Wednesday, November 21, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం యేడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం యేడవ అధ్యాయం

శౌనక ఉవాచ
నిర్గతే నారదే సూత భగవాన్బాదరాయణః
శ్రుతవాంస్తదభిప్రేతం తతః కిమకరోద్విభుః

నారదభగవానుడు వెళ్ళిన తరువాత ఆయన చెప్పినది విన్న వ్యాసుడు ఏమి చేసాడు

సూత ఉవాచ
బ్రహ్మనద్యాం సరస్వత్యామాశ్రమః పశ్చిమే తటే
శమ్యాప్రాస ఇతి ప్రోక్త ఋషీణాం సత్రవర్ధనః

సరస్వతీ నదికి బ్రహ్మనది అని పేరు. ఆ నదికి పశ్చిమతీరంలో శమ్యాప్రాస అని ఆశ్రమం.

తస్మిన్స్వ ఆశ్రమే వ్యాసో బదరీషణ్డమణ్డితే
ఆసీనోऽప ఉపస్పృశ్య ప్రణిదధ్యౌ మనః స్వయమ్

ఆ ఆశ్రమంలో బదరీ వృక్షాలు (రేగు చెట్లు) ఎక్కువ. (అలాగే బృందావనం, బృంద అంటే పల్లేరు). తన ఆశ్రమంలో ఆచమనం చేసి (ఉపస్పృశ్య ) ప్రాణాయమం చేసాడు (ప్రణిదధ్యౌ ).

భక్తియోగేన మనసి సమ్యక్ప్రణిహితేऽమలే
అపశ్యత్పురుషం పూర్ణం మాయాం చ తదపాశ్రయమ్

పరిశుధ్ధమైన మనసు పరమాత్మ యందు లగ్నంచేసి. లగ్నం చెయ్యగానే పరమాత్మ సాక్షాత్కారం కలిగింది (అపశ్యత్పురుషం ). పరమాత్మనే కాకుండా ఆయన మాయను కూడ సాక్షాత్కరించుకున్నాడు

యయా సమ్మోహితో జీవ ఆత్మానం త్రిగుణాత్మకమ్
పరోऽపి మనుతేऽనర్థం తత్కృతం చాభిపద్యతే

యేమాయచేత మోహింపబడతాడో (అనాత్మని ఆత్మ అనుకోవడం) ఆ మాయ చేత నేనే ప్రకృతి అనుకుంటాడు. దానితో అనర్ధాన్ని పొందుతాడు.

అనర్థోపశమం సాక్షాద్భక్తియోగమధోక్షజే
లోకస్యాజానతో విద్వాంశ్చక్రే సాత్వతసంహితామ్

అజ్ఞ్యానంవల్ల (లోకస్యాజానతో ) ప్రకృతిసమ్మోహంవల్ల కలిగే అన్ర్ధాలనుంచి ఉపశమింపచేసేది పరమాత్మ యందు భక్తి యోగం. అందుకు భాగవతం వ్రాశాడు

యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమపూరుషే
భక్తిరుత్పద్యతే పుంసః శోకమోహభయాపహా

అది వింటే కృష్ణునియందు భక్తి కలుగుతుంది, అది శోక మోహ భయాపహం. శారీరిక బాధ శోకం మానసిక బాధ దుఖం. ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకోవడం మోహం. శోకమునూ మోహమునూ భయమునూ తొలగించగలదు ఆ భాక్తి

స సంహితాం భాగవతీం కృత్వానుక్రమ్య చాత్మజమ్
శుకమధ్యాపయామాస నివృత్తినిరతం మునిః

భాగవతమనే సాత్వత సమ్హితలో ఉన్న విషయాలను కూర్చి పుత్రుడైన శుకునికి వినిపించాడు. ఆ శుకుడు నివృత్తియందు ఆసక్తి ఉన్నవాడు.

శౌనక ఉవాచ
స వై నివృత్తినిరతః సర్వత్రోపేక్షకో మునిః
కస్య వా బృహతీమేతామాత్మారామః సమభ్యసత్

నివృత్తి మార్గం లో ఉండి ప్రాపంచకమైన వాటిని ఉపేక్షించి పరమాత్మ గుణాలను మననం చేసే శుకుడు ఉన్నవాటిలోకల్లా పెద్దదైన (బృహతీ) గ్రంధాన్ని సహజంగానే భక్తి ఉన్న శుకయోగీంద్రుడు యే ప్రయోజనం ఆశించి విన్నాడు

సూత ఉవాచ
ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రన్థా అప్యురుక్రమే
కుర్వన్త్యహైతుకీం భక్తిమిత్థమ్భూతగుణో హరిః

సాంసారిక విషయములయందు వాసనలేనివారైనా , ఆత్మారాములు (ఆత్మ యందు పరమాత్మను సాక్షాత్కరించుకొన్నావారు) అయిన, మునులైన భాగవత కధలు భగవత్గుణానువర్ణానికి విఘాతం కాదు. పరమాత్మ యందు వారు అహైతుకీ భక్తి కలిగి ఉంటారు. అత్యంత వాత్సల్యపూరితమైన అవతారాన్ని ఇక్కడ చెప్పారు

హరేర్గుణాక్షిప్తమతిర్భగవాన్బాదరాయణిః
అధ్యగాన్మహదాఖ్యానం నిత్యం విష్ణుజనప్రియః

పరమాత్మయందే పరమాత్మ గుణములచేత ఆకర్షింపబడే మనసు గలవాడు కాబట్టి ఈ పెద్ద కదను తండ్రివద్ద నేర్చుకున్నాడు(అధ్యగాన్మహదాఖ్యానం ). వేదవేదాంతములకన్నా విశిష్టమైనది భాగవతం - భాగవతోత్తముల గుణవర్ణన ఇందులో ఉంది కాబట్టి దీన్ని వినడానికి శుకుడు ముందుకొచ్చాడు

పరీక్షితోऽథ రాజర్షేర్జన్మకర్మవిలాపనమ్
సంస్థాం చ పాణ్డుపుత్రాణాం వక్ష్యే కృష్ణకథోదయమ్

కృష్ణకథోదయమ్ - కృష్ణ పరమాత్మ కధను వృధ్ధిపొందించే పాండుపుత్రుల జీవనం వారి కీర్తిని (సంస్థాం చ పాణ్డుపుత్రాణాం), పరీక్షిత్తు పుట్టుక అతను చేసే పనులు(కర్మ) ఆయన మోక్షం(విలాపనమ్). ఇవన్నీ కృష్ణుని కధలో అంతర్లీనంగా ఉన్నాయి.

యదా మృధే కౌరవసృఞ్జయానాం వీరేష్వథో వీరగతిం గతేషు
వృకోదరావిద్ధగదాభిమర్శ భగ్నోరుదణ్డే ధృతరాష్ట్రపుత్రే

భారతంలో కౌరవ పాండవులు వారి వీరులు మరణించినప్పుడు మిగిలిన ధుర్యోధనున్ని భీముడు గధతో ఊరు భాగం బద్దలుకోట్టాడు

భర్తుః ప్రియం ద్రౌణిరితి స్మ పశ్యన్కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి
ఉపాహరద్విప్రియమేవ తస్య జుగుప్సితం కర్మ విగర్హయన్తి

తనస్వామి అయిన దుర్యోధనునికి ఇది ప్రియం కలిగిస్తుందని ద్రోణ పుత్రుడు, ద్రౌపతి పుత్రులని వారు నిద్రించుచుండగా సంహరించాడు. ఈ పని వల్ల ఎవరికీ ప్రీతి కలగనిది (ఉపాహరద్విప్రియమేవ ).

మాతా శిశూనాం నిధనం సుతానాం నిశమ్య ఘోరం పరితప్యమానా
తదారుదద్వాష్పకలాకులాక్షీ తాం సాన్త్వయన్నాహ కిరీటమాలీ

అశ్వధ్ధామ తన ప్రభువుకి న్యాయం చేస్తున్నట్లు తలచి ఉపపాండవులని నిద్రపోతుండగా సంహరించాడని విన్న ద్రౌపతి విలపించి. ఆ ద్రౌపతిని అర్జనుడు ఓదార్చాడు. (కొన్ని వేల మంది రజులు వారి కిరీటాలని అర్జునిని పాదం ముందు ఉంచడంవల్ల ఈయంకు కిరీటిమాలి అని పేరు)

తదా శుచస్తే ప్రమృజామి భద్రే యద్బ్రహ్మబన్ధోః శిర ఆతతాయినః
గాణ్డీవముక్తైర్విశిఖైరుపాహరే త్వాక్రమ్య యత్స్నాస్యసి దగ్ధపుత్రా

బ్రహ్మబంధువు అంటే బ్రహామణుడిలాంటివాడు. అలాంటివాడి శిరస్సుని తీసుకొస్తాను. నిప్పు పెట్టినవాడు విషం పెట్టినవాడు భార్యను అపహరించినవాడు ఆయుధంతో కొట్టడానికి వచ్చినవాడు రాజ్యాన్ని అపహరించినవాడు ప్రాణం తీసేవారు -  ఈ ఆరుపనుల్లో ఎది చేసినా వాడిని ఆతతాయి అంటారు. మీరు దహనసంస్కారాలు చేసి స్నానం చేసేలోపు తీసుకుని వస్తాను

ఇతి ప్రియాం వల్గువిచిత్రజల్పైః స సాన్త్వయిత్వాచ్యుతమిత్రసూతః
అన్వాద్రవద్దంశిత ఉగ్రధన్వా కపిధ్వజో గురుపుత్రం రథేన

అచ్యుతమిత్రసూతః - కృష్ణుడు అర్జునికి సారధిమాత్రమే కాదు మిత్రుడుకూడా. అర్జునికి ఉన్న ఒక ధైర్యం కృష్ణుడైతే రెండొవది కపి ద్వజం. ఆయన గుఱ్ఱాలు అగ్ని ఇచ్చినవి.  అర్జునుడు అశ్వధ్ధామ వెంట పడ్డాడు (అన్వాద్రవత్) కవచమూ (దంశిత) ఆయుధము తీసుకుని

తమాపతన్తం స విలక్ష్య దూరాత్కుమారహోద్విగ్నమనా రథేన
పరాద్రవత్ప్రాణపరీప్సురుర్వ్యాం యావద్గమం రుద్రభయాద్యథా కః

ఉద్విగ్నమనసుతో అశ్వధ్ధామ అర్జునిని చూసి పరిగెత్తాడు. శంకరున్ని చూసి పరుగెత్తిన దక్షునిలాగ. (క: అంటే దక్షప్రజాపతి)

యదాశరణమాత్మానమైక్షత శ్రాన్తవాజినమ్
అస్త్రం బ్రహ్మశిరో మేనే ఆత్మత్రాణం ద్విజాత్మజః

గుఱ్ఱములు అలసిపోయేదాక పరుగెత్తి, ఇంక పారిపోలేనప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఆచమనం చేసి ప్రయోగించాడు.

అథోపస్పృశ్య సలిలం సన్దధే తత్సమాహితః
అజానన్నపి సంహారం ప్రాణకృచ్ఛ్ర ఉపస్థితే

అశ్వధ్ధామకి బ్రహ్మాస్త్రప్రయోగం మాత్రమే తెలుసు ఉపసంహారం తెలీదంప్పటికీ ప్రాణాపాయంవచ్చింది కాబట్టి ప్రయోగించాడు.

తతః ప్రాదుష్కృతం తేజః ప్రచణ్డం సర్వతో దిశమ్
ప్రాణాపదమభిప్రేక్ష్య విష్ణుం జిష్ణురువాచ హ

అది ప్రచండవేగంతో వస్తున్నప్పుడు  ప్రాణానికే ప్రమాదం యేర్పడింది

అర్జున ఉవాచ
కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానామభయఙ్కర
త్వమేకో దహ్యమానానామపవర్గోऽసి సంసృతేః
త్వమాద్యః పురుషః సాక్షాదీశ్వరః ప్రకృతేః పరః
మాయాం వ్యుదస్య చిచ్ఛక్త్యా కైవల్యే స్థిత ఆత్మని

సంసారం నుంచి జనాలని రక్షిచగలవాడివి నీవు
నీవే ఆది పురుషుడివి ఈ
స ఏవ జీవలోకస్య మాయామోహితచేతసః
విధత్సే స్వేన వీర్యేణ శ్రేయో ధర్మాదిలక్షణమ్

ధర్మ జ్ఞ్యాన వైరాగ్యాలంటే ఎమిటో భోధించడానికి అందరినీ నీ మాయతో కాపాడుతున్నావు.

తథాయం చావతారస్తే భువో భారజిహీర్షయా
స్వానాం చానన్యభావానామనుధ్యానాయ చాసకృత్

నీ ఈ అవతారం భూభరాన్ని తొలగించడానికి. నిన్ను ధ్యానం చేసేవాళ్ళను కాపాడేవాడివి నీవు

కిమిదం స్విత్కుతో వేతి దేవదేవ న వేద్మ్యహమ్
సర్వతో ముఖమాయాతి తేజః పరమదారుణమ్

పరమభయంకరంగా అన్ని దిక్కులను ఆక్రమించి వస్తున్న ఈ తేజస్సునుంచి నన్నున్ నువ్వే కాపాడాలి

శ్రీభగవానువాచ
వేత్థేదం ద్రోణపుత్రస్య బ్రాహ్మమస్త్రం ప్రదర్శితమ్
నైవాసౌ వేద సంహారం ప్రాణబాధ ఉపస్థితే

న హ్యస్యాన్యతమం కిఞ్చిదస్త్రం ప్రత్యవకర్శనమ్
జహ్యస్త్రతేజ ఉన్నద్ధమస్త్రజ్ఞో హ్యస్త్రతేజసా

బ్రహ్మాస్త్రాన్ని ఇంకో అస్త్రంతో తిప్పి పంపలేము, నీవు కూడా బ్రహ్మాస్త్రాని ప్రయోగించు

సూత ఉవాచ
శ్రుత్వా భగవతా ప్రోక్తం ఫాల్గునః పరవీరహా
స్పృష్ట్వాపస్తం పరిక్రమ్య బ్రాహ్మం బ్రాహ్మాస్త్రం సన్దధే

సంహత్యాన్యోన్యముభయోస్తేజసీ శరసంవృతే
ఆవృత్య రోదసీ ఖం చ వవృధాతేऽర్కవహ్నివత్

దృష్ట్వాస్త్రతేజస్తు తయోస్త్రీల్లోకాన్ప్రదహన్మహత్
దహ్యమానాః ప్రజాః సర్వాః సాంవర్తకమమంసత

ప్రజోపద్రవమాలక్ష్య లోకవ్యతికరం చ తమ్
మతం చ వాసుదేవస్య సఞ్జహారార్జునో ద్వయమ్

కృష్ణుడి అభిప్రాయం తెలుసుకిని అర్జనుడు రెండు అస్త్రాలని ఉపసమ్హరించాడు

తత ఆసాద్య తరసా దారుణం గౌతమీసుతమ్
బబన్ధామర్షతామ్రాక్షః పశుం రశనయా యథా

అశ్వధ్ధామను కట్టి తీసుకుపోతున్నాడు అర్జనుడు

శిబిరాయ నినీషన్తం రజ్జ్వా బద్ధ్వా రిపుం బలాత్
ప్రాహార్జునం ప్రకుపితో భగవానమ్బుజేక్షణః

కోపముతో శ్రీకృష్ణుడు అర్జనుడి ప్రతిజ్ఞ్య గుర్తుచేసాడు

మైనం పార్థార్హసి త్రాతుం బ్రహ్మబన్ధుమిమం జహి
యోऽసావనాగసః సుప్తానవధీన్నిశి బాలకాన్

వీడు బ్రాహ్మణుడు కాడు బ్రహ్మబంధువు. తప్పు చెయ్యని, రాత్రిపూట పడుకున్నవాళ్ళను, చిన్న పిల్లలను చంపాడు - ఈ నాలుగూ తప్పే.

మత్తం ప్రమత్తమున్మత్తం సుప్తం బాలం స్త్రియం జడమ్
ప్రపన్నం విరథం భీతం న రిపుం హన్తి ధర్మవిత్

ధర్మం తెలిసినవాడు మద్య్పానం సేవించినవాడిని, ధనం మొదలైన వాటివల్ల ఉన్న మదం ప్రమత్తం, పిచ్చివాడిని, పడుకున్నవాడిని, పిల్లవాడిని, స్త్రీని, శరణమన్నవాడిని, రధంలేని వాడిని, భయపడినవాడిని సంహరించకూడదు

స్వప్రాణాన్యః పరప్రాణైః ప్రపుష్ణాత్యఘృణః ఖలః
తద్వధస్తస్య హి శ్రేయో యద్దోషాద్యాత్యధః పుమాన్

ఇతరుల ప్రాణాలు తీసి వాడి ప్రాణాలు నిలుపుకోవాలనుకునేవాడు అఘేణ: - దయలేనివాడు, చెడ్డవాడు
అలాంటివాన్ని చమపడం వాడికే మేలు. వాడుచేసిన తప్పుల వలన వాడు నరకానికి పోతాడు

ప్రతిశ్రుతం చ భవతా పాఞ్చాల్యై శృణ్వతో మమ
ఆహరిష్యే శిరస్తస్య యస్తే మానిని పుత్రహా

నా ముందరే ద్రౌపతికి ప్రతిజ్ఞ్య చేసావు కదా.

తదసౌ వధ్యతాం పాప ఆతతాయ్యాత్మబన్ధుహా
భర్తుశ్చ విప్రియం వీర కృతవాన్కులపాంసనః

ఆత్మబంధువుని చంపినవాడు ఆతతాయి. మనకి కీడు చేసాడు వాడి స్వామికి కూడా కీడే చేసాడు.

సూత ఉవాచ
ఏవం పరీక్షతా ధర్మం పార్థః కృష్ణేన చోదితః
నైచ్ఛద్ధన్తుం గురుసుతం యద్యప్యాత్మహనం మహా

ఇదంతా అర్జనుని గుణాన్ని పరీక్షించడానికి అడిగాడు కృష్ణుడు.
తనను చంపినవాడు (తన అంటే తన పుత్రులని) అయిన గురుపుత్రుని చంపలేదు

అథోపేత్య స్వశిబిరం గోవిన్దప్రియసారథిః
న్యవేదయత్తం ప్రియాయై శోచన్త్యా ఆత్మజాన్హతాన్

కట్టెసి ద్రౌపతికి వివరించాడు జరిగింది

తథాహృతం పశువత్పాశబద్ధమవాఙ్ముఖం కర్మజుగుప్సితేన
నిరీక్ష్య కృష్ణాపకృతం గురోః సుతం వామస్వభావా కృపయా ననామ చ

తథాహృతం - అలా పట్టుకొచ్చిన (చెప్పరాని చెయ్యరాని ఊహించని విధంగా పట్టుకొచ్చి అని అర్థం)
అవాఙ్ముఖం - తలదించుకుని ఉన్న అశ్వధ్ధామను చూచి ఉత్తమ స్వభావురాలు కాబట్టి (వామస్వభావా ) దయతో తలవంచి నమస్కారం చేసింది (ననామ )

ఉవాచ చాసహన్త్యస్య బన్ధనానయనం సతీ
ముచ్యతాం ముచ్యతామేష బ్రాహ్మణో నితరాం గురుః

కట్లు విప్పండి విప్పండి (ముచ్యతాం ), ఇతను గురువు (ద్రోణుడు లేడు కాబట్టి)

సరహస్యో ధనుర్వేదః సవిసర్గోపసంయమః
అస్త్రగ్రామశ్చ భవతా శిక్షితో యదనుగ్రహాత్
స ఏష భగవాన్ద్రోణః ప్రజారూపేణ వర్తతే
తస్యాత్మనోऽర్ధం పత్న్యాస్తే నాన్వగాద్వీరసూః కృపీ

మీరు ఎవరి దగ్గరనుంచి అస్త్రాలు నేర్చుకున్నారో ఆ ద్రోనుడే ఈ రూపంతో ఉన్నాడు. ద్రోణునిలో సగమైన కృపి (తస్యాత్మనోऽర్ధం ) ఈ పుత్రున్ని చూసుకుని భర్తతో సహగమనం మానుకుంది

తద్ధర్మజ్ఞ మహాభాగ భవద్భిర్గౌరవం కులమ్
వృజినం నార్హతి ప్రాప్తుం పూజ్యం వన్ద్యమభీక్ష్ణశః

ధర్మజ్ఞ్యులైన మీరు ద్రోణుని వంశాన్ని గౌరవించాలి. ఈయనను సేవించాలి శిక్షించకూడదు

మా రోదీదస్య జననీ గౌతమీ పతిదేవతా
యథాహం మృతవత్సార్తా రోదిమ్యశ్రుముఖీ ముహుః

భర్తని దైవంగా చూస్కునే వీరి తల్లి నేను ఇప్పుడు ఏడుస్తున్నట్లు ఏడవకూడదు.

యైః కోపితం బ్రహ్మకులం రాజన్యైరజితాత్మభిః
తత్కులం ప్రదహత్యాశు సానుబన్ధం శుచార్పితమ్

బ్రాహ్మణుని వారి వంశాన్ని కోపింపజేసిన రాజకులం ఉండదు.

సూత ఉవాచ
ధర్మ్యం న్యాయ్యం సకరుణం నిర్వ్యలీకం సమం మహత్
రాజా ధర్మసుతో రాజ్ఞ్యాఃప్రత్యనన్దద్వచో ద్విజాః

ద్రౌపతి మాట్లాడిన మాట ధర్మబద్దం (గురువుని చంపకూడదనడం) న్యాయబద్దం (బ్రాహ్మణుని చంపకూడదని) దయతో పాపలేకుండా సమంగా మాట్లాడిన ద్రౌపతిని ధర్మరాజు ప్రశంసించాడు

నకులః సహదేవశ్చ యుయుధానో ధనఞ్జయః
భగవాన్దేవకీపుత్రో యే చాన్యే యాశ్చ యోషితః
తత్రాహామర్షితో భీమస్తస్య శ్రేయాన్వధః స్మృతః
న భర్తుర్నాత్మనశ్చార్థే యోऽహన్సుప్తాన్శిశూన్వృథా

అనదరూ ద్రౌపతిని మెచ్చుకున్నరు. భీముడు మాత్రం ఆవేశంతో మాట్లాడాడు. అశ్వధ్ధామ పని వల్ల ఎవరికీ మంచి జరగలేదు

నిశమ్య భీమగదితం ద్రౌపద్యాశ్చ చతుర్భుజః
ఆలోక్య వదనం సఖ్యురిదమాహ హసన్నివ

భీమ ద్రౌపతుల మాటలు విన్న కృష్ణుడు కాస్త చిరునవ్వుతో చూస్తూ

శ్రీభగవానువాచ
బ్రహ్మబన్ధుర్న హన్తవ్య ఆతతాయీ వధార్హణః
మయైవోభయమామ్నాతం పరిపాహ్యనుశాసనమ్

అర్జునా ధర్మం తప్పకుండా వ్యవహరించు. బ్రాహ్మణున్ని చంపకూడదు, ఆతతాయిని చంపితీరాలి. ఈ రెండూ నేనే చెప్పాను. నా అజ్ఞ్యను పరిపాలించు

కురు ప్రతిశ్రుతం సత్యం యత్తత్సాన్త్వయతా ప్రియామ్
ప్రియం చ భీమసేనస్య పాఞ్చాల్యా మహ్యమేవ చ

నీ ప్రతిజ్ఞ్య సత్యం చెయ్యి, నా శాసనాన్ని సత్యం చేయి. భీమునికి ద్రౌపతికి నాకూ కూడా ప్రియం కలిగించేలా చేయి.

సూత ఉవాచ
అర్జునః సహసాజ్ఞాయ హరేర్హార్దమథాసినా
మణిం జహార మూర్ధన్యం ద్విజస్య సహమూర్ధజమ్

కృష్ణుడిలో భావాన్ని అర్థం చేసుకుని కత్తి తీసుకుని అశ్వధ్ధామ జుట్టులో ఉన్న ంఅణిని తీసుకునాడు

విముచ్య రశనాబద్ధం బాలహత్యాహతప్రభమ్
తేజసా మణినా హీనం శిబిరాన్నిరయాపయత్
వపనం ద్రవిణాదానం స్థానాన్నిర్యాపణం తథా
ఏష హి బ్రహ్మబన్ధూనాం వధో నాన్యోऽస్తి దైహికః

అది తీసుకుని తేజోవిహీనమైన మణి విహీనమైన అశ్వధ్ధామను వెళ్ళమన్నాడు. బ్రాహ్మణ వధ అంటే గుండు చెయించడం, ధనాన్ని తీసుకోవడం, బహిష్కారం చెయ్యడం ఈ మూడు బ్రహ్మణుడికి విధించే శిక్షలు- మరణశిక్షతో సమానం.

పుత్రశోకాతురాః సర్వే పాణ్డవాః సహ కృష్ణయా
స్వానాం మృతానాం యత్కృత్యం చక్రుర్నిర్హరణాదికమ్

అలా అశ్వధ్ధామ వెళ్ళాక పుత్రులకి అంత్యక్రియలు చేసి లాంచనంగా విలపించి దానాదికాలౌ చేసుకున్నారు (చక్రుర్నిర్హరణాదికమ్).

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం ఆరవ అధ్యాయం

సూత ఉవాచ
ఏవం నిశమ్య భగవాన్దేవర్షేర్జన్మ కర్మ చ
భూయః పప్రచ్ఛ తం బ్రహ్మన్వ్యాసః సత్యవతీసుతః

వ్యాస ఉవాచ
భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిస్తవ
వర్తమానో వయస్యాద్యే తతః కిమకరోద్భవాన్

స్వాయమ్భువ కయా వృత్త్యా వర్తితం తే పరం వయః
కథం చేదముదస్రాక్షీః కాలే ప్రాప్తే కలేవరమ్

సన్యాసులందరూ తామున్న చోటినుచి విడిచివెళ్ళాక మీరేమి చేసారు. కాలం ప్రాప్తించినప్పుడు నీవు ఎలా ప్రవర్తించావు

ప్రాక్కల్పవిషయామేతాం స్మృతిం తే మునిసత్తమ
న హ్యేష వ్యవధాత్కాల ఏష సర్వనిరాకృతిః

నీవు చెప్పిన ఈ కధ పొయిన కల్పానిది. ఒక కల్పం 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అటువంటివి 14 మన్వంతారలకు ముందు జరిగింది.
మనకు జరిగిన విషయాలని మరిపించేది, అన్నిటినీ తొలగించగలది కాలం. అలాంటి కాలం నీ జ్ఞ్యాపకశక్తిని ఎందుకు తొలగించలేకపొయింది.

నారద ఉవాచ
భిక్షుభిర్విప్రవసితే విజ్ఞానాదేష్టృభిర్మమ
వర్తమానో వయస్యాద్యే తత ఏతదకారషమ్

విజ్ఞానాదేష్టృభి - విన్యానం బోధించిన గురువులు అక్కడినుంచి వెళ్ళినతరువాత. వయస్యాద్యే   - బాల్యంలో ఉన్న నేను ఇలా చేసాను

ఏకాత్మజా మే జననీ యోషిన్మూఢా చ కిఙ్కరీ
మయ్యాత్మజేऽనన్యగతౌ చక్రే స్నేహానుబన్ధనమ్

మాతల్లికి నేను ఒక్కడినే కొడుకుని. యోషిత్ - సంసారం మీద ఎక్కువ వ్యామోహం. కింకరి - పరాధీన. నాకు కూడా వేరే దిక్కులేదు, నా మీద ఎక్కువ బంధం పెంచుకుంది

సాస్వతన్త్రా న కల్పాసీద్యోగక్షేమం మమేచ్ఛతీ
ఈశస్య హి వశే లోకో యోషా దారుమయీ యథా

స్వతంత్ర్యురాలు కాకుండటం వల్ల నా మీద ఎంత ప్రేమ ఉన్నా నా యోగక్షేమాలు చూడలేకపోయింది.
 యోషా దారుమయీ - చెక్కతో చేసిన బొమ్మ లాగ మనం కూడా భగవంతుని చేతిలో బొమ్మలము.

అహం చ తద్బ్రహ్మకులే ఊషివాంస్తదుపేక్షయా
దిగ్దేశకాలావ్యుత్పన్నో బాలకః పఞ్చహాయనః

ఊషివాంస్తదుపేక్షయా - వారు వెళ్ళినవారితరువాత కూడా ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టలేదు. పఞ్చహాయనః - అయిదు సంవత్సరాల వయసు దిగ్దేశకాలావ్యుత్పన్నో - దిక్కు కాలం దేశం ఏమీ తెలీవు.  మహానుభావుల ఆవాసం వారు ఉన్నప్పుడే కాదు వారు వెళ్ళినతరువాత కూడా ఆ ప్రభావం కనపడుతుంది.

ఏకదా నిర్గతాం గేహాద్దుహన్తీం నిశి గాం పథి
సర్పోऽదశత్పదా స్పృష్టః కృపణాం కాలచోదితః

పాలుపిండుదామని వెళ్తున్న మా తల్లిని కాలచోదితమై కాలు మీద పడగా పాము కరిచింది.

తదా తదహమీశస్య భక్తానాం శమభీప్సతః
అనుగ్రహం మన్యమానః ప్రాతిష్ఠం దిశముత్తరామ్

తన భక్తులకు మేలు చెయ్యాలనునే పరమాత్మ కృపగా ఈ సంఘటనను తలిచాను.  ఉత్తరదిక్కుకు బయలుదేరాను

స్ఫీతాఞ్జనపదాంస్తత్ర పురగ్రామవ్రజాకరాన్
ఖేటఖర్వటవాటీశ్చ వనాన్యుపవనాని చ

చిత్రధాతువిచిత్రాద్రీనిభభగ్నభుజద్రుమాన్
జలాశయాఞ్ఛివజలాన్నలినీః సురసేవితాః

చిత్రస్వనైః పత్రరథైర్విభ్రమద్భ్రమరశ్రియః
నలవేణుశరస్తన్బ కుశకీచకగహ్వరమ్

ఏక ఏవాతియాతోऽహమద్రాక్షం విపినం మహత్
ఘోరం ప్రతిభయాకారం వ్యాలోలూకశివాజిరమ్

ఒక పెద్ద అడవిలోకి వెళ్ళాను. పెద్దపులు యేనుగులు నక్కలూ ఉన్న అడవికి వెళ్ళాను.

పరిశ్రాన్తేన్ద్రియాత్మాహం తృట్పరీతో బుభుక్షితః
స్నాత్వా పీత్వా హ్రదే నద్యా ఉపస్పృష్టో గతశ్రమః

అలసిపోయాను, ఆకలి దప్పి అవుతున్నది. నదిలో స్నానం చేసి ఆచమనంచేసి అక్కడ పళ్ళు తినడం వల్ల ఆ శ్రమ పొయింది.

తస్మిన్నిర్మనుజేऽరణ్యే పిప్పలోపస్థ ఆశ్రితః
ఆత్మనాత్మానమాత్మస్థం యథాశ్రుతమచిన్తయమ్

ఆ సరస్సు ఒడ్డున ఒక రావిచెట్టు ఉన్నది. ఋషులు చెప్పినట్లు పరమాత్మను ధ్యానం చేసాను.

ధ్యాయతశ్చరణామ్భోజం భావనిర్జితచేతసా
ఔత్కణ్ఠ్యాశ్రుకలాక్షస్య హృద్యాసీన్మే శనైర్హరిః

భావనిర్జితచేతసా - అన్ని భావాలను (సాంసారిక విషయాలను) గెలిచిన మనసుతో లేదా పరమాత్మ భావముతో జయైంచబడిన చిత్తముతో.
ఔత్కణ్ఠ్యాశ్రుకలాక్షస్య - ఆ పరమాత్మ విగ్రహాన్ని ధ్యానం చేస్తుంటే కుతూహలంతో కనులు చెమ్మగిల్లి నీరు తిరిగిన నా హృదయంలో పరమాత్మ మెల్లగా ఆవిర్భవించాడు.

ప్రేమాతిభరనిర్భిన్న పులకాఙ్గోऽతినిర్వృతః
ఆనన్దసమ్ప్లవే లీనో నాపశ్యముభయం మునే

ప్రేమతో బరువెక్కిన శరీరంతో పులకించగా ఆనందంలో తేలుతున్న (ఆనన్దసమ్ప్లవే) నేను ఇహముని పరముని రెండూ చూడలేకపోయాను (నాపశ్యముభయం )

రూపం భగవతో యత్తన్మనఃకాన్తం శుచాపహమ్
అపశ్యన్సహసోత్తస్థే వైక్లవ్యాద్దుర్మనా ఇవ

మనఃకాన్తం మనసుకు సుందరమైన రూపాని చూస్తుండగా అంతలోనే అంతర్ధానమయ్యాడు. వైక్లవ్యాద్దుర్మనా ఇవ - చాల బాధపడి.

దిదృక్షుస్తదహం భూయః ప్రణిధాయ మనో హృది
వీక్షమాణోऽపి నాపశ్యమవితృప్త ఇవాతురః

హృదయంలో మనసుని నిలిపి తదేకధ్యానం చేస్తూ కూర్చున్నాను. (మనం కావాలంటే కనపడడు ఆయన తలుచుకుంటే వస్తాడు). అవితృప్త్ - నాకు తృప్తి కలగలేదు. బాగా జ్వరంవచ్చిన వాడు పథ్యం అయినాక ఆహారం తీసుకోబోయేప్పుడు ఆహరం తినాలని ఎంత ఆతౄత కలుగుతుందో అంత ఆతృత కలిగింది. ఈ సారి

ఏవం యతన్తం విజనే మామాహాగోచరో గిరామ్
గమ్భీరశ్లక్ష్ణయా వాచా శుచః ప్రశమయన్నివ

మామాహాగోచరో గిరామ్ గమ్భీరశ్లక్ష్ణయా వాచా శుచః ప్రశమయన్నివ - కనపడకపోయినటువంటి బాధను తొలగిస్తున్నట్లుగా ఓదారుస్తున్నట్లుగా వాక్కు వినబడింది.

హన్తాస్మిఞ్జన్మని భవాన్మా మాం ద్రష్టుమిహార్హతి
అవిపక్వకషాయాణాం దుర్దర్శోऽహం కుయోగినామ్

ఇక ఈ జన్మలో నేను నీకు కనపడను. నేను కషాయం (పూర్వ జనంసముపార్జమైన సంస్కారం) పక్వం కాకుండా కుయోగులకు కనపడను.

సకృద్యద్దర్శితం రూపమేతత్కామాయ తేऽనఘ
మత్కామః శనకైః సాధు సర్వాన్ముఞ్చతి హృచ్ఛయాన్

నన్ను చూడాలని తలిచావు. నీ తపన చూసి నేను కనపడ్డాను. నీ మనసు ఇక నుంచి మళ్ళీ ఇంకొక్కసారి కనపడాలని కోరిక ఉంటుంది. నా మీద కోరిక ఉన్నవారికి ఇతరకోరికలు రావడానికి అవకాశంలేదు. శనై: ముంచతి హృచ్ఛయాన్ - మెల్లగా హృదయంలో పడుకునే కోరికలు పోతాయు

సత్సేవయాదీర్ఘయాపి జాతా మయి దృఢా మతిః
హిత్వావద్యమిమం లోకం గన్తా మజ్జనతామసి

నా మీద నీకు భక్తి సత్సేవ వల్ల కలిగింది. అన్ని పాపాలనుపోగోట్టి నావారిని (భక్తులను) చేరుకుంటావు తరువాత నన్ను చేరుకుంటావు. అవద్యం హిత్వా - పాపాన్ని దుఖాన్ని విడిచిపెట్టి. మజ్జనతామసి - నా వారితో కలిసి ఉన్నావు

మతిర్మయి నిబద్ధేయం న విపద్యేత కర్హిచిత్
ప్రజాసర్గనిరోధేऽపి స్మృతిశ్చ మదనుగ్రహాత్

ఇల కలిగిన బుధ్ధి పోకూడదు అని ఒక సరి కనపడ్డాను. ఈ భక్తి ఇక నీకు ఎమైనా పోదు. ప్రళయకాలంలో కూడా నీ చరిత్రలో జరిగినా స్మృతిమాత్రం పోదు.

ఏతావదుక్త్వోపరరామ తన్మహద్భూతం నభోలిఙ్గమలిఙ్గమీశ్వరమ్
అహం చ తస్మై మహతాం మహీయసే శీర్ష్ణావనామం విదధేऽనుకమ్పితః

ఏతావదుక్త్వోపరరామ - ఇదంతా చెప్పి ఆ వాక్కు ఆగిపొయింది.
నభోలిఙ్గమలిఙ్గమీశ్వరమ్ - ఆకాశమే ఆయంకు గుర్తు (ఆకాశం లేని చోటే లేదు. ) సకల్జగత్శాసకుడు
ఆ వాక్కు కనపడిన వైపు సాష్టాంగ నమస్కారం చేసాను.

నామాన్యనన్తస్య హతత్రపః పఠన్గుహ్యాని భద్రాణి కృతాని చ స్మరన్
గాం పర్యటంస్తుష్టమనా గతస్పృహః కాలం ప్రతీక్షన్విమదో విమత్సరః

పరమాత్మ వాక్కుని విన్నాక రూపాన్ని చూసాక సిగ్గు విడిచి పరమాత్మ నామాన్ని తలిచాను. పఠన్గుహ్యాని భద్రాణి కృతాని చ స్మరన్ - పరమ రహస్యములు శుభక్రమలులు, పరమాత్మ ఆచరించిన నా
విషయంలో జరిగిన కరమలు తలుస్తూ
కాలం ప్రతీక్షన్విమదో విమత్సరః - కాలాన్ని ప్రతీక్షిస్తూ, మదమాత్సర్యములు లేకుండా భూమండలమంతా సంచరించాను.

ఏవం కృష్ణమతేర్బ్రహ్మన్నాసక్తస్యామలాత్మనః
కాలః ప్రాదురభూత్కాలే తడిత్సౌదామనీ యథా

ఏవం కృష్ణమతేర్బ్రహ్మన్నాసక్తస్యామలాత్మనః - సంసారమ్యందు ఆసక్తిలేకుండా పరిశుధ్ధమైన మనసుతో పరమాత్మ భక్తితో అన్నీ మరిచిన నాకు
కాలః ప్రాదురభూత్కాలే తడిత్సౌదామనీ యథా- చంచలమైన మెరుపు తీగలాగ అనుకున్న కాలం వచ్చింది

ప్రయుజ్యమానే మయి తాం శుద్ధాం భాగవతీం తనుమ్
ఆరబ్ధకర్మనిర్వాణో న్యపతత్పాఞ్చభౌతికః

అంతవరకూ పరమాత్మకు సేవచేస్తున్న శరీరం పడిపోయింది.

కల్పాన్త ఇదమాదాయ శయానేऽమ్భస్యుదన్వతః
శిశయిషోరనుప్రాణం వివిశేऽన్తరహం విభోః

శరీరం పొయిన తరువాత కూడా నాకు స్మృతి అలాగే ఉంది. కల్పాంతంలో అన్ని ప్రాణులను చేర్చుకున్నప్పుడు నేను కూడా ఆయన వాక్కు ద్వారా ఆయన హృదయంలో ప్రవేశించాను

సహస్రయుగపర్యన్తే ఉత్థాయేదం సిసృక్షతః
మరీచిమిశ్రా ఋషయః ప్రాణేభ్యోऽహం చ జజ్ఞిరే

స్వామి అలా వెయ్యి మహాయుగాలు నిదురించి ఉన్నాడు. అప్పుడు ఆయన సంకల్పంతో బ్రహ్మ ప్రజాపతులు మొ వారు పుట్టారు. నేను బ్రహ్మగారి హృదయం నుంచి పుట్టాను

అన్తర్బహిశ్చ లోకాంస్త్రీన్పర్యేమ్యస్కన్దితవ్రతః
అనుగ్రహాన్మహావిష్ణోరవిఘాతగతిః క్వచిత్

అన్తర్బహిశ్చ లోకాంస్త్రీన్పర్యేమ్యస్కన్దితవ్రతఃబ్రహ్మయొక్క ప్రాణములోంచి బయటపడిన నేను ఇప్పటివరకు బయటలోపలా నా నామ సంకీర్తన వ్రతానికి భంగం రాకుండా సంచరిస్తూ ఉన్నాను.
అనుగ్రహాన్మహావిష్ణోరవిఘాతగతిః - పరమాత్మ అనుగ్రహం వల్ల యే లోకానికైన అడ్డులేకుండా వెళ్ళగలను.

దేవదత్తామిమాం వీణాం స్వరబ్రహ్మవిభూషితామ్
మూర్చ్ఛయిత్వా హరికథాం గాయమానశ్చరామ్యహమ్

బ్రహ్మ ఇచ్చిన వీణతో సంచరిస్తూ ఉన్నాను. మూర్చ్ఛ - రాగ విశేషములను మూర్చినములు అంటాం

ప్రగాయతః స్వవీర్యాణి తీర్థపాదః ప్రియశ్రవాః
ఆహూత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి

తేడా ఎమిటంటే అప్పుడు ఆ బాల్యంలో ఒక్కసారే కనపడ్డాడు. ఇప్పుడు ఆహూత ఇవ మే శీఘ్రం - పిలవగానే అహవానించినట్లు వస్తాడు.
ప్రగాయతః స్వవీర్యాణి తీర్థపాదః అన్నీ మరిచిపోయి గానం చేస్తున్నప్పుడు (ప్రగాయతః ) పిలవగానే వస్తాడు.


ఏతద్ధ్యాతురచిత్తానాం మాత్రాస్పర్శేచ్ఛయా ముహుః
భవసిన్ధుప్లవో దృష్టో హరిచర్యానువర్ణనమ్

ఆతుర చిత్తానాం మాత్రాస్పర్శేచ్ఛయా - శబ్దాది విషయాలను అనుభవించాలని అన్నిరోగాలు తెచ్చుకుంటున్న జీవులకు.
భవసిన్ధుప్లవో దృష్టో - సంసారమనే సముద్రంలో(భవ సింధు) ఉన్న నాకు ఒక నావ (ప్లవ:) కనపడింది అదే హరిచర్యానువర్ణనమ్.

యమాదిభిర్యోగపథైః కామలోభహతో ముహుః
ముకున్దసేవయా యద్వత్తథాత్మాద్ధా న శామ్యతి

అరిషడ్వర్గం మన మనసుని పూర్తిగా ఆక్రమించింది. దీన్ని యోగముతో దానముతో యాగముతో తొలగించలేము. భగవంతుని లీల శ్రవణ - భగవతుని లీలలను గానం గానీ శ్రవణం గాని చెయ్యుటవలన కలిగే ఫలితం వేరే యోగ యాగాదులతో కలగదు.

సర్వం తదిదమాఖ్యాతం యత్పృష్టోऽహం త్వయానఘ
జన్మకర్మరహస్యం మే భవతశ్చాత్మతోషణమ్

నీవడిగినదానికి సమాధానంగా నా చరిత్రను నీకు చెప్పాను. నా జన్మకర్మలను వినడంవల్ల నీ ఆత్మ సంతోషిస్తుందని చెప్పాను.

సూత ఉవాచ
ఏవం సమ్భాష్య భగవాన్నారదో వాసవీసుతమ్
ఆమన్త్ర్య వీణాం రణయన్యయౌ యాదృచ్ఛికో మునిః

యాదృచ్ఛికో మునిః భగవంతుని ఇచ్చతో తిరిగే ముని. ఈ విషయాలన్నీ ఆయనకు చెప్పి (ఆమన్త్ర్య ) వీణను మోగిస్తూ వెళ్ళాడు.

అహో దేవర్షిర్ధన్యోऽయం యత్కీర్తిం శార్ఙ్గధన్వనః
గాయన్మాద్యన్నిదం తన్త్ర్యా రమయత్యాతురం జగత్

పరమాత్మ కీర్తిని గానం చేస్తూ ఆ గానంలోనే అన్నీ మరచి మదమెక్కి (భగవంతుని నామస్మరణ అనే మత్తు - గాయన్మాద్య) వీణ మీద తీగలతో పరమాత్మను గానం చేస్తూ (తన్త్ర్యా ) పారవశ్యం చెందుతూ లోకమంతా తిరుగుతూ బాధపడుతున్న వారి బాధలను వారికి ఇష్టమున్నా లేకున్నా వినిపిస్తున్నాడు. మనందరి మనసును క్షణకాలం ఆనందంలో ముంచుతాడు, బాధపడుతున్న జగత్తుని ఆనందింపజేస్తున్నాడు. ఈయన ధన్యుడు.

Tuesday, November 20, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పంచమ అధ్యాయం

సూత ఉవాచ
అథ తం సుఖమాసీన ఉపాసీనం బృహచ్ఛ్రవాః
దేవర్షిః ప్రాహ విప్రర్షిం వీణాపాణిః స్మయన్నివ

నారద ఉవాచ
పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా
పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవ వా

జిజ్ఞాసితమధీతం చ బ్రహ్మ యత్తత్సనాతనమ్
తథాపి శోచస్యాత్మానమకృతార్థ ఇవ ప్రభో

అధీతం అంటే పొందారు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందారు, పరభ్రహ్మ విషయం తెలుస్కొన్నారు, తెలుసుకొన్నదానిని భారతరూపంలో అందించారు. అయిన మీరు చింతిస్తున్నారు. ఎందుకు

వ్యాస ఉవాచ
అస్త్యేవ మే సర్వమిదం త్వయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే
తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతమ్

మీరుచెప్పినదంతా నాదగ్గర ఉంది. అయిన ఎందుకు నా మనసు తృప్తిని పొందటంలేదు. అవ్యక్తం అగాధమైన నా చింత యొక్క మూలాన్ని తెలపగోరుతున్నాను మీరు అనంతమైన జ్ఞ్యానమున్నవారు. మీరు బ్రహ్మయొక్క శరీరమ్నుంచి పుట్టినవారు.

స వై భవాన్వేద సమస్తగుహ్యముపాసితో యత్పురుషః పురాణః
పరావరేశో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసఙ్గః

మీరు అందరి మనసులో ఉన్న భావలని తెలుసుకోగలరు. మీరు పురాణ పురుషున్ని ఆరాధించారు.  ఆ పురుషుడు పర - అవర ఈశ: తక్కువ వారికి ఎక్కువ వారికి ప్రభువు. ప్రకృతికి అహంకరానికి మహత్తుకు ప్రభువు. మనసైవ సృజతి - మనసుతో సంకల్పంతో సృజిస్తాడు రక్షిస్తాడు సం హరిస్తాడు. ఆ గుణాలతో ఆయనకి సంబంధముండదు. పరమాత్మ తాను తానుగానే ఉంటాడు,

త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీమన్తశ్చరో వాయురివాత్మసాక్షీ
పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ

సూర్యునిలాగ సకలలోకాలు పర్యటిస్తున్నావు, వాయువు ఎలా ఐతే అందరిలో ఉంటుందో అలాగే అందరిలో సంచరిస్తున్నావు. పరమాత్మని చేరడానికి తెలియడానికి తెలపడానికి ఆచరించాల్సిన అన్ని నియమాలను ధర్మాలను నిర్వహించడంలో నేను పరిపూర్ణుడిని అనుకుంటున్నాను గాని నిజముగా నాలో ఉన్న లోపమేమిటో చెప్పవలసింది. (నూనం - తక్కువ)

శ్రీనారద ఉవాచ
భవతానుదితప్రాయం యశో భగవతోऽమలమ్
యేనైవాసౌ న తుష్యేత మన్యే తద్దర్శనం ఖిలమ్

పరమాత్మ యొక్క గాధలను వర్ణించవలసినవిధంగా వర్ణించలేదేమో. అది అనుదితప్రాయం అంటే చెప్పలేనట్లుగానే. భగవత్ తత్వాన్ని భగవత్ తత్వంగా చెప్పలేదు. పరమాత్మను సంతోషింపలేని పని ఆ శాస్త్రం క్రియ పని వ్యర్థం.

యథా ధర్మాదయశ్చార్థా మునివర్యానుకీర్తితాః
న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః

ధర్మార్థ కామాలను వర్ణించావు గాని పరమాత్మ ప్రభావాన్ని వర్ణించలేదు.

న యద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్
తద్వాయసం తీర్థముశన్తి మానసా న యత్ర హంసా నిరమన్త్యుశిక్క్షయాః

ఎన్ని రకాల చిత్ర చిత్ర పదాలున్నా అలంకారాలున్నా కవిత్వం సకలజగత్తుని పాలించే పరమాత్మను గానంచెయ్యనట్లైతే అవి కాకులు సంచరించే ప్రదేశం. పరమాత్మ కీర్తిని గానం చెయ్యని కావ్యమును జ్ఞ్యానులు చద్వరు. మనస సరస్సులో సంచరించే హంసలు బురదగుంటలో తిరుగుతారా. ఉషిక్ - పరమాత్మ. క్ష్యయం - గృహం.

తద్వాగ్విసర్గో జనతాఘవిప్లవో యస్మిన్ప్రతిశ్లోకమబద్ధవత్యపి
నామాన్యనన్తస్య యశోऽఙ్కితాని యత్శృణ్వన్తి గాయన్తి గృణన్తి సాధవః

కవిత్వ లక్షణాలు (యతి ప్రాస చందస్సు అలంకారాలు రీతి వృత్తి) లేకపోయినా పరమాత్మ నామాలను కీర్తించుట జపించుట ధ్యానించుట చెప్పిన కావ్యాన్ని, దానిలో కావ్యలక్షణాలు లేకపోయినా అది జనాల పాపాలను పోగొట్టేవే

నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరఞ్జనమ్
కుతః పునః శశ్వదభద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణమ్

పరమాత్మమయముగా తోచని నాడు మనం చేసే పని (అలోచన, కార్యం మొ) అది నిష్కామకర్మ అయినా పరమాత్మ భావంలేకపోతే శోభించదు. భక్తి లేని జ్ఞ్యానము పనికిరాదు. నిష్కామ కర్మ అయిన పరమాత్మకు సంబంధించనిది వ్యర్థమైనప్పుడు పరమాత్మకు. మన శరీరమూ వాక్కు వేదవిహితంగా ఉంది అంటే అది మన బుధ్ధి వల్లకాదు. ఆ బుధ్ధి ఇచ్చినది పరమాత్మ. అందుకు ఆ కర్మకు సంకలంపాన్ని ఇచ్చిన మనసును అలోచింపజేసిన బుధ్ధినీ పరమాత్మకు సమర్పించాలి. మనలో భావన కలిగించేది పరమాత్మ.మనం అనుభవించాల్సిన ఫలితానికి అనుగుణమైన బుధ్ధిని ఆయనే కలిగిస్తాడు. అందుకే ఆయనకు శరీరాన్ని మనస్సును అర్పించాలి. ప్రయోజనం ఆశించని కర్మ అయిన పరమాత్మకు అర్పించకుంటే శుభప్రదం కాదు

అథో మహాభాగ భవానమోఘదృక్శుచిశ్రవాః సత్యరతో ధృతవ్రతః
ఉరుక్రమస్యాఖిలబన్ధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితమ్

ఇవి నీకు చెప్పాల్సిన అవసరంలేదు. మీరు అమోఘదృక్ - సఫలమైన జ్ఞ్యానం కలవారు. పరిశుధ్ధమైన కీర్తి కలవాడవు సత్యం మీద ప్రీతి కలవాడవు, దృతవ్రతుడివి. అన్ని వ్రతాలు ఆచరించిన వాడవు. ప్రాణులందరికీ సంసారబంధం వదలడానికి పరమాత్మ చరిత్ర తెలుపు. ప్రతీవారికి పరమాత్మ ఎలా ఉపకరిస్తున్నాడు. పరమాత్మకు మనమీద గల ప్రేమను తెలుపు. మనం చెయ్యాల్సిన పని చెయ్యకపోతే మనం పడే కష్టాలని పరమాత్మ సహించలేడు. సమాధినానుస్మర - నీ దివ్యదృష్టితో స్మరించు ఆయన చేష్టలను

తతోऽన్యథా కిఞ్చన యద్వివక్షతః పృథగ్దృశస్తత్కృతరూపనామభిః
న కర్హిచిత్క్వాపి చ దుఃస్థితా మతిర్లభేత వాతాహతనౌరివాస్పదమ్

నడిసముద్రంలో బాగా గాలివీచి అలలులేస్తుంటే పడవ ఎలా అందులో మునుగుతుందో పరమాత్మ తత్వమును కాకుండా భిన్నమైన సాంసారిక తత్వమును (ధనము మొ) ఇలాంటివాటిగురించి ఆలోచించేవాడు ఎంతటి జ్ఞ్యాని అయిన పెనుగాలికి వచ్చే పెద్ద అలలలో కొట్టుకుపోయే పడవలాంటివాడు

జుగుప్సితం ధర్మకృతేऽనుశాసతః స్వభావరక్తస్య మహాన్వ్యతిక్రమః
యద్వాక్యతో ధర్మ ఇతీతరః స్థితో న మన్యతే తస్య నివారణం జనః

సహజంగానే స్వభావాన్ని బట్టి లోకులు అధర్మాన్ని ఆచరిస్తున్నారు. జుగుప్సితమైన పని చేసే మనుషులకి, అలాంటివారికి భారతంలో ధర్మం ఆచరించమంటే వారు అధర్మాన్నే ఆచరిస్తారు. అలాంటివారిని ఎలా వారిస్తావు, ఎవరైనా ఎలా వారిస్తారు. ఒక కావ్యం చదివితే అదివరకూ వారు చేసే అధర్మాన్ని ఆపగలగాలి. నోటికిమాత్రం ఇది ధర్మాన్ని భోదిస్తున్నట్లు ఉన్నది గాని, అది చూసి వారు అధర్మాన్నే ఆచరిస్తే వారిని నివారించడం ఎలా?

విచక్షణోऽస్యార్హతి వేదితుం విభోరనన్తపారస్య నివృత్తితః సుఖమ్
ప్రవర్తమానస్య గుణైరనాత్మనస్తతో భవాన్దర్శయ చేష్టితం విభోః

నీవు వ్రాసిన మహాభారతాన్ని వివేకంగలవారు తెలుసుకోగలరు, అది జ్ఞ్యానులకే తెలియశక్యం. నివృత్తి (సర్వ కర్మ ఫల త్యాగం ) సుఖము. సంసారంలో సహజమైన సాత్విక రాజస తామస గుణాల్లో ఉండే వారికి తత్వంతెలియని వారికి (అనాత్మన: ) పరమాత్మ తత్వం చెప్పు. ఆయన అవ్యాజమైన కృప గురించిచెప్పు. ఆయన లీలలను వర్ణించు.

త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరేర్భజన్నపక్వోऽథ పతేత్తతో యది
యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తోऽభజతాం స్వధర్మతః

అన్ని ధర్మాలను కర్మఫలితాలను విడిచి నారాయణుని పాదాలని ఆశ్రయించినవాడు తనకి కలగవలసిన జ్ఞ్యానం పూర్తిగా కలగకుండా మరణిస్తే వాడు పవిత్రమైన సంపద కలవారి ఇంట్లో పుడతాడు. పరమాత్మను సేవించనివాడికి శుభమూ కలగదు. సుఖము సుఖమూ కాదు పరమాత్మని స్మరించని నాడు. దు:ఖము దు:ఖము కాదు పరమాత్మని స్మరించిననాడు

తస్యైవ హేతోః ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యధః
తల్లభ్యతే దుఃఖవదన్యతః సుఖం కాలేన సర్వత్ర గభీరరంహసా

సంపదపొందటానికి ప్రయత్నం చెయ్యకరలేదు, మన ప్రయ్త్నంలేనిదే రావు అన్నది నిజం ఐతే దు:ఖము కూడా ఎవరికి రాకూడదు ఎందుకంటే ఎవరూ దు:ఖానికి ప్రయత్నం చెయ్యరు గనక. అమిత వేగమైన కాలం కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దు:ఖం ఇస్తుంది. మన ప్రయత్నం జ్ఞ్యానం పొందాలని ధర్మాన్ని పొందాలని ఉండాలి. మిగతావి మన ప్రయత్నం లేకుండానే వస్తాయి. ఈ జన్మ పరంపరను తప్పించే ఊఅయాన్ని చెప్పు.

న వై జనో జాతు కథఞ్చనావ్రజేన్ముకున్దసేవ్యన్యవదఙ్గ సంసృతిమ్
స్మరన్ముకున్దాఙ్ఘ్ర్యుపగూహనం పునర్విహాతుమిచ్ఛేన్న రసగ్రహో జనః

ఒక్కసారి పరమాత్మ పాదసేవలో రుచి తెలిసినవాడు దాన్ని వదిలిపెడతాడా? ప్రంపంచంలో పెద్దకష్టాలలో కల్లా పెద్ద కష్టం సంసారం. ఇన్ని దు:ఖాలకి మూలమైన సంసారన్నే వదలని వాడు పరమాత్మ దొరికితే వదులుతాడా? పరమాత్మ పాద పద్మాలని ఆశ్రయించే విధానాన్ని తెలిసినవాడు మళ్ళి విడిచిపెట్టడు

ఇదం హి విశ్వం భగవానివేతరో యతో జగత్స్థాననిరోధసమ్భవాః
తద్ధి స్వయం వేద భవాంస్తథాపి తే ప్రాదేశమాత్రం భవతః ప్రదర్శితమ్

ఇవాన్నీ నీకు స్వయంగా తెలుసు. అయినా కేవలం ప్రాదేశమాత్రంగా (సూక్ష్మంగా ) చెప్పాను.

త్వమాత్మనాత్మానమవేహ్యమోఘదృక్పరస్య పుంసః పరమాత్మనః కలామ్
అజం ప్రజాతం జగతః శివాయ తన్మహానుభావాభ్యుదయోऽధిగణ్యతామ్

నీవుకూడా స్వామియొక్క అంశవే . జగాతు యొక్క కళ్యాణానికి పుట్టుకలేనివాడివైన నువ్వు పుట్టినావని తెలుసుకో. సకల జగత్తు ఎలా వృధ్ధి పొందుతుందో దానిగురించి ఆలోచించు

ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్తయోః
అవిచ్యుతోऽర్థః కవిభిర్నిరూపితో యదుత్తమశ్లోకగుణానువర్ణనమ్

మానవుడాచరించే తపస్సు శాస్త్రం ఆచరించే సత్కర్మలు అధ్యయనం చేసే వేదాలు, చేసే దానం వీటన్నిటికీ తప్పకుండా ఫలితం కలగాలంటే ఏమి చెయ్యలో పండితులందరూ చెప్పారు - పరమాత్మ యొక్క గుణాలను సంకీర్తనమే. మనచేత పరమాత్మ చేయిస్తున్నాడు అనుకుంటే వస్తుంది . ఈ కర్మల ఫలితం పరమాత్మ నామ సంకీర్తనే.

అహం పురాతీతభవేऽభవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినామ్
నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతామ్

నేను పూర్వజన్మలో వేదాలను అధ్యాయం చేసే వారి దగ్గర ఉన్న ఒక దాసీ పుత్రుడను. చిన్నవాడిగా ఉండగానే ఋషులను సేవించాను. ప్రావృషి నిర్వివిక్షతామ్ - వారు చాతుర్మాస్యంలో ఉన్నవారు.

తే మయ్యపేతాఖిలచాపలేऽర్భకే దాన్తేऽధృతక్రీడనకేऽనువర్తిని
చక్రుః కృపాం యద్యపి తుల్యదర్శనాః శుశ్రూషమాణే మునయోऽల్పభాషిణి

నేను అన్ని ఆటల మీద నుంచి మనసు పొయింది, బాల్య చాపల్యం కూడా పొయింది. అపేతాఖిల చాపలే - అన్ని చాపల్యాలు పొయాయి. అదృతక్రీడననే - ఆటలమీద నుంచి మనసు పొయింది. తుల్య దర్శన - అన్ని ప్రాణులను సమానంగా చూసే ఋషులు.

ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజైః సకృత్స్మ భుఞ్జే తదపాస్తకిల్బిషః
ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసస్తద్ధర్మ ఏవాత్మరుచిః ప్రజాయతే

వారు తిని వదిలిపెట్టిన విస్తరిలో ప్రసాదాన్ని వారి అనుమతితో స్వీకరించే అదృష్టంవల్ల ఒకటి రెండు మెతుకులు తినగానే సకల పాపాలు పోయాయి. వారివెంటనే ఉండటంతో ఆ ధర్మమంటేనే రుచిపుట్టింది.

తత్రాన్వహం కృష్ణకథాః ప్రగాయతామనుగ్రహేణాశృణవం మనోహరాః
తాః శ్రద్ధయా మేऽనుపదం విశృణ్వతః ప్రియశ్రవస్యఙ్గ మమాభవద్రుచిః

వారుపరమాత్మ కధలను మనోహరంగా గానం చేస్తుంటే విన్నాను. వారుగానం చేసే గాధలను వింటున్న నాకు ఆ భగవంతుని కధలయందే రుచి పుట్టింది.

తస్మింస్తదా లబ్ధరుచేర్మహామతే ప్రియశ్రవస్యస్ఖలితా మతిర్మమ
యయాహమేతత్సదసత్స్వమాయయా పశ్యే మయి బ్రహ్మణి కల్పితం పరే

పరమాత్మ యందు కలిగిన రుచితో ప్రపంచమనతా పరమాత్మలోనే కల్పించబడింది. ఆయనకన్నా భిన్నంగా ప్రపంచంలేదని అర్థమైంది. ఇదంతా పరమాత్మలో కల్పించబడిన మాయ అని అర్థం అయింది.

ఇత్థం శరత్ప్రావృషికావృతూ హరేర్విశృణ్వతో మేऽనుసవం యశోऽమలమ్
సఙ్కీర్త్యమానం మునిభిర్మహాత్మభిర్భక్తిః ప్రవృత్తాత్మరజస్తమోపహా

ఇలా వారు చేస్తున్న పనులని చెప్తున్న కధలను చేస్తున్న కీర్తలను విన్న నాకు పరమాత్మ  మీద భక్తి కలిగింది. నా రజో తమో గుణాన్ని జయించే భక్తి కలిగింది.

తస్యైవం మేऽనురక్తస్య ప్రశ్రితస్య హతైనసః
శ్రద్దధానస్య బాలస్య దాన్తస్యానుచరస్య చ
జ్ఞానం గుహ్యతమం యత్తత్సాక్షాద్భగవతోదితమ్
అన్వవోచన్గమిష్యన్తః కృపయా దీనవత్సలాః


ఇలా ఇంద్రియ నిగ్రం కలిగింది సంసార స్వరూపం తెలిసింది, భగవంతుని యొక్క మాయ అని అర్థం అయింది భగవంతుని మీద భక్తి కలిగింది వారి ఉచ్చిష్ట భోజనంతో పాపాలు తొలిగాయి. ఇవన్నీ ఒకదానివెంట ఒకటి కలుగగా వారికి నా మీద దయ పుట్టి, దీనవత్సలులు కాబట్టి వర్షఋస్తువు పూర్తయి బయటకు వెళ్ళేముందు భగవత్ తత్వాన్ని నాకు ఉపదేశించారు

యేనైవాహం భగవతో వాసుదేవస్య వేధసః
మాయానుభావమవిదం యేన గచ్ఛన్తి తత్పదమ్

యే జ్ఞ్యానంతో పరమాత్మ స్థానాన్ని చేరుకుంటామో దాన్ని ఋషుల బోధతో తెలుసుకోగలిగాను.


ఏతత్సంసూచితం బ్రహ్మంస్తాపత్రయచికిత్సితమ్
యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితమ్

మనకు కలిగేటటువంటి మూడు తాపములకూ సరి అయిన చికిత్స తెలుస్కున్నాను - పరమాత్మ భక్తులను సేవించడం. ఇది నాకు మహానుభావుల సేవ వలన తెలిసింది.

ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత
తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితమ్

కర్మ పరమాత్మకి అర్పిస్తే పుణ్యం. మనమే చేసామనుకుంటే పాపం.కర్మ రెండువిధాలుగా పనిచేస్తుంది. నెయ్యి ఎక్కువ తాగితే అజీర్ణం చేస్తుంది. అదే నెయ్యి మందులో వెసుకుంటే అదే అజీర్ణం పోతుంది. మందులో కలుపుకుంటే ఎలా రోగంపోతుందో - అవే కర్మలను పరమాత్మకు అర్పిస్తే పాపం ఉండదు
ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత - దేనితే ప్రాణులకు రోగం కలుగ్తుందో.
తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితమ్ - దాన్నే మందులో వాడితే రోగం కలిగించదు

ఏవం నృణాం క్రియాయోగాః సర్వే సంసృతిహేతవః
త ఏవాత్మవినాశాయ కల్పన్తే కల్పితాః పరే

యే రకంగా భుజించావో అదే ద్రవ్యాన్ని అలాగే భుజిస్తే రోగం తగ్గదు. కాని అదే పదార్ధాన్ని ఔషధంలో వేసుకుంటే రోగం తగ్గుతుంది. నీవాచరించే యే కర్మలు సంసారాన్ని ఇస్తాయో అవే కర్మలు పరమాత్మకు అర్పించినప్పుడు
త ఏవాత్మవినాశాయ కల్పన్తే కల్పితాః పరే -  అవే సంసారాన్ని తొలగిస్తాయి. అనుయోగంలో గాని వియోగంలో గాని మనసు పెట్టకపోవడం మోక్షం.

యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణమ్
జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితమ్
కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్
గృణన్తి గుణనామాని కృష్ణస్యానుస్మరన్తి చ

యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణమ్ -
భాగవతం మొత్తంలో చెప్పే విషయం నీవు చేసే పనియొక్క అసలైన ఫలితం భగవంతుని సంతోషం.
జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితమ్- పరమాత్మ ఆధీనంలో ఉన్నదైన జ్ఞ్యానం భక్తియోగంతో కూడితేనే దాన్ని జ్ఞ్యానం అంటారు.
కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్ - పరమాత్మ బోధించాడని చెప్పాడని చెయించాడనే భావంతో కర్మలు చేస్తున్నారో, భగావంతుని స్మరణతో కరమలు చేస్తారో అది ఉత్తమ కర్మ

ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ
ఇతి మూర్త్యభిధానేన మన్త్రమూర్తిమమూర్తికమ్
యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనః పుమాన్

ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ - ఈ మంత్రాన్ని వారునాకు చెప్పారు. ఇది జ్ఞ్యానం కలిగించే మంత్రం.
ఇతి మూర్త్యభిధానేన మన్త్రమూర్తిమమూర్తికమ్ - ఎలాంటి విగ్రహాన్ని లేకుండా మంత్రమే మూర్తిగా ఉన్నా ఈ మంత్రాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు

ఇమం స్వనిగమం బ్రహ్మన్నవేత్య మదనుష్ఠితమ్
అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్భావం చ కేశవః

పరమాత్మనాలో జ్ఞ్యానాన్ని భక్తి భావాన్ని ఆయిశ్వర్యాన్ని (నా మనసు ను నేను శాసించుట)

త్వమప్యదభ్రశ్రుత విశ్రుతం విభోః సమాప్యతే యేన విదాం బుభుత్సితమ్
ప్రాఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సఙ్క్లేశనిర్వాణముశన్తి నాన్యథా

నీవు కూడా పరమాత్మ కీర్తిని గుణాలను వర్ణించు. దుఃఖైర్ముహురర్దితాత్మనాం - అనేక పరితాపాలతో బాధలతో ఉన్నవారికి. సంక్లేశనివారణ అంటే భగవంతుని కీర్తిని గాణం చెయ్యలని లేదా వినాలి లేదా ధ్యానం చెయ్యలి 
సమాప్యతే యేన విదాం బుభుత్సితమ్ -జ్ఞ్యానులకి (విదాం )తెలుసుకోదగింది (బుభుత్సితమ్ ) దేనిచేత (యేన ) పూరింపబడుతుందో (సమాప్యతే ).
సఙ్క్లేశనిర్వాణముశన్తి నాన్యథా - తాపత్ర్యలాచేత కలిగే దుఖాలని తొలగించేది పరమాత్మ కధలే. బాగా చెప్పేవాడు (ఉశంతి ).

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం నాలుగవ అధ్యాయం 

వ్యాస ఉవాచ
ఇతి బ్రువాణం సంస్తూయ మునీనాం దీర్ఘసత్రిణామ్
వృద్ధః కులపతిః సూతం బహ్వృచః శౌనకోऽబ్రవీత్

సూతుడు చెప్పినది విన్న శౌనకాదులు సూతున్ని స్తోత్రం చేసి అందరిలోకల్ల వృధ్ధుడైన, కులపతి అయిన, ఋగ్వేద ఆధ్యాయి అయిన శౌనకుడు ఈ విధంగా అడిగాడు.

శౌనక ఉవాచ
సూత సూత మహాభాగ వద నో వదతాం వర
కథాం భాగవతీం పుణ్యాం యదాహ భగవాఞ్ఛుకః

చెప్పేవారందరిలో శ్రేష్టుడవైన నీవు మాకు శుకునికి పరీక్షిత్తు యేమని చెప్పాడో అలాగే మాకు వివరించండి

కస్మిన్యుగే ప్రవృత్తేయం స్థానే వా కేన హేతునా
కుతః సఞ్చోదితః కృష్ణః కృతవాన్సంహితాం మునిః

అసలు భాగవతం యే యుగంలో యే ప్రదేశంలో యే కారణం చేత యెవరు ప్రేరేపిస్తే ఈ భాగవత సం హితను చేసాడు. 

తస్య పుత్రో మహాయోగీ సమదృఙ్నిర్వికల్పకః
ఏకాన్తమతిరున్నిద్రో గూఢో మూఢ ఇవేయతే

మహాయోగి అయిన, సమదృక్ అయిన, నిర్వికల్పుడైన (ప్రకృతి మాయకు లొంగనివాడైన) నిరంతరమూ పరమాత్మ యందు లగ్నమైనవాడు, నిద్రను వీడినవాడు (నిద్ర అంటే మాయ. యేమి ఉన్నా తెలీని స్థితి) . రహస్యమైన వాడు, అన్నీ తెలిసికూడా మూఢుడిలా కనపడే శుకుడు

దృష్ట్వానుయాన్తమృషిమాత్మజమప్యనగ్నం దేవ్యో హ్రియా పరిదధుర్న సుతస్య చిత్రమ్
తద్వీక్ష్య పృచ్ఛతి మునౌ జగదుస్తవాస్తి స్త్రీపుమ్భిదా న తు సుతస్య వివిక్తదృష్టేః

వెనుక శుకున్ని పిలుస్తూ వెంట వెళ్తున్న నగ్నంగా లేని వ్యాసుడు, స్నానం చేస్తున్న దేవ కన్యలు వస్త్రంవేసుకుంటే దానికి కారణం అడిగాడు, అప్పుడు వారు 'నీకు ఆడా మగా అనే తేడా తెలుసు. నీ సుతునికి అది తెలీదు '. భేధ దృష్టే సిగ్గుని కలిగిస్తుంది. ఆ భేధం శుకునికి లేదు

కథమాలక్షితః పౌరైః సమ్ప్రాప్తః కురుజాఙ్గలాన్
ఉన్మత్తమూకజడవద్విచరన్గజసాహ్వయే

ఇలాంటి శుకున్ని పౌరులు ఎలా గుర్తుపట్టారు. ఒక పిచ్చివాడిలాగ మూగవాడిలాగ జడుడిలాగ ఉన్న శుకున్ని ఎలా గుర్తుపట్టారు.

కథం వా పాణ్డవేయస్య రాజర్షేర్మునినా సహ
సంవాదః సమభూత్తాత యత్రైషా సాత్వతీ శ్రుతిః

పరీక్షిత్తుకి  ఈయనతో సంవాదం ఎలా జరిగింది. అందులో భాగవతం ఎలా వచ్చింది

స గోదోహనమాత్రం హి గృహేషు గృహమేధినామ్
అవేక్షతే మహాభాగస్తీర్థీకుర్వంస్తదాశ్రమమ్

ఆవుపాలుపిండేంత సేపుకూడా ఉండని శుకుడు, వారి ఇళ్ళల్లోకి కూడా చూడని శుకుడు, ఆయనపాద స్పర్శతోనే తీర్థంకుర్వంతి - ఆ ఆశరమమే తీర్థమవుతుంది. అలాంటి శుకుడు ఒకే చోట ఏడురోజున్నాడంటే ఆయన పుణ్యమేమిటి

అభిమన్యుసుతం సూత ప్రాహుర్భాగవతోత్తమమ్
తస్య జన్మ మహాశ్చర్యం కర్మాణి చ గృణీహి నః

ఈ పరీక్షిత్తు మహాభాగవతోత్తముడని దీని బట్టి అర్థమవుతోంది. పరీక్షిత్తు కధకూడా చెప్పండి.

స సమ్రాట్కస్య వా హేతోః పాణ్డూనాం మానవర్ధనః
ప్రాయోపవిష్టో గఙ్గాయామనాదృత్యాధిరాట్శ్రియమ్

ఈ పరీక్షిత్తు సామ్రాట్. పండవుల గౌరవాని పెంచినవాడు సామ్రాజ్య సంపదను కాదని ఎందుకు ప్రాయోపవేశం చేసాడు.

నమన్తి యత్పాదనికేతమాత్మనః శివాయ హానీయ ధనాని శత్రవః
కథం స వీరః శ్రియమఙ్గ దుస్త్యజాం యువైషతోత్స్రష్టుమహో సహాసుభిః

తమప్రయోజనాలు నెరవేరాలని మిగతారాజులందరూ ఎవరికి వారి ధనాన్ని ఇస్తారో అలాంటి పదవిని
ఈ సంపదను అధికారాన్ని అంత చిన్న వయసులో యవన్నాన్ని, అనుయాయూలను ఎలా వదిలిపెట్టాడు.

శివాయ లోకస్య భవాయ భూతయే య ఉత్తమశ్లోకపరాయణా జనాః
జీవన్తి నాత్మార్థమసౌ పరాశ్రయం ముమోచ నిర్విద్య కుతః కలేవరమ్

తమకోసం బ్రతికేవారు విరక్తితో వదిలిపెట్టొచ్చు గాని రాజులు బ్రతికేది పరోపకరానికీ లోకశుభానికి సంపదకూ కదా. అలాంటివారు తమకోసం తాము జీవించరు. ఆయనున్నది పరాశ్రయానికి. ప్రజలకు ఇవన్నీ కలిగించే శరీరాన్ని విడువకూడదు కదా

తత్సర్వం నః సమాచక్ష్వ పృష్టో యదిహ కిఞ్చన
మన్యే త్వాం విషయే వాచాం స్నాతమన్యత్ర ఛాన్దసాత్

ఇదంతా మాకు చెప్పవలసింది. మీరులాంటి అన్ని విషాయలోనూ స్నాతకులే (తీరం చేరినవారే)

సూత ఉవాచ
ద్వాపరే సమనుప్రాప్తే తృతీయే యుగపర్యయే
జాతః పరాశరాద్యోగీ వాసవ్యాం కలయా హరేః

మూడవ ద్వాపరయుగంలో (ఎక్కడినుంచి మూడవది? బ్రమ్హసృష్టినుంచి ఇది 28వ ద్వాపరయుగం. భారత భాగవతాలు తయారయ్యినవి 28వ యుగంలో మొదలయ్యాయి. భరతుడినుండీ మనంకాలాన్ని గుణిస్తే ఇది 3వ ద్వాపరయుగం. నాలుగు యుగాలు 72 సార్లు తిరిగితే ఒక మన్వంతరం. మన్వంతరం రీత్య 28వది. 16వ మహాయుగంలో యేర్పడింది రామాయణం. భారతం 28వ మహాయుగం. 62లక్షలు ఒక మహాయుగం. రామాయణానికి భారతానికీ 12 మహాయుగాలు తేడా 62 లక్షలు * 12 సంవత్సరాల తేడా ఉంది ). పరాశర మహర్షి వలన వసు యొక్క కుమార్తే శ్రీమన్నారయుణి అంశతో వ్యాస భగవానుడు జన్మించాడు.

స కదాచిత్సరస్వత్యా ఉపస్పృశ్య జలం శుచిః
వివిక్త ఏక ఆసీన ఉదితే రవిమణ్డలే

సరవతీ నదిలో శుచి అయి ఏకాంత ప్రదేశంలో  కూర్చుని చూస్తే, )

పరావరజ్ఞః స ఋషిః కాలేనావ్యక్తరంహసా
యుగధర్మవ్యతికరం ప్రాప్తం భువి యుగే యుగే

జరిగినది జరగబోయేది తెల్సినవాడు కాబట్టి (పరావర) తెలియశక్యంకాని వేగం కల కాలంలో యుగధర్మం మారుతుండటం చూచాడు (పరమాత్మకూడా కాలచక్రాన్ని వెనక్కు తిప్పడు. )

భౌతికానాం చ భావానాం శక్తిహ్రాసం చ తత్కృతమ్
అశ్రద్దధానాన్నిఃసత్త్వాన్దుర్మేధాన్హ్రసితాయుషః

భౌతికమైన వస్తువులకు శక్తితగ్గిపోవడం చూసి (చెట్టు నీడ, కాయ పరిణామం ) మానవుల శక్తితగ్గడం చూసి, వారు అశ్రధ్ధాళువులు అశక్తిపరులు దుర్భుధ్ధి అల్పాయుస్యులు

దుర్భగాంశ్చ జనాన్వీక్ష్య మునిర్దివ్యేన చక్షుషా
సర్వవర్ణాశ్రమాణాం యద్దధ్యౌ హితమమోఘదృక్

దౌర్భాగ్యులు అయిన జనాలను చూసి దివ్య దృష్టితో చూసి సర్వవర్ణ ఆశ్రమాలవారు ఎలా హితమును పొందుతారో

చాతుర్హోత్రం కర్మ శుద్ధం ప్రజానాం వీక్ష్య వైదికమ్
వ్యదధాద్యజ్ఞసన్తత్యై వేదమేకం చతుర్విధమ్

వైదిక కర్మ ఎలా లోపించకుండా ఉండాలి అని ఒక వేదముగా ఉన్న వేదాన్ని నాలుగుభాగాలుగా చేసాడు

ఋగ్యజుఃసామాథర్వాఖ్యా వేదాశ్చత్వార ఉద్ధృతాః
ఇతిహాసపురాణం చ పఞ్చమో వేద ఉచ్యతే

అయిదవ వేదముగా ఇతిహాస పురాణాలని ఏర్పాటుచేసాడు

తత్రర్గ్వేదధరః పైలః సామగో జైమినిః కవిః
వైశమ్పాయన ఏవైకో నిష్ణాతో యజుషాముత

పైల జైమిన వైశంపాయ్నునికి ఋగ్ యజుర్ సామ వేదాలను

అథర్వాఙ్గిరసామాసీత్సుమన్తుర్దారుణో మునిః
ఇతిహాసపురాణానాం పితా మే రోమహర్షణః

అంగిరసునికి అధర్వణ వేదం. పురాణాలను మా తండ్రి అయిన రోమహర్షుణికి

త ఏత ఋషయో వేదం స్వం స్వం వ్యస్యన్ననేకధా
శిష్యైః ప్రశిష్యైస్తచ్ఛిష్యైర్వేదాస్తే శాఖినోऽభవన్

వేదాలు ఎంతమంది శిష్యులు ఉంటే అన్ని శాఖలుగా మారాయి

త ఏవ వేదా దుర్మేధైర్ధార్యన్తే పురుషైర్యథా
ఏవం చకార భగవాన్వ్యాసః కృపణవత్సలః

తక్కువ బుద్ధి ఉన్నవారు కూడా వేదాలను తెలుసుకోవడానికి ఇలాంటి విభాగాన్ని చేసాడు

స్త్రీశూద్రద్విజబన్ధూనాం త్రయీ న శ్రుతిగోచరా
కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ
ఇతి భారతమాఖ్యానం కృపయా మునినా కృతమ్

ఈ వేదాలు స్త్ర్రి శూద్రులకు బ్రహ్మబంధులకి అర్థంకావు కాబట్టి
సంసారాన్ని దాటడానికి ఉత్తమకరంతెలియక అల్లాడుతున్నవారికి దయతో మహాభారతాన్ని ఏర్పాటుచేసాడు

ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజాః
సర్వాత్మకేనాపి యదా నాతుష్యద్ధృదయం తతః

ఇలా వ్యాసభగవానుడు ఇవన్నీ చేసికూడా తృప్తి కలగలేదు.

నాతిప్రసీదద్ధృదయః సరస్వత్యాస్తటే శుచౌ
వితర్కయన్వివిక్తస్థ ఇదం చోవాచ ధర్మవిత్

ధృతవ్రతేన హి మయా ఛన్దాంసి గురవోऽగ్నయః
మానితా నిర్వ్యలీకేన గృహీతం చానుశాసనమ్

భారతవ్యపదేశేన హ్యామ్నాయార్థశ్చ ప్రదర్శితః
దృశ్యతే యత్ర ధర్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత

సరస్వతీ నదీ తీరంలో కూర్చిని తర్కించసాగాడు

తథాపి బత మే దైహ్యో హ్యాత్మా చైవాత్మనా విభుః
అసమ్పన్న ఇవాభాతి బ్రహ్మవర్చస్య సత్తమః

ఇన్ని చేసినా ఈ ఆత్మలో పరమాత్మ వచ్చి చేరినట్లు అనిపించలేదు. భగవంతుడు సంతోషించినట్లు లేదు

కిం వా భాగవతా ధర్మా న ప్రాయేణ నిరూపితాః
ప్రియాః పరమహంసానాం త ఏవ హ్యచ్యుతప్రియాః

యతులకు సన్యాసులకు ఇష్టమైన భాగవత ధర్మాలు చెప్పలేదేమొ అనుకున్నాడు

తస్యైవం ఖిలమాత్మానం మన్యమానస్య ఖిద్యతః
కృష్ణస్య నారదోऽభ్యాగాదాశ్రమం ప్రాగుదాహృతమ్

ఇంతచేసి నా మనసుకూ పరమాత్మకూ తృప్తిలేదని బాధ పడుచుండగా నారద మహర్షి ఆ ఆశ్రమానికి వచ్చాడు

తమభిజ్ఞాయ సహసా ప్రత్యుత్థాయాగతం మునిః
పూజయామాస విధివన్నారదం సురపూజితమ్

లేచి ఎదురేగి అథిది మర్యాదలతో పూజించాడు.

Sunday, November 18, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం మూడవ అధ్యాయం

సూత ఉవాచ
జగృహే పౌరుషం రూపం భగవాన్మహదాదిభిః
సమ్భూతం షోడశకలమాదౌ లోకసిసృక్షయా

యస్యామ్భసి శయానస్య యోగనిద్రాం వితన్వతః
నాభిహ్రదామ్బుజాదాసీద్బ్రహ్మా విశ్వసృజాం పతిః

యస్యావయవసంస్థానైః కల్పితో లోకవిస్తరః
తద్వై భగవతో రూపం విశుద్ధం సత్త్వమూర్జితమ్

పశ్యన్త్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరుభుజాననాద్భుతమ్
సహస్రమూర్ధశ్రవణాక్షినాసికం సహస్రమౌల్యమ్బరకుణ్డలోల్లసత్

అదబ్ర చక్షుషా: ఇది దోషంలేని కంటితో చూస్తారు. ఈయననే అనిరుధ్ధ తత్వం అంటారు. వాసుదేవ ప్రద్యుమ్న అనిరుధ్ధ్ సంకర్షణ. అనిరుధ్ధ తత్వమే అన్ని అవతారాలకీ మూలం. నిధానం భీజం అవ్యయం.

ఏతన్నానావతారాణాం నిధానం బీజమవ్యయమ్
యస్యాంశాంశేన సృజ్యన్తే దేవతిర్యఙ్నరాదయః

దేవతలూ మానవులు దానవులు అందరూ ఈ అనిరుధ్ధునిలో సహస్రాశం.

స ఏవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః
చచార దుశ్చరం బ్రహ్మా బ్రహ్మచర్యమఖణ్డితమ్

మొదటిసృష్టి సనకాదులు. వారు పుట్టగానే 5 యేళ్ళ పిల్లల ఆకారంతో ఉన్న
అరు. కాని పెద్దవారనుకునే వారందరికన్న ముందు పుట్టినవారు. వీరే మొదటి సృష్టి. బ్రహ్మచర్యంతోటి ఇతరులెవ్వరూ ఉపాసించలేని పరమాత్మను వారు ఉపాసించారు

ప్రతీ అవతారానికి ఒక ప్రయోజనం ఉంది. సనకాదుల అవతారం పరిపూర్ణమైన విరక్తిని బ్రహ్మచర్యాన్ని ఆచరించి చూపారు. వయసు కాలం సౌకర్యం మనసు బుధ్ధి పెరిగినా వాటి వికారాలను పడకుండా ఉండటానికి పరబ్రహ్మ ఉపాసనే మార్గమని చూపారు

ద్వితీయం తు భవాయాస్య రసాతలగతాం మహీమ్
ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః

రెండొవది వరాహం. వరాహం అంటే : వర + అహం. అహం అంటే రొజు. వర అంటే మంచి... నీటిలోంచి భూమిని తీసినరొజు కాబట్టి అది మంచి రోజు. మనువు సృష్టి జరిగితే వచ్చిన వారెక్కడ ఉండాలి అని అడిగితే ఆలోచించిన బ్రహ్మగారికి తుమ్ము వచ్చి ఆ తుమ్ములోంచి ఒక చిన్న వరాహం ఉద్భవించింది.  ఈ వరాహం అంటే మంచి రోజు అని అర్థం. వరాహానికే సూకరం అని కూడా పేరు. సూకరానికి మూలం సుకరం. అలాంటి అతి దుష్కరమైన పనిని సుకరం చేసాడు కాబట్టి సుకరం అని పేరు. భూమి వచ్చిన తరువాత భూమిమీద మొదలు రాలినవి యజ్ఞ్య వరాహ మూర్తి రోమాలు. అవే ధర్భాలు (కుశములు). యజ్ఞ్యం పితృశార్దం ఎలా చెయ్యాలో నేర్పిన అవతారం.
స్వామి హిరణ్యాక్షున్ని వధించాడు. హిరణ్యమంటే బంగారం. అక్షములు అంటే ఇంద్రియములు. బంగారానికి మారు పేరు వ్యామోహం. హిరణ్యాక్షుడు ఇంద్రియవ్యామోహానికి ప్రతీక. పితృదేవరాధన యజ్ఞ్యములు చెయ్యకపోవడానికి ఇంద్రియ వ్యామోహమే కారణం. భగవదారాధనను కూడ ఇంద్రియవ్యామోహం మింగేస్తుంది.

తృతీయమృషిసర్గం వై దేవర్షిత్వముపేత్య సః
తన్త్రం సాత్వతమాచష్ట నైష్కర్మ్యం కర్మణాం యతః

తృతీయం దేవర్షి సృష్టి. నారదుడు పాంచరాత్ర ప్రవర్తకుడు.దానికే సాత్వత తంత్రమని పేరు. అఖిల జ్ఞ్యానములకు, ధర్మాలకు యోగాలకి మూలం ఈ పాంచరాత్ర తంత్రం. భగవదారాధనను ఎల చెయ్యాలి. దేవాలయాల్లో ఇంట్లో ఒంట్లో ఉన్న మూర్తిని ఎలా ఆరాధించాలో చెప్పిన అవతారం. అర్చకుడు సృష్టిన్యాసం స్థితిన్యాసం లయన్యాసం చేస్తారు. తరువాత పరమాత్మ శిరస్సు నుండి పాదముల వరకూ న్యాసం చేసుకోవాలి. భగవంతుని ఆరాధించే వారు వారే భగవంతుడు కావాలి. అందుకే కృష్ణ పరమాత్మకు కుబ్జకు పుట్టిన ఉప్శ్లోకుడు నారదుని నుంచి పాంచరాత్రం నేర్చుకుని పాంచరాత్రసమ్హిత వ్రాశాడు.

తుర్యే ధర్మకలాసర్గే నరనారాయణావృషీ
భూత్వాత్మోపశమోపేతమకరోద్దుశ్చరం తపః

ధర్ముడనే ప్రజాపతికి దక్షుని కుమార్తే మూర్తికి కలిగిన వారు నర నారాయణులు. వీరు తపస్సు ఎలా చెయ్యాలో గురు శుశ్రూష ఎల చెయ్యాలో నేర్పారు. సహస్రకవచుడనే రాక్షసున్ని వధించారు. ఒకరు తపస్సు చేస్తుంటే ఒకరు యుధ్ధం చేస్తూ ఒక్కోకవచాన్ని తొలగించి వాడిని సమ్హరించారు. నిరంతరం ఆత్మకు కవచంగా ఉండేదే శరీరం. కోరికలే కవచాలు. ఒకరు నరుడుగా (గురువుగా) నారాయణుడుగా (పరమాత్మగా) అవతరించారు. అలాగే మనం కూడా గురువుని పరమాత్మని సేవించాలి.

పఞ్చమః కపిలో నామ సిద్ధేశః కాలవిప్లుతమ్
ప్రోవాచాసురయే సాఙ్ఖ్యం తత్త్వగ్రామవినిర్ణయమ్

అయిదవ అవతారమైన కపిలావతారం. తల్లి అయిన దేవహూతికి సాంఖ్య శాస్త్రముని భోధించాడు. ఈయన పరమ సిధ్దుడు

షష్ఠమత్రేరపత్యత్వం వృతః ప్రాప్తోऽనసూయయా
ఆన్వీక్షికీమలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్

అనసూయాత్రులకు సంభవించిన ఆరవ అవతారం దత్తుడు మూడు అంశలతో ముగ్గురు పుత్రులు జన్మించారు. ఈయన అలర్క మహర్షికి పరమవేదాంత తత్వాన్ని భోధించారు. పరశురామునికి కార్తవీర్యార్జునికి కూడా దత్తుడే గురువు. (కార్తవీర్యార్జుడు సహస్రబాహువు. ఆయన రాజ్యంలో ఇళ్ళకు ప్రజలు తలుపులు పెట్టుకోలేదు. ఆయన స్మరణతో పోయిన వస్తువు దొరుకుతుంది, మన ఎదురుగా వచ్చిన కౄర మృగం కూడా వెనుదిరుగుతుంది. ఆయన కోరిక ప్రకారం పరశురాముడిగా వచ్చి ఈయనని సమ్హరిస్తాడు)
దత్తుడు యోగనిధి. ధ్యానయోగాన్ని బాగా ప్రచారంచేసి అది అయోగ్యులకు అందకుండా ఉండేందుకు ఆయన సురాపానం చేస్తున్నట్లుగా అయోగ్యులకు కనపడతారు. పరశురామునికి కూడా ఇలాగే దర్శనమిచ్చారు మొదట. యోగమును అనర్హులకు అందచెయ్యకూడదు అది ఆయుధాలని అందరికీ అమ్మినట్లు. యెంతో మందికి తత్వం చెప్పిన అవతారం దత్తాత్రేయావతారం

తతః సప్తమ ఆకూత్యాం రుచేర్యజ్ఞోऽభ్యజాయత
స యామాద్యైః సురగణైరపాత్స్వాయమ్భువాన్తరమ్

స్వాయంభువ మన్వంతారాని దక్షిణ యజ్ఞ్యుల రూపంలో వీరు పరిపాలించారు. ప్రతీ మన్వంతరంలోను మనువు మనుపుత్రులు ఇంద్రుడు దేవతలూ సప్తఋషులు పరమాత్మ అవతారమూ ఉంటుంది. ఈ ఆరు ప్రతీ మన్వంతరంలోనూ ఉండాలి. స్వాయంభువ మన్వంతరంలో పరమాత్మ అవతారం యజ్ఞ్య. ఆకుతికి రుచికి పుట్టాడు. యామాద్యైః సురగణై - ఆ మన్వంతరంలో దేవతలకు యాములు అని పేరు. ఇంద్రుడిపేరు యామ, ఆ మన్వంతరంలో

అష్టమే మేరుదేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః
దర్శయన్వర్త్మ ధీరాణాం సర్వాశ్రమనమస్కృతమ్

నాభి అనే ప్రజాపతికి మేరు దేవితో కలిగినవాడు ఋషభుడు. ఈయన యోగమును ప్రవర్తింపచేసినవాడు. ఈయన నడవడి అర్థంచేసుకోని వాళ్ళకు అనాచారమే ఆచారంగా మారే ప్రామాదం ఉంది. భరతునికి రాజ్యపట్టభిషేకం చేసి వానప్రస్తాశ్రమమాని వెళ్ళి ఆజగరంగా కొన్నాళ్ళు కొన్నాళ్ళు రక్తవస్త్రం కొన్నాళ్ళు కౌపీనంతో శికతో కొన్నాళ్ళూ లేకుండా కొన్నాళ్ళు, యే ఒక్క దానిమీద ఆదరంతో కాకుండా ఆయన దేహ యాత్ర కొనసాగించారు. నేనునాది అన్న భావలతో సంభందంలేకుండా ప్రవర్తించాడు. సర్వశ్రేష్ట: అయం ఋషభ.

ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః
దుగ్ధేమామోషధీర్విప్రాస్తేనాయం స ఉశత్తమః

పార్ధ: అంటే పృధు చక్రవర్తి. ఈయన పరిపాలించడంవల్ల భూమికి పృధ్వి అని పేరువచ్చింది. భూమిలో ఎత్తుపల్లాలు సవరించి, నీళ్ళు నిలవ ఉండటానికి కొన్నిచోట్ల పల్లంగా ఉంచాడు. ఈయన భూమినుంచి ఔషధులను పిండాడు. ఉశత్తమ: అంటే లోపల ఉండేదాన్ని బయటకు తెచ్చినవాడు

రూపం స జగృహే మాత్స్యం చాక్షుషోదధిసమ్ప్లవే
నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుమ్

మత్స్యముగా అవతరించి సత్యవ్రతునికి మత్స్యపురాణాన్ని భోధించారు.

సురాసురాణాముదధిం మథ్నతాం మన్దరాచలమ్
దధ్రే కమఠరూపేణ పృష్ఠ ఏకాదశే విభుః

ధాన్వన్తరం ద్వాదశమం త్రయోదశమమేవ చ
అపాయయత్సురానన్యాన్మోహిన్యా మోహయన్స్త్రియా

క్షీరసాగరమధనంలో మూడూవతారాలున్నాయి. అమృతాన్ని తీసుకొచ్చిన ధన్వంతరి, కూర్మం, మోహిని. అమృతాన్ని ఎలా సేవించాలో చెప్పాడు ధన్వంతరి. అమృతాన్ని దొంగిలించాలనుకున్న రాక్షసుల

చతుర్దశం నారసింహం బిభ్రద్దైత్యేన్ద్రమూర్జితమ్
దదార కరజైరూరావేరకాం కటకృద్యథా

కశ్యపం అంటే పరుపు. పరుపు భోగానికి సంకేతం. దాన్ని పరమాత్మ చేతులతో చీలచాడు. చేతులతో అంటే కర్మలతో. ఉత్తమకర్మాలాచరించినపుడే భోగవ్యామోహం పోతుంది.
హిరణ్యకశిపుడు భోగవ్యామోహం హిరణ్యాక్షుడు ఇంద్రియవ్యామోహం. ఈ రెండిటినీ కర్మల వలన కలిగిన సంస్కారంతో తొలగించుకోవాలి. ఉత్తమకాలం వచ్చినప్పుడు ఇంద్రియవ్యామోహం ఉత్తమ కర్మలతో భోగవ్యామోహం పోతుంది

పఞ్చదశం వామనకం కృత్వాగాదధ్వరం బలేః
పదత్రయం యాచమానః ప్రత్యాదిత్సుస్త్రిపిష్టపమ్

స్వర్గం ఇంద్రునికి ఇవ్వడానికి వామనావతారం వచ్చింది. త్రివిష్టపం. తిర్కరణముల (కాయ వాచ మనస) చేత చేసిన కర్మలవలన పుణ్యాన్ని అనుభవించే స్తానానికి త్రివిష్టపం అని పేరు. అనుభవించేప్పుడు నాది నేను అనే భావన లేనంతకాలం ఆ అనుభవం మన దగ్గర ఉంటుంది

స్వర్గం ఇంద్రునికి ఇవ్వడానికి వామనావతారం వచ్చింది. త్రివిష్టపం. తిర్కరణముల (కాయ వాచ మనస) చేత చేసిన కర్మలవలన పుణ్యాన్ని అనుభవించే స్తానానికి త్రివిష్టపం అని పేరు. అనుభవించేప్పుడు నాది నేను అనే భావన లేనంతకాలం ఆ అనుభవం మన దగ్గర ఉంటుంది. వామనావతారం ధర్మసూక్ష్మాన్ని భోదించే అవతారం.

బలికి పరమాత్మ ఇచ్చిన రసాతలం నైమిత్తిక ప్రళయంలో కూడా ఉంటుంది. బ్రహ్మగారికి నూరు సంవత్సరాలు వచ్చేవరకూ ఆ లోకం ఉంటుంది.

అవతారే షోడశమే పశ్యన్బ్రహ్మద్రుహో నృపాన్
త్రిఃసప్తకృత్వః కుపితో నిఃక్షత్రామకరోన్మహీమ్

భూమిమీద ఉండే క్షత్రియులని సమ్హరించి ధర్మాన్ని నెలకొల్పడానికి పరశురామావతారం.

తతః సప్తదశే జాతః సత్యవత్యాం పరాశరాత్
చక్రే వేదతరోః శాఖా దృష్ట్వా పుంసోऽల్పమేధసః

కలియుగమ్రాబోతోంది అని బుధ్ధి తగ్గటాన్ని చూసి వేదాలని పురాణాలని విభాగం చేసి లఘువుగా అందించారు.

నరదేవత్వమాపన్నః సురకార్యచికీర్షయా
సముద్రనిగ్రహాదీని చక్రే వీర్యాణ్యతః పరమ్

శ్రీ రామచంద్రుడు నరుడుగా వచ్చి సముద్రాన్ని నిగ్రహించి వారధి యేర్పాటు చేసి దుష్టులని శిక్షించాడు. కృష్ణావతారంలో అగ్నిని నిగ్రహించాడు.

ఏకోనవింశే వింశతిమే వృష్ణిషు ప్రాప్య జన్మనీ
రామకృష్ణావితి భువో భగవానహరద్భరమ్

బలరామకృష్ణులుగా వృష్ణి వంశంలో పుట్టి పరమాత్మ  భూమి భారాన్ని హరించాడు.

తతః కలౌ సమ్ప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్
బుద్ధో నామ్నాఞ్జనసుతః కీకటేషు భవిష్యతి

బుద్ధుడు అవతారం కాదని చాలా మంది చెప్తారు. ఆయన కూడా అవతారమే. రాక్షసులను మోహింపచేయడానికి వచ్చిన అవతారం. యజ్ఞ్య యాగాదులని ఆచరిస్తూ పరస్త్రీలని పరధనాన్ని హరిస్తూ ఉన్నవారిచేత యజ్ఞ్య యాగాదులని మాంపించాలని, అవన్నీ ధర్మంకాదని వార్ని నమ్మించి అవన్నీ వృధా అని వారిచేత ధర్మాన్ని మాంపించడానికి అధర్మాని ఆచరింపచేసి నశింపచెయ్యడానికి బుధ్ధుడు అవతరించాడు

అథాసౌ యుగసన్ధ్యాయాం దస్యుప్రాయేషు రాజసు
జనితా విష్ణుయశసో నామ్నా కల్కిర్జగత్పతిః

దస్యుప్రాయేషు రాజసు: రాజులందరూ దొంగలైనప్పుడు దొంగలలాగ వ్యవహరించినప్పుడు భూభారన్ని తొలగించడానికి వచ్చే అవతారం కల్కి

అవతారా హ్యసఙ్ఖ్యేయా హరేః సత్త్వనిధేర్ద్విజాః
యథావిదాసినః కుల్యాః సరసః స్యుః సహస్రశః

పరమాత్మ అవతారాలు అసంఖ్యేయం. జగత్తుని పరిపాలించడం ఆయన విధికాబట్టి అవతారాన్ని స్వీకరిస్తాడు. మహాసముద్రమ్నుంచి కాలువలు (కుల్యా:) తీస్తే ఎన్నీవుతాయో అలాంటివి ఆయన అవతారాలు

ఋషయో మనవో దేవా మనుపుత్రా మహౌజసః
కలాః సర్వే హరేరేవ సప్రజాపతయః స్మృతాః

ఋషులు మనువులు దేవతలు ప్రజాపతులు ఇలా భూభారన్ని తొలగించడానికి ఉన్న పరమాత్మ రూపం అంతా పరమాత్మ అంశ.

ఏతే చాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్స్వయమ్
ఇన్ద్రారివ్యాకులం లోకం మృడయన్తి యుగే యుగే

ఈ అవతారాలన్నీ అంశావతారాలు. కానీ కృషుడు సాక్షాత్ భగవంతుడే. అనిరుధ్ధుడే కృష్ణుడుగా వచ్చాడు. అన్ని నామాలకంటే కృష్ణనామం ఎంతో మధురం. రాక్షసులచేత కలత పడిన ధర్మాన్ని ప్రాణులని రక్షించడానికి భగవంతుండు అవతరిస్తాడు

జన్మ గుహ్యం భగవతో య ఏతత్ప్రయతో నరః
సాయం ప్రాతర్గృణన్భక్త్యా దుఃఖగ్రామాద్విముచ్యతే

ఈ మూడవ అధ్యాయాయాన్ని, పరమాత్మ అతిరహస్యమైన జన్మని రోజూ సాయం ప్రాత: కాలంలో నోటితో కీర్తిస్తూ(గృణన్) భక్తితో చదువుకుంటే అసలు జీవితంలో ఆపదలే రావు.

ఏతద్రూపం భగవతో హ్యరూపస్య చిదాత్మనః
మాయాగుణైర్విరచితం మహదాదిభిరాత్మని

అసలుస్వామ్య్ అరూపం. జ్ఞ్యాన స్వరూపుడు. అవతారాలు ఆయన్ రూపాలుగా భావించాలి
ఇవన్నీ మాయగుణాలతో యేర్పరచిన రూపాలే గాని అసలు రూపం నిరాకారం నిర్గుణం

యథా నభసి మేఘౌఘో రేణుర్వా పార్థివోऽనిలే
ఏవం ద్రష్టరి దృశ్యత్వమారోపితమబుద్ధిభిః

పరమాత్మ గుణం/రూపం ఉన్నవాడా లేనివాడా? మేఘములు ఆకాశంలో ఉన్నాయి. భూమి ఉన్నదే ఆకాశంలో. పెద్దగాలికి వచ్చే దుమ్ము భూమియొక్క రేణువులే. కాని ఆ దుమ్ముని గాలికి ఆపాదిస్తున్నాం. ఆ దుమ్ముకి గాలి ఆధారం అనుకుంటాం. నిరాకారమైన గాలిలో ఎమీ ఉండదు. గాలి కేవలం విడదీస్తుంది. అలాగే ఆకాశం అంటే శూన్యం. మబ్బులు ఉంటే అది ఆకాశం కాదు. చూచేవాడెప్పుడూ చూడబడే వాడుకాడు. పరమాత్మ ద్రష్ట. ప్రపంచం దృశ్యం. ఆత్మ ద్రష్ట శరీరం దృష్యం. చూడబడెది చూచేది కాదు. చూచేది చూడబడే వాడు కాడు. ఇది బుధ్ధిలేని వాళ్ళు ఆరోపించేది.

అతః పరం యదవ్యక్తమవ్యూఢగుణబృంహితమ్
అదృష్టాశ్రుతవస్తుత్వాత్స జీవో యత్పునర్భవః

మరి జీవత్మ ఎవరు: ఎవరైతే మళ్ళి మళ్ళి పుడతారో అదే జీవాత్మ. అది అవ్యక్తం . అవ్యక్తంలోకి జీవుడూ వస్తాడు పరమాత్మ వస్తాడు. కానీ మనం కర్మ బద్దులం. పరమాత్మ రావడానికి కూడా మన కర్మే కారణం. అది ఆయననే రప్పిస్తుంది. పోవడానికి మాత్రం ఆయనకు ఇష్టం కారణం మనకు కర్మ కారణం. గుణములన్ని కలిస్తేనే ప్రకృతి. జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు గుణములచే యేర్పరచబడ్డాయి. జీవుడు మాటిమాటికి పుడుతుంటాడు. యేది అవ్యక్తంగా ప్రకృతిగా కనపడుతుందో అదే తాను అనుకుంటాడు.
విడిగా ఉన్న గుణాలు ఒకటిగా చేరి మళ్ళి విడిగా చేస్తాడు అదే సృష్టి. విరుధ్ధమైన రెండు తత్వాలు కలిస్తేనే సృష్టి. సమానాంశలు పెడితే ప్రళయం.

యత్రేమే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వసంవిదా
అవిద్యయాత్మని కృతే ఇతి తద్బ్రహ్మదర్శనమ్

జ్ఞ్యానికి ఈ రెండు రూపలు ఒకటే. ఉనికీ లేదు లేమీ లేదు. ఉనికిలేదు అంటే లేమిలేనట్లైనా అయ్యి ఉండాలి. లేమిలేదు అంటే ఉనికిలేకుండా ఉండాలి. మరి ఇదేంటి. ఎప్పుడూ కనపడనిదానిని లేమి అంటాం. ఎప్పుడూ కనపడని దానినుండే కనపడేవన్నీ పుట్టాయి. అంటే మన బుధ్ధిచేత ఇంద్రియాలచేత మనస్సుచేత మన ఊహకు అందని ఒక పదార్ధం. రూపంలేనిదల్లా లేదని అనగలమా? రూపంలేని వాయువు వలన రూపం ఉన్న అగ్ని వచ్చిన్. కనపడని ప్రతీది లేదనడం కనపడే ప్రతీది ఉన్నది అనడం తప్పు. ఉంటే ఎపూడూ ఉండాలి. లేకుంటే ఎప్పుడూ లేదు. పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. ఆకారంలేదు కాబట్టి లేదనడం తప్పు. ఆకారంలేకుండా ఉండి ఆకారమున్న వాటి సృష్టికి మూఅలం అయినవాడు ఉన్నవాడా లేనివాడా?
అవిద్యతో మాయతో మన ఆత్మతో ఇవన్నీ కలిపిస్తున్నాము.

యద్యేషోపరతా దేవీ మాయా వైశారదీ మతిః
సమ్పన్న ఏవేతి విదుర్మహిమ్ని స్వే మహీయతే

ఎప్పుడైతే యోగమాయ తొలగిపోతుందో (ఉపరత:) అప్పుడు జ్ఞ్యానం కలుగుతుంది. విశ్రాద: కలపడాన్ని ఇచ్చేది సమూహాత్మక జ్ఞ్యానన్ని ఇచ్చేది శారద. భేదంలో అభేధాన్ని చూపుతుంది శారద. శారదా అంటే జ్ఞ్యాన స్వరూపం. విడిగా ఉన్నదానిలో ఐక్యతని చూపుతుంది. శరీరాలు వేరైన శరీరాల్లో ఉండే ఆత్మతత్వం ఒక్కటే. ఎవరు యే శరీరంలోకి వచ్చాడో ఆ గుణం వస్తుంది. ఆ శరీరంతో చేసే పనిని శరీరికి కల్పిస్తాం మాయతో. ఈ మాయ తొలగిపోతే అప్పుడు మనం ఉన్నవాళ్ళం. పరమాత్మ ఉన్నడనితెలిస్తే మనం ఉన్నవాళ్ళం అవుతాం. పుట్టుకలేని పరమాత్మ ఇన్ని తీరులుగా పుట్టాడు.

ఏవం చ జన్మాని కర్మాణి హ్యకర్తురజనస్య చ
వర్ణయన్తి స్మ కవయో వేదగుహ్యాని హృత్పతేః

పుట్టుకలేని స్వామికి ఇన్నిపుట్టుకలు కర్తగాని స్వామికి ఇన్ని కార్యములు. ఇలాంటివాటిని జ్ఞ్యానులు వర్ణిస్తారు. మనకున్న మోహాన్ని తొలగించడానికి మనం భావించే రూపంతో వచ్చి మనం చేసే కర్మలు చేసి. మన కర్తృత్వాన్ని తొలగించడానికి ఆయన కర్మలు చేస్తున్నాడు. మనకు పుట్టుకలేకుండా చెయ్యడానికి ఆయన జన్మ స్వీకరిస్తున్నాడు. మనం ఏమీ చెయని వాళ్ళం అని తెలుసుకోవాలంటే ఆయనే అన్నీ చేస్తున్నాడని తెలుసుకోవాలి. మనకి జ్ఞ్యానం కలిగించడానికి మోక్షమివ్వడానికి వస్తాడు.

స వా ఇదం విశ్వమమోఘలీలః సృజత్యవత్యత్తి న సజ్జతేऽస్మిన్
భూతేషు చాన్తర్హిత ఆత్మతన్త్రః షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశః

పరమాత్మని తెలుసుకోవాలంటే లేనిదాంట్లో ఉన్నదాన్ని చూడాలి. జ్ఞ్యాన విషయాన్ని చూచుట అంటాం (ఉదా రుచి చూచుట).
పరమాత్మ సృష్టించడానికి ఆయన లీల (ఆట) కావాలి, కానీ ఆయన ఆ ఆటని ఆకాంక్షతో ఆడడు. ఈ జగత్తుని ఆయనే సృష్టించి రక్షించి కాపాడతాడు. మనం ఎక్కడ కూర్చున్న గంధంతో వచ్చే వాయువు వస్తుంది. వాసన చూసిన తరువాత సువాసనను దుర్వాసననూ మన ఇష్టంలేకుండానే గ్రహిస్తాం, మన ఇష్టం పని చెయ్యనప్పుడు మనకి తెలియకుండా మన ఇచ్చలేకుండా వచ్చే దానిమీద మనసు ఎందుకుపెడతాం. మనసు  పెట్టనివాడు పరమాత్మ. శబ్ద స్పర్ష రూప రస గంధం బుధ్ధి - ఈ ఆరింటిని, వీటిద్వారావచ్చే విషయాలని,మనచేతిలో లేని విషయాల్ని మనసు లగ్నం చెయ్యకుండా ఇచ్చినా దన్ని ఇచ్చినట్లు స్వీకరిస్తే జ్ఞ్యాని. దానిలో ఇష్టాద్వేషాలు లేకుండా స్వీకరించాలి

న చాస్య కశ్చిన్నిపుణేన ధాతురవైతి జన్తుః కుమనీష ఊతీః
నామాని రూపాణి మనోవచోభిః సన్తన్వతో నటచర్యామివాజ్ఞః

ఈ పరమాత్మ లీలలు ఎలా ఉంటాయో కుమనీషులు (చెడ్డ బుధ్ధి కలవాడు) తెలుస్కోజాలడు
అస్య ఊతీ: ఈ దుష్టబుధ్ది కలవాడు తార్కిక బుధ్ధితో పరమాత్మ లీలలల్ను తెలుసుకోలేడు. నాటకంలో నటుడికి యే రూపముందో, నటుడిని కాకుండా ఆ పాత్రగురించి చెప్తాడు, నటించేవారి నామ రూప్పలను మాటలను గ్రహించాడని అనుకుంటాడు.

స వేద ధాతుః పదవీం పరస్య దురన్తవీర్యస్య రథాఙ్గపాణేః
యోऽమాయయా సన్తతయానువృత్త్యా భజేత తత్పాదసరోజగన్ధమ్

పరమాత్మ ఒక్కొక్క ఆయ్ధానికి ఒక్కొక్క ప్రాముఖ్యముంది. పరమాత్మ రధాంగపాణి. ఆయన చక్రం జ్ఞ్యానానికి ప్రతీక. దురన్తవీర్యస్య - ఆయన ప్రతాపం ఎవరికీ తెలీదు.  పరమాత్మ మాయను ఎవరు సంతతమూ స్వచ్చమైన కపటమైన భక్తి కలిగి ఉంటారో వారు తెలుస్కుంటారు. అందుకే భోజనంచేసేప్పుడు ప్రతీ ముద్దకీ ఒక్కో నామం చెప్పి తీసుకోవాలి. ద్వాదశ నామాలతో (కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూధన, త్రివిక్రమ, వామన, ష్ర్రిధర, హృషికేష, పద్మనాభ, దామోధర)పన్నేండు ముద్దలు తినాలి.) అంటే సంతత అన్వృత్తి కావాలి. అప్పుడు పరమాత్మ మాయను దాటవచ్చు.

అథేహ ధన్యా భగవన్త ఇత్థం యద్వాసుదేవేऽఖిలలోకనాథే
కుర్వన్తి సర్వాత్మకమాత్మభావం న యత్ర భూయః పరివర్త ఉగ్రః

సూతుడు శౌనకులతో - మీరంతా ధన్యులు. ఆయనకు ఆత్మార్పణం చేస్తున్నరు, అన్ని భావములూ ఆయనయందు ఉంచుట వలన మీరు ధన్యులు. దీని వల్ల భయంకరమైన జనన మరణ సంసార చక్రం (పరివర్త) రాదు.

ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసమ్మితమ్
ఉత్తమశ్లోకచరితం చకార భగవానృషిః

మీ ప్రశ్నలు నా సమాధానాలు కలిపితే భాగవతం. ఆయన ధ్యానం, అవతారాలు  లీలలు అన్నీ కలిపి భాగవతం అంటారు. కృష్ణపరమాత్మ తన తేజస్సును భాగవతంలో నిక్షేపం చేసాడు. ఈ భాగవతమే వేదం. ఈ పరమాత్మ చరిత్రని ఋషులు లోకక్షేమం కోసం అందించారు

నిఃశ్రేయసాయ లోకస్య ధన్యం స్వస్త్యయనం మహత్
తదిదం గ్రాహయామాససుతమాత్మవతాం వరమ్

అన్ని శుభాలకు ఇది నిలయం. సకలలోకశ్రేయస్సుకు అందించిన భాగవతం జ్ఞ్యానులలో శ్రేష్టుడైన శుకునికి వ్యాసుడు పాఠంగా చెప్పాడు.

సర్వవేదేతిహాసానాం సారం సారం సముద్ధృతమ్
స తు సంశ్రావయామాసమహారాజం పరీక్షితమ్

దీనికన్నా ముందు యేమేమి ఉన్నాయో (వేద ఇతిహాస ) వాటి సారానికి సారం ఈ భాగవతం. ఇది సారానికే సారం.  శుకుడు పరీక్షిత్తునికి చెప్పాడు.

ప్రాయోపవిష్టం గఙ్గాయాం పరీతం పరమర్షిభిః
కృష్ణే స్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ

పరీక్షిత్తు గంగాతీరంలో ప్రాయోపవేశానికి కూర్చున్నాడు . ఆహారం అన్ని వికారాలకి మూలం. ఆ ఆహరాన్ని వదిలేసి ప్రాయోపవేశం చేశాడు. కృష్ణుని అవతార పరిసమాప్తితో ధర్మ జ్ఞ్యానాలు కూడా పోయాయి

కలౌ నష్టదృశామేష పురాణార్కోऽధునోదితః
తత్ర కీర్తయతో విప్రా విప్రర్షేర్భూరితేజసః

కలి ఆగమనంతో జ్ఞ్యానం పోయింది (నష్ట దృశా). భాగవతమనే సూర్యుడు ఇప్పుడు వచ్చాడు (అధునా ఉదిత:).

అహం చాధ్యగమం తత్ర నివిష్టస్తదనుగ్రహాత్
సోऽహం వః శ్రావయిష్యామి యథాధీతం యథామతి

శుకుడు పరీక్షిత్తుకి చెబుతుంటే అక్కడ నేను కూడా ఉన్నాను. అక్కడే ఉన్నాను కాబట్టి ఆయన అనుగ్రహంతో పొందాను. విన్నదాన్ని విన్నట్టు మళ్ళీ చెప్పాలంటే గుర్వనుగ్రహం గుర్వాదేశం ఉండాలి. నేను ఆయన నుంచి ఇదంతా పొందాను. గురువు వినయశీలుడు కాకపోతే శిష్యులు అహంకారపూరితులవుతారు. అందుకే యథాధీతం యథామతి : అంటే నా గుర్వనుగ్రహంతో నా బుధ్ధికి తోచినంత మీకు చెప్తాను.

Saturday, November 17, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం రెండో అధ్యాయం

రెండవ అధ్యాయం
శౌనకాది ఋషులు సూతున్ని ఆరు ప్రశ్నలు అడిగారు ఆరు అన్నదాని షడూర్ములు (జననం మరణం క్షుత్ పిపాస మోహం శొకం), షడ్భావ వికారాలు (పుట్టుట ఉనికి పెరుగుట తరుగుట మారుట నశించ్హుట పుట్టినవాటికి తప్పకుండా ఉండేవి), అరిషడ్వర్గాలు (కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు)
ఇవన్నీ కలిపితే పద్దెనిమిది. మహాభారతం అంతా పద్దెనిమిదే. ప్రపంచమంతా యే పద్దెనిమిది చుట్టు ఉన్నదో ఆ పద్దెనిమిదే భారతం.
వ్యాస ఉవాచ
ఇతి సమ్ప్రశ్నసంహృష్టో విప్రాణాం రౌమహర్శణిః
ప్రతిపూజ్య వచస్తేశాం ప్రవక్తుముపచక్రమే

రోమహర్షణుడి పుత్రుడు సూతుడు. చకాగా అడిగీనందు వల్ల బాగా సంతోషించినా సూతుడు వారు పలికిన ఆ మాటలను మన్నించి బాగా చెప్పడానికి (ప్రవక్తుం) మొదలుపెట్టాడు
గురుస్మరణ పూర్వకాన్ని ప్రవచనం అంటారు. గురువుని స్మరించి మాట్లాడుట
అందుకే సూతుడు కూడా తన గురువుగారిని గానం చేస్తున్నాడు. పరీక్షిత్తునికి సూతుడు చెప్తున్నప్పుడు వచ్చి విన్న వాళ్ళలో ఈ సూతుడుకూడా ఉన్నాడు
సూత ఉవాచ
యం ప్రవ్రజన్తమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ
పుత్రేతి తన్మయతయా తరవోऽభినేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోऽస్మి

యం ప్రవ్రజన్తమనుపేతమపేతకృత్యం: శుకుని ప్రత్యేకత అనుపేతం. యే ఒక్కడి దగ్గరకీ ఆయన విద్యకోసం వెళ్ళలేదు. అనుపేతం అనే దానికి ఉపనయనం అవ్వకుండా అని కూడా ఉంది అర్థం. కాని అది పూర్తిగా నిజం కాదు. శుకుడు పుట్టగానే శంకరుడు వచ్చి యజ్ఞ్యోపవీతం వేసారు. శుకునికి తండ్రే గురువు. కానీ ఆయన ఎవ్వరినీ ఆశ్రయించలేదు. అందుకే అనుపేతం. అనుపేతంగానే ప్రవ్రజంతం. యే ఉపదేశంలేకుండానే సన్యాసం తీసుకున్నాడు. ఎందుకంటే అపేతకృత్యం. ఈయన చెయ్యవలసిన పనులేమీ లేవు. శుకుడు కృతకృత్యుడు - చెయ్యవలసినవేమీ లేని వాడు
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ: పుతృఎతి తన్యమతయా: వ్యాసుడు పుత్రుడని విరహంతో పిలవగా
అన్నిప్రాణుల హృదయంలోకి వెళ్ళగలవాడైన ఆయంకి నమస్కరిస్తున్నను
ఇక్కడ అభినేదు: అని మునిం అంటున్నాడు. ప్రతిద్వనించాడు బదులిచ్చాడు అయినా మౌనంగా ఉన్నాడు.
యః స్వానుభావమఖిలశ్రుతిసారమేకమధ్యాత్మదీపమతితితీర్షతాం తమోऽన్ధమ్
సంసారిణాం కరుణయాహ పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనామ్

గురువు ఎలాంటి వారంటే - స్వానుభావం అంటే తన ప్రభావన్ జ్ఞ్యానం విధానం ఇలాంటి వాటిని 'అఖిల శ్రుతి సారం'. పరమాత్మ స్వరూపం అఖిల శ్రుతిసారం. తమోగుణంతో సంసారాన్ని దాటలేనివారికి ఇది ఆధ్యాత్మ దీపం. అతి తితీర్షతాం - కటిక చీకటిని దాటలేని వారికి. అలాంటి సంసారులకు దయతో రహస్యమైన పురాణం. ఇది రహస్యమైన పురాణం ఎందుకంటే ధర్మమును ధర్మంగానే ఆచరించాలని చెప్పే పురాణం. ఇది ధర్మం గబట్టి  ఆచరించమని చెప్పే పురాణం. అటువంటి వ్యాససూనుడైన శుకునికి నమస్కరిస్తున్నాను.

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్

భారతానికి జయం అనే పేరు. అంతే కాదు పురాణ సరాన్ని జయం అంటారు. జయ అంటే 18. పది ఇందిర్యములతో అష్టప్రకృతిని గెలుచుట.

మునయః సాధు పృష్టోऽహం భవద్భిర్లోకమఙ్గలమ్
యత్కృతః కృష్ణసమ్ప్రశ్నో యేనాత్మా సుప్రసీదతి

శిష్యులు మంచి మాట లోకమంగళమైన మాట అడిగారని, యే ప్రశ్నతో భగవానుడు సంతోషితాడో అది అడిగారని సూతుడు ...

స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే
అహైతుక్యప్రతిహతా యయాత్మా సుప్రసీదతి

జీవుడికి ఉత్తమధర్మమేదంటే దేనివల్ల పరమాత్మ మీద భక్తి కలుగుతుందో అది ఉత్తమ ధర్మం. పరమాత్మ మీద భక్తి కలగడమే అది కూడా అహైతుకీ భక్తి, కారణంలేని భక్తి కావాలి. అది అప్రతిహతంగా ఉండాలి. దేనివల్ల అది కలుగుంతుందో అది ధర్మం. దాని వల్ల ఆత్మ ప్రసన్నమవుతుంది. ఆత్మ హాయిగా ఉంటుంది.

వాసుదేవే భగవతి భక్తియోగః ప్రయోజితః
జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకమ్

పరమాత్మ యందు భక్తి కలిగితే ఎమవుతుంది? అది వైరాగ్యాన్ని కలిగిస్తుంది. జ్ఞ్యానం కూడా కలుగుతుంది. అది ప్రయోజనం కాంక్షించని జ్ఞ్యానం. స్వరూపవిరోధి వుప్పాయ విరోధి ఫలవిఋఓధి అని విరోధి త్రయం. నేను స్వతంత్రున్ని అనుకోవడం స్వరూపవైరోధి.నన్ను ఎవరో కాపడతారనేది ఉపాయ విరోధి. మోక్షాన్ని చేరడంవల్ల మనకి ఆనందం కలుగుతుంది అనేది ఫలవిరోధి. అహమన్నం - మనం అన్నం వంటి వారం. మనల్ని భుజిచేది పరమాత్మ. ఇలాంటి విరోదులు తొలగడమే అహైతుకీ జ్ఞ్యానం

ధర్మః స్వనుష్ఠితః పుంసాం విష్వక్సేనకథాసు యః
నోత్పాదయేద్యది రతిం శ్రమ ఏవ హి కేవలమ్

ఒకవేళ ఆచరించిన ధర్మం పరమాత్మకోసం కాకుంటే భక్తిని కలిగించడానికి కాకుంటే దానివల్ల ఆయసమే తప్ప ఏమి లేదు. నిజంగా ధర్మం ఆచరిస్తే భగవంతుని కధ వినాలి అనిపించే కోరిక కలగలేదంటే యెన్ని ధర్మాలు ఆచరించినా ఫలం లేదు

ధర్మస్య హ్యాపవర్గ్యస్య నార్థోऽర్థాయోపకల్పతే
నార్థస్య ధర్మైకాన్తస్య కామో లాభాయ హి స్మృతః

ధర్మానికి ఎప్పుడూ అర్థం ప్రయోజనం కాదు. ఎందూంటే అర్థం శాశ్వతం కాదు. మోక్షం ప్రాసిదించే ధర్మానికి అర్థం ప్రయోజనం కాదు. ధర్మము నశించంది శాశ్వతమైనది. నశించని ధర్మానికి నశించే అర్థం ఫలితం కాదు. ధర్మం వల్ల అర్థం వచ్చినా ధర్మం అర్థం కొరకు కాదు. ధర్మం మోక్షం కొరకు. ధనము లభించింది అంటే అది ధర్మాచరణ కొరకే. అర్థం కలిగేది దిగులు లేకుండా ధర్మాన్ని ఆచరించడానికి. యే వ్యవస్థ అయిన ధర్మాచరణకే. ధర్మం మోక్షం కోసమే.

కామస్య నేన్ద్రియప్రీతిర్లాభో జీవేత యావతా
జీవస్య తత్త్వజిజ్ఞాసా నార్థో యశ్చేహ కర్మభిః

ఇంద్రియప్రీతి కామానికి ప్రయోజనంకాదు. బ్రతికున్నంతకాలం అనుభవించినా తృప్తి కలగదు. నిజముగా తృప్తి కలిగితే సంసారం ఇంతకాలం ఉండదు. మనమాచరించే కర్మతో జీవునికి తత్వం తెలుసుకోవాలనే భావం కలగదు. దేన్ని ఆచరించుటవలన్ తత్వజిజ్ఞ్యాస కలుగుతుందో అది కర్మ. అంతవరకూ అవి కర్మలు గావు. జీవాత్మ పరమాత్మ తత్వాన్ని తెలుకోవాలని కోరిక కలిగించంత కాలం అది ధర్మమూ కాదు. ఆచరించేవాటిలో నేను నాది అనేది విడిచిపెట్టడమే ధర్మము.

వదన్తి తత్తత్త్వవిదస్తత్త్వం యజ్జ్ఞానమద్వయమ్
బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే

మరి తత్వం అని దేన్ని అంటారు. రెండుగా లేని జ్ఞ్యానాన్ని అంటారు. యేకమేవాయ అద్వితీయం బ్రహ్మా. పరమాత్మ ఒక్కడే. ఆయనను పొందడమే స్వరూపం. దానికి కవల్సిన ధర్మాన్ని అచరించుటే ధర్మము. ఆయానను సేవించడమే ధర్మము, సేవించడం మీద కామం, సేవించడానికే అర్థం. ఆ పరమాత్మనే బ్రహ్మ అని భగవనుడని పరమాత్మ అని అంటారు. పరమాత్మ ఒక్కడు అని తెలుసుకోవడమే తత్వం. ఆ జ్ఞ్యానం కలిగితేనే అది ధర్మం

తచ్ఛ్రద్దధానా మునయో జ్ఞానవైరాగ్యయుక్తయా
పశ్యన్త్యాత్మని చాత్మానం భక్త్యా శ్రుతగృహీతయా

ఇది అందరికీ కలగదు. మునులకి కలుగుతుంది. మునులంటే నిరంతరం భగవంతున్ని స్మరణ చేస్తుండేవాళ్ళు. పరమాత్మను మననం చెయ్యడానికి ఉండే సాధన మౌనం... జ్ఞ్యానవైరాగ్యములు కూడుకున్న భక్తితోనే పరమాత్మని చేరవగలము. మునులు ఆత్మలోనే ఉన్న పరమాత్మని చూస్తారు.

అతః పుమ్భిర్ద్విజశ్రేష్ఠా వర్ణాశ్రమవిభాగశః
స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణమ్

వర్ణవిభాగానుకూలంగా ఆశ్రమవిభాగలకనుకూలంగా చెప్పబడిన ధర్మాలను ఆచరించాలి. చక్కగా ఆచరించిన ధర్మం యొక్క సిధ్ధి ఎమిటంటే హరితోషణం - పరమాత్మ సంతోషం.
తస్మాదేకేన మనసా భగవాన్సాత్వతాం పతిః
శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యశ్చ నిత్యదా

యేకాగ్రమైన మనసుతో పరమాత్మ గురించే వినాలి, కీర్తించాలి, ధ్యానించాలి, పూజించాలి.
యదనుధ్యాసినా యుక్తాః కర్మగ్రన్థినిబన్ధనమ్
ఛిన్దన్తి కోవిదాస్తస్య కో న కుర్యాత్కథారతిమ్

అలా చేస్తే అహంకారం మమకారం అనే కర్మ గ్రంధిని జ్ఞ్యానులు ఛేదిస్తారు. ఇటువంటి పరమాత్మ కధలయందు ప్రీతి కలగని వారెవరు?
శుశ్రూషోః శ్రద్దధానస్య వాసుదేవకథారుచిః
స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థనిషేవణాత్

మహానుభావులని సేవించాలనే కోరిక కలగడంవల్ల, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల లాభం వాసుదేవుని కధ మీద రుచి పుడుతుంది.
మన మన్సుల్లో పరమాత్మ కధలపై ప్రీతి కలగాడానికి మార్గం ఎమిటి? పర్మాత్మ కధలు వినాలి అని బుధ్ధి పుట్టలి అన్నా కొన్ని పాపాలు పోవాలి. పాపాలలో కూడా మూడురకాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది ప్రకృతిమీద ప్రీతి. అది సంసారం తప్ప మరి దేన్నీ చూడనివ్వదు. ఇంకోరకమైన పాపం - సంసారమ్మీద ప్రీతి ఉన్న్నా అప్పుడప్పుడు గుడికి వెల్దాం అనిపిస్తుంది. మూడవది రెండవది పుణ్యతీర్థాలను సేవించాలి అనే బుధ్ధి కలగడం. దాని వల్ల పెద్దలని సేవించాలి అనే బుధ్ధి కలుగుతుంది.

శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణకీర్తనః
హృద్యన్తఃస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతామ్

తనకధలను వింటున్నటివంటి వారి హృదయంలో ప్రవేశిస్తాడు పరమాత్మ. మహానుభావులచేత గానం చెయ్యబడే వాడు, మహానుభావులచేత శ్రవణం చెయ్యబడతాడు తన కథ వినేవారి హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న పాపాలను యేరిపారేస్తాడు. ఎందుకంటే ఆయన సుహృత్ సతాం కనుక. అంటే మన ఇంటికి వచ్చి మనైంటిని శుభ్ర పరుస్తాడు.
నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవతసేవయా
భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ

నిత్యం భాగవతసేవ చెయ్యడంవల్ల పరమాత్మ పాపలను తొలగిస్తాడు. ఉత్తములచేత కీర్తిచబడె పరమాత్మ మీద నిష్ట తో కూడిన భక్తి కలుగుతుంది
తదా రజస్తమోభావాః కామలోభాదయశ్చ యే
చేత ఏతైరనావిద్ధం స్థితం సత్త్వే ప్రసీదతి

అది కలగగానే మనసులో ఉన్న గుణాల్లో రజస్తమో భావలు - కామలోభాలు - పరమాత్మ అనుగ్రహంవల్ల ఈ భావలతో మురికిపడదు. ఇవి తొలగిన తరువాత మన్సౌ సత్వంలో ఉంటుంది.

ఏవం ప్రసన్నమనసో భగవద్భక్తియోగతః
భగవత్తత్త్వవిజ్ఞానం ముక్తసఙ్గస్య జాయతే

అప్పుడు ప్రశాంతమైన మనసు కలిగితుంటాడు పరమాత్మ భక్తి కలగడంవల్ల. అలాంటివారికి, సామసారిక విషయములయందు సంగం వదిలినవాడికి పరమాత్మ తత్వం అంటే యెమిటో తెలుస్తుంది

భిద్యతే హృదయగ్రన్థిశ్ఛిద్యన్తే సర్వసంశయాః
క్షీయన్తే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే

సంసారనికి మనకీ వేసిన ముడి - ప్రకృతిసంబంధం. ఎంతకాలం నేను నాది అంటూ ఉంటామో శరీరమే ఆత్మ అనుకోవడం హృదయగ్రంధి. అది ఉన్నంతవరకూ నీటిల్లో బుడగల్లాగ పుట్టేది మరణం కోసమే. ఆ హృదయానికి ఉన్న ముడి చేదించబడుతుంది అంటే అహంకారం పోతుంది.  ఎప్పుడైతే సంశయాలు పోయాయో అప్పుడు చెయ్యవలసిన కర్మలేవీ ఉండవు. చేసిన కర్మలన్నీ తొలగాలంటే సందేహాలు తొలగాలి. సందేహాలు తొలగాలంటే అహంకారం తొలగాలి. ఇదంతా ఎప్పుడు తొలుగుతుంది అంటే ఆత్మ రూపుడైన పరమాత్మ సాక్షత్కారం కలిగిన నాడు. అప్పుడు అహంకారం తొలుగుతుంది. దానివల్ల సంశయాలు పోతాయి. వాటివల్ల కర్మ నశిస్తుంది, అప్పుడు హృదయగ్రంధి చేధింపబడుతుంది

అతో వై కవయో నిత్యం భక్తిం పరమయా ముదా
వాసుదేవే భగవతి కుర్వన్త్యాత్మప్రసాదనీమ్

కవి అంటే ఇక్కడ జ్ఞ్యానులు. వారందరూ పరమాత్మ యందు భక్తి కలిగి ఉంటారు. ఎలంటి భక్తి పరిపూర్ణమైన ఆనందంతో భక్తి కలిగి ఉంటారు. భక్తి కలిగి ఉండటమే మనసును ప్రసన్నంగా ఉంచుతుంది -ఆత్మప్రసాదిని.

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్గుణాస్తైర్యుక్తః పరమపురుష ఏక ఇహాస్య ధత్తే
స్థిత్యాదయే హరివిరిఞ్చిహరేతి సంజ్ఞాః శ్రేయాంసి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః

ఎవరిమీద భక్తి కలగాలి? ప్రకృతి ఏర్పడింది అంటే దానిలో గుణాలుంటాయి. ఆ గుణాలను పరమాత్మ స్వీకరించి ఆయా గుణాల కార్యాలను చేస్తారు. యే పని చేస్తున్నప్పుడు ఆ గుణం తీసుకుంటాడు. ఆగుణాలతో కూడి ఉన్న పరమాత్మ ఒక్కడే. ఆయనే మూడు గుణాలతో మూడు కర్మలను చేస్తున్నడు.
'శ్రేయాంసి తత్ర ఖలు సత్త్వతనోర్నృణాం స్యుః' మనమిప్పుడు ఎవరిని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది. మనం యే రూపమున్న స్వామిని సేవిద్దాం? మన శ్రేయస్సు సాత్వీకమైన ఆరాధన్ చేస్తేనే.

పార్థివాద్దారుణో ధూమస్తస్మాదగ్నిస్త్రయీమయః
తమసస్తు రజస్తస్మాత్సత్త్వం యద్బ్రహ్మదర్శనమ్

యెలాగైతే భూమినుంచి కట్టే కట్టే నించి పొగ పొగ నుంచి మంట వస్తాయో పరమాత్మ తత్వము నుండే ప్రకృతివస్తుది. దానినుంచే ముగ్గురు మూర్తులు వస్తారు. త్రయీమయి అంటే వేదం. ఇలాంటి అగ్ని హోత్రం పొగ నుంచే వస్తుంది. ఆ అగ్ని కట్టె నుంచి వస్తుంది

భేజిరే మునయోऽథాగ్రే భగవన్తమధోక్షజమ్
సత్త్వం విశుద్ధం క్షేమాయ కల్పన్తే యేऽను తానిహ

ఇంతకు ముందు మునులు ఎవరిని సేవించారో ఆ అధోక్షజుడుని సేవించు. ఇంద్రియాలను వాటివల్ల పుట్టిన వ్యాపారలను తగ్గించే వాడు అధోక్షజుడు. విశుద్దమైన సత్వగుణం క్షేమాని కల్పిస్తుంది. అది అనుసరించేవారు కూడా క్షేమంగా ఉంటారు

ముముక్షవో ఘోరరూపాన్హిత్వా భూతపతీనథ
నారాయణకలాః శాన్తా భజన్తి హ్యనసూయవః

మోక్షమ్యందు కోరిక ఉన్నవారు శ్రీమన్నారయణున్ని సేవించాలి. అసూయలేకుండా సేవించాలి. అసూయ అంటే ఇతరదేవతా నిందలేకుండా సేవించాలి.

రజస్తమఃప్రకృతయః సమశీలా భజన్తి వై
పితృభూతప్రజేశాదీన్శ్రియైశ్వర్యప్రజేప్సవః

వారిమనస్సులో ఎలాంటి భావముంటే అలాంటివారిని సేవిస్తాం. ఇతరదేవతలని ఎందుకు ఆరాదిస్తారు: పితృదేవతలని భూతపతిని ప్రజాపతిని - సంపదను శాసకత్వం సంతానాన్ని కావలంటే వారిని ఆరాధిస్తారు

వాసుదేవపరా వేదా వాసుదేవపరా మఖాః
వాసుదేవపరా యోగ వాసుదేవపరాః క్రియాః
వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరం తపః
వాసుదేవపరో ధర్మో వాసుదేవపరా గతిః

అన్నివేదాలు, యాగాలు, యజ్ఞ్యాలు, క్రియలు, మనకి కలిగే జ్ఞ్యానం, తపస్సు, ఆచరించే ధర్మం, మనకి లభించే దిక్కు గతి కూడా వాసుదేవపరమే

స ఏవేదం ససర్జాగ్రే భగవానాత్మమాయయా
సదసద్రూపయా చాసౌ గుణమయాగుణో విభుః

అటువంటి పరమాత్మ ప్రళయమవ్వగానే ఆత్మమాయతో ప్రపంచాన్ని సృష్టించారు. ఆ మాయ సత్ అసత్ రూపం. ప్రళయకాలంలో ఉన్నది లేదు అన్న వ్యవహారమే లేదు. ఉండేది ఎప్పుడూ ఉంది కాని ప్రళయంలో చూసే వాడే లేడు చెప్పేవాడే లేడు. అందుకే సత్ అసత్ లేదు. పరమాత్మ మాయ సత్ అసత్ రూపం. ఉన్నట్టూ లేనట్టు కనపడేది. 'నేను చెప్పినదే సిద్ధాంతం'అని ఎవ్వరూ చెప్పలేరు. ఇది పరమాత్మ మాయ. ఈ మాయ గుణమయి. కాని పరమాత్మకి గుణముండదు. గుణం కలిగిన మాయ చేత యే గుణములు లేని పరమాత్మ సృష్టిస్తాడు.

తయా విలసితేష్వేషు గుణేషు గుణవానివ
అన్తఃప్రవిష్ట ఆభాతి విజ్ఞానేన విజృమ్భితః

మాయా ప్రభావం వలన మూడు గుణాలు వ్యాపిస్తాయి... ఆ గుణాలలో స్వామి ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించి తన విజ్ఞ్యానంతో విజృంభించి ఆ గుణములు పరమాత్మకే ఉన్నాయా అనిపిస్తాడు. కాని ఆయన విజృంభించేది ప్రకాశించేది ఆయాన విజ్ఞ్యానంతోనే. జ్ఞ్యానం ఉన్నచోట మాయ పనిచెయ్యదు.
పరమాత్మ మాయచేత విజృంభించిన గుణత్రయములో గుణములులేని తాను ప్రవేశించి తన విజ్ఞ్యానంతో సర్వత్ర వ్యాపించి సృష్టికార్యం జరిపి వేరే వారికి పరమాత్మే గుణవంతుడూ అనిపిస్తాడు. తను మాత్రం నిర్గుణుడుగా విజ్ఞ్యానమయుడుగా ఉంటాడు.

యథా హ్యవహితో వహ్నిర్దారుష్వేకః స్వయోనిషు
నానేవ భాతి విశ్వాత్మా భూతేషు చ తథా పుమాన్

నిప్పు కట్టెలలో (దారుషు) ఉంటుంది. యే కట్టెలోనైనా ఒకటే నిప్పు. కానిప్రతీ కట్టెలో విడివిడిగా కనపడుతుంది. తనకు కారణమైన కట్టెలలో విడివిడిగా కనపడే అగ్నిలాగ అన్ని ప్రాణులలో ఉండే పరమాత్మ చాలా మందిలా అనిపిస్తాడు (నానేవ భాతి)

అసౌ గుణమయైర్భావైర్భూతసూక్ష్మేన్ద్రియాత్మభిః
స్వనిర్మితేషు నిర్విష్టో భుఙ్క్తే భూతేషు తద్గుణాన్

పంచ్భూతములు పంచజ్ఞ్యానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచతన్మాత్రలు అన్నీ ప్రకృతినుంచే పుట్టాయి. గుణమయములైన భావాలతో ఉన్న వీటిలోకి ప్రవేశించి యే గుణమూ కోరికా వికారం లేని వాడు అన్నిటినీ అనుభవిస్తున్నట్లు కనపడతాడు.

భావయత్యేష సత్త్వేన లోకాన్వై లోకభావనః
లీలావతారానురతో దేవతిర్యఙ్నరాదిషు

ఈ పరమాత్మే అన్ని లోకాలను సృష్టిస్తాడు రక్షిస్తాడు సమ్హరిస్తాడు. ఈయన భూతభావన్ - అన్నిలోకాలను నిలిపేవాడు. తానే ఆయా గుణములతో చేరి తన లీలగా పరమాత్మ అనేక అవతారాలు స్వీకరిస్తాడు. ఆయా గుణాలని స్వీకరించినట్లు కంపిస్తాడు. పరమాత్మ దేవతలుగా పశుపక్షాదులుగా మనుషులుగా అవతరిస్తాడు. ప్రతీ ప్రాణిలో తానే ఉంటాడు అన్నీ తానే అనుభవిస్తున్నట్లు కనిపిస్తాడు.

Friday, November 16, 2012

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం ప్రధమాధ్యాయం

ధర్మః ప్రోజ్ఝితకైతవోऽత్ర పరమో నిర్మత్సరాణాం సతాం
వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమ్
శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః
సద్యో హృద్యవరుధ్యతేऽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్

ఇతర అన్ని గ్రంధములకంటే భాగవతానికున్న వైశిష్ట్యం ఇందులో కపటం ఉండదు. ప్రోజ్జిత - అంటే మిక్కిలి విడవబడిన. భగవంతుని కోరినవాడు మోక్షాన్ని కూడా కోరడు. శ్రీమన్నారాయణుని కథ వినడమే పురుషార్థం.
నిర్మత్సరాణాం - ఎదుటివారి అభివృధ్ధి సహించకపోవడం మాత్సరం. పరోత్కర్ష అసహనం

నిర్మత్సరాణాం - ఎదుటివారి అభివృధ్ధి సహించకపోవడం మాత్సరం. పరోత్కర్ష అసహనం
వేద్యం వాస్తవమత్ర వస్తు - ఇది తెలుస్కోవలసినది. తెలుస్కుంటే సుఖం కలుగుతుంది.
సంస్కృతంలో ఖం అంటే ఇంద్రియం. సుఖం అంటే మంచి ఇంద్రియం. అంటే భగవంతుని విషయాలను ధ్యానించడం. సుఖం కలుగుతుంది అంటే మంచి ఇంద్రియం అవుతుని. అంటే చెయ్యకూడని వాటిని చెయ్యవు
తాపత్రయోన్మూలనమ్ - దీనివల్ల మూడు రకాల తాపత్రయాలు తొలిగిపోతాయి
శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః
నారాయణుడు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు భాగవతం. ఇక్కడ మహాముని అంటే నారాయణుడు. ఆయనే వ్యాసునిగా అవతరించి భాగవతాన్ని 18000 శ్లొకాలుగా అందించాడు.
ఈ భాగవతం ఉండగా కిం వా పరైరీఇశ్వరః. తక్కిన వాటితో పనేంటి
దాని వల్ల ఫలం ఎమిటంటే
సద్యో హృద్యవరుధ్యతేऽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్
పరమాత్మ వచ్చి హృదయంలో చేరతాడు. వినానలనే కోరిక కలిగి చెప్పేవారిమీద గౌరవంతో వినాలి. ఆ భావనే శుశ్రూష. ఆ భావన ఉంటే పరమాత్మ హృదయంలో ఉంటాడు.
భక్తి మంత్రం మీదా ఉండాలి మంత్రం పర్తిపాదించే దైవం మీద ఉండాలి గురువు మీద కూడా ఉండాలి


నిగమకల్పతరోర్గలితం ఫలం
శుకముఖాదమృతద్రవసంయుతమ్
పిబత భాగవతం రసమాలయం
ముహురహో రసికా భువి భావుకాః


ప్రతివారి చేతిలో ఉండే పండూ ఈ భాగవతం. బాగా తీయగా ఉన్న పండునే చిలుక పొడుస్తుంది. అలాంటి చిలుక (శుకుడు) కొట్టిన పండు భాగవతం. ఇది చెట్టునుండి పడినపండు కాదు, జారిన పండు. ఈ ఫలం మన చేతుల్లోకి రాగానే రసం అయ్యింది. మామూలుగా పండులో మనం చాలా భాగం పారేసి రసం తాగుతాం. కానీ ఈ భాగవతం అనే పండే రసం అయ్యింది. 'గలితం ఫలం శుకముఖాదమృతద్రవసంయుతమ్ పిబత భాగవతం రసం'
రసమాలయం - లయం అంటే మోక్షం. మోక్షంలో కూడా భాగవతం వినాలి చదవాలి. మోక్షంలో కూడా ఇడే చేస్తాం.
ముహురహో రసికా భువి భావుకాః
రసమును భావన చేసే వాళ్ళు. భగవంతుని భావించడమే బలం. రసికా అంటే పరమాత్మ యొక్క రసమును తెలుసుకుని భావించేవాళ్ళు.
భాగవతం శ్రోత్రమనోభిరామం. వినడానికి కూడా బాగుంటుంది.

నైమిషేऽనిమిషక్షేత్రే ఈశయః శౌనకాదయః
సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసత

యాగం వంద సంవత్సరాలు దాటితే సత్రం అంటాం. పది దాటితే యజ్ఞ్యం సంవత్సరం దాటితే యాగం నెల్లల్లో చేస్తే హోమం అంటాం.ఒక్క రోజులో చేస్తే ఇష్టి అంటాం. ఋషులకు బ్రహ్మగారు తపస్సుకు చూపించిన స్థలం నైమిషం. వరాహావతారంలో హిరణ్యాక్షుని సైన్యాన్ని వరాహమూర్తి ఒక్క నిముషంలో 92 కోట్ల రాక్షసులని సమ్హరించిన ప్రదేశం.  ఇక్కడ స్వర్గాయ లోకాయ అంటే వైకుంటం అని అర్థం.
త ఏకదా తు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః
సత్కృతం సూతమాసీనం పప్రచ్ఛురిదమాదరాత్

మునులందరూ ప్రాత: కాలంలో హవిస్సులన్నీ ఇచ్చి  సూతున్ని బాగా సత్కరించి ఆదరించి ఈ విధంగా అడిగారు
ఋషయ ఉవాచ
త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ
ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత

మీరు అన్ని పురాణాలను చదివారు చెప్పారు (ఆఖ్యాతాని అపి అధీతాని)
యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్బాదరాయణః
అన్యే చ మునయః సూత పరావరవిదో విదుః


వేత్థ త్వం సౌమ్య తత్సర్వం తత్త్వతస్తదనుగ్రహాత్
బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత

వేదవ్యాసునినికి ఇతర ఋషులకి ఎంత తెలుస్లో నీకు అంతా తెలుసు. వ్యాస మహర్షి తెలుస్కున్నవి ఆయన దయతో నీవు తెలుసుకున్నావు. ఉత్తుడైన స్నేహశీలి అయిన ఆచార్యుడు శిష్యులు అడగకనే చెప్తారు
తత్ర తత్రాఞ్జసాయుష్మన్భవతా యద్వినిశ్చితమ్
పుంసామేకాన్తతః శ్రేయస్తన్నః శంసితుమర్హసి

మీరు ఆయా సందర్భాలలో పెద్దగా ప్రయాస పడకుండా మానవులందరికి ఇది శ్రేయస్సు కలిగిస్తుందో. అది కూడా సులభంగా  (తర తర అంజసా భవతా )  శ్రేయస్సుని కలిగిస్తుందో అది చెప్పండి. ఒక్క శ్రేయస్సుమాత్రమే కలగాలి (యేకాంత:) .
ప్రాయేణాల్పాయుషః సభ్య కలావస్మిన్యుగే జనాః
మన్దాః సుమన్దమతయో మన్దభాగ్యా హ్యుపద్రుతాః

కలియుగంలో మానవులంతా అల్పాయుష్యులు. పొట్టివాళ్ళు (మందా: ) నిత్యం ఉపద్రవం ఉండే వాళ్ళు.
భూరీణి భూరికర్మాణి శ్రోతవ్యాని విభాగశః
అతః సాధోऽత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా

చేయవలసిన ధర్మాలు కర్మలు పెద్దవి ఉన్నవి. వినవలసినవి విభాగం ప్రాక్రం చాలా ఉన్నవి. వాటి సారం నీ బుద్ధితో వెలికి తీసి (సముద్ధృత్య ) మాకివ్వు
బ్రూహి భద్రాయ భూతానాం యేనాత్మా సుప్రసీదతి
శ్రధ్ధగా మేము వింటాం దానివల్ల పరమాత్మ ప్రసన్నుడవుతాడు
సూత జానాసి భద్రం తే భగవాన్సాత్వతాం పతిః
దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా

అవన్నీ నీకు తెలుసు, నీకు శుభం కలుగు గాక. సకల వేద శాస్త్ర ఇతిహాస సారమంటే వసుదేవునివాల్ల దేవికి యందు పరమాత్మ కుమారుడిగా పుట్టి యేమి చేశారు, యేమి చెయాలనుకుని పుట్టాడో
తన్నః శుష్రూషమాణానామర్హస్యఙ్గానువర్ణితుమ్
యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ

మిమ్మల్ని శుష్రూష చేస్తున్నా మాకు వివరించతగినవాడవు. ఆ అవతారం సకల భూతముల క్షేమానికి సుఖానికి పనికొచ్చేది
ఆపన్నః సంసృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్
తతః సద్యో విముచ్యేత యద్బిభేతి స్వయం భయమ్

సంసారంలో పడి పెద్ద ఆపదలో ఉన్న మానవుడు పరమాత్మ నామనును అనుకోకుండా(వివశ:) ధ్యానం చేసినా విముక్తుడవుతాడో అలాంటివాడు కూడా సంసారంలోంచి విముక్తుడవుతాడు. ఎలాంటివాడిని చూస్తే భయం కూడా భయపడుతుందో
యత్పాదసంశ్రయాః సూత మునయః ప్రశమాయనాః
సద్యః పునన్త్యుపస్పృష్టాః స్వర్ధున్యాపోऽనుసేవయా

యే పరమాత్మ పాదాలను ఆశ్రయించిన్ మునులు ఒక్క సారి స్పృశిస్తేనే తక్కినవారందరూ గంగా స్నానం చేసిన వారిలాగ పవిత్రులవుతారో.

కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్యకర్మణః
శుద్ధికామో న శృణుయాద్యశః కలిమలాపహమ్

అపవిత్రంగా ఉన్నతాను పవిత్రంకావలనుకుని భగవానుని కధను వినని వాడెవడు.
తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభిః
బ్రూహి నః శ్రద్దధానానాం లీలయా దధతః కలాః

అలాంటి పరమాత్మ యేమి పనులు చేసాడని పెద్దలు చెప్పారో.
అథాఖ్యాహి హరేర్ధీమన్నవతారకథాః శుభాః
ఈలా విదధతః స్వైరమీశ్వరస్యాత్మమాయయా

అటువంటి పరమాత్మ కధను చెప్పండి
వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే
యచ్ఛృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే

మేము మాత్రం తృప్తి పొందము, రసము తెలిసిన్వ వారు వింటే భగవంతుని కధలో ప్రతీ పదంలో రుచే. రుచికే రుచి (స్వాదు స్వాదు).
కృతవాన్కిల కర్మాణి సహ రామేణ కేశవః
అతిమర్త్యాని భగవాన్గూఢః కపటమానుషః

బలరామునితో కలిసి అతిమానుషుడైన భగవానుడు ఎమేమిపనులు చేసాడో
కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేऽస్మిన్వైష్ణవే వయమ్
ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః

కలిపురుషుడు రాబోతున్నాడని తెలుస్కున్నాము ఈ విష్నుక్షేత్రంలోకి ఆ కలి రాకుండా ఉండటానికి ఈ సత్రం చేస్తున్నాము
త్వం నః సన్దర్శితో ధాత్రా దుస్తరం నిస్తితీర్షతామ్
కలిం సత్త్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవమ్

కలిమలాన్ని తొలిగించుకోడానికి ఎమి చెయ్యాలనుకున్న మాకు భగవానుడు మిమ్మల్ని చూఫాడు

బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి
స్వాం కాష్ఠామధునోపేతే ధర్మః కం శరణం గతః

కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత ధరమము ఎవరిని ఆశ్రయించింది