Monday, March 18, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
భరతస్తు మహాభాగవతో యదా భగవతావనితలపరిపాలనాయ సఞ్చిన్తితస్తదనుశాసనపరః
పఞ్చజనీం విశ్వరూపదుహితరముపయేమే

భరతుడు పరమభాగవతుడు. వృషభుని ఆజ్ఞ్యను పాలించి విశ్వరూపుని పుత్రిక అయిన పంచజనిని వివాహం చేసుకున్నాడు.

తస్యాము హ వా ఆత్మజాన్కార్త్స్న్యేనానురూపానాత్మనః పఞ్చ జనయామాస భూతాదిరివ
భూత
సూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనమావరణం ధూమ్రకేతుమితి

అలా వారిద్దరికీ ఐదుగురు కుమారులు పుట్టారు తామసాహంకారానికి పంచతన్మాత్రలు ఉదయించినట్లు. సుమతిం రాష్ట్రభృతం సుదర్శనమావరణం ధూమ్రకేతుమితి - అనే ఐదుగురు కొడుకులు.

అజనాభం నామైతద్వర్షం భారతమితి యత ఆరభ్య వ్యపదిశన్తి

భరతుడు పరిపాలనకు రాకముందు అజనాభ వరషమని పేరు పొందినది భరతుని పరిపాలన వలన భారత వర్షమని పేరుగాంచింది.

స బహువిన్మహీపతిః పితృపితామహవదురువత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానాః ప్రజాః స్వ
ధర్మమనువర్తమానః పర్యపాలయత్

ఈ భరతుడు చాలా తెలిసిన వాడు. తండ్రిలాగా తాత లాగా గొప్ప వాత్సల్యం కలవాడు. ప్రజలందరూ ఎవరికి వారు తమ వృత్తులు ఆచరించేట్లు పాలించాడు. రాజు కూడా తన ధర్మాన్ని తాననుసరిస్తూ రాజ్యాన్ని పరిపాలించాడు

ఈజే చ భగవన్తం యజ్ఞక్రతురూపం క్రతుభిరుచ్చావచైః శ్రద్ధయాహృతాగ్నిహోత్రదర్శపూర్ణమాస
చాతుర్మాస్యపశుసోమానాం ప్రకృతివికృతిభిరనుసవనం చాతుర్హోత్రవిధినా

పరమాత్మను అనేకమైన ఉన్నతమైన యజ్ఞ్యములతో శ్రద్ధతో చాతుర్మాస్యమూ దశపూర్ణ మాసాలు, చాతుర్హోత్రమూ (హోత ఋత్విక్ అధ్వర్యువు ఉద్గాత) మొదలైనవి చేసాడు.

సమ్ప్రచరత్సు నానాయాగేషు విరచితాఙ్గక్రియేష్వపూర్వం యత్తత్క్రియాఫలం ధర్మాఖ్యం పరే
బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలిఙ్గానాం మన్త్రాణామర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం
భగవతి వాసుదేవ ఏవ భావయమాన ఆత్మనైపుణ్యమృదితకషాయో హవిఃష్వధ్వర్యుభిర్గృహ్యమాణేషు స
యజమానో యజ్ఞభాజో దేవాంస్తాన్పురుషావయవేష్వభ్యధ్యాయత్

ఇలా ఎన్నో యాగాలు చేస్తుండగా ఈయన యజ్ఞ్యములు చేసాడు, శ్రద్ధగా విధిగా చేసాడు గానీ, ఆ యజ్ఞ్యఫలాన్ని యజ్ఞ్యపురుషుడైన పరమాత్మార్పణం చేసాడు. యజ్ఞ్యములో యజ్ఞ్యపురుషుడైన శ్రీమన్నారాయణున్నే ఆరాధించే యజ్ఞ్యాలుండవు, కొన్ని మిగతా దేవతలని ఆరాధించేవి. కాని అవి అన్నీ ఆ దేవతల పేర్లు చెప్పడానికే గానీ అన్నిటికీ అంతర్యామి పరమాత్మ, ఏ దేవతా మంత్రాలు చదివినా ఆ మంత్రార్థాలు ఇచ్చేది పరమాత్మే. మంత్రముతో పిలిచే దేవత ఎవరైనా, అన్ని దేవతాకారాలలో ఉండేవాడు నారాయణుడే. అన్ని మత్రాలనూ లింగాలనూ దేవతలనూ ద్రవ్యాలనూ క్రియలనూ పరమాత్మ యందే భావిస్తూ తన చాతుర్యముతో తన పాపాన్ని పోగొట్టుకున్నాడు (గీతలో చెప్పినట్లుగా - కౌశలముతో కర్మలు చేయాలి; కర్మల ఫలితం అంటకుండా చేయడం కౌశలం). ఆయా అధ్వర్యులు ఆయా హవిస్సులు ఇస్తున్నప్పుడు "భగవత నారాయణస్య కంఠాయ స్వాహా" అని ఇచ్చేవాడు. అంటే పరమాత్మ యొక్క ఆయా అవయవాలలో ఆయా దేవతలను ధ్యానించాడు. బ్రహ్మకి ఇవ్వాలంటే శిరస్సే స్వాహా, అశ్వనీ దేవతలంటే నాసికలు.

ఏవం కర్మవిశుద్ధ్యా విశుద్ధసత్త్వస్యాన్తర్హృదయాకాశశరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహా
పురుషరూపోపలక్షణే శ్రీవత్సకౌస్తుభవనమాలారిదరగదాదిభిరుపలక్షితే నిజపురుషహృల్లిఖితేనాత్మని
పురుషరూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదినమేధమానరయాజాయత

ఇలా చేయడము వలన భరతునికి ఎలాంటి కర్మా అంటలేదు. కర్మ శుద్ధి పొందడము వలన మనసు కూడా పరిశుద్ధినొందింది. ఇలాంటి మహానుభావుని హృదయములో ఉండే అంతరాకాశములో (దహరాకాశములో) ఉన్న పరమాత్మ, వాసుదేవుడు, మహాపురుషుడు, శ్రీ వత్సమూ శంఖమూ గదా చక్రమూ మొదలైన వాటితో శొభించబడుతున్న పురుషాకారాన్ని ప్రకాశింపచేస్తూ హృదయములో పరమాత్మ సాక్షాత్కరించే సరికి ఆ పరమాత్మ యొక్క సకల అవయములని ధ్యానించడం వలన పరమాత్మ భక్తి పెరిగింది. నిత్య నైమిత్తిక కర్మలాచరిస్తూ భగవదారాధన ఎలా చేయాలో మనకీ ఆఖ్యానం చెబుతుంది. నిరంతరం సకల చరాచర జగత్తులో ఉన్న పరమాత్మని ఆరాధిస్తున్నాడు కాబట్టి పరమాత్మ యందు భక్తి పెరిగింది.

ఏవం వర్షాయుతసహస్రపర్యన్తావసితకర్మనిర్వాణావసరోऽధిభుజ్యమానం స్వతనయేభ్యో
రిక్థం పితృపైతామహం యథాదాయం విభజ్య స్వయం సకలసమ్పన్నికేతాత్స్వనికేతాత్పులహాశ్రమం
ప్రవవ్రాజ

ఇంత జాగ్రత్తగా ఉన్నా అతను పూర్వ జన్మలో చేసిన కర్మల సంస్కారం నశించడానికి పది లక్షల సంవత్సరాలు పట్టింది. తన రాజ్యాన్ని ఐదుగురికీ సమానముగా పంచాడు. సకల సంపదలకూ నికేతనమైన తన నికేతాన్ని వదిలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళాడు

యత్ర హ వావ భగవాన్హరిరద్యాపి తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేన సన్నిధాప్యత ఇచ్ఛా
రూపేణ

శ్రీమన్నారాయణుడు పులహాశ్రమములో (బదరికీ కేదారికీ మధ్యలో ఉన్నది) నిజరూపములో ఉండి భక్తుల కోరికలను ఇప్పటికీ తీరుస్తున్నాడు.

యత్రాశ్రమపదాన్యుభయతో నాభిభిర్దృషచ్చక్రైశ్చక్రనదీ నామ సరిత్ప్రవరా సర్వతః పవిత్రీ
కరోతి

అక్కడ రెండు దిక్కులా ప్రవహించే చక్ర నది ప్రవహిస్తోంది.

తస్మిన్వావ కిల స ఏకలః పులహాశ్రమోపవనే వివిధకుసుమకిసలయతులసికామ్బుభిః కన్దమూల
ఫలోపహారైశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్త ఉపరతవిషయాభిలాష ఉపభృతోపశమః పరాం
నిర్వృతిమవాప

ఏకాంతములో అన్ని విషయాభిలాషలూ వదిలిపెట్టి అక్కడ ఉన్న ఉద్యానవనములో ఉన్న పూలతో ఫలములతో పరమాత్మని ఆరాధించాడు, అంతటి ప్రశాంతమైన స్థలములో పరమాత్మను ఆరాధించగలుగుతున్నందుకు సంతోషించాడు. ఇలా ఆరాధించడముతో పరమాత్మ మీద ప్రేమ పెరిగింది.

తయేత్థమవిరతపురుషపరిచర్యయా భగవతి ప్రవర్ధమానానురాగభరద్రుతహృదయశైథిల్యః
ప్రహర్షవేగేనాత్మన్యుద్భిద్యమానరోమపులకకులక ఔత్కణ్ఠ్యప్రవృత్తప్రణయబాష్పనిరుద్ధావలోక
నయన ఏవం నిజరమణారుణచరణారవిన్దానుధ్యానపరిచితభక్తియోగేన పరిప్లుతపరమాహ్లాదగమ్భీర
హృదయహ్రదావగాఢధిషణస్తామపి క్రియమాణాం భగవత్సపర్యాం న సస్మార

ఆ సంతోషముతో తన మనసూ శరీరమూ పులకించి శరీరములో రోమాలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. పరిపూర్ణముగా పరమాత్మను ఆరాధించడముతో ఆనందముతో తడిసిపోయాడు. ఈయనకు భక్తియోగం పెరిగింది, అత్యంత ప్రీతి పాత్రుడైన పరమాత్మ పాదపద్మాలని ఆరాధిస్తున్నందువలన. ఆరాధన చేస్తున్నాడు గానీ ఆరాధన "నేను చేస్తున్నానని " గానీ "నారాయణునికి చేస్తున్నా" అని గానీ భావించలేదు. ఇలా చేస్తున్న పరమాత్మ ఆరాధనను భక్తిలో మునిగి స్మరించలేదు

ఇత్థం ధృతభగవద్వ్రత ఐణేయాజినవాససానుసవనాభిషేకార్ద్రకపిశకుటిలజటాకలాపేన చ
విరోచమానః సూర్యర్చా భగవన్తం హిరణ్మయం పురుషముజ్జిహానే సూర్యమణ్డలేऽభ్యుపతిష్ఠన్నేతదు
హోవాచ

ఈ ప్రకారముగా వ్ర్తాన్ని అవలంబించి జింక చర్మాన్ని వస్త్రముగా కట్టుకొని అవభృత స్నానం చేసినందు వలన నెత్తిన ఉన్న జటలు విచ్చుకున్నాయి. అలా ప్రకాశిస్తూ హిరణ్మయుడైన సూర్యుడిని ధ్యానించాడు. కనపడుతున్న సూర్యభగవానునిలోనే శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఈ శ్లోకం చెప్పాడు

పరోరజః సవితుర్జాతవేదో దేవస్య భర్గో మనసేదం జజాన
సురేతసాదః పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం నృషద్రిఙ్గిరామిమః

పరమాత్మ సకల చరాచర జగత్తునూ మనస్సుతో సంకల్పముతో సృష్టించాడు.  సర్వ దేవతక అంతర్యామిగా ఉన్న స్వామిని ఆరాధించారు. దేవతలకంటే ఇతరమైన లోకాలలో ఉండే వారు మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి ఆరాధించారు
దేవతల కంటే ఇతరములైన లోకాలలో ఉండే లోకాలలో నివాసం ఉండే వారు మళ్ళీ ఇక్కడికే వచ్చి పరమ జ్ఞ్యాన స్వరూపులై దేవతల స్వరూపులై ఉన్న స్వామిని ఆరాధించారు

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఆరవ అధ్యాయం 

రాజోవాచ
న నూనం భగవ ఆత్మారామాణాం యోగసమీరితజ్ఞానావభర్జితకర్మబీజానామైశ్వర్యాణి పునః
క్లేశదాని భవితుమర్హన్తి యదృచ్ఛయోపగతాని

ఇది విన్న పరీక్షిత్తు "కోరకుండా వచ్చినా కోరి వచ్చినా వచ్చిన ఐశ్వర్యాన్ని ఒప్పుకుంటే మళ్ళీ సంసారములో పడినట్లే. " అన్నాడు. అప్పుడు శుకుడు

ఋషిరువాచ
సత్యముక్తం కిన్త్విహ వా ఏకే న మనసోऽద్ధా విశ్రమ్భమనవస్థానస్య శఠకిరాత ఇవ
సఙ్గచ్ఛన్తే

అప్పుడు శుకుడు "ఉన్న మాట ఉన్నట్లు చెప్పావు. మనస్సును నిగ్రహించుకోలేని వారు ఏ విషయాలను గెలవాలని ప్రయత్నిస్తారో ఆ విషయాలకే లోనవుతారు. మన మనస్సు దొంగ వేటగాడిలాంటిది

తథా చోక్తమ్
న కుర్యాత్కర్హిచిత్సఖ్యం మనసి హ్యనవస్థితే
యద్విశ్రమ్భాచ్చిరాచ్చీర్ణం చస్కన్ద తప ఐశ్వరమ్

మనసు ఏకాగ్రముగా లేనంతవరకూ ఎక్కడా ఏ విషయములోనూ స్నేహం చేయకూడదు. పొరబాటున కొంచెం నమ్మి "ఏమవుతుందిలే" అనుకుంటే ఎంత గొప్ప వారి తపస్సైనా వ్యర్థమవుంది. మనస్సును గెలవగలిగితే వాటితో చెలిమి చేసినా నష్టములేదు. సాక్షాత్ శంకరుని తపస్సుకూడా జారిపోయింది కదా. ఇంతకంటే ఏమి కావాలి ఉదాహరణ

నిత్యం దదాతి కామస్య చ్ఛిద్రం తమను యేऽరయః
యోగినః కృతమైత్రస్య పత్యుర్జాయేవ పుంశ్చలీ

మనసు నిరంతరం కోరిక వెంటనే పరిగెత్తుతూ ఉంటుంది. ప్రతీక్షణం కోరికకు అవకాశం (చిధ్రం) ఏర్పడే ఉంటుంది, దాని వెంటా దాని మిత్రులైన క్రోధ మోహ మదాదులు ఉంటాయి. స్నేహం చేసి యోగిగా ఉన్నవాడికి కోరికలు ఉండకూడదు పుర్హ్సుడి వెంట చరించే స్త్రీ (వేశ్య లాంటివి)

కామో మన్యుర్మదో లోభః శోకమోహభయాదయః
కర్మబన్ధశ్చ యన్మూలః స్వీకుర్యాత్కో ను తద్బుధః

ఇన్ని రకములైన కర్మలకు ఏది మూలమో దాన్ని ఎవరు స్వీకరిస్తాడు. సఖ్యం వలనే కోరికా కోపం లోభం మదం మోహం పుడతాయి. ఈ ఒక్క మైత్రీ భావాన్ని దూరముగా ఉంచితే తక్కినవేమీ రావు

అథైవమఖిలలోకపాలలలామోऽపి విలక్షణైర్జడవదవధూతవేషభాషాచరితైరవిలక్షిత
భగవత్ప్రభావో యోగినాం సామ్పరాయవిధిమనుశిక్షయన్స్వకలేవరం
జిహాసురాత్మన్యాత్మానమసంవ్యవహితమనర్థాన్తరభావేనాన్వీక్షమాణ ఉపరతానువృత్తిరుపరరామ

సకలలోకపాలకులకు ఈయన అధిపతి అయి ఉండీ అవధూత వేషాన్ని వారి ఆచారాన్నీ వ్యవహారాన్నీ ఆచరించి చూపాడు. తరువాత వచ్చే యోగులకది మార్గదర్శకం. ఇంక శరీరాన్ని విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు రోగాలకు రోగమైన శరీరాన్ని  విడిచిపెట్టదలచి ఉచ్చ్వాస నిశ్వాసలను కూడా విడిచిపెట్టాడు

తస్య హ వా ఏవం ముక్తలిఙ్గస్య భగవత ఋషభస్య యోగమాయావాసనయా దేహ ఇమాం
జగతీమభిమానాభాసేన సఙ్క్రమమాణః కోఙ్కవేఙ్కకుటకాన్దక్షిణ
కర్ణాటకాన్దేశాన్యదృచ్ఛయోపగతః కుటకాచలోపవన ఆస్య కృతాశ్మకవల ఉన్మాద ఇవ ముక్తమూర్ధజో
ऽసంవీత ఏవ విచచార

లింగాన్ని వదిలిపెట్టి యోగమాయతో భూమండలములో శరీరం మీద అభిమానాన్ని విడిచిపెట్టి ఆయా దేశాలను తిరుగుతూ ఉన్నాడు, చివరకు కుటకాచలం వద్దకు వచ్చి ఆగాడు. నోరు తెరుచుకుని ఉంటాడు. ఆ నోటిలో ఏది పడితే అదే ఆహారం. రుచి మీదకు మనసు పోతే తినాలన్న ఆశ కలుగుతుంది,ఆహరం మీద లోలుపత్వం వస్తుంది, అది శరీరాన్ని బాగా బలిపిస్తుంది, దాని వలన శొమరితనమూ, శొమరితనం వలన అనాచారం, అనాచరం వలన భ్రష్టత వస్తుంది. శరీరమూ మనసూ పాడవుతుంది. అలా నొటిలో ఏది పడీతే అది తింటూ ఉన్మాదుడిలా జుట్టు విరబూసుకుని దిగంబరముగా సంచరించాడు

అథ సమీరవేగవిధూతవేణువికర్షణజాతోగ్రదావానలస్తద్వనమాలేలిహానః సహ తేన దదాహ

ఇలా సంచరిస్తూ ఉంటే ఒక సారి పెద్ద గాలి రావడం వలన వెదురుబొంగులు రాజుకోవడముతో అగ్నిపుట్టింది, అది వనం మొత్తం కాలిపోయింది, అందులో ఈయన కూడా ఉన్నాడు.

యస్య కిలానుచరితముపాకర్ణ్య కోఙ్కవేఙ్కకుటకానాం రాజార్హన్నామోపశిక్ష్య కలావధర్మ
ఉత్కృష్యమాణే భవితవ్యేన విమోహితః స్వధర్మపథమకుతోభయమపహాయ కుపథ
పాఖణ్డమసమఞ్జసం నిజమనీషయా మన్దః సమ్ప్రవర్తయిష్యతే

వృషభుడు సంచరించిన మార్గములు విని దాన్ని అపార్థము చేసుకుని ఆయన ఆచరించినవి ఆచరించారు. రాబోయే కలియుగములో ఇలాగే జరగవలసి ఉండాల్సి ఉంది కాబట్టి ఎటువంటి ప్రమాదమూ లేని వారి ధర్మాలను వదిలిపెట్టి పాఖండ మార్గాలను ప్రజలు తమ బుద్ధితో మందులందరూ దాన్ని ప్రవర్తింపచేస్తారు. పరమాత్మ మాయచే మోహించబడిన వారై

యేన హ వావ కలౌ మనుజాపసదా దేవమాయామోహితాః స్వవిధినియోగశౌచచారిత్రవిహీనా దేవ
హేలనాన్యపవ్రతాని నిజనిజేచ్ఛయా గృహ్ణానా అస్నానానాచమనాశౌచకేశోల్లుఞ్చనాదీని కలినాధర్మ
బహులేనోపహతధియో బ్రహ్మబ్రాహ్మణయజ్ఞపురుషలోకవిదూషకాః ప్రాయేణ భవిష్యన్తి

తే చ హ్యర్వాక్తనయా నిజలోకయాత్రయాన్ధపరమ్పరయాశ్వస్తాస్తమస్యన్ధే స్వయమేవ
ప్రపతిష్యన్తి

తమ తమ విధిని బట్టీ చారిత్రమును బట్టీ ఆచారాన్ని బట్టీ ఆచరించకుండా భగవంతున్ని అవమాన పరిచే వ్రతాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు తీసుకుంటూ  వాటికి ఇష్టము వచ్చిన పేర్లు పెట్టుకుంటూ స్నానాచమనాదులు లేక కేశాలను కడుక్కోకుండా పరమాత్మనూ బ్రాహ్మణులనూ యజ్ఞ్యములనూ పురుషులనూ దూషించేవారవుతారు. తరువాతి ఆచారాన్ని తరువాతి నియమాన్ని ఆచరించిన వారై, "నాకంటే ముందు వారు చేసారు కాబట్టి నేను చేసాను" అంటూ  పరమ అజ్ఞ్యానములో వారే పడిపోతూ ఉన్నారు

అయమవతారో రజసోపప్లుతకైవల్యోపశిక్షణార్థః

రజో గుణం ఆవరించిన వారికి మోక్షం రావడానికి కావలసిన మార్గం చెప్పే అవతారం ఇది.

తస్యానుగుణాన్శ్లోకాన్గాయన్తి
అహో భువః సప్తసముద్రవత్యా ద్వీపేషు వర్షేష్వధిపుణ్యమేతత్
గాయన్తి యత్రత్యజనా మురారేః కర్మాణి భద్రాణ్యవతారవన్తి

ఏడు సముద్రాలతో కూడి ఉన్న ఏడు ద్వీపాలలో ఇది పరమ పవిత్రమైన విషయం. ఈ సప్త సముద్రములూ గల ఈ భూమండలమెందుకు పవిత్రమెందుకంటే పరమాత్మ అవతార చైత్రలను గానం చేస్తున్నారు కాబట్టి

అహో ను వంశో యశసావదాతః ప్రైయవ్రతో యత్ర పుమాన్పురాణః
కృతావతారః పురుషః స ఆద్యశ్చచార ధర్మం యదకర్మహేతుమ్

ప్రియవ్రతుని వంశం కూడా పరమ పవిత్రం ఎందుకంటే పురాణ పురుషుడు ఉద్భవించాడు. కర్మ చేయకుండా ఉండటానికి కావలసిన ధర్మాన్ని వృషభుడు ఆచరించాడు. కర్తృత్వ జ్ఞ్యాతృవాభిమానములు లేకుండా చేసాడు. సంస్కారముతో వాసన వాసనతో కోరిక కోరికతో కర్మలు కర్మలతో భోగం భోగముతో వాసన. ఇవన్నీ ఒక ధర్మాచరణతో రాకుండా ధర్మాచరణ మోక్షహేతువుగావాలి. ఎలా చేస్తే కర్మ బంధించదో అలా చేసి చూపాడు

కో న్వస్య కాష్ఠామపరోऽనుగచ్ఛేన్మనోరథేనాప్యభవస్య యోగీ
యో యోగమాయాః స్పృహయత్యుదస్తా హ్యసత్తయా యేన కృతప్రయత్నాః

ఇలాంటి మహాత్ముని మార్గాన్ని సంకల్పముతో కూడా అనుసరించేవాడెవరైనా ఉన్నారా? ఈయన ఆచరించిన యోగముతో లభించిన సిద్ధులను ఉదాసీన స్వభావముతో ఉన్నాడు. వాటిని వదులుకున్నాడు. ఆయన మార్గాన్ని మనసుతో కూడా అనుసరించలేము

ఇతి హ స్మ సకలవేదలోకదేవబ్రాహ్మణగవాం పరమగురోర్భగవత ఋషభాఖ్యస్య
విశుద్ధాచరితమీరితం పుంసాం సమస్తదుశ్చరితాభిహరణం పరమమహా
మఙ్గలాయనమిదమనుశ్రద్ధయోపచితయానుశృణోత్యాశ్రావయతి వావహితో భగవతి తస్మిన్వాసుదేవ ఏకాన్తతో
భక్తిరనయోరపి సమనువర్తతే

వేదలోకదేవబ్రాహ్మణగవాం - వీటన్నిటికీ పరమ గురువైన వృషభదేవుని పరమపవిత్ర చరిత్రను వర్ణించాను. ఇది మానవుల సకల పాపములనూ తొలగించి అనంతమైన కళ్యానన్ని కలిగించేది. శ్రద్ధతో సావధానముతో ఎవరు ఈ చరిత్రను విని వినిపిస్తారో అలాంటి వారు పరమాత్మ అయిన వాసుదేవుని యందు ఏకాంతమైన భక్తి కలవారై ఆయన మార్గాని అవలంబిస్తారు.

యస్యామేవ కవయ ఆత్మానమవిరతం వివిధవృజినసంసారపరితాపోపతప్యమానమనుసవనం
స్నాపయన్తస్తయైవ పరయా నిర్వృత్యా హ్యపవర్గమాత్యన్తికం పరమపురుషార్థమపి స్వయమాసాదితం నో
ఏవాద్రియన్తే భగవదీయత్వేనైవ పరిసమాప్తసర్వార్థాః

ఈయనను ఈ మార్గములోనే పండితులూ యోగులూ ఋషులూ సావధానముతో ఉంచి అనేక పాపములను పోగొట్టడానికి తమను తాము పరిశుద్ధి చేసుకున్నవారై పరమాత్మ దయతో తృప్తి పొందిన వారై ఆత్యంతికమైన మోక్షాన్ని కూడా అంగీకరించరు. పరమాత్మయందు ఉండే భక్తితోటే అన్ని కోరికలూ తీరినవారై పరమాత్మ ఇచ్చే మోక్షాన్నీ ఆదరించరు

రాజన్పతిర్గురురలం భవతాం యదూనాం
దైవం ప్రియః కులపతిః క్వ చ కిఙ్కరో వః
అస్త్వేవమఙ్గ భగవాన్భజతాం ముకున్దో
ముక్తిం దదాతి కర్హిచిత్స్మ న భక్తియోగమ్

మీ వంశములో మీ కులములో మీకు కింకరునిగా దూతగా మేనమామ కుమారుడై తిరిగిన ఆ దైవమే ఈయన. ఆయన మీకు కింకరుడయ్యాడు. ఇన్ని రకాల సేవ చేసిన తరువాత ఒక నిర్ణయానికొచ్చాడు. కావలంటే ముక్తినిస్తాను గానీ భక్తినివ్వనూ. భక్తినిస్తే చెప్పిన పనల్లా చేయాలి. (అందుకే భగవద్రామానుజులు "శేముషీ భక్తి  రూపా" నాకు భక్తినివ్వు అని అన్నారు)

నిత్యానుభూతనిజలాభనివృత్తతృష్ణః
శ్రేయస్యతద్రచనయా చిరసుప్తబుద్ధేః
లోకస్య యః కరుణయాభయమాత్మలోకమ్
ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై

ఈ శ్లోకం నిత్యానుసంధానం. దీని వలన భక్తి మీద భక్తి కలుగుతుంది. నిరంతరం అనుభవించే సమస్త ఆనందములతో తనను తాను చూచుకుని ఆనందించి తృప్తి పొందినవాడు. ఆయనకు ఇది కావాలీ ఇది వద్దూ అన్న భావన లేదు. సాంసారిక విషయాల యందు మనసు ప్రసరించదు. సంసారములో ప్రవర్తించేవాడి బుద్ధి మోక్షాన్ని చూడలేక నిదురపోతూ ఉంటుంది. యోగమాయతో తనలోకం ఇలా ఉంటుంది, తన లోకాన్ని చేరాలి అని ఏ మహానుభావుడు చెప్పాడో అటువంటి వృషభ దేవునికి నమస్కారము. ఇది వృషభ ద్వాదశి. నిత్యానుసంధానం చేసుకోవలసినది
పరమాత్మ తనకు లభించినదానితో ఆనందముగా ఉండేవాడు. ఆయనకు నిత్యానుభూతి ఉన్నది. మనకి ప్రతీక్షణం దుఃఖం కలుగుతూనే ఉంటుంది. కలిగిన వెంటనే దాన్ని మరచిపోతూ ఉంటాము. సుఖము ఎప్పటికో కలుగుతుంది. పరమాత్మ నిత్యానందముతో ఉంటాడు. మానవుడెందుకు సుఖాన్ని పొందుట లేదు. మన ప్రవృత్తులన్నీ దుఃఖానికే పనికొస్తున్నాయి. 
మానవుడి స్వభావం బాధపడడమే. ఏది శ్రేయస్సో దానికోసం ప్రయత్నించుట లేదు. చాలా కాలం నుంచీ నిదురపోయిన బుద్ధికల లోకానికి కరుణ బోధించాలని వచ్చిన వృషభదేవునికి నమస్కారము. అభయాన్ని ప్రసాదించే తన లోకాన్ని ప్రసాదించిన వృషభదేవునికి నమస్కారం

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 11

1. శమ దమ తపః శౌచం తితిక్ష ఉపరతి (విషయముల యందు ఇంద్రియాలు ప్రవర్తించకుండా ఆపుట ఆత్మా రామం.),  ఈ ఆరు అందరికీ ఉండాల్సినవి. అహింస సత్యం అస్తేయం (దొంగతనం చేయకపోవుట) అనసూయ ఉండాలి, అమర్షమూ (ఎదుటివారి వృద్ధిని చూచి సహించకపోవడం), లోలుపత ఉండకుండుట , - ఈ పన్నెండు గుణాలూ బ్రాహ్మణుడికి ఉండాలి.

2. వివాద శీలాం స్వయం అర్థ చోరిణి బహ్వాశినీం నిష్టుర వాక్య బాషిణీం దివాస్వపాం
భక్తి ప్రజా విహీనాం, (భర్త యందూ భగవంతుని యందూ భక్తి లేనిదీ) అపి జహ్యాత్ శత పుత్ర మాతరం
ఇలాంటి భార్య విడువదగినది

3. రుచి మీదకు మనసు పోతే తినాలన్న ఆశ కలుగుతుంది,ఆహరం మీద లోలుపత్వం వస్తుంది, అది శరీరాన్ని బాగా బలిపిస్తుంది, దాని వలన శొమరితనమూ, శొమరితనం వలన అనాచారం, అనాచరం వలన భ్రష్టత వస్తుంది. శరీరమూ మనసూ పాడవుతుంది.

4. నిత్యానుభూతనిజలాభనివృత్తతృష్ణః
శ్రేయస్యతద్రచనయా చిరసుప్తబుద్ధేః
లోకస్య యః కరుణయాభయమాత్మలోకమ్
ఆఖ్యాన్నమో భగవతే ఋషభాయ తస్మై

ఈ శ్లోకం నిత్యానుసంధానం. దీని వలన భక్తి మీద భక్తి కలుగుతుంది. నిరంతరం అనుభవించే సమస్త ఆనందములతో తనను తాను చూచుకుని ఆనందించి తృప్తి పొందినవాడు. ఆయనకు ఇది కావాలీ ఇది వద్దూ అన్న భావన లేదు. సాంసారిక విషయాల యందు మనసు ప్రసరించదు. సంసారములో ప్రవర్తించేవాడి బుద్ధి మోక్షాన్ని చూడలేక నిదురపోతూ ఉంటుంది. యోగమాయతో తనలోకం ఇలా ఉంటుంది, తన లోకాన్ని చేరాలి అని ఏ మహానుభావుడు చెప్పాడో అటువంటి వృషభ దేవునికి నమస్కారము. ఇది వృషభ ద్వాదశి. నిత్యానుసంధానం చేసుకోవలసినది

5. హేతు త్రయంతు నిద్రాయ: స్వభార్య, పుస్తకం, జపం
హేతు త్రయంతు అనిద్రాయా: జ్యూతం విత్తం పరాంగన

6. ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే
విశుద్ధసత్త్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి

ఈ మంత్రాన్ని జపిస్తూ. ఐశ్వర్యానికీ సంతానానికీ మానసిక దిగులు లేకుండా ఉండటానికి దీన్ని జపించాలి

7. సర్వభూతప్రియో హరిః -  పరమాత్మంటే సకల ప్రాణులకీ ప్రియుడు.

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఐదవ అధ్యాయం

ఋషభ ఉవాచ
నాయం దేహో దేహభాజాం నృలోకే కష్టాన్కామానర్హతే విడ్భుజాం యే
తపో దివ్యం పుత్రకా యేన సత్త్వం శుద్ధ్యేద్యస్మాద్బ్రహ్మసౌఖ్యం త్వనన్తమ్

శరీరం ధరించే జీవులు సంచరించే జీవులయొక్క మానవలోకములో దేహము కష్టములనిచ్చే కోరికలను కోరతగదు. ఎందుకంటే మలమును తినే (వరాహములు) జంతువులకు కూడా ఇవే కోరికలు ఉంటాయి. పరమాత్మను సాక్షాత్కరించుకునే తపస్సు చేయండి. దాని వలన మనసు శుద్ధి అవుతుంది.

మహత్సేవాం ద్వారమాహుర్విముక్తేస్తమోద్వారం యోషితాం సఙ్గిసఙ్గమ్
మహాన్తస్తే సమచిత్తాః ప్రశాన్తా విమన్యవః సుహృదః సాధవో యే

సజ్జనులను సేవించుటే ముక్తికి మార్గము. ఆడవారియందు అధికమైన ఆసక్తి ఉన్నవారితో స్నేహం చేయడం నరకానికి ద్వారము. సమచిత్తము ఉన్నవారు సజ్జనులు. ప్రశాంతముగా ఉండేవారు. కోపము మోహమూ లేని వారు. క్షమ ఉన్నవారు, హితాన్ని ఆశించేవారు, యోగక్షేమాన్ని ఉపదేశించేవారు (సాధవః) వీరితో సంగము మోక్షాన్ని ఇస్తుంది

యే వా మయీశే కృతసౌహృదార్థా జనేషు దేహమ్భరవార్తికేషు
గృహేషు జాయాత్మజరాతిమత్సు న ప్రీతియుక్తా యావదర్థాశ్చ లోకే

భగవంతున్నయిన నా యందు స్నేహాన్నీ మైత్రినీ భక్తినీ కలిగి ఉన్నవారు సాధువులు. శరీరమును పోషించడానికి కావలసిన విధానాన్ని ఆలోచించే జనులయందూ భార్యా పుత్రులూ ధనమూ కలిగి ఉన్న గృహస్థాశ్రమం యందు (సంసారము యందు) ప్రేమ లేని వారు మహానుభావులు. వారు బతకడానికి ఎంత కావాలో అంతే కోరుకుంటారు - యావదర్థాశ్చ లోకే

నూనం ప్రమత్తః కురుతే వికర్మ యదిన్ద్రియప్రీతయ ఆపృణోతి
న సాధు మన్యే యత ఆత్మనోऽయమసన్నపి క్లేశద ఆస దేహః

ఇది రావడానికి శరీరమే ఆత్మ అన్న ఏమరపాటుతో (అజాగ్రత్తతో ఉండటం) చేయకూడని పనులు చేస్తాడు ఎందుకంటే ఆ పని చేయడం వలన ఇంద్రియముల యందు ప్రీతి పెరుగుతుంది. దేహాత్మ వివేకం లేని వాడు దేహం కోసమే అన్నిపనులూ చేస్తాడు. ఇంద్రియ ప్రీతి వలన శరీరము యందు ఆసక్తి పెరుగుతుంది. దాని వలన మళ్ళీ పనులు చేస్తాడు. శరీరం ఆత్మకు ఆలయం. శరీరం పడే బాధకు ఆత్మతో సంబంధము లేదు. ఆత్మకు ఏ శరీరమూ లేదు. లేని శరీరము ఆత్మ బంధానికి కారణమవుతోంది.

పరాభవస్తావదబోధజాతో యావన్న జిజ్ఞాసత ఆత్మతత్త్వమ్
యావత్క్రియాస్తావదిదం మనో వై కర్మాత్మకం యేన శరీరబన్ధః

పరాభవమూ బాధలూ దుఃఖాలూ అజ్ఞ్యానం వలన పుట్టేవి, ఆ భావనలు ఆత్మ తత్వం తెలియనంతవరకే . ఎంత వరకూ పని చేస్తూ ఉంటామో అంతవరకూ మనసు లగ్నమవుతుది, అంతవర్కూ ఇందిర్య ప్రీతి కలుగుతూ ఉంటుంది, ఎంతవరకూ ఇంద్రియ ప్రీతి కలుగుతుందో అంతవరకూ శరీరం వస్తుంది, దాని వలన మళ్ళీ పనులు చేస్తూ ఉంటాము. శరీరం సుఖముగా ఉంచాలి అన్న భావనతోనే ఇవన్నీ పొందుతూ ఉన్నాము. ఎప్పుడు దుఃఖప్రతీకారమే (కలిగిన కష్టాలను తొలగించుకోవడమే తప్ప) సుఖ ప్రాప్తి లేదు. పనూల వలన మనస్సంబంధం, మనస్సంబంధం వలన ఆత్మకు శరీర సంబంధం ఉంటుంది.

ఏవం మనః కర్మవశం ప్రయుఙ్క్తే అవిద్యయాత్మన్యుపధీయమానే
ప్రీతిర్న యావన్మయి వాసుదేవే న ముచ్యతే దేహయోగేన తావత్

ఆచరించే కర్మల వలననే మనస్సేర్పడుతుంది. అవిద్యతో ఆత్మకు శరీర బంధమేర్పడుతుంది, అవిద్య కర్మలతో ఏర్పడుతుంది. నాయందు ప్రీతి కలిగేంతవరకూ ఈ చక్రం తొలగదు. అంతవరకూ దేహయోగముతో విడువబడడు

యదా న పశ్యత్యయథా గుణేహాం స్వార్థే ప్రమత్తః సహసా విపశ్చిత్
గతస్మృతిర్విన్దతి తత్ర తాపానాసాద్య మైథున్యమగారమజ్ఞః

ఆత్మ తత్వజ్ఞ్యానం కలిగినవాడు రజ సత్వ తమో గుణాల వలన కలిగే కోరికలన్నీ అసత్యములని తెలుసుకోడో అంతవరకూ సంసారం మీద బంధముంటుంది. పరమాత్మ యందూ తత్వం యందూ స్మరణ ఉండక శరీరములో తాపాలను పొందుతాడు. స్త్రీ పురుష సమాగమ రూపమైన సుఖమును గోరి తాపమును పొందుతాడు

పుంసః స్త్రియా మిథునీభావమేతం తయోర్మిథో హృదయగ్రన్థిమాహుః
అతో గృహక్షేత్రసుతాప్తవిత్తైర్జనస్య మోహోऽయమహం మమేతి

సంసారానికీ వాసనకూ స్త్రీ పురుషుల మిథునీ భావము (దంపతులుగా ఉండుట) హృదయానికి పెద్ద పీటముడి. దాని వలన ఇద్దరికీ బంధము పెరుగుతుంది. దంపతులుగా ఉన్నప్పటినుండీ ఇది మొదలవుతుంది. ఇల్లూ పొలమూ పుత్రులూ మిత్రులూ, వీరందరినీ పోషించడానికీ విత్తం కావాలి. నేనూ నావాళ్ళూ అన్న మోహం దీని వలననే పెరుగుతుంది.

యదా మనోహృదయగ్రన్థిరస్య కర్మానుబద్ధో దృఢ ఆశ్లథేత
తదా జనః సమ్పరివర్తతేऽస్మాద్ముక్తః పరం యాత్యతిహాయ హేతుమ్

కర్మలనాచరించినంత వరకూ హృదయానికి గ్రంధి ఏర్పడుతున్నది. అది ఉన్నంతవరకూ పరమాత్మ జ్ఞ్యానం కలగదు. ఆ హృదయ గ్రంధి పోవాలి.

హంసే గురౌ మయి భక్త్యానువృత్యా వితృష్ణయా ద్వన్ద్వతితిక్షయా చ
సర్వత్ర జన్తోర్వ్యసనావగత్యా జిజ్ఞాసయా తపసేహానివృత్త్యా

అది కలగాలంటే పరమహంఅసా గురువూ దైవమూ అయిన నాయందు భక్తితో అనుసరించి ఉండటముతోటీ సంసారము యందు ఆశ లేకుండా ఉండటముతో జంటలను జయించి, ప్రపంచములో పుట్టిన ప్రతీ ప్రాణీ కష్టాలి పడుతున్నది అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఆత్మ తత్వాన్నీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి తపసుతోటీ ఆశలను తొలగించే ప్రయత్నముతోటీ

మత్కర్మభిర్మత్కథయా చ నిత్యం మద్దేవసఙ్గాద్గుణకీర్తనాన్మే
నిర్వైరసామ్యోపశమేన పుత్రా జిహాసయా దేహగేహాత్మబుద్ధేః

న సేవలు చేస్తూ నా కథలు వింటూ నావారితో కలిసి ఉండటమూ ఎవరియందూ వైరాన్ని పెట్టుకోకుండా సమానభావముతో ఉంటూ ఇంద్రియ నిగ్రహముతో (మనసూ మిగతా ఇంద్రియాలను గెలుచుట) శరీరం యందు ఇంటి యందు మనసు యందూ, శరీరమే ఆత్మ అనే బుద్ధి వదిలిపెట్టి అధ్యాత్మ యోగముతో శరీరమంటే ఆత్మ వేరనే భావనతో ధ్యానించగలగాలి

అధ్యాత్మయోగేన వివిక్తసేవయా ప్రాణేన్ద్రియాత్మాభిజయేన సధ్ర్యక్
సచ్ఛ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వదసమ్ప్రమాదేన యమేన వాచామ్

చక్కగా ప్రాణములనూ ఇంద్రియములనూ మనసునూ జయించి, బ్రహ్మచర్యముతో పొరబాటున కూడా మోహానికి గురికాకుండా మితబాషిత్వముతో భ్రమ లేకుండా వ్యామోహం లేకుండా సకల జగత్తులో నన్నే చూడగలగాలి

సర్వత్ర మద్భావవిచక్షణేన జ్ఞానేన విజ్ఞానవిరాజితేన
యోగేన ధృత్యుద్యమసత్త్వయుక్తో లిఙ్గం వ్యపోహేత్కుశలోऽహమాఖ్యమ్

విజ్ఞ్యానముతో కూడి ఉన్న జ్ఞ్యానాన్ని (విజ్ఞ్యానమంటే శరీరాన్ని పోషించుకోవడం) యోగముతో ధైర్యమూ పరిశుద్ధితో కూడి నేను నేననే సంస్కారాన్ని మెల్లిగా తొలగించుకోవాలి

కర్మాశయం హృదయగ్రన్థిబన్ధమవిద్యయాసాదితమప్రమత్తః
అనేన యోగేన యథోపదేశం సమ్యగ్వ్యపోహ్యోపరమేత యోగాత్

కర్మలకు సంస్కారం మూలం. ఇది హృదయ గ్రంధిని బంధిస్తుంది. ఈ కర్మ అవిద్య వలన వచ్చింది.అది తెలుసుకుని ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉపదేశించిన జ్ఞ్యానం ప్రకారం ఈ శరీరాత్మ భావాన్ని శరీర బంధాన్నీ వాసననూ సంస్కారాన్ని వదిలిపెట్టి ఆ యోగాన్ని కూడా వదిలిపెడతాడు. శరీరాన్ని దారిలో పెట్టుటే యోగం (యుజ్యతే ఇతి యోగః). శరీరమంటే ఏమిటో తెలిసి శరీరాన్ని దారిలో పెడితే మనసు ఆత్మ వైపు వెళుతుంది, మనసును ఆత్మవైపు పెట్టడానికే యోగం. అలా లగ్నమయ్యాక వెనక్కు తిరిగిరాదు కాబట్టి యోగముతో పని లేదు

పుత్రాంశ్చ శిష్యాంశ్చ నృపో గురుర్వా మల్లోకకామో మదనుగ్రహార్థః
ఇత్థం విమన్యురనుశిష్యాదతజ్జ్ఞాన్న యోజయేత్కర్మసు కర్మమూఢాన్
కం యోజయన్మనుజోऽర్థం లభేత నిపాతయన్నష్టదృశం హి గర్తే

తండ్రి కుమారులనూ గురువు శిష్యులనూ సరి అయిన మార్గములో పెట్టాలి. నా లోకన్ని పొందగోరినవాడు నా అనుగ్రహం కోసం ఈ విధానాన్ని రాగ ద్వేషాలు లేకుండా సహనం కోల్పోకుండా ఆ తత్వం తెలియని వారికి బోధించాలి. గురువైన వాడూ తెలిసిన వాడు కర్మలతో మూఢులైన వారికి కర్మలను బోధించకూడదు, కర్మలలో నియోగించరాదు. కళ్ళు లేని వారిని గోతిలో పడేసినందు వలన కళ్ళు ఉన్న వారికేమి లాభము. జ్ఞ్యానమున్న వాడు అజ్ఞ్యానులను సంసారములో పడవేయకూడదు.

లోకః స్వయం శ్రేయసి నష్టదృష్టిర్యోऽర్థాన్సమీహేత నికామకామః
అన్యోన్యవైరః సుఖలేశహేతోరనన్తదుఃఖం చ న వేద మూఢః

సహజముగానే ఈ లోకమంతా శ్రేయస్సు ఎలా పొందాలో అన్న విషయం తెలియకుండానే ఉంటుంది. అలాంటి వారు అన్ని ప్రయోజనాలనూ కోరికతో పొందుతూ ఉంటాడు. కొద్ది సుఖం కలుగుతుందీ అన్న భావన కలిగితే పర్సపరం ద్వేషించుకుంటూ ఉంటారు. కోరికలు బాగా ఎక్కువవడమే దీనికి కారణం. కోరిక వలన వైరమూ వైరము వలన కష్టాలు పెరుగుతాయి.

కస్తం స్వయం తదభిజ్ఞో విపశ్చిదవిద్యాయామన్తరే వర్తమానమ్
దృష్ట్వా పునస్తం సఘృణః కుబుద్ధిం ప్రయోజయేదుత్పథగం యథాన్ధమ్

సంసారమ్యొక్క రహస్యం తెలిసినవాడెవడైనా పక్కవారిని సంసారములో పడమని బోధిస్తారా? దారి తెలియకుండా పక్కదారి పట్టిన గుడ్డి వాడికి కనులున్నవాడు దారి చూపినట్లుగా వారు సంసారములో మిగతావారిని పడనీయరు

గురుర్న స స్యాత్స్వజనో న స స్యాత్పితా న స స్యాజ్జననీ న సా స్యాత్
దైవం న తత్స్యాన్న పతిశ్చ స స్యాన్న మోచయేద్యః సముపేతమృత్యుమ్

సంసారాన్ని ఎవరు దాటిస్తారో వారే గురువూ భర్తా తల్లీ తండ్రీ. అలా చేయలేని వాడు తండ్రీ కాడూ, తల్లీ కాదు, గురువూ కాదూ, అలా చేయలేని దేవుడు దేవుడే కాడు.

ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్త్వం హి మే హృదయం యత్ర ధర్మః
పృష్ఠే కృతో మే యదధర్మ ఆరాదతో హి మామృషభం ప్రాహురార్యాః

అసలు నాకు ఈ శరీరముతో ఎటువంటి సంబంధమూ లేదు. ఈ శరీరాన్ని నేను తెచ్చుకున్నాను గానీ శరీరము నాకు రాలేదు. ధర్మము నా హృదయము. అధర్మము నాకు వీపు. ధర్మము ముందు ఉండి అధర్మమును తొలగించిన వాడిని కాబట్టి నేను వృషబున్ని.

తస్మాద్భవన్తో హృదయేన జాతాః సర్వే మహీయాంసమముం సనాభమ్
అక్లిష్టబుద్ధ్యా భరతం భజధ్వం శుశ్రూషణం తద్భరణం ప్రజానామ్

అందుకే నా హృదయమునుంచి పుట్టిన మీలో పెద్దవాడైన భరతుడిని సేవించండి నేను వెళ్ళిన తరువాత. మనస్సుని కష్టపెట్టుకోకుండా సేవించండి. మీరు రాజుని సేవించుటే అతని మాట వినుటే మీరు ప్రజలను పరిపాలించుట.

భూతేషు వీరుద్భ్య ఉదుత్తమా యే సరీసృపాస్తేషు సబోధనిష్ఠాః
తతో మనుష్యాః ప్రమథాస్తతోऽపి గన్ధర్వసిద్ధా విబుధానుగా యే

చైతన్యం లేని వాటి కంటే చైతన్యం గల గడ్డి పరకలూ మొలకలూ ఉత్తములూ, వాటి కంటే ఉత్తములు ప్రాణం ఉన్నవి. ప్రాణమున్నవాటికంటే జ్ఞ్యానం ఉన్నవి ఉత్తములు, జ్ఞ్యానం కలవాటన్నిటిలో మనుష్యులు ఉత్తములు, వారిలో కూడా యోగులు ఉత్తములు. గంధర్వులు సిద్ధులూ దేవతలూ వీరి కంటే ఉత్తములు, వీరికంటే ఇంద్రాదులూ, ఇంద్రాదులు కంటే దక్షాదులూ, దక్షాదులకంటే శంకరుడు శ్రేష్టుడు, ఆయన కంటే బ్రహ్మ శ్రేష్టుడు. ఆ బ్రహ్మ నా యందు భక్తి కలవాడు. నాకు బ్రాహ్మణోత్తములు దేవతలు. బ్రాహ్మణులతో సమానమైన ప్రాణమును చూడలేము.

దేవాసురేభ్యో మఘవత్ప్రధానా దక్షాదయో బ్రహ్మసుతాస్తు తేషామ్
భవః పరః సోऽథ విరిఞ్చవీర్యః స మత్పరోऽహం ద్విజదేవదేవః

న బ్రాహ్మణైస్తులయే భూతమన్యత్పశ్యామి విప్రాః కిమతః పరం తు
యస్మిన్నృభిః ప్రహుతం శ్రద్ధయాహమశ్నామి కామం న తథాగ్నిహోత్రే

ఇలాంటి బ్రాహ్మణులకు పెట్టిన దాన్ని వారు భుజిస్తుంటే వారి నాలుకలతో నేను తింటాను గానీ అగ్నిహోత్రములో ఉన్నదాన్ని కాదు. యజ్ఞ్య యాగాదులకంటే బ్రాహ్మణ భోజనం నాకు ప్రీతి.

ధృతా తనూరుశతీ మే పురాణీ యేనేహ సత్త్వం పరమం పవిత్రమ్
శమో దమః సత్యమనుగ్రహశ్చ తపస్తితిక్షానుభవశ్చ యత్ర

ఈ బ్రాహ్మణులలో శమమూ దమమూ సత్యం అనుగ్రహం తితీక్ష తపము ఉంటాయి. (ఇవి ఉన్న వారే బ్రాహ్మణులు)

మత్తోऽప్యనన్తాత్పరతః పరస్మాత్స్వర్గాపవర్గాధిపతేర్న కిఞ్చిత్
యేషాం కిము స్యాదితరేణ తేషామకిఞ్చనానాం మయి భక్తిభాజామ్

అన్ని లోకాలలో ఏది కావాలన్నా ఇచ్చేది నేనే. నాకంటే పరమైనది ఇంకోటి లేదు. దేన్నీ కోరని వారు కూడా నన్ను కోరతారు

సర్వాణి మద్ధిష్ణ్యతయా భవద్భిశ్చరాణి భూతాని సుతా ధ్రువాణి
సమ్భావితవ్యాని పదే పదే వో వివిక్తదృగ్భిస్తదు హార్హణం మే

సకల ప్రపంచమూ నా రూపముగా భావించండి. మీరు వేటి వేటిని ద్వేషిస్తున్నారో అవి అన్నీ నా గృహాలే అని భావించిన నాడు వాటిని ద్వేషిస్తారా? చరాచరాలు ధృవములూ అధృవములూ అన్నీ నా రూపము. సకల ప్రపంచమూ పరమాత్మ స్వరూపమే అని చూచుటే నా ఆరాధనే

మనోవచోదృక్కరణేహితస్య సాక్షాత్కృతం మే పరిబర్హణం హి
వినా పుమాన్యేన మహావిమోహాత్కృతాన్తపాశాన్న విమోక్తుమీశేత్

మనస్సు వాక్కు ఇంద్రియములూ నేత్రములనూ నా అనుగ్రహముతోనే మీరు నిగ్రహించుకోగలరు. నా అనుగ్రహం లేకుండా, ప్రపంచమంతా నా రూపమనే ఈ దృష్టి లేని వాడు యమ పాశం నుండి విముక్తుడు కాలేడు. త్రికరణములచే నన్ను ఆరాధించిన వాడిని సంసారం బాధించదు

శ్రీశుక ఉవాచ
ఏవమనుశాస్యాత్మజాన్స్వయమనుశిష్టానపి లోకానుశాసనార్థం మహానుభావః పరమ
సుహృద్భగవానృషభాపదేశ ఉపశమశీలానాముపరతకర్మణాం మహామునీనాం భక్తిజ్ఞానవైరాగ్య
లక్షణం పారమహంస్యధర్మముపశిక్షమాణః స్వతనయశతజ్యేష్ఠం పరమభాగవతం భగవజ్
జనపరాయణం భరతం ధరణిపాలనాయాభిషిచ్య స్వయం భవన ఏవోర్వరితశరీరమాత్రపరిగ్రహ ఉన్మత్త
ఇవ గగనపరిధానః ప్రకీర్ణకేశ ఆత్మన్యారోపితాహవనీయో బ్రహ్మావర్తాత్ప్రవవ్రాజ

కుమారులకీ విధముగా లోకానికి బోధించడానికి పరమ సుహృత్ అయిన పరమాత్మ ఇంద్రియ నిగ్రహం ప్రధానముగా కల మహామునులకు భక్తి జ్ఞ్యాన వైరాగ్యాన్ని బోధించే సన్యాసి ధర్మం ప్రపత్తి ధర్మ పరమాత్మ ధర్మం బోధిస్తున్నవాడై కుమారులలో పెద్దవాడూ భాగవతోత్తముడైన భరతున్ని రాజ్య పాలనానికి అభిషేకం చేసి ఈ భూమి  మీదకు ఎలా వచ్చాడో అలాగే తయారయ్యాడు. దిగంబరుడై ఉన్మత్తుడిలా జుట్టు విరబోసుకుని శరీరములో అగ్నిహోత్రాన్ని ఆవేశింపచేసుకుని బ్రహ్మావర్త దేశమునకు బయలుదేరాడు

జడాన్ధమూకబధిరపిశాచోన్మాదకవదవధూతవేషోऽభిభాష్యమాణోऽపి జనానాం గృహీతమౌన
వ్రతస్తూష్ణీం బభూవ

జడుడిలా గుడ్డి మూగా పిచ్చి చెవిటి వాడిలాగ పిశాచం పట్టినవాడిలాగ ఆకారం తెచ్చుకున్నాడు. శరీరం నిండా దుమ్ము కొట్టుకుని పోగా ఎవరి మాటలనూ లెక్కచేయక మౌన వ్రతాన్ని అవలంబించాడు

తత్ర తత్ర పురగ్రామాకరఖేటవాటఖర్వటశిబిరవ్రజఘోషసార్థగిరి
వనాశ్రమాదిష్వనుపథమవనిచరాపసదైః పరిభూయమానో మక్షికాభిరివ వనగజస్తర్జన
తాడనావమేహనష్ఠీవనగ్రావశకృద్రజఃప్రక్షేపపూతివాతదురుక్తైస్తదవిగణయన్నేవాసత్సంస్థాన
ఏతస్మిన్దేహోపలక్షణే సదపదేశ ఉభయానుభవస్వరూపేణ స్వమహిమావస్థానేనాసమారోపితాహం
మమాభిమానత్వాదవిఖణ్డితమనాః పృథివీమేకచరః పరిబభ్రామ

పురములూ గ్రామములూ ఆకరములూ (చిన్న పల్లెలు) ఖేటములు (పది ఇల్లు కల గ్రామములు) ఆవటములు (చెట్ల కింద ఇల్లూ) పర్వతాలలో అరణ్యాలలో తోటలలో ప్రజలు చేస్తున్న అవహేళనను పట్టించుకోకుండా, అడవిలో ఏనుగు వెళుతుంటే ఈగలు బాధపెట్టినట్లుగా కొందరు రాళ్ళతో కొట్టారు, కొందరు హింసించారు, దుర్భాషలాడారు దుమ్ము పోసారు మట్టి వేసారు. అవి ఏమీ పట్టీంచుకోకుండా ఇహలోకానుభవం పరలోకానుభవం శరీరానుభవం ఆత్మానుభవముతో తాను పరమాత్మ అంశ కాబట్టి తన ప్రభావాన్ని నిలుపుకుంటూ అహం మమ అన్న అహంకారము లేని వాడై ఒక్కడే ఈ పృధ్వీ మండలాన్ని సంచరిస్తూ ఉన్నాడు

అతిసుకుమారకరచరణోరఃస్థలవిపులబాహ్వంసగలవదనాద్యవయవవిన్యాసః ప్రకృతి
సున్దరస్వభావహాససుముఖో నవనలినదలాయమానశిశిరతారారుణాయతనయనరుచిరః సదృశసుభగ
కపోలకర్ణకణ్ఠనాసో విగూఢస్మితవదనమహోత్సవేన పురవనితానాం మనసి కుసుమ
శరాసనముపదధానః పరాగవలమ్బమానకుటిలజటిలకపిశకేశభూరిభారోऽవధూతమలిననిజ
శరీరేణ గ్రహగృహీత ఇవాదృశ్యత

పరమ సుందరుడు, పరమ సుకుమారమైన అవయవములు కలవాడు. సహజమైన సుందరుడు కాబట్టి ఆయన నవ్వితే అందరి మనసుకూ ఆహ్లాదం కలిగించింది. పుండరీకాక్షుడు కాబట్టి అప్పుడే వికసించిన పద్మము వలె వికసించిన చల్లటి చూపులు గలవాడు. కపోలములూ కంఠమూ నాసికా అందముగా కలవాడై ఎందుకు నవ్వుతున్నాడో ఎవరికీ అర్థం కాకుండా జనుల అజ్ఞ్యానానికి జాలిపడుతూ నవ్వాడు. పురస్త్రీల మనస్సులో మన్మధుడి బాణాలను ఎక్కుపెడుతూ, దుమ్మంతా గాలికి లేచి శరీరానికి అలముకుని గ్రహము పట్టినవాడిలా అందరికీ కనపడ్డాడు.

యర్హి వావ స భగవాన్లోకమిమం యోగస్యాద్ధా ప్రతీపమివాచక్షాణస్తత్ప్రతిక్రియాకర్మ
బీభత్సితమితి వ్రతమాజగరమాస్థితః శయాన ఏవాశ్నాతి పిబతి ఖాదత్యవమేహతి హదతి స్మ చేష్టమాన
ఉచ్చరిత ఆదిగ్ధోద్దేశః

పరమాత్మ ఈ లోకానికి యోగము నేర్పాలనుకున్నవాడు కాబట్టి ఉన్నవారు తరించాలన్నా తెలుసుకోవాలన్నా బ్రతకాలన్నా ఏ పనులు చేయాలో వృషభుడు దానికి వ్యతిరిక్తముగా చేస్తున్నాడు. తత్వం తెలుసుకున్న వారు ఎటువంటి నియమమూ పాటించరు. ఈయన ఎటువంటి ప్రతీకారం లేకుండా (దురద పెడితే గోక్కోవడం ఆకలేస్తే అన్నం తినడం దాహం వేస్తే నీరు తాగడం ఎత్చ్..,)  ఆజగర వ్రతం (కొండచిలువ) ఆచరించాడు.  కొండచిలువ తానున్నచోటికి వస్తేనే తింటుంది. భగవంతుడు అందించిన దానితోనే తృప్తి పడడం ఆజగర వ్రతం. ఆయన పడుకునే అన్ని పనులూ (తినడం తాగడం మల మూత్ర విసర్జనా) చేస్తున్నాడు.

తస్య హ యః పురీషసురభిసౌగన్ధ్యవాయుస్తం దేశం దశయోజనం సమన్తాత్సురభిం చకార

మహాయోగి అయిన ఆయన మలం దశయోజనాల మేర సుగంధాన్ని వెదజల్లింది.

ఏవం గోమృగకాకచర్యయా వ్రజంస్తిష్ఠన్నాసీనః శయానః కాకమృగగోచరితః పిబతి
ఖాదత్యవమేహతి స్మ

కొన్నాళ్ళు గోవులా కొన్నాళ్ళు మృగములా కొన్నాళ్ళు కాకిలా ఉన్నాడు, నడుచుకుంటూ ఉంటూ ఒకే కూర్చుని పని చేసుకుంటూ తింటూ తాగుతూ మూత్ర విసర్జన చేస్తూ కైవల్యాధిపతి అయిన స్వామి ఆనందస్వరూపుడు , పరమాత్మలోనే తనను ఉంచి, పరమాత్మకూ తనకూ ఎలాంటి వ్యవధానం లేకుండా అన్నీ సిద్ధించినవాడై  (అష్టసిద్ధులు పొందినవాడై),

ఇతి నానాయోగచర్యాచరణో భగవాన్కైవల్యపతిరృషభోऽవిరతపరమమహానన్దానుభవ ఆత్మని
సర్వేషాం భూతానామాత్మభూతే భగవతి వాసుదేవ ఆత్మనోऽవ్యవధానానన్తరోదరభావేన సిద్ధ
సమస్తార్థపరిపూర్ణో యోగైశ్వర్యాణి వైహాయసమనోజవాన్తర్ధానపరకాయప్రవేశదూరగ్రహణాదీని
యదృచ్ఛయోపగతాని నాఞ్జసా నృప హృదయేనాభ్యనన్దత్

మనోజవం పరకాయ ప్రవేశం దూరగ్రహణం దూర శ్రవణం అన్నీ రాగా వాటిని అభినందించలేదు, ఒప్పుకోలేదు. యోగముతో కలిగిన జ్ఞ్యానాగ్నిలో అన్ని కర్మబీజములూ కాల్చివేశాడూ. ఇది విన్న పరీక్షిత్తు "కోరకుండా వచ్చినా కోరి వచ్చినా వచ్చిన ఐశ్వర్యాన్ని ఒప్పుకుంటే మళ్ళీ సంసారములో పడినట్లే. " అన్నాడు. అప్పుడు శుకుడు

Sunday, March 17, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అథ హ తముత్పత్త్యైవాభివ్యజ్యమానభగవల్లక్షణం సామ్యోపశమవైరాగ్యైశ్వర్యమహా
విభూతిభిరనుదినమేధమానానుభావం ప్రకృతయః ప్రజా బ్రాహ్మణా దేవతాశ్చావనితలసమవనాయాతితరాం
జగృధుః

పుట్టిన వెంటనే ఈయన పరమాత్మ అనే గుర్తులు కలిగి ఉన్నాడు. పెరుగుతున్న కొద్దీ ఉపశమమూ వైరాగ్యమ్మూ వృద్ధి అవుతూ ఉన్నాయి. ప్రజలూ బ్రాహ్మణులూ ఈయన మహారాజైతే భూమికి ఏ లోపమూ ఉండదు అన్న భావనతో సంతోషించారు.

తస్య హ వా ఇత్థం వర్ష్మణా వరీయసా బృహచ్ఛ్లోకేన చౌజసా బలేన శ్రియా యశసా

ఈయన గొప్ప దివ్యమైన తేజస్సుతో బలముతో కీర్తితో ఐశ్వర్యముతో జ్ఞ్యానముతో అన్నిటిలో అగ్రగణ్యుడు కాబట్టి వృషభ అని పేరు పెట్టాడు

వీర్యశౌర్యాభ్యాం
చ పితా ఋషభ ఇతీదం నామ చకార

యస్య హీన్ద్రః స్పర్ధమానో భగవాన్వర్షే న వవర్ష తదవధార్య భగవానృషభదేవో
యోగేశ్వరః ప్రహస్యాత్మయోగమాయయా స్వవర్షమజనాభం నామాభ్యవర్షత్

ఈయన రాజ్యము చేస్తూ ఉండగా ఈయన ప్రభావాన్ని అందరికి చెప్పడానికా అన్నట్లు ఇంద్రుడు వర్షం కురిపించడం ఆపేసాడు. అది తెలుసుకుని యోగేశ్వరుడైన భగవానుడు నవ్వి తన యోగ శక్తితో తన వర్షమైన అజనాభ వర్షాన్ని వర్షింపచేసాడు.

నాభిస్తు యథాభిలషితం సుప్రజస్త్వమవరుధ్యాతిప్రమోదభరవిహ్వలో గద్గదాక్షరయా గిరా
స్వైరం గృహీతనరలోకసధర్మం భగవన్తం పురాణపురుషం మాయావిలసితమతిర్వత్స తాతేతి
సానురాగముపలాలయన్పరాం నిర్వృతిముపగతః

నాభికూడా తాను కోరిన పరమాత్మనే పుత్రుడుగా పుట్టాడని తెలుసుకొని సంతోషించి పరమానందం పొంది పరమాత్మను కొడుకుగా సంబోదించడములో పొందిన పరవశములో బొంగురుపోయిన గొంతుతో పరమాత్మ మాయచే కమ్ముకోబడిన వాడై "వత్సా, తాతా" అని ప్రేమతో లాలిస్తూ గొప్ప తృప్తిని పొందాడు.

విదితానురాగమాపౌరప్రకృతి జనపదో రాజా నాభిరాత్మజం సమయసేతురక్షాయామభిషిచ్య
బ్రాహ్మణేషూపనిధాయ సహ మేరుదేవ్యా విశాలాయాం ప్రసన్ననిపుణేన తపసా సమాధియోగేన నర
నారాయణాఖ్యం భగవన్తం వాసుదేవముపాసీనః కాలేన తన్మహిమానమవాప

ప్రజల కోరిక మేరకు రాజుని చేసాడు, చిన్న పిల్లవాడిగా ఉన్న వృషబున్ని రాజుగా చేసి రాజ్యభారాన్ని బ్రాహ్మణులకూ మంత్రులకూ అప్పచెప్పి బదరీ (విశాలా) వెళ్ళాడు. ప్రసన్నమైన తపస్సుతో సమాధి యోగములో పరమాత్మను ఆరాధిస్తూ అతని లోకానికి వెళ్ళాడు నాభి.

యస్య హ పాణ్డవేయ శ్లోకావుదాహరన్తి
కో ను తత్కర్మ రాజర్షేర్నాభేరన్వాచరేత్పుమాన్
అపత్యతామగాద్యస్య హరిః శుద్ధేన కర్మణా

నాభి మాహాత్యం:
నాభి చేసిన పని ఎవరు చేయగలరు. అతనిని చూచి సంతోషించి పరమాత్మే కొడుకుగా వచ్చాడు. నాభికంటే వేరు బ్రహ్మణ్యులు (బ్రాహ్మణులంటే ప్రీతి గలవారు) లేరు.

బ్రహ్మణ్యోऽన్యః కుతో నాభేర్విప్రా మఙ్గలపూజితాః
యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసురోజసా

ఆయన బ్రాహ్మణులను మంగళములతో పూజిస్తాడు. అంత భక్తి బ్రాహ్మణుల మీద ఉంది కాబట్టే బ్రాహ్మణులు కూడా అంతే కృతజ్ఞ్యతగా యజ్ఞ్యములో పరమాత్మను చూపారు.

అథ హ భగవానృషభదేవః స్వవర్షం కర్మక్షేత్రమనుమన్యమానః ప్రదర్శితగురుకులవాసో
లబ్ధవరైర్గురుభిరనుజ్ఞాతో గృహమేధినాం ధర్మాననుశిక్షమాణో జయన్త్యామిన్ద్రదత్తాయాముభయ
లక్షణం కర్మ సమామ్నాయామ్నాతమభియుఞ్జన్నాత్మజానామాత్మసమానానాం శతం జనయామాస

భగవానుడైన వృషబుడు కర్మక్షేత్రమైన అజనాభ వర్షములో "తాను ధర్మాన్ని ఆచరించకుంటే తోటివారు కూడా ఆచరించరని ధర్మాన్ని ఆచరించాడు. గురుకులం వెళ్ళి వారి వద్ద చదువుకుని వారి నుండి వరములను పొంది గృహస్థ ధర్మాలను ఆచరించగోరి జయంతి అనే ఇంద్రుని పుత్రికను పెండ్లాడి, ప్రవృత్తి నివృత్తి లక్షణాలు గల కర్మలను వివరించి తాను చెప్పిన పనులనే వివరించగోరి తనలాంటి వారినే నూరుగురిని కొడుకులుగా పొందాడు. వారిలో భరతుడు శ్రేష్టుడు

యేషాం ఖలు మహాయోగీ భరతో జ్యేష్ఠః శ్రేష్ఠగుణ ఆసీద్యేనేదం వర్షం భారతమితి
వ్యపదిశన్తి

అలాంటి మహానుభావుడైన భరతుని వలన దీనికి భరత వర్షమని పేరు వచ్చింది.

తమను కుశావర్త ఇలావర్తో బ్రహ్మావర్తో మలయః కేతుర్భద్రసేన ఇన్ద్రస్పృగ్విదర్భః కీకట ఇతి
నవ నవతి ప్రధానాః

భరతుడు గాక మిగతావారు తొమ్మిది మంది.

కవిర్హవిరన్తరిక్షః ప్రబుద్ధః పిప్పలాయనః
ఆవిర్హోత్రోऽథ ద్రుమిలశ్చమసః కరభాజనః

ఇవి వారి పేర్లు

ఇతి భాగవతధర్మదర్శనా నవ మహాభాగవతాస్తేషాం సుచరితం భగవన్మహిమోపబృంహితం
వసుదేవనారదసంవాదముపశమాయనముపరిష్టాద్వర్ణయిష్యామః

వీరు మహా భాగవతోత్తములు. పరమాత్మ ధర్మాన్ని మాత్రమే సేవించి రాజ్యమును కాదని వెళ్ళారు. వీరి చరిత్ర వసుదేవ నారద సంవాదములో వింటావు. వీరి చరిత్ర అన్నిటినీ (మనస్సునూ ఇంద్రియాలను బుద్ధినీ ) జయించాలంటే ఆచరించాలి. స్వరూప స్వభావాలతో పరమాత్మను పొందడానికి కావలసిన మార్గాన్ని మాత్రమే ఆచరించాలి. తక్కిన పనులు చేస్తున్నట్లే కనపడాలి. లౌకిక విషయాలలో మనసు పెట్టీనా పెట్టకపోయినా జరిగేవి జరుగుతూనే ఉంటాయి.

యవీయాంస ఏకాశీతిర్జాయన్తేయాః పితురాదేశకరా మహాశాలీనా మహాశ్రోత్రియా యజ్ఞశీలాః
కర్మవిశుద్ధా
బ్రాహ్మణా బభూవుః

ఇంక మిగతా ఎనభై ఒక్క మంది జయంతి పుత్రులు తండ్రి ఆదేశము పాటించేవారు కాబట్టి శుద్ధమైనటువంటి బ్రాహ్మణోత్తములయ్యారు.

భగవానృషభసంజ్ఞ ఆత్మతన్త్రః స్వయం నిత్యనివృత్తానర్థపరమ్పరః కేవలానన్దానుభవ
ఈశ్వర ఏవ విపరీతవత్కర్మాణ్యారభమాణః కాలేనానుగతం ధర్మమాచరణేనోపశిక్షయన్నతద్విదాం
సమ ఉపశాన్తో మైత్రః కారుణికో ధర్మార్థయశఃప్రజానన్దామృతావరోధేన గృహేషు లోకం నియమయత్

పరమాత్మ వృషభుడు ఆత్మ తంత్రుడు. తనను మరెవ్వరూ వశములో ఉంచుకోలేరు, వశము నుంచి తప్పించలేరు. ఈయన కేవలం ఆనందాన్ని అనుభవించే ఈశ్వరుడు. పరమాత్మైనా పక్కవారికి అనుమానం రాకుండా సామాన్య గృహస్థులు చేసే పనులే చేసుకుంటూ కాలానుగుణ ధర్మాన్ని తానాచరిస్తూ తక్కిన వారికి ఆచరించమని నేర్పుతూ, తత్వ జ్ఞ్యానం లేని వారి విషయములో సమముగా ఉండి, అన్నీ మానుకుని మైత్రి గలిగి ఉన్నాడు. ధర్మార్థ యశ సంతానమూ మొదలైన వాటితో రాజ్యపరిపాలన చేసాడు. ధర్మబద్ధముగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు

యద్యచ్ఛీర్షణ్యాచరితం తత్తదనువర్తతే లోకః

ఉత్తములు దేన్ని అనుసరిస్తారో తక్కిన వారు దాన్నే ఆచరిస్తారు కాబట్టి దాన్నే ఆచరించాడు.

యద్యపి స్వవిదితం సకలధర్మం బ్రాహ్మం గుహ్యం బ్రాహ్మణైర్దర్శితమార్గేణ
సామాదిభిరుపాయైర్జనతామనుశశాస

అన్ని ధర్మాలు తనకు తెలిసి ఉండీ ధర్మజ్ఞ్యుడయి ఉండి కూడా బ్రాహ్మణులు చెప్పిన మార్గములో అనుసరించి అందరినీ ఆ మార్గములో నడిపాడు

ద్రవ్యదేశకాలవయఃశ్రద్ధర్త్విగ్వివిధోద్దేశోపచితైః సర్వైరపి క్రతుభిర్యథోపదేశం శత
కృత్వ ఇయాజ

యజ్ఞ్యాలతో ఇంద్రున్ని ఆనందింపచేసాడు

భగవతర్షభేణ పరిరక్ష్యమాణ ఏతస్మిన్వర్షే న కశ్చన పురుషో
వాఞ్ఛత్యవిద్యమానమివాత్మనోऽన్యస్మాత్కథఞ్చన కిమపి కర్హిచిదవేక్షతే భర్తర్యనుసవనం
విజృమ్భితస్నేహాతిశయమన్తరేణ

ఈయన పరిపాలించే జగత్తులో ఏ ఒక్కడూ అన్యాయముగా వచ్చేదాన్ని కోరుకోడు. పక్క నుండీ ఎదురు నుండీ ఏ చిన్న వస్తువును కూడా పరమాత్మనే ఆరాధించే వారు కోరుకోరు.

స కదాచిదటమానో భగవానృషభో బ్రహ్మావర్తగతో బ్రహ్మర్షిప్రవరసభాయాం ప్రజానాం
నిశామయన్తీనామాత్మజానవహితాత్మనః ప్రశ్రయప్రణయభరసుయన్త్రితానప్యుపశిక్షయన్నితి హోవాచ

ఇలాంటి వృషభుడు ఒకసారి బ్రహ్మావర్తమునకు వెళ్ళాడు. ఈయన మొత్తం భూమండలాన్ని పర్యటించాలని వెళ్ళి బ్రహ్మావర్తమునకు చేరి అక్కడ ఉన్న బ్రహ్మర్షుల సభలో ప్రజలు వింటూ ఉండగా ఆత్మ జ్ఞ్యానమందు మనసు పెట్టి అందరూ వినయమూ వివేకమూ జ్ఞ్యానములో బాగా శిక్షింపబడ్డవారే అయినా వృషభుడు చెప్పదలచు కున్నది వారింకానేర్చుకోలేదు. అలాంటి ప్రజలందరికీ తాను ధర్మోపదేశము చేయగోరి ఇలా మాట్లాడాడు.

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
నాభిరపత్యకామోऽప్రజయా మేరుదేవ్యా భగవన్తం యజ్ఞపురుషమవహితాత్మాయజత

వారందరిలో నాభి పెద్దవాడు. సంతానాన్ని కోరి సావధానమ మనసుతో భార్యతో కలిసి పరమాత్మను ఆరాధించాడు.

తస్య హ వావ శ్రద్ధయా విశుద్ధభావేన యజతః ప్రవర్గ్యేషు ప్రచరత్సు ద్రవ్యదేశకాల
మన్త్రర్త్విగ్దక్షిణావిధానయోగోపపత్త్యా దురధిగమోऽపి భగవాన్భాగవతవాత్సల్యతయా సుప్రతీక
ఆత్మానమపరాజితం నిజజనాభిప్రేతార్థవిధిత్సయా గృహీతహృదయో హృదయఙ్గమం మనో
నయనానన్దనావయవాభిరామమావిశ్చకార

పరిశుద్దమైన మనసు శ్రద్ధా ఏకాగ్రతతో భగవానున్ని ఆరాధించాడు. యజ్ఞ్యానికి ఎనిమిది అంగాలుంటాయి. ఒక క్రమపద్దతిలో సమూహాత్మకముగా ఏర్పరచేవి. యజ్ఞ్యానికి ద్రవ్యమూ (పాలూ, పురోడాశం హవిస్సు పెరుగు) ద్రవ్యమూ ప్రదేశమూ కాలమూ (మంచి ముహూత్రమూ) మంత్రాల్లూ ఋత్విక్కులూ దక్షిణా విధానమూ యోగమూ కావాలి. ఇవన్నీ సక్రమముగా చేకూరాలి ఇవన్నీ సావధానమనసుతో చేకూర్చాడు. అందు వలన భాగవతుల యందు వాత్సల్యం కలిగినందున ఎవ్వరికీ చిక్కని వాడైన శ్రీమన్నారాయణుడు కోరికను తీర్చడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన హృదయమునకు నిరంతరం స్మరించదగినవాడు. మనసుకీ నేత్రాలకు ఆనందం కలిగించేవాడు తన దివ్య మంగళ రూపాన్ని ప్రత్యక్షం చేసాడు. నాలుగు భుజములున్న తన రూపాన్ని చూపించాడు. భుజయుగళద్వయం (ఇది గద్యం కాబట్టి ఆరు లఘువులు )

అథ హ తమావిష్కృతభుజయుగలద్వయం హిరణ్మయం పురుషవిశేషం కపిశకౌశేయామ్బర
ధరమురసి విలసచ్ఛ్రీవత్సలలామం దరవరవనరుహవనమాలాచ్ఛూర్యమృతమణి
గదాదిభిరుపలక్షితం స్ఫుటకిరణప్రవరముకుటకుణ్డలకటకకటిసూత్రహారకేయూరనూపురాద్యఙ్గ
భూషణవిభూషితమృత్విక్సదస్యగృహపతయోऽధనా ఇవోత్తమధనముపలభ్య సబహు
మానమర్హణేనావనతశీర్షాణ ఉపతస్థుః

పీతాంబరధారి అయిన స్వామి, వక్షములో శ్రీవత్సం కలిగి ఉన్న స్వామీ, శంఖమూ పద్మమూ వనమాలా గదా ఖడ్గముతో ప్రకాశించే స్వామి, అన్ని రకాల ఆభరణాలతో, ముకుటముతో కుండలములూ కటకములూ కటి సూత్రములూ హారములూ నూపురములూ కేయూరములు గలిగిన స్వామిని ఋత్విక్కులూ సదస్యులూ యజమానులు ధనములేని వాడికి ధనమున్నవాడు కనపడితే ఎలా లేస్తారో అలా లేచారు. ఆర్తితో లేచి గౌరవముతో పూజతో తల వంచి నమస్కరించి సేవించారు

ఋత్విజ ఊచుః
అర్హసి ముహురర్హత్తమార్హణమస్మాకమనుపథానాం నమో నమ ఇత్యేతావత్సదుపశిక్షితం కో
ऽర్హతి పుమాన్ప్రకృతిగుణవ్యతికరమతిరనీశ ఈశ్వరస్య పరస్య ప్రకృతిపురుషయోరర్వాక్తనాభిర్నామ
రూపాకృతిభీ రూపనిరూపణమ్సకలజననికాయవృజిననిరసనశివతమప్రవరగుణగణైకదేశ కథనాదృతే

నీవు మాలాంటి వాడికి కనపడటానికి యోగ్యుడవు (మాకు యోగ్యత ఉన్నట్లే) యోగ్యుడైన వాడికి పూజించ యోగ్యత మాకు ఉన్నట్లు తెలిసింది, నీకు నమస్సులు.
ఇంత కంటే ఎక్కువ (నమస్కారం కంటే ఎక్కువ) నీతో మాట్లాడటానికి మాకు ఏమి శక్తి ఉంది. ప్రకృతి పురుషులకంటే నీవు విలక్షణుడవు. ప్రకృతి పురుషులకు కనపడే ఆకారాన్ని తీసుకుని వచ్చావు. (మనకొక విషయం తెలిసిందంటే పురుషుని వలన తెలియాలి ప్రకృతి వలన తెలియాలి, ఈయన్ రెంటికీ అతీతుడు. అయినా మనకు కనపడడానికి మనం చూడగలిగే ఆకారముతో వచ్చాడు)
ప్రకృతి పురుషులేర్పడిన తరువాత మనకెలాంటి స్వరూప స్వభావాలర్థమవుతాయో అలాంటి స్వరూపాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన ఎవరికీ సాధారణముగా కనపడడు. సకల జనుల పాపములను పోగొట్టగలిగినవాడు (సకలజననికాయవృజిననిరసన). సుఖాలని ప్రసాదిస్తాడు. ఈయనకన్నీ మంగళ గుణాలే. అలాంటి పరమాత్మతో మనం మాట్లాడాలంటే ఏమి మాట్లాడగలము? నమో నమః అనగలమంతే, లేదా నీకున్న అనంత కోటి గుణాలలో ఒకటో అరో గుణాన్ని చెప్పగల ప్రయత్నం చేయగలం

పరిజనానురాగవిరచితశబలసంశబ్దసలిలసితకిసలయతులసికాదూర్వాఙ్కురైరపి సమ్భృతయా
సపర్యయా కిల పరమ పరితుష్యసి

పరమాత్మా, నీవింత గొప్పవాడవు. నిన్ను స్తోత్రం చేయలేము. కనీసం నిన్ను ఆరాధించాలన్నా ఆరాధించగలమా? ఒకటో రెండో తులసీ దళాలు వేయగలం. నీవింత పెద్దవాడవైన భక్తుల అనురాగముతో పలకబడిన జయ జయ ధ్వానాల చేత తులసితో ఆరాధన అందుకుంటావు. (గంగా గాయత్రీ గీతా గోవు తులసీ నామ సహస్రకం, సూర్యుడూ కాలము, పరమాత్మను పూజించ వీలు లేని వారు వీటితో అర్చించవచ్చు). తులసి దొరకకుంటే ఏదో ఒక చిగురుటాకులతో నిన్ను ఆరాధించవచ్చు. అదీ దొరకకపోతే గడ్డితో కూడా (దూర్వాఙ్కురైరపి) ఆరాధన స్వీకరిస్తావు. ఆర్తితో దేనితో పూజ చేసినా నీవు స్వీకరిస్తావు. నీకు తగినంత ద్రవ్యాలతో నిన్ను పూజించలేమన్న భయము మాకు లేదు. నీవు దేనితో పూజించినా సంతోషిస్తావు.

అథానయాపి న భవత ఇజ్యయోరుభారభరయా సముచితమర్థమిహోపలభామహే

మేము ఎంత గొప్ప లేదా చిన్న పూజ చేసినా మేము చేసే పూజతో నీకు సంతోషం కలుగుతుందా. కొద్ది పూజ చేసి కూడా గొప్ప ఫలితం పొందుతున్నాము

ఆత్మన ఏవానుసవనమఞ్జసావ్యతిరేకేణ బోభూయమానాశేషపురుషార్థస్వరూపస్య కిన్తు నాథాశిష
ఆశాసానానామేతదభిసంరాధనమాత్రం భవితుమర్హతి

నీ స్వరూపానికి తగినట్లుగానే యజ్ఞ్యమవుతున్న వెంటనే ఎలాంటి వ్యతిరేకమూ లేకుండా మేము చేసిన కర్మవలన కాకుండా నీ దయ వలన ఫలితాన్ని పొందుతున్నాము. నీవు పురుషార్థస్వరూపుడివి. ఏ కోరికా లేని వాడు ఎంత చిన్న పూజ చేసినా స్వామీ నీవు కరుణిస్తావు. ఆశీర్వాదాన్ని కోరికనూ కోరే మేము కేవలం ఏదో పేరుకు ఆరాధన చేస్తున్నామంతే!

తద్యథా బాలిశానాం స్వయమాత్మనః శ్రేయః పరమవిదుషాం పరమపరమపురుష ప్రకర్ష
కరుణయా స్వమహిమానం చాపవర్గాఖ్యముపకల్పయిష్యన్స్వయం నాపచిత ఏవేతరవదిహోపలక్షితః

ఏది మాకు శ్రేయస్సో కాదో తెలియను మూర్ఖులము. మాకేది కావాలో తెలియదు. మోక్షమంటే తెలియదు. అలాంటి వారికి నీ అతి తీవ్రమైన దయను ప్రసరిస్తావు. పెద్ద కోరిక కోరుకుని దానికి తగ్గట్టు పూజ చేయకపోయినా నీవు దయతో కరుణిస్తావు, మోక్షాన్ని ప్రసాదిస్తావు. నీవు ఏమాత్రం మార్పు లేకుండా ఉండి, మాకు మాత్రం మోక్షాన్నిస్తావు. మా చర్మ చక్షువులకు దర్శనమిచ్చావు.  నీవు ఆరాధించబడకుండానే సామాన్య మానవునిలా ఇక్కడ ఉన్నవారిలో నీవు కూడా ఒకడిగా ఉన్నట్లు కనపడుతున్నావు గానీ నీ దివ్యత్వాన్ని చూపెడుతున్నావా? మాకిదే వరము.

అథాయమేవ వరో హ్యర్హత్తమ యర్హి బర్హిషి రాజర్షేర్వరదర్షభో భవాన్నిజపురుషేక్షణవిషయ ఆసీత్

తన వారికీ తనకూ దృష్టి పధములో ఉండేట్లు చేసావు.

అసఙ్గనిశితజ్ఞానానలవిధూతాశేషమలానాం భవత్స్వభావానామాత్మారామాణాం
మునీనామనవరతపరిగుణితగుణగణ పరమమఙ్గలాయనగుణగణకథనోऽసి

సజ్జనులంటే ఎవరు? సంసారము యందు ఆసక్తి లేని వారు. వారిని నరకం రాదు స్వర్గమూ రాదు. ఇలాంటి వారికి చాలా తీక్షణమైన తపస్సు ఉంటుంది. అసంగమనే అతి తీక్షణమైన జ్ఞ్యానాగ్ని చేత అన్ని మురికులనూ పాపాలనూ ధ్వంసం చేస్తారు. అలాంటి భక్తులు చాలు. అనేకమైన కళ్యాణ గుణముల సమూహము చేత స్తోత్రం చేయబడతావు.

అథ కథఞ్చిత్స్ఖలనక్షుత్పతనజృమ్భణదురవస్థానాదిషు వివశానాం నః స్మరణాయ జ్వర
మరణదశాయామపి సకలకశ్మలనిరసనాని తవ గుణకృతనామధేయాని వచనగోచరాణి భవన్తు

మరి ఇలాంటి వాడవైన నిన్ను మేము స్తోత్రం ఎందుకు చేయలేకపోతాము? ఎందుకంటే మాకు తీరికేది? స్క్లనక్షుత్పతనజృమ్భణదురవస్థానాదిషు - జారిపడడం ఆకలీ దప్పి పడటమూ ఆవలించడమూ  ఇతర బాధలను తొలగించుకునే ప్రయత్నములో ఉన్న మేము పరవశులమయ్యాము. వీటితో పరవశులమైన మేము నిన్ను స్మరించడానికి నీ పేర్లు ఏవీ జ్ఞ్యాపకం రావు. ఇంతకాలం స్మరించకున్నా అంతకాలములో స్మరించినా మోక్షం ఇవ్వగల నీ నామధేయాలు ఉన్నా మాకు అవి జ్ఞ్యాపకం రావు.
గుణకృతనామధేయాని  - యాని నామాని గఊనాని. నీ పేర్లన్నీ నీ గుణాలని చెప్పేవే. నిన్ను మేము మరచిపోయినా అంతకాలములో స్మరించినా మా అన్ని పాపాలను పోగొట్టగల నీ నామాన్ని మాకు స్పురణ చేయి. పరమాత్మ నామం పలకాలని  స్ఫురణ నీవే చేయాలి. నీవే గుర్తుంచుకోవాలీ స్తోత్రం చేయించుకోవాలి.

కిఞ్చాయం రాజర్షిరపత్యకామః ప్రజాం భవాదృశీమాశాసాన ఈశ్వరమాశిషాం
స్వర్గాపవర్గయోరపి
భవన్తముపధావతి ప్రజాయామర్థప్రత్యయో ధనదమివాధనః ఫలీకరణమ్

ఈ రాజు నీలాంటి సంతానాన్ని కోరాడు. ఇహములో గానీ పరములో గానీ స్వర్గము గానీ మోక్షము గానీ కావాలంటే నిన్నే వెతుకుతారు. నీవు అపరాజితుడవు. నీవు ఓడిపోనివాడవు. నీ మాయనూ ఎవరూ గెలవలేరు.

కో వా ఇహ తేऽపరాజితోऽపరాజితయా
మాయయానవసితపదవ్యానావృతమతిర్విషయవిషరయానావృత
ప్రకృతిరనుపాసితమహచ్చరణః

మనకు కలిగే భోగములూ విషయములూ విషయాసక్తులూ ఇవన్నీ అనవసితములు. నీ మాయచేత ఆవరించబడని వారికి నీ జ్ఞ్యానం కలుగుతుంది. నీ మాయను గెలవాలంటే ఏమి చేయాలి? వారెందుకు గెలవ లేకపోయారు. నీ భక్తులైన గొప్పవారిని వారు సేవించి ఉండరు. నీ భక్తుల ఆరాధనముతోనే నీ మాయను గెలవవచ్చు.

యదు హ వావ తవ పునరదభ్రకర్తరిహ సమాహూతస్తత్రార్థధియాం మన్దానాం
నస్తద్యద్దేవహేలనం దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ప్రతివోఢుమవిదుషామ్

మేము యజ్ఞ్య యాగాలు దానాలు చేస్తున్నాము గానీ ఎవరు పరదేవతో మాకు తెలియదు. ఒక్క నిన్ను తప్ప అందరినీ పూజిస్తున్నాము. ఏ దేవతను మేము ఆరాధించినా ఆ కోరికను ఇచ్చేది నీవే. జ్ఞ్యానము లేకుండా ఏమి అడగాలో తెలియకుండా అజ్ఞ్యానములో పడి నిన్ను ఎలా ఆరాధించాలో తెలీయకుండా కొట్టుమిట్టాడుతున్న మాకు నీవే జ్ఞ్యానం అందించాలి.

శ్రీశుక ఉవాచ
ఇతి నిగదేనాభిష్టూయమానో భగవాననిమిషర్షభో వర్షధరాభివాదితాభివన్దితచరణః
సదయమిదమాహ

ఇలా స్తోత్రం చేయబడిన పరమాత్మ అందరిచేతా నమస్కరించబడి ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
అహో బతాహమృషయో భవద్భిరవితథగీర్భిర్వరమసులభమభియాచితో యదముష్యాత్మజో మయా
సదృశో భూయాదితి మమాహమేవాభిరూపః కైవల్యాదథాపి బ్రహ్మవాదో న మృషా భవితుమర్హతి మమైవ హి
ముఖం యద్ద్విజదేవకులమ్

మీరంతా మహర్షులూ నాయందే భక్తి ఉండి నా స్వరూపం తెలిసి ఉన్నవారు. మీరేమన్నా అది జరిగి తీరుతుంది. కానీ మీరు చాలా కష్ట సాధ్యమైన వరాన్ని కోరారు. న్యాయముగా ఈ వరం ఇతరులకు దుర్లభం. ఇతనికి నాలాంటి కుమారుడు కావాలని కోరారు. నాలాంటి వాడను నేనే. నాకు ఇంకో సమానుడు లేడు. నాలాంటి వాడు లేడు కాబట్టి నీలాంటు వాడు కావాలి అన్న వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుల మాట అబద్దం కాకూడదు. బ్రాహ్మణోత్తములంటే నా ముఖమే. వారు మాట్లాడారంటే నేను మాట్లాడినట్లే. నా మాట నేను అబద్దమెలా చేస్తాను.

తత ఆగ్నీధ్రీయేంశకలయావతరిష్యామ్యాత్మతుల్యమనుపలభమానః

నాలాంటి వాడు ఇంకోడు లేడు కాబట్టీ మీరు కోరారు కాబట్టి ఈ ఆగ్నీద్రుడికి నేనే కొడుకుగుగా అవతరిస్తాను

శ్రీశుక ఉవాచ
ఇతి నిశామయన్త్యా మేరుదేవ్యాః పతిమభిధాయాన్తర్దధే భగవాన్

ఇలా పలికి మేరు దేవికీ నాభికీ కోరిన వరాలిచ్చి స్వామి అంతర్ధానమయ్యాడు
పరమాత్మ తన దివ్యమైన దేహముతో నాభికీ మేరుదేవికీ కుమారుడిగా పుట్టాడు. ఎక్కడ యజ్యం చేసారో ఆ దర్భలలోనే నాభికి ప్రీతి కలిగించడానికి అతని యొక్క అంతఃపుర స్త్రీ అయిన మేరు దేవి యందు ఊర్ధ్వ రేతస్కులైన దిగంబరులైన యతి (సన్యాసి) ధర్మాలను చెప్పడానికి వచ్చాడు. పరిశుద్ధమైన సత్వ దేహముతో అవతరించాడు.

Saturday, March 16, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం రెండవ అధ్యాయం


శ్రీమద్భాగవతం పంచమ స్కధం రెండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఏవం పితరి సమ్ప్రవృత్తే తదనుశాసనే వర్తమాన ఆగ్నీధ్రో జమ్బూద్వీపౌకసః ప్రజా
ఔరసవద్ధర్మావేక్షమాణః పర్యగోపాయత్

ఈ ప్రకారముగా ప్రియవ్రతుడు తనకు నియమించిన పని పూర్తి చేసి తన పుత్రులకు రాజ్యమిచ్చి తగిన వ్యవస్థ ఏర్పరచి నారదుని మార్గమును అనుసరించి పరమాత్మను చేరుకున్నాడు. ఆగ్నీద్రుడు జంబూద్వీపములో ఉన్న ప్రజలను తన సంతానము వలె ధర్మముగా పరిపాలిస్తూ రక్షించాడు.

స చ కదాచిత్పితృలోకకామః సురవరవనితాక్రీడాచలద్రోణ్యాం భగవన్తం విశ్వసృజాం
పతిమాభృతపరిచర్యోపకరణ ఆత్మ ఇకాగ్ర్యేణ తపస్వ్యారాధయాం బభూవ

ఇలా రాజ్య పరిపాలన చేస్తున్న ఆగ్నీద్రుడు పితృలోకాన్ని కోరుకుని (అంటే సంతానాన్ని ఆశించి) దేవతా స్త్రీలు విహరించే ద్రోణి అయిన మేరు పర్వత ప్రాంతములో ప్రజాపతి పతి అయిన పరమాత్మను అన్ని రకాల ఉపకరణములను దగ్గర పెట్టుకుని ఏకాగ్రమైన మనసుతో స్వామిని ఆరాధించడం మొదలుపెట్టాడు

తదుపలభ్య భగవానాదిపురుషః సదసి గాయన్తీం పూర్వచిత్తిం నామాప్సరసమభియాపయామాస

ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ తన సభలో గానమూ నాట్యమూ చేస్తున్న పూర్వ చిత్తి అన్న అప్సరసను పంపించాడు.

సా చ తదాశ్రమోపవనమతిరమణీయం వివిధనిబిడవిటపివిటపనికరసంశ్లిష్టపురట
లతారూఢస్థలవిహఙ్గమమిథునైః ప్రోచ్యమానశ్రుతిభిః ప్రతిబోధ్యమానసలిలకుక్కుటకారణ్డవ
కలహంసాదిభిర్విచిత్రముపకూజితామలజలాశయకమలాకరముపబభ్రామ

అది సుందరమైన వనము. వివిధనిబిడవిటపివిటప - అనేక విధమైన దట్టముగా ఉండే వృక్షముల (విటపి) యొక్క కొమ్మల (విటప) సమూహం(నివిడ) చేత అల్లుకుని ఉన్న ఆ పొదలూ, అల్లుకున్న లతలు. లతలు అల్లుకుని ఉన్న పొదల మీద పక్షులు వాలి మనోహరుంగా కిల కిలా రావములు చేస్తున్నాయి. అక్కడి పక్షులు వేదాలనే వల్లిస్తున్నాయి. నీటికోళ్ళు హంసలూ కొంగలు మొదలైన పక్షులతో విచిత్రమైన కూతలు కూస్తూ ఉన్న పరిశుద్ధమైన జలము గల సరస్సు. ఇలాంటిన్ సరస్సులో పూర్వచిత్తి సంచరించినది.

తస్యాః సులలితగమనపదవిన్యాసగతివిలాసాయాశ్చానుపదం ఖణఖణాయమానరుచిర
చరణాభరణస్వనముపాకర్ణ్య నరదేవకుమారః సమాధియోగేనామీలితనయననలినముకుల
యుగలమీషద్వికచయ్య వ్యచష్ట

మహా వయ్యారముగా విలాసముగా ఒక్కో అడుగూ వేస్తూ ఉంది. కాలికుండే అందెలు చప్పుడు చేస్తూ ఉన్నాయి. అందమైన పాదములకు ధరించిన ఆభరణ ధ్వని విని సమాధితో మూసుకున్న కనులను కొద్దిగా తెరిచాడు ఆగ్నీద్రుడు.

తామేవావిదూరే మధుకరీమివ సుమనస ఉపజిఘ్రన్తీం దివిజమనుజమనోనయనాహ్లాద
దుఘైర్గతివిహారవ్రీడావినయావలోకసుస్వరాక్షరావయవైర్మనసి నృణాం కుసుమాయుధస్య విదధతీం
వివరం నిజముఖవిగలితామృతాసవసహాసభాషణామోదమదాన్ధమధుకరనికరోపరోధేన ద్రుతపద
విన్యాసేన వల్గుస్పన్దనస్తనకలశకబరభారరశనాం దేవీం తదవలోకనేన వివృతావసరస్య
భగవతో మకరధ్వజస్య వశముపనీతో జడవదితి హోవాచ

ఆడ తుమ్మెద పద్మాన్ని వాసన చూస్తున్నట్లుగా తోటలో ఉన్న పూలను వాసన చూస్తున్న ఆమె మనసుకూ కంటికీ ఆనందము కలిగిస్తూ ఉంది. నడక విహార విలాస చూపులలో అన్ని రకములుగా ఎదుటివారి మనసులో మన్మధున్ని ఉద్దేపిస్తున్నట్లు ఉన్న ఆమె మాటలూ చూపులూ నడకలూ విలాసములూ చిరునవ్వులతో ఆకర్షించబడిన ం అనసు కలవాడై అవకాశం వచ్చింద కాబట్టి మన్మధుడు మనసులో ప్రవేశించి ఇన్నాళ్ళూ తపస్సు వలన కలిగిన జ్ఞ్యానం మొత్తం విడిచిపెట్టి జడుడిలాగ ఇలా మాట్లాడాడు

కా త్వం చికీర్షసి చ కిం మునివర్య శైలే
మాయాసి కాపి భగవత్పరదేవతాయాః
విజ్యే బిభర్షి ధనుషీ సుహృదాత్మనోऽర్థే
కిం వా మృగాన్మృగయసే విపినే ప్రమత్తాన్

నీవెవరివి ఏమి చేయాలనుకుంటున్నావు ఇక్కడంతా మునులు ఉంటారు. ఇంతటి సౌందర్యము సామన్యముగా ఎవరికీ ఉండదు. నీవు మునులను మోహింపచేయడానికి పరమాత్మ పంపిన మాయవా. అల్లితాడు లేని రెండు ధనువులను ధరించావు, నీ మిత్రులుగా అయిన వారి మనసును క్షోభింపచేసి  వశమునకు తేవడానికి (ఇక్కడ ధనువు అంటే కనుబొమ్మలు) నీవే మృగాలని వేటాడాలనుకుంటున్నావు., గురి చూసి కొట్టాలంటే వింటి నారి ఉండాలి గనీ నీకు ఆ నారి లేదు. అప్రమత్తుముగా లేని ఏ మృగాల కోసం వెతుకుతున్నావు.

బాణావిమౌ భగవతః శతపత్రపత్రౌ
శాన్తావపుఙ్ఖరుచిరావతితిగ్మదన్తౌ
కస్మై యుయుఙ్క్షసి వనే విచరన్న విద్మః
క్షేమాయ నో జడధియాం తవ విక్రమోऽస్తు

కనులను పద్మాలుగా వర్ణిస్తున్నాడు. (ఆడవారి కనులను కలువలూ లేదా పద్మాలు అరవింద అశోకమూ నవ మల్లికా మొదలైనవన్నీ మన్మధుని బాణాలు)
మాలాంటి మందబుద్ధులు క్షేమముగా ఉండటానికి నీ పరాక్రమం పనికి రానీ.

శిష్యా ఇమే భగవతః పరితః పఠన్తి
గాయన్తి సామ సరహస్యమజస్రమీశమ్
యుష్మచ్ఛిఖావిలులితాః సుమనోऽభివృష్టీః
సర్వే భజన్త్యృషిగణా ఇవ వేదశాఖాః

నీవొక్కదానివే కాకుండా నీ శిష్యులతో కలిసి వచ్చావు. ఈ పక్షులు నీవు పలికిన మాటలనే పలుకుతున్నాయి ఋషులు వేద శాఖలను పలికినట్లు.

వాచం పరం చరణపఞ్జరతిత్తిరీణాం
బ్రహ్మన్నరూపముఖరాం శృణవామ తుభ్యమ్
లబ్ధా కదమ్బరుచిరఙ్కవిటఙ్కబిమ్బే
యస్యామలాతపరిధిః క్వ చ వల్కలం తే

నీవు పలికే ఈ మాటలను మేము వింటున్నాము. అత్తరూ పన్నీరు గంధమూ ఒంటికి అలుముని వచ్చావు, ఆ సుగంధం ఈ ఆశ్రమాన్ని వ్యాపించి ఉంది

కిం సమ్భృతం రుచిరయోర్ద్విజ శృఙ్గయోస్తే
మధ్యే కృశో వహసి యత్ర దృశిః శ్రితా మే
పఙ్కోऽరుణః సురభిరాత్మవిషాణ ఈదృగ్
యేనాశ్రమం సుభగ మే సురభీకరోషి

లోకం ప్రదర్శయ సుహృత్తమ తావకం మే
యత్రత్య ఇత్థమురసావయవావపూర్వౌ
అస్మద్విధస్య మనౌన్నయనౌ బిభర్తి
బహ్వద్భుతం సరసరాససుధాది వక్త్రే

కా వాత్మవృత్తిరదనాద్ధవిరఙ్గ వాతి
విష్ణోః కలాస్యనిమిషోన్మకరౌ చ కర్ణౌ
ఉద్విగ్నమీనయుగలం ద్విజపఙ్క్తిశోచిర్
ఆసన్నభృఙ్గనికరం సర ఇన్ముఖం తే

అలా ఒక్కో అంగాన్ని వర్ణిస్తూ, ముఖము  యొక్క మకరందాన్ని తీసుకోవడానికి తుమ్మెదలు వస్తున్నాయి

యోऽసౌ త్వయా కరసరోజహతః పతఙ్గో
దిక్షు భ్రమన్భ్రమత ఏజయతేऽక్షిణీ మే
ముక్తం న తే స్మరసి వక్రజటావరూథం
కష్టోऽనిలో హరతి లమ్పట ఏష నీవీమ్

చేతులో ఒక చిలుకని పట్టుకొని వచ్చావు.

రూపం తపోధన తపశ్చరతాం తపోఘ్నం
హ్యేతత్తు కేన తపసా భవతోపలబ్ధమ్
చర్తుం తపోऽర్హసి మయా సహ మిత్ర మహ్యం
కిం వా ప్రసీదతి స వై భవభావనో మే

న త్వాం త్యజామి దయితం ద్విజదేవదత్తం
యస్మిన్మనో దృగపి నో న వియాతి లగ్నమ్
మాం చారుశృఙ్గ్యర్హసి నేతుమనువ్రతం తే
చిత్తం యతః ప్రతిసరన్తు శివాః సచివ్యః

ఇలా ఆమెను వర్ణించి. నన్నే నీ ప్రథమ శిష్యునిగా స్వీకరించు. సాక్షాత్తు నీ యంతట నీవు వచ్చి ఉండవు. ఎవరో పంపే ఉంటారు.

శ్రీశుక ఉవాచ
ఇతి లలనానునయాతివిశారదో గ్రామ్యవైదగ్ధ్యయా పరిభాషయా తాం విబుధవధూం విబుధ
మతిరధిసభాజయామాస

ఆడవారిని ఎలా అనునయించాలో బాగా తెలిసిన వాడైన అగ్నీద్రుడు అతి సామాన్యులు సహజముగా వాడే బాషలో నిపుణుడు (సౌందర్యాన్ని వర్ణించడములో నైపుణ్యం ప్రదర్శించే వాడు). ఆ దేవ కన్యను చాలా జాగ్రత్తగా సమ్మానించాడు ( అనునయించాడు)

సా చ తతస్తస్య వీరయూథపతేర్బుద్ధిశీలరూపవయఃశ్రియౌదార్యేణ పరాక్షిప్తమనాస్తేన
సహాయుతాయుతపరివత్సరోపలక్షణం కాలం జమ్బూద్వీపపతినా భౌమస్వర్గభోగాన్బుభుజే

ఆమెకూడా అత ని బుద్ధి బలం పరాక్రమం సౌందర్యం విని అతని మీద మనసు లగ్నం చేసింది. ఒక లక్ష సంవత్సరాలు స్వర్గభోగాలు అనుభవించింది

తస్యాము హ వా ఆత్మజాన్స రాజవర ఆగ్నీధ్రో

ఆమెయందు నాభి కింపురుష హరిహర్ష ఇలావృత రమ్యక హిరణ్మయ కుభద్ర అశ్వకేతు ఇలా తొమ్మిది మంది పుట్టారు. వీరే నవ ఖండాలకు అధిపతులు.

నాభికిమ్పురుషహరివర్షేలావృతరమ్యకహిరణ్మయ
కురుభద్రాశ్వకేతుమాలసంజ్ఞాన్నవ పుత్రానజనయత్

సా సూత్వాథ సుతాన్నవానువత్సరం గృహ ఏవాపహాయ పూర్వచిత్తిర్భూయ ఏవాజం దేవముపతస్థే

వీరిని ఇంటివద్ద వదిలిపెట్టి మరలా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. పూర్వచిత్తి పాలు తాగడం వలన వీరందరూ మహా బలులయ్యారు,

ఆగ్నీధ్రసుతాస్తే మాతురనుగ్రహాదౌత్పత్తికేనైవ సంహననబలోపేతాః పిత్రా విభక్తా ఆత్మతుల్య
నామాని యథాభాగం జమ్బూద్వీపవర్షాణి బుభుజుః

తండ్రి వీరికి నవ వర్షాలను ఇచ్చాడు

ఆగ్నీధ్రో రాజాతృప్తః కామానామప్సరసమేవానుదినమధిమన్యమానస్తస్యాః సలోకతాం
శ్రుతిభిరవారున్ధ యత్ర పితరో మాదయన్తే

అంగీద్రుడికి ఆమె యందు ఏమాత్రం అనురాగం తగ్గక కోరికలు తృప్తి పొందక ఆమెనే చింతిస్తూ ఈ అప్సరసలు ఎక్కడ విహరిస్తారో అది పొందడానికి పితృదేవతలను ఆరాధించి ఆ లోకానికి వెళ్ళాడు

సమ్పరేతే పితరి నవ భ్రాతరో మేరుదుహిత్ర్మేరుదేవీం ప్రతిరూపాముగ్రదంష్ట్రీం లతాం రమ్యాం
శ్యామాం నారీం భద్రాం దేవవీతిమితి సంజ్ఞా నవోదవహన్

మేరు పర్వతం యొక్క పుత్రికలను తొమ్మండుగురిని వివాహం చేసుకున్నారు