Tuesday, April 16, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ప్రధమాధ్యాయం

                                                          ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం ప్రధమాధ్యాయం


శ్రీరాజోవాచ
సమః ప్రియః సుహృద్బ్రహ్మన్భూతానాం భగవాన్స్వయమ్
ఇన్ద్రస్యార్థే కథం దైత్యానవధీద్విషమో యథా

అన్ని ప్రాణులకూ పరమాత్మ సముడు కదా. ఆయన సముడే కాడు ప్రియుడు, మిత్రుడూ కదా. పక్షపాతం ఉన్న వాడిలాగ ఇంద్రుని కొరకు రాక్షసులను ఎలా చంపాడు

న హ్యస్యార్థః సురగణైః సాక్షాన్నిఃశ్రేయసాత్మనః
నైవాసురేభ్యో విద్వేషో నోద్వేగశ్చాగుణస్య హి

మనం ఒకరి ప్రయోజనాన్ని ఆశించి ఒకరి పక్షాన్ని ఆశిస్తాము. మరి స్వామికి ఏమి స్వార్థం ఉంది. పరమాత్మ అంటేనే జ్ఞ్యాన స్వరూపం, మోక్ష స్వరూపం. ఆయనకు దేవతలకు ఏమి పని. దేవతలతో లాభమూ లేదు రాక్షసులతో పగా లేదూ.  ఆయన గుణములు లేని వాడు. మనం గుణములు పట్టిన వారం. గుణముల ఉద్రేకాన్ని బట్టి మన స్వభావం మారుతుంది మాలాంటి వారికి. ఆయనకు ప్రాకృతిక గుణములతో సంబంధం లేదు.

ఇతి నః సుమహాభాగ నారాయణగుణాన్ప్రతి
సంశయః సుమహాన్జాతస్తద్భవాంశ్ఛేత్తుమర్హతి

పరమాత్మ గుణాలను తెలుసుకోవాలని నాకు సందేహం కలిగింది. అది మీరు నిర్వృత్తి చేయవలసింది.

శ్రీఋషిరువాచ
సాధు పృష్టం మహారాజ హరేశ్చరితమద్భుతమ్
యద్భాగవతమాహాత్మ్యం భగవద్భక్తివర్ధనమ్

అద్భుతమైన పరమాత్మ గురించి బాగా అడిగావు. పరమ భాగవతుల గురించి చెప్పుకుంటే పరమాత్మ యందు భక్తి పెరుగుతుంది. అలాంటి భగవంతుని చరిత్ర అడిగావు.

గీయతే పరమం పుణ్యమృషిభిర్నారదాదిభిః
నత్వా కృష్ణాయ మునయే కథయిష్యే హరేః కథామ్

కృష్ణునికీ వ్యాసునికీ నమస్కారం (కృష్ణాయ మునయే). లేదా కృష్ణాయ మునయే అన్నదానికి వ్యాసునకు నమస్కారం అనే అర్థం వస్తుంది. వ్యాసునికీ కృష్ణ అనే పేరు.

నిర్గుణోऽపి హ్యజోऽవ్యక్తో భగవాన్ప్రకృతేః పరః
స్వమాయాగుణమావిశ్య బాధ్యబాధకతాం గతః

పరమాత్మకు ఎలాంటి ప్రాకృతిక గుణములు లేవు. అందుచేతనే కర్మబంధమైన జన్మలు లేని వాడు పరమాత్మ. కార్య కారణ రూపములో మనకు ప్రత్యక్షముగా కనపడడు. ప్రకృతికంటే విలక్షణుడు.తనకెలాంటి ప్రాకృతిక గుణములూ లేకున్నా, ఆ గుణాలలో తాను చేరి, జీవులకు అంతర్యామిగా చేరతాడు. బాధించబడే వాడూ బాధపడేవాడు బాధపెట్టేవాడూ తానే అయి ఉన్నాడు. ఆయనే బాధకుడు ఆయనే బాధ్యుడు. పుట్టేవారిలో మరణించేవారిలో ఆయనే ఉన్నాడు. ఆయనకు పుట్టుకా చావూ లేవు

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః
న తేషాం యుగపద్రాజన్హ్రాస ఉల్లాస ఏవ వా

సత్వ రజో తమో గుణాలు ప్రకృతివే గానీ ఆత్మవు కావు, ఆత్మకు కావు. ఈ మూడు గుణాలూ ప్రకృతివే. కానీ ఈ మూడు గుణాలు ఎప్పుడూ సమానముగా ఉండవు. వీటిలో హెచ్చుతగ్గులు కావాలి. అన్నీ ఒకే సారి ఎక్కువ గానీ ఒకే సారి తక్కువ గానీ ఉండవు. ఒక సారి సత్వం పెరుగుతుంది, ఒక సారి రజస్సు పెరుగుతుంది, ఒక సారి తమస్సు పెరుగుతుంది. ఒక గుణం పెరిగిందంటే మిగతా రెండు గుణాలూ తగ్గినట్లు అర్థం. గుణములలో ఉండేది ఆయనే కాబట్టి ఒక దానిలో ఆయన అధికముగా ఉండి మిగతావాటిని తగ్గించాడు.

జయకాలే తు సత్త్వస్య దేవర్షీన్రజసోऽసురాన్
తమసో యక్షరక్షాంసి తత్కాలానుగుణోऽభజత్

సత్వ గుణం ఎక్కువ ఉన్నప్పుడు దేవతలూ, రజో గుణం ఎక్కువ ఉన్నప్పుడు రాక్షసులూ, తామస గుణం ఎక్కువ ఉన్నప్పుడు యక్షులూ రాక్షసులూ గెలుస్తారు. పరమాత్మ ఎవరినీ గెలిపించడూ ఓడించడు

జ్యోతిరాదిరివాభాతి సఙ్ఘాతాన్న వివిచ్యతే
విదన్త్యాత్మానమాత్మస్థం మథిత్వా కవయోऽన్తతః

సత్వ గుణ ప్రాచుర్యం ఉన్న సమయములో దేవతల పక్షం ఉంటాడు. తమో గుణం ఎక్కువ ఉన్నప్పుడు రాక్షసులలో ప్రకాశిస్తాడు. పొయ్యిలో కట్టెలు పెడతాము. ఒక్కో కట్టే ఒక్కో ఆకారములో ఉంటుంది. కట్టె ఏ ఆకారముతో ఉంటుందో మంట కూడా అదే ఆకారముతో ఉంటుంది. ఆ గుణము కట్టెదే గానీ మంటది కాదు. కట్టెలో దాగి ఉన్న అగ్ని పైకి కనపడదు. అంతవరకూ కట్టెలో నిప్పు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. అందులోనే ఉంటుంది కానీ దాని కంటే వేరు కాదు. ప్రయత్నిస్తే కనపడుతుంది. అంటే లేని నిప్పు పుట్టిందా, ఉన్న నిప్పే కనపడిందా? కట్టెలో నిప్పు ఎప్పుడూ ఉన్నది. మనం చిలికితే వచ్చింది. అలాగే ఆ రీతిలో జీవాత్మలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను యమ నియమాది ప్రక్రియతో చిలికి తెలుసుకుంటారు.

యదా సిసృక్షుః పుర ఆత్మనః పరో రజః సృజత్యేష పృథక్స్వమాయయా
సత్త్వం విచిత్రాసు రిరంసురీశ్వరః శయిష్యమాణస్తమ ఈరయత్యసౌ

కాబట్టి పరమాత్మ సృష్టి  చేయాలనుకున్నప్పుడు రజస్సులోకీ, సత్వ గుణం అనుకున్నప్పుడు అందులోకీ, తమో గుణం అనుకున్నప్పుడు అందులోకీ ప్రవేశిస్తాడు.ప్రళయములో సృష్టిలో రక్షణలో మూడిటిలో సమానముగా ఒకటి ఉంది. అదే కాలం. పరమాత్మ నడుస్తూ ఉన్న కాలాన్ని సృష్టి స్థితి లయములకు ఆశ్రయం చేసి. ప్రకృతి జీవులతో కాలాన్ని కలుపుతాడు.  ఈ మూడూ కలిసే ప్రపంచం.

కాలం చరన్తం సృజతీశ ఆశ్రయం ప్రధానపుమ్భ్యాం నరదేవ సత్యకృత్
య ఏష రాజన్నపి కాల ఈశితా సత్త్వం సురానీకమివైధయత్యతః
తత్ప్రత్యనీకానసురాన్సురప్రియో రజస్తమస్కాన్ప్రమిణోత్యురుశ్రవాః

గొప్ప కీర్తి గల పరమాత్మ సత్వ గుణం వృద్ధి చేయాలనుకున్నప్పుడు దేవతలను గెలిపిస్తాడు. తమో గుణం వృద్ధి చేయాలనుకున్నప్పుడు రాక్షసులను గెలిపిస్తాడు.

అత్రైవోదాహృతః పూర్వమితిహాసః సురర్షిణా
ప్రీత్యా మహాక్రతౌ రాజన్పృచ్ఛతేऽజాతశత్రవే

పరమాత్మ కాలానుగుణముగా వ్యవహరిస్తాడని చెప్పడానికి ఒక ఇతిహాసం ఉంది. రాజసూయ యాగములో అజాత శత్రువైన ధర్మరాజు ఈ ప్రశ్న నారదున్ని అడిగాడు.

దృష్ట్వా మహాద్భుతం రాజా రాజసూయే మహాక్రతౌ
వాసుదేవే భగవతి సాయుజ్యం చేదిభూభుజః

తత్రాసీనం సురఋషిం రాజా పాణ్డుసుతః క్రతౌ
పప్రచ్ఛ విస్మితమనా మునీనాం శృణ్వతామిదమ్

పరమాత్మ శిశుపాలుని వధించినప్పుడు శిశుపాలుని తేజస్సు ఆయనలో కలవడం చూచి ఆశ్చర్యపడి శిశుపాలునికి వాసుదేవుని సాయుజ్యం ఎలా దొరికింది అని నారద మహర్షిని ఋషులందరూ వింటూ ఉండగా ఆశ్చర్యముతో ఇలా అడిగాడు

శ్రీయుధిష్ఠిర ఉవాచ
అహో అత్యద్భుతం హ్యేతద్దుర్లభైకాన్తినామపి
వాసుదేవే పరే తత్త్వే ప్రాప్తిశ్చైద్యస్య విద్విషః

ఏకాంత భక్తులకు కూడా దొరకని పరమాత్మ సిద్ధిని పరమ శత్రువైన శిశుపాలునికి ఎలా కలిగింది.

ఏతద్వేదితుమిచ్ఛామః సర్వ ఏవ వయం మునే
భగవన్నిన్దయా వేనో ద్విజైస్తమసి పాతితః

వేనుడు పరమాత్మను నిందించడం సహించని ఋషులు అతనికి నరకాన్నిచ్చారు. శిశుపాలుడు చేసిన పని కూడా అదే కదా. ఒకరికి నరకం ఒకరికి మోక్షం ఎలా వచ్చింది.

దమఘోషసుతః పాప ఆరభ్య కలభాషణాత్
సమ్ప్రత్యమర్షీ గోవిన్దే దన్తవక్రశ్చ దుర్మతిః

మాటలు నేర్చుకున్నపటినుంచీ కృష్ణపరమాత్మను తిట్టడమే పనిగా పెట్టుకున్నవాడు. అలాంటి వాడికి మోక్షమెలా వచ్చింది. ఇతని తమ్ముడు కూడా అలాంటి వాడే.

శపతోరసకృద్విష్ణుం యద్బ్రహ్మ పరమవ్యయమ్
శ్విత్రో న జాతో జిహ్వాయాం నాన్ధం వివిశతుస్తమః

ఇంత ఘోరం చేసిన వీరిద్దరూ కృష్ణ పరమాత్మను ఎంతగా నిందించారంటే, ఇంకెవరైనా అలా మాట్లాడితే నాలికకు పుండు కావలసి ఉంది. వీరు నరకానికి ఎందుకు పోలేదు. సామాన్యులకు తెలుసుకోవడానికి వీలు లేని పరమాత్మ యందు, వీరు అందరూ చూస్తుండగానే మోక్షం ఎలా పొందారు. గాలికి కొట్టుకుంటున్న దీపములా నా మనసు కూడా రెపరెప లాడుతోంది. అది మీరు వివరించవలసింది.

కథం తస్మిన్భగవతి దురవగ్రాహ్యధామని
పశ్యతాం సర్వలోకానాం లయమీయతురఞ్జసా

ఏతద్భ్రామ్యతి మే బుద్ధిర్దీపార్చిరివ వాయునా
బ్రూహ్యేతదద్భుతతమం భగవాన్హ్యత్ర కారణమ్

ఈ ఆశ్చర్యానికి కారణం మీరే చెప్పగలరు

శ్రీబాదరాయణిరువాచ
రాజ్ఞస్తద్వచ ఆకర్ణ్య నారదో భగవానృషిః
తుష్టః ప్రాహ తమాభాష్య శృణ్వత్యాస్తత్సదః కథాః

ఈ మాట అడగగానే నారదుడు విశ్రాంతి సమయం కాబట్టి సదస్సులో ఉన్న వారందరూ వినడానికి వీలైనట్లుగా చెప్పారు.

శ్రీనారద ఉవాచ
నిన్దనస్తవసత్కార న్యక్కారార్థం కలేవరమ్
ప్రధానపరయో రాజన్నవివేకేన కల్పితమ్

నీవడిగిన ప్రశ్నే తప్పు. నిందా గౌరవం పూజా ధిక్కారం పరిహాసం సత్కారం ఇవన్నీ ఆత్మకు ఉంటాయా? అలాంటప్పుడు హింసించేది హింసించబడేదీ శరీరమే తప్ప ఆత్మ కాదు.

హింసా తదభిమానేన దణ్డపారుష్యయోర్యథా
వైషమ్యమిహ భూతానాం మమాహమితి పార్థివ

శరీరమే ఆత్మ అన్న అభిమానముతోనే మనం ఇతరులని హింసిస్తాము, శిక్షిస్తామూ, పరుషముగా మాట్లాడతాము.

యన్నిబద్ధోऽభిమానోऽయం తద్వధాత్ప్రాణినాం వధః
తథా న యస్య కైవల్యాదభిమానోऽఖిలాత్మనః
పరస్య దమకర్తుర్హి హింసా కేనాస్య కల్ప్యతే

నాదీ నేనూ అన్నవే కారణాలు శత్రుత్వానికి. ఇది శరీరాన్ని బట్టి వచ్చేదే. ఏ అభిమానముతో ఇవి కలుగుతున్నాయో ఆ అభిమానముతో ఆ శరీరాన్ని చంపేసి ఆ బాధ తొలగిపోయింది అనుకుంటారు . ఇవన్నీ అంత్రయామికి అంటవు. ఇలాంటి వాటితో ఎవరు హింస కలిపిస్తారు? ఎవరు ఆత్మను బాధిస్తారు. అందరూ శరీరాన్ని బాధించేవారే.

తస్మాద్వైరానుబన్ధేన నిర్వైరేణ భయేన వా
స్నేహాత్కామేన వా యుఞ్జ్యాత్కథఞ్చిన్నేక్షతే పృథక్

నీవు ఏ భావముతోనైనా ఉండు, ఏ గుణాలైనా కలిగి ఉండు. కానీ ఉన్నంత కాలం పరమాత్మనే స్మరించు. వైరముతో స్నేహముతో భక్తితో సేవించినా పరమాత్మకు ఆ తేడా ఉండదు . వైరమున్నా స్నేహం ఉన్నా భక్తి ఉన్నా భగవంతుని సేవిస్తే మోక్షం తప్పదు. స్నేహముతో కానీ కోరికతో గానీ సేవించినా మోక్షమే వస్తుంది.

యథా వైరానుబన్ధేన మర్త్యస్తన్మయతామియాత్
న తథా భక్తియోగేన ఇతి మే నిశ్చితా మతిః

పరమాత్మ యందు భక్తి కంటే పరమాత్మ యందు వైరమే తొందరగా ఫలితాన్నిస్తుంది. ఒక తుమ్మెద ఒక పురుగును పట్టుకొని వచ్చి గోడకున్న రంధ్రానికి పెడుతుంది. పెట్టి, తను కాపలా ఉండి నిరంతరం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ పురుగు దాన్నే చూస్తూ దాన్నే ఆలోచిస్తూ కొన్నాళ్ళకు ఆ తుమ్మెదగా మారుతుంది. మనం కూడా ఏ భావనతో పరమాత్మను తలస్తూ చూస్తూ ఉంటే మనకు కూడా ఆ రూపమే వస్తుంది.

కీటః పేశస్కృతా రుద్ధః కుడ్యాయాం తమనుస్మరన్
సంరమ్భభయయోగేన విన్దతే తత్స్వరూపతామ్

ఏవం కృష్ణే భగవతి మాయామనుజ ఈశ్వరే
వైరేణ పూతపాప్మానస్తమాపురనుచిన్తయా

ఈ రీతిలో మాయా మానుష విగ్రహుడైన కృష్ణ పరమాత్మ యందు ద్వేషముతో నిరంతరం తలచి అన్ని పాపాలను పోగొట్టుకుని ఆయననే పొందాడు. ఇందులో వింతేమీ లేదు

కామాద్ద్వేషాద్భయాత్స్నేహాద్యథా భక్త్యేశ్వరే మనః
ఆవేశ్య తదఘం హిత్వా బహవస్తద్గతిం గతాః

కామముతో కానీ కోరికతో భయముతో భక్తితో గానీ ఆయననే తలిస్తే పాపాన్ని పోగొట్టుకుని ఎంతో మంది ఈ భావాలతో పరమాత్మను చేరారు

గోప్యః కామాద్భయాత్కంసో ద్వేషాచ్చైద్యాదయో నృపాః
సమ్బన్ధాద్వృష్ణయః స్నేహాద్యూయం భక్త్యా వయం విభో

గోపికలు కామముతో, కంసుడు భయముతో, శిశుపాల దంతవక్తృఅ జరాసంధాధులు ద్వేషముతో, బంధుత్వముతో యాదవులు, మీరు స్నేహముతో, మేము భక్తితో తరిస్తూ ఉన్నాము.

కతమోऽపి న వేనః స్యాత్పఞ్చానాం పురుషం ప్రతి
తస్మాత్కేనాప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్

ఈ ఐదింటిలో వేనుడు ఎందులోనూ చేరడు. విధానం ఏది అన్నది అప్రధానం. ఏ భావముతో నీవు కృష్ణున్ని తలచినా నీకు మోక్షమే వస్తుంది.  కానీ మనసు సమగ్రముగా అక్కడే ఉండాలి.

మాతృష్వస్రేయో వశ్చైద్యో దన్తవక్రశ్చ పాణ్డవ
పార్షదప్రవరౌ విష్ణోర్విప్రశాపాత్పదచ్యుతౌ

ఇంత అడుగుతున్నావు. శిశుపాల దంత వక్తృలు కూడా కృష్ణునికి బంధువులే. నీవు బావ అన్న భావముతో పూజిస్తే వారు శత్రువు అన్న భావముతో పూజిస్తున్నారు. మీకంటే వారికి పరమాత్మతో దగ్గర సంబంధం ఉంది. శాపముతో వారు ఇక్కడకు వచ్చారు. వారు స్వామి ద్వారపాలకులు.

శ్రీయుధిష్ఠిర ఉవాచ
కీదృశః కస్య వా శాపో హరిదాసాభిమర్శనః
అశ్రద్ధేయ ఇవాభాతి హరేరేకాన్తినాం భవః

పరమాత్మ భక్తులకు కూడా శాపం తగులుతుందా. ఎంత బ్రాహ్మణులైనా పరమాత్మ ద్వారపాలకులను శపించగలరా. అంత గొప్ప వారు శాపం ఎలా పెట్టారు. ఇది నమ్మదగ్గట్టుగా లేదు. పరమాత్మ ఏకాంత సేవకులు.

దేహేన్ద్రియాసుహీనానాం వైకుణ్ఠపురవాసినామ్
దేహసమ్బన్ధసమ్బద్ధమేతదాఖ్యాతుమర్హసి

వైకుంఠములో ఉండే వారికి ప్రకృతి సంబంధమైన శారీర ఇంద్రియ ప్రాణములు ఉండవు కదా? శరీరము ఉన్న వారితో సంబంధముతో సంబంధం ఎలా ఏర్పడింది. మాకు ఈ రహస్యాన్ని వివరించవలసింది

శ్రీనారద ఉవాచ
ఏకదా బ్రహ్మణః పుత్రా విష్ణులోకం యదృచ్ఛయా
సనన్దనాదయో జగ్ముశ్చరన్తో భువనత్రయమ్

సనక సనందన సనత్కుమార సనత్సుజాలు లోకాలన్నీ తిరుగుతూ పరమాత్మను సేవించాలని వైకుంఠానికి వెళ్ళారు. వారి వయసు చూస్తే ఐదారేళ్ళ పిల్లల్లా ఉన్నారు కానీ మొదలు పుట్టినవారందరి కంటే మొదలు పుట్టినవారు.

పఞ్చషడ్ఢాయనార్భాభాః పూర్వేషామపి పూర్వజాః
దిగ్వాససః శిశూన్మత్వా ద్వాఃస్థౌ తాన్ప్రత్యషేధతామ్

దిగంబరముగా ఉన్నారు. అప్పుడు అక్కడున్న ద్వారపాలకులు అడ్డగించారు. పరమాత్మ పాద సన్నిధిలో ఉన్న వారికి రజస్సు తమస్సు ఉన్నయని ఇలాంటి చోట మీరు ఉండటానికి వీలు లేదు. ఏ గుణముతో మీరు ఆపారో ఆ గుణముగల రాక్షసుల యందు మీరు జన్మించండి

అశపన్కుపితా ఏవం యువాం వాసం న చార్హథః
రజస్తమోభ్యాం రహితే పాదమూలే మధుద్విషః
పాపిష్ఠామాసురీం యోనిం బాలిశౌ యాతమాశ్వతః

ఏవం శప్తౌ స్వభవనాత్పతన్తౌ తౌ కృపాలుభిః
ప్రోక్తౌ పునర్జన్మభిర్వాం త్రిభిర్లోకాయ కల్పతామ్

మహాత్ముల శాపం వలన భూలోకములోకి పడిపోతున్నవారి మీద జాలి కలిగి మూడు జన్మలలోనే పరమాత్మను చేరతారు అని  చెప్పారు

జజ్ఞాతే తౌ దితేః పుత్రౌ దైత్యదానవవన్దితౌ
హిరణ్యకశిపుర్జ్యేష్ఠో హిరణ్యాక్షోऽనుజస్తతః

హతో హిరణ్యకశిపుర్హరిణా సింహరూపిణా
హిరణ్యాక్షో ధరోద్ధారే బిభ్రతా శౌకరం వపుః

మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. నరసింహరూపములో హిరణ్యకశిపున్నీ వరాహ రూపములో హిరణ్యాక్షున్నీ సంహరించాడు

హిరణ్యకశిపుః పుత్రం ప్రహ్లాదం కేశవప్రియమ్
జిఘాంసురకరోన్నానా యాతనా మృత్యుహేతవే

పరమభాగవతుడైన తన పుత్రుడైన హిరణ్యకశిపున్ని స్వామి చంపాడు. ప్రహ్లాదున్ని చంపాలని ఎంత ప్రయత్నించినా పరమాత్మ తేజస్సు కలవాడు, ప్రశాంతాత్ముడూ, పరమ భాగవతుడు అయిన ప్రహ్లాదున్ని ఏమీ చేయలేకపోయాయి

తం సర్వభూతాత్మభూతం ప్రశాన్తం సమదర్శనమ్
భగవత్తేజసా స్పృష్టం నాశక్నోద్ధన్తుముద్యమైః

తతస్తౌ రాక్షసౌ జాతౌ కేశిన్యాం విశ్రవఃసుతౌ
రావణః కుమ్భకర్ణశ్చ సర్వలోకోపతాపనౌ

ఇలా పరమాంత చే సంహరించబడిన వారు కేశినీ విశ్వా వసునకు రావణ కుంభకర్ణులుగా అవతరించారు. రామునిగా పరమాత్మ అవతరించి వారిని వధించాడు. మార్కండేయ మహర్షి వలన నీవు త్వరలో ఆ చరిత్ర వింటావు. ఆ రావణ కుంభర్కర్ణులే శిశుపాల దంతవక్తౄలుగా పుట్టారు.
తీవ్ర వైరముతో పరమాత్మను ధ్యానించి ఆయన సన్నిధికి వారు చేరారు

తత్రాపి రాఘవో భూత్వా న్యహనచ్ఛాపముక్తయే
రామవీర్యం శ్రోష్యసి త్వం మార్కణ్డేయముఖాత్ప్రభో

తావత్ర క్షత్రియౌ జాతౌ మాతృష్వస్రాత్మజౌ తవ
అధునా శాపనిర్ముక్తౌ కృష్ణచక్రహతాంహసౌ

వైరానుబన్ధతీవ్రేణ ధ్యానేనాచ్యుతసాత్మతామ్
నీతౌ పునర్హరేః పార్శ్వం జగ్మతుర్విష్ణుపార్షదౌ

శ్రీయుధిష్ఠిర ఉవాచ
విద్వేషో దయితే పుత్రే కథమాసీన్మహాత్మని
బ్రూహి మే భగవన్యేన ప్రహ్లాదస్యాచ్యుతాత్మతా

లోకములో కొడుకంటే అందరికీ ప్రీతి ఉంటుంది కదా. ఈంత పరమ ప్రీతి పాత్రుడైన పుత్రుడు, మహాత్ముడూ, పరమాత్మ యందు ప్రీతి కలిగిన ప్రహ్లాదుని యందు ద్వేషమెందుకు వచ్చింది

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

                                                   ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం

శ్రీరాజోవాచ
వ్రతం పుంసవనం బ్రహ్మన్భవతా యదుదీరితమ్
తస్య వేదితుమిచ్ఛామి యేన విష్ణుః ప్రసీదతి

దితి పుంసవన వ్రతమాచరించిందీ అన్నారు. ఆ విషయం నాకు చెప్పండి. అది ఆచరిస్తే పరమాత్మ సంతోషిస్తాడని చెప్పరు.

శ్రీశుక ఉవాచ
శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తురనుజ్ఞయా
ఆరభేత వ్రతమిదం సార్వకామికమాదితః

మార్గ శీర్ష శుక్ల పాడ్యమి నాడు భర్త అనుమతి పొంది అన్ని కోరికలూ ప్రసాదించే వ్రతం ప్రారంభించాలి.

నిశమ్య మరుతాం జన్మ బ్రాహ్మణాననుమన్త్ర్య చ
స్నాత్వా శుక్లదతీ శుక్లే వసీతాలఙ్కృతామ్బరే
పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్భగవన్తం శ్రియా సహ

మరుత్తుల ఉత్పత్తి కథను వినాలు. బ్రాహ్మణులను పూజించాలి.

అలం తే నిరపేక్షాయ పూర్ణకామ నమోऽస్తు తే
మహావిభూతిపతయే నమః సకలసిద్ధయే

యథా త్వం కృపయా భూత్యా తేజసా మహిమౌజసా
జుష్ట ఈశ గుణైః సర్వైస్తతోऽసి భగవాన్ప్రభుః

విష్ణుపత్ని మహామాయే మహాపురుషలక్షణే
ప్రీయేథా మే మహాభాగే లోకమాతర్నమోऽస్తు తే

తెల్లని పలు వరస కలిగి స్నానం చేయాలి (పళ్ళు తోముకుని స్నానం చేయాలి)
వస్త్రాలూ దంతములూ తెల్లగా ఉండాలి. చక్కగా అలంకరించుకోవాలి. అమ్మవారితో ఉన్న పరమాత్మను పొద్దున్నే ఏమీ చేయకుండా
పూర్ణ కాముడూ నిరపేక్షుడు మహావిభూతి పతి అయిన స్వామికి నమస్కరించాలి. జ్ఞ్యాన శక్త్యాది గుణములు కలిగి నీవెలా ఉన్నావో అందుకే నీవు మాకు ప్రభువు.
విష్ణు పత్నీ మహా మాయా లోక మాతా నాకు ప్రసన్నమవ్వాలి. అని అమ్మను పూజించి.


ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ
మహావిభూతిభిర్బలిముపహరామీతి అనేనాహరహర్మన్త్రేణ
విష్ణోరావాహనార్ఘ్యపాద్యోపస్పర్శనస్నానవాసౌపవీతవిభూషణగన్ధపుష్పధూపదీపోపహారాద్యుపచారాన్సుస్
అమాహితోపాహరేత్

హవిఃశేషం చ జుహుయాదనలే ద్వాదశాహుతీః
ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి

ఈ మంత్రముతో మూడు పూటలా షోడశోపచారాలు సమర్పించి సావధానముతో స్వామిని అర్చించాలి. హవిస్సును అగ్ని హోత్రములో ద్వాదశాహుతులు ఇవ్వాలి ఈ మంత్రముతో.

శ్రియం విష్ణుం చ వరదావాశిషాం ప్రభవావుభౌ
భక్త్యా సమ్పూజయేన్నిత్యం యదీచ్ఛేత్సర్వసమ్పదః

అన్ని సంపదలూ కావాలంటే అమ్మవారితో కలిసి ఉన్న స్వామిని ఆరాధించి భక్తితో నిండిన మనసుతో దండ ప్రణామం గావించి పది సార్లు ఈ మంత్రాన్ని జపించి పరమాత్మ యొక్క స్తోత్రాన్ని పఠించాలి.
"మీరిద్దరూ సకల జగత్తుకూ ప్రభువులూ కారణము. అమ్మవారి ప్రకృతీ, మాయా శక్తి, ఎవ్వరికీ అందేది కాదు, అర్థమయ్యేది కాదు. అలాంటి శక్తికి నీవే పురుషుడవు. అన్ని యజ్ఞ్యములూ పూజలూ క్రియలూ క్రియా ఫలములూ నీవే. దేవి గుణాలను ఆవిష్కరిస్తుంది. నీవా గుణాలను అనుభవిస్తావు.

ప్రణమేద్దణ్డవద్భూమౌ భక్తిప్రహ్వేణ చేతసా
దశవారం జపేన్మన్త్రం తతః స్తోత్రముదీరయేత్

యువాం తు విశ్వస్య విభూ జగతః కారణం పరమ్
ఇయం హి ప్రకృతిః సూక్ష్మా మాయాశక్తిర్దురత్యయా

తస్యా అధీశ్వరః సాక్షాత్త్వమేవ పురుషః పరః
త్వం సర్వయజ్ఞ ఇజ్యేయం క్రియేయం ఫలభుగ్భవాన్

గుణవ్యక్తిరియం దేవీ వ్యఞ్జకో గుణభుగ్భవాన్
త్వం హి సర్వశరీర్యాత్మా శ్రీః శరీరేన్ద్రియాశయాః
నామరూపే భగవతీ ప్రత్యయస్త్వమపాశ్రయః

నీవు అందరి ఆత్మవూ. అమ్మవారు అందరి శరీరమూ ఇంద్రియమూ. మీరే, ఒకరు నామం, ఒకరు రూపం. నీవే నమ్మకం సిద్ధీ. ఎలాగైతే మీరు మూడు లోకాలకూ అధిపతులై అందరికీ వరాలిస్తారో నా ఈ చిన్న కోరికను ప్రసాదించండి.

యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ
తథా మ ఉత్తమశ్లోక సన్తు సత్యా మహాశిషః

ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రియా సహ
తన్నిఃసార్యోపహరణం దత్త్వాచమనమర్చయేత్

తతః స్తువీత స్తోత్రేణ భక్తిప్రహ్వేణ చేతసా
యజ్ఞోచ్ఛిష్టమవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిమ్

పతిం చ పరయా భక్త్యా మహాపురుషచేతసా
ప్రియైస్తైస్తైరుపనమేత్ప్రేమశీలః స్వయం పతిః
బిభృయాత్సర్వకర్మాణి పత్న్యా ఉచ్చావచాని చ

ఈ రీతిలో పరమాత్మను అమ్మవారితో కలిపి స్తోత్రం చేసి పూజా ద్రవ్యాలు సమర్పించి స్వామిని ఆరాధించి, మళ్ళీ స్తోత్రం చేసి, యజ్ఞ్య ఉచ్చిష్టాన్ని వాసన మాత్రమే చూచి, మళ్ళీ మూడవ సారి స్వామిని అర్చించాలి. అదే భక్తితో భర్తను కూడా సేవించాలి. భర్త కూడా ప్రేమను కలిగి ఆమెను ఆదరించాలి. వ్రతం చేస్తున్న సమయములో భర్తకూడా భార్య చేసే పనులని పంచుకోవాలి

కృతమేకతరేణాపి దమ్పత్యోరుభయోరపి
పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిరేతత్సమాహితః


ఇలా ఒకరినొకరు సేవించుకోవాలి. ఇలాంటి వ్రతం చేయడానికి భార్య అసమర్ధురాలైతే ఆమెకు బదులుగా భర్త కూడా ఈ వ్రతన్ని చేయవచ్చు. మొదటి నియమం ఏమిటంటే, ఒక్కసారి వ్రతాన్ని స్వీకరించిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో వ్రత విఘ్నం కలగరాదు. బ్రాహ్మణులనూ ముత్తైదువులనూ పుష్పములతో పూజా ద్రవ్యాలతో భక్తితో ఆరాధించి పరమాత్మని కూడా ఆరాధించాలి. పూజ అయిన తరువాత భర్త ఆజ్ఞ్య పరమాత్మ ఆజ్ఞ్య తీసుకుని ప్రసాదాన్ని తీసుకోవాలి. మార్గశిరం నుంచీ మళ్ళీ మార్గశిరం దాకా ఆచరించి కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారు ఝామును స్నానం చేసి ఆచమనం చేసి
కృష్ణున్ని పూజించి  క్షీరాన్నముతో హోమం చేయాలి నెయ్యితో హోమం చేయాలి. పన్నెండు ఆహుతులూ ఇవ్వాలి. భర్తకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని బ్రాహ్మణులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని వారి అనుమతితో భోజనం చేయాలి. ఎంత మంది బ్రాహ్మణులు వచ్చినా అగ్రపీఠం ఆచార్యులకు వేసి తన (మరియూ బంధువుల) వాక్కుని  నియమించుకోవాలి

విష్ణోర్వ్రతమిదం బిభ్రన్న విహన్యాత్కథఞ్చన
విప్రాన్స్త్రియో వీరవతీః స్రగ్గన్ధబలిమణ్డనైః
అర్చేదహరహర్భక్త్యా దేవం నియమమాస్థితా

ఉద్వాస్య దేవం స్వే ధామ్ని తన్నివేదితమగ్రతః
అద్యాదాత్మవిశుద్ధ్యర్థం సర్వకామసమృద్ధయే

ఏతేన పూజావిధినా మాసాన్ద్వాదశ హాయనమ్
నీత్వాథోపరమేత్సాధ్వీ కార్తికే చరమేऽహని

శ్వోభూతేऽప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్
పయఃశృతేన జుహుయాచ్చరుణా సహ సర్పిషా
పాకయజ్ఞవిధానేన ద్వాదశైవాహుతీః పతిః

ఆశిషః శిరసాదాయ ద్విజైః ప్రీతైః సమీరితాః
ప్రణమ్య శిరసా భక్త్యా భుఞ్జీత తదనుజ్ఞయా

ఆచార్యమగ్రతః కృత్వా వాగ్యతః సహ బన్ధుభిః
దద్యాత్పత్న్యై చరోః శేషం సుప్రజాస్త్వం సుసౌభగమ్

అప్పుడు భర్త భార్యకు ఉత్తమ పుత్రుడు కలుగుతాడు అని ఆశీర్వదించాలి.

ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోరభీప్సితార్థం లభతే పుమానిహ
స్త్రీ చైతదాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహమ్

కన్యా చ విన్దేత సమగ్రలక్షణం పతిం త్వవీరా హతకిల్బిషాం గతిమ్
మృతప్రజా జీవసుతా ధనేశ్వరీ సుదుర్భగా సుభగా రూపమగ్ర్యమ్

విన్దేద్విరూపా విరుజా విముచ్యతే య ఆమయావీన్ద్రియకల్యదేహమ్
ఏతత్పఠన్నభ్యుదయే చ కర్మణ్యనన్తతృప్తిః పితృదేవతానామ్

యధావిధిగా దీన్ని ఆచరించి మానవుడు తాను కోరిన దాన్ని పొందుతాడు. పురుషుడు చేస్తే ఉత్తమ సంతానన్నీ భార్య ప్రీతినీ పొందుతారు.  భార్య చేస్తే నిత్య సౌభాగ్యం సౌమంగళ్యం ఉత్తమ సంతానం పొందుతుంది. పెళ్ళి కాని అమ్మాయి చేస్తే తాను కోరుకున్న ఉత్తమ భర్తను పొందుతుంది. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుంది. పాపం బాగా చేసిన వారు చేస్తే పాపం పోతుంది. మృత సంతాన బాధ కలవారు చేస్తే ఆ బాధ తొలగి ఉత్తమ సంతానం కలుగుతుంది. కురూపి కురూపాన్ని పోగొట్టుకుంటుంది.

తుష్టాః ప్రయచ్ఛన్తి సమస్తకామాన్హోమావసానే హుతభుక్శ్రీహరిశ్చ
రాజన్మహన్మరుతాం జన్మ పుణ్యం దితేర్వ్రతం చాభిహితం మహత్తే

రోజం ఉన్నవారు రోగం నుంచీ, చెరసాలలో ఉన్నవారు చెరసాల నుంచీ విడుదల అవుతారు. దీన్ని చేస్తే పాపాత్ములు పాపం పోగొట్టుకుంటారు. వ్రతం చేయలేని వారు ఈ అధ్యాయాన్ని సంవత్సర కాలం చేస్తే పితృ దేవతలు సంతోషించి అన్ని కోరికలూ తీరుస్తారు
హోమం పూర్తి అయ్యాక అగ్నిహోత్రుడూ స్వామీ అమ్మవారూ సంతోషించి అన్ని కోరికలూ తీరుస్తారు.
ఈ పుంసవన వ్రతం దితి వ్రతం మరుత్తుల జన్మా చెప్పాను. ఇది చదివిన వారు అన్ని కోరికలనూ తీర్చుకుంటారు.
దానితో బాటు లక్ష్మీ నారాయణుల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు.

                                                సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

Sunday, April 14, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
పృశ్నిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్
అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్

పన్నెండు మంది ఆదిత్యులలో ఒకరు త్వష్ట, తరువాత సవిత
సవిత భార్య ఐన పృశ్ని మహామఖులైన వీరందరినీ సంతానముగా పొందింది (సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్ అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం)

సిద్ధిర్భగస్య భార్యాఙ్గ మహిమానం విభుం ప్రభుమ్
ఆశిషం చ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతామ్

పన్నెండు మంది ఆదిత్యులలో భగుడు కూడా ఒకరు. అతని భార్య సిద్ధి. ఒక కన్యనూ ముగ్గురు కుమారులనూ కన్నారు

ధాతుః కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా
సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసమనుక్రమాత్

ధాతకు కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసం సంతానముగా కలిగారు

అగ్నీన్పురీష్యానాధత్త క్రియాయాం సమనన్తరః
చర్షణీ వరుణస్యాసీద్యస్యాం జాతో భృగుః పునః

అగ్నిక్రియలో వీరందరినీ సంతానముగా పొందారు. వరుణుని భార్య చర్షణి. వారికి బృగు మహర్షి మరలా పుత్రునిగా పుట్టారు.

వాల్మీకిశ్చ మహాయోగీ వల్మీకాదభవత్కిల
అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోరృషీ

వాల్మీకి కూడా వరుణునికీ చర్షణికీ పుట్టారు. అందుకే వాల్మికీ కూడా ప్రాచేతసుడు (వరుణ). రెండవ సారి ఈయన పుట్ట నుండి పుట్టాడు. నాలుగు మహాయుగాలు జపం చేసాడు. అంతలో ఆయన మీద పెద్ద పుట్ట మొలచింది. పుట్ట (వల్మీకం) నుంచి లేచాడు కాబట్టి ఈయన వాల్మీకి. అగస్త్య వసిష్ఠ మహర్షి మిత్రా వరుణులు (ఆదిత్యులు) ఊర్వశి నాట్యం చేస్తుండగా వ్యామోహించి కుండలో తమ వీర్యాన్ని నిక్షిప్తం చేసారు. అగస్త్యుడు మిత్రా వరుణుల కుమారుడు, తల్లి ఊర్వశి. (ఎవరిని భావించి రేతస్సును వదిలిపెడతామో వారే తల్లి అవుతారు. కంసుడు ఉగ్రసేనుడి కుమారుడే గానీ, ఉగ్రసేనుడు పరమభక్తుడైనప్పుడు కంసుడు అలా ఎందుకయ్యాడు. ఉగ్రసేనుని భార్య ఋతుమతియై ఒక సాయంకాలం వేళ విహరిస్తూ ఉండగా తన భర్తను స్మరించింది ఒక ఉద్యానవనములో. ఎప్పటినుండో ఆమె సౌందర్యాన్ని ఆశించిన ఒక గంధర్వుడు భర్త రూపాన్ని తీసుకుని అసురాంశతో వచ్చాడు. వారి సమాగమం వలన కంసుడు పుట్టాడు. కానీ కంసుడు అసుర గంధర్వ వీర్యం వలన వచ్చాడు. క్షేత్ర బీజ సంకల్ప ప్రభావం వలననే పిల్లలు పుడతారు. అందుకే ఏ వైపు చూసిన పరమాత్మ చిత్రపటాలు ఉండేట్లు ఉంచుతారు శయ్యామందిరములో. కారణమూ స్మరణమూ దేహమూ.) మిత్రావరుణులు ఊర్వశి సౌందర్యం చూసి అగస్త్య వసిష్ఠుల జననం కోసం కుంభములో రేతస్సు ఉంచారు.
మిత్రుడు రేవతి యందు ముగ్గురు కుమారులను పొందాడు.

రేతః సిషిచతుః కుమ్భే ఉర్వశ్యాః సన్నిధౌ ద్రుతమ్
రేవత్యాం మిత్ర ఉత్సర్గమరిష్టం పిప్పలం వ్యధాత్

పౌలోమ్యామిన్ద్ర ఆధత్త త్రీన్పుత్రానితి నః శ్రుతమ్
జయన్తమృషభం తాత తృతీయం మీఢుషం ప్రభుః

ఇంద్రుడు పౌలోమి యందు ముగ్గురు కుమారులను పొందాడు

ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః
కీర్తౌ పత్న్యాం బృహచ్ఛ్లోకస్తస్యాసన్సౌభగాదయః

త్రివిక్రముడి భార్య కీర్తి, వీరికి బృహశ్లోకుడూ, అతనికి సౌభగుడూ కలిగారు

తత్కర్మగుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః
పశ్చాద్వక్ష్యామహేऽదిత్యాం యథైవావతతార హ

కాశ్యపస ప్రభావాన్ని తరువాత చెబుతాను

అథ కశ్యపదాయాదాన్దైతేయాన్కీర్తయామి తే
యత్ర భాగవతః శ్రీమాన్ప్రహ్రాదో బలిరేవ చ

కశ్యపుడికీ అధితికీ వామనుడిగా స్వామి ఎలా అవతరించాడో ఆ ఉపాఖ్యానం తరువాత చెబుతాను. ఇంతవరకూ దేవతల గురించి చెప్పాను.. ఇక దితి పుత్రుల గురించి విను. ఆ వంశములో ప్రహ్లాదుడూ బలి చక్రవతీ పుట్టారు.

దితేర్ద్వావేవ దాయాదౌ దైత్యదానవవన్దితౌ
హిరణ్యకశిపుర్నామ హిరణ్యాక్షశ్చ కీర్తితౌ

దైత్య దానవుల చేత కీర్తించబడే దితి పుత్రులు ఇద్దరు ఉన్నారు. హిరణ్యకశిపుడూ హిరణ్యాక్షుడు.

హిరణ్యకశిపోర్భార్యా కయాధుర్నామ దానవీ
జమ్భస్య తనయా సా తు సుషువే చతురః సుతాన్

కయాత అనే హిరణ్యకశిపుని భార్య, వీరికి నలుగురు పుత్రులు సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ

సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ చ
తత్స్వసా సింహికా నామ రాహుం విప్రచితోऽగ్రహీత్

సింహిక అన్న పుత్రిక కలదు. రాహువు సింహికను వివాహం చేసుకున్నాడు. ఇతన్ని శ్రీమహావిష్ణువు చక్రముతో సంహరించాడు.

శిరోऽహరద్యస్య హరిశ్చక్రేణ పిబతోऽమృతమ్
సంహ్రాదస్య కృతిర్భార్యా సూత పఞ్చజనం తతః

సంహ్రాదునికి కృతి భార్య , వీరికి పంచజనుడనే కొడుకు

హ్రాదస్య ధమనిర్భార్యా సూత వాతాపిమిల్వలమ్
యోऽగస్త్యాయ త్వతిథయే పేచే వాతాపిమిల్వలః

హ్రాదునికి ధమని యందు వాతాపీ ఇల్వలుడు పుట్టారు. వీరు అగస్త్యుని చేత సంహరించబడ్డారు

అనుహ్రాదస్య సూర్యాయాం బాష్కలో మహిషస్తథా
విరోచనస్తు ప్రాహ్రాదిర్దేవ్యాం తస్యాభవద్బలిః

ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. అతని కుమారుడు బలి చక్రవర్తి. అతనికి బాణుడు పెద్ద కుమారుడు

బాణజ్యేష్ఠం పుత్రశతమశనాయాం తతోऽభవత్
తస్యానుభావం సుశ్లోక్యం పశ్చాదేవాభిధాస్యతే

ఆ బలి చక్రవర్తి ప్రహ్లాదుల ప్రభావం తరువాత వివరిస్తాను

బాణ ఆరాధ్య గిరిశం లేభే తద్గణముఖ్యతామ్
యత్పార్శ్వే భగవానాస్తే హ్యద్యాపి పురపాలకః

బాణాసురుడు శంకరున్ని పూజించి శంకరుని ప్రమధ గణాలలో ఒకడయ్యాడు. ఇప్పటికీ ద్వారపాలకుడిగా ఉన్నాడు

మరుతశ్చ దితేః పుత్రాశ్చత్వారింశన్నవాధికాః
త ఆసన్నప్రజాః సర్వే నీతా ఇన్ద్రేణ సాత్మతామ్

దితికి నలభై తొమ్మిది మంది మరుత్ గణములు పుట్టారు. శ్రాద్ధ, పితృ తర్పణ గ్రహణ సంక్రమణ కాలములో వీరి జననం వినాలి. పుట్టబోయే ముందు ఇంద్రుడు వారిని తన భృత్యులుగా చేసుకున్నాడు. కశ్యప ప్రజాపతికీ దితికీ పుట్టిన వారు మరుత్తులు. ఇది విన్న వారికి వంశ వృద్ధి అవుతుంది.

శ్రీరాజోవాచ
కథం త ఆసురం భావమపోహ్యౌత్పత్తికం గురో
ఇన్ద్రేణ ప్రాపితాః సాత్మ్యం కిం తత్సాధు కృతం హి తైః

దితి పుత్రులు ఆసురత్వాన్ని వదిలిపెట్టి దైవత్వాన్ని ఎలా పొందారు. ఈ విషయాన్ని నాతో బాటు కథ వింటోన్న ఋషులకు కూడా వినాలని ఉంది.

ఇమే శ్రద్దధతే బ్రహ్మన్నృషయో హి మయా సహ
పరిజ్ఞానాయ భగవంస్తన్నో వ్యాఖ్యాతుమర్హసి

శ్రీసూత ఉవాచ
తద్విష్ణురాతస్య స బాదరాయణిర్వచో నిశమ్యాదృతమల్పమర్థవత్
సభాజయన్సన్నిభృతేన చేతసా జగాద సత్రాయణ సర్వదర్శనః

విష్ణు రాతుడు ఆర్థ్రతతో అడిగినందుకు సంతోషించి అన్నీ తెలుసుకున్నవాడైన శుకుడు పరీక్షిత్తుకు వివరించాడు.

శ్రీశుక ఉవాచ
హతపుత్రా దితిః శక్ర పార్ష్ణిగ్రాహేణ విష్ణునా
మన్యునా శోకదీప్తేన జ్వలన్తీ పర్యచిన్తయత్

దేవ దానవ యుద్ధములో ఇంద్రుడు రాక్షసులని సంహరించాడు. ఇంద్రునికి శ్రీ హరి రక్షకునిగా ఉన్నాడు

కదా ను భ్రాతృహన్తారమిన్ద్రియారామముల్బణమ్
అక్లిన్నహృదయం పాపం ఘాతయిత్వా శయే సుఖమ్

తన సంతానాన్ని విష్ణువు చంపడం చూసి ఆ దుఃఖం తట్టుకోలేక, నా పిల్లలు ఇలా అయ్యినందుకు నా సవతి అయిన అదితి పిల్లలు ఇలా ఎప్పుడవుతారు అని అమర్షముతో ఉంది. నాకొక కుమారుడు కలిగి వాడు ఇంద్రున్ని చంపితే ఆ వార్త నేను విని ప్రశాంతముగా ఎప్పుడు నిద్రపోతానో.

కృమివిడ్భస్మసంజ్ఞాసీద్యస్యేశాభిహితస్య చ
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

ఈ భావాన్ని చెప్పవలసి వచ్చినందుకు వ్యాసుడూ  శుకుడూ బాధపడుతున్నారు.  అందరూ బాధపడుతున్నదీ బాధపెడుతున్నదీ ఈ శరీరాన్నే. తాను ఏ శరీరాన్ని కాపాడుకోవాలని చూస్తున్నాడో అలాంటి ఇంకొకరి శరీరాన్ని బాధపెట్టాలని చూస్తున్నారు. చనిపోయిన తరువాత ఏమవుతుంది. దహనం చేస్తే బూడిదవుతాడు. లేకపోతే ఏ కుక్కలో గద్దలో పీక్కొని తింటాయి. తిన్న తరువాత మలం వదిలిపెడతాయి.  కాలిస్తే బూడిదవుతుంది, విడిచిపెడితే మలమవుతుంది. కొంతభాగం పురుగవుతుంది, మలమవుతుంది, లేక బూడిదవుతుంది. అలాంటి ఈ శరీరం కోసం ఇలాంటి ఇంకో శరీరాన్ని వేధిస్తున్నారు.
ఈ పాపాన్ని వారు నరకములో అనుభవిస్తారు. పెళ్ళి ఒక నరకం, పిల్లలు ఒక నరకం, పిల్లలకు యవ్వనం రావడం ఒక నరకం. తమకు వృద్ధాప్యం రావడం ఒక నరకం. ఐదవ నరకం రోగం. ఆరు నుంచీ తొమ్మిది వరకూ నరకలోకములో అనుభవిస్తాము. ఇలా నవ విధ నరకములలో బాధపడుతూ ఉంటారు. నిజముగా శత్రువుకు బాధకలిగించాలనుకుంటే వారితో మాట్లాడకు, శత్రువు మీద పగ తీర్చుకోవడమంటే వారితో బాధించబడు. ఈ విషయం తెలుసుకోరు. దీని వలన నరకం వస్తుంది

ఆశాసానస్య తస్యేదం ధ్రువమున్నద్ధచేతసః
మదశోషక ఇన్ద్రస్య భూయాద్యేన సుతో హి మే

ఇలా జ్ఞ్యాతులూ శత్రువులూ ఎవ్వరూ మిగలకుండా అందరూ పోవాలి అని బాధిస్తున్న ఇంద్రుని మదం ఎలా అణచాలి అని ఆలోచిస్తూ ఉన్నది

ఇతి భావేన సా భర్తురాచచారాసకృత్ప్రియమ్
శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ

ఇంద్రునికి హాని కలిగించాలి. ఇంద్రుని సేననూ సంహరించాలి. ఒక తేజస్వి ఐన కుమారుడు కావాలి. అందుకోసం భర్త దగ్గరకు వెళ్ళి, చాలా కాలం ఉండి అడిగినవీ అడగనివీ ఎన్నో సేవలు చేసింది

భక్త్యా పరమయా రాజన్మనోజ్ఞైర్వల్గుభాషితైః
మనో జగ్రాహ భావజ్ఞా సస్మితాపాఙ్గవీక్షణైః

అలా చాలా సార్లు ప్రీతి కలిగించింది. ప్రేమతో వినయముతో ఇంద్రియ నిగ్రహముతో పరమభక్తితో, మనసుకు నచ్చే మాటలతో క్రీగంటి చూపులతో, కొన్ని భావములతో అతని మనసుని స్వీకరించింది

ఏవం స్త్రియా జడీభూతో విద్వానపి మనోజ్ఞయా
బాఢమిత్యాహ వివశో న తచ్చిత్రం హి యోషితి

కశ్యపుడు జ్ఞ్యానే అయినా నేర్పు గలిగిన స్త్రీ చేత ఓడించబడ్డాడు

విలోక్యైకాన్తభూతాని భూతాన్యాదౌ ప్రజాపతిః
స్త్రియం చక్రే స్వదేహార్ధం యయా పుంసాం మతిర్హృతా

బ్రహ్మ తన శరీరములో సగ భాగాన్ని స్త్రీగా సృష్టించాడు పురుషుల బుద్ధి హరించడానికి

ఏవం శుశ్రూషితస్తాత భగవాన్కశ్యపః స్త్రియా
ప్రహస్య పరమప్రీతో దితిమాహాభినన్ద్య చ

ఇలా చాలా కాలం సేవించిన దితిని చూచి కశ్యపుడు

శ్రీకశ్యప ఉవాచ
వరం వరయ వామోరు ప్రీతస్తేऽహమనిన్దితే
స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః

ఇంతకాలం నీవు చేసిన సేవకు నేను మెచ్చాను, ఎమైనా వరం కోరుకో. భర్త సంతోషించిన తరువాత స్త్రీ పొందలేనిది ఏమైనా ఉంటుందా

పతిరేవ హి నారీణాం దైవతం పరమం స్మృతమ్
మానసః సర్వభూతానాం వాసుదేవః శ్రియః పతిః

పరమాత్మే భరత రూపములో అవతరిస్తాడు.

స ఏవ దేవతాలిఙ్గైర్నామరూపవికల్పితైః
ఇజ్యతే భగవాన్పుమ్భిః స్త్రీభిశ్చ పతిరూపధృక్

పరమాత్మ నామ రూప చిహ్నములతో కావలసిన అన్ని కోరికలూ తీర్చేవాడు భర్త. పురుషులూ స్త్రీలూ శ్రీమన్నారాయణున్నే సేవిస్తారు.

తస్మాత్పతివ్రతా నార్యః శ్రేయస్కామాః సుమధ్యమే
యజన్తేऽనన్యభావేన పతిమాత్మానమీశ్వరమ్

పతివరతలు ఐన స్త్రీలు భర్త యొక్క శ్రేయస్సును కోరుస్తారు. అనురాగమున్న భర్తలు భార్య యొక్క కోరికలు తీరుస్తారు. అటువంటి స్త్రీలు అన్ని కోరికలనూ పొందుతారు

సోऽహం త్వయార్చితో భద్రే ఈదృగ్భావేన భక్తితః
తం తే సమ్పాదయే కామమసతీనాం సుదుర్లభమ్

నీకేమి కావాలో కోరుకోమని కశ్యపుడు అడిగాడు

దితిరువాచ
వరదో యది మే బ్రహ్మన్పుత్రమిన్ద్రహణం వృణే
అమృత్యుం మృతపుత్రాహం యేన మే ఘాతితౌ సుతౌ

ఇంద్రున్ని చంపే కొడుకు కావాలి. నా పుత్రులను ఇంద్రుడు అతని రక్షకులూ చంపారు

నిశమ్య తద్వచో విప్రో విమనాః పర్యతప్యత
అహో అధర్మః సుమహానద్య మే సముపస్థితః

ఈ కోరిక వినగానే తాను చేసిన అధర్మం తెలుసుకున్నాడు కశ్యపుడు.

అహో అర్థేన్ద్రియారామో యోషిన్మయ్యేహ మాయయా
గృహీతచేతాః కృపణః పతిష్యే నరకే ధ్రువమ్

స్త్రీ రూపమైన మాయతో నా మనస్సూ ఇంద్రియములూ హరించబడ్డాయి. నేను నరకములో పడెదను

కోऽతిక్రమోऽనువర్తన్త్యాః స్వభావమిహ యోషితః
ధిఙ్మాం బతాబుధం స్వార్థే యదహం త్వజితేన్ద్రియః

స్త్రీ తనకు తానుగా వచ్చి సేవిస్తే ఎంత తెలివిగలవాడైనా కాదనకపోవడమే నరకానికి మూలం. వారు మనసులో ఏమి భావించుకుని వచ్చారో ఎవరికీ తెలియదు.

శరత్పద్మోత్సవం వక్త్రం వచశ్చ శ్రవణామృతమ్
హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితమ్

పద్మము వంటి ముఖం, పద్మము నుండి వచ్చే మకరందం లాంటి మాటలు ఉంటాయి. వారి ముఖం చూసి, మాటలు విని మోసపోతాము. వారి మనసును తెలుసుకోగలవాడు ఎవ్వడూ. స్వార్థపరులైన స్త్రీలకు ప్రియుడైనవాడు అంటూ ఎవ్వరూ ఉండరు.

న హి కశ్చిత్ప్రియః స్త్రీణామఞ్జసా స్వాశిషాత్మనామ్
పతిం పుత్రం భ్రాతరం వా ఘ్నన్త్యర్థే ఘాతయన్తి చ

తమ కోరిక తీరకపోతే స్వార్థపరులైన స్త్రీలు ఎవ్వరిని చంపడానికీ వెనుకాడరు

ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్న మృషా భవేత్
వధం నార్హతి చేన్ద్రోऽపి తత్రేదముపకల్పతే

ఇప్పుడు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా అధర్మమే అవుతుంది. నేను ధర్మ తప్పకుండా నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను అని ఆలోచించి

ఇతి సఞ్చిన్త్య భగవాన్మారీచః కురునన్దన
ఉవాచ కిఞ్చిత్కుపిత ఆత్మానం చ విగర్హయన్

తనను తాను నిందించుకుంటూ కొద్దిగా కనపడీ కనపడనట్లుగా కోపాన్ని ప్రదర్శించి ఇలా అన్నాడు

శ్రీకశ్యప ఉవాచ
పుత్రస్తే భవితా భద్రే ఇన్ద్రహాదేవబాన్ధవః
సంవత్సరం వ్రతమిదం యద్యఞ్జో ధారయిష్యసి

శుభంకరురాలా నీవన్నట్లు ఇంద్రున్ని చంపేవాడు నీకు కొడుకుగా కలుగుతాడు, అతను దేవ బాంధవుడవుతాడు. నేను చెప్పినట్లుగా నీవు సంవత్సరం వ్రతం ఆచరిస్తే ఇంద్రున్ని చంపేవాడు కొడుకుగా కలుగుతాడు. వ్రత నియమం తప్పితే దేవబాంధవుడు పుత్రుడుగా లభిస్తాడు

దితిరువాచ
ధారయిష్యే వ్రతం బ్రహ్మన్బ్రూహి కార్యాణి యాని మే
యాని చేహ నిషిద్ధాని న వ్రతం ఘ్నన్తి యాన్యుత

తప్పకుండా వ్రతం ఆచరిస్తాను. చేయవలసినవీ చేయకూడనివీ ఏవి అని అడిగింది

శ్రీకశ్యప ఉవాచ
న హింస్యాద్భూతజాతాని న శపేన్నానృతం వదేత్
న ఛిన్ద్యాన్నఖరోమాణి న స్పృశేద్యదమఙ్గలమ్

ప్రాణులను హింసించకూడదు, నిందించకూడదు, అబద్దమాడరాదు, గోళ్ళూ రోమములూ తీయరాదు, అపవిత్రమైన దాన్ని ముట్టరాదు, నీట మునిగి స్నానం చేయరాదు. ఎవరి మీద కోపించరాదు. ఎవరినీ దుర్భాషలాడరాదు. ఉతకని బట్టలు కట్టరాదు, ఒక సారి ధరించిన మాలను మళ్ళీ ధరించరాదు, ఎంగిళి అన్నాన్ని తినరాదు, రజస్వల తాకిన అన్నాన్ని తినరాదు, మాంసాన్నీ అపవిత్రుడు తెచ్చిన అన్నాన్నీ రజస్వల చూచిన అన్నానీ తినరాదు, దోసిటితో నీరు తాగరాదు,. వాడిన పదార్థాలను ఎంగిళినీ తాకరాదు, వాడిన జలం తాకరాదు. ఉభయ సంధ్యలలో జుట్టు విరబూసుకుని ఉండరాదు. వాక్కుని నియమించుకోవాలి, పైన వస్త్రం లేకుండా బయట తిరగరాదు, కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోరాదు, తడి కాళ్ళతో నిద్రపోరాదు. భక్తీ వినయం లేకుండా ఉండరాదు, ఉత్తరం వైపు తలపెట్టి పడుకోరాదు, తలవైపు కాళ్ళు పెట్టి పడుకోరాదు, ఇతరులు పడుకున్న శయ్య మీద పడుకోరాదు, సంధ్యాకాలములో పడుకోరాదు, వస్త్రం లేకుండా పడుకోరాదు. భక్తీ వినయం లేకుండా ఉండరాదు. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోరాదు, ఇంకొకరు పడుకున్న శయ్య మీద పడుకోరాదు, తలవైపు కాళ్ళుపెట్టి పడుకోరాదు, వస్త్రం లేకుండా పడుకోరాదు, సంధ్యా కాలములలో పడుకోరాదు. ఎప్పుడూ ఉతికిన వస్త్రమే కట్టుకోవాలీ, పరిశుద్ధిగా ఉండాలీ, అన్నీ మాంగళ్యములనే ఉపయోగించహలి, ఉదయ ఫలహారం ముందే అమ్మవారినీ స్వామినీ గోవులనూ బ్రాహ్మణులనూ ధనమునీ పూజించాలి ముత్తైదువులైన స్త్రీలను పూజించాలి. భర్తను పూజించాలి, స్వామిని పూజించాలి. దెన్ని పుంసవన వ్రతం అంటారు. దీన్ని సంవత్స్రం చేస్తే  నీకు తప్పకుండా ఇంద్రున్ని చంపే కుమారుడు కలుగుతాడు. అలాగే అని ఒప్పుకుంది. కాశ్యపుని వలన గర్భం పొంది ఆ వ్రతాన్ని ఆచరిస్తోంది. పిన తల్లి వ్రతాన్ని తెలుసుకున్నాడు ఇంద్రుడు. జ్ఞ్యాని కాబట్టి ఆమె ఉంటున్న ఆశ్రమానికి వచ్చి ఆమెను శ్రద్ధగా సేవించడం మొదలుపెట్టాడు. పూలనూ పళ్ళనూ కందమూలములనూ దర్భలనూ ఆకులనూ జలములనూ మట్టినీ ఏ సమయములో ఏవి ఆరాధనకు కావాలో అవి తీసుకుని వచ్చేవాడు. ఇంత జాగ్రత్తగా సేవించడానికి కారణం ఈమె ఎప్పుడు వ్రతములో పొరబాటు చేస్తుందా అని కనిపెట్టడానికి మృగన్ని వేటాడే వేటగాడు మృగాకారమైన వేషాన్ని వేసుకున్నట్లుగా.

నాప్సు స్నాయాన్న కుప్యేత న సమ్భాషేత దుర్జనైః
న వసీతాధౌతవాసః స్రజం చ విధృతాం క్వచిత్

నోచ్ఛిష్టం చణ్డికాన్నం చ సామిషం వృషలాహృతమ్
భుఞ్జీతోదక్యయా దృష్టం పిబేన్నాఞ్జలినా త్వపః

నోచ్ఛిష్టాస్పృష్టసలిలా సన్ధ్యాయాం ముక్తమూర్ధజా
అనర్చితాసంయతవాక్నాసంవీతా బహిశ్చరేత్

నాధౌతపాదాప్రయతా నార్ద్రపాదా ఉదక్శిరాః
శయీత నాపరాఙ్నాన్యైర్న నగ్నా న చ సన్ధ్యయోః

ధౌతవాసా శుచిర్నిత్యం సర్వమఙ్గలసంయుతా
పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్గోవిప్రాఞ్శ్రియమచ్యుతమ్

స్త్రియో వీరవతీశ్చార్చేత్స్రగ్గన్ధబలిమణ్డనైః
పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్కోష్ఠగతం చ తమ్

సాంవత్సరం పుంసవనం వ్రతమేతదవిప్లుతమ్
ధారయిష్యసి చేత్తుభ్యం శక్రహా భవితా సుతః

బాఢమిత్యభ్యుపేత్యాథ దితీ రాజన్మహామనాః
కశ్యపాద్గర్భమాధత్త వ్రతం చాఞ్జో దధార సా

మాతృష్వసురభిప్రాయమిన్ద్ర ఆజ్ఞాయ మానద
శుశ్రూషణేనాశ్రమస్థాం దితిం పర్యచరత్కవిః

నిత్యం వనాత్సుమనసః ఫలమూలసమిత్కుశాన్
పత్రాఙ్కురమృదోऽపశ్చ కాలే కాల ఉపాహరత్

ఏవం తస్యా వ్రతస్థాయా వ్రతచ్ఛిద్రం హరిర్నృప
ప్రేప్సుః పర్యచరజ్జిహ్మో మృగహేవ మృగాకృతిః

నాధ్యగచ్ఛద్వ్రతచ్ఛిద్రం తత్పరోऽథ మహీపతే
చిన్తాం తీవ్రాం గతః శక్రః కేన మే స్యాచ్ఛివం త్విహ

ఇంత జాగ్రత్తగా చూస్తున్నా మనసులో సంతానం మీద ఆశ, ఇంద్రుని మీద ద్వేషం, రాజ్యం కావాలన్న ఆశ ఉండుటచే ఎటువంటి పొరబాటు లేకుండా చేస్తోంది.

ఏకదా సా తు సన్ధ్యాయాముచ్ఛిష్టా వ్రతకర్శితా
అస్పృష్టవార్యధౌతాఙ్ఘ్రిః సుష్వాప విధిమోహితా

ఇలా పదకొండు నెలలు చేసి చిక్కిపోయి అలసిపోయి మలమూత్ర విసర్జన చేసి ఆచమనం చేయకుండా కళ్ళూ చేతులూ కడుక్కోకుండా అలాగే పడుకుంది. అందులోనూ అది సంధ్యా సమయం. పరమాత్మ ఆమెను మోహింపచేసాడు

లబ్ధ్వా తదన్తరం శక్రో నిద్రాపహృతచేతసః
దితేః ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా

అప్పుడు ఇంద్రుడు తన యోగమాయతో దితి గర్భములోకి ప్రవేశించి ఆమె గర్భాన్ని ఏడు భాగాలుగా ఖండించాడు. వారు ఏడుస్తుంటే ఏడవకండీ "మా రుదా" అంటూ ఖండించాడు. వారందరూ చేతులు జోడించి మమ్ములను ఎందుకు నీవు చంపుతున్నావు

చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభమ్
రుదన్తం సప్తధైకైకం మా రోదీరితి తాన్పునః

తమూచుః పాట్యమానాస్తే సర్వే ప్రాఞ్జలయో నృప
కిం న ఇన్ద్ర జిఘాంససి భ్రాతరో మరుతస్తవ

మా భైష్ట భ్రాతరో మహ్యం యూయమిత్యాహ కౌశికః
అనన్యభావాన్పార్షదానాత్మనో మరుతాం గణాన్

న మమార దితేర్గర్భః శ్రీనివాసానుకమ్పయా
బహుధా కులిశక్షుణ్ణో ద్రౌణ్యస్త్రేణ యథా భవాన్

అప్పుడు ఇంద్రుడు, మీరు భయపడకండి మీరు అన్నట్లు నాకు మీరు సోదరులే. మిమ్ములను నేను చంపను. ఈ ప్రకారముగా ఇరువురూ ఒప్పందం చేసుకున్నారు. ఇలా వజ్రముతో ఖండించినా ఆమె చేసిన వ్రత ప్రభావం వలన వారు బతికే ఉన్నారు. అశ్వద్ధామ అస్త్రముతో నీవు చావనట్లు అలాగే వజ్రాయుధముతో వారు కూడా మరణించలేదు. ఒక్క సారి మనసారా సేవిస్తే వారి సామీప్యాన్ని పొందుతారు. అలాంటిది దాదాపు ఒక సంవత్సర కాలం సేవించింది. ఒక్క సారి ఖండించగా చావకపోయేసరికి మళ్ళీ ఒక్కొక్కరినీ మళ్ళీ ఏడు సార్లు ఖండించాడు.తల్లి మీద ద్వేషాన్ని పక్కనపెట్టి మరుత్తులకు కూడా తనతో సమాన స్థానన్ని ఇచ్చి. యజ్ఞ్యములో భాగం తీసుకునే వారిగా చేసాడు. దితి లేవగానే తన కుమారులు ఎదురుగా ఉన్నారు. విషయం తెలుసుకుని వారు బతికే ఉన్నందుకు సంతోషించింది. నేను దేవతలకు భయమును కలిగించే సంతానాన్ని కోరి పరమ దుష్కరమైన ఈ వ్రతాన్ని చేసాను. ఒక కుమారుడు కావాలనుకుంటే నలభై తొమ్మిది మంది అయ్యారు. ఇది ఎలా జరిగింది. నీకు తెలిస్తే చెప్పు. అబద్దం చెప్పకు
అమా నీవు చెప్పక ముందే నీ సంకల్పం నాకు తెలుసు. అది తెలుసుకునే నేను కూడా నీవలే ప్రయోజనం కోరి వచ్చాను. అవకాశం దొరికించుకున్నాను. నీ గర్భాన్ని చేదించాను.నేను మొదలు ఏడు భాగాలు చేసాను. వారు మరణించకుంటే మరలా ఏడు భాగాలు చేసాను. అయినా వారు జీవించే ఉన్నారు. ముందు ఆశ్చర్యపడ్డా తరువాత అర్థమయ్యింది. శ్రీమన్నారాయణున్ని నీవు ఆరాధించావు కాబట్టి అది వ్యర్థం కాలేదు. వజ్రాయుధం కూడా పని చేయలేదు. పరమాత్మను ఆరాధిస్తే కోరని వారి కోరికలు కూడా నెరవేరుతాయి. ఎవరు పరమాత్మను వరములు కోరరో వారే స్వార్థం బాగా తెలిసినవారు. భగవంతుని కోరని వాడే స్వార్థ కుశలుడు. తననే తాను ఇచ్చేవాడు పరమాత్మ. పరమాత్మ మాత్రమే తనను తాను ఇచ్చుకుంటాడు. తనను తాను ఇచ్చుకునే వాడు అతనే. అటువంటి పరమాత్మను ప్రకృతి బంధాన్ని పెంచే కోరికలు అడిగే వాడు ఎంత తెలివి తక్కువ వాడు. ఆ విషయం తెలియక నేను దుర్మార్గం చేసాను. నన్ను క్షమించు. నీ సంతానం మరణించలేదు. నీకు అంత కోపం ఉండి ఉండదనుకుంటున్నాను.  విధి అలా ఉన్నదని గ్రహించిన దితి శుద్ధ భావముతో ఇంద్రునీ పంపించింది. మరుత్తులతో కలిసి ఇంద్రుడు స్వర్గానికి వెళ్ళాడు

సకృదిష్ట్వాదిపురుషం పురుషో యాతి సామ్యతామ్
సంవత్సరం కిఞ్చిదూనం దిత్యా యద్ధరిరర్చితః

సజూరిన్ద్రేణ పఞ్చాశద్దేవాస్తే మరుతోऽభవన్
వ్యపోహ్య మాతృదోషం తే హరిణా సోమపాః కృతాః

దితిరుత్థాయ దదృశే కుమారాననలప్రభాన్
ఇన్ద్రేణ సహితాన్దేవీ పర్యతుష్యదనిన్దితా

అథేన్ద్రమాహ తాతాహమాదిత్యానాం భయావహమ్
అపత్యమిచ్ఛన్త్యచరం వ్రతమేతత్సుదుష్కరమ్

ఏకః సఙ్కల్పితః పుత్రః సప్త సప్తాభవన్కథమ్
యది తే విదితం పుత్ర సత్యం కథయ మా మృషా

ఇన్ద్ర ఉవాచ
అమ్బ తేऽహం వ్యవసితముపధార్యాగతోऽన్తికమ్
లబ్ధాన్తరోऽచ్ఛిదం గర్భమర్థబుద్ధిర్న ధర్మదృక్

కృత్తో మే సప్తధా గర్భ ఆసన్సప్త కుమారకాః
తేऽపి చైకైకశో వృక్ణాః సప్తధా నాపి మమ్రిరే

తతస్తత్పరమాశ్చర్యం వీక్ష్య వ్యవసితం మయా
మహాపురుషపూజాయాః సిద్ధిః కాప్యానుషఙ్గిణీ

ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః
యే తు నేచ్ఛన్త్యపి పరం తే స్వార్థకుశలాః స్మృతాః

ఆరాధ్యాత్మప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరమ్
కో వృణీత గుణస్పర్శం బుధః స్యాన్నరకేऽపి యత్

తదిదం మమ దౌర్జన్యం బాలిశస్య మహీయసి
క్షన్తుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భో మృతోత్థితః

శ్రీశుక ఉవాచ
ఇన్ద్రస్తయాభ్యనుజ్ఞాతః శుద్ధభావేన తుష్టయా
మరుద్భిః సహ తాం నత్వా జగామ త్రిదివం ప్రభుః

ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి
మఙ్గలం మరుతాం జన్మ కిం భూయః కథయామి తే

దితి గర్భములో దేవతలు ఎలా పుట్టారో నీవడిగావు. పరమ పావనమైన మరుత్తుల జన్మ నీకు చెప్పాను.
శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
పృశ్నిస్తు పత్నీ సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్
అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం మహామఖాన్

పన్నెండు మంది ఆదిత్యులలో ఒకరు త్వష్ట, తరువాత సవిత
సవిత భార్య ఐన పృశ్ని మహామఖులైన వీరందరినీ సంతానముగా పొందింది (సవితుః సావిత్రీం వ్యాహృతిం త్రయీమ్ అగ్నిహోత్రం పశుం సోమం చాతుర్మాస్యం)

సిద్ధిర్భగస్య భార్యాఙ్గ మహిమానం విభుం ప్రభుమ్
ఆశిషం చ వరారోహాం కన్యాం ప్రాసూత సువ్రతామ్

పన్నెండు మంది ఆదిత్యులలో భగుడు కూడా ఒకరు. అతని భార్య సిద్ధి. ఒక కన్యనూ ముగ్గురు కుమారులనూ కన్నారు

ధాతుః కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా
సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసమనుక్రమాత్

ధాతకు కుహూః సినీవాలీ రాకా చానుమతిస్తథా సాయం దర్శమథ ప్రాతః పూర్ణమాసం సంతానముగా కలిగారు

అగ్నీన్పురీష్యానాధత్త క్రియాయాం సమనన్తరః
చర్షణీ వరుణస్యాసీద్యస్యాం జాతో భృగుః పునః

అగ్నిక్రియలో వీరందరినీ సంతానముగా పొందారు. వరుణుని భార్య చర్షణి. వారికి బృగు మహర్షి మరలా పుత్రునిగా పుట్టారు.

వాల్మీకిశ్చ మహాయోగీ వల్మీకాదభవత్కిల
అగస్త్యశ్చ వసిష్ఠశ్చ మిత్రావరుణయోరృషీ

వాల్మీకి కూడా వరుణునికీ చర్షణికీ పుట్టారు. అందుకే వాల్మికీ కూడా ప్రాచేతసుడు (వరుణ). రెండవ సారి ఈయన పుట్ట నుండి పుట్టాడు. నాలుగు మహాయుగాలు జపం చేసాడు. అంతలో ఆయన మీద పెద్ద పుట్ట మొలచింది. పుట్ట (వల్మీకం) నుంచి లేచాడు కాబట్టి ఈయన వాల్మీకి. అగస్త్య వసిష్ఠ మహర్షి మిత్రా వరుణులు (ఆదిత్యులు) ఊర్వశి నాట్యం చేస్తుండగా వ్యామోహించి కుండలో తమ వీర్యాన్ని నిక్షిప్తం చేసారు. అగస్త్యుడు మిత్రా వరుణుల కుమారుడు, తల్లి ఊర్వశి. (ఎవరిని భావించి రేతస్సును వదిలిపెడతామో వారే తల్లి అవుతారు. కంసుడు ఉగ్రసేనుడి కుమారుడే గానీ, ఉగ్రసేనుడు పరమభక్తుడైనప్పుడు కంసుడు అలా ఎందుకయ్యాడు. ఉగ్రసేనుని భార్య ఋతుమతియై ఒక సాయంకాలం వేళ విహరిస్తూ ఉండగా తన భర్తను స్మరించింది ఒక ఉద్యానవనములో. ఎప్పటినుండో ఆమె సౌందర్యాన్ని ఆశించిన ఒక గంధర్వుడు భర్త రూపాన్ని తీసుకుని అసురాంశతో వచ్చాడు. వారి సమాగమం వలన కంసుడు పుట్టాడు. కానీ కంసుడు అసుర గంధర్వ వీర్యం వలన వచ్చాడు. క్షేత్ర బీజ సంకల్ప ప్రభావం వలననే పిల్లలు పుడతారు. అందుకే ఏ వైపు చూసిన పరమాత్మ చిత్రపటాలు ఉండేట్లు ఉంచుతారు శయ్యామందిరములో. కారణమూ స్మరణమూ దేహమూ.) మిత్రావరుణులు ఊర్వశి సౌందర్యం చూసి అగస్త్య వసిష్ఠుల జననం కోసం కుంభములో రేతస్సు ఉంచారు.
మిత్రుడు రేవతి యందు ముగ్గురు కుమారులను పొందాడు.

రేతః సిషిచతుః కుమ్భే ఉర్వశ్యాః సన్నిధౌ ద్రుతమ్
రేవత్యాం మిత్ర ఉత్సర్గమరిష్టం పిప్పలం వ్యధాత్

పౌలోమ్యామిన్ద్ర ఆధత్త త్రీన్పుత్రానితి నః శ్రుతమ్
జయన్తమృషభం తాత తృతీయం మీఢుషం ప్రభుః

ఇంద్రుడు పౌలోమి యందు ముగ్గురు కుమారులను పొందాడు

ఉరుక్రమస్య దేవస్య మాయావామనరూపిణః
కీర్తౌ పత్న్యాం బృహచ్ఛ్లోకస్తస్యాసన్సౌభగాదయః

త్రివిక్రముడి భార్య కీర్తి, వీరికి బృహశ్లోకుడూ, అతనికి సౌభగుడూ కలిగారు

తత్కర్మగుణవీర్యాణి కాశ్యపస్య మహాత్మనః
పశ్చాద్వక్ష్యామహేऽదిత్యాం యథైవావతతార హ

కాశ్యపస ప్రభావాన్ని తరువాత చెబుతాను

అథ కశ్యపదాయాదాన్దైతేయాన్కీర్తయామి తే
యత్ర భాగవతః శ్రీమాన్ప్రహ్రాదో బలిరేవ చ

కశ్యపుడికీ అధితికీ వామనుడిగా స్వామి ఎలా అవతరించాడో ఆ ఉపాఖ్యానం తరువాత చెబుతాను. ఇంతవరకూ దేవతల గురించి చెప్పాను.. ఇక దితి పుత్రుల గురించి విను. ఆ వంశములో ప్రహ్లాదుడూ బలి చక్రవతీ పుట్టారు.

దితేర్ద్వావేవ దాయాదౌ దైత్యదానవవన్దితౌ
హిరణ్యకశిపుర్నామ హిరణ్యాక్షశ్చ కీర్తితౌ

దైత్య దానవుల చేత కీర్తించబడే దితి పుత్రులు ఇద్దరు ఉన్నారు. హిరణ్యకశిపుడూ హిరణ్యాక్షుడు.

హిరణ్యకశిపోర్భార్యా కయాధుర్నామ దానవీ
జమ్భస్య తనయా సా తు సుషువే చతురః సుతాన్

కయాత అనే హిరణ్యకశిపుని భార్య, వీరికి నలుగురు పుత్రులు సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ

సంహ్రాదం ప్రాగనుహ్రాదం హ్రాదం ప్రహ్రాదమేవ చ
తత్స్వసా సింహికా నామ రాహుం విప్రచితోऽగ్రహీత్

సింహిక అన్న పుత్రిక కలదు. రాహువు సింహికను వివాహం చేసుకున్నాడు. ఇతన్ని శ్రీమహావిష్ణువు చక్రముతో సంహరించాడు.

శిరోऽహరద్యస్య హరిశ్చక్రేణ పిబతోऽమృతమ్
సంహ్రాదస్య కృతిర్భార్యా సూత పఞ్చజనం తతః

సంహ్రాదునికి కృతి భార్య , వీరికి పంచజనుడనే కొడుకు

హ్రాదస్య ధమనిర్భార్యా సూత వాతాపిమిల్వలమ్
యోऽగస్త్యాయ త్వతిథయే పేచే వాతాపిమిల్వలః

హ్రాదునికి ధమని యందు వాతాపీ ఇల్వలుడు పుట్టారు. వీరు అగస్త్యుని చేత సంహరించబడ్డారు

అనుహ్రాదస్య సూర్యాయాం బాష్కలో మహిషస్తథా
విరోచనస్తు ప్రాహ్రాదిర్దేవ్యాం తస్యాభవద్బలిః

ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. అతని కుమారుడు బలి చక్రవర్తి. అతనికి బాణుడు పెద్ద కుమారుడు

బాణజ్యేష్ఠం పుత్రశతమశనాయాం తతోऽభవత్
తస్యానుభావం సుశ్లోక్యం పశ్చాదేవాభిధాస్యతే

ఆ బలి చక్రవర్తి ప్రహ్లాదుల ప్రభావం తరువాత వివరిస్తాను

బాణ ఆరాధ్య గిరిశం లేభే తద్గణముఖ్యతామ్
యత్పార్శ్వే భగవానాస్తే హ్యద్యాపి పురపాలకః

బాణాసురుడు శంకరున్ని పూజించి శంకరుని ప్రమధ గణాలలో ఒకడయ్యాడు. ఇప్పటికీ ద్వారపాలకుడిగా ఉన్నాడు

మరుతశ్చ దితేః పుత్రాశ్చత్వారింశన్నవాధికాః
త ఆసన్నప్రజాః సర్వే నీతా ఇన్ద్రేణ సాత్మతామ్

దితికి నలభై తొమ్మిది మంది మరుత్ గణములు పుట్టారు. శ్రాద్ధ, పితృ తర్పణ గ్రహణ సంక్రమణ కాలములో వీరి జననం వినాలి. పుట్టబోయే ముందు ఇంద్రుడు వారిని తన భృత్యులుగా చేసుకున్నాడు.

శ్రీరాజోవాచ
కథం త ఆసురం భావమపోహ్యౌత్పత్తికం గురో
ఇన్ద్రేణ ప్రాపితాః సాత్మ్యం కిం తత్సాధు కృతం హి తైః

దితి పుత్రులు ఆసురత్వాన్ని వదిలిపెట్టి దైవత్వాన్ని ఎలా పొందారు

ఇమే శ్రద్దధతే బ్రహ్మన్నృషయో హి మయా సహ
పరిజ్ఞానాయ భగవంస్తన్నో వ్యాఖ్యాతుమర్హసి

శ్రీసూత ఉవాచ
తద్విష్ణురాతస్య స బాదరాయణిర్వచో నిశమ్యాదృతమల్పమర్థవత్
సభాజయన్సన్నిభృతేన చేతసా జగాద సత్రాయణ సర్వదర్శనః

శ్రీశుక ఉవాచ
హతపుత్రా దితిః శక్ర పార్ష్ణిగ్రాహేణ విష్ణునా
మన్యునా శోకదీప్తేన జ్వలన్తీ పర్యచిన్తయత్

కదా ను భ్రాతృహన్తారమిన్ద్రియారామముల్బణమ్
అక్లిన్నహృదయం పాపం ఘాతయిత్వా శయే సుఖమ్

కృమివిడ్భస్మసంజ్ఞాసీద్యస్యేశాభిహితస్య చ
భూతధ్రుక్తత్కృతే స్వార్థం కిం వేద నిరయో యతః

ఆశాసానస్య తస్యేదం ధ్రువమున్నద్ధచేతసః
మదశోషక ఇన్ద్రస్య భూయాద్యేన సుతో హి మే

ఇతి భావేన సా భర్తురాచచారాసకృత్ప్రియమ్
శుశ్రూషయానురాగేణ ప్రశ్రయేణ దమేన చ

భక్త్యా పరమయా రాజన్మనోజ్ఞైర్వల్గుభాషితైః
మనో జగ్రాహ భావజ్ఞా సస్మితాపాఙ్గవీక్షణైః

ఏవం స్త్రియా జడీభూతో విద్వానపి మనోజ్ఞయా
బాఢమిత్యాహ వివశో న తచ్చిత్రం హి యోషితి

విలోక్యైకాన్తభూతాని భూతాన్యాదౌ ప్రజాపతిః
స్త్రియం చక్రే స్వదేహార్ధం యయా పుంసాం మతిర్హృతా

ఏవం శుశ్రూషితస్తాత భగవాన్కశ్యపః స్త్రియా
ప్రహస్య పరమప్రీతో దితిమాహాభినన్ద్య చ

శ్రీకశ్యప ఉవాచ
వరం వరయ వామోరు ప్రీతస్తేऽహమనిన్దితే
స్త్రియా భర్తరి సుప్రీతే కః కామ ఇహ చాగమః

పతిరేవ హి నారీణాం దైవతం పరమం స్మృతమ్
మానసః సర్వభూతానాం వాసుదేవః శ్రియః పతిః

స ఏవ దేవతాలిఙ్గైర్నామరూపవికల్పితైః
ఇజ్యతే భగవాన్పుమ్భిః స్త్రీభిశ్చ పతిరూపధృక్

తస్మాత్పతివ్రతా నార్యః శ్రేయస్కామాః సుమధ్యమే
యజన్తేऽనన్యభావేన పతిమాత్మానమీశ్వరమ్

సోऽహం త్వయార్చితో భద్రే ఈదృగ్భావేన భక్తితః
తం తే సమ్పాదయే కామమసతీనాం సుదుర్లభమ్

దితిరువాచ
వరదో యది మే బ్రహ్మన్పుత్రమిన్ద్రహణం వృణే
అమృత్యుం మృతపుత్రాహం యేన మే ఘాతితౌ సుతౌ

నిశమ్య తద్వచో విప్రో విమనాః పర్యతప్యత
అహో అధర్మః సుమహానద్య మే సముపస్థితః

అహో అర్థేన్ద్రియారామో యోషిన్మయ్యేహ మాయయా
గృహీతచేతాః కృపణః పతిష్యే నరకే ధ్రువమ్

కోऽతిక్రమోऽనువర్తన్త్యాః స్వభావమిహ యోషితః
ధిఙ్మాం బతాబుధం స్వార్థే యదహం త్వజితేన్ద్రియః

శరత్పద్మోత్సవం వక్త్రం వచశ్చ శ్రవణామృతమ్
హృదయం క్షురధారాభం స్త్రీణాం కో వేద చేష్టితమ్

న హి కశ్చిత్ప్రియః స్త్రీణామఞ్జసా స్వాశిషాత్మనామ్
పతిం పుత్రం భ్రాతరం వా ఘ్నన్త్యర్థే ఘాతయన్తి చ

ప్రతిశ్రుతం దదామీతి వచస్తన్న మృషా భవేత్
వధం నార్హతి చేన్ద్రోऽపి తత్రేదముపకల్పతే

ఇతి సఞ్చిన్త్య భగవాన్మారీచః కురునన్దన
ఉవాచ కిఞ్చిత్కుపిత ఆత్మానం చ విగర్హయన్

శ్రీకశ్యప ఉవాచ
పుత్రస్తే భవితా భద్రే ఇన్ద్రహాదేవబాన్ధవః
సంవత్సరం వ్రతమిదం యద్యఞ్జో ధారయిష్యసి

దితిరువాచ
ధారయిష్యే వ్రతం బ్రహ్మన్బ్రూహి కార్యాణి యాని మే
యాని చేహ నిషిద్ధాని న వ్రతం ఘ్నన్తి యాన్యుత

శ్రీకశ్యప ఉవాచ
న హింస్యాద్భూతజాతాని న శపేన్నానృతం వదేత్
న ఛిన్ద్యాన్నఖరోమాణి న స్పృశేద్యదమఙ్గలమ్

నాప్సు స్నాయాన్న కుప్యేత న సమ్భాషేత దుర్జనైః
న వసీతాధౌతవాసః స్రజం చ విధృతాం క్వచిత్

నోచ్ఛిష్టం చణ్డికాన్నం చ సామిషం వృషలాహృతమ్
భుఞ్జీతోదక్యయా దృష్టం పిబేన్నాఞ్జలినా త్వపః

నోచ్ఛిష్టాస్పృష్టసలిలా సన్ధ్యాయాం ముక్తమూర్ధజా
అనర్చితాసంయతవాక్నాసంవీతా బహిశ్చరేత్

నాధౌతపాదాప్రయతా నార్ద్రపాదా ఉదక్శిరాః
శయీత నాపరాఙ్నాన్యైర్న నగ్నా న చ సన్ధ్యయోః

ధౌతవాసా శుచిర్నిత్యం సర్వమఙ్గలసంయుతా
పూజయేత్ప్రాతరాశాత్ప్రాగ్గోవిప్రాఞ్శ్రియమచ్యుతమ్

స్త్రియో వీరవతీశ్చార్చేత్స్రగ్గన్ధబలిమణ్డనైః
పతిం చార్చ్యోపతిష్ఠేత ధ్యాయేత్కోష్ఠగతం చ తమ్

సాంవత్సరం పుంసవనం వ్రతమేతదవిప్లుతమ్
ధారయిష్యసి చేత్తుభ్యం శక్రహా భవితా సుతః

బాఢమిత్యభ్యుపేత్యాథ దితీ రాజన్మహామనాః
కశ్యపాద్గర్భమాధత్త వ్రతం చాఞ్జో దధార సా

మాతృష్వసురభిప్రాయమిన్ద్ర ఆజ్ఞాయ మానద
శుశ్రూషణేనాశ్రమస్థాం దితిం పర్యచరత్కవిః

నిత్యం వనాత్సుమనసః ఫలమూలసమిత్కుశాన్
పత్రాఙ్కురమృదోऽపశ్చ కాలే కాల ఉపాహరత్

ఏవం తస్యా వ్రతస్థాయా వ్రతచ్ఛిద్రం హరిర్నృప
ప్రేప్సుః పర్యచరజ్జిహ్మో మృగహేవ మృగాకృతిః

నాధ్యగచ్ఛద్వ్రతచ్ఛిద్రం తత్పరోऽథ మహీపతే
చిన్తాం తీవ్రాం గతః శక్రః కేన మే స్యాచ్ఛివం త్విహ

ఏకదా సా తు సన్ధ్యాయాముచ్ఛిష్టా వ్రతకర్శితా
అస్పృష్టవార్యధౌతాఙ్ఘ్రిః సుష్వాప విధిమోహితా

లబ్ధ్వా తదన్తరం శక్రో నిద్రాపహృతచేతసః
దితేః ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా

చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనకప్రభమ్
రుదన్తం సప్తధైకైకం మా రోదీరితి తాన్పునః

తమూచుః పాట్యమానాస్తే సర్వే ప్రాఞ్జలయో నృప
కిం న ఇన్ద్ర జిఘాంససి భ్రాతరో మరుతస్తవ

మా భైష్ట భ్రాతరో మహ్యం యూయమిత్యాహ కౌశికః
అనన్యభావాన్పార్షదానాత్మనో మరుతాం గణాన్

న మమార దితేర్గర్భః శ్రీనివాసానుకమ్పయా
బహుధా కులిశక్షుణ్ణో ద్రౌణ్యస్త్రేణ యథా భవాన్

సకృదిష్ట్వాదిపురుషం పురుషో యాతి సామ్యతామ్
సంవత్సరం కిఞ్చిదూనం దిత్యా యద్ధరిరర్చితః

సజూరిన్ద్రేణ పఞ్చాశద్దేవాస్తే మరుతోऽభవన్
వ్యపోహ్య మాతృదోషం తే హరిణా సోమపాః కృతాః

దితిరుత్థాయ దదృశే కుమారాననలప్రభాన్
ఇన్ద్రేణ సహితాన్దేవీ పర్యతుష్యదనిన్దితా

అథేన్ద్రమాహ తాతాహమాదిత్యానాం భయావహమ్
అపత్యమిచ్ఛన్త్యచరం వ్రతమేతత్సుదుష్కరమ్

ఏకః సఙ్కల్పితః పుత్రః సప్త సప్తాభవన్కథమ్
యది తే విదితం పుత్ర సత్యం కథయ మా మృషా

ఇన్ద్ర ఉవాచ
అమ్బ తేऽహం వ్యవసితముపధార్యాగతోऽన్తికమ్
లబ్ధాన్తరోऽచ్ఛిదం గర్భమర్థబుద్ధిర్న ధర్మదృక్

కృత్తో మే సప్తధా గర్భ ఆసన్సప్త కుమారకాః
తేऽపి చైకైకశో వృక్ణాః సప్తధా నాపి మమ్రిరే

తతస్తత్పరమాశ్చర్యం వీక్ష్య వ్యవసితం మయా
మహాపురుషపూజాయాః సిద్ధిః కాప్యానుషఙ్గిణీ

ఆరాధనం భగవత ఈహమానా నిరాశిషః
యే తు నేచ్ఛన్త్యపి పరం తే స్వార్థకుశలాః స్మృతాః

ఆరాధ్యాత్మప్రదం దేవం స్వాత్మానం జగదీశ్వరమ్
కో వృణీత గుణస్పర్శం బుధః స్యాన్నరకేऽపి యత్

తదిదం మమ దౌర్జన్యం బాలిశస్య మహీయసి
క్షన్తుమర్హసి మాతస్త్వం దిష్ట్యా గర్భో మృతోత్థితః

శ్రీశుక ఉవాచ
ఇన్ద్రస్తయాభ్యనుజ్ఞాతః శుద్ధభావేన తుష్టయా
మరుద్భిః సహ తాం నత్వా జగామ త్రిదివం ప్రభుః

ఏవం తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి
మఙ్గలం మరుతాం జన్మ కిం భూయః కథయామి తే

Saturday, April 13, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదిహేడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదిహేడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
యతశ్చాన్తర్హితోऽనన్తస్తస్యై కృత్వా దిశే నమః
విద్యాధరశ్చిత్రకేతుశ్చచార గగనే చరః

స లక్షం వర్షలక్షాణామవ్యాహతబలేన్ద్రియః
స్తూయమానో మహాయోగీ మునిభిః సిద్ధచారణైః

కులాచలేన్ద్రద్రోణీషు నానాసఙ్కల్పసిద్ధిషు
రేమే విద్యాధరస్త్రీభిర్గాపయన్హరిమీశ్వరమ్

విద్యాధర పతి అయిన చిత్రకేతువు పరమాత్మ వెళ్ళిన దిక్కుకు నమస్కారం చేసి ఒక లక్ష సంవత్సరాలు తన శక్తి తొలగిపోకుండా సిద్ధ చారణులచే స్తోత్రం చేయబడుతూ పర్వత ప్రాంతములలో విద్యాధర స్త్రీలతో కలిసి పరమాత్మను గానం చేస్తూ పరమాత్మను గానం చేయిస్తూ కాలం గడిపాడు.

ఏకదా స విమానేన విష్ణుదత్తేన భాస్వతా
గిరిశం దదృశే గచ్ఛన్పరీతం సిద్ధచారణైః

ఆదిశేషువిచ్చిన కామగమనమైన విమానములో సంచరిస్తూ ఒక సారి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ సిద్ధులూ చారణులూ ఉన్నారు

ఆలిఙ్గ్యాఙ్కీకృతాం దేవీం బాహునా మునిసంసది
ఉవాచ దేవ్యాః శృణ్వన్త్యా జహాసోచ్చైస్తదన్తికే

తన ముందు కూర్చున్న సనకాదులకు తత్వోపదేశం చేస్తున్నాడు. ఈయన కూడా అది విన్నాడు. శంకరుడు పార్వతీ దేవిని ఆలింగనం చేసుకుని తత్వోపదేశం చేస్తుంటే

చిత్రకేతురువాచ
ఏష లోకగురుః సాక్షాద్ధర్మం వక్తా శరీరిణామ్
ఆస్తే ముఖ్యః సభాయాం వై మిథునీభూయ భార్యయా

జటాధరస్తీవ్రతపా బ్రహ్మవాదిసభాపతిః
అఙ్కీకృత్య స్త్రియం చాస్తే గతహ్రీః ప్రాకృతో యథా

ప్రాయశః ప్రాకృతాశ్చాపి స్త్రియం రహసి బిభ్రతి
అయం మహావ్రతధరో బిభర్తి సదసి స్త్రియమ్

శ్రీశుక ఉవాచ
భగవానపి తచ్ఛ్రుత్వా ప్రహస్యాగాధధీర్నృప
తూష్ణీం బభూవ సదసి సభ్యాశ్చ తదనువ్రతాః

ఇత్యతద్వీర్యవిదుషి బ్రువాణే బహ్వశోభనమ్
రుషాహ దేవీ ధృష్టాయ నిర్జితాత్మాభిమానినే

శ్రీపార్వత్యువాచ
అయం కిమధునా లోకే శాస్తా దణ్డధరః ప్రభుః
అస్మద్విధానాం దుష్టానాం నిర్లజ్జానాం చ విప్రకృత్

న వేద ధర్మం కిల పద్మయోనిర్న బ్రహ్మపుత్రా భృగునారదాద్యాః
న వై కుమారః కపిలో మనుశ్చ యే నో నిషేధన్త్యతివర్తినం హరమ్

ఏషామనుధ్యేయపదాబ్జయుగ్మం జగద్గురుం మఙ్గలమఙ్గలం స్వయమ్
యః క్షత్రబన్ధుః పరిభూయ సూరీన్ప్రశాస్తి ధృష్టస్తదయం హి దణ్డ్యః

నాయమర్హతి వైకుణ్ఠ పాదమూలోపసర్పణమ్
సమ్భావితమతిః స్తబ్ధః సాధుభిః పర్యుపాసితమ్

అతః పాపీయసీం యోనిమాసురీం యాహి దుర్మతే
యథేహ భూయో మహతాం న కర్తా పుత్ర కిల్బిషమ్

శ్రీశుక ఉవాచ
ఏవం శప్తశ్చిత్రకేతుర్విమానాదవరుహ్య సః
ప్రసాదయామాస సతీం మూర్ధ్నా నమ్రేణ భారత

చిత్రకేతురువాచ
ప్రతిగృహ్ణామి తే శాపమాత్మనోऽఞ్జలినామ్బికే
దేవైర్మర్త్యాయ యత్ప్రోక్తం పూర్వదిష్టం హి తస్య తత్

సంసారచక్ర ఏతస్మిఞ్జన్తురజ్ఞానమోహితః
భ్రామ్యన్సుఖం చ దుఃఖం చ భుఙ్క్తే సర్వత్ర సర్వదా

నైవాత్మా న పరశ్చాపి కర్తా స్యాత్సుఖదుఃఖయోః
కర్తారం మన్యతేऽత్రాజ్ఞ ఆత్మానం పరమేవ చ

గుణప్రవాహ ఏతస్మిన్కః శాపః కో న్వనుగ్రహః
కః స్వర్గో నరకః కో వా కిం సుఖం దుఃఖమేవ వా

ఏకః సృజతి భూతాని భగవానాత్మమాయయా
ఏషాం బన్ధం చ మోక్షం చ సుఖం దుఃఖం చ నిష్కలః

న తస్య కశ్చిద్దయితః ప్రతీపో న జ్ఞాతిబన్ధుర్న పరో న చ స్వః
సమస్య సర్వత్ర నిరఞ్జనస్య సుఖే న రాగః కుత ఏవ రోషః

తథాపి తచ్ఛక్తివిసర్గ ఏషాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ
బన్ధాయ మోక్షాయ చ మృత్యుజన్మనోః శరీరిణాం సంసృతయేऽవకల్పతే

అథ ప్రసాదయే న త్వాం శాపమోక్షాయ భామిని
యన్మన్యసే హ్యసాధూక్తం మమ తత్క్షమ్యతాం సతి
ఇలా అన్నాడు. శంకరుడు లోకగురువు. జీవులకు తత్వం బోధిస్తున్నాడు. ఇలాంటి శంకరుడు కూడా భరయను కౌగిలించుకుని కూర్చి మాకు తత్వం చెబుతున్నాడు. జఠాధరుడైన వాడు ప్రాకృతమైన పామరుడిలా ఎలా ఉన్నాడు. పామరుడు కూడా రహస్యముగా ఏకాంతముగా భార్యతో ఉంటాడు గానీ సభలో ఉంటాడా? మరి శంకరుడు ఎలా ఉన్నాడు ఇలా? శంకరుడు అది విని ఒక చిరునవ్వి నవ్వి మౌనముగా ఉన్నాడు. ఆయన చెప్పిన దాన్ని వినే ఋషులు కూడా మౌనముగా ఊరుకున్నారు గానీ భర్తను అధిక్షేపించగానే పార్వతీ అమ్మవారు ఊరుకోక "లోకానికి ధర్మం చెప్పే మహానుభావుడు, సిగులేని మాలాటి వారికి ధర్మం చేప్పేవాడు వచ్చాడు. బ్రహ్మకూ బ్రహ్మ పుత్రులకూ సనకాదులకూ కుమార్స్వామికీ మొదలైనవారికి ఈ ధర్మం తెలియదు. ఈయనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను చెప్పిన వీరందరి చేత ధ్యానించబడే మహిమ గల శ్రీమన్నారాయణుని పాదములను ధ్యాఇంచే వీడు జ్ఞ్యానులని పరిహైసించి దుష్టుడై కొత్త బాష్యం చెబుతున్నాడు. ఇటువంటి వాడు వైకుంఠం వెళ్ళడానికి అర్హుడు కాడు. వైకుంఠములో అందరు సాధువులే ఉంటారు. నీవు రాక్షస యోనిలో చేరి రాక్షసునిగా పుట్టు. మళ్ళీ ఇలాంటి మహానుభావులకు నీవు అవమానం చేయకూడదు. పుత్రా! నీకు గుణపాఠం చెప్పడానికే ఇలా చేస్తున్నాను. "
ఇలా శపిస్తే ఆ శాపాన్ని పొందిన చిత్రకేతువు తలవంచి ఆమెను ప్రార్థించాడు. "అమ్మా నీవు ఇచ్చిన శాపాన్ని శిరస్సు వంచి స్వీకరిస్తున్నాను. మానవులు పొందవలసినది వారు పొందే తీరు తారు వారి కర్మ ఫలితముగా. నన్ను శపించావంటే అది నా పూర్వ జన్మ కర్మ ఫలమే. జీవుడు సంసారములో సంచరిస్తూ సుఖాన్నీ దుఃఖాన్ని జ్యానాన్నీ అజ్ఞ్యానాన్ని అనుభవిస్తాడు కర్మానుసారముగా. మానవుడికి జీవుడికీ కలిగే సుఖ దుఃఖములకు జీవుడూ కారణం కాదు. ఇతరులూ కారణం కాదు. తెలియని వారే నేను తప్పు చేసాను, వాడు తప్పు చేసాడు అంటారు. పరమాత్మ ఒక్కడే తన మాయతో సకల జగత్తులనీ సృష్టిస్తాడు. ఆ పరమాత్మే సుఖాన్ని దుఃఖాన్నీ బంధాన్నీ మోక్షాన్నీ ఇస్తాడు. పరమాత్మకి ఎలాంటి రాగద్వేషాలు ఉండవు. సంసారమనే చక్రముతో సంబంధం ఉండదు. ఆయనకు తనవాడూ పరాయి వాడూ మిత్రుడు అంటూ ఎవరూ ఉండరు. ఆయనకు సుఖమూ దుఃఖమూ అంటూ ఉండదు. సుఖం యందు ప్రీతీ దుఃఖం యందు కోపమూ లేదు. ఆయనకేమీ లేకున్నా ఆయన తన సంకల్పముతో మన కర్మానుగుణముగా సుఖదుఃఖాలను ప్రసాదిస్తూ ఉంటాడు. పుట్టుకా సంసారం బంధమూ ఇస్తూ ఉంటాడు. నీ శాపానికి భయపడి నేను ఇలా అనట్లేదు. శాపాన్ని తీసేయమని నేను అడగను. ఒక వేళ నేను మాట్లాడిన దాని వలన నీ మనసు కష్ట్పడితే, నేను తప్పుగా మాట్లాడితే క్షమించు. కానీ ఆ శాపం తొలగించమని నేను అడగను "

శ్రీశుక ఉవాచ
ఇతి ప్రసాద్య గిరిశౌ చిత్రకేతురరిన్దమ
జగామ స్వవిమానేన పశ్యతోః స్మయతోస్తయోః

ఇలా పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకుని వారందరూ చూస్తుండగానే విమానం ఎక్కి వెళ్ళిపోయాడు.

తతస్తు భగవాన్రుద్రో రుద్రాణీమిదమబ్రవీత్
దేవర్షిదైత్యసిద్ధానాం పార్షదానాం చ శృణ్వతామ్

అప్పుడు పార్వతీ దేవీ ఋషులూ దేవతలూ జ్ఞ్యానులూ అందరూ వింటూ ఉండగా శంకరుడు ఇలా చెప్పాడు

శ్రీరుద్ర ఉవాచ
దృష్టవత్యసి సుశ్రోణి హరేరద్భుతకర్మణః
మాహాత్మ్యం భృత్యభృత్యానాం నిఃస్పృహాణాం మహాత్మనామ్

శ్రీమన్నారాయణుని భక్తుల ప్రభావం అర్థమయ్యిందా. పరమాత్మ భక్తులూ, పరమాత్మ భక్తుల భక్తులు నిస్పృహులు. కహ్స్టమొచ్చినా సుఖమొచ్చినా వారు పరమాత్మను స్మరిస్తూనే ఉంటారు.

నారాయణపరాః సర్వే న కుతశ్చన బిభ్యతి
స్వర్గాపవర్గనరకేష్వపి తుల్యార్థదర్శినః

శ్రీమన్నారాయణుని భక్తులు దేని నుండీ భయపడరు. వారికి స్వర్గమూ మోక్షమూ నరకమూ మూడూ సమానమే. వారు దేన్నీ కోరరు.

దేహినాం దేహసంయోగాద్ద్వన్ద్వానీశ్వరలీలయా
సుఖం దుఃఖం మృతిర్జన్మ శాపోऽనుగ్రహ ఏవ చ

మానవులకు శరీరముతో సంబంధం ఉన్నప్పుడే ద్వంద్వములు. జీవులకు దేహము యొక్క సంబంధముతో కలిగేవి ద్వంద్వాలు. ఈ భావనలు ఆత్మకు కావు, ఆత్మవి కావు.

అవివేకకృతః పుంసో హ్యర్థభేద ఇవాత్మని
గుణదోషవికల్పశ్చ భిదేవ స్రజివత్కృతః

ఇది గుణదోష వికల్పం. ఇవి గుణములనీ ఇవి దోషములనీ అంటాం. పుష్పమాలలో పూలన్నీ కలిసి ఉన్నాయి అంటాము. కానీ అలా కలిపినవి దారము గానీ యదార్థముగా పూలు వేరుగానే ఉన్నాయి. ఆత్మ వేరుగా శరీరము వేరుగా ఉన్నా మాయ వలన శరీరమూ ఆత్మా కలిసి ఉన్నాయి అని అంటున్నాము.

వాసుదేవే భగవతి భక్తిముద్వహతాం నృణామ్
జ్ఞానవైరాగ్యవీర్యాణాం న హి కశ్చిద్వ్యపాశ్రయః

పరమాత్మ యందు భక్తి ఉన్న వారి యొక్క బలం జ్ఞ్యానమూ వైరాగ్యం. అలాంటి వారికి ఈ ప్రపంచములో తొలగించవలసినదీ తొలగిపోవలసినదీ అంటూ ఏమీ లేవు

నాహం విరిఞ్చో న కుమారనారదౌ న బ్రహ్మపుత్రా మునయః సురేశాః
విదామ యస్యేహితమంశకాంశకా న తత్స్వరూపం పృథగీశమానినః

నేనూ బ్రహ్మా కుమార నారదులూ మునులూ బ్రహ్మ పుత్రులూ దేవతలూ అందరూ నారాయణుని అంశ అంశలో వారము. ఆయన ఏమనుకుంటున్నాడో మాకు తెలియదు. ఆయన స్వరూపం కూడా మాకు తెలియదు. ఎవరికి వారమే మేమే ప్రభువులమనుకుంటున్నాము. అటువంటి మేము ఆ పరమాత్మ సంకల్పాన్ని తెలుసుకోలేము.

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియః స్వః పరోऽపి వా
ఆత్మత్వాత్సర్వభూతానాం సర్వభూతప్రియో హరిః

ఇలాంటి వారికి ప్రీతి పాత్రుడూ శత్రువూ అంటూ ఉండరు. ఆయన అందరికీ ఆత్మే. శరీరములో కాళ్ళ నుండి తల వరకూ ఉన్న అవయవాలలో ఏది మనకు ఇష్టం అంటే ఏమని చెబుతాము. ఎలాగైతే శరీరమునకన్ని అవయవములూ సమానమో ఆత్మకు కూడా అన్నీ సమానమే. పరమాత్మకు అందరి యందు సమాన ప్రీతి ఉంది. పరమాత్మంటే సకల ప్రాణులకీ ప్రియుడు.

తస్య చాయం మహాభాగశ్చిత్రకేతుః ప్రియోऽనుగః
సర్వత్ర సమదృక్శాన్తో హ్యహం చైవాచ్యుతప్రియః

అటువంటి పరమాత్మకు చిత్రకేతువు మిక్కిలి ప్రియమైన వాడు. ఇతను అన్నింటినీ అన్నింటా సమానముగా చూస్తాడు. పరమాత్మకు అతను ప్రియుడు. పరమాత్మ నాకు (శంకరునకు) ప్రియుడు.

తస్మాన్న విస్మయః కార్యః పురుషేషు మహాత్మసు
మహాపురుషభక్తేషు శాన్తేషు సమదర్శిషు

మహానుభావుల విషయములో వారి చర్యలను చూసి మనం ఆశ్చర్యపడకూడదు. వారెందుకు వస్తారో ఎందుకు వెళతారో మనకు అర్థం కాదు. వారు శాంతులూ సమదర్శులు.

శ్రీశుక ఉవాచ
ఇతి శ్రుత్వా భగవతః శివస్యోమాభిభాషితమ్
బభూవ శాన్తధీ రాజన్దేవీ విగతవిస్మయా

ఇది విని పార్వతీ దేవి ఆశ్చర్యాన్ని వదిలిపెట్టి ప్రశాంతముగా ఉంది.

ఇతి భాగవతో దేవ్యాః ప్రతిశప్తుమలన్తమః
మూర్ధ్నా స జగృహే శాపమేతావత్సాధులక్షణమ్

పార్వతీ దేవికి ప్రతి శాపం ఇవ్వగల శక్తి ఉండి కూడా చిత్రకేతువు మౌనముగా వెళ్ళిపోయాడు. ఇది మహానుభావుల లక్షణం.

జజ్ఞే త్వష్టుర్దక్షిణాగ్నౌ దానవీం యోనిమాశ్రితః
వృత్ర ఇత్యభివిఖ్యాతో జ్ఞానవిజ్ఞానసంయుతః

ఈయనే త్వష్ట యజ్ఞ్యం చేస్తుంటే ఆ దక్షిణాగ్నిలో రాక్షస రూపములో పుట్టాడు. రాక్షసునిగా పుట్టినా అతనికి జ్ఞ్యాన విజ్ఞ్యానములు రెండూ ఉన్నాయి. పరమాత్మ యందు భక్తి పోలేదూ, లౌకిక జ్ఞ్యానమూ పోలేదు.

ఏతత్తే సర్వమాఖ్యాతం యన్మాం త్వం పరిపృచ్ఛసి
వృత్రస్యాసురజాతేశ్చ కారణం భగవన్మతేః

నీవడిగినది నేను వివరించాను. పరమాత్మ యందు భక్తి ఉన్న మహానుభావుడు రాక్షసునిగా పుట్టడానికి గల కారణం చెప్పాను

ఇతిహాసమిమం పుణ్యం చిత్రకేతోర్మహాత్మనః
మాహాత్మ్యం విష్ణుభక్తానాం శ్రుత్వా బన్ధాద్విముచ్యతే

ఇది మహానుభావుడైన చిత్రకేతు ఉపాఖ్యానం. విష్ణు భక్తుల మాహాత్యం విన్న వాడు సంసార బంధనం నుండి విడుదల అవుతాడు.

య ఏతత్ప్రాతరుత్థాయ శ్రద్ధయా వాగ్యతః పఠేత్
ఇతిహాసం హరిం స్మృత్వా స యాతి పరమాం గతిమ్

ఈ చిత్రకేతూ వృత్తాసుర ఉపాఖ్యానమును ప్రతీరోజూ ప్రాతః కాలములో పరమాత్మను స్మరించుకుంటూ చదివిన వాడు పరమపదమును పొందుతాడు.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదహారవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదహారవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
అథ దేవఋషీ రాజన్సమ్పరేతం నృపాత్మజమ్
దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనామనుశోచతామ్

ఇంత చెప్పినా ఆ రాజుకు చనిపోయిన పిల్లవాడిమీదే ధ్యాస ఉండటముతో ఆ చనిపోయిన పిల్లవాని ఆత్మను పిలిచాడు

శ్రీనారద ఉవాచ
జీవాత్మన్పశ్య భద్రం తే మాతరం పితరం చ తే
సుహృదో బాన్ధవాస్తప్తాః శుచా త్వత్కృతయా భృశమ్

ఓ జీవాత్మా నీకు మేలు, వీరిద్దరూ నీ తల్లితండ్రులు, వారి కోసం నీ శరీరములో మళ్ళీ చేరు. నీవు రాజుగారి కొడుకువు. పెరిగితే యువరాజువవుతావు

కలేవరం స్వమావిశ్య శేషమాయుః సుహృద్వృతః
భుఙ్క్ష్వ భోగాన్పితృప్రత్తానధితిష్ఠ నృపాసనమ్

జీవ ఉవాచ
కస్మిన్జన్మన్యమీ మహ్యం పితరో మాతరోऽభవన్
కర్మభిర్భ్రామ్యమాణస్య దేవతిర్యఙ్నృయోనిషు

అప్పుడు జీవాత్మ "వీరు తల్లి తండ్రులంటున్నారు. ఇన్ని కోట్ల జన్మలో ఏ జన్మలో వీరు నాకు తల్లి తండ్రులు"

బన్ధుజ్ఞాత్యరిమధ్యస్థ మిత్రోదాసీనవిద్విషః
సర్వ ఏవ హి సర్వేషాం భవన్తి క్రమశో మిథః

దేవతగా మానవునిగా పశువుగా కీటకముగా పుట్టాను.  వీటిలో ఏ జన్మలో తల్లి తండ్రులు వీరు. తల్లి తండ్రులూ బందువులూ జ్ఞ్యాతులూ మిత్రులూ భార్యా, ప్రతీ ఒక్కరూ సంసారములో ఇవన్నీ అవుతారు. ఎవరు ఎప్పుడు తండ్రో అన్నో కొడుకో మిత్రుడో ఎవరు ఎవరికి ఏమవుతారో. తామాచరించే కర్మల వలన సంచరించే ఈ సంసారములో అందరికీ అందరూ అన్నీ కావొచ్చు, ఏమీ కాకపోవచ్చు

యథా వస్తూని పణ్యాని హేమాదీని తతస్తతః
పర్యటన్తి నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు

అంగట్లో వస్తువును మనం కొనుక్కుంటే అది మన వస్తువు. దాన్ని మళ్ళీ అమ్మితే కొన్నవాడు యజమాని.మనం కూడా ఇంతే.

నిత్యస్యార్థస్య సమ్బన్ధో హ్యనిత్యో దృశ్యతే నృషు
యావద్యస్య హి సమ్బన్ధో మమత్వం తావదేవ హి

అంగట్లో ఉన్న వస్తువులు అందరిలో తిరుగుతూ ఉన్నట్లు ఈ జీవుడు రకరకాల శరీరాలలో పుడతాడు. ఆత్మ ఒక్కటే నిత్యం. శరీరమ నిత్యం. నిత్యమైన ఆత్మకు శరీరముతో సంబంధం అనిత్యం. అనిత్యమైన శరీరాన్ని మరచిపోయి నిత్యమైన ఆత్మను తలచుకోవడం జ్ఞ్యాని పని. అలా చేయని వాడు మూర్ఖుడు. అసలు జీవునికి నాశమూ అహంకారం లేదు

ఏవం యోనిగతో జీవః స నిత్యో నిరహఙ్కృతః
యావద్యత్రోపలభ్యేత తావత్స్వత్వం హి తస్య తత్

ఏష నిత్యోऽవ్యయః సూక్ష్మ ఏష సర్వాశ్రయః స్వదృక్
ఆత్మమాయాగుణైర్విశ్వమాత్మానం సృజతే ప్రభుః

అందరికీ ఇదే ఆశ్రయం నిత్యం సూక్షం. పరమాత్మ దీన్ని ఆత్మ మాయా గుణములతో సృష్టించి సంహరిస్తాడు. ఆత్మకు కానీ పరమాత్మకు కానీ ప్రియమైనదీ అప్రియమైనదీ ఉండదు. ఎవరు ఏ తప్పు చేస్తున్నాడో చూసే పరమాత్మ. ఈ ఆత్మ ఏ తప్పూ చేయదు, ఏ పనీ చేయదు. ఈ ఆత్మకు ఏ కర్మ ఫల దోషం అంటదు. అలాంటి నన్ను తీసుకొచ్చి ఈ కారాగారములో ఉండమని అంటున్నారు. పరమాత్మ ఉదాసీనముగా ఉంటాడు. అన్నీ కటాక్షిస్తూ ఉంటాడు. ఆయనతోనే నాకు సంబంధం అని చెప్పి ఆ జీవుడు వెళ్ళిపోయాడు.

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియః స్వః పరోऽపి వా
ఏకః సర్వధియాం ద్రష్టా కర్తౄణాం గుణదోషయోః

నాదత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలమ్
ఉదాసీనవదాసీనః పరావరదృగీశ్వరః

శ్రీబాదరాయణిరువాచ
ఇత్యుదీర్య గతో జీవో జ్ఞాతయస్తస్య తే తదా
విస్మితా ముముచుః శోకం ఛిత్త్వాత్మస్నేహశృఙ్ఖలామ్

అది విని రాజూ బంధువులూ ఆశ్చర్యముతో స్నేహాన్నీ దుఃఖాన్ని విడిచిపెట్టి ఆ దేహానికి అంత్య సంస్కారం చేసి, విడిచిపెట్టలేని ప్రేమనూ స్నేహాన్ని ఉపదేశముతో విడిచిపెట్టి

నిర్హృత్య జ్ఞాతయో జ్ఞాతేర్దేహం కృత్వోచితాః క్రియాః
తత్యజుర్దుస్త్యజం స్నేహం శోకమోహభయార్తిదమ్

బాలఘ్న్యో వ్రీడితాస్తత్ర బాలహత్యాహతప్రభాః
బాలహత్యావ్రతం చేరుర్బ్రాహ్మణైర్యన్నిరూపితమ్
యమునాయాం మహారాజ స్మరన్త్యో ద్విజభాషితమ్

ఇంత జరిగితే ఆపిల్లవాన్ని చంపిన తొమ్మిది వందల తొంభై మంది స్త్రీలు చేసిన పనికి సిగ్గుపడి బాల హత్యకు పరిహారం చేసుకుని యమునా నదిలో స్నానం చేసి పాపం పోగొట్టుకున్నారు. నారాద అంగీరసుల జ్ఞ్యాన బోధ వలన బుద్ధి తెచ్చుకున్న బురదలోంచి ఏనుగు బయటకు వచ్చినట్లు చిత్రకేతు సంసారం నుండి బయటకు వచ్చి యమునా నదిలో స్నానం చేసి తర్పణాలు చేసి ప్రాణాయామం చేసి నారాదాంగీరసులకు నమస్కరించాడు.

స ఇత్థం ప్రతిబుద్ధాత్మా చిత్రకేతుర్ద్విజోక్తిభిః
గృహాన్ధకూపాన్నిష్క్రాన్తః సరఃపఙ్కాదివ ద్విపః

కాలిన్ద్యాం విధివత్స్నాత్వా కృతపుణ్యజలక్రియః
మౌనేన సంయతప్రాణో బ్రహ్మపుత్రావవన్దత

అథ తస్మై ప్రపన్నాయ భక్తాయ ప్రయతాత్మనే
భగవాన్నారదః ప్రీతో విద్యామేతామువాచ హ

ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ

ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ
ఓం నమస్తుభ్యం భగవతే ప్రద్యుమ్నాయా
ఓం నమస్తుభ్యం భగవతే అనిరుద్ధాయ
ఓం నమస్తుభ్యం భగవతే సఙ్కర్షణాయ

నమో విజ్ఞానమాత్రాయ పరమానన్దమూర్తయే
ఆత్మారామాయ శాన్తాయ నివృత్తద్వైతదృష్టయే

వ్యక్తముగా సమస్తముగా మంత్రమును నారదుడు ఉపదేశించి ఆత్మారామునికీ శాంతునికీ భేధ దృష్టి లేని వానికి నమస్కారం.

ఆత్మానన్దానుభూత్యైవ న్యస్తశక్త్యూర్మయే నమః
హృషీకేశాయ మహతే నమస్తేऽనన్తమూర్తయే

సకల ఇంద్రియాధిపతికి నమస్కారం

వచస్యుపరతేऽప్రాప్య య ఏకో మనసా సహ
అనామరూపశ్చిన్మాత్రః సోऽవ్యాన్నః సదసత్పరః

మనస్సుతో సహా అన్ని వాక్కులూ మంత్రములూ అక్కడిదాకా వెళ్ళి తెలియక్ వచ్చాయి. సకల చరాచర జగత్తు ఎవరిలో పుట్టి ఉండి లీనమవుతుందో. మట్టితో చేయబడీ కుండలు మట్టిలోకే వెళ్ళినట్లు మనం కూడా పరమాత్మ నుండి వచ్చి, పరమాత్మ లోనికే వెళతాము

యస్మిన్నిదం యతశ్చేదం తిష్ఠత్యప్యేతి జాయతే
మృణ్మయేష్వివ మృజ్జాతిస్తస్మై తే బ్రహ్మణే నమః

యన్న స్పృశన్తి న విదుర్మనోబుద్ధీన్ద్రియాసవః
అన్తర్బహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోऽస్మ్యహమ్

దేహేన్ద్రియప్రాణమనోధియోऽమీ యదంశవిద్ధాః ప్రచరన్తి కర్మసు
నైవాన్యదా లౌహమివాప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట్రపదేశమేతి

దేహం ఇంద్రియం ప్రాణం మనసు బుద్ధీ అంతః కరణం పరమాత్మ అంశ ఉన్నప్పుడే పని చేస్తాయి. అవి లేనప్పుడు పని చేయలేవు. ఇనుము గానీ బంగారం కానీ రాగి కానీ ఏ లోహమైనా అగ్ని సంస్కారం ఉంటేనే  మనకు కావలసిన రీతిలో మలచుకుంటుంది. అలాగే మనం ఏ పని చేయాలన్నా పరమాత్మ స్పృష్టం కావాలి.ఆయన లేకుండా గడ్డిపరక కూడా కదలదు. మనం చూస్తున్నామని కానీ చూడబడుతున్నామని కానీ అంటున్నామంటే అది ఆయన సంకల్పం ఉంటేనే. మాట్లాడుటా చూచుటా తినుటా నడుచుటా అన్ని పరమాత్మ అంశ వలనే జరుగుతాయి

ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే
సకలసాత్వతపరివృఢనికరకరకమలకుడ్మలోపలాలితచరణారవిన్దయుగల పరమపరమేష్ఠిన్నమస్తే

అరవై ఎనిమిది అక్షరాల మంత్రం ఇది. దీన్ని ఏడు రోజులు జపం చేస్తే

శ్రీశుక ఉవాచ
భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః
యయావఙ్గిరసా సాకం ధామ స్వాయమ్భువం ప్రభో

సంకర్షణుడు కనపడతాడని చెప్పి నారదుడూ అంగీరసుడు వెళ్ళిపోయారు. చిత్ర్కేతువు నీరు మాత్రమే తీసుకుంటూ ఏడు రోజులు సావధాన మనస్కుడై ఆ మంత్రాన్ని జపించాడు. అలా చేస్తే మానవుడిగా  ఉన్న చిత్రకేతువు విద్యాధరాధిపత్యం పొందాడు

చిత్రకేతుస్తు తాం విద్యాం యథా నారదభాషితామ్
ధారయామాస సప్తాహమబ్భక్షః సుసమాహితః

తతః స సప్తరాత్రాన్తే విద్యయా ధార్యమాణయా
విద్యాధరాధిపత్యం చ లేభేऽప్రతిహతం నృప

తతః కతిపయాహోభిర్విద్యయేద్ధమనోగతిః
జగామ దేవదేవస్య శేషస్య చరణాన్తికమ్

ఈ మంత్రాన్ని అలాగే జపిస్తూ ఈ మంత్ర ప్రభావముతో కొద్ది రోజులలోనే ఆదిశేషుని వద్దకు వెళ్ళాడు

మృణాలగౌరం శితివాససం స్ఫురత్కిరీటకేయూరకటిత్రకఙ్కణమ్
ప్రసన్నవక్త్రారుణలోచనం వృతం దదర్శ సిద్ధేశ్వరమణ్డలైః ప్రభుమ్

ఆదిశేషున్ని సాక్షాత్కరించుకోగలిగాడు. తామర తూడు లాగ తెల్లని వర్ణం గలిగి, నల్లని వస్త్రం ధరించి,సిద్ధ సాధ్యాదులతో కూడి ఉన్న స్వామిని సేవించాడు. అలా సేవించడం వలన పాపములన్నీ పటాపంచలైపోయాయి

తద్దర్శనధ్వస్తసమస్తకిల్బిషః స్వస్థామలాన్తఃకరణోऽభ్యయాన్మునిః
ప్రవృద్ధభక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్టరోమానమదాదిపురుషమ్

పరిశుద్ధమైన అంతఃకరణముతో భక్తి పెరిగి పులకింతలు కలిగి ఆనంద బాష్పాలతో నమస్కరించాడు. ఆయన పాద పద్మాలను కన్నీటితో తడిపితే

స ఉత్తమశ్లోకపదాబ్జవిష్టరం ప్రేమాశ్రులేశైరుపమేహయన్ముహుః
ప్రేమోపరుద్ధాఖిలవర్ణనిర్గమో నైవాశకత్తం ప్రసమీడితుం చిరమ్

తతః సమాధాయ మనో మనీషయా బభాష ఏతత్ప్రతిలబ్ధవాగసౌ
నియమ్య సర్వేన్ద్రియబాహ్యవర్తనం జగద్గురుం సాత్వతశాస్త్రవిగ్రహమ్

మాట్లాడాలనుకున్నా నోట మాట రాలేదు. ఆయన కటాక్షముతో మనసుని నిగ్రహించుకుని వాక్కుని పొంది ఇతర ఇంద్రియముల పనులు మానివేసి ఆదిశేషుని స్తోత్రం చేస్తున్నాడు. ఇది సంకర్షణ స్తుతి. మనో నియమానికి ఇదొక మంత్రం. ఇది రోజూ చదివితే మనసు చెప్పినట్లు వింటుంది

చిత్రకేతురువాచ
అజిత జితః సమమతిభిః సాధుభిర్భవాన్జితాత్మభిర్భవతా
విజితాస్తేऽపి చ భజతామకామాత్మనాం య ఆత్మదోऽతికరుణః

ఎవరు మనసు జయిస్తారో వారు నిన్ను గెలుస్తారో. ఎవరు తమ మనసుని గెలవరో వారిని నీవు గెలుస్తావు

తవ విభవః ఖలు భగవన్జగదుదయస్థితిలయాదీని
విశ్వసృజస్తేऽంశాంశాస్తత్ర మృషా స్పర్ధన్తి పృథగభిమత్యా

ఎవరికి కోరికలుండవో వారికి నిన్ను నీవు ఇచ్చుకుంటావో. ఎవరికి  కోరికలు ఉంటాయో వారికి కోరికలు తప్ప ఇంకేమీ మిగలవు. ప్రపంచం యొక్క సృష్టి స్థితీ సంహారం నీ లీలలు. ప్రజాపతులందరూ నేనే సృష్టి చేస్తున్నానని తమలో తాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నీ దయ లేనప్పుడు ఇలాంటి దోషాలు కలుగుతాయి.నీవే అసలు జగన్నాయకుడవు.

పరమాణుపరమమహతోస్త్వమాద్యన్తాన్తరవర్తీ త్రయవిధురః
ఆదావన్తేऽపి చ సత్త్వానాం యద్ధ్రువం తదేవాన్తరాలేऽపి

చిన్నవాటికన్నిటికీ చిన్నవాడివీ, పెద్దవాటన్నిటికీ పెద్దవాడివి. లోపలా వెలుపలా నీవున్నావు ప్రాణుల యొక్క ప్రారంభమూ మధ్యా చివరలో నీవే ఉంటావు. మొదలూ మధ్యా చివరా ప్రతీ వస్తువులో నీవే. ఏడు ఊర్ధ్వ ఏడు అధో లోకాలు కలిపి ఉన్న బ్రహ్మ్మాండం చుట్టూ ఏడు ఆవరణలు ఉంటాయి. భూమి ఎంత విస్తీర్ణమో దానికి పదిరెట్లు జలము. అలా ఒకదానికి ఒకటి పది రెట్లు భూమీ జలం అగ్ని వాయువు ఆకాశం  మహత్తూ అహంకారం. త్రయవిధురః - ఆ మూడూ (మొదలు మధ్య అంతం) నీకు లేవు. కానీ ఆది మధ్యాంతములు కల్పిస్తూ ఆ ఆదిలో అంతములో మధ్యలో నీవే ఇంద్రియములూ శరీరములూ నీవే. ఈ అనంతకోటి బ్రహ్మాండములలో ఉన్న జీవులందరిలో అంతర్యామిగా నీవే ఉన్నావు. బ్రహ్మానడములలో బ్రహ్మాండముల ఆవరణలో ఆ ఆవరణలో ఉన్న ఆది మధ్యాంతములలో వాటిలో ఉండే జీవులలో అంతర్యామిగా ఉన్నావు నీవు.

క్షిత్యాదిభిరేష కిలావృతః సప్తభిర్దశగుణోత్తరైరణ్డకోశః
యత్ర పతత్యణుకల్పః సహాణ్డకోటికోటిభిస్తదనన్తః

ఈ బ్రహ్మాండమంతా నీ ఇన్ని వేల శిరస్సులలో ఒక అణువులా అనిపిస్తుంది. అందుకే నిన్ను అనంతుడూ అంటారు

విషయతృషో నరపశవో య ఉపాసతే విభూతీర్న పరం త్వామ్
తేషామాశిష ఈశ తదను వినశ్యన్తి యథా రాజకులమ్

ఇలాంటి సప్తావరణలూ వాటి ప్రభావాలూ చూసాక కూడా నీవు ప్రసాదించే ఐశ్వర్యాలు కావాలి గానీ నీవు మాత్రం వద్దు అంటారు. వారేమి కోరుకున్నారో అదే ఇస్తున్నావు. అవీ పోతున్నాయి, వారూ పోతున్నారు. అందరూ నీ విభూతులు కావలని కోరుకుంటారు గానీ నిన్ను కోరరు. ఇలా వరాలిచ్చే దేవతలు కూడా నిత్యము కాదు. యథా రాజకులమ్ - కొత్త రాజు రాగానే పాత రాజు ఇచ్చినవి వెనక్కు తీసేసుకుంటాడు. అలా మనం నిత్యముగా ఉండని దేవతలని ఆరాధిస్తే వారి వలన వచ్చే సుఖ భోగాలు ఆ విభూతులు ఉన్నంత వరకే ఉంటాయి.

కామధియస్త్వయి రచితా న పరమ రోహన్తి యథా కరమ్భబీజాని
జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోऽస్య ద్వన్ద్వజాలాని

మంచి విత్తనాలు వేస్తే మొలుస్తాయి గానీ, చెడు విత్తనాలు మొలుస్తాయా? నీ యందు భక్తి లేకుండా ఆశతో సేవించే వారికి నీవు కనపడతావా.  కోరికలు నింపుకున్న బుద్ధి గలవారు నీ యందు మనసు నిలుపలేరు. నీవు జ్ఞ్యాన స్వరూపుడవు, గుణ రహితుడవు. గుణాలను లెక్కపెట్టుకునే మేము గుణాలు లేని నిన్ను నశించేవాటిని అడగడం అవివేకం.

జితమజిత తదా భవతా యదాహ భాగవతం ధర్మమనవద్యమ్
నిష్కిఞ్చనా యే మునయ ఆత్మారామా యముపాసతేऽపవర్గాయ

సాంసారికమైన విషయములు కావాలనుకున్న వారు నీవు చెప్పిన భాగవత ధర్మాన్ని ఆచరించలేరు. గుణవంతులైన వారి దగ్గర నేను నాదీ, నీవు నీది అన్న భావములు ఎక్కువగా ఉంటాయి.

విషమమతిర్న యత్ర నృణాం త్వమహమితి మమ తవేతి చ యదన్యత్ర
విషమధియా రచితో యః స హ్యవిశుద్ధః క్షయిష్ణురధర్మబహులః

వైషమ్యముతో కూడిన భేధ బుద్ధితో ఏర్పరచిన ఈ భావ పరంపర ఎవరికుంటుందో వారు పరిశుద్ధులు కారు. వారు నశించిపోయేవారు, అధర్మమే అధికముగా కలవారు.

కః క్షేమో నిజపరయోః కియాన్వార్థః స్వపరద్రుహా ధర్మేణ
స్వద్రోహాత్తవ కోపః పరసమ్పీడయా చ తథాధర్మః

నాదీ, ఇతరులదీ అంటున్నవారిలో ఎవరు నమ్మదగ్గర వారు?  ఈ ఇద్దరిలో ఎవరైనా నశించకుండా ఉంటారా? ఈ రెండు భావాలూ అజ్ఞ్యాన జనితములే. లోకములో మానవులు రెండు రకాలుగా ఉంటారు. కొందరు తమరికి ద్రోహం చేసుకుంటారు. కొందరు ఇతరులకు ద్రోహం చేస్తారు. ఈ రెంటిలో దేని వల్లనైనా లాభం ఉందా? నష్టం లేకుండా ఉందా?? లాభం లేకపోయినా నష్టం ఉంటుంది. తనకు తాన ద్రోహం చేసుకుంటే పరమాత్మవైన నీకు కోపం వస్తుంది. ఇతరులకు చేస్తే అది అధర్మం అవుతుంది.

న వ్యభిచరతి తవేక్షా యయా హ్యభిహితో భాగవతో ధర్మః
స్థిరచరసత్త్వకదమ్బేష్వపృథగ్ధియో యముపాసతే త్వార్యాః

నీవు బోధించిన పరమభాగవత ధర్మానికి ఏ ద్రోహమూ లేదు, న వ్యభిచరతి (తన గతిని విడిచిపెట్టి పోదు). భేధ బుద్ధి లేని వారు చరాచరమైన జగత్తు విషయమూలో భేధ భావనతో ఉండరు. అన్నీ పరమాత్మే అనుకున్నవారు ఎవరికి ద్రోహం చేస్తారు ఎవరిని నిందిస్తారు, దేన్ని అనుభవిస్తారు?

న హి భగవన్నఘటితమిదం త్వద్దర్శనాన్నృణామఖిలపాపక్షయః
యన్నామ సకృచ్ఛ్రవణాత్పుక్కశోऽపి విముచ్యతే సంసారాత్

నిన్ను ఒక్క సారి దర్శించుకుంటే అంతవరకూ చేసినటువంటి అన్ని పాపాలూ పోతాయి. చండాలుడు కూడా తన వశములో లేకుండా అనుకోకుండా నీ నామాన్ని స్మరిస్తే ఉత్తమ స్థితి లభిస్తుంది. ఒకటికి నాలుగు సార్లు నీ నామం వింటే చండాలుడు కూడా సంసారం నుంచి విముక్తుడైనప్పుడు నిరంతరం నీ నామ స్మరణ చేసేవాడు మోక్షానికి వెళతాడని వేరే చెప్పాలా

అథ భగవన్వయమధునా త్వదవలోకపరిమృష్టాశయమలాః
సురఋషిణా యత్కథితం తావకేన కథమన్యథా భవతి

నిన్ను దర్శించుకున్నతరువాత నాకు ఉన్న గుణ త్రయములు నశించాయి, వాటి వలన బాధ నశించింది. నిన్ను చూసిన వెంటనే నా అజ్ఞ్యానం తొలగిపోయి నా స్వరూపం నేను తెలుసుకున్నాను

విదితమనన్త సమస్తం తవ జగదాత్మనో జనైరిహాచరితమ్
విజ్ఞాప్యం పరమగురోః కియదివ సవితురివ ఖద్యోతైః

అందరిలో అంతర్యామిగా ఉన్న నీకు ఎవరు ఏది చేస్తారో ఎందుకు చేస్తారో చెప్పాలా. అఖిల జగదాత్మవు నీవు. నిన్ను లోకానికి తెలపడానికి నిన్ను మేము స్తోత్రం చేస్తున్నామంటే జనులకు నిన్ను చూపడమనేది అయ్యే పనేనా? దివిటీలతో సూర్యున్ని చూపినట్లుగా, మిణుగురు పురుగులతో సూర్యభగవానుని చూపెట్టగలమా?

నమస్తుభ్యం భగవతే సకలజగత్స్థితిలయోదయేశాయ
దురవసితాత్మగతయే కుయోగినాం భిదా పరమహంసాయ

సకల చరాచర సృష్టి స్థితి లయాలను చేసే నీకు నమస్కారం. నీ స్వరూపం మాకు అర్థం కాదు. దుష్ట యోగులకు ఆత్మ గతి అర్థం కాదు.

యం వై శ్వసన్తమను విశ్వసృజః శ్వసన్తి
యం చేకితానమను చిత్తయ ఉచ్చకన్తి
భూమణ్డలం సర్షపాయతి యస్య మూర్ధ్ని
తస్మై నమో భగవతేऽస్తు సహస్రమూర్ధ్నే

నీవు చూస్తే లోకాలన్నీ చూస్తాయి, నీవు నిట్టూర్పు విడిస్తే లోకాలన్నీ నిట్టుర్పు విడుస్తాయి. ఎవరు శిరస్సు మీద ఈ లోకాలన్నీ ఉంటాయో అటువంటి స్వామికి నమస్కారం.

శ్రీశుక ఉవాచ
సంస్తుతో భగవానేవమనన్తస్తమభాషత
విద్యాధరపతిం ప్రీతశ్చిత్రకేతుం కురూద్వహ

ఈ ప్రకారముగా స్తోత్రం చేసిన చిత్రకేతుతో పరమాత్మ

శ్రీభగవానువాచ
యన్నారదాఙ్గిరోభ్యాం తే వ్యాహృతం మేऽనుశాసనమ్
సంసిద్ధోऽసి తయా రాజన్విద్యయా దర్శనాచ్చ మే

నారదాంగీరసులు నీకు ఏ నా స్వరూపాన్ని బోధించారో ఆ విద్యతో నా దర్శనముతో సిద్ధుడవయ్యావు. అన్ని భూతాలకూ ఆత్మని నేనే, అన్ని  భూతాలను బతికించేవాడినీ నేనే. నేనే శబ్ద బ్రహ్మ (ఉపాసకులకు) పరబ్రహ్మ (జ్ఞ్యానులకు). ఈ రెండూ నేనే. లోకములో నేనూ, నాలో లోకములూ వ్యాపించి ఉన్నాయి.

అహం వై సర్వభూతాని భూతాత్మా భూతభావనః
శబ్దబ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీ తనూ

లోకే వితతమాత్మానం లోకం చాత్మని సన్తతమ్
ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతమ్

ప్రకృతి జీవాత్మలలో నేనున్నాను, ఆ రెండూ నాలో ఉన్నాయి. రెండు నాతోటీ నేను రెంటితోటి వ్యాపించి ఉన్నను.లోకములో నారాయణుడు ఉన్నాడు. నారాయణునిలో లోకము ఉంది.

యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని
ఆత్మానమేకదేశస్థం మన్యతే స్వప్న ఉత్థితః

కలలో అనేక వాహనాలను చూస్తాడు, కొన్నిటిని అధిరోహిస్తాడు, మరి కల ఐపోగానే అవన్నీ అసత్యం అని తెలుసుకుంటాడు. జగత్తు కూడా ఇంతే. కల ఉన్నంత వరకూ అవి అన్నీ చూస్తాడు. అజ్ఞ్యానం ఉన్నంతవరకూ నా ఇల్లూ నా భార్యా నా సంపదా అని అంటాడు. అజ్ఞ్యానం తొలగగానే అవేవీ ఉండవు.

ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః
మాయామాత్రాణి విజ్ఞాయ తద్ద్రష్టారం పరం స్మరేత్

సుషుప్తి జాగరం స్వప్నం అనే మూడు దశలు ఉన్నాయి. నిద్రావస్థలో ఏదీ తెలియదు. స్వప్నావస్థలో కల వచ్చినట్లు తెలుస్తూ ఉంటుంది. నిద్రపోయింది కలగన్నదీ శరీరమా ఆత్మా? స్వప్నావస్థలో ఉన్న సకల జగత్తు ఎలా మేలుకున్న తరువాత అదృశ్యమవుతుందో మాయచే ఆక్రమించిన జీవుడు ఇదంతా మాయతో ఏర్పరచిన జగత్తు అని తెలుసుకుని, మాయతో ఏర్పరచిన జగత్తుని కాకుండా నన్ను చూస్తాడు. బుద్ధిమంతుడైన వాడు నన్ను స్మరిస్తాడు

యేన ప్రసుప్తః పురుషః స్వాపం వేదాత్మనస్తదా
సుఖం చ నిర్గుణం బ్రహ్మ తమాత్మానమవేహి మామ్

పడుకున్న వాడు పడుకుని లేచిన తరువాత "నేను చాలా బాగా నిదుర్పోయాను " అంటాడు. కలగన్న వాడు కల ఐపోయాక "నేను బాగా కలగన్నాను" అని అంటాడు. ఆ రెంటిలో ఉన్న "నేను" నిద్రపోయిన వాడిలో ఉన్నట్లా, కలగన్న వాడిలో ఉన్నట్లా? ఈ "నేను" ఆ రెంటి కంటే వేరు. నిద్రా స్వప్నావస్థలకంటే ఎలా ఐతే జీవుడు వేరో, ప్రకృతీ జీవులకంటే పరమాత్మ ఐన నేను వేరు. శరీరం విశ్రమించినప్పుడు జీవుడు ఏమి చేస్తూ ఉంటాడు. పరమాత్మను కౌగిలించుకుని ఉంటాడు. నేను నిర్గుణ బ్రహ్మనూ, సుఖ స్వరూపుడిని, నన్ను మాత్రమే నీవు తెలుసుకో..

ఉభయం స్మరతః పుంసః ప్రస్వాపప్రతిబోధయోః
అన్వేతి వ్యతిరిచ్యేత తజ్జ్ఞానం బ్రహ్మ తత్పరమ్

నిద్రపోయిన వాడూ కలగన్న వాడూ రెంటినీ తెలుసుకుంటాడు. నిద్రపోయానూ అంటాడు, కలగన్నానూ అంటాడు. ఆ జ్ఞ్యానం కలిగించే వాడిని నేనే. అవస్థలిచ్చేవాడిని నేనే, అవస్థలలో తేడాని తెలిపేవాడిని నేనే. అటువంటి నన్ను తెలుసుకో. రెండిటి వెంట ఉండేది, రెంటి కన్నా వేరుగా ఉండేది బ్రహ్మము.

యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః
తతః సంసార ఏతస్య దేహాద్దేహో మృతేర్మృతిః

ఆత్మకంటే జగత్తుకంటే పరమాత్మ వేరనీ, ఆ వేరుగా ఉన్న పరమాత్మను మరచిపోవుటే సంసారం. ఆ పరమాత్మను తెలియుటే మోక్షము. సంసారమంటే ఒక దేహం నుండి ఇంకో దేహానికి మారడమే. విజ్ఞ్యానమూ (లౌకిక జ్ఞ్యానం) జ్ఞ్యానమూ (ఆధ్యాత్మ జ్ఞ్యానం) తెలుసుకోగల మానవ జన్మ పొంది కూడా అది తెలుసుకోకుంటే ఆ జీవునికి శాంతం ఉండదు.

లబ్ధ్వేహ మానుషీం యోనిం జ్ఞానవిజ్ఞానసమ్భవామ్
ఆత్మానం యో న బుద్ధ్యేత న క్వచిత్క్షేమమాప్నుయాత్

స్మృత్వేహాయాం పరిక్లేశం తతః ఫలవిపర్యయమ్
అభయం చాప్యనీహాయాం సఙ్కల్పాద్విరమేత్కవిః

ఆశలో కష్టములు తెలిసి ఆశించడములో ఉన్న ఫలితం తెలుసుకుని, ఆశా ఫలం విపారీతం అనీ, విరక్తిలోనే అభయం ఉంది అని తెలుసుకున్న వాడు దేనినీ సంకల్పించకూడదు. కావాలి కావాలి అంటున్నంత సేపూ కష్టాలపాలవుతాడు. పండితుడు కోరికలను విరమించుకోవాలి.

సుఖాయ దుఃఖమోక్షాయ కుర్వాతే దమ్పతీ క్రియాః
తతోऽనివృత్తిరప్రాప్తిర్దుఃఖస్య చ సుఖస్య చ

భార్యా భర్తలు సుఖం కలగాలనీ దుఃఖం తొలగాలనీ సంసారం చేస్తారు. అది కలగక పోగా ఉన్న సుఖం పోయి కొత్త దుఃఖం వస్తుంది.

ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినామ్
ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయవిలక్షణామ్

మనమనుకున్నదేదీ రాదు, అనుకోనిదే వస్తుంది. పండితుడైన వాడు అనుకోవడం మానేస్తాడు. పొందుతున్న దాన్ని తెలుసుకుని అనుకోవడం మానెయ్యాలి. ఆత్మ యొక్క గతి చాలా విలక్షణమైనది, సూఖ్షమైనదీ అని తెలుసుకుని చూచిన దానితో విన్నదానితో చూచినవీ విన్నవీ అబద్దమని తెలుసుకుని వాటిని విడిచిపెట్టి జ్ఞ్యాన విజ్ఞ్యానముతో సంతోషముతో నా భక్తుడు నన్ను పొందాలి.

దృష్టశ్రుతాభిర్మాత్రాభిర్నిర్ముక్తః స్వేన తేజసా
జ్ఞానవిజ్ఞానసన్తృప్తో మద్భక్తః పురుషో భవేత్

ఏతావానేవ మనుజైర్యోగనైపుణ్యబుద్ధిభిః
స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్పరాత్మైకదర్శనమ్

యోగములో నైపుణ్యం సంపాదించిన మానవులు చేయవలసిన పని ఇదే. జీవుని స్వార్థమంటే ఒక్కటే - పరమాత్మ గురించి తెలుసుకోవడం, పరమాత్మను చూడలనుకోవడం. అది తెలుసుకోవడమే ప్రయోజనం అని భావించాలి

త్వమేతచ్ఛ్రద్ధయా రాజన్నప్రమత్తో వచో మమ
జ్ఞానవిజ్ఞానసమ్పన్నో ధారయన్నాశు సిధ్యసి

నేను చెప్పిన మాటలను పొరబడకుండా తెలుసుకుని జ్ఞ్యాన విజ్ఞ్యానమును తెలుసుకుని త్వరలోనే సిద్ధిని పొందుతావు. కోరికలూ మాని పరమాత్మని ధ్యానించు. ఇదే నిత్యం. ఇదే సత్యం.

శ్రీశుక ఉవాచ
ఆశ్వాస్య భగవానిత్థం చిత్రకేతుం జగద్గురుః
పశ్యతస్తస్య విశ్వాత్మా తతశ్చాన్తర్దధే హరిః

ఇలా జగత్తునకు గురువైన భగవానుడు చిత్రకేతువును ఓదార్చి చిత్రకేతువు చూస్తుండగా అంతర్ధానం చెందాడు

Friday, April 12, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఊచతుర్మృతకోపాన్తే పతితం మృతకోపమమ్
శోకాభిభూతం రాజానం బోధయన్తౌ సదుక్తిభిః

సంతానం కలిగితే అన్ని దుఃఖాలూ పోతాయి అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు. పుట్టిన వారు శాశ్వతముగా ఉంటారు అని ఎవరైనా మాట ఇచ్చారా, ఇవ్వగలరా? మొన్నటి వరకూ ఇతనెవరో నీకు తెలీదు. ప్రవాహములో కలిసిన కట్టెలు ఆ కలిసిన కాసేపూ నీవు భార్యా పిల్లలూ అంటూ ఉండడం సమంజసమా. ప్రవాహములో కట్టెలు కలిసినట్లుగా మానవులు కూడా కలుస్తూ ఉంటారూ విడిపోతూ ఉంటారు. ప్రతీ వరి గింజలో బియ్యపు గింజ ఉంటుందా. ఆన్ని భూమి నుంచి వచ్చినవే అయినా ఎంత తేడా ఉంటుంది.

కోऽయం స్యాత్తవ రాజేన్ద్ర భవాన్యమనుశోచతి
త్వం చాస్య కతమః సృష్టౌ పురేదానీమతః పరమ్

యథా ప్రయాన్తి సంయాన్తి స్రోతోవేగేన బాలుకాః
సంయుజ్యన్తే వియుజ్యన్తే తథా కాలేన దేహినః

యథా ధానాసు వై ధానా భవన్తి న భవన్తి చ
ఏవం భూతాని భూతేషు చోదితానీశమాయయా

వయం చ త్వం చ యే చేమే తుల్యకాలాశ్చరాచరాః
జన్మమృత్యోర్యథా పశ్చాత్ప్రాఙ్నైవమధునాపి భోః

భూతైర్భూతాని భూతేశః సృజత్యవతి హన్తి చ
ఆత్మసృష్టైరస్వతన్త్రైరనపేక్షోऽపి బాలవత్

ఇదంతా పరమాత్మ మాయతో జరుగుతుంది. మీరు కానీ మేము కానీ సకల సృష్టి గానీ. మనమిపుడు పుట్టాము, కొన్నాళ్ళకు మరణిస్తాము,  ఇలా సృష్టి స్థితి లయమూ జరుగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంటే మనం చావే వద్దని అంటాము, కష్టాలూ దరిద్రమూ వద్దని అంటాము. కానీ మనమస్వతంత్ర్యులము. పరమత్మ ఏమిస్తే అది తీసుకోవాలి. ఏదిస్తే అది ఎప్పుడిస్తే అప్పుడు ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. అక్కడ మన ఇష్టమే లేదు.  మనకు స్వాతంత్ర్యం లేదు. శరీరం నీదైతే నీవనుకున్న నాడు ఉంటుందా. నాది అనుకుంటున్న దేహమే పోతున్నది. ఆ దేహముతో ఇంకో దేహం వస్తోంది. వచ్చిన దేహం ముందు పోతోందా, ఉన్న దేహం పోతోందా? అది మనం చెప్పలేము.

దేహేన దేహినో రాజన్దేహాద్దేహోऽభిజాయతే
బీజాదేవ యథా బీజం దేహ్యర్థ ఇవ శాశ్వతః

ఒక విత్తమనముతో ఒక పైరు ఇంకో విత్తనముతో ఇంకో పైరూ వస్తుంది. కష్టపడి వేసిన పంటని మనమెలా కోస్తామో మన జీవితాలూ అంతే. మనం చేయదగినది ఏదీ ఉండదు. నీవెందుకు బాధపడుతున్నావు.

దేహదేహివిభాగోऽయమవివేకకృతః పురా
జాతివ్యక్తివిభాగోऽయం యథా వస్తుని కల్పితః

ఈ శరీరమే ఆత్మ అనే వాదమే బుద్ధిలేని మాట. జాతి వస్తువు ధనం ఇల్లూ పిల్లలూ సంపదలూ వర్ణములూ అన్ని దేహాన్ని బట్టే.

శ్రీశుక ఉవాచ
ఏవమాశ్వాసితో రాజా చిత్రకేతుర్ద్విజోక్తిభిః
విమృజ్య పాణినా వక్త్రమాధిమ్లానమభాషత

ఇలా అంగిరసుడు రాజును ఓదార్చాడు. అప్పుడు ముఖమును కడుగుకొని రాజు ఇలా అన్నాడు

శ్రీరాజోవాచ
కౌ యువాం జ్ఞానసమ్పన్నౌ మహిష్ఠౌ చ మహీయసామ్
అవధూతేన వేషేణ గూఢావిహ సమాగతౌ

ఇంత కష్టములో ఉన్న మమ్ములను ఓదార్చి అవధూత వేషములో ఉన్న బ్రాహ్మణోత్తములు ఎవరు మీరు

చరన్తి హ్యవనౌ కామం బ్రాహ్మణా భగవత్ప్రియాః
మాదృశాం గ్రామ్యబుద్ధీనాం బోధాయోన్మత్తలిఙ్గినః

కుమారో నారద ఋభురఙ్గిరా దేవలోऽసితః
అపాన్తరతమా వ్యాసో మార్కణ్డేయోऽథ గౌతమః
వసిష్ఠో భగవాన్రామః కపిలో బాదరాయణిః
దుర్వాసా యాజ్ఞవల్క్యశ్చ జాతుకర్ణస్తథారుణిః
రోమశశ్చ్యవనో దత్త ఆసురిః సపతఞ్జలిః
ఋషిర్వేదశిరా ధౌమ్యో మునిః పఞ్చశిఖస్తథా
హిరణ్యనాభః కౌశల్యః శ్రుతదేవ ఋతధ్వజః
ఏతే పరే చ సిద్ధేశాశ్చరన్తి జ్ఞానహేతవః

వీరందరిలో మీరు ఒకరు అయ్యి ఉంటారు. దుఃఖములో ఉన్న మాకు జ్ఞ్యాన దీపం ఇవ్వాలని అనుకుంటున్నారు.

తస్మాద్యువాం గ్రామ్యపశోర్మమ మూఢధియః ప్రభూ
అన్ధే తమసి మగ్నస్య జ్ఞానదీప ఉదీర్యతామ్

శ్రీఙ్గిరా ఉవాచ
అహం తే పుత్రకామస్య పుత్రదోऽస్మ్యఙ్గిరా నృప
ఏష బ్రహ్మసుతః సాక్షాన్నారదో భగవానృషిః

నీకు సంతానం కావాలంటే నేను నీకు సంతానం ప్రసాదించాను. ఈయన సాక్షాత్ నారదుడు. బ్రాహ్మణ భక్తుడవైన నీవు దుఃఖించకూడదని దయతో మేము వచ్చాము.

ఇత్థం త్వాం పుత్రశోకేన మగ్నం తమసి దుస్తరే
అతదర్హమనుస్మృత్య మహాపురుషగోచరమ్

అనుగ్రహాయ భవతః ప్రాప్తావావామిహ ప్రభో
బ్రహ్మణ్యో భగవద్భక్తో నావాసాదితుమర్హసి

తదైవ తే పరం జ్ఞానం దదామి గృహమాగతః
జ్ఞాత్వాన్యాభినివేశం తే పుత్రమేవ దదామ్యహమ్

అధునా పుత్రిణాం తాపో భవతైవానుభూయతే
ఏవం దారా గృహా రాయో వివిధైశ్వర్యసమ్పదః

నీకు సంతానాన్ని ఇందుకే ఇచ్చాము. సంతానం ఉన్న లేకున్నా వారికోసమే ఏడుపు. నిరంతరం దుఃఖం కలిగించే సంతానాన్ని కోరడం తెలివి ఉన్నవారు చేసే పనేనా? సంతానం పేరుతో ఉన్న దుఃఖం బాధా అర్థం కావాలనే సంతానాన్ని ఇచ్చాము. ఇపుడు అర్థమయ్యిందా. భార్య ఇలూ అయినా ఇంతే. సంసారం అంటేనే బాధ.

శబ్దాదయశ్చ విషయాశ్చలా రాజ్యవిభూతయః
మహీ రాజ్యం బలం కోషో భృత్యామాత్యసుహృజ్జనాః

సర్వేऽపి శూరసేనేమే శోకమోహభయార్తిదాః
గన్ధర్వనగరప్రఖ్యాః స్వప్నమాయామనోరథాః

ఇవన్నీ పగటి కలల లాంటివి (గన్ధర్వనగరప్రఖ్యాః ).

దృశ్యమానా వినార్థేన న దృశ్యన్తే మనోభవాః
కర్మభిర్ధ్యాయతో నానా కర్మాణి మనసోऽభవన్

వీటిలో ఏది ఉన్నా దుఃఖమే. దేహమంటేనే దుఃఖము. శరీరం కలవానికి శరీరమే అన్ని తాపములనూ కలిగిస్తుంది.

అయం హి దేహినో దేహో ద్రవ్యజ్ఞానక్రియాత్మకః
దేహినో వివిధక్లేశ సన్తాపకృదుదాహృతః

తస్మాత్స్వస్థేన మనసా విమృశ్య గతిమాత్మనః
ద్వైతే ధ్రువార్థవిశ్రమ్భం త్యజోపశమమావిశ

బుద్ధిమంతుడవై "నేనంటే" ఎవరు అన్న దాని గురించి ఆలోచించు. అర్థం లేని దుఃఖాన్ని విడిచ్పెట్టు

శ్రీనారద ఉవాచ
ఏతాం మన్త్రోపనిషదం ప్రతీచ్ఛ ప్రయతో మమ
యాం ధారయన్సప్తరాత్రాద్ద్రష్టా సఙ్కర్షణం విభుమ్

మేము నీ మీద దయకలిగి వచ్చాము. ఈ మంత్రాన్ని జపిస్తే ఏడు రోజులలో నీకు ఆదిశేషుడు (సంకర్షణుడు) సాక్షాత్కరిస్తాడు.

యత్పాదమూలముపసృత్య నరేన్ద్ర పూర్వే
శర్వాదయో భ్రమమిమం ద్వితయం విసృజ్య
సద్యస్తదీయమతులానధికం మహిత్వం
ప్రాపుర్భవానపి పరం న చిరాదుపైతి

బ్రహ్మ రుద్రేంద్రాదులు కూడా సంకర్షణ ఉపాసనచే అంతటి మహిమను పొందారు. నీవు కూడా సంకర్షణుని ఉపాసన చేయవలసినదని నారదుడు చిత్రకేతునికి చెప్పాడు.