Friday, May 3, 2013

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తే నాగరాజమామన్త్ర్య ఫలభాగేన వాసుకిమ్
పరివీయ గిరౌ తస్మిన్నేత్రమబ్ధిం ముదాన్వితాః

మందర పర్వతం వచ్చాక వాసుకుని కూడా అమృతం ఇస్తామని చెప్పి పిలిచారు. వాసుకుని పర్వతానికి కట్టి అమృతం రావడం కోసం చిలకడ మొదలు పెట్టారు

ఆరేభిరే సురా యత్తా అమృతార్థే కురూద్వహ
హరిః పురస్తాజ్జగృహే పూర్వం దేవాస్తతోऽభవన్

స్వామి వెళ్ళి వాసుకి తల వైపు పట్టుకున్నారు, దేవతలు కూడా అక్కడే పట్టుకున్నారు.

తన్నైచ్ఛన్దైత్యపతయో మహాపురుషచేష్టితమ్
న గృహ్ణీమో వయం పుచ్ఛమహేరఙ్గమమఙ్గలమ్

అది చూసిన రాక్షసులు, "మేము కశ్యపుని పుత్రులము బ్రాహ్మణులము, మేము అమంగళమైన తోకను పట్టుకోము"

స్వాధ్యాయశ్రుతసమ్పన్నాః ప్రఖ్యాతా జన్మకర్మభిః
ఇతి తూష్ణీం స్థితాన్దైత్యాన్విలోక్య పురుషోత్తమః
స్మయమానో విసృజ్యాగ్రం పుచ్ఛం జగ్రాహ సామరః

మేము స్వాధ్యాయం శాస్త్రం ఉత్తమ జన్మ ఉన్న వారం.  చిరునవ్వుతో అది చూసి స్వామి తోకను పట్టుకున్నాడు. ఈ ప్రకారముగా ఎవరు తోక పట్టుకోవాలో ఎవరు తల పట్టుకోవాలో నిర్ణయించబడినది. అప్పుడు సముద్రాన్ని చిలికారు

కృతస్థానవిభాగాస్త ఏవం కశ్యపనన్దనాః
మమన్థుః పరమం యత్తా అమృతార్థం పయోనిధిమ్

మథ్యమానేऽర్ణవే సోऽద్రిరనాధారో హ్యపోऽవిశత్
ధ్రియమాణోऽపి బలిభిర్గౌరవాత్పాణ్డునన్దన

కానీ పర్వతానికి ఆధారం లేదు. పర్వతం నీటిలో ప్రవేశిస్తోంది ఇంతటి బలవంతులు పట్టుకున్నా.

తే సునిర్విణ్ణమనసః పరిమ్లానముఖశ్రియః
ఆసన్స్వపౌరుషే నష్టే దైవేనాతిబలీయసా

అందరి ముఖాలూ వాడిపోయాయి. బలీయమైన దైవం తమ పనిని అడ్డుకొంది అని తలచారు.

విలోక్య విఘ్నేశవిధిం తదేశ్వరో దురన్తవీర్యోऽవితథాభిసన్ధిః
కృత్వా వపుః కచ్ఛపమద్భుతం మహత్ప్రవిశ్య తోయం గిరిముజ్జహార

విఘ్నేశుని పూజించకుండా పని మొదలుపెట్టారని పర్వతం మునిగిపోతోంది. అది చూసిన పరమాత్మ అనత బలం కలవాడు సత్య సంకలపం కలవాడు అత్యాశ్చర్యకరమైన కూర్మ అవతారాన్ని ధరించి నీటిలో ప్రవేశించాడు. అందుకే మనం ఏ కార్యం సఫలం కావాలన్నా కూర్మాన్ని ధ్యానించాలి. ఆయనే విశ్వక్సేనుడు.

తముత్థితం వీక్ష్య కులాచలం పునః సముద్యతా నిర్మథితుం సురాసురాః
దధార పృష్ఠేన స లక్షయోజన ప్రస్తారిణా ద్వీప ఇవాపరో మహాన్

ఇలా మందర పర్వతం పైకి లేచింది. దాన్ని చూచి అందరూ చిలకడానికి లేచారు. అంత పెద్ద పర్వతాన్ని స్వామి వీపుతో మోసాడు. ఆయన వీపు ఇంకో ద్వీపములా ఉంది.

సురాసురేన్ద్రైర్భుజవీర్యవేపితం పరిభ్రమన్తం గిరిమఙ్గ పృష్ఠతః
బిభ్రత్తదావర్తనమాదికచ్ఛపో మేనేऽఙ్గకణ్డూయనమప్రమేయః

దేవతలూ రాక్షసులూ బలీయములైన భుజములతో బాగా తిప్పుతూ ఉంటే తన వీపు దురద పెడితే గీకినట్లు భావించాడు. ఆయన అప్రమేయుడు

తథాసురానావిశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్
ఉద్దీపయన్దేవగణాంశ్చ విష్ణుర్దైవేన నాగేన్ద్రమబోధరూపః

అంత పెద్ద పర్వతాన్ని రాక్షసులు తమ శక్తితో తిప్పలేరు. అందుచే వారిలో వారి రూపముతోనే ప్రవేశించాడు. వారి బలాన్ని వారి పరాక్రమాన్ని వృద్ధి పొందింపచేసాడు. దేవతల బలాన్ని కూడా పెంచాడు దేవతారూపముతో. అజ్ఞ్యాన రూపముతో వాసుకి బలాన్ని పెంచాడు. పర్వతం కిందకి ఒరగకుండా ఆయన పైన బరువుగా కూర్చున్నాడు. వాసుకిలో, దేవతలలో, రాక్షసులలో, పరవతం మీద, పర్వతం కింద, పరవతములోను, సముద్రములో, విడిగా తాను - అష్ట మూర్తిగా అయ్యాడు స్వామి. అందుకే స్వామిని అష్ట మూర్తి అష్ట బాహువు, అందుకే అమ్మవారు కూడా అష్ట లక్ష్ములుగా వచ్చారు.

ఉపర్యగేన్ద్రం గిరిరాడివాన్య ఆక్రమ్య హస్తేన సహస్రబాహుః
తస్థౌ దివి బ్రహ్మభవేన్ద్రముఖ్యైరభిష్టువద్భిః సుమనోऽభివృష్టః

వేయి బాహువులతో స్వామి పరవతాన్ని పట్టుకుని మధిస్తూ, అందరిలో అన్నిటిలో స్వామి ఉండి పర్వతాన్ని చిలికాడు, ఆయన వేగాన్ని చూసి బ్రహ్మ రుద్రాదులు స్తోత్రం చేస్తున్నారు. అందరూ పూల వర్షం  కురిపించారు.

ఉపర్యధశ్చాత్మని గోత్రనేత్రయోః పరేణ తే ప్రావిశతా సమేధితాః
మమన్థురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షోభితనక్రచక్రమ్

పైనా కిందా తనలో పర్వతములో పాములో దాని అవతలా లోపలా అంతా ప్రవేశించి, స్వామి ఇంత చేస్తే దేవతలూ రాక్షసులూ మదముతో పర్వతాన్ని చిలికారు.

అహీన్ద్రసాహస్రకఠోరదృఙ్ముఖ శ్వాసాగ్నిధూమాహతవర్చసోऽసురాః
పౌలోమకాలేయబలీల్వలాదయో దవాగ్నిదగ్ధాః సరలా ఇవాభవన్

పాము  యొక్క వేయి కఠోరమైన చూపులూ, ముఖములూ, నిశ్వాస, అగ్ని అన్ని వైపుల నుండీ విషం వస్తూ అసురుల బలం పోయింది. రాక్షసులందరూ చల్లబడి పోయారు.

దేవాంశ్చ తచ్ఛ్వాసశిఖాహతప్రభాన్ధూమ్రామ్బరస్రగ్వరకఞ్చుకాననాన్
సమభ్యవర్షన్భగవద్వశా ఘనా వవుః సముద్రోర్మ్యుపగూఢవాయవః

దేవతలకు వారు కట్టుకున్న బట్టలూ ఆభరణాలూ మాడిపోయాయి. వారు నల్లగా ఐపోయారు. స్వామి దేవతల వైపు ఒక మేఘాన్ని పంపించారు. అది చల్లని వాన కురిపించాడు. పై నుంచి సముద్ర తరంగాలతో చల్లని వాయువు దేవతల మీదకు వీచింది

మథ్యమానాత్తథా సిన్ధోర్దేవాసురవరూథపైః
యదా సుధా న జాయేత నిర్మమన్థాజితః స్వయమ్

ఇంత కష్టపడి ఇంత చిలికినా అమృతం రాలేదు. ఇంక స్వామి స్వయముగా చిలికాడు.

మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోతవిద్యున్
మూర్ధ్ని భ్రాజద్విలులితకచః స్రగ్ధరో రక్తనేత్రః
జైత్రైర్దోర్భిర్జగదభయదైర్దన్దశూకం గృహీత్వా
మథ్నన్మథ్నా ప్రతిగిరిరివాశోభతాథో ధృతాద్రిః

మేఘశ్యాముడు పీతాంబరం ధరించి చెవులకు మకర కుండలాలు ప్రకాశిస్తూ ఉండగా, చిలుకుతున్నందు వలన శిఖ వీడి వెంట్రుకలు ముఖం మీద పడి, కళ్ళు కాస్త ఎర్రబడి, జగత్తుకి అభయమిచ్చే బాహువులతో పామును పట్టుకుని కవ్వముతో చిలుకుతూ ఇంకో మందరములా కనపడుతున్నాడు. కిందినుండి పర్వతాన్ని ధరించి, పర్వతం మీద తాను ఉండి, తాను చిలుకుతూ ఉన్నాడు

నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః
సమ్భ్రాన్తమీనోన్మకరాహికచ్ఛపాత్తిమిద్విపగ్రాహతిమిఙ్గిలాకులాత్

అలా చిలికేసరికి హాలాహలం పుట్టింది. సముద్రములో ఉండే తిమింగలాలూ మొదలైన్వన్నీ కొట్టుకుంటున్నాయి.

తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధో విసర్పదుత్సర్పదసహ్యమప్రతి
భీతాః ప్రజా దుద్రువురఙ్గ సేశ్వరా అరక్ష్యమాణాః శరణం సదాశివమ్

ఉగ్ర వేగముతో వచ్చే విషాన్ని చూచి ప్రజలందరూ భయపడ్డారు. కాపాడమని అక్కడ ఉన్న శంకరున్ని శరణు వేడారు.

విలోక్య తం దేవవరం త్రిలోక్యా భవాయ దేవ్యాభిమతం మునీనామ్
ఆసీనమద్రావపవర్గహేతోస్తపో జుషాణం స్తుతిభిః ప్రణేముః

మూడు లోకాలకొచ్చిన ఆ కంటకాన్ని చూచి స్తోత్రముతో స్వామికి నమస్కరించి

శ్రీప్రజాపతయ ఊచుః
దేవదేవ మహాదేవ భూతాత్మన్భూతభావన
త్రాహి నః శరణాపన్నాంస్త్రైలోక్యదహనాద్విషాత్

మూడు లోకాలను కాల్చి వేసే విషం నుండి మమ్ము కాపాడు

త్వమేకః సర్వజగత ఈశ్వరో బన్ధమోక్షయోః
తం త్వామర్చన్తి కుశలాః ప్రపన్నార్తిహరం గురుమ్

మొత్తం జగత్తుకు నీవే బంధాన్నీ మోక్షాన్నీ ఇస్తావు. తెలిసినవారు నిన్ను ఆశ్రయించేవారి బాధలు పోగొట్టేవాడిగా నిన్ను ఆశ్రయిస్తారు

గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్విభో
ధత్సే యదా స్వదృగ్భూమన్బ్రహ్మవిష్ణుశివాభిధామ్

నీ గుణములతో యోగమాయతో సృష్టి స్థితి సంహారాలు చేస్తుంటావు, బ్రహ్మగా విష్ణువుగా శివునిగా ఉంటావు

త్వం బ్రహ్మ పరమం గుహ్యం సదసద్భావభావనమ్
నానాశక్తిభిరాభాతస్త్వమాత్మా జగదీశ్వరః

నీవే సకల శక్తులుగా భాసిస్తావు.

త్వం శబ్దయోనిర్జగదాదిరాత్మా ప్రాణేన్ద్రియద్రవ్యగుణః స్వభావః
కాలః క్రతుః సత్యమృతం చ ధర్మస్త్వయ్యక్షరం యత్త్రివృదామనన్తి

నీవే జగత్తునకు ఆదివి, శబ్ద స్వరూపుడవు, ఆత్మవు, ప్రాణములూ ఇంద్రియములూ ద్రవ్యములూ గుణములూ రూపములు, సత్యమూ ఋతమూ రూపము అక్షరమూ ఓంకారము

అగ్నిర్ముఖం తేऽఖిలదేవతాత్మా క్షితిం విదుర్లోకభవాఙ్ఘ్రిపఙ్కజమ్
కాలం గతిం తేऽఖిలదేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశమ్

నీ ముఖం అగ్ని పాదం భూమి గమనం కాలం చెవులు దిక్కులు నాలుక వరుణుడు నాభి ఆకాశం నిట్టూర్పు వాయువు చక్షువు సూర్యుడు చంద్రుడు మనసు శిరస్సు ఆకాశం ఎముకలే పర్వతాలు సముద్రమే కుక్షి రోమాలే ఔషదులు ఏడు చందస్సులు ఏడు ధాతువులు హృదయం ధర్మం

నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్సూర్యశ్చ చక్షూంషి జలం స్మ రేతః
పరావరాత్మాశ్రయణం తవాత్మా సోమో మనో ద్యౌర్భగవన్శిరస్తే

కుక్షిః సముద్రా గిరయోऽస్థిసఙ్ఘా రోమాణి సర్వౌషధివీరుధస్తే
ఛన్దాంసి సాక్షాత్తవ సప్త ధాతవస్త్రయీమయాత్మన్హృదయం సర్వధర్మః

ముఖాని పఞ్చోపనిషదస్తవేశ యైస్త్రింశదష్టోత్తరమన్త్రవర్గః
యత్తచ్ఛివాఖ్యం పరమాత్మతత్త్వం దేవ స్వయంజ్యోతిరవస్థితిస్తే

అష్టోత్తరములూ, అన్ని ఉపనిషత్తులూ నీ ముఖములూ, దాన్నే శివాఖ్యమని పరమ మంగళమనీ చెబుతున్నారు. నీ నీడ అధర్మము తరంగములు నీ సంకల్పములూ మూడు గుణాలు నీ మూడు నేత్రాలు నీవు జ్ఞ్యాన స్వరూపానివి నీ సంకల్పం శాస్త్రం చందో మయుడవు పురాణ ఋషివి నీవు

ఛాయా త్వధర్మోర్మిషు యైర్విసర్గో నేత్రత్రయం సత్త్వరజస్తమాంసి
సాఙ్ఖ్యాత్మనః శాస్త్రకృతస్తవేక్షా ఛన్దోమయో దేవ ఋషిః పురాణః

న తే గిరిత్రాఖిలలోకపాల విరిఞ్చవైకుణ్ఠసురేన్ద్రగమ్యమ్
జ్యోతిః పరం యత్ర రజస్తమశ్చ సత్త్వం న యద్బ్రహ్మ నిరస్తభేదమ్

నీ పరాక్రమం బ్రహ్మకు గానీ, విష్ణువుకు గానీ ఇంద్రునకు కానీ తెలియదు. నీవి పరం జ్యోతివి. రజస్తమో గుణాలూ సత్వమూ నిన్ను ఆవరించవు. కామం నిన్ను ఆవరించవు, దక్ష యజ్ఞ్యం విధ్వంసం చేసావు నీవు.

కామాధ్వరత్రిపురకాలగరాద్యనేక
భూతద్రుహః క్షపయతః స్తుతయే న తత్తే
యస్త్వన్తకాల ఇదమాత్మకృతం స్వనేత్ర
వహ్నిస్ఫులిఙ్గశిఖయా భసితం న వేద

ప్రళయ కాలములో నీ నేత్రం నుండి వచ్చే అగ్ని కణముతో అంతా భస్మం చేసావు

యే త్వాత్మరామగురుభిర్హృది చిన్తితాఙ్ఘ్రి
ద్వన్ద్వం చరన్తముమయా తపసాభితప్తమ్
కత్థన్త ఉగ్రపరుషం నిరతం శ్మశానే
తే నూనమూతిమవిదంస్తవ హాతలజ్జాః

ఆత్మా రాములచే స్తోత్రం చేయబడుతూ ఉంటావు. పార్వతీ దేవితో కలిసి ఉండి ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటావు. ఉగ్ర పురుషుడివి. నిరంతరం శ్మశానములో ఉంటావు. నీ అసలు ప్రభావాన్ని మేము తెలుసుకోలేము. సిగ్గు విడిచి నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ ప్రభావాన్ని  మేము తెల్సుకోలేము. బ్రహ్మాదులే నిన్ను తెలుసుకోలేరు. ఆయన సృష్టిలో భాగం ఐన మేము ఎలా తెలుసుకోగలము. ఇంత కన్నా మేము చెప్పలేము. ఇలాంటి పని చేస్తావు అని చెప్ప వీలు లేని నీవు లోకం యొక్క రక్ష కోసం ఆవిర్భవిస్తూ ఉంటావు

తత్తస్య తే సదసతోః పరతః పరస్య
నాఞ్జః స్వరూపగమనే ప్రభవన్తి భూమ్నః
బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయం తు
తత్సర్గసర్గవిషయా అపి శక్తిమాత్రమ్

ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర
మృడనాయ హి లోకస్య వ్యక్తిస్తేऽవ్యక్తకర్మణః

శ్రీశుక ఉవాచ
తద్వీక్ష్య వ్యసనం తాసాం కృపయా భృశపీడితః
సర్వభూతసుహృద్దేవ ఇదమాహ సతీం ప్రియామ్

ఇలా స్తోత్రం చేస్తే శివుడు దయతో ఇలా అన్నాడు పార్వతితో

శ్రీశివ ఉవాచ
అహో బత భవాన్యేతత్ప్రజానాం పశ్య వైశసమ్
క్షీరోదమథనోద్భూతాత్కాలకూటాదుపస్థితమ్

చూసావా వీరికి ఎంత బాధ కలిగిందో వీరి ఆప్ద చూడు

ఆసాం ప్రాణపరీప్సూనాం విధేయమభయం హి మే
ఏతావాన్హి ప్రభోరర్థో యద్దీనపరిపాలనమ్

వీరికి నేను అభయం ఇచ్చి తీరాలి. ప్రభువు యొక్క కర్తవ్యం దీనులను పరిపాలించుటే.

ప్రాణైః స్వైః ప్రాణినః పాన్తి సాధవః క్షణభఙ్గురైః
బద్ధవైరేషు భూతేషు మోహితేష్వాత్మమాయయా

క్షణబంగురమైన తన ప్రాణములతో ఇతరులను కాపాడాలి. అదే వేరే వారు మోహం పొంది వైరం పెంచుకుని ఇతరులను చంపి తాము బతకాలని కోరతారు.

పుంసః కృపయతో భద్రే సర్వాత్మా ప్రీయతే హరిః
ప్రీతే హరౌ భగవతి ప్రీయేऽహం సచరాచరః
తస్మాదిదం గరం భుఞ్జే ప్రజానాం స్వస్తిరస్తు మే

బాధపొందుతున్న వారి మీద దయ చూపితే సర్వ భూఅత అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు. పరమాత్మ సంతోషమే నాకూ సంతోషం. కాబట్టి నేను ఈ విషాన్ని తింటున్నాను. ప్రజలకూ నీకు శుభం కలుగుగాక.

శ్రీశుక ఉవాచ
ఏవమామన్త్ర్య భగవాన్భవానీం విశ్వభావనః
తద్విషం జగ్ధుమారేభే ప్రభావజ్ఞాన్వమోదత

ఇలా మాట్లాడిన శివునికి, శివుని ప్రభావం బాగా తెలిసిన పార్వతీ అమ్మవారు ఆమోదం తెలిపింది.
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! 


తతః కరతలీకృత్య వ్యాపి హాలాహలం విషమ్
అభక్షయన్మహాదేవః కృపయా భూతభావనః

అంతటా వ్యాపిస్తున్న విషాన్ని శంకరుడు అరచేతిలో ఉంచుకుని దయతో దాన్ని తినేసాడు.

తస్యాపి దర్శయామాస స్వవీర్యం జలకల్మషః
యచ్చకార గలే నీలం తచ్చ సాధోర్విభూషణమ్

జలకల్మషమైన ఆ విషం మిగుట వలన స్వామి కంఠం నల్లగా మారిపోయింది. వేరేవారికి అది మచ్చగానీ, స్వామికి అది అలంకారమైంది,.

తప్యన్తే లోకతాపేన సాధవః ప్రాయశో జనాః
పరమారాధనం తద్ధి పురుషస్యాఖిలాత్మనః

లోకముల తాపముతో సజ్జనులు తాము తపిస్తారు. తపిస్తున్న లోకముల తాపములను తప్పించుట భగవంతుడైన శ్రీమన్నారాయణుని పరమారాధనం.

నిశమ్య కర్మ తచ్ఛమ్భోర్దేవదేవస్య మీఢుషః
ప్రజా దాక్షాయణీ బ్రహ్మా వైకుణ్ఠశ్చ శశంసిరే

ఈ విషయం చూసి బ్రహ్మ విష్ణువు మొదలైన వారు పరమ శివున్ని ప్రశంసించారు.

ప్రస్కన్నం పిబతః పాణేర్యత్కిఞ్చిజ్జగృహుః స్మ తత్
వృశ్చికాహివిషౌషధ్యో దన్దశూకాశ్చ యేऽపరే

అరచేతిలో విషాన్ని పెట్టుకుని నోటిలో వేసుకుంటూ ఉన్నప్పుడు అది కొద్దిగా జారింది. అలా పడ్డదాన్ని కొన్ని క్రిమి కీటకాలు తిన్నాయి. అవే తేళ్ళూ పాములూ మొదలైన జీవాలు.

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏవం స్తుతః సురగణైర్భగవాన్హరిరీశ్వరః
తేషామావిరభూద్రాజన్సహస్రార్కోదయద్యుతిః

దేవతా గణముల చేత స్తోత్రం చేయబడిన పరమాత్మ వేయి మందిసూర్యుల కాంతి తేజస్సుతో వారికి సాక్షాత్కరించాడు.

తేనైవ సహసా సర్వే దేవాః ప్రతిహతేక్షణాః
నాపశ్యన్ఖం దిశః క్షౌణీమాత్మానం చ కుతో విభుమ్

ఆయన కాంతి చేత అందరి కళ్ళూ మూసుకుని పోయాయి. ఆ వెలుగుకు ఆకాశాన్నీ దిక్కులనీ తమనీ కూడా చూసుకోలేకపోయారు. బ్రహ్మ రుద్రులు మాత్రం ఆయనను చూడగలిగారు.

విరిఞ్చో భగవాన్దృష్ట్వా సహ శర్వేణ తాం తనుమ్
స్వచ్ఛాం మరకతశ్యామాం కఞ్జగర్భారుణేక్షణామ్

స్వామి మరకతం వంటి నీల వర్ణం కలిగి పుండరీకాక్షుడు.

తప్తహేమావదాతేన లసత్కౌశేయవాససా
ప్రసన్నచారుసర్వాఙ్గీం సుముఖీం సున్దరభ్రువమ్

చక్కగా బాగా కాల్చి వన్నెతెచ్చిన బంగారపు రంగు కల వస్త్రం కట్టుకుని ఉన్నవాడు. అందమైన సర్వాయవములు కలవాడు. చక్కని ముఖము మంచి కనుబొమ్మలూ మణికిరీటం కేయూరములూ మకర కుండల కాంతి శోభిస్తూ మొలత్రాడూ వలయములూ హారములూ మొదలైనవాటితో ప్రకాశిస్తూ కౌస్తుభాన్నీ వనమాలను అమ్మవారినీ ధరించి ఉన్న స్వామి

మహామణికిరీటేన కేయూరాభ్యాం చ భూషితామ్
కర్ణాభరణనిర్భాత కపోలశ్రీముఖామ్బుజామ్

కాఞ్చీకలాపవలయ హారనూపురశోభితామ్
కౌస్తుభాభరణాం లక్ష్మీం బిభ్రతీం వనమాలినీమ్

సుదర్శనాదిభిః స్వాస్త్రైర్మూర్తిమద్భిరుపాసితామ్
తుష్టావ దేవప్రవరః సశర్వః పురుషం పరమ్
సర్వామరగణైః సాకం సర్వాఙ్గైరవనిం గతైః

సుదర్శనాది ఆయుధములతో ఉన్న స్వామిని చూచి శివునితో కలిసి బ్రహ్మాదులు స్తోత్రం చేసారు. సాష్టాంగ నమస్కారం చేసి స్తోత్రం చేస్తున్నారు

శ్రీబ్రహ్మోవాచ
అజాతజన్మస్థితిసంయమాయా గుణాయ నిర్వాణసుఖార్ణవాయ
అణోరణిమ్నేऽపరిగణ్యధామ్నే మహానుభావాయ నమో నమస్తే

ఆద్యంత రహితుడు, అన్ని గుణములూ ఆయనే, మోక్ష సుఖమూ ఆయనే, అణువులకు అణువు, నీ లోకం ఇంత ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు. అలాంటి నీకు నమస్కారం.

రూపం తవైతత్పురుషర్షభేజ్యం శ్రేయోऽర్థిభిర్వైదికతాన్త్రికేణ
యోగేన ధాతః సహ నస్త్రిలోకాన్పశ్యామ్యముష్మిన్ను హ విశ్వమూర్తౌ

నీవు చూపిన ఈ రూపం తమకు శ్రేయస్సు కావాలని కోరుకున్న మహా పురుషులందరి చేత ఆరాధించబడే రూపం. వైదికముగా ఆరాధిస్తారు కొందరూ, తంత్రముగా ఆరాధిస్తారు కొందరు. నా యోగముతో మీ శరీరములో ఉండే లోక త్రయాన్ని చూస్తున్నాను.

త్వయ్యగ్ర ఆసీత్త్వయి మధ్య ఆసీత్త్వయ్యన్త ఆసీదిదమాత్మతన్త్రే
త్వమాదిరన్తో జగతోऽస్య మధ్యం ఘటస్య మృత్స్నేవ పరః పరస్మాత్

మొడటి మధ్య చివరి లోకాలు నీలోనే ఉన్నాయి. నీవే ఆది మధ్య అంతములూ. కుండకు మట్టి లాగ. కుండకూ ఆది మధ్య అంతము ఉండదు.

త్వం మాయయాత్మాశ్రయయా స్వయేదం నిర్మాయ విశ్వం తదనుప్రవిష్టః
పశ్యన్తి యుక్తా మనసా మనీషిణో గుణవ్యవాయేऽప్యగుణం విపశ్చితః

నీవు నీ యోగ మాయతో సకల చరాచర ప్రపంచాన్ని సృష్టించి అందులో చేరిన నిన్ను యోగము కలవారూ, జ్ఞ్యానులూ మనసుతో నిన్ను చూస్తారు. గుణముల సమూహముగా ఉన్న ప్రకృతిలో ఉన్నా నీవు అగుణుడవు.

యథాగ్నిమేధస్యమృతం చ గోషు భువ్యన్నమమ్బూద్యమనే చ వృత్తిమ్
యోగైర్మనుష్యా అధియన్తి హి త్వాం గుణేషు బుద్ధ్యా కవయో వదన్తి

కట్టెలలో నిప్పులాగ, గోవులలో అమృతం (పాలు) లాగ, భూమిలో అన్నము లాగ, భూమిలో తవ్వితే వచ్చే నీరు లాగ, కష్టపడి ప్రయత్నిస్తేనే వచ్చే బ్రతుకు తెరువులాగ, యోగముతో నిన్ను పొందవచ్చు అని జ్ఞ్యానులు చెబుతారు

తం త్వాం వయం నాథ సముజ్జిహానం సరోజనాభాతిచిరేప్సితార్థమ్
దృష్ట్వా గతా నిర్వృతమద్య సర్వే గజా దవార్తా ఇవ గాఙ్గమమ్భః

మేము ఎంతో కాలం నుండీ నిన్ను దర్శించాలని ప్రయత్నిస్తున్నాము, దర్శించుకోగలిగాము, ఆనందించాము. దావనలములో ఉన్న ఏనుగులు గంగా జలములో మునిగితే ఎంత ఆనందం పొందుతాయో అంత అనాందం పొందాము.

స త్వం విధత్స్వాఖిలలోకపాలా వయం యదర్థాస్తవ పాదమూలమ్
సమాగతాస్తే బహిరన్తరాత్మన్కిం వాన్యవిజ్ఞాప్యమశేషసాక్షిణః

మేము నిన్ను దేన్ని కోరి చేరామో దాన్ని నీవు ప్రసాదించు, నీవు మాలోపలా వెలుపలా ఉన్నావు. అశేష సాక్షికి ఇంకేమి చెప్పాలి.

అహం గిరిత్రశ్చ సురాదయో యే దక్షాదయోऽగ్నేరివ కేతవస్తే
కిం వా విదామేశ పృథగ్విభాతా విధత్స్వ శం నో ద్విజదేవమన్త్రమ్

నేనూ శంకరుడూ ఇతర దేవతలూ దక్షాదులూ అగ్నికి రవ్వల లాగ నీ యొక్క అంశలము. నిప్పు నుండి రవ్వలు వచ్చినట్లుగా నీ నుండి మేము వచ్చాము. అలా ఐనప్పుడు నీకంటే వేరుగా మేము ప్రకాశించాలంటే ఎలా ప్రకాశించగలం. నిప్పు నుండి వచ్చిన రవ్వలకు ఎంత సేపు ప్రకాశం ఉంటుంది. మాకూ బ్రాహ్మణులకూ దేవతలకూ శుభమును కలిగించు

శ్రీశుక ఉవాచ
ఏవం విరిఞ్చాదిభిరీడితస్తద్విజ్ఞాయ తేషాం హృదయం యథైవ
జగాద జీమూతగభీరయా గిరా బద్ధాఞ్జలీన్సంవృతసర్వకారకాన్

బ్రహ్మాదుల చేత స్తోత్రం చేయబడి, వారి హృదయాన్ని తెలుసుకుని మేఘ గంభీర నాదముతో పలికాడు, అన్ని అవయవాలూ ముడుచుకుని చేతులు జోడించుకుని ఉన్న వారితో మాట్లాడాడు.

ఏక ఏవేశ్వరస్తస్మిన్సురకార్యే సురేశ్వరః
విహర్తుకామస్తానాహ సముద్రోన్మథనాదిభిః

ఒక్కడే ఐన పరమాత్మ దేవతా కార్యము యందు విహరించాలని అనుకున్నాడు. సముద్రాన్ని చిలుకుట పర్వతాన్ని మోయుట మొదలైన వాటిని చేయాలని అనుకున్నాడు.

శ్రీభగవానువాచ
హన్త బ్రహ్మన్నహో శమ్భో హే దేవా మమ భాషితమ్
శృణుతావహితాః సర్వే శ్రేయో వః స్యాద్యథా సురాః

బ్రహ్మా రుద్రా దేవతలారా, నా మాటలను సావధానముతో వినండి. మీకందరికీ మేలు కలుగుతుంది. వెళ్ళండి. దైతేయులైన రాక్షసుల వద్దకు వెళ్ళి వారితో సంధి చేసుకోండి.

యాత దానవదైతేయైస్తావత్సన్ధిర్విధీయతామ్
కాలేనానుగృహీతైస్తైర్యావద్వో భవ ఆత్మనః

ఇపుడు కాలం బాగా లేదు. కాలం బాగయ్యే వరకూ వారితో సంధి చేసుకోండి.

అరయోऽపి హి సన్ధేయాః సతి కార్యార్థగౌరవే
అహిమూషికవద్దేవా హ్యర్థస్య పదవీం గతైః

పని ఉన్నప్పుడు శత్రువులతో ఐనా సంధి చేసుకోవాలి. పామూ ఎలుకలకు కూడా స్నేహం అవసరం.

అమృతోత్పాదనే యత్నః క్రియతామవిలమ్బితమ్
యస్య పీతస్య వై జన్తుర్మృత్యుగ్రస్తోऽమరో భవేత్

మీరు తొందరపడి, ఆలస్యం చేయకుండా అమృతాన్ని పొందడానికి ప్రయత్నించండి. మరణించిన వాడు కూడా అది తాగితే బతుకుతాడు

క్షిప్త్వా క్షీరోదధౌ సర్వా వీరుత్తృణలతౌషధీః
మన్థానం మన్దరం కృత్వా నేత్రం కృత్వా తు వాసుకిమ్

పాల సముద్రములో అన్ని లతలూ ఆకులూ వేసి, మందర పర్వతాన్ని కవ్వం చేసుకుని వాసుకుని తాడు చేసుకుని నా సహాయముతో సముద్రాన్ని చిలకండి

సహాయేన మయా దేవా నిర్మన్థధ్వమతన్ద్రితాః
క్లేశభాజో భవిష్యన్తి దైత్యా యూయం ఫలగ్రహాః

సోమరితనాన్ని వదలి చిలకండి. పాపం రాక్షసులకు కష్టం మాత్రం మిగులుతుంది, ఫలితం మాత్రం మీకు వస్తుంది.

యూయం తదనుమోదధ్వం యదిచ్ఛన్త్యసురాః సురాః
న సంరమ్భేణ సిధ్యన్తి సర్వార్థాః సాన్త్వయా యథా

వారికెలాగూ ఫలితం రాదు కాబట్టి ఫలితం మీకు వచ్చేంత వరకూ వారు దేన్ని కోరినా కాదనకండి. శాంతముతో ఓదార్పుతో నెమ్మదితో పనులైనట్లు కోపముతో పనులు అవ్వవు.

న భేతవ్యం కాలకూటాద్విషాజ్జలధిసమ్భవాత్
లోభః కార్యో న వో జాతు రోషః కామస్తు వస్తుషు

సముద్రాన్ని చిలుకుతూ ఉంటే విష జ్వాలలతో కాలకూటం వస్తుంది, దాన్ని చూసి మీరు భయపడకండి. మిగతా వస్తువులు కూడా వస్తాయి. వాటి యందు లోభము చూపకండి, కామము చూపకండి.

శ్రీశుక ఉవాచ
ఇతి దేవాన్సమాదిశ్య భగవాన్పురుషోత్తమః
తేషామన్తర్దధే రాజన్స్వచ్ఛన్దగతిరీశ్వరః

ఈ రీతిలో దేవతలను ఆజ్ఞ్యాపించి స్వామి అంతర్ధానం చెందాడు. తన ఇష్టం ప్రకారం వచ్చేవాడు కాబట్టి అంతర్ధానమయ్యాడు

అథ తస్మై భగవతే నమస్కృత్య పితామహః
భవశ్చ జగ్మతుః స్వం స్వం ధామోపేయుర్బలిం సురాః

అంతర్ధానమైన ఆ దిక్కుకు అందరూ నమస్కరించి బ్రహ్మ రుద్రులు వారి వారి లోకాలకు వెళ్ళగా దేవతలు బలి చక్రవర్తి వద్దకు వెళ్ళారు.

దృష్ట్వారీనప్యసంయత్తాన్జాతక్షోభాన్స్వనాయకాన్
న్యషేధద్దైత్యరాట్శ్లోక్యః సన్ధివిగ్రహకాలవిత్

దేవతలు రాగానే బలి చక్రవర్తి సైన్యం వారి మీదకు వెళ్ళింది, సంధి ధర్మం తెలిసిన బలి వారిని వారించాడు

తే వైరోచనిమాసీనం గుప్తం చాసురయూథపైః
శ్రియా పరమయా జుష్టం జితాశేషముపాగమన్

వారి చేత కాపాడబడే బలి చక్రవర్తి వద్దకు వెళ్ళిన మహామతి ఐన ఇంద్రుడు మంచి మాటలతో బలి చక్రవర్తిని ఓదార్చాడు

మహేన్ద్రః శ్లక్ష్ణయా వాచా సాన్త్వయిత్వా మహామతిః
అభ్యభాషత తత్సర్వం శిక్షితం పురుషోత్తమాత్

శ్రీమన్నారాయణుడు ఏమేమి మాట్లాడమన్నాడో అవి అన్నీ చెప్పాడు

తత్త్వరోచత దైత్యస్య తత్రాన్యే యేऽసురాధిపాః
శమ్బరోऽరిష్టనేమిశ్చ యే చ త్రిపురవాసినః

అది విన్న బలి చక్రవర్తి బాగుందని అంగీక్రైంచాడు. మిగతా రాక్షసులు కూడా దానికి అంగీకరించారు.

తతో దేవాసురాః కృత్వా సంవిదం కృతసౌహృదాః
ఉద్యమం పరమం చక్రురమృతార్థే పరన్తప

అలా పరస్పరం సంధి చేసుకుని ఒక ఒప్పందం చేసుకుని క్షీర సాగర మధనం కోసం ఉద్యమం మొదలు పెట్టారు.

తతస్తే మన్దరగిరిమోజసోత్పాట్య దుర్మదాః
నదన్త ఉదధిం నిన్యుః శక్తాః పరిఘబాహవః

వీరూ వారూ అందరూ కలిసి మందర పర్వతాన్ని అడుగు నుంచి పెకిలించుకుని గట్టిగా అరుస్తూ పాల సముద్రములో పడవేద్దామని బయలుదేరారు.

దూరభారోద్వహశ్రాన్తాః శక్రవైరోచనాదయః
అపారయన్తస్తం వోఢుం వివశా విజహుః పథి

అంత దూరం మోయలేకపోయారు. అలా మోయలేక దారిలో దాన్ని కింద పడవేసారు

నిపతన్స గిరిస్తత్ర బహూనమరదానవాన్
చూర్ణయామాస మహతా భారేణ కనకాచలః

పర్వతం కిందపడుతూ ఎంతో మంది దేవ దానవులను చూర్ణం చేసింది.

తాంస్తథా భగ్నమనసో భగ్నబాహూరుకన్ధరాన్
విజ్ఞాయ భగవాంస్తత్ర బభూవ గరుడధ్వజః

కొందరు పోడి ఐపోగా, కొందరు మరణించగా, కొందరు కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నారు. అది చూసి స్వామి వేంచేసి.

గిరిపాతవినిష్పిష్టాన్విలోక్యామరదానవాన్
ఈక్షయా జీవయామాస నిర్జరాన్నిర్వ్రణాన్యథా

పర్వతం పడి చనిపోయిన వారందరినీ అమృత దృష్టితో బతికించాడు, గాయం ఐన వారి గాయాలను తగ్గించాడు

గిరిం చారోప్య గరుడే హస్తేనైకేన లీలయా
ఆరుహ్య ప్రయయావబ్ధిం సురాసురగణైర్వృతః

ఎడమ చేత్తో పర్వతాన్ని లేపి గరుడుని మీద వేసాడు. తాను కూడా గరుత్మంతుని మీద ఎక్కి అందరితో కలిసి సముద్రం వద్దకు వెళ్ళాడు

అవరోప్య గిరిం స్కన్ధాత్సుపర్ణః పతతాం వరః
యయౌ జలాన్త ఉత్సృజ్య హరిణా స విసర్జితః

అక్కడకు వెళ్ళగానే ఆ పర్వతాన్ని సముద్రములో వేసాడు. అలా వేసిన తరువాత గరుత్మంతుడు శెలవు తీసుక్ని వెళ్ళిపోయాడు.

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
రాజన్నుదితమేతత్తే హరేః కర్మాఘనాశనమ్
గజేన్ద్రమోక్షణం పుణ్యం రైవతం త్వన్తరం శృణు

సకల పావనమైన గజేంద్ర మోక్షాన్ని చెప్పాను

పఞ్చమో రైవతో నామ మనుస్తామససోదరః
బలివిన్ధ్యాదయస్తస్య సుతా హార్జునపూర్వకాః

రైవత మన్వంతరములో గాధలను వినవలసింది. (స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత - ఐదు). రైవతుడు తామసుని సోదరుడు. అతని పుత్రులు బలి మొదలైన వారు

విభురిన్ద్రః సురగణా రాజన్భూతరయాదయః
హిరణ్యరోమా వేదశిరా ఊర్ధ్వబాహ్వాదయో ద్విజాః

విభువు అనే వాడు ఇంద్రుడు, హిరణ్యరోమాదులు సప్తఋషులు

పత్నీ వికుణ్ఠా శుభ్రస్య వైకుణ్ఠైః సురసత్తమైః
తయోః స్వకలయా జజ్ఞే వైకుణ్ఠో భగవాన్స్వయమ్

శుక్రుడు, ఆయన భార్య వైకుంఠ, పరమాత్మ వైకుంఠనాథునిగా వారికి అవతరించాడు.

వైకుణ్ఠః కల్పితో యేన లోకో లోకనమస్కృతః
రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియకామ్యయా

లక్ష్మీ దేవి ప్రార్థన ప్రకారం, మిగతా వారి ప్రార్థన ప్రకారం, బ్రహ్మానడకోశములోపల ఇంకో వైకుంఠాన్ని ఏర్పాటు చేసాడు. (మనకు ఐదు రకాల వైకుంఠాలు ఉన్నాయి. రావణాదులు వెళ్ళిన వైకుంఠము పరమపదము కాదు)

తస్యానుభావః కథితో గుణాశ్చ పరమోదయాః
భౌమాన్రేణూన్స విమమే యో విష్ణోర్వర్ణయేద్గుణాన్

ఇలాంటి పరమాత్మ యొక్క ప్రభావం ఇంతే అనుకోకు. పరమాత్మ ప్రభావాన్ని చెప్పాలంటే భూమిలో ఉన్న పరాగములు లెక్కపెట్టిన వారు చెప్పగలరు. (విమమే అనే పదం వాడడం వలన- విష్ణోర్ ను కం వీర్యాణి ప్ర వోచం యః పార్థివాని విమమే రజాంసి - ఇది వేద మంత్రం అని మనకు చెబుతున్నట్లు ఉంది).

షష్ఠశ్చ చక్షుషః పుత్రశ్చాక్షుషో నామ వై మనుః
పూరుపూరుషసుద్యుమ్న ప్రముఖాశ్చాక్షుషాత్మజాః

చాక్షుష మన్వంతరములో వీరందరూ సప్తఋషులూ, వారి కొడుకులు.

ఇన్ద్రో మన్త్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః
మునయస్తత్ర వై రాజన్హవిష్మద్వీరకాదయః

నారాయణుడు అజితుడనే పేరుతో అవతరించాడు.

తత్రాపి దేవసమ్భూత్యాం వైరాజస్యాభవత్సుతః
అజితో నామ భగవానంశేన జగతః పతిః

క్షీర సాగరాన్ని మధించి అమృతాన్ని దేవతలు ఇచ్చాడు.

పయోధిం యేన నిర్మథ్య సురాణాం సాధితా సుధా
భ్రమమాణోऽమ్భసి ధృతః కూర్మరూపేణ మన్దరః

సముద్రాన్ని చిలికి దేవతలకు అమృతాన్ని అందించాడు. కూర్మ రూపములో మునుగుతున్న పర్వతాన్ని ధరించాడు.

శ్రీరాజోవాచ
యథా భగవతా బ్రహ్మన్మథితః క్షీరసాగరః
యదర్థం వా యతశ్చాద్రిం దధారామ్బుచరాత్మనా

పరమాత్మ పాల సముద్రమును ఎలా చిలికాడు. అలా చేస్తున్నప్పుడు మందర పర్వతమును కూర్మ రూపములో ఎందుకు ధరించాడు.

యథామృతం సురైః ప్రాప్తం కిం చాన్యదభవత్తతః
ఏతద్భగవతః కర్మ వదస్వ పరమాద్భుతమ్

ఇంకా ఎటువంటి అద్భుతాలు జరిగాయి. అవి మాకు వివరించవలసింది

త్వయా సఙ్కథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః
నాతితృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితమ్

నీవు వర్ణిస్తున్న పరమాత్మ యొక్క మహిమతో నాకు తృప్తి కలగడం లేదు. బాగా కాగి ఉన్న భూమి ఒకటి రెండు వానలతో చల్లారదు కదా.

శ్రీసూత ఉవాచ
సమ్పృష్టో భగవానేవం ద్వైపాయనసుతో ద్విజాః
అభినన్ద్య హరేర్వీర్యమభ్యాచష్టుం ప్రచక్రమే

ఈ రీతిలో అడిగితే వ్యాసుని పుత్రుడైన శుకుడు అభినందించి పరమాత్మ పరాక్రమాన్ని చెప్పడానికి ఉపక్రమించాడు

శ్రీశుక ఉవాచ
యదా యుద్ధేऽసురైర్దేవా బధ్యమానాః శితాయుధైః
గతాసవో నిపతితా నోత్తిష్ఠేరన్స్మ భూరిశః

దేవ దానవ యుద్ధములో తీక్షణమైన ఆయుధములు గల దానవుల చేత దేవతలు పీడించబడుతున్నారు. వారి ప్రాణాలు పోతున్నాయి.

యదా దుర్వాసః శాపేన సేన్ద్రా లోకాస్త్రయో నృప
నిఃశ్రీకాశ్చాభవంస్తత్ర నేశురిజ్యాదయః క్రియాః

రాక్షసులు తమో గుణ సంపన్నులు. దేవతలు సత్వ గుణ సంపన్నులు. ఐనా దేవతలు ఓడిపోవడానికి కారణం దుర్వాసుని శాపం. ఆ శాపం వలన అన్ని లోకాలలో లక్ష్మి అంతర్థానం చెందింది. యజ్ఞ్య యాగాది క్రియలు కూడా లోపించాయి. వాక్కూ శుద్ధీ విద్యా జ్ఞ్యానం తేజస్సూ అన్నీ ఇచ్చేది అమ్మవారు.

నిశామ్యైతత్సురగణా మహేన్ద్రవరుణాదయః
నాధ్యగచ్ఛన్స్వయం మన్త్రైర్మన్త్రయన్తో వినిశ్చితమ్

ఇలా జరగడముతో దీనికి పరిష్కారం ఆలోచించారు గానీ కర్తవ్యాన్ని నిశ్చయించుకోలేకపోయారు

తతో బ్రహ్మసభాం జగ్ముర్మేరోర్మూర్ధని సర్వశః
సర్వం విజ్ఞాపయాం చక్రుః ప్రణతాః పరమేష్ఠినే

మేరు పర్వత శిఖరం మీద ఉన్న  బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు

స విలోక్యేన్ద్రవాయ్వాదీన్నిఃసత్త్వాన్విగతప్రభాన్
లోకానమఙ్గలప్రాయానసురానయథా విభుః

ఇంద్రాది వాయ్వాది దేవతలు బల హీనులూ శక్తి హీనులూ అయ్యారు. అమ్మవారు లేకపోవడముతో రాక్షసులు తప్ప మిగతా వారందరూ అమంగళురుగా అయ్యారు.

సమాహితేన మనసా సంస్మరన్పురుషం పరమ్
ఉవాచోత్ఫుల్లవదనో దేవాన్స భగవాన్పరః

బ్రహ్మగారు పరమ పురుషున్ని స్మరించాడు. పరమాత్మను ఈ మిషతో దర్శించుకోవచ్చు కాబట్టి బ్రహ్మగారి ముఖం వికసించింది. దేవతలతో ఇలా చెబుతున్నాడు

అహం భవో యూయమథోऽసురాదయో మనుష్యతిర్యగ్ద్రుమఘర్మజాతయః
యస్యావతారాంశకలావిసర్జితా వ్రజామ సర్వే శరణం తమవ్యయమ్

ఒక విషయాన్ని తెలుసుకోండి, నేను రుద్రుడూ మీరు రాక్షసులూ మానవులూ పక్షులూ చెట్లూ ఇతర ప్రాణులూ ఏ పరమాత్మ అవతారములో అంశలో అంశలమో ఆయననే శరణు వేడదాము. ఆయనకు చంపదగినవాడూ లేదు, రక్షించదగినవాడూ లేడూ

న యస్య వధ్యో న చ రక్షణీయో నోపేక్షణీయాదరణీయపక్షః
తథాపి సర్గస్థితిసంయమార్థం ధత్తే రజఃసత్త్వతమాంసి కాలే

ఉపేక్షించేవాడూ ఆశ్రయించేవాడూలేడు. కానీ ఆశ్రయించినవారి పక్షములో ఆయన ఉంటాడు. ఐనా సృష్టి స్థితి సంహారాల కోసం త్రిగుణాలని అవలంబిస్తాడు.

అయం చ తస్య స్థితిపాలనక్షణః సత్త్వం జుషాణస్య భవాయ దేహినామ్
తస్మాద్వ్రజామః శరణం జగద్గురుం స్వానాం స నో ధాస్యతి శం సురప్రియః

మనమిపుడు స్వామిని ప్రార్థిస్తున్నాము. ప్రపంచాన్ని రక్షించడానికి కావలసిన సత్వ గుణాన్ని ఆయన స్వీకరించాడు, ప్రాణుల రక్షణ స్వీకరించాడు. రక్షణ ఆయన పని. అందుచే సత్వ గుణం తీసుకున్న శ్రీ మహా విష్ణువును ప్రార్థిద్ధాము. ఆ పరమాత్మ శ్రీమన్నారాయణున్ని వేడుదాము. ఆయనే మనకు శుభం కలిగిస్తాడు. ఆయంకు దేవతలంటే ప్రీతి కలదు అన్న బిరుదు ఉంది.

శ్రీశుక ఉవాచ
ఇత్యాభాష్య సురాన్వేధాః సహ దేవైరరిన్దమ
అజితస్య పదం సాక్షాజ్జగామ తమసః పరమ్

ఈ రీతిలో మాట్లాడి బ్రహ్మ దేవతలందరితో కలసి అజితుడు అనే పేరుతో ఉన్న స్వామి అవతారం ఉన్న స్థానానికి (లోకానికి ) వెళ్ళాడు.

తత్రాదృష్టస్వరూపాయ శ్రుతపూర్వాయ వై ప్రభుః
స్తుతిమబ్రూత దైవీభిర్గీర్భిస్త్వవహితేన్ద్రియః

ఆయన లోకానికి వెళ్ళినా ఆయన కనపడడు. అంతకు ముందే విన్నట్లు వారికి ఆయన కనపడలేదు. అందుకని వేద వాక్యాలతో స్వామిని వారు సావధానముతో పరమాత్మ మీదే మనసూ ఇంద్రియాలు పెట్టి స్తోత్రం చేసారు.

ఇది ప్రసన్న  భగవత్స్తుతి

శ్రీబ్రహ్మోవాచ
అవిక్రియం సత్యమనన్తమాద్యం గుహాశయం నిష్కలమప్రతర్క్యమ్
మనోऽగ్రయానం వచసానిరుక్తం నమామహే దేవవరం వరేణ్యమ్

ఎలాంటి వికారం పొందని వాడవు. త్రికాలములో బాధించబడని వాడు (సత్యం, త్రికాల అబాధితం), అంతం లేని వాడు, అన్నిటికీ మొదటివాడు, ప్రతివారి అంతఃకరణములో ఉండేవాడు ఎలాంటి విశేషణాలూ లేనివాడు, ఎవరి ఊహకూ అందని వాడు, మనసు కంటే వేగముగా వెళ్ళేవాడు, ఏ వాక్కుకూ అందని వాడు, అలాంటి సర్వ శ్రేష్టుడైన పరమాత్మకు నమస్కరిస్తున్నాను

విపశ్చితం ప్రాణమనోధియాత్మనామర్థేన్ద్రియాభాసమనిద్రమవ్రణమ్
ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ తమక్షరం ఖం త్రియుగం వ్రజామహే

ప్రాణమూ మనసూ బుద్ధీ ఆత్మా, నాలిగింటినీ సాక్షాత్కరించుకునేవాడు, అర్థములకు ఇంద్రియములనూ సాక్షాత్కరింపచేసుకుంటాడు, సాక్షాత్కరింపచేస్తాడు, తమోగుణం లేనివాడు, ఇతరగుణముల ప్రభావం లేనివాడు, ప్రకృతి సంబంధమైన శరీరం లేనివాడు (శరీరమే ఆత్మకు గాయం, ఆ గాయం లేనివాడు పరమాత్మ, ప్రకృతి బద్ధమైన శరీరం లేనివాడు)
అజ్య్నానం జ్ఞ్యానములు (చాయా తపౌ), కోరిక కలిగేవారికే ఉంటాయి (గృధ్రపక్షౌ ).
ఛాయాతపౌ యత్ర న గృధ్రపక్షౌ - ఎండా నీడలు గ్రద్దకు రెక్కలు కావు. ఇక్కడ నీడ అజ్ఞ్యానం, తపౌ అంటే జ్ఞ్యానం. గృధ్రం అంటే కోరికలు.గాయమైతే గ్రద్దలు వస్తాయి. పొడుచుకుని తింటాయి. వ్రణం కనపడితే గ్రద్దలు ఎలా ఊరుకోవో, శరీరం కనపడితే మనసు ఊరుకోదు. దీని వెంటనే కోపం ఉంటుంది.
నిరంతరం కోరికనే అంటిపెట్టుకుని ఉండే జీవునికి ఉండే అజ్ఞ్యానం జ్ఞ్యానం ఎవరికి కోరికకు పక్షముగా కాకుండా ఉంటాయో అటువంటి పరమాత్మవు నీవు.
అలాంటి నాశరహితం, నిరాకార నిర్గుణ స్వరూపం అయిన, ధర్మార్థ కామ స్వరూపుడు, సత్వ రజస్తమో రూపుడు ఐన పరమాత్మకు నమస్కారం

అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం పఞ్చదశారమాశు
త్రినాభి విద్యుచ్చలమష్టనేమి యదక్షమాహుస్తమృతం ప్రపద్యే

కాలమనే ఈ చక్రం పరమాత్మ యొక్క మాయతో నడవబడేదీ తిప్పబడేది. మనసనే చక్రం ఇది. పదిహేను ఆకులు ఉంటాయి. ఐదు జ్ఞ్యానేంద్రియములూ ఐదు కర్మేంద్రియములు పంచభూతములు. సత్వ రజసతమో గుణాలు త్రినాభులు. ఎనిమిది నేములు ఎనిమిది ప్రకృతులు. ఈ చక్రానికి మధ్యభాగం పరమాత్మ, అటువంటి నీకు నమస్కారం.

య ఏకవర్ణం తమసః పరం తదలోకమవ్యక్తమనన్తపారమ్
ఆసాం చకారోపసుపర్ణమేనముపాసతే యోగరథేన ధీరాః

నీవు ఏకవర్ణం, ఒకే తీరుగా ఉంటావు. అజ్ఞ్యానానికి అవతల తీరములో ఉంటావు, ఎవరికీ కనపడవు ఎవరికీ తెలియబడవు, ఆది అంతములు లేనివాడవు.నిన్ను ధీరులు మాత్రమే యోగరథము మీద ఉపాసన చేస్తారు.

న యస్య కశ్చాతితితర్తి మాయాం యయా జనో ముహ్యతి వేద నార్థమ్
తం నిర్జితాత్మాత్మగుణం పరేశం నమామ భూతేషు సమం చరన్తమ్

నీ మాయను ఎవరూ దాటలేరు, దాటలేకపోవడమే కాదు దాటాలని కూడా అనుకోరు. నీ మాయతో లోకమంతా మోహం చెంది తెలియవలసిన దాన్ని తెలియజాలదు. నీవు మనసు యొక్క బుద్ధి యొక్క గుణాన్ని గెలిచినవాడివి. అన్ని భూతముల యందూ సమానముగా ఉంటావు. నీకు నమస్కారం.

ఇమే వయం యత్ప్రియయైవ తన్వా సత్త్వేన సృష్టా బహిరన్తరావిః
గతిం న సూక్ష్మామృషయశ్చ విద్మహే కుతోऽసురాద్యా ఇతరప్రధానాః

మేమంతా నీ శరీరము చేత అంశగా సృష్టించబడ్డాము. కొందరు లోపలా కొందరు వెలుపలా. నీ యొక్క అతి సూక్ష్మ గతిని సత్వ గుణ ప్రధానముగా ఉన్న ఋషులు కూడా తెలుసుకోలేరు. ఇంక రాక్షసాదులు ఏమి తెలుసుకుంటారు.

పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూతసర్గః
స వై మహాపూరుష ఆత్మతన్త్రః ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతిః

భూమి నీ పాదములు, ఈ భూమిలో నాలుగు రకాల ప్రాణులు ఉంటాయి. జలము(మావి) నుంచి అండం నుంచి స్వేదం నుంచీ భూమి నుంచి పుడతాయి. ఈ భూత జాలమంతా ఏ భూమి మీద ఉంటుందో అది నీ పాదములు. నీవు ఇతరులకు అధీనుడవు కావు, ఆత్మ తంత్రుడవు.

అమ్భస్తు యద్రేత ఉదారవీర్యం సిధ్యన్తి జీవన్త్యుత వర్ధమానాః
లోకా యతోऽథాఖిలలోకపాలాః ప్రసీదతాం నః స మహావిభూతిః

నీ యొక్క ఉదారమైన వీర్యము జలము. జలములో పెరిగే వారు పుట్టీ పెరిగి బలమును కూర్చుకుని సిద్ధిని పొందుతారు. మూడు లోకములూ మూడు లోకముల పాలకులు ఆ జలములోనే పుట్టి వృద్ధి పొంది సిద్ధి పొందుతున్నారు. అలాంటి స్వామి నాకు ప్రసన్నమవుగాక.

సోమం మనో యస్య సమామనన్తి దివౌకసాం యో బలమన్ధ ఆయుః
ఈశో నగానాం ప్రజనః ప్రజానాం ప్రసీదతాం నః స మహావిభూతిః

చంద్రుడు నీ మనసు. ఈ చంద్రుడే దేవతలకు ఆహారం (అమృతం), ప్రాణం. ఇతనే వృక్షములకు అధిపతి (మంచుతో), ప్రజలకు సృష్టిని పెంచేవాడు. పితృదేవతలకూ ప్రాణం ఇతనే (కిరణములవలన). అటువంటి మహావిభూతి కల పరమాత్మ మాకు ప్రసన్నమవుగాక.

అగ్నిర్ముఖం యస్య తు జాతవేదా జాతః క్రియాకాణ్డనిమిత్తజన్మా
అన్తఃసముద్రేऽనుపచన్స్వధాతూన్ప్రసీదతాం నః స మహావిభూతిః

అగ్ని నీ ముఖము. అగ్నిహోత్రుడు వేదములను తెలిపేవాడు - జాతవేద. ఆ అగ్నే అన్ని క్రియలకూ ప్రతినిధి. జ్ఞ్యాన కాండ క్రియా కాండ ఉపాసనా కాండ (కాండ త్రయం) అనే మూడు కాండలలో అగ్నిహోత్రుడు క్రియా కాండకు ప్రతినిధి. జాతకర్మా నామకరణాది చౌలాది క్రియలకు అధిపతి.
ఈ అగ్నిహోత్రుడు మన శరీరములో (ఇక్కడ సముద్రం అంటే శరీరం. సాముద్రిక శాస్త్రములో ఉన్న ముద్రలతో ఉన్నది సముద్రం. శరీరానికి ముద్ర అని పేరు. సంతోషమునిచ్చేదానితో కూడుకుని ఉన్నది కాబట్టి శరీరం) ఉన్న సప్త ధాతువులను జఠరాగ్ని రూపములో ఉండి పచనం చేస్తాడు. కావలసిన శక్తిని ప్రసరింపచేస్తాడు అగ్నిహోత్రుడు. త్వక్ మాంఅస మధ్య రుధిరాది సప్త ధాతువులు సరిగా ఉండాలంటే జఠరాగని సరిగ్గా ఉండాలి. తరువాత చేయవలసిన పనికి సన్నద్ధత, కావలసినవి ఉంచుకుని అవసరం లేనివి బయటకు పంపుతావు.

యచ్చక్షురాసీత్తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏష ధిష్ణ్యమ్
ద్వారం చ ముక్తేరమృతం చ మృత్యుః ప్రసీదతాం నః స మహావిభూతిః

ఈ స్తోత్రములో ఉన్న క్రమం ఇది. భూమి, జలం, జలాధి దేవత చంద్రుడు, తరువాత అగ్ని, అగ్ని దేవత సూర్యుడు.
నీవే చక్సువువి. నీ నేత్రం నుండి సూర్యుడు పుట్టాడు. నీ నేత్రము సూర్యుడు. ఈయనే దేవయానం (అర్చి మార్గము). ఈ సూర్యుడు వేదమయుడు. బ్రహ్మకు మూలస్థానం (ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తి). ముక్తికి ఈయనే ద్వారం. అమృతం కూడా ఈయనే. మృత్యువు కూడా ఈయనే.

ప్రాణాదభూద్యస్య చరాచరాణాం ప్రాణః సహో బలమోజశ్చ వాయుః
అన్వాస్మ సమ్రాజమివానుగా వయం ప్రసీదతాం నః స మహావిభూతిః

ఇపుడు వాయువు. నీ ప్రాణం నుండే సకల చరాచర ప్రాణం ఏర్పడ్డాయి. ఈ వాయువే సహః (వేగ సామర్ధ్య). బలం ఓజః (నిగ్రహించే సామర్ధ్యం). ఒక సమ్రాట్టును అనుచరులు అనుసరించినట్లుగా నిన్ను మేము అనుసరిస్తున్నాము

శ్రోత్రాద్దిశో యస్య హృదశ్చ ఖాని ప్రజజ్ఞిరే ఖం పురుషస్య నాభ్యాః
ప్రాణేన్ద్రియాత్మాసుశరీరకేతః ప్రసీదతాం నః స మహావిభూతిః

వాయువు ఉండేది ఆకాశములో. పరమాత్మ యొక్క శ్రవణ ఇంద్రియమునుండి దిక్కులు ఏర్పడ్డాయి. హృదయం నుండి ఇంద్రియములు ఏర్పడ్డాయి. నీ నాభినుండి ఆకాశం ఉద్భవించింది. ప్రాణ ఇంద్రియ ఆత్మ అసు శరీర అనే ఐదింటికీ నీవే మూలాధారం. అలాంటి మహావిభూతి ప్రసన్నమవుగాక.

బలాన్మహేన్ద్రస్త్రిదశాః ప్రసాదాన్మన్యోర్గిరీశో ధిషణాద్విరిఞ్చః
ఖేభ్యస్తు ఛన్దాంస్యృషయో మేఢ్రతః కః ప్రసీదతాం నః స మహావిభూతిః

ఆ పరమాత్మ బలమునుండి పుట్టినవాడు ఇంద్రుడు, అనుగ్రహం నుండి పుట్టిన్వారు దేవతలు, కోపం నుండి పుట్టినవారు రుద్రుడు, బుద్ధినుండి బ్రహ్మ ఇంద్రియముల నుండి వేదములు పుట్టాయి, ఉపస్థ నుండి ఋషులు పుట్టాయి.

శ్రీర్వక్షసః పితరశ్ఛాయయాసన్ధర్మః స్తనాదితరః పృష్ఠతోऽభూత్
ద్యౌర్యస్య శీర్ష్ణోऽప్సరసో విహారాత్ప్రసీదతాం నః స మహావిభూతిః

వక్షస్థలమునుండి అమ్మవారు, నీ చాయతో పితృ దేవతలూ ధర్మము స్తనములనుండి, ధర్మము కానిది వీపునుండి పుట్టింది. శిరస్సు నుండి ద్యౌ ఆవిర్భవించింది, విహారం నుండి అప్సరసలు ఆవిర్భవించారు.

విప్రో ముఖాద్బ్రహ్మ చ యస్య గుహ్యం రాజన్య ఆసీద్భుజయోర్బలం చ
ఊర్వోర్విడోజోऽఙ్ఘ్రిరవేదశూద్రౌ ప్రసీదతాం నః స మహావిభూతిః

బ్రాహ్మణులు ముఖము నుండి, రాజులు భుజముల నుండి, ఊరువుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టారు. అటువంటి స్వామి ప్రసన్నమవుగాక

లోభోऽధరాత్ప్రీతిరుపర్యభూద్ద్యుతిర్నస్తః పశవ్యః స్పర్శేన కామః
భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నః స మహావిభూతిః

కింది పెదవి నుండి లోభం పై పెదవి నుండి ప్రీతి నాసిక నుండి ద్యుతి నాసిక నుండి పశువులు స్పర్శతో కోరిక కనుబొమ్మలనుండి యముడు రెప్పలతో కాలం పుట్టింది

ద్రవ్యం వయః కర్మ గుణాన్విశేషం యద్యోగమాయావిహితాన్వదన్తి
యద్దుర్విభావ్యం ప్రబుధాపబాధం ప్రసీదతాం నః స మహావిభూతిః

ద్రవ్యం నీ వయః, నీ యోగ మాయచేత గుణ కర్మలు పుడతాయి. ఏది ఊహకు అందనిదో జ్ఞ్యానులను కూడా మోహింపచేస్తుందో అలాంటి స్వామి కాపాడాలి

నమోऽస్తు తస్మా ఉపశాన్తశక్తయే స్వారాజ్యలాభప్రతిపూరితాత్మనే
గుణేషు మాయారచితేషు వృత్తిభిర్న సజ్జమానాయ నభస్వదూతయే

అన్ని ఇతర శక్తులను శమింపచేసేవాడివి, స్వారాజ్యముతో ఆత్మానందం కలవాడవు. నీ మాయచేత ఏర్పరచబడిన సత్వ రజస్తమో గుణాల యందు నీవు ఆసక్తుడవు కావు. ఆకాశానికి కూడా నీవే మూలం.

స త్వం నో దర్శయాత్మానమస్మత్కరణగోచరమ్
ప్రపన్నానాం దిదృక్షూణాం సస్మితం తే ముఖామ్బుజమ్

నీకు నమస్కారం. మా అందరిపుట్టుకకు కారణమైన నీవు మా కళ్ళకు కనపడు. నిన్ను ఆశ్రయించి చిరునవ్వుతో కూడిన నీ ముఖపద్మాన్ని కోరుతున్నాము

తైస్తైః స్వేచ్ఛాభూతై రూపైః కాలే కాలే స్వయం విభో
కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్కరోతి హి

ఆయా సమయములో ఆయా రూపాలు స్వీకరించి ఎవరికీ అర్థం కాని రీతిలో లీలను చేస్తావు.

క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా
దేహినాం విషయార్తానాం న తథైవార్పితం త్వయి

మేము చేసే పనులకు కష్టం ఎక్కువ ఫలం తక్కువ. అలాంటి కర్మలు చేస్తూ ఉంటాము. విఫలమవుతూ ఉణ్టాయి మేము చేసే కర్మలు. కష్టం మాత్రమే మిగులుతుంది. విషయం చేత ఆర్తులైన దేహుల కర్మలు ఇలా ఉంటాయి. నీ యందు అర్పించని పనులు ఇలాగే ఉంటాయి.

నావమః కర్మకల్పోऽపి విఫలాయేశ్వరార్పితః
కల్పతే పురుషస్యైవ స హ్యాత్మా దయితో హితః

అదే కర్మలు నీకు అర్పిస్తే పని కాకున్నా, పని లాంటిదైనా అది తక్కువదికాదు, చిన్నది కాదు, ఫల రాహిత్యం ఉండదు. ఏ పని ఐనా నీకు అర్పిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రతీ ప్రాణికీ నీవే ఆత్మా ప్రియుడివీ హితం కలిగించేవాడివి

యథా హి స్కన్ధశాఖానాం తరోర్మూలావసేచనమ్
ఏవమారాధనం విష్ణోః సర్వేషామాత్మనశ్చ హి

చెట్టు మొత్తానికి నీరు పోయాలంటే వేరుకు మాత్రమే నీరుపోసినట్లు, నిన్ను ఒక్కడినే ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్లే. అందరూ తృప్తి పొందుతారు.

నమస్తుభ్యమనన్తాయ దుర్వితర్క్యాత్మకర్మణే
నిర్గుణాయ గుణేశాయ సత్త్వస్థాయ చ సామ్ప్రతమ్

నీవు అనంతుడవు నీవు నమస్కారం. ఏ సమయములో నీవు ఏ పని చేస్తావో ఎవరూ ఊహించలేరు. నీవు నిర్గుణుడివి, అన్ని గుణాలకూ నీవు ఈశుడివి. ప్రస్తుతం నీవు సత్వ గుణములో ఉన్నావు. అలాంటి నీకు నమస్కారం.

ఇది పురుష సూక్తాన్న్ని చెప్పిన స్తుతి.

                                                                                            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు  

Thursday, May 2, 2013

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం నాలగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం నలగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తదా దేవర్షిగన్ధర్వా బ్రహ్మేశానపురోగమాః
ముముచుః కుసుమాసారం శంసన్తః కర్మ తద్ధరేః

అప్పుడు దేవతలూ గంధర్వులూ బ్రహ్మా రుద్రుడూ అందరూ పుష్పవృష్టి కురిపించారు.దివ్య దుందుభులు మోగాయి , అప్సరసలు నాట్యం చేసారు.ఈ మొసలి హు హు అనే పేరు గల గంధర్వుడు.దేవల మహర్షి శాపం వలన ముసలిగా పుట్టాడు.ఆ గంధర్వుడు పరమాత్మకు నమస్కరించి, ఉత్తమ కథలు కల పరమాత్మను గానం చేసాడు.  పరమాత్మ కటాక్షం చేత ఆయనకు ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగా తన లోకానికి వెళ్ళాడు. గజేంద్రుడు పరమాత్మ స్పర్శ వలన అజ్ఞ్యానం తొలగిపోయి భగవత్ సరూప్యాన్ని పొందాడు. చత్రుభుజాన్ని పీతాబరధారిత్వాన్ని పొందాడు.ఇంతకు ముందు జన్మలో ఇతను ఇంద్రద్యుమ్నుడనే మహానుభావుడు, ద్రవిడ దేశపు రాజు. మౌన్వ వ్రతాన్ని ధరించి జటలు ధరించి తాపసుడై స్నానం చేసి పరమాత్మను ధ్యానం చేస్తుంటే పరమాత్మ సంకల్పం వలన అగస్త్యుడు శిష్యులతో కలసి అక్కడికి వచ్చాడు.మౌనవ్రతములో భగవత్ ధ్యానములో ఉండుట వలన మునిని చూచి కూడా లేవలేదూ నమస్కరించలేదు.భగవతుని ఆరాధనకంటే విశిష్టమైనది భాగవత ఆరాధన.బుద్ధిలేకుండా ఏనుగులా ప్రవర్తించిననందుకు ఏనుగుగా, స్తబ్ద మతిగా పుట్టమని శపించాడు. అలా శపించి వెళ్ళిపోయాడు. అది విని కూడా ఇంద్రద్య్మ్నుడు లేవలేదు. దాని గురించి భగవంతుని ప్రార్థించలేదు. ఇలా జ్ఞ్యాక శక్తి ఉండే అవకాశం లేని ఏనుగు జాతిలో పుట్టి కూడా పరమాత్మని ఆరాధించినవాడు కాబట్టి పూర్వ జన్మ జ్ఞ్యానం కలిగి  మోక్షాన్ని పొందాడు. ఇలా స్వామి మోక్షాన్నిచ్చి పరమాత్మ తన లోకానికి తన భవనానికి, అందరిచేతా గానం చేయబడుతూ వెళ్ళాడు


నేదుర్దున్దుభయో దివ్యా గన్ధర్వా ననృతుర్జగుః
ఋషయశ్చారణాః సిద్ధాస్తుష్టువుః పురుషోత్తమమ్

అప్పుడు దేవతలూ గంధర్వులూ బ్రహ్మా రుద్రుడూ అందరూ పుష్పవృష్టి కురిపించారు.దివ్య దుందుభులు మోగాయి , అప్సరసలు నాట్యం చేసారు.


యోऽసౌ గ్రాహః స వై సద్యః పరమాశ్చర్యరూపధృక్
ముక్తో దేవలశాపేన హూహూర్గన్ధర్వసత్తమః

ఈ మొసలి హు హు అనే పేరు గల గంధర్వుడు.దేవల మహర్షి శాపం వలన ముసలిగా పుట్టాడు.

ప్రణమ్య శిరసాధీశముత్తమశ్లోకమవ్యయమ్
అగాయత యశోధామ కీర్తన్యగుణసత్కథమ్

ఆ గంధర్వుడు పరమాత్మకు నమస్కరించి, ఉత్తమ కథలు కల పరమాత్మను గానం చేసాడు. 

సోऽనుకమ్పిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్య తమ్
లోకస్య పశ్యతో లోకం స్వమగాన్ముక్తకిల్బిషః

పరమాత్మ కటాక్షం చేత ఆయనకు ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగా తన లోకానికి వెళ్ళాడు.

గజేన్ద్రో భగవత్స్పర్శాద్విముక్తోऽజ్ఞానబన్ధనాత్
ప్రాప్తో భగవతో రూపం పీతవాసాశ్చతుర్భుజః

గజేంద్రుడు పరమాత్మ స్పర్శ వలన అజ్ఞ్యానం తొలగిపోయి భగవత్ సరూప్యాన్ని పొందాడు. చత్రుభుజాన్ని పీతాబరధారిత్వాన్ని పొందాడు.

స వై పూర్వమభూద్రాజా పాణ్డ్యో ద్రవిడసత్తమః
ఇన్ద్రద్యుమ్న ఇతి ఖ్యాతో విష్ణువ్రతపరాయణః

ఇంతకు ముందు జన్మలో ఇతను ఇంద్రద్యుమ్నుడనే మహానుభావుడు, ద్రవిడ దేశపు రాజు. మౌన వ్రతాన్ని ధరించి జటలు ధరించి తాపసుడై స్నానం చేసి పరమాత్మను ధ్యానం చేస్తుంటే

స ఏకదారాధనకాల ఆత్మవాన్గృహీతమౌనవ్రత ఈశ్వరం హరిమ్
జటాధరస్తాపస ఆప్లుతోऽచ్యుతం సమర్చయామాస కులాచలాశ్రమః


యదృచ్ఛయా తత్ర మహాయశా మునిః సమాగమచ్ఛిష్యగణైః పరిశ్రితః
తం వీక్ష్య తూష్ణీమకృతార్హణాదికం రహస్యుపాసీనమృషిశ్చుకోప హ


పరమాత్మ సంకల్పం వలన అగస్త్యుడు శిష్యులతో కలసి అక్కడికి వచ్చాడు.మౌనవ్రతములో భగవత్ ధ్యానములో ఉండుట వలన మునిని చూచి కూడా లేవలేదూ నమస్కరించలేదు.


తస్మా ఇమం శాపమదాదసాధురయం దురాత్మాకృతబుద్ధిరద్య
విప్రావమన్తా విశతాం తమిస్రం యథా గజః స్తబ్ధమతిః స ఏవ

భగవతుని ఆరాధనకంటే విశిష్టమైనది భాగవత ఆరాధన.బుద్ధిలేకుండా ఏనుగులా ప్రవర్తించిననందుకు ఏనుగుగా, స్తబ్ద మతిగా పుట్టమని శపించాడు. అలా శపించి వెళ్ళిపోయాడు.
అది విని కూడా ఇంద్రద్య్మ్నుడు లేవలేదు. దాని గురించి భగవంతుని ప్రార్థించలేదు. ఇలా జ్ఞ్యాక శక్తి ఉండే అవకాశం లేని ఏనుగు జాతిలో పుట్టి కూడా పరమాత్మని ఆరాధించినవాడు కాబట్టి పూర్వ జన్మ జ్ఞ్యానం కలిగి  మోక్షాన్ని పొందాడు. ఇలా స్వామి మోక్షాన్నిచ్చి పరమాత్మ తన లోకానికి తన భవనానికి, అందరిచేతా గానం చేయబడుతూ వెళ్ళాడు

శ్రీశుక ఉవాచ
ఏవం శప్త్వా గతోऽగస్త్యో భగవాన్నృప సానుగః
ఇన్ద్రద్యుమ్నోऽపి రాజర్షిర్దిష్టం తదుపధారయన్

నీవడింగినదంతా గజేంద్ర  మోక్షాన్నీ పరమత్మ ప్రభావాన్నీ చెప్పాను.స్వర్గాన్నీ కీర్తినీ ఇచ్చేదీ కలిదోషాలను పోగొట్టేదీ దుస్స్వప్నాలను పోగొట్టేది, శ్రేయస్సుకోరే వారూ బ్రాహ్మణోత్తములూ పరిశుద్ధులూ పొద్దున్నే లేచి దుస్స్వప్నములు తొలగడానికి పారాయణ చేస్తారు. అందరూ చూస్తుండగా పరమాత్మ గజేంద్రునితో ఇలా మాట్లాడాడు.

ఆపన్నః కౌఞ్జరీం యోనిమాత్మస్మృతివినాశినీమ్
హర్యర్చనానుభావేన యద్గజత్వేऽప్యనుస్మృతిః

ఏవం విమోక్ష్య గజయూథపమబ్జనాభస్
తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః
గన్ధర్వసిద్ధవిబుధైరుపగీయమాన
కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోऽగాత్

ఏతన్మహారాజ తవేరితో మయా కృష్ణానుభావో గజరాజమోక్షణమ్
స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుఃస్వప్ననాశం కురువర్య శృణ్వతామ్

యథానుకీర్తయన్త్యేతచ్ఛ్రేయస్కామా ద్విజాతయః
శుచయః ప్రాతరుత్థాయ దుఃస్వప్నాద్యుపశాన్తయే

ఇదమాహ హరిః ప్రీతో గజేన్ద్రం కురుసత్తమ
శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభుః

శ్రీభగవానువాచ
యే మాం త్వాం చ సరశ్చేదం గిరికన్దరకాననమ్
వేత్రకీచకవేణూనాం గుల్మాని సురపాదపాన్

శృఙ్గాణీమాని ధిష్ణ్యాని బ్రహ్మణో మే శివస్య చ
క్షీరోదం మే ప్రియం ధామ శ్వేతద్వీపం చ భాస్వరమ్

శ్రీవత్సం కౌస్తుభం మాలాం గదాం కౌమోదకీం మమ
సుదర్శనం పాఞ్చజన్యం సుపర్ణం పతగేశ్వరమ్

శేషం చ మత్కలాం సూక్ష్మాం శ్రియం దేవీం మదాశ్రయామ్
బ్రహ్మాణం నారదమృషిం భవం ప్రహ్రాదమేవ చ

మత్స్యకూర్మవరాహాద్యైరవతారైః కృతాని మే
కర్మాణ్యనన్తపుణ్యాని సూర్యం సోమం హుతాశనమ్

ప్రణవం సత్యమవ్యక్తం గోవిప్రాన్ధర్మమవ్యయమ్
దాక్షాయణీర్ధర్మపత్నీః సోమకశ్యపయోరపి

గఙ్గాం సరస్వతీం నన్దాం కాలిన్దీం సితవారణమ్
ధ్రువం బ్రహ్మఋషీన్సప్త పుణ్యశ్లోకాంశ్చ మానవాన్

ఉత్థాయాపరరాత్రాన్తే ప్రయతాః సుసమాహితాః
స్మరన్తి మమ రూపాణి ముచ్యన్తే తేऽంహసోऽఖిలాత్

యే మాం స్తువన్త్యనేనాఙ్గ ప్రతిబుధ్య నిశాత్యయే
తేషాం ప్రాణాత్యయే చాహం దదామి విపులాం గతిమ్

సంతోషించిన ప్రమాత్మ గజేంద్రునితో ప్రాణులందరూ వింటూ ఉండగా, "నిన్నూ నన్ను ఈ సరసూనూ చెట్లనూ గుట్టలనూ శిఖరాలనూ ఋషుల ఆశ్రమాలనూ బ్రహ్మాది లోకాలనూ నా ఆయుధాలనూ వనమాల గరుడుడూ లక్ష్మీ దేవి నారదున్నీ శివున్నీ నా అవతారాలనూ సూర్యుడినీ అగ్నిహోత్రున్నీ గోవులనూ విప్రులనూ దక్ష పుత్రికలనూ చంద్రున్నీ కాశ్యపున్నీ గంగనీ ఐరావతాన్నీ ధ్రువున్నీ మొదలైన్వారినీ తెల్లవారే లేచి వినయం కలవారై ఈ నా రూపాలను స్మరిస్తే వారు అఖిల పాపముల నుండీ రక్షించబడతారు.నీవు చేసిన స్తోత్రముతో తెల్లవారు ఝామునే లేచి ఎవరు నన్ను స్తోత్రం చేస్తారో, వారికి చనిపోయిన తరువాత నేను మోక్షం ఇస్తాను


శ్రీశుక ఉవాచ
ఇత్యాదిశ్య హృషీకేశః ప్రాధ్మాయ జలజోత్తమమ్
హర్షయన్విబుధానీకమారురోహ ఖగాధిపమ్

ఇలా గజేంద్రునితో మాట్లాడి శ్రీమన్నారాయణుడు పాంచ జన్యాన్ని పూరించి సకల దేవతా సమూహాన్ని ఆనందింపచేస్తూ గరుత్మంతున్ని అధిరోహించి వైకుంఠానికి వెళ్ళాడు

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనో హృది
జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితమ్

ఇలా మనసుని బుద్ధిలో నిలిపి ఈ గజరాజు పూర్వ జన్మలో నేర్చుకున్న పరమాత్మ మంత్రాన్ని జపించాడు. 

శ్రీగజేన్ద్ర ఉవాచ
ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకమ్
పురుషాయాదిబీజాయ పరేశాయాభిధీమహి

సకల చరాచర జగత్తులో ఎవరు వ్యాపించి ఉన్నాడో. ఉన్న ఒకే పురుషుడు. ఆయనే మొదటి కారణం. భ్రహ్మాదులకి కూడా అదిదేవత.ఆయనను నేను ధ్యానం చేస్తున్నాను

యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయమ్
యోऽస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయమ్భువమ్

సకల చరాచర జగత్తులో ఎవరిలో ఉందో ఎవరి వల్ల వచ్చిందో ఎవరి వలన సృష్టించబడుతుందో, ఇహ లోకము పరలోకము కంటే పరమైన వాడు ఎవరో అలాంటి స్వయంభువుని శరణు వేడుతున్నాను.
ఎవ్వనిచే జనించు జగ, మెవ్వనిలోపల నుండు లీనమై
యెవ్వనియందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూలకారణం
బెవ్వ, డనాదిమధ్యలయు డెవ్వడు, సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

యః స్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వ చ తత్తిరోహితమ్
అవిద్ధదృక్సాక్ష్యుభయం తదీక్షతే స ఆత్మమూలోऽవతు మాం పరాత్పరః

ఆ పరమాత్మ సకల చరాచర జగత్తునీ తన మాయతో సాక్షాత్కరింపచేస్తాడు కొంతమందికి దాస్తాడు. ఆయన జ్ఞ్యానానికి ఎటువంటి అడ్డూ ఉండదు. అన్నిటికీ ఆయన సాక్షి.

కాలేన పఞ్చత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు
తమస్తదాసీద్గహనం గభీరం యస్తస్య పారేऽభివిరాజతే విభుః

ప్రకృతినీ జీవున్నీ చూస్తూ ఉంటాడు. అలాంటి పరాత్పరుడు నన్ను కాపాడుగాక. అన్నిలోకములూ లోకపాలకులూ అన్నీ ఆయా కాలం రాగానే నశిస్తాయి.  మొత్తం చీకటి అంతులేని చీకటి. ఆ చీకటి అవతల నీవు ఉంటావు. వేదాహమేతం పురుషం మహాంతమ్” | ఆదిత్యవర్ణం తమసస్తు పారే.

న యస్య దేవా ఋషయః పదం విదుర్జన్తుః పునః కోऽర్హతి గన్తుమీరితుమ్
యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః స మావతు

ఆయన ఉన్న ప్రదేశాన్ని దేవతలు కానీ ఋషులు గానీ తెలియలేరు.  ఆ స్థానన్ని మామూలు జీవుడు ఎలా తెలుసుకుంటాడు. పరమాత్మ ఉండే చోటు ఫలాన అని చెప్పగలమా. నటుడు రకరకాల వేషాలు వేసుకుని వస్తే మనకు ఆ వేషం కనపడుతుంది కానీ అది వేసుకున్నవాడు కనపడడు.

దిదృక్షవో యస్య పదం సుమఙ్గలం విముక్తసఙ్గా మునయః సుసాధవః
చరన్త్యలోకవ్రతమవ్రణం వనే భూతాత్మభూతాః సుహృదః స మే గతిః

ఆయనను చేరడానికి వీలు లేదు. అలాంటి వాడు నన్ను కాపాడుగాక.ఎవరి యొక్క స్థానాన్ని చేరాలని ముక్తసనుగులైన సాధువులు అలౌకిక వ్రతాన్ని, అడ్డులేని వ్రతాన్ని అవలంబిస్తారు.

న విద్యతే యస్య చ జన్మ కర్మ వా న నామరూపే గుణదోష ఏవ వా
తథాపి లోకాప్యయసమ్భవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి

వీరందరూ ఎవరిని ఆత్మగా తలుస్తారో ఆయన నాకు గతి.ఎవరికి పుట్టుకా లేదు,కర్మలతో సంబంధం లేదో, ప్రకృతితో కర్మలతో వచ్చిన పేరూ రూపమూ లేదో, ఇవేవీ లేకపోయినా లోక సృష్టికీ స్థితికీ లయానికీ నామ రూపాలు తన సంకల్పముతో తెచ్చుకుంటాడు.

తస్మై నమః పరేశాయ బ్రహ్మణేऽనన్తశక్తయే
అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే

ఇదంతా ఆయన సంకల్పము తప్ప ప్రకృతి బంధం కాదు. ఇలాంటి పరమేశ్వరునికీ అనత శక్తునికీ నమస్కారం. ఏ రూపమూలేక అన్ని రూపాలూ ఉన్నవాడు

నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే
నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి

ఆత్మసాక్షాత్కరం కలిగించే వాడు సకల జగత్తుకూ సాక్షి అయినవాడు. వాక్కులకు అందని వాడు.

సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా
నమః కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే

మనసుకు కానీ చిత్తమునకూ కానీ వాక్కుకు కానీ అందని వాడు. నైష్కర్మ్యముతో ఆచరించే కర్మలకు అందేవాడు.

నమః శాన్తాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే
నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ

మోక్షానికి నాధుడు, మోక్షానాంద స్వరూప జ్ఞ్యానం ఇచ్చేవాడు. గుణ త్రయ రహితుడు, గుణ త్రయమును ఆవహించి ప్రళయం కలిగించేవాడు.అందరినీ మోహింపచేసేవాడు, మోహమే స్వరూపముగా కలవాడు.రూపమూ గుణమూ లేని నిర్విశేషుడు.జ్ఞ్యానధనుడు. జ్ఞ్యానమే ధనముగా కలవాడు.

క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే
పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః

సర్వాధ్యక్షుడు.జీవాత్మ ప్రకృతికీ మూలమైన స్వామికి నమస్కారం.సకల ఇంద్రియ గుణములను సాక్షాత్కరింపచేసేవాడు, ఇంద్రియాలకు ఆయా శక్తులను ప్రసరింపచేసేవాడు,

సర్వేన్ద్రియగుణద్రష్ట్రే సర్వప్రత్యయహేతవే
అసతా చ్ఛాయయోక్తాయ సదాభాసాయ తే నమః

సకల జగత్తుకూ జ్ఞ్యానం ఇచ్చేవాడు, ఏ సమయములో ఏ జ్ఞ్యానం ఇవ్వాలో ఆ జ్ఞ్యానం ఇచ్చేవాడు. సంస్కారానికి అనుగుణమైన బుద్ధినీ జ్ఞ్యానాన్ని కల్పించేవాడు.అందరి విశ్వాసానికి బుద్ధికీ ఆయనే హేతువు. అయ్న సత్తుగా భాసిస్తాడు.నశించేది నశించనట్లుగా నశిచనిది లేనట్లుగా ఈయన మాయ వలన అనిపిస్తుంది.

నమో నమస్తేऽఖిలకారణాయ నిష్కారణాయాద్భుతకారణాయ
సర్వాగమామ్నాయమహార్ణవాయ నమోऽపవర్గాయ పరాయణాయ

అన్నిటికీ నీవే కారణం, దేనికీ కారణం కావు. ఊహించడానికి కూడా వీలులేనంత అద్భుతమైన కారణం. నీవే మోక్షమూ నీవే పరమ ఆధారం

గుణారణిచ్ఛన్నచిదుష్మపాయ తత్క్షోభవిస్ఫూర్జితమానసాయ
నైష్కర్మ్యభావేన వివర్జితాగమ స్వయంప్రకాశాయ నమస్కరోమి

గుణమనే పైకప్పుచే కప్పబడిన జీవుని స్వరూపాన్ని కాపాడెవాడు. ప్రకృతి యొక్క క్షోభ వలన వచ్చే అహంకార మహత్ తత్వాలకు కారణం. కామన లేకుండా నిష్కామముగా ఆచరించే కర్మల వలన మాత్రమే కనపడే వాడు. ఏ కోరికా లేకుంటే అన్నీ చూపేవాడు. కోరితే తన స్వరూపాన్ని దాచేవాడు.

మాదృక్ప్రపన్నపశుపాశవిమోక్షణాయ ముక్తాయ భూరికరుణాయ నమోऽలయాయ
స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే

మాలాంటి ప్రపన్న (ఆశ్రయించిన) పశువుల (జీవుల) యొక్క పాశములను విడిపించేవాడా. నీకు ఏ పాశమూ లేదు, దయ కలిగినవాడవు, లయము చెందని వాడవు. నీ ఒక అంశముతో సకల దేహదారుల హృదయములో అంతర్యామిగా ఉంటావు. అలా అంతర్యామిగా ఉండి తనను తాను చూసుకునేవాడు. బ్రహ్మకు (బృహతే) నమస్కారం.

ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తైర్దుష్ప్రాపణాయ గుణసఙ్గవివర్జితాయ
ముక్తాత్మభిః స్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ

అంత పెద్దవాడైనా అందరికీ అందడు. శరీరం పుత్రులూ బంధువులూ భార్య ధనమూ జనము యందు ఆశకలవారికి అందడు. అయనకు త్రిగుణాలూ లేవు, వాటి యందు సంగమూ లేదు. నిరంతరం ముక్తాత్మలు తన హృదయములోనే భావింపబడే వాడవు. నీవే జ్ఞ్యానాత్మవూ పరమాత్మవూ ఈశ్వరుడవు.

యం ధర్మకామార్థవిముక్తికామా భజన్త ఇష్టాం గతిమాప్నువన్తి
కిం చాశిషో రాత్యపి దేహమవ్యయం కరోతు మేऽదభ్రదయో విమోక్షణమ్

ధర్మమూ అర్థమూ కామమూ మోక్షమూ ఈ నాలుగూ కోరే వారు ఎవరిని భజిస్తున్నారో, ఇలా జీవాత్మనే విడిపించేవాడు ఈ శరీరానికి వచ్చిన ఆపద విడిపించలేడా?

ఏకాన్తినో యస్య న కఞ్చనార్థం వాఞ్ఛన్తి యే వై భగవత్ప్రపన్నాః
అత్యద్భుతం తచ్చరితం సుమఙ్గలం గాయన్త ఆనన్దసముద్రమగ్నాః

ఆయనను ఆశ్రయించి ఆయన యందే మనసు లగ్నం చేసిన ఏకాంత భక్తులు మరి దేన్నీ కోరరు. ఏమీ కోరకున్నా అనంతమైన అమృతం వంటి పరమాత్మ కళ్యాణ గుణాలను గానం చేసేవారికి ఏమి కావాలి.హరి కథామృతాన్నీ గుణామృతాన్నీ గ్రోలుతూ ఉంటారు. పరమాత్మ యొక్క పరమపావనమైన చరితాన్ని గానం చేస్తూ పరమానందములో ఉంటారు. ఆయన నాశనం లేనివాడు, అంతటా వ్యాపించి ఉంటేవాడు, అందరికన్నా ఉత్తముడు, అందరికీ అధిపతి, అర్థం కాని వాడు, ఆధ్యాత్మ యోగంచేతనే తెలియబడే వాడు, సూక్ష్ముడు, చాలా దూరములో ఉంటాడు, చాలా దగ్గరలో ఉంటాడు, చాలా దగ్గరలో ఉంటాడు , ఇంద్రియములకు తెలియని వాడు,

తమక్షరం బ్రహ్మ పరం పరేశమవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యమ్
అతీన్ద్రియం సూక్ష్మమివాతిదూరమనన్తమాద్యం పరిపూర్ణమీడే

యస్య బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః
నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతాః

యథార్చిషోऽగ్నేః సవితుర్గభస్తయో నిర్యాన్తి సంయాన్త్యసకృత్స్వరోచిషః
తథా యతోऽయం గుణసమ్ప్రవాహో బుద్ధిర్మనః ఖాని శరీరసర్గాః

అంతులేని వాడు మొదటి వాడు పరిపూర్ణుడైన పరమాత్మకు నమస్కరిస్తున్నాను.బ్రహ్మాది దేవతలూ వేదములూ చరాచర లోకములూ ఆయా పేర్లతో రూపాలతో ఏర్పడ్డవన్నీ ఆయన చిన్న అంశతో ఏర్పడినవే.నిప్పు నుండి రవ్వలూ సూర్యునినుండి కిరణాలు వచ్చినట్లు, చరాచర జగత్తూ ఈయన నుండి బయటకూ వస్తుంది, లోపలకూ పోతుంది.బుద్ధీ మనసూ ఇంద్రియములూ శరీరములూ పరమాత్మనుండే వస్తాయి, పరమాత్మ లోకే లయం అవుతాయి.

స వై న దేవాసురమర్త్యతిర్యఙ్న స్త్రీ న షణ్ఢో న పుమాన్న జన్తుః
నాయం గుణః కర్మ న సన్న చాసన్నిషేధశేషో జయతాదశేషః

ఈయన స్త్రీ కాదు, పురుషుడు కాడు జంతువూ కాదు, గుణం ఉన్నవాడుకాడు, లేని వాడు కాడు, ఉన్నవాడూ కాడు లేనివాడూ కాడు.అన్నీ కాదన్న తరువాత మిగిలినవాడు. ఏమేమి "కాదు కాదు" అంటామో, అలా అన్నాక చివరకు మిగిలేవాడు. ఏది కాదని చెప్పలేమో అది ఆయన. అన్నీ ఆయనే , ఏమీ కాని వాడూ ఆయనే

జిజీవిషే నాహమిహాముయా కిమన్తర్బహిశ్చావృతయేభయోన్యా
ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవస్తస్యాత్మలోకావరణస్య మోక్షమ్

ఇపుడు నేను ఎందుకు స్వామిని పిలుస్తున్నాను.ఈ శరీరాన్ని కాపాడమని కాదు.నన్ను ఈ శరీరము నుండి విడిపించమని.నేను వెలుపలా లోపలా ఏనుగు జన్మతో బాధపడుతున్నాను.దీని నుండి నన్ను విడిపించండి.ఈ గజాకృతితో నేను బతక్లానుకోవటం లేదు.కాలము పరిపూర్తి రాకుండా దేనికీ మోక్షం రాదు.ఆ కారణం నీవే.అలాంటి నీవు నాకు మోక్షం ప్రసాదించు

సోऽహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసమ్
విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోऽస్మి పరం పదమ్

"సకల ప్రపంచాన్ని సృష్టిచేసినవాడవూ, ప్రపంచానివీ, ప్రపంచముతో సంబంధం లేనివాడవు, సకల ప్రపంచాన్నీ తెలుసుకునేవాడవు, సకల ప్రపంచం స్వరూపముగా కలవాడు, పుట్టనివాడూ, బ్రహ్మ, అలాంటి నీకు నమస్కరిస్తున్నాను.


యోగరన్ధితకర్మాణో హృది యోగవిభావితే
యోగినో యం ప్రపశ్యన్తి యోగేశం తం నతోऽస్మ్యహమ్

తామాచరించిన కర్మలు నశింపచేసుకుని, యోగము చేత ఏర్పడిన హృదయములో ఎవరిని యోగులు చూస్తారో, వారికి నా నమస్కారం"

నమో నమస్తుభ్యమసహ్యవేగ శక్తిత్రయాయాఖిలధీగుణాయ
ప్రపన్నపాలాయ దురన్తశక్తయే కదిన్ద్రియాణామనవాప్యవర్త్మనే

నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యాహంధియా హతమ్
తం దురత్యయమాహాత్మ్యం భగవన్తమితోऽస్మ్యహమ్

ఇచ్చా జ్ఞ్యాన క్రియా శక్తులు స్వరూపము.సకల బుద్ధులూ నీ దగ్గరే ఉంటాయి. ఆశ్రయించినవారిని కాపాడేవాడివీ అనంతమైన శక్తి కలవాడివి, దుష్ట ఇంద్రియములు పొందలేని స్వభావం కలవాడవు. లోకములో ఎవరూ అహంకారబుద్ధి వలన తనను తాను తెలుసుకోలేరు. అలా ఎవరిని తెలియలేరో అటువంటి వానికి నేను నమస్కరిస్తున్నాను

శ్రీశుక ఉవాచ
ఏవం గజేన్ద్రముపవర్ణితనిర్విశేషం
బ్రహ్మాదయో వివిధలిఙ్గభిదాభిమానాః
నైతే యదోపససృపుర్నిఖిలాత్మకత్వాత్
తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్

ఇలా స్తోత్రం చేస్తే ఏ దేవతా వెళ్ళలేదు. వీరెప్పుడైతే వెళ్ళలేదో, నిఖిలాత్మ అయిన పరమాత్మ, సర్వ దేవమయుడైన పరమాత్మ, అక్కడ సాక్షాత్కరించాడు.

తం తద్వదార్తముపలభ్య జగన్నివాసః
స్తోత్రం నిశమ్య దివిజైః సహ సంస్తువద్భిః
ఛన్దోమయేన గరుడేన సముహ్యమానశ్
చక్రాయుధోऽభ్యగమదాశు యతో గజేన్ద్రః

జగన్నివాసుడైన పరమాత్మ బాధపడుతున్న గజేంద్రుని స్తోత్రం విని, దేవతలందరూ స్తోత్రం చేస్తూ ఉంటే, వేద స్వరూపుడైన గరుత్మంతుని చేత బాగా మోయబడి (సముహ్యమాన)

సోऽన్తఃసరస్యురుబలేన గృహీత ఆర్తో
దృష్ట్వా గరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రమ్
ఉత్క్షిప్య సామ్బుజకరం గిరమాహ కృచ్ఛ్రాన్
నారాయణాఖిలగురో భగవన్నమస్తే

చక్రాయుధుడు గజేంద్రుడు ఉన్న చోటికి వేగముగా వచ్చాడు. సరస్సులోపల బాగా బలం గల ముసలి చేత గ్రహించబడి బాధపడుతున్న ఏనుగు గరుత్మంతుని మీద చక్రధారి అయి ఉన్న స్వామిని చూసాడు
. అలాంటి స్వామిని చూచి పద్మము ఉన్న తొండమును పైకి ఎత్తి కష్టముతో. నారాయణా అఖిల గురో నమస్తే అని పెద్దగా పలకడానికి ప్రయత్నించాడు

తం వీక్ష్య పీడితమజః సహసావతీర్య
సగ్రాహమాశు సరసః కృపయోజ్జహార
గ్రాహాద్విపాటితముఖాదరిణా గజేన్ద్రం
సంపశ్యతాం హరిరమూముచదుచ్ఛ్రియాణా

ఇలా బాధపడుతున్న గజేంద్రుని చూచి గజేంద్రుని మీద నుండి వేగముగా చూచి, ముసలితో సహా ఏనుగును పైకి తీసాడు, పైకి తీసి ముసలి తలను కోసి వేసాడు.రక్షించబడాలన్న ఆర్తి మనకన్నా, రక్షించాలన్న ఆర్తి ఆయనకు ఎక్కువ ఉంది.ఇది పరమాత్మ కృపకు పరాకాష్ఠ.
దేవతలందరూ ఆర్తిగా చూస్తూ ఉండగా ముసలి నోటిని చక్రముతో చీల్చి ఏనుగు కాళ్ళను విడిపించాడు.నోటిలో ఉన్న ఏనుగు కాళ్ళకు చక్రముతో ఇప్పించాడు.


శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఆసీద్గిరివరో రాజంస్త్రికూట ఇతి విశ్రుతః
క్షీరోదేనావృతః శ్రీమాన్యోజనాయుతముచ్ఛ్రితః

త్రికూట పర్వతం క్షీర సాగరముచేత చుట్టబడి ఉంది. ఆ పర్వతం పది వేల యోజనాల వైశాల్యముతో ఉంది.

తావతా విస్తృతః పర్యక్త్రిభిః శృఙ్గైః పయోనిధిమ్
దిశః ఖం రోచయన్నాస్తే రౌప్యాయసహిరణ్మయైః

అన్యైశ్చ కకుభః సర్వా రత్నధాతువిచిత్రితైః
నానాద్రుమలతాగుల్మైర్నిర్ఘోషైర్నిర్ఝరామ్భసామ్

స చావనిజ్యమానాఙ్ఘ్రిః సమన్తాత్పయర్మిభిః
కరోతి శ్యామలాం భూమిం హరిన్మరకతాశ్మభిః

సిద్ధచారణగన్ధర్వైర్విద్యాధరమహోరగైః
కిన్నరైరప్సరోభిశ్చ క్రీడద్భిర్జుష్టకన్దరః

యత్ర సఙ్గీతసన్నాదైర్నదద్గుహమమర్షయా
అభిగర్జన్తి హరయః శ్లాఘినః పరశఙ్కయా

నానారణ్యపశువ్రాత సఙ్కులద్రోణ్యలఙ్కృతః
చిత్రద్రుమసురోద్యాన కలకణ్ఠవిహఙ్గమః

సరిత్సరోభిరచ్ఛోదైః పులినైర్మణివాలుకైః
దేవస్త్రీమజ్జనామోద సౌరభామ్బ్వనిలైర్యుతః

తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః
ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితామ్

సర్వతోऽలఙ్కృతం దివ్యైర్నిత్యపుష్పఫలద్రుమైః
మన్దారైః పారిజాతైశ్చ పాటలాశోకచమ్పకైః

చూతైః పియాలైః పనసైరామ్రైరామ్రాతకైరపి
క్రముకైర్నారికేలైశ్చ ఖర్జూరైర్బీజపూరకైః

మధుకైః శాలతాలైశ్చ తమాలైరసనార్జునైః
అరిష్టోడుమ్బరప్లక్షైర్వటైః కింశుకచన్దనైః

పిచుమర్దైః కోవిదారైః సరలైః సురదారుభిః
ద్రాక్షేక్షురమ్భాజమ్బుభిర్బదర్యక్షాభయామలైః

బిల్వైః కపిత్థైర్జమ్బీరైర్వృతో భల్లాతకాదిభిః
తస్మిన్సరః సువిపులం లసత్కాఞ్చనపఙ్కజమ్

అంతే వైశాల్యం ఎత్తు ఉంది. మూడు శిఖరములతో పాల సముద్రాన్ని వ్యాపించి ఉంది. బంగారు వెండి ఇనుము శిఖరములు ఉన్నాయి. రకరకాల రత్నములూ ధాతువులూ ఉన్నాయి, సరసులూ కొలనులూ ఉన్నాయి. ఆ పర్వతం యొక్క స్థాణు భాగం పాలకెరటములు తగులుతూ ఉంటుంది. యక్ష కిన్నెర గంధర్వ కింపురుషాదులు అక్కడ ఉంటారు. లేళ్ళ యొక్క గెంతులూ మృగాల గర్ఝనలు ఉంటాయి. ఎన్నో ఉద్యానవనాలు, స్త్రీలూ అన్నీ ఉండి. మందార పారిజాత మొదలైన దానిమ్మ పిప్ప చెట్లూ రక రకాల లతలూ పక్షులూ నీటి వృక్షాలు రక రకాల వృక్షాలు, అన్ని ఋతువుల విశేషాలూ ఉన్నాయి.

కుముదోత్పలకహ్లార శతపత్రశ్రియోర్జితమ్
మత్తషట్పదనిర్ఘుష్టం శకున్తైశ్చ కలస్వనైః

హంసకారణ్డవాకీర్ణం చక్రాహ్వైః సారసైరపి
జలకుక్కుటకోయష్టి దాత్యూహకులకూజితమ్

మత్స్యకచ్ఛపసఞ్చార చలత్పద్మరజఃపయః
కదమ్బవేతసనల నీపవఞ్జులకైర్వృతమ్

కున్దైః కురుబకాశోకైః శిరీషైః కూటజేఙ్గుదైః
కుబ్జకైః స్వర్ణయూథీభిర్నాగపున్నాగజాతిభిః

మల్లికాశతపత్రైశ్చ మాధవీజాలకాదిభిః
శోభితం తీరజైశ్చాన్యైర్నిత్యర్తుభిరలం ద్రుమైః

తత్రైకదా తద్గిరికాననాశ్రయః కరేణుభిర్వారణయూథపశ్చరన్
సకణ్టకం కీచకవేణువేత్రవద్విశాలగుల్మం ప్రరుజన్వనస్పతీన్

యద్గన్ధమాత్రాద్ధరయో గజేన్ద్రా వ్యాఘ్రాదయో వ్యాలమృగాః సఖడ్గాః
మహోరగాశ్చాపి భయాద్ద్రవన్తి సగౌరకృష్ణాః సరభాశ్చమర్యః

వృకా వరాహా మహిషర్క్షశల్యా గోపుచ్ఛశాలావృకమర్కటాశ్చ
అన్యత్ర క్షుద్రా హరిణాః శశాదయశ్చరన్త్యభీతా యదనుగ్రహేణ

స ఘర్మతప్తః కరిభిః కరేణుభిర్వృతో మదచ్యుత్కరభైరనుద్రుతః
గిరిం గరిమ్ణా పరితః ప్రకమ్పయన్నిషేవ్యమాణోऽలికులైర్మదాశనైః

సరోऽనిలం పఙ్కజరేణురూషితం జిఘ్రన్విదూరాన్మదవిహ్వలేక్షణః
వృతః స్వయూథేన తృషార్దితేన తత్సరోవరాభ్యాసమథాగమద్ద్రుతమ్

విగాహ్య తస్మిన్నమృతామ్బు నిర్మలం హేమారవిన్దోత్పలరేణురూషితమ్
పపౌ నికామం నిజపుష్కరోద్ధృతమాత్మానమద్భిః స్నపయన్గతక్లమః

స పుష్కరేణోద్ధృతశీకరామ్బుభిర్నిపాయయన్సంస్నపయన్యథా గృహీ
ఘృణీ కరేణుః కరభాంశ్చ దుర్మదో నాచష్ట కృచ్ఛ్రం కృపణోऽజమాయయా

ఈ ప్రాంతములో ఒక గజరాజు ఆడ ఏనుగులతో కలిసి విహరిస్తూ మహా వృక్షాలను కూడా తన తొండముతో కూల్చి పారవేస్తూ ఉన్నాడు. ఈ గజరాజు వాసన వస్తే చాలు సింహాలు కూడా పారిపోతున్నాయి. మిగతా మృగాలు కూడా ఈ గజరాజంటే భయం. ఈ గజరాజు ప్రేమ పొందిన మామూలు కుందేళ్ళు అక్కడే ఆడుకుంటున్నాయి. వేసవి తాపాన్ని తాళలేక ఏనుగు పిల్లలతో కలిసి అంత పెద్ద పర్వతాన్నీ తన అడుగులతో కంపింపచేస్తూ మద జలానికి ఆశపడి తుమ్మెదలు సేవిస్తూ ఉండగా, మదముతో మత్తిల్లిన కళ్ళతో తన వారితో కలిసి దప్పిగొని ఆ సరోవరం దగ్గరకి వేంచేసాడు. బంగారు పద్మములతో ఉన్న సుంగంధ జలాన్ని స్నానం చేసి తాగి, స్నానం చేసి ప్రియురాళ్ళను తరుముతూ ఉన్నాడు. పరమాత్మ మాయను తెలుసుకోలేక తన మదమూ వైభవం బలం ప్రకటించబడే విధముగా విహరించాడు ఆ సరస్సులో

తం తత్ర కశ్చిన్నృప దైవచోదితో గ్రాహో బలీయాంశ్చరణే రుషాగ్రహీత్
యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోऽతిబలో విచక్రమే

తథాతురం యూథపతిం కరేణవో వికృష్యమాణం తరసా బలీయసా
విచుక్రుశుర్దీనధియోऽపరే గజాః పార్ష్ణిగ్రహాస్తారయితుం న చాశకన్

ఎప్పుడైతే మదమూ గర్వమూ అహంకారం పబలిందో అప్పుడు పరమాత్మ ప్రేరణతో అక్కడ చాలా బలం కలిగి ఉన్న ఒక ముసలి ఈ ఏనుగు పాదాన్ని కోపముతో పట్టేసింది. దైవబలముతో బలం పొందిన ఆ ఏనుగు ఆ ముసలిని వెన్నకు లాగడానికి ప్రయత్నించింది.అంత పెద్ద గజరాజు బాధతో విలపిస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వారు "అయ్యో అయ్యో" అంటున్నారు గానీ విడిపించలేకపోయారు

నియుధ్యతోరేవమిభేన్ద్రనక్రయోర్వికర్షతోరన్తరతో బహిర్మిథః
సమాః సహస్రం వ్యగమన్మహీపతే సప్రాణయోశ్చిత్రమమంసతామరాః

ఏనుగు ముసలి, ముసలి లోపలికీ ఏనుగు బయటకీ లాగుతూ ఉండగా, ఒక వేయేళ్ళు గడిచాయి

తతో గజేన్ద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానభూద్వ్యయః
వికృష్యమాణస్య జలేऽవసీదతో విపర్యయోऽభూత్సకలం జలౌకసః

ఇత్థం గజేన్ద్రః స యదాప సఙ్కటం ప్రాణస్య దేహీ వివశో యదృచ్ఛయా
అపారయన్నాత్మవిమోక్షణే చిరం దధ్యావిమాం బుద్ధిమథాభ్యపద్యత

న మామిమే జ్ఞాతయ ఆతురం గజాః కుతః కరిణ్యః ప్రభవన్తి మోచితుమ్
గ్రాహేణ పాశేన విధాతురావృతోऽప్యహం చ తం యామి పరం పరాయణమ్

మనోబలమూ శరీర బలమూ తగ్గింది, ఏనుగుకు అన్నీ తగ్గిపోతూ ఉంటే ముసలికి అన్ని బలాలూ పెరుగుతూ ఉన్నాయి. కష్టాన్ని పొందింది ఏనుగు. మానవుడు ఆపద వచ్చినట్లు భావించేదెప్పుడంటే ప్రాణ సంకటం వచ్చినప్పుడే. అలాగే ఈ గజరాజుకి కూడా ప్రాణ సంకటం వచ్చి పూర్వ జన్మ జ్ఞ్యానం ఉండటం వలన, ఆ బుద్ధితో నా చుట్టూ ఉన్న ఇంతమంది బలమైన గజములు ఉండీ విడిపించలేకపోతున్నారంటే నన్ను బందించింది ముసలి కాదు, కర్మ. ఇది దైవ చోదితం కాబట్టి ఆయన్నే ప్రార్థిస్తాను

యః కశ్చనేశో బలినోऽన్తకోరగాత్ప్రచణ్డవేగాదభిధావతో భృశమ్
భీతం ప్రపన్నం పరిపాతి యద్భయాన్మృత్యుః ప్రధావత్యరణం తమీమహి

సకల చరాచర జగత్తులో జీవులను మృత్యువు అనే మహా పాశమునుండీ, ప్రచండమైన వేగముతో వచ్చే కాల సర్పమునుండి భయపడే వారిని, ప్రపన్నులను, భయపడి ఆశ్రయించిన వారిని కాపాడే వాడు ఎవడు. ఇందరిని భయపెట్టే మృత్యువు ఆ పరమాత్మను చూసి తానే భయపడుతుంది. అలాంటి భగవంతుని నేను ధ్యానం చేస్తున్నాను. ఆ విధముగా నేను ఈ కష్టాన్ని తొలగించుకుంటాను.

Wednesday, May 1, 2013

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీరాజోవాచ
స్వాయమ్భువస్యేహ గురో వంశోऽయం విస్తరాచ్ఛ్రుతః
యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్వదస్వ నః

స్వాయంభూవ మనువు చరిత్రను చెప్పారు. ఇతర మనువుల చరిత్రను కూడా వివరించవలసింది. ప్రతీ మన్వంతరములోనూ మనువూ మనుపుత్రులూ ఇంద్రుడూ దేవతలూ సప్తఋషులూ పరమాత్మ అవతారాలు ఉంటాయి. పరమాత్మ యొక్క జన్మ, ఆయన కర్మలు జ్ఞ్యానులు చెబుతూ ఉంటారు. అవి మాకు వివరించండి.

మన్వన్తరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః
గృణన్తి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్

యద్యస్మిన్నన్తరే బ్రహ్మన్భగవాన్విశ్వభావనః
కృతవాన్కురుతే కర్తా హ్యతీతేऽనాగతేऽద్య వా

జరిగిన దానిలో జరగబోయే దానిలో జరుగుతున్న దానిలో పరమాత్మ ఏమేమి చేసి ఉన్నాడో ఏమేమి చేయబోతాడు ఏమేమి చేస్తున్నాడో చెప్పవలసింది.

శ్రీఋషిరువాచ
మనవోऽస్మిన్వ్యతీతాః షట్కల్పే స్వాయమ్భువాదయః
ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సమ్భవః

ఈ కల్పములో మనకు ఆరుగురు మనువులు గడిచిపోయారు. ఆరు మనువులలో మొదటివాడైన స్వాయంభువ మన్వంతరం నీకు వివరించాను.

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః
ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్పుత్రతాం గతః

ఆకూతి (రుచి భార్య) దేవహూతి (కర్దముని భార్య) అనే వారిలో అకూతి గురించి చెబుతాను. దేవహూతికి కపిలునిగా వచ్చాడు. అకూతికీ రుచికీ యజ్ఞ్యుడిలా వచ్చాడు పరమాత్మ. కపిలుడు జ్ఞ్యానోపదేశం. యజ్ఞ్యుడు ధర్మోపదేశము గురించి వచ్చాడు.

కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్
ఆఖ్యాస్యే భగవాన్యజ్ఞో యచ్చకార కురూద్వహ

ఇది వరకే నీకు కపిల చరిత్ర విస్తారముగా చెప్పాను. ఇపుడు యజ్ఞ్యుని గురించి వివరిస్తాను.

విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః
విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్

ఇలా సంతానం కలిగిన తరువాత స్వాయంభువ మనువు సంసారం యందు విరక్తి కలిగి రాజ్యాన్ని విడిచి వానప్రస్థాశ్రమానికి వనానికి వెళ్ళి.

సునన్దాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్
తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత

సునంద తీరములో ఘోరముగా ఒంటి కాలి మీద నిలబడి ఈ మంత్రాన్ని జపించాడు. శరీరానికి కావలసిన దాని కన్నా శరీరాన్ని దూరముగా ఉంచడం తపస్సు. తపస్సు శరీరానికి, జపం మనసుకీ.

శ్రీమనురువాచ
యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్
యో జాగర్తి శయానేऽస్మిన్నాయం తం వేద వేద సః

పరమాత్మ సకల ప్రపంచములో స్పందన కలిగిస్తాడు. సకల ప్రపంచాన్నీ స్పందింపచేస్తాడు. ఈ ప్రపంచం పరమాత్మని స్పందింపచేయలేదు. సకల చరాచరజగత్తూ నిద్రపోయినా ఆయన నిద్రపోడు. (వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే .. - పరమాత్మ స్వరూపం ఎవరికీ అర్థం కాదని నాకు తెలుసు )

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కిఞ్చిజ్జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్య స్విద్ధనమ్

పరమాత్మ చేత విడువబడిన జగత్తులో నీవు అనుభవించడానికి ప్రయత్నించకు. భగవంతుడు వ్యాపించని ప్రదేశం లేదు. పరమాత్మకు సంబంధించినదాన్ని నాది అనకు. పరమాత్మ అనుగ్రహించిన దాన్ని ఆయన ప్రసాదముగా స్వీకరించు. ఆయనకు అర్పించవలసినదాన్ని నీవు దొంగిలించకు. భగవంతునికి సంబంధించిన జీవున్ని నాది అనుకోకు.తేన త్యక్తే నభుఞ్జీథా - పరమాత్మది కాదు అని అనుకొని ప్రపంచాన్ని నీవు అనుభవించ ప్రయత్నించవద్దు.

యం పశ్యతి న పశ్యన్తం చక్షుర్యస్య న రిష్యతి
తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత

మన కన్ను పరమాత్మను చూడాలి. మనను చూస్తున్న పరమాత్మను ఏ కన్ను చూడలేదో, పరమాత్మను చూడలేని కన్నుకు ఎవరు చూపును ఇస్తారో, జగత్తును చూస్తున్న పరమాత్మ జ్ఞ్యాన చక్షువు క్షీణించదు, పరమాత్మను చూడలేని మన చక్షువు యొక్క శక్తి క్షీణిస్తుంది. ప్రపంచం మొత్తాన్నీ స్వామి లయం చేస్తాడు, కానీ ఆయన శక్తి లయం కాదు. పరమాత్మ ప్రపంచాన్ని చూస్తున్నాడన్న మన జ్ఞ్యానం లయమవుతుంది. పరమాత్మ భూత నిలయుడు (సకల ప్రపంచాన్నీ దాచుకున్నవాడు). ఆయన సుపర్ణుడు. అలాంటి పరమాత్మను సేవించండి.

న యస్యాద్యన్తౌ మధ్యం చ స్వః పరో నాన్తరం బహిః
విశ్వస్యామూని యద్యస్మాద్విశ్వం చ తదృతం మహత్

పరమాత్మకు ఆది మధ్య అంతములు లేవు, తన వారు ఇతరులూ తటస్థులూ అన్న భావము లేవు. ప్రపంచానికి ఇవి ఉన్నాయి. ఇంత పెద్ద విశము పరమాత్మ చేత సృష్టించబడేదీ రక్షించబడేది. పరమాత్మ విశ్కాయ (విశ్వరూపుడు).

స విశ్వకాయః పురుహూతశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః
ధత్తేऽస్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే

సకల వేద వాక్యాల చేతా స్మరించబడే వాడు. బ్రహ్మాది దేవతలతో ఆహావింపబడేవాడు. త్రికాల అబాధితుడు, స్వయంప్రకాశుడు,ప్రకృతి గుణాలతో బాధించబడని వాడు. యోగ మాయ చేత ప్రపంచం యొక్క జన్మ స్థితి లయాలను కలిగించేవాడు. ఆ సృష్టి స్థితి లయములను తన జ్ఞ్యానముతో ప్రభావముతో తొలగించి ఎలాంటి కోరికా లేకుండా ఉంటాడు. తాను సృష్టించిన జగత్తు మీద మమకారం ఉండదు.

అథాగ్రే ఋషయః కర్మాణీహన్తేऽకర్మహేతవే
ఈహమానో హి పురుషః ప్రాయోऽనీహాం ప్రపద్యతే

లోకములో ఋషులు ఇకముందు కర్మలు ఆచరించ వలసిన అవసరం లేకుండా కర్మను చేస్తారు. వైరాగ్యం కలగడానికి కర్మలు చేస్తారు. వారు నశ్వరమైన ఫలితాన్ని ఆశించి కర్మలు చేయరు. వైరాగ్యం కలగడం కోసం ఋషులు కర్మలు ఆచరిస్తారు. కోరిక పుడితే దాని వలన తాము అనుభవించిన కష్టములు బేరీజు వేసుకుంటే కోరిక మీద విరక్తి కలుగుతుంది.

ఈహతే భగవానీశో న హి తత్ర విసజ్జతే
ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదన్తి యేऽను తమ్

కోరికలో మనం లగ్నం కానంతవరకూ కోరిక తప్పు కాదు. పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు కానీ, దాని మీద ఆశపెట్టుకోలేదు. ధర్మముగా కర్మలు ఆచరించాలి గానీ అభిలాషతో కాదు. జరగబోయే ఫలితం మీద ఆలోచన కర్మను సరిగా చేయనివ్వదు. పరమాత్మ ఆత్మలాభముతో (తనకు తాను లభించే దానితో) పూర్ణుడు కాబట్టి, ఎవరు పరమాత్మను అనుసరిస్తారో వారు కూడా బాధపడరు.

తమీహమానం నిరహఙ్కృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్
నౄన్శిక్షయన్తం నిజవర్త్మసంస్థితం ప్రభుం ప్రపద్యేऽఖిలధర్మభావనమ్

పరమాత్మ సంకల్పిస్తాడు, సృష్టీ రక్షణ జరగాలని. కానీ జ్ఞ్యాన స్వరూపుడు కాబట్టి నేనే సృష్టిస్తున్నాను, నేనే కాపాడుతున్నాను అని అనుకోడు. జ్ఞ్యానం ఉన్నట్లు గుర్తు కోరిక లేకపోవడం. కోరికలు పూర్ణులకు ఉండవు. పూర్ణత్వానికి గుర్తు తనకు తానుగా ప్రవర్తించడం (ఎవరో ప్రేరేపిస్తే ప్రయత్నించకపోవడం). జీవులకు తత్వమును నేర్పేవాడు, తన దారిలోనే తాను ఉండేవాడు, అలాంటి వాడే ప్రభువు. ఆయననే సేవించాలి. ఆయన అన్ని ధర్మములకూ మూలపురుషుడు.

శ్రీశుక ఉవాచ
ఇతి మన్త్రోపనిషదం వ్యాహరన్తం సమాహితమ్
దృష్ట్వాసురా యాతుధానా జగ్ధుమభ్యద్రవన్క్షుధా

ఇలా ఉపనిషత్ మంత్రలాతో (ఈశ కేన కఠ ఉపనిషత్తులు) అధ్యయనం చేస్తూ ఉన్న మనువును రాక్షసులు ఆకలి ఎక్కువై ఈయనను తిందామని బయలుదేరారు

తాంస్తథావసితాన్వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః
యామైః పరివృతో దేవైర్హత్వాశాసత్త్రివిష్టపమ్

ఇలా మనువును బక్షించవచ్చిన రాక్షసులను యజ్ఞ్యుడు దేవతలతో కలసి వచ్చి వారిని సంహరించి మనువును రక్షించి జగత్తును శాసించాడు.

స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నేః సుతోऽభవత్
ద్యుమత్సుషేణరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః

రెండవ మనువు స్వారోచిష మనువు. ఈయన అగ్ని కుమారుడు. ఈ స్వారోచిష మనువుకు కుమారులు కలిగారు.

తత్రేన్ద్రో రోచనస్త్వాసీద్దేవాశ్చ తుషితాదయః
ఊర్జస్తమ్భాదయః సప్త ఋషయో బ్రహ్మవాదినః

రోచనుడనే వాడు ఈ మన్వంతరములో ఇంద్రుడు. తుషితులు దేవతలు. ఊర్జ స్తభాదులు ఋషులు.

ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్
తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః

వేదశిరసు అనే ఋషికి స్తుషితా అనే భార్యకి పరమాత్మ విభు అనే అవతారములో వచ్చాడు

అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః
అన్వశిక్షన్వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః

ఈ విభువు ఎనభై ఎనిమిది వేల మంది మునులకు తత్వజ్ఞ్యానమును బోధించాడు. వారికి ఈ వ్రతాన్ని నేర్పాడు

తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః
పవనః సృఞ్జయో యజ్ఞ హోత్రాద్యాస్తత్సుతా నృప

మూడవ మనువు ఉత్తముడు (ద్రువుని సోదరుడు). అతనికి పవన యజ్ఞ్యహోత్రాదులు కుమారులు

వసిష్ఠతనయాః సప్త ఋషయః ప్రమదాదయః
సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇన్ద్రస్తు సత్యజిత్

వసిష్ఠ పుత్రులైన ప్రమదాదులు సప్త ఋషులు. సత్యాదులు దేవతలు. సత్యజిత్ ఇంద్రుడు.

ధర్మస్య సూనృతాయాం తు భగవాన్పురుషోత్తమః
సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యవ్రతైః సహ

ధర్ముడికి భార్య ఐన సూనృత యందు భగవానుడు సత్యసేనుడనే పేరుతో అవతరించాడు

సోऽనృతవ్రతదుఃశీలానసతో యక్షరాక్షసాన్
భూతద్రుహో భూతగణాంశ్చావధీత్సత్యజిత్సఖః

సత్యసేనుడు అబద్దాలాడడం అనే వ్రతము కలిగి ఉన్న దుశ్శీలనూ యక్ష రాక్షసులను సకల ప్రాణులకూ హాని చేసే వారిని వధించాడు

చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః
పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః

నాలుగవ మనువు ఉత్తమ సోదరుడు తామసుడు. పృధువాది కుమారులు.

సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః
జ్యోతిర్ధామాదయః సప్త ఋషయస్తామసేऽన్తరే

సత్యకాదులు ఇతర దేవతలు త్రిశిఖుడు ఈశ్వరుడు. జ్యోతిర్థాములు ఋషులు

దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప
నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా

విదృతి యొక్క పుత్రులు దేవతలు. వైదృతులకి ఆ పేరు రావడానికి కాల క్రమములో అంతరించిపోతున్న వేదాలను ధరించారు.

తత్రాపి జజ్ఞే భగవాన్హరిణ్యాం హరిమేధసః
హరిరిత్యాహృతో యేన గజేన్ద్రో మోచితో గ్రహాత్

ఈ తామస మన్వంతరములో హరిమేధ అనే మహర్షికి హరిణి అనే భార్య యందు హరి అనే అవతారములో వచ్చాడు. ఈయనే గజేంద్రునికి మోక్షాన్నిచ్చాడు.

శ్రీరాజోవాచ
బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయమ్
హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్

మేము ఈ విషయాన్ని వినాలనుకుంటున్నాము. మకరము పొందిన ఏనుగును స్వామి వచ్చి ఎలా విడిపించాడు

తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభమ్
యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్గీయతే హరిః

ఈ కథ ఎంతో గొప్ప పవిత్రమైనది శుభాన్ని కలిగించేది మంగళాన్ని ధనాన్నీ ప్రసాదించేది. పరమాత్మగానం చేయబడే ఏ కథైనా ఇంతే

శ్రీసూత ఉవాచ
పరీక్షితైవం స తు బాదరాయణిః ప్రాయోపవిష్టేన కథాసు చోదితః
ఉవాచ విప్రాః ప్రతినన్ద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్

ఇలా పరీక్షిన్మహరజాఉ ఇలా అడిగితే శుకుడు బాగా అడిగావని మెచ్చుకుని, ఆనందముతో వింటున్న ఋషుల సభలో ఈ కథను వివరించడం మొదలు పెట్టాడు.