Tuesday, March 26, 2013

లక్ష్మీ పంచకం

లక్ష్మీ పంచకం
కింద ఉన్న ఐదు శ్లోకాలనూ లక్ష్మీ పంచకం అంటారు. దీన్ని ప్రతీ పూర్ణిమ నాడూ చదువుకుంటే పరమాత్మ యందు భక్తి పెరిగి సంసారములో కోరిక కోరకుండా ఉంటారు. 

తద్భగవతో మాయామయం రూపం పరమసమాధియోగేన రమా దేవీ సంవత్సరస్య రాత్రిషు
ప్రజాపతేర్దుహితృభిరుపేతాహఃసు చ తద్భర్తృభిరుపాస్తే ఇదం చోదాహరతి

ఈ కామదేవున్ని లక్ష్మీ దేవి ప్రజాపతులల్తో కలిసి వారి పుత్రికలతో కలసి ఆరాధిస్తుంది. పగలు అంటే ప్రజాపతుల పుత్రులూ రాత్రి అంటే వారి పుత్రికలు. వీరితో కలిసి కామదేవున్ని ఆరాధిస్తుంది

ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే
ఆకూతీనాం
చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ
సర్వమయాయ
సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్

ఈ కామదేవుడే హృషీకేశుడు. కోరిక ఇంద్రియములు మన చేతిలో లేకుండుటచే కలుగుతుంది. ఆ ఇంద్రియ ప్రవృత్తిని నియంత్రించగలిగే వాడు పరమాత్మ. అందుకే స్వామి హృషీకేశుడు. ప్రకృతి గుణాల కంటే ఆత్మ గుణాల కంటే పరమాత్మ విలక్షణుడు. ఆకూతి (కర్మేంద్రియాలకూ) జ్ఞ్యానేంద్రియాలకూ మనసు యొక్క ప్రవృత్తికీ ఆయనే అధిపతి. షోడశకలాయ - ఐదు జ్ఞ్యాన ఐదు కర్మ పంచభూతములకూ మనసుకూ అధిపతి, ఆయనే చందోమయుడు అమృతమయుడు అన్నమయుడు, సర్వమయుడు. బలమూ (ధారణ సామర్ధ్యం) ఓజః (ప్రవృత్తి సామర్ధ్యం) సహః (శత్రువులను ఓడించే సామర్ధ్యం) కలవాడు. అతనే కాంతుడూ కాముడు. ఇహలోకములో సుందరుడూ, పరలోకములో కోరికలను తీర్చేవాడు. ఈ లోకములో మనం చూసే సౌందర్యమంతా పరలోక సుఖాదాయకం కావాలి. పరలోకములో సుఖం కలిగించేదిగా ఉండాలి. ఈయన కామస్పతి - సకల కోరికలకూ అధినాధుడు. ఆయనకు ఆనందం కలిగించే ప్రవృత్తి మనం అలవరచుకుంటే ఇహలోకములో ప్రతీ ప్రవృత్తీ మనకు సంతోషాన్నిస్తుంది.

స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో హ్యారాధ్య లోకే పతిమాశాసతేऽన్యమ్
తాసాం న తే వై పరిపాన్త్యపత్యం ప్రియం ధనాయూంషి యతోऽస్వతన్త్రాః

యువతులు సౌందర్యవతులు తాము కోరుకున్న భర్త రావడానికి నిన్ను ఆరాధిస్తారు. కానీ వారు అనుకూలవంతులైన పుత్రులని కోరరు. భర్త మంచివాడే అయినా కొడుకు మంచివాడు కాకపోవడముతో ఆ సంతానం వారిని కాపాడరు. ఆ సంతానం తల్లి తండ్రులను కాపాడరు గానీ తల్లి తండుర్లు సంపాదించిన ఆస్తులను మాత్రం బాగా కాపాడతారు. భర్తను కోరే ఆడవారు ఇలాంటి సంతానం కలుగుతుందనో కలవచ్చనో ఆలోచించరు.

స వై పతిః స్యాదకుతోభయః స్వయం సమన్తతః పాతి భయాతురం జనమ్
స ఏక ఏవేతరథా మిథో భయం నైవాత్మలాభాదధి మన్యతే పరమ్

మాకర్థమయ్యింది ఒకటే. ఎవడు పతి? తాను వేటి వలనా భయము పొందని వాడు భర్త. వాడికి భయం లేకుంటేనే మనము భయపడకుండా కాపాడతాడు. తనకు భయములేని వాడై, భయం ఉన్నవారిని ఎవడు కాపాడతాడో అతనే భర్త. తనను చూచి తానే భయపడే వాడు భర్త ఎలా అవుతాడు. ఆత్మలాభము కంటే ఇంకో ఫలం ఉన్నదని భావించేవాడేవడూ భర్తకాడు. ఆత్మలాభం కంటే భిన్నమైనదాన్ని ఫలముగా తలచేవాడెవడూ భర్త కాదు. పరమాత్మ ప్రాప్తే మనకు ఫలము. దాని కన్నా భిన్నమైనదాన్ని కోరేవారు భర్తా కాదు, భార్యా కాదు, పిల్లలూ కాదు.

యా తస్య తే పాదసరోరుహార్హణం నికామయేత్సాఖిలకామలమ్పటా
తదేవ రాసీప్సితమీప్సితోऽర్చితో యద్భగ్నయాచ్ఞా భగవన్ప్రతప్యతే

పరమాత్మనే ఎందుకారాధించాలంటే, అందరికంటే భగవంతుడు ఉత్తముడు, అడిగిన దాన్నిస్తాడు. అనేక కోరికలతో నిండి ఉన్న మనసు గానీ బుద్ధి కానీ, తాను కోరే కోరికల వలన అనర్థమును పొందకుండా ఉండాలంటే నీ పాదపద్మములనే ఆరాధించాలి. కోరికలు భగవంతుని మీద భక్తిని పెంచే కోరికలు కావాలి. నీవు పూజించబడి కోరబడి భక్తులు ఏమడుగుతారో అది ఇస్తావు. కోరి ఆరాధించినపుడు ఆరాధించిన వాడు ఏ కోరిక కోరతాడో అది ఇస్తావు. కోరిక తీరకుంటే భక్తులు బాధపడతారని కోరికలను తీరుస్తూ ఉంటావు.

మత్ప్రాప్తయేऽజేశసురాసురాదయస్తప్యన్త ఉగ్రం తప ఐన్ద్రియే ధియః
ఋతే భవత్పాదపరాయణాన్న మాం విన్దన్త్యహం త్వద్ధృదయా యతోऽజిత

మానవులే కాదూ ఇంద్రాదులు కూడా ఇంద్రియముల యందే మనసు పెట్టుకుని నశ్వరమైన వాటిని పొందడానికి ఘోరమైన తపస్సు చేస్తారు. బ్రహ్మ రుద్ర దేవతలూ రాక్షసులూ అందరూ ఇలాగే చేసారు. అలా కోరని వారు ఒక్కరు మాత్రమే, నీ పాద భక్తులు మాత్రమే. కొందరు నేను నా హృదయాన్ని నీ మీద ఉంచిన సంగతి తెలియక నన్ను మాత్రమే కోరతారు. నా హృదయం నీలో ఉంటుంది. అది తెలియని వారు నిన్ను కోరక నన్ను కోరతారు.

స త్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వన్దితం కరామ్బుజం యత్త్వదధాయి సాత్వతామ్
బిభర్షి మాం లక్ష్మ వరేణ్య మాయయా క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి

నన్ను కోరేవారందరూ, నీతో బాటుగా నన్ను కోరేవారిగా వారిని తయారు చేయి. లేదా నన్ను నీతో విడిపోకుండా ఉండే వరమునియ్యి. భక్తులు కోరిక కాదనకుండా నేనైనా నిన్ను విడిచిపెట్టి వెళతానేమో గానీ, నీవు మాత్రం నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళవు. నన్ను పుట్టుమచ్చగా చేసుకుని నీ హృదయములో ఉంచుకున్నావు.
నీవు నీ భక్తుల యొక్క శిరస్సు మీద ఏ కరాంభుజమును ఉంచుతావో ఆ కరాంభుజమునే నా శిరస్సు మీద ఉంచి నీ నుండి నాకు ఎడబాటు రాకుండా వరమివ్వు. ఆనాడు నీవు పుట్టుమచ్చగా చేసుకున్నప్పుడు "నేనే ఉండగా వేరే గుర్తు ఎందుకు" అనుకున్నాను. కానీ భక్తులు ఇలా నన్ను వేరు చేస్తారని తెలియదు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీ సంకల్పాన్ని ఎవరు ఊహించగలరు.


శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తథా చ భద్రశ్రవా నామ ధర్మసుతస్తత్కులపతయః పురుషా భద్రాశ్వవర్షే సాక్షాద్భగవతో
వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయశీర్షాభిధానాం పరమేణ సమాధినా
సన్నిధాప్యేదమభిగృణన్త ఉపధావన్తి

ధర్ముని పుత్రుడు భద్రశ్వుడు. కులపతులతో కలిసి భద్రశ్రవుడు హయగ్రీవుని ఆరాధిస్తూ ఉంటాడు.పరమ సమాధితో ఈ మంత్రాలను చదువుతూ ఆయన్ని ఉపాసిస్తారు

భద్రశ్రవస ఊచుః
ఓం నమో భగవతే ధర్మాయాత్మవిశోధనాయ నమ ఇతి

ఇది హయగ్రీవమంత్రం. ఈయన ధర్మ స్వరూపుడూ మనశ్శుద్ధిని కలిగిస్తాడు అంటే చక్కని వాగ్ వైభవాన్ని ఇస్తాడు.

అహో విచిత్రం భగవద్విచేష్టితం ఘ్నన్తం జనోऽయం హి మిషన్న పశ్యతి
ధ్యాయన్నసద్యర్హి వికర్మ సేవితుం నిర్హృత్య పుత్రం పితరం జిజీవిషతి

ఎంత విచిత్రం పరమాత్మ లీల. చనిపోతున్న వారిని చూస్తూ కూడా మళ్ళీ ఇంకోళ్ళను చంపుతారు. చూస్తూ కూడా గుడ్డివాడవుతున్నాడు. అదే విషయాన్ని ధ్యానం చేసి కూడా చెడు పని చేయడానికి వెనుకాడడు. ఎందరో పోయిన వాళ్ళను చూసినా తాను బతకడానికి చెడు పని చేస్తాడు.

వదన్తి విశ్వం కవయః స్మ నశ్వరం పశ్యన్తి చాధ్యాత్మవిదో విపశ్చితః
తథాపి ముహ్యన్తి తవాజ మాయయా సువిస్మితం కృత్యమజం నతోऽస్మి తమ్

తండ్రిని అంత్యక్రియలు చేసిన కొడుకు తాను చాలా కాలం బతుకుతాడనుకుంటాడు. ఇదేమి చిత్రం

పండితులందరూ ప్రపంచం నశ్వరం అని చెబుతూ ఉన్నారు అనుభవిస్తూ ఉన్నారు. స్పష్టముగా చూస్తున్నా ఇందరు చెబుతున్నా నీ మాయ ఎంత గొప్పది. అందరూ ఇందులోకే పోతున్నారు.ఇంత ఆశ్చర్యకరములైన కర్మలు చేసే పరమాత్మకు నమస్కారం

విశ్వోద్భవస్థాననిరోధకర్మ తే హ్యకర్తురఙ్గీకృతమప్యపావృతః
యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే సర్వాత్మని వ్యతిరిక్తే చ వస్తుతః

సృష్టి లయలకు నీవే కర్తవూ నీవే అకర్తవు.  అన్ని కార్యాలకు కారణమైన నీ  యందు ఇది చిత్రం. అన్నీ నీలో ఉండి అన్నీ నీవే చేస్తున్న నీ మాయను దాటలేకపోవడం వింతేమీ కాదు

వేదాన్యుగాన్తే తమసా తిరస్కృతాన్రసాతలాద్యో నృతురఙ్గవిగ్రహః
ప్రత్యాదదే వై కవయేऽభియాచతే తస్మై నమస్తేऽవితథేహితాయ ఇతి

ప్రళయకాలములో తమస్సులో దాగి ఉన్న వేదాలను రసాతలములో ఉన్న వేదాలని తీసుకుని వచ్చి ప్రార్థిస్తున్న బ్రహ్మకు ఇచ్చావు. అలాంటి సత్య సంకల్పుడవైన నీకు నమస్కారం.

హరివర్షే చాపి భగవాన్నరహరిరూపేణాస్తే తద్రూపగ్రహణనిమిత్తముత్తరత్రాభిధాస్యే
తద్దయితం రూపం మహాపురుషగుణభాజనో మహాభాగవతో దైత్యదానవకులతీర్థీకరణశీలాచరితః
ప్రహ్లాదోऽవ్యవధానానన్యభక్తియోగేన సహ తద్వర్షపురుషైరుపాస్తే ఇదం చోదాహరతి

హరి వర్షములో నృసింహ రూపములో ఉంటాడు. ఆయన ఎందుకు అది ధరించాడో తరువాత చెబుతాను. అది పరమ సుందరమైన రూపం. సకల దైత్యులకూ దానవులకూ సద్గుణములకు గని అయిన ప్రహ్లాదుడు అనన్యమైన భక్తియోగముతో అందరి చేతా ఆరాధించబడుతూ, ఆయన నరసింహుని ఆరాధిస్తాడు.

ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర
కర్మాశయాన్రన్ధయ రన్ధయ తమో గ్రస గ్రస ఓం స్వాహా అభయమభయమాత్మని భూయిష్ఠా ఓం క్ష్రౌమ్

క్షౌం అనేది నరసింహ బీజం. నీవు తేజస్సులకు తేజస్సువి. అజ్య్నానాన్ని పోగొట్టమని ప్రార్థిస్తూ ఉంటాడు.

స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయన్తు భూతాని శివం మిథో ధియా
మనశ్చ భద్రం భజతాదధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ

ప్రపంచానికి మంగళమవుగాక, దుర్మార్గులు కూడా ప్రసన్నముగా ఉండుగాక. అన్ని ప్రాణులూ పరస్పరం ఒకరి క్షేమాన్ని ఇంకొకరు కోరుకుందురు గాక. అందరి మనస్సూ భద్రముగ పరమాత్మ యందే లగ్నము కానీ.

మాగారదారాత్మజవిత్తబన్ధుషు సఙ్గో యది స్యాద్భగవత్ప్రియేషు నః
యః ప్రాణవృత్త్యా పరితుష్ట ఆత్మవాన్సిద్ధ్యత్యదూరాన్న తథేన్ద్రియప్రియః

మా మనస్సు భార్యా బంధువులూ ఇల్లూ పిల్లల యందు గాక పరమాత్మ భక్తుల యందు లగ్నమవు గాక. ప్రాణాయామ పరాయణుడై ప్రాణాయామముతో మనసుని జయించినవాడు ఇంద్రియములకు లొంగిన వాడు పొందలేడు కదా.

యత్సఙ్గలబ్ధం నిజవీర్యవైభవం తీర్థం ముహుః సంస్పృశతాం హి మానసమ్
హరత్యజోऽన్తః శ్రుతిభిర్గతోऽఙ్గజం కో వై న సేవేత ముకున్దవిక్రమమ్

ఎవరి క్షణ కాల సంగముతో మానస సరోవరం తీర్థముగా అయ్యిందో, అలాగే నీ క్షణ కాలం నివాసముతో మా హృదయం కూడా మానససరోవరమంత పవిత్రం అవుతుంది. ఇలాంటి పరమాత్మ యొక్క పరాక్రమాన్ని ఎవరు సేవించరు. ఏ స్తోత్రం మనసులో ఉన్న మన్మధున్ని జయిస్తుందో అలాంటి ఏ బుద్ధిమంతుడు సేవించడు.

యస్యాస్తి భక్తిర్భగవత్యకిఞ్చనా సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః
హరావభక్తస్య కుతో మహద్గుణా మనోరథేనాసతి ధావతో బహిః

ఎవరికి పరమాత్మ యందు కోరికలేని భక్తి ఉంటుందో అలాంటి వారిదగ్గరకి గుణములతో కలిసి దేవతలందరూ వచ్చి చేరతారు. పరమాత్మ యందు భక్తుడుకాని వాడికి గొప్ప గుణాలెలా ఉంటాయి. మనస్సనే రథమెక్కి మాటి మాటికీ బయటకు వెళ్ళేవాడికి గుణాలెలా వస్తాయి.

హరిర్హి సాక్షాద్భగవాన్శరీరిణామాత్మా ఝషాణామివ తోయమీప్సితమ్
హిత్వా మహాంస్తం యది సజ్జతే గృహే తదా మహత్త్వం వయసా దమ్పతీనామ్

శరీరం కలిగినవారందరికీ పరమాత్మే ఆత్మ, చేపలకు నీరు లాగ.  అలాంటి పరమాత్మను వదిలిపెట్టి సంసారములో లగ్నమైతే వయసుతో పెద్దవాడవుతాడు గానీ జ్ఞ్యానముతో కాడు

తస్మాద్రజోరాగవిషాదమన్యు మానస్పృహాభయదైన్యాధిమూలమ్
హిత్వా గృహం సంసృతిచక్రవాలం నృసింహపాదం భజతాకుతోభయమితి

ఈ సంసారములో 1. రజస్సూ 2. ప్రేమ కోపం విషాదం అభిమానం కోరిక దైన్యమూ మానసిక వ్యాధి మొదలైన వాటికిమూలమైన గృహాన్ని వదిలిపెట్టి శ్రీమన్నారసింహుని పాదాలనే స్మరించండి.

కేతుమాలేऽపి భగవాన్కామదేవస్వరూపేణ లక్ష్మ్యాః ప్రియచికీర్షయా ప్రజాపతేర్దుహిత్ణాం పుత్రాణాం
తద్వర్షపతీనాం పురుషాయుషాహోరాత్రపరిసఙ్ఖ్యానానాం యాసాం గర్భా మహాపురుషమహాస్త్రతేజసోద్వేజిత
మనసాం విధ్వస్తా వ్యసవః సంవత్సరాన్తే వినిపతన్తి

మన్మధుని ఆకారములో అమ్మ వారికి ప్రీతి కలిగించాలన్న ఉద్దేశ్యముతో, ప్రజాపతి యొక్క పుత్రులు అధిపతిగా ఉన్న కేతుమాల వర్షములో ఉన్నాడు. ఈ ప్రజాపతులకు ఒక పురుష ఆయుష్యం ఒక పగలు. ఒక సంవత్సరం అయిన తరువాత వారికుండే గర్భములు కాలపురుషుని ప్రభ్హావముతో పడిపోతాయి.

అతీవ సులలితగతివిలాసవిలసితరుచిరహాసలేశావలోకలీలయా
కిఞ్చిదుత్తమ్భితసున్దరభ్రూమణ్డల
సుభగవదనారవిన్దశ్రియా రమాం రమయన్నిన్ద్రియాణి రమయతే

పరమాత్మ తన సౌందర్యముతో సౌకుమార్యముతో, గతి విలాస హాస సౌందర్యములతో అమ్మవారితో సహా అందరినీ రంజింపచేస్తూ ఉంటాడు

తద్భగవతో మాయామయం రూపం పరమసమాధియోగేన రమా దేవీ సంవత్సరస్య రాత్రిషు
ప్రజాపతేర్దుహితృభిరుపేతాహఃసు చ తద్భర్తృభిరుపాస్తే ఇదం చోదాహరతి

ఈ కామదేవున్ని లక్ష్మీ దేవి ప్రజాపతులల్తో కలిసి వారి పుత్రికలతో కలసి ఆరాధిస్తుంది. పగలు అంటే ప్రజాపతుల పుత్రులూ రాత్రి అంటే వారి పుత్రికలు. వీరితో కలిసి కామదేవున్ని ఆరాధిస్తుంది

ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే
ఆకూతీనాం
చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ చ్ఛన్దోమయాయాన్నమయాయామృతమయాయ
సర్వమయాయ
సహసే ఓజసే బలాయ కాన్తాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్

ఈ కామదేవుడే హృషీకేశుడు. కోరిక ఇంద్రియములు మన చేతిలో లేకుండుటచే కలుగుతుంది. ఆ ఇంద్రియ ప్రవృత్తిని నియంత్రించగలిగే వాడు పరమాత్మ. అందుకే స్వామి హృషీకేశుడు. ప్రకృతి గుణాల కంటే ఆత్మ గుణాల కంటే పరమాత్మ విలక్షణుడు. ఆకూతి (కర్మేంద్రియాలకూ) జ్ఞ్యానేంద్రియాలకూ మనసు యొక్క ప్రవృత్తికీ ఆయనే అధిపతి. షోడశకలాయ - ఐదు జ్ఞ్యాన ఐదు కర్మ పంచభూతములకూ మనసుకూ అధిపతి, ఆయనే చందోమయుడు అమృతమయుడు అన్నమయుడు, సర్వమయుడు. బలమూ (ధారణ సామర్ధ్యం) ఓజః (ప్రవృత్తి సామర్ధ్యం) సహః (శత్రువులను ఓడించే సామర్ధ్యం) కలవాడు. అతనే కాంతుడూ కాముడు. ఇహలోకములో సుందరుడూ, పరలోకములో కోరికలను తీర్చేవాడు. ఈ లోకములో మనం చూసే సౌందర్యమంతా పరలోక సుఖాదాయకం కావాలి. పరలోకములో సుఖం కలిగించేదిగా ఉండాలి. ఈయన కామస్పతి - సకల కోరికలకూ అధినాధుడు. ఆయనకు ఆనందం కలిగించే ప్రవృత్తి మనం అలవరచుకుంటే ఇహలోకములో ప్రతీ ప్రవృత్తీ మనకు సంతోషాన్నిస్తుంది.

స్త్రియో వ్రతైస్త్వా హృషీకేశ్వరం స్వతో హ్యారాధ్య లోకే పతిమాశాసతేऽన్యమ్
తాసాం న తే వై పరిపాన్త్యపత్యం ప్రియం ధనాయూంషి యతోऽస్వతన్త్రాః

యువతులు సౌందర్యవతులు తాము కోరుకున్న భర్త రావడానికి నిన్ను ఆరాధిస్తారు. కానీ వారు అనుకూలవంతులైన పుత్రులని కోరరు. భర్త మంచివాడే అయినా కొడుకు మంచివాడు కాకపోవడముతో ఆ సంతానం వారిని కాపాడరు. ఆ సంతానం తల్లి తండ్రులను కాపాడరు గానీ తల్లి తండుర్లు సంపాదించిన ఆస్తులను మాత్రం బాగా కాపాడతారు. భర్తను కోరే ఆడవారు ఇలాంటి సంతానం కలుగుతుందనో కలవచ్చనో ఆలోచించరు.

స వై పతిః స్యాదకుతోభయః స్వయం సమన్తతః పాతి భయాతురం జనమ్
స ఏక ఏవేతరథా మిథో భయం నైవాత్మలాభాదధి మన్యతే పరమ్

మాకర్థమయ్యింది ఒకటే. ఎవడు పతి? తాను వేటి వలనా భయము పొందని వాడు భర్త. వాడికి భయం లేకుంటేనే మనము భయపడకుండా కాపాడతాడు. తనకు భయములేని వాడై, భయం ఉన్నవారిని ఎవడు కాపాడతాడో అతనే భర్త. తనను చూచి తానే భయపడే వాడు భర్త ఎలా అవుతాడు. ఆత్మలాభము కంటే ఇంకో ఫలం ఉన్నదని భావించేవాడేవడూ భర్తకాడు. ఆత్మలాభం కంటే భిన్నమైనదాన్ని ఫలముగా తలచేవాడెవడూ భర్త కాదు. పరమాత్మ ప్రాప్తే మనకు ఫలము. దాని కన్నా భిన్నమైనదాన్ని కోరేవారు భర్తా కాదు, భార్యా కాదు, పిల్లలూ కాదు.

యా తస్య తే పాదసరోరుహార్హణం నికామయేత్సాఖిలకామలమ్పటా
తదేవ రాసీప్సితమీప్సితోऽర్చితో యద్భగ్నయాచ్ఞా భగవన్ప్రతప్యతే

పరమాత్మనే ఎందుకారాధించాలంటే, అందరికంటే భగవంతుడు ఉత్తముడు, అడిగిన దాన్నిస్తాడు. అనేక కోరికలతో నిండి ఉన్న మనసు గానీ బుద్ధి కానీ, తాను కోరే కోరికల వలన అనర్థమును పొందకుండా ఉండాలంటే నీ పాదపద్మములనే ఆరాధించాలి. కోరికలు భగవంతుని మీద భక్తిని పెంచే కోరికలు కావాలి. నీవు పూజించబడి కోరబడి భక్తులు ఏమడుగుతారో అది ఇస్తావు. కోరి ఆరాధించినపుడు ఆరాధించిన వాడు ఏ కోరిక కోరతాడో అది ఇస్తావు. కోరిక తీరకుంటే భక్తులు బాధపడతారని కోరికలను తీరుస్తూ ఉంటావు.

మత్ప్రాప్తయేऽజేశసురాసురాదయస్తప్యన్త ఉగ్రం తప ఐన్ద్రియే ధియః
ఋతే భవత్పాదపరాయణాన్న మాం విన్దన్త్యహం త్వద్ధృదయా యతోऽజిత

మానవులే కాదూ ఇంద్రాదులు కూడా ఇంద్రియముల యందే మనసు పెట్టుకుని నశ్వరమైన వాటిని పొందడానికి ఘోరమైన తపస్సు చేస్తారు. బ్రహ్మ రుద్ర దేవతలూ రాక్షసులూ అందరూ ఇలాగే చేసారు. అలా కోరని వారు ఒక్కరు మాత్రమే, నీ పాద భక్తులు మాత్రమే. కొందరు నేను నా హృదయాన్ని నీ మీద ఉంచిన సంగతి తెలియక నన్ను మాత్రమే కోరతారు. నా హృదయం నీలో ఉంటుంది. అది తెలియని వారు నిన్ను కోరక నన్ను కోరతారు.

స త్వం మమాప్యచ్యుత శీర్ష్ణి వన్దితం కరామ్బుజం యత్త్వదధాయి సాత్వతామ్
బిభర్షి మాం లక్ష్మ వరేణ్య మాయయా క ఈశ్వరస్యేహితమూహితుం విభురితి

నన్ను కోరేవారందరూ, నీతో బాటుగా నన్ను కోరేవారిగా వారిని తయారు చేయి. లేదా నన్ను నీతో విడిపోకుండా ఉండే వరమునియ్యి. భక్తులు కోరిక కాదనకుండా నేనైనా నిన్ను విడిచిపెట్టి వెళతానేమో గానీ, నీవు మాత్రం నన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళవు. నన్ను పుట్టుమచ్చగా చేసుకుని నీ హృదయములో ఉంచుకున్నావు.
నీవు నీ భక్తుల యొక్క శిరస్సు మీద ఏ కరాంభుజమును ఉంచుతావో ఆ కరాంభుజమునే నా శిరస్సు మీద ఉంచి నీ నుండి నాకు ఎడబాటు రాకుండా వరమివ్వు. ఆనాడు నీవు పుట్టుమచ్చగా చేసుకున్నప్పుడు "నేనే ఉండగా వేరే గుర్తు ఎందుకు" అనుకున్నాను. కానీ భక్తులు ఇలా నన్ను వేరు చేస్తారని తెలియదు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీ సంకల్పాన్ని ఎవరు ఊహించగలరు.

వీటిని లక్ష్మీ పంచకం అంటారు. దీన్ని ప్రతీ పూర్ణిమ నాడూ చదువుకుంటే పరమాత్మ యందు భక్తి పెరిగి సంసారములో కోరిక కోరకుండా ఉంటారు.

రమ్యకే చ భగవతః ప్రియతమం మాత్స్యమవతారరూపం తద్వర్షపురుషస్య మనోః ప్రాక్
ప్రదర్శితం స ఇదానీమపి మహతా భక్తియోగేనారాధయతీదం చోదాహరతి

రమ్యక వర్షములో మత్స్యమూర్తి వేంచేసి ఉంటారు, ఈయనను ఆరాధించేది మనువు. రమ్యక వర్షాధిపతి మనువు. ఇది మత్స్య మంత్రం

ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్త్వాయ ప్రాణాయౌజసే సహసే బలాయ
మహామత్స్యాయ
నమ ఇతి

బలానికీ ఓజస్సుకూ సహస్సుకూ అధిపతి. బలానికి మారుపేరు మత్స్యం. ఆయనే ప్రాణమూ ఓజస్సూ సహస్సూ బలం. ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ మనువు మత్స్య రూపాన్ని సేవిస్తున్నాడు.

అన్తర్బహిశ్చాఖిలలోకపాలకైరదృష్టరూపో విచరస్యురుస్వనః
స ఈశ్వరస్త్వం య ఇదం వశేऽనయన్నామ్నా యథా దారుమయీం నరః స్త్రియమ్

నీటి పైనా లోపల తిరిగే అవతారం మత్స్యం. అంటే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణ అంటే జలములకు ఆధారం, జలములు ఆధారముగా కలవాడు. నీటిలోపల స్వామి ఉంటే నీటికి స్వామి ఆధారం. బయట ఉన్నప్పుడు స్వామికి నీరు ఆధారం. నారాయణ ఉపనిషత్తుని చూపిన వాడు, లోపల ఉన్నా బయట ఉన్నా కనపడకుండా ఉంటాడు. అందుకే నిన్ను ఈశ్వరుడూ అంటారు. ఈశతి అంటే సకల జగత్తునూ తన వశములో ఉంచుకున్నవాడు అని అర్థం. మానవులు తన ఎదురుగా ఉన్న తనలాంటి బొమ్మనే (ఆడవారినే) తమ వశములో ఉంచుకోలేరు. నీవు మాత్రం సకల జగత్తునూ నీ వశములో ఉంచుకుంటావు. ఆపద వస్తే ఆదుకోగలిగిన వారే సకల జగత్తునీ వశములో ఉంచుకోగలరూ. రెండు కాళ్ళ జంతువులనూ నాలుగు కాళ్ళ జంతువులనూ ఆపద వస్తే శరణిచ్చేవాడివి నీవే. మిగతా దేవతలు ఆదుకొనలేరు. అందుకే ఏ ప్రాణి జాతమైనా ఇంకెవరి వశములోనూ ఉండదు.

యం లోకపాలాః కిల మత్సరజ్వరా హిత్వా యతన్తోऽపి పృథక్సమేత్య చ
పాతుం న శేకుర్ద్విపదశ్చతుష్పదః సరీసృపం స్థాణు యదత్ర దృశ్యతే

భవాన్యుగాన్తార్ణవ ఊర్మిమాలిని క్షోణీమిమామోషధివీరుధాం నిధిమ్
మయా సహోరు క్రమతేऽజ ఓజసా తస్మై జగత్ప్రాణగణాత్మనే నమ ఇతి

ప్రళయములో ఆ సముద్రములో బ్రహ్మాండమైన ప్రళయములో భూమికి రవ్వంత కూడా హాని కలగకుండా భూమిలో ఉన్న అన్ని ఔషధులనూ నిక్షిప్తం చేసి కాపాడావు. ఆ భూమికి నన్ను ఏర్పాటు చేసి నన్నూ భూమినీ ఋషులనూ కాపాడినవాడవు నీవే కదా. నాతో కలిసి నీవే అంతా విజృంభించావు. ఇలాంటి జగత్తు యొక్క ప్రాణ రూపమైన నీకు నమస్కారం.

హిరణ్మయేऽపి భగవాన్నివసతి కూర్మతనుం బిభ్రాణస్తస్య తత్ప్రియతమాం తనుమర్యమా సహ
వర్షపురుషైః పితృగణాధిపతిరుపధావతి మన్త్రమిమం చానుజపతి

హిరణ్మయ వర్షములో స్వామి కూర్మ రూపములో ఉండగా అర్యముడు (పితృగణాధిపతి) తన వారందరితో కలిసి ఈ మంత్రాన్ని జపిస్తాడు

ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్త్వగుణవిశేషణాయానుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే
నమో భూమ్నే నమో నమోऽవస్థానాయ నమస్తే

ఈయన అవస్థానుడు. ఎప్పుడూ ఉండేవాడు. కూర్మం చాలా గట్టిది.  నీవు అకూపార - నీవు దాట లేని ఒడ్డూ లేదు, నీవు సమీపించలేని స్థలం లేదు. సకల ప్రాణుల గుణాలనూ నీలో ఉంచుకున్నావు. నీ కూర్మావతారములో నీవెక్కడ ఉన్నావో కూడా ఎవరికీ తెలీదు. పర్వతం ఎంత ఉందో అంత వ్యాపించి ఉన్నావు. నీ స్థానాన్ని మేము గుర్తుపట్టలేము.

యద్రూపమేతన్నిజమాయయార్పితమర్థస్వరూపం బహురూపరూపితమ్
సఙ్ఖ్యా న యస్యాస్త్యయథోపలమ్భనాత్తస్మై నమస్తేऽవ్యపదేశరూపిణే

నీ ఈ రూపం నీ సంకల్పముతో ఏర్పాటు చేసుకున్నావు. అనేకమైన ప్రపంచం యొక్క రూపములతో ఏది నీ రూపం ఏర్పడినదో అది నీ రూపం. కూర్మ రూపములోనే అన్ని రూపములూ ఉన్నాయి.  దేవతలను అమృతాన్నిచ్చింది సముద్రం కాదు, నీవే. కానీ తెలియక అందరూ సముద్రం ఇచ్చిందని చెప్పుకుంటారు. (దాత కూడా కూరమములా ఉండాలి. ఇచ్చినట్లు ఎవరికీ తెలియకూడదు) దానం నశ్యతి కీర్తనాత్. దానము చేస్తే చెప్పకూడదు. "ఇది ఇలా ఉంటుందని " ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి నీ రూపం ఎవరికీ అర్థం కాదు. ఎవరు చెప్పలేని రూపములో ఉన్న నీకు నమస్కారం

జరాయుజం స్వేదజమణ్డజోద్భిదం చరాచరం దేవర్షిపితృభూతమైన్ద్రియమ్
ద్యౌః ఖం క్షితిః శైలసరిత్సముద్ర ద్వీపగ్రహర్క్షేత్యభిధేయ ఏకః

జరాయుజం (మావి నుంచి ) గుడ్డు నుంచీ చెమట నుంచీ భూమిని భేదించుకుని పుట్టే జాతులు. దేవతలూ ఋషులూ పితృ దేవతలూ ప్రాణులూ, ఆకాశమూ భూమీ స్వరగమూ నదులూ గ్రహములూ తారకులూ సముద్రాలూ అన్నీ నీవే.

యస్మిన్నసఙ్ఖ్యేయవిశేషనామ రూపాకృతౌ కవిభిః కల్పితేయమ్
సఙ్ఖ్యా యయా తత్త్వదృశాపనీయతే తస్మై నమః సాఙ్ఖ్యనిదర్శనాయ తే ఇతి

అన్ని రూపాలుగా ఉన్న నిన్ను పక్కన బెట్టి నీలో ఉన్నవాటికి పేర్లు పెడుతున్నారు.  అనేకమైన భూత జాలముల సంఖ్యను చూపిస్తావు కాబట్టి నీవు సాంఖ్య రూపుడివి, అలాంటి నీకు నమస్కారం

ఉత్తరేషు చ కురుషు భగవాన్యజ్ఞపురుషః కృతవరాహరూప ఆస్తే తం తు దేవీ హైషా భూః సహ
కురుభిరస్ఖలితభక్తియోగేనోపధావతి ఇమాం చ పరమాముపనిషదమావర్తయతి

ఉత్తర కురేషులో వరాహస్వామిని భూదేవి ప్రార్థిస్తుంది. ఈ ఉపనిషత్తును పఠనం చేస్తూ ఉంటుంది.

ఓం నమో భగవతే మన్త్రతత్త్వలిఙ్గాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః
కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే

వరాహానికి శుక్లః అని పేరు. అన్ని కర్మలూ చేస్తూ కూడా పరిశుద్ధుడు. అంత పెద్ద భూమిని కోరల మీద నిలుపుకున్నా కొంచెం మట్టి కూడా అంటలేదు. మనం కూడా కోరిక లేకుండా చేస్తే పరిశుద్ధులమే అవుతాము.

యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్వివ జాతవేదసమ్
మథ్నన్తి మథ్నా మనసా దిదృక్షవో గూఢం క్రియార్థైర్నమ ఈరితాత్మనే

వరాహ స్వామిని ప్రార్థించే మంత్రం ఇది. కట్టెలో ఉన్న అగ్నిని తీయడానికి ఎలా మధనం చేయాలో. అంతర్యామిగ ఉన్న పరమాత్మను బయటకు తీయడానికి ఋషులు తమ మనసుతో బుద్ధి అనే వాసుకితో శరీరమనే మదర పర్వతాన్ని సంసారమనే సముద్రాన్ని.  మధనం చేస్తారు. వారంతగా మధనం చేసినా నీవు కనపడవు. నీవు శబ్దమే స్వరూపముగా ఉన్నవాడు. వేద వేద్యుడవు.

ద్రవ్యక్రియాహేత్వయనేశకర్తృభిర్మాయాగుణైర్వస్తునిరీక్షితాత్మనే
అన్వీక్షయాఙ్గాతిశయాత్మబుద్ధిభిర్నిరస్తమాయాకృతయే నమో నమః

సృష్టి చేయాలంటే ద్రవ్యమూ క్రియా హేతువూ ఆధారం కావాలి.దాన్ని కూర్చే వాడు చేర్చేవాడూ నియమించేవాడూ .  కేవలం వేదాంత విద్యతోటే బుద్ధినీ మనస్సునూ అతిక్రమించిన విలక్షణమైన పరమాత్మ మాయాను అతిక్రమించగలం.

కరోతి విశ్వస్థితిసంయమోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః
మాయా యథాయో భ్రమతే తదాశ్రయం గ్రావ్ణో నమస్తే గుణకర్మసాక్షిణే

నీకు ప్రీతి కలిగించే వేదమంత్రాలనూ యజ్ఞ్య యాగాదులనూ చేయాలి. నీవు . ప్రపంచాన్ని సృష్టించి రక్షించి సంహరిస్తున్నావు. నీ ఈప్సితాన్నీ అనీప్సితాన్ని తెలుసుకోలేని వారు, నీవెక్కడున్నావో తెలీయకుండానే అయస్కాంతం చుట్టూ ఇనుము తిరిగినట్లు నీ చుట్టూ తిరుగుతారు

ప్రమథ్య దైత్యం ప్రతివారణం మృధే యో మాం రసాయా జగదాదిసూకరః
కృత్వాగ్రదంష్ట్రే నిరగాదుదన్వతః క్రీడన్నివేభః ప్రణతాస్మి తం విభుమితి


అడ్డు వచ్చిన రాక్షసులని చంపి రసాతలం నుంచి నన్ను బయటకు తీసావు. ఒక ఆట ఆడినట్లుగా భూమిని పైకి తీసావు. అలాంటి నీకు నమస్కారం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తత్ర భగవతః సాక్షాద్యజ్ఞలిఙ్గస్య విష్ణోర్విక్రమతో వామపాదాఙ్గుష్ఠనఖ
నిర్భిన్నోర్ధ్వాణ్డకటాహవివరేణాన్తఃప్రవిష్టా యా బాహ్యజలధారా తచ్చరణపఙ్కజావనేజనారుణ
కిఞ్జల్కోపరఞ్జితాఖిలజగదఘమలాపహోపస్పర్శనామలా సాక్షాద్భగవత్పదీత్యనుపలక్షితవచో
భిధీయమానాతిమహతా కాలేన యుగసహస్రోపలక్షణేన దివో మూర్ధన్యవతతార యత్తద్విష్ణుపదమాహుః

సీతా అలకనందా భద్ర చక్షు అనే నాలుగు నదులూ పరమాత్మ పాదాంగుష్ఠమునుంచి పుట్టిన నదులు. పరమాత్మ యజ్ఞ్య లింగుడు. పరమాత్మను గుర్తించేది యజ్ఞ్యముతోనే. ఆయన త్రివిక్రమావతారములో ఈయన ఎడమ కాలిని పైలోకం కొలవడానికి పంపాడు. దాని బొటన వేలి గోరు చివర తగిలి బ్రహ్మాండ కటాహం పగిలి రంధ్రం ఏర్పడి అందులోంచి జలం పుట్టింది. అదే గంగా నది. జలము లోపల ప్రవేశించింది. పరమాత్మ యొక్క పాదమును ఆ జలమే కడిగింది. పరమాత్మ పాద పద్మములను కడుగుట వలన ఆ పాద పద్మముల అరుణిమ (ఎర్రదనం) నీటిలో ప్రవేశించింది. ఆ ఎరుపుదుదనం పద్మము మధ్య ఉన్న పుప్పొడి వంటిది. సకల జగముల పాపమును తొలగించదగినది కాబట్టి ఈ జలం పవిత్రం. ఈ నదిని భగవత్ పది అంటారు. బ్రహ్మాండ కటాహం నుంచి రావడానికి ఎన్నో యుగాలు పట్టింది. అలా కొన్ని వేల యుగాల తరువాత ద్యౌ భాగానికి వచ్చింది. దానికే విష్ణు పదం అని పేరు. ప్రకృతి నుంచి వచ్చిన మహత్ తత్వం మహత్ తత్వం నుంచి వచ్చిన అహంకారం, తామసాహంకారం నుంచి పుట్టిన వాటిలో ఒకటి ఆకాశం. అలా ప్రకృతిని భేదించుకుని రావడానికి కొన్ని వేల యుగాలు పట్టింది.

యత్ర హ వావ వీరవ్రత ఔత్తానపాదిః పరమభాగవతోऽస్మత్కులదేవతాచరణారవిన్దోదకమితి
యామనుసవనముత్కృష్యమాణభగవద్భక్తియోగేన దృఢం క్లిద్యమానాన్తర్హృదయ ఔత్కణ్ఠ్య
వివశామీలితలోచనయుగలకుడ్మలవిగలితామలబాష్పకలయాభివ్యజ్యమానరోమపులకకులకోऽధునాపి
పరమాదరేణ శిరసా బిభర్తి

అక్కడే ధ్రువుడు ఉన్నాడు. శింశుమారమంటే మొసలి ఆకారముతో ఉంటుంది. పరమభాగవతుడు ధ్రువుడు. ఈ జలం మా కులదైవమైన పరమాత్మ పాదోదకమని ప్రతీ క్షణం ఆకర్షితమైన భక్తి రసముతో తడిసిన హృదయముతో ఉన్న వాడిని గంగ తడిపింది. కంటి నిండా ఆనందబాష్పాలూ శరీరమంతా పులకింతలూ కలిగి పరమాత్మ యందు అతనికున్న భక్తి పారవశ్యం సూచించబడుతూ ఉంది. ఈనాటికీ ఆ గంగా జలాన్ని ధ్రువుడు రోజూ శిరస్సున ధరిస్తూ ఉన్నాడు

తతః సప్త ఋషయస్తత్ప్రభావాభిజ్ఞా యాం నను తపస ఆత్యన్తికీ సిద్ధిరేతావతీ భగవతి
సర్వాత్మని వాసుదేవేऽనుపరతభక్తియోగలాభేనైవోపేక్షితాన్యార్థాత్మగతయో ముక్తిమివాగతాం ముముక్షవ
ఇవ సబహుమానమద్యాపి జటాజూటైరుద్వహన్తి

పరమాత్మ ప్రభావం బాగా తెలిసిన తపస్వులు "మేమాచరించే తపస్సుకు అసలైన సిద్ధి ఇదే" అనుకొని, ఎప్పుడూ తగ్గని భక్తి యోగముతో ఇతర సకల పురుషార్థములనూ వారు ఉపేక్షించారు. వచ్చిన గంగను చూచి ముక్తే నడచి వచ్చింది అనుకున్నారు. ఎంతో భక్తితో గౌరవముతో ఇప్పటికీ ఆ జలాన్ని తమ జటలతో వహిస్తున్నారు.

తతోऽనేకసహస్రకోటివిమానానీకసఙ్కులదేవయానేనావతరన్తీన్దు మణ్డలమావార్య బ్రహ్మ
సదనే నిపతతి

అక్కడి నుంచీ మరి కాస్త కిందకి దిగింది గంగ. ఆకాశములోకి అవతరించింది. అక్కడ ఎప్పుడూ అనేక సహస్ర కోటి దేవతల విమానములతో నిండిన ఆకాశములో చంద్రమండలాన్ని ముంచేసి బ్రహ్మలోకానికి వచ్చింది.

తత్ర చతుర్ధా భిద్యమానా చతుర్భిర్నామభిశ్చతుర్దిశమభిస్పన్దన్తీ నదనదీ
పతిమేవాభినివిశతి సీతాలకనన్దా చక్షుర్భద్రేతి

బ్రహ్మ దగ్గరకొచ్చేసరికి ఈ నది నాలుగుగా మారింది. అల మారి నాలుగు నదులుగా ప్రవహించి సముద్రములో కలుస్తుంది. వాటిలో ఒకటి

సీతా తు బ్రహ్మసదనాత్కేసరాచలాదిగిరిశిఖరేభ్యోऽధోऽధః ప్రస్రవన్తీ గన్ధమాదనమూర్ధసు
పతిత్వాన్తరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షారసముద్రమభిప్రవిశతి

సీతా నది. అది బ్రహ్మలోకములో కేసరాచలా పర్వతం నుంచి గంధమాదన పర్వతములోకొచ్చి భద్రాశవ వర్షములో పశ్చిమ దిక్కులో ఉప్పు సముద్రములో కలుస్తుంది

ఏవం మాల్యవచ్ఛిఖరాన్నిష్పతన్తీ తతోऽనుపరతవేగా కేతుమాలమభి చక్షుః ప్రతీచ్యాం దిశి సరిత్
పతిం ప్రవిశతి

ఇంకో నది చక్షు, మాల్యవ శికరం నుంచి జారిపడుతూ వేగం తగ్గకుండా కేతుమాలమునుంచి వచ్చి పశ్చిమ దిక్కునుంచి సముద్రములో చేరుతుంది

భద్రా చోత్తరతో మేరుశిరసో నిపతితా గిరిశిఖరాద్గిరిశిఖరమతిహాయ శృఙ్గవతః
శృఙ్గాదవస్యన్దమానా ఉత్తరాంస్తు కురూనభిత ఉదీచ్యాం దిశి జలధిమభిప్రవిశతి

భద్రా నది మేరు నుండి ఉత్తరభాగం నుండి పడి ఒక్కో పర్వతాన్ని దాటుకుంటూ వచ్చి శృగవత్ పర్వతం నుంచి జారుతూ ఉత్తర దిక్కులో సముద్రాన్ని చేరుతుంది.

తథైవాలకనన్దా దక్షిణేన బ్రహ్మసదనాద్బహూని గిరికూటాన్యతిక్రమ్య
హేమకూటాద్ధైమకూటాన్యతిరభసతరరంహసా లుఠయన్తీ భారతమభివర్షం దక్షిణస్యాం దిశి
జలధిమభిప్రవిశతి యస్యాం స్నానార్థం చాగచ్ఛతః పుంసః పదే పదేऽశ్వమేధరాజసూయాదీనాం ఫలం
న దుర్లభమితి

అలకనంద బ్రహ్మలోకం నుంచి దక్షిణ దిక్కు నుంచి జారి ఎన్నో పర్వతాలను దాటి హేమ పర్వతాన్ని దాటి భారత వర్షము వద్ద దక్షిణ దిక్కులో సముద్రాన్ని చేరుతుంది. ఈ నదిలో స్నానం చేసిన వాడికి ప్రతీ అడుగుకూ పది అశ్వమేధాలూ రాజసూయాలు చేసినట్లు

అన్యే చ నదా నద్యశ్చ వర్షే వర్షే సన్తి బహుశో మేర్వాదిగిరిదుహితరః శతశః
తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రమన్యాన్యష్ట వర్షాణి స్వర్గిణాం పుణ్యశేషోపభోగ
స్థానాని భౌమాని స్వర్గపదాని వ్యపదిశన్తి

ఇలా ఈ నాలుగే కాక ప్రతీ వర్షములో ఎన్నో నదులూ నదములూ ఉన్నాయి. కొన్ని మేరు పర్వతం యొక్క బిడ్డలు. ఒక్కో పర్వతం నుండీ వేల నదులు పుట్టాయి. అవి ఈ భూ ప్రపంచాన్ని ఆవరించి ఉన్నాయి. వీటిలో అలకనందకు ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే భార్త క్షేత్రం గొప్పది కాబట్టి అలకనంద గొప్పది. భార్త క్షేత్రం కర్మ భూమి. ఆయా లోకాలకు వెళ్ళడానికి కావలసిన కర్మలు చేయడానికి ఉన్నది భారత భూమి. స్వర్గములో దేవతలు కూడా ఇక్కడికే వచ్చి ఆ స్థానం పొందారు. మిగతా ఎనిమిది వర్షములూ స్వర్గానికి వెళ్ళేవారు పుణ్య శేషముతో అనుభవించే భోగస్థానాలు.

ఏషు పురుషాణామయుతపురుషాయుర్వర్షాణాం దేవకల్పానాం నాగాయుతప్రాణానాం
వజ్రసంహననబల
వయోమోదప్రముదితమహాసౌరతమిథునవ్యవాయాపవర్గవర్షధృతైకగర్భకలత్రాణాం తత్ర తు త్రేతా
యుగసమః కాలో వర్తతే

మిగతా వర్షాలలో పురుషులకు పదివేల, లక్ష సంవత్సరాలు ఆయువు కలవారు, పదివేల ఏనుగుల బలం కలవారు. వజ్రాయుధం కన్నా ఎక్కువ బలం కలవారు. నిరంతరం ఆమోదమే, మోదమూ (శరీర హర్షం లేదా అనుకూల వస్తువును చూడటం వలన కలిగేది) ప్రమోదమూ (మాన్సిక హర్షం లేదా చూసిన వస్తువును తనది చేసుకోవడం వలన కలిగేది) ఆనందమూ (ఆత్మానందం లేదా తనది చేసుకున్న దానిని అనుభవించడం వలన కలిగేది.)  ఇవి కలగడం వలన సంతోషించిన వారూ, నిరంతరం దంపతుల సమాగమముతోనే కాలం గడిపేవారు. వారు కేవలం యుగం పూర్తైన తరువాత చివరి సంవత్సరములో మాత్రమే ఆ భార్యలు గర్భాన్ని ధరిస్తారు. అక్కడి కాలం త్రేతాయుగములా ఉంటుంది.

యత్ర హ దేవపతయః స్వైః స్వైర్గణనాయకైర్విహితమహార్హణాః సర్వర్తుకుసుమస్తబకఫల
కిసలయశ్రియానమ్యమానవిటపలతావిటపిభిరుపశుమ్భమానరుచిరకాననాశ్రమాయతనవర్షగిరిద్రోణీషు
తథా చామలజలాశయేషు వికచవివిధనవవనరుహామోదముదితరాజహంసజలకుక్కుటకారణ్డవసారస
చక్రవాకాదిభిర్మధుకరనికరాకృతిభిరుపకూజితేషు జలక్రీడాదిభిర్విచిత్రవినోదైః సులలితసురసున్దరీణాం
కామకలిలవిలాసహాసలీలావలోకాకృష్టమనోదృష్టయః స్వైరం విహరన్తి

అక్కడి దేవతాపతులు తమ తమ సేవకులతో గొప్ప సేవలు చేయించుకోబడుతూ అన్ని ఋతువులలో ఉన్న అన్ని కాయలూ పళ్ళతో ఆరాధించబడుతూ, చెట్లూ పూలూ కాయలూ పళ్ళూ చెట్ల కొమ్మలూ అరణ్యములూ వాటితో కూడిన పర్వతములూ నదులూ ఆశ్రయములూ పరిశుద్ధమైన జలము కలిగి ఉన్న ఆశ్రమాలు. రక రకముల పక్షులూ తుమ్మెదలూ మొదలైన వాటితో విహరిస్తూ ఉండగా, జల క్రీడలతో పరమ సుందరులైన దేవతా స్త్రీలతో వారి యవ్వనం వయ్యారముతో ఆకర్షించబడిన మనసు కలవారై విహరిస్తూ ఉంటారు

నవస్వపి వర్షేషు భగవాన్నారాయణో మహాపురుషః పురుషాణాం తదనుగ్రహాయాత్మతత్త్వ
వ్యూహేనాత్మనాద్యాపి సన్నిధీయతే

అక్కడ ప్రతీ వర్షములో పరమాత్మ ఏదో ఒక రూపములో అక్కడ ఉన్న వారిలో ముఖ్యమైన వారితో పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ తొమ్మిది వర్షాలలో పరమాత్మ ఆయా రూపాలలో ఇప్పటికీ ఉన్నాడు

ఇలావృతే తు భగవాన్భవ ఏక ఏవ పుమాన్న హ్యన్యస్తత్రాపరో నిర్విశతి భవాన్యాః శాపనిమిత్తజ్ఞో
యత్ప్రవేక్ష్యతః స్త్రీభావస్తత్పశ్చాద్వక్ష్యామి

ఇలావృత వర్షములో కేవల శంకరుడు మాత్రమే పురుషుడు. మిగతా వారు ఎవరు వెళ్ళినా స్త్రీలే అవుతారు. పార్వతీదేవి శాపమున్నది.

భవానీనాథైః స్త్రీగణార్బుదసహస్రైరవరుధ్యమానో భగవతశ్చతుర్మూర్తేర్మహాపురుషస్య
తురీయాం తామసీం మూర్తిం ప్రకృతిమాత్మనః సఙ్కర్షణసంజ్ఞామాత్మసమాధిరూపేణ
సన్నిధాప్యైతదభిగృణన్భవ ఉపధావతి

అమ్మవారు వారందరికీ నాయకురాలు. శంకరుడు పరమాత్మ యొక్క నాలగవ రూపం (సంకర్షణ) అయిన శంకరుడు ఆత్మ రూపములో ఉండి పరమాత్మ అయిన సంకర్షణున్ని ఆరాధిస్తాడు ఈ మంత్రముతో

శ్రీభగవానువాచ
ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణసఙ్ఖ్యానాయానన్తాయావ్యక్తాయ నమ ఇతి
భజే భజన్యారణపాదపఙ్కజం భగస్య కృత్స్నస్య పరం పరాయణమ్
భక్తేష్వలం భావితభూతభావనం భవాపహం త్వా భవభావమీశ్వరమ్

ఇది సంకర్షణ మత్రం. అన్ని గుణములూ వచ్చి చేరిన వాడు. స్వామి విజ్ఞ్యానమూ బలమూ అనంతము. ఆయన అవ్యక్తుడు. అలాంటి స్వామికి నమస్కారం. అని శంకరుడు సంకర్షణున్ని ఇలావృత్తములో స్వామిని అర్చిస్తూ ఉంటాడు. "సేవించదగిన వారికి నెలవైన పాదపద్మములు కలిగినవాడివైన నిన్ను సేవిస్తున్నాను. సకల ఐశ్వర్యము ఇచ్చే స్వామి, సంసారాన్ని తొలగించే నీవు, భక్తుల కోరిక తీర్చే నీకు నమస్కరిస్తున్నాను

న యస్య మాయాగుణచిత్తవృత్తిభిర్నిరీక్షతో హ్యణ్వపి దృష్టిరజ్యతే
ఈశే యథా నోऽజితమన్యురంహసాం కస్తం న మన్యేత జిగీషురాత్మనః

ఈయన తన మాయా గుణములతో చిత్త వృత్తులతో సృష్టించబడిన జగత్తును చూస్తున్నా వాటి యందు ఆయనకు ఆసక్తి కలగదు. మనస్సు లగ్నం కాకుండా ఉండాలంటే కోపాన్ని గెలవాలి. కోపాన్ని గెలవగలిగిన వాడే మనస్సుని గెలవగలరు. మానవులందరూ గెలవలేని కోపం గలవారే. కోపమును గెలవాలనుకున్న వారు ఎవరు ఆ పరమాత్మను సేవించరు?

అసద్దృశో యః ప్రతిభాతి మాయయా క్షీబేవ మధ్వాసవతామ్రలోచనః
న నాగవధ్వోऽర్హణ ఈశిరే హ్రియా యత్పాదయోః స్పర్శనధర్షితేన్ద్రియాః

వంకర చూపు ఉన్నవారికి ప్రపంచం ఉన్నట్లు కనపడుతుంది. మద్య పానం చేసిన వారి కనులు ఎలా ఐతే ఎర్రబారి ప్రపంచమంతా తిరుగుతున్నట్లు కనపడుతుందో అలాగ. నాగ వధువులు ఆరాధించడానికి ముందుకు వచ్చీ, పరమాత్మ పాదములు స్పృశించడం వలన ఇంద్రియ ఘర్షణ కలిగి, సిగ్గుతో ఆరాధించలేకపోతున్నారు నిన్ను. నీకు పుట్టుకా రక్షణా లయం లేదు. అందుకే నిన్ను అనంతం అంటారు.

యమాహురస్య స్థితిజన్మసంయమం త్రిభిర్విహీనం యమనన్తమృషయః
న వేద సిద్ధార్థమివ క్వచిత్స్థితం భూమణ్డలం మూర్ధసహస్రధామసు

ఈ సంకర్షుని వేయి పడగలలో ఏదో ఒక పడగ మీద ఏదో ఒక చిన్న మూల ఆవగింజలా ఉన్న భూమండలం ఉన్నట్లు కూడా ఈయనకు తెలియదు.

యస్యాద్య ఆసీద్గుణవిగ్రహో మహాన్విజ్ఞానధిష్ణ్యో భగవానజః కిల
యత్సమ్భవోऽహం త్రివృతా స్వతేజసా వైకారికం తామసమైన్ద్రియం సృజే

ఈయన గుణాలు అనంతములు. ఈయన అనంతమైన ఆకారములలో ఒక ఆకారం బ్రహ్మ. ఆయన నుంచి నేను (శంకరుడు) పుట్టాను. నేను సత్వ రజస్సు తమో గుణాలూ ఓంకారం ఇలాంటి వాటితో తమోగుణాలనూ పంచభూతాలనూ ప్రళయాన్ని సృష్టించేవాడిగా ఉన్నాను.

ఏతే వయం యస్య వశే మహాత్మనః స్థితాః శకున్తా ఇవ సూత్రయన్త్రితాః
మహానహం వైకృతతామసేన్ద్రియాః సృజామ సర్వే యదనుగ్రహాదిదమ్

మేమంతా దారముతో కట్టబడిన పక్షులలా ఈయన అధీనములో ఉన్నాము. నేను మహాన్ (అహంకారం), రాజసిక సాత్విక తామసిక అహంకారాన్ని సృష్టిస్తున్నాను. అది ఎవరి అనుగ్రహం వలన చేస్తున్నామో ఆయనకి నమస్కారం

యన్నిర్మితాం కర్హ్యపి కర్మపర్వణీం మాయాం జనోऽయం గుణసర్గమోహితః
న వేద నిస్తారణయోగమఞ్జసా తస్మై నమస్తే విలయోదయాత్మనే

ఎవరి మాయ వలన త్రిగుణాత్మకమైన జగత్తులో పడి దానిని దాటలేకపోతున్నాము. దీనిని ఎలా దాటాలో మనం తెలుసుకోలేకపోతున్నాము. అలాంటి ప్రళయకారకుడైన పరమాత్మకు నమస్కారం

Monday, March 25, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదహారవ అధ్యాయం


శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదహారవ అధ్యాయం

రాజోవాచ
ఉక్తస్త్వయా భూమణ్డలాయామవిశేషో యావదాదిత్యస్తపతి యత్ర చాసౌ జ్యోతిషాం గణైశ్చన్ద్రమా
వా సహ దృశ్యతే

తత్రాపి ప్రియవ్రతరథచరణపరిఖాతైః సప్తభిః సప్త సిన్ధవ ఉపక్లృప్తా యత ఏతస్యాః సప్త
ద్వీపవిశేషవికల్పస్త్వయా భగవన్ఖలు సూచిత ఏతదేవాఖిలమహం మానతో లక్షణతశ్చ సర్వం వి
జిజ్ఞాసామి

ప్రియవ్రతుని గురించి చెబుతూ భూమండల విస్తారం చెప్పారు. సూర్య భగవానుడు ఎంత వరకూ తన ప్రభావం వ్యాపింపచేసాడో చంద్రుడు ఎంత వరకూ వ్యాపింప చేసాడో చెప్పారు. ఏడు ద్వీపాల గురించీ సముద్రాల గురించీ చెప్పారు.
ఒక్కో ద్వీపం సముద్రం ఎంత విశాలమూ దాని గుణములేమిటీ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ జగత్తంతా పరమాత్మ స్థూల రూపం. ఈ జగత్తును బాగా అర్థం చేసుకుంటే భగవానుని స్థూల రూపాన్ని ధ్యానం చేయవచ్చు.   నిరాకారమైన స్వామి మీద మనసు లగ్నం అయ్యే వరకూ ఆయన స్థూల రూపం మీద మనసు లగ్నం చేయాలి.

భగవతో గుణమయే స్థూలరూప ఆవేశితం మనో హ్యగుణేऽపి సూక్ష్మతమ ఆత్మజ్యోతిషి పరే
బ్రహ్మణి భగవతి వాసుదేవాఖ్యే క్షమమావేశితుం తదు హైతద్గురోऽర్హస్యనువర్ణయితుమితి

సూక్ష్మ రూపం యందు మనసు నిలపడానికి పరమాత్మ స్థూల రూపం మీద నిలుపుట అభ్యాసముగా ఉంటుంది.  మీరు మాకు సకల పృధ్వీ మండలాన్నీ వర్ణించవలసినది.  ఆ ప్రశ్న విన్న శుకుడు

ఋషిరువాచ
న వై మహారాజ భగవతో మాయాగుణవిభూతేః కాష్ఠాం మనసా వచసా వాధిగన్తుమలం
విబుధాయుషాపి పురుషస్తస్మాత్ప్రాధాన్యేనైవ భూగోలకవిశేషం నామరూపమానలక్షణతో
వ్యాఖ్యాస్యామః

పరమాత్మ విభూతులన్నీ అనంతములూ. ఆ విభూతులన్నీ ప్రతి ఒక్కటీ వివరముగా వర్ణించడం ఎవరి వలనా కాదు. ఆయన విభూతులలో ఏదో ఒక భాగం పూర్తిగా వర్ణించాలన్నా మనస్సుతో గానీ వాక్కుతో గానీ అందుకోలేము, మనకు దేవతల ఆయుష్షు వచ్చినా, కల్ప కాలం మనం ఉన్నా అది అలవి కాని పని.

మొత్తం కాకుండా ప్రాధాన్యమైన విశేషమును వివరిస్తాను. వాటి పేరూ కొలతా చెబుతాను

యో వాయం ద్వీపః కువలయకమలకోశాభ్యన్తరకోశో నియుతయోజనవిశాలః సమవర్తులో యథా
పుష్కరపత్రమ్

యస్మిన్నవ వర్షాణి నవయోజనసహస్రాయామాన్యష్టభిర్మర్యాదాగిరిభిః సువిభక్తాని భవన్తి

మనం ఉన్నది జంబూ ద్వీపమూ లేదా ఇలా వర్షము. కలువ మొగ్గ రూపములో ఉంటుంది. దీని అభ్యంతర కోశం (జఠరం) లక్ష యోజనాలు ఉంటుంది. సమవర్తులాకారములో ఒకే రకమైన కొలతలో పద్మం యొక్క రేకులాగ ఏ భాగం నుంచి కొలిచినా ఒకే కొలత ఉంటుంది.

ఇందులో తొమ్మిది వర్షాలుంటాయి. ఒక్కోటి తొమ్మిది వేల యోజనాలు.

ఏషాం మధ్యే ఇలావృతం నామాభ్యన్తరవర్షం యస్య నాభ్యామవస్థితః సర్వతః సౌవర్ణః కుల
గిరిరాజో మేరుర్ద్వీపాయామసమున్నాహః కర్ణికాభూతః కువలయకమలస్య మూర్ధని ద్వాత్రింశత్సహస్ర
యోజనవితతో మూలే షోడశసహస్రం తావతాన్తర్భూమ్యాం ప్రవిష్టః

దీనికి సరిహద్దు పర్వతాలు ఎనిమిది ఉంటాయి. ఈ తొమ్మిది వర్షముల మధ్యలో ఇలా వృత్తమనే వర్షముంటుంది. మేరుపర్వతం దేని మధ్యలో ఉందో అది ఇలా వృత్తం. అది బంగారు పర్వతం. జంబూ ద్వీపం ఎంత వైశాల్యముందో ఈ మేరు పర్వతం అంత ఎత్తు ఉంది. లక్ష యోజనాల పొడవు ఈ పర్వతం. దీప ఆయమ సమున్నాహః  ద్వీప వైశాల్యమంత ఎత్తు గలదు.
ఈ పర్వతం పైభాగములో ముప్పై రెండు వేల యోజనాలు వైశాల్యం, పదహారువేలు యోజనాలు కింద వైశాల్యం. కింద వైశాల్యం తక్కువ, పైన వైశాల్యం ఎక్కువ. దేవతా లోకాలన్నీ ఇక్కడే ఉన్నాయి.  పదహారు వేల యోజనాలతో భూమిలోపల కూడా ఉంది. అంత విస్తీర్ణముతో పదహారు వేల యోజనాల లోతు వెడల్పుతో అంతర్భూమిలో ఉంది.

ఉత్తరోత్తరేణేలావృతం నీలః శ్వేతః శృఙ్గవానితి త్రయో రమ్యకహిరణ్మయకురూణాం వర్షాణాం మర్యాదా
గిరయః ప్రాగాయతా ఉభయతః క్షారోదావధయో ద్విసహస్రపృథవ ఏకైకశః పూర్వస్మాత్పూర్వస్మాదుత్తర
ఉత్తరో దశాంశాధికాంశేన దైర్ఘ్య ఏవ హ్రసన్తి

ఇలా వృతానికి ఉత్తర భాగములో మూడు పర్వతాలుంటాయి -  నీలః శ్వేతః శృఙ్గవ. ఒక్కో పర్వతం ఒక్కో వర్షానికీ(రమ్యకహిరణ్మయకురూణాం) సరిహద్దు. ఇవి తూర్పు దిక్కు వైశాల్యం ఉండి విస్తరించాయి. ఉప్పు సముద్రానికి ఆ పక్కా ఎపక్కా వ్యాపించాయి. ఒక్కో పర్వతం తన పూర్వ పర్వతం కంటే పది రెట్లు ఎక్కువ విస్తీర్ణం.

ఏవం దక్షిణేనేలావృతం నిషధో హేమకూటో హిమాలయ ఇతి ప్రాగాయతా యథా
నీలాదయోऽయుతయోజనోత్సేధా
హరివర్షకిమ్పురుషభారతానాం యథాసఙ్ఖ్యమ్

తథైవేలావృతమపరేణ పూర్వేణ చ మాల్యవద్గన్ధమాదనావానీలనిషధాయతౌ ద్విసహస్రం
పప్రథతుః కేతుమాలభద్రాశ్వయోః సీమానం విదధాతే

మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద ఇత్యయుతయోజనవిస్తారోన్నాహా మేరోశ్చతుర్
దిశమవష్టమ్భగిరయ ఉపక్లృప్తాః

పొడుగులోనే ఎక్కువ తక్కువలు, వైశాల్యములో కావు. దక్షిణ ఇలా వృతములో మూడు పర్వతాలు ఉన్నాయి. నిషధో హేమకూటో హిమాలయ. ఇవన్నీ పదివేల యోజనాల ఎత్తులో ఉన్నాయి. హరి వర్షం కింపురుషం భారత వర్షం. భారతదేశ సరిహద్దు పర్వతం హిమాలయం. ఇలావృత వర్షానికి పూర్వభాగములో, ఇంకో మూడు పర్వతాలు ఉన్నాయి. మాల్యవత్ గంధమాధనం అవానలం అనే పర్వతాలు పేరు పొందాయి. ఇవి కేతుమాల భద్రాశ్వ వర్షానికి హద్దులు. మరియొక నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తూ వెడల్పు ఉన్నవై మేరు పర్వతానికి ఉన్నాయి. మన్దరో మేరుమన్దరః సుపార్శ్వః కుముద. మేరు పర్వతానికి పోదగినవారికే ఈ పర్వతాలు దారి ఇస్తాయి. మేరుపర్వతానికి ఇవి రక్షకమైనవి.

చతుర్ష్వేతేషు చూతజమ్బూకదమ్బన్యగ్రోధాశ్చత్వారః పాదపప్రవరాః పర్వతకేతవ ఇవాధి
సహస్రయోజనోన్నాహాస్తావద్విటపవితతయః శతయోజనపరిణాహాః

ఈ నాలుగు పర్వతములలో ఒక్కో పర్వతానికి గుర్తుగా ఒక్కో మహా వృక్షములు ఉన్నాయి.మామిడీ జంబూ కదంబం న్యగ్రోధ (మఱ్ఱి). ఈ నాలుగు మహావృక్షాలూ పర్వతానికి జండాలులా ఉన్నాయి.

హ్రదాశ్చత్వారః పయోమధ్విక్షురసమృష్టజలా యదుపస్పర్శిన ఉపదేవగణా యోగైశ్వర్యాణి
స్వాభావికాని భరతర్షభ ధారయన్తి

పదకొండు వేల యోజనాల ఎత్తుతో, ఒక్కో కొమ్మ వైశాల్యం వంద యోజనాలు. అలాగే ఈ పర్వతానికి నాలుగు చెట్లున్నాయి. నాలుగు సముద్రాలే వీటికి నీరుపోస్తాయి. పాలూ తేనే చెరుకు రసం నీరు. ఈ నాలుగు జనములతో నాలుగు హ్రదములున్నాయి.

దేవోద్యానాని చ భవన్తి చత్వారి నన్దనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రమితి

యేష్వమరపరివృఢాః సహ సురలలనాలలామయూథపతయ ఉపదేవగణైరుపగీయమాన
మహిమానః కిల విహరన్తి

ఈ జలములో గొప్పదనం, ఒక్క సారి ఈ జలాన్ని ఆచమనం చేస్తే దేవతల సమముతో బలం వచ్చి యోగముతో నిష్ణాతులవుతారు. ఉపదేవతల ఐశ్వర్యం  సహజముగా వస్తాయి.

నాలుగు పర్వతాలూ నాలుగు చెట్లూ నాలుగు నదులతో బాటు నాలుగు ఉద్యాన వనాలున్నాయి. అవి నందనం చైత్రరథం వైభ్రాజకం సర్వతోభద్రం. ఈ ఉద్యానవనములలో దేవతలతో చుట్టబడి దేవతా స్త్రీలూ వారి భర్తలూ వినోడములతో కాలం గడుపుతారు

మన్దరోత్సఙ్గ ఏకాదశశతయోజనోత్తుఙ్గదేవచూతశిరసో గిరిశిఖరస్థూలాని ఫలాన్యమృత
కల్పాని పతన్తి

తేషాం విశీర్యమాణానామతిమధురసురభిసుగన్ధిబహులారుణరసోదేనారుణోదా నామ నదీ
మన్దరగిరిశిఖరాన్నిపతన్తీ పూర్వేణేలావృతముపప్లావయతి

మందర పర్వతం మీద ఉన్న చెట్టు పేరు మామిడి. పదకొండు వందల యోజనాల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తుకు తగ్గట్టుగా ఒక్కో పండూ ఒక్కో పర్వత శిఖరములా ఉంటుంది. అవి ఎంతో తీయగా ఉంటాయి.

యదుపజోషణాద్భవాన్యా అనుచరీణాం పుణ్యజనవధూనామవయవస్పర్శసుగన్ధవాతో దశ
యోజనం సమన్తాదనువాసయతి

ఆ మామిడి పళ్ళ రసం పర్వత ప్రాంతములో ప్రవహించింది, అలా ప్రవహించి ఎరుపు రంగు నీరులా మారి అరుణొద అనే పేరు వచ్చింది. మందర గిరి శిఖరం నుంచి ఈ నది పడి తూర్పు దిక్కుగా ప్రవహించి ఇలావృతాన్ని తడిపేస్తుంది. ఈ అరుణొదా నది జలమును సేవించిన పార్వతీ దేవి సేవకులైన యక్షులు మొదలైనవారిని స్పృశిస్తే చాలు, మన శరీర సుగంధం పదియోజనాలు వ్యాపిస్తుంది.

ఏవం జమ్బూఫలానామత్యుచ్చనిపాతవిశీర్ణానామనస్థిప్రాయాణామిభకాయనిభానాం రసేన
జమ్బూ నామ నదీ మేరుమన్దరశిఖరాదయుతయోజనాదవనితలే నిపతన్తీ దక్షిణేనాత్మానం
యావదిలావృతముపస్యన్దయతి

జంబూ (అల్ల నేరేడు) పళ్ళు కింద పడగా ఒక్కో పండు ఏనుగు శరీరమంత ఉండగా ఆ జంబూ ఫలము యొక్క రసము పారిన నది జంబూ నది. ఈ ప్రవాహమూ జలమూ నదీ పరివాహక ప్రాంతములో ఉన్న మట్టితో కలిసి బంగారమయ్యింది. జంబూ నదీ తీరములో పుట్టినది జాంబూనదం. దానితో దేవతలు ఆభరణాలు చేసుకుంటారు.  మేరు మందర శిఖరాల నుండీ పదివేల యోజనాల నుండీ కిందపడుతూ దక్షిణ భాగములో పడి ఇలా వృత వర్షాన్ని తడిపేస్తుంది. అక్కడ ఉండే మట్టి,జంబూ రసముతో తడపబడి, వాయువు సూర్య కిరణాలు సోకడం వలన  దేవతలకు ఆభరణముగా జాంబూనదముగా పేరు గాంచింది

తావదుభయోరపి రోధసోర్యా మృత్తికా తద్రసేనానువిధ్యమానా వాయ్వర్కసంయోగవిపాకేన
సదామరలోకాభరణం జామ్బూనదం నామ సువర్ణం భవతి

యదు హ వావ విబుధాదయః సహ యువతిభిర్ముకుటకటకకటిసూత్రాద్యాభరణరూపేణ ఖలు
ధారయన్తి

యస్తు మహాకదమ్బః సుపార్శ్వనిరూఢో యాస్తస్య కోటరేభ్యో వినిఃసృతాః
పఞ్చాయామపరిణాహాః
పఞ్చ మధుధారాః సుపార్శ్వశిఖరాత్పతన్త్యోऽపరేణాత్మానమిలావృతమనుమోదయన్తి

ఇక మూడవ వృక్షం కడిమ చెట్టు, ఇది సుపార్శ్వములో ఉంది. ఈ వృక్షం యొక్క తొఱ్ఱలో వెళ్ళినటువంటి ఐదు మధు ధారలు ప్రవహిస్తూ పర్వత శిఖరము నుంచీ ప్రవహిస్తూ ఇలా వృతానికి పశ్చిమ భాగములో వస్తాయి. ఈ రసాన్ని తాగిన వారి నిట్టూర్పు నుంచి వచ్చిన వాయువు కొన్ని  యోజనాలు వ్యాపిస్తుంది.

యా హ్యుపయుఞ్జానానాం ముఖనిర్వాసితో వాయుః సమన్తాచ్ఛతయోజనమనువాసయతి

ఏవం కుముదనిరూఢో యః శతవల్శో నామ వటస్తస్య స్కన్ధేభ్యో నీచీనాః పయోదధిమధుఘృత
గుడాన్నాద్యమ్బరశయ్యాసనాభరణాదయః సర్వ ఏవ కామదుఘా నదాః
కుముదాగ్రాత్పతన్తస్తముత్తరేణేలావృతముపయోజయన్తి

ఇక నాలగవది అయిన న్యగ్రోధము (మఱ్ఱి). ఇక్కడ నాలుగు నదములు ఉన్నాయి. (తూర్పు నుంచి పశ్చిమానికి పారితే నదము).

యానుపజుషాణానాం న కదాచిదపి ప్రజానాం వలీపలితక్లమస్వేదదౌర్గన్ధ్యజరామయమృత్యు
శీతోష్ణవైవర్ణ్యోపసర్గాదయస్తాపవిశేషా భవన్తి యావజ్జీవం సుఖం నిరతిశయమేవ

అన్ని కోరికలూ తీర్చే నదులు ఇవి. అన్ని కావలసిన వాటికీ నదులే ప్రసాదిస్తాయి.పరవతం నుంచి పడుతూ ఉత్తరం వైపునుంచి ఇలావృతానికి వ్యాపించి ఉంటుంది. ఈ నీరు తాగినందు వలనే వారిని దేవతలన్నారు. శరీరం మడత పడటం శరీరం దుర్గంధం రావడం మొదలైనవి ఉండవు.చలి వేడి రంగు మారడం లాంటివి ఈ నదీ జలం తాగే వారికి ఏర్పడవు. బతికున్నంతవరకు మాత్రం ఇవన్నీ అనుభవిస్తారు.

కురఙ్గకురరకుసుమ్భవైకఙ్కత్రికూటశిశిరపతఙ్గరుచకనిషధశినీవాసకపిలశఙ్ఖ
వైదూర్యజారుధిహంసఋషభనాగకాలఞ్జరనారదాదయో వింశతిగిరయో మేరోః కర్ణికాయా ఇవ కేసరభూతా
మూలదేశే పరిత ఉపక్లృప్తాః

ఈ మొత్తం ఇరవై పర్వతాలు. ఇవి మేరు పర్వతానికి పూవు మధ్య చుట్టు ఉన్న కర్ణికలాగ ఉన్నాయి. మేరు పర్వతం మధ్యభాగమైతే ఈ ఇరవై పర్వతాలూ చుట్టూ వ్యాపించి ఉంటాయి.

జఠరదేవకూటౌ మేరుం పూర్వేణాష్టాదశయోజనసహస్రముదగాయతౌ ద్విసహస్రం పృథుతుఙ్గౌ
భవతః ఏవమపరేణ పవనపారియాత్రౌ దక్షిణేన కైలాసకరవీరౌ ప్రాగాయతావేవముత్తరతస్త్రిశృఙ్గ
మకరావష్టభిరేతైః పరిసృతోऽగ్నిరివ పరితశ్చకాస్తి కాఞ్చనగిరిః

జఠరదేవ మేరు యొక్క పూర్వభాగములో ఉండి దశయోజన విస్తీర్ణముతో వ్యాపించి ఉంటాయి. ఇలా చుట్టూ ఉన్న పర్వతాలతో మేరుపర్వతం అగ్ని జ్వాలలతో ఆవరించి ఉన్నట్లుగా ప్రకాశిస్తూ ఉంటుంది.

మేరోర్మూర్ధని భగవత ఆత్మయోనేర్మధ్యత ఉపక్లృప్తాం పురీమయుతయోజనసాహస్రీం సమ
చతురస్రాం శాతకౌమ్భీం వదన్తి

మేరు యొక్క మూర్ధ్న భాగములో చతుర్ముఖ బ్రహ్మ యొక్క నగరముంటుంది. పదివేల యోజనాలతో సమ చతురస్రముగా ఉంటుంది. అది శాతకుంభీ నగరం.

తామనుపరితో లోకపాలానామష్టానాం యథాదిశం యథారూపం తురీయమానేన
పురోऽష్టావుపక్లృప్తాః

ఇలాంటి బ్రహ్మ పురిని చుట్టుకొని అష్టదిగ్పాలకుల నగరాలుంటాయి. ఏ దిక్కుకు ఏ పాలకులో ఆ దిక్కులో ఆ నగరాలుంటాయి. ఒక్కో దానికీ రెండవది నాలగవ వంతు.  

జంబూ ద్వీపములో నవ వర్షాలు. తొమ్మిది వేల యోజనాల వెడల్పు ఒక్కొక్కటీ. మొత్తం ఈ ద్వీపములో మర్యాదా గిరులు (హద్దులు) ఉన్నాయి. గుండ్రముగా ఉన్న భూమిలో నిలువుగా ఒక గీతా అడ్డముగా ఒక గీతా గీస్తే ఆ మధ్య నుండే దానిలో ఇలావృతమనే వర్షముంది. అది నాభి యందు ఉంది, అక్కడ ఉన్న పర్వతం పేరు మేరువు. అది బంగారములా మెరుస్తూ ఉంటుంది. అది ముప్పై రెండు వేల యోజనాలు వెడల్పు. మొదలు పదహారు వేలు భూమిలోకి పదహారు వేలు. ఇలా వృతమనేది మధ్యలో ఉంది. దానికి ఉత్తరముగా (అంటే మీదకి) మూడు ఉన్నాయి నీలా శ్వేత శృంగవాన్ అని మూడు కొండలు. అక్కడ రమ్యక హిరణ్మయ కురు అనే మూడు వర్షాలు ఇలావృత వర్షం మీద ఉన్నాయి. దానికి ఈ పక్కా ఆ పక్కా ఉప్పు సముద్రం. అది ఒక్కో దానికంటే రెండవది రెండు వేల యోజనాల ఎక్కువ ఉంటుంది. ఇంక కిందకు వస్తే నిషధం హేమకూటం హిమాలయం అంటే మూడు పర్వతాలు. మధ్యభాగానికి దక్షిణం వైపు ఉంది. అక్కడ హరి వర్షమూ కింపురుష వర్షమూ భారత వర్షమూ ఉన్నాయి. మొదట ఇలా వృతానికి దగ్గరగా ఉన్నది హరి వర్షం, దానికింద కింపురుష, దాని కింద భారత. ఇలా వృత వర్షానికి పడమట వైపు మాల్యవత్ అనే పర్వతం తూర్పు వైపు గంధమాధనమనే పర్వతం ఉన్నాయి. అక్కడ కేతు మాల భద్రాశ్వమనే వర్షం ఉన్నాయి. ఇవి మొత్తం తొమ్మిది వర్షముల యొక్క సంస్థానం. వీటిలో మందరమూ మేరు మందరమూ సుపార్శ్వమూ కుముదమూ అని మధ్యలో ఉన్న మేరుపర్వతానికి దగ్గరలో దాని అంత ఎత్తుకాకుండా దానికి కాపలాగా అన్నట్లుగా ఈ నాలుగు పర్వతాలూ ఉన్నాయి. తామర మధ్య చుట్టూ ఉన్న రేకులలాగ. ఈ నాలుగు పర్వతాల మీదా నాలుగు చెట్లున్నాయి మామిడీ నేరేడు కదంబ మర్రి చెట్లు. ఈ పర్వతాలు కొన్ని వేల యోజనాల ఎత్తు ఉన్నాయి, ఎన్నో శాఖలు కలిగి ఉన్నాయి, విశాలమైన సరస్సులు ఉన్నాయి. ఒకటి మంచి నీళ్ళ సరస్సు ఒకటి తేనే సరస్సు ఒకటి చెరుకు సరస్సు పాల సరస్సూ ఉన్నాయి. అక్కడ దేవతల ఉద్యానాలు ఉన్నాయి - నందనం చైత్రథం వైభ్రాజకం సర్వతోభద్రమని. అక్కడి దేవతలందరూ వారి వారి భార్యలతో కలిసి వచ్చి విహరిస్తూ ఉంటారు.

ఈ మందర పర్వతం మీద కొండంత మామిడి పళ్ళు పండుతాయి. అవి రాలి కిందపడి వాటి రసం పారుతూ ఉంటుంది. అదే అరుణోదా అనే నది మందర గిరి శిఖరం నుండి ఇలావృత వర్షమునకు వస్తుంది ఆ నది. దానిని చుట్టుపక్కలా ఉండే యక్షులు అనుభ్వైస్తూ ఉంటారు. మరొక పర్వతం (దక్షిణ భాగం మీద ఉన్న కొండమీద) జంబూ అనే నేరేడు చెట్టు చాలా ఎత్తుగా ఉండి ఏనుగంత నేరేడు పళ్ళు కిందపడి వాటి రసం పారి, మేరు మందర శిఖరం కంటే ఎత్తైన దానినుండి ఇలావృతానికి దక్షిణముగా పారుతోంది. ఈ రెండు వైపులా ఉన్న మట్టి ఈ నేరేడు పళ్ళు రసములు తగలడం వలన బంగారములా మెరుస్తూ ఉంటుంది. మెరవడం చేతనూ ఆ మట్టి చేతనే బంగారం రావడం చేతనూ దానికి జాంబూనదం అని పేరు పెట్టారు. ఆ జంబూ నది ఒడ్డులో బంగారం పండుతుంది.

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదిహేనవ అధ్యాయం



శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
భరతస్యాత్మజః సుమతిర్నామాభిహితో యము హ వావ కేచిత్పాఖణ్డిన ఋషభ
పదవీమనువర్తమానం చానార్యా అవేదసమామ్నాతాం దేవతాం స్వమనీషయా పాపీయస్యా కలౌ కల్పయిష్యన్తి

భరతుని కుమారుడు సుమంతుడు. ఆయన తన తాతగారైన ఋషభుని మార్గాన్ని అవలంబించాడు. ఆయన మార్గం సరిగా అర్థం కాక చాలా మంది పాఖండులు (పాప చిహ్నములు కలవారు) వేదములో చెప్పబడని కొత్త దేవత పేరు చెప్పేసారు. దానినే బుద్ధుడన్నారు. బుద్ధుడే సుమతిగా అవతరించాడన్నారు. సుమంతుని యోగ మార్గం వీరికి అర్థం కాక ఈయనను బుద్ధుడనుకున్నారు. బౌద్ధము వేద బాహ్యం. 

తస్మాద్వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రోऽభవత్

ఇతనికి వృద్ధసేనతో దేవతాజిత్ అని కుమారుడు కలిగాడు.

అథాసుర్యాం తత్తనయో దేవద్యుమ్నస్తతో ధేనుమత్యాం సుతః
పరమేష్ఠీ తస్య సువర్చలాయాం ప్రతీహ ఉపజాతః

య ఆత్మవిద్యామాఖ్యాయ స్వయం సంశుద్ధో మహాపురుషమనుసస్మార

ప్రతీహాత్సువర్చలాయాం ప్రతిహర్త్రాదయస్త్రయ ఆసన్నిజ్యాకోవిదాః సూనవః ప్రతిహర్తుః
స్తుత్యామజ భూమానావజనిషాతామ్

అతనికి దేవద్య్మ్నుడు, అలా ఐదో తరం తరువాత ప్రతీహుడనే వాడు యోగమార్గముతో పరమాత్మని ధ్యానిస్తూ ఆయనలో చేరాడు.ఇతనికి సువర్చల యందు ముగ్గురు కుమారులుకలిగారు. వీరందరూ యజ్ఞ్యములో నిపుణులు.

భూమ్న ఋషికుల్యాయాముద్గీథస్తతః ప్రస్తావో దేవకుల్యాయాం ప్రస్తావాన్నియుత్సాయాం
హృదయజ ఆసీద్విభుర్విభో రత్యాం చ పృథుషేణస్తస్మాన్నక్త ఆకూత్యాం జజ్ఞే నక్తాద్ద్రుతిపుత్రో గయో రాజర్షిప్రవర
ఉదారశ్రవా అజాయత సాక్షాద్భగవతో విష్ణోర్జగద్రిరక్షిషయా గృహీతసత్త్వస్య కలాత్మవత్త్వాదిలక్షణేన
మహాపురుషతాం ప్రాప్తః

స వై స్వధర్మేణ ప్రజాపాలనపోషణప్రీణనోపలాలనానుశాసనలక్షణేనేజ్యాదినా చ భగవతి
మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మనార్పితపరమార్థలక్షణేన బ్రహ్మవిచ్చరణానుసేవయాపాదిత
భగవద్భక్తియోగేన చాభీక్ష్ణశః పరిభావితాతిశుద్ధమతిరుపరతానాత్మ్య ఆత్మని
స్వయముపలభ్యమానబ్రహ్మాత్మానుభవోऽపి నిరభిమాన ఏవావనిమజూగుపత్

నక్తునికి దృతి వలన గయుడు కలిగాడు. ఇతను రాజర్షులలో శ్రేష్టుడు, మంచి కీర్తి కలవాడు. సకల జగత్తునూ రక్షించాలన్న సంకల్పముతో పరమాత్మ తన అంశను ఇతనిలో నిక్షిప్తం చేసాడు. ఇతనికి ఆత్మ తత్వజ్ఞ్యానం బాగా కలిగింది. ఇతను మహా పురుషుడు. రాజుగా ప్రజాపాలన, యజ్ఞ్యయాగాలు చేసాడు, క్షత్రియునిగా యుద్ధమూ చేసాడు, పుత్రునిగా పితృ కర్మలూ చేసాడు. ప్రజలకు ప్రీతి కలిగించాడు, పాలించాడు పోషించాడు, అనుశాసించాడు, లాలించాడు.
యజ్ఞ్యాదులు (పంచ యజ్ఞ్యాలతో) చేస్తూ పరమాత్మను ఆరాధించాడు. బ్రాహ్మణుల పాద సేవ వలన కలిగిన పరమాత్మ భక్తితో మాటి మాటికీ దేహమే ఆత్మ అన్న భ్రమను తొలగించుకుని పరబ్రహ్మానుభవం బ్రహ్మానుభవం ఆత్మానుభవముతో 

తస్యేమాం గాథాం పాణ్డవేయ పురావిద ఉపగాయన్తి

ఆ గయుని యొక్క ప్రభావం చెప్పే ఈ గాధను ప్రాచీనులు ఇలా పాడుతున్నారు

గయం నృపః కః ప్రతియాతి కర్మభిర్యజ్వాభిమానీ బహువిద్ధర్మగోప్తా
సమాగతశ్రీః సదసస్పతిః సతాం సత్సేవకోऽన్యో భగవత్కలామృతే

గయున్ని ఎవరు అనుసరించగలరు. యజ్ఞ్యములంటే ప్రీతి కలవాడు, చాలా విషయాలు తెలిసినవాడూ, తెలిసిన దాన్ని ఆచరించేవాడు. పరమాత్మానుగ్రహాన్ని బాగా పొందినవాడు. సకల పతి ఆయనే. సజ్జనులని సేవిస్తాడు. ఇన్ని లక్షణాలు కలవారు పరమాత్మ తప్ప ఎవరై ఉంటాడు

యమభ్యషిఞ్చన్పరయా ముదా సతీః సత్యాశిషో దక్షకన్యాః సరిద్భిః
యస్య ప్రజానాం దుదుహే ధరాశిషో నిరాశిషో గుణవత్సస్నుతోధాః

దక్షుని కుమార్తెలైన పదహారు మంది ఇతనికి పరమానందముతో పట్టభిషేకం చేసారు. ఈ పదహారు మందీ గయున్ని సేవించారు. గయుడు ఎలాంటి కోరికా లేని విరక్తుడు. ఏమీ ఆశించని గయుని యొక్క ప్రజలకు అడగకుండానే భూదేవి అన్నీ ఇచ్చింది. భూదేవిని గోవుతో పోలుస్తారు. ఏ గోవైనా దూడ తన పొదుగు దగ్గర నోరు పెడితేనే పాలిస్తుంది. అలాగే భూమి కూడా గయుని యొక్క గుణాలనే దూడలచే పొదుగులతో ప్రజలు కోరినవన్నీ ప్రసాదించినది

ఛన్దాంస్యకామస్య చ యస్య కామాన్దుదూహురాజహ్రురథో బలిం నృపాః
ప్రత్యఞ్చితా యుధి ధర్మేణ విప్రా యదాశిషాం షష్ఠమంశం పరేత్య

వేదములు కూడా అతను ఏమీ కోరలేదు కాబట్టి, అతని ప్రజలకు కావలసినవన్నీ అతని కోరికలుగా భావించి ప్రసాదించాయి. ప్రజలడిగినప్పుడల్లా వర్షించాయి. వేద మాత ఆశీర్వాదం వలన అన్నీ ప్రసాదించాయి. ఈయన యుద్ధములో శత్రువులను ఆరాధించగానే యుద్ధములో శత్రురాజులు ఆయంకు కానుకలు ఇచ్చారు. ధర్మముతో విప్రులు ఆరాధించబడి ఆశీస్సులు ఇచ్చారు. వారి తపస్సునుంచి ఆరవ భాగం రాజుకు ఇచ్చారు.

యస్యాధ్వరే భగవానధ్వరాత్మా మఘోని మాద్యత్యురుసోమపీథే
శ్రద్ధావిశుద్ధాచలభక్తియోగ సమర్పితేజ్యాఫలమాజహార

గయుడు యజ్ఞ్యం చేసి సోమ యాగములు చేసాడు. ఇతను చేసిన సోమ యాగముతో సోమ రసాన్ని ఆహుతి రూపములో పానం చేసిన ఇంద్రుడు మత్తులో మునిగిపోయాడు. నారాయణుడు స్వయముగా వచ్చి తన భాగాన్ని తీసుకున్నాడు. సాధారణముగా విష్ణువుకిచ్చిన హవిస్సును ఇంద్రాదులు తీసుకుని వెళ్ళి అర్పిస్తారు. ఇంద్రుడే మత్తులో ఉండుట వలనా, గయుడు ధర్మ పద్దతిలో పరమాత్మార్పణముగా అన్ని పనులూ చేస్తున్నాడు కాబట్టి విష్ణువే స్వయముగా వచ్చి భాగాన్ని తీసుకున్నాడు. 

యత్ప్రీణనాద్బర్హిషి దేవతిర్యఙ్ మనుష్యవీరుత్తృణమావిరిఞ్చాత్
ప్రీయేత సద్యః స హ విశ్వజీవః ప్రీతః స్వయం ప్రీతిమగాద్గయస్య

పరమాత్మ ప్రీతి చెందితే వరకూ సకల చరాచర జగత్తూ ప్రీతి చెందుతుంది.అలాంటి పరమాత్మ గయుడు చేసిన యజ్ఞ్యముతో ప్రీతి పొద్నాడు.
గయుడు సాక్షాత్ పరమాత్మనే సంతోషపెట్టినవాడయ్యాడు

గయాద్గయన్త్యాం చిత్రరథః సుగతిరవరోధన ఇతి త్రయః పుత్రా బభూవుశ్చిత్రరథాదూర్ణాయాం
సమ్రాడజనిష్ట తత ఉత్కలాయాం మరీచిర్మరీచేర్బిన్దుమత్యాం బిన్దుమానుదపద్యత తస్మాత్సరఘాయాం
మధుర్నామాభవన్మధోః సుమనసి వీరవ్రతస్తతో భోజాయాం మన్థుప్రమన్థూ జజ్ఞాతే మన్థోః
సత్యాయాం భౌవనస్తతో దూషణాయాం త్వష్టాజనిష్ట త్వష్టుర్విరోచనాయాం విరజో విరజస్య శతజిత్ప్రవరం పుత్ర
శతం కన్యా చ విషూచ్యాం కిల జాతమ్

ఈయనకి ముగ్గురు కొడుకులు పుట్టారు. ఇలా వరుసలో విరజునితో భరత వంశము సమాప్తము. ఈయనకి నూరుగురు కొడుకులూ ఒక అమ్మాయి.

తత్రాయం శ్లోకః
ప్రైయవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవః
అకరోదత్యలం కీర్త్యా విష్ణుః సురగణం యథా

దేవతలందరికీ ప్రీతి కలిగించే ప్రియవ్రతుని వంశములో చివరి వాడు విరజుడు. పరమాత్మ కీర్తిని భూమండలములో వ్యాపింపచేసిన వాడు విరజుడు 

Sunday, March 24, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

స హోవాచ
స ఏష దేహాత్మమానినాం సత్త్వాదిగుణవిశేషవికల్పితకుశలాకుశలసమవహారవినిర్మితవివిధ
దేహావలిభిర్వియోగసంయోగాద్యనాదిసంసారానుభవస్య ద్వారభూతేన షడిన్ద్రియవర్గేణ
తస్మిన్దుర్గాధ్వవదసుగమేऽధ్వన్యాపతిత ఈశ్వరస్య భగవతో విష్ణోర్వశవర్తిన్యా మాయయా జీవలోకో
ऽయం యథా వణిక్సార్థోऽర్థపరః స్వదేహనిష్పాదితకర్మానుభవః శ్మశానవదశివతమాయాం
సంసారాటవ్యాం గతో నాద్యాపి విఫలబహుప్రతియోగేహస్తత్తాపోపశమనీం హరిగురుచరణారవిన్ద
మధుకరానుపదవీమవరున్ధే

మీరు చెప్పిన విషయాలు బాగా తెలిసిన వారికి అర్థమవుతుంది గానీ మాలాంటి వారికి అర్థం కాదు. మీరు చెప్పిన తత్వం అజ్యానులకు తెలియదు. ఇంతకష్టపడీ గానీ తెలుసుకోవడానికి అవకాశం లేని దాని కంటే మాలాంటి వారు సులభముగా తెలుస్కునే వాటిని గురించి చెప్పండి.
సంసారమనే అడవిలోకి వెళ్ళడానికి మొదటి కారణం దేహాత్మ భ్రాంతి. దేహాత్మాభిమానం. సత్వ రజస్ తమో గుణాలు ఆవరించడం వలన ఆచరించిన వలన కలిగిన పుణ్య పాపముల వలన మనిషిగానో పశువుగానో కీటకముగానో పుడతాము. ఈ మూడు గుణాల చేత కల్పించబడిన పుణ్యమూ పాపమూ మనం ఏ జన్మ ఎత్తాలో నిర్ణయిస్తారు. సంసారమనే అరణ్యానికి ఆరు ఇంద్రియాలు ద్వారాలు. ఈ ఆరు ఇంద్రియాలు కోట దారిలాగ ఉంటాయి. పరమాత్మ యొక్క వశములో ఉన్న మాయతో వ్యాపారి అతను తెచ్చుకున్న వస్తువును వేరే వాళ్ళకి అమ్మి డబ్బు తీసుకోవడానికి మాయోపాయాలు పన్నినట్లుగా జీవుడు కూడా మాయోపాయాలతో ఇంక ఎన్నో పాపాలు చేస్తాయి. పరమాత్మ వశములో ఉండే మాయచేత వ్యాపారనికి వెళ్ళేవాడు ఎలా ఐతే గుర్రాలకు డబ్బు తగిలించుకుని వ్యాపారనికి వెళ్ళి, వ్యాపారం చేసి ఎంత సంపాదించినా వాడి శరీరానికి ఎంత అనుభవం అవసరమో అంతే వస్తుంది. శరీరముతో చేయబడిన కర్మతో పాపం చేసి ఆ వచ్చిన కర్మతో మళ్ళీ పనులు చేస్తాడు. శ్మశానమైన సంసారమనే అమంగళ కరమైన అడవిలో ప్రవేశించి.

యస్యాము హ వా ఏతే షడిన్ద్రియనామానః కర్మణా దస్యవ ఏవ తే తద్యథా పురుషస్య ధనం
యత్కిఞ్చిద్ధర్మౌపయికం బహుకృచ్ఛ్రాధిగతం సాక్షాత్పరమపురుషారాధనలక్షణో యోऽసౌ ధర్మస్తం
తు సామ్పరాయ ఉదాహరన్తి తద్ధర్మ్యం ధనం దర్శనస్పర్శనశ్రవణాస్వాదనావఘ్రాణసఙ్కల్ప
వ్యవసాయగృహగ్రామ్యోపభోగేన కునాథస్యాజితాత్మనో యథా సార్థస్య విలుమ్పన్తి

ఇప్పటికీ పళ్ళు లేని చేట్ల కింద ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ పళ్ళు ఉన్న చెట్ల కింద ఉండడానికి ప్రయత్నించరు. అందరి కాళ్ళూ పట్టుకుంటాము గానీ గురువుగారి పాదాలు పట్టుకోము. బరువు మోయడమే మనకలవాటయ్యింది. గురు హరి చరణాలను ఆశ్రయించకుండా అడ్డుపడేవి ఆరు దొంగలు. ఇలాంటి దానికి విరుగుడు ఒకటే - మానవుడు ధర్మముతో పరమ పురుష ఆరాధనతో సంపాదించి పెట్టిన ధనము వలన అడవిలోకే వెళ్ళము. కష్టపడి సంపాదించాల్సినది ధర్మం. పరమపురుష ఆరాధనే ధర్మం. ఈ ధనం దొంగల చేతికి చిక్కదు. ఇది మనకు పరలోకములో పనికొచ్చేది, పరలోకములో పనికొచ్చే ధనం భగవదారాధన. ఈ ధనము (ధర్మము) ఎలా వస్తుంది? ఎలా పోతుంది? భగవంతుని భక్తుల యొక్క దర్శన స్పర్శన ధ్యాన వందన అర్చన స్మరణ వంటి వాటి వలన వస్తుంది. మహాపాపులైన వారు కూడా ప్రత్యేకముగా ఎటువంటి పుణ్యము చేయకున్నా పుణ్యము చేసిన వారిని స్పృశించినా వారి పేరు విన్నా దర్శించినా మాట్లాడినా చాలు, అన్ని పుణ్యాలూ వస్తాయి పాపాలు పోతాయి. సంసారములో ఉండే వాడు పాపులను చూచినా తాకినా మాటలు విన్నా వారితో భోజనం చేసినా చాలు పాపం రావడానికి.
మహాభాగవతోత్తములతో కలిసి ఉంటే ఎలా పుణ్యం కలుగుతుందో మహా పాపాత్ములతో కలిసి ఉంటే సంసారమే వస్తుంది. చేదు మనస్సు కలవారూ మనస్సును గెలవలేని వారూ అన్ని ధనములనూ పోగొట్టుకుంటారు. దొంగలకు అవకాశం కల్పించవద్దు. భక్తుల వద్ద ఉండే అవకాశం కల్పించండి.

అథ చ యత్ర కౌటుమ్బికా దారాపత్యాదయో నామ్నా కర్మణా వృకసృగాలా ఏవానిచ్ఛతోऽపి
కదర్యస్య
కుటుమ్బిన ఉరణకవత్సంరక్ష్యమాణం మిషతోऽపి హరన్తి

మనకున్న శరీరము దేహమే నేను అన్న భావన ఉన్నడానికి కారణం. రజో గుణం ఎక్కువ కాగానే నేనే ఈ పని చేసా అన్న అహంకారం. తమో గుణం ఎక్కువ కాగానే పక్కవాడిని నాశనం చేయాలని లాక్కోవాలని అనిపిస్తుంది. దీని వలన వచ్చే జన్మలో మంచి జన్మా చెడు జన్మా వస్తుంది. దీని వలన కొందరితో సమ్యోగం కొందరితో వియోగం వస్తుంది. పొంగూ కుంగూ వస్తుంది. ఆరు ఇంద్రియాలు (జ్ఞ్యానేంద్రియాలూ మనస్సు)తో దుర్గమమైన సంసారమనే అడవిలో ప్రవేశిస్తున్నాము. ఈశ్వరుడి అధీనములో మాయ ఉంటుంది. దానిచే ఆవరించబడిన వారు ఒక ప్రయోజనాన్ని ఆశించి ఆ ఊరినుంచి ఈ ఊరికీ తిరుగుతున్న వర్తకుల వంటి వారమందరమూ. సంపాదించడం ఖర్చుపెట్టడమే మనం చేసేది. ఒక ప్రయోజనం సాధిస్తామని తాపత్రయపడుతూ ఉంటాము. దానికోసం కర్మ చేస్తుంటాము. కర్మ చేసి ఏమి సాధిస్తాము? శ్మశానములో పని చేయడమంటే ఎంత అసహ్యించుకోవాలో ఈ శరీరం కోసం పని చేయడమంటే శ్మశానం వంటిదే ఈ శరీరమని, దీనిలో తిరుగుతూ సంసారములో పడతాము. యవ్వమొచ్చి భార్యతో కలిసి తుచ్చమైన శరీర సుఖాన్ని సుఖం అనుకొని నమ్మి దానితో మోసపోయినాము. వార్ధక్యం వచ్చి పడుకొని లేవలేక వారిని వీరినీ అందరినీ బాధపెట్టాము. చివరికి శరీరం విడిచిపోతాము. తరువాత ఈ శరీరముతో చేసిన కొన్ని పనులని అనుభవించడానికి స్వర్గానికో నరకానికో పోతామూ, మళ్ళీ కడుపులో పడతాము. ఇదీ మన బ్రతుకు. పుట్టినవాడు పెరగకా తప్పదూ, భార్యా పిల్లలూ తప్పదూ, ముసలితనమూ చావూ తప్పదు. నరకమూ స్వర్గమూ తప్పదు, మళ్ళీ పుట్టుకా తప్పదు. వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ ఆ తాపాన్ని తగ్గించే దానిని తెలుసుకుంటాడు చివరకు. లోకములో మనం సంపాదించినదేదీ మన బాధలను తగ్గించదు. శ్రీ హరే గురువు రూపములో వచ్చాడు. వారి పాదారవిందాలను సేవిస్తే వారు మనకు అది జ్ఞ్యాపకం రాకుండా చేసి, ఇంద్రియాలనే దొంగలు ధర్మకార్యం చేయాలని సంపాదించే దొంగలు దోచుకుపోతారు. మనం కూడా ధర్మకార్యాలను చేస్తాము, దానితో సంపాదించిన దాన్ని ఇంద్రియాలు మన దుర్వినియోగం చేసేట్లు చేస్తాయి. ధర్మానికని ఉపయోగ పడవలసిన అర్థాన్ని ఇంద్రియాలు అధర్మానికి ఉపయోగపడేలా చేస్తాయి


యథా హ్యనువత్సరం కృష్యమాణమప్యదగ్ధబీజం క్షేత్రం పునరేవావపనకాలే గుల్మతృణ
వీరుద్భిర్గహ్వరమివ భవత్యేవమేవ గృహాశ్రమః కర్మక్షేత్రం యస్మిన్న హి కర్మాణ్యుత్సీదన్తి
యదయం కామకరణ్డ ఏష ఆవసథః

తత్ర గతో దంశమశకసమాపసదైర్మనుజైః శలభశకున్తతస్కర
మూషకాదిభిరుపరుధ్యమానబహిఃప్రాణః క్వచిత్పరివర్తమానోऽస్మిన్నధ్వన్యవిద్యాకామ
కర్మభిరుపరక్తమనసానుపపన్నార్థం నరలోకం గన్ధర్వనగరముపపన్నమితి మిథ్యా
దృష్టిరనుపశ్యతి



తత్ర చ క్వచిదాతపోదకనిభాన్విషయానుపధావతి పానభోజనవ్యవాయాదివ్యసనలోలుపః


తరువాత వివాహమవుతుంది. ఇంటికొస్తాము. అక్కడ పెళ్ళాము పిల్లలూ కొట్టుకుంటారు. వీరే అడవిలో ఉన్న తోడేళ్ళూ నక్కలూ. బలాత్కారముగా వచ్చి పీక్కు తింటారు.  ఈ బాధలనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఒక్క సారి చెట్లూ తుప్పలూ మొక్కలూ నిండిన అడవిలాంటిది గృహస్థాశ్రమం. ఈ ఫలితానికి ఈ వ్రతం, లేదా ఈ నోము నోచమని చెప్తూ ఉంటారు. ఇవి భగవంతుని పొందే వ్రతాలు కావు. ఆ కోరికతో ఈ కోరికతో కర్మలు చేసి అడవిలో దారిని ఇంకా కష్టం చేసుకుంటున్నాము. ఇలా ఉండి ఆ అడవిలో మనం క్షుద్రమైన తిండీ తాగుడూ భార్యతో రమించడం సుఖమనుకుని చేస్తాము. ఇది సుఖమా దుఃఖమా? బాగా తింటే రెండు రోజులలో సుస్తీ చేస్తుంది. శక్తి ఉంది కదా అని పది మంది స్త్రీలతో రమిస్తాడు. అది తరువాత వ్యాధుల రూపములో దుఃఖాన్ని కలిగిస్తుంది. మనం చేసే పనులన్నీ తాత్కాలికముగా సుఖం కలిగించినట్లు ఉంటాయి గానీ అవి సుఖాన్ని కలిగించవు. మనం అడవిలో వెళుతూ ఉంటే నీరు తాగుదామని వెళితే అది వెళ్ళేసరికి ఎలా నిజమైన నీరు కాదని తెలుస్తుందో, మనం సుఖం అనుకొని అనుభవించే సుఖాలన్నీ అలాంటివే.
సంసారమే అడవిలో ఇటూ అటూ తిరుగుతూ ఉంటే సుడిగాలి వంటిది ఆడది. అందమైన ఆడదాన్ని చూసే సరికి మరి కన్ను కనపడక పిచ్చి ఎక్కుతుంది. సుడిగాలి వస్తే ఎలా అది కళ్ళల్లో పడి కళ్ళు కనిపించవో ఆడదాని అందం మగవాడికి అలా చేస్తుంది. దానితో ధూళి కమ్ముంకొని పోయి చీకటైపోయి మర్యాదలు మరచి తన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాడు. ఎండమావులలోకి దిగుతాడు. ఇంకో చోట గుడ్ల గూబలూ కీచురాళ్ళూ ఉంటాయి, అవి మనమీద పడనటువంటి వారు  మన మీద శత్రుత్వం కలవారు మనని తిడుతూ ఉంటారు. వాటి వలన లోపల బాధ కలుగుతూ కూడా సర్దుకుంటాడు.
ఈ విధముగా జీవితములో మనమనుభవించే వాటిని అడవి రూపములో చెప్పారు.
అక్కడ ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు.

క్వచిచ్చాశేషదోషనిషదనం పురీషవిశేషం తద్వర్ణగుణనిర్మితమతిః
సువర్ణముపాదిత్సత్యగ్నికామకాతర ఇవోల్ముకపిశాచమ్

అథ కదాచిన్నివాసపానీయద్రవిణాద్యనేకాత్మోపజీవనాభినివేశ ఏతస్యాం సంసారాటవ్యామితస్తతః
పరిధావతి

క్వచిచ్చ వాత్యౌపమ్యయా ప్రమదయారోహమారోపితస్తత్కాలరజసా రజనీభూత
ఇవాసాధుమర్యాదో
రజస్వలాక్షోऽపి దిగ్దేవతా అతిరజస్వలమతిర్న విజానాతి

క్వచిత్సకృదవగతవిషయవైతథ్యః స్వయం పరాభిధ్యానేన విభ్రంశితస్మృతిస్తయైవ మరీచి
తోయప్రాయాంస్తానేవాభిధావతి

క్వచిదులూకఝిల్లీస్వనవదతిపరుషరభసాటోపం ప్రత్యక్షం పరోక్షం వా రిపురాజకుల
నిర్భర్త్సితేనాతివ్యథితకర్ణమూలహృదయః

స యదా దుగ్ధపూర్వసుకృతస్తదా కారస్కరకాకతుణ్డాద్యపుణ్యద్రుమలతావిషోద
పానవదుభయార్థశూన్యద్రవిణాన్జీవన్మృతాన్స్వయం జీవన్మ్రియమాణ ఉపధావతి

ఏకదాసత్ప్రసఙ్గాన్నికృతమతిర్వ్యుదకస్రోతఃస్ఖలనవదుభయతోऽపి దుఃఖదం
పాఖణ్డమభియాతి

యదా తు పరబాధయాన్ధ ఆత్మనే నోపనమతి తదా హి పితృపుత్రబర్హిష్మతః పితృపుత్రాన్వా స ఖలు
భక్షయతి

క్వచిదాసాద్య గృహం దావవత్ప్రియార్థవిధురమసుఖోదర్కం శోకాగ్నినా దహ్యమానో భృశం
నిర్వేదముపగచ్ఛతి

క్వచిత్కాలవిషమితరాజకులరక్షసాపహృతప్రియతమధనాసుః ప్రమృతక ఇవ విగతజీవలక్షణ
ఆస్తే

కదాచిన్మనోరథోపగతపితృపితామహాద్యసత్సదితి స్వప్ననిర్వృతిలక్షణమనుభవతి

క్వచిద్గృహాశ్రమకర్మచోదనాతిభరగిరిమారురుక్షమాణో లోకవ్యసనకర్షితమనాః కణ్టక
శర్కరాక్షేత్రం ప్రవిశన్నివ సీదతి

క్వచిచ్చ దుఃసహేన కాయాభ్యన్తరవహ్నినా గృహీతసారః స్వకుటుమ్బాయ క్రుధ్యతి

స ఏవ పునర్నిద్రాజగరగృహీతోऽన్ధే తమసి మగ్నః శూన్యారణ్య ఇవ శేతే నాన్యత్కిఞ్చన వేద శవ
ఇవాపవిద్ధః

కదాచిద్భగ్నమానదంష్ట్రో దుర్జనదన్దశూకైరలబ్ధనిద్రాక్షణో వ్యథిత
హృదయేనానుక్షీయమాణవిజ్ఞానోऽన్ధకూపేऽన్ధవత్పతతి

కర్హి స్మ చిత్కామమధులవాన్విచిన్వన్యదా పరదారపరద్రవ్యాణ్యవరున్ధానో రాజ్ఞా
స్వామిభిర్వా నిహతః పతత్యపారే నిరయే

అథ చ తస్మాదుభయథాపి హి కర్మాస్మిన్నాత్మనః సంసారావపనముదాహరన్తి

ముక్తస్తతో యది బన్ధాద్దేవదత్త ఉపాచ్ఛినత్తి తస్మాదపి విష్ణుమిత్ర ఇత్యనవస్థితిః

క్వచిచ్చ శీతవాతాద్యనేకాధిదైవికభౌతికాత్మీయానాం దశానాం ప్రతినివారణేऽకల్పో దురన్త
చిన్తయా విషణ్ణ ఆస్తే

క్వచిన్మిథో వ్యవహరన్యత్కిఞ్చిద్ధనమన్యేభ్యో వా కాకిణికా
మాత్రమప్యపహరన్యత్కిఞ్చిద్వా విద్వేషమేతి విత్తశాఠ్యాత్

అధ్వన్యముష్మిన్నిమ ఉపసర్గాస్తథా సుఖదుఃఖరాగద్వేషభయాభిమానప్రమాదోన్మాద
శోకమోహలోభమాత్సర్యేర్ష్యావమానక్షుత్పిపాసాధివ్యాధిజన్మజరామరణాదయః

క్వాపి దేవమాయయా స్త్రియా భుజలతోపగూఢః ప్రస్కన్నవివేకవిజ్ఞానో
యద్విహారగృహారమ్భాకుల
హృదయస్తదాశ్రయావసక్తసుతదుహితృకలత్రభాషితావలోకవిచేష్టితాపహృతహృదయ ఆత్మానమజితాత్మాపారే
ऽన్ధే తమసి ప్రహిణోతి

కదాచిదీశ్వరస్య భగవతో విష్ణోశ్చక్రాత్పరమాణ్వాదిద్విపరార్ధాపవర్గ
కాలోపలక్షణాత్పరివర్తితేన వయసా రంహసా హరత ఆబ్రహ్మతృణస్తమ్బాదీనాం భూతానామనిమిషతో మిషతాం
విత్రస్తహృదయస్తమేవేశ్వరం కాలచక్రనిజాయుధం సాక్షాద్భగవన్తం యజ్ఞపురుషమనాదృత్య
పాఖణ్డదేవతాః కఙ్కగృధ్రబకవటప్రాయా ఆర్యసమయపరిహృతాః సాఙ్కేత్యేనాభిధత్తే

యదా పాఖణ్డిభిరాత్మవఞ్చితైస్తైరురు వఞ్చితో బ్రహ్మకులం సమావసంస్తేషాం
శీలముపనయనాదిశ్రౌతస్మార్తకర్మానుష్ఠానేన భగవతో యజ్ఞపురుషస్యారాధనమేవ
తదరోచయన్శూద్రకులం భజతే నిగమాచారేऽశుద్ధితో యస్య మిథునీభావః కుటుమ్బభరణం యథా
వానరజాతేః

తత్రాపి నిరవరోధః స్వైరేణ విహరన్నతికృపణబుద్ధిరన్యోన్యముఖనిరీక్షణాదినా గ్రామ్య
కర్మణైవ విస్మృతకాలావధిః

క్వచిద్ద్రుమవదైహికార్థేషు గృహేషు రంస్యన్యథా వానరః సుతదారవత్సలో వ్యవాయక్షణః

ఏవమధ్వన్యవరున్ధానో మృత్యుగజభయాత్తమసి గిరికన్దరప్రాయే

క్వచిచ్ఛీతవాతాద్యనేకదైవికభౌతికాత్మీయానాం దుఃఖానాం ప్రతినివారణేऽకల్పో దురన్తవిషయ
విషణ్ణ ఆస్తే

క్వచిన్మిథో వ్యవహరన్యత్కిఞ్చిద్ధనముపయాతి విత్తశాఠ్యేన

క్వచిత్క్షీణధనః శయ్యాసనాశనాద్యుపభోగవిహీనో యావదప్రతిలబ్ధమనోరథోపగతాదానే
ऽవసితమతిస్తతస్తతోऽవమానాదీని జనాదభిలభతే

ఏవం విత్తవ్యతిషఙ్గవివృద్ధవైరానుబన్ధోऽపి పూర్వవాసనయా మిథ ఉద్వహత్యథాపవహతి

ఏతస్మిన్సంసారాధ్వని నానాక్లేశోపసర్గబాధిత ఆపన్నవిపన్నో యత్ర యస్తము హ
వావేతరస్తత్ర విసృజ్య జాతం జాతముపాదాయ శోచన్ముహ్యన్బిభ్యద్
వివదన్క్రన్దన్సంహృష్యన్గాయన్నహ్యమానః సాధువర్జితో నైవావర్తతేऽద్యాపి యత ఆరబ్ధ ఏష నరలోక
సార్థో యమధ్వనః పారముపదిశన్తి

యదిదం యోగానుశాసనం న వా ఏతదవరున్ధతే యన్న్యస్తదణ్డా మునయ ఉపశమశీలా
ఉపరతాత్మానః సమవగచ్ఛన్తి

యదపి దిగిభజయినో యజ్వినో యే వై రాజర్షయః కిం తు పరం మృధే శయీరన్నస్యామేవ
మమేయమితి కృతవైరానుబన్ధాయాం విసృజ్య స్వయముపసంహృతాః

కర్మవల్లీమవలమ్బ్య తత ఆపదః కథఞ్చిన్నరకాద్విముక్తః పునరప్యేవం సంసారాధ్వని
వర్తమానో నరలోకసార్థముపయాతి ఏవముపరి గతోऽపి

ఒకళ్ళింటికి వెళ్ళాము, మనకు తెలియకుండా ఎందుకూ పనికిరాని ఒక వస్తువును తీసుకున్నాము, దానితో వీడికీ వాడికీ పెద్ద గొడవ. ఇంకో చోట క్షీణ ధనం, తినడానికి తిండిలేదు, పడకా లేదు. అయినా కోరికలు చావవు. మళ్ళీ డబ్బు సంపాదించి ఒక ఇంట్లో ఉండి హాయిగా ఉండాలని కోరికలతో ఎలా డబ్బు సంపాదించాలి, ఎవరిని ఎలా మోసం చేయాలో పధకాలు రచించి దాని వలన అవమానములు పొందుతాడు. మిగతా వారి మీద ద్వేషం పెంచుకుంటాడు. దీనిలోపల తిరుగుతూ, అనేకమైన క్లేషములని అనుభవిస్తూ, ఆపదలు పొందుతూ ఏదో పెద్ద ఆనందముగా ఉన్నట్లు ఒక చోట పాటలు పాడతాడు, ఒక చోట ఏడుస్తాడు, ఒక చోట శోకము ఒక చోట భయము ఒక చోట తగవూ పొందుతూ చివరగా భగవత్ తత్వం తెలిసిన పెద్దల ఉపదేశం లభిస్తుంది. దాని వలన భగవత్ తత్వం తెలుసుకోగలుగుతాడు. 

తస్యేదముపగాయన్తి
ఆర్షభస్యేహ రాజర్షేర్మనసాపి మహాత్మనః
నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మతః

భరతుని గొప్ప దనాన్ని చెబుతూ
భరతుని కథ వింటాము గానీ భరతునిలా ఎవరుంటారు. ఆకాశములో గరుత్మంతుడు ఎగురుతున్నాడు కదా అని నాకు రెండు రెక్కలు ఉన్నాయని ఒక ఈగ ఎగరడానికి ప్రయత్నిస్తే ఎలా నవ్వుతామో అలాగే మనమూ మనుషులమే భరతుడూ మనిషే అని మనం ఆయనలా ఉండగలమా


యో దుస్త్యజాన్దారసుతాన్సుహృద్రాజ్యం హృదిస్పృశః
జహౌ యువైవ మలవదుత్తమశ్లోకలాలసః

యవ్వనములో ఉన్నాడు భరతుడు. యవ్వనములో ఉండి మనసుని లాగేసే భార్యా అన్నదమ్ములూ తండ్రీ అందరినీ వదిలివేసి భగవంతుని యందే మనసు లగ్నం చేసాడు. ఇల్లూ వాకిలీ వదిలిపెట్టి మనసులో కూడా ఏమీ కోరకుండా భవంతుని సేవలో ఉన్నాడు. అలా యోగ శాస్త్రం తెలిసి ఆత్మ తత్వం తెలిసి భగవంతునికి సేవ చేయడం యందే లగ్నమయ్యి, భగవంతుడే తన ప్రీతి కొరకు సర్వ వ్యాపారాలు చేయించుకుంటున్నాడని తెలుసుకుని.

యో దుస్త్యజాన్క్షితిసుతస్వజనార్థదారాన్
ప్రార్థ్యాం శ్రియం సురవరైః సదయావలోకామ్
నైచ్ఛన్నృపస్తదుచితం మహతాం మధుద్విట్
సేవానురక్తమనసామభవోऽపి ఫల్గుః



యజ్ఞాయ ధర్మపతయే విధినైపుణాయ
యోగాయ సాఙ్ఖ్యశిరసే ప్రకృతీశ్వరాయ
నారాయణాయ హరయే నమ ఇత్యుదారం
హాస్యన్మృగత్వమపి యః సముదాజహార

య ఇదం భాగవతసభాజితావదాతగుణకర్మణో రాజర్షేర్భరతస్యానుచరితం స్వస్త్య్
అయనమాయుష్యం ధన్యం యశస్యం స్వర్గ్యాపవర్గ్యం వానుశృణోత్యాఖ్యాస్యత్యభినన్దతి చ సర్వా ఏవాశిష
ఆత్మన ఆశాస్తే న కాఞ్చన పరత ఇతి


 వెనక లేడి శరీరములో ఉన్నప్పుడే ఇదే స్థిత్లో ఉండి ఎప్పుడు మనసులో నారాయణాయ నమః అంటూ ఉండి ఆ లేడి శరీరన్ని విడిచాడు. ఈ భరతుని చరితం విన్న మనకు స్వస్తి, ఆయువూ కీర్తి ధనమూ స్వర్గమూ మోక్షమూ కలుగుతాయి. సమస్త కోరికలూ తగ్గిపోతాయి, మరొకదాన్ని ఇంకోరి నుండి పొందాలనే బాధ తగ్గిపోతుంది. అన్నీ ఇచ్చేవాడు వాడే అని అన్నీ తనకొరకు అనుభవించేవాడు వాడే.
ఈయన పేరుతోనే మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. మన దేశానికి మూలము 1. తాను కాని తనది కాని భౌతిక విషయముల యందు త్యాగం 2. భగవంతుని సేవ యందు సంగమూ. ఈ రెండూ కలవాడు భరతుడు. అందుకే ఆయన పేరుతో మన దేశానికి భారత వర్షమని పేరు వచ్చింది. ఇంత గొప్ప దేశములో పుట్టి మనం ఎలా ఉండాలో జ్ఞ్యాపకం చేయడం కోసమే మనము సంకల్పములో "భరత్ వర్షే " అని అంటాము. ఆయన కుటుంబములో పుట్టిన వారము మనం.

Saturday, March 23, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదమూడవ అధ్యాయం



శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదమూడవ అధ్యాయం

బ్రాహ్మణ ఉవాచ
దురత్యయేధ్వన్యజయా నివేశితో రజస్తమఃసత్త్వవిభక్తకర్మదృక్
స ఏష సార్థోర్థపరః పరిభ్రమన్భవాటవీం యాతి న శర్మ విన్దతి

పరమాత్మ యొక్క మాయ చేత నీవు దారిలో (సంసారములో) పడవేయబడతావు. గుణత్రయముల కర్మలను చేస్తాము.  మనము పని చేయడం ప్రారంభించగానే "ఈ పని ఎలాంటిది" రాజసికమా తామసికమా సాత్వికమా అని ఆలోచిస్తాముగానీ, "ఇది నిర్గుణమా" అని ఆలోచించము. నిర్గుణున్ని ఆరాధిస్తే పని నిర్గుణమవుతుంది. సగుణమైన ప్రకృతిని ఆరాధిస్తే పని కూడా త్రైగుణ్యమవుతుంది. సంసారములో పని చేస్తున్నమనగానే సాత్విక రాజసిక తామసిక కర్మలుగానే చూస్తాము.
వ్యాపారానికి వెళ్ళేవాడు మూటపెట్టుకుని అంగడిలోకి ఎలా వస్తాడో మనం కూడా పూర్వ జన్మ కర్మలనే మూటలను పట్టుకుని వస్తాము. అందుకే ఆ జీవుడు సార్థః. నెత్తిన బరువు ఉండి కూడా ఇంకా బరువు కావాలంటాడు.  ఉన్నదాన్ని పోగొడదామని చేసే పనుల వలన కొత్తవి పుడుతున్నాయి. ప్రయోజనాన్ని ఆశించి ఈ దారిలో తిరుగుతూ సంసారమనే అరణ్యానికి ప్రవేశిస్తాడు. ఒక ఊరికి వెళ్ళడానికి పోయి అడవిలో ప్రవేశిస్తాడు. ఆ అడవిలో సుఖమనే మాటే ఉండదు.

యస్యామిమే షణ్నరదేవ దస్యవః సార్థం విలుమ్పన్తి కునాయకం బలాత్
గోమాయవో యత్ర హరన్తి సార్థికం ప్రమత్తమావిశ్య యథోరణం వృకాః

అడవిలోకి వెళ్ళగానే ఒక్క సారిగా ఆరు దిక్కుల నుంచి  ఆరు దొంగలు ప్రవేశిస్తారు. వారు పట్టి లాగుతారు. వారు మీ దగ్గర ఉన్న డబ్బంతా దోచుకుంటారు. నీ బుద్ధిని గుంజుకుంటారు. ఇంద్రియములు బుద్ధిని తన వశం చేసుకుంటాయి. దాని వలన మనం చేసే పనులన్నీ బుద్ధి లేని పనులవుతాయి. నక్కలన్నీ (తోడేళ్ళు) కలిసి మేకలని లాగినట్లుగా మన శరీరాన్ని మనసునీ బుద్ధినీ అంతఃకరణాలనూ ఆరు ఇంద్రియాలూ మనసూ తీసుకుని పోతాయి.

ప్రభూతవీరుత్తృణగుల్మగహ్వరే కఠోరదంశైర్మశకైరుపద్రుతః
క్వచిత్తు గన్ధర్వపురం ప్రపశ్యతి క్వచిత్క్వచిచ్చాశురయోల్ముకగ్రహమ్

అది చూసి మనం వేగముగా పరిగెత్తబోతాము. అప్పుడు ఒక పొదలో పడతాము. పొదలో పడగానే కందిరీగలూ దోమలూ పురుగులూ తేల్ల్లు ఉంటాయి. అవి అన్నీ ఒక్క సారి పడి కరుస్తాయి. బ్రహ్మచారిగా ఉండి పెళ్ళి చేసుకోగానే అరిషడ్వర్గాలు ఉన్న పొదలో పడతాము, అందులో దుర్మార్గులూ దుష్టులూ ఎందరో ఉంటారు. ఇలా బాధపడుతూ కూడా "ఇలా ఎంతకాలం ఉంటుందిలే నేను తప్పించుకుని బయటపడతాను" అని గంధర్వ నగరాన్ని చూస్తూ ఉంటాడు. కొరివి దెయ్యాలు పట్టుకుంటాయి (ఉల్ముకగ్రహమ్) - భార్యకు భర్తా భర్తకు భార్యా కొరివి దెయ్యాల వంటి వారు

నివాసతోయద్రవిణాత్మబుద్ధిస్తతస్తతో ధావతి భో అటవ్యామ్
క్వచిచ్చ వాత్యోత్థితపాంసుధూమ్రా దిశో న జానాతి రజస్వలాక్షః

ఈ అడవిలో "ఎలాగా అడవిలోకి వచ్చాము కదా" అని ఇంటినీ డబ్బునీ ఏర్పరచుకుని ఉంటాడు. ఇలా పరిగెత్తుతూ ఉంటే పెద్ద సుడిగాలి (దుర్జనులూ శత్రువులూ ద్రోహులూ ఆపదలూ) వచ్చి కన్నులో కొడతాయి. అప్పుడు ఏమీ కనపడకుండా ఉంటుంది. కీచురాళ్ళ ధ్వని వలన చెవులు కూడా వినపడవు. ఇంకో పక్క నక్కలు కూస్తూ ఉంటాయి, కళ్ళు కనపడవు చెవులు వినపడవు.

అదృశ్యఝిల్లీస్వనకర్ణశూల ఉలూకవాగ్భిర్వ్యథితాన్తరాత్మా
అపుణ్యవృక్షాన్శ్రయతే క్షుధార్దితో మరీచితోయాన్యభిధావతి క్వచిత్

అలా వెళ్ళి వెళ్ళి పాప వృక్షాలను ఆశ్రయిస్తాడు. దప్పి కాగానే ఎండమావుల నీటికోసం చూస్తాడు.

క్వచిద్వితోయాః సరితోభియాతి పరస్పరం చాలషతే నిరన్ధః
ఆసాద్య దావం క్వచిదగ్నితప్తో నిర్విద్యతే క్వ చ యక్షైర్హృతాసుః

ప్రియురాళ్ళ ముద్దు మాటలలో పడతాడు. తరువాత చిన్న పిల్లల ముద్దుమాటలలో పడతాడు.

శూరైర్హృతస్వః క్వ చ నిర్విణ్ణచేతాః శోచన్విముహ్యన్నుపయాతి కశ్మలమ్
క్వచిచ్చ గన్ధర్వపురం ప్రవిష్టః ప్రమోదతే నిర్వృతవన్ముహూర్తమ్

చలన్క్వచిత్కణ్టకశర్కరాఙ్ఘ్రిర్నగారురుక్షుర్విమనా ఇవాస్తే
పదే పదేభ్యన్తరవహ్నినార్దితః కౌటుమ్బికః క్రుధ్యతి వై జనాయ

క్వచిన్నిగీర్ణోజగరాహినా జనో నావైతి కిఞ్చిద్విపినేపవిద్ధః
దష్టః స్మ శేతే క్వ చ దన్దశూకైరన్ధోన్ధకూపే పతితస్తమిస్రే


మనలోపల ఉన్న అసలు వస్తువులని ఇంద్రియాలు దోచుకున్నాయి. నేను ఆలోచిస్తున్నాను అనమని నేను చూస్తున్నాను అని అనమని చెబుతున్నాయి. మేకని తోడేళ్ళు ఎత్తుకుపోయినట్లు నీ స్వరూప జ్ఞ్యానన్ని లోనున్న ఇంద్రియాలు దోచుకుంటున్నాయి. ఇక్కడ పెద్ద లతలూ చెట్లూ గడ్డీ బలిసిపోయి ఉన్నాయి, పెద్ద దోమలూ ఈగలూ ఉన్నాయి. గంధర్వ పురమని ఒకటి కనిపిస్తోంది, గంధర్వపురమంటే ఇపుడు ఉండి మరొక క్షణములో ఉండని ఇంద్రజాలం వంటిది. ఇవాల మంచి సుఖమనుభవించాము. రాత్రి సుస్తీ చేసింది. అంటే ఒక కాలములో ఉన్నది ఇంకో కాలములో ఉండదు. కొరివి దయ్యాలలాంటివి. నిజము కావు. మన జీవితములో కళ్ళు కనపడకుండా ఇసక చల్లే గాలి వచ్చి కొడుతుంది, ఇందాకటిది కళ్ళ దోషమైతే, ఈ దోషం ముక్కుది. కళ్ళు కనపడకుండా చేస్తుంది. ఇంతలో పెద్ద గోలబయలు దేరుతుంది చెవికి. కీచురాళ్ళ ధ్వని. కంటికి కనపడవు కానీ ధ్వని వస్తుంది. తరువాత ఆకలేసింది, గానీ అక్కడ అన్నీ విషపు చెట్లు ఉన్నాయి. తప్పని సరి పరిస్థుతుల్లో అవే తినాల్సి వచ్చింది. ఒక చోట నీరు కనిపించింది. అవి నిజమైన నీరు కావు. నీళ్ళల్లా కనిపిస్తోంది వెన్నెల్లో. దానికోసం పరిగెడుతున్నాము. ఒక సారి కార్చిచ్చు వస్తుంది. ఇవన్నీ మనం అనుభవించేవి. ఇంద్రియములచే మనమనుభవించే సుఖమనుకుని అనుభవించే సుఖము కానివి. అడవిలో కనపడేవి ఎలాంటి సుఖాలో ఇవీ అలాంటి సుఖాలే. ఇంతలో దొంగలొచ్చి అంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఇంతలో ఎవరో వచ్చి మాయతో విచిత్రమైన పదార్థాలన్నీ ముందు పెట్టాడు. కానీ అది మాయ. పదే పదే ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కువగా వేస్తే పెళ్ళాం మీదా పిల్లల మీదా కోపం వస్తుంది.
కర్హి స్మ చిత్క్షుద్రరసాన్విచిన్వంస్తన్మక్షికాభిర్వ్యథితో విమానః
తత్రాతికృచ్ఛ్రాత్ప్రతిలబ్ధమానో బలాద్విలుమ్పన్త్యథ తం తతోన్యే

క్వచిచ్చ శీతాతపవాతవర్ష ప్రతిక్రియాం కర్తుమనీశ ఆస్తే
క్వచిన్మిథో విపణన్యచ్చ కిఞ్చిద్విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్

క్వచిత్క్వచిత్క్షీణధనస్తు తస్మిన్శయ్యాసనస్థానవిహారహీనః
యాచన్పరాదప్రతిలబ్ధకామః పారక్యదృష్టిర్లభతేవమానమ్

అన్యోన్యవిత్తవ్యతిషఙ్గవృద్ధ వైరానుబన్ధో వివహన్మిథశ్చ
అధ్వన్యముష్మిన్నురుకృచ్ఛ్రవిత్త బాధోపసర్గైర్విహరన్విపన్నః

తాంస్తాన్విపన్నాన్స హి తత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థః
ఆవర్తతేద్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగమ్

మనస్వినో నిర్జితదిగ్గజేన్ద్రా మమేతి సర్వే భువి బద్ధవైరాః
మృధే శయీరన్న తు తద్వ్రజన్తి యన్న్యస్తదణ్డో గతవైరోభియాతి

ఈ ఆకలి ఎందుకు పుడుతోంది అన్న ఆలోచన ఉండదు. ఇలా అడవిలో వెళుతూ ఉంటే కొండచిలువను చూచుకోకుండా దాని నోటిలో ప్రవేశిస్తాడు, ఒక చోట పాములు ఒక చోట గోతులు. జీవితమంతా ఒక అడవి. దీనికి భవాటవి అన్న పేరు. భవ అంటే సంసారం. సంసారమంటే అడవి. ఇందులో సుఖమనుకున్నవి అడవిలో అనుభవించేవీ ఒకటే. ఒకప్పుడు బాధలన్నీ పోయి తన వారు కనపడి వస్తున్నాడు. అంటే జ్ఞ్యానం కలిగి భగవానుడు తెలుస్తాడు ఒకసారి. అయినా పూర్తిగా భగవానుని మీద ధ్యాస నిలపడు. రహూగణా నీవు కూడా ఇదే స్థితిలో ఉన్నావు. నేను శాసకున్నీ నేను శిస్ఖిస్తున్నాను అనుకోకు. దేని యందూ నాది అన్న బుద్ధిని పెంచుకోక భగవానుని సేవచేయి.

ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయస్తదాశ్రయావ్యక్తపదద్విజస్పృహః
క్వచిత్కదాచిద్ధరిచక్రతస్త్రసన్సఖ్యం విధత్తే బకకఙ్కగృధ్రైః

ఇలాంటివాటితో వెళుతూ వెళుతూ ఉంటే పెద్ద పెద్ద సింహాలు వస్తాయి. వివాహం అయి నాలుగు ముద్దుమాటలలో పిల్లలు పుట్టి వారు పెరుగ్తూ ఉంటే వచ్చే సమస్యలే సింహాలు. కొంగలూ గద్దలూ రాబంధువులు అయిన బంధువులతో స్నేహం చేస్తారు. కొందరు కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్లు నడిచేవారు, కొందరు కళ్ళు పొడిచేవారు, కొందరు తెలియకుండా మోసం చేస్తారు కొందరు తెలిసి మోసం చేస్తారు. అలాంటి వాళ్ళను నమ్ముతావు. నీకు వాస్తవముగా తత్వం బోధించే సజ్జనుల వాక్యాన్ని నీవు వినవు.

తైర్వఞ్చితో హంసకులం సమావిశన్నరోచయన్శీలముపైతి వానరాన్
తజ్జాతిరాసేన సునిర్వృతేన్ద్రియః పరస్పరోద్వీక్షణవిస్మృతావధిః

వారు మోసం చేసాక కూడా మంచి వారిని ఆశ్రయించడు. కోతి స్వహావమైన చపల చిత్తముతో ఉంటాడు. జారి పడుతూ కూడా అదే చెట్టు ఎక్కాలనుకుంటోన్న కోతిలాగ. జూదం ఆడే వాడు ఒక సారి ఓడితే మరలి వెళ్ళక గెలిచే దాకా ఆడగోరుతాడు. సంసారము కూడా అంతే. ద్వేషమూ వైరమూ కక్షా పగా ఎంతటి అనర్థాన్నైనా తెస్తాయి. అలాంటి వారితో తిరిగి అలాంటి వారితో మోసగించబడి, వారితో కలిసి ఉంటేనే బ్రతకగలం అని అలాంటి జాతితో కలిగే వాటితోనే తృప్తి పొందుతాడు. అబ్బాయికి అమ్మాయి జాతి, ఆడవారికి అమ్మాయి పరస్పరం ఒకరి ముఖం ఒకరు చూస్తూ కూర్చుంటాడు (పరస్పరోద్వీక్షణ), ఎంత సేపు చూసారో కూడా కాలం మరచిపోతారు (విస్మృతావధిః)

ద్రుమేషు రంస్యన్సుతదారవత్సలో వ్యవాయదీనో వివశః స్వబన్ధనే
క్వచిత్ప్రమాదాద్గిరికన్దరే పతన్వల్లీం గృహీత్వా గజభీత ఆస్థితః

ద్రుమేషు - చేట్ల కింద కూర్చుని ఉంటారు అమ్మాయిలూ అబ్బాయిలూ. అలా వినోదించడం వలన పిల్లల మీద ప్రేమ, భార్యల మీద ప్రేమ కలవారి కేవలం సమాగమం తప్ప సాధించవలసిన పని లేదని అందులో మునిగి పోయి తనను తానే కట్టేసుకుంటాడు. తనకు కట్టేసే తాళ్ళు తానే తెచ్చుకుంటాడు. అడవిలో వెళుతుండగా ఏనుగు కనపడితే కొండ ఎక్కాడు, అక్కడ పెద్ద పులి కనపడింది, దన్ని తప్పించుకోవడానికి ఒక తీగను పట్టుకుంటే ఆ తీగ తెగి పాములు కుడతాయి.

అతః కథఞ్చిత్స విముక్త ఆపదః పునశ్చ సార్థం ప్రవిశత్యరిన్దమ
అధ్వన్యముష్మిన్నజయా నివేశితో భ్రమఞ్జనోద్యాపి న వేద కశ్చన

ఇన్ని కష్టాలు పడి కూడా భగవంతుని అనుగ్రహం వలన ఒక సారి ఆపదలు పోతే , ఈ సారైనా వాటి వైపు వెళ్ళకుండా జాగ్రత్త తీసుకోడు. అతి కష్టము మీద ఆపద పోగొట్టుకొని కూడా పునః దానిలో ప్రవేశిస్తాడు. ఇదంతా భగవంతుని మాయ. ఆ మాయతో అడవిలో (సంసారము) పడి ఇన్ని వేల కోట్ల సంవత్సరాలుగా పరిభ్రమిస్తున్నాడు

రహూగణ త్వమపి హ్యధ్వనోస్య సన్న్యస్తదణ్డః కృతభూతమైత్రః
అసజ్జితాత్మా హరిసేవయా శితం జ్ఞానాసిమాదాయ తరాతిపారమ్

రహూగణా నీవు కూడా ఇన్నాళ్ళూ ఇలాంటి అడవిలోనే ఉన్నావు. "నేను రాజును. వాడు తప్పు చేసాడ్,  నేను శిక్షిస్తాను" అన్న భావం వదిలిపెట్టు. హింస మాను. తోటి ప్రాణులతో మైత్రి చెయ్యి. హరి సేవతో సంసారము యందు మనసు లగ్నం చేయకుండా జ్ఞ్యానమనే ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని అడ్డం వచ్చిన తీగలను నరుక్కుంటూ సంసారం యొక్క (అడవి యొక్క) ఆవలి తీరం చేరు.

రాజోవాచ
అహో నృజన్మాఖిలజన్మశోభనం కిం జన్మభిస్త్వపరైరప్యముష్మిన్
న యద్ధృషీకేశయశఃకృతాత్మనాం మహాత్మనాం వః ప్రచురః సమాగమః

అన్ని రకాల జన్మల కంటే మానవ జన్మే ఉత్తమం. కానీసం మనకేదీ తెలియదన్న సంగతి తెలుస్తుంది. ఈ సంసార అరణ్యములో మానవేతర జన్మల వలన ఏమి లాభం. పరమాత్మ యొక్క కీర్తి యందు మనసు పెట్టిన మాహత్ములతో సమావేశం కేవలం మానవ జన్మలోనే ఉంది.

న హ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిర్హతాంహసో భక్తిరధోక్షజేమలా
మౌహూర్తికాద్యస్య సమాగమాచ్చ మే దుస్తర్కమూలోపహతోవివేకః

గురువర్యా! నీ పాద పద్మ పరాగ తాకిడితో అన్ని పాపములూ పోయి పరమాత్మ యందు భక్తి కలుగుట వింతేమీ కాదు. మనం పుణ్యం సంపాదించుకుని దానితోనే పరమాత్మను పొందాలనుకోవడం కాని పను. గురువు గారి పాదాలను ఆశ్రయించడం మాత్రమే మార్గం. ఒక్క క్షణ కాలం మీతో మాట్లాడితే ఇంతవరకూ నాలో ఉన్నటువంటి అన్ని కుతర్కాలూ పోయాయి. కుతర్కం వలన ఉన్న అవివేకం నశించిపోయింది.

నమో మహద్భ్యోస్తు నమః శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్యః
యే బ్రాహ్మణా గామవధూతలిఙ్గాశ్చరన్తి తేభ్యః శివమస్తు రాజ్ఞామ్

ఇది వేద మంత్రం. మహానుభావులకూ శిశువులకూ వటువులకూ అందరికీ నమస్కారం. బ్రహ్మజ్ఞ్యానం కలవారికి నమస్కారం చేయడానికి వయసుతో నిమిత్తం లేదు. ప్రహ్లాదుడూ ద్రువుడు వంటి వారు చిన్న పిల్లలుగానే జ్ఞ్యానం పొందారు. కొందరు మహనుభావులు అవధూత వేషములో జడ అంధ బదిర మూక రూపాలలో బ్రాహ్మణుడిగా గుర్తుపట్ట వీలులేని రూపములో సంచరించేవారికి నా నమస్కారములు. రాజులకు మేలగు గాక. అడవిలోకి వెళ్ళిన రాజులకు తెలియకుండా సంచరించే బ్రహ్మజ్ఞ్యానుల వలన మంగళం కలగాలి. 
మహాత్ములైన మీ వంటి వారిని కలవడానికి ఉపయోగపడే శరీరం ఉంటే ఆ శరీరం వచ్చిన మానవజన్మ ధన్యం. ఒక క్షణ కాలం మీ పరిచయముతో అనాధిగా నాలో ఉన్న దుస్తర్కం వలన నశించిన వివేకం ఉదయించింది.
గొప్పవారికీ శిశువులకీ యువకులకీ బ్రహ్మచారులకీ బ్రాహ్మణులకీ అవధూతలకీ నమస్కారం. అందరికీ క్షేమం కలిగించే స్థితి వచ్చింది. అందరిలో ఉన్న భగవానునికి నమస్కారం చేస్తున్నాడు. 

శ్రీశుక ఉవాచ
ఇత్యేవముత్తరామాతః స వై బ్రహ్మర్షిసుతః సిన్ధుపతయ ఆత్మసతత్త్వం విగణయతః
పరానుభావః పరమకారుణికతయోపదిశ్య రహూగణేన సకరుణమభివన్దితచరణ ఆపూర్ణార్ణవ ఇవ
నిభృతకరణోర్మ్యాశయో ధరణిమిమాం విచచార

ఈ ప్రక్రారముగా భరతుడు రహూగణుడికి ఆత్మ తత్వాన్ని కరుణ మనస్కుడై బోధిస్తే ఇంత జ్ఞ్యానం పొందిన రాజు పరిపూర్ణ భక్తితో రాజుకు నమస్కరించి పూర్తిగా నిండిన సముద్రములా అవయములూ మనస్సు బుద్ధీ చిత్తమూ అంతఃకరణం ఆరు ఊర్ములతో భూమండలం మొత్తం భరతుడు సంచరించాడు.

సౌవీరపతిరపి సుజనసమవగతపరమాత్మసతత్త్వ ఆత్మన్యవిద్యాధ్యారోపితాం చ దేహాత్మ
మతిం విససర్జ ఏవం హి నృప భగవదాశ్రితాశ్రితానుభావః

మహానుభావుల కలయికతో తెలియబడిన పరమాత్మ తత్వం కలవాడై, అజ్ఞ్యానం వలన కలిగిన "దేహమే ఆత్మ" అన్న భావాన్ని రాజు భరతుని ఉపదేశం వలన విడిచిపెట్టాడు.

రాజోవాచ
యో హ వా ఇహ బహువిదా మహాభాగవత త్వయాభిహితః పరోక్షేణ వచసా జీవలోకభవాధ్వా స
హ్యార్యమనీషయా కల్పితవిషయోనాఞ్జసావ్యుత్పన్నలోకసమధిగమః అథ తదేవైతద్దురవగమం
సమవేతానుకల్పేన నిర్దిశ్యతామితి

గురువుగారి భక్తులనాశ్రయించిన వారికి పొందిన వారికి ఎటువంటి స్థితి వచ్చిందో చూసావా. రహూగణుడికి భరతుని కన్నా ముందే మోక్షం వచ్చింది. అనేకమైన జ్ఞ్యానములు తెలుసుకున్న వారు కూడా నీవు పరోక్షముగా వచ్చిన మహాభాగవత ధర్మాలు బోధించావు, బుద్ధి బలం చేత ఏవో కొన్ని విషయాలను కల్పించుకుని అవ్యుత్పన్నలోకమును సులభముగా పొందలేరు.
అజ్ఞ్యాని లోకములతో మనం కలిసి ఉండము. జ్ఞ్యానులనూ పరమాత్మభక్తులనూ ఆశ్రయిస్తే అజ్ఞ్యానులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు.