Sunday, April 21, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
అథ దైత్యసుతాః సర్వే శ్రుత్వా తదనువర్ణితమ్
జగృహుర్నిరవద్యత్వాన్నైవ గుర్వనుశిక్షితమ్

మనస్సులో ఎలాంటి కల్మషం లేని రాక్షస బాలురకు ప్రహ్లాదుడు సులభముగా స్పష్టముగా చేసిన ఉపదేశాన్ని స్వీకరించారు. గురువుగారు బోధించిన దాన్ని స్వీకరించలేదు.

అథాచార్యసుతస్తేషాం బుద్ధిమేకాన్తసంస్థితామ్
ఆలక్ష్య భీతస్త్వరితో రాజ్ఞ ఆవేదయద్యథా

పిల్ల మనస్తత్వం మారినట్లు గ్రహించిన గురుపుత్రులు, అది ప్రహ్లాదుని పనే అని గ్రహించి హిరణ్యకశిపునికే అది నివేదించారు.

శ్రుత్వా తదప్రియం దైత్యో దుఃసహం తనయానయమ్
కోపావేశచలద్గాత్రః పుత్రం హన్తుం మనో దధే

గురుపుత్రులు చెప్పిన తన పుత్రుడు చేసిన అవినీతి (అనయం) విని ఒళ్ళంతా మండిపోతుంటే ప్రహ్లాదున్ని చంపడానికి నిశ్చయించుకున్నాడు.

క్షిప్త్వా పరుషయా వాచా ప్రహ్రాదమతదర్హణమ్
ఆహేక్షమాణః పాపేన తిరశ్చీనేన చక్షుషా

ప్రశ్రయావనతం దాన్తం బద్ధాఞ్జలిమవస్థితమ్
సర్పః పదాహత ఇవ శ్వసన్ప్రకృతిదారుణః

అటువంటి ప్రవృత్తికి అర్హుడు కాని ప్రహ్లాదున్ని కిందకి తోసి పరుషమైన మాటలతో పాపౌ వంకర చూపుతో తండ్రి వద్ద వినయముగా చేతులు జోడించి ఒదిగి ఉన్నా, ఇంద్రియ నిగ్రహం గల ప్రహ్లాదునితో పరమదారుణమైన రాక్షుడు తోక తొక్కిన తాచులా బుసలు కొడుతూ ఇలా అన్నాడు.

శ్రీహిరణ్యకశిపురువాచ
హే దుర్వినీత మన్దాత్మన్కులభేదకరాధమ
స్తబ్ధం మచ్ఛాసనోద్వృత్తం నేష్యే త్వాద్య యమక్షయమ్

వినయము లేని వాడా, మంద బుద్ధీ, రాక్షస కులములో భేధం కలిగించేవాడా, నీవు నా ఆజ్ఞ్యను అతిక్రమించావు, తోసి వేసావు. నిన్ను యమ సదనానికి పంపుతాను.

క్రుద్ధస్య యస్య కమ్పన్తే త్రయో లోకాః సహేశ్వరాః
తస్య మేऽభీతవన్మూఢ శాసనం కిం బలోऽత్యగాః

నేను కోపిస్తే మూడు లోకాలూ లోక నాయకులతో కూడి వణికిపోతారు. అలాంటి నా ఆజ్ఞ్యను ఎవరి బలము చూసుకుని ధిక్కరిస్తున్నావు.

శ్రీప్రహ్రాద ఉవాచ
న కేవలం మే భవతశ్చ రాజన్స వై బలం బలినాం చాపరేషామ్
పరేऽవరేऽమీ స్థిరజఙ్గమా యే బ్రహ్మాదయో యేన వశం ప్రణీతాః

మహారాజా నాకేకాదు, నీకు కూడా ఆయనే బలం. చిన్నవారూ పెద్దవారూ స్థావరములూ జంగమములూ బ్రహ్మాది దేవతలూ ఎవరి వశములో ఉన్నారో అందరికీ ఆయనే బలం.
బలయుతులకు దుర్బలులకు
బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడ ప్రాణులకును
బలమెవ్వం డట్టి విభుడు బల మసురేంద్రా

స ఈశ్వరః కాల ఉరుక్రమోऽసావోజః సహః సత్త్వబలేన్ద్రియాత్మా
స ఏవ విశ్వం పరమః స్వశక్తిభిః సృజత్యవత్యత్తి గుణత్రయేశః

ఆయనే శాసకుడు, ఆయనే కాలము, ఆయనే చాలా వేగము కల పాదము గలవాడు, అతనే ఓజస్సూ (ప్రవృత్తి, అనుకున్న దానిలో ప్రవర్తించగల నేర్పు. సంకల్పించినదాన్ని చేయగలగడం) సహస్సూ(వేగం, చేసే పనిని వేగముగా చేయడం, వేగమును తట్టుకోవడం) బలం (ధారణ, ధరించే సామర్ధ్యం), ఇంద్రియమ్ములూ, అన్నీ ఆయనే. నా చేత నమస్కరింపచేస్తున్నాదీ, నీచేత తిరస్కరింపచేస్తున్నదీ ఆయనే. నీ ప్రవృత్తీ నా ప్రవృత్తీ, నీ ఆలోచనా నా ఆలోచనా, నీ వేగం నా వేగం, నీ బలం నా బలం అన్నీ ఆయనే. ఆయన తన దివ్యమైన శక్తులతో మూడు గుణములు (సత్వం రజః తమః) అధిపతి కాబట్టి ఆయనే మూడు గుణాలతో మూడు పనులనూ చేస్తాడు (సృష్టి స్థితి లయములు).

జహ్యాసురం భావమిమం త్వమాత్మనః సమం మనో ధత్స్వ న సన్తి విద్విషః
ఋతేऽజితాదాత్మన ఉత్పథే స్థితాత్తద్ధి హ్యనన్తస్య మహత్సమర్హణమ్

ఈ అసుర బుద్ధినీ, తలంపునూ విడిచిపెట్టు. మనస్సును రాగ ద్వేషములు లేకుండా సమముగా ఉంచుకో. అలా చేస్తే శత్రువులే ఉండరు. వేరొక శత్రువు నీకు ఉండరు. అడ్డదారి పట్టిన వశములో లేని, గెలువని మనసుకంటే వేరొక శత్రువు లేరు. మనసుని గెలుచుటే మంచి ఆరాధన.

దస్యూన్పురా షణ్న విజిత్య లుమ్పతో మన్యన్త ఏకే స్వజితా దిశో దశ
జితాత్మనో జ్ఞస్య సమస్య దేహినాం సాధోః స్వమోహప్రభవాః కుతః పరే

మనలోనే ఆరుగురు దొంగలున్నారు. వారిని గెలవకుండా "మేము పది దిక్కులూ గెలిచాము" అని భావిస్తూ ఉంటారు. అసలు ఎవరికెవరు శత్రువులు? మోహం వలన పుట్టినవారే శత్రువులు. మనసుని గెలిచి జ్ఞ్యానం కలిగి సమదృష్టి కలవారికి శత్రువులు ఎవరు?
లోకములన్నియున్ గడియలోన జయించినవాడ వింద్రియా
నీకము జిత్తముం గెలువ నేరవు నిన్ను నిబద్ధు జేయు నీ
భీకర శత్రు లార్వుర బ్రఖిన్నుల జేసిన బ్రాణికోటిలో
నీకు విరోధి లే డొకడు నేర్పున చూడుము దానవేశ్వరా!

శ్రీహిరణ్యకశిపురువాచ
వ్యక్తం త్వం మర్తుకామోऽసి యోऽతిమాత్రం వికత్థసే
ముమూర్షూణాం హి మన్దాత్మన్నను స్యుర్విక్లవా గిరః

నిజముగా నీకు చావు మీదే కోరిక ఉన్నట్లు ఉంది. ఇంతగా గర్విస్తున్నావు. చనిపోబోయే వారికి మాటలు ఇలాగే తడబడతాయి, అందుకే నీవిలా మాట్లాడుతున్నావు.

యస్త్వయా మన్దభాగ్యోక్తో మదన్యో జగదీశ్వరః
క్వాసౌ యది స సర్వత్ర కస్మాత్స్తమ్భే న దృశ్యతే

మంద భాగ్యుడా నీవు చెప్పినట్లుగా నాకంటే వేరే ఒక జగన్నాధుడు ఉంటే, ఎక్కడున్నాడు. నీవనంట్లు అంతటా ఉంటే అందులో కనపడుట లేదే?

సోऽహం వికత్థమానస్య శిరః కాయాద్ధరామి తే
గోపాయేత హరిస్త్వాద్య యస్తే శరణమీప్సితమ్

నిజముగా అంతటా ఉంటే, ఈ స్తంభములో కూడా ఉంటే ఆయన చూస్తుండగానే నీ శిరస్సును ఖండిస్తాను. అంతటా ఉంటే, నిన్ను ఆ హరే కాపాడాలి. నీవు ఆయనని శరణు వేడావు కదా?

ఏవం దురుక్తైర్ముహురర్దయన్రుషా సుతం మహాభాగవతం మహాసురః
ఖడ్గం ప్రగృహ్యోత్పతితో వరాసనాత్స్తమ్భం తతాడాతిబలః స్వముష్టినా

కోపముతో దుర్భాషలతో పరమభాగవతోత్తముడైన తన కన్నకొడుకుని ఈ మహారాక్షసుడు బాధిస్తూ, ఖడ్గమును తీసుకుని సింహాసనం నుండి కిందకు ఎగిరాడు. మహాబలాడ్యుడైన ఆ హిరణ్యకశిపుడు తన పిడికిలితో స్తంభాన్ని కొట్టాడు.

తదైవ తస్మిన్నినదోऽతిభీషణో బభూవ యేనాణ్డకటాహమస్ఫుటత్
యం వై స్వధిష్ణ్యోపగతం త్వజాదయః శ్రుత్వా స్వధామాత్యయమఙ్గ మేనిరే

అతను ముష్టితో కొట్టగానే ఆ స్తంభము నుండి ఒక భయంకరమైన ధ్వని వినిపించింది. బ్రహ్మాండ కటాహం వణికిపోయేంత పరమభయంకరమైన ధ్వని వినిపించింది. వారి వారి లోకాలలో ఉన్న బ్రహ్మ రుద్రేంద్రాదులు ఈ ధ్వని విని తమ లోకాలకు ముప్పు ముంచుకొచ్చిందీ, ప్రళయం వచ్చింది అని భయపడ్డారు.

స విక్రమన్పుత్రవధేప్సురోజసా నిశమ్య నిర్హ్రాదమపూర్వమద్భుతమ్
అన్తఃసభాయాం న దదర్శ తత్పదం వితత్రసుర్యేన సురారియూథపాః

హిరణ్యకశిపుడు వేగముగా కొడుకును చంపడానికి వేగముగా వెళ్ళాడు. తాను ముందుకు వెళ్ళేసరికి పధ్నాలుగు లోకాలూ వణికే ధ్వని వచ్చింది. అది విని ఆశ్చర్యముతో వెనక్కు తిరిగాడు. అపూర్వమైనది ( ఇది వరకు ఎక్కడా జరిగి ఉండని), అద్భుతమైనదీ అయైన ధ్వనిని విని, సభలో ఆ ధ్వని ఎక్కడినుంచి వచ్చిందో చుట్టూ చూసాడు గానీ ఏమీ కనపడలేదు. రాక్షస సైన్యమంతా భయపడి వణికిపోయింది ఆ ధ్వని వలన.

సత్యం విధాతుం నిజభృత్యభాషితం వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః
అదృశ్యతాత్యద్భుతరూపముద్వహన్స్తమ్భే సభాయాం న మృగం న మానుషమ్

నరసింహస్వామి అవతారానికి మూల కారణం ఇది.
1. సత్యం విధాతుం నిజభృత్యభాషితం. తన భక్తుడు అన్న మాటను నిజం చేయడానికి. ఇక్కడ ప్రహ్లాదుడు సర్వ వ్యాపి అన్నది ప్రహ్లాదుడు. అలా ప్రహ్లాదునికి చెప్పినది నారదుడు. ఆ నారదునికి చెప్పినది బ్రహ్మ. ఈ ముగ్గురూ స్వామి భక్తులే. స్తంభములోంచి స్వామి ఆవిర్భవించి వారి మాటను నిజం చేసారు.

2. వ్యాప్తిం చ భూతేష్వఖిలేషు చాత్మనః - ఇది రెండవ కారణం. సకల ప్రాణుల యందు స్వామి వ్యాపించి ఉన్నాడు. ఈ విషయం అందరికీ చాటడానికి కనపడ్డాడు.

స్వామి రూపం వేదాలకు కూడా అందించడానికి మాటలు అందవు. అందుకే ఆయన రూపం అత్యద్భుతం. అత్యత్భుత రూపాన్ని వహించి కనపడ్డాడు. ఏ స్తంభాన్ని హిరణ్యకశిపుడు కొట్టాడో అందులో కనపడ్డాడు. మనిషీ కాదు మృగమూ కాదు. నరమూ కాదు సింహమూ కాదు. నరసింహం.

    నరమూర్తిగాదు కేవల
    హరిమూర్తియు గాడు మానవాకారము కే
    సరి యకారము నున్నది
     హరి మాయారచితమగు  యధార్దము చూడన్!
    నరరూపం మృగరూపం కాని నృసింహాకృతి
    పగలు రాత్రి కాని సంధ్యాసమయం
    లోపల  వెలుపల కాని సభాద్వారం
    ప్రాణులున్నవీ లేనివీ అయిన వాడిగోళ్ళు

స సత్త్వమేనం పరితో విపశ్యన్స్తమ్భస్య మధ్యాదనునిర్జిహానమ్
నాయం మృగో నాపి నరో విచిత్రమహో కిమేతన్నృమృగేన్ద్రరూపమ్

అప్పుడు హిరణ్యకశిపుడు చుట్టూ తిరిగి చూచాడు. స్తంభం మధ్యనుంచి తనను సంహరించడానికి వస్తున్న స్వామిని చూచి, నరమూ కాదు, మృగమూ కాదు, ఇదేమి రూపం అని ఆశ్చర్యపోయాడు.

మీమాంసమానస్య సముత్థితోऽగ్రతో నృసింహరూపస్తదలం భయానకమ్
ప్రతప్తచామీకరచణ్డలోచనం స్ఫురత్సటాకేశరజృమ్భితాననమ్

ఆ రూపాన్ని చూచి, ఇదే రూపం అయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగానే భయపడడానికి అదే చివరి మెట్టుగా అంతకంటే భయపడడానికి ఏదీ లేని రూపం, బాగుగా కాల్చిన బంగారపు రంగు (పచ్చ) భయంకరమైన కళ్ళు కలిగి, బాగా ప్రకాశించే మెడ చుట్టూ ఉండే సటలతో (జుట్టు),

కరాలదంష్ట్రం కరవాలచఞ్చల క్షురాన్తజిహ్వం భ్రుకుటీముఖోల్బణమ్
స్తబ్ధోర్ధ్వకర్ణం గిరికన్దరాద్భుత వ్యాత్తాస్యనాసం హనుభేదభీషణమ్

పర్వత గుహలాంటి దమ్ష్ట్రలూ, కోరలు, మహా ఖడ్గములా అటూ ఇటూ కదులుతున్న నాలుకా, కనుబొమ్మల ముడితో  భయంకరముగా ఉన్న, నిక్కబొడుచుకుని ఉన్న చెవులూ, పర్వత గుహ వంటి నాసికా రంధ్రము కలా, భయంకరమైన దవడలూ కలిగి

దివిస్పృశత్కాయమదీర్ఘపీవర గ్రీవోరువక్షఃస్థలమల్పమధ్యమమ్
చన్ద్రాంశుగౌరైశ్ఛురితం తనూరుహైర్విష్వగ్భుజానీకశతం నఖాయుధమ్

స్వర్గానికి తాకుతున్నంత ప్రమాణం గల శరీరం కలవాడై, బాగా పొడువూ కాకుండా పొట్టీ కాకుండా బలిసి ఉన్న మెడ, విశాల వక్షస్థలం, సన్నని నడుము, చంద్రుని కిరణముల వలె తెల్లగా ఉన్న, చుర కత్తుల వంటి రోమములూ, అంతటా వ్యాపించి ఉన్న వేయి భుజాలూ, (భుజ అనీక సైన్యం - అంతటా వ్యాపించి ఉన్న భుజములనే సైన్యం కలవాడు), గోళ్ళే ఆయుధములుగా కలిగి,

దురాసదం సర్వనిజేతరాయుధ ప్రవేకవిద్రావితదైత్యదానవమ్
ప్రాయేణ మేऽయం హరిణోరుమాయినా వధః స్మృతోऽనేన సముద్యతేన కిమ్

ఎవ్వరి చేతా దగ్గరకి పోవడానికి వీలు లేనంత భయంకరముగా ఉన్నాడు, తనకంటే ఇతరుల చేతిలో ఉన్న ఆయుధములను తరిమికొడుతున్న వాడు, ఇప్పటి దాకా అన్ని భీరములూ పలికిన హిరణ్యకశిపుడు కూడా ఆ దివ్య భయంకరమైన రూపాన్ని చూచి "నా వధ ఈ రూపములో జరగాలని నిర్ణయించుకున్నాడా" అని అనుకున్నాడు.

ఏవం బ్రువంస్త్వభ్యపతద్గదాయుధో నదన్నృసింహం ప్రతి దైత్యకుఞ్జరః
అలక్షితోऽగ్నౌ పతితః పతఙ్గమో యథా నృసింహౌజసి సోऽసురస్తదా

అలా అనుకొని గదను తీసుకుని స్వామి మీదకు వెళ్ళాడు. నారసింహుని మీదకు రాక్షసుడనే ఏనుగు వెళ్ళింది. అగ్ని తేజస్సు గుర్తించక మిడతలు ఎలా అందులో పడతాయో అలా హిరణ్యకశిపుడు వెళ్ళాడు. ఇంత గొప్పవాడైన హిరణ్యకశిపుడు కూడా అంధ కారములో మునిగిపోయాడు. ఇంత పెద్ద బ్రహ్మాండమనే అంధకారాన్ని మింగిన స్వామ్మికి హిరణ్యకశిపున్ని తనలో చేరుకోవడం ఒక లెక్కలోకి రాదు.

న తద్విచిత్రం ఖలు సత్త్వధామని స్వతేజసా యో ను పురాపిబత్తమః
తతోऽభిపద్యాభ్యహనన్మహాసురో రుషా నృసింహం గదయోరువేగయా

తన చేతిలో ఉన్న గదతో స్వామిని కొట్టాడు. పామును గరుడుడు ఒడిసిపట్టినట్లుగా గదతో ఉన్న హిరణ్యకశిపున్ని స్వామి పట్టుకున్నాడు.

తం విక్రమన్తం సగదం గదాధరో మహోరగం తార్క్ష్యసుతో యథాగ్రహీత్
స తస్య హస్తోత్కలితస్తదాసురో విక్రీడతో యద్వదహిర్గరుత్మతః

ఆయన పట్టుకుంటే హిరణ్యకశిపుడు ఆ పట్టుని విడిపించుకున్నాడు. అది మంచి శకునముగా దేవతలు భావించలేదు. అందరూ మబ్బుల చాటులో దాక్కుని జరిగేదంతా చూస్తున్నారు. గరుత్మంతుడు పాముతో ఆడుకున్నట్లు హిరణ్యకశిపునితో ఆడుకున్నాడు స్వామి.

అసాధ్వమన్యన్త హృతౌకసోऽమరా ఘనచ్ఛదా భారత సర్వధిష్ణ్యపాః
తం మన్యమానో నిజవీర్యశఙ్కితం యద్ధస్తముక్తో నృహరిం మహాసురః
పునస్తమాసజ్జత ఖడ్గచర్మణీ ప్రగృహ్య వేగేన గతశ్రమో మృధే

సకలలోకపాలకులూ హిరణ్యకశిపుడు స్వామి చేతిలోంచి పట్టును తప్పించుకోవడం మంచిది కాదు కదా అనుకున్నారు. తన బలం మీద తనకే అనుమానం వచ్చింది హిరణ్యకశిపునికి. ఒక కత్తినీ డాలునీ తీసుకుని మీదకి వెళ్ళాడు. యుద్ధమంటే ఆనందం కలిగేవాడైన హిరణ్యకశిపుడు స్వామి మీదకు వెళ్ళాడు.

తం శ్యేనవేగం శతచన్ద్రవర్త్మభిశ్చరన్తమచ్ఛిద్రముపర్యధో హరిః
కృత్వాట్టహాసం ఖరముత్స్వనోల్బణం నిమీలితాక్షం జగృహే మహాజవః

డేగ లాంటి వేగం గల హిరణ్యకశిపుడు నూరు చంద్రులు (అంచులు) గల కత్తిని సందులేకుండా వేగముగా పట్టుకుని తిప్పుతూ ఉన్న వాడిని చూచి స్వామి ఒక అట్టహాసం చేసాడు. ఆ ధ్వనితో అన్ని లోకాలూ వణికిపోయాయి. ఆ అట్టహాసానికి హిరణ్యకశిపుడు కళ్ళు మూసుకున్నాడు.

విష్వక్స్ఫురన్తం గ్రహణాతురం హరిర్వ్యాలో యథాఖుం కులిశాక్షతత్వచమ్
ద్వార్యూరుమాపత్య దదార లీలయా నఖైర్యథాహిం గరుడో మహావిషమ్

సర్పము ఎలా ఎలుకను ఎంత వేగముగా వెళుతున్నా పట్టుకుంటుందో, అలా పట్టుకుని సభా ద్వారములో కూర్చుండి తన ఊరువు మీద పెట్టుకుని పాముని గరుడుడు గోళ్ళతో చీల్చి వేసినట్లు చీల్చి వేసాడు.

సంరమ్భదుష్ప్రేక్ష్యకరాలలోచనో వ్యాత్తాననాన్తం విలిహన్స్వజిహ్వయా
అసృగ్లవాక్తారుణకేశరాననో యథాన్త్రమాలీ ద్విపహత్యయా హరిః

ఏంగును చంపిన సింహం గోళ్ళకు అంటినట్లుగా స్వామి గోళ్ళకూ, మెడచుట్టూ ఉన్న కేసరమూలూ, ముఖానికీ రక్తం అంటుకొని ఉండగా, ప్రేగులు మెడలో పడిన సింహములాగ, ఆయన కోపాన్ని చూస్తే ఎవ్వరూ  ఆయనౌ చూడడానికి సాహసం చేయరానిదిగా ఉండెను.

నఖాఙ్కురోత్పాటితహృత్సరోరుహం విసృజ్య తస్యానుచరానుదాయుధాన్
అహన్సమస్తాన్నఖశస్త్రపాణిభిర్దోర్దణ్డయూథోऽనుపథాన్సహస్రశః

గోళ్ళ కొనలతో హిరణ్యకశిపుని గుండే పెకిలి వేయబడినది. అతన్ని ఇలా వధిస్తే మా రాజుని చంపుతావా అని సైన్యమంతా వచ్చారు. తన నఖములతో ఇంకా కొన్ని ఇతర ఆయుధాలతో వచ్చిన వారిని వచ్చినట్లు వధించాడు. భుజములే స్వామి సైన్యము. దారిపట్టి వచ్చిన వారందరినీ సంహరించాడు.

సటావధూతా జలదాః పరాపతన్గ్రహాశ్చ తద్దృష్టివిముష్టరోచిషః
అమ్భోధయః శ్వాసహతా విచుక్షుభుర్నిర్హ్రాదభీతా దిగిభా విచుక్రుశుః

అలా చంపుతూ తన తలని ఒక్క సారి విదిలించాడు, అలా విధించగా అక్కడున్న మేఘాలన్నీ విడిపోయాయి, ఒక్క సారి పైకి చూడగానే గ్రహాలన్నీ రాలిపోయాయి, ఒక్క సారి ఆయన కోపముతో నిశ్వాస తీయగానే ఏడు సముద్రాలూ ఒక్కసారి ఉప్పొంగాయి, గట్టిగా గర్ఝించగానే దిగ్గజాలు పారిపోయాయి, ఆయన జూలులో ఆకాశములో వెళ్ళే విమానాలు చిక్కుకున్నాయి.

ద్యౌస్తత్సటోత్క్షిప్తవిమానసఙ్కులా ప్రోత్సర్పత క్ష్మా చ పదాభిపీడితా
శైలాః సముత్పేతురముష్య రంహసా తత్తేజసా ఖం కకుభో న రేజిరే

ఒక్క అడుగు వేయగానే భూమి మొత్తం కదిలి పక్కకు వెళ్ళిపోయింది, ఆయన వేగముతో పర్వతాలు పడిపోయాయి, ఆయన తేజస్సుతో ఆకాశమూ దిక్కులూ ఉన్నట్లు కనపడలేదు.

తతః సభాయాముపవిష్టముత్తమే నృపాసనే సమ్భృతతేజసం విభుమ్
అలక్షితద్వైరథమత్యమర్షణం ప్రచణ్డవక్త్రం న బభాజ కశ్చన

ఇలా అన్నీ పూర్తి చేసి, సభా మధ్యములో ఉన్న సింహాసనం మీద తన దివ్యమైన తేజస్సుతో కూర్చున్నాడు. ఆయనకు ఎదురు నిలిచేవాడే లేడు. దరిదాపులకు కూడా ఎవరూ వచ్చే సాహసం చేయలేదు. ఆయన కోపం ఎంతకీ తగ్గలేదు. మహా ఉగ్రముగా ఉన్నాడు. అలాంటి స్వామిని చూచి ఎవ్వరి ముఖమూ శోభించలేదు.

నిశామ్య లోకత్రయమస్తకజ్వరం తమాదిదైత్యం హరిణా హతం మృధే
ప్రహర్షవేగోత్కలితాననా ముహుః ప్రసూనవర్షైర్వవృషుః సురస్త్రియః

మూడు లోకములకూ తల నొప్పి వంటి వాడైన (లోకత్రయమస్తకజ్వరం ) హిరణ్యకశిపుడు సంహరించబడ్డాడని విని ఆనందించి అప్సరసలు వికసించిన ముఖం కలవారై పుష్పవర్షాన్ని కురిపించారు.

తదా విమానావలిభిర్నభస్తలం దిదృక్షతాం సఙ్కులమాస నాకినామ్
సురానకా దున్దుభయోऽథ జఘ్నిరే గన్ధర్వముఖ్యా ననృతుర్జగుః స్త్రియః

అందరూ తమ విమానాలలో చూడడానికి రాగానే ఆకాశమంతా విమానాలతో నిండిపోయింది సందులేకుండా. ఇలా దేవతలూ దేవతాధిపతులూ దుంధుభులు మోగించారు, గంధర్వులు గానం అప్సరసలు నాట్యం చేసారు.

తత్రోపవ్రజ్య విబుధా బ్రహ్మేన్ద్రగిరిశాదయః
ఋషయః పితరః సిద్ధా విద్యాధరమహోరగాః

ఋషులూ పితృదేవతలూ సిద్ధులూ విష్ణుపార్శదులూ మొదలైన వారందరూ

మనవః ప్రజానాం పతయో గన్ధర్వాప్సరచారణాః
యక్షాః కిమ్పురుషాస్తాత వేతాలాః సహకిన్నరాః

శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆసీనుడైన స్వామికి దగ్గరగా మాత్రం రాలేదు.

తే విష్ణుపార్షదాః సర్వే సునన్దకుముదాదయః
మూర్ధ్ని బద్ధాఞ్జలిపుటా ఆసీనం తీవ్రతేజసమ్
ఈడిరే నరశార్దులం నాతిదూరచరాః పృథక్

అలా స్వామి చుట్టూ తిరుగుతూ స్వామిని స్తోత్రం చేసారు.

శ్రీబ్రహ్మోవాచ
నతోऽస్మ్యనన్తాయ దురన్తశక్తయే విచిత్రవీర్యాయ పవిత్రకర్మణే
విశ్వస్య సర్గస్థితిసంయమాన్గుణైః స్వలీలయా సన్దధతేऽవ్యయాత్మనే

గుణములకూ నామములకూ స్వరూపములకూ స్థితికీ అంతము లేని స్వామికి నమస్కార్మ్. "ఇంతా" అని వివరించలేనంత శక్తి గలవాడు.సకల జగత్తునూ తన వశములో ఉంచుకోగల విచిత్రమైన (బలమూ శక్తీ ఉపయోగించకుండానే సకల లోకములనూ తన వశములో ఉంచుకోగలవాడు.) వీర్యము గలవాడు.  నీవు చేసే ఏ పని అయినా సకల లోకములనూ పావనం చేస్తావు. సృష్టి స్థితి లయాలను తన లీలతో చేసేవాడు. తరుగు లేని వాడు

శ్రీరుద్ర ఉవాచ
కోపకాలో యుగాన్తస్తే హతోऽయమసురోऽల్పకః
తత్సుతం పాహ్యుపసృతం భక్తం తే భక్తవత్సల

ఇది ప్రళయకాలం కాదు కదా. అంత కోపం ఎందుకు.ఈ అల్పున్ని చంపడానికా ఇంత కోపం. నీ భతుడైన ప్రహ్లాదుడు నీ వద్దకు వచ్చాడు. అతన్ని కాపాడు, శాంతించు

శ్రీన్ద్ర ఉవాచ
ప్రత్యానీతాః పరమ భవతా త్రాయతా నః స్వభాగా
దైత్యాక్రాన్తం హృదయకమలం తద్గృహం ప్రత్యబోధి
కాలగ్రస్తం కియదిదమహో నాథ శుశ్రూషతాం తే
ముక్తిస్తేషాం న హి బహుమతా నారసింహాపరైః కిమ్

ఇతను దేవతలకు ఇచ్చే హవిస్సును తనే స్వీకరించేవాడు. అలాంటిది నీవు మమ్ము కాపాడదలచి అతన్ని సంహరించి మా భాగాలు మాకు ఇచ్చావు. మిమ్ము తలచుకునే అవకాశమే మాకు లేదు. నిరంతరం ఇతని వలన వచ్చే ఉపద్రవం తలచుకుంటూ నీ ఇల్లు అయిన మా హృదయములో నిన్ను తలచుకోకుండా ఉన్న మేము ం అళ్ళీ నిన్ను తలచుకోగలుగుతున్నాము. మా హృదయములో నీ స్వరూపాన్ని ప్రతిష్టింపచేసావు. ఇదంతా కాల గ్రస్థం. కొంత సమయములో సంతోషం, కొంత సమయములో విచారం. ఇదంతా కాలానుగుణముగా జరిగే ప్రక్రియ. నిన్ను సేవించే వారు మోక్షం కూడా కోరరు. మాకు మీ సేవ ప్రధానం.

శ్రీఋషయ ఊచుః
త్వం నస్తపః పరమమాత్థ యదాత్మతేజో
యేనేదమాదిపురుషాత్మగతం ససర్క్థ
తద్విప్రలుప్తమమునాద్య శరణ్యపాల
రక్షాగృహీతవపుషా పునరన్వమంస్థాః

మాకు తపముతోటి ఇంతటి తేజస్సును ప్రసాదించినది నీవు. ఆ తపస్సుతోనే బ్రహ్మ సకల జగత్తునీ సృష్టించాడు. మేమాచరించే తపస్సు మేము ఆచరించకుండా ఇతను లోపింపచేసాడు. నీవిపుడు ఈ అవతారాన్ని తీసుకుని ఆ తపస్సుని మాకు తిరిగి ఇచ్చావు.

శ్రీపితర ఊచుః
శ్రాద్ధాని నోऽధిబుభుజే ప్రసభం తనూజైర్
దత్తాని తీర్థసమయేऽప్యపిబత్తిలామ్బు
తస్యోదరాన్నఖవిదీర్ణవపాద్య ఆర్చ్ఛత్
తస్మై నమో నృహరయేऽఖిలధర్మగోప్త్రే

మా మా పుత్రులు మాకర్పించే శ్రాద్ధ భోజనం వీడే తినేసి, వారిచ్చే తర్పణాలు కూడా వీడే స్వీకరించాడు. అతని ఉదరాన్ని చీల్చి, ఆ జలాన్నీ అన్నాన్ని మాకు మళ్ళీ ప్రసాదించావు. సకల ధర్మాన్నీ కాపాడే నృసింహస్వామికి నమస్కారం

శ్రీసిద్ధా ఊచుః
యో నో గతిం యోగసిద్ధామసాధురహార్షీద్యోగతపోబలేన
నానా దర్పం తం నఖైర్విదదార తస్మై తుభ్యం ప్రణతాః స్మో నృసింహ

యోగము వలన మేము సంపాదించిన సిద్ధిని తన యోగముతో హిరణ్యకశిపుడు సంహరించాడు. "నేనే బలవంతున్నీ శక్తిమంతున్నీ" అని గర్విస్తున్న వాడిని చీల్చి మా సిద్ధిని మాకు ఇచ్చావు

శ్రీవిద్యాధరా ఊచుః
విద్యాం పృథగ్ధారణయానురాద్ధాం న్యషేధదజ్ఞో బలవీర్యదృప్తః
స యేన సఙ్ఖ్యే పశువద్ధతస్తం మాయానృసింహం ప్రణతాః స్మ నిత్యమ్

మేము మా మనసుని నీ యందు ధారణం చేసి పొందిన అఖిల విద్యలను ఈ దుర్మార్గుడు అడ్డుపడి నిషేధించాడు. యుద్ధములో పశువులా (ప్రతికిరా శూన్యుడై) సంహరించబడ్డాడు. అలాంటి నీకు నిత్యమూ నమస్కారము.

శ్రీనాగా ఊచుః
యేన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నః
తద్వక్షఃపాటనేనాసాం దత్తానన్ద నమోऽస్తు తే

మా మస్తకములో ఉన్న రత్నాలనూ, మా స్త్రీ రత్నాలనూ హరించాడు. ఇతని వక్షస్థమ చీల్చి మాకు ఆనందం కలిగించావు

శ్రీమనవ ఊచుః
మనవో వయం తవ నిదేశకారిణో దితిజేన దేవ పరిభూతసేతవః
భవతా ఖలః స ఉపసంహృతః ప్రభో కరవామ తే కిమనుశాధి కిఙ్కరాన్

మేము మీ ఆజ్ఞ్యను పాలించేవారము.ఈ దితి కుమారుడు మా మర్యాదలను అడ్డగించాడు. ఈ ఖలుడు నీ చేత ఉపసంహరించబడ్డాడు. ఏమి చేయాలో మీ కింకరులమైన మాకు ఆజ్ఞ్యాపించు

శ్రీప్రజాపతయ ఊచుః
ప్రజేశా వయం తే పరేశాభిసృష్టా న యేన ప్రజా వై సృజామో నిషిద్ధాః
స ఏష త్వయా భిన్నవక్షా ను శేతే జగన్మఙ్గలం సత్త్వమూర్తేऽవతారః

మేము ప్రజాపతులం. నీవు పరేశుడవు. నీవు మమ్ము సృష్టించావు. నీ ఆజ్ఞ్య ప్రకారం మేము ప్రజలను సృష్టిస్తుంటే వీడు అడ్డగించాడు. అలాంటి వాడు నీచేత వక్షస్థలం చీలచబడి పడి ఉన్నాడు. సకల విశ్వమునకూ నీ అవతారం మంగళ కరం

శ్రీగన్ధర్వా ఊచుః
వయం విభో తే నటనాట్యగాయకా యేనాత్మసాద్వీర్యబలౌజసా కృతాః
స ఏష నీతో భవతా దశామిమాం కిముత్పథస్థః కుశలాయ కల్పతే

మేము నీకు గాయకులమూ నర్తకులమూ. నీ ఎదుట నాట్యం చేస్తాము. వీడు తనకు చేయించుకున్నాడు. చెడుదారిలో పోయేవాడు క్షేమాలు పొందుతాడా? ఏదో కొంతకాలం సాగించుకుంటాడు అంతే.

శ్రీచారణా ఊచుః
హరే తవాఙ్ఘ్రిపఙ్కజం భవాపవర్గమాశ్రితాః
యదేష సాధుహృచ్ఛయస్త్వయాసురః సమాపితః

మేము సంసారాన్ని పోగొట్టే నీ పాదములను ఆశ్రయించినవారం. సజ్జన హృదయములో శల్యం ఐన వీడిని సంహరించారు.

శ్రీయక్షా ఊచుః
వయమనుచరముఖ్యాః కర్మభిస్తే మనోజ్ఞైస్
త ఇహ దితిసుతేన ప్రాపితా వాహకత్వమ్
స తు జనపరితాపం తత్కృతం జానతా తే
నరహర ఉపనీతః పఞ్చతాం పఞ్చవింశ

చక్కని సేవలు చేస్తూ మీకు మేము అనుచరులుగా ఉన్నాము. నీకు సేవ చేయవలసిన మమ్ము ఈ రాక్షసుడు తనకు సేవకునిగా చేసుకుని తన వాహనాలని మోయించాడు. సకల లోకములకూ పరితాపాన్ని కలిగించాడు. అలాంటి ఇరవై ఐదవ తత్వము (ఇరవై నాలుగు తత్వాలు జీవుడు + ఇరవై ఐదవది పరమాత్మ)అయిన నీవు వీడి ఐదునీ (పంచ ప్రాణాలని) తీసుకున్నావు.

శ్రీకిమ్పురుషా ఊచుః
వయం కిమ్పురుషాస్త్వం తు మహాపురుష ఈశ్వరః
అయం కుపురుషో నష్టో ధిక్కృతః సాధుభిర్యదా

మేము చిన్న పురుషులము నీవు మహా పురుషుడవు, వీడు దుష్ట పురుసుడు. సజ్జనులతో దిక్కరించబడి నశించాడు.

శ్రీవైతాలికా ఊచుః
సభాసు సత్రేషు తవామలం యశో గీత్వా సపర్యాం మహతీం లభామహే
యస్తామనైషీద్వశమేష దుర్జనో ద్విష్ట్యా హతస్తే భగవన్యథామయః

ఆయా దేవ సభలలో నీ దివ్య గుణ నామాలను కీర్తించి గొప్ప గౌరవాన్ని పొందాము. ఈ దుర్మార్గుడు అలాంటి మర్యాదను తొలగించాడు. అలాంటి వాడు వ్యాధి తొలగించబడినట్లుగా మీ దయతో సంహరించబడ్డాడు.

శ్రీకిన్నరా ఊచుః
వయమీశ కిన్నరగణాస్తవానుగా దితిజేన విష్టిమమునానుకారితాః
భవతా హరే స వృజినోऽవసాదితో నరసింహ నాథ విభవాయ నో భవ

మేము కిన్నెరులం, నీ అనుచరులము. అలాంటి మేము ఈ రాక్షసునితో వాడి సేవను చేయవలసి వచ్చింది. మా దుఃఖాన్ని మీరు తొలగించారు. మా వైభవం మాకు కలిగించు.

శ్రీవిష్ణుపార్షదా ఊచుః
అద్యైతద్ధరినరరూపమద్భుతం తే దృష్టం నః శరణద సర్వలోకశర్మ
సోऽయం తే విధికర ఈశ విప్రశప్తస్తస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః

అత్యద్భుతమైన నీ నరసింహరూపాన్ని మేము చూడగలిగాము. ఈ రూపం అన్ని లోకములకూ సుఖమూ శుభమూ మంగళం కలిగిస్తుంది. వేరే వాళ్ళందరూ స్వామి దుర్మార్గున్న సంహరించాడు అంటున్నారు కానీ వారికేం తెలుసు ఇతను కూడా మీ సేవకుడు, సనకాదులచే శపించబడ్డాడు అని. సనకాదుల శాపం వలన కలిగిన దుఃఖాన్ని పోగొట్టావు. అలాంటి వాని సంహారం నిగ్రహం కాదు, అది నీ అనుగ్రహమే. నీ సేవకులను నీవు నిగ్రహించవు. అనుగ్రహిస్తావు.

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
ఏవం దైత్యసుతైః పృష్టో మహాభాగవతోऽసురః
ఉవాచ తాన్స్మయమానః స్మరన్మదనుభాషితమ్

ఇది వరకు నేను చెప్పిన దాన్ని గుర్తు చేసుకుని మహాభాగవత అసురుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు

శ్రీప్రహ్రాద ఉవాచ
పితరి ప్రస్థితేऽస్మాకం తపసే మన్దరాచలమ్
యుద్ధోద్యమం పరం చక్రుర్విబుధా దానవాన్ప్రతి

మా నాన్న గారు తీవ్రమైన తపస్సు చేయడానికి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు, ఇదే అవకాశమని దేవతలు మా మీదకి దండించి వచ్చారు

పిపీలికైరహిరివ దిష్ట్యా లోకోపతాపనః
పాపేన పాపోऽభక్షీతి వదన్తో వాసవాదయః

హిరణ్యకశిపుడు పూర్తిగా తపస్సులో మునిగి అతని మీద పుట్టా మొలిచి పాములూ వచ్చి, శరీరాన్ని క్రిమికీటకాలు తినివేసి ఉన్నప్పుడు వచ్చారు

తేషామతిబలోద్యోగం నిశమ్యాసురయూథపాః
వధ్యమానాః సురైర్భీతా దుద్రువుః సర్వతో దిశమ్

వారు విజృంభించగా అది తట్టుకోలేని రాక్షసులు వేరు వేరు దిక్కులకు పారిపోయారు

కలత్రపుత్రవిత్తాప్తాన్గృహాన్పశుపరిచ్ఛదాన్
నావేక్ష్యమాణాస్త్వరితాః సర్వే ప్రాణపరీప్సవః

తమ ప్రాణాలు కాపాడుకుంటే చాలని వేటినీ పట్టించుకోకుండా సైన్యాధికారులందరూ పారిపోయారు

వ్యలుమ్పన్రాజశిబిరమమరా జయకాఙ్క్షిణః
ఇన్ద్రస్తు రాజమహిషీం మాతరం మమ చాగ్రహీత్

దేవతలు నగరాన్ని స్వాధీనం చేసుకుంటే ఇంద్రుడు మా తల్లిని బంధించాడు

నీయమానాం భయోద్విగ్నాం రుదతీం కురరీమివ
యదృచ్ఛయాగతస్తత్ర దేవర్షిర్దదృశే పథి

అలా తీసుకుని వెళుతుంటే భగవత్సంకల్పముతో నారదుడు అక్కడికి వచ్చాడు

ప్రాహ నైనాం సురపతే నేతుమర్హస్యనాగసమ్
ముఞ్చ ముఞ్చ మహాభాగ సతీం పరపరిగ్రహమ్

వద్దు నాయనా ఈమెను చెరపట్టవద్దు. ఈమె ఎటువంటి అపరాధం చేయలేదు. పరుల భార్యను చెరబట్టడం మంచిది కాదు

శ్రీన్ద్ర ఉవాచ
ఆస్తేऽస్యా జఠరే వీర్యమవిషహ్యం సురద్విషః
ఆస్యతాం యావత్ప్రసవం మోక్ష్యేऽర్థపదవీం గతః

ఈమె గర్భములో హిరణ్యకశిపుని కొడుకు పెరుగుతున్నాడు. ప్రసవించేంత వరకూ నా దగ్గర పెట్టుకుని ప్రసవించిన తరువాత విడిచిపెడతాను

శ్రీనారద ఉవాచ
అయం నిష్కిల్బిషః సాక్షాన్మహాభాగవతో మహాన్
త్వయా న ప్రాప్స్యతే సంస్థామనన్తానుచరో బలీ

ఆ కడుపులో ఉన్నది పరమ భాగవతుడు. ఏమాత్రం కపటం లేని వాడు. అతన్ని నీవు ఏమీ చేయలేవు. అతను పరమ భక్తుడు. అందుకు గర్భములో ఉండగానే నీ కంటే బలవంతుడు.

ఇత్యుక్తస్తాం విహాయేన్ద్రో దేవర్షేర్మానయన్వచః
అనన్తప్రియభక్త్యైనాం పరిక్రమ్య దివం యయౌ

దేవర్షి వాక్యాన్ని మన్నిస్తూ దేవేంద్రుడు పరమాత్మ భక్తుడు ఉన్నాడని తెలుసుకుని, ఆమెకు ప్రదక్షిణం చేసి వెళ్ళాడు.

తతో మే మాతరమృషిః సమానీయ నిజాశ్రమే
ఆశ్వాస్యేహోష్యతాం వత్సే యావత్తే భర్తురాగమః

మా తల్లిని నారదుడు తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి, నీ భర్త వచ్చేంత వరకూ నా ఆశ్రమములోనే ఉండమని చెప్పాడు

తథేత్యవాత్సీద్దేవర్షేరన్తికే సాకుతోభయా
యావద్దైత్యపతిర్ఘోరాత్తపసో న న్యవర్తత

నారదుని వద్ద ఎటువంటి భయం ఉండే అవకాశం లేదు కాబట్టి ఆమె ఆనందముగా అంగీకరించింది. తపస్సు అయ్యేంత వరకూ ఆ ఆశ్రమములోనే ఉన్నది

ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతీ
అన్తర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛాప్రసూతయే

అక్కడ ఉన్నంత కాలం పరమభక్తితో నారదున్ని సేవించింది. తన గర్భం క్షేమముగా ఉండాలనీ, తాను కోరుకున్నప్పుడే ప్రసవించాలీ అని వరము కోరుకుంది.

ఋషిః కారుణికస్తస్యాః ప్రాదాదుభయమీశ్వరః
ధర్మస్య తత్త్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలమ్

ఆమె కోరిన కోరిక ప్రకారం నారదుడు రెండు వరాలనూ ప్రసాదించాడు. మా అమ్మగారికీ నాకూ, ఇద్దరికీ పనికొస్తుందనీ ధర్మమునూ తత్వ జ్ఞ్యానమునూ ఉపదేశించాడు.

తత్తు కాలస్య దీర్ఘత్వాత్స్త్రీత్వాన్మాతుస్తిరోదధే
ఋషిణానుగృహీతం మాం నాధునాప్యజహాత్స్మృతిః

ఇది జరిగి చాలా కాలం జరిగింది కాబట్టి, తాను స్త్రీ కాబట్టీ ఆ విషయం మరచిపోయింది. నారద మహర్షి అనుగ్రహం వలన నాకు ఆ జ్ఞ్యానం ఇప్పటికీ గుర్తు ఉంది

భవతామపి భూయాన్మే యది శ్రద్దధతే వచః
వైశారదీ ధీః శ్రద్ధాతః స్త్రీబాలానాం చ మే యథా

నా మాట మీద నమ్మకం ఉంటే మీకు కూడా అటువంటి అత్యుత్తమైన జ్ఞ్యానం కలుగుతుంది. స్త్రీలకైనా బాలకులకైనా ఎవరికైనా శ్రద్ధ ఉంటే జ్ఞ్యానం కలుగుతుంది.

జన్మాద్యాః షడిమే భావా దృష్టా దేహస్య నాత్మనః
ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వరమూర్తినా

పుట్టుకా ఉనికీ పెరుగుటా తరుగుటా మారుటా నశించుటా అనే ఆరు భావములూ  శరీరానికి గానీ ఆత్మకు కాదు. ఒక చెట్టుకు పూవూ, పిందె, కాయా, పండూ, పండు రాలిపోవడం అనే వికారాలు ఉంటాయి. కాని ఇవి జరిగినా ఆ చెట్టుకు ఏమీ జరుగదు. అలాగే ఈ వికారాలన్నీ శరీరానికే గానీ ఆత్మకు కాదు.

ఆత్మా నిత్యోऽవ్యయః శుద్ధ ఏకః క్షేత్రజ్ఞ ఆశ్రయః
అవిక్రియః స్వదృఘేతుర్వ్యాపకోऽసఙ్గ్యనావృతః

ఆత్మ నిత్యమూ నాశము లేనిది, గుణాలు లేనిది, రెండవది అంటూ లేనిది, శరీరం యొక్క స్థితి స్వరూపాన్ని తెలుసుకునేది, ఎలాంటి వికారాలు లేనిది, తనను తాను తెలుసుకునేది. అంతటా వ్యాపించి ఉంటుంది గానీ వ్యాప్యమైన వాటితో సంగం ఉండదు

ఏతైర్ద్వాదశభిర్విద్వానాత్మనో లక్షణైః పరైః
అహం మమేత్యసద్భావం దేహాదౌ మోహజం త్యజేత్

ఇది ఆత్మ యొక్క పన్నెండు లక్షణాలు. ఈ లక్షణాలున్న ఆత్మను తెలియక శరీరం యందూ శరీరం కొరకూ శరీరం వలన వచ్చిన వారి యందు నాదీ నేనూ అన్న భావం వదిలిపెట్టలేరు. ఆత్మ కంటే శరీరం వేరు అని తెలుసుకున్న వారు దేహముతో వచ్చిన సంబంధీకులని నా వారు అనుకోడు. మోహం వలన పొందే ఈ బ్ర్హమను వదిలిపెడతాడు

స్వర్ణం యథా గ్రావసు హేమకారః క్షేత్రేషు యోగైస్తదభిజ్ఞ ఆప్నుయాత్
క్షేత్రేషు దేహేషు తథాత్మయోగైరధ్యాత్మవిద్బ్రహ్మగతిం లభేత

ఇది అందరికీ తెలియదు. బంగారం గనులలో ఉంటుంది, అంటే భూమిలోనే ఉంటుంది. అలా అని భూమిలో ఎక్కడ పడితే అది ఉండదు. ఎక్కడ ఉన్న రాయిని బాగా పరీక్షించి చూస్తే అది బంగారం అని తెలిసినవాడికి  బంగారం లభిస్తుందో, దహరాకాశ లక్షణం హృదయ లక్షణం తెలిసినవాడికి ఆత్మ గురించి తెలుసుతుంది. ఆత్మ తత్వం తెలిసిన వాడికే ఆత్మ జ్ఞ్యానం లభిస్తుంది. ఆత్మకు శరీరం క్షేత్రం. ఆధ్యాత్మ యోగముతో ఆ ఆత్మ జ్ఞ్యానాన్ని తెలుసుకుంటాడు.

అష్టౌ ప్రకృతయః ప్రోక్తాస్త్రయ ఏవ హి తద్గుణాః
వికారాః షోడశాచార్యైః పుమానేకః సమన్వయాత్

భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మహత్తూ అహంకారం ప్రకృతి, ఇవి అష్ట ప్రకృతి, మూడు గుణాలు (సత్వ రజ తమో), ఇవి కాక ఐదు జ్యాన ఐదు కర్మేంద్రియ పంచ భూతాలూ మనసు కలిపి పదహారు వికారాలు. ఇవి అన్నీ కలిపిన ఇరవై ఏడులో జీవుడు మాత్రం ఒక్కడే.

దేహస్తు సర్వసఙ్ఘాతో జగత్తస్థురితి ద్విధా
అత్రైవ మృగ్యః పురుషో నేతి నేతీత్యతత్త్యజన్

ఈ శరీరం సర్వ సంఘాతం. ఈ పైన చెప్పిన ఇరవై ఏడూ కలిస్తే దేహం. ఇది రెండు రకాలుగా ఉంటుంది. స్థావరమూ జంగమమూ. కదిలేదీ కదలనిది. ఈ సముదాయములోనే ఆత్మను వెతికి పట్టుకోవాలి. లేదు లేదు అన్న అసత్యాన్ని విడిచిపెట్టి వెతకాలి.

అన్వయవ్యతిరేకేణ వివేకేనోశతాత్మనా
స్వర్గస్థానసమామ్నాయైర్విమృశద్భిరసత్వరైః

ఆత్మ ఉన్నట్లు ఎలా తెలుసుకోవాలి. అన్వయ వ్యతిరేకాలతో తెలుసుకోవాలి. ఆత్మ ఉంటేనే శరీరానికి ఉనికి. ఆత్మ లేకపోతే శరీరాన్ని మనమే విడిచిపెడతాము. వివేక జ్ఞ్యానముతో ఆత్మ వేరూ శరీరం వేరూ అన్న పరిశీలముతో తెలుసుకోవాలి. ఈ లోకములో కొన్నాళ్ళు ఉండీ, పరలోకములో కొన్నాళ్ళు ఉంటాము. స్వగ్రాది భావములు ఉన్నవీ అని ఒప్పుకుంటే ఆత్మ ఉన్నది అని ఒప్పుకోవాలి. పరలోకం ఉన్నది అని ఒప్పుకుంటే ఆత్మ ఉన్నది అని ఒప్పుకోవాలి. పరలోకం అనేది శరీరం పోయిన తరువాతే వస్తుంది.

బుద్ధేర్జాగరణం స్వప్నః సుషుప్తిరితి వృత్తయః
తా యేనైవానుభూయన్తే సోऽధ్యక్షః పురుషః పరః

బుద్ధికి మూడు వృత్తులు ఉంటాయి జాగరణ నిద్రపోవుటా కలలు గనుట. ఈ మూడు ఎవరికి గలవో వాడు ఆత్మ. అలా మేలుకొనే, కలలు గనే , నిద్రపోయేది బుద్ధి. నిద్రలో పరమాత్మతో జీవుడు చక్కగా కలిసిపోతాడు. ఇవి ఎవరితో అనుభవించబడుతున్నాయో వాడు దేహాధ్యక్షుడు. ఇవే మూడు. ఈ మూడూ బుద్ధి భేధాలు. ఈ మూడూ ఒప్పుకున్నామంటే శరీఎరం కంటే బుద్ధి కంటే మనసు కంటే ఆత్మ వేరే ఉన్నాడు. వేరే ఆత్మ లేకుంటే కలలూ రావు మెలుకువా లేదు.

ఏభిస్త్రివర్ణైః పర్యస్తైర్బుద్ధిభేదైః క్రియోద్భవైః
స్వరూపమాత్మనో బుధ్యేద్గన్ధైర్వాయుమివాన్వయాత్

గాలి ఉన్నది అని ఎలా నమ్మాలి? వాసన బట్టి వాయును నమ్మాలి. వాయువు లేకుంటే వాసన ఉండదు. నిద్ర కానీ స్వప్నం కానీ మెలుకువ కానీ శరీరానికి కాదు. బుద్ధికి. ఆత్మ లేకుంటే బుద్ధి లేదు. వీటిని బట్టే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. శరీరమును బట్టే సంసారం. శరీరం రావడానికి బుద్ధే కారణం.

ఏతద్ద్వారో హి సంసారో గుణకర్మనిబన్ధనః
అజ్ఞానమూలోऽపార్థోऽపి పుంసః స్వప్న ఇవార్ప్యతే

ఈ బుద్ధే మనం ఆచరించే కర్మలను బట్టీ, మనం అనుభవించే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సంసారం అజ్ఞ్యాన మూలం. శరీరం కంటే విడిగా ఉన్న ఆత్మ సంగతి తెలిసి కూడా శరీరమే ఆత్మ అని అపార్థం చేసుకుంటున్నాము. ఇదే అజ్ఞ్యానం. కలలో ఎలా ఐతే మనం కలలో ఉన్న వస్తువులను నిజం అనుకుంటున్నామో శరీరం ఆత్మ అనుకోవడం కూడా అంతే.

తస్మాద్భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనామ్
బీజనిర్హరణం యోగః ప్రవాహోపరమో ధియః

కర్మలను ఆచరించినా కర్తృత్వ బుద్ధి వదిలిపెట్టాలి. "నేను చేస్తున్నాను" అన్న భావన లేకుంటే కర్మ బద్ధించదు. సత్వ రజస్సూ తమస్సు గల కర్మలను బీజం (విత్తనం) లేకుండా చేయాలి. బుద్ధి యొక్క ప్రవాహాన్ని ఆపెయ్యాలి. బుద్ధిలో కలిగే సంస్కారముతో బుద్ధి ఏమేమి చేయాలని ఆలోచిస్తోందో అది ఆపెయ్యాలి. బుద్ధిలో నేనూ నాదీ అన్న సంస్కారం ఉంటే సంసారం ఉంటుంది.

తత్రోపాయసహస్రాణామయం భగవతోదితః
యదీశ్వరే భగవతి యథా యైరఞ్జసా రతిః

అలా చేయడానికి ఎన్నో ఉపాయాలు ఉన్నాయి గానీ అవి మనం చేయలేము. ఒక్క ఉపాయం మాత్రం చేయగలం. భగవంతుని మీద ప్రేమా భక్తీ ఉంటే మనం సంసారములో చిక్కుకోము.

గురుశుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ
సఙ్గేన సాధుభక్తానామీశ్వరారాధనేన చ

గురువుగారిని భక్తిగా సేవిస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. గురువే మనకు కనపడే దైవం. దొరికిన వస్తువు దాచుకుంటున్న కొద్దీ సంసారం మీద ఆసక్తి పెరుగుతుంది. దాని వలన ప్రీతీ ఆస్కతీ వాసనా సంస్కారం పెరుగుతుంది. దొరికింది దొరికినట్లు పరమాత్మకు గానీ గురువుగారికి గానీ సమర్పించాలి. సజ్జనుల సంగముతో పరమాత్మను ఆరాధించడముతో పరమాత్మ కథ యందు శ్రద్ధతో, పరమాత్మ గుణాను కీర్తనం చేయడముతో, పరమాత్మ పాద పద్మాలను ధ్యానం చేయడం వలన, పరమాత్మ అర్చామూర్తిని చూడటము వలనా, అర్చా మూర్తిని ఆరాధించడం వలనా

శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనైర్గుణకర్మణామ్
తత్పాదామ్బురుహధ్యానాత్తల్లిఙ్గేక్షార్హణాదిభిః

హరిః సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః
ఇతి భూతాని మనసా కామైస్తైః సాధు మానయేత్

ఇవన్నీ కలిగితే అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు. పరమాత్మే నియామకుడు అనీ, అన్ని ప్రాణులూ పరమాత్మ స్వరూపాలే కాబట్టి ఆ ప్రాణుల అవసరాలు కూడా తీరుస్తాము. మనఃపూర్వకముగా ప్రీతితో సాధువులకు సమర్పించాలి, వారిని గౌరవించాలి.

ఏవం నిర్జితషడ్వర్గైః క్రియతే భక్తిరీశ్వరే
వాసుదేవే భగవతి యయా సంలభ్యతే రతిః

అప్పుడు గానీ మనం అరిషడ్వర్గాన్ని జయించలేము. అప్పుడు భగవంతుని యందు భక్తి కలుగుతుంది. ఇలా చేస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది.

నిశమ్య కర్మాణి గుణానతుల్యాన్వీర్యాణి లీలాతనుభిః కృతాని
యదాతిహర్షోత్పులకాశ్రుగద్గదం ప్రోత్కణ్ఠ ఉద్గాయతి రౌతి నృత్యతి

పరమాత్మ యొక్క సాటి లేని లీలవతారములనూ, ఆయా గుణములనూ, కర్మలనూ విని, మహా ఆనందముతో శరీరం పులకించి ఆనందబాష్పాలతో శరీరం పొంగిపోయి గొతు బొంగురు పోయి అరుస్తాడు, ఆడతాడు పాడతాడు, దెయ్యం పట్టినవాడిలాగ ఉంటాడు. ఒక చో నమస్కారం చేస్తాడు. నారాయణా ముకుందా గోవిందా అని హరి నామములను పిలుస్తూ ఉంటాడు

యదా గ్రహగ్రస్త ఇవ క్వచిద్ధసత్యాక్రన్దతే ధ్యాయతి వన్దతే జనమ్
ముహుః శ్వసన్వక్తి హరే జగత్పతే నారాయణేత్యాత్మమతిర్గతత్రపః

తదా పుమాన్ముక్తసమస్తబన్ధనస్తద్భావభావానుకృతాశయాకృతిః
నిర్దగ్ధబీజానుశయో మహీయసా భక్తిప్రయోగేణ సమేత్యధోక్షజమ్

సంసారాన్ని పట్టించుకోకుండా పరమాత్మ నామ గుణ కర్మలను కీర్తిస్తూ ఉంటే సంసారం వదిలిపెట్టింది అని అర్థం. విత్తనం కూడా కాలిపోవాలి. విత్తు వెంట ఉండే మొలక (బీజ అనుశయః) కూడా లాగెయ్యాలి. ఆ మొత్తాన్ని తగలపెట్టాలి. అప్పుడే మొలక రాకుండా ఉంటుంది. గొప్ప భక్తి ప్రయోగముతో ఈ సంస్కారాన్ని (శరీరాన్ని కాదు) తగలపెట్టాలి. అలాంటప్పుడు మాత్రమే పరమాత్మను పొందుతాడు.

అధోక్షజాలమ్భమిహాశుభాత్మనః శరీరిణః సంసృతిచక్రశాతనమ్
తద్బ్రహ్మనిర్వాణసుఖం విదుర్బుధాస్తతో భజధ్వం హృదయే హృదీశ్వరమ్

పరమాత్మను పొందుట ఒక్కటే (అధోక్షజాలమ్భం) ఆత్మను అశుభాన్ని కలిగించే సంసార సంబంధాన్ని తొలగించేది. శరీరమునకూ ఆత్మకూ సంసార సంబంధం తొలగుటే మోక్షానందం అని చెబుతారు. అందుకు హృదయ పూర్వకముగా పరమాత్మను ధ్యానించండీ, స్మరించండి.

కోऽతిప్రయాసోऽసురబాలకా హరేరుపాసనే స్వే హృది ఛిద్రవత్సతః
స్వస్యాత్మనః సఖ్యురశేషదేహినాం సామాన్యతః కిం విషయోపపాదనైః

ఆయనను ధ్యానించడం ఎంతో సులభం. మన హృదయ రంధ్రములోనే స్వామి ఉన్నాడు. అలాంటి పరమాత్మను చూడటానికి ప్రయాస ఏముంది. సకల ఆత్మకు ఆయన బంధువు. ఆయను వదిలిపెట్టి ఆత్మను సంసారములో బంధించేటటువంటి వాటి గురించి ప్రయత్నిస్తారు.

రాయః కలత్రం పశవః సుతాదయో గృహా మహీ కుఞ్జరకోశభూతయః
సర్వేऽర్థకామాః క్షణభఙ్గురాయుషః కుర్వన్తి మర్త్యస్య కియత్ప్రియం చలాః

ధనమూ భార్యా భర్తా పశువులూ పుత్రాదులూ ఇల్లూ భూమీ ఏనుగూ గుర్రాలూ ధన కోశములూ అన్ని రకాల అర్థ కామాలూ క్షణ భంగురాలే. ఎందుకంటే అది సంపాదించినవాడే క్షణ కాలం ప్రాణములు గలవాడు. సంపాదించినవాడే స్థిరం కానప్పుడు వాడు సంపాదించిన ధనం ప్రీతిని కలిగిస్తాయా?

ఏవం హి లోకాః క్రతుభిః కృతా అమీ క్షయిష్ణవః సాతిశయా న నిర్మలాః
తస్మాదదృష్టశ్రుతదూషణం పరం భక్త్యోక్తయేశం భజతాత్మలబ్ధయే

కాబట్టి, ఇవే కావు, ఇహ లోకములో సంపాదించేవే కాకుండా, యజ్ఞ్య యాగాలతో సంపాదించిన సత్కర్మలైనా శాశ్వతముగా ఉంటాయా? ఇహ లోకం ఎలా క్షణికమో పరలోకము కూడా అలాగే నశ్వరం. వృధా ప్రయాస మాత్రం మిగులుతుంది. కేవలం గొప్పలు మాత్రమే మిగులుతాయి. అవేవీ పరిశుద్ధులు కావు.

యదర్థ ఇహ కర్మాణి విద్వన్మాన్యసకృన్నరః
కరోత్యతో విపర్యాసమమోఘం విన్దతే ఫలమ్

ఎప్పుడూ ఎలాంటి దోషములూ చూడబడని వినబడని పరమాత్మని ఆశ్రయించి ఆనందించక పుట్టినప్పటినుంచీ తప్పులూ దూషణలూ నాశములే చూస్తారు. పరమాత్మ దగ్గర ఈ దోషాలేవీ ఉండవు. పరమాత్మ లబ్ధి కోసం చేయవలసినది భక్తి మాత్రమే.  ఏదో ఫలితం వస్తుందని భావించుకుంటూ మనిషి పనులు చేస్తాడు, కాని దానికి విపర్యయం కలుగుతుంది. సుఖం కోసం చేసే పని దుఃఖాన్ని ఇస్తుంది. భోగం వస్తుంది అనుకుంటే రోగం వస్తుంది. ఆస్తి చేకూరుతుందీ అనుకుంటే ఉన్నది కాస్తా పోతుంది.

సుఖాయ దుఃఖమోక్షాయ సఙ్కల్ప ఇహ కర్మిణః
సదాప్నోతీహయా దుఃఖమనీహాయాః సుఖావృతః

పని చేసేవాడు సుఖం కలగాలని దుఃఖం తొలగాలని పని చేస్తాడు, కానీ నిరంతరం కోరిక కలుగుతున్న కొద్దీ దుఃఖమే ఏర్పడుతుంది. కోరిక ఉంటే దుఃఖం, కోరిక లేకపోతే సుఖం.

కామాన్కామయతే కామ్యైర్యదర్థమిహ పూరుషః
స వై దేహస్తు పారక్యో భఙ్గురో యాత్యుపైతి చ

ఏ ఏ ఆశలతో వేటి వేటిని మానవుడు కోరతాడో అవన్నీ శరీరానికే. ఆ శరీరం కూడా తనది కాదు. ఇతరులకు పరాధీనమై ఉన్నది, దానికోసం కోరికలు కోరి పనులు చేయడం అజ్ఞ్యానానికి పరాకాష్ఠ. కోరికలు కోరుతున్నకొద్దీ శరీరం యొక్క రాకపోకలు పెరుగుతాయి. మళ్ళీ రాకుండా ఉండాలి అంటే కోరికలు మానుకోవాలి.

కిము వ్యవహితాపత్య దారాగారధనాదయః
రాజ్యకోశగజామాత్య భృత్యాప్తా మమతాస్పదాః

సంతానం భర్తా ఇల్లూ సంపదలూ రాజ్యం గజములూ దంతములూ వాహనములూ ఇవన్నీ "నావి" అన్న భావన వలన వచ్చినవి. కానీ వీటిలో ఏ భాగమూ ఆత్మకు చెందదు.

కిమేతైరాత్మనస్తుచ్ఛైః సహ దేహేన నశ్వరైః
అనర్థైరర్థసఙ్కాశైర్నిత్యానన్దరసోదధేః

ఇవన్నీ అర్థములలా అనిపించే అనర్థములు. నష్టములని లాభములనుకుంటాము. పరమాత్మ నిత్యానంద స్వరూపుడు. ఆయన్ని వదిలి అజ్ఞ్యానులు దుఃఖాన్ని పొందుతున్నారు.

నిరూప్యతామిహ స్వార్థః కియాన్దేహభృతోऽసురాః
నిషేకాదిష్వవస్థాసు క్లిశ్యమానస్య కర్మభిః

శరీరం ఆచరిస్తున్న పనుల వలనా, శరీరం పొందుతున్న సుఖ దుఃఖాల వలన ఆత్మకు ఏమైనా లాభం ఉందా? అన్ని సార్లు ఆత్మ శరీరాన్ని ధరించేట్లు చేస్తున్నాము. గర్భాదానం నుంచి మొదలుపెట్టి శ్మశానములో దహనం వరకూ ప్రతీ అవస్థలో పనులతో కష్టపడుతున్నాము. నిరంతరం కష్టపడుతూ ఆయా కర్మలు చేస్తూ ఉంటాడు.

కర్మాణ్యారభతే దేహీ దేహేనాత్మానువర్తినా
కర్మభిస్తనుతే దేహముభయం త్వవివేకతః

ఈ కష్టం దేహముతో ఉన్నందుకు ఆత్మవి అనుకుంటాడు. ఆత్మను అనుసరించే దేహముతో అన్ని కష్టములూ పడుతూ, దేహముతో కర్మలు చేస్తూ, కర్మలతో దేహాన్ని ధరిస్తాడు. సమూలముగా దహించనంత వరకూ చేసిన కర్మల ఫలితాన్ని కొన్ని వందల, వేల దేహములతో అనుభవిస్తూ ఉంటాడు.

తస్మాదర్థాశ్చ కామాశ్చ ధర్మాశ్చ యదపాశ్రయాః
భజతానీహయాత్మానమనీహం హరిమీశ్వరమ్

కోరికలేకుండా ధర్మ బుద్ధితో ఆచరించాలి, పరమాత్మ అర్పణ బుద్ధితో కర్మలు ఆచరించాలి, భగవదాజ్ఞ్యయా భగవత్ కైంకర్య రూపముగా ఆచరించాలి. భగవంతుంది పొందాలి అన్న కోరికతో ఆచరించాలి. కర్మలనీ భగవదారాధనా రూపముగా ఆచరించిన నాడు ఆ కర్మలు మనని బంధించవు.

సర్వేషామపి భూతానాం హరిరాత్మేశ్వరః ప్రియః
భూతైర్మహద్భిః స్వకృతైః కృతానాం జీవసంజ్ఞితః

ప్రతీ ప్రాణికీ సఖుడూ ప్రియుడూ ఆత్మా, శాసకుడూ పరమాత్మే. పంచభూతములూ పంచ తన్మాత్రములూ పంచ జ్ఞ్యానేంద్రియములూ పంచ కర్మేంద్రియములూ పంచ విషయములూ అనే వీటి సంఘాతముతో శరీరమును చేసి అందులో ఆత్మను బంధిస్తున్నాము. ఆ బంధాన్ని పోగొట్టాలి.

దేవోऽసురో మనుష్యో వా యక్షో గన్ధర్వ ఏవ వా
భజన్ముకున్దచరణం స్వస్తిమాన్స్యాద్యథా వయమ్

భగవంతున్ని దేవతలే ఆరాధించాలీ, మానవులే ఆరాధించాలి, యక్ష గంధర్వులే ఆరాధించాలి అన్న నియమం ఏమీ లేదు. అందుకు నేనే ఉదాహరణ. నేను రాక్షసున్నైనప్పటికీ పరమాత్మని ఆరాధిస్తూ ఆనందిస్తున్నాను.

నాలం ద్విజత్వం దేవత్వమృషిత్వం వాసురాత్మజాః
ప్రీణనాయ ముకున్దస్య న వృత్తం న బహుజ్ఞతా

బ్రాహ్మణుడూ దేవతా ఋషీ కావాలనో సచ్చరిత్రా ఆచారం జ్ఞ్యానం కావాలని అనుకోకండి.

న దానం న తపో నేజ్యా న శౌచం న వ్రతాని చ
ప్రీయతేऽమలయా భక్త్యా హరిరన్యద్విడమ్బనమ్

ఒక్క పరిశుద్ధమైన భక్తి ఒకటి ఉంటే చాలు. పరమాత్మ ఆనందిస్తాడు. భక్తి తప్ప మిగతావన్నీ ఆడంబరాలే.

తతో హరౌ భగవతి భక్తిం కురుత దానవాః
ఆత్మౌపమ్యేన సర్వత్ర సర్వభూతాత్మనీశ్వరే

కాబట్టి రాక్షసులారా పరమాత్మ యందు భక్తి కలిగి ఉండండి. ఎలా నా యందు పరమాత్మ ఉన్నాడో అన్ని ప్రాణులలో పరమాత్మే ఉన్నాడు. ఎలా నాకు కష్టమూ దుఃఖమూ రావొద్దని ప్రార్థిస్తామో అందరికీ అలాగే ఉండాలని కోరుకోవాలి.

దైతేయా యక్షరక్షాంసి స్త్రియః శూద్రా వ్రజౌకసః
ఖగా మృగాః పాపజీవాః సన్తి హ్యచ్యుతతాం గతాః

రాక్షసులూ యక్షులూ స్త్రీలూ మృగములూ పాపులూ మొదలైన వారందరూ పరమాత్మని ఆరాధించి పరమాత్మని పొందారు. నిష్కల్మషమైన భక్తితో పరమాత్మని ఆరాధిస్తే పరమాత్మను పొందుతారు

ఏతావానేవ లోకేऽస్మిన్పుంసః స్వార్థః పరః స్మృతః
ఏకాన్తభక్తిర్గోవిన్దే యత్సర్వత్ర తదీక్షణమ్

ప్రతీ ఆత్మకూ కల పరమ స్వార్థం ఒక్కటే. పరమాత్మ యందు ఏకాంత భక్తి ఉండుటే. ప్రతీ వారూ పరమాత్మ యందు ఏకాంత భక్తి కోరాలి. అదే కోరదగిన వస్తువు. అన్ని చోట్లా పరమాత్మనే చూడాలి. సకల చరాచర జగత్తులో పరమాత్మని చూచుటా, పరమాత్మ యందు ఏకాంత భక్తిని ఉంచుటా, ఈ రెండే ఆత్మకు పరమ స్వార్థములు. ఇవి కలిగి ఉండండి అని రాక్షస బాలురకు ప్రహ్లాదుడు ఉపదేశించాడు.

Saturday, April 20, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీప్రహ్రాద ఉవాచ
కౌమార ఆచరేత్ప్రాజ్ఞో ధర్మాన్భాగవతానిహ
దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థదమ్

తండ్రికి ఉపదేశమిచ్చిన తరువాత ప్రహ్లాదుడు గురుకులములో రాక్షసపిల్లలకీవిధముగా ఉపదేశమిచ్చాడు
"ప్రాజ్ఞ్యుడైన వాడు, జ్ఞ్యానం పొందదలచుకున్న వాడు కౌమారావాస్థలోనే (ఐదో ఏటి నుంచే) భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే భాగవత ధర్మముని ఆచరించాలి. భగవత్ లీలా శ్రవణం ఐదేళ్ళ వయసులోనే ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ మానవ జన్మ రావడం ఎంతో దుర్లభం. ఈ మానవ జన్మ కూడా అధృవం. ఉన్నన్నాళ్ళు కూడా ఒకే రకమైన ఆలోచన ఉంటుందని లేదు. మానవ జన్మ అధృవం అస్థిరం.

యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణమ్
యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వరః సుహృత్

మానవుడిగా పుట్టినవాడికి ప్రధాన కర్తవ్యం శ్రీమన్నారాయణుని పాదములను చేరుట. ఆయన ఒక్కడే అన్ని ప్రాణులకూ ప్రియుడు, ఆత్మ ప్రభువూ, సుహృత్.

సుఖమైన్ద్రియకం దైత్యా దేహయోగేన దేహినామ్
సర్వత్ర లభ్యతే దైవాద్యథా దుఃఖమయత్నతః

దేహములనూ ఇంద్రియములనూ ఇచ్చిన పరమాత్మే మన ప్రయత్నముతో పని లేకుండా మనకి ఏమేమి కావాలో ఇస్తాడు. దానికి కావలసిన సౌకర్యాలను స్వామి కలిగిస్తూనే ఉన్నాడు. దానికి మీ ప్రయత్నం అవసరం లేదు. దీనికి ఉదాహరణ, దుఃఖం కొరకు ఎవరూ ప్రయత్నించరు. మరి మనకి ఇష్టం లేనిది మన ప్రయత్నం లేకుండా వస్తున్నప్పుడు ఇష్టమైనది కూడా ప్రయత్నం లేకుండానే వస్తుంది. కర్మననుసరించి సుఖ దుఃఖాలు వస్తాయి. కానీ భగవత్ భాగవత ఆచార్య కైంకర్యం అలా రాదు. దానికి మన ప్రయత్నం అవసరం. సుఖ దుఃఖాల కోసం ప్రయత్నించడం అనే మాటను వదిలిపెట్టండి. అది ఆయనే ఇస్తాడు. మనం చేయవలసింది మాత్రం ఆయనను చేరడానికి ప్రయత్నించడం. దేహాన్ని ఇచ్చిన దైవమే ఆ దేహమునకు సుఖమునూ దుఃఖమునూ ఇస్తాడు.

తత్ప్రయాసో న కర్తవ్యో యత ఆయుర్వ్యయః పరమ్
న తథా విన్దతే క్షేమం ముకున్దచరణామ్బుజమ్

కాబట్టి శరీరమునిచ్చిన పరమాత్మ శరీరానికి కావలసినవి ఇస్తాడు కాబట్టి, శరీరమునకు కావలసిన వాటి గురించి ప్రయత్నించి ఆయుష్యాన్ని దుర్వినియోగం చేసుకోకండి. పరమాత్మ పాదపద్మములే మనకు యోగ క్షేమమును (ప్రాప్తిః ప్రాప్తిశ్చ రక్షణం) కలిగిస్తాయి.  పరమాత్మ పాదములు లభించుట అంత సులభం కాదు. ఆహార విహార జీవనం దొరికినట్లూ, సుఖం సంతోషం లభించినట్లు పరమాత్మ పాదములు లభించవు. పరమాత్మ కటాక్షం కలిగితే ఒక క్షణ కాలం ఒక భక్తునితో సంగం లభిస్తుంది. సజ్జన సహవాసం క్షణ కాలం కలిగినా మన జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. పరమాత్మ పాద పద్మాలను మనం అంత సులభముగా పొందలేము. సంసారమనే మహా ఆపదలో పడ్డవాడు అలాంటి క్షేమకరమైన పరమాత్మ పాదములు పొందడానికి ప్రయత్నం చేయాలి.

తతో యతేత కుశలః క్షేమాయ భవమాశ్రితః
శరీరం పౌరుషం యావన్న విపద్యేత పుష్కలమ్

మనకు లభించిన మానవ దేహం ఇంత కాలం ఆరాగ్యముగా ఉంటుందీ అని ఎవరూ చెప్పలేరు. మానవ శరీరమునకు ఆపద కలగక మునుపే పరమాత్మను చేరడానికి ప్రయత్నించాలి.

పుంసో వర్షశతం హ్యాయుస్తదర్ధం చాజితాత్మనః
నిష్ఫలం యదసౌ రాత్ర్యాం శేతేऽన్ధం ప్రాపితస్తమః

నూరేళ్ళ ఆయుష్షులో రాత్రిల్లు నిద్రతో గుడ్డి చీకటి పొంది వృధాగా రాత్రి పూట పడుకుంటాడు.

ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి వింశతిః
జరయా గ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః

యాభై ఏళ్ళలో శిశువుగా బాలుడిగా ఆటలలో ఇరవై ఏళ్ళు గడుస్తాయి. అరవై ఏళ్ళు వచ్చినప్పుడు వృద్ధాప్యముతో చింతిస్తూ ఇంకో ఇవరి ఏళ్ళు

దురాపూరేణ కామేన మోహేన చ బలీయసా
శేషం గృహేషు సక్తస్య ప్రమత్తస్యాపయాతి హి

మంచి యవ్వన మదములో కామముతో క్రీడిస్తూ పదేళ్ళను పది నిముషాలుగా గడుపుతాడు. ఆటలలో ఆసక్తి తగ్గించి పరమాత్మ యందు మనసు లగ్నం చేయండి. బాల్యము నుంచీ పరమాత్మ మీద భక్తి ఉన్న వారికి యవ్వనములో కామాసక్తి తగ్గిపోతుంది. మనకున్న కామనలు ఎన్నాళ్ళు అనుభవించినా తగ్గవు. ఎంత ప్రయత్నించినా నింపశక్యము కాని కోరికతో మోహముతో గృహములో ఆసక్తుడవ్వకుండా బాల్యమునుంచీ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి.

కో గృహేషు పుమాన్సక్తమాత్మానమజితేన్ద్రియః
స్నేహపాశైర్దృఢైర్బద్ధముత్సహేత విమోచితుమ్

ప్రపంచములో ఎవరైనా, ఎంత గొప్పవాడైనా, ధారా పుత్రుల యందు ఆస్కతుడై, ఇంద్రియ నిగ్రహం లేని వాడు సంసారం యందు ఆస్కత్మై స్నేహ పాశములతో గట్టిగా కట్టబడిన మన్సుని లాగగలడా?

కో న్వర్థతృష్ణాం విసృజేత్ప్రాణేభ్యోऽపి య ఈప్సితః
యం క్రీణాత్యసుభిః ప్రేష్ఠైస్తస్కరః సేవకో వణిక్

అర్థ కామాల యందు ఉన్న ఆసక్తిని ఎవరైనా విడిచిపెడతాడా? అర్థ కామాల మీద ఆశ ప్రాణముల కంటే గొప్పది. అత్యంత ప్రీతి పాత్రములైన ప్రాణులతో దొంగలూ సేవకులు వ్యాపారస్థులు ఆడుకొంటారు. (వ్యాపారస్థులు పాతరోజులలో సముద్ర ప్రయాణం చేసేవారు, అంటే ప్రాణం పణముగా పెట్టి వ్యాపారం చేసేవారు.)

కథం ప్రియాయా అనుకమ్పితాయాః సఙ్గం రహస్యం రుచిరాంశ్చ మన్త్రాన్
సుహృత్సు తత్స్నేహసితః శిశూనాం కలాక్షరాణామనురక్తచిత్తః

ఏకాంతములో దయచూపిన ప్రియురాలు చెవిలో మాట్లాడే మనసుకు నచ్చే తీయ తీయని మాటలను వినడానికి ఆశపడి ప్రియులు ప్రాణాలను పణముగా పెడతారు. ఆమెతో సమాగమం, ఆలోచన, ఆమె మాటలనే మంత్రములు,  వినడానికి ఆసక్తుడై కొంత కాలం. దాని వలన పుట్టిన్ శిశువులతో కొంతకాలం, వారు మాట్లాడే వచ్చీ రాని మాటలకు, స్నేహితులతో కొంతకాలం, ఉన్న వారు పరమాత్మను స్మరిస్తారా.

పుత్రాన్స్మరంస్తా దుహితౄర్హృదయ్యా భ్రాతౄన్స్వసౄర్వా పితరౌ చ దీనౌ
గృహాన్మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ్చ వృత్తీశ్చ కుల్యాః పశుభృత్యవర్గాన్

పిల్లలలనూ పుత్రికలనూ అన్నలనూ తల్లి తండ్రులనూ, ఇళ్ళూ, అందమైన గొప్ప ఆభరణములూ వస్త్రములూ, బతుకు తెరువులూ, పశువులూ సేవకులూ ఇతరులనీ ఎవరైనా వదిలిపెడతాడా?

త్యజేత కోశస్కృదివేహమానః కర్మాణి లోభాదవితృప్తకామః
ఔపస్థ్యజైహ్వం బహుమన్యమానః కథం విరజ్యేత దురన్తమోహః

వీటిని వదిలిపెట్టినవాడే జ్ఞ్యాని. సాలెపురుగు తన నోటి నుంచి దారం తీసి గూడు కడుతుంది, తానే దారాన్ని మింగేస్తుంది. అలాగే మనమే కూర్చుకోవాలి, మనమే వదిలేసుకోవాలి. కోశస్కృద్ అన్నదానికి తేనెటీగ అన్న పేరు కూడా ఉంది. తేనెపట్టును కష్టపడి సేకరించి తాను కూర్చుకున్న తేనెతుట్టను వదిలివెళ్ళిపోతుంది. అలాగే గృహస్థుడు కూడా పైవాటన్నిటినీ (వాటి మీద ఆసక్తిని) వదిలిపెట్టాలి.
కానీ లోభముతో కోరికలయందు తృప్తే కలగక, ఉపస్థ జిహ్వా, ఈ రెండు ఇంద్రియాలకే తృప్తి కలిగించడానికి బతికే వారు ఈ సంసారం చాలు అని అంటారా? ఇలాంటి వారు అసలు విరక్తిని పొందుతారా?

కుటుమ్బపోషాయ వియన్నిజాయుర్న బుధ్యతేऽర్థం విహతం ప్రమత్తః
సర్వత్ర తాపత్రయదుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుమ్బరామః

కుటుంబాన్ని పోషించడానికే ఆయుష్యాన్ని ఖర్చు చేస్తూ ఆయుష్యం ఐపోతున్నదన్న విషయం తెలుసుకోడు. శరీరం కానీ తన పురుషార్థములు కానీ ఐపోతున్నవన్న విషయం తెలియలేడు. ప్రతీ చోటా తాపత్రయాలే ఎదురవుతాయి. శరీరమైనా బాగుండదు, మనస్సయినా బాగుండదూ, చుట్టూ ఉన్నవైనా బాగుండవు.
ఇలా ప్రతీ క్షణం బాధపడుతున్నా కుటుంబం మీద ప్రేమ ఉండటముతో విరక్తి మాత్రం కలుగదు. ఆ బాధలకంటే తన కుటుంబాన్ని ఎక్కువ పోషిస్తూ ఉంటాడు.

విత్తేషు నిత్యాభినివిష్టచేతా విద్వాంశ్చ దోషం పరవిత్తహర్తుః
ప్రేత్యేహ వాథాప్యజితేన్ద్రియస్తదశాన్తకామో హరతే కుటుమ్బీ

జ్ఞ్యానం కలవాడికి కూడా నిరంతరం వీడి మనసు ధనము యందే ఉంటుంది. దానికోసం మోసం చేస్తాడు. పరవిత్తాన్ని అపహరిస్తాడు. ఆ అపహరించడం దోషముగా కాక గుణముగా భావిస్తాడు. ఇంద్రియ నిగ్రహం లేక, కోరికలను శమింపచేసుకోలేక ఇతరుల ద్రవ్యాన్ని హరిచి, తన మనశ్శాంతిని హరించుకుంటాడు.

విద్వానపీత్థం దనుజాః కుటుమ్బం పుష్ణన్స్వలోకాయ న కల్పతే వై
యః స్వీయపారక్యవిభిన్నభావస్తమః ప్రపద్యేత యథా విమూఢః

పండితుడు కూడా ఇదే రీతిలో తన కుటుంబాన్ని పోషించుకుంటూ తాను చేరవలసిన ఉత్తమలోకానికి చేరలేకపోతున్నాడు. ఇలా ఉత్తమ లోకాలను పొందకపోవడానికి కారణం, ఇది నాది, అది వాడిదీ అన్న భేధ దృష్టి ఉండటం. ముసలితనం వరకూ "నీ నా" అన్న భేధ బుద్ధి ఉన్న వారికి ముసలితనములో ఐనా వైరాగ్యం ఎలా వస్తుంది. ఇలా అజ్ఞ్యానాన్ని పొందుతాడు మూఢుడిలాగ.

యతో న కశ్చిత్క్వ చ కుత్రచిద్వా దీనః స్వమాత్మానమలం సమర్థః
విమోచితుం కామదృశాం విహార క్రీడామృగో యన్నిగడో విసర్గః

ఏ విధముగా చూచినా ఏ దిక్కునుంచి కూడా సంసారములో చిక్కుకున్న వాడు విడిపించుకోజాలడు. స్త్రీలకు ఒక ఆట మృగముగా మారి బిడ్డలు గుదిబండలుగా మారిన వాడు సంసారమునుంచి ఎలా బయటపడగలడు.

తతో విదూరాత్పరిహృత్య దైత్యా దైత్యేషు సఙ్గం విషయాత్మకేషు
ఉపేత నారాయణమాదిదేవం స ముక్తసఙ్గైరిషితోऽపవర్గః

కాబట్టి దైత్యులారా, విషయముల యందు సంగం ఉన్న రాక్షసుల సంగాన్ని వదిలిపెట్టండి, శ్రీమన్నారాయణుని ఆశ్రయించండి. ఆయనే సంగమును వదిలిన వారిచేత పొందదగిన వాడు. మీలాంటి రాక్షసులతో స్నేహం చేయకండి, పరమాత్మను ఆశ్రయించండి.

న హ్యచ్యుతం ప్రీణయతో బహ్వాయాసోऽసురాత్మజాః
ఆత్మత్వాత్సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః

ఇంట్లో పిల్లలుగా ఉన్నప్పుడు తల్లినీ తండ్రినీ మిత్రులనీ మెప్పించాలి, పెద్దయ్యాక భార్యని మెప్పించాలి, సేవకుడైతే యజమానిని మెప్పించాలి. ఎంత ప్రయత్నించినా వారిని మెప్పించలేము. కానీ శ్రీమన్నారాయణుని మెప్పించడానికి పెద్ద ప్రయత్నం అవసరము లేదు. ఆయన సకల భూతములకూ ప్రాణులకూ ఆత్మ. అందరిలో ఉంటాడు. అంతటా ఉన్నాడు. నీవెక్కడున్నావో అక్కడే ఉన్నాడు. ఆయనను మెప్పించడానికి శ్రమతో పని లేదు.

పరావరేషు భూతేషు బ్రహ్మాన్తస్థావరాదిషు
భౌతికేషు వికారేషు భూతేష్వథ మహత్సు చ

అన్ని రకముల ప్రాణులూ, బ్రహ్మ దగ్గర నుంచీ స్తంభం వరకూ, పాంచభౌతిక వికారములు కలిగి, పంచభూతముల యందు

గుణేషు గుణసామ్యే చ గుణవ్యతికరే తథా
ఏక ఏవ పరో హ్యాత్మా భగవానీశ్వరోऽవ్యయః

సత్వ రజస్సు తమో గుణాలూ, ప్రకృతి (గుణసామ్యే ), మహత్ తత్వమూ  (గుణవ్యతికరే ), వీటన్నిటిలో ఉండేవాడు ఒక్కడే, ఆయనే పరమాత్మ, శాసకుడు, నాశము లేని వాడు, తరగని అవడు.

ప్రత్యగాత్మస్వరూపేణ దృశ్యరూపేణ చ స్వయమ్
వ్యాప్యవ్యాపకనిర్దేశ్యో హ్యనిర్దేశ్యోऽవికల్పితః

ఈయనే ప్రత్యగాత్మగా, జీవాత్మగా, అంతర్యామిగా, శరీరముగా ఉంటాడు. ఆయనే వ్యాప్యం (అన్ని చోట్లా ఉండేవాడు), వ్యాపి (కొన్ని చోట్ల ఉన్నట్లు కనపడే వాడు).(మనుష్యత్వం వ్యాప్తి, ఆత్మ వ్యాపకం). ఆధారమూ (వ్యాపకం) ఆధేయమూ (వ్యాప్తి) ఆయనే. చూపదగిన వాడూ, తెలియదగినవాడు, తెలపలేని వాడు ఆయనే.

కేవలానుభవానన్ద స్వరూపః పరమేశ్వరః
మాయయాన్తర్హితైశ్వర్య ఈయతే గుణసర్గయా

ఈయనను ఎవరికి వారు అనుభవిస్తేనే అర్థమవుతుంది కానీ ఈ రూపమని ఎవ్వరూ స్వామిని నిర్దేశించి చెప్పలేరు. అలా అని చెప్పలేకుండా ఊరుకోలేరు. ఈయన మూడు గుణమ్ములు సృష్టించే ప్రకృతి చేత పొందబడతాడు. ప్రకృతితో (మాయతో) జగత్తుని సృష్టిస్తాడు. ప్రకృతిలో ఉండే మనం పరమాత్మను పొందాలి.

తస్మాత్సర్వేషు భూతేషు దయాం కురుత సౌహృదమ్
భావమాసురమున్ముచ్య యయా తుష్యత్యధోక్షజః

పరమాత్మ సకల చరాచర జగత్తులలో అన్ని ప్రాణులలో అంతర్యామిగా ఉన్నాడు. అన్ని ప్రాణుల యందూ దయ చూపండి. సకల భూత దయే పరమాత్మ ఆరాధన. స్నేహాన్ని చేయండి, ప్రతీ ప్రాణినీ ప్రేమించండి, దయ చూపించండి. ఇదే నారాయణుని ఆరాధన. అన్ని ప్రాణుల యందూ దయ చూపలంటే ముందు మనలో ఉన్న రాక్షసత్వాన్ని విడిచిపెట్టాలి. అది వదిలి ప్రతీ ప్రాణినీ దయ చూచుట నేర్చుకొనుటే భగవదారాధన. అప్పుడే పరమాత్మ సంతోషిస్తాడు.

తుష్టే చ తత్ర కిమలభ్యమనన్త ఆద్యే
కిం తైర్గుణవ్యతికరాదిహ యే స్వసిద్ధాః
ధర్మాదయః కిమగుణేన చ కాఙ్క్షితేన
సారం జుషాం చరణయోరుపగాయతాం నః

అలాంటి పరమాత్మ సంతోషిస్తే మనకు పొందరానిదేదైనా ఉంటుందా. ప్రకృతి మహత్తు అహంకారం , వాటినుంచి వచ్చే భూత సృష్టితో మనకేమి పని. ఏ గుణమూ లేని ప్రకృతీ, ప్రకృతి ధర్మాలతో మనకేంటి పని. దేనితో పరమాత్మ ఆనందిస్తాడో అలాంటి సకల జీవుల యందూ స్నేహం కలిగి ఉండి శ్రీమన్నారాయణుని పాదపద్మములను కీర్తిస్తూ ఉండడి. ఇదే మనకు ధర్మం, ఇదే మనకు కామం, ఇదే మనకు అర్థం.

ధర్మార్థకామ ఇతి యోऽభిహితస్త్రివర్గ
ఈక్షా త్రయీ నయదమౌ వివిధా చ వార్తా
మన్యే తదేతదఖిలం నిగమస్య సత్యం
స్వాత్మార్పణం స్వసుహృదః పరమస్య పుంసః

ధర్మ అర్థ కామములనే త్రివర్గములూ, తర్క మీమాంస వేదములూ రాజనీతి, బతుకు తెరువూ, ఇదంతా సత్యమే. వేదములలో చెప్పబడినవే. గురువుగారి దగ్గర ఇవన్నీ నేర్చుకుని అవి అన్నీ మనకు పరమ మిత్రుడైన పరమాత్మకు అర్పించాలి. చదువు యొక్క ఉద్దేశ్యం అదే. అప్పుడే చదువుకున్న విద్య సఫలమవుతుంది. లేకపోతే ఆ చదువు బంధాన్నిస్తుంది.

జ్ఞానం తదేతదమలం దురవాపమాహ
నారాయణో నరసఖః కిల నారదాయ
ఏకాన్తినాం భగవతస్తదకిఞ్చనానాం
పాదారవిన్దరజసాప్లుతదేహినాం స్యాత్

ఇప్పుడు నేను నీకు చెబుతున్న జ్ఞ్యానం ఎవరికీ కలిగేది కాదు. దీన్ని శ్రీమన్నారాయణుడు తనకు అత్యంత భక్తుడైన నారద మహామునికి అందించాడు. ఈ జ్ఞ్యానం కలగాలంటే భగవంతుని కంటే భిన్నమైన వస్తువేది లేదు అని తెలుసుకుని త్రికరణములతో భగవానునికి అర్పితమైన వారి పాద ధూళి ఎవరికి దొరుకుతుందో వారికి దొరుకుతుంది.  భాగవత దాస్యం చేస్తేనే ఈ జ్ఞ్యానం లభిస్తుంది.

శ్రుతమేతన్మయా పూర్వం జ్ఞానం విజ్ఞానసంయుతమ్
ధర్మం భాగవతం శుద్ధం నారదాద్దేవదర్శనాత్

ఈ జ్ఞ్యానం నేను పూర్వం నారదుని వలనే విన్నాను. పరిశుద్ధమైన పరంభాగవత ధర్మాన్ని భగవంతుని సాక్షాత్కరించుకున్న నారదుని వలన విన్నాను.

శ్రీదైత్యపుత్రా ఊచుః
ప్రహ్రాద త్వం వయం చాపి నర్తేऽన్యం విద్మహే గురుమ్
ఏతాభ్యాం గురుపుత్రాభ్యాం బాలానామపి హీశ్వరౌ

మనమందరం చదువుకున్నది ఒకే గురువుగారి దగ్గర కదా? నీకూ మాకూ వీరే కదా గురువులు. ఇక్కడకు రాక ముందు అంతఃపురములో ఉన్న నీవు చిన్నపిల్లవాడికి. మరి నీకు ఈ సమాగమం ఎలా జరిగింది.

బాలస్యాన్తఃపురస్థస్య మహత్సఙ్గో దురన్వయః
ఛిన్ధి నః సంశయం సౌమ్య స్యాచ్చేద్విస్రమ్భకారణమ్

మా మీద ప్రీతి ఉంటే మాకు చెప్పవచ్చు అనుకుంటే ఈ రహస్యాన్ని వివరించు. 

Friday, April 19, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
పౌరోహిత్యాయ భగవాన్వృతః కావ్యః కిలాసురైః
షణ్డామర్కౌ సుతౌ తస్య దైత్యరాజగృహాన్తికే

తౌ రాజ్ఞా ప్రాపితం బాలం ప్రహ్లాదం నయకోవిదమ్
పాఠయామాసతుః పాఠ్యానన్యాంశ్చాసురబాలకాన్

యత్తత్ర గురుణా ప్రోక్తం శుశ్రువేऽనుపపాఠ చ
న సాధు మనసా మేనే స్వపరాసద్గ్రహాశ్రయమ్

ఏకదాసురరాట్పుత్రమఙ్కమారోప్య పాణ్డవ
పప్రచ్ఛ కథ్యతాం వత్స మన్యతే సాధు యద్భవాన్

చండా మర్కులు శుక్రాచార్యుని కొడుకులు హిరణ్యకశిపుని దగ్గరే ఉంటారు. వారి దగ్గర ప్రహ్లాదున్ని ఇతర రాక్షస పిల్లలతో కలిసి చేర్పించాడు.
పరిపాలనకు కావలసిన నీతిని ఇది వరకే కోవిదుడైన ప్రహ్లాదునికి నేర్పించారు.
గురువు గారు చెప్పిన దాన్ని విన్నాడూ చదివాడు. కానీ మనసులో  గురువుగారు చెప్పినది మంచిది కాదు అనుకున్నాడు. "నేనూ ఇతరుడూ" అన్న భేధ బుద్ధి కలిగించే పాఠం మంచిదనిపించలేదు.
హిరణ్యకశ్యపుడు ఇంటికి పిలిపించుకుని ప్రహ్లాదున్ని తొడ మీద కూర్చోపెట్టుకుని ఇనాళ్ళూ నీకు గురువు చెప్పిన దానిలో నీవేది మంచిది అనుకుంటున్నావు.

శ్రీప్రహ్లాద ఉవాచ
తత్సాధు మన్యేऽసురవర్య దేహినాం సదా సముద్విగ్నధియామసద్గ్రహాత్
హిత్వాత్మపాతం గృహమన్ధకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత

జీవులు చెడు విషయము గ్రహించడం వలన నిరంతరం ఉద్వేగం,  కలత చెందిన బుద్ధి గలవారు. నేను నా వాడు, పరాయివాడు అన్న రాగ ద్వేషాలే చెడు. ఆత్మను పాడు చేసే అంధ కూపము వంటి ఇంటిని వదిలి అరణ్యమునకు వెళ్ళి శ్రీమన్నారాయణున్ని ఆరాధించడమే మన విధి

శ్రీనారద ఉవాచ
శ్రుత్వా పుత్రగిరో దైత్యః పరపక్షసమాహితాః
జహాస బుద్ధిర్బాలానాం భిద్యతే పరబుద్ధిభిః

సమ్యగ్విధార్యతాం బాలో గురుగేహే ద్విజాతిభిః
విష్ణుపక్షైః ప్రతిచ్ఛన్నైర్న భిద్యేతాస్య ధీర్యథా

గృహమానీతమాహూయ ప్రహ్రాదం దైత్యయాజకాః
ప్రశస్య శ్లక్ష్ణయా వాచా సమపృచ్ఛన్త సామభిః

వత్స ప్రహ్రాద భద్రం తే సత్యం కథయ మా మృషా
బాలానతి కుతస్తుభ్యమేష బుద్ధివిపర్యయః

బుద్ధిభేదః పరకృత ఉతాహో తే స్వతోऽభవత్
భణ్యతాం శ్రోతుకామానాం గురూణాం కులనన్దన

శత్రువుల యందు పక్షపాత బుద్ధి కలవారు శత్రువుల  బుద్ధిని మార్చేస్తారు. అని భావించి చిన్నగా నవ్వి, మళ్ళీ గురువుగారిని  పిలిచి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. విష్ణు పక్షాన్ని ఆశ్రయించే వారు దరి చేరకుండా చూడమని చెప్పాడు. బ్రాహ్మణుల వద్దా, దాగి యున్న విష్ణు పక్షం వారి వలన ఇతని బుద్ధి పాడవకుండా చూడండి అని చెప్పాడు.
గురువు గారు ప్రహ్లాదుని ఇంటికి తీసుకెళ్ళి, అతన్ని లాలించి
ప్రహ్లాదా నీకు మేలవుగాక, నిజం చెప్పు, అబద్దం వద్దు ఇక్కడ ఇంతమంది పిల్లలున్నారు, వారందరినీ కాదని నీకీ విపరీత బుద్ధి ఎలా వచ్చింది. నీకిది స్వయముగానే వచ్చిందా ఇంకెవరైనా ఇలా చెప్పారా. కులాన్ని శొభింపచేసే వాడా దీనికి కారణమేమిటి.

శ్రీప్రహ్రాద ఉవాచ
పరః స్వశ్చేత్యసద్గ్రాహః పుంసాం యన్మాయయా కృతః
విమోహితధియాం దృష్టస్తస్మై భగవతే నమః

నావాడూ ఇతరుడు అన్న భేధ బుద్ధి ఎవరు మాయతో కలుగుతుందో, ఎవరు కలిగిస్తారో వాడికి నమస్కారం.

స యదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే
అన్య ఏష తథాన్యోऽహమితి భేదగతాసతీ

పరమాత్మ కటాక్షం మన మీద ఉంటే , పరమాత్మను మనం అనుసరిస్తే నేను వేరు వాడు వేరు అన్న బుద్ధి తొలగిపోతుంది.అతను వేరు నేను వేరు అనే అసతీ (చెడు) బుద్ది పరమాత్మను  ఆశ్రయిస్తే తొలగిపోతుంది.

స ఏష ఆత్మా స్వపరేత్యబుద్ధిభిర్దురత్యయానుక్రమణో నిరూప్యతే
ముహ్యన్తి యద్వర్త్మని వేదవాదినో బ్రహ్మాదయో హ్యేష భినత్తి మే మతిమ్

నేను వాడూ అనే భేధభావం దాటడానికి వీలులేని పరమాత్మ మాయననుసరించేవారికి కలుగుతుంది. వేదం తెలిసిన వారు కూడా ఈ విషయములో మోహం చెందుతారు. బ్రహ్మాదులు కూడా ఈ విషయములో మోహించబడతారు. ఎవరు బ్రహ్మాదుల బుద్ధిని భేధించారో వాడే నా బుద్ధినీ మార్చాడు.

యథా భ్రామ్యత్యయో బ్రహ్మన్స్వయమాకర్షసన్నిధౌ
తథా మే భిద్యతే చేతశ్చక్రపాణేర్యదృచ్ఛయా

అయస్కాంతం దగ్గర ఇనుము ఎలా ఆకర్షించబడుతుందో నా మనస్సు కూడా పరమాత్మ సంకల్పముతో నా బుద్ధి మారుతోంది. ఇది స్వామి యొక్క కృప

శ్రీనారద ఉవాచ
ఏతావద్బ్రాహ్మణాయోక్త్వా విరరామ మహామతిః
తం సన్నిభర్త్స్య కుపితః సుదీనో రాజసేవకః

ఈ విధముగా గురువుగారికి గొప్ప బుద్ధి కల ప్రహ్లాదుడు చెప్పడు.

ఆనీయతామరే వేత్రమస్మాకమయశస్కరః
కులాఙ్గారస్య దుర్బుద్ధేశ్చతుర్థోऽస్యోదితో దమః

రాజు గారి కొడుకుని దండించలేక దీనులై, ప్రహ్లాదున్ని బెదిరించారు "మనకు అపకారం చేస్తున్నాడు. మన కులాన్ని భస్మం చేస్తున్నాడు. ప్రహ్లాదుని మీద దండోపాయాన్నే వాడాలి"

దైతేయచన్దనవనే జాతోऽయం కణ్టకద్రుమః
యన్మూలోన్మూలపరశోర్విష్ణోర్నాలాయితోऽర్భకః

రాక్షసులనే గంధపు తోటలో ముళ్ళ చెట్టు మొలిచింది.

ఇతి తం వివిధోపాయైర్భీషయంస్తర్జనాదిభిః
ప్రహ్రాదం గ్రాహయామాస త్రివర్గస్యోపపాదనమ్

ఈ ముళ్ళ చెట్టు నుంచి వచ్చిన కర్రే రాక్షస వంశమనే గంధపు చెట్టును నరకడానికి నారం (గొడ్డలికుండే కట్టె) అయ్యాడు.
ఇలా రకరకాల ఉపాయాలతో బెదిరింపులతో త్రివర్గాన్ని చెప్పారు ప్రహ్లాదునికి. ధర్మార్థ కామములను బోధించారు.

తత ఏనం గురుర్జ్ఞాత్వా జ్ఞాతజ్ఞేయచతుష్టయమ్
దైత్యేన్ద్రం దర్శయామాస మాతృమృష్టమలఙ్కృతమ్

ప్రహ్లాదుడు తెలియవలసిన నాలుగూ తెలుసుకున్నాడు. ఇతనికి అన్ని విషయాలూ బాగా తెలిసాయని మహారాజు అనుగ్రహం పొందడానికి పిల్లవాడిని బాగా తయారు చేసి, మొదలు తల్లి వద్దకు పంపించి, అలంకరింపచేసి, ఆ పిల్లవాన్ని రాజుగారికి చూపించారు

పాదయోః పతితం బాలం ప్రతినన్ద్యాశిషాసురః
పరిష్వజ్య చిరం దోర్భ్యాం పరమామాప నిర్వృతిమ్



ఆరోప్యాఙ్కమవఘ్రాయ మూర్ధన్యశ్రుకలామ్బుభిః
ఆసిఞ్చన్వికసద్వక్త్రమిదమాహ యుధిష్ఠిర

ఆ పిల్లవాడు పాదాభివందనం చేయగానే హిరణ్యకశిపుడు ప్రహ్లాదున్ని కౌగిలించుకుని ఆనందాన్ని పొంది, తొడ మీద కూర్చోబెట్టుకుని, శిరస్సును ముద్దాడి, ఆనందబాష్పాలతో ప్రహ్లాదున్ని తడిపి
ప్రహ్లాదా నీవు చదివిన దానిలో ఏదైనా మంచి మాట చెప్పు. ఇంతకాలం నీవు గురువుగారి వద్ద ఏమి నేర్చుకున్నావో, అందులో నీకేమి బాగా వచ్చో దన్ని చెప్పు.

హిరణ్యకశిపురువాచ
ప్రహ్రాదానూచ్యతాం తాత స్వధీతం కిఞ్చిదుత్తమమ్
కాలేనైతావతాయుష్మన్యదశిక్షద్గురోర్భవాన్

శ్రీప్రహ్రాద ఉవాచ
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్
అర్చనం వన్దనం దాస్యం సఖ్యమాత్మనివేదనమ్

ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా
క్రియేత భగవత్యద్ధా తన్మన్యేऽధీతముత్తమమ్

భగవంతుని యందు నవ విధ భక్తులతో తనను తాను అర్పించుకోవడమే చక్కగా గురువుగారి దగ్గర చదువుకోవడం అనుకుంటున్నాను.
కాయికా: శ్రవణ కీర్తన పాదసేవనం
మానసిక: స్మర్ణం దాస్యం ఆత్మ నివేదనం
వాచికమైనవి మిగిలిన మూడు. ఇదే ఉత్తమ అధ్యయనం.

నిశమ్యైతత్సుతవచో హిరణ్యకశిపుస్తదా
గురుపుత్రమువాచేదం రుషా ప్రస్ఫురితాధరః

బ్రహ్మబన్ధో కిమేతత్తే విపక్షం శ్రయతాసతా
అసారం గ్రాహితో బాలో మామనాదృత్య దుర్మతే

సన్తి హ్యసాధవో లోకే దుర్మైత్రాశ్ఛద్మవేషిణః
తేషాముదేత్యఘం కాలే రోగః పాతకినామివ

ఈ మాటలు విని పెదవులు అదరగా "బ్రహ్మ బధూ, ఇదేమిటి, శత్రు పక్షాన్ని ఆశ్రయించి సారము కాని దాన్ని మీరు ప్రహ్లాదునికి నేర్పించారా. లోకములో మైత్రీ అనే కప్పు కప్పుకుని స్నేహం చేసే వారు చాలామందే ఉన్నారు. వారు చేసిన పాపం ఊరికే పోదు. పాపము చేసిన వారికి రోగం వచ్చినట్లు ఫల కాలములో అది బయటపడుతుంది".  ఎందుకు మీరిలా చేసారు?

శ్రీగురుపుత్ర ఉవాచ
న మత్ప్రణీతం న పరప్రణీతం సుతో వదత్యేష తవేన్ద్రశత్రో
నైసర్గికీయం మతిరస్య రాజన్నియచ్ఛ మన్యుం కదదాః స్మ మా నః

మీ పిల్లవానికి మేము ఇలాంటివి చెబుతామా. ఇది మేము గానీ ఆశ్రమం బయట వారు గానీ చెప్పినది కాదు. ఇది ఇతని సహజ బుద్ధి. ఒకరు చెబితే వచ్చినది కాదు. కోపాన్ని కాస్త నిగ్రహించుకో. మాకు దుఃఖాన్ని ఇవ్వకు.

శ్రీనారద ఉవాచ
గురుణైవం ప్రతిప్రోక్తో భూయ ఆహాసురః సుతమ్
న చేద్గురుముఖీయం తే కుతోऽభద్రాసతీ మతిః

ఆ మాట విని పిల్లవాడిని మళ్ళీ అడిగాడు. ఈ విషయం గురువుగారు చెప్పకుంటే ఈ అమంగళమైన బుద్ధి నీకు ఎలా వచ్చింది.

శ్రీప్రహ్రాద ఉవాచ
మతిర్న కృష్ణే పరతః స్వతో వా మిథోऽభిపద్యేత గృహవ్రతానామ్
అదాన్తగోభిర్విశతాం తమిస్రం పునః పునశ్చర్వితచర్వణానామ్

సంసారములో ఉన్నవారికి ఇలాంటి బుద్ధి తనకు తానుగా వస్తుందా  లంచమిచ్చి నేర్చుకుందామన్నా ఇలాంటి బుద్ధి వస్తుందా?
అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
    చచ్చుచు  పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన  వారికిం
    చెచ్చెర పుట్టునే  పరులు చెప్పిన నైన నిజేచ్చనైన నే
    మిచ్చిన నైన కానలకు  నేగిననైన హరిప్రబోధముల్.

న తే విదుః స్వార్థగతిం హి విష్ణుం దురాశయా యే బహిరర్థమానినః
అన్ధా యథాన్ధైరుపనీయమానాస్తేऽపీశతన్త్ర్యామురుదామ్ని బద్ధాః

ఇంద్రియములను జయించని వారూ, చీకటిన ప్రవేశించేవారూ, పునః పునః తింటున్నవే తినేవారికి (అనుభవించేవారికి) ఈ బుద్ధి కలుగుతుందా?
ఎవరైతే సంసారములో ఉండే సాంసారిక విషయములను పురుషార్థములుగా భావిస్తారో వారు పరమాత్మను పురుషార్థముగా తెలియజాలరు
కానని వాని నూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మ బద్ధులై
కానరు, విష్ణుఁగొందఱటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా !

నైషాం మతిస్తావదురుక్రమాఙ్ఘ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థః
మహీయసాం పాదరజోऽభిషేకం నిష్కిఞ్చనానాం న వృణీత యావత్

పరమాత్మ మనందరికి సంసారమనే ముకుతాడు వేసాడు. దానితో బంధించబడిన మనం గుడ్డి వాడిని అనుసరించి వెళ్ళిన వారివంటి వారము
సత్సంగము లభించనంత వరకూ సాంసారమైన అనర్థాన్ని తొలగించే పరమాత్మ పాద పద్మాన్ని కోరరు

ఇత్యుక్త్వోపరతం పుత్రం హిరణ్యకశిపూ రుషా
అన్ధీకృతాత్మా స్వోత్సఙ్గాన్నిరస్యత మహీతలే

ఆహామర్షరుషావిష్టః కషాయీభూతలోచనః
వధ్యతామాశ్వయం వధ్యో నిఃసారయత నైరృతాః

అయం మే భ్రాతృహా సోऽయం హిత్వా స్వాన్సుహృదోऽధమః
పితృవ్యహన్తుః పాదౌ యో విష్ణోర్దాసవదర్చతి

విష్ణోర్వా సాధ్వసౌ కిం ను కరిష్యత్యసమఞ్జసః
సౌహృదం దుస్త్యజం పిత్రోరహాద్యః పఞ్చహాయనః

పరోऽప్యపత్యం హితకృద్యథౌషధం స్వదేహజోऽప్యామయవత్సుతోऽహితః
ఛిన్ద్యాత్తదఙ్గం యదుతాత్మనోऽహితం శేషం సుఖం జీవతి యద్వివర్జనాత్

కోపముతో గుడ్డివాడై ఒడిలోంచి బాలున్ని కింద పారేసి రోషముతో కళ్ళు ఎర్రబడి "వీడిని చంపెయ్యండి, వీడే నా సోదరున్ని చంపాడు. పినతండ్రిని చంపిన శత్రువును దాసునిలాగ సేవిస్తున్నాడు. ఐదేళ్ళ పిల్లవాడు ఇప్పుడు విష్ణు పక్షం వహిస్తున్నాడు. వదిలిపెట్టడానికి వీలు లేని తల్లి తండ్రుల ప్రేమను ఐదేళ్ళప్పుడే వదిలిపెట్టినప్పుడు పెద్దయ్యాక ఆ విష్ణువునైనా ఎలా పట్టుకుంటాడు. శత్రువు పుత్రుడైనా వాడు మనకు హితం కలిగించేవాడైతే మందును సేవించినట్లు సేవించాలి. తన కొడుకైనా అపకారం చేసేవాడైతే శరీరములో వచ్చిన వ్యాధిలాగ తొలగించుకోవాలి" మందుకు తగ్గని రోగం వచ్చి శరీరం మొత్తం పాకుతుంటే దాన్ని తీసేసినట్లుగా
  అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే
    షాంగ శ్రేణికి రక్షసేయు క్రియ ఈ అజ్ఞుం కులద్రోహి దు
    స్సంగుం కేశవ పక్షపాతి అధముం జంపించి వీరవ్రతో
    త్తుంగ ఖ్యాతి చరించెదన్  కులము నిర్దోషంబు గావించెదన్

సర్వైరుపాయైర్హన్తవ్యః సమ్భోజశయనాసనైః
సుహృల్లిఙ్గధరః శత్రుర్మునేర్దుష్టమివేన్ద్రియమ్

అన్ని రకముల ఉపాయాలతో వీన్ని చంపెయ్యండి. విషం పెట్టీ, పాముల మీద పడుకోబెట్టి అగ్నిలో పడవేసి గానీ చంపెయ్యండి. ముని యొక్క చెడు ఇంద్రియం వంటి వాడు.మౌనాన్ని పాటించని ముని ఎలా  వాక్కుని వదిలిపెట్టాలో అలా ఇతన్ని మనం వధించి రాక్షస కులాన్ని బాగుచేసుకుందాము

నైరృతాస్తే సమాదిష్టా భర్త్రా వై శూలపాణయః
తిగ్మదంష్ట్రకరాలాస్యాస్తామ్రశ్మశ్రుశిరోరుహాః

వంకర పళ్ళతో (తిగ్మ) పెద్ద నోరు, ఎర్రని వెంట్రుకలు కలిగి అరుస్తూ నరకండి కొట్టండి చీల్చండీ అంటూ  త్రిశూలాన్ని తీసుకుని అన్ని అవయవాలలో పొడిచారు

నదన్తో భైరవం నాదం ఛిన్ధి భిన్ధీతి వాదినః
ఆసీనం చాహనన్శూలైః ప్రహ్రాదం సర్వమర్మసు

పరే బ్రహ్మణ్యనిర్దేశ్యే భగవత్యఖిలాత్మని
యుక్తాత్మన్యఫలా ఆసన్నపుణ్యస్యేవ సత్క్రియాః

పాపం చేసే వాడు ఆచరించే పుణ్య క్రియలలాగ ప్రహ్లాదుని మీద వారు చేసిన క్రియలన్నీ నిష్ఫలమయ్యాయి.

ప్రయాసేऽపహతే తస్మిన్దైత్యేన్ద్రః పరిశఙ్కితః
చకార తద్వధోపాయాన్నిర్బన్ధేన యుధిష్ఠిర

దిగ్గజైర్దన్దశూకేన్ద్రైరభిచారావపాతనైః
మాయాభిః సన్నిరోధైశ్చ గరదానైరభోజనైః

హిమవాయ్వగ్నిసలిలైః పర్వతాక్రమణైరపి
న శశాక యదా హన్తుమపాపమసురః సుతమ్
చిన్తాం దీర్ఘతమాం ప్రాప్తస్తత్కర్తుం నాభ్యపద్యత

"ఇలాంటి వాడు" అని చెప్పడానికి వీలు కాని పరమాత్మ యందు (అనిర్దేశ్యుడు) మనసు లగ్నం చేసిన ప్రహ్లాదుని యందు ప్రయోగించబడిన శిక్షలన్నీ నిష్ఫలమయ్యాయి. అనిర్దేశ్యుడైన పరమాత్మని ధ్యానిస్తున్న ప్రహ్లాదుడు కూడా అనిర్దేశ్యుడయ్యాడు. రాక్షసులు చేస్తున్న అన్ని శ్రమలూ వృధా అవుతున్న కొద్దీ, నిర్భంధముతో మరీ మరీ ప్రయత్నిచారు. మామూలు ఏనుగులు సరిపోవని అష్ట దిగ్గజాలను తెప్పించి తొక్కించాడు, తక్షకాది సర్పాలను తెప్పించి కరిపించాడు, అభిచార హోమాలు చేయించాడు, పర్వతం మీద నుంచి కింద పడేసారు, రాక్షస మాయతో, ముక్కూ చెవులూ నోరూ గట్టిగా మూసారు, విషాన్నం పెట్టారు, భోజనం లేకుండా చేసారు, మంచి గాలి నిప్పు నీరు నీటిలో పర్వతాల కిందా ఆపి, ఇన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోయాడు. ప్రహ్లాదుడు ఏ పాపమూ లేని వాడు. అలాంటి ఏ పాపం లేని ప్రహ్లాదున్ని పాపి అయిన హిరణ్యకశిపుడు ఏమీ చేయలేకపోయాడు. "నా ప్రయత్నముతో చావట్లేదంటే ఇతను నాకు మృత్యువు అవుతాడా"

ఏష మే బహ్వసాధూక్తో వధోపాయాశ్చ నిర్మితాః
తైస్తైర్ద్రోహైరసద్ధర్మైర్ముక్తః స్వేనైవ తేజసా

వర్తమానోऽవిదూరే వై బాలోऽప్యజడధీరయమ్
న విస్మరతి మేऽనార్యం శునః శేప ఇవ ప్రభుః

అప్రమేయానుభావోऽయమకుతశ్చిద్భయోऽమరః
నూనమేతద్విరోధేన మృత్యుర్మే భవితా న వా

ఇతి తచ్చిన్తయా కిఞ్చిన్మ్లానశ్రియమధోముఖమ్
శణ్డామర్కావౌశనసౌ వివిక్త ఇతి హోచతుః

తన తేజస్సుతో అన్ని ఉపాయాలను చేధించాడు. బాలుడైనా ఇతనిది చాలా సూక్ష్మబుద్ధి, ఇన్ని అపకారాలు చేసినా వాటిని సునశ్యేఫునిలాగ తలావ్ట్లేదు. ఇతని ప్రభావం ఇంతా అని చెప్పలేము. ఇతనికి ఎక్కడినుంచీ భయం కలగదు. ఇతనికి మరణం లేదు. ఇలాంటి వానితో విరోధం పెట్టుకున్నందు వలన నాకే మృత్యువు వస్తుందేమో. అన్ని లోకాలూ గెలిచాడూ, ఐదేళ్ళ పిల్లవాన్ని గెలవలేకపోయాను. ఏమీ చేయలేక ముఖం వాడిపోయి, అధోముఖుడై ఉండగా గురుపుత్రులు వచ్చి ఇలా అన్నారు

జితం త్వయైకేన జగత్త్రయం భ్రువోర్విజృమ్భణత్రస్తసమస్తధిష్ణ్యపమ్
న తస్య చిన్త్యం తవ నాథ చక్ష్వహే న వై శిశూనాం గుణదోషయోః పదమ్

నీవు కనుబొమ్మ ముడివేస్తే మూడు లోకాలూ వణికిపోయాయి. అలాంటి నీవు బాల్యములో ఉన్న పిల్లవాడి గుణాల గురించి బాధపడుతున్నావా

ఇమం తు పాశైర్వరుణస్య బద్ధ్వా నిధేహి భీతో న పలాయతే యథా
బుద్ధిశ్చ పుంసో వయసార్యసేవయా యావద్గురుర్భార్గవ ఆగమిష్యతి

వరుణ పాశాలతో కట్టేసి అక్కడే ఉంచు. వయసుతో పెద్దలను సేవించడం వలన గురువు బోధ వలనా బుద్ధి మారుతుంది. మా తండ్రి శుక్రాచార్యులు వచ్చేవరకు అలాగే ఉంచు

తథేతి గురుపుత్రోక్తమనుజ్ఞాయేదమబ్రవీత్
ధర్మో హ్యస్యోపదేష్టవ్యో రాజ్ఞాం యో గృహమేధినామ్

దాని హిరణ్యకశిపుడు ఒప్పుకుని "ఇతనికి గృధస్థాశ్రమ ధర్మాలని రాజ ధర్మాలనీ చెప్పండి. ధర్మార్థ కామాలనే బోధించండి. ఎక్కువగా కామ ప్రయోజనాన్నే చెప్పండి

ధర్మమర్థం చ కామం చ నితరాం చానుపూర్వశః
ప్రహ్రాదాయోచతూ రాజన్ప్రశ్రితావనతాయ చ

యథా త్రివర్గం గురుభిరాత్మనే ఉపశిక్షితమ్
న సాధు మేనే తచ్ఛిక్షాం ద్వన్ద్వారామోపవర్ణితామ్

వారి మాటలు విని వినయ సంపన్నుడికీ, చెప్పినట్లు వినేవాడైన ప్రహ్లాదునికి అవన్నీ చెప్పడానికి ఉద్యక్తులయ్యారు. గురువు గారు త్రివర్గాలని చెబుతున్నారని, వారు ద్వంద్వాల మీదే మోజు ఎక్కువగా ఉన్నవారని తెలుసు కాబట్టి వాటి మీద ఎక్కువ మోజు చూపలేదు. ఇలా బోధించే గురువుగారు తన పనులలో తాను ఉండగా తన తోటి పిల్లలందరూ ఆటకు పిలిచారు.

యదాచార్యః పరావృత్తో గృహమేధీయకర్మసు
వయస్యైర్బాలకైస్తత్ర సోపహూతః కృతక్షణైః

అథ తాన్శ్లక్ష్ణయా వాచా ప్రత్యాహూయ మహాబుధః
ఉవాచ విద్వాంస్తన్నిష్ఠాం కృపయా ప్రహసన్నివ

తే తు తద్గౌరవాత్సర్వే త్యక్తక్రీడాపరిచ్ఛదాః
బాలా అదూషితధియో ద్వన్ద్వారామేరితేహితైః

పర్యుపాసత రాజేన్ద్ర తన్న్యస్తహృదయేక్షణాః
తానాహ కరుణో మైత్రో మహాభాగవతోऽసురః

మహాపండితుడైన ప్రహ్లాదుడు దయతో నవ్వుతున్నట్లుగా వారి శ్రద్ధ ఆసక్తిని ఆకర్షించి పిలిచాడు. ఇతని మీద గౌరవముతో అన్ని ఆటలూ విడిచిపెట్టి ఇంకా ద్వంద్వములు చేరని వయసులో ఉన్న రాక్షస పిల్లలు ప్రహ్లాదుని యందే మనసూ చూపు ఉంచి సేవించారు. అలాంటి వారితో పరం కరుణతో ప్రహ్లాదుడు మాట్లాడుతున్నాడు

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం నాలగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం నాలగవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
ఏవం వృతః శతధృతిర్హిరణ్యకశిపోరథ
ప్రాదాత్తత్తపసా ప్రీతో వరాంస్తస్య సుదుర్లభాన్

శ్రీబ్రహ్మోవాచ
తాతేమే దుర్లభాః పుంసాం యాన్వృణీషే వరాన్మమ
తథాపి వితరామ్యఙ్గ వరాన్యద్యపి దుర్లభాన్

దుర్లభుములైనా ఆ వరాలను బ్రహ్మ ఇచ్చాడు. ఇచ్చి, నీవడిగినవి లోకములో ఎవరికీ లభించేవి కావు. అయినా నీ తపస్సుకు మెచ్చి ఇస్తున్నాను. ఇలా వరములిచ్చి బ్రహ్మగారు ప్రజాపతులతో హిరణ్యకశిపులతో స్తోత్రం చేయబడి అంతర్థానం చెందాడు.

తతో జగామ భగవానమోఘానుగ్రహో విభుః
పూజితోऽసురవర్యేణ స్తూయమానః ప్రజేశ్వరైః

ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రద్ధేమమయం వపుః
భగవత్యకరోద్ద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్

బ్రహ్మ వలన వరమును పొంది, అది తలచుకొని బ్రహ్మను సృష్టించిన పరమాత్మ  యందు వైరాన్ని పొందాడు.
అన్ని లోకములనూ దిక్కూనూ గెలిచాడు. దేవ దానవ యక్ష కిన్నెర గరుడ భూత ప్రేత పిశాచాలనూ సకల ప్రాణులనూ తన వశములో ఉంచుకుని ప్రపంచాన్ని గెలిచినవాడయ్యాడు. సకల్ అ లోఖలపాలకుల స్థానాన్ని ఆక్రమించాడు తన తేజస్సుతో స్వర్గానికి వెళ్ళి ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. మహేంద్ర భవనాన్ని అధిష్ఠించి. పగడములతో సోపానములు గల మరకత మణులతో  నేలలు గల స్ఫటికమణులతో ఉన్న గోడలు ఉన్న మహేంద్ర భవనము, పాల నురుగు లాంటి శయ్యలూ, ఘల్లు ఘల్లు మనే శబ్దం చేసే అందెలు గల దేవతా వనితలు గలది ఆ భవనం. ఆ మహేంద్ర భవనములో అన్ని లోకాలనూ గెలిచి ఏక రాజు ఆయాడు

స విజిత్య దిశః సర్వా లోకాంశ్చ త్రీన్మహాసురః
దేవాసురమనుష్యేన్ద్ర గన్ధర్వగరుడోరగాన్

సిద్ధచారణవిద్యాధ్రానృషీన్పితృపతీన్మనూన్
యక్షరక్షఃపిశాచేశాన్ప్రేతభూతపతీనపి

సర్వసత్త్వపతీన్జిత్వా వశమానీయ విశ్వజిత్
జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా

దేవోద్యానశ్రియా జుష్టమధ్యాస్తే స్మ త్రిపిష్టపమ్
మహేన్ద్రభవనం సాక్షాన్నిర్మితం విశ్వకర్మణా
త్రైలోక్యలక్ష్మ్యాయతనమధ్యువాసాఖిలర్ద్ధిమత్

యత్ర విద్రుమసోపానా మహామారకతా భువః
యత్ర స్ఫాటికకుడ్యాని వైదూర్యస్తమ్భపఙ్క్తయః

యత్ర చిత్రవితానాని పద్మరాగాసనాని చ
పయఃఫేననిభాః శయ్యా ముక్తాదామపరిచ్ఛదాః

కూజద్భిర్నూపురైర్దేవ్యః శబ్దయన్త్య ఇతస్తతః
రత్నస్థలీషు పశ్యన్తి సుదతీః సున్దరం ముఖమ్

తస్మిన్మహేన్ద్రభవనే మహాబలో మహామనా నిర్జితలోక ఏకరాట్
రేమేऽభివన్ద్యాఙ్ఘ్రియుగః సురాదిభిః ప్రతాపితైరూర్జితచణ్డశాసనః

తమఙ్గ మత్తం మధునోరుగన్ధినా వివృత్తతామ్రాక్షమశేషధిష్ణ్యపాః
ఉపాసతోపాయనపాణిభిర్వినా త్రిభిస్తపోయోగబలౌజసాం పదమ్

జగుర్మహేన్ద్రాసనమోజసా స్థితం విశ్వావసుస్తుమ్బురురస్మదాదయః
గన్ధర్వసిద్ధా ఋషయోऽస్తువన్ముహుర్విద్యాధరాశ్చాప్సరసశ్చ పాణ్డవ

స ఏవ వర్ణాశ్రమిభిః క్రతుభిర్భూరిదక్షిణైః
ఇజ్యమానో హవిర్భాగానగ్రహీత్స్వేన తేజసా

అలాంటి అత్యుత్తమమైన మహేంద్ర భవనములో ఏకచత్రాధిపతి అయిన దేవతలందరి చేతా నమస్కరిచబడుతూ దేవ సింహాసనం మీద కూర్చుని మహా సుగంధం గల మద్యపానముతో మదించి కన్నులు ఎర్రబారగా, కళ్ళు తిరుగుతూ ఉన్న హిరణ్యకశిపున్ని అన్ని లోకపాలకులూ కానుకలు తెచ్చి నమస్కరిస్తూ ఉంటారు. 

అకృష్టపచ్యా తస్యాసీత్సప్తద్వీపవతీ మహీ
తథా కామదుఘా గావో నానాశ్చర్యపదం నభః

రత్నాకరాశ్చ రత్నౌఘాంస్తత్పత్న్యశ్చోహురూర్మిభిః
క్షారసీధుఘృతక్షౌద్ర దధిక్షీరామృతోదకాః

శైలా ద్రోణీభిరాక్రీడం సర్వర్తుషు గుణాన్ద్రుమాః
దధార లోకపాలానామేక ఏవ పృథగ్గుణాన్

స ఇత్థం నిర్జితకకుబేకరాడ్విషయాన్ప్రియాన్
యథోపజోషం భుఞ్జానో నాతృప్యదజితేన్ద్రియః

నేనూ (నారదుడు) తుంబురుడూ ఆయనను కీర్తిచాము. గంధర్వ విద్యాధర అప్సరసలూ స్తోత్రం చేసారు. యజ్ఞ్యములతో దక్షిణలతో అతన్నే ఆరాధించారు. అతని తేజస్సుతో అగ్నిలో వేసిన ఆహుతులు కూడా తనే స్వీకరించాడు. ఏడు ద్వీపాలున్న భూమి దున్నకుండానే పంటను ఇచ్చింది. ఆకాశములో ఆశ్చర్యాలకు హద్దే లేదు. సముద్రములన్నీ రత్నముల రాశులను వారి భార్యల చేత తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాయి. అలాగే పర్వతాలు కూడా అన్ని కానుకలూ ఇస్తున్నాయి. అష్ట దిగ్పాలకుల గుణములను ఒక్కడే స్వీకరించాడు. ఇంద్రియ జయం లేని వాడై ఎన్ని వచ్చినా తృప్తి పొందలేకపోయాడు

ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్ఛాస్త్రవర్తినః
కాలో మహాన్వ్యతీయాయ బ్రహ్మశాపముపేయుషః

తస్యోగ్రదణ్డసంవిగ్నాః సర్వే లోకాః సపాలకాః
అన్యత్రాలబ్ధశరణాః శరణం యయురచ్యుతమ్

తస్యై నమోऽస్తు కాష్ఠాయై యత్రాత్మా హరిరీశ్వరః
యద్గత్వా న నివర్తన్తే శాన్తాః సన్న్యాసినోऽమలాః

ఇతి తే సంయతాత్మానః సమాహితధియోऽమలాః
ఉపతస్థుర్హృషీకేశం వినిద్రా వాయుభోజనాః

ఐశ్వర్యముతో మదించి బాగా గర్వం వచ్చి, శాస్త్రాన్ని ఉల్లంఘించాడు. ఇలా చాలా కాలమ గడిచింది. బ్రహ్మ వరమును పొంది గర్వించిన ఇతనికి బ్రాహ్మణ శాపం తగ్లింది. తని ఉగ్ర దండానికి కలత చెందిన ఋషులూ దేవతలు పరమాత్మ ఉన్న దిక్కుకు నమస్కరించి, పరమపద వాసికి నమస్కరించి, మనసునూ బుద్ధినీ ఏకాగ్రం చేసుకుని పరిశుద్ధులై హృషీకేశున్ని స్తోత్రం చేసారు.అప్పుడు వారికి రూపం లేని వాక్కు వినిపించింది.మేఘ గంభీర స్వనముతో, సజ్జనులకు అభయాన్ని ప్రసాదించే వాక్కు వినపడింది.

తేషామావిరభూద్వాణీ అరూపా మేఘనిఃస్వనా
సన్నాదయన్తీ కకుభః సాధూనామభయఙ్కరీ

మా భైష్ట విబుధశ్రేష్ఠాః సర్వేషాం భద్రమస్తు వః
మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే

దేవోత్తములారా భయపడవలదు మీకు అన్ని దిక్కులా శుభమే కలుగుతుంది. నా దర్శనమైతే వెంటనే శ్రేయస్సు చేకూరుతుంది. రాక్షసాధముడి యొక్క దౌర్జన్యం తెలుసు. దానికి నేను శాంతిని చేస్తాను. కొంత కాలం ఎదురు చూడండి.

జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం దైతేయాపసదస్య యత్
తస్య శాన్తిం కరిష్యామి కాలం తావత్ప్రతీక్షత

యదా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు
ధర్మే మయి చ విద్వేషః స వా ఆశు వినశ్యతి

దేవతల యందు గోవుల యందు సాధువుల యందు బ్రాహ్మణుల యందు ధర్మము యందు చివరకు నాయందూ ఎప్పుడైతే వ్యతిరేకముగా ప్రవర్తిస్తాడో అప్పుడు వాడే అంతమొందుతాడు 

నిర్వైరాయ ప్రశాన్తాయ స్వసుతాయ మహాత్మనే
ప్రహ్రాదాయ యదా ద్రుహ్యేద్ధనిష్యేऽపి వరోర్జితమ్

తన కొడుకుని ద్వేషించడముతో వాడి నాశం మొదలవుతుంది, ఎవ్వరినీ ద్వేషించనీ, ప్రశాంత చిత్తుడూ, తన సొంతకొడుకైన, మహాత్ముడైన, ప్రహ్లాదునికి ద్రోహం చేసినప్పుడు ఎన్ని వరాలున్నా సరే నేను చంపుతాను.

శ్రీనారద ఉవాచ
ఇత్యుక్తా లోకగురుణా తం ప్రణమ్య దివౌకసః
న్యవర్తన్త గతోద్వేగా మేనిరే చాసురం హతమ్

ఇలా పరమాత్మ చేత చెప్పబడి కలత తొలగిన దేవతలు తిరిగి వెళ్ళారు.అలాంటి హిరణ్య కశిపునికి నలుగురు కుమారులు కలిగారు.

తస్య దైత్యపతేః పుత్రాశ్చత్వారః పరమాద్భుతాః
ప్రహ్రాదోऽభూన్మహాంస్తేషాం గుణైర్మహదుపాసకః

బ్రహ్మణ్యః శీలసమ్పన్నః సత్యసన్ధో జితేన్ద్రియః
ఆత్మవత్సర్వభూతానామేకప్రియసుహృత్తమః

దాసవత్సన్నతార్యాఙ్ఘ్రిః పితృవద్దీనవత్సలః
భ్రాతృవత్సదృశే స్నిగ్ధో గురుష్వీశ్వరభావనః
విద్యార్థరూపజన్మాఢ్యో మానస్తమ్భవివర్జితః

అందులో ప్రహ్లాదుడు గొప్పవారి చేత ఉపాసించబడే వాడు
బ్రాహ్మణ భక్తి కలవాడు, అందరినీ తనలాగ చూచే వాడు, ఇంద్రియ జయం కలవాడు, పెద్దలకు దాసుడిలా నమస్కరించేవాడు, ఆడిన మాట తప్పని వాడు, దీనులను తండ్రిలా ప్రేమించేవాడు, తన తోటివారిని సోదరుల్లా చూచేవాడు, పెద్దల గురువుల యందు పరమాత్మ భావన కలవాడు, విద్యా సౌందర్యమూ కులమూ ధనముతో శొభించేవాడు

నోద్విగ్నచిత్తో వ్యసనేషు నిఃస్పృహః శ్రుతేషు దృష్టేషు గుణేష్వవస్తుదృక్
దాన్తేన్ద్రియప్రాణశరీరధీః సదా ప్రశాన్తకామో రహితాసురోऽసురః

అన్నీ ఉన్నా అభిమానం ధంభం లేని వాడు. ఎన్ని రకముల బాధలు వచ్చినా కలత చెందని వాడు. వినబడేవీ కనపడేవీ ఏవీ వాస్తవాలు కావు అనుకొనేవాడు. ఇంద్రియమునూ ప్రాణమును మనసునూ బుద్ధినీ నియమించుకున్నవాడు. జాతి రీత్యా అసురుడైనా ఆసురీ గుణములు లేని వాడు

యస్మిన్మహద్గుణా రాజన్గృహ్యన్తే కవిభిర్ముహుః
న తేऽధునా పిధీయన్తే యథా భగవతీశ్వరే

ప్రహ్లాదునిలో ఉన్న గుణములను దేవలోకములో దేవతలు శత్రువు పుత్రుడైన భావాన్ని మరచిపోయి స్తోత్రం చేస్తారు. పరమాత్మ యందు ఎలా గుణాలు ఉన్నాయో ప్రహ్లాదుని యందు కూడా అలాంటి గుణాలే ఉన్నాయి.

యం సాధుగాథాసదసి రిపవోऽపి సురా నృప
ప్రతిమానం ప్రకుర్వన్తి కిముతాన్యే భవాదృశాః

శత్రువులు(దేవతలు) కూడా సద్గుణములకు పోలికగా ప్రహ్లాదుని చెబుతారు. అతని గుణములతో అతని మాహాత్మ్యం ప్రకటించబడుతుంది.

గుణైరలమసఙ్ఖ్యేయైర్మాహాత్మ్యం తస్య సూచ్యతే
వాసుదేవే భగవతి యస్య నైసర్గికీ రతిః

పరమాత్మ యందు సహజ సిద్ధమైన భక్తి అతనిలో ఉంది . తమకు తాముగా అన్ని గుణాలూ వచ్చి చేరాయి

న్యస్తక్రీడనకో బాలో జడవత్తన్మనస్తయా
కృష్ణగ్రహగృహీతాత్మా న వేద జగదీదృశమ్

పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటముతో పిల్లవారు ఆడుకొనే ఆటలు కూడా మానేశాడు. జడుడిలాగ నిరంతరం పరమాత్మ యందే మనసు లగ్నం చేసి ఉంటాడు. కృష్ణుడనే ఒక గ్రహం అతన్ని పట్టింది. అతనికి ప్రపంచమంటే అస్సలు తెలీదు. 

ఆసీనః పర్యటన్నశ్నన్శయానః ప్రపిబన్బ్రువన్
నానుసన్ధత్త ఏతాని గోవిన్దపరిరమ్భితః

పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ
లా నిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుడేతద్విస్వమున్ భూవరా

క్వచిద్రుదతి వైకుణ్ఠ చిన్తాశబలచేతనః
క్వచిద్ధసతి తచ్చిన్తా హ్లాద ఉద్గాయతి క్వచిత్

అతని యందే మనసు లగ్నం చేసుకుని ఉంటాడు ఒక చోట.ఒక చోట అతని గుణాలను గానం చేస్తాడు, అరుస్తాడు, సిగ్గు విడిచి నాట్యం చేస్తాడు,

నదతి క్వచిదుత్కణ్ఠో విలజ్జో నృత్యతి క్వచిత్
క్వచిత్తద్భావనాయుక్తస్తన్మయోऽనుచకార హ

క్వచిదుత్పులకస్తూష్ణీమాస్తే సంస్పర్శనిర్వృతః
అస్పన్దప్రణయానన్ద సలిలామీలితేక్షణః

స ఉత్తమశ్లోకపదారవిన్దయోర్నిషేవయాకిఞ్చనసఙ్గలబ్ధయా
తన్వన్పరాం నిర్వృతిమాత్మనో ముహుర్దుఃసఙ్గదీనస్య మనః శమం వ్యధాత్

అతనికి భాగవత సంగతితో కలిగిన భక్తితో ఇలా ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క పాదపద్మముల సేవలో మునిగిపోయాడు. ప్రపంచములో ఎవ్వరూ పొందనంత తృప్తిని పొందాడు. దుర్జనుల సంగం వలన మనసు పొందిన దైన్యాన్ని తొలగించుకున్నవాడయ్యాడు.

తస్మిన్మహాభాగవతే మహాభాగే మహాత్మని
హిరణ్యకశిపూ రాజన్నకరోదఘమాత్మజే

ఇలాంటి పరమభాగవతోత్తముడైన, కన్న కొడుకైన, ప్రహ్లాదుని యందు హిరణ్యకశిపుడు పాపం చేసాడు

శ్రీయుధిష్ఠిర ఉవాచ
దేవర్ష ఏతదిచ్ఛామో వేదితుం తవ సువ్రత
యదాత్మజాయ శుద్ధాయ పితాదాత్సాధవే హ్యఘమ్

పుత్రాన్విప్రతికూలాన్స్వాన్పితరః పుత్రవత్సలాః
ఉపాలభన్తే శిక్షార్థం నైవాఘమపరో యథా

ఇంత గొప్పవాడైన కుమారుని విషయములో పరిశుద్ధుడు పరమసాధువైన ప్రహ్లాదుని యందు తండ్రి ఇంత పాపం చేసాడు. సొంత కొడుకు తప్పు చేస్తే దారికి తెచ్చుకుంటారు కదా ప్రపంచములో. ఎవరిమీదైనా ప్రేమలేకుండా ఉండవచ్చు గానీ కన్న కొడుకు మీద ప్రేమలేకుండా ఉంటారా. మంచి దారిలోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తారు గానీ, శత్రువులాగ వధ చేయాలని అనుకోరు కదా

కిముతానువశాన్సాధూంస్తాదృశాన్గురుదేవతాన్
ఏతత్కౌతూహలం బ్రహ్మన్నస్మాకం విధమ ప్రభో
పితుః పుత్రాయ యద్ద్వేషో మరణాయ ప్రయోజితః

దుష్టులైనా దారికి తెస్తారే,పరమాత్మని దైవముగా భావించే వారిని ఇలా చేయడానికి గల కారణమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. కొడుకు మీద తండ్రికున్న ద్వేషం తండ్రి మరణానికి కారణయ్యింది కదా? ఎందుకిలా జరిగింది అని ధర్మరాజు నారదున్ని అడిగాడు

Thursday, April 18, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
హిరణ్యకశిపూ రాజన్నజేయమజరామరమ్
ఆత్మానమప్రతిద్వన్ద్వమేకరాజం వ్యధిత్సత

స తేపే మన్దరద్రోణ్యాం తపః పరమదారుణమ్
ఊర్ధ్వబాహుర్నభోదృష్టిః పాదాఙ్గుష్ఠాశ్రితావనిః

జటాదీధితిభీ రేజే సంవర్తార్క ఇవాంశుభిః
తస్మింస్తపస్తప్యమానే దేవాః స్థానాని భేజిరే

తస్య మూర్ధ్నః సముద్భూతః సధూమోऽగ్నిస్తపోమయః
తీర్యగూర్ధ్వమధో లోకాన్ప్రాతపద్విష్వగీరితః

చుక్షుభుర్నద్యుదన్వన్తః సద్వీపాద్రిశ్చచాల భూః
నిపేతుః సగ్రహాస్తారా జజ్వలుశ్చ దిశో దశ

తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుః సురాః
ధాత్రే విజ్ఞాపయామాసుర్దేవదేవ జగత్పతే

విష్ణు పురాణం పద్మ పురాణం విష్ణు ధర్మోత్తర పురాణములో ఈ గాధ ఇంకా విపులముగా ఉంటుంది . హిరణ్యకశిపుడు విష్ణువు మీదకు యుద్ధానికి వెళతానంటే శుక్రాచార్యుడు వారించి "ఈ బలం నీకు సరిపోదని" చెప్పి తపస్సు చేసి శక్తి సంపాదించుకోమని చెప్పాడు
తాను ఎవరి చేతిలో ఓడిపోకుండా తనకు సాటి ఇంకొకరు లేకుండా ఉండాలని సంకల్పించి మందర గిరి పర్వతము మీద పరమ దారుణమైన తపస్సు చేసాడు. కేవలం ఒక కాలి బొటన వేలిమీద నిలబడి ఆకాశాన్ని మాత్రమే చూస్తూ తపస్సు చేసాడు. ఇతని తపశ్శక్తితో జటల యొక్క కాంతులతో ప్రళయకాల సూర్యునిలా భాసించాడు. ఇతను తపస్సుకు వెళ్ళగానే దేవతలంతా వారి వారి లోకాలకు మళ్ళీ వెళ్ళారు. తపస్సు చేస్తున్న హిరణ్య కశిపుని నుంచి తపో జ్వాల లేచి అన్నిలోకాలనూ తపింపచేస్తూ, నదులూ సముద్రాలు క్షోభించాయి, ద్వీపములూ అద్రులు చలించాయి. గ్రహములూ నక్షత్రములూ తారలు కిందకు పడబోతున్నాయి

దైత్యేన్ద్రతపసా తప్తా దివి స్థాతుం న శక్నుమః
తస్య చోపశమం భూమన్విధేహి యది మన్యసే
లోకా న యావన్నఙ్క్ష్యన్తి బలిహారాస్తవాభిభూః

తస్యాయం కిల సఙ్కల్పశ్చరతో దుశ్చరం తపః
శ్రూయతాం కిం న విదితస్తవాథాపి నివేదితమ్

సృష్ట్వా చరాచరమిదం తపోయోగసమాధినా
అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్యః పరమేష్ఠీ నిజాసనమ్

తదహం వర్ధమానేన తపోయోగసమాధినా
కాలాత్మనోశ్చ నిత్యత్వాత్సాధయిష్యే తథాత్మనః

అన్యథేదం విధాస్యేऽహమయథా పూర్వమోజసా
కిమన్యైః కాలనిర్ధూతైః కల్పాన్తే వైష్ణవాదిభిః

అప్పుడందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ఇతను చేసే తపస్సు వలన మేము ఉండలేకున్నాము అని చెప్పారు. నీకు అన్ని రకముల్ పూజలు ఆచరించే అన్ని లోకములూ నశించకముందే అతని తపస్సుని నివారించవలసింది. అతను ఏమనుకుని తపస్సు చేస్తున్నాడో నీకు తెలిసే ఉంటుంది. ఘోరమైన తపస్సు చేసిన నీవు సకల చరాచర జగత్తునూ సృష్టించి సత్యలోకాన్ని అధిష్ఠించావన్న విషయం తనకు తెలుసు. త్రిమూత్రులలా తాను కూడా ఆ శక్తులు పొందాలని తపస్సు చేస్తున్నాడు. ఎన్ని యుగాలు తపస్సు చేస్తే నీవు బ్రహ్మవయ్యావో. బ్రహ్మాసనం శివత్వం విష్ణుత్వం కావాలి అన్న కోరిక కోరితే, అతను ఈ ఒక్క జన్మలో పొందలేకపోయినా తరువాత వచ్చే జన్మలలో అవ్వగలడు, ఎందుకంటే ఆత్మ నిత్యం కాబట్టి. అలా వరముని పొంది నీవు యధా పూర్వం ఉన్న దాన్ని సృష్టించిన దాన్ని అతను తారు మారు చేస్తాడు. ఇతను బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తున్నాడు కాబట్టి అతనికి ఆ లోకమే నిత్యం అనుకుని విష్ణువూ శివుడూ కాలముతో నశించేవని భావించి తన తమో గుణముతో నీ లోకం కోరతాడు.

ఇతి శుశ్రుమ నిర్బన్ధం తపః పరమమాస్థితః
విధత్స్వానన్తరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర

ఇవన్నీ అనుకుని ఈ నిర్భంధముతో ఈ తపస్సు చేస్తున్నాడని మేము విన్నాము. ఏది యోగ్యమో ఆ పని నీవు చేయవలసినది

తవాసనం ద్విజగవాం పారమేష్ఠ్యం జగత్పతే
భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ

ఇతను తపస్సు మొదలు నీ ఆసనం  కోరి చేస్తున్నాడు. బ్రాహ్మణ, గో స్థానాన్ని, పారమేష్ఠి స్థానం కోరి చేస్తున్నాడు

ఇతి విజ్ఞాపితో దేవైర్భగవానాత్మభూర్నృప
పరితో భృగుదక్షాద్యైర్యయౌ దైత్యేశ్వరాశ్రమమ్

అతని శరీరాన్ని పిపీలికాదులు తినేసాయి. ఎముకలు మాత్రం ఉన్నాయి. మబ్బు కమ్మిన సూర్యునిలా ఉన్న అతన్ని చూచి హంసవాహనుడు నవ్వి చూస్తూ

న దదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీకతృణకీచకైః
పిపీలికాభిరాచీర్ణం మేదస్త్వఙ్మాంసశోణితమ్

తపన్తం తపసా లోకాన్యథాభ్రాపిహితం రవిమ్
విలక్ష్య విస్మితః ప్రాహ హసంస్తం హంసవాహనః

ఇలా అందరూ విజ్ఞ్యాపనం చేస్తే ప్రజాపతులనూ ఋషులనూ వెంటపెట్టుకుని హిరణ్యకశిపుని ఆశ్రమానికి వెళ్ళాడు. అతని మీద అప్పటికే పుట్ట మొలచి ఉంది, పుట్టా, వెదురు బొంగులూ, గడ్డీ, దర్భా, మొలిచాయి.

శ్రీబ్రహ్మోవాచ
ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే తపఃసిద్ధోऽసి కాశ్యప
వరదోऽహమనుప్రాప్తో వ్రియతామీప్సితో వరః

అద్రాక్షమహమేతం తే హృత్సారం మహదద్భుతమ్
దంశభక్షితదేహస్య ప్రాణా హ్యస్థిషు శేరతే

నీవు తపస్సులో సిద్ధిపొందావు. ఇంక నీవు లే. నీకు వరములివ్వడానికి వచ్చాను. నీ హృదయ బలం ఎంతటిదో నేను చూడగలిగాను

నైతత్పూర్వర్షయశ్చక్రుర్న కరిష్యన్తి చాపరే
నిరమ్బుర్ధారయేత్ప్రాణాన్కో వై దివ్యసమాః శతమ్

వ్యవసాయేన తేऽనేన దుష్కరేణ మనస్వినామ్
తపోనిష్ఠేన భవతాజితోऽహం దితినన్దన

తతస్త ఆశిషః సర్వా దదామ్యసురపుఙ్గవ
మర్తస్య తే హ్యమర్తస్య దర్శనం నాఫలం మమ

ప్రాణాన్ని ఇంతవరకూ ఎముకలలో నిలిపినవాడి నీవొక్కడవే. ఇలా ఇంకెవరూ చేయలేరు. నీరు కూడా లేకుండా ఇలా తపస్సు ఎవరు చేయగలరు. నీ పట్టుదలతో నన్ను గెలిచావు. నీకేమి కావాలో కోరికో. నీవు మర్త్యుడవు, నేను అమర్త్యున్ని. నా దర్శనం వృధా ఎప్పుడూ కాదు. అన్ని కోరికలనూ తీరుస్తుంది.

శ్రీనారద ఉవాచ
ఇత్యుక్త్వాదిభవో దేవో భక్షితాఙ్గం పిపీలికైః
కమణ్డలుజలేనౌక్షద్దివ్యేనామోఘరాధసా

"మొదటి పుట్టిన" దేవుడైన బ్రహ్మగారు చీమల దగ్గరనుంచీ అన్ని క్రిములూ తినేసిన హిరణ్యకశిపుని శరీరం మీద తన కమండలములో ఉన్న (విష్ణు పాదోదకమైన),అద్భుతమైన ఆరాధన చేసి పొందిన,  జలమును ప్రోక్షించాడు

స తత్కీచకవల్మీకాత్సహజోబలాన్వితః
సర్వావయవసమ్పన్నో వజ్రసంహననో యువా
ఉత్థితస్తప్తహేమాభో విభావసురివైధసః

ఈ జలం ప్రోక్షించబడగానే ఓజస్సూ సహస్సూ బలం కలిగి ఆ పుట్టను చేధించుకుని యువకుడై వజ్రము వంటి దేహము ఏర్పడి చక్కగా కాల్చిన బంగారు దేహముతో అగ్నిహోత్రునిలాగ లేచాడు

స నిరీక్ష్యామ్బరే దేవం హంసవాహముపస్థితమ్
ననామ శిరసా భూమౌ తద్దర్శనమహోత్సవః

ఉత్థాయ ప్రాఞ్జలిః ప్రహ్వ ఈక్షమాణో దృశా విభుమ్
హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్గదయాగృణాత్

శ్రీహిరణ్యకశిపురువాచ
కల్పాన్తే కాలసృష్టేన యోऽన్ధేన తమసావృతమ్
అభివ్యనగ్జగదిదం స్వయఞ్జ్యోతిః స్వరోచిషా

ఆత్మనా త్రివృతా చేదం సృజత్యవతి లుమ్పతి
రజఃసత్త్వతమోధామ్నే పరాయ మహతే నమః

నమ ఆద్యాయ బీజాయ జ్ఞానవిజ్ఞానమూర్తయే
ప్రాణేన్ద్రియమనోబుద్ధి వికారైర్వ్యక్తిమీయుషే

త్వమీశిషే జగతస్తస్థుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానామ్
చిత్తస్య చిత్తైర్మనైన్ద్రియాణాం పతిర్మహాన్భూతగుణాశయేశః

త్వం సప్తతన్తూన్వితనోషి తన్వా త్రయ్యా చతుర్హోత్రకవిద్యయా చ
త్వమేక ఆత్మాత్మవతామనాదిరనన్తపారః కవిరన్తరాత్మా

త్వమేవ కాలోऽనిమిషో జనానామాయుర్లవాద్యవయవైః క్షిణోషి
కూటస్థ ఆత్మా పరమేష్ఠ్యజో మహాంస్త్వం జీవలోకస్య చ జీవ ఆత్మా

త్వత్తః పరం నాపరమప్యనేజదేజచ్చ కిఞ్చిద్వ్యతిరిక్తమస్తి
విద్యాః కలాస్తే తనవశ్చ సర్వా హిరణ్యగర్భోऽసి బృహత్త్రిపృష్ఠః

వ్యక్తం విభో స్థూలమిదం శరీరం యేనేన్ద్రియప్రాణమనోగుణాంస్త్వమ్
భుఙ్క్షే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుషః పురాణః

అనన్తావ్యక్తరూపేణ యేనేదమఖిలం తతమ్
చిదచిచ్ఛక్తియుక్తాయ తస్మై భగవతే నమః

ఆకాశములో ఉన్న హంస వాహనుడైన స్వామిని చూచి చేతులు జోడించి ఆనందాశ్రువులతో పులకింతలతో గద్గదమైన కంఠముతో స్తోత్రం చేస్తూ ప్రళయకాలములో అంధకారములో మునిగినా ఈ జగమును బయటకు తెచ్చావు. సత్వ రజస్సు తమస్సులను తెచ్చుకుని సృష్టి స్థితి సంహారం చేస్తున్నావు. ఇలాంటి త్రిగుణ ధామమైన నీకు నమస్కారం. సకల చరాచర జగత్తుకూ నీవు ఆది మూర్తివి. స్థావర జంగమములకు నీవే పతివి. నీవే బుద్ధికీ చిత్తానికీ పంచభూతములకూ అధిపతివి.నీవే మనసుకు ఈశ్వరుడవు.ఒక్క అహంకారం తప్ప మిగిలిన సప్త తంత్రులనూ నీవే కల్పించావు. యజ్ఞ్య విద్యా తపో విద్యా యోగ విద్యా సృష్టి విద్యా నీవే ఆత్మవై ఆత్మ కలవారందరికీ ఆత్మవై, అనాధివై ఉన్నావు. నీవే కాలానివీ నీవే ఆయువువూ, ఆయుష్యాన్ని పెంచేవాడివీ తీసుకునేవాడివీ నీవే. నీవే కూటస్థుడవు, మార్పులేనివాడవు, పుట్టుకలేని వాడవు, నీవే ఆత్మవు, నీకంటే పరమైనది వేరేదేదీ లేదు. కదిలేదీ కదలనిదీ రెండూ నీవే. అన్ని  విద్యలూ కళలూ మూర్తులూ నీవే. నీవే హిరణ్యగర్భుడవూ బ్రహ్మవూ, ప్రకృతివీ. ఇంద్రియములూ ప్రాణములూ మనసూ గుణములూ ఇవన్నీ నీ స్థూల శరీరం. ఆకలేసినప్పుడు ప్రపంచమంతా నీకొక చిన్న ముద్ద. నీవే ప్రకృతివీ జీవుడవూ పరమాత్మవు. చిత్ అచిత్ ఈశ్వర అనే మూడు శక్తులతో కూడి ఉన్న నీకు నమస్కారం.

యది దాస్యస్యభిమతాన్వరాన్మే వరదోత్తమ
భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో

నాన్తర్బహిర్దివా నక్తమన్యస్మాదపి చాయుధైః
న భూమౌ నామ్బరే మృత్యుర్న నరైర్న మృగైరపి

వ్యసుభిర్వాసుమద్భిర్వా సురాసురమహోరగైః
అప్రతిద్వన్ద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినామ్

నేను వరం అడుగుతున్నాను. ఇవ్వదలచుకుంటే ఇవ్వు. నీ సృష్టితో మరణించకుండా వరమును ఇవ్వు. లోపల గానీ వెలుపల గానీ పగలు గానీ రాత్రి కానీ ఆయుధాలతో కానీ భూమి మీద గానీ ఆకాశములో గానీ

సర్వేషాం లోకపాలానాం మహిమానం యథాత్మనః
తపోయోగప్రభావాణాం యన్న రిష్యతి కర్హిచిత్

మానవులతో మృగములతో ప్రాణం ఉన్నవాటితో లేని వాటితో దేవ దానవ యక్ష నాగ కిన్నెరలలో నాకు ఎదురు ఉండకూడదు. సకల చరాచర జగత్తుకూ నేనే అధిపతిని కావాలి. సకల లోకపాలకుల ప్రభావం నాకే రావలి. తపస్సుతో యోగముతో గానీ నశించని శక్తి కావాలి. నా ఎదురుగా ఎవరూ నిలబడకూడదు అని అడిగాడు

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా
హిరణ్యకశిపూ రాజన్పర్యతప్యద్రుషా శుచా

శ్రీమహావిష్ణువు వరాహ రూపం ధరించి హిరణ్యాక్షున్ని సంహరిస్తే హిరణ్య కశ్యపుడు కోపముతో దు@ఖముతో తపించిపోయాడు.

ఆహ చేదం రుషా పూర్ణః సన్దష్టదశనచ్ఛదః
కోపోజ్జ్వలద్భ్యాం చక్షుర్భ్యాం నిరీక్షన్ధూమ్రమమ్బరమ్

కరాలదంష్ట్రోగ్రదృష్ట్యా దుష్ప్రేక్ష్యభ్రుకుటీముఖః
శూలముద్యమ్య సదసి దానవానిదమబ్రవీత్

పళ్ళు కొరుకుతూ కళ్ళు తిప్పుతో క్రోధముతో శోకముతో నీరు కారుతూ ఉంటే కనుబొమ్మలు తిప్పుతూ శులాన్ని ఎత్తుకొని అక్కడ ఉన్న దైత్యులని ఉద్దేశ్యించి


భో భో దానవదైతేయా ద్విమూర్ధంస్త్ర్యక్ష శమ్బర
శతబాహో హయగ్రీవ నముచే పాక ఇల్వల

విప్రచిత్తే మమ వచః పులోమన్శకునాదయః
శృణుతానన్తరం సర్వే క్రియతామాశు మా చిరమ్

సపత్నైర్ఘాతితః క్షుద్రైర్భ్రాతా మే దయితః సుహృత్
పార్ష్ణిగ్రాహేణ హరిణా సమేనాప్యుపధావనైః

మీరందరూ నేను చెప్పినది జాగ్రత్తగా వినండి, చెప్పినట్లు చేయండి. ణా సోదరుడు కపటులైన శత్రువుచేత చంపబడ్డాడు.

తస్య త్యక్తస్వభావస్య ఘృణేర్మాయావనౌకసః
భజన్తం భజమానస్య బాలస్యేవాస్థిరాత్మనః

నిరంతరం వారి పక్షం వహించి వారిని సేవించే విష్ణువు చేత చంపబడ్డాడు. వనములో ఉండేవాడు. (వనం అంటే నీరు అనీ, అడవి అనీ వస్తుంది అర్థం). మాయా రూపములో ఉండే వన వరాహముగా ఉండి క్షుద్రుడై, పిల్లవాని స్వభావము కలవాడై, పిలిచిన వారి వెంట పోయే రకం కలవాడు, చంచల బుద్ధి కలవాడు అయిన విష్ణువు.

మచ్ఛూలభిన్నగ్రీవస్య భూరిణా రుధిరేణ వై
అసృక్ప్రియం తర్పయిష్యే భ్రాతరం మే గతవ్యథః

నా త్రిశూలముతో ఆయన శిరస్సు ఖండించి రక్తమంటే ప్రీతి కలిగిన నా తమ్మునికి ఇస్తాను

తస్మిన్కూటేऽహితే నష్టే కృత్తమూలే వనస్పతౌ
విటపా ఇవ శుష్యన్తి విష్ణుప్రాణా దివౌకసః

తరువాత వేరు పోయిన చెట్ల లాగ దేవతలందరూ నశిస్తారు

తావద్యాత భువం యూయం బ్రహ్మక్షత్రసమేధితామ్
సూదయధ్వం తపోయజ్ఞ స్వాధ్యాయవ్రతదానినః

మీరు బయలు దేరి భూమండలానికి వెళ్ళండి. అక్కడ అంతా ధ్వంసం చేయండి. అక్కడ అందరూ బ్రాహ్మణులూ క్షత్రియులూ ఉంటారు. వారి వలన పాడైన భూమిని బాగు చేయండి. తపస్సూ స్వాధ్యాయం యజ్ఞ్యం చేసే వారు కనపడితే చంపేయ్యండి, ఎందుకంటే విష్ణువు అవి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు

విష్ణుర్ద్విజక్రియామూలో యజ్ఞో ధర్మమయః పుమాన్
దేవర్షిపితృభూతానాం ధర్మస్య చ పరాయణమ్

బ్రాహ్మణులు చేసే పనులలోనే విష్ణువు ఉంటాడు. ధర్మం యజ్ఞానికీ విష్ణువు బ్రాహ్మణులకీ మూలం. ఏఎ రెంటినీ నాశనం చేయండి

యత్ర యత్ర ద్విజా గావో వేదా వర్ణాశ్రమక్రియాః
తం తం జనపదం యాత సన్దీపయత వృశ్చత

గోవులూ బ్రాహ్మణులూ వేదములూ వర్ణాశ్రమాలు ఉన్న పల్లెలకి వెళ్ళి తగలపెట్టండి నరికేయ్యండి.

ఇతి తే భర్తృనిర్దేశమాదాయ శిరసాదృతాః
తథా ప్రజానాం కదనం విదధుః కదనప్రియాః

అది విన్న యుద్ధ ప్రియులైన రాక్షసులు బయలు దేరారు. Yఉద్ధం చేస్తున్నారు.పురములూ గ్రామములూ ఆశ్రములూ మండలాలూ నగరములూ పట్టణాలూ అన్ని తగలపెట్టారు. గడ్డపారలతో పారలతో వంతెనలనూ ప్రాకారాలనూ దేవాలయాలనూ మహావృక్షాలనూ పెకిలించి వేశారు.దివిటీలతో ఇళ్ళు తగలపెట్టారు. ఇలా హిరణ్యకశిపుని అనుచరులతో లోకమంతా పీడించబడితే దేవతలంతా స్వర్గాన్ని వీడి కిందకు వచ్చారు

పురగ్రామవ్రజోద్యాన క్షేత్రారామాశ్రమాకరాన్
ఖేటఖర్వటఘోషాంశ్చ దదహుః పత్తనాని చ

కేచిత్ఖనిత్రైర్బిభిదుః సేతుప్రాకారగోపురాన్
ఆజీవ్యాంశ్చిచ్ఛిదుర్వృక్షాన్కేచిత్పరశుపాణయః
ప్రాదహన్శరణాన్యేకే ప్రజానాం జ్వలితోల్ముకైః

ఏవం విప్రకృతే లోకే దైత్యేన్ద్రానుచరైర్ముహుః
దివం దేవాః పరిత్యజ్య భువి చేరురలక్షితాః

హిరణ్యకశిపుర్భ్రాతుః సమ్పరేతస్య దుఃఖితః
కృత్వా కటోదకాదీని భ్రాతృపుత్రానసాన్త్వయత్

శకునిం శమ్బరం ధృష్టిం భూతసన్తాపనం వృకమ్
కాలనాభం మహానాభం హరిశ్మశ్రుమథోత్కచమ్

తన్మాతరం రుషాభానుం దితిం చ జననీం గిరా
శ్లక్ష్ణయా దేశకాలజ్ఞ ఇదమాహ జనేశ్వర

ఇలా ధ్వంసం చేసిన తరువాత తమ్మునికి అంత్య క్రియలు జరిపాడు, తర్పణాలు ఇచ్చాడు. శకుని మొదైలైన పిల్లలూ, వారి తల్లి వృషాభాను, తమ తల్లి అయిన దితినీ జాలితో ప్రేమతో వినయముతో కరుణతో ఇలా మాట్లాడాడు

శ్రీహిరణ్యకశిపురువాచ
అమ్బామ్బ హే వధూః పుత్రా వీరం మార్హథ శోచితుమ్
రిపోరభిముఖే శ్లాఘ్యః శూరాణాం వధ ఈప్సితః

అమ్మా, కోడలా (హిరణ్యాక్షుని భార్య తనకు కోడలితో సమానం), పుత్రులారా, శత్రువుకు అభిముఖముగా యుద్ధం చేసి మరణించుట మెచ్చుకోదగ్గ విషయం

భూతానామిహ సంవాసః ప్రపాయామివ సువ్రతే
దైవేనైకత్ర నీతానామున్నీతానాం స్వకర్మభిః

చలివేంద్రములో ఒక కుండ పెట్టుకుని కూర్చుంటారు. దప్పి ఐన వారు వరుసలో నిలుచుని మాట్లాడుకుంటారు. ఆ వరుసలో ఉన్నంతసేపూ కాసేపు మాట్లాడుకొంటారు. తరువాత ఎవరి దారిన వారు పోతారు. జీవితములో కూడా అంతే. పరమాత్మ ఈ జీవులను తాము తాము ఆచరించిన కర్మలకు అనుగుణముగా కలుపుతాడు. ఆ పని ఉన్నంతవరకూ వారు కలిసి ఉంటారు. ఈ వియోగ సమ్యోగాలకు మనం విచారించరాదు.

నిత్య ఆత్మావ్యయః శుద్ధః సర్వగః సర్వవిత్పరః
ధత్తేऽసావాత్మనో లిఙ్గం మాయయా విసృజన్గుణాన్

ఆత్మ నిత్యం, తరగనిది, ప్రకృతి దోషాలు లేకుండా అన్ని తెలిసినది ఆత్మ ఈ. ఆత్మే మాయ చేత ప్రకృతి గుణములకు ఆసక్తుడై మాయచేత శరీరాన్ని ధరిస్తుంది

యథామ్భసా ప్రచలతా తరవోऽపి చలా ఇవ
చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే చలతీవ భూః

బాగా వేగముగా ప్రవాహం వెళుతూ ఉంటుంది, అప్పుడు వడ్డున ఉన్న చెట్లు కూడా మనతో వస్తున్నట్లు కనపడతాయి. కళ్ళు తిరుగుతున్నప్పుడు భూమి తిరుగుతున్నట్లు కనపడుతుంది. అలాగే నిత్యమైన ఆత్మకు అనిత్యమైన శరీర సంబంధం వలన ఈ ఆత్మకూడా అలాగే పోతుంది అని భ్రమ కలిగి ఉంటాము. ఈ మూడు గుణములతో మనసు భ్రమిస్తుంది. మనసు యొక్క భ్రమను ఆత్మ కూడా పొందినట్లు అనిపిస్తుంది.

ఏవం గుణైర్భ్రామ్యమాణే మనస్యవికలః పుమాన్
యాతి తత్సామ్యతాం భద్రే హ్యలిఙ్గో లిఙ్గవానివ

ఆత్మకు ఏ లింగమూ లేదు. మనమాచరించిన కర్మది శరీరం.

ఏష ఆత్మవిపర్యాసో హ్యలిఙ్గే లిఙ్గభావనా
ఏష ప్రియాప్రియైర్యోగో వియోగః కర్మసంసృతిః

శరీరము లేని చోట శరీరమున్నట్లు ఉన్న భావనే ఆత్మకు విపరీత జ్ఞ్యానం. ప్రియ సమాగమం, అప్రియ సమాగమం, ప్రియ వియోగం, అప్రియ వియోగం, మనకు కర్మ వలన కలుగుతాయి.ఈ సమ్యోగ వియోగముల కొరకు మనం చేసే కర్మలకే సంసారమని పేరు.

సమ్భవశ్చ వినాశశ్చ శోకశ్చ వివిధః స్మృతః
అవివేకశ్చ చిన్తా చ వివేకాస్మృతిరేవ చ

పుట్టుకా మరణం బాధా దుఃఖం విలాపం ఏమీ లేకుండా ఉండేది ఈ సంసారం. అవివేకం చింతా, వివేకమును మరచిపోవడం. వివేకం గుర్తు రాకపోవడం కూడా మన పాపములో భాగమే

అత్రాప్యుదాహరన్తీమమితిహాసం పురాతనమ్
యమస్య ప్రేతబన్ధూనాం సంవాదం తం నిబోధత

చనిపోయిన బంధువులతో యమ ధర్మ రాజు మాట్లాడిన గాధను చెబుతాను. ఉశీనుడనే వాడు యుద్ధములో సంహరించబడ్డాడు

ఉశీనరేష్వభూద్రాజా సుయజ్ఞ ఇతి విశ్రుతః
సపత్నైర్నిహతో యుద్ధే జ్ఞాతయస్తముపాసత

శరీరమంతా చీలిపోయింది, భయానక స్థితిలో ఉంది ఆ శరీరం.

విశీర్ణరత్నకవచం విభ్రష్టాభరణస్రజమ్
శరనిర్భిన్నహృదయం శయానమసృగావిలమ్

ప్రకీర్ణకేశం ధ్వస్తాక్షం రభసా దష్టదచ్ఛదమ్
రజఃకుణ్ఠముఖామ్భోజం ఛిన్నాయుధభుజం మృధే

ఉశీనరేన్ద్రం విధినా తథా కృతం పతిం మహిష్యః ప్రసమీక్ష్య దుఃఖితాః
హతాః స్మ నాథేతి కరైరురో భృశం ఘ్నన్త్యో ముహుస్తత్పదయోరుపాపతన్

శత్రువులచే ఇలా సంహరించబడిన భర్తను చూచి అతని భార్యలు దుఃఖపడి. "చనిపోయింది మీరు కాదు మేము" అని ఏడుస్తూ కన్నీరు కార్చారు. సిగ ముడి విడి ఆభరణములు జారి విలపించారు.దయలేని బ్రహ్మ నిన్ను మా నుండి వేరు చేసారు. మాకు ఆనందం ఇచ్చిన నీవే ఇపుడు దు@ఖాన్ని పెంచుతున్నావు. అలా విలపిస్తున్నప్పుడు, అతన్ని దహనం చేయడానికి వారెవరూ ఒప్పుకోలేదు. అప్పుడు సాయంకాలం అయ్యింది, సూర్యుడు అస్తమించాడు. వారి విలాపాన్ని చూచి వారికి ఓదార్పు కలిగించాలని, పిల్లవాని రూపములో వచ్చి

రుదత్య ఉచ్చైర్దయితాఙ్ఘ్రిపఙ్కజం సిఞ్చన్త్య అస్రైః కుచకుఙ్కుమారుణైః
విస్రస్తకేశాభరణాః శుచం నృణాం సృజన్త్య ఆక్రన్దనయా విలేపిరే

అహో విధాత్రాకరుణేన నః ప్రభో భవాన్ప్రణీతో దృగగోచరాం దశామ్
ఉశీనరాణామసి వృత్తిదః పురా కృతోऽధునా యేన శుచాం వివర్ధనః

త్వయా కృతజ్ఞేన వయం మహీపతే కథం వినా స్యామ సుహృత్తమేన తే
తత్రానుయానం తవ వీర పాదయోః శుశ్రూషతీనాం దిశ యత్ర యాస్యసి

ఏవం విలపతీనాం వై పరిగృహ్య మృతం పతిమ్
అనిచ్ఛతీనాం నిర్హారమర్కోऽస్తం సన్న్యవర్తత

తత్ర హ ప్రేతబన్ధూనామాశ్రుత్య పరిదేవితమ్
ఆహ తాన్బాలకో భూత్వా యమః స్వయముపాగతః

శ్రీయమ ఉవాచ
అహో అమీషాం వయసాధికానాం విపశ్యతాం లోకవిధిం విమోహః
యత్రాగతస్తత్ర గతం మనుష్యం స్వయం సధర్మా అపి శోచన్త్యపార్థమ్

అహో ఇలా ఏడ్చేవారందరూ పెద్దవారు, ఇలాంటి వారికి ఈ వ్యామోహం ఏమిటి. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు. వచ్చినపుడు లేని వికారం పోయినపుడు ఎందుకు. వీరు కూడా పోయే వారే కదా. పోయేవారు తన కన్నా ముందు పోయిన వారి గురించి విచారిస్తున్నారు.

అహో వయం ధన్యతమా యదత్ర త్యక్తాః పితృభ్యాం న విచిన్తయామః
అభక్ష్యమాణా అబలా వృకాదిభిః స రక్షితా రక్షతి యో హి గర్భే

మీ కన్నా మేమే ధన్యులము. నా చిన్నప్పుడే తల్లి తండ్రులు పోయారు. కానీ నేను మీలా ఏడవటం లేదే. మేము ఉండేది అడవౌలలో. ఐనా మమ్ములను ఏ మృగాలూ తినలేదు. బాగానే ఉన్నాము. శిశువు గర్భములో ఉన్నప్పుడు ఎవరు కాపాడతారో బయట ఉన్నప్పుడూ వారే కాపాడతారన్న సత్యం తెలుసుకున్నము

య ఇచ్ఛయేశః సృజతీదమవ్యయో య ఏవ రక్షత్యవలుమ్పతే చ యః
తస్యాబలాః క్రీడనమాహురీశితుశ్చరాచరం నిగ్రహసఙ్గ్రహే ప్రభుః

ఏ పరమాత్మ తన సంకల్పముతో సృష్టి స్థితి సంహారం చేస్తాడో అలాంటి వాడికి ఈ ప్రపంచమంతా ఒక వినోదం. అనుగ్రహిస్తాడు నిగ్రహిస్తాడు. సృష్టిస్తాడూ సంహరిస్తాడు. నడి మార్గములో దారిలో ఉన్నా పరమాత్మ కాపాడ దలచుకుంటే సురక్షితముగా ఉంటాడు. ఇంట్లో ఉండి, అతని దృష్టిలేకపోతే మరణిస్తాడు

పథి చ్యుతం తిష్ఠతి దిష్టరక్షితం గృహే స్థితం తద్విహతం వినశ్యతి
జీవత్యనాథోऽపి తదీక్షితో వనే గృహేऽభిగుప్తోऽస్య హతో న జీవతి

ఏ దిక్కులేని వాడైనా అడవైలో ఉన్నా పరమాత్మ అనుగ్రహం ఉంటే బతుకుతాడు. ఇంటిలోనే ఉన్నా ఆయన కటాక్షం లేకపోతే ఆ ఇల్లే కూలి మీద పడుతుంది.

భూతాని తైస్తైర్నిజయోనికర్మభిర్భవన్తి కాలే న భవన్తి సర్వశః
న తత్ర హాత్మా ప్రకృతావపి స్థితస్తస్యా గుణైరన్యతమో హి బధ్యతే

అందుకోసం ప్రాణులు వారు వారు ఆచరించిన కర్మలకనుగుణముగా కొంతకాలముంటారు పోతారు. ఆత్మ ఎప్పుడూ ప్రకృతి గుణములకు బద్ధం కాదు. ప్రకృతి సంబంధం వలన కలిగిన ఈ శరీరం నాది అనుకోవడం పురుషునికి మోహం వల్లనే కలుగుతుంది

ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథగ్భౌతికమీయతే గృహమ్
యథౌదకైః పార్థివతైజసైర్జనః కాలేన జాతో వికృతో వినశ్యతి

ఇల్లు కట్టుకోవడానికి మట్టీ నీరు గాలీ నిప్పూ వాడతాం. ఆ కలయికలో మార్పు వస్తే ఆ ఇల్లు కొంతకాలం తరువాత ఉండదు. ఇంటిలో ఎలా పంచభూతాలూ ఉంటాయో శరీరములో కూడా ఉంటాయి

యథానలో దారుషు భిన్న ఈయతే యథానిలో దేహగతః పృథక్స్థితః
యథా నభః సర్వగతం న సజ్జతే తథా పుమాన్సర్వగుణాశ్రయః పరః

కట్టెలో ఉండే నిప్పు కట్టెలో కంటే విడిగా కనపడుతుంది. శరీరములో ఉండే ప్రాణవాయువు శరీరం కన్నా విడిగా కనపడుతుంది.

సుయజ్ఞో నన్వయం శేతే మూఢా యమనుశోచథ
యః శ్రోతా యోऽనువక్తేహ స న దృశ్యేత కర్హిచిత్

అంతటా ఉన్నా ఆకాశం ఎందులో పట్టు బడనట్లు, శరీరములో ఉండే వాయువు విడిగా ఉన్నట్లు, కట్టెలో ఉన్న నిప్పు కట్టె కంటే వేరుగా ఉన్నట్లు శరీరము కన్నా ఆత్మ వేరుగా ఉంటుంది. మీరు ఏడ్చేది శరీరం కోసమా, శరీరములో ఉన్నవాడికోసమా. శరీరం కోసమైతే, శరీరం ఇక్కడే ఉంది.అందులో ఉన్న జీవుడి కోసం బాధపడుతున్నరా?ఆ జీవున్ని మీరెలాగూ చూడలేదు. ప్రాణం కోసం ఏదుతున్నారనుకుంటే ఎన్నడైనా ఆ ప్రాణం మీతో మాట్లాడిందా?

న శ్రోతా నానువక్తాయం ముఖ్యోऽప్యత్ర మహానసుః
యస్త్విహేన్ద్రియవానాత్మా స చాన్యః ప్రాణదేహయోః

భూతేన్ద్రియమనోలిఙ్గాన్దేహానుచ్చావచాన్విభుః
భజత్యుత్సృజతి హ్యన్యస్తచ్చాపి స్వేన తేజసా

యావల్లిఙ్గాన్వితో హ్యాత్మా తావత్కర్మనిబన్ధనమ్
తతో విపర్యయః క్లేశో మాయాయోగోऽనువర్తతే

వితథాభినివేశోऽయం యద్గుణేష్వర్థదృగ్వచః
యథా మనోరథః స్వప్నః సర్వమైన్ద్రియకం మృషా

అథ నిత్యమనిత్యం వా నేహ శోచన్తి తద్విదః
నాన్యథా శక్యతే కర్తుం స్వభావః శోచతామితి

లుబ్ధకో విపినే కశ్చిత్పక్షిణాం నిర్మితోऽన్తకః
వితత్య జాలం విదధే తత్ర తత్ర ప్రలోభయన్

కులిఙ్గమిథునం తత్ర విచరత్సమదృశ్యత
తయోః కులిఙ్గీ సహసా లుబ్ధకేన ప్రలోభితా

ఆసజ్జత సిచస్తన్త్ర్యాం మహిష్యః కాలయన్త్రితా
కులిఙ్గస్తాం తథాపన్నాం నిరీక్ష్య భృశదుఃఖితః
స్నేహాదకల్పః కృపణః కృపణాం పర్యదేవయత్

ఫ్రాణమూ ఇంద్రియం మనసూ శరీరం ఇవి పరమాత్మ మన కర్మకు అనుగుణముగా ఇస్తాడు.
కర్మగానుగుణముగా శరీరాన్ని పొందుతుంది కర్మానుగుణముగా శరీరాన్ని విడిచిపెడుతుంది
ఆ శరీరాన్ని చూచి నావాడు అంటే, ఆ శరీరం నాదనా, ఆ ఆత్మ నాది అనా అర్థం
గుణుమౌలతో ఏర్పడిన శరీరాన్ని చూచి ఆత్మ అనుకోవడం అసత్యపు అభినివేశనం
స్వప్నములో వస్తువులు స్వప్నం ఉన్నంతవరకూ ఉనంట్లు ఇవన్నీ దేహం ఉన్నంతవరకే ఉంటాయి.
మనం దేనికోసమైనా విచారించడం తప్పు. ఆఅత్మ ఎలాగూ నిత్యం, శరీరం ఎలాగూ అనిత్యం. దుఃఖముతో అనిత్యమైనది తిరిగి రాదు.నిత్యమైనది ఎలాగైనా ఉంటుంది.మనం మన విలాపముతో దాని స్వభావం మార్చలేము.మరి విలాపం దేనికోసం. చచ్చేవారు ఏడుపుతో బతకరు. బతికే వారు సంతోషం వలన చావరు.
ఒక అరణ్యములో ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. అక్కడున్న గింజలు చూసి ఆడపక్షి అక్కడ వాలి వలలో పడింది.అలా పట్టుబడిన పక్షికోసం మగ పక్షి విలపిస్తోంది. అలా ఉండగా వేటగాడు దాన్ని బాణముతో కొట్టాడు

అహో అకరుణో దేవః స్త్రియాకరుణయా విభుః
కృపణం మామనుశోచన్త్యా దీనయా కిం కరిష్యతి

కామం నయతు మాం దేవః కిమర్ధేనాత్మనో హి మే
దీనేన జీవతా దుఃఖమనేన విధురాయుషా

ఇలా విలపిస్తున్నప్పుడు దాన్ని కూడా కొట్టాడు

కథం త్వజాతపక్షాంస్తాన్మాతృహీనాన్బిభర్మ్యహమ్
మన్దభాగ్యాః ప్రతీక్షన్తే నీడే మే మాతరం ప్రజాః

ఏవం కులిఙ్గం విలపన్తమారాత్ప్రియావియోగాతురమశ్రుకణ్ఠమ్
స ఏవ తం శాకునికః శరేణ వివ్యాధ కాలప్రహితో విలీనః

ఏవం యూయమపశ్యన్త్య ఆత్మాపాయమబుద్ధయః
నైనం ప్రాప్స్యథ శోచన్త్యః పతిం వర్షశతైరపి

శ్రీహిరణ్యకశిపురువాచ
బాల ఏవం ప్రవదతి సర్వే విస్మితచేతసః
జ్ఞాతయో మేనిరే సర్వమనిత్యమయథోత్థితమ్

యమ ఏతదుపాఖ్యాయ తత్రైవాన్తరధీయత
జ్ఞాతయో హి సుయజ్ఞస్య చక్రుర్యత్సామ్పరాయికమ్

అతః శోచత మా యూయం పరం చాత్మానమేవ వా
క ఆత్మా కః పరో వాత్ర స్వీయః పారక్య ఏవ వా
స్వపరాభినివేశేన వినాజ్ఞానేన దేహినామ్

కాబట్టి కొన్నాళ్ళకు మీరు పోయే వారే. ఏదుస్తున్న మీకు ఇందులో ఉన్న ఆత్మ మరణించదని తెలియదా?తెలియదూ అంటే దుఃఖములో మరచిపోయి ఉంటారు.ఒక నూరేళ్ళు ఏద్చినా ఆ శరీరములోకి ఆత్మ రాదు.మరి ఎందుకు విలపిస్తున్నారు.ఇంత చిన్నవాడు ఇంత వేదాంతం మాట్లాడటం చూచి అక్కడి వారు ఆశ్చర్యపోయారు.వారంతా ఊరట చెందారు. యముడు అందరినీ ఓదార్చి వెళ్ళాడు. సుయజ్ఞ్యుని బంధువులు అతనికి అంత్యక్రియలు చేసారు. మీరు కూడా యుద్ధములో మరణించినవాడి కోసం బాధపడవద్దు. నావాడు ఎవడు, నేను ఎవడు. అలాంటి విచారముతో పని లేదు. ఎవరు ఆత్మ ఎవరు పరమాత్మ ఎవరు శరీరం. కేవలం అజ్ఞ్యానముతోనే నావారు ఇతరులూ అన్న భ్రమతో ఉంటాము. ఆపద సమానమైనా నా వాడు అనుకుంటే దుఃఖం ఎక్కువ వస్తుంది. బాధ అనేది ఆపద వలన కాదు, స్వీయ భావన వలన, మమకారం వలన. కేవలం అజ్ఞ్యానముతోటే ఈ భావం వస్తుంది.

శ్రీనారద ఉవాచ
ఇతి దైత్యపతేర్వాక్యం దితిరాకర్ణ్య సస్నుషా
పుత్రశోకం క్షణాత్త్యక్త్వా తత్త్వే చిత్తమధారయత్

హిరణ్యకశిపుని వాక్యాన్ని విని తల్లీ, హిరణ్యాక్షుని భార్యా శోకం క్షణములో విడిచిపెట్టింది పరమాత్మ తత్వములో చిత్తాన్ని నిలిపి దుఃఖాన్ని విడిచిపెట్టింది