా ఆరాధించాలి. పూజ అయిన తరువాత భర్త ఆజ్ఞ్య పరమాత్మ ఆజ్ఞ్య తీసుకుని ప్రసాదాన్ని తీసుకోవాలి. మార్గశిరం నుంచీ మళ్ళీ మార్గశిరం దాకా ఆచరించి కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారు ఝామును స్నానం చేసి ఆచమనం చేసి
కృష్ణున్ని పూజించి  క్షీరాన్నముతో హోమం చేయాలి నెయ్యితో హోమం చేయాలి. పన్నెండు ఆహుతులూ ఇవ్వాలి. భర్తకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని బ్రాహ్మణులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని వారి అనుమతితో భోజనం చేయాలి. ఎంత మంది బ్రాహ్మణులు వచ్చినా అగ్రపీఠం ఆచార్యులకు వేసి తన (మరియూ బంధువుల) వాక్కుని  నియమించుకోవాలి

విష్ణోర్వ్రతమిదం బిభ్రన్న విహన్యాత్కథఞ్చన
విప్రాన్స్త్రియో వీరవతీః స్రగ్గన్ధబలిమణ్డనైః
అర్చేదహరహర్భక్త్యా దేవం నియమమాస్థితా

ఉద్వాస్య దేవం స్వే ధామ్ని తన్నివేదితమగ్రతః
అద్యాదాత్మవిశుద్ధ్యర్థం సర్వకామసమృద్ధయే

ఏతేన పూజావిధినా మాసాన్ద్వాదశ హాయనమ్
నీత్వాథోపరమేత్సాధ్వీ కార్తికే చరమేऽహని

శ్వోభూతేऽప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్
పయఃశృతేన జుహుయాచ్చరుణా సహ సర్పిషా
పాకయజ్ఞవిధానేన ద్వాదశైవాహుతీః పతిః

ఆశిషః శిరసాదాయ ద్విజైః ప్రీతైః సమీరితాః
ప్రణమ్య శిరసా భక్త్యా భుఞ్జీత తదనుజ్ఞయా

ఆచార్యమగ్రతః కృత్వా వాగ్యతః సహ బన్ధుభిః
దద్యాత్పత్న్యై చరోః శేషం సుప్రజాస్త్వం సుసౌభగమ్

అప్పుడు భర్త భార్యకు ఉత్తమ పుత్రుడు కలుగుతాడు అని ఆశీర్వదించాలి.

ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోరభీప్సితార్థం లభతే పుమానిహ
స్త్రీ చైతదాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహమ్

కన్యా చ విన్దేత సమగ్రలక్షణం పతిం త్వవీరా హతకిల్బిషాం గతిమ్
మృతప్రజా జీవసుతా ధనేశ్వరీ సుదుర్భగా సుభగా రూపమగ్ర్యమ్

విన్దేద్విరూపా విరుజా విముచ్యతే య ఆమయావీన్ద్రియకల్యదేహమ్
ఏతత్పఠన్నభ్యుదయే చ కర్మణ్యనన్తతృప్తిః పితృదేవతానామ్

యధావిధిగా దీన్ని ఆచరించి మానవుడు తాను కోరిన దాన్ని పొందుతాడు. పురుషుడు చేస్తే ఉత్తమ సంతానన్నీ భార్య ప్రీతినీ పొందుతారు.  భార్య చేస్తే నిత్య సౌభాగ్యం సౌమంగళ్యం ఉత్తమ సంతానం పొందుతుంది. పెళ్ళి కాని అమ్మాయి చేస్తే తాను కోరుకున్న ఉత్తమ భర్తను పొందుతుంది. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. పాపం బాగా చేసిన వారు చేస్తే పాపం పోతుంది. మృత సంతాన బాధ కలవారు చేస్తే ఆ బాధ తొలగి ఉత్తమ సంతానం కలుగుతుంది. కురూపి కురూపాన్ని పోగొట్టుకుంటుంది.

తుష్టాః ప్రయచ్ఛన్తి సమస్తకామాన్హోమావసానే హుతభుక్శ్రీహరిశ్చ
రాజన్మహన్మరుతాం జన్మ పుణ్యం దితేర్వ్రతం చాభిహితం మహత్తే

రోజం ఉన్నవారు రోగం నుంచీ, చెరసాలలో ఉన్నవారు చెరసాల నుంచీ విడుదల అవుతారు. దీన్ని చేస్తే పాపాత్ములు పాపం పోగొట్టుకుంటారు. వ్రతం చేయలేని వారు ఈ అధ్యాయాన్ని సంవత్సర కాలం చేస్తే పితృ దేవతలు సంతోషించి అన్ని కోరికలూ తీరుస్తారు
హోమం పూర్తి అయ్యాక అగ్నిహోత్రుడూ స్వామీ అమ్మవారూ సంతోషించి అన్ని కోరికలూ తీరుస్తారు.
ఈ పుంసవన వ్రతం దితి వ్రతం మరుత్తుల జన్మా చెప్పాను. ఇది చదివిన వారు అన్ని కోరికలనూ తీర్చుకుంటారు.
దానితో బాటు లక్ష్మీ నారాయణుల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు.

                                                సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment