Sunday, September 29, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                                     ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

సూత ఉవాచ
సంస్తుతో భగవానిత్థం మార్కణ్డేయేన ధీమతా
నారాయణో నరసఖః ప్రీత ఆహ భృగూద్వహమ్

ఇలా స్తోత్రం చేయబడిన పరమాత్మ సంతోషించి

శ్రీభగవానువాచ
భో భో బ్రహ్మర్షివర్యోऽసి సిద్ధ ఆత్మసమాధినా
మయి భక్త్యానపాయిన్యా తపఃస్వాధ్యాయసంయమైః

మహానుభావా నీవు ఆత్మ సమాధి స్థితిఓ సిద్ధుడవయ్యావు
నా యందు భక్తితో, తపస్వాధ్యాయ ఇంద్రియ నిగ్రహాదులతో నీవు సాధించావు

వయం తే పరితుష్టాః స్మ త్వద్బృహద్వ్రతచర్యయా
వరం ప్రతీచ్ఛ భద్రం తే వరదోऽస్మి త్వదీప్సితమ్

మేము సంతోషించాము నీ బ్రహ్మ చర్య వ్రతముతో
వరాన్ని కోరుకో నీకు శుభం కలుగుతుంది. వరములిచ్చేవారందరికీ నేనే అధిపతిని (కంచి వరదరాజస్వామి)

శ్రీఋషిరువాచ
జితం తే దేవదేవేశ ప్రపన్నార్తిహరాచ్యుత
వరేణైతావతాలం నో యద్భవాన్సమదృశ్యత

ఇంకా నాకు వరములెందుకు. దేవ దేవా నీవు ఆశ్రయించిన వారి బాధలను తొలగిస్తావు
నీవు నాకు ఇచ్చిన ఈ వరము చాలు. నీ సాక్షాత్కారమే చాలు.

గృహీత్వాజాదయో యస్య శ్రీమత్పాదాబ్జదర్శనమ్
మనసా యోగపక్వేన స భవాన్మేऽక్షిగోచరః

బ్రహ్మాది దేవతలు కూడా యోగముతో నీ పాద పద్మాలను దర్శించాలని ఎంతో తపిస్తూ ఉంటారు
అలాంటి మీరు నా కన్నులకు కనపడ్డారు

అథాప్యమ్బుజపత్రాక్ష పుణ్యశ్లోకశిఖామణే
ద్రక్ష్యే మాయాం యయా లోకః సపాలో వేద సద్భిదామ్

నాకు ఒక్కసారి నీ మాయను చూడాలని ఉంది. లోకములూ లోకపాలకులూ పోతున్నారూ వస్తున్నారు. ఇది ఎలా జరుగుతుందో చూడాలని ఉంది అని అడుగగా

సూత ఉవాచ
ఇతీడితోऽర్చితః కామమృషిణా భగవాన్మునే
తథేతి స స్మయన్ప్రాగాద్బదర్యాశ్రమమీశ్వరః

అది విని భగవానుడు అలాగే అని బదరికాశ్రమానికి వెళ్ళారు

తమేవ చిన్తయన్నర్థమృషిః స్వాశ్రమ ఏవ సః
వసన్నగ్న్యర్కసోమామ్బు భూవాయువియదాత్మసు

పంచభూతాలనూ వాటి స్వరూపాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ
తాను పరమాత్మను కోరిన వరాన్ని గురించి ఆలోచిస్తూ కొన్నాళ్ళు కాలం గడిపాడు

ధ్యాయన్సర్వత్ర చ హరిం భావద్రవ్యైరపూజయత్
క్వచిత్పూజాం విసస్మార ప్రేమప్రసరసమ్ప్లుతః

పరమాత్మను చూచినందు వలన నిరంతరం ఆ రూపమే కళ్ళముందు కదలాడుతూ
ఆ ప్రేమా ఆ ఆకారమూ తలచుకున్నప్పుడల్లా కళ్ళూ చెమ్మగిలూతూ, సంధ్యావందనం మరచిపోయాడు పూజా స్నానం మరచిపోయాడు

తస్యైకదా భృగుశ్రేష్ఠ పుష్పభద్రాతటే మునేః
ఉపాసీనస్య సన్ధ్యాయాం బ్రహ్మన్వాయురభూన్మహాన్

ఇలా ఉండగా, ఈ ముని పుషభద్రా నదీ తీరములో సంధ్యావందనం చేస్తూ ఉండగా పెద్ద వాయువు వచ్చింది మహాప్రళయముగా

తం చణ్డశబ్దం సముదీరయన్తం బలాహకా అన్వభవన్కరాలాః
అక్షస్థవిష్ఠా ముముచుస్తడిద్భిః స్వనన్త ఉచ్చైరభి వర్షధారాః

దాని వెంటనే పెద్ద పెద్ద మేఘాలూ వచ్చాయి
మెరుపులతో కనులూ అన్ని ఇంద్రియాలూ మిరుమిట్లు గొలిపాయి.
ఉరుముతూ మెరుస్తూ గాలితో బ్రహ్మాండమైన వర్షం కురిసింది

తతో వ్యదృశ్యన్త చతుః సముద్రాః సమన్తతః క్ష్మాతలమాగ్రసన్తః
సమీరవేగోర్మిభిరుగ్రనక్ర మహాభయావర్తగభీరఘోషాః

ఈ ఆశ్రమములోకే నాలుగు సముద్రాలూ వచ్చాయి.
మొత్తం భూమండలాన్ని మింగివేస్తున్నాయి
వాయు వేగముతో తరంగాలు ఉవ్వెత్తున లేస్తూ ఉన్నాయి

అన్తర్బహిశ్చాద్భిరతిద్యుభిః ఖరైః
శతహ్రదాభిరుపతాపితం జగత్
చతుర్విధం వీక్ష్య సహాత్మనా మునిర్
జలాప్లుతాం క్ష్మాం విమనాః సమత్రసత్

ముసళ్ళూ తిమింగలాలతో సుడిగుండాలతో లోపలా వెలుపలా ఎక్కడ చూచినా నీరే
మెరుపులే మేఘాలే
జగత్తు మొత్తం మెరుపులతో ఉరుములతో వణికిపోయింది
ఎక్కడ చూసినా నాలుగు దిక్కులా నీరే. మార్కండేయుని మనసు ఖేధబడి కొద్దిగా భయపడ్డాడు

తస్యైవముద్వీక్షత ఊర్మిభీషణః ప్రభఞ్జనాఘూర్ణితవార్మహార్ణవః
ఆపూర్యమాణో వరషద్భిరమ్బుదైః క్ష్మామప్యధాద్ద్వీపవర్షాద్రిభిః సమమ్

ఇలా ఉండగానే నీరు అంతటా వ్యాపించి ఎత్తూ వంపూ ఏమీ లేకుండా మొత్తం నీటితో సమానమైపోయినిద్

సక్ష్మాన్తరిక్షం సదివం సభాగణం
త్రైలోక్యమాసీత్సహ దిగ్భిరాప్లుతమ్
స ఏక ఏవోర్వరితో మహామునిర్
బభ్రామ విక్షిప్య జటా జడాన్ధవత్

ఆకాశమూ భూమీ స్వర్గమూ నక్షత్రాలూ  మూడు లోకాలూ దిగ్గజాలూ
అంతా జలమే.
ఈ మహాప్రళయముతో భయపడిన మార్కండేయుడు తన జటలను విప్పి అందులో సంచరిస్తున్నాడు ఏమీ గానక.

క్షుత్తృట్పరీతో మకరైస్తిమిఙ్గిలైర్
ఉపద్రుతో వీచినభస్వతాహతః
తమస్యపారే పతితో భ్రమన్దిశో
న వేద ఖం గాం చ పరిశ్రమేషితః

ఆకలీ దప్పీ వేస్తున్నాయి
ముసళ్ళూ తిమింగలాలూ మీదకు వస్తున్నాయి మింగడానికి
పక్కకు పోతే తరంగాలూ వాయువు
ఇంకో దిక్కుకు వెళితే ఉరుములూ మెరుపులూ వస్తున్నాయి
మొత్తం కటిక చీకటి
భూమి ఎక్కడ ఉందో
ఆకాశస్మ్ ఎక్కడ ఉందో తాను ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు

క్రచిన్మగ్నో మహావర్తే తరలైస్తాడితః క్వచిత్
యాదోభిర్భక్ష్యతే క్వాపి స్వయమన్యోన్యఘాతిభిః

ఇలా వెళ్ళి వెళ్ళి తరంగాలచేత కొట్టబడి ఒక పెద్ద సుడిగుండం లోపలకు వెళ్ళాడు
అక్కడ పెద చేపలు చిన చేపలను తింటూ ఉన్నాయి

క్వచిచ్ఛోకం క్వచిన్మోహం క్వచిద్దుఃఖం సుఖం భయమ్
క్వచిన్మృత్యుమవాప్నోతి వ్యాధ్యాదిభిరుతార్దితః

ఒక చోట మోహం ఒక చోట శోకమూ భయమూ దుఃఖమూ మృత్యువూ
కొందరు వ్యాధులతో చస్తున్నారు, కొందరు దుఃఖిస్తున్నారు
కొందరికి జ్వరాలు వస్తున్నాయి. కొందరు ఏడుస్తున్నారు మొత్తుకుంటున్నారు,
కొందరు చస్తున్నారు కొందరు పుడుతున్నారు

అయుతాయతవర్షాణాం సహస్రాణి శతాని చ
వ్యతీయుర్భ్రమతస్తస్మిన్విష్ణుమాయావృతాత్మనః

ఇలా మొత్తం ఒక పది లక్షల సంవత్సరాలు తిరిగుతూనే ఉన్నాడు భగవంతుని మాయతో

స కదాచిద్భ్రమంస్తస్మిన్పృథివ్యాః కకుది ద్విజః
న్యాగ్రోధపోతం దదృశే ఫలపల్లవశోభితమ్

ఇలా తిరుగుతూ ఉండగా ఒక గడ్డ కనపడింది. దాని మీద ఒక చిన్న మఱ్ఱి చెట్టు కనపడింది
దానికి మఱ్ఱి కాయలూ పళ్ళూ చిగురుటాకులూ ఆకులూ అన్నీ ఉన్నాయి

ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుమ్
శయానం పర్ణపుటకే గ్రసన్తం ప్రభయా తమః

ఆ చెట్టుకు ఈశాన్య శాఖ యందు ఒక చిన్న పిల్లవాడిని చూచాడు
మఱ్ఱి ఆకు యొక్క పుట భాగం యందు పడుకుని తన కాంతితో మొత్తం చీకటిని మింగివేస్తున్నాడు

మహామరకతశ్యామం శ్రీమద్వదనపఙ్కజమ్
కమ్బుగ్రీవం మహోరస్కం సునసం సున్దరభ్రువమ్

శ్వాసైజదలకాభాతం కమ్బుశ్రీకర్ణదాడిమమ్
విద్రుమాధరభాసేషచ్ ఛోణాయితసుధాస్మితమ్

పద్మగర్భారుణాపాఙ్గం హృద్యహాసావలోకనమ్
శ్వాసైజద్వలిసంవిగ్న నిమ్ననాభిదలోదరమ్

పగడం వంటి పెదవుల కాంతి పళ్ళ మీద పడి చిరునవ్వు ఎర్రగా ప్రకాశిస్తోంది.
ఆయన నవ్వూ చూపూ హృద్యముగా ఉన్నాయి

చార్వఙ్గులిభ్యాం పాణిభ్యామున్నీయ చరణామ్బుజమ్
ముఖే నిధాయ విప్రేన్ద్రో ధయన్తం వీక్ష్య విస్మితః

ఆ స్వామి పరమ సుకుమారమైన తన వేళ్ళతో తన పాదపద్మాన్ని తీసుకుని నోటిలో పెట్టుక్ని బొటన వేలుని ఆస్వాదిస్తున్నాడు
ఆ స్వామిని చూచి మార్కండేయుడు ఆశ్చర్యపోయి

తద్దర్శనాద్వీతపరిశ్రమో ముదా ప్రోత్ఫుల్లహృత్పౌల్మవిలోచనామ్బుజః
ప్రహృష్టరోమాద్భుతభావశఙ్కితః ప్రష్టుం పురస్తం ప్రససార బాలకమ్

మొత్తం అలసట పోయింది
సంతోషముతో హృదయమూ కనులూ వికసించాయి.
ఇంత చిన్న చెట్టుకు,ఇంత చిన్న ఆకు మీద చిన్న పిల్లవాడా, ఆయనకు ఈ ఆభరణాలా

తావచ్ఛిశోర్వై శ్వసితేన భార్గవః
సోऽన్తః శరీరం మశకో యథావిశత్
తత్రాప్యదో న్యస్తమచష్ట కృత్స్నశో
యథా పురాముహ్యదతీవ విస్మితః

ఈ పిల్లవాడెవరు అని అడుగుదామని దగ్గరకు వెళ్ళగా
ఆ పిల్లవాడు ఉచ్చ్వాస తీసుకున్నాడు
వెంటనే గాలి పీల్చుకుంటే దోమ నోటిలోకి వెళ్ళినట్లుగా పరమాత్మ గాలి పీల్చుకోగానే మార్కండేయుడు లోపలకు వెళ్ళాడు
అక్కడకు వెళ్ళగా తాను అంతకు ముందు వేటి  వేటిని చూచాడో, మునిగిపోయినవీ, కనపడకుండా పోయినవి నశించనివీ నశించినవీ చూచి ఆశ్చర్యపోయాడు

ఖం రోదసీ భాగణానద్రిసాగరాన్ద్వీపాన్సవర్షాన్కకుభః సురాసురాన్
వనాని దేశాన్సరితః పురాకరాన్ఖేటాన్వ్రజానాశ్రమవర్ణవృత్తయః

ఆకాశమూ దిక్కులూ అంతరిక్షమూ భూమీ స్వర్గమూ నక్షత్రాలూ సముద్రాలూ ద్వీపములూ పర్వతాలూ నదులూ దిక్కులూ దేవతలూ రాక్షసులూ అడవులూ దేశములూ పురములూ వ్ర్జములూ పల్లెలూ పట్టణములూ ఆశ్రమాలూ మహాభూతాలూ కాలమూ

మహాన్తి భూతాన్యథ భౌతికాన్యసౌ కాలం చ నానాయుగకల్పకల్పనమ్
యత్కిఞ్చిదన్యద్వ్యవహారకారణం దదర్శ విశ్వం సదివావభాసితమ్

మనం ప్రపంచములో వేటి వేటిని వ్యవహరిస్తామో అది మొత్తం ఉన్నట్టే కనపడింది
అది చూచి

హిమాలయం పుష్పవహాం చ తాం నదీం నిజాశ్రమం యత్ర ఋషీ అపశ్యత
విశ్వం విపశ్యఞ్ఛ్వసితాచ్ఛిశోర్వై బహిర్నిరస్తో న్యపతల్లయాబ్ధౌ

అందులో హిమాలయాన్నీ, తను ఉన్న నదీ తన ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న ఋషులనూ చూచాడు
అవి అన్నీ చూచి ఆశ్చర్యముతో ఇదేమిటా అనుకుంటూ ఉంటే స్వామి మళ్ళీ శ్వాస తీయగా బయటకు వచ్చి ప్రళయ సాగరములో పడ్డాడు

తస్మిన్పృథివ్యాః కకుది ప్రరూఢం వటం చ తత్పర్ణపుటే శయానమ్
తోకం చ తత్ప్రేమసుధాస్మితేన నిరీక్షితోऽపాఙ్గనిరీక్షణేన

మళ్ళీ బయటకు వచ్చి చెట్టూ ఆకూ పిల్లవాడు ఆయన నవ్వునీ చూచాడు
ఈయనను ఆ పిల్లవాడు (స్వామి) చూచాడు

అథ తం బాలకం వీక్ష్య నేత్రాభ్యాం ధిష్ఠితం హృది
అభ్యయాదతిసఙ్క్లిష్టః పరిష్వక్తుమధోక్షజమ్

పిల్లవాడు ముద్దుగా ఉండడముతో కౌగిలించుకుందామని దగ్గరకు వచ్చాడు

తావత్స భగవాన్సాక్షాద్యోగాధీశో గుహాశయః
అన్తర్దధ ఋషేః సద్యో యథేహానీశనిర్మితా

అంతలోనే స్వామి అంతర్ధానమయ్యాడు
సామర్ధ్యం లేని వారు పెంచుకున్న ఆశలాగ అంతర్ధానమయ్యాడు పరమాత్మ

తమన్వథ వటో బ్రహ్మన్సలిలం లోకసమ్ప్లవః
తిరోధాయి క్షణాదస్య స్వాశ్రమే పూర్వవత్స్థితః

పరమాత్మ అంతర్ధానమవ్వగానే సముద్రమూ తుఫానూ గాలీ భూతాలూ ఏదీ లేక మళ్ళీ తాను తన ఆశ్రమ నదీ తీరములో సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

                                                     ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీశౌనక ఉవాచ
సూత జీవ చిరం సాధో వద నో వదతాం వర
తమస్యపారే భ్రమతాం నౄణాం త్వం పారదర్శనః

సూతా, నీవు చాలా కాలం జీవించి ఉండుగాక.
అజ్ఞ్యానమనే మహా అంధకారములో సంచరించే మానవులకు వెలుగు చూపే వాడవు

ఆహుశ్చిరాయుషమృషిం మృకణ్డుతనయం జనాః
యః కల్పాన్తే హ్యుర్వరితో యేన గ్రస్తమిదం జగత్

నీవు మార్కండేయుని గురించి చెప్పావు
ఆయన చిరంజీవి అని లోకాలన్నీ చెప్పుకుంటున్నాయి

స వా అస్మత్కులోత్పన్నః కల్పేऽస్మిన్భార్గవర్షభః
నైవాధునాపి భూతానాం సమ్ప్లవః కోऽపి జాయతే

ప్రళయకాల చివరలో కూడా ఈయన ఉన్నాడట. స్వామే ఈయనను మింగివేసాడట
ఈయన మా కులం వాడు. ఆయన గొప్ప తనాన్ని మేము కూడా వినాలనుకుంటున్నాము
ప్రళయాన్ని చూచాడు ప్రళయ కాలములో స్వామి చేత మింగబడి, తరువాత బయటకు వచ్చాడు అని చెప్పుకుంటున్నారు

ఏక ఏవార్ణవే భ్రామ్యన్దదర్శ పురుషం కిల
వటపత్రపుటే తోకం శయానం త్వేకమద్భుతమ్

మాకు తెలియకుండా ఈ ప్రళయం ఎలా వచ్చింది
ఏకార్ణవములో తిరుగుతూ ఉన్న ఈ మహాత్ముడు పరమాత్మను చూచాడట
సముద్రములో వటపత్రం మీద ఒంటిగా పడుకున్న పరమాత్మను చూచాడట
మా ఈ సందేహాన్ని తొలగించవలసింది

ఏష నః సంశయో భూయాన్సూత కౌతూహలం యతః
తం నశ్ఛిన్ధి మహాయోగిన్పురాణేష్వపి సమ్మతః

సూత ఉవాచ
ప్రశ్నస్త్వయా మహర్షేऽయం కృతో లోకభ్రమాపహః
నారాయణకథా యత్ర గీతా కలిమలాపహా

లోకుల భ్రమ పోగొట్టడానికి చాలా చక్కని ప్రశ్న వేశావు. ఇది నారాయణ కథ, కలి పాపాలను పోగొడుతుంది

ప్రాప్తద్విజాతిసంస్కారో మార్కణ్డేయః పితుః క్రమాత్
ఛన్దాంస్యధీత్య ధర్మేణ తపఃస్వాధ్యాయసంయుతః

ఈయన తండ్రిగారి దగ్గరనుండి వరుసలో ఉపనయనాదులన్నీ చేసుకుని
వేదములు ధర్మముగా చదువుకుని

బృహద్వ్రతధరః శాన్తో జటిలో వల్కలామ్బరః
బిభ్రత్కమణ్డలుం దణ్డముపవీతం సమేఖలమ్

బృహద్వ్రతం (బ్రహ్మచర్యవ్రతము) తీసుకుని జటలు ధరించి వల్కలు ధరించి

కృష్ణాజినం సాక్షసూత్రం కుశాంశ్చ నియమర్ద్ధయే
అగ్న్యర్కగురువిప్రాత్మస్వర్చయన్సన్ధ్యయోర్హరిమ్

రెండు సంధ్యలలో పరమాత్మను అగ్ని అర్క గురు విప్ర ఆత్మ స్వరూపులుగా పూజిస్తూ

సాయం ప్రాతః స గురవే భైక్ష్యమాహృత్య వాగ్యతః
బుభుజే గుర్వనుజ్ఞాతః సకృన్నో చేదుపోషితః

సాయం ప్రాతః కాలలో భిక్షాటన చేసి గురువుగారికి అర్పిస్తూ ఆయన అనుజ్ఞ్య ఇస్తే రోజుకు ఒక్క సారి భుజించేవాడు

ఏవం తపఃస్వాధ్యాయపరో వర్షాణామయుతాయుతమ్
ఆరాధయన్హృషీకేశం జిగ్యే మృత్యుం సుదుర్జయమ్

ఇలా తపస్వాధ్యాయ పరుడై పదివేల సంవత్సరాలు గురువును సేవిస్తూ పరమాత్మను ఆరాధిస్తూ జయింపరాని మృత్యువును కూడా గెలిచాడు

బ్రహ్మా భృగుర్భవో దక్షో బ్రహ్మపుత్రాశ్చ యేऽపరే
నృదేవపితృభూతాని తేనాసన్నతివిస్మితాః

బ్రహ్మా బృగు శంకరులూ దక్షాదులు ఈ మార్కండేయుని తపశ్శక్తిని చూచి అత్యాశ్చర్యపడ్డారు

ఇత్థం బృహద్వ్రతధరస్తపఃస్వాధ్యాయసంయమైః
దధ్యావధోక్షజం యోగీ ధ్వస్తక్లేశాన్తరాత్మనా

బ్రహ్మచర్యముతో తపస్వాధ్యాయముతో పరమాత్మను శ్రీమన్నారాయణున్ని హృదయములో నిలుపుకున్నాడు

తస్యైవం యుఞ్జతశ్చిత్తం మహాయోగేన యోగినః
వ్యతీయాయ మహాన్కాలో మన్వన్తరషడాత్మకః

ఇలా ఆరు మన్వంతర కాలాలు ఉన్నాడు మార్కండేయుడు. ఇంత కాలం స్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు

ఏతత్పురన్దరో జ్ఞాత్వా సప్తమేऽస్మిన్కిలాన్తరే
తపోవిశఙ్కితో బ్రహ్మన్నారేభే తద్విఘాతనమ్

ఈ విషయాన్ని సప్తమ మన్వంతరములో ఇంద్రుడు తెలుసుకుని
ఈయన చేస్తున్న తపస్సు వలన మా లోకానికి ప్రమాదం రవొచ్చు అని విఘ్నాలు కల్పించడం ప్రారంభించాడు

గన్ధర్వాప్సరసః కామం వసన్తమలయానిలౌ
మునయే ప్రేషయామాస రజస్తోకమదౌ తథా

గంధర్వులూ అప్సరసలూ మలయానిలం వసంతుడూ మొదలైన వారు, రజస్సునూ మదాన్నీ తమస్సునూ పెంచేవారిని పంపాడు

తే వై తదాశ్రమం జగ్ముర్హిమాద్రేః పార్శ్వ ఉత్తరే
పుష్పభద్రా నదీ యత్ర చిత్రాఖ్యా చ శిలా విభో

వారు అక్కడ ఆశ్రమానికి వెళ్ళారు

తదాశ్రమపదం పుణ్యం పుణ్యద్రుమలతాఞ్చితమ్
పుణ్యద్విజకులాకీఋనం పుణ్యామలజలాశయమ్

పవిత్రమైన ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆయన తపస్సు విఘ్నం కలిగించడానికి ప్రయత్నించారు
వసంత ఋతువు ప్రతీ చెట్టుకూ ప్రతీ కొమ్మకూ పూలు పూస్తూ కోకిల తన కూతలతో మయూరము నాట్యముతో గంధర్వులు గానముతో మన్మధుడు బాణాన్ని ఎక్కుపెట్టాడు

మత్తభ్రమరసఙ్గీతం మత్తకోకిలకూజితమ్
మత్తబర్హినటాటోపం మత్తద్విజకులాకులమ్

వాయుః ప్రవిష్ట ఆదాయ హిమనిర్ఝరశీకరాన్
సుమనోభిః పరిష్వక్తో వవావుత్తమ్భయన్స్మరమ్

ఉద్యచ్చన్ద్రనిశావక్త్రః ప్రవాలస్తబకాలిభిః
గోపద్రుమలతాజాలైస్తత్రాసీత్కుసుమాకరః

అన్వీయమానో గన్ధర్వైర్గీతవాదిత్రయూథకైః
అదృశ్యతాత్తచాపేషుః స్వఃస్త్రీయూథపతిః స్మరః

హుత్వాగ్నిం సముపాసీనం దదృశుః శక్రకిఙ్కరాః
మీలితాక్షం దురాధర్షం మూర్తిమన్తమివానలమ్

అగ్నిని ఉపాసించే మార్కండేయున్ని చూచారు.
రూపుదాల్చిన అగ్నిహోత్రం వంటి ఆయనను చూచి

ననృతుస్తస్య పురతః స్త్రియోऽథో గాయకా జగుః
మృదఙ్గవీణాపణవైర్వాద్యం చక్రుర్మనోరమమ్

ఆయన ముందర స్త్రీలు నాట్యమూ గాయకులు గానమూ
మృదంగాలూ వీణా నాదాలు చేసారు
మన్మధుడు అస్త్రాన్ని సంధించాడు

సన్దధేऽస్త్రం స్వధనుషి కామః పఞ్చముఖం తదా
మధుర్మనో రజస్తోక ఇన్ద్రభృత్యా వ్యకమ్పయన్

క్రీడన్త్యాః పుఞ్జికస్థల్యాః కన్దుకైః స్తనగౌరవాత్
భృశముద్విగ్నమధ్యాయాః కేశవిస్రంసితస్రజః

పుంజకస్థలి అనే అప్సరస స్త్రీ ఉంది అక్కడ
మన్మధుడు తన బాణాన్నీ ప్రయోగించాడు

ఇతస్తతో భ్రమద్దృష్టేశ్చలన్త్యా అను కన్దుకమ్
వాయుర్జహార తద్వాసః సూక్ష్మం త్రుటితమేఖలమ్

విససర్జ తదా బాణం మత్వా తం స్వజితం స్మరః
సర్వం తత్రాభవన్మోఘమనీశస్య యథోద్యమః

కానీ ఆయన కనులు తెరవనే లేదు వారిని చూడనే లేదు

త ఇత్థమపకుర్వన్తో మునేస్తత్తేజసా మునే
దహ్యమానా నివవృతుః ప్రబోధ్యాహిమివార్భకాః

వీరి ప్రయత్నం వ్యర్థమయిపోయింది
ఇంత చేసినా ఆయనకు వీరి మీద కోపం కూడా రాలేదు
ఆయన తపస్సు యొక్క తేజస్సు వేడిని భరించలేక పాముని లేపిన పసిపిల్లల్లాగ పారిపోయారు

ఇతీన్ద్రానుచరైర్బ్రహ్మన్ధర్షితోऽపి మహామునిః
యన్నాగాదహమో భావం న తచ్చిత్రం మహత్సు హి

దృష్ట్వా నిస్తేజసం కామం సగణం భగవాన్స్వరాట్
శ్రుత్వానుభావం బ్రహ్మర్షేర్విస్మయం సమగాత్పరమ్

మన్మధుడు నిస్తేజుడయ్యాడు
ఆయన ప్రభావాన్ని చూచి ఆశ్చర్యపోయారు

తస్యైవం యుఞ్జతశ్చిత్తం తపఃస్వాధ్యాయసంయమైః
అనుగ్రహాయావిరాసీన్నరనారాయణో హరిః

ఈయన చూపిన తపశ్శక్తీ ఇంద్రియ నిగ్రహాన్ని చూచి నర నారాయణులు వచ్చారు అక్కడకి

తౌ శుక్లకృష్ణౌ నవకఞ్జలోచనౌ
చతుర్భుజౌ రౌరవవల్కలామ్బరౌ
పవిత్రపాణీ ఉపవీతకం త్రివృత్
కమణ్డలుం దణ్డమృజుం చ వైణవమ్

అలా నలుపూ తెలుపూ మిశ్రమమైన నారాయణున్నీ నరున్నీ చూచి
పద్మాలవంటి కనులతో ఉన్నారు, నాలుగు భుజాలతో
కమండలమూ దండమూ జపమాలనూ తీసుకుని

పద్మాక్షమాలాముత జన్తుమార్జనం
వేదం చ సాక్షాత్తప ఏవ రూపిణౌ
తపత్తడిద్వర్ణపిశఙ్గరోచిషా
ప్రాంశూ దధానౌ విబుధర్షభార్చితౌ

వేదమూ తపస్సే రూపు దాల్చినట్లుగా ఉన్నారు.

తే వై భగవతో రూపే నరనారాయణావృషీ
దృష్ట్వోత్థాయాదరేణోచ్చైర్ననామాఙ్గేన దణ్డవత్

ఈ ఇద్దరినీ చూచి సంతోషముతో ఆశ్చర్యముతో లేచి దండములాగ పడి నమస్కరించాడు

స తత్సన్దర్శనానన్ద నిర్వృతాత్మేన్ద్రియాశయః
హృష్టరోమాశ్రుపూర్ణాక్షో న సేహే తావుదీక్షితుమ్

పరమాత్మ దర్శనముతో మనసుకూ ఇంద్రియాలకూ  తృప్తి కలగడముతో
ఆనంద బాష్పములు కనులలో నిండి ఎదురుగా ఉన్న వారిని సరిగా చూడలేకపోయాడు

ఉత్థాయ ప్రాఞ్జలిః ప్రహ్వ ఔత్సుక్యాదాశ్లిషన్నివ
నమో నమ ఇతీశానౌ బభాశే గద్గదాక్షరమ్

ఉత్సాహముగా వార్ని ఆలింగనం చేసుకున్నట్లుగా నమో నమః అంటూ మాటలు పెగలక ఉన్నాడు

తయోరాసనమాదాయ పాదయోరవనిజ్య చ
అర్హణేనానులేపేన ధూపమాల్యైరపూజయత్

వారికి ఆసనాన్నిచ్చి  పాద్యమూ అర్ఘ్యమూ ధూపమూ దీపమూ మాల్యములూ ఇలా పదుహారు ఉపచారాలు సక్రమముగా జరిపి

సుఖమాసనమాసీనౌ ప్రసాదాభిముఖౌ మునీ
పునరానమ్య పాదాభ్యాం గరిష్ఠావిదమబ్రవీత్

అనుగ్రహముతో ఉన్నవారిరువురినీ చూచి మళ్ళీ స్తోత్రం చేస్తున్నాడు

శ్రీమార్కణ్డేయ ఉవాచ
కిం వర్ణయే తవ విభో యదుదీరితోऽసుః
సంస్పన్దతే తమను వాఙ్మనైన్ద్రియాణి
స్పన్దన్తి వై తనుభృతామజశర్వయోశ్చ
స్వస్యాప్యథాపి భజతామసి భావబన్ధుః

మీ గురించి ఏమని వర్ణించాలి.
సకల జీవుల ప్రాణములూ వాక్కు మనసు ఇంద్రియములు నీ సంకల్పముతోనే పని చేస్తాయి, బ్రహ్మ రుద్రులకు కూడా.
ఐనా ఇంత గొప్ప వాడవైనా నిన్ను సేవించేవారికి నీవు బంధువు

మూర్తీ ఇమే భగవతో భగవంస్త్రిలోక్యాః
క్షేమాయ తాపవిరమాయ చ మృత్యుజిత్యై
నానా బిభర్ష్యవితుమన్యతనూర్యథేదం
సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః

స్వామీ, మీ ఈ రెండు రూపాలూ మూడు లోకముల తాపాన్ని పోగొట్టి క్షేమాన్ని అందించడానికి మృత్యువును జయించడానికి
సకల లోకాలను కాపాడడానికి ఇవే కాక చాలా రూపలను ధరిస్తూ ఉన్నావు
సాలెపురుగు ఎలా సృష్టించి మళ్ళీ మింగుతుందో నీవు జగత్తును సృష్టించి మరలా సంహరిస్తూ ఉన్నావు

తస్యావితుః స్థిరచరేశితురఙ్ఘ్రిమూలం
యత్స్థం న కర్మగుణకాలరజః స్పృశన్తి
యద్వై స్తువన్తి నినమన్తి యజన్త్యభీక్ష్ణం
ధ్యాయన్తి వేదహృదయా మునయస్తదాప్త్యై

ఇలా స్థావర జంగమాధిపతి ఐన నీ పాదపద్మములను,
కర్మ కాలముల గుణముల మురికి ఎక్కడ ఉంటే స్పృశించవో
వాటిని వేదముల యందే మనసు ఉన్న మునులు స్తోత్రం చేస్తారు నమస్కారం చేస్తారు, మాటి మాటికీ పూజిస్తారు ధ్యానం చేస్తారు

నాన్యం తవాఙ్ఘ్ర్యుపనయాదపవర్గమూర్తేః
క్షేమం జనస్య పరితోభియ ఈశ విద్మః
బ్రహ్మా బిభేత్యలమతో ద్విపరార్ధధిష్ణ్యః
కాలస్య తే కిముత తత్కృతభౌతికానామ్

అన్ని వైపులా భయం ఆవరించి ఉన్న జీవునికి
నీ పాదపద్మాల చేరిక కంటే వేరే అభయాన్ని మేము తెలియము
సంసార తాప తప్తులకు భయాన్ని తొలగించేవి నీ పాదములే
ద్విపరార్థ కాల ఆయుష్యమున్న బ్రహ్మ కూడా కాలానికి భయపడుతూ ఉంటాడు
అలాంటపుడు బ్రహ్మ చేత సృష్టించబడిన వారు భయపడతారని వేరేగా చెప్పాలా

తద్వై భజామ్యృతధియస్తవ పాదమూలం
హిత్వేదమాత్మచ్ఛది చాత్మగురోః పరస్య
దేహాద్యపార్థమసదన్త్యమభిజ్ఞమాత్రం
విన్దేత తే తర్హి సర్వమనీషితార్థమ్

కాబట్టి ఉత్త్తమ భక్తి కలవారమై నీ పాద మూలాన్ని భజిస్తాము
శరీరము ఇంద్రియాలూ అన్నీ జీవుడు అందులో ఉన్నాడు అని చెప్పడానికి ఒక గుర్తు  మాత్రమే
అలాంటి ఆవరణలను విడిచిపెట్టి నీ పాదాలను సేవిస్తేనే అనుకున్నవన్నీ పొందగలడు

సత్త్వం రజస్తమ ఇతీశ తవాత్మబన్ధో
మాయామయాః స్థితిలయోదయహేతవోऽస్య
లీలా ధృతా యదపి సత్త్వమయీ ప్రశాన్త్యై
నాన్యే నృణాం వ్యసనమోహభియశ్చ యాభ్యామ్

నీ మాయతో వచ్చిన మూడు గుణాలు సృష్టి స్థితి సంహారాలను కలిగిస్తాయి
నీవే సత్వ రూపాన్ని ప్రశాంతి కోసం ధరిస్తావు. రజస్తమస్సుల వలన వ్యసన మోహాలు కలుగుతాయి. నీ దర్శనముతో అవి అన్నీ తొలగుతాయి

తస్మాత్తవేహ భగవన్నథ తావకానాం
శుక్లాం తనుం స్వదయితాం కుశలా భజన్తి
యత్సాత్వతాః పురుషరూపముశన్తి సత్త్వం
లోకో యతోऽభయముతాత్మసుఖం న చాన్యత్

నీ సత్వ రూపాన్ని ఉపాసించేవారికి ఏ భయమూ ఉండదు

తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే
విశ్వాయ విశ్వగురవే పరదైవతాయ
నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ
హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ

అటువంటి పరమాత్మకు నమస్కారము
నీవే ప్రపంచము, ప్రపంచానికి గురువూ
నీవే పరదేవతవు.
నరునికీ నారాయణునికీ నమస్కారం
మీరే హంసలు. మీరే మౌన స్వరూపులు
మీరే నిగమేశ్వరులు వేదాధిపతులు
అటువంటి మీకు నమస్కారం

యం వై న వేద వితథాక్షపథైర్భ్రమద్ధీః
సన్తం స్వకేష్వసుషు హృద్యపి దృక్పథేషు
తన్మాయయావృతమతిః స ఉ ఏవ సాక్షాద్
ఆద్యస్తవాఖిలగురోరుపసాద్య వేదమ్

రకరకముల ఇంద్రియముల మార్గములతో భ్రమ పడే వారు మీ స్వరూపాన్ని తెలుసుకోలేరు
నీవు మా హృదయాలలో ఇంద్రియాలలో ప్రాణాలలో మనసులో ఉన్నావు
ఐనా నిన్ను మేము తెలుసుకోలేకపోతున్నాము
నీ మాయ చేత మా అందరి బుద్ధీ కప్పబడుతూ ఉన్నది.
వేదానికి బ్రహ్మకు అందించినవాడవు
వేదాన్ని కాపాడినవాడవు

యద్దర్శనం నిగమ ఆత్మరహఃప్రకాశం
ముహ్యన్తి యత్ర కవయోऽజపరా యతన్తః
తం సర్వవాదవిషయప్రతిరూపశీలం
వన్దే మహాపురుషమాత్మనిగూఢబోధమ్

పరమాత్మను దర్శించుకుంటే వేదములు ఆత్మస్వరూపమూ స్పష్టముగా తెలుస్తాయి
ఇలాంటి నిన్ను తెలుసుకోవడానికి బ్రహ్మాది దేవతలు ప్రయత్నం చేస్తూ కూడా మోహాన్ని చెందుతారు
ఇటువంటి మహా పురుషున్ని, పరమ రహస్యమైన ఆత్మ స్వరూప ప్రకాశకునికి నమస్కరిస్తున్నాను అని మార్కండేయుడు శ్రీమన్నారాయణున్ని స్తోత్రం చేసాడు

                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                            సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఏడవ అధ్యాయం

                                                 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఏడవ అధ్యాయం

ఈ శాఖలూ ఇవి చదువుకున్న వారి గురించీ చదువుకుంటే అన్ని పాపాలు పోతాయి

సూత ఉవాచ
అథర్వవిత్సుమన్తుశ్చ శిష్యమధ్యాపయత్స్వకామ్
సంహితాం సోऽపి పథ్యాయ వేదదర్శాయ చోక్తవాన్

అధర్వ వేదాన్ని సుమతుడు తన శిష్యులకు బోధించాడు.
అతను వేద దర్శునికీ ,

శౌక్లాయనిర్బ్రహ్మబలిర్మోదోషః పిప్పలాయనిః
వేదదర్శస్య శిష్యాస్తే పథ్యశిష్యానథో శృణు
కుముదః శునకో బ్రహ్మన్జాజలిశ్చాప్యథర్వవిత్

అతను శౌక్లాయనునికీ, అతను బ్రహ్మబలికీ, పిప్పలాయునికీ, ఇలా మొదలైనవారందరూ అధర్వ వేదాన్ని చదువుకున్నారు
కుముద, శునక జాజలి అధర్వణ వేదాన్ని నేర్చుకున్నారు.

బభ్రుః శిష్యోऽథాన్గిరసః సైన్ధవాయన ఏవ చ
అధీయేతాం సంహితే ద్వే సావర్ణాద్యాస్తథాపరే

అంగీరసుని శిష్యుడు బభ్రు, ఆయన శిష్యుడు సైంధవాయనుడు
వారు రెండు సంహితలను నేర్చుకున్నారు

నక్షత్రకల్పః శాన్తిశ్చ కశ్యపాఙ్గిరసాదయః
ఏతే ఆథర్వణాచార్యాః శృణు పౌరాణికాన్మునే

నక్షత్ర కల్పా, శాంతి, కశ్యప అంగీరసాదులు అధర్వవేదానికి ఆచార్యులు
ఇంక పురాణాల గురించి విను.

త్రయ్యారుణిః కశ్యపశ్చ సావర్ణిరకృతవ్రనః
వైశమ్పాయనహారీతౌ షడ్వై పౌరాణికా ఇమే

అధీయన్త వ్యాసశిష్యాత్సంహితాం మత్పితుర్ముఖాత్
ఏకైకామహమేతేషాం శిష్యః సర్వాః సమధ్యగామ్


మా తండ్రి గారైన ఉగ్రస్రవుడు వ్యాసుని నుంచి నేర్చుకుంటే నేను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను.

కశ్యపోऽహం చ సావర్ణీ రామశిష్యోऽకృతవ్రనః
అధీమహి వ్యాసశిష్యాచ్చత్వారో మూలసంహితాః

నేనూ కశ్యపుడూ సావర్ణీ, పరశురామ శిష్యుడైన అకృతవ్రనుడు చదువుకున్నాను
నాలుగు సంహితలనూ అధ్యయనం చేసాము

పురాణలక్షణం బ్రహ్మన్బ్రహ్మర్షిభిర్నిరూపితమ్
శృణుష్వ బుద్ధిమాశ్రిత్య వేదశాస్త్రానుసారతః

బ్రహ్మఋషులు పురాణ లక్షణాలేమిటో బాగా చెప్పారు
వేదశాస్త్రానుసారమైన పురాణం గురించి చెబుతున్నాను వినండి

సర్గోऽస్యాథ విసర్గశ్చ వృత్తిరక్షాన్తరాణి చ
వంశో వంశానుచరీతం సంస్థా హేతురపాశ్రయః

సర్గశ్చ, ప్రతి సర్గశ్చ వంశో మన్వంత రాణి చ, వంశాను చరితం చేతి పురాణం పంచ లక్షణం' అను అయిదు ముఖ్య విషయాలు పురాణంలో చెప్పబడి యున్నవి.
సర్గము అంటే సృష్టి
విసర్గము అంటే ప్రళయం
వృత్తి, రక్షణా, వంశమూ వంశాను చరితము, సంస్థా హేతువు అపాశ్రయం.
ఐదు కాకుండా మరో ఐదు ఉంటాయి మహాపురాణానికి

దశభిర్లక్షణైర్యుక్తం పురాణం తద్విదో విదుః
కేచిత్పఞ్చవిధం బ్రహ్మన్మహదల్పవ్యవస్థయా

ఈ పది లక్షణాలు. కొందరు దీన్ని ఐదు రకాలు అని చెబుతారు

అవ్యాకృతగుణక్షోభాన్మహతస్త్రివృతోऽహమః
భూతసూక్ష్మేన్ద్రియార్థానాం సమ్భవః సర్గ ఉచ్యతే

సర్గమంటే ప్రకృతి యొక్క గుణాలు శోభిస్తే మహత్తు పుడుతుంది. ఆ మహత్తు నుండి అహంకారం పుడుతుంది. ఆ అహంకారం మూడు రకాలు. సాత్విక రాజస తాంసములు. ఈ అహంకారం నుండి పంచ తన్మాత్రలూ పంచ జ్ఞ్యానేంద్రియములూ పంచ కర్మేంద్రియములూ పంచభూతములూ పుడతాయి. ఇదంతా కలిపి సర్గం అంటారు.

పురుషానుగృహీతానామేతేషాం వాసనామయః
విసర్గోऽయం సమాహారో బీజాద్బీజం చరాచరమ్

వీటినుండి బ్రహ్మాండమూ, దానినుండి చతుర్ముఖ బ్రహ్మ, దాని నుండి దేవతలూ మానవులూ దానవులూ బ్రహ్మఋషులూ రావడం విసర్గము.
పరమాత్మ చేత అనుగ్రహించబడిన ఈ 24 తత్వాల నుండి వాసనామయమైన సృష్టి విసర్గము. ఒక బీజం నుండి ఇంకో బీజం వచ్చినట్లుగా ఈ ఇరవై నాలుగు తత్వాల నుండి అంతా పుట్టింది

వృత్తిర్భూతాని భూతానాం చరాణామచరాణి చ
కృతా స్వేన నృణాం తత్ర కామాచ్చోదనయాపి వా

సకల భూతముల వృత్తి ప్రవృత్తి, కోరికతో కానీ ప్రేరణతో గానీ ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణి పుడుతుంది

రక్షాచ్యుతావతారేహా విశ్వస్యాను యుగే యుగే
తిర్యఙ్మర్త్యర్షిదేవేషు హన్యన్తే యైస్త్రయీద్విషః

రక్ష అంటే పరమాత్మ యొక్క అవతార రూపం
ఇది ప్రతీ యుగములో ఉంటుంది
పరమాత్మ దేవతలుగా మానవులుగా ఋషిగా తిర్యక్ గా పుడతాడు. వేద శత్రువులను సంహరిస్తాడు

మన్వన్తరం మనుర్దేవా మనుపుత్రాః సురేశ్వరాః
ర్షయోऽంశావతారాశ్చ హరేః షడ్విధముచ్యతే

ఒక మన్వంతరం అంటే మనువూ, మను పుత్రులూ దేవతలూ సప్తఋషులూ, అవతారాలు, ఇంద్రుడు. ఇలా ఈ ఆరుగురూ ప్రతీ మన్వంతరములో ఉంటారు.

రాజ్ఞాం బ్రహ్మప్రసూతానాం వంశస్త్రైకాలికోऽన్వయః
వంశానుచరితం తేషామ్వృత్తం వంశధరాస్చ యే

బ్రహ్మ నుండి పుట్టిన రాజుల చరిత వంశము. ఇది త్రైకాలికం. వారి నుండి వచ్చిన వారు, మళ్ళీ వారి నుండి వచ్చినవారూ అంతా కలసి వంశానుచరితము.

నైమిత్తికః ప్రాకృతికో నిత్య ఆత్యన్తికో లయః
సంస్థేతి కవిభిః ప్రోక్తశ్చతుర్ధాస్య స్వభావతః

ప్రళయం నాలుగు రకాలు
నైమిత్తికం ప్రాకృతం ఆత్యంతికము నిత్యమూ. సంస్థ అంటే ప్రళయం

హేతుర్జీవోऽస్య సర్గాదేరవిద్యాకర్మకారకః
యం చానుశాయినం ప్రాహురవ్యాకృతముతాపరే

సర్గాదికి హేతువు అవిద్యతో ఉన్న జీవుడు హేతువు
దీనినే అనుశాయి అనీ అవ్యాకృతమనీ అంటారు ప్రకృతిని

వ్యతిరేకాన్వయో యస్య జాగ్రత్స్వప్నసుషుప్తిషు
మాయామయేషు తద్బ్రహ్మ జీవవృత్తిష్వపాశ్రయః

ఈ జీవునికి జాగృత్ స్వప్న సుషుప్తి అనే మూడు దశలు ఉంటాయి.
ఎక్కడెక్కడ సృష్టి ఉంటుందో అన్ని చోట్లా పరమాత్మే ఉంటాడు. ఆయన కారణం మనం కార్యము.

పదార్థేషు యథా ద్రవ్యం సన్మాత్రం రూపనామసు
బీజాదిపఞ్చతాన్తాసు హ్యవస్థాసు యుతాయుతమ్

బీజమూ అంకురము ప్రరోహమూ వృక్షమూ పతనం అనే ఐదు స్థితులు ఉంటాయి
ఇవి తెలుసుకున్నవాడు

విరమేత యదా చిత్తం హిత్వా వృత్తిత్రయం స్వయమ్
యోగేర్ల వా తదాత్మానం వేదేహాయా నివర్తతే

సత్వ రజస్తమో వృత్తులను విడిచిపెట్టి యోగముతో పరమాత్మను చేరతాడు

ఏవం లక్షణలక్ష్యాణి పురాణాని పురావిదః
మునయోऽష్టాదశ ప్రాహుః క్షుల్లకాని మహాన్తి చ

ఇవి పురాణ లక్షణాలు
మునులు మొత్తం పురాణాలు పద్దెనిమిది అన్నారు
మహాపురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు పద్దెనిమిది

బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం లైఙ్గం సగారుడం
నారదీయం భాగవతమాగ్నేయం స్కాన్దసంజ్ఞితమ్

భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కణ్డేయం సవామనమ్
వారాహం మాత్స్యం కౌర్మం చ బ్రహ్మాణ్డాఖ్యమితి త్రిషట్

ఇలా మొత్తం పద్దెనిమిది పురాణాలు.

బ్రహ్మన్నిదం సమాఖ్యాతం శాఖాప్రణయనం మునేః
శిష్యశిష్యప్రశిష్యాణాం బ్రహ్మతేజోవివర్ధనమ్

ఈ ప్రకారముగా వేదములూ పురాణములు, వీటిని వ్యాసభగవానుడు ఎలా విస్తరింపచేసాడో చెప్పాను
ఈ శాఖ ప్రణయన విధానం తెలుసుకుంటే మనకు బ్రహ్మతేజస్సు పెరుగుతుంది.


                                           సర్వం  శ్రీకృష్ణార్పణమస్తు
                                           సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Saturday, September 28, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఆరవ అధ్యాయం

                                                 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఆరవ అధ్యాయం

పరీక్షిత్తు శుక యోగీంద్రున్ని "మరణించేవాడు దేన్ని జపించాలి దేన్ని ధ్యానించాలి,అనీ, పరమాత్మ ఏది చేయడానికి వచ్చాడు, చనిపోయే జీవుడు దేన్ని స్మరించాలి, ఏమి చేయాలి" అని అడిగితే అవి అన్నీ చెప్పిన శుకుడు, ఇంకేమైనా నీవు వినాలని అనుకుంటున్నావా అని అడిగాడు

సూత ఉవాచ
ఏతన్నిశమ్య మునినాభిహితం పరీక్షిద్
వ్యాసాత్మజేన నిఖిలాత్మదృశా సమేన
తత్పాదమూలముపసృత్య నతేన మూర్ధ్నా
బద్ధాఞ్జలిస్తమిదమాహ స విష్ణురాతః

వ్యాస కుమారుడైన, సకల పరిపూర్ణమైన ఆత్మ జ్ఞ్యానం గలవాడు, అందరి యందూ సమ భావన ఉన్నవాడైన శుకుడు అలా అడిగితే,
విష్ణువు చేత ఇవ్వబడిన (విష్ణు రాతుడు) పరీక్షిత్తు శుక యోగీంద్రుని పాదాల మీద తల ఉంచి చేతులు జోడించి

రాజోవాచ
సిద్ధోऽస్మ్యనుగృహీతోऽస్మి భవతా కరుణాత్మనా
శ్రావితో యచ్చ మే సాక్షాదనాదినిధనో హరిః

మీరు పరమ కరుణామయులై నన్ను అనుగ్రహించారు
ఏమి తెలుసుకోవాలి అనుకున్నానో అది మీ ద్వారా తెలుసుకున్నాను
ఆద్యంతములు లేని పరమాత్మ స్వరూప స్వభావాలను పరిపూర్ణముగా నాకు వినిపించారు

నాత్యద్భుతమహం మన్యే మహతామచ్యుతాత్మనామ్
అజ్ఞేషు తాపతప్తేషు భూతేషు యదనుగ్రహః

అజ్ఞ్యానులై సంసార తాపత్రయముతో పరితపించే జీవులను అనుగ్రహించుట మీవంటి వారికి అద్భుతమేమీ కాదు. అది మీ స్వభావం. పరమాత్మ యందు భక్తి గలవారు సంసారములో భ్రమించే అజ్ఞ్యుల తాపాన్ని పోగొట్టడం ఆశ్చర్యం కాదు

పురాణసంహితామేతామశ్రౌష్మ భవతో వయమ్
యస్యాం ఖలూత్తమఃశ్లోకో భగవాననవర్ణ్యతే

మీ నుంచి ఈ భాగవత సంహితను విన్నాను
దీని యందు ఉత్తమ శ్లోకుడైన పరమాత్మ ప్రతీ శ్లోకములో పాదములో వర్ణించబడుతున్నాడు

భగవంస్తక్షకాదిభ్యో మృత్యుభ్యో న బిభేమ్యహమ్
ప్రవిష్టో బ్రహ్మ నిర్వాణమభయం దర్శితం త్వయా

ఆత్మని పరమాత్మలో ఉంచి, మనసుని ఆత్మలో ఉంచి పరమాత్మ దర్శనం చేసుకుంటే తక్షకుడు కాటు వేసినా, నీ శరీరం దహించుకుని పోతున్నా నీకు తెలియదు అని అన్నారు
నేను తక్షకాదుల వలన భయపడడం లేదు
పరమానంద స్వరూపుడైన పరమాత్మ స్వరూపాన్ని చూపించి అభయాన్ని చూపారు

అనుజానీహి మాం బ్రహ్మన్వాచం యచ్ఛామ్యధోక్షజే
ముక్తకామాశయం చేతః ప్రవేశ్య విసృజామ్యసూన్

మీరు ఆజ్ఞ్య ఇస్తే నా వాక్కును నేను నియమించుకుని పరమాత్మ యందు మనసు లగ్నం చేస్తాను
అన్ని కోరికలూ అన్ని సంగములనూ విడిచిపెట్టి మనసును పరమాత్మ యందు లగ్నం చేసి శరీరాన్ని విడిచిపెడతాను మీరు అనుజ్ఞ్య ఇస్తే

అజ్ఞానం చ నిరస్తం మే జ్ఞానవిజ్ఞాననిష్ఠయా
భవతా దర్శితం క్షేమం పరం భగవతః పదమ్

మీరు బోధించిన జ్ఞ్యానముతో నా అజ్ఞ్యానం తొలగిపోయింది
పరమ పదమును నాకు దర్శింపచేసారు మీరు.ఇంక నాకు భయమేమిటి

సూత ఉవాచ
ఇత్యుక్తస్తమనుజ్ఞాప్య భగవాన్బాదరాయణిః
జగామ భిక్షుభిః సాకం నరదేవేన పూజితః

పరీక్షిత్తు పలికిన పలుకులు విని, రాజుగారి పూజలందుకుని శుకయోగీంద్రుడు తన తోటి శిష్యులతో బయలుదేరాడు

పరీక్షిదపి రాజర్షిరాత్మన్యాత్మానమాత్మనా
సమాధాయ పరం దధ్యావస్పన్దాసుర్యథా తరుః

పరీక్షిత్తు కూడా మనసును ఆత్మలోనూ ఆత్మను పరమాత్మలోనూ లగ్నం చేసి
కలదలిక లేని వృక్షం లాగ యోగములో కూర్చున్నాడు

ప్రాక్కూలే బర్హిష్యాసీనో గఙ్గాకూల ఉదఙ్ముఖః
బ్రహ్మభూతో మహాయోగీ నిఃసఙ్గశ్ఛిన్నసంశయః

యమునా నదిలో తూర్పుతీరములో దర్భల యందు ఉత్తరముఖముగా కూర్చుని
ఏ సందేహమూ లేక, దేని యందూ ఆశలేక పరమాత్మ యందే మనసు ఉంచాడు

తక్షకః ప్రహితో విప్రాః క్రుద్ధేన ద్విజసూనునా
హన్తుకామో నృపం గచ్ఛన్దదర్శ పథి కశ్యపమ్

అదే సమయములో బ్రాహ్మణ శాపమును నిజం చేయడానికి తక్షకుడు బయలుదేరాడు.
కశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షిత్తును కాపాడడానికి బయలుదేరాడు

తం తర్పయిత్వా ద్రవిణైర్నివర్త్య విషహారిణమ్
ద్విజరూపప్రతిచ్ఛన్నః కామరూపోऽదశన్నృపమ్

ఎంత గొప్ప విషమైన తొలగించగల శక్తి కశ్యపునికి ఉంది.
ఆ బ్రాహ్మణున్ని ధనముతో వెనక్కు పంపాడు
బ్రాహ్మణ రూపములో లోపలకు వెళ్ళి పరీక్షిత్తుని కాటు వేసాడు
బ్రహ్మభూతస్య రాజర్షేర్దేహోऽహిగరలాగ్నినా
బభూవ భస్మసాత్సద్యః పశ్యతాం సర్వదేహినామ్

పరమాత్మ యందే మనసు లగ్నం చేసి సమాధిలో ఉన్న పరీక్షిత్తుకు ఈ విషయం ఏమీ తెలియలేదు
చుట్టూ ఉన్నవారు అది చూసారు

హాహాకారో మహానాసీద్భువి ఖే దిక్షు సర్వతః
విస్మితా హ్యభవన్సర్వే దేవాసురనరాదయః

అది చూసి ఆకాశములో భూమిలో అందరూ హాహాకారాలు చేసారు
పరీక్షిత్తు సమాధి చూసి దేవతలూ రాక్షసులూ మానవులూ ఇది చూసి పరమాశ్చర్యాన్ని పొందారు

దేవదున్దుభయో నేదుర్గన్ధర్వాప్సరసో జగుః
వవృషుః పుష్పవర్షాణి విబుధాః సాధువాదినః

దేవతలు పుష్ప వృష్ఠి కురిపించి పూల వర్షం కుర్పించారు
చాలా ఉత్తమ కార్యం చేసావని పరీక్షిత్తును మెచ్చుకున్నారు

జన్మేజయః స్వపితరం శ్రుత్వా తక్షకభక్షితమ్
యథాజుహావ సన్క్రుద్ధో నాగాన్సత్రే సహ ద్విజైః

ఈ విషయాన్ని , తన తండ్రి సర్పము కాటు వేయడం వలన మరణించాడని తెలుసుకున్న జనమేజయుడు
భూంలోకములో సర్పాలు లేకుండా చేస్తానని సర్పయాగం చేసాడు

సర్పసత్రే సమిద్ధాగ్నౌ దహ్యమానాన్మహోరగాన్
దృష్ట్వేన్ద్రం భయసంవిగ్నస్తక్షకః శరణం యయౌ

అన్ని పాములూ వచ్చి యజ్ఞ్య గుండములో పడిపోతూ ఉంటే
తక్షకుడు భయపడి ఇంద్రున్ని శరణు వేడాడు

అపశ్యంస్తక్షకం తత్ర రాజా పారీక్షితో ద్విజాన్
ఉవాచ తక్షకః కస్మాన్న దహ్యేతోరగాధమః

ఇంద్రుడు అభయమిచ్చాడు తక్షకునికి
అది గమనించాడు జనమేజయుడు

తం గోపాయతి రాజేన్ద్ర శక్రః శరణమాగతమ్
తేన సంస్తమ్భితః సర్పస్తస్మాన్నాగ్నౌ పతత్యసౌ

మీ మంత్రాలు చాలా శక్తి గలవి. మీరు యాగం చేస్తున్నా తక్షకుడు ఎందుకు రాలేదు అని అడిగాడు

పారీక్షిత ఇతి శ్రుత్వా ప్రాహర్త్విజ ఉదారధీః
సహేన్ద్రస్తక్షకో విప్రా నాగ్నౌ కిమితి పాత్యతే

ఇంద్రుడు తక్షకున్ని రక్షిస్తున్నాడని చెప్పగా ఆ ఇంద్రున్ని కూడా పడవేయండి అని అన్నాడు జనమేజయుడు
(సహేంద్రతక్షకాయ స్వాహా)

తచ్ఛ్రుత్వాజుహువుర్విప్రాః సహేన్ద్రం తక్షకం మఖే
తక్షకాశు పతస్వేహ సహేన్ద్రేణ మరుత్వతా

అది విన్న బ్రాహ్మణులు అలాగే చేయబోతే, ఇంద్రునితో కలసి తక్షకుడు కూడా వచ్చి పడమని బ్రాహ్మణులు మంత్రం చదవగా ఇంద్రుడు కూడా వచ్చేస్తున్నాడు

ఇతి బ్రహ్మోదితాక్షేపైః స్థానాదిన్ద్రః ప్రచాలితః
బభూవ సమ్భ్రాన్తమతిః సవిమానః సతక్షకః

మొత్తం లోకమంతా భయపడిపోయింది

తం పతన్తం విమానేన సహతక్షకమమ్బరాత్
విలోక్యాఙ్గిరసః ప్రాహ రాజానం తం బృహస్పతిః

అపుడు బృహస్పతి వచ్చి, తక్షకుడు మరణించరాదు, ఆయన అమృతం తాగి ఉన్నాడు

నైష త్వయా మనుష్యేన్ద్ర వధమర్హతి సర్పరాట్
అనేన పీతమమృతమథ వా అజరామరః

ఈయన అమృతాన్ని తాగాడు.
అతనికి వార్దక్యం గానీ మరణం గానీ ఉండదు.

జీవితం మరణం జన్తోర్గతిః స్వేనైవ కర్మణా
రాజంస్తతోऽన్యో నాస్త్యస్య ప్రదాతా సుఖదుఃఖయోః

మీ నాన్నగారిని సర్పం కాటు వేసి చంపింది అని పగబడుతున్నావు
ఎవరినీ ఎవరూ చంపరు, ఎవరినీ ఎవరూ సృష్టీ చేయరు, ఎవరినీ ఎవరూ బతికించరు
పుట్టుకా మరణం బతుకూ వారు వారు చేసుకున్న కర్మల వలననే వస్తాయి
కర్మ కంటే వేరే ఏదీ మనకు సుఖమును గానీ దుఃఖాన్ని గానీ ఇవ్వదు

సర్పచౌరాగ్నివిద్యుద్భ్యః క్షుత్తృద్వ్యాధ్యాదిభిర్నృప
పఞ్చత్వమృచ్ఛతే జన్తుర్భుఙ్క్త ఆరబ్ధకర్మ తత్

మరణించడానికి సర్పమో దొంగలో అగ్నో విద్యుత్తో ఆకలో దప్పో వ్యాధో కారణం కావొచ్చు. కానీ ఈ కారణాలన్నీ తాను చేసిన కర్మల రూపములో వచ్చేవే

తస్మాత్సత్రమిదం రాజన్సంస్థీయేతాభిచారికమ్
సర్పా అనాగసో దగ్ధా జనైర్దిష్టం హి భుజ్యతే

ఎలాంటి కర్మ చేస్తే ఎలా మరణిస్తాడో ధర్మ శాస్త్రం చెప్పి ఉంది.
వాడు ఆచరించిన కర్మ  మాత్రమే మరణాన్ని ఇస్తుంది
ఈ సర్పాభిచారమును ఆపండి
ఏ తప్పూ చేయని సర్పాలన్ని దహించిపోయాయి
లోకములో ఎవడి అదృష్టాన్ని వాడు అనుభవిస్తాడు

సూత ఉవాచ
ఇత్యుక్తః స తథేత్యాహ మహర్షేర్మానయన్వచః
సర్పసత్రాదుపరతః పూజయామాస వాక్పతిమ్

బృహస్పతి కోరగా ఆయన మాటను మన్నించాడు జనమేజయుడు.

సైషా విష్ణోర్మహామాయా బాధ్యయాలక్షణా యయా
ముహ్యన్త్యస్యైవాత్మభూతా భూతేషు గుణవృత్తిభిః

ఒకరు బాధించేవారు, ఒకరు బాధించబడే వారు అనేది విష్ణువు యొక్క మాయ. ఆ మాయతోనే ఒకరు బాధించేవారూ ఒకరు బాధించబడేవారూ అవుతారు
సత్వ రజస్తమో గుణాలు, శబ్దాది గుణాలతో అతని వారు కూడా మోహాన్ని పొందుతారు

న యత్ర దమ్భీత్యభయా విరాజితా మాయాత్మవాదేऽసకృదాత్మవాదిభిః
న యద్వివాదో వివిధస్తదాశ్రయో మనశ్చ సఙ్కల్పవికల్పవృత్తి యత్

పరమాత్మ మాయ ఎలాంటిందంటే ఎలాంటి చోట కూడా మనకు ఎలాంటి భయమూ లేదు
మనము సర్వత్రా భయం లేకుండా ఉన్నాము అనేవారు గానీ, భయము ఉన్నా లేనట్లు దంభం నటించేవారు గానీ,
ఎన్నో సార్లు ఏది ఆత్మ (మనసా ఇంద్రియాలా, విజ్ఞ్యానమా అంటూ దినకరి అనే తర్క గ్రంధములో 24 ఆత్మవాదాలు ఉన్నాయి) అని ఎన్ని వాదాల ఎన్ని తీరులా ప్రవర్తించినా అది అంతా భగవంతుని ఆశ్రయించేది కాదు
మనసు సంకల్పమూ వికల్పమూ చేసేది.

న యత్ర సృజ్యం సృజతోభయోః పరం శ్రేయశ్చ జీవస్త్రిభిరన్వితస్త్వహమ్
తదేతదుత్సాదితబాధ్యబాధకం నిషిధ్య చోర్మీన్విరమేత తన్మునిః

సృజించేవాడికన్నా సృజించబడేదానికన్నా పరమాత్మ పరుడు (వీటికి పైవాడు)
సత్వ రజస్తమో గుణములతో జీవుడు పొందే ఏ శ్రేయస్సు ఉందో అది అంతా కలసే ఉంటుంది.
కాబట్టి సృజించేవాడూ, సృజించబడేది గుణములూ గుణముల ప్రవృత్తీ, శ్రేయస్సూ ఆపదా
ఇవన్నీ ఆలోచించి, ఇవన్నీ వేరు కాదు, అంతా పరమాత్మే.
ఎవరూ బాధించడం లేదూ ఎవరూ బాధపడడం లేదూ అని తెలుసుకుంటే. అంతా పరమాత్మ మాయే అని తెలుసుకుని ఊర్ములను విరమించాలి
ఆకలీ దప్పి శోక మోహములూ జరా రోగములను ఊర్ములంటారు. వీటిని మొదలు గెలవాలి. ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి. వీటితో ఎలాంటి సంబంధమూ మనకు లేదు. ఆత్మ నిత్యమూ సత్యమూ.

పరం పదం వైష్ణవమామనన్తి తద్యన్నేతి నేతీత్యతదుత్సిసృక్షవః
విసృజ్య దౌరాత్మ్యమనన్యసౌహృదా హృదోపగుహ్యావసితం సమాహితైః

భగవనుతుడు ఉన్నాడా లేడా అంటే లేడు లేడనేవాడు కొందరైతే, ఆ లేదు అనేదే లేదనీ భగవంతుడు ఉన్నాడు అని కొందరు, అంటే ఉన్నాడనీ లేడనీ కనపడడనీ మనకు తెలియడనీ పలురకములుగా అంటూ ఉంటారు
దుష్టపు ఆలోచనను విడిచిపెట్టాలి, పరమాత్మ యందు మాత్రమే ప్రీతి కలవారై
సావధానములైన ఇంద్రియములతో పరమాత్మను హృదయములో భద్రముగా దాచుకోవాలి
నేను అనేది అహంకారం,నాది అనేది మమకారం. ఇదే దౌర్జన్యం.
ఎవరికైతే ఇవి ఉండవో వారే పరమపదమును పొందుతారు

అతివాదాంస్తితిక్షేత నావమన్యేత కఞ్చన
న చేమం దేహమాశ్రిత్య వైరం కుర్వీత కేనచిత్

అలా చేరాలంటే ఏమి కావాలి? మన గురించి చాలా మంది చాలా రకములుగా మాట్లాడుతూ ఉంటారు. అవి విని ఊరుకోవాలి. అతివాదాలను ఓర్చుకోవాలి.
ఎవరినీ అవమానించకూడదు. ఈ శరీరాన్ని ఆధారముగా చేసుకుని ఎవరితో వైరము చేయకూడదు

నమో భగవతే తస్మై కృష్ణాయాకుణ్ఠమేధసే
యత్పాదామ్బురుహధ్యానాత్సంహితామధ్యగామిమామ్

అకుణ్ఠమేథ ఐన పరమాత్మకు నమస్కారం
ఆయన పాద పద్మాలను ధ్యానం చేయడం వలన నేను ఈ భాగవత సంహితను పొందానో

శ్రీశౌనక ఉవాచ
పైలాదిభిర్వ్యాసశిష్యైర్వేదాచార్యైర్మహాత్మభిః
వేదాశ్చ కథితా వ్యస్తా ఏతత్సౌమ్యాభిధేహి నః

వ్యాసభగవానుడు వేదాలను విభజించాడని చెప్పారు
నలుగురు శిష్యులకు బోధించాడని చెప్పారు
ఆవేదాలను ఎన్నిభాగాలు చేసాడో ఎవరికి చెప్పాడో మాకు అందించవలసింది అని శౌనకుడు అడుగగా

సూత ఉవాచ
సమాహితాత్మనో బ్రహ్మన్బ్రహ్మణః పరమేష్ఠినః
హృద్యాకాశాదభూన్నాదో వృత్తిరోధాద్విభావ్యతే

మొదలు చతుర్ముఖబ్రహ్మ (పరమేష్ఠి) సావధానుడై పరమాత్మ యందు మనసు లగ్నం చేసినపుడు ఆయన హృదయములో ఒక నాదం వెలువడింది

యదుపాసనయా బ్రహ్మన్యోగినో మలమాత్మనః
ద్రవ్యక్రియాకారకాఖ్యం ధూత్వా యాన్త్యపునర్భవమ్

ఈ నాదో పాసనతో యోగులందరూ మనస్సు యొక్క మలాన్ని తొలగించుకుంటారు
మన మనసుకు మురికి - ద్రవ్యం క్రియా కారకము. (బియ్యాన్ని నిప్పుతో అన్నం చేస్తున్నాము)
ఈ మూటి జ్ఞ్యానం పోతే గానీ పరమాత్మ జ్ఞ్యానం కలుగదు
ఇది తెలుసుకున్న తరువాతే వారు మళ్ళీ పుట్టని మోక్షాన్ని పొందుతారు

తతోऽభూత్త్రివృదోంకారో యోऽవ్యక్తప్రభవః స్వరాట్
యత్తల్లిఙ్గం భగవతో బ్రహ్మణః పరమాత్మనః

ఆ నాదం నుంచే ఓంకారం పుట్టింది
ఆ ఓంకారం వచ్చిన అఖండమైన జ్ఞ్యానమే స్వారాజ్యం. దాన్నే స్వరాట్ అంటాము.
ఈ ఓంకారమే పరమాత్మ యొక్క సూచిక.

శృణోతి య ఇమం స్ఫోటం సుప్తశ్రోత్రే చ శూన్యదృక్
యేన వాగ్వ్యజ్యతే యస్య వ్యక్తిరాకాశ ఆత్మనః

ఈ ఓంకారాన్ని స్ఫోటం అంటారు. వయ్యాకరణులు (వ్యాకరణ శాస్త్రవేత్తలు) చెప్పేది కూడా పరమాత్మ గురించే. తర్క శాస్త్రం చెప్పేది కూడా ఈశ్వరుని గురించే. ఒక కుండ ఉంటే కుమ్మరి ఉంటాడు. ప్రతీ కార్యానికీ ఒక కర్త ఉంటాడు, ఆ కర్త మనలాంటి సామాన్యుడు కాలేడు కాబట్టి ఆయన పరమాత్మ.
వ్యాకరణములో స్పోట బ్రహ్మ అని చెబుతారు. సకల చరాచర జగత్తూ ఆయనలోంచి వస్తుంది. ఆ స్పోటం అంటే శబ్దం. అదే ఓంకారం. కనులూ చెవులూ కూడా మూసుకుంటే ఈ నాదాన్ని వింటారు(ప్రాణాయామం చేస్తున్నపుడు కళ్ళూ చెవులూ ముక్కూ మూయడం ఒక విధానం. అలా చేస్తే ఓంకార నాదమే వినవస్తుంది. అపుడు కూడా మరొక దాన్ని గురించి ఆలోచించదు. ఆ ఓంకార నాదం ఏ రూపములో విన వచ్చిందో దాన్ని బట్టి వాడు సాత్వికుడా తామసుడా రాజసికుడా చెప్పవచ్చు)
హృదయములో ఆ నాదం ఉన్నది కాబట్టే మన నోటినుండి ఇన్న నాదాలు వస్తున్నాయి. ప్రతీవారి హృదయములో ఓంకారం ఉంటుంది

స్వధామ్నో బ్రాహ్మణః సాక్షాద్వాచకః పరమాత్మనః
స సర్వమన్త్రోపనిషద్వేదబీజం సనాతనమ్

ఇదే పరమాత్మ యొక్క వాచకమైన శబ్దం. ఇదే ఓంకారం
ఈ ఓంకారమే, సకల మంత్రముల, సకల ఉపనిషత్తుల బీజం. ఇదే సనాతనం

తస్య హ్యాసంస్త్రయో వర్ణా అకారాద్యా భృగూద్వహ
ధార్యన్తే యైస్త్రయో భావా గుణనామార్థవృత్తయః

దీనికి అకార ఉకార మకారములనే మూడు అక్షరాలు ఉంటాయి
ఈ అకార ఉకార మకారములే - సత్వ రజస్తమో గుణాలు, ఇవే గుణమూ నామమూ అర్థము.
అకారం -నామము
ఉకారం గుణము
మకారం - అర్థం
అకారం  - సత్వం
ఉకారం - రజస్సు
మకారం - తపాసు
మూడు గుణాలూ మూడు లోకాలు, గుణ నామ అర్థాలూ ఓంకారమే

తతోऽక్షరసమామ్నాయమసృజద్భగవానజః
అన్తస్థోష్మస్వరస్పర్శ హ్రస్వదీర్ఘాదిలక్షణమ్

ఈ ఓంకారం నుంచే అకారం నుంచీ హకారం వరకూ ఉంటాయి. వీటినే మహేశ్వరసూత్రములూ అంటారు. పాణిని వ్యాకరణ సూత్రములు వ్రాయడానికి శంకరుని గురించి తపస్సు చేస్తే సనకుడూ సనందాదులూ కూడా తపస్సు చేస్తే స్వామి వచ్చి తాండవం చేస్తూ పధ్నాలుగు సార్లు ఢమరుకం మోగిస్తే, ఎవరు దేనిగురించి తపస్సు చేసారో వారికి ఆ ధ్వని ఆ రూపములో వినబడింది

పాణినికి అక్షర సమాన్యాయముగా వినబడింది.
కణాధునికి న్యాయసూత్రాలుగా గౌతమునికి గౌతమ సూత్రాలుగా వచ్చాయి. ఇలా ఒక్కొక్కరికీ వారనుకున్న ఆశించిన శాస్త్ర బోధకమైన సూత్రాలుగా, న్యా వైశేషిక మీమాంస వ్యాకరణ సూత్రాలుగా తయారయ్యాయి.
ఈ ఓంకారం నుండే అక్షర సమామ్నాయం వచ్చింది

అక్షరములు - మొదలు స్వరములూ అంటాము.
అ దగ్గర నుంచీ ఔ వరకూ - ఆ ఈ ఊ ఋ ౡఏ అఏ ఐ ఓ ఔ - స్వరములు
అనుస్వారం అంటే విసర్గలు.
వీటినే అచ్చులూ లేదా స్వరములూ అంటారు
క దగ్గర నుంచీ మా దగ్గర వరకూ ఉండేవాటిని స్పర్శలు అంటారు

    క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
    చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
    ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
    త వర్గము - త, థ, ద, ధ, న
    ప వర్గము - ప, ఫ, బ, భ, మ

ఇవి స్పర్శలు
య ర ల వ - అంతస్థలు
శ     ష     స     హ - ఇవి ఊష్మలు
ఇలా స్వరములూ స్పర్శలూ అంతస్థలూ ఊష్మలు
ముక్కుతో పలికేవి అనునాసికలు.  ఙ, ఞ, ణ, న, మ లు అనునాసికలు.

అచ్చులు ఇంకో మూడు రకాలు  - హ్రస్వమూ దీర్ఘమూ ప్లుతము
హ్రసవమంటే - ఒక చిటిక - అ
దీర్ఘమంటే - రెండు చిటికెలు - ఆ
ప్లుతమంటే మూడు చిటికలు - ఆ
ఇవి కాక ఇంకో మూడు ఉన్నాయి - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితము, ఇవి స్వరములు
అంటే ఒక్కొక్కటీ మూడు అవుతాయి.
హ్రస్వములో - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితము
దీర్ఘములో - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితము
ప్లుతములో - ఉదాత్తమూ అనుదాత్తమూ స్వరితమూ
ఇలా మూడు మూళ్ళు - తొమ్మిది.
ఈ తొమ్మిదిలో మళ్ళీ రెండు ఉంటాయి - అనునాసికమూ, అననునాసికము. ఒక అకారము ఇలా 9 * 2 = పద్దెనిమిది రకాలు.
ఆ ఈ ఊ - ఈ మూడు పద్దెనిమిదీ + పద్దెనిమిదీ + పద్దెనిమిది - 54
ఋకారము కూడా పద్దెనిమిది
ఌ కారం మాత్రం పన్నెండే ఉంటుంది. ఆరు పోతాయి. దానికి ప్లుతము లేదు
ఏ ఐ ఓ ఔ - కూడా పన్నెండే. వీటికి హ్రస్వం లేదు.
ఇలా అన్ని కలుపుకుంటే - అ ఇ ఉ ఌ - 18+18+18+18+12+12+12+12+12 =132 అవుతాయి
మొత్తం అచ్చులు నూట ముప్పై రెండు
ఇలాగే హల్లులకు కూడా.

తేనాసౌ చతురో వేదాంశ్చతుర్భిర్వదనైర్విభుః
సవ్యాహృతికాన్సోంకారాంశ్చాతుర్హోత్రవివక్షయా

ఈ నాదములతో వచ్చిన ఈ వర్ణములతో బ్రహ్మ నాలుగు ముఖములతో బ్రహ్మ వేదాన్ని ఆవిర్భవినంపచేసాడు
వ్యాహృతులు - భూః భువ@ సువ@ - వీటితో
స + ఓంకారం - ఓంకార సహితమైన వ్యాహృతులు - ఓం భువః...
ఇవన్నీ చాతుర్హోత్రం కోసం (యజ్ఞ్యం కోసం) ఏర్పాటు చేసాడు
అందులో నలుగురు ఉంటారు - ఋత్విక్కు అధ్వర్యువు హోత ఉద్గాత. యజ్ఞ్యములు ఆచరించడానికి పనికొచ్చే వేదాలను బ్రహ్మ తన ముఖం నుండి ఏర్పాటు చేసాడు

పుత్రానధ్యాపయత్తాంస్తు బ్రహ్మర్షీన్బ్రహ్మకోవిదాన్
తే తు ధర్మోపదేష్టారః స్వపుత్రేభ్యః సమాదిశన్

ఇలా తన నుండి వచ్చిన వేదాలని బ్రహ్మ జ్ఞ్యానం కల తన పుత్రులకు బోధించగా
వారు వారి పుత్రులకు బోధించారు

తే పరమ్పరయా ప్రాప్తాస్తత్తచ్ఛిష్యైర్ధృతవ్రతైః
చతుర్యుగేష్వథ వ్యస్తా ద్వాపరాదౌ మహర్షిభిః

ఇలా నాలుగు యుగాల దాకా వచ్చింది. కృత త్రేతా ద్వాపర యుగం దాకా వచ్చాయి. త్వరలో రాబోయేది కలియుగం అని తెలుసుకుని.

క్షీణాయుషః క్షీణసత్త్వాన్దుర్మేధాన్వీక్ష్య కాలతః
వేదాన్బ్రహ్మర్షయో వ్యస్యన్హృదిస్థాచ్యుతచోదితాః

కలియుగములో వారు మందబుద్ధులనీ, అల్పాయుష్కులనీ, ఈ వేదాలు వారి చేత కాపాడబడవనీ హృదయములో ఉన్న పరమాత్మ చోదన వలన బ్రహ్మఋషులు వేదాలను విభజించారు

అస్మిన్నప్యన్తరే బ్రహ్మన్భగవాన్లోకభావనః
బ్రహ్మేశాద్యైర్లోకపాలైర్యాచితో ధర్మగుప్తయే

ఈ మన్వంతరములో కూడా బ్రహ్మాది లోకపాలకులందరూ అడిగితే ప్రార్థిస్తే పరమాత్మ శ్రీమన్నారాయణుడు

పరాశరాత్సత్యవత్యామంశాంశకలయా విభుః
అవతీర్ణో మహాభాగ వేదం చక్రే చతుర్విధమ్

పరాశరుని వల్ల సత్యవతి యందు పరమాత్మ అంశాంశ ఐన వేదవ్యాసునిగా అవతరించి వేదమును నాలుగు భాగములుగా చేసాడు

ఋగథర్వయజుఃసామ్నాం రాశీరుద్ధృత్య వర్గశః
చతస్రః సంహితాశ్చక్రే మన్త్రైర్మణిగణా ఇవ

ఋగ్ యజు సామ అధర్వణ వేదాలుగా విభజించి
మంత్రములతో ఆయా మణులను ఎలా విభజిస్తామో రాశులను వ్యాసభగవానుడు విభజించాడు

తాసాం స చతురః శిష్యానుపాహూయ మహామతిః
ఏకైకాం సంహితాం బ్రహ్మన్నేకైకస్మై దదౌ విభుః

నాలుగు భాగములకు నలుగురు శిష్యులుగా చేసుకుని ఒక్కో శిష్యునికి ఒక్కో సంహితను అందించాడు

పైలాయ సంహితామాద్యాం బహ్వృచాఖ్యాం ఉవాచ హ
వైశమ్పాయనసంజ్ఞాయ నిగదాఖ్యం యజుర్గణమ్

పైలునికి ఋక్ వేదాన్ని
వైశంపాయునికి యజుర్వేదాన్ని
జైమినికి సామవేదాన్ని బోధించాడు
అంగీరసునికి (సుమతుడు) అధర్వణ వేదాన్ని బోధించాడు

సామ్నాం జైమినయే ప్రాహ తథా ఛన్దోగసంహితామ్
అథర్వాఙ్గిరసీం నామ స్వశిష్యాయ సుమన్తవే

పైలః స్వసంహితామూచే ఇన్ద్రప్రమితయే మునిః
బాష్కలాయ చ సోऽప్యాహ శిష్యేభ్యః సంహితాం స్వకామ్

అలా పైలుడు తనకు బోధించిన ఋగ్ వేదాన్ని ఇంద్రప్రమితునికీ, అతను బాష్కలునికీ బాష్కలుడు తన శిష్యులకూ చెప్పుకుంటూ వెళ్ళాడు

చతుర్ధా వ్యస్య బోధ్యాయ యాజ్ఞవల్క్యాయ భార్గవ
పరాశరాయాగ్నిమిత్ర ఇన్ద్రప్రమితిరాత్మవాన్

దాన్ని నాలుగు భాగాలుగా చేసి యాజ్ఞ్యవల్కునికి బోధించాడు
పరాశరునికీ అగ్ని మిత్రునికీ ఇంద్రప్రమితికీ

అధ్యాపయత్సంహితాం స్వాం మాణ్డూకేయమృషిం కవిమ్
తస్య శిష్యో దేవమిత్రః సౌభర్యాదిభ్య ఊచివాన్

తాము తాము తమ గురువుల వద్ద నేర్చుకున్నదాన్ని తమ శిష్యులకు బోధిస్తూ వచ్చారు
దేవమిత్రుడు సౌభరికీ,

శాకల్యస్తత్సుతః స్వాం తు పఞ్చధా వ్యస్య సంహితామ్
వాత్స్యముద్గలశాలీయ గోఖల్యశిశిరేష్వధాత్

అతనిపుత్రుడైన శాకల్యుడు దాన్ని ఐదు భాగాలు చేసి
వాత్స్య ముద్గల శాలీయ గోఖల్య శిశిర అనే ఐదుగురికి చెప్పాడు

జాతూకర్ణ్యశ్చ తచ్ఛిష్యః సనిరుక్తాం స్వసంహితామ్
బలాకపైలజాబాల విరజేభ్యో దదౌ మునిః

జాతూకర్ణుడు వారి శిష్యుడు. ఆయన ఈ సంహిత భాగాన్ని బాలక పైల జాబాల విరజుడనే నలుగురికి ఇచ్చాడు

బాష్కలిః ప్రతిశాఖాభ్యో వాలఖిల్యాఖ్యసంహితామ్
చక్రే వాలాయనిర్భజ్యః కాశారశ్చైవ తాం దధుః

బాష్కలి తాను చదువుకున్న భాగానికి వాలఖిల్య సంహిత అనే పేరు పెట్టి బాలాయనీ భజ్య కాశారి అనే వారికి చెప్పాగా వారు స్వీకరించారు.

బహ్వృచాః సంహితా హ్యేతా ఏభిర్బ్రహ్మర్షిభిర్ధృతాః
శ్రుత్వైతచ్ఛన్దసాం వ్యాసం సర్వపాపైః ప్రముచ్యతే

బహ్వృచ మంటే ఋక్కు. ఇంతమంది బ్రాహ్మణోత్తములచే మొదలుపెట్టిన ఈ సంహితను, ఈ వేద విభాగాన్ని వింటే అన్ని పాపాలూ తొలగిపోతాయి

వైశమ్పాయనశిష్యా వై చరకాధ్వర్యవోऽభవన్
యచ్చేరుర్బ్రహ్మహత్యాంహః క్షపణం స్వగురోర్వ్రతమ్

వీరి శిష్యులే అధ్వర్యులు. అధర్వణ వేదాన్ని వీరు విన్నారు.

యాజ్ఞవల్క్యశ్చ తచ్ఛిష్య ఆహాహో భగవన్కియత్
చరితేనాల్పసారాణాం చరిష్యేऽహం సుదుశ్చరమ్

ఇలాగే ఈయన శిష్యులందరూ కూడా గురువుగారు తనకు వచ్చిన బ్రహ్మ హత్యాపాతకాన్ని తన శిష్యులు నలుగురికీ చెప్పి, వారి తపశ్శక్తితో పోగొట్టమని వైశంపాయనుడు చెప్పాడు
అలా చెబితే యాజ్ఞ్యవల్క్యుడు నేనొక్కడినే చేస్తాను అని అన్నాడు. వీరు అలా చేయలేరు అని అన్నడు. తోటి బ్రాహ్మణులను అవమానించినందు వలన

ఇత్యుక్తో గురురప్యాహ కుపితో యాహ్యలం త్వయా
విప్రావమన్త్రా శిష్యేణ మదధీతం త్యజాశ్వితి

గురువుకు కోపం వచ్చి, నేను చెప్పిన వేదాన్ని విడిచిపెట్టు అని అన్నాడు
అపుడు యజ్ఞ్యవల్క్యుడు తాను నేర్చిన వేద భాగాన్ని వమనం (వాంతి)చేసుకున్నాడు

దేవరాతసుతః సోऽపి ఛర్దిత్వా యజుషాం గణమ్
తతో గతోऽథ మునయో దదృశుస్తాన్యజుర్గణాన్

యజూంషి తిత్తిరా భూత్వా తల్లోలుపతయాదదుః
తైత్తిరీయా ఇతి యజుః శాఖా ఆసన్సుపేశలాః

ఆయన వమనం చేయగా వచ్చిన భాగాన్ని కొన్ని పక్షులు తినేశాయి.వాటిని తిత్తిరి పక్షులు అంటారు. అవి తిన్న వాటిని వ్యాపింపచేసాయి. దాన్నే తైత్తిరీయ శాఖ అంటారు

యాజ్ఞవల్క్యస్తతో బ్రహ్మంశ్ఛన్దాంస్యధి గవేషయన్
గురోరవిద్యమానాని సూపతస్థేऽర్కమీశ్వరమ్

ఈ యాజ్ఞ్యవల్క్యుడే సూర్యభగవానుని ప్రార్థించి మా గురువుగారు స్పృశించని వేద శాఖలను నాకు ప్రసాదించండి అని వేడుకున్నాడు
కానీ అవి నిత్యం అధయయనం చేయబడుతూనే ఉండాలి. గురువు గారు నేర్వనిదీ, అధయయనం చేయబడుతూ ఉండేవి, ఐన వాటిని ఇవ్వమని ప్రార్థించాడు
సూర్యున్ని ఈ మంత్రాలతో ప్రార్థించాడు
సూర్యభగవానుని అనుగ్రహాన్నీ విద్యనూ ఆరోగ్యాన్ని కోరిన వారు ఈ మంత్రాన్ని రోజూ చదవాలి

శ్రీయాజ్ఞవల్క్య ఉవాచ
ఓం నమో భగవతే ఆదిత్యాయాఖిలజగతామాత్మస్వరూపేణ కాల
స్వరూపేణ చతుర్విధభూతనికాయానాం బ్రహ్మాదిస్తమ్బపర్యన్తానామన్తర్హృదయేషు
బహిరపి చాకాశ ఇవోపాధినావ్యవధీయమానో భవానేక
ఏవ క్షణలవనిమేషావయవోపచితసంవత్సరగణేనాపామాదాన
విసర్గాభ్యామిమాం లోకయాత్రామనువహతి

సూర్యభగవానుడు అఖిల జగత్తుకూ ఆత్మ. ఈయనే కాల స్వరూపుడు. ఆత్మ స్వరూపుడు. జలాయుజ(మావి నుండి పుట్టేవి) అండజ స్వేదజ ఉద్బిజ్జమూ (చెట్లు) , ఇలా నాలుగు రకాల జీవులూ, బ్రమ్హాది స్తంభ పర్యంతం ఉన్న ప్రాణుల హృదయములోపలా బయటా , ఎటువంటి వ్యవధానం లేకుండా ఉన్నది నీవు.
క్షణం లవం నిమేషం ఘడియ విఘడియ గంటలూ రోజులూ అనే విభాగము నీ వలననే.
నీరును తీసుకొనుట, విడిచిపెట్టుట వలన లోకాన్ని కాపాడుతున్నావు
వారిలో జ్ఞ్యానాన్ని ఆవిర్భవింపచేసి చీకటిని పోగొట్టి లోకాన్నీ కాపాడుతున్నావు
నీవే కాల స్వరూపుడవు ఆత్మ స్వరూపుడవు
సకల ప్రాణుల అంతర్యామివి నీవే

యదు హ వావ విబుధర్షభ సవితరదస్తపత్యనుసవనమహర్
అహరామ్నాయవిధినోపతిష్ఠమానానామఖిలదురితవృజిన
బీజావభర్జన భగవతః సమభిధీమహి తపన మణ్డలమ్

సకల పాప కల్మషాన్ని కాల్చిపారేసే నీ తపన మండలాన్ని ధ్యానం చేస్తున్నాను

య ఇహ వావ స్థిరచరనికరాణాం నిజనికేతనానాం మనైన్ద్రియాసు
గణాననాత్మనః స్వయమాత్మాన్తర్యామీ ప్రచోదయతి

మనసూ ఇంద్రియములూ ప్రాణములూ నీ చేతే కాపాడబడుతూ ఉంటాయి.
మనసూ బుద్ధీ ఇంద్రియాలను అంతర్యామిగా ఉండి ప్రేరణ చేస్తూ ఉంటావు

య ఏవేమం లోకమతికరాలవదనాన్ధకారసంజ్ఞాజగరగ్రహ
గిలితం మృతకమివ విచేతనమవలోక్యానుకమ్పయా పరమకారుణిక
ఈక్షయైవోత్థాప్యాహరహరనుసవనం శ్రేయసి స్వధర్మాఖ్యాత్మావ
స్థనే ప్రవర్తయతి

ఈ లోకం మహా భయంకరమైన నోటితో అంధకారం అనే లోకాన్ని కాలం అనే కొండచిలువ మింగివేస్తుంది.
ఆ లోకాన్ని చూచి పరమ దయ గలవాడవైన నీవు నీ చూపుతోనే లేపి ప్రతీ ఝామూ కాపాడుతూ ఉంటావు
అందరూ వారి వారి ధర్మాన్ని సక్రమముగా ఆచరించడానికి కావలసిన జ్ఞ్యానాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి ప్రవర్తింపచేస్తూ ఉన్నావు

అవనిపతిరివాసాధూనాం భయముదీరయన్నటతి పరిత ఆశాపాలైస్
తత్ర తత్ర కమలకోశాఞ్జలిభిరుపహృతార్హణః

నీవు ఒక రాజువలే దుర్మార్గులకు భయం కలిగిస్తూ  సన్మార్గులకు రక్షణ కలిగ్స్తూ ప్రకాశిస్తూ ఉంటావు
నీ సంచరిస్తూ ఉంటే ఆయా లోకపాలకులు చేతులు జోడించి ప్రాథిస్తారు

అథ హ భగవంస్తవ చరణనలినయుగలం త్రిభువనగురుభిరభివన్దితమ్
అహమయాతయామయజుష్కామ ఉపసరామీతి

నీ పాదపద్మాలు మూడు లోకనాయకులకూ వందితము
యజుర్వేద జ్ఞ్యానం పొందడానికి నేను నిన్ను ఉపాసిస్తున్నాను

సూత ఉవాచ
ఏవం స్తుతః స భగవాన్వాజిరూపధరో రవిః
యజూంష్యయాతయామాని మునయేऽదాత్ప్రసాదితః

అని ప్రార్థిస్తే అలా స్తుతించబడి గుఱ్ఱం రూపములో వచ్చి ఆ పరమాత్మ అధ్యయనం, ఆగిపోని యజుర్భాగములను బోధించాడు

యజుర్భిరకరోచ్ఛాఖా దశ పఞ్చ శతైర్విభుః
జగృహుర్వాజసన్యస్తాః కాణ్వమాధ్యన్దినాదయః

గుఱ్ఱం రూపములో వచ్చాడు కాబట్టి యజుర్వేదములో ఈ శాఖకు వాజసనేయ శాఖ అంటారు
పదిహేను శాఖలు, అందులో ఒక్కోటి నూరు భాగాలు. ఈ మొత్తం పదిహేను శాఖలనూ పదిహేను మంది శిషుయులకు, కాణ్వాదులకు బోధించాడు


జైమినేః సమగస్యాసీత్సుమన్తుస్తనయో మునిః
సుత్వాంస్తు తత్సుతస్తాభ్యామేకైకాం ప్రాహ సంహితామ్

జైమిని సామ వేదాన్ని చదువుకున్నాడు, వారు వారి పుత్రులకు ఒక్కో సంహితను అందించాడు

సుకర్మా చాపి తచ్ఛిష్యః సామవేదతరోర్మహాన్
సహస్రసంహితాభేదం చక్రే సామ్నాం తతో ద్విజ

అతని కుమారుడు సుకర్మ. అతను వేయి శాఖలతో ఉన్న సామ వేదానికి వేయి మంది శిష్యులకు అందించాడు

హిరణ్యనాభః కౌశల్యః పౌష్యఞ్జిశ్చ సుకర్మణః
శిష్యౌ జగృహతుశ్చాన్య ఆవన్త్యో బ్రహ్మవిత్తమః

హిరణ్యనాభ కౌశల్య పౌష్యంకులు, ఈ ముగ్గురూ సుకర్మ శిష్యులు.
వీరు అవంతి వేదములను నేర్చుకున్నారు

ఉదీచ్యాః సామగాః శిష్యా ఆసన్పఞ్చశతాని వై
పౌష్యఞ్జ్యావన్త్యయోశ్చాపి తాంశ్చ ప్రాచ్యాన్ప్రచక్షతే

ఉత్తర దేశీయులు వేయిలో ఐదు వందలు తీసుకుని సామవేదాన్ని అధ్యయనం చేస్తున్నారు
పౌష్యంజన అవంత్యులు ప్రాచ్య ఉదీచ్య శాఖలు నేర్చుకున్నారు


లౌగాక్షిర్మాఙ్గలిః కుల్యః కుశీదః కుక్షిరేవ చ
పౌష్యఞ్జిసిష్యా జగృహుః సంహితాస్తే శతం శతమ్

వీరందరూ పౌష్యజ్ఞ్య శిష్యులు. ఈ ఐదుగురూ ఒక్కొక్కరూ నూరు శాఖలను తీసుకున్నారు

కృతో హిరణ్యనాభస్య చతుర్వింశతి సంహితాః
శిష్య ఊచే స్వశిష్యేభ్యః శేషా ఆవన్త్య ఆత్మవాన్

హిరణ్య నాభుని 24 సంహితలను ఇలా చదువుకున్నవారు వారి వారి శిష్యులకు శిష్య పరంపరగా పెరిగి వెళ్ళాయి.


                                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                           సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఐదవ అధ్యాయం

                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఐదవ అధ్యాయం




శ్రీశుక ఉవాచ
అత్రానువర్ణ్యతేऽభీక్ష్ణం విశ్వాత్మా భగవాన్హరిః
యస్య ప్రసాదజో బ్రహ్మా రుద్రః క్రోధసముద్భవః

ఈ భాగవతములో సకల జగద్రూపుడైన శ్రీమన్నారాయణుడు వర్ణించబడతారు
ఆయనకు సంతోషం వస్తే బ్రహ్మపుట్టాడు. కోపం వస్తే శివుడు పుట్టాడు. అలాంటి పరమాత్మ కథ శ్రీమద్భాగవతములో ఉంటుంది

త్వం తు రాజన్మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి
న జాతః ప్రాగభూతోऽద్య దేహవత్త్వం న నఙ్క్ష్యసి

చనిపోతాననే జంతుబుద్ధి వదలిపెట్టు. నీవు పుట్టలేదు, పుట్టబోవు, నశించవు
దేహం కలవాడు పుట్టడు. దేహం పుడుతుంది

న భవిష్యసి భూత్వా త్వం పుత్రపౌత్రాదిరూపవాన్
బీజాఙ్కురవద్దేహాదేర్వ్యతిరిక్తో యథానలః

కొడుకూ మనవడూ అందరూ నీవే అనుకుంటే, వారి రూపములో నీవు బతికే ఉన్నావు.
వారు నీవు కాదు అనుకుంటే , నీవు పుట్టనే లేదు.
నీవు పుట్టలేదు. ఇది వరకు పుట్టిలేవు.. మరణించవు, ఇది వరకు మరణించి లేవు. బీజం నుంచి వృక్ష్మూ వృక్షము నుండి బీజమూ ఎపుడూ పుడుతూనే ఉంటుంది
అగ్ని జల వాయు సంబంధముతోనే అది పుడుతుంది
శుక్ర శోణిత అగ్ని సంయోగముతోనే దేహం పుడుతుంది. ఆత్మకు ఈ వేటితోనూ సంబంధం లేదు

స్వప్నే యథా శిరశ్ఛేదం పఞ్చత్వాద్యాత్మనః స్వయమ్
యస్మాత్పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజోऽమరః

నీవు కలగంటావు, కలలో తల నరికేశారు అని అంటావు, అది నీవే చెబుతావు
నీ కలలో తల నరికి వేయుట ఎంత అబద్ధమో నీవు చచ్చుటా అంతే అబద్దం
ఏ శరీరములో ఉండి నీవు ఆత్మను చూస్తున్నావో దానికి పుట్టుకా మరణమూ రెండూ లేవు.

ఘటే భిన్నే ఘటాకాశ ఆకాశః స్యాద్యథా పురా
ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సమ్పద్యతే పునః

కుండ అంటే ఆకాశమే. ఆకాశానికి కప్పు వేస్తే కుండ. ఒక పరిమిత భాగం చుట్టూ ఒక ఆకారం వేసి ఆకాశాన్ని కప్పి ఉంచుతున్నాము. అదే కుండ పగలగొడితే ఆకాశం ఆకాశములోనే ఉంటుంది. దేహం పోతే ఆత్మ ఆత్మలాగే ఉంటుంది. ఆకాశానికి కుండ ఎలా ఆవరణమో, ఆత్మకు ఆవరణ దేహం. దేహాన్ని వదలి జీవుడు బ్రహ్మలో చేరతాడు.

మనః సృజతి వై దేహాన్గుణాన్కర్మాణి చాత్మనః
తన్మనః సృజతే మాయా తతో జీవస్య సంసృతిః

మనస్సే దేహాలనూ కర్మలనూ గుణాలనూ ఆత్మకు సృష్టిస్తుంది. అలాంటి మనసును మాయ సృష్టిస్తుంది. మాయతో జీవునికి సంసారం ఏర్పడుతుంది

స్నేహాధిష్ఠానవర్త్యగ్ని సంయోగో యావదీయతే
తావద్దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః
రజఃసత్త్వతమోవృత్త్యా జాయతేऽథ వినశ్యతి

ప్రమిదలో నూనె ఉన్నంతవరకూ వత్తి కాలుతుంది. ప్రమిద ఉన్నా, నూనె లేకుంటే వత్తి కాలదు. దేహం ఉన్నా షేహం లేకుంటే మనసు సంస్కరించదు. సంస్కృతములో నూనెకు స్నేహం అని అంటారు. ఆ నూనే సంస్కారము.
గుణత్రయముతో పుట్టి గుణ త్రయముతోనే నశిస్తారు

న తత్రాత్మా స్వయంజ్యోతిర్యో వ్యక్తావ్యక్తయోః పరః
ఆకాశ ఇవ చాధారో ధ్రువోऽనన్తోపమస్తతః

ఈ ఆత్మ స్వయం జ్యోతి. అది వ్యక్తమూ అవ్యక్తమూ కాదు. రెంటికీ అవతల ఉంటుంది. ఆకాశములా ఆధారమైనది

ఏవమాత్మానమాత్మస్థమాత్మనైవామృశ ప్రభో
బుద్ధ్యానుమానగర్భిణ్యా వాసుదేవానుచిన్తయా

ఆత్మను పరమాత్మలో ఉన్న ఆత్మలాగే భావించి అనుమాన గర్భమైన బుద్ధితో పరమాత్మనే ధ్యానిస్తూ

చోదితో విప్రవాక్యేన న త్వాం ధక్ష్యతి తక్షకః
మృత్యవో నోపధక్ష్యన్తి మృత్యూనాం మృత్యుమీశ్వరమ్

బ్రాహ్మణ శాపముతో తఖకుడు కాల్చేది నిన్ను కాదు. నీ దేహాన్ని
మృత్యువులకు మృత్యువైన పరమాత్మను మృత్యువు ఎక్కడైనా అంటుందా

అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదమ్
ఏవం సమీక్ష్య చాత్మానమాత్మన్యాధాయ నిష్కలే

పరమాత్మ పదమే నా స్థానము
నేనే పరమాత్మ నివాసానికి వెళతాను
అని ఇలా ఆత్మ స్వరూపాన్ని తలచుకుని పరమాత్మ యందు ఆత్మలో దీన్ని ఉంచి

దశన్తం తక్షకం పాదే లేలిహానం విషాననైః
న ద్రక్ష్యసి శరీరం చ విశ్వం చ పృథగాత్మనః

అలా చేస్తే తక్షకుడు వచ్చి కరుస్తున్నా నీవు దాన్ని చూడలేవు
ఆత్మ కంటే వేరుగా ప్రపంచాన్నీ చూడలేవు, నిన్ను కరుస్తున్న పామునూ చూడలేవు
కాలిపోతున్న నీ దేహాన్నీ చూడలేవు

ఏతత్తే కథితం తాత యదాత్మా పృష్టవాన్నృప
హరేర్విశ్వాత్మనశ్చేష్టాం కిం భూయః శ్రోతుమిచ్ఛసి

(ద్వితీయ స్కంధములో) నీవు అడిగిన 'ఆత్మ అంటే ఏమిటీ అన్న దానికి సమాధానం ఇది.
నీవు ఎలా ఆత్మ గురించి అడిగావో, ఈ ఆత్మా జగత్తూ అంటే పరమాత్మ యొక్క లీల అని చెప్పాను
ఇంకా నీవు ఏమి వినాలనుకుంటున్నావో చెప్పవలసింది.


                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                    సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం

                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
కాలస్తే పరమాణ్వాదిర్ద్విపరార్ధావధిర్నృప
కథితో యుగమానం చ శృణు కల్పలయావపి

పరమాణువు నుంచీ ద్విపరార్థం వరకూ కాలాన్ని చెప్పుకున్నాము

చతుర్యుగసహస్రం తు బ్రహ్మణో దినముచ్యతే
స కల్పో యత్ర మనవశ్చతుర్దశ విశామ్పతే

నాలుగు యుగములు వేయి సార్లు తిరిగితే బ్రహ్మకు ఒక పూట. దీన్ని కల్పమూ అంటారు
ఈ కల్పములో పధ్నాలుగు మంది మనువులు ఉంటారు. తరువాత ప్రళయం వస్తుంది. ఇది బ్రహ్మ యొక్క రాత్రి

తదన్తే ప్రలయస్తావాన్బ్రాహ్మీ రాత్రిరుదాహృతా
త్రయో లోకా ఇమే తత్ర కల్పన్తే ప్రలయాయ హి

ఈ బ్రహ్మ యొక్క రాత్రిలో మూడులోకాలు పోతాయి. భూః భువ@ సువః.

ఏష నైమిత్తికః ప్రోక్తః ప్రలయో యత్ర విశ్వసృక్
శేతేऽనన్తాసనో విశ్వమాత్మసాత్కృత్య చాత్మభూః

దీన్ని నైమిత్తిక ప్రళయం అంటారు. పరమాత్మ అనంతాసనుడై ఆదిశేషుని మీద పడుకుని ప్రపంచాన్ని తనలో చేర్చుకుని ఆత్మ భూః గా ఉంటాడు

ద్విపరార్ధే త్వతిక్రాన్తే బ్రహ్మణః పరమేష్ఠినః
తదా ప్రకృతయః సప్త కల్పన్తే ప్రలయాయ వై

ఇదే బ్రహ్మకు ద్విపరార్థకాలం ఐతే అది మహా ప్రళయం. దాన్ని మహా కల్పం అంటారు
అపుడు భూమీ జలం అగ్ని వాయువు ఆకాశం మహత్ అహంకారం అనే ఏడు ప్రకృతులూ ప్రళయాన్ని పొందుతాయి

ఏష ప్రాకృతికో రాజన్ప్రలయో యత్ర లీయతే
అణ్డకోషస్తు సఙ్ఘాతో విఘాట ఉపసాదితే

దీన్ని ప్రాకృతిక ప్రళయం అంటారు
అండ కోశం అంతా కలసి

పర్జన్యః శతవర్షాణి భూమౌ రాజన్న వర్షతి
తదా నిరన్నే హ్యన్యోన్యం భక్ష్యమాణాః క్షుధార్దితాః
క్షయం యాస్యన్తి శనకైః కాలేనోపద్రుతాః ప్రజాః

మహాప్రళయ కాలములో నూరు సంవత్సరాలు వర్షము లేకుండా ఉంటుంది
ప్రజలు ఆకలికి తాళలేక ఒకరినొకరు తింటారు
అందరూ మెల్లగా నశిస్తారు

సాముద్రం దైహికం భౌమం రసం సాంవర్తకో రవిః
రశ్మిభిః పిబతే ఘోరైః సర్వం నైవ విముఞ్చతి

ఎక్కడ తడి అనేది ఉందో దాన్ని మొత్తం సూర్యుడు లాగుతాడు. సముద్రములో, దేహములో భూమిలో నదులలో రసములో ఉన్న నీటిని ప్రళయకాల సూర్యుడు ఈనాలిగింటిలో ఉండే నీటిని తన ఘోర కిరణాలతో తీసుకుంటాడు. ఏ ఒక్క నీటి బిందువునీ విడిచిపెట్టడు

తతః సంవర్తకో వహ్నిః సఙ్కర్షణముఖోత్థితః
దహత్యనిలవేగోత్థః శూన్యాన్భూవివరానథ

ప్రళయ కాలాగ్ని సంకర్షణుని వేయి ముఖముల నుండి లేచి వాయు వేగముతో లేచి మొత్తం శూన్యముగా ఉన్న అతల సుతలాది వివరాలను కాల్చిపారేస్తాయి

ఉపర్యధః సమన్తాచ్చ శిఖాభిర్వహ్నిసూర్యయోః
దహ్యమానం విభాత్యణ్డం దగ్ధగోమయపిణ్డవత్

ఆ జ్వాలలు పైకీ కిందకీ చుట్టూ నిండుతాయి
తన శిఖలూ సూయుని శిఖలూ అగ్ని శిఖలతో కాల్చబడిన ప్రపంచము బాగా కాలిన పిడకలా అవుతుంది.

తతః ప్రచణ్డపవనో వర్షాణామధికం శతమ్
పరః సాంవర్తకో వాతి ధూమ్రం ఖం రజసావృతమ్

అలా కాలిన  బూడిద ఐన తరువాత భయంకరమైన వాయువులతో కూడిన వర్షం, రజస్సుతో నిండి నూరు సంవత్సరాలు పడుతుంది

తతో మేఘకులాన్యఙ్గ చిత్ర వర్ణాన్యనేకశః
శతం వర్షాణి వర్షన్తి నదన్తి రభసస్వనైః

నూరు సంవత్సరాలు వర్షిస్తాయి
భయంకర ధ్వనితో గర్ఝిస్తాయి.

తత ఏకోదకం విశ్వం
బ్రహ్మాణ్డవివరాన్తరమ్

సూర్యభగవానుడు తీసుకున్న మొత్తం జలాలని విడిచిపెడతాడు
చివరకు ఉదకం ఒక్కటే మిగులుతుంది. ప్రపంచం మొత్తములో జలం మాత్రమే ఉంటుంది. బ్రహ్మానడ వివరములో కూడాజలమే ఉంటుంది.

తదా భూమేర్గన్ధగుణం గ్రసన్త్యాప ఉదప్లవే
గ్రస్తగన్ధా తు పృథివీ ప్రలయత్వాయ కల్పతే

భూమి గంధాన్ని జలము తీసుకుంటుంది. గంధము పోయిన భూమి లయమైపోతుంది

అపాం రసమథో తేజస్తా లీయన్తేऽథ నీరసాః
గ్రసతే తేజసో రూపం వాయుస్తద్రహితం తదా

జలం యొక్క రసాన్ని తేజస్సు తీసుకుంటుంది. రసం పోయిన జలము లయమైపోతుంది
తేజో రూపాన్ని వాయువు. వాయువు రూపాన్ని ఆకాశమూ తీసుకుంటాయి

లీయతే చానిలే తేజో వాయోః ఖం గ్రసతే గుణమ్
స వై విశతి ఖం రాజంస్తతశ్చ నభసో గుణమ్

ఆకాశ గుణాన్ని తామస అహంకారం తీసుకోగా, ఆకాశం కూడా లయమవుతుంది

శబ్దం గ్రసతి భూతాదిర్నభస్తమను లీయతే
తైజసశ్చేన్ద్రియాణ్యఙ్గ దేవాన్వైకారికో గుణైః

జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలు దేవతలలో కలుస్తాయి

మహాన్గ్రసత్యహఙ్కారం గుణాః సత్త్వాదయశ్చ తమ్
గ్రసతేऽవ్యాకృతం రాజన్గుణాన్కాలేన చోదితమ్

అహంకారాన్ని మహత్ తత్వమూ. దాన్ని సత్వాది గుణాలు తీసుకుంటాయి

న తస్య కాలావయవైః పరిణామాదయో గుణాః
అనాద్యనన్తమవ్యక్తం నిత్యం కారణమవ్యయమ్

ఇలాంటి మహత్ తత్వాన్ని అవ్యాహృతమైన కాలము చేత ప్రేరేపించబడిన ప్రకృతి తీసుకుంటుంది
ఇదంతా కలసి పరమాత్మలోకి వెళ్ళిపోతాయి

న యత్ర వాచో న మనో న సత్త్వం తమో రజో వా మహదాదయోऽమీ
న ప్రాణబుద్ధీన్ద్రియదేవతా వా న సన్నివేశః ఖలు లోకకల్పః

అక్కడ వాక్కూ సత్వమూ మనసూ రజస్తమో గుణాలూ, మహదాదులూ ప్రాణ బుద్ధి ఇంద్రియ దేవతలూ సన్నివేశమూ ఏవీ కనపడవు

న స్వప్నజాగ్రన్న చ తత్సుషుప్తం న ఖం జలం భూరనిలోऽగ్నిరర్కః
సంసుప్తవచ్ఛూన్యవదప్రతర్క్యం తన్మూలభూతం పదమామనన్తి

జాగ్రత్ స్వప్న సుషుప్తులూ నిద్రా ఆకాశం జలం భూమీ వాయువూ అగ్నీ సూర్యుడూ నిద్రపోయినట్లుగా లేనట్లుగా, ఊహించడానికి వీలు లేనట్లుగా, పరమాత్మ పదమును చేరుకుంటాయి

లయః ప్రాకృతికో హ్యేష పురుషావ్యక్తయోర్యదా
శక్తయః సమ్ప్రలీయన్తే వివశాః కాలవిద్రుతాః

ఇది ప్రాకృతిక ప్రళయం.
అన్ని శక్తులూ కాలముచే ప్రేరేపించబడి ఒకదానిలో ఒకటి లీనమైపోతాయి

బుద్ధీన్ద్రియార్థరూపేణ జ్ఞానం భాతి తదాశ్రయమ్
దృశ్యత్వావ్యతిరేకాభ్యామాద్యన్తవదవస్తు యత్

అవి అన్నీ జ్ఞ్యానములో చేరతాయి. కనపడుతున్నట్టుగా, కనపడనివి కనపడినట్టుగా, కనపడినవి కనపడంట్లుగా వ్యతిరేకముగా చూస్తాము.

దీపశ్చక్షుశ్చ రూపం చ జ్యోతిషో న పృథగ్భవేత్
ఏవం ధీః ఖాని మాత్రాశ్చ న స్యురన్యతమాదృతాత్

దీపమూ చక్షూ రూపము, జ్యోతి యొక్క వికారం.
జ్యోతి లేకుండా విడిగా ఉండలేవు. బుద్ధీ ఇంద్రియములూ మాత్రలూ, ఇవన్నీ కూడా ఒకటిలేకుండా ఇంకొకటి ఉండలేవు. బుద్ధి లేనిదే మనస్సు,మనసు లేనిదే ఇంద్రియాలూ, ఇంద్రియం లేనిదే అహంకారమూ, ఇలా ప్రతీదీ రెండవదాని తత్వాన్ని ఆశ్రయించే ఉంటాయి

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి చోచ్యతే
మాయామాత్రమిదం రాజన్నానాత్వం ప్రత్యగాత్మని

నిదురపోవుటా మేలుకొని ఉండుటా కలలు గనుటా, బుద్ధివి.
ఎలాగైతే మనం దీపమూ కన్నూ రూపమూ తేజస్సువి అని చెబుతున్నామో
నిద్రా మెలకువా కలలూ బుద్ధివి.
ఇది గమనిస్తే ప్రపంచం మొత్తం మాయా జనితం అనీ, ఆత్మలో ఉండి నానారూపాలుగా భాసిస్తుంది అని అర్థమవుతుంది.

యథా జలధరా వ్యోమ్ని భవన్తి న భవన్తి చ
బ్రహ్మణీదం తథా విశ్వమవయవ్యుదయాప్యయాత్

ఆకాశములో మేఘాలు కనపడతాయీ కనపడవు. ఉంటాయీ పోతాయి. అవి ఎంత భ్రమలో ఇవీ అంతే భ్రమ. ఆకాశములో మేఘాలు ఉండీ ఉండనట్లుగా పరపంచం అంతా పరమాత్మలో ఉంటుందీ ఉండదు.
సృష్టీ స్థితీ నాశం అనే మూడు గుణాలతో ప్రపంచం ఉంటుంది. అన్ని అవయవిలకూ సత్యమే అవయవము.

సత్యం హ్యవయవః ప్రోక్తః సర్వావయవినామిహ
వినార్థేన ప్రతీయేరన్పటస్యేవాఙ్గ తన్తవః

కనుక పరమాత్మలేకుండా ప్రపంచం ఉండదు.

యత్సామాన్యవిశేషాభ్యాముపలభ్యేత స భ్రమః
అన్యోన్యాపాశ్రయాత్సర్వమాద్యన్తవదవస్తు యత్

ప్రపంచాన్ని చూసి నిత్యం అని సామాన్య విశేషభావాలతో దేన్నైతే తలుస్తున్నారో అది అంతా భ్రమా
పుట్టుకా నాశమూ ఉన్నవన్నీ వస్తువులు కావు. ఎప్పటికీ ఉండేది మాత్రమే వస్తువు. ఎప్పటికీ ఉండేది పరమాత్మే. ఏది వస్తువో అదే వాస్తవం. పరమాత్మ ఒక్కడే వాస్తవం. పరమాత్మ ఒక్కడే సత్యం.

వికారః ఖ్యాయమానోऽపి ప్రత్యగాత్మానమన్తరా
న నిరూప్యోऽస్త్యణురపి స్యాచ్చేచ్చిత్సమ ఆత్మవత్

మనం ఎన్ని భేధాలనూ వికారాలనూ చెప్పుకుంటున్నా ప్రత్యగాత్మ లేకుండా మనసూ బుద్ధీ గుణాలూ బుద్ధీ భాసించవు.

న హి సత్యస్య నానాత్వమవిద్వాన్యది మన్యతే
నానాత్వం ఛిద్రయోర్యద్వజ్జ్యోతిషోర్వాతయోరివ

సత్యం ఎపుడైనా నానా విధాలుగా ఉంటుందా. సత్యము ఏకం. సత్యములో భేధాలు ఉండవు.
గాలి యొక్క విభాగం అగ్ని యొక్క విభాగము చేయగలమా. ఎన్నీ దీపాలు ఉంటే అన్ని అగ్నులూ అని అనగలమా. ఎన్ని శరీరాలు ఉంటే అన్ని వస్తువులు అని అనగలమా.

యథా హిరణ్యం బహుధా సమీయతే నృభిః క్రియాభిర్వ్యవహారవర్త్మసు
ఏవం వచోభిర్భగవానధోక్షజో వ్యాఖ్యాయతే లౌకికవైదికైర్జనైః

బంగారం ఒక్కటే దాన్ని మానవులు ఉంగరమనీ గాజులనీ కడియాలనీ హారాలనీ అంటున్నా ఉన్న బంగారమొకటే. అలాగ మనం లోకములో గానీ, వేదములో గానీ ఎన్ని పేర్లైతే చెప్పుకుంటున్నామో అది అంతా పరమాత్మే. ఎన్ని పేర్లు పెట్టినా బంగారం ఒకటే ఐనట్లు, ఎన్ని రకాలుగా ప్రపంచాన్ని వర్ణించినా అది అంతా పరమాత్మే.

యథా ఘనోऽర్కప్రభవోऽర్కదర్శితో
హ్యర్కాంశభూతస్య చ చక్షుషస్తమః
ఏవం త్వహం బ్రహ్మగుణస్తదీక్షితో
బ్రహ్మాంశకస్యాత్మన ఆత్మబన్ధనః

శరీరమూ, ఆత్మ, ఆత్మలో పరమాత్మ అంటున్నాము. పరమాత్మే అన్నీ చూపుతున్నాడని అంటున్నాము. ఏ పరమాత్మ దీన్ని సృష్టిస్తున్నాడని అంటున్నామో ఆ పరమాత్మనే మనం గుర్తించట్లేదు.
మేఘము సూర్యునితో సృష్టించబడింది. మేఘం ఉన్నదని మేఘాన్ని చూపేదీ సూర్యుడే. కన్ను కూడా సూర్యుడే. సూర్యుడి వలన పుట్టి సూర్యుడి వలన చూపబడే మేఘము, సూర్యుని వలన చూపబడే కన్నుకి చీకటిని కలిగిస్తుంది. అదే కన్ను సూర్యుడు లేకుంటే మేఘాన్ని చూడలేదు. అదే మేఘం సూర్యుడు లేకుంటే లేదు.సూర్యుని వలన పుట్టిన మేఘం సూర్యున్ని కప్పినట్లు కనపడినట్లుగా భగవంతుని వలన పుట్టిన జగత్తు, భగవంతున్నే కప్పినట్లుగా కనపడుతుంది.
జగతూ ఆత్మ సృష్టీ బుద్ధీ మనసూ పరమాత్మ వలననే సృష్టించబడ్డాయి. ఆ బుద్ధీ మనసే పరమాత్మను చూడలేకుండా చేస్తున్నాయి.

నేను బ్రహ్మ యొక్క అవయవాన్ని
బ్రహ్మ చేతే చూడబడుతూ ఉన్నాను
ఆయన సృష్టే ఆత్మను బంధిస్తూ ఉన్నది, ఆంతను చూపెడుతూ ఉన్నది

ఘనో యదార్కప్రభవో విదీర్యతే చక్షుః స్వరూపం రవిమీక్షతే తదా
యదా హ్యహఙ్కార ఉపాధిరాత్మనో జిజ్ఞాసయా నశ్యతి తర్హ్యనుస్మరేత్

ఎపుడైతే ఈ మేఘాన్ని చీల్చి వేస్తే సూర్యుడు కనపడతాడు. సూర్యుని వలన పుట్టిన మేఘాన్ని చీల్చివేస్తే సూర్యుడు కనపడతాడు
ఆత్మకు ఉపాధిగా ఉండే అహంకారం జిజ్ఞ్యాసతో నశిస్తే మబ్బు తొలగితే సూర్యుడు కనపడినట్లుగా భగవానుడు కనపడతాడు

యదైవమేతేన వివేకహేతినా మాయామయాహఙ్కరణాత్మబన్ధనమ్
ఛిత్త్వాచ్యుతాత్మానుభవోऽవతిష్ఠతే తమాహురాత్యన్తికమఙ్గ సమ్ప్లవమ్

వివేకం అనే ఆయుధముతో ఇలాంటి అల్పబంధనాన్ని పరమాత్మ స్వరూపుడై పరమాత్మను మనసులో ఉంచుకుని, పరమాత్మలోనే లీనమవుతే అది ఆత్యంతిక ప్రళయం.

నిత్యదా సర్వభూతానాం బ్రహ్మాదీనాం పరన్తప
ఉత్పత్తిప్రలయావేకే సూక్ష్మజ్ఞాః సమ్ప్రచక్షతే

ఇది గాక నిత్య ప్రళయం, నిత్య సృష్టీ ఉంటుంది. సూక్షం తెలిసినవారు మాత్రమే దీన్ని గుర్తుపడతారు. ప్రాణి పెరగడం అంటే నిరంతరం ఆ శరీరములో పాత కణాలు నశిస్తూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి.
జగత్తులో జరిగే ప్రతీ మార్పూ సృష్టి లయాలకు సంకేతం. నదీ ప్రావహములో పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. మన శరీరం కూడా నిత్యం పరిణామం చెందుతూ ఉంటుంది

కాలస్రోతోజవేనాశు హ్రియమాణస్య నిత్యదా
పరిణామినాం అవస్థాస్తా జన్మప్రలయహేతవః

కాల వేగముతో రోజు రోజుకూ ఇదంతా హరించబడేది
ఇదంతా పరిణామం యొక్క వ్యవస్థ

అనాద్యన్తవతానేన కాలేనేశ్వరమూర్తినా
అవస్థా నైవ దృశ్యన్తే వియతి జ్యోతిషాం ఇవ

ఆది లేకుండా అంతం లేకుండా ఉండే ఈశ్వర రూపమే కాలము.
రోజులు గడుస్తున్నా నెలలు గడుస్తున్నా యుగాలు గడుస్తున్నా అది మనకు కనపడదు.ఉత్పత్తీ వినాశాన్ని మనం గమనించలేము.

నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రాకృతికో లయః
ఆత్యన్తికశ్చ కథితః కాలస్య గతిరీదృశీ

ఇలా ప్రళయం నాలుగు రకాలు
నిత్య(మనలో వచ్చే ప్రతీ మార్పు), నైమిత్తిక (బ్రహ్మకు ఒకపూట) ప్రాకృతిక (మహా ప్రళయం), ఆత్యంతికం(మోక్షం)

ఏతాః కురుశ్రేష్ఠ జగద్విధాతుర్నారాయణస్యాఖిలసత్త్వధామ్నః
లీలాకథాస్తే కథితాః సమాసతః కార్త్స్న్యేన నాజోऽప్యభిధాతుమీశః

పరమాత్మ యొక్క ఈ లీలా కథలన్నీ నీకు సంగ్రహముగా వివరించాను.
సంపూర్ణముగా చెప్పాలంటే బ్రహంకు కూడా సాధ్యం కాదు. క్లుప్తముగా చెప్పాను

సంసారసిన్ధుమతిదుస్తరముత్తితీర్షోర్
నాన్యః ప్లవో భగవతః పురుషోత్తమస్య
లీలాకథారసనిషేవణమన్తరేణ
పుంసో భవేద్వివిధదుఃఖదవార్దితస్య

ఎంత ప్రయత్నించినా దాట శక్యం కాని సంసారాన్ని దాటాలి అనుకునేవారికి
పురుషోత్తముడైన పరమాత్మ లీలా కథా రసమును సేవించడం తప్ప వేరే పడవ లేదు
సముద్రములో ఉన్నాము గానీ, చుట్టూ అగ్నితో బాధించబడుతూ ఉన్నాము. ఇది దాటడానికే పరమాత్మ కథ వినడం మాత్రమే మార్గము

పురాణసంహితామేతామృషిర్నారాయణోऽవ్యయః
నారదాయ పురా ప్రాహ కృష్ణద్వైపాయనాయ సః

ఈ పురాణ సంహితను నారాయణుడు,పరమాత్మ నారదునికి,నారదుడు వ్యాసునికీ, వ్యాసుడు నాకూ చెప్పాడు

స వై మహ్యం మహారాజ భగవాన్బాదరాయణః
ఇమాం భాగవతీం ప్రీతః సంహితాం వేదసమ్మితామ్

ఈ భాగవతం వేదం లాంటిది

ఇమాం వక్ష్యత్యసౌ సూత ఋషిభ్యో నైమిషాలయే
దీర్ఘసత్రే కురుశ్రేష్ఠ సమ్పృష్టః శౌనకాదిభిః

ఈ భాగవతాన్ని సూతుడు నైమిశారణ్యములో దీర్ఘ సత్రములో శౌనకాది ఋషులు అడిగితే చెబుతాడు


                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                              సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం మూడవ అధ్యాయం

                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం మూడవ అధ్యాయం
 

శ్రీశుక ఉవాచ
దృష్ట్వాత్మని జయే వ్యగ్రాన్నృపాన్హసతి భూరియమ్
అహో మా విజిగీషన్తి మృత్యోః క్రీడనకా నృపాః

నేను భూమిని గెలవాలీ, నేను భూమిని గెలవాలీ,  అనే రాజుని చూచి భూమి నవ్వుతుంది
మృత్యువు చేతిలో ఆట బొమ్మలైన రాజులు నన్ను గెలవాలి అనుకుంటున్నారు

కామ ఏష నరేన్ద్రాణాం మోఘః స్యాద్విదుషామపి
యేన ఫేనోపమే పిణ్డే యేऽతివిశ్రమ్భితా నృపాః

జ్ఞ్యానం ఉన్నప్పటికీ రాజుల ఈ కోరిక వ్యర్థమే అవుతుంది
నీటి మీద నురుగులాంటి శరీరం మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు రాజులు

పూర్వం నిర్జిత్య షడ్వర్గం జేష్యామో రాజమన్త్రిణః
తతః సచివపౌరాప్త కరీన్ద్రానస్య కణ్టకాన్

మొదలు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను రాజులు గెలవాలి
తరువాత సచివులనూ పౌరులనూ మిత్రులనూ గెలిచి, ప్రజలకు కంటకం కలిగించేవారిని తరువాత గెలవాలి

ఏవం క్రమేణ జేష్యామః పృథ్వీం సాగరమేఖలామ్
ఇత్యాశాబద్ధహృదయా న పశ్యన్త్యన్తికేऽన్తకమ్

మేము ఈ రీతిలో మొత్తం భూమండలాన్ని గెలుస్తాము
ఇలా వీళ్ళు ఆశతో కలలు కంటూ ఉండగానే మృత్యువు కాస్తా వస్తాడు
అతి దగ్గరలో వచ్చే మృత్యువును చూడలేక దూరములో ఉన్న రాజ్యాలను చూస్తున్నారు

సముద్రావరణాం జిత్వా మాం విశన్త్యబ్ధిమోజసా
కియదాత్మజయస్యైతన్ముక్తిరాత్మజయే ఫలమ్

సముద్రమే హద్దుగా ఉన్న నన్ను గెలిచి మళ్ళీ వారు నాలోనే కలుస్తున్నారు
వీరి ఆత్మ జయం ఎక్కడ? వీరు ముక్తిని ఎలా గెలుస్తారు

యాం విసృజ్యైవ మనవస్తత్సుతాశ్చ కురూద్వహ
గతా యథాగతం యుద్ధే తాం మాం జేష్యన్త్యబుద్ధయః

భూమీ రాజ్యాన్ని, ఇటువంటి వాటిని మనువులూ మనుపుత్రులూ ఎలా వచ్చారో యుద్ధములో అలాగే పోయారు
ఇలాంటి వారు నన్ను గెలుస్తారా
గెలిచినవారూ పాలించినవారూ అందరూ పోయారు.

మత్కృతే పితృపుత్రాణాం భ్రాతృణాం చాపి విగ్రహః
జాయతే హ్యసతాం రాజ్యే మమతాబద్ధచేతసామ్

నా కోసం తండ్రీ కొడుకూ సోదరులూ అని కూడా చూడకుండా వారిని వారు చంపుకుంటారు
వారిలో వారికి నా కోసమే విరోధం వస్తుంది. అందరి మనసులలో భూమి మీదే మమత  ఉంటుంది.

మమైవేయం మహీ కృత్స్నా న తే మూఢేతి వాదినః
స్పర్ధమానా మిథో ఘ్నన్తి మ్రియన్తే మత్కృతే నృపాః

"ఇదంతా నా భూమి" అని మూఢులై మాట్లాడుకుంటూ ఉంటారు
పోటీ పడి, విరోధించి పరస్పరం చంపుకుంటారు నా కోసం

పృథుః పురూరవా గాధిర్నహుషో భరతోऽర్జునః
మాన్ధాతా సగరో రామః ఖట్వాఙ్గో ధున్ధుహా రఘుః

తృణబిన్దుర్యయాతిశ్చ శర్యాతిః శన్తనుర్గయః
భగీరథః కువలయాశ్వః కకుత్స్థో నైషధో నృగః

హిరణ్యకశిపుర్వృత్రో రావణో లోకరావణః
నముచిః శమ్బరో భౌమో హిరణ్యాక్షోऽథ తారకః

ఇలాంటి రాజులందరూ (మనకు వేరే పురాణాలలో శతకంఠరావణాసురుడు ఉన్నాడు. వాడిని లోకరావణుడు అని ఇక్కడ చెప్పారు)

అన్యే చ బహవో దైత్యా రాజానో యే మహేశ్వరాః
సర్వే సర్వవిదః శూరాః సర్వే సర్వజితోऽజితాః

చాలా మంది రాక్షసులూ రాజులూ చక్రవర్తులూ మహేశ్వరులుగా ఉండి
మాకు అన్నీ తెలుసు మేమే శూరులం అని అందరినీ గెలిచారు, ఎవరినీ గెలవలేదు

మమతాం మయ్యవర్తన్త కృత్వోచ్చైర్మర్త్యధర్మిణః
కథావశేషాః కాలేన హ్యకృతార్థాః కృతా విభో

ఇలాంటి వారందరూ, గెలిచినవారు ఓడినవారూ బతికినవారూ బతుకుతున్నవారూ అందరూ నా మీద మమకారముతోనే బతుకుతున్నారు
ఆశలు బాగా పెంచుకుంటున్నారు నా కోసం

కథా ఇమాస్తే కథితా మహీయసాం వితాయ లోకేషు యశః పరేయుషామ్
విజ్ఞానవైరాగ్యవివక్షయా విభో వచోవిభూతీర్న తు పారమార్థ్యమ్

ఇలా కోట్లాడిన వారందరూ కాలములో కలసిపోయారు. కథ మాత్రం మిగిలిపోయింది
అనుకున్న కోరిక మాత్రం తీఎరలేదు వారికి
ఈ రీతిలో చాలా మంది రాజుల కథను చెప్పాను. లోకములో కీర్తిని పెంచుకుని ప్రాణాలు వదలిన వారి కథలు చాలా చెప్పాను
ఇలా చెప్పడానికి కారణం, రామునిలా ప్రవర్తించండి రావణునిలా కాదు, ధర్మరాజులా ప్రవర్తించండి దుర్యోధనునిలా కాదు. ఇంత పెద్దవారు కూడా ఇన్ని ఘనకార్యాలు చేసి కూడా వారు ఎవరూ మిగలలేదని జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలగాలని చెప్పాను. ఎంత ఘనకీర్తి సంపాదించినా, ఎంత జ్ఞ్యానమున్నా, ఎంత పరాక్రమం సంపాదించినా ఎంత బలం ఉన్నా అందరూ పోయేవారే అని తెలుసుకుని విజ్ఞ్యానం వైరాగ్యం కలగడానికి కొన్ని మాటలు అల్లి నీకు కొన్ని కథలు అలా చెపాను.కానీ ఆ కథలే పరమార్థం కాదు. ఆ కథల వలన విజ్ఞ్యానం పెంచుకోండి. ఇదంతా కేవల వాగ్వైభవం

యస్తూత్తమఃశ్లోకగుణానువాదః సఙ్గీయతేऽభీక్ష్ణమమఙ్గలఘ్నః
తమేవ నిత్యం శృణుయాదభీక్ష్ణం కృష్ణేऽమలాం భక్తిమభీప్సమానః

దీనికి ప్రథానం, పరమాత్మా జీవాత్మ ఈ రెండే సత్యం అనేది
జీవులు ఎన్ని అకృత్యాలు జరిపి అధర్మాన్ని ఎలా వృద్ధి చేసి మోహములో పడతారో అర్థం కావడానికి కథా రూపములో అందించాను.
ఏ కథలో ఐనా పరమాత్మ గుణాలనే చెప్పాను. ఆ కథలు సంపూర్ణ అమంగళలని సంపూర్ణముగా తొలగిస్తాయి
పరమాత్మ కీర్తిని పెంచేవి ఆ కథలు. మన అశుభాన్నీ తొలగించేవి ఆ కథలు. పరమాత్మ కథలు నిత్యం వినడి. పరమాత్మ యందు పరిశుద్ధమైన భక్తి కలిగి ఉండండి. ఇదే భాగవత సారం.

శ్రీరాజోవాచ
కేనోపాయేన భగవన్కలేర్దోషాన్కలౌ జనాః
విధమిష్యన్త్యుపచితాంస్తన్మే బ్రూహి యథా మునే

ఈ కలియుగములో, ఇంత అధర్మములో, ఆ కలి దోషాలను ఏ ఉపాయముతో తొలగించుకోవాలి.

యుగాని యుగధర్మాంశ్చ మానం ప్రలయకల్పయోః
కాలస్యేశ్వరరూపస్య గతిం విష్ణోర్మహాత్మనః

యుగాలూ యుగ ధర్మములూ యుగమానములూ ప్రళయమూ కల్పమూ, ఇవన్నీ కాల గతే కదా
యుగాలేమిటి యుగ ధర్మాలేమిటి ప్రళయం ఏమిటి కల్పం ఏమిటో వివరించండి

శ్రీశుక ఉవాచ
కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్తజ్జనైర్ధృతః
సత్యం దయా తపో దానమితి పాదా విభోర్నృప

కృత యుగములో ధర్మం నాలుగు పాదాలతో, అటువంటి మానవులతో కలసి ఉంటుంది
సత్యం దయ తపం దానం - ఈ నాలుగు కృత యుగములో పాదాలు

సన్తుష్టాః కరుణా మైత్రాః శాన్తా దాన్తాస్తితిక్షవః
ఆత్మారామాః సమదృశః ప్రాయశః శ్రమణా జనాః

సంతుష్టులూ దయ గలవారూ ఇంద్రియ నిగ్రహం ఓర్పూ కలవారు.
కృత యుగములో ఎక్కువ మంది సన్యాసుల లాగానే ఉంటారు

త్రేతాయాం ధర్మపాదానాం తుర్యాంశో హీయతే శనైః
అధర్మపాదైరనృత హింషాసన్తోషవిగ్రహైః

తృతా యుగములో నాలుగవ పాదం పోతుంది.
దాని వలన నాలిగింటిలో ఒక్కో భాగం పోతుంది.
అనృతం హింస అసంతోషం విరోధం వస్తాయి

తదా క్రియాతపోనిష్ఠా నాతిహింస్రా న లమ్పటాః
త్రైవర్గికాస్త్రయీవృద్ధా వర్ణా బ్రహ్మోత్తరా నృప

ఐతే హింస ఉంటుంది కానీ ఎక్కువ హింస ఉండదు, ఎక్కువ ఆశ ఉండదు.
ధర్మార్థ కామాలనే సేవిస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కూడా వేదముల చేత వృద్ధి పొందించబడేవే . అప్పుడు కూడా బ్రాహ్మణులే శ్రేష్టులుగా ఉంటారు.

తపఃసత్యదయాదానేష్వర్ధం హ్రస్వతి ద్వాపరే
హింసాతుష్ట్యనృతద్వేషైర్ధర్మస్యాధర్మలక్షణైః

తపమూ సత్యమూ దయా దానం అనే నాలిగింటిలో ద్వాపర యుగములో సగం పోతుంది
హింస, అస్నతుష్టి, అనృతం, ద్వేషములతో ఉంటారు

యశస్వినో మహాశీలాః స్వాధ్యాయాధ్యయనే రతాః
ఆధ్యాః కుటుమ్బినో హృష్టా వర్ణాః క్షత్రద్విజోత్తరాః

కీర్తివంతులూ గొప్ప స్వభావం కలవారూ స్వాధ్యాయన పరులు ఉంటారు
శ్రీమంతులూ, బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా శ్రేష్టులుగా గుర్తించబడతారు

కలౌ తు ధర్మపాదానాం తుర్యాంశోऽధర్మహేతుభిః
ఏధమానైః క్షీయమాణో హ్యన్తే సోऽపి వినఙ్క్ష్యతి

కలియుగములో నాలగవ పాదం మాత్రం పెరుగుతుంది.
అధర్మ పెరుగుతున్న కొద్దీ ధర్మం యొక్క భాగం తగ్గుతూ ఉంటుంది

తస్మిన్లుబ్ధా దురాచారా నిర్దయాః శుష్కవైరిణః
దుర్భగా భూరితర్షాశ్చ శూద్రదాసోత్తరాః ప్రజాః

అకారణ ద్వేషం కలిగి ఉంటారు
దౌర్భాగ్యం ఉంటుంది. ఆకలి ఎక్కువ ఉంటుంది. శూద్రులూ దాసులే ఉత్తములు

సత్త్వం రజస్తమ ఇతి దృశ్యన్తే పురుషే గుణాః
కాలసఞ్చోదితాస్తే వై పరివర్తన్త ఆత్మని

గుణాలు మూడూ కనపడుతూ ఉంటాయి. అవే తిరుగుతూ ఉంటాయి. తమస్సు మాత్రం మిగులుతుంది.

ప్రభవన్తి యదా సత్త్వే మనోబుద్ధీన్ద్రియాణి చ
తదా కృతయుగం విద్యాజ్జ్ఞానే తపసి యద్రుచిః

మనసు బుద్ధి ఇంద్రియములు సత్వములో ఉన్నపుడు కృత యుగముగా తెలుసుకోండి
అపుడు జ్ఞ్యానమూ తపసులో రుచి పుడుతుంది

యదా కర్మసు కామ్యేషు భక్తిర్యశసి దేహినామ్
తదా త్రేతా రజోవృత్తిరితి జానీహి బుద్ధిమన్

ధర్మార్థ కామాలో బుద్ధి ఉండి రజో గుణముతో ప్రవర్తించినపుడు అది త్రేతా యుగం అవుతుంది

యదా లోభస్త్వసన్తోషో మానో దమ్భోऽథ మత్సరః
కర్మణాం చాపి కామ్యానాం ద్వాపరం తద్రజస్తమః

అపుడు లోభమూ అసంతోషమూ మానమూ దంభమూ మత్సరమూ ప్రతీ కర్మకూ ఉంటాయి
ద్వాపర యుగములో కామ్య కర్మలు మొదలవుతాయి. అపుడు రజస్సూ తమస్సు కలిసి పని చేస్తాయి

యదా మాయానృతం తన్ద్రా నిద్రా హింసా విషాదనమ్
శోకమోహౌ భయం దైన్యం స కలిస్తామసః స్మృతః

కలియుగములో ఇవన్నీ ఉంటాయి
కేవల తమో గుణం.

తస్మాత్క్షుద్రదృశో మర్త్యాః క్షుద్రభాగ్యా మహాశనాః
కామినో విత్తహీనాశ్చ స్వైరిణ్యశ్చ స్త్రియోऽసతీః

మానవుల దృష్టే క్షుద్రముగా ఉంటుంది. అదృష్టము తక్కువ, చూపు కూడా క్షుద్రముగా ఉంటుంది. ఆకలి బాగా ఉంటుంది
కోరికలు ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉండదు. స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. యధేచ్చగా ప్రవర్తిస్తూ  ఉంటారు

దస్యూత్కృష్టా జనపదా వేదాః పాషణ్డదూషితాః
రాజానశ్చ ప్రజాభక్షాః శిశ్నోదరపరా ద్విజాః

ఊళ్ళలో దొంగలే ఎక్కువ ఉండారు.
వేదములన్నీ పాపులచేతా నాస్తికుల చేతా దూషించబడుతూ ఉంటాయి
ప్రజలను తినేవారే రాజులవుతారు
స్త్రీ యందూ భోజనం యందే కోరిక ఉంటుంది

అవ్రతా బటవోऽశౌచా భిక్షవశ్చ కుటుమ్బినః
తపస్వినో గ్రామవాసా న్యాసినోऽత్యర్థలోలుపాః

బ్రహ్మచారులకు వ్రతమూ సన్యాసులకు ఆచారమూ ఉండదు
సన్యాసులు కూడా కుటుంబం కలిగి ఉంటారు
తపస్సు చేస్తున్నాము అంటూ వారు ఊళ్ళలోనే మకాం వేస్తారు
సన్య్సాసులకు డబ్బు మీద ప్రేమ ఉంటుంది

హ్రస్వకాయా మహాహారా భూర్యపత్యా గతహ్రియః
శశ్వత్కటుకభాషిణ్యశ్చౌర్యమాయోరుసాహసాః

పొట్టి శరీరముతో ఎక్కువ ఆకలితో, సంతానం ఎక్కువ ఉంటుంది, సిగ్గు లేకుండా ఉంటారు
మాట్లాడుకోవడం అంటే వారి వారి కుటుంబం గురించే ఉంటుంది కానీ వేరే మాటలే ఉండవు.
అది కూడా వారి కుటుంబాన్ని పోషించడానికి ఎన్ని దొంగతనాలు చేసారో ఎంతమందిని మోసం చేసారో , ఎంత సాహసం చేసారో చెప్పుకుంటూ ఉంటారు

పణయిష్యన్తి వై క్షుద్రాః కిరాటాః కూటకారిణః
అనాపద్యపి మంస్యన్తే వార్తాం సాధు జుగుప్సితామ్

కపటం మోసం చేసేవారు పందాళ్ళూ పెట్టుకుంటూ ఉంటారు.
ఆపద లేని సమయములో కూడా మంచివారు అసహ్యించుకునే వృత్తిని అవలంబిస్తూ ఉంటారు

పతిం త్యక్ష్యన్తి నిర్ద్రవ్యం భృత్యా అప్యఖిలోత్తమమ్
భృత్యం విపన్నం పతయః కౌలం గాశ్చాపయస్వినీః

డబ్బు లేని పతిని భార్య వదలిపెడుతుంది, సేవకులూ విడిచిపెడతారు
సేవకునికి ఆపద కలిగిస్తే రక్షించేబదులు యజమాని వదలిపెడతాడు
పాలు ఇవ్వని ఆవులను విడిచిపెడతారు

పితృభ్రాతృసుహృజ్జ్ఞాతీన్హిత్వా సౌరతసౌహృదాః
ననాన్దృశ్యాలసంవాదా దీనాః స్త్రైణాః కలౌ నరాః

స్త్రీ సమాగమాన్ని కోరేవారు తల్లీ తండ్రీ గురువూ పెదనాన్నా చిన్నాన్నా అనే సంబంధాలను సముద్రములో ముంచివేస్తారు. వారికి కావలసినదల్లా, అమ్మయైతే అబ్బాయి, అబ్బాఇతే అమ్మాయి సావాసం కావాలి. తల్లీ తండ్రీ గురువూ మిత్రుడూ బంధువూ అంటూ ఉండరు
అందరూ బావమరదులతోటీ మరదళ్ళతోనే మాట్లాడతారు. వేరే సంబంధం ఉండదు
నరులు  స్త్రీ మీద వ్యామోహం కలిగిన వారే ఉంటారు కలియుగములో

శూద్రాః ప్రతిగ్రహీష్యన్తి తపోవేషోపజీవినః
ధర్మం వక్ష్యన్త్యధర్మజ్ఞా అధిరుహ్యోత్తమాసనమ్

తపస్సు చేసి బతికేవారి వేషాలను శూద్రులు వేసుకుంటారు
అధర్మం తెలిసినవారే ఉత్తమ ఆసనాన్ని ఎక్కి ధర్మం చెబుతూ ఉంటారు

నిత్యం ఉద్విగ్నమనసో దుర్భిక్షకరకర్శితాః
నిరన్నే భూతలే రాజననావృష్టిభయాతురాః

నిత్యం మనసు ఉద్విగ్నముగా ఉంటుంది.
ఒక పక్కన కరువుతో ఇంకో పక్కన పన్నుతో బాధపడతారు
అనావృష్టితో ఆహారం లేకుండా భయం పుడుతుంది

వాసోऽన్నపానశయన వ్యవాయస్నానభూషణైః
హీనాః పిశాచసన్దర్శా భవిష్యన్తి కలౌ ప్రజాః

వస్త్రమూ అన్నమూ పానమూ నిద్రా సంభోగాదులూ స్నానమూ ఆభరణాలు లేక ప్రజలు
పిశాచాలలా కనపడతారు ప్రజలు.

కలౌ కాకిణికేऽప్యర్థే విగృహ్య త్యక్తసౌహృదాః
త్యక్ష్యన్తి చ ప్రియాన్ప్రాణాన్హనిష్యన్తి స్వకానపి

చిల్లిగవ్వకోసం కూడా మైత్రిని విడిచిపెట్టి విరోధం పెంచుకుని ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు
ఆ చిల్లిగవ్వకోసం ప్రాణం వదలడానికీ ప్రాణం తీయడానికీ కూడా సిద్ధపడతారు

న రక్షిష్యన్తి మనుజాః స్థవిరౌ పితరావపి
పుత్రాన్భార్యాం చ కులజాం క్షుద్రాః శిశ్నోదరంభరాః

వృద్ధ తల్లి తండ్రులను కుమారులు పోషించరు
పిల్లలను కూడా తల్లి తండ్రులు పోషించరు. నాకే లేదు నీకేమి పెడతాను అంటారు. (ఉదర పరులు)
ముసలి వాళ్ళు కూడా పెళ్ళి చేసుకుంటారు. (శిశ్న పరులు)

కలౌ న రాజన్జగతాం పరం గురుం త్రిలోకనాథానతపాదపఙ్కజమ్
ప్రాయేణ మర్త్యా భగవన్తమచ్యుతం యక్ష్యన్తి పాషణ్డవిభిన్నచేతసః

పాపుల వాదముతో భేధించబడిన బుద్ధి గలవారు కలియుగములో భగవదారాథన చేయరు

యన్నామధేయం మ్రియమాణ ఆతురః పతన్స్ఖలన్వా వివశో గృణన్పుమాన్
విముక్తకర్మార్గల ఉత్తమాం గతిం ప్రాప్నోతి యక్ష్యన్తి న తం కలౌ జనాః

చనిపోతున్నవాడూ రోగ గ్రస్థుడూ పడబోతూ జారబోతూ ఉన్నవాడూ పరవశముతో పరమాత్మ నామాన్ని పలికితే  అన్ని కర్మాశయాలనూ వదలి ఉత్తమ గతిని పొందుతాడో అలాంటి పరమాత్మను కలియుగములో మానవులు పూజించరు

పుంసాం కలికృతాన్దోషాన్ద్రవ్యదేశాత్మసమ్భవాన్
సర్వాన్హరతి చిత్తస్థో భగవాన్పురుషోత్తమః

ద్రవ్యమూ దేశమూ మనసూ దోషభూయిష్టమే.
ఇన్ని రకాల మానవుల దోషాలను కూడా హృదయములో అంతర్యామిగా ఉన్న పరమాత్మ హరిస్తాడు

శ్రుతః సఙ్కీర్తితో ధ్యాతః పూజితశ్చాదృతోऽపి వా
నృణాం ధునోతి భగవాన్హృత్స్థో జన్మాయుతాశుభమ్

విన్నా కీర్తించినా ధ్యానించినా పూజించినా, (భక్తులను) ఆదరించినా చాలు.
పదివేల జన్మలలో ఉన్న పాపాలనీ పరమాత్మ పోగొడతాడు

యథా హేమ్ని స్థితో వహ్నిర్దుర్వర్ణం హన్తి ధాతుజమ్
ఏవమాత్మగతో విష్ణుర్యోగినామశుభాశయమ్

బంగారాన్ని నిప్పులో వేస్తే బంగారానికి ఉన్న మలినాన్ని నిప్పు ఎలా పోగొడుతుందో
ఆత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ రోగుల పాపపు స్వభావాన్ని తొలగిస్తాడు.

విద్యాతపఃప్రాణనిరోధమైత్రీ తీర్థాభిషేకవ్రతదానజప్యైః
నాత్యన్తశుద్ధిం లభతేऽన్తరాత్మా యథా హృదిస్థే భగవత్యనన్తే

విద్యా తపస్సూ ప్రాణాయామమూ స్నేహమూ తీర్థాభిషేకమూ వ్రతమూ దానమూ జపమూ, వీటితో అంతగా పరిశుద్ధి కలగదు.
పరమాత్మను హృదయములో ఉంచుకుంటే శుద్ధి వస్తుంది.

తస్మాత్సర్వాత్మనా రాజన్హృదిస్థం కురు కేశవమ్
మ్రియమాణో హ్యవహితస్తతో యాసి పరాం గతిమ్

కలియుగానికి ఒకటే మందు. అన్ని రకములుగా పరమాత్మను హృదయములో ఉంచుకోండి
బతికున్నంత కాలం స్మరించకున్నా, కనీసం మరణించే ముందు ధ్యానం చేసినా చాలు.

మ్రియమాణైరభిధ్యేయో భగవాన్పరమేశ్వరః
ఆత్మభావం నయత్యఙ్గ సర్వాత్మా సర్వసంశ్రయః

భగవానుడు సర్వాత్మ, అందరికీ ఆశ్రయం. ఆయనను స్మరిస్తే ఆయనలో చేర్చుకుంటాడు

కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్గుణః
కీర్తనాదేవ కృష్ణస్య ముక్తసఙ్గః పరం వ్రజేత్

ఇన్ని దోషాలు ఉన్న కలియుగములో కూడా ఒక మంచి గుణం ఉంది
పరమాత్మను ఒక్క సారి కీర్తిస్తే చాలు. భగవద్కీర్తనతోనే అన్ని బంధాలూ తొలగి పరమాత్మను చేరవచ్చు. ఈ సౌకర్యం వేరే యుగాలలో లేదు

కృతే యద్ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః
ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్

కృత యుగములో ధ్యానమూ, త్రేతా యుగములో యజ్ఞ్యము
ద్వాపరములో సేవ, కలియుగములో నామ సంకీర్తన విధించబడినవి. వేరే వాటితో కలియుగములో పని లేదు. ఒక్క నామ సంకీర్తనతో తరించవచ్చు

                                             సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                             సర్వం శ్రీసాయినాథార్పణమస్తు